Showing posts with label small story. Show all posts
Showing posts with label small story. Show all posts

Sunday, February 21, 2021

ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ- సేకరణ కర్లపాలెం హనుమంతరావు



ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.

'స్వామీ మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.

'రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!' అన్నాడు.

'పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం  చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.

'దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.

కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.

'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.

'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.

సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.

రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.

'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.

'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు  నువ్వుఅ అనుకొంటున్న 'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?' అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.

***

సేకరణ ! కర్లపాలెం హనుమంతరావు 

-కర్లపాలెం హనుమంతరావు

( నా నోట్ సునుంచి సేకరించినది. సోర్సు తెలియదు)

 

 


Saturday, February 13, 2021

జంతు లోకం! - కర్లపాలెం హనుమంతరావు - సరదా వ్యాసం

 



" మేన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ . మనిషీ మనలాగే జంతువు. కాకపోతే మనం అడవిలో ఉంటాం,  వాడు తనలాంటి మనిషి జంతువుల  మధ్యన నిత్యం రాజకీయాలకు సరదాపడతాడు  దానికి మనమేం చేస్తాం!" అంది కోతి వచ్చీ రాని బట్లర్ ఇంగ్లీషులో గంభీరంగా. 
"అక్కడికి మనమంతా సైన్స్ మ్యూజియంలో మాత్రమే ఉండాల్సిన  జంతువులమైనట్లు!  ఏంటా కిచకిచలూ? ఎట్లాగైనా మనవాడు మన మనవడు  గదా ! అందుక్కాబోలు మన వానరానికి నరుడిగారంటే అంత గారాం ?" అంది నక్క ఎకసెక్కంగా. 
"జోకులొద్దు! మేటర్ సీరియసిక్కడ . మాటిమాటికి మాటమాటకు కంపు మనిషి మనతో తనని కంపేర్ ఎందుకు చేసుకుంటాడో అర్ధం కాకుండా ఉంది. ఎవడైనా కొద్దిగా బుద్ధి తక్కువ పని చేస్తే చాలప్పా .   "గాడిద కొడకా!" అని తిడతాడు! గాడిదలకు మెదడు అంత తక్కువనా ఆ మట్టి బుర్ర ఉద్దేశం?" అని  గార్దభం కోపంగా.
"మరే!  ఎవరైనా సరే సరిపడక పోతే బండ తిట్లకు దిగేస్తాడు. కొండవీటి చాంతాండంత కవిత్వాలు రాస్తున్నారని కవులను ... 'వాడలవాడలందిరిగి వచ్చెడువారలు గోడల గొందులలో వొదిగి కూయుచుండెడి'  వారు అంటూ  వాళ్లందర్మీ గాడిదలతో పోల్చేశాడు ! గాడిదయితే మాత్రం కవిత్వాలు రాయకూడదని రూలుందా!" అనింకా ఎక్కించింది నక్క.
"అందుకేగా.. వీడా నా కొడుకని, కందంలో ఈ గాడిద కూడా అంత అందంగానూ ఏడ్చిందా రోజు ! గాడిద కనుక కాస్తోకూస్తో దీనికి  కవిత్వ మొచ్చు. మొరగటమే తప్ప మరేమీ ఎరగని ఈ పిచ్చికుక్కేం చేసింది పాపం!  ఊర కుక్కలు, బోర కుక్కలని  అంటూ  రాజకీయ పార్టీయి  అట్లా ఒకళ్ళనొకళ్ళు  కుక్కలను అడ్డం పెట్టుకొని ఆడిపోసుకోడానికి! " అంది కోడి ముక్కుతో కాళ్ళు గీరుకుంటూ.
"అట్లాగే మా పేర్లు పెట్టి కూడా  ముట్టె   పొగరని మనిషి ఎప్పుడూ తిడుతూ ఉంటాడు కదా!"అంది పంది కూడా బాధగా. "దున్నపోతులాగా మా చేత పని చేయించుకుంటూ ఒళ్ళొంగని వాళ్ళని మళ్ళా దున్నపోతులని దులిపేస్తాడు ..అదేం మాయరోగమో గానీ మనిషికి! " అందో ఆంబోతు ఆవేదనగా.
"అందరు నందరే మరియు నందరు నందరే అంటూ సభలోని వాళ్ళందరినీ కలగలిపి కుక్కలూ, కోతులూ, పందులూ, దున్నలూ, గాడిదలంటూ  శ్రీనాథుడనే ఓ కవిసార్వభౌముడు     తిట్టిపోయటం గుర్తొచ్చి గట్టిగా నిట్టూర్చు కొన్నాయి అభయారణ్యంలో సభ తీరిన ఆ జంతువులన్నీ.
"మనిషి తీరుతో పడ లేకుండా వున్నానబ్బీ ! నాలుగుగింజలు ఇలా రాల్చి నాచేత నానా ఊడిగం చేయించుకుంటున్నాడు. ముందు వాడి నుంచి నాకు విముక్తి కలిగించండి  మహాప్రభో!" అంటూ  పావురాయి అడివికొచ్చి కన్నీళ్ళు పెట్టుకోవటం చేత ఇలా సభ మొదలయింది.
"మనవాడి  తీరే అంత! మన మనవడని చెప్పుకోవటానికే సిగ్గేస్తోంద"అని పక్క కోతితో చెప్పుకుని బాధపడిందో పాతకాలం నాటి ఓ పండు కోతి . 
"వాడొక్కడికే దేవుడు పెద్ద బుర్ర ఇచ్చాడన్న పొగరు కాబోలు! వెళ్ళి ఆ దేవుణ్ణే అడుగుదాం పదండి!" అంది జంబూకం. జిత్తులన్నీ  తానే ప్రదర్శిస్తూ 'జాకాల్'  అన్న తన పేరుని బద్నామ్ చేస్తున్నాడని మనిషి మీది ఆ నక్కగారికి ఎక్కడలేని అక్కసు.
...

విషయం అంతా ఓపికగా విన్నాడు దేవుడు. జంతులోకం ఆక్రోశం చూసి   గాఢంగా నిట్టూర్చాడుకూడా .  మడిసి మిడిసిపాటు తనకూ కొత్తేం కాదు. ఒళ్ళు మండినప్పుడు వాడు   తననీ  విడిచిపెట్టింది లేదు. "తిరిపమునకిద్దరాండ్రా... పరమేశా! గంగ విడుము... పార్వతి చాలున్!" అని దులిపి పారేయడం  గుర్తుకొచ్చింది. అయినా దేవుడి పాత్ర  లో ఉన్నప్పుడు  సర్ది చెప్పడం తన బాధ్యత. 
 కనక "మనిషి మహాశయుడి తీరంతే! తెగనాడేటప్పుడు గాడి తప్పటంలో వాడు  మహా  మొనగాడు ! అదంతా  మనిషి మార్క్ రాజకీయం.  పాలిటిక్సన్నాక ఇలాంటి హాట్ ఫూట్స్   తప్పవు అప్పుడప్పుడు . వాడికి ఎన్నికలంటే పోలింగు 'బూతులు'. 'నబూతో నభవిష్యత్తు ' అని నమ్మే సజ్జు రాజకీయాలలో  రోజురోజుకు ఎక్కువౌతోంది.  అశ్లీలమే వాళ్ళ అసలైన శీలమైపోయింది. అట్లాంటి వాళ్ళ తిట్లనట్లా పట్టించుకొంటే ఉన్న ఒక్క కంటితో కూడా నిండా   నిద్రపోలేదు మీ భల్లూకం . థూఁ! నా బొడ్డనుకోవాలి" అన్నాడు దేవుడుబొడ్డు నిమురుకుంటూ. 
"వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు మెంటలనో, శుంఠలనో ఎంత  అన్  ప్రిన్ టబుల్ లేంగ్వేజీలో  ఏడ్చినా  పర్వాలేదు కానీ మహాప్రభో!... మధ్యలో మా కుక్కలనీ, పందులనీ... లాక్కు రావటమెందుకంట ?! ఈ వానర వారసుడి వరుస చూస్తే మీరింకో అర్జెంటు  అవతారమెత్తాల్సిన అవసరమున్నట్లుంది" అని జంతువులన్నీ మోరలెత్తి మరీ భోరుమని మొత్తుకున్నాయ్. .
"సరే.. ముందసలు సందర్భమేంటో కనుక్కుందాం. మానవుడి వాదనా విందాం.. 'రమ్మనమ' ని కాకి చేత కబురంపించాడు దేవుడు.

"ఎక్కడి టైమూ  ఈ దిక్కుమాలిన పాలిటిక్సుకే చాలటం లేదు. నా తరపున చిలకను పంపిస్తున్నా!  చర్చించుకోండి!' అన్నాడు మనిషి.  
చిలక వచ్చి  మనిషి పలుకులు వినిపించింది.
"కుక్కంటే మాకూ మక్కువ ఎక్కువే. డాగ్ అనగా తిరగేసిన గాడ్  కిందే కదా లెక్క!(DOG-GOD). కనకనే  శునకాన్ని భైరవుడిగా కొలుస్తుంటాం. దాన్ని   గ్రామసింహమమని నామధేయవిచ్చి మరీ గౌరవిస్తుంటాం. ధర్మరాజు తమ్ముళ్ళందరినీ వదిలేసి, ఒక్క కుక్కనే సరాసరి స్వర్గానికి తీసుకెళ్ళిన సందర్భం జంతుతంతు  మర్చిపోయింది. కుక్క పిల్లా... అగ్గిపుల్లా... కాదేదీ మా  ఆంధ్రా కవుల కనర్హం. ఆ మాటకొస్తే మేము ఏ జంతువునీ తక్కువ చేసింది  లేదు. చివరికి పావురాయిని కూడా.  మీ దశావతారాల్లో జంతువులన్నింటికీ దేవుడి హోదా కల్పించామా ? కాదా ?! గాడిదైనా  మా దృష్టిలోగాడ్ ది గ్రేటే!. పేపరు వాళ్ళు, టివీల వాళ్ళు మా ప్రసంగాలు  పూర్తిగా వినకుండా వాళ్ళకి నచ్చినట్లు రాసుకుంటే  మాదా బాధ్యత? ! ఇన్ని నిజాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా భుజాలు తడుముకుంటామంటే మీ భుజాలు.. మీ ఇష్టం" అని మనిషి మాటలుగా  వప్పచేప్పింది చిలుకమ్మ      .
చిలుక పలుకులకు పాము ఫ్లాటయి పోయింది. మనిషిని అపార్ధం చేసుకున్నందుకు గార్ధభం కుమిలి పోయింది. మొసలి కూడా     కన్నీరు కార్చింది. కానీ నక్కే... 'ఈ మనిషి జిత్తులు నాకు కొత్తా! మనిషిని పనిష్ చేయాల్సిందే!'' అని వాదనకు దిగింది.
ఉడుంది కూడా అదే పట్టు.
"మనిషితో మాది రక్త సంబంధం. మాట పోతుంద"ని దోమ తెలివిగా సమయానికి  తప్పుకుంది.
"మురుగు లేనిదే మాకు మనుగడలేదు. నరుడే మా గురుడ'ని ఈగలూ, నల్లులూ, పేలు లాంటి కీటకాలు ఉమ్మడిగా ప్రకటన జారీ చేశాయి.
కోడికి మాత్రం కోపం  ఇంకా      తగ్గలేదు."నేను కూయటం మానేస్తాను. ఘడియ ఘడియకు కూయించుకొని ఆకలేసినప్పుడు కూరగా దోరగా వేయించుకొని తింటాడీ తిండిపోతు.  వాడికి పెద్ద పండుగ వస్తే మా కోడి  జాతికి పెనుగండం. పందేలలో  నిష్ట దరిద్రుడికేమో మా వల్ల అష్టభోగాలు. మాకేమో అష్టకష్టాలు" అంది కసిగా.
"బోడి కోడి లేకపోతే  తెల్లవారదా ఏంది? మనిషికి  బోలెడన్ని గడియారాలేడ్చాయి మనిషికి " అంది  మనిషి తరపున చిలుక.
"నేనూ దున్నటం మానేస్తాను. తిండిగింజలు లేక చస్తాడ" ని కసిగా   కాడి కింద పడేసింది దున్నపోతు. "నీ సాయం లేకపోతే వ్యయసాయం సాగదా!. మిషన్లతో పనులు నిమిషాల్లో అయిపోతాయి" అంది  మళ్ళీ చిలుక
మనిషిని శిక్షించే విషయంలో అడవి నడిమికి చీలింది. 
 గోవులూ, గుర్రాలూ, చిలుకలూ, ఎలుకలూ, నెమళ్ళూ, తేళ్ళూ లాంటివి ఒకవైపు. 
కాకీ, నక్క, గద్ద, గబ్బిలం లాంటివి మరో       వైపు.
పులులూ చర్చల్ని బహిష్కరించాయి. మనిషి కనపడితే వేసేయటమే మా పాలసీ అని గొరిల్లాల  ప్రకటించేసాయి. కప్పమాత్రం గంటకో వైపుకి గెంతుతోంది. గోడ మీదున్న పిల్లికి ఎటు దూకాలో పాలుపోవటం లేదు. చివరికి ఎన్నికలు తప్ప లేదు ! 
--- 
 ఒక్క కుక్క  ఓటు మీదే గెలుపోటములు తేలిపోయే పరిస్థితులొచ్చి పడ్డాయిప్పుడు.
"మనిషి నీ మాస్టర్ .  మాకే నీ ఓటం"టూ మనిషి ఏజెంట్ చిలక     ఒకవైపు,  
"మాస్టర్ కాదు! వాడొట్టి మాన్ స్టర్ .. అనగా రాక్షసుడు! మాకే నీ ఓటం"టూ నక్కల ఊళలింకోవైపు.   ప్రతి కుక్కకూ ఓ  రోజొస్తుందని సామెత  నిజమైన .
 పోలింగు రోజు అది.   
ఓటేసే టైము ముగిసింది. ఒక్క ఓటు మెజార్టీతో మనిషి ఘన విజయం సాధించినట్లు ప్రకటించాడు దేవుడు.
అంటే అ ఒక్క ఓటు కుక్కదే నన్నమాటే గదా !
"ఛీ...కుక్క కుక్కబుద్ధి పోనిచ్చుకున్నది కాదు... కనకపు సింహాసనమ్మీద కూర్చోబెడతామన్నా వెనుకటి బుద్ధి ఎలా పోతుంది! " అన్న శతక పద్యం తలుచుకుని  చీదరించుకొంది కాకి & కో . :
 లోకులు పలుకాకులు.
 " ఈ శునకం ఓటెలాగూ మనిషికే వేస్తుంది.  గెలిచే పక్షంలో  వుండటమే  తెలివయిన పని అని నేనూ అటు దూకేసాను !" అని సంబర పడిపోయింది   మార్జాలం.
"నువ్వటు దూకటం చూసి నేనూ అటే గంతేశాలే    ఆఖరి నిమిషం లో!" అంది కప్ప నాలిక అదోలాచప్పరిస్తూ.    
'"ఎదయితేఏం!  మనిషి గెలిచాడు. గెలిచిన వాడితో సంధి చేసుకోవటం ఓడిన పక్షానికి శ్రేయస్కరం. ఎందుకు చెపుతున్నానో అర్ధం చేసుకోండి!" అని ఓ  ఉచిత  సలహా పారేసి ఇంచక్కా అంతర్థానమయి   పోయాడు దేవుడు. 
దేవుడి మాట మేరకు పావురాయిని  రాయబారానికి పంపాయిజంతువులు .
  పోయిన కపోతానిది అదే పోత! ఎంతకూ  తిరిగిరాలేదు! పావురాయికి పాపం ఏమయినట్లు?!
రెండు రోజుల తరువాత మనిషి దగ్గరనుంచి చిలుక ద్వారా వర్తమానం   వచ్చింది.  "డబుల్ థేంక్స్! ఒకటి గెలిపించినదుకు.రెండు పావురాయిని గిఫ్ట్  గా పంపించినందుకు!మీ  రెండో బహుమానం   మహా పసందు " అంటూ. పావురాయిని మనిషి మసాలో కూరి విందు లాగించుకున్నట్లు జంతువులకు అర్థమయింది. తన మీద దేవుడికి ఫిర్యాదు చేసిన ఏ జీవిని మనిషి వదిలిపెట్టడన్న  మనిషి ఆటవిక నైజం అడవి జంతువులకు అప్పుడు గాని  బోధపడింది కాదు. 
 '                             మనిషెంత దుర్మార్గుడు! మన అడవిలో కూడా మరీ ఇంత అన్యాయం లేదు .' అనుకున్నాయి అన్ని జంతువులు ఆ వేదనగా.
 "అందుకే నేను వాడికి ఓటు వెయ్యనిది.  ఒట్టు... నన్ను నమ్మండి"అని గోల పెట్టింది శునకం. 

       మరి మనిషి గెలవటానికి సాయపడిన ఆ ఒక్క ఓటూ ఎవరిది?!ఎవరిది? ఎవరిది?!   
ఆ దేవుడికే తెలియాలి. చివరికి ఆ దేవుడే సస్పెన్స్  తేల్చేయాల్సొచ్చింది  కిందికి దిగి    .
'ఇదంతా ఆ వరహవతరంగారి పుణ్యఫలమే !' అని తేలిపోయింది దేవుడు పెదవి విప్పడంతో.
" మామనిషికి గనుక  ఓటెయ్యకపోతే వచ్చే జన్మలో నువ్వూ మనిషివయి పుట్టటమే కాదు   రాజకీయాల్లోకూడా పడతావని చిలుక      చాటుగా  బెదిరించి పోయింది బాబోయ్! అందుకే . అదిరిపోయి అటే  ఓటు వెయ్యాల్సి వచ్చింది"  అంటూ బురదలో మొహం దాచుకొని కుళ్లి కుళ్లి ఏడవడం    మొదలు పెట్టింది  పాపం ఆ వరాహమిప్పుడు.
 
నీతి :ఇకనయినా  మనం , మనుషులం కనీసం జంతువులయినా అసహ్యించుకునే స్థాయి దాక రాజకీయాలను దిగాజార్చు  కోకుండా  వుండటం మంచిది కదా!
 
-- కర్లపాలెం హనుమంతరావు
ఆగష్టు 19, 2010
(ఈనాడు దినపత్రిక సంపాదకీయ ప్రచురణ)

Monday, February 8, 2021

స్త్రీ మనస్తత్వం- కర్లపాలెం హనుమంతరావు సేకరించిన చిన్న కథ



ఇప్పుడే ఒక  తమాషా బైబిలు కథ చదివాను. చిన్నదే కానీ చమత్కారం పాలు ఎక్కువ.

ఏదెను ఉద్యానవనంలో నడుస్తుండగా పాము ఒక ఆపిల్  ఇచ్చి 'తిను! నీ ప్రియుడికి నీవు మరంత అందంగా కనిపిస్తావు".అంటుంది.

ఈవ్ తల అడ్డంగా ఆడించి"ఆ అవసరం  లేదు.  నా వాడి జీవితంలో నేను ఒక్కర్తెనే మహిళనుఅంది. పాము  నవ్వి "ఆదాము జీవితంలో మరో  స్త్రీ కూడా ప్రవేశించి ఉంది. గుహలో దాచిపెట్టాడు. చూపిస్తా.. రమ్మం’టూ"ఒక నీటి గుంట దగ్గరకు తీసుకు వెళ్లి తొంగి చూడమంది. 

నీళ్లల్లో తొంగి చూసిన తరువాత ఈవ్ ఆపిల్ తినడానికి ఒప్పుకుంది. 

- సేకరణ by కర్లపాలెం హనుమంతరావు 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...