Showing posts with label Short Stories. Show all posts
Showing posts with label Short Stories. Show all posts

Saturday, December 5, 2020

వేంపల్లి షరీఫ్ కథ ' పర్దా - నా పరామర్శ - కర్లపాలెం హనుమంతరావు





ఇప్పుడే చదివాను . ముగిసిన తరువాత మనసంతా అదోలా చేదయిపోయింది . 
మనిషి జీవితంలోని  కష్టసుఖాలకు  తిండి, బట్ట, తలదాచుకునే  ఇంత నీడ .. ఇవి కరవు అవడమే కారణమనుకుంటాం సాధారణంగా. నిజమే ఇవి ప్రాథమిక అవసరాలే .. తీరనప్పుడు జీవితం దు:ఖ  భాజనం తప్పక అవుతుంది. ఇవన్నీ ఆర్థికంతో ముడిపెట్టుకుని ఉన్న అంశాలు . చాలినంత డబ్బు సమకూరితే ఇక మనిషికి  ఏ తరహా కష్టాలు  ఉండవు. కష్టాలు ఉండనంత మాత్రాన బతుకంతా సుఖమయమయిపోతుందనా అర్ధం? జీవితం ఒక ముడి పదార్థం మాత్రమే అయితే, లాజిక్ ప్రకారం  నిజవే అనిపిస్తుంది. అదే నిజమైతే మరి  బాగా డబ్బుండి ప్రాథమిక అవసరాలు అన్నీ తీరిపోయే వారికి ఇక ఏ కష్టాలు ఉండకూడదు. . కదా మరి ? కానీ వాస్తవ జీవితాలు ఆ విధంగా లేవే!  అన్నీ సదుపాయాలు సమకూరి బైటికి సలక్షణంగా జీవితం గడుపుతున్నట్లు కనిపించేవాళ్లూ లోలోన ఏవో కుంగుబాటుల్లో .. తాము పరిష్కరించుకోలేని తాము ఏర్పరుచుకోని కట్టుబాటుల మధ్య ఇరుక్కుపోయి బైటికి రాలేక... వచ్చే మార్గం తెలేక .. తెలిసిన వాళ్లు అందుబాటులో లేక  అనుక్షణం బైటికి చెప్పుకోలేని సంక్షోభం మధ్య  నలిగిపోతుండటం కనిపిస్తుంది. అట్లాంటి నిష్ప్రయోజనమైన,   నిరాధారమైన  ( మూఢ ) విశ్వాసాల మధ్య  ఇరుక్కుని నలిగిపోయే బడుగు తరగతి సంసారుల సంఘర్షణ ఇతివృత్తంగా అల్లిన వేంపల్లి షరీఫ్ 'పర్దా' కథ కరుణరసార్ద్రంగా ఉంది. 

కథలో రచయిత ప్రధమపురుషలో  వినిపిస్తున్నట్లు అనిపించే దిగువ మధ్య తరగతి పట్టణ  ముస్లిం కుటుంబ నేపథ్యంలోని ఒక ముసలి అవ్వ కథ  ఇది .  కాని, నిజానికి ప్రతి ముస్లిం పేద కుటుంబంలోనూ పొద్దు వాటారే దశలో ఉండే స్త్రీలు ఎదుర్కొనే  విచిత్రమైన సమస్యను ఈ కథకు వస్తువుగా ఎంచుకున్నందుకు రచయిత అభినందనీయుడు  .  
ఇస్లాం కుటుంబాలలో ఇప్పటికీ  ' పర్దా' పద్ధతి  స్త్రీ లోకం పాలిట ఒక పెను శాపంగానే లోలోపల రగులుతూనే  ఉంది. ప్రభుత్వం తాను తెచ్చినట్లు చెప్పుకునే   చట్టాలు నిత్య జీవితాలలో ఆమోదయోగ్యమై ఆచరణ స్థాయి దాకా ఎదిగిరావాలంటే ముందు అందుకు సంబంధించిన  సమాజాలలో మానసికపరమైన పరిణతి స్థాయి పెరగడం అవసరం .  ఆచరణ స్థాయి దాకా తీసుకురాలేని సంస్కరణలు  ఎన్ని  సంక్షేమ పథకాలు, చట్టాల రూపంలో  ప్రదర్శనకు పెట్టినా అవి కేవలం ఏ బుక్కుల్లోనో  నమోదయి .. ఉండేందుకు, మరీ అత్యయిక పరిస్థితుల్లో ' షో ' చేసేందుకు మాత్రామే  పనికివస్తాయి. 
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉండి వెంటనే పెళ్లి చేసి పంపేయగల  తాహతు  లేని ముస్లిం కుటుంబాలలో ' పరువు ' భయం కోసం పరదాల మరుగున ఆడపిల్ల సరదా సంతోషాలకు ఓ రెండు గదుల హద్దులు గీసేయటం ఒక అమానుష దృశ్యమయితే   .. ఏ పరదాల మరుగునా తిరిగే అవసరం లేని గ్రామీణ వాతావరణంలో బిడ్డల ఎదుగుదల కోసం మత విన్వాసాలను కూడా కాదనుకుని  సంసారం నెట్టుకొచ్చిన ఒకానొక తరం నాటి  ముసలవ్వ  ఇప్పుడు ఆ పర్దా .. గోషాల మధ్య  కొత్తగా ఇరుక్కుని మసలవలసిన పరిస్థితులు తోసుకురావడం మరింత అమానుషంగా  ఉంటుంది. తెంచుకోలేని మతమూఢ  విశ్వాసాల మూలకంగా మానవ సంబంధాలు, కుటుంబసంబంధాలు, చివరికి పేగు బంధాలు కూడా ఎంతటి  కఠిన పరీక్షకు నిలబడవలసి  వస్తుందో   అతి సహజంగా చిత్రించాడు రచయిత. కధ ఆసాంతం ఎక్కడా ఏ అతిశయోక్తులు.. అలంకారాల జోలికి  పోకుండా నిరలంకారప్రాయంగా రచయిత చెప్పుకొచ్చిన శైలీ శిల్పాల  కారణంగా కథ చదివినంతా సేపే కాదు , చదిలిన తరువాతా చెదిరిన మనసును కుదుటపడనీయదు . 
కాలం మినహా మరెవ్వరూ  పరిష్కారం చూపించలేని ఈ తరహా సమస్యలను ఎప్పటికప్పుడు సాహిత్యంలో చర్చించకపోతే.. సమాజం సంస్కారయుతంగా మారాలన్న ఆలోచనే ఆరంభమయే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. 
తనకు తెలిసిన తన ప్రపంచపు తమ ఒకానొక  తీవ్రమైన సమస్యను పది మంది ముందు ఏ మెహర్చానీ పెట్టుకోకుండా చక్కని కథ రూపంలో చర్చకు పెట్టి ప్రగతిపథకాముకుల మనసుల్లో అలోచనలను ప్రేరేపించినందుకు  మిత్రుడు వేంపల్లి షరీష్ బహుధా అభినందనీయుడు! సాహిత్య లోకం నుంచి కృతజ్ఞతలకు అర్హుడు. 👏👏❤️✌️😎
- కర్లపాలెం హనుమంతరావు.
5, డిసెంబర్ 2020 
బోథెల్; వాషింగ్టన్ రాష్ట్రం 
యు.ఎస్.ఎ 
వాట్సప్: +918142283676 


Friday, December 13, 2019

అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష! నిజమే! కనీసం కథానికల వరకు!


'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!' అనే డైలాగ్ కన్యాశుల్కం కర్త గురజాడవారి పుణ్యమా అని బహుళ ప్రచారంలోకి వచ్చిన పలుకుబడి. నిజమే; కానీ ఆ రావడం వెనక ఉన్న ఉద్దేశంలో కొంత వెక్కిరింతా ఉంది. 

నిజానికి వేదాలలో అన్నీ ఉన్నాయో లేదో ఎవరికైనా తెలిసే అవకాశం తక్కువే. అలా తెలియలంటే ముందుగా ఆ వేదాలలో అసలు ఏముందో కొంతైనా అవగాహన కలగించుకోవడం సబబు. ఆ సంగతి అట్లా ఉంచి కథానికలుగా మన ఆధునికులు చెప్పుకునే రూపాలు వేదకాలం నుంచే ఉన్నాయన్న    వాదనా  ఒకటి పండితలోకంలో  ప్రచులితంగా ఉంది. ఆ ప్రతిపాదనకు అనుకూలత ప్రకటిస్తో  డాక్టర్ కె.కోదండరామాచార్యులు '50 వసంతాల వావిళ్ల వాజ్ఞ్మ వైజయంతి' సావనీర్ లో 'వేదవాజ్ఞ్మయంలో కథానికలు ఉన్నవి' అంటూ ఒక చిరువ్యాసంలో ప్రతిపాదించారు.(పు.117 -125). అధ్యయానికి అంతంటూ లేదు- అనే భావానికి ఊతం ఇచ్చే ఒకానొక చిన్నకథను సైతం ఈ సందర్భంగా ఆయన  చెప్పుకొచ్చారు. 'భరద్వాజో హ త్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యము వాస.. ఏషా ఏవ త్రయీ విద్యా' అనే తైత్తరీయ బ్రాహ్మణకం తాలూకు మూడో అష్టకంలో కనిపించే పదో ప్రపాఠకం పదకొండో అనువాకాన్ని ఉదాహరణగా ఆచార్యులు తీసుకున్నారు.  నేడు కథానిక లక్షణాలుగా విమర్శక లోకం గుర్తించిన సంక్షిప్తత, సమగ్రత, సంభాషణల సొగసు, ఉపదేశం, పరిమితమైన పాత్రలు.. ఈ చిన్నకథలోనూ ఉండడం గమనార్హం. 
భరద్వాజుడు మూడు ఆయుర్దాయ భాగాలను వరంగా పొందిన ఒకానొక రుషి.  జీవితకాలమంతా బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనానికే మీదు కట్టి చివరి దశలో వార్థక్యం చేత శక్తి సన్నగిల్లి శయనావస్థలో ఉన్న దశలో ఇంద్రుని దర్శనభాగ్యం రుషికి లభిస్తుంది. 'నాలుగో ఆయుర్దాయ భాగం సైతం వరంగా ప్రసాదించేందుకు నేను సిద్ధం. కాని  ఆ  వరంతో నువ్వు ఏమి చెయ్యదల్చుకొన్నావో ముందు చెప్పు' అంటూ ఇంద్రుడు ప్రశ్నిస్తాడు. 'మునుపటి మాదిరే వేదాధ్యయనాన్ని కొనసాగిస్తాన'ని భరద్వాజుని బదులు. రుగ్, యజు, సామ వేదాల వంక చూపుడు వేలు చూపించి 'మహా పర్వతాలుగా కనిపించే  అవేమిటో తెలుసునా? వేదాలు మహానుభావా!  నీకింత వరకు దక్కిన జీవితకాలంలో వాటి నుంచి నీవు గ్రహించింది కేవలం ఇంత మాత్రమే సుమా!'అంటూ మూడు సార్లు పిడికెళ్లను తెరిచి  చూపిస్తాడు ఇంద్రుడు. 'నిజంగా నీకు ఇంకా వేదాధ్యయన ఫలం మీద బలమైన కోరిక మిగిలుంటే సావిత్రాగ్నిని ద్యానించు! ఆపైన ఆదిత్యుని సాయుజ్యం పొందు!' అనీ సూచిస్తాడు. అందు మీదట ఇంద్ర ప్రసాదితమైన  నాలుగో జీవిత భాగం కేవలం వేద విద్యాధ్యయనానికి  మాత్రమే వినియోగించక,  సాధించిన  జ్ఞాన కాంతి పుంజం సాయంతో పరిసరాలను సైతం తేజోవంతం చేసి విద్య అంతిమ పరమార్థాన్ని రుషి ప్రపంచానికి చాటినట్లు కథ.  
ఈ కథ పరిణామంలో, ప్రక్రియాపరంగా. లక్ష్య నిర్దేశనపరంగా  తాజా కథానికలకు ఏ మాత్రం తీసిపోనిదని డాక్టర్ కె. కోదండరామాచార్యులవారి వాదం. కాదనగలమా?
-కర్లపాలెం హనుమంతరావు
10, డిసెంబర్, 2019

Wednesday, December 4, 2019

ముద్దు- చతుర కథ



-కర్లపాలెం హనుమంతరావు
***
(చతుర ప్రచురితం)

Thursday, October 24, 2019

ఎర్ర ముక్కు జింక- కొత్తపల్లి పత్రిక సౌజన్యంతో



అనగా అనగా ఒక ధృవపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ. సాధారణంగా ధృవపు జింకలకు పొడవాటి ముక్కులు ఉండవు. ఉన్నా అవి అట్లా ఎర్రగా మెరవవు. అందుకని అందరూ రుడాల్ఫును 'ఎర్రముక్కు జింక' అని పిలిచి, ఏడిపించేవాళ్ళు. రుడాల్ఫు తన ఎర్ర ముక్కును చూసుకొని నిజంగా కుమిలిపోయేవాడు. మిగిలిన జింకలన్నీ అతన్ని ఎగతాళి చేస్తుండేవి. రుడాల్ఫు తల్లిదండ్రులు గాని, తోడబుట్టినవాళ్ళు గాని అతనివైపుకు చూడకుండా నేలబారున చూస్తూ మాట్లాడేవాళ్లు. అతన్ని తలచుకొని సిగ్గుపడేవాళ్ళు. "తనేం నేరం చేశాడని భగవంతుడు ఇట్లా శిక్షిస్తున్నాడు?" అని రుడాల్ఫు అనుక్షణం బాధపడేవాడు.

డిసెంబరు నెల. క్రిస్మస్ రానున్నది. క్రిస్మస్ తాత ప్రపంచంలోని పిల్లలందరికోసం బహుమతులు తీసుకొని, ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామూలుగా తన బండిని లాగే ధృవపుజింకలు-డాషర్, డ్యాన్సర్, ప్రాన్సర్, విక్సన్ లను సిద్ధం కమ్మన్నాడు. వాళ్లు లాగే ఆ బండిని ఎక్కి, తాత బయలుదేరగానే, ధృవపుజింకలన్నీ అంతటి గౌరవానికి నోచుకున్న తమ జాతి హీరోలను కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశాయి. కానీ ఏం లాభం? ఆ సాయంత్రం భూమిని ఒక భయంకరమైన పొగమంచు కప్పేసింది. దారి ఏమాత్రం కనబడటంలేదు. క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిచ్చేందుకు వచ్చేది ఇళ్ల పొగ గొట్టాల్లోంచే కదా! ఆ మంచుపొర ఎంత దట్టంగా ఉందంటే, తాతకు, పాపం ఒక్క పొగగొట్టం కూడా కనబడలేదు! ఆ పొగమంచులోంచి దారి కనుక్కోవాలని తాత తన చేతిలో ఉన్న లాంతరును ఎంత ఊపినా ప్రయోజనం లేకపోయింది.
ఏం చేయాలో పాలుపోక, క్రిస్మస్ తాత కంగారు పడుతున్న ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు రుడాల్ఫు. అతని ముక్కు రోజూకంటే ఎర్రగా మెరిసిపోతూ వెలుగులు చిమ్ముతున్నది. తాత సాంతాక్లజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది- రుడాల్ఫుకు బండి సారధ్యం లభించింది! క్రిస్మస్ తాత రుడాల్ఫును బండిలో అన్ని జింకలకంటే ముందు నిలిపి, కళ్లెం వేసి, తను బండినెక్కాడు. మరుక్షణంలో‌బండి ముందుకు దూసుకుపోయింది. రుడాల్ఫు క్రిస్మస్ తాతను ఆరోజు ప్రతి ఇంటి పొగగొట్టానికీ చేర్చాడు- భద్రంగానూ, వేగంగానూ. వాన, పొగమంచు, మంచు, వడగళ్ళు- ఇవేవీ ఆపలేకపోయాయి రుడాల్ఫును. ఎర్రగా మెరిసే అతని ముక్కు, అంత దట్టమైన పొగమంచునూ చీల్చుకొని ముందుకు పోయింది!

ఆ తర్వాత క్రిస్మస్ తాత అందరికీ చెప్పాడు, సంతోషపడుతూ- "రుడాల్ఫు గనక లేకపోతే ఆరోజున నేను ఎక్కడికీ కదలలేకపోయేవాడిని" అని. ఇప్పుడు అందరూ రుడాల్ఫునూ, అతని బలాన్నీ, అతని ఎర్రముక్కునూ కొనియాడటం మొదలుపెట్టారు! ఒకనాడు అతను సిగ్గుపడి, దాచలేక- దాచలేక- దాచుకున్న ఎర్రముక్కే, ఈనాడు ప్రతి ధృవపుజింకకూ కలల వెలుగైంది. అన్ని జింకలూ ఇప్పుడు అలాంటి ముక్కుకోసం తపించటం మొదలుపెట్టాయి! శక్తికీ, మంచితనానికీ మారుపేరైన రుడాల్ఫు క్రమంగా అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. లోపాలను తలచుకొని కుమిలిపోయే వాళ్లెవరైనాసరే- తన కథను విని స్ఫూర్తి తెచ్చుకునేంతగా ఎదిగాడు.
సేకరణ: కర్లపాలెం హనుమంతరావు
-కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

Thursday, February 14, 2019

రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభలోని నా కథానిక


రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభ (29-07-1982  నాటి) వారపత్ర్రికలోని నా కథానికః
ఎన్ని కమ్మని ప్రేమ కబుర్లు పోటీ కొచ్చినా జీవతమనే  పరుగుపందెంలో ఆఖర్న బంగారు పతకం సాధించేది,, విచ్చు రూపాయే! ఆర్థిక సంబంధాల ప్రాబల్యం అప్పటికీ ఇప్పటికీ,, ఇంకెప్పటికీ ఎవరూ పడగొట్టలేని వస్తాదే బతుకుగోదాలో అని మరో సారి చెప్పిన చిన్న కథ.. రాధమ్మ పెళ్లి జరిగిపోయింది! 

కథానిక : 
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది 
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం ) 

రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "

' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు  మంది!' అన్నాడో కవి! 

అయితేనేం  పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు. 

ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు.  పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక. 

సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు. 

ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం. 

సరే వాళ్లు మాత్రం  వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ? 

బోర్ బోర్! 

కడుపు నిండేనా, కాలు నిండేనా? 

ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే  'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా! 

' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు. 

వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు.  మరి ఇరుపక్షాల పెద్దలు? 

"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.

" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ

" ఒకవేళ ఒప్పుకోకపోతే?”

“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".

"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "

" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"

" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా.  అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని  పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?" 

"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ!  ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు " 

"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."

"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ  ది సేమ్ ...' అని నవ్వింది. 

రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో  డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి. 

అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది.  ప్రణయం ముదిరి పాకాన పడింది.

రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని  గాడ్యయేట్  తమ్ముడూ, పించను   ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని  పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు. 

ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే   రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట. 

భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు. 
నా అంత ఎత్తు ఎదిగిన  వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ  కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .

 “నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “

" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"

రాజు మాట్లాడలేకపోయాడు. 

తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"

"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! " 

"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో  తలెత్తుకు తరగాలా. . వద్దా  ?” అని అందుకుంది తల్లి.

" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో  ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి  ఖాయమంటున్నారు.  గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క .  అందుకే మీ మహదేవన్నయ్య  ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం  రాధ తండ్రి చుట్టూతా  తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?" 

" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "  

"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా  బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే  ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద  ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”

రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి. 

ఆయన మెత్తబడినట్లు  తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక 
నువ్వు పెద్ద ఆచారాలను గురించి  చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను  వ్యవహారం తొందరగా సెటిల్  చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”

"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా  రానీయడం? " 

శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే ..  మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి  అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!" 

"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు.  తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి?  మీరు చల్లగా ఉండటం కావాలి మాకు.  మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా!  రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి. 

" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను  ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.

ఈశ్వరావుతో జరగదనుకున్న  పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి  శాంత కళ్ళ లోకి మెరుపులు  వచ్చేశాయి. 

రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో. 

కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో! 

మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు. 

అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు.  తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది. 

వారం రోజులయింది.  కానీ , రాధ జాడ  అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు. 

ఆ రోజు పోస్టులో రాజాకు  కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం, 

ఆత్రుతగా   కవరు ఓపెన్ చేశాడు.  రాజు. 

శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది! 

రాజ గారికి! 
 అర్థమయిందనుకుంటాను. 
నా పెళ్ళి నిశ్చయమై పోయింది. 
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన  రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం. 
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి. 
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా  సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు. 

నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను  విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ  ఊరే. 
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి. 

మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు  ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే  ఫార్స్  అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు  అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు; 

ఇట్లు, 

... 

రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా  కాదని ఒప్పుకుంది! 

అదే మార్గంలో  రాధ తల్లిదండ్రులూ వెళ్లారు. 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  






రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది - కథానిక


ఆకాశరామన్న- కథానిక - ఆంధ్రభూమి- వార పత్రిక

ఆకాశరామన్న ఆంధ్రభూమి (19, ఫివ్రవరి, 2019)  నాటి వారపత్రికలోని నా కథానిక


















ఈ లింక్ నొక్కి  పిడిఎఫ్ చదువుకోవచ్చు!







Friday, February 8, 2019

బతకనేర్చిన వాడు- చిన్నకథ



రాంబాబు నావలో బొబ్బర్లంక చేరాడు. అల్లుడుగారిని రిసీవ్ చేసుకోడానికి వెంకయ్యగారే స్వయంగా ఒడ్డుమీద వేచివున్నారు. వెంకయ్యగారు ప్రస్తుతం ఆ పరగాణామొత్తానికి ఎన్నికైన ప్రజాప్రతినిధి.
సామానంతా దిగింతరువాత అందరితోపాటే నావయజమాని రామలింగానికి రవాణాచార్జీలు చెల్లించబోయాడు రాంబాబు. రామలింగం చాలా నొచ్చుకొన్నాడు
'వెంకయ్యగారి అల్లుడంటే ఊరంతటికీ అల్లుడేనండీ బాబూ! అల్లుళ్లదగ్గర డబ్బులు దండుకొనే అథమస్థాయికి చేరలేదండీ ఈ రామలింగం ఇంకా!' అంటూ ఏవేవో నిష్ఠురాలాడాడు.
వెంకయ్యగారు రొయ్యమీసాలు మెలేసుకొంటూ అంతా ప్రసన్నంగా విన్నారు.
మామగారికా ఇలాకాలో ఎంత మందాన మర్యాద మన్ననలు అందుతున్నాయో స్వయంగా చూసిన అల్లుడురాంబాబు ఆనందంతో తబ్బుబ్బయిపోయాడు.
పెద్దపండుగ మూడురోజులు అదే పద్ధతిలో బ్రహ్మాండంగా గడిచిపోయింది రాంబాబుకు అత్తారూర్లో.
భార్యాపిల్లలు మరో వారం రోజులుండి వస్తామన్నారు.  ఏడాదికి సరిపడా ఊరగాయ పచ్చళ్ళు, పండుగకట్నంగా మామాగారిఛ్చిన టీవీ సెట్టులాంటి భారీసామానుతో ఒంటరిగానే తిరుగు ముఖం పట్టాడు రాంబాబు. వెంకయ్యగారే స్వయంగా లాంచిదాకా వచ్చి వీడ్కోలు పలికారు.
నావ అవతలి ఒడ్డు చేరుకోగానే ప్రయాణీకులంతా రామలింగానికి చార్జీలు చెల్లించి సామాను దింపుకొని పోతున్నారు. వెంట తెచ్చుకొన్న సామాను దింపించుకొని పోయేందుకు రామలింగంకోసం ఎదురుచూస్తూ నిలబడున్నాడు రాంబాబు.
రామలింగం ఇటువైపు రావడంలేదు సరికదా.. రెండుమూడుసార్లు పిలిచినా విననట్లే ఎటో వెళ్ళిపోతున్నాడు! రాంబాబుకి పరిస్థితి పూర్తిగా అర్థమయింది. మామగారు ఎదురుగా లేరు కదా! ఈ ఓడమల్లయ్య ఇప్పుడు నిజసరూపం చూపిస్తున్నాడన్నమాట!
చేసేదేముంది! రాంబాబూ అందరికిమల్లేనే రవాణా చార్జీలు రామలింగం చేతిలో పోసి 'ఇహనైనా నా సామాను వడ్డున పెట్టిస్తారా?' అనడిగాడు సాధ్యమైనంత వెటకారం జోడిస్తూ!’
రామలింగం అదేమీ పట్టించుకోకుండా వెకిలిగా నవ్వుతూ 'అల్లుడుగారు వచ్చినప్పటి  చార్జీలుకూడా ఇప్పిస్తే .. ఇదిగో ఇప్పుడే సామాను వడ్డుమీదకు పట్టిస్తా..' అనేసాడు.
అవాక్కయిపోవడం రాంబాబు వంతయింది.
దక్కిస్తూ పాత చార్జీలుకూడా పైసలుతో సహా రామలింగానికి సమర్పించుకొని సామాను వడ్డుకు పట్టించుకొన్నాడు బతుకుజీవుడా అనుకొంటో!
'బతకనేర్చినవాడురా బాబూ!' అని గొణుక్కునే రాంబాబు దగ్గరికొచ్చి 'హి.. హి..హి' అన్నాడు రామలింగం 'తెలుసు బాబూ! తవరు నన్ను 'బతకనేర్చిన వాడురా బాబూ!' అని తిట్టుకొంటున్నారని తెలుసు. మరేం చెయ్యమన్నారు  చెప్పండల్లుడుగారూ! ఇదంతా మీ మాంగారిదగ్గర్నుంచి వంటబట్టించుకొన్న విద్యేనండీ బాబూ! ఎన్నికలముందు ఇంటిగుమ్మందాకా వచ్చి మరీ ఓటుకు  ఓ ఐదొందలనోటు చొప్పున  లెక్కెట్టి  ఇచ్చిపోయారండీ ధర్మప్రభువులు! అందరం ఓట్లేసినాం. ఎన్నికల్లో గెల్చినారు సారు. మేం ఎన్నుకొన్న ప్రజాప్రతినిధేకదా.. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు కదా అని.. మా పేదోళ్లందరికీ తలా ఓ నాటుపడవైనా ఇప్పించమని ఆడగాడానికని వెళ్ళాం బాబూ! ఏం చేసారో తెలుసా మీ మాంగారు? నావలు కొనుక్కోడానికి బ్యాంకోళ్ళు ఇచ్చే అప్పుకు సిఫార్సు చేయడానికి మడిసికి ఐదువేలు చొప్పున లెక్కెటి మరీ  వసూలు చేసేసారండీ! పెద్దోళ్లకేనా మరి బతకనేర్చిన విద్యలన్నీ? పేదోళ్ళకు మాత్రం కావద్దా? మేం నేర్చుకొంటేనే తప్పయిపోతుందాండీ? ఏం చోద్యం సాగుతోందండీ లోకంలో!’ అంటూ నావను నెట్టుకొంటో వెళ్ళిపోయాడు రామలింగం.
-కర్లపాలెం హనుమంతరావు
***


Saturday, March 4, 2017

నా నచ్చిన పుస్తకం లోని నాకు నచ్చిన చిన్న కథ- కాదేదీ నా కబుర్ల కనర్హం


ఒక అడవిలో మూడు చెట్లు. మూడింటికి మూడు కోరికలు.
మొదటి దానికి ఒక అందమయిన రాకుమారిపడక గదిలో అద్దం దగ్గర ఆమె తన విలువయిన ఆభరణాలు దాచుకునే అందమయిన నగిషీలు చెక్కబడిన చెక్క పెట్టెలాగా మారి అందరి దృష్టిని ఆకర్షించాలని అభిలాష .
రెండో చెట్టుకి ఒక బ్రహ్మాండమయిన నౌకలాగా మారి రాజులూ రాణులు విహరించే లాహిరి లాహిరి ఊయలగా మారాలని కోరిక.ప్రళయం వచ్చినప్పుడు జనాల ప్రాణాలను కాపాడే అవకాశం రావాలని కూడా దాని ఆశ .
మూడో దానికి మాత్రం ఈ ప్రపంచం లో అందరికన్నా ఏపుగా ఎదిగి తన జాతికి పేరు తీసుకురావాలని ఆశయం .
కొంత కాలానికి చెట్లు కొట్టేవాళ్ళొచ్చి అన్నింటి తో పాటు వాటినీనరికి తీసుకుని పోయారు.
మొదటి చెట్టు కొయ్య జంతువులకు ఆహారం పెట్టే చెక్క పెట్టె గా చెక్కబడింది.రెండోది చేపల తొట్టి. మూడోదాన్ని మరీ అన్యాయంగా చిన్న చిన్న పేళ్ళు గా కొట్టేసారు.
మూడు చెట్లు తమ దురదృష్టానికి దుఃఖపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేక పోయింది. 
కొంత కాలానికి జంతువుల కొష్టం లోకి ఒక ఆడమనిషి ప్రసవించటానికి వచ్చింది.పుట్టిన బిడ్డను ఆ గడ్డి తొట్టెలో పడుకోబెట్టింది.ప్రపంచం లోకెల్లా అత్యంత విలువయిన నిది తనలో వున్నట్లు తెలిసి ఆ చెక్క పెట్టె మురిసిపోయింది.
చాలా ఏళ్ల తరువాత ఆ బిడ్డ పెరిగి పెద్దయి ఒక నది వడ్డుకి వెళ్లి అక్కడి పడవలో పడుకున్నాడు.ఇంతలో పెను తుఫాను ఆరంభమయింది.పడవలోని మనిషి ప్రకృతి వైపు చూసి 'శాంతి శాంతి 'అని ఆదేశించాడు. ప్రకృతి శాంతించింది. ఆ క్షణంలో పడవకు అర్ధమయింది -తనలో పడుకున్నవాడు రాజు కాదు రాజులకు రాజు వంటి వాడని.
మరి కొంత కాలానికి అదే వ్యక్తిని శిలువ వేయటానికి కొయ్య పేళ్ళను ఏరుకుని వెళ్లారు కొంత మంది సైనికులు.
జీసస్ ను శిలువ వేసిన తన చెక్కలతో సహా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు 
ఆ మూడో చెట్టు అందరికన్నా ఎక్కువగా మురిసిపోయింది.
ఆ రకంగా మూడు వృక్షాల ఆకాంక్షలను దేవుడి బిడ్డే స్వయంగా వచ్చి తీర్చాడు.
-యండమూరి వీరేంద్రనాథ్



దేవుడు వున్నాడా లేడా?... జీసస్ దేవుడి బిడ్డ అవునా కదా ? అని చర్చల లోకి వెళ్ళటానికి కాదు ఈ కథ ఇక్కడ ప్రస్తావించింది..
కల్పించే వూహా శక్తి వుండాలే కానీ...చెయ్యి తిరిగిన రచయిత దేనినయినా ఎంత అందంగా సమన్వయం చేయగలడోనని చెప్పటానికి!

(యండమూరి వీరేంద్రనాథ్ 'విజయానికి ఆరో మెట్టు' లో ఈ కథ కనిపించినప్పుడు ముందుగా నాకూ తట్టిన ఆలోచన ఇదే ! .ఇలాంటి చిత్రమయిన చిన్నచిన్న కథలు..ఆలోచనలను రేకెత్తించేవి ఆ పుస్తకం నిండా కోకొల్లలు. ఆసక్తి వున్న వాళ్ళు తప్పకుండ చదవదగిన వ్యక్తిత్వ వికాస సబంధంయిన మంచి ఉపయుక్తమయిన  పుస్తకం 
ఏది ఎలా వున్నా యండమూరివారి దగ్గరనుంచి మనం చాల చక్కని తెలుగు భాషను నేర్చుకోవచ్చు. ఇది .చదివేవారి సమయం వృధా పోదు  నాదీ గ్యారంటీ
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, February 5, 2017

పెరటి మందు- చతుర కథ




నాలుగు రోజులుగా ఒంట్లో బాగుండటం లేదు. టెంపరేచర్ చూస్తే నార్మల్ గానే ఉంది. కానీ ఆకలి మందగించింది. దాంతోపాటే చురుకుదనమూ తగ్గింది బాగా. ఇదివరకు ఇలాగే సుస్తీ చేసినప్పుడు డాక్టర్ రామనాథంగారి దగ్గర కెళ్లాను. 'అన్నీ వితిన్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం తొందర్లోనే మెజారిటీలో కలసిపోతారు' అన్నాడాయన.

'మెజారిటీ అంటే?'

'మన దేశంలో నలభై ఏళ్ళు దాటినోళ్ళందరికీ బి.పిలు, షుగర్లు తగులుకుంటున్నాయి. ఆ మెజారిటీ' అంటూ నవ్వి టానిక్కులూ అవీ రాసిచ్చి క్రమం తప్పకుండా వాడమన్నాడు. మళ్లా నెలరోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు.
డాక్టరుగారిచ్చిన మందులే కాదు, ఇంకా చాలా మందులు అదనంగా వాడుతున్నాను చాలా కాలం నుంచి. ఆ డాక్టర్నే కాదు.. ఇంతకుముందు ఇంకా చాలా మందిని కల్సిన కారణంగా.. తగ్గినట్లే తగ్గి మళ్లా సుస్తీ ఎందుకు తిరగ బెట్టేస్తుందో అర్థం కావడంలేదు. అందుకే ఈ అవస్తలన్నీ!

ఒంట్లో ఓపికుండంగానే వాలంటరీ రిటైర్మెంటు తీసుకొన్నాను. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలలో చేరిపోయారు. ఆవిడ ప్రభుత్వోద్యోగి. 'బ్యాంకు ఉద్యోగం. ఎంతొచ్చినా అవసరానికి మించేం చేసుకుంటాం. బదిలీల మీద ప్రదక్షిణాలు చేయడం  తప్ప' అన్న వేడాంతంతో పదేళ్లు ముందే చేసిన అస్త్రసన్యాసం అది. పనీపాటా లేకపోవడం మొదట్లో సర్దాగానే ఉన్నా.. రాన్రానూ.. సమయం గడవక మహా విసుగు మొదలయింది.
ఎంతసేపు టీవీ చూస్తే కాలక్షేపం అయ్యేను! ఎన్ని పత్రికలు తిరగేసే పొద్దు పోయేను!

ఈ మధ్య కంటి చెకప్పుకని వెళ్లినప్పుడు ఆ డాక్టరూ చావు కబురు చల్లంగా చెప్పేసారు 'మీ ఎడమ కంటికి గ్లాకోమా ఎఫెక్టయింది' అని.

'గ్లాకోమా అంటే?'

'కంటి నరాలకి సంబంధించిన వత్తిడండీ! వంటికి బి.పి లాంటిదే అనుకోండి. చూపులో మెల్లంగా తేడా వస్తుంది. అలిగి పుట్టింటికి పోయిన పెళ్లామయితే మనసు మార్చుకొని తిరిగొస్తుందేమో గానీ.. దీందుంప తెగ!  పోయిన చూపుకు ఆ మాత్రం కూడా దయ ఉండదు. ఎన్ని మందులు వాడినా  చస్తే తిరిగి  రాదు. మానవ సంబంధాలను సరిదిద్దేందుకు ఏమైనా మందులు కనిపెట్టారేమో తెలీదు కానీ.. గ్లాకోమా కారణంగా నష్టపోయిన దృష్టిని తిరిగి తెప్పించడంలో  మాత్రం ఇంత వరకు  ఎవరూ సఫలం కాలేదు.

'డాక్టరుగారి సెన్సాఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేసే స్థితిలో లేను నేను. 'మరిప్పుడెలా డాక్టర్ గారూ?' అనడిగాను ఆందోళనగా.

'డోంట్ వరీ టూ మచ్ మిష్టర్ రావ్! అందువల్ల ఒరిగేదేమీ కూడా లేదు. కొన్ని మందులు రాసిస్తాను. క్రమంగా తప్పకుండా వాడాలి. విజన్ లాస్ కట్టడి చేయడం కుదరక పోయినా.. ఆ స్పీడును కాస్త కంట్రోలు చేసుకోవచ్చు. కావాల్సింది పేషెంట్ లో మనో నిబ్బరం.. క్రమ శిక్షణ. భోజనం ఓ పూట మానేసినా సమస్య లేదు. కానీ ఈ మందులు మింగడం మాత్రం మానేయకూడదు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ!' అంటూ ప్రిస్కిప్షన్ రాసిచ్చి తగిన జాగ్రత్తలు చెప్పి పంపించాడా కళ్ల డాక్టర్.

కాస్త ఖరీదైన మందులే అయినా క్రమం తప్పకుండా వాడుతున్నాను. అయినా మధ్య మధ్యలో ఈ సుస్తీ పరామర్శలేవిఁటో! నా ఆందోళన చూసి మా పక్కింటి రమణమూర్తిచ్చిన సలహామీద ఇదిగో.. ఈ  పంజగుట్టలో ఉన్న డాక్టర్ సహాయ్ గారిని కలవడానికని వచ్చాను.

'రమణ మూర్తి చెప్పాడు' అంటూ ఆయన క్యాజువల్ గా పరీక్షించి  మళ్లా రెండు రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు. రెంద్రోజులయ్యాక వెళ్లినప్పుడు మళ్లా జస్ట్ క్యాజువల్ గా పరీక్షించి మరో మూడ్రోజుల తర్వాతొచ్చి కలవమన్నాడు! ఆయన చెప్పిన టైముకే వెళ్లాను మూద్రోజుల తర్వాత..  పడుతూ లేస్తూ! యధాలాపంగా  ఏదో చిన్న  పరీక్షలాంటిది  చేసి ..   ఇంకో వారం రోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు! వెళ్ళిన ప్రతీ సారీ ఇదే తంతు!  ఏదో చెక్ చేస్తాడు. బరువు చూస్తాడు. ఆకలిని గురించి అడుగుతాడు. ఆహారం అలవాట్లను గురించి అడిగిందే అడుగుతాడు. నాకు ఎందుకో కాస్త అసహజంగా అనిపిస్తుంది. అసహనంగా కూడా ఉంది.  కొంతమంది డాక్టర్లకు పేషెంట్లను ఇలా వూరికే తిప్పుకోడం సరదా అనుకుంటా. సాడిజమా?'డబ్బు కోసవాఁ ఈ తిప్పలన్నీ! అనుకోవడానికీ లేదు ఈయన కేసులో. మొదటిసారి వెళ్ళినప్పుడు ఛార్జ్ చేసిందే! తరువాత ఇన్ని సార్లు వెళ్లినా పైసా అడగడం లేదు. మరెందుకు ఇన్నేసి సార్లు తిప్పించుకుంటున్నట్లు?!

ఈ నెలరోజుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా ఏవీఁ లేవే?! ఎప్పటిలాగే ఈ డాక్టర్ను కూడా మార్చేయడం ఒక్కటే మంచి మందు.' అని నిశ్చయానికొచ్చేసాను. మార్చేసే ముందు కడుపులో ఉన్న ఆలోచనను  ఆయన ముందు పెట్టడం మంచిదనిపించింది. ఆయన చెప్పిన టైముకి వెళ్లి కలిసాను.

ఎప్పట్లానే బి.పి, బరువు, ఆకలిఆహారం అలవాట్లు.. అన్నీ అడిగాడు. అనుకున్నట్లుగానే మరో మూడు రోజులాగి రమ్మన్నాడు మందూ మాకూ ఏవీ ఇవ్వకుండానే! ఇహ ఉండబట్టలేక గట్టిగానే అడిగేశాను మనసులో ఇంతకాలం బట్టీ రొళ్లుతున్న ఆ  సందేహం!

ఆయన కోపం తెచ్చుకోలేదు. సరికదా.. నవ్వుతూ అన్నాడు 'చూడండి రావుగారూ! మీరు మోతీనగర్లో ఆంజనేయస్వామివారి టెంపుల్దగ్గర కదా ఉంటారు? మా ఇల్లూ ఆ టెంపుల్కి ఆ రెండో వైపే ఉంది. నేను రోజూ అయిదు గంటల ప్రాంతంలో ఆ గుడి పక్క పార్కులో జాగింగ్ చేస్తుంటాను. నేను మిమ్మల్ని అక్కడ చూస్తుంటాను.'

'నన్నా! పార్కులోనా! ఇంపాజిబుల్ సార్! నేనసలెప్పుడూ ఆ జాగింగులూ.. గట్రా కోసం పార్కులకు  రానేఁ!

''జాగింగుకి రారు. కానీ పాల ప్యాకెట్లు పికప్ చేసుకోడానికైతే వస్తుంటారు కదా? నిజానికి మీరా పాకెట్ల వంకతో అయినా మీ ఇంటి నుంచి  నడుచుకుంటూ రావాలి ఈ వయసులో! కానీ స్కూటీ మీద వస్తుంటారు. పార్కు గేటు ముందు స్కూటీ ఆపి పార్కు అడ్డ దారి గుండా అటువైపున్న డాబ్బా నుంచి పేకట్లు తీసుకుని మళ్లా స్కూటీ మీద వెళ్లి పోతుంటారు. నడక మీకు పడదని నాకప్పుడే అర్థమైపోయింది. మీ కేస్ షీట్ చూసాను. ఈ రెండేళ్ళల్లో నలుగురు డాక్టర్లని మార్చేసారు. ఇప్పుడు నన్ను కూడా మార్చేయబోతున్నారేమో! నిజానికి మీరు మార్చాల్సింది డాక్టర్లను కాదు రావుగారూ! మీ అలవాట్లను. లైఫ్ స్టైల్ ని. ఉద్యోగం మానేశారు. అది మీ పర్సనల్. కానీ ఆరోగ్యం కోసం ఆ స్థానంలో మరేదైనా చేయాలి కదా! ముఖ్యంగా శరీరానికి అలవాటైన శ్రమనుంచి వంట్లో ఓపికున్నప్పుట్నుంచే అనవసరంగా విరామమిచ్చేస్తే.. ఇదిగో పరిణామాలిలాగే ఉంటాయి.

నేనేదో సంజాయిషీలాంటిది ఇవ్వబోతుంటే వారించి ఆయనే కొనసాగించాడు 'మీ గురించి మీ నైబర్ రమణ మూర్తి అంతా చెప్పారు. కనీసం అపార్టుమెంటు వెల్ఫేర్  పనుల్లో అయినా బిజీగా గడపేయచ్చు మీ లాంటి ఎర్లీ రిటైరీస్! ఏదో ఓ రూపంలో బాడీకి ఎక్సర్సైజెస్ చాలా అవసరమండీ ఈ రోజుల్లో! సారీ! ఇలా అన్నానని ఏమీ అనుకోకండీ.. ఔట్ పుట్ లేకుండా.. ఒన్లీ ఇన్ పుట్ మీదే ధ్యాస పెట్టేస్తే ఇదిగో.. ఇలాంటి అనారోగ్య సమస్యలే దాడి చేస్తాయ్ శరీరంమీద.  బాడీ బరువెక్కడం.. ఆకలి మందగించడం..ఆసక్తి సన్నగిల్లడం.. ప్రతికూలమైన ఆలోచనలు పెరిగిపోవడం.. ఇవన్నీ సోమరితనం వల్లనే సంభవించేవని వందేళ్ల కిందటే పరిశోధనల్లో తేలాయి. మందులు.. చికిత్సల పేరుతో నేనూ ఇంతకు ముందు మీరు చూపించుకున్న డాక్టర్ల మాదిరిగానే ఎంతైనా గుంజుకోవచ్చు. మీక్కూడా ఏదో ట్రీట్ మెంటు జరుగుతోందన్న తృప్తీ ఉండేది. ప్రిస్కిప్షన్ పేపరి వంక మీరొక్క సారైనా చూసారా?'

'చూడ్డానికి మీరసలు మందులేవైనా రాసిస్తేగదా డాక్టర్!' ఛాన్సొచ్చిందని నిష్ఠురానికి దిగబోయాను.

'మందులు రాయడం లేదా?.. ఏదీ చూపించండి?' అని ఫైల్ తెరిచి ప్రిస్కిప్షన్ పేపరు నా ముందు పరిచారు.

'రోజూ  ఉదయం..  సాయంత్రం ఏదైనా కడుపులోకి తీసుకొన్న తరువాత.. కనీసం ఓ గంటపాటు నడవాలి' అని రాసుంది.. ఇంగ్లీషులో!

నేనా సలహా చూడకపోలేదు. నడవమని సలహా ఇవ్వడం మందులు రాసినట్లెట్లా అవుతుందని నా ఆలోచన. అందులోనూ నాకు మొదట్నుంచి నడకంటే మహా చిరాక్కూడా!

ప్రిస్కిష్పన్నలా వదిలేయండి రావుగారూ! మోరొచ్చిన ప్రతీసారీ నేను నడక ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూనే ఉన్నాను. నా దగ్గర 'ఊఁ' గొడుతూ పోయారే కానీ.. కనీసం మీ ఇంటి దగ్గర పాలడబ్బాకి వెళ్లేటప్పుడైనా పార్కు అడ్డదారిని ఎంచుకోడం మానేయలేకపోయారు! మీరు పార్కు చుట్టూ కాలినడకన వెళ్లి పని ముగించుకోడం మొదలు పెట్టేవరకైనా నేను ట్రీట్ మెంటు మొదలు పెట్టకూడదనుకున్నాను. మొదల పెట్టీ ప్రయోజనం ఉండదు. ఇదివరకటి డాక్టర్లకు మల్లే మీ చేత వందలొందలు ఖర్చు పెట్టించడం.. ఆనక చేతకాని డాక్టర్నని తిట్టించుకోడం తప్ప. పెరటి చెట్టును కదా.. అందుకు చులకనయానేమో మరి.. మీకే తెలియాలి' అని నవ్వుతూ లేచాడు డాక్టర్ సహాయ్!

అప్పుడర్థమయింది.. ఇంటిముందు బంగారంలాంటి పార్కు పెట్టుకొనీ.. జాగింగ్ చేసేందుకు బద్ధకించి రోగలు కొని తెచ్చుకొన్న  నా పొరపాటు. మందులకోసం వేలకు వేలు పోసాను. పదుల కొద్దీ డాక్టర్లను తెగ మార్చేసాను.. లోపం నాలో ఉంచుకొని.

మర్నాడు పాలపాకెట్టుకు బైటకు వెళ్లేటప్పుడు స్కూటీ తీయ లేదు. ఎప్పటి కన్నా ఓ గంట ముందే లేచి బైటకు వెళ్లే నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం నేను గమనించక పోలేదు.

పార్కులో జాగింగ్ చేస్తున్న డాక్టర్ సహాయ్ నన్ను చూసి గుర్తు పట్టి 'హాయ్' అంటూ చేతులూపాడు కూడా! నెక్స్ట్ విజిట్ కి వెళ్లినప్పుడు 'పార్కు చుట్టూతా అలా నెమ్మదిగా కాకుండా ఇంకాస్త వేగంగా పరిగెడితే.. నెనిప్పుడు రాసిస్తున్న మందులు మరీ ఎక్కువ కాలం వాడాల్సిన పనుండదు' అని భుజం తట్టాడు డాక్టరు సహాయ్ గారు!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,యూఎస్ఎ

 

(చతుర- ఆగష్టు, 2012 నెల సంచిక ప్రచిరతం)

 

Monday, January 30, 2017

దగ్గరి దారి- మరీ చిన్న కథ

ముఫ్ఫై అపార్ట్ మెంట్ల కాంప్లెక్స్ మాది. లిఫ్ట్ పనిచేయని ఓ పరగడున పాల పాకెట్లు తీసుకొని మెట్ల దారిన వస్తుంటే రెండో ఫ్లోర్ మెట్లకు ఓ మూల నిండుగర్భిణీలా ఉన్న ఓ వ్యాలెట్ కంటబడింది. అప్రయత్నంగా వంగి దాన్నందుకొని చూస్తే బరువును బట్టి లోపల సొమ్ము భారీగా ఉందని తేలింది. సభ్యత కాదు కాబట్టి ఎంతుందో తెలీదు కానీ.. మొత్తానిక అంతా దాదాపుగా ఐదొందలు.. వెయ్యినోట్లే. క్రెడిట్ .. డెబిట్ కార్టుల్లాంటివీ ఏవేవో ఉన్నాయి.  అన్నింటి మీదా బి. గోవింద రాజన్ అన్న పేరే ఉండుంటం వల్ల ఆ పర్శుతాలూకు ఆసామి ఎవరో తేలిపోయింది. వాచ్ మెన్ అప్పారావును అడిగితే .. అలాంటి పేరున్న వాళ్లెవరూ అపార్టుమెంట్లలో లేరని తేల్చాడు.
'ఇంత సొమ్ముంది. పై పెచ్చు ప్లాస్టిక్ కార్డులు! పోగొట్టుకొన్న మనిషి తానే వెదుక్కుంటూ రాడా? అప్పుడు తిరిగిచ్చేద్దాంలే!' అనిపించి ఇలా పర్శు నా దగ్గరుందని వాచ్ మెన్ కు చెప్పి  వచ్చేసాను.

ఒకటి రెండు రోజుల్దాకా ఎవరూ రాలేదు! ఆశ్చర్యం! మరీ ఆశ్చర్యం ఒక నెల రోజులు దాటినా ఎవరూ రాలేదు.

పరాయి సొమ్మును పాములా భావించే చాదస్తం  నాది. పోనీ  పోలీసులకిలా దొరికిందన్న సమాచారమిద్దామా అనిపించింది. వాళ్ల పోకిరీ బుద్ధి బాగా తెల్సుండబట్టి మనసొప్పలేదు. గుళ్లో హుండీలో వేయమని మొదలు పెట్టింది మా శ్రీమతి. పోలీసులకన్నా దేవుడి చూట్టూతా చేరిన  వాళ్లేమన్నా బుద్ధిమంతులా? ఆ పనీ చెయ్య బుద్ధి కాలేదు.
ఇంట్లో మధన ఇలా సాగుతుండగానే  మా  ధర్మ విచికిత్సను పటాపంచలు చేస్తూ  కాలింగు బెల్ కొట్టి మరీ ఓ నడి వయసు శాల్తీ లోపలి కొచ్చింది. అయిన పరిచయాలను బట్టి అతగాడు ఏదో ప్రైవేటు కాలేజీ లక్చెరరని తేలింది. అందరికీ    'గోరా'గా తెలిసిన అతగాడి అసలు పేరు 'గోవింద రాజ కుమారన్'ట! మా కాంప్లెక్సులో అద్దెకు దిగి ఇంకా రెండు నెలలు కూడా నిండక పోవడంతో అతగాడి ఆరిజన్ తమిళనాడు సైడు వేలూరని పసిగట్ట లేకపోయాం.   కృష్టాజిల్లా బ్రాహ్మణ యాసతో స్పష్టమైన తెలుగు మాట్లాట్టం వల్లా  గోరా రూట్స్ గోరైంతైనా పసిగట్టలేక పోయాం ఎవ్వరం.
పర్శులో ఐదువేల ఏడొందలు .. ఐదు వెయ్యి నోట్లు.. ఒక్క ఐదొందల నోటు.. నాలుగు యాభై నోట్లున్నాయని చూడకుండానే చెప్పేసాడు. క్రెడిట్.. డెబిట్ కార్డు వివరాలు కూడా అన్నీ పొల్లుపోకుండా చెప్పడంతో .. ఇంకా సందేహించడం అవమానించడమే అవుతుంది. అంతే కాదు. ఆ పరాయి సొమ్మును ఇంకా మోసే మానసిక స్థైర్యం నాకు లేదు. మా శ్రీమతిగారి హుషారుక్కూడా  అడ్డుకట్ట పడినట్లుంటుందన్న ఆత్రంతో పర్శు తిరిగి తెచ్చిస్తూ' అన్నీ సరిగ్గా  ఉన్నాయో.. లేవో.. ఒకసారి సరి చూసుకో బాబూ!' అన్నాను,
'ఉంటాయంకుల్! మీ నిజాయితీని గురించి  ఇక్కడందరూ చెప్పుకుంటుంటారు. ఆ  ధీమతోనే  ఆ రోజు మీ కంట బడేట్లు ఈ పర్సును  మెట్ల మూల పడేశాను. మీరా పరగడుపు చీకట్లలో  చూడ లేదు కానీ.. నేనక్కడే ఓ వారగా నిలబడున్నాను' అన్నాడు!
ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టడం నా వంతయింది. ఇన్నాళ్ళూ నన్నవసరంగా టెన్షన్ పెట్టడం కొద్దిగా కోపం కూడా తెప్పించింది. నా ముఖంలోని భావాలను చదివినట్లుగా నొచ్చుకుంటున్నట్లు మొహం పెట్టి అన్నాడు గోరా 'సారీ! పెద్దవారు. మిమ్మల్నిలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. ఇంకేం  చేసేది? ఆ టైంలో ఇంట్లో మా అమ్మ నాన్నలున్నారు. మా నాన్నగారికి మందు పిచ్చి, దానికి తోడు నా జేబులు తడిమి ఎంతుంటే అంత పట్టుకేళ్లే అలవాటు. అడిగితే పెద్ద రభస అమ్మతో కూడా. బైకుమీదనుంచి పడి బాగా దెబ్బలు తగిలున్నాయని నన్ను చూడ్డానికి  హఠాత్తుగా ఊడి పడ్డారిద్దరూ. మర్నాడు మళ్లా బ్యాంకులో వేద్దును కానీ కుంటికాలు.. పెద్ద పెద్ద  క్యూలు! కుదర్లా! అంతకు ముందు రోజు రాత్రే మోదీగారీ పెద్దనోట్లు రద్దుచేసారు.  మా   వాళ్లిద్దర్నీ ఇప్పుడే బస్సెకించి  వస్తున్నా. సారీ  అంకుల్..  మా పేరెంట్సిద్దరూ  ఊరికెళ్లిందాకా నా హార్డ్ ఎరన్డ్ మనీ భద్రంగా ఉండాలంటే ఇంతకు మించి నాకు మరో దారి కనిపించలా’
.  
డబ్బు దాచుకోడానికి డబ్బు పోగొట్టుకోడం కూడా ఓ దగ్గరి దారని కనిపెట్టిన గోరా తెలివికి నోరెళ్ల బెట్టడం నా వంతయింది!
లకీగా ఇవాళ్టికింకా ఒక్క రోజు గడువు మిగిలుంది రద్దైన పెద్ద నోట్లు బ్యాంకులో వేసుకోడానికి. సంతోషమూ అయింది.
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రికలో మరీ చి.క(మరీ చిన్న కథ) గా ప్రచురితం)

***


Thursday, November 10, 2016

దుర్భాషా సాహిత్య ప్రయోజనం- వ్యంగ్య కథానిక


ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది. లేచెళ్ళి కాసిని మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు. ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు! ఈ సారి కాస్త ఎక్కువగా! నొప్పికూడా  పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.   కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్ ఎగదన్ని గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో విన్నాడు. ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం పండుకూడా తినలేదు..  వళ్లంతా ఒహటే చెమటలు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి  మంచంమీద కూలబడ్డాడు.
గుండెల్లో నొప్పి  తెరలు తెరలుగా వస్తూనే ఉంది.
హార్ట్ ఎటాక్?!’ అనుమానంతో  గుండె కొట్టుకొనే వేగం  మరింత హెచ్చింది.
ఇప్పుడేం చేయడం?
సమయానికి ఇంటి దగ్గరా ఎవరూ లేరు. అందర్నీ తానే ఊరికి తరిమేశాడు. ఏదో  పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు దగ్గర పడుతోంది.. ఇంట్లో పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో.. మూడ్ స్థిరంగా ఉండటం లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి పంపించాడు.. వారం రోజుల తరువాత తిరిగి తనే   తీసుకు వస్తానని వాగ్దానం చేసి మరీ. 
ఇప్పుడిలా అవుతుందని కల కన్నాడా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగుంటే తగిన  జాగ్రత్తల్లో ఉండేవాడే కదా!
కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే ముందే..  వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి. 
డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు ఆపద్భాందవుల ఫోన్ నెంబర్లు దొరికాయి. డాక్టర్ గోవిందు. డాక్టర్ బండ కోదండం. డాక్టర్ దూర్వాసిని.
డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.
'గోవిందో  గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే పనిగా మోగుతోంది.  అయినా   ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి.  సెల్ కట్ చేద్దామనుకొనే లోపు గుర్.. గుర్ మంటూ గొంతు వినిపించింది.
'హలో!.. ఎవరూ?'
'డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!.. గ్గుండెల్లో... న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే.. ప్ప..ట్నుంచీ'
అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ సార్! అందర్లాగా మీరూ నన్ను వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'
'కాదా?'
'కాదండీ బాబూ! మంది పంగనామం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్  ‘బెల్లం సాగుతో అధికాదాయం సాధించే నవీన విధానాలుఅనే అంశంమీద   పరిశోధన చేసినందుకు..’  సుబ్బారెడ్డి ఫోన్ ఠక్కుమని కట్ చేసేసాడు. ఇప్పుడా సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’
రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం.. నెంబర్ వెంటనే కలసింది.
'యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'
'ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితినంతా గుండెలవిసి పోయేలా  వివరించాడు. ఆసాంతం  తాపీగా విని.. ఓ సుదీర్ఘ ఉఛ్ఛ్వాసం  తీసుకొని మరీ 'సారీ! మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా డాక్టర్ పట్టా సాహిత్యానికి సంబంధించింది బ్రో! ప్రాచీనకాలంలో జంతువుల జీవన  విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన  పాత్ర' అనే అంశంమీద కుంభకోణం విద్యాపీథం వారిచ్చిన స్నాతకొత్సవానంతర  పట్టా! బండ కోదండంఅన్న పేరు విన్న తరువాతైనా మీకు నా గురించి  అర్థం కాకపోవడం విఛారకరం..' ఉండేలు  సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో బాదేసినట్లు  గుండెలు కలుక్కుమన్నాయి.  ఫోన్ కట్ చేసేసాడు.
మిగిలిందిక డాక్టర్ దూర్వాసిని.  సమయం చూస్తే అర్థరాత్రి దాటి అర్థ గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు చేసేస్తే!  సంకోచిస్తూనే నెంబర్ రింగ్ చేసాడు  సుబ్బారెడ్డి మార్గాంతరం లేక.






చాలాసేపు చడీ చప్పుడు  లేదు.. ఊరికే రింగవడం మినహా! అదే పనిగా ప్రయత్నించిన మీదట  అవతలవైపునుంచి రెస్పాన్స్ వచ్చిం దీసారి! ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో సూరేకారం పోసినంత రౌద్రం! సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక   సమర్పించడం సగం కూడా కాలేదు అవతలి వైపు  శాల్తీ కాళికా దేవి అవతారమే ఎత్తేసింది.

'ఎవర్రా నువ్వు? నీకు అసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..  కాల్  చేసేది?  కాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు? ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు పేషెంటేవన్న గ్యారంటీ ఏంటి? నిజంగా నీది గుండె నొప్పేనని రుజువేంటి? నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ ఆసుపత్రికో.. అంబులెన్సుకో!  నేరుగా ఇలా  ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?  పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు పోలీస్ స్టేషన్  సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా.. బీ కేర్ ఫుల్!' ఠక్కుమని ఫోన్ కట్టయి పోయింది.
సుబ్బారెడ్డిట్లా  నేరుగా డాక్టర్లనే తగులుకోడానికి కారణం లేకపోలేదు. రాతకోసం  ప్రశాంతత కావాలని వేధిస్తుంటే  ఫ్రెండువెధవ తననీ అడ్రసు తెలీని  అజ్ఞాతంలో వదిలేసి పోయాడు రాత్రి.  మళ్లీ తెల్లారి వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా ఏంటో  తెల్సిచ్చావదు! ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో ఫుల్లుగా  మందుగొట్టి  గొడ్డులా పడున్నాడు.  తనదగ్గర సమయానికే  ఆసుపత్రుల నెంబర్లూ  ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ  పడక.
ఉన్న  మూడు నెంబర్లూ  బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!
పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ గుండెల్లో నొప్పి ఎక్కువై పోతోంది. చెమటలూ ధారగా కారి పోతున్నాయి. అక్కడికీ    నొప్పినుంచి దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని   న్యూస్ చానెలేదో ఆన్ చేసాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్.. హిల్లరీల ప్రచారానికి సంబంధించిన వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి.  ట్రంపు మహాశయుడు హిల్లరీమ్యాడమ్మీద పడి  అడ్డమైన కారు కూతలూ అడ్డూ ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే స్థాయిలో హిల్లరీ అమ్మగారి భాషా ప్రయోగాలు కూడా!
మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి రాజకీయాలమీద విరక్తి పుట్టించే దుర్భాషలవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న సుబ్బారెడ్డికిమాత్రం హఠాత్తుగా  తారక మంత్రం దొరికినట్లయింది.  మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు  సెల్ ఫోన్ అందుకున్నాడు.


మళ్లీ డాక్టర్ దూర్వాసిని  బెడ్ రూంలోని  సెల్ మొరుగుడు మొదలు పెట్టింది అదే పనిగా.  ఎన్ని సార్లు నోరుమూసేసినా   మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో  దూర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న  మొగుడుగారు గయ్యిమని లేచారు మేడమ్గారిమీద 'మీ ఆసుపత్రినుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవక పోతే ఎట్లా?  ఆనక సమస్యలొచ్చి పడతే సర్ధిపెట్టలేక చచ్చేది నేనే. ముందా ఫోన్ చూడు!' అంటూ.  
భర్త హెచ్చరించరికలతో ఇహ తప్పదన్నట్లు చిరాగ్గా లేచి   సెల్  అందుకొంది డాక్టర్ దూర్వాసనమ్మ.
 …
సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో ఉండేలు సుబ్బారెడ్డి యమగండంనుండి బైటపడ్డాడు  చివరికి ఎట్లాగైతేనేం!
పోలీసులు సమయానికి వచ్చి  కలగచేసుకోక పోయుంటే ప్రముఖ రచయిత   సుబ్బారెడ్డి  ఈ పాటికి పై లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా   నవల పూర్తి చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దూర్వాసిని ఇచ్చిన అర్థరాత్రి 'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని  'షిటీం సీరియస్ గా తీసుకోబట్టి గుండెనొప్పితో లుంగలు  చుట్టుకుపోతోన్న  సుబ్బారెడ్డిని 'సగం  నిర్మాణంలో ఉన్న ఊరిబైటి భవంతిలో గాలించి మరీ పట్టుకొన్నారు పోలీసులు.   అత్యవసర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆగమేఘాలమీద పోలీసులే  దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్పించడం వల్ల సుబ్బారెడ్డి కథ సుఖాంతమైంది.
అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దూర్వాసిని సైతం న్యూసెన్సు కేసులో మరింక ముందుకు పోదల్చుకోలేదు.
వాస్తవానకి మనం మెచ్చుకోవాల్సింది సుబ్బారెడ్డిని.. అతగాడి సమయస్ఫూర్తిని  కాదు. అతగాడు అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని అందించిన అమెరికన్ రాజకీయ మేధావులు ట్రంప్ గారిని.. హిల్లరీ మ్యాడమ్ గారిని.
'ట్రంపు- హిల్లరీ'లని మించిన కంపు రాజకీయాలు మన దేశంలోనూ ప్రతీ క్షణం బరితెగించి మరీ  జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో నీతి.. మర్యాదలు అంతరించిపోతున్నాయని వూరికే  దురపిల్లే  ఆదర్శవాదులు.. దుర్భాషా సాహిత్య ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి అవసరం ఉందన్నదే ఈ కథ నీతి!

-కర్లపాలెం హనుమంతరావు
(తెలుగిల్లు- అంతర్జాల పత్రిక ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...