Friday, December 31, 2021

ఈనాడు- సంపాదకీయం ఆనందాక్షరి రచన-కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

 

ఈనాడు- సంపాదకీయం 


ఆనందాక్షరి

రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )


'ఏ వాణి వేదశాస్త్రేతిహాస మహాబ్ది మందారవల్లియై కందళించే/ ..అయ్యమరవాణి హంసవాహనుని రాణి' ని  ఆవాహన చేసుకుంటూ గాని కరుణశ్రీ ఏ కావ్య రచనకూ శ్రీకారం చుట్టేవారు కాదు. వాణీ కటాక్షం లేకపోయుంటే వాల్మీకి మహర్షి వట్టి కిరాతకుడిగానే మిగిలే వాడు. 'మాణిక్య వీణాం ముపలాలయన్తి/ మదాలసాం మంజుల వాగ్విలాసాం' అంటూ మనసారా స్మరించిన మాతంగ కన్య అను గ్రహం వల్లనే మేకలు కాసుకునే కాళిదాసు మహాకవిగా చిరంజీవి అయ్యాడని ఓ కథ. ఆకాశాన్ని గుప్పిట పట్టేటంత విజ్ఞానఖని వ్యాస ముని. ఆ మహర్షి మేధస్సూ భారతమ్మ ఆశీస్సు ఫలమే! దైత్యనా థుడు హిరణ్యకశిపుడికి బిడ్డ ప్రహ్లాదుడి విష్ణుభక్తిపై దిగులు, 'లభ్యంబైన  సురాధిరాజ పదమున్ లక్షింపడ' ని  విచారం. 'విద్యాభ్యాసంబున గాని తీవ్ర మతిగాడని చండామార్కులవారికి చదువుసంధ్యలు అబ్బించే పని అప్పగిస్తాడు. ఆ సందర్భంలో చదువులు చేసే చలువ గురించి ఆ అసురప్రభువు చేసిన ప్రకటన ఇన్ని యుగాలు గడచినా వన్నెతగ్గని ఆభరణం. 'చదవని వాడజ్ఞుండగు/ జదివిన సద సద్వి వేక చతురత గలుగుం/ జదువగ వలయును జనులకు-  కృతయుగానికే కాదు అన్నింటా కృతకతపాలు పెచ్చు మీరుతున్న  ఈ కలియుగానికీ  అతికినట్లు సరిపోయే సూక్తి ఇది. జగత్తుకు గురువై ఉండీ మానవజన్మ ఎత్తినందుకుగాను శ్రీమన్నారాయణుడికే సాందీపని గురుకులాన జ్ఞానార్జన చేసేపని  తప్పిందికాదు. 'వానలు పస పైరులు కభి/ మానము పస వనితలకును మరి యోగులకున్/ ధ్యానము పస యా మీదట/ జ్ఞానము పస సుప్రసన్ను'లకు అన్న పరమానం దయతి 'సంపంగిమన్నా' శతకపద్యం నొక్కిచెప్పే సత్యమూ ఇదే. శేషము వేంకటపతి శశాంకవిజయంలో చెప్పినట్లు 'చెరకునకు పండు, పసిడికి పరిమళమును, చిత్రమునకు ప్రాణంబును, తా/ నరుదగ గల్గిన రీతిని' నరునికి విద్య అదనపు శోభాభరణం. ' లేశమేని సద్విద్య లేనివాడు/ శోభగాంచడు నిర్గంధ సుమము వోలె ' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తిలో కాదని కొట్టిపారేసే అతిశయోక్తి రవంతైనా లేదు. 


కోటి విద్యలు కూటి కొరకేనని సామెత.  మేదిన గల విద్యలన్నీ మెతుకుల కొరకేననడం సగం సత్యమే! అందరూ 'కూరగాయల' కోసమే చదువులు సాగిస్తే మనకు సౌందర్యలహరులు, కుమారసంభవాలు సంభవించేవా! 'తత్తరపడి యా ఉత్త చదువులు చదివితే తత్వ విచారంబయ్యేనా? / యుత్తమమైన నూరేండ్లు దాటినా ఉత్తమ పురుషుండ య్యేనా? ' అని ఏనాడో వీరబ్రహ్మేంద్రస్వామి డంబాల చదువును నిలదీశాడు. 'అసమాన దానవిద్యా రసికత లేనట్టి నరుని బ్రతుకేటికి సీ కసవేరు కతికి బ్రదుకదె/ పసరము తన కడుపునిండ' అని పర్వత కొండా శతకంలోని ఎత్తిపొడుపు. నార్లవారు అన్నట్లు- విజ్ఞతలేని విద్య ఎంత ఆర్జించినా ఏం లాభం? పేరు చూసి పిండినంత మాత్రాన నేతి బీరలోనుంచి నేయి కారుతుందా! 'పండితుండు' అని ప్రగల్భాలు పలి కినంత మాత్రాన నోటినుంచి రాలేవన్నీ ఆణిముత్యాలేననుకోవడం భ్రమ. మనిషిని మనిషి తినే కరవుకాలం విరుచుకుపడి ఒక పేద ద్విజుడు బతుకుతెరువు కోసం ఊరు విడిచిపోయే పనిలో పడ్డాడు. శివుడు కరుణించి అరవబాసలో స్వయంగా ఒక పద్యం చేసి పురాన్నేలే  రాజుకు సమర్పించి వెచ్చం తెచ్చుకొమ్మని ఆ పురోహితుడిని పురమాయించిన కథ ధూర్జటి విరచిత శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ఉంది. 'సింధురరాజ గమనా ధమ్మిల్ల బంధంబు సహజగంధం' అనే ప్రయోగ ఔచిత్యాన్ని రాజాస్థానకవి నత్కీరుడు ఆక్షేపిస్తే యాయవారం అయ్య వారి దగ్గర తిరుగు సమాధానమేది? చివరికి దక్కింది నిండుసభలో ఘోరపరాభవమే. శరీరపాటవం, మంచివాక్కు, పరిశుభ్రమైన దుస్తులు సంపదలు కలిగి ఉంటేనే లోకం గౌరవించేది. బంగారానికి సువాసన లాగా సింగారానికి నిజంగా మన్నన దక్కేది స్వయంగా సాధించుకున్న విద్యాసుగంధంవల్లనే. 'విజ్ఞానం మహాభాగ్యం' అన్న అబ్దుల్ కలాం సూక్తి ఎన్ని యుగాలకైనా వర్తించే సుభాషితం.


హెలెన్ కెల్లర్ ఈ వాస్తవానికి వర్తమాన ఉత్తమ ఉదాహరణ. మాట వినలేని, లోకాన్ని చూడలేని అనేకమంది అభాగ్యుల్లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది అంతులేని విద్యార్జన  అనే తపనే! 'వేడినీరు' స్వభావ స్వరూపాలను స్వయంగా అనుభవంలోకి తెచ్చుకునేందుకు మసిలే నీటిని ఒంటిమీద వంపించుకుంటూ ఒక్కో అక్షర ఉచ్ఛారణ సాధన చేసిన తెగువ ఆ మగువది. నిరామయ నిశ్శబ్ద నీరవ నిశ్చల నిబిడాంధకార మస్తిష్కంనుంచి నిబద్ధతతో మేధను సానబట్టింది కాబట్టే 'ది స్టోరీ ఆఫ్ లైఫ్' అనే ఉత్కృష్ట గ్రంథకర్తగా ఆమె చరిత్రలో మిగిలిపోయింది. ఏళ్లతరబడి ఏకాంతవాసంలో గడపాల్సిన దురదృష్ట దుర్దినాలలో  సైతం నెల్సన్ మండేలా నమ్ముకున్నది బుద్ధిమాంద్యపు ఉపద్రవానికి నిరంతర పఠనం అనే మంచిమందు. గోడలను కాగితాలుగా కొనగోళ్లను కలం పుల్లలుగా మలచి కారాగారంలోనే గణితాభ్యాసం చేసిన జ్ఞాని కథ ' కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో' ది . అధ్యయనం చేయాలన్న ఆసక్తి ఉండాలేగాని ఆర్కిమెడిస్ సూత్రంనుంచి ఆవకాయ పాళ్ల దాకా అన్నీ ఆనందం కలిగించే అంశాలే! 'పెక్కులు చదివిన బెనగు దోడనే/తెక్కుల పలు సందేహముల'  అన్న అన్నమయ్యవారి సందేహానికి చిన్నయసూరి ' పంచతంత్రం' లోని  ' విద్య పలు సందియములు దొలచును/వెలయించు నగోచరార్థ విజ్ఞానము' అన్న సూక్తే చక్కని సమాధానం. విజ్ఞానంతోపాటు విద్య ఆనందాన్ని అందిస్తుందని బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం తాజా సర్వేలో తేలిందంటున్నారు నిర్వాహ కులు, అధిక విద్యార్హతలు కలిగిన వారిలో 81శాతం, అల్పవిద్యావంతులలో  74శాతం, నిరక్షర కుక్షులలో  64శాతం ఆనందకరమైన  జీవితాలు గడుపుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ' అవ్యక్త నిధిని తూచేందుకు మనిషి దగ్గరున్న పడికట్టు రాయి అక్షరం ఒక్కటే'  అంటారు ఖలీల్ జిబ్రాన్. ఆ అక్షరానికి ఆనందం అనే విలువ జోడించాలి. అప్పుడది మనిషి విలువను మరింతగా పెంచుతుంది!


రచన-కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - ప్రచురితం - 15 -07 - 2012 )

Thursday, December 30, 2021

మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు




 


మహమ్మదీయ మహాయుగంలో గ్రంధాలయాలు 


5. భోజరాజు గ్రంథాలయము. క్రీస్తుశకము పండెండవళతాబ్దికి చెందిన కవిపోషకు డగు భోజరాజు గ్రంథ భాండారమే రాజనిర్మిత భాండా గారములలో మనకు తెలిసినవానిలో మొదటిది. కవి పోషకుడగుటయేగాక ఈ మహారాజు స్వయము కవి; పండితుడు. ఎంజనీరింగు, ఆర్కిటెక్చరు మున్నగు కళలను గూర్చినదగు 'సమరంగన' మనుపుస్తకము అతని రచనము. గైక్వాడువారి ఓరియంటల్ సీరీసులో కొలది వత్సరములకు పూర్వము ప్రచురించు భాగ్యము నాకు గలిగేను. సిద్ధరాజను పేరుగల చాళుక్యరాజు ఈభోజ రాజు రాజ్యమును జయించి ఈతని గ్రంథాలయమునుతన రాజధానీనగరమగు అహిల్ వాడునకు గొనిపోయి తన గ్రంథ భాండాగారమున కలుపుకొనేను. ఈ ఆన్ హిల్ వాడు నేడు పేటన్ అను నామమున శ్రీ గైక్వాడ్ మహారాజానారి సంస్థానమున ఒక నగరమైయున్నది.


5. ముహమ్మదీయుల దండయాత్రలు. గజనీముహమ్మదు దండయాత్రలతో హిందూ దేశ చరిత్రమున హిందూమహాయుగమునకు ఆశ్వాసాంత మైన జనవచ్చును. గజనీముహమ్మదు దేవాలయము లను నాశనముచేసెను, అర్చకులను తన క్రూరఖడ్గము నకు బలియిచ్చెను. అట్టిస్థితిలో అర్చకులు, పండితులు తమకు సాధ్యమైనన్ని గ్రంథములను గైకొని టి బెట్టు, నేపాళము మొదలగు దూరదేశములకును, ఎడారినడుమ నుండి దుర్గమమైన కౌసల్ మియరు మొదలగు తావుల


గము : గ్రంధాలయములు


కును, తదితర ప్రదేశములకు పారిపోయిరి. ఇక ముహమ్మదీయయుగమునందలి భారత దేశ గ్రం థాలయముల చరిత్రను గూర్చి తెలిసికొనవలసియున్నది.


9. ముహమ్మదీయులు:


హిందూసాహిత్య విజ్ఞానము. సాహిత్య


దండెత్తి వచ్చిన ముహమ్మదీయులు క్రమముగ దేశ పాలకులు నిచ్చట నిలిచిపోయిరి. పాలకులు పాదు కొనినపిదప వారికి సాహిత్యవిజ్ఞానాభివృద్ధివి వయమున శ్రద్ధవహించు:ుకు సావకాశము సమకూడెన. అపుడు వారు మసీదులను కట్టించిరి; ముహమ్మదీయ మతవ్యాప కమునకై పాఠశాలలు పెట్టించిరి; ముహమ్మదీయ విజ్ఞాన ప్రచారపరిశోధనలకై కళాశాలల నిర్మించిరి. కాలక్రమ మున వారిదృష్టి హిందువులు మతగ్రంథముల పైగూడ ప్రసరింప నారంభించెను. హిందువుల ధర్మగ్రంథములు వారియాజమాన్యమున పారశీక భాషలోనికి అనువదింప బడుటకు శుభారంభము జరిగెను. 3. ఢిల్లీ నగరము.


బానిసరాజుల కాలమున ఢిల్లీ నగరము విద్యాశాలలకు విఖ్యాతినందెను. పలువురు విద్యాసంతు లానగరమునకు చేరిరి. బానిసరాజులు విద్యాగోష్ఠియందు బహుప్రీతిని చూపిరి. కవులు, పండితులు తాము రచియించిన నూతన కావ్యములను, గ్రంథములను చదువుచుండ వినుటను ఆరాజులును, ప్రధానులును ఘన కార్యముగా భావించిరి. ఖిల్జీ రాజ్యసంస్థాపనాచార్యుడగు జలాలుద్దీన్ పండిత  


రత్నమును, కవిరాజును అగు అమీర్ ఖుస్రు అనువాని రాజభాండారపాలకుని నియమించి అతనికి కొరాన్ పరిరక్షకుడు అను బిరుదమిచ్చి అతని యుద్యోగ ము నాకు మంచివేతనమును ఏర్పఱచెను. గ్రంథ భాండాగ పాలకులలో ఈ అమీర్ ఖుసుకు జరిగినంత గౌరవము మఱి యెవరికిని జరిగి ముండ లేదనుట అతిశయోక్తి గాదు.


1. చక్రవర్తి ఫిరోజ్ టూగ్లక్. మొగలాయి చక్రవర్తులకు పూర్వులైన ముహమ్మ


దీయ చక్రవర్తులలో ఫిరోజ్ టూగ్లక్ నామము భారత దేశ గ్రంథాలయోద్యమ చరిత్ర కారునకు పూజనీయ మైనది. ఫిరోజ్ స్వయము పండితుడు; విశేషించి పండితపోషకుడు. విదేశములనుండి పండితులను రప్పించి వారితో సద్దో సలుపుటకు ఆతడు ముచ్చటపడు వాడు. అల్లు వచ్చిన పండితులు ఆవాసమునకు గాను అతను రాజభవనము నొకదానిని ప్రత్యేకించెను. విద్యావంతు డగు ఈ ప్రభువు హైందవపండితులను రాజసేవలో నియమించెను. హిందువుల సారస్వతముతో పరిచయ ముసంపాదింప తన మతస్థులను హెచ్చరించెను. నాగ ర్కాట్ నందలి దేవాలయమున ఒక చక్కని సంస్కృత గ్రంథ భాండాగారముండుటను తెలిసికొని పారశీక భాష నేర్చిన హిందూపండితుల నట కార్యను లుగ నియమించి ఆచ్చటి అపూర్వ గ్రంథములను కొన్ని ని రశీక భాషలోనికి అనువదింపజేసెను. Que మరణానంతరము భారత దేశ గ్రం థాలయోద్యమము కొంత కాలముకుంటువడినదని చెప్పవచ్చును. ఈ కాల మున తైమూరు హిందూదేశముపై ఎత్తిచ్చి ఢిల్లీనగర మును కొల్లగొట్టెను.


5. మఱికొన్ని చిన్న రాజ్యములు. మొగలుల కాలమునాటి భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రను వివరించుటకు పూర్వము ఈ కాలము నాటి మఱికొన్ని చిన్న రాజ్యములు గ్రంథాలయోద్యమ విషయమున ఎట్లు కృషి చేసినవో తెలిసికొనవలసియు 8. అహమ నగరమున బహమనీ రాజులు ఒక న్నది. చక్కని గ్రంథ భాండారమును నిర్మించి క్రమముగ నిర్వ హించిరని తెలిసికొనుట కావందముగ నున్నది. ఆ రాజులు దీనికి ఒసగిన పోషణము అనంతమును,


అత్యంతశ్లాఘాపాత్రమును ఆయినదే అయినను పదు నేనవశతాబ్దిలో వారికడ మంత్రిగనుండిన ముహమ్మదు గవాను చేసినదానము ముందు అది డిందుపాటు నొందు చున్నది. డక్కనునందలి భాండాగారములందు అక్కడ క్కడ అతని పద్యమాలికలు నేటికిగూడ మనకు దొరు కుచున్నవి. అతడు కోటికి పడగ ఎత్తినధనవంతు డేయ య్యు చేతికి ఎముక లేని నెఱ దాతగుటచే మరణకా లమునాటికి ఆతని బొక్కసమున లెక్క కాసులుమాత్ర ముండెను. ఉన్నతభావములుగల పోడిమీ జీవితమున ఆతడు ఋషివలె దినములు గడపెరు. అతని ధనమం తయు మసీదులు కట్టుటకు, పండితులను పోషించుటకు, గ్రంథ భాండాగారములను నిర్మించుటకు న్యాయపఱుప బడెను. బీజపురమున ఆదిల్ షాహి వంశపురాజులుగూడ నొకచక్కని భాండాగారమును నిర్వహించిరి. ఆ గ్రంథాలయమునందలి పలుగ్రంథములను ఔరంగజేబు ఢిల్లీ నగరమునకు గొనిపోయినను పందొమ్మిదవ తాబ్దిని అగ్రంథాలయమును సందర్శించిన డాక్టరు ఫెర్గుసన్ దాని మంచిదినములలో ఆ గ్రంథాలయము బ్రహ్మాండ మైనదైయుండవలెనని అభిప్రాయపడినాడు. వంగ దేశ మును రిపాలించిన తొలిజట్టు ముహమ్మదీయ ప్రభువు లలో క్రీస్తుశకము 1282 మొదలు 1825 వఱకు పరిపా లనము సాగించిన నాదిర్షా భారత దేశ గ్రంథాలయో ద్యమచరిత్రకారుల ఎల్లరచే స్మరింపదగినవాడు. ఇంగ భాషలోనికి మహాభారతము ప్రథమమున భాషాంతరీక రింపబడుటకు ఆతనిఆజ్ఞయే కారణము .


5. మొగలాయి చక్రవర్తుల కాలము. మొగలాయి చక్రవర్తుల కాలమున భారత దేశ గ్రం థాలయోద్యమము హుటాహుటినడలతో సాగినదని చెప్పవచ్చును. మొగలాయి చక్రవర్తులు, రాణులు, రాజకుమారులు కళాసాహిత్యములందు మంచి అభిరుచిని, అభినివేశమును చూపిరి. మొగలాయీల మూలపురుషుడగు తైమూరు రచియించిన స్వీయ చరిత్ర నేడును ఉపలబ్ధమగుచున్నది. ఈ తైమూరువలె నీతిని వంశీయులును స్వయము గ్రంథకర్తలై విలపిల్లిరి. వెంగ లాయి రాజవంశసంస్థాపకుడుగు బేబరు గొప్ప విద్వాం సుడు. 'బేబర్ నామా' అను పేరుగల ఆతని స్వీయ


చరిత్ర ఆతరగతివాఙ్మయములో ఎన్నదగినదై నేటి కిని ప్రకాశించుచున్నది. పుస్తకములలో చిత్రములను రచియించు ఆచారమునకు బేబరు ఆద్యపురుషుడన వచ్చును. పుస్తకములు సచిత్రముగ ప్రచురించు పద్ధతి కనుగొనినది మొగలులకు కీర్తిదెచ్చిన విషయము గా నేటికిని మనము చెప్పుకొనుచున్నాము. బేబరు తన గ్రంథములయం దన్నిటియందును చిత్రములను చేర్చు వాడు. బేబరు అనంతరము మొగలాయిసామ్రాజ్యము నగు నియంతయైన ఆతని తనయుడు హుమాయూను తాను జైత్రయాత్రలకు పోవు నవసరమునగూడ కూడ నొకపుస్తకభాండాగారమును తరలించుకొని పోవు వాడు. చరిత్రకు అందిన ప్రథమసంచార గ్రంథాలయ మిదియేయని నిస్సంశ తముగ చెప్పుకొనవచ్చును. ఈ సందర్భమున నెపోలియనును గూర్చిన ఒక సంగతి సాదృ శ్వనిబంధనమున జ్ఞప్తికి వచ్చుచున్నది. నెపోలియను పుస్తకములనిన చెవికోసికొనువాడు. మంచి పుస్తకములు నెంచి ఆతడు అందు ఒక్కొక్క గ్రంథమును జేబునం దిముడు చిన్న సైజున ముద్రింపించి సుందరముగ బైండు చేయించియుంచుకొని ఈ గ్రంథసంచయమును తాను ఎచ్చటికిపోయిన అచ్చటకు గొనిపోవువాడు. హుమా యూను గ్రంథాలయాభిమానము మిక్కిలి మెచ్చదగి నది. ఆతడు తన విలాసమందిరమును ఒక గ్రంథాల యముగ మార్చిపై చెను. గ్రంథాలయ ప్రియుడగు ఈ రాజొక సారి గ్రంథాలయముననుండగా కాలుజారి మేడ మెట్లపైనుండిపడి అప్పుడు తగిలిన దెబ్బలు కారణము గా మరణించెను. హుమాయూన్ తనయుడు అక్బరు పాదుషా ఒక గొప్పగ్రంథ భాండాగారమును కూర్చెను. తాను జయించిన ఒక గుజరాతు దేశపురాజుయొక్క మునుగూడ నీతడు తన స్వాధీనము లోనికి తెచ్చికొ నేను. తనకడ మంత్రిత్వమువహించి యున్న ఫెయిజి అను వాని గ్రంథ సముదాయమును సయితము అక్బరు తన సొంత గ్రంథ సముచ్చయమున చేర్చికొ నేను. ఈ పుస్తకములన్నియు మూడుభాగ ములుగ విభజింపబడెను. పద్యము, వైద్యము, జ్యోతి షము, సంగీతము అను విషయములకు చెందిన గ్రంథము లన్నియు మొదటి విభాగమున చేర్చబడెను. భాషా


తత్త్వము, వేదాంతము, మతము, ఖగోళశాస్త్రము, రేఖాగణితము అను విషయములకు చెందిన గ్రంథము అన్నియు రెండవ విభాగమున చేర్పబడెను. వాఖ్యాన ములు, వంశ చరిత్రలు, న్యాయశాస్త్రము అను విషయము లకు చెందిన పుస్తకములన్నియు మూడవవిభాగమున చేర్పబడెను. పుస్తకములలో చిత్రములను చేర్చు ఆచా రము ఈతనికాలమున బాగుగ పెంపొందెను. పుస్తక ములను సంకరతరముగ బైండింగు చేయు విషయమున ఈచక్రవర్తి హయాను. లో అతిశ్రద్ధ చూపబడెను. మొగలాయిచక్రవర్తులు స్వయముగా గ్రంథములను ప్రోవుచేయుటయందు అత్యుత్సాహమును చూపు పోయే గాక తమపూర్వులు ఏర్పఱచిన గ్రంథ భాండారములను కంటవతీడుకొని పరిరక్షించుట యందును విశేషాభి మానము చూపిరి. ఇంతటిదీక్షతో, ఇంతటిశ్రద్ధతో మొగలాయిచక్రవర్తులు సంతరించిన గ్రంధ సముదాయ మంతయు క్రీస్తుశకము 1739 వ సంవత్సరమున ఢిల్లీ నగ రముపై ఎత్తివచ్చి దానిని కొల్లగొట్టిన పారశీకుడు నాదిర్షా చేతులలో బడెను. 5. ఇతరరాజుల గ్రంథభాండాగారములు.


దక్షిణ భారత దేశపు సుప్రసిద్ధులగు రాజ నొడగు టిప్పుసూల్తాను బహుళ గ్రంథములను సేక రించెను. 1799-వ సంవత్సరమున శ్రీరంగ పట్టణము పట్టు కొనబడినపుడు ఈగ్రంథ సముచ్చయమంతయు నాశ నము చేయబడెను, లక్నో స్నే పట్టణము పట్టుకొనబడినపుడు 1884వ సంవత్సరమున అయోధ్యనబాబు గ్రంథా లయముకూడ నిప్లేయయ్యెను. కాని పలువురు రాజుల భాండాగారములు కాలపురుషుని నాశనఖడ్గమునకు ఎదురొడ్డి నిలచినవి. నేపాళము, కాశ్మీరము, మైనూ రు, జయపురము, జోధపురము, భోపాల్, ఆళ్వారు రాజ్యములందు పురాతన గ్రంథ భాండాగారములు నేటి కిని సుస్థితీయందున్నవి. ఆయాభాండాగారము లందలి గ్రంథములకు నేడు మంచిమంచి కెటలాగులు తయారు చేయబడియున్నవి. తంజావూరు ప్రభువుల గ్రంథభాం డారము మదరాసు ప్రభుత్వము వారి పరిరక్షణము నంది ప్రజోపయోగకరమైన సంస్థయై ప్రకాశించుచున్నది.


( బరోడా సంస్థానంలోని గ్రంథాలయ శాఖాద్యక్షులు కీ.శే న్యూటన్ మోహన్ దత్తా గారి ఆంగ్ల వ్యాసం ఆధారంగా ) 

( ఆంధ్రభూమి - వార- అక్టోబర్ 1938 సంచిక నుండి సేకరణ ) 


కథ బొమ్మల పెళ్లిళ్లు కొడపటిగంటి కుటుంబరావు. ( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 


కథ 

బొమ్మల పెళ్లిళ్లు 

కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 

బోధెల్ - యూఎస్ఎ



ఆరోజు సరోజినికి పర్వదినం. ఆపిల్లకళ్లకు సమస్తం ఆనందమయంగా తోచింది. 


వాళ్ల బావ భైరవమూర్తి గారి మేడ టాజిమహల్లాగుంది. ఇంటిపక్క తోట నందనవనంలాగుంది. తనతో తోటలో పికారు చెయ్య టానికి వచ్చిన సావిత్రి సాక్షాత్తూ దేవకన్యకలాగుంది. 


ఆరోజున సరోజినికి సావిత్రినిచూస్తే అనురాగంపొంగి పొర్లటం మొదలు పెట్టింది. ఈ ప్రేమావేశం తాత్కా లిక మేఫనీ, పూర్వం ఉన్నదికాదనీ, ముందుండబోదనీ ఆ ఉత్సాహంమీద సరోజినికి తోచటం అసంభవం. దీనికంతా కారణం అప్పుడే ప్రవేశిస్తున్న వసంతరుతువు కాదు, ఆనాడు భైరవమూర్తిగారి శిశువు అన్నప్రాశన.


మీరు సావిత్రినికాని సరోజినిని కాని ఇద్దరినీ కాని బాగా ఎరిగుండకపోతే ఇద్దరూ కవలపిల్లలని చెప్పినా నమ్ముతారు. 


నిజానికిమటుకు సరోజిని సావిత్రికి పిన తల్లి. సావిత్రి సరోజినికన్న ఏమాత్రమో పెద్దదీ, సరోజినికన్న మితభాషి కూడా కావటంచేత చూడగానే ఇద్దరిలో కనపడే భేద మేమిటంటే సావిత్రి పినతల్లికంటె గంభీరంగా ఉండేది. అంతకుమించి ఇద్దరిలోనూ ఎక్కువ తారతమ్యం లేదు.


సరోజిని సావిత్రిని తోటంతా తిప్పి ఆఖరుకు  తన ప్రాణానికి మంచి పాదరిల్లంటిది కనపడ్డ చోటు  చూపి ఇక్కడ కాస్సేపు కూర్చుందామన్నది. 


ఇద్దరూ ఆకుల కింద కూర్చున్నారు. కొంతసేపు ఆకబుర్లూ ఈకబు ర్లూ చెప్పి సరోజిని అసలు సంగతి కొచ్చింది.


“అయితే, సావిత్రీ బావ నీ పెళ్లి చేస్తాడుట నిజవేనా ? " 


సావిత్రి సమాధానంగా పినతల్లిని చూసి నవ్వింది.


"అంతా నిశ్చయమయిందా?" 


" అదే నిశ్చయం. ఇంకా తాంబూలా లిచ్చుకో లేదు.”


2


“నీ కాబొయ్యే మొగుడెవరు ?  "


సావిత్రి చాలా నేర్పరి. ఎటువంటి ప్రశ్న కటువంటి సమాధానం చెప్పాలో ఎరుగును .


“ఎరగవు టే? మామయ్య ఇక్కడ చదువుకునేట ప్పుడు వస్తూండేవాడే—రాధాకృష్ణ మూర్తని !” 


" నాకు బాగా జ్ఞాపకంలేదు... అయితే నీకీ  సంబంధం ఇష్టమేనా?" 


" ఎందు కిష్టంకాదు?”,


సరోజిని తనావిషయం మాట్లాడదలుచుకున్నది అ యిపోయినట్టు నన్న గొంతుతో ఏదో మంగళహారతి ఎత్తిచప్పున ఆపి “ఇప్పు డీసంబంధం కాకుండాపోతే?” అన్నది.


" ఏమిటి?"


“నిన్ను ఆ అబ్బాయికిచ్చి -ఆయన పేరేమిటి? —ఆయనకిచ్చి చెయ్యరనుకో..”. 


" పోనీ!...అయినా ఎందుకు చెయ్యరు?”.


"ఇంకొకరి కిచ్చిచే స్తే!" 


" ఇంకో రెవరు?"


“అన్నయ్యకి స్తే!”


సావిత్రి నవ్వి “తాతయ్య కిష్టంలేదుగా?" అంది. 


"తాతయ్య సంగతి కాదిప్పుడు! నీ సంగతి చెప్పు!"


" ఏమో! నా కంత యిష్టంలేదు సుమా. మామయ్య ఎప్పుడూ మేనకోడలిని చేసుకోటం నీతి కాదఁటుంటాడు. అయినా ఇప్పుడెందు కాఆలోచన?”


సరోజిని సావిత్రి చెయ్యి తీసుకుని వేళ్లు సాగ దీస్తూ “ఇవాళ మా నాన్న మీ నాన్న నడగబోతున్నాడు. నిన్ను అన్నయ్య కియ్యమని. నీకింకా తెలీదేమో?” అని సావిత్రి మొహం వంక చూసింది. 


సరోజిని అనుకున్నట్టు సావిత్రి మొహాన  ఏభావం కనపళ్ళేదు. 


ఇంత రహస్యం చెప్పినా సావిత్రి చలించకపోవటంచూసి సరోజినికి ఉత్సాహభంగమైంది. ఇద్దరూ కొంతకాలం మౌనంగా కూర్చున్నతరువాత సరోజిని పోదామంటూ లేచింది.


“కాస్సేపు కూర్చోవే అబ్బ! ఇంట్లో ఏముంది?"


"ఇంకా అడుగూ బొడుగూ కాఫీ ఉందేమో తౌగి ఇప్పుడేవస్తా. లేకపోతే మంచినీళ్లైనా తాగుతా: ఏం చేస్తాం!" అంటూ చెయ్యి వదలించుకుని సరోజిని ఇంటి వైపు పరిగెత్తింది.


సరోజినటువెళ్లింది, సుందరం ఇటొచ్చాడు. అతను వెనకనించి సావిత్రిని సమీపించి “ఇక్కడున్నావుటే అమ్మాయి? అమ్మ నీకోసం వెతుకుతూంటేను,,, ఓసి!" అంటూ సావిత్రి పక్కనేకూలబడి ఒక చేత్తో సావిత్రిని దగ్గరికి తీసుకున్నాడు.


“నీపెళ్లెప్పుడే, పెళ్లికూతురా ? రాధాయి కంట గడు 

తున్నారూ నిన్ను! మంచివెధవ నీకు మంచి మొగుడవుతాడు. ఆలుసుమాత్రం ఇచ్చేవు సుమా! ఒక చెంపనించి తొక్కి పెడితే కాని మాటవినడు. జాగ్రత్త."


" ఏమ్మాటలు, మామయ్యా!"


"ఓసి! నీకెంతసిగ్గు ! ఒక్కత్తెవు కూర్చుని మొగుడి విషయం ఆలోచిస్తున్నావేమోనని మంచి  చెప్పబోతే తప్పా? నే పోతున్నా లే!”


" ఉండు! ఉండు! అట్లా అయితే నేనూ పెళ్లి విష యమే మాట్లాడతాను. ఒకటి చెప్పు. మేనమామను పెళ్లి చేసుకోవచ్చునా?”


"తప్పు!"


" నేను మరి నిన్ను చేసుకోబోతున్నా నే!"


సుందరం సావిత్రి చెంపమీద ఒక్కటి పెట్టి “ఈసారి  ఆమాటంటే నీతో మాట్లాడను," అన్నాడు. 


సావిత్రి చెంపరుద్దుకుంటూ నవ్వి, “ఈ మాట మీ నాన్న అన్నా ఇదేనా శిక్ష!” అన్నది. 


సుందరం ఆశ్చర్యంతో మేనకోడలి వంకచూసి, “నాకింకా తెలీదే! నీతో ఎవరన్నారు?" అని అడి గాడు.


"సరోజిని.”


“దాని కన్నీ తెలుసు!... హూఁ! ఆ అయిదు వేల కట్నం నాన్న గారి మతిచెడగొడుతున్నది. సంవత్సరం కిందట ఈ విషయం వచ్చినప్పుడు అయినవాళ్లలో కట్నంరాదని చాతనాయిన  వంకలన్నీ చెప్పి మనిద్దరికీ ముడిపడకుండా చేశాడు. ఈసారి బావ ఎట్లా తప్పించుకుంటాడు? ఇంకో వెయ్యి ఇస్తామంటే సగోత్రీకుల పిల్లనైనా చేసుకుంటారు నాన్న గారు. ఒక్కపాఠం నేర్చుకో, పిల్లా! నీ కెప్పటికైనా పిల్లలు పుడితే విశ్వ ప్రయత్నంచేసి వాళ్లకు పెద్దవాళ్ళ నెదిరించటం నేర్పు. నాకిన్నేళ్లు  వచ్చినై, ఇంత చదువు చదివాను! నాన్న గారు రేపు కొండముచ్చును పెళ్ళిచేసుకోమంటే కాదనేటం దుకు నాకు ధైర్యంలేదు... మీ నాన్న నీకు చనువిచ్చా డుగా! రాధాయినే చేసుకుంటానని పోట్లాడు.”


"నేను పోట్లాడను. నాన్న పెళ్ళివిషయం నన్నడగడు, నేను సిగ్గుపడతానని ఆయన నమ్మకం, నేను సిగ్గు లేనట్టు ఆయన కెట్లా తెలియచెయ్యటం?" 


" ఆహా ఏం లోకం ! ఎవరి పిల్లల మనసు వాళ్ళకు తెలీదు!"


ఆసాయంకాలం సుందరం, రాధాకృష్ణమూర్తి కృష్ణ ఒడ్డున ఇసకలో కూర్చున్నారు.


ఆ మర్నాడు సావిత్రి పెళ్ళికి ముహూర్తం ఏర్పాటు చేశారు. తాంబూలాలు పుచ్చుకున్నారు. ముహూర్తం ఇరవైరోజుల్లో ఉంది. 


" రాధా! నా పెళ్ళికి తప్పక రావాలిసుమా , చెల్లెలిని చేసుకుంటున్న వాడి పెళ్ళి నీకెక్కడ తటస్తపడుతుంది?" అన్నాడు సుందరం దీనంగా.


‘‘అర్ధంలేకుండా మాట్లాడతావేంరా, సుందరంగా !  అప్పకూతుర్ని చేసుకుంటున్న వాడివి నువ్వే నేం లోకం లో! నీకు మళ్ళీ అటువంటి పిల్లవస్తుందీ?”


"అటువంటి పిల్ల మాసరోజా ఒకతె ఉందిగా!" 


" ఛీ! అప్రాచ్యుడా! వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారను కుంటున్నావుకాని, నక్కకూ —ఇద్దరికీ ఎంతో భేదం ఉంది. నాకు సంబంధమే కనపడదు.” 


“ఇంకేం? నాకు భేదమే కనపడదు. నిన్నా ఇవాళ లోపల   వందసార్లు సావిత్రిని సరోజిని పేరు పెట్టి పిలిచాను. అది పలకదు!" 


" నీ మొహం! దానిక్కోపం, వళ్ళుమంట, ఎందుకుండదు ? చిత్రంచూడు. ప్రకృతి మనల్ని వెక్కిరించటాని కిట్లాచేసిందికాని వాళ్ళిద్దరిలో నీకు కనపడ్డభేదం నాకు  కనపడి నీ కాభేదం కనపడకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను సావిత్రిని కొంతవరకు నిశ్చింతగా - పెళ్ళిచేసుకునేవాణ్ణి. సరోజానీకు కుదిరేది.” 


ఇక్కడ రాధాకృష్ణమూర్తి ఈడుకుమించిన మాటన్నాడు.


"ఎందుకు దిగులుపడతావురా? పెళ్ళయిన మరుక్షణం నుంచీ  ప్రయత్నంచేసినా ఇద్దరికీ సంబంధం కనపడదు.” 


" నీదయవల్ల  అట్లా అయినా బాగుండును."


" నాన్నక్కోపం వచ్చింది మీ బావగారిమీద.”


" పెద్దకట్నం పోయిందే అని.” 


" సామెత చెప్పినట్టుంది.”


పూర్తిగా పొద్దుకూకకుండానే ఇద్దరూ ఇంటిదారి పట్టారు. భైరవమూర్తి గారి మేడముందు రాధాకృష్ణ మూర్తి గుడ్ నైటన్నాడు.


సుందరం  రాధాకృష్ణమూర్తి చెయ్యిపట్టుకున్నాడు. "ఒక కప్ కాఫీ తాగిన తరువాత. " 

" కాఫీ! అవశ్యం ”


ఇద్దరూ మూలగదిలో చేశారు. సుందరం లోపలికి వెళ్లాడు, సరోజినితో రెండు  కప్పులు కాఫీ తయారు చెయ్యమన్నాడు. అందుకని సరోజిని మూడు కప్పుల కాఫీచేసి తనకోకప్పు దాచుకుని మిగిలిన కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తరవాత కొంచెం ఎడంగా నుంచుని రాధాకృష్ణమూర్తిని పరీక్ష చెయ్యటం మొదలు పెట్టింది. 


రాధాకృష్ణ మూర్తి కాఫీ కాస్త రుచి చూచి కప్పుబల్ల మీద పెట్టి "ఫైన్ ” అన్నాడు.


సుందరంకూడా కొంచెం తాగి మొహం చిట్లించి, “నాకు కాఫీ రుని తెలీదురా ఖర్మం!" అన్నాడు


" సావిత్రికీ అంతే, అన్నయ్యా దానివన్నీ నీగుణా లే" అన్నది సరోజిని నవ్వుతూ. 


రాధాకృష్ణమూర్తి కొంచెంసేపు సరోజిని వంకచూసి, తలగోక్కుని కాఫీతాగటం సాగించాడు.


ఈ కాఫీ మాత్రం ధుమాగా ఉందిరా. యమాగా ఉందనుకో! అద్భుతంగా ఉందంటేనమ్ము . ఎందుకూ? నెంగరం అయ్యరు కాఫీకి నకలు. అసలుకు సరియయిననకలు" 

 సరోజిని తల ఒక పక్కకు  ఒరగేసి  రాధాకృష్ణమూర్తి  వంక చూస్తూ "పాపం, సావిత్రికి సుందరమే మొగుడయే వాడు?" అనుకుంది.


" నేను పోతున్నాను. మీకింకేమన్నా కావాలా? " 


"నీళ్ళు” సుందరం.


" తాగటానికేనా?"…రాధాకృష్ణ మూర్తి. “


" తప్పకుండా! లేకపోతే ఈ చేదుఇట్లాగే ఉండనీమంటావా ఏమిటి?”


సరోజిని  బిగ్గరగా నవ్వుతూ పరిగెత్తిపోయింది.


రొండు నిమిషాలపాటు స్నేహితులిద్దరూ మౌనంగా  కూర్చున్నారు. చివరకు రాధాకృష్ణమూర్తికి మాట్లాడబుద్ధయింది. "మీ చెల్లెలికీ మీ మేనకోడలికి భేదం లేదంటావేంరా? " 


“ఆఁ?" అన్నాడు సుందరం పరధ్యానంగా,


" ఇద్దరికీ లక్షభేదం ఉంది.” 


" ఎవరు?"


" మీ చెల్లెలికీ- మీ సావిత్రికీ "


"ఏమిటి?"


భేదం —లక్ష భేదం—”


"ఏంభేదం?"


" ఉంది " 


"ఎందుకుంది. "


"ఎందుకు లేదు.”


ఇప్పుడు సుందరం దోవకొచ్చాడు.


‘నాఆలోచనంతా పాడు చేశావు! ఏమిటా మనం మాట్లాడుతున్నది?”


రాధాకృష్ణమూర్తి మళ్ళీ వెనక్కి రాదలుచుకోలేదు. "సావిత్రి ఇంత ఉత్సాహంగా ఉండదు.”


స్నేహితు డేంమాట్లాడుతున్నాడో తెలీక సుందరం " ఆఁ?" అన్నాడు. ‘


" ఇంక మాట్లాడదు.".


" ఎవరు?" 


'' సావిత్రి.” 


" సావిత్రంటే  . ఓహో సావిత్రా? ఇంకాసావిత్రేమో ననుకున్నా!"


" ఇంక నవ్వ దసలు .”


"ఎవరు? సావిత్రేనా?"


" ఆ! అంటే సావిత్రికాదు? సావిత్రి!"


"సావిత్రి నవ్వదా ?”


"నవ్వదు. ఎందుకు నవ్వాలి? నవ్వు నాలుగందాల చేటు  " 


రాధాకృష్ణమూర్తి తలగోక్కుని అకస్మాత్తుగా " గుడ్ నైట్" అని వెళ్లిపోయినాడు.




జరిగిన సంగతి  ఏమిటంటే రాధాకృష్ణమూర్తి మొదట సావిత్రికోసం ఉబలాటపడ్డప్పుడు తనమనస్సును ఆపిల్ల కర్పించుకున్నాడు. ఒకపిల్ల తన అనుజ్ఞ లేకుండా తన మనసును ఎత్తుకుపోయినట్లు   అతనికి కొత్త అనుభవం. అనుభవంలేనివాడు కనకనే పని పెట్టుకొచ్చి సరోజిని తన మనస్సును   ఆకర్షిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. దానికి అతనికివ్వబడ్డ విశేషేమిటంటే సరోజిని !


రాధాకృష్ణమూర్తి మాట్లాడుతున్నది వినిపించుకో కుండా సుందరం ఆలోచిస్తున్న దేమిటంటే తన చెల్లెలికీ సావిత్రికీ ఏం సంబంధం ఉందా  అని. దానిక్కారణం ఉంది. 


అతను సావిత్రిని సరిగా చూసింది కిందటిరోజు ఉదయం. చెల్లెలిని సరిగా చూసిందంతకు పూర్వమే! మగ వాడికి పెళ్లియావ లేనంత కాలం ఆడపిల్లలంతా ఒకటి గానే ఉంటారు. వాళ్ళిద్దరికీ కొంతపోలికకూడా ఉండే చెప్పేదేమిటి?


అన్నిటికన్న ముఖ్యమైనవిషయం మొదటినించీ సావిత్రికి దిగులు తన్ను తనమామ కియ్యరనే .


—కొడపటిగంటి కుటుంబరావు.

( ఆంధ్రభూమి - మాస- 1938, అక్టోబర్ సంచిక ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

30-12-2021 ; బోధెల్ ; యూఎస్ఎ


వలపు -తాత కృష్ణమూర్తి ( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ )

 వలపు 

-తాత కృష్ణమూర్తి


( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ ) 



పుస్తకాలలో ఉన్న నాయికానాయకులకేగాక, మెదడు, శరీరావయవాలు సవ్యంగా ఉన్న ప్రతి మని షికీ యీడువచ్చిన పిమ్మట వలపంటే యేమిటో, కొంతవరకు అనుభవమవుతుంది. మహాకవులు నాయికిల వలె ప్రతీఆడదీ విరహవేదనలో మన్మధుణ్ణి, చంద్రు ణ్ణి, గాలిని, పిట్టల్ని నోరుతిరగని సమాసాలతో తిట్టి, చెలికత్తెలను కొట్టి, జుట్టు పీకుకొని, ఒళ్లు రక్కుకొని, మెడలోనిహారాలు తెంచేసుకొని, కాంభోజీరాగంలో వెక్కివెక్కి యేడవక పోవచ్చు ; ఉద్యానవనాలలో ఉండే లతలతో ఉరిపోసుకోకపోవచ్చు. ప్రతీమగ వాడూ కథలలోని రాజులవలె నిద్రాహారాలు మాని వేసి, కలలో కనిపించిన కన్యాలలామకోసం మహా రణ్యాలకుపోయి తపస్సులు చేయలేకపోవచ్చు; వలపు తీవ్రత కోర్వలేక కత్తితో కంఠంకోసుకొనో, విషం త్రాగో, చావడానికి సాహసించలేక పోవచ్చు. కాని ప్రతీమనిషికీ ప్రేమతత్వం ఏదోవిధంగా తెలియరాక మానదు.


అయితే లోకంలో చాలామందికి తమ అనుభవా లెట్లా ఉన్నా, వలపును గూర్చి అభిప్రాయాలు మాత్రం 3 మహావిపరీతంగా ఉండడానికి కారణం బహుళః కవుల తలతిక్క వ్రాతలే నేమో! దేనినైనా సరే, మసిపూసి మారడికాయ చేయగల సమర్ధులు కవులు, జంతువులు,


పిట్టలు, కీటకాలు సహితం అనుభవించి తెలుసుకోగల సెక్సు ప్రేమను మహా అపురూపమైన వస్తువుగా వర్ణించి దానికి తమ ఊహాశ క్తివలన లేనివెన్నో అర్థాలు కల్పించి, లోకంతో సంబంధంలేక ఏకొండగుహలోనో ముక్కు మూసుకొని మూడవ నేత్రంతో సర్వమూ తిలకించగల మహారుషులకును, కల్పితకథలద్వారా నిజాన్ని అబద్ధం గాను అబద్ధాన్ని నిజంగాను చెయ్యగల ఊహాజ్ఞాన సంపన్నులను కవిపుంగవులకును తప్ప, సామాన్యుల కది యెంతమాత్రమూ తెలియరాని రహస్యమని బోధిస్తా మంటారు !


సెక్సు ప్రభావంవలన స్త్రీ పురుషులకు ఒండొరుల యడల జనించే అనురాగమే వలపు. దీనినే పేరు, మోహం, మనసుల కలయిక, కామం, మన్మధవికారం, మమత యిత్యాది పేర్లతో వ్యవహరిస్తారు జనులు. వలపులో సుఖం దుఃఖం, అభిమానం యీర్ష్య, పశుత్వం దేవత్వం, స్వార్ధం స్వార్ధత్యాగం, మంచి చెడ్డ- అన్నీ లీనమైఉంటాయి. తెల్లని సూర్యకాంతిలో యింద్ర ధనస్సు రంగులన్నీ యిమిడియున్నట్లు వలపులో దయ, ద్వేషం, భక్తి, భయం మొదలైన గుణాలెన్నో విశద పడుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి.


ప్రేమ అనేమాటకు వాడుకలో అనేక అర్ధాలు ఉంటున్నాయి. మాతృప్రేమ, బంధుప్రేమ, దేశప్రేమ


దైవపేరు మొదలైనవి సెక్సుతో సంబంధం లేనివి. ఇక సెక్సుతో సంబంధం ఉన్న ప్రేమలో కూడా ము ఖ్యంగా రెండుకాలు ఉన్నాయి. శరీర సంపర్క వాంఛ ప్రధానంగాల ప్రేమ ఒకరకం. దీనినే కామ మనీ, పశుప్రేమమనీ అంటారు. శరీరభోగాలతో జోక్యంలేని ప్రేమ రెండోరకం. ఇది కేవలం మానసిక మనిన్నీ, మిక్కిలి పవిత్రమైనదనిన్నీ చెప్తారు. వల పులో నిజంగా యీ రెండురకాల ప్రేమలూ విడదీయ డానికి వీలు లేకుండా ఐక్యమైఉంటాయి.


ప్లేటో అనేది కథలలో సహజం గా నే కనిపించవచ్చును గాని మానవప్రకృతికి విరుద్ధ మే అనిపిస్తుంది. వలపుగలచోట శరీరసౌఖ్యా పేరు ఉండక తప్పదు. అయితే, ప్రేమించుకునే నాళ్ళకందరికీ అట్టి సౌఖ్యాలు లభించక పోవచ్చును; కోర్కెలు తీర్చుకుం దుకు తగిన అవకాశాలు లేకపోవచ్చును; కోర్కెలు, అవకాశాలు కూడా గలవారు యింద్రియనిగ్రహంవలన తమ శరీరవాంఛల నణచుకోవచ్చును. కాని, ఇంద్రియ సుఖవాంఛారహితమైన వలపుమాత్రం అసహజం!


అట్లే శరీవసంబంధం ఉన్నచోట నల్లా తప్పకుండా ప్రేమ ఉండితీరాలని తలచడం తప్పు. స్త్రీ పురుషులిద్దరు ఎట్టిప్రేమయు లేకనే శరీరసంపర్కం కలిగి ఉండ వచ్చును; బిడ్డలనుకూడ కనవచ్చును. ఇట్టినడత కడు నీచమైనదే అయినా, అస్వాభావికంమాత్రం కాదన డానికి మానవసంఘంలోగల వేశ్యావృత్తి ఒక గట్టి నిదర్శనం.


స్త్రీపురుషు లిద్దరికి శరీరసంబంధమాత్రమైన ఐక మత్యం యేర్పడినప్పు డది తుచ్ఛమగు కామమనిన్నీ, మన సుల కలయిక మాత్రం సంభవించినప్పు డది పవిత్రమగు స్నేహమనిన్నీ, మనోతనువులు రెండిటి బాంధవ్యమూ చేకూరినప్పు డది పేమమనిన్నీ చెప్పుకుంటారు, సాధా రణంగా. కాని తరుచుగా కామంలో స్నేహం, స్నే హంలో ప్రేమ, ప్రేమలో కామం కలసి పొడగడుతూ ఉంటాయేకాని, దేని కది విడిగా విళదకుడదు. కాబ బట్టే అర్ధం ప్రియులచేష్టలు యితరుల కప్పుడప్పుడు ఏమీ కాకుండా, విపరీతంగా కనబడతాయి.


స్త్రీపురుషులిరువురికి' అన్యొన్యాను రాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియుల కే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపువలపు' నాయికానాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రూపలావణ్యాలం చూసుకొని మోూహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనం చూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెన్డ్ మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గలవాళు లేకపోలేదు--హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బల లమైన హేతువులని చెప్పకతప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, వయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది. కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సె ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి, క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా మచ్చిక జంతువులలోన కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, వైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకేపుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


(స్త్రీపురుషులిరువురికి' అన్యోన్యానురాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియులకే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపుదలవు'. నాయికా నాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రహదశులావణ్యాలు చూసుకొని మోహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనంచూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెస్టి మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గల వాళ్లు లేకపోలేను-హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బలమైన హేతువులని చెప్పక తప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, నయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సెకు ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి. క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా ఉండదు. పక్షులలోను, మచ్చిక జంతువులలోను కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, పైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకే పుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


అమెరికా, యూరప్ వంటి దేశాలలో ఒకేతరగతిలో కలసి చదువుకునే బాలురు, బాలికలు సాధారణంగా పెండ్లాడుకుందుకు యిష్టపడరట. సగోత్రీకులకు, వివా హబాంధవ్యాలు నిషేధించిన హిందూధర్మశాస్త్రవేత్త లకు యీరహస్యం తెలుసు!


వెలుతురు, వేడిమి, విద్యుచ్ఛక్తి మొదలైనవాటి వలె వలపొక బాహ్యశక్తికాదు. ఆకలి, తలనొప్పి వంటి శరీర బాధయుకాదు. ఇంద్రియానుభవాల వలన మొదట జనించి, పిదప మనసులో స్థిరపడి, క్రమం గా మెదడునుకూడ వశ పరచుకోగల దారుణమహిమ కలది, అది. పంచేంద్రియాలలోను చూపు మిక్కిలి చురుకైనది కనుక, ప్రేమ సంకురింపజేయుటలో దానికి గల సామర్ధ్యాలు మరిదేనికీ లేవు. కళ్ళకుగల యీ దా రుణశక్తికి వెరచి కాబోలు మానససంఘంలో కొందరు ఘోషాపద్ధతిని విధించుకున్నారు తమ స్త్రీలకు! హిం దూవిధవకు సంఘం విధించిన పాడుముస్తాబుకూడా పురు వదృష్టికి వెరచియే నేమో!


మొదట చతుప్రభావంవలన ఉద్భవించిన వలపును మిగతా. యింద్రియాలు కొంతవరకు బలపరచగలవు. కాబట్టే ప్రియాలు కంటికింపగు ముస్తాబు చేసికొనుట తో తృప్తిపడరు, పువ్వులు, పరిమశద్రవ్యములు విరి విగా వాడతారు. కమ్మని మిఠాయిలు భుజిస్తారు. జిలి బిలి పలుకులతో సంభాషించుకుంటారు. పాడుకుం టారు. నృత్యంచేస్తారు. ముద్దులాడుకుంటారు. కాగ లించుకుంటారు. కరుచుకుంటారు. పిచ్చిపిచ్చి పను లెన్నో చేస్తారు. పంచేంద్రియాలకూ పరవశత్వం వస్తే నేగాని వాళ్ళకు తనివి తీరదు.


• ఎలవును జనింపజేయుటలోను, జనించిన వలపును వృద్ధినొందించుటలోను, ఒక్కొక్కప్పు డొక్కొక్క యింద్రియం ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రియురాలి అను గ్రహం సంపాదించడానికి ఆమెనిద్రించే గది కిటికీ వద్ద చేరి, ఫిడేలో వీణో వాయినూ పాడేవాడట, పూర్వ కాలపు ఐరోపాప్రియుడు! పిల్లనగ్రోవి ఊది గొల్లపడు చులను వశపరచుకు నేవాడట శ్రీకృష్ణుడు. గానం, వా యిద్యం, సంభాషణ, ఏడుపు, నవ్వు మొదలైనవి కణ్ణం


ద్రియాన్ని రంజింపజేసే సాధనాలు. ఇక ఘ్రాణేంద్రి యాన్ని మెప్పించి, ప్రేమను పెంపొంద జేయగలవి. పువ్వులు, మంచిగంధం, పన్నీరు, అత్తరు, కస్తూరి మొ దలైనవి. ప్రియుల నొక్కొక్కప్పుడు కొన్ని కొన్ని వాసనలు వెర్రెత్తించగలవు. యోజనగంధిని ఆమె ఘుమ ఘుమకు వలచినాడట శంతన మహారాజు! అట్లే తియ్యని మిఠాయిలు, కమ్మనిపిండివంటలు, పండ్లు, పాలు, తేనె, సారాయిలు జిహ్వేంద్రియం ద్వారా మోహోద్రే కాన్ని స్ఫురింపజేసి వృద్ధిచేయగలవు. వలపును సాధిం చడంలో ఒక్కొక్కప్పుడు స్పర్శేంద్రియం చదువు కంటె తీక్ష్యంగా పనిచేస్తుంది. అయితే తనప్రతాపం చూపెట్టుకుందుకు కంటికిగల అవకాశాలు స్పర్శకు లభించవు, కలసి నాట్యం చేసుకునే సందర్భంలో ఒం డొరుల యొడలితాకుడుకు మోహో ప్రేకులై దంపతు లైన పాశ్చాత్య యువతీయువకు లెందరో ఉన్నారట! తన మొగంతీరుకూ, పాటనేర్పుకూ, మాటతీపికీ, దేనికీ సాధ్యుడుకాక కొయ్యబొమ్మవలె నిల్చున్న ప్రవరుణ్ణి చూసి, తుదకు క్షణబాహు మూలరుచితో


"పాంచద్భూష


బాలిండ్లు పొంగారఁబై యంచుల్ మోపగఁ గౌఁగిలించి యధరంబాసింప -” సాహసించిందట సరూధిని. ఉగ్గుపాలతో కళాశాస్త్ర మార్మాలన్నీ నేర్చుకున్న ఆప్రౌఢకు, అతగాడిని లొంగదీయడానికి స్పర్శేంద్రియమే అంత్యసాధనమని తోచింది!


ఇంద్రియసుఖాలు వలపు కెంత అవసరములైనా, కేవలం వాటిపోషణ మీదనే ఆధారపడి ఉండ దది. అందుకనే ప్రేమకు చంచల స్వభావం ఆరోపించారు. పెద్దలు. శరీరం, మనసు, మెదడు ఏకీభవించి కాపా డితేనేగాని నిలవదు వలపు! స్త్రీపురుషు లిద్దరికి ఒకసారి నిజమైన వలపు కుదిరినప్పుడు, అట్టి ప్రేమ స్థిరంగా నిలుస్తుందనీ, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చలించదనీ, వాదిస్తారు కొందరు విడాకులు, ద్వితీ యవివాహాలు, ప్రియులకలహాలు మానవసంఘంలో అరుదైనట్లు పుట్టుక, పెరుగుట, చావుగల జీవ


ప్రేమకు స్థిరత్వం ఆరోపించడం వెర్రి. కాని, ఇంద్రియాల ప్రేరేపణకు లెక్క చేయక, హృదయాన్ని లొంగదీసు కొని, బుద్ధిబలంవలన స్థిరంగా ఒక్కరినే ప్రేమించ గలుగుట మానవునికి అసాధ్యంకాదు. పతీవ్రతలు, ఏక పత్నీ వ్రతులు అట్టి మనోబలంగల ఘనులు.


వలపు విషయంలో అవకతవకగా ప్రవర్తించే వాళ్ళం. దరూ మెదడుతకు వరాళ్ళే అని రూఢిపరచగ లరు నేటి శాస్త్రజ్ఞులు. మెదడుశక్తి అంటే పుస్తకాలు చదు పుకున్న జ్ఞానమని కాదు. బడిచదువు, పరిక్షలు, శా శాస్త్ర జ్ఞానం—వీటితో సంబంధంలేక, ప్రతీ మనిషికీ పుట్టుక 'నే భగవంతు డనుగ్రహించే శక్తి అది! సమాన మైన అవకాశాలతో,ఒకేగురువు వద్ద శిక్ష నభ్యసించిన విద్యా . ర్థులందరూ ఒకేమో స్టరు తెలివితేటలు గల వాళ్ళుగా ఉండకపోవడానికి యిదేకారణం. మనిషికీ మనిషికీ, జం తువుకూ మనిషికీగల తేడాలను యేర్పరిచేది యీజ్ఞాన శక్తే! వలపు నిలకడలేనిదే అయినా, దానిని బళవరచు కొని, స్థిరంగా ఒకరిమీదనే నిలచేటట్లు చేసుకోవడం మానవుని ప్రజ్ఞ. అది వానిమేధాశక్తిని నిరూపిస్తుంది. సంఘానికి కొంత మేలు చేస్తుంది. వాని జీవితానికి శాంతి


వలపుకు చంచల స్వభావం ఉండడమే కొంతవరకు మానవుడికి ఉపచరిస్తూ ఉంది. లేకపోతే, జోళ్ళుకుట్టు కుసేవాడు రాజు కూతుర్ని చూసి మోహించి, మనసు మరల్చుకోలేక గుండెపొడుచుకొని చావవలసినదే. వలచినవారిని పొందలేని మనిషికి మరి జీవితంలో ఆనం దమ నేది ఉండదన్న మాట. దొంపత్యను నేది అర్థంలేని బాంధవ్యమవుతుంది. కలిగినవలపును నిలుపుకుందుకు గాని, మరల్చుకుందుకు గాని మానవుడికి సాధ్యమవుతూ. ఉంది గనుక నే, సంఘానికి కొంత గౌరవం, ప్రత్యేక వ్యక్తులకు కొంతచిత్తశాంతి లభిస్తున్నాయి.


కొన్నికొన్ని పరిస్థితులందు కంటికి నచ్చిన వాళ్ళను చూసినప్పుడుగాని, పరిచయంగల వాళ్ళతో ముచ్చ టించేటప్పుడు గాని, ప్రతీమనిషికీ హృదయంలో అర్థం లేని వెర్రి వెర్రికోర్కెలు రగలడం సహజం. అయితే, కొంతఆలోచనాశక్తి, మెదడు అనేవి ఉంటాయి కనుక, కలిగిన ప్రతికోర్కెకూ దాసుడు కానక్కర


లేదు మనిషి. వలపును తన చెప్పుచేతలలో ఉంచుకో లేని మనిషిది దుర్బలమైన మెదడన్నమాట!


తెలివితక్కువవాళ్ళను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తూ ఉంటుంది వలపు. అది మనదేవుళ్ళను, రుషులనుకూడా కొందరిని పరాభవించి సకల బాధలూ పెట్టింది. ఇంద్రుడు, శంక రుడు, శ్రీకృష్ణుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు. వీళ్ళందరూ దానికి లొంగిపోయిన మహానుభావులే! ఇక ఆల్పప్రజ్ఞావంతులగు సామాన్యజనులు దాని ప్రభకు దాసోహమనడంలో ఆటే వింతలేదు. మళ్ళీ జీవరాసు లలో కల్లాజ్ఞా నవంతుడనని గర్విస్తాడు నరుడు; తుద కిట్లాంటివాటిలో వెర్రికు ట్టెవలె ప్రవర్తిస్తూ ఉంటాడు. వలపుమూలాన మానససంఘంలో నిత్యమూ ఎన్నో ఘోరాలు, అసందర్భాలు జరుగుతునే ఉంటాయి -' ఆత్మహత్యలు, కూనీలు, దెబ్బలాట్లు, మోసాలు, దొంగతనాలు, యుద్ధాలు, బలవంతం పెళ్లిళ్లు - యిత్యా, దులు. అందుకనే, వలపు గుడ్డిదనీ, వలపులో ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళకంటే అసందర్భంగా ప్రవర్తిస్తారనీ చెప్తారు పెద్దలు. ఒక్కొక్కప్పుడు దెయ్యం పట్టినట్లు మనిషి నా వేశించి,పీడించి, పశువును చేయగలదువలపు; మహామారివ్యాధివలె బాధించి, ప్రాణాలు తీయగలదు.


అట్లే నరున కిహలోకమందే స్వర్గమిచ్చి, సకల సౌఖ్యాలూకూర్చి, వానినిఘనకార్యాలు చెయ్యడానికి పురికొల్పి, బిచ్చగాని సహితం సింహాసనమెక్కించి, వానిజీవితాన్ని ఆనందమయంగా చెయ్యగలదు వలపు. అల్పుని ఘనునిగాను, లోభిని త్యాగిగాను, వృద్ధుని పడుచువానిగాను, పిరికివానిని ధైర్యవంతుని గాను, బలహీనుని శక్తివంతునిగాను మార్చగలదు. మానవ హృదయంలోగల ఔన్నత్యాన్ని పైకి తెచ్చి,. చెడునడ తగల వారిని బాగుపరచి, సంఘానికి ఐకమత్యం, గృహా నికి శాంతి నెలకొల్పగలదు. బంధుత్వాలు, స్నేహాలు, వివాహాలు, సంతానాలు వలపుమీదనే ఆధారపడి ఉంటున్నాయి. పేమకొరకు నరుడు తన ప్రాణాల నా ధారపోయగల త్యాగశీలుడౌతాడు. వలపు అతనిజీవితానికి వెలుగునిచ్చే దివ్యజ్యోతి ; ఆత్మకు శాంతినొసగే తారకమంత్రం !


వలపులో మంచి, చెడుగు, రెండూ ఉన్నాయన్న సంగతి గుర్తెరిగి, సాధ్యమైనంతవరకు ఆమంచే సామా న్యుడికి లభ్యమయేటట్లు చెయ్యడానికి యత్నించారు, మన శాస్త్రకారులు.. సంఘనియమాలు, వివాహాచా రాలు, నీతులు, మతబోధ, అన్నీ యిట్టి సదుద్దేశం గలవే. అనుభవం, పరిశోధనాశక్తి, ఊహాజ్ఞానం మెం డుగాగల మహానుభావులు అన్ని దేశాలలోను, అన్ని యుగాలలోను యిట్టి సిద్ధాంతాలు నిర్మిస్తు నేఉంటారు. ఆది అంతము లేని పరిశ్రమ వారిది! ఏమంటే, నేటి జనులకు నిన్నటి శాస్త్రాలు మనస్కరించవు; రేపటి జనులకు నేటి సిద్ధాంతాలు సరిపడవు..


వలపు విషయంలో ధర్మశాస్త్రవేత్తలు విధించిన యేనియమా:ూ తమకు తృప్తికరంగా లేకపోవుటవలన, నేటి రష్యాలో కొందరు "స్వేచ్ఛ' పేమ"ను అనుసరి స్తున్నారు. అంటే, ప్రకృతిలోగల మృగపక్ష్యాది స్వేచ్ఛజీవుల యిచ్ఛానుసారంగా జనులు వావి వరుసలనుకూడ గణించక వలపు సుఖముల ననుభవిం చుట! ఇది ప్రత్యేకవ్యక్తుల కొక్కొక్కప్పుడు కొంత సదుపాయంగా ఉన్నట్లు కనిపించినా, సంఘానికీ, సం తానానికీ లాభకరంగా ఉంటుందని తోచదు. ఉత్తమ జాతి పక్షులు, జంతువులు, సహితం కొన్ని నియమాలు ననుసరించి మళ్లీ ప్రవర్తిస్తాయి. చక్రవాకాలు, పావు రాలు మనిషికి బుద్ధి చెప్పేటంత నీతితో మెలగుతా యట, తమజోడుపిట్టలపట్ల, ఏకట్టుబాట్లూ లేని స్వే చ్ఛప్రేమ మానవునికి 'సౌఖ్యప్రదం కాకపోవడమేగాక, యీర్ష్యగుణం మెండుగాగల వాని ప్రకృతికి బొత్తిగా సరిపడదు. నేటి సాంఘికాచారములలో లోటుబాట్లు పెక్కులుండవచ్చును ; ఆచరణలో ఉన్న శాస్త్రనియ మాలు నవీన నాగరికతకు అనుగుణ్యములుగా లేక పోవ చ్చును; దేశకాలపరిస్థితుల ననుసరించి సంఘాన్ని సం స్కరించుకొని, మానవుడు తన జీవితాన్ని సవరించుకో వలసినదేకాని, కట్టుబాట్లు లెక్క చెయ్యక, సంఘాన్ని ధిక్కరించి, కళ్ళెంలేని గుర్రంవలె వెర్రిగా పరుగెత్త దలచుట తెలివితక్కువ.


-తాత కృష్ణమూర్తి.





ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక చట్టం నిజమైన చుట్టం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


చట్టం నిజమైన చుట్టం 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 ) 



" వినియోగదారుడు అంటే ఎవరండీ" అని అడిగా మా వారిని ఇవాళ పొద్దున. 


 అటునుంచి సమాధానం లేదు. 


ఒకటి అడిగితే పొంతనలేకుండా పది జవాబులు చెప్పే మన రాహుల్ బాబు  జబ్బు కొద్దిగా మా వారికీ కద్దు . అయినా ఏ బదులూ లేకపోయేసరికి కంగారని పించింది. దాంతో లోపల గదిలోకి తొంగి చూశా. ఆయన యోగాలో  ఉన్నారు. 'శవాసనం' వేస్తుండబట్టి మన ప్రశ్న చెవిలోకి వెళ్లినట్లు లేదు. సమాధానం తెలియక అలా శవాసనం నటిస్తున్నారా.. చెప్మా ? 


ఎంతైనా మగవాడు.. మొగుడుగారు.  చట్టసభల్లో ప్రతిపక్షాలు నిలదీసి అడిగినట్లు అడిగితే భర్తగారి అహం దెబ్బతీసినట్లు అవుతుందేమోనన్న సందేహం నాది. అందుకే నా ప్రశ్నకు నేనే సమాధానాలు వెదుక్కునే పనిలో పడ్డా... పేపరు చూస్తూ:


' వినియోగదారుడు' అంటే మరీ బరువైన పదంలా ఉంటుంది. నాలాంటి మధ్యతరగతి ఇల్లాలికి అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ' వాడేవాడు' అనుకోవచ్చేమో . వాడే .. వీడు' అని ఇదివరకో అపరాధ పరిశోధన నవల చదివా. దానికి ఈ శీర్షికకు పోలికేమన్నా ఉందా?


అదేదో పతివ్రతల ప్రతంచేసి నారదులవారికి కృష్ణమూర్తిని దానం చేస్తుంది గదా శ్రీకృష్ణ తులాభారంలో సత్య భామ! మళ్ళీ మొగుణ్ని కొనుక్కోవడానికి ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ తక్కెట్లో  పోసినా బరువు తూగదు . మా వారికి మల్లే ఆ నల్లనయ్యకూ ఉదయం పూట వ్యాయామం అంటే మహాబద్ధకం అనుకుంటా. మరి, రుక్మిణీభామ  వచ్చి ఇల్లా మొక్కి అల్లా ఒక్క తులసాకు వేసీ వెయ్యగానే ఎలా తూగినట్లు? అంతా కృష్ణలీల' అను కుంటాంగానీ, మరీ లోతుగా ఆలోచిస్తే ఇందులోనూ ఎక్కడో 'మాయ' కొట్టడం లేదూ!


తూకాలూ కొలతలూ ఉన్నచోట ఈ మాయా మర్మం తప్పనిసరేమో! పెట్రోలు బంకుల్లో ఈమధ్య ఇట్లాంటి మాయలేగా బయటపడి పెద్ద రభస జరిగింది ! 


మా వారితో కలిసి బండిమీద బయటకు వెళ్లినప్పుడు నేను ఈ బంకుల్లో పెట్రోలు పోసేటప్పుడు చూస్తుండేదాన్ని. ఈయనగారు  కనీసం మీటరు వంక చూసి ' ఇదేమిట' ని గట్టిగా గదమాయించడానికీ   మహా మొహమాటం! అక్కడికీ  నాకు అనుమానం వచ్చి అడగబోయినా, నా నోరు మూయించడానికి మాత్రం గట్టిగా దబాయించేస్తారు . కొనే వాళ్లం మంచి సరకు కోరడం మన హక్కు కాదూ!


వారానికోసారి నేనే రైతుబజారు దాకా పోయి కూరగాయలు అవీ తెచ్చుకుంటా.  ఉన్నంతలో మంచివి ఏరుకుని, బేరమాడి కొనాలంటే ఈయనగారివల్ల కాదన్న సంగతి మా పెళ్లయిన కొత్తలోనే తేలిపోయిందిలేండి. 


నట్టింట్లో సోఫాకు చేరగిలబడి టీవీ చూస్తూనో, పేపరు తిర

గేస్తూనో, చట్టసభలో ప్రతిపక్షనాయకుడి మోడల్లో  తెగ రెచ్చిపోతే- మంచి సరకు మనింటికి వస్తుందా? 


నోటీసూ పాడూ ఇవ్వకుండానే అప్పటికప్పుడు ఇంటి అద్దె హఠాత్తుగా వంద పెంచినా సరే పళ్లికిలించుకుంటూ ఇచ్చుకుంటారేగానీ ' ఇదేంటీ అన్యాయం. ఇలా మూణ్లెల్ల కోసారి చొప్పున పెంచుకుంటూ పోవడానికి మీకేం హక్కుంది' అని కనీసం మాట వరసకైనా అనరే! 


 నాకైతే కడుపు మండుతూనే ఉంటుంది. నాలుగు దులు

పుదామనే ఉంటుంది. కాని, ఇద్దరు మగాళ్ల మధ్య

మనం నోరు చేసుకోవడం మర్యాద కాదని మౌనం

వహిస్తా.  మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్

అవస్థే నాదీనూ! 


ఇలాంటి వ్యవహారాల్లో మగవాళ్లకన్నా మన ఆడంగులే ఎంతో మెరుగు. బేరాల విషయాల్లో ఒక పట్టాన రాజీపడనే పడం. మా

ఫ్లాట్స్ మహిళాబృందం మొత్తం దుకాణాలకు వెళ్లినప్పుడు

చూడాలి తమాషా!  పక్కపిన్నుల్నైనా సరే పదిసార్లు అటూ

ఇటూ వంచి చూడందే ఎంచుకోం. ఇక చీరెల బేరమైతే సరే

సరి ! ఉచిత కానుకలు, భారీ డిస్కౌంట్ల విషయంలో

మహా బలహీనులమైపోతుంటాం. ఆ విషయంలో మాత్రం మనం అబలలం! మరేం చెయ్యాలి చెప్పండి! లోకం చూస్తే విజయావారి ' మాయాబజారు' మార్కు, విపణి వీధి అంత కంగాళీగా ఉందని నిన్న ఎక్కడో చదివా. తాను సుఖంగా బతకడం కోసం లోకంలోని ఏ వస్తువునైనా తెగనమ్మడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు.  మరి అందుకే ఉచితమనే మాట

ఎంతగా వినిపిస్తే- కొనే విషయంలో అంత ఎక్కువ

జాగ్రత్త తీసుకోవాలి మనం.


ఈ ఎన్నికల్లో చూస్తున్నాంగా ! అమూల్యమైన ఓటును,

సొంతం చేసుకునేందుకు  ఎంత ధరైనా  పెట్టే దొరలు

ఊళ్ల మీదపడి తెగ తిరిగేస్తున్నారు. ప్రజాస్వామ్య

మంటే ఒక పెద్ద బజారులాగుంది. ఎన్నికలు వచ్చినప్పు ఎన్నో పార్టీల దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో

అభ్యర్థులు అమ్మకానికి పెట్టిన సరకు కొనే ఓటర్లం

ఎంత అప్రమత్తంగా ఉండాలి?


అందమైన రంగుల కాగితాల్లో చుట్టి ఆకర్షణీయంగా

తయారుచేసిన ప్యాకెట్లు గదండీ ఈ పార్టీల మేనిఫె

స్టోలు! 


ఒక పార్టీ ఉచిత విద్యుత్ ,సగం ధరకే నీళ్లు, ఖర్చు లేని చదువులు, కూర్చోపెట్టి మేపే ఆహార పథకాలు.. గట్రా గట్రా  ఇస్తామంటుంది. ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఘడియ నుంచే వరస పెట్టి ఉపకార వేతనాలు, పసివయసు నుంచే పింఛన్లు, ఉచితంగా గుండె ఆపరేషన్లు, సాగు చేసుకునేందుకు  వ్యవసాయ భూములు .. లాంటివి సవాలక్ష ఇచ్చే దస్త్రాల మీద సంతకాలు చేసుకుంటూ పోతామంటుంది. ఇంకో పార్టీ ఇదివరకు చేసిన అప్పులు కొట్టిపారేస్తాం. ముందు ముందు కొట్టిపారేసే అప్పులు కొత్తగా ఇప్పిస్తాం. పొరుగు రాష్ట్రాలలో  పారే నదులకు గండ్లు  కొట్టిస్తాం .. అంటూ హామీలు గుప్పిస్తుంది. మావారు దినం తప్పకుండా పారాయణం చేసే ' శ్రీశ్రీ సంధ్యాసమస్యలు' లాంటి సందిగ్ధంలో పడిపోతున్నాడు సామాన్య ఓటరు. 


బెర్లిన్ గోడముక్కలు కూడా మన వాడ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాయి. మరిక సందిగ్ధంలో పడిపోవడం వినియోగదారుడి ముఖ్య లక్షణం లాగుంది. 


పెళ్లికొడుకుల విషయంలో ఆడపిల్లలు ఇలాగే అయోమయంలో పడిపోతుంటారు. పెళ్లిచూపులకొ చ్చిన వాళ్ల  లోపలంతా  ఎంత లొటారంగా ఉందో కనిపెట్టకుండా పైన పటారం చూసి పడిపోతే జీవితాంతం చెత్త సరకుతో సర్దుకుపోవాలి సుమా! 


పటాటోపం చూసే పిల్లల్ని ఈ సోకాల్డ్  ఈ - స్కూళ్లల్లో పడేస్తే, బీటెక్కులు పూర్తిచేసినా బిడ్డలకు బయోడాటాకు స్పెల్లింగైనా రాదు.


పట్టాలు, భూమి పట్టాలు, బిరుదులు, బాబాల దగ్గర బంగారం, శివలింగాలు, రాజధాని వంకతో రాళ్ల దిబ్బలు, సర్వేల పేరుతో అనుకూల ఫలితాలు, విశ్లేషణల నెపంతో విపక్షాల  మీద చిమ్మేందుకు విషపు వార్తలు, చివరికి బిడ్డల్ని  కని పెట్టేందుకు అమ్మ కడుపులు కూడా అమ్మ కానికి దొరుకుతున్న వ్యాపార యుగమిది. అందుకే ' వాడే'  వాడు, అదేనండీ ' వినియోగదారుడు ' ఎంతో వివేకంతో విచక్షణను ఉపయోగించాలిప్పుడు. 


అందరూ మా వారంత అమాయకంగా ఉంటే, అనక మా సంసారమంత సంబడంగా  తయారవుతుంది వ్యవహారం.  బజారులో వినియో గదారుడే నిజమైన రాజు. ఆ రాజాధి రాజు  వినియోగదారుడికి ఎన్నో హక్కులుంటాయిట. 


ఏది మేలైన సరకో తెలుసుకునే హక్కు, కొన్న సరుకు  మన్నికైందనీ, ముందు ముందు మన మెడకు గుదిబండగా మారదని అమ్మేవాడి నుంచి భరోసా పొందే హక్కు, 'ఐఎస్ఐ' ' ఆగమార్క్' ప్రమాణా లకు తగ్గలేదని నిర్ధారించుకునే హక్కు, ఎన్నో రకాల నుంచి మేలురకాన్ని మాత్రమే కోరుకునే హక్కు. ఇట్లా!  నోరు నొక్కుకుని కూర్చుంటే ఎన్ని హక్కులుంటే మాత్రం.

ఏం ఉపయోగం? 


 ఉచితంగా వస్తుందని, సగం ధరకే దొరుకుతుందని, కంటికి నదురుగా ఉందని, పక్కింటి పిన్నిగారు కొన్నదనీ మనమూ తొందరపడి అమ్మేవాడి మాయలో పడిపోతే  కష్టమేసుమండీ!  


 మా వారస్తమానం అలా కాయితాల మీద వూరికే గీకినట్లు    'వినియోగదారుడికి హక్కుల చట్టం '  వూరికే రాలేదు.  ఆ చట్టం..  ' వాడే ' వాడికి నిజమైన చుట్టం సుమండీ! 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 ) 

ఈనాడు- హాస్యం - వ్యంగ్యం - గల్పిక ఎన్నో దృష్టాంతాలు - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 200


 




ఈనాడు-  హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

ఎన్నో దృష్టాంతాలు 


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 


పరమాత్ముడైనా ఆ పరంధాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అతని పాదుకలు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండానే  దర్జాగా అయోధ్యా సింహాసనాన్నెక్కి కూర్చు న్నాయి! అదృష్టమంటే అదే! 


లక్కుంటే  ఎడారిలో ఉన్నా ఏనుగు వెదుక్కుంటూ వచ్చి గజమాల మెళ్లో వేసేస్తుంది. దీన్నే 'తంతే బూరెల బుట్టలో పడటం' అంటారు. అలా పడాలని బుట్ట ముందు నిలబడి తన్నించుకున్నా తలరాత బాలేక పోతే  పక్కనున్న బురదలో  పడొచ్చు.


' అదృష్టం అదృశ్యం అప్పాచెల్లెళ్లు . రెండూ కంటికి కనిపించేవికావు . దీనికి దృష్టాంతాలేగానీ సిద్ధాంతాలుండవు. 


అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలం మీద దిగేముందు ఇరవై నిమిషాలకు సరిపడే  ఇంధనం మాత్రమే మిగిలుందట. అదృష్టం అట్లా కలిసిరావాలి. అది కలిసి రావాలని   నిర్బంధంగా పెట్టుకునే  పచ్చలరాయి తినే పచ్చడన్నంలో కలిసిపోయి గొంతుకు అడ్డంపడి చచ్చినా చావచ్చు. 


ప్రారబ్దానికి  ఏ శబ్దార్ధకౌముదీ అసలైన అర్థం చెప్పలేదు. ఖర్మానికి ధర్మాధర్మ విచక్షణలుండవు.  'గీత ' చెబుతూనే ఉంది గదా.. పూర్వజన్మ సుకృతమ నేది ఉందే... అది ఏ నిర్వచనానికీ అందనిదని .


టైమ్ బాగా లేకపోతే భోలకప్పూర్ నల్లా నీరే కాదు.... మినరల్ వాటరూ కాలకూటమైపోతుందట! ఏదేమైనా రాజకీయాలు పత్తి మార్కెట్ల మాదిరిగా తయారయ్యాయనేది నూటికి నూరుపాళ్ళు నిజం.  జనాలని నమ్ముకోవాల్సిందిపోయి, అభ్యర్థుల జాతక చక్రాలను నమ్ముకుంది మొన్నటి ఎన్నికల్లో జయలలితమ్మాళ్: మన దగ్గర ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తం పార్టీ చీట్లు తీసినట్లు!  గోడదూకే వాళ్లెక్కువైపోతున్నారని గోడను మరింత ఎత్తుగా కట్టుకుంది  ఓ జనం పార్టీ.  ఓటమికి గుర్తు కలిసి రావటంలేదనుకుంటోందేగానీ , జనంలో గుర్తింపులేదని ఇంకా గుర్తించలేకుండా ఉంది ఇంకో కొత్తపార్టీ! 


నేతల తలరాతలను తేల్చేది నిజానికి అయిదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ, ఎత్తులూ తాయెత్తులూ కానేకాదని ఇన్నేళ్లకైనా  ప్రజాప్రతి నాయకులనుకునేవాళ్ళ కళ్లు తెరిపిడి పడకపోవడమేమిటి! 


రోజులూ అట్లాగే ఏడ్చాయి. ఎన్నికల్లో గెల్చినోడు సరిగ్గా  ప్రమాణస్వీకారం చేసే రోజే ప్రాణాల మీదకు తెచ్చుకుంటే , యావజ్జీవం పడినవాడు దర్జాగా బయటకొచ్చి పచ్చి చీకటి  వ్యాపారం  చేసుకుంటాడు. రాసిపెట్టుంటే చర్లపల్లిలో ఉన్నా బిర్యానీ పొట్లాలు, సిమ్ కార్డులు సరఫరా ఆగవు ! నూకలు చెల్లిపోతే  గోకులాచాట్ కెళ్ళినా ప్రాణాలు పోతాయిమరి ! దేవుడు దయతలచి ' ఊ ' అన్నా పూజారి పుణ్యముంటేనేగాని ప్రసాదమైనా దక్కని ఈ కాలంలో ముందు పూజారిగారి మనసు మనవైపు మళ్లటమే  అసలు అదృష్టానికి సిసలు దృష్టాంతం.  


కాలం కలిసిరాదనుకో !  పెట్టుకున్న  'నానో' కారు ఫ్యాక్టరీకీ  రెక్కలొచ్చి ఎటెటో ఎగిరిపోతుంది! చేటుకాలం తోసుకొస్తే జైకొట్టిన చేతులే చెప్పులు విసిరేస్తే చేటు కాలం  దాపురించింది వేరే చెప్పాలా? అందుకే అదృష్టం మీదందరికీ కన్ను . అదృష్టమేమన్నా మన గర్ల్ ఫ్రెండా, చప్పట్లు కొట్టి పిలిస్తే 'హాయ్|  అంటూ చప్పునొచ్చేసి వచ్చి ఒళ్ళో వాలిపోవటానికి!


సోనియాజీ 2004లో ప్రధాని పదవికి మన్మోహన్ సింగు గారిని సూచించింది. అప్పటికి  ఆయన లోక సభ  సభ్యుడు కూడా కాదు. దేశానికి సేవ చేయాలని రాసిపెట్టి ఉంది. అంచేతనే ఆయన అంత పెద్ద నేతయారు. 


రాసిపెట్టి ఉంటే ఎక్కడున్నా దక్కుతుందనే సిద్ధాంతం నమ్మకముంటే రాద్ధాంతాలు చేయనక్కర్లే!


దేనికోసమూ దేబిరించకుండా  దేవుడిచ్చిన  పాత్రను సక్రమంగా పోషించడమే స్థితప్రజ్ఞుడి విజ్ఞత.  


జీవితం ఒక పాత్రఅనుకో! కింది సగం కృషి, పై సగం అదృష్టం. అదృష్టం నోటిదాకా రావాలంటే  కృషి చేయక తప్పదు.


దుర్యోధనుడు ధర్మరాజుతో  జూదమాడి గెలిచింది అదృష్టం వల్లకాదు... శకుని పాచికలవల్ల.  గురు త్వాకర్షణశక్తి సూత్రం తట్టినప్పుడే  న్యూటన్ ఆ ఆపిల్ చెట్టు కింద చేరడమూ  అదృష్టంవల్ల కాదు... ఆపిల్ పండు నేల రాలిపడ్డంతో సహా అంతా కాకతాళీయం. సముద్ర తీరం దాటేముందు వాయుగుండం ఏ సిద్ధాంత గ్రంథమూ తిరగేయదు. వాటాన్ని బట్టి జరిగే ఆ పకృతి చర్యను ఏ యాగమూ యజ్ఞమూ ఆపలేదు. 


తలరాతలు మనచేత్తో మనమే రాసుకునేవి: ఆ సత్యం  సత్యంరాజు ఉదంతం సుస్పష్టంగా తెలియచేస్తోంది . అయినా ఇంకా అదృష్టం చూరు  పట్టుకు  వేలాట్టం  కార్యశూరులు  చేయవలసిన  చర్యేనా? !


అదృష్టలక్ష్మి వద్దన్నా వచ్చి మన ఇంటి తలుపు ఎప్పుడో ఓరోజు తట్టి తీరుతుంది . ఆ టైమ్ మన బెడ్ టైం కాకపోవడమే అదృష్టం . 


ఇప్పుడైనా మన అదృష్టానికేం లోటు?! స్వైన్ ఫ్లూ   సీజన్లో జల్లీ ఫ్లూ రావడమే అదృష్టం.  వానల్లేని  కార్తెల్లోను బలవంతంగా బ్యాంకు లోన్లు అంటకట్టడం లేదు. అదీ అదృష్టమే.  అమెరికాలోనూ మాంద్యమున్న రోజుల్లో మన దగ్గర ఉద్యోగాలాట్టే ఉడటంలేదు. అదీ అదృష్టమే.  కందిపప్పుకి బదులు పెసర పప్పు, సన్నబియ్యం ప్లేసులో  దొడ్డుబియ్య బలవంతంగా సంచుల్లో  పొయ్యడం  లే.. లక్కు! లేటయితేనేమిగాని బైటకెళ్లిన ఆడపిల్లల ఏ యాసిడ్ దాడుల్లేకుండా  ఇళ్లు చేరుతున్నారు. అదెంత అదృష్టం! 


ఇట్లా నాలుగైదు ముక్కలయినా అదృష్టానికి దృష్టాంతాలుగా రాయడానికి మిగలడం రచయితగా  నా అదృష్టం . 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 



ఈనాడు- సంపాదకీయం పాటే మంత్రమూ... రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 )

   ఈనాడు- సంపాదకీయం 


పాటే మంత్రమూ... 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 


దివ్యభావాలతో అమూర్తిని భగవంతుడిగా భావించి ఆరాధించడమే భక్తి. అది తొమ్మిది విధాలు. అందులో సంకీర్తనం ఒకటి. అది సంగీత సంబంధి. రామామాత్యుని స్వరమేళ కళానిధి- స్వర ప్రకరణం ప్రకారం, సంగీతం సామవేద సంగ్రహం. బ్రహ్మ సంగ్రహకర్త. సర్వజ్ఞుడైన శంకరుడు గానసంతుష్టుడు. అనంతుడు సంగీత స్వాధీనుడు. యక్షగంధర్వ దేవదానవ మానవాదులే కాదు... పశుపక్ష్యాదులూ నాదప్రియులు. గాంధర్వం, గానం అని సంగీతం రెండువిధాలు. గంధర్వులు గానంచేసే అనాది స్వరసంప్రదాయం గాంధర్వం. వాగ్గేయకారులు లక్షణయుక్తంగా రచించి దేశీరాగాలతో జనరంజకంగా పాడేది గానం. సంకీర్తనం గానప్రధానం. ఖట్వాంగుడు అనే రాజు ఇంద్రాది దేవతల వరప్రసాదం వల్ల తన ఆయష్షుకాలం ఒక్క ముహూర్తం మాత్రమే అని తెలుసుకుంటాడు. ' గిరులు బోలెడి కరులను/ హరులం దన ప్రాణ దయితలై మనియెడి సుం/ దరులను, హితవరులను, బంధ/ వరులను అందరిని వర్ణించి'  చివరకు గాఢ వైరాగ్యంతో మోక్షం పొందే ముందు నిరంతరాయంగా కొనసాగించింది గోవిందనామ సంకీర్తనమే ! 'ఈ మేను కలిగినందుకు సీతారామ నామమే పల్కవలెను' అని త్యాగరాజస్వామివారి కృతి. ' సకల సంగ్రహము సకల సంచ యము/ అకృత సుకృతమిది హరినామం' అని అన్నమాచార్యులు వారి సంకీర్తనం. 'రాతిరనే ఏనుగునెక్కి- రాకా చంద్రుడు గొడుగు గాను/ లేత తుమ్మెద మొదలైన బలముల చేత గెలిచెదనం టివా?' అంటూ మువ్వగోపాల పదకర్త క్షేత్రయ్య పదం. విరహం, వైరాగ్యం, శృంగారం, వేడుకోలు , అలక, సందేశం, సంతాపం, నుతి, ఎత్తిపొడుపు, బెంగ, పాగల్భ్యం  , బేలతనం- భావన ఏదైతేనేం... పొదిగే పనితనం ఉండాలేగానీ అన్నీ- సంకీర్తనాభరణంలో అందంగా అమిరే మణులూ మాణిక్యాలే!


జానపదం, యక్షగానం, జావళులవలె సంకీర్తనా ఒకానొక కాలంలో ముమ్మరంగా వెలిగిన దాఖలాలు కద్దు . సంకీర్తన ప్రక్రి యకు లక్షణాలు నిర్దేశించి, వేలకొద్ది గేయాలను సృజించిన పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య వంశంలోని పన్నెండుమంది కవులు స్వయంగా సంకీర్తన కర్తలు, ప్రచార నిర్వాహకులు. పెద తిరుమలయ్య తండ్రి సంకీర్తన కర్తృత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తే, ' సంప్రదాయాగత జ్ఞానసహితుడైన మనుజు సత్కవితయు వేదమంత సమము'  (తెలుగు సంకీర్తన లక్షణం-23) అంటూ సంకీర్తనాక్రియకు వేదప్రామాణికతను ప్రసాదించినవాడు చినతిరుమలాచార్యుడు. భక్తి అంటే రాతి విగ్రహం ముందు మోకరిల్లి మనసులోని కోరికలన్నీ ఏకరువు పెట్టడం ఒక్కటే కాదు. డాక్టర్ శ్రీపాద పినాకపాణివారన్నట్లు హృదయానుభవ భావమాధుర్యాన్ని బాహాటమైన పదాలతో ప్రకటించుకోవడమూ ఒక రకమైన భక్తిమార్గమే. భక్త మీరాబాయి కృష్ణప్రే మలో మునిగి భజనలు చేసినా, తుకారాం పాండురంగడిమీది అపరిమిత ప్రేమతో అభంగాలు గానం చేసినా, పురందరదాసు సుందరీమణుల ముందువెనకలనున్న శ్యామసుందరుడి అందచం దాలను పదాలుగా పలికినా- సంకీర్తనార్చనలోని అంతర్భాగాలే అవన్నీ. గీతాంజలి - ఈశ్వరుడికి టాగోర్ పట్టిన కీర్తనల హారతి. 'సానుతాప గానముతో సానురాగ గీతముతో/ మేనుమరచి నిన్నె వలచి/ వెదుకుచుంటి... వేచియుంటి' అంటూ బ్రహ్మసమాజం కోసం కృష్ణశాస్త్రి కలంనుంచి జాలువారిన సంకీర్తనలు ఎన్నెన్నో! తూము నరసింహదాసునుంచి ఎడ్ల రామదాసుదాకా తెలుగు సంకీ ర్తన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులు ఎందరో! 'చింతలేదిక యేసు పుట్టెను/ వింతగను బెత్లహేమందున' అంటూ అతిలోకదైవం మితిలేని ప్రేమను ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తూ యేసుభక్తులు చేసే కీర్తనలు, ఉర్దూ భాషామయ గీతికలను వచ్చిన లిపిలో రాసుకుని ఖురాను సమీపభావంతో అల్లా దయను కీర్తించే మొహరం గీతాలు- సంకీర్తనారాధనకు మతాలు ఎల్లలు లేవనేదానికి సంకేతాలు. 


వాంఛితార్థాలు తీరడం ఎలా ఉన్నా... పారవశ్యంతో సంకీ ర్తన గానం సాగించే నాదోపాసకులు మానసికంగా పొందే సాంత్వన అనిర్వచనీయం. 'పాట దైవసన్నిధికి బాట' అని పరమ భాగవతుల విశ్వాసం. ఇష్టమూర్తుల సద్గుణాలను పదపదంలో ప్రశంసిస్తూ ప్రతి పదానికి మానసికంగా అర్థాన్ని అనుభవించే సంకీర్తనా ప్రక్రియలో చైతన్యం వలయాలుగా ప్రసారమవుతూ మనసును ఆనందలోకాల విహారానికి మోసుకెళుతుంది. భక్తితత్వం అంటే కేవలం దైవసంబంధమనే భావన సగమే సత్యం. సామాజిక రుగ్మతలమీద విముఖతతో కూడుకున్న వైరాగ్య భావాలనుంచీ తత్వాల రూపంలో వెలువడ్డ సంకీర్తన సాహిత్యం తెలుగులో బోలెడంత. మేలుకొలుపులు, జోలపాటలు, పవ్వళింపులు, మంగళహార తులు, నీతిబోధనలు, బైరాగి గీతాలు, దేశభక్తి గీతాలు... సంకీర్తన ప్రక్రియకు బహుముఖ రూపాలు. కీర్తనల ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో తేలిందిప్పుడు. మతిమరుపు వ్యాధిపీడితులు వందమందిమీద కీర్తన క్రియాత్మక ధ్యాన పద్ధతులను ప్రయోగించగా అందరి జన్యువుల్లో సానుకూల స్పందనలు నమోదయ్యాయని పరిశోధక బృందం తేల్చి చెప్పింది. ఆత్మాశ్రయం, అనుభూతి, ఆవే దనలనుంచి సాంత్వనను కలిగించే కీర్తనల ప్రక్రియ- మతిమరుపు రుగ్మత నిదానానికి ఔషధంగా ఉపయోగపడుతుందని తేలటం సంతోషించదగ్గ పరిణామమేగా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 08 -2012 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...