Showing posts with label galpika. Show all posts
Showing posts with label galpika. Show all posts

Wednesday, February 2, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం పావలా కాలధర్మం రచన- కర్లపాలెం హనుమంతరావు


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

పావలా కాలధర్మం 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 ) 

 

చిల్లర రాజకీయాలు పెరుగుతున్న కొద్దీ చిల్లర నాణాలు క్రమంగా కనుమరుగైపో తున్నాయి. పైసా, అయిదు పైసలు, పది పైసలు, ఇరవై పైసలు... ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఇరవై అయిదు పైసలవంతు. త్వరలో అర్ధ రూపాయి గతీ అంతే కావచ్చు  


భిక్షగాడికి కూడా అక్కర్లేని డొక్కు నాణెంగా తయారైంది పావలా  వంద పావలా బిళ్ళల తయారీ కే నూట అరవై రూపాయలు ఖర్చవుతున్నాయని కేంద్ర అమాత్యులు వాపోతున్నారు. ఈ కరవు కాలంలో వాటిని తయారుచేయడం తమవల్ల కాదని ఓ దండం పెట్టేస్తున్నారు. జులై ఒకటినుంచి పావలా 'మరణం' అధికారికంగా నిర్ధారణయింది!


దమ్మిడీకి కొరగాని నేతల్ని ఎన్నుకోవడానికి ఎన్నికల్లో కోట్లు  రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అలాగని ఎన్నికలనే రద్దు చేయాలని ఎవరన్నా అంటున్నారా! బడుగు జీవి బతుకులాగా పావలా నాణెం అందరికీ అలుసయి పోయిందనేదే బెంగ . నెత్తిమీద రూపాయి ఉంచినా పావలాకు అమ్ముడుకాని నేతలను మనం భరించాలి  గానీ, పర్సులో పావలాని మాత్రం బరువని చెప్పి గిరాటేస్తున్నాం. 


కారు డిక్కీలో, బస్సు టాపులమీద పత్తిబేళ్ల మాదిరిగా కట్టలు కట్టలు వెయ్యి నోట్లు రవాణా అయే  కాలంలో- ఇంకా ఈ పావలా, అర్ధ రూపాయల గురించి పలవరింతలు ఎందుకని నవ్వుకొంటున్నారా! అయినవాడికి పదవి కట్టబెట్టడానికి గిట్టనివాడిని చట్టసభనుంచి వెళ్ళగొట్టినట్లు... అయిదు, రెండు, ఒక రూపాయినోట్లకు నాణాల స్థాయి కల్పించారు. పేద వాడి నాణెం పావలా, అర్ధరూపాయలను మాయం చేస్తామంటున్నారిప్పుడు . చిల్లర మహాలక్ష్మి అంటే ఎంత చుల కన? 


గుళ్ళో దేవుడి హారతి పళ్ళెంలో వేయడానికి ఇక రూపాయి, అర్ధరూపాయలే సమర్పించుకోవాలి కాబోలు. పిల్లాడు కిడ్డిబ్యాంకులో వేసుకోవడానికి ఇక రూపాయలే ఇచ్చుకోవాలి. పాపాయిల భోగిపళ్లలో కలపడానికైనా పావలా బిళ్లలు చలామణీలో ఉంటే నిండుగా ఉండును పండువు . శవయా త్రలో వెనక్కు విసురుకుంటూ పోయే చిల్లరలో పావలాలు కాక రూపాయి బిళ్లలు కలపాలంటే- బతికున్న వాడి బంధువులు భరించలేక చచ్చూరుకోవాల్సిందే. అసలైన ఆర్థికమాంద్యం దెబ్బ అప్పుడు  తెలిసొస్తోంది.


బడుగు జీవికి జనాభాలో ఏ పాటి విలువుందో పావలాల్లాంటి చిల్లర బిళ్లలకూ కరెన్సీ లోకంలో అంతే విలువుందిప్పుడు. కూడికలూ తీసివేతల లెక్కల వరకేగానీ, ఇంద... తీసుకో అంటూ ఇవ్వడానికి పావలాలు ఎక్కడున్నాయి? టీవీల్లో తెలుగులా, నేతల్లో నిజాయతీలా, దుకాణాల్లో నికార్సయిన సరకులా, చేత్తో రాసే ఉత్తరాల్లా... పావలాలూ పది పైసల బిళ్లలూ మాయమైపోయాయి. 


అమలుకాని వాటిని ఇప్పుడు పావలా వడ్డీ పథకాలనే పిలుస్తున్నారు. బంగారం కొట్లో ధర్మకాటాలో వేసి తూచడానికితప్ప, ఇతర సమయాల్లో పావలాలు, అర్ధలూ పనికిరాని పదా ' ర్థాలు ' . 


ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎంత సవ్యంగా ఏడ్చిందో  - డబ్బు లెక్కల్లో పావలాలకు, అర్ధరూపాయలకు అంతే విలు వుందిప్పుడు . పేదోడిని పట్టించుకుంటున్నారు కనకనా, పావలాను ఎవరైనా లెక్క పెట్టడానికి! 


కుంభకోణాల విలువా వేలకోట్ల రూపాయల స్థాయికి చేరిపోయింది. రాష్ట్రప్రభుత్వాల బడ్జెట్లూ లక్షల కోట్లు మించుతున్నాయి. పావలాలను, పైసలను సర్దుబాటు చేసే తీరిక, ఓపిక ఇప్పుడెక్కడున్నాయి? 


పావలాలను, రూపా యల్ని కాదని, కోట్ల రూపాయల్ని ఆరగించినవారు వాటిని సర్దుబాటు చేయలేకే ఇప్పుడు తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. 


ఒకప్పుడు పావలా బిళ్ళ అంటే ఎంత విలువ? కప్పు చాయ్ తాగాలంటే పావలా

చాలు. ఇంకా వెనక్కు వెళితే- మానెడు బియ్యం కొలిచేవారు. ఓ పావలాబిళ్ళ గనక జేబులో ఉంటే- ఆ రోజుకు అతను పెద్ద దివానే. పిల్లాడిచేతిలో పావలా పెడితే- ఐస్ సోడా , సోంపాపిడి, మామిడితాండ్ర, రబ్బరు పెన్సిలు, రంగు బెలూన్లు రెండో మూడో కొనుక్కున్నా- ఇంకా పైసో .. రెండు పైసలో మిగిలుండేవి. ఇప్పుడు పీచు మిఠాయినుంచి పాప్ కార్న్ పాకెట్ దాకా ఏది కొనాలన్నా రూపాయలు  అచ్చుకోవాలి . 


దీపా వళి పండుగకు పావలాకు సగం బుట్టెడు టపాసుల చ్చేవి. పెద్దపండగ నాడు హరిదాసు అక్షయపాత్రలో అరసోల బియ్యం ఓ పావలాబిళ్ళతో పాటు కలిపి పోస్తే ఇంటిల్లపాదీ అప్లైశ్వర్యాలతో చల్లగా ఉండమని మనసారా దీవలనందించేవాడు . 


పావలా రైలు టికెట్ తో  పాతిక మైళ్ళు సుఖంగా ప్రయాణం చేసేవాళ్లం. సైకిలు అద్దె గంటకు పావలా.  శివరాత్రి పండక్కు పావలా ఇచ్చి మూడు సినిమాలు వరసగా చూసి మురిసిపోయేవాళ్లం. అందాకా ఎందుకు, అప్పట్లో ఆలిండియా కాంగ్రెసులో ప్రాథమిక సభ్యత్వం ఖరీదు- కేమం ఒక్క పావలా!


నాణెమా అంటే నాలుక్కాలాలపాటు నిలబడుం డేదీ... విలువగలదీ అని నిఘంటువు అర్ధం. నాణేల చరిత్ర రెండువేల ఏడొందల నాటిది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాల తయారీకి లోహాలకు కరవొస్తే ఆదుకున్నది అప్పటి నాణేలే! శాసనాలకు మాదిరిగానే నాణేలూ చారిత్రక పరిశోధనకు చక్కని సాధనాలు,


అలాంటి నాణేలకు ఇప్పుడు మూడింది. పిల్లకాయ లకు పావలా బిళ్లల్ని ఇంక ఏ మ్యూజియాలలోనో,  నాణేల సేకరణ పుస్తకాలలోనో  చూపించుకోవాలి.


వెయ్యి నోటు ఇస్తే, వెనక్కూ ముందుకూ వెయ్యి సార్లు తిప్పిచూసుకుని తీసుకునే ఈ కాలంలో- పావలా బిళ్ళ గురించి విలపించడం వృథా అంటారా?


ఆర్ధిక సమరంలో బడుగువాడి పక్కన నిలబడి పోరాడే పావలా యోధుడికి ఇలాగైనా ఆశ్రునివాళి సమర్పించడం మన కనీస ధర్మం.




రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 )   

Tuesday, February 1, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక ఎందరో మేతగాళ్లు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 )

 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక 

ఎందరో మేతగాళ్లు 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 



రోజూ ఉండే రాజకీయాలకేంగానీ, ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచికథ చెప్పాలనుందిరా? 


చెప్పు బాబాయ్! కహానీలు చెప్పడంలో నిన్ను మించిన మొనగాడు లేడులే, కానీయ్! 


సృంజయుడనే ఓ మహారాజు, సంతానం లేదు. నారదులవారు ఓసారి చూడ్డానికొచ్చి- గుణవంతుడు, రూప వంతుడు అయిన కొడుకు పుడతాడని ఆశీర్వదించాడట. 'గుణాన్ని ఏమన్నా కోసుకు తింటానా? రూపంతో పనేమి లేదు... రూకలు సృష్టించే పుత్రుణ్ని ప్రసాదించండి స్వామి! వాడి చెమట, కన్నీళ్లు, లాలాజలం కూడా బంగారంలా మారిపోవాలి మరి ' అని కోరుకొన్నాడట మహారాజు . అట్లా పుట్టినవాడే సువర్ణష్ఠీవి.


వాడే గనక ఇంకా జీవించి ఉంటే మన ఆదాయప్పన్ను వాళ్ళకి నిండా బోలెడంత పని


హుష్ ! ముందు కథ విను! వాడినొకసారి దొంగలు ఎత్తుకెళ్ళారు. ఆశకొద్దీ బంగారంకోసం కడుపుకోసి చూస్తే నెత్తురు, మాంసం, పేగులూ తప్ప ఏమీ లేవు. చచ్చిన కొడుకును చూసి రాజుగారు ఏడుస్తుంటే నారదుడొచ్చి ఓదార్చాడు. ' శ్రీరామచంద్రుడి లాంటి మహానుభావుల్ని కోరుకోవాలి గానీ, బంగారం కోసం యావపడితే ఇట్లాగే ... చివరికి బూడిదే మిగిలేది ' అని బుద్ధిచెప్పి ఆ కొడుకును మళ్ళీ బతికించి పోయాడు నారదుడు.


బాగుంది. ఇంతకూ ఇవాళ నీకెందుకీ హరికథ హఠాత్తుగా గుర్తుకొచ్చింది!


పత్రిక చూస్తుంటే లంచాలను గురించి ఓ కథనం కంటబడిందిరా! కూరగాయలు, పెట్రోలు రేట్లు పెరిగి పోతున్నట్లు లంచాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయట! అవినీతి నిరోధకశాఖ పట్టిక ప్రకారమే పట్టుబడ్డ ఉద్యో గుల అక్రమార్జన నిరుడు సగం మెట్రోరైలు ప్రాజెక్టు ఖర్చంత ఉందిట! ఏసీబీవాళ్లు దాడిచెయ్యని, చెయ్యలేని సొమ్మంతా పోగేస్తే- ఏకంగా పోలవరం ప్రాజెక్టునే పూర్తి చెయ్యొచ్చునేమో! సమాచార హక్కు చట్టాలు, అన్నా హజా రేలు, అవినీతి నిరోధక శాఖలు, అడుగడుగునా విజిలెన్సు కమిషన్లు, కొరడాలు ఝళిపించే న్యాయస్థానాలు, జనాల చీదరింపులు.. ఎన్నున్నా... ఇదేందిరా పచ్చిగడ్డే పరమాన్న 'మనుకునే లంచాల పిచ్చి మనవాళ్లకు వదలకుండా పట్టుకుంది?


'లంచం- ఏంటి బాబాయ్... మరీ అంత మొరటుగా పిలుస్తావ్! ముడుపులు, నైవేద్యాలు, మామూళ్లు, చాయ్  పానీలు, విరాళాలు, నజరానాలు, ప్రసాదాలు అంటూ ఎన్నేసి నాజూకు పేర్లున్నాయ్! అయినా, ఇవాళే ఈ పద్ధతి కొత్తగా ప్రవేశించినట్లు తెగ ఇదైపోతున్నావ్! రోజూ నువ్వు నాకిది కావాలి.. అది కావాలి అంటూ చెంపలేసుకొనే ముందు దేవుడికి కొట్టే టెంకాయను ఏమంటారేంటి ? దేవుడే దేవేరి  అనుగ్రహం కోసం పారిజాతాన్ని అపహరించి మరీ సమర్పించుకోక తప్పింది కాదు . రాజులిచ్చే అగ్రహాలకోసం కాదూ కవులు ప్రబంధాలను అంకితాలిచ్చింది! భూమి పుట్టినప్పుడే బహుమానాలు పుట్టాయి బాబాయ్! ఆదాము అవ్వలచేత సంసారం చేయించటానిక్కూడా పాము ఆపిల్ పండును లంచంగా ఇచ్చుకోవాల్చొచ్చింది. 


అది వేరురా... చాకిరీ చేయడానికి నెలనెలా జీతాలు అందుకునే నౌకరీల్లోనూ రోజూ చెయ్యాల్సిన పనికి చాయ్ పానీలు  ఆశించడమేంటి?


నూలు పోగు అందించకపోతే చందమామ ఏమన్నా వెన్నెల తగ్గిస్తాడా ! చందమామకు ఆ పోగు అందం ఎట్లాగో .. కొన్ని సర్కారు పోస్టులకు బల్లకింది చేతులు ఆదో అందం. నువ్వు ఇందాక చెప్పావే హరికథ... సర్కారు పనివాళ్ళ బుర్రకథ ముందు ఎవరికీ వినపడదు. పిల్లాడిని బడికిపోరా అంటే నువ్వు జీడి కొనుక్కోవడానికి డబ్బులిస్తేనే పోతానంటాడు. నోరులేని గేదె నోటికి పచ్చగడ్డి అందించకపోతే పాల పొదుగుమీద చెయ్యి వెయ్యనివ్వదు. నోరున్న మనిషి మరి కట్టేసుకుంటాడా! ఇన్ని చెబుతున్నావు... నీ నాలిక మీద తేనెబొట్టు పడితే చప్పరించకుండా ఉండగలవా? డబ్బు వ్యవహారాల్లో మునిగి తేలేవాడు డబ్బునెట్లా  ఆశించకుండా బిగపట్టుకుంటాడు  బాబాయ్! 


గడ్డి తినడం మహా ఘనమైన లక్షణమని మరి చంకలు గుద్దుకోమంటావా నువ్వు! 


మేయడం కూడా  గొప్ప సృజనాత్మక కళే! ఇన్నేసి వేల మంది సర్కారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క సరసాదేవి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ లాంటివాళ్లే మనకు ఎందుకు గుర్తుం డిపోతున్నారంటావ్? జీతంమీదగాక మరీ గీతంమీదే మరలు బిగిస్తే సర్కారులో దస్త్రాల బళ్లు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలవు.. గుర్తుంచుకో! అమెరికాలాంటి అగ్రరాజ్యాలు కూడా చతికిలపడ్డ రోజుల్లో  మనా దేశార్థికం ఇంత చురుగ్గా ఉందంటే దానికి కారణం కార్యాలయాల్లో చేతులు కింద

పెట్టుకునే బల్లలు ఇంకా ఉన్నాయి కాబట్టే 


ఇంతకీ నువ్వనేది ఏందిరా! లంచాలు ఇలాగే పదికాలా లపాటు వర్ధిల్లాలంటావ్! 


అంతేకాదు... అక్రమార్జనను ఉద్యోగుల హక్కుగా పరిగణించాలి. సిటిజన్ ఛార్జుల మాదిరిగా ఆఫీసుల్లో ఈ పనికి ఇంత అని పబ్లిగ్గా రేట్లు నిర్ణయించాలి. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారిని గుర్తించి ప్రోత్సాహించాలి. ఆదాయపన్ను పత్రాల్లో జీతంతో పాటు గీతాన్ని ప్రకటించుకునే సంస్కరణలు అమలు చేయాలి. గీతాలమీద తగినన్ని రాయితీలు ఇవ్వాలి. అవినీతి నిరోధకశాఖ విజిలెన్సు కమిషన్లు వంటివాటిని వెంటనే రద్దుచేసి ఆ సిబ్బందిని నీతి నిరోధక కార్యక్రమాల నిర్వహణవైపు మళ్ళించాలి. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించిన పద్ధతిలోనే అక్రమార్జనను క్రమబద్ధీకరించే చట్టాలు వెంటనే అమలుచేయాలి . నేతలు నానా గడ్డ కరిచి సంపాదించుకొన్న మొత్తాలను దాచుకునేందుకు  తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాలు వంటివాటి నిధులను మళ్లించి వెంటనే తగినన్ని నేలమాళిగలను ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వ గిడ్డంగులను ఖాళీ చేయించి నల్లధనాన్ని దాచుకునే సౌకర్యం కలిగించాలి. లంచగొండులకు తగిన రక్షణ కల్పించగలిగితే విదేశాల్లోని మన నల్లధనం మొత్తం మనదేశంలోకే ధారాళంగా ప్రవహిస్తుంది. అప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతులున్న దేశం మనదే అయితీరుతుంది. ఏమంటావ్! 


ఇంకేమంటాను. నా మనసులోని మాట చెప్పాలంటే నువ్వు నాకు ఒక అయిదొందలు ఆమ్యామ్యాగా అచ్చుకోవాలి. 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 





Thursday, January 13, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక మాయలోళ్లు రచన కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 21-01-2014 )


 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


మాయలోళ్లు 


రచన కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 21-01-2014 ) 


కంటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని మొత్తానికి ప్రస్తుతానికి నడుస్తున్నదంతా టోపీ రాజకీయమే.


'పదమూడు నెలలు తిరక్కుండానే ఆమ్ ఆద్మీకి అధికారం కట్టబెట్టింది హస్తిన ప్రజ. అప్పటి బట్టి  బడానేతలందరి దృష్టి హ్యాట్ ట్రిక్ పైకే మళ్లింది. ఇప్పటిదాకా అమాయకుల నెత్తికి మాత్రమే టోపీలు . ఇప్పుడు పోటీ అంతా తమ నెత్తిన తామే పెట్టుకునేందుకు .  తిరగడానికి . జనాల టైపు  టోపీలు  కనిపించవు . సొంతానివి మాత్రం తళతళా మెరుపులు ! 


ప్రారంభంలో మనవి తలపాగాలే. టోపీ పరిచయం తెల్లవాడితో. ఓడ దిగీదిగగానే బుర్ర మీది  'టోపీ' ఎత్తి భారతీయులను బుట్టలో పడేశాడు. సరకులు అమ్ముకుంటామని వచ్చి దేశం ఆసాంతం  మురుకుల్లా నమిలేశాడు. తెల్లవాడి పీడా  వదిలినా, వాడి 'టోపీ' మాయ మాత్రం మన నెత్తిమీదనుంచి దిగటంలా! 


బాపూతో  పాటు దక్షి ణాఫ్రికానుంచి దిగుమతయిన  టోపీ? పాపం, బాపూజీ ఆ టోపీ వాడకం  నిరాడంబరానికి గుర్తు.  ఆయన గుర్తుకు అని చెప్పుకొనే శిష్యుల వాడకానికి రకరకాల కోణాలు.  మాత్రం . . ' టోపీ పార్టీ ఇక వద్ద' ని మొత్తుకున్న పెద్దాయనకే చివరికి ' టోపీ ' పెట్టిందాయన శిష్యగణం ! 


పురానా జమానాలో పనామా కాలువ తవ్వే జనాలకు ఎండపొడకు రక్షణగా పుట్టిందీ టోపీ . టోపీ పెట్టుకు తిరిగే  చరిత్ర క్రీస్తుపుట్టక పూర్వానిది. మెక్సికోలో పురాతన కట్టడాలు  తవ్వేటపపుడే ఓ శవం  నెత్తి పై టోపీ ప్రత్యక్షమయిందని చరిత్ర. చచ్చినా వదలని టోపీ గురించి  ఎంత చెప్పినా తక్కువే! 


  ప్రతి బడుగుజీవికి నెత్తిన ఓ టోపీ  పాలసీ మన దగ్గర. నూట ఇరవై రెండు కోట్లకు పైబడిన జనాభా ! ఎన్ని రకాల టోపీలిక తయారు కావాలి! కాబట్టే  మన దగ్గర  కనిపించేటన్ని  టర్కీ టు ఇటలీ మార్కు మొత్తం కూడినా  తక్కువే! టోపీలకు బ్రిటన్ అమెరికాలు  మహా ప్రసిద్ధి.   మన దగ్గర మాత్రం ' ఇటలీ' మేడ్ కి మహా రద్దీ! 

టోపీలూ  హ్యాట్లూ మన టైపు సంస్కృతీ సంప్రదాయాలకు సూటు కాదు, కానీ టోపీలు పెట్టడం .. పెట్టించుకోడంలో మన రేంకే టాపు . 


విష్ణుమూర్తి సుదర్శనం  ప్రయోగించిన చివరి క్షణంలో గాని ప్రత్యక్ష మయేది కాదు. మన నేతలు పెట్టే టాపీలు అలాకాదు. దెబ్బై పోయిన తరువాతనే నెత్తికి పెట్టారని తెలిసేది!


 ఇంద్రజాలికుడు పి.సి.సర్కారు పిల్లపిప్పర మెంటు బిళ్లల నుంచి, ఆడపిల్లలకు  బొట్టుబిళ్లల దాకా ఏది కావాలన్నా  టోపీ నుంచే తీసిచ్చేది! మనా సర్కారు ముందు  పి.సి సర్కారు మాయ బలాదూర్ .  సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి హామీలు, ఆహార భద్రతలు, అవినీతిని అడ్డుకునే చట్టాలు, అర్హులకంటూ   ప్రదానం చేసే భూ   పట్టాలు... గట్రా గట్రాలు అడక్క  ముందే టక్కున టోపీ నుంచే  తీసిచ్చేస్తారు ! 


కళ్యాణకట్టల దగ్గర  అట్టముక్కల  పైన గుండుకు ఓ నామం ఉచితం, నామానికి ఓా టోపీ ఉచితం అని రాసుంటే చూసి నవ్వుకుంటాం . సర్కారు చేసే మాయలను  మాత్రం  మా బాగా నమ్ముకుంటాం . 'ఓటు' పత్రాన్ని  భక్తిగా బ్యాలట్ పళ్లింలో  పెట్టి మరీ  నేతలకే దేవుల్లాకు సమర్పించు కుంటాం. గుప్తుల బ్రాండ్ స్వర్ణయుగం కోసం కళ్లు  రెండు కాయలు కాసేలా ఎదురుతెన్నులు  చూస్తుంటాం . గుప్తులకాలంలో  కనిపించని టోపీలపై  మన పాలకులకు మహమోజని ఆలస్యంగా గుర్తిస్తాం . గుడ్లు అప్పుడు వెళ్ల బెట్టేస్తాం!  


రామాయణ కాలంలో భరతుడు అంత "మీద పెట్టి అమాయకంగా అడవులు పట్టిన అన్నగారి పాదుక లను పట్టుకొచ్చి సింహాసనం పాలన సాగించాడు. అదే కథ ఈ కలికాలంలో కనక పునరావృతమై ఉంటే పాదుకులకు బదులు 'టోపీ' కూర్చుని ఉండేదేమో సింహాసనంమీద. జటోపీ లేకుండా రామాయణమైనా, మహాభారతమైనా సరే రక్తికట్టే కాలం కాదిది. కమలనాథులూ కాషాయం టోపీల మీద పడ్డారంటే కథ ఎండాకా ముదిరిందో అర్థమవుతుంది.


సొంత నెత్తికి గొప్పగా కనిపించేటట్లు హ్యాట్లు తగిలించు కుని ఊరేగడం, ఓటేసేవాడి నెత్తికి ఏమాత్రం నొప్పి తెలీ కుండా కుచ్చుటోపీ తగిలించడమేగా పటాటోపం' అంటే జనం సొమ్ము లక్షల కోట్లు కుమ్మేసి ఆ కేసుల నుంచి నిక్షేపంగా బయటపడటానికి దేశాలు పట్టుకు తిరిగే యువనేత ఓదార్పు పేరుతో మంది నెత్తికి పెడుతున్నవి టోపీలు కావూ? పొద్దస్తమానం నిజాయతీ గురించి ఉపన్యాసాలు దంచే ఆ పెద్దమనిషి నిజానికి ఎన్నికల గుర్తుగా ఎంచుకోవాల్సింది 'టోపీనే


మోరెత్తి కాస్త అటు హస్తినవైపు ఓపిక చేసుకుని చూస్తే తెలుస్తుంది- 'టోపీ' రాజకీయాలెంత పటాటో పంగా నడుస్తున్నాయో!


'అమ్మ' ఏడుపు' సెంటిమెంటు పనిచెయ్యలేదు. ఇక లాభం లేదని యువరాజు కిరీటం ఇంట్లో దాచేశాడు. విరాటపర్వంలో, ఉత్తర కుమారుడి మాదిరిగా నవ్వూ కోపం కలగలిసిన కొత్త మొహంతో, కొత్త ఆమాద్మీ రకం టోపీతో జనంలోకి రాబోతున్నాడు. సహచట్టం, ఆధార్కార్డు, విద్యాహక్కు ఆహార భద్రత టోపీలు: నప్పలేదని, వంటగ్యాసు బండలు అవినీతి నిరోధక


చట్టాలు అంటూ కొత్తరకం టోపీలు బుట్టలో పెట్టు కుని ఓట్లకోసం బయలు దేరుతున్నాడు. బట్టతలకు దువ్వెనలు అమ్మేవాడికి పోటీగా బట్టతలకు టోపీ పెట్టడా నికి వస్తున్నాడు.


కనిపించే టోపీలు ఏవి పెట్టుకున్నా పరవాలేదు. కని పించని టోపీలతోనే సామాన్యుడు భద్రంగా ఉండాలి. ఎన్నికలు దూసుకొస్తున్నాయి. 'టోపీ'లొస్తున్నాయి.


కర్లపాలెం హనుమంతరావు




 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 


పదండి ముందుకు.. పదండి తోసుకు! 


-కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


ఆఫీసుకు పోగానే, 'ఆలస్యమయిందే' అనడి గాడు కామేశం . 


' బండిమొండికేసింది. పాద యాత్ర చేసొచ్చా' అన్నా. 


అలాంటి మాటలే. అన్నందుకు బాసు చేత చచ్చే చివాట్లూ తిన్నా. 


'ఎప్పుడూ విమానాల్లో ఎగిరేవాడు ఎప్పు డైనా రెండడుగులు నడిస్తే జాలి పడతారు. క్రీస్తు పుట్టక ముందెప్పుడో అయిదొందలేళ్ల కిందట సిద్ధార్థుడు మహారాజు కొడుకై ఉండీ రథం దిగి నడిచాడని మనమిప్పటికీ గొప్పగా చెప్పుకుంటాం . పల్లెల్లో ఆడవాళ్లు  నీళ్ళ కోసం మైళ్లకొద్దీ నడుస్తారు.... ఎవడికి పట్టింది? డొక్కుబండి మీద తిరిగే నీబోటివాడు.. బోడి.. నడిస్తే ఎవడిక్కావాలి. పాకితే ఎందుకు జాలి? నువ్వేమన్నా వై. యస్.వా.. ఎమ్మెస్ బాసువీ  నీ వెంటబడి మరీ పొగట్టానికి' అన్నాడు కామేశం.


యస్. వై.యస్.. అంటే గుర్తొచ్చింది. పేపర్లలో వారం పది రోజుల్నుండీ ఆయన్దే  ఊసంతా. 


ఊసుపోక కాంటీన్లో ఆ విషయమే కదిపా.  చర్చ అంటే కామేశం రెచ్చిపోతాడు. పైపెచ్చు హస్తం అభిమాని.


''అందుకే 'దేశం' ఉసూరుమంటుంది. హనుమంతుడు. కుప్పిగంతులేస్తుంది. మంత్రదండముందా అని మంత్రులు దండె త్తుతుంది. వై .. ఎప్పుడనాలో... యస్.. ఎప్పు డనాలో తెలిసిన గడుసువాడు నాయకుడైతే విపక్షం, స్వపక్షంలోని విపక్షం కూడా పక్ష పాతం లేకుండా ఏకపక్షంగా ఇలాగే పక్ష వాతం పాలబడుతుంది. మొత్తానికి గురు వును ముంచిన శిష్యుడు మా'వాడు' ' అన్నాడు కామేశం కులాసాగా. 


'గురువెవరు గురూ? '


' పేరెందుకులే.. బాధపడతావు. పైసా ఖర్చుపెట్టి పది రూపాయలు ప్రచారం చేసు కొనే విద్యకు మెరుగు పెట్టి అసలు ఏ పెట్టు బడీ లేకుండానే కీర్తిని రాబట్టే కొత్త టెక్నిక్  కనిపెట్టాడే ఆయనే శిష్యుడు. నడక తనది. తిమ్మిరి 

సీ యమ్ ది.  పాదాలు తనవి . బొబ్బలు తనవాళ్లవి.  పెడబొబ్బలు పెడుతున్నారుగా.. వినపట్టంలా? ' ముసిముసి నవ్వులు నవ్వాడు. 


' అవును హస్తం పాదయాత్ర వట్టి సర్కస్ ఫీట్' అంటున్నారు చాలమంది' 

అన్నా అక్కసుకొద్దీ. 


ఆయన నడక పడక అలా అంటున్నారు. గానీ, పాదయాత్ర సూపర్ హిట్. దిగ్విజ "యంగా నడుస్తున్నది మూడో వారం... ఓవర్ టేక్ చెయ్యాలంటే ఒహటే దారి. పరిగెత్తే యాత్ర పెట్టుకోవటమే! 


' వైయస్ కీ  వయసులో నడవాలని మనసెందుకైంది బాస్? 


సిటీలో నీళ్ళు లేవు. కరెంటు లేదు. పొల్యూషన్. ఎండలు మండిపోతున్నాయి. రైలెక్కుదామంటే పట్టాలు తప్పుతాయని

భయం. బన్సెక్కుదామంటే లగేజ్ ప్రాబ్లమ్. కార్లలో షికారు చేసే రోజులా..  కావు. అసెంబ్లీ సీజన్ అయిపోయింది. కరవుకు తప్ప మీడియాలోదేనికీ కవరేజీ లేని రోజులు. ఏవరేజిగా ఆలోచించగల ఏ నాయకుడికి అయినా  వచ్చే ఐడియానే ఈ అనంత ఆక్రందన! ... చూశావుగా ఎంత స్పందనో! దటీజ్ అవర్ బాస్' 


'అవునవును ఇది చూసే సీమ అవేదన.. కోస్తా అవస్త... గట్రాలు బైలుదేరాయని  జైలుదేరాయని నా థీరీ.  కరవు రోజుల్లో ఎవరు  పల కరించినా జనం బావురుమనటానికి సిద్ధంగా ఉంటారనేదే వీటి వెనక సిద్ధాంతం  . అవునా?' 


' దేవుడు బుట్టలో ఉన్నాడనే యమునా నది వసుదేవుడికి దారిచ్చింది. ప్రతిపక్షం బుట్టలో పవరుందని పసిగట్టింది కనకనే 'వార్ '  అయినా.. తె.రా.స. వారయినా... ఎవరైనా దానికి దారిస్తున్నది. బుష్ కా  మాత్రం పుష్ ఉండుంటే దండయాత్రకు బదులు ఇరాకులో పాదయాత్ర చేస్తుండే వాడు. ఏ చిరాకు లేకుండా చవురు బావులు చులాగ్గా దక్కుండేవి. మీ ముఖ్య

మంత్రిగారిరవైనాలుగ్గంటలూ నిద్రపోకుండా... నిద్రపోనీయకుండా 'జన్మభూమో అని వెంటబడుతుంటే జనంలో చైతన్యం మరీ ఎక్కువైనట్లుంది... ప్రతిపక్షం వెంట బడి పోతున్నారు.' 


'అవును స్పూర్తి సి.యమ్ ది. కీర్తి వై.యస్ ది . ప్రజల వద్దకు పాలన చివరి సీనులో ప్రజల వద్దకు ఆలనగా ఎలా మలుపు తిరిగిందో చూడు. దటీజ్ పొలిటిక్స్.. ' 


' కరవులో రాజకీయం సబబా గురూ !' 


' పడనివాళ్ళు అలా అంటుంటారుగానీ నడక పవరు నీకేం తెలుసు? పదవులు పోయిన పాండవులకి పాదయాత్ర చేస్తేగాని మళ్ళీ రాజ్యం

దక్కలేదు. ఉన్న ఊళ్ళో ఉప్పు దొరక్కటండీ  గాంధీగారు ' పదండి దండిగా! 

ఉప్పు చేద్దా' మని దండియాత్రకని బైలుదేరిందీ! ప్రజల్లో స్థానం కోసం అప్పుడప్పుడూ ఇలాంటి డప్పు ప్రస్థానాలు, ప్రజాప్రస్థానాలు..

పుట్టుకొస్తుంటాయి మహాశయా! మావో  మహాశయుడు  కూడా డెబైయేళ్ల కిందట ఎన్నో వేలకిలోమీటర్లిలాగే నడిచాడయ్యా మహానుభావా...! ' 


' పొద్దుపొడిచింది మొదలు పొద్దు గడిచిందాకా ఇళ్ళల్లో ఇల్లాళ్లు తిరిగేదానికి మీటరేస్తే ఇంతకన్నా ఎన్నో వేల రెట్లు తిరిగుంటారు బాస్: ఇదో పెద్ద మేటర్ కాదు. శాసనసభల్లో ముక్కలు ముక్కలుగా చేస్తారే మన నాయ కులు... వాకౌట్లు..., వాటినన్నింటినీ కలిపి కూడితే మావో ప్రస్థానానికన్నా మరో మీటర న్నా పొడుగుండుంటుంది. ' 


' పాదయాత్రలెన్ని యోజనాలున్నాయన్నది కాదు ప్రశ్న.. జనా

లకెన్ని ప్రయోజనాలున్నాయన్నది పాయింట్. ' 


' రాముడు నడిచిన బాటలో రాయిక్కూడా ప్రాణం వస్తుంది. మా పెద్దాయన నడుస్తున్న బాటలో ఊళ్లకి ఊపిరి వస్తుంది. అన్న నడిచే బాటలోని ముళ్లని లక్ష్మణస్వామి ముందే ఏరి ' పారేసినట్లు... మా నాయకుడు నడుస్తున్న దారిలోని పెండింగ్ పన్లన్నింటినీ ప్రభుత్వం ముందే పూర్తిచేస్తున్నదా లేదా?  అదే పెద్ద ప్రయోజనం. పేపరు చూట్టంలా? '  అన్నాడు ఎద్దేవాగా. 


' అది చూసే మా దిబ్బపాలెం మామయ్య ఆ పెత్తనం మీదేసుకుని నెత్తి మీదకు తెచ్చుకున్నాడు' అన్నా చివరికి. 


' ఎవరా దిబ్బపాలెం మామయ్య? ఏమిటా కథ? ఎప్పుడూ చెప్పలేదే? ' అనడిగాడు కామేశం. 


' ఇప్పుడు చెబుతున్నా. విను. మా మామయ్య దిబ్బపాలెం ఉప సర్పంచి.  నీకులాగే పెద్దాయనకు పెద్ద అభిమాని.  రూట్ లేకపోయినా పాలెం మీద నుంచి పాద యాత్ర ఏర్పాటు చేసుకున్నాడెలాగో తంటాలు పడి . ఉప్పందిన అధికారులు ఏం చేశారో తెలుసా? రాత్రికిరాత్రి ఆత్రంగా ఊరి బైటి  చెత్తనంతా ఊళ్ళోకెత్తిపోసి... పెద్దా యన దారి మాత్రం ఫినాయిల్ పెట్టి కడి గేసి కూర్చున్నారు. ' 


' నమ్మేదేనా? .... ఏ పేపర్లో రాలేదే? ' 


' అన్నీ పేపర్లో రావు. అడుగో.... మా మామయ్య ఊళ్ళో వాళ్లు తంతారని మా ఇంట్లో దాక్కున్నాడు. అడుగు! ' అన్నా  అప్పుడే మా ఆఫీసుకొచ్చిన మా మామయ్యని చూపించి . 


'నిజమేరా అబ్బాయ్..' అని అడక్కుం డానే అన్నీ ఆయనే చెప్పుకొచ్చాడు 'సర్ పంచి పదవికి తాడేస్తే.. ఉన్న ఉప సర్ పంచి పదవి ఊడినట్లయింది. నా పని. ఎన్నికలయితేగాని అన్ని విషయాలూ తేలవు' అన్నాడు దిగులుగా.


' పోనీలే అంకుల్... ఓడితే మాత్రమేం.. ఒలింపిక్స్లో మారథాన్ రేసని ఉందొకటి దానికి పనికొస్తుంది మన కాంగిరేసు' అన్నాడు కామేశం ఓదార్పుగా.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


Thursday, December 30, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక చట్టం నిజమైన చుట్టం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


చట్టం నిజమైన చుట్టం 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 ) 



" వినియోగదారుడు అంటే ఎవరండీ" అని అడిగా మా వారిని ఇవాళ పొద్దున. 


 అటునుంచి సమాధానం లేదు. 


ఒకటి అడిగితే పొంతనలేకుండా పది జవాబులు చెప్పే మన రాహుల్ బాబు  జబ్బు కొద్దిగా మా వారికీ కద్దు . అయినా ఏ బదులూ లేకపోయేసరికి కంగారని పించింది. దాంతో లోపల గదిలోకి తొంగి చూశా. ఆయన యోగాలో  ఉన్నారు. 'శవాసనం' వేస్తుండబట్టి మన ప్రశ్న చెవిలోకి వెళ్లినట్లు లేదు. సమాధానం తెలియక అలా శవాసనం నటిస్తున్నారా.. చెప్మా ? 


ఎంతైనా మగవాడు.. మొగుడుగారు.  చట్టసభల్లో ప్రతిపక్షాలు నిలదీసి అడిగినట్లు అడిగితే భర్తగారి అహం దెబ్బతీసినట్లు అవుతుందేమోనన్న సందేహం నాది. అందుకే నా ప్రశ్నకు నేనే సమాధానాలు వెదుక్కునే పనిలో పడ్డా... పేపరు చూస్తూ:


' వినియోగదారుడు' అంటే మరీ బరువైన పదంలా ఉంటుంది. నాలాంటి మధ్యతరగతి ఇల్లాలికి అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ' వాడేవాడు' అనుకోవచ్చేమో . వాడే .. వీడు' అని ఇదివరకో అపరాధ పరిశోధన నవల చదివా. దానికి ఈ శీర్షికకు పోలికేమన్నా ఉందా?


అదేదో పతివ్రతల ప్రతంచేసి నారదులవారికి కృష్ణమూర్తిని దానం చేస్తుంది గదా శ్రీకృష్ణ తులాభారంలో సత్య భామ! మళ్ళీ మొగుణ్ని కొనుక్కోవడానికి ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ తక్కెట్లో  పోసినా బరువు తూగదు . మా వారికి మల్లే ఆ నల్లనయ్యకూ ఉదయం పూట వ్యాయామం అంటే మహాబద్ధకం అనుకుంటా. మరి, రుక్మిణీభామ  వచ్చి ఇల్లా మొక్కి అల్లా ఒక్క తులసాకు వేసీ వెయ్యగానే ఎలా తూగినట్లు? అంతా కృష్ణలీల' అను కుంటాంగానీ, మరీ లోతుగా ఆలోచిస్తే ఇందులోనూ ఎక్కడో 'మాయ' కొట్టడం లేదూ!


తూకాలూ కొలతలూ ఉన్నచోట ఈ మాయా మర్మం తప్పనిసరేమో! పెట్రోలు బంకుల్లో ఈమధ్య ఇట్లాంటి మాయలేగా బయటపడి పెద్ద రభస జరిగింది ! 


మా వారితో కలిసి బండిమీద బయటకు వెళ్లినప్పుడు నేను ఈ బంకుల్లో పెట్రోలు పోసేటప్పుడు చూస్తుండేదాన్ని. ఈయనగారు  కనీసం మీటరు వంక చూసి ' ఇదేమిట' ని గట్టిగా గదమాయించడానికీ   మహా మొహమాటం! అక్కడికీ  నాకు అనుమానం వచ్చి అడగబోయినా, నా నోరు మూయించడానికి మాత్రం గట్టిగా దబాయించేస్తారు . కొనే వాళ్లం మంచి సరకు కోరడం మన హక్కు కాదూ!


వారానికోసారి నేనే రైతుబజారు దాకా పోయి కూరగాయలు అవీ తెచ్చుకుంటా.  ఉన్నంతలో మంచివి ఏరుకుని, బేరమాడి కొనాలంటే ఈయనగారివల్ల కాదన్న సంగతి మా పెళ్లయిన కొత్తలోనే తేలిపోయిందిలేండి. 


నట్టింట్లో సోఫాకు చేరగిలబడి టీవీ చూస్తూనో, పేపరు తిర

గేస్తూనో, చట్టసభలో ప్రతిపక్షనాయకుడి మోడల్లో  తెగ రెచ్చిపోతే- మంచి సరకు మనింటికి వస్తుందా? 


నోటీసూ పాడూ ఇవ్వకుండానే అప్పటికప్పుడు ఇంటి అద్దె హఠాత్తుగా వంద పెంచినా సరే పళ్లికిలించుకుంటూ ఇచ్చుకుంటారేగానీ ' ఇదేంటీ అన్యాయం. ఇలా మూణ్లెల్ల కోసారి చొప్పున పెంచుకుంటూ పోవడానికి మీకేం హక్కుంది' అని కనీసం మాట వరసకైనా అనరే! 


 నాకైతే కడుపు మండుతూనే ఉంటుంది. నాలుగు దులు

పుదామనే ఉంటుంది. కాని, ఇద్దరు మగాళ్ల మధ్య

మనం నోరు చేసుకోవడం మర్యాద కాదని మౌనం

వహిస్తా.  మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్

అవస్థే నాదీనూ! 


ఇలాంటి వ్యవహారాల్లో మగవాళ్లకన్నా మన ఆడంగులే ఎంతో మెరుగు. బేరాల విషయాల్లో ఒక పట్టాన రాజీపడనే పడం. మా

ఫ్లాట్స్ మహిళాబృందం మొత్తం దుకాణాలకు వెళ్లినప్పుడు

చూడాలి తమాషా!  పక్కపిన్నుల్నైనా సరే పదిసార్లు అటూ

ఇటూ వంచి చూడందే ఎంచుకోం. ఇక చీరెల బేరమైతే సరే

సరి ! ఉచిత కానుకలు, భారీ డిస్కౌంట్ల విషయంలో

మహా బలహీనులమైపోతుంటాం. ఆ విషయంలో మాత్రం మనం అబలలం! మరేం చెయ్యాలి చెప్పండి! లోకం చూస్తే విజయావారి ' మాయాబజారు' మార్కు, విపణి వీధి అంత కంగాళీగా ఉందని నిన్న ఎక్కడో చదివా. తాను సుఖంగా బతకడం కోసం లోకంలోని ఏ వస్తువునైనా తెగనమ్మడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు.  మరి అందుకే ఉచితమనే మాట

ఎంతగా వినిపిస్తే- కొనే విషయంలో అంత ఎక్కువ

జాగ్రత్త తీసుకోవాలి మనం.


ఈ ఎన్నికల్లో చూస్తున్నాంగా ! అమూల్యమైన ఓటును,

సొంతం చేసుకునేందుకు  ఎంత ధరైనా  పెట్టే దొరలు

ఊళ్ల మీదపడి తెగ తిరిగేస్తున్నారు. ప్రజాస్వామ్య

మంటే ఒక పెద్ద బజారులాగుంది. ఎన్నికలు వచ్చినప్పు ఎన్నో పార్టీల దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో

అభ్యర్థులు అమ్మకానికి పెట్టిన సరకు కొనే ఓటర్లం

ఎంత అప్రమత్తంగా ఉండాలి?


అందమైన రంగుల కాగితాల్లో చుట్టి ఆకర్షణీయంగా

తయారుచేసిన ప్యాకెట్లు గదండీ ఈ పార్టీల మేనిఫె

స్టోలు! 


ఒక పార్టీ ఉచిత విద్యుత్ ,సగం ధరకే నీళ్లు, ఖర్చు లేని చదువులు, కూర్చోపెట్టి మేపే ఆహార పథకాలు.. గట్రా గట్రా  ఇస్తామంటుంది. ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఘడియ నుంచే వరస పెట్టి ఉపకార వేతనాలు, పసివయసు నుంచే పింఛన్లు, ఉచితంగా గుండె ఆపరేషన్లు, సాగు చేసుకునేందుకు  వ్యవసాయ భూములు .. లాంటివి సవాలక్ష ఇచ్చే దస్త్రాల మీద సంతకాలు చేసుకుంటూ పోతామంటుంది. ఇంకో పార్టీ ఇదివరకు చేసిన అప్పులు కొట్టిపారేస్తాం. ముందు ముందు కొట్టిపారేసే అప్పులు కొత్తగా ఇప్పిస్తాం. పొరుగు రాష్ట్రాలలో  పారే నదులకు గండ్లు  కొట్టిస్తాం .. అంటూ హామీలు గుప్పిస్తుంది. మావారు దినం తప్పకుండా పారాయణం చేసే ' శ్రీశ్రీ సంధ్యాసమస్యలు' లాంటి సందిగ్ధంలో పడిపోతున్నాడు సామాన్య ఓటరు. 


బెర్లిన్ గోడముక్కలు కూడా మన వాడ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాయి. మరిక సందిగ్ధంలో పడిపోవడం వినియోగదారుడి ముఖ్య లక్షణం లాగుంది. 


పెళ్లికొడుకుల విషయంలో ఆడపిల్లలు ఇలాగే అయోమయంలో పడిపోతుంటారు. పెళ్లిచూపులకొ చ్చిన వాళ్ల  లోపలంతా  ఎంత లొటారంగా ఉందో కనిపెట్టకుండా పైన పటారం చూసి పడిపోతే జీవితాంతం చెత్త సరకుతో సర్దుకుపోవాలి సుమా! 


పటాటోపం చూసే పిల్లల్ని ఈ సోకాల్డ్  ఈ - స్కూళ్లల్లో పడేస్తే, బీటెక్కులు పూర్తిచేసినా బిడ్డలకు బయోడాటాకు స్పెల్లింగైనా రాదు.


పట్టాలు, భూమి పట్టాలు, బిరుదులు, బాబాల దగ్గర బంగారం, శివలింగాలు, రాజధాని వంకతో రాళ్ల దిబ్బలు, సర్వేల పేరుతో అనుకూల ఫలితాలు, విశ్లేషణల నెపంతో విపక్షాల  మీద చిమ్మేందుకు విషపు వార్తలు, చివరికి బిడ్డల్ని  కని పెట్టేందుకు అమ్మ కడుపులు కూడా అమ్మ కానికి దొరుకుతున్న వ్యాపార యుగమిది. అందుకే ' వాడే'  వాడు, అదేనండీ ' వినియోగదారుడు ' ఎంతో వివేకంతో విచక్షణను ఉపయోగించాలిప్పుడు. 


అందరూ మా వారంత అమాయకంగా ఉంటే, అనక మా సంసారమంత సంబడంగా  తయారవుతుంది వ్యవహారం.  బజారులో వినియో గదారుడే నిజమైన రాజు. ఆ రాజాధి రాజు  వినియోగదారుడికి ఎన్నో హక్కులుంటాయిట. 


ఏది మేలైన సరకో తెలుసుకునే హక్కు, కొన్న సరుకు  మన్నికైందనీ, ముందు ముందు మన మెడకు గుదిబండగా మారదని అమ్మేవాడి నుంచి భరోసా పొందే హక్కు, 'ఐఎస్ఐ' ' ఆగమార్క్' ప్రమాణా లకు తగ్గలేదని నిర్ధారించుకునే హక్కు, ఎన్నో రకాల నుంచి మేలురకాన్ని మాత్రమే కోరుకునే హక్కు. ఇట్లా!  నోరు నొక్కుకుని కూర్చుంటే ఎన్ని హక్కులుంటే మాత్రం.

ఏం ఉపయోగం? 


 ఉచితంగా వస్తుందని, సగం ధరకే దొరుకుతుందని, కంటికి నదురుగా ఉందని, పక్కింటి పిన్నిగారు కొన్నదనీ మనమూ తొందరపడి అమ్మేవాడి మాయలో పడిపోతే  కష్టమేసుమండీ!  


 మా వారస్తమానం అలా కాయితాల మీద వూరికే గీకినట్లు    'వినియోగదారుడికి హక్కుల చట్టం '  వూరికే రాలేదు.  ఆ చట్టం..  ' వాడే ' వాడికి నిజమైన చుట్టం సుమండీ! 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 15-03-2014 ) 

ఈనాడు- హాస్యం - వ్యంగ్యం - గల్పిక ఎన్నో దృష్టాంతాలు - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 200


 




ఈనాడు-  హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

ఎన్నో దృష్టాంతాలు 


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 


పరమాత్ముడైనా ఆ పరంధాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అతని పాదుకలు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండానే  దర్జాగా అయోధ్యా సింహాసనాన్నెక్కి కూర్చు న్నాయి! అదృష్టమంటే అదే! 


లక్కుంటే  ఎడారిలో ఉన్నా ఏనుగు వెదుక్కుంటూ వచ్చి గజమాల మెళ్లో వేసేస్తుంది. దీన్నే 'తంతే బూరెల బుట్టలో పడటం' అంటారు. అలా పడాలని బుట్ట ముందు నిలబడి తన్నించుకున్నా తలరాత బాలేక పోతే  పక్కనున్న బురదలో  పడొచ్చు.


' అదృష్టం అదృశ్యం అప్పాచెల్లెళ్లు . రెండూ కంటికి కనిపించేవికావు . దీనికి దృష్టాంతాలేగానీ సిద్ధాంతాలుండవు. 


అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలం మీద దిగేముందు ఇరవై నిమిషాలకు సరిపడే  ఇంధనం మాత్రమే మిగిలుందట. అదృష్టం అట్లా కలిసిరావాలి. అది కలిసి రావాలని   నిర్బంధంగా పెట్టుకునే  పచ్చలరాయి తినే పచ్చడన్నంలో కలిసిపోయి గొంతుకు అడ్డంపడి చచ్చినా చావచ్చు. 


ప్రారబ్దానికి  ఏ శబ్దార్ధకౌముదీ అసలైన అర్థం చెప్పలేదు. ఖర్మానికి ధర్మాధర్మ విచక్షణలుండవు.  'గీత ' చెబుతూనే ఉంది గదా.. పూర్వజన్మ సుకృతమ నేది ఉందే... అది ఏ నిర్వచనానికీ అందనిదని .


టైమ్ బాగా లేకపోతే భోలకప్పూర్ నల్లా నీరే కాదు.... మినరల్ వాటరూ కాలకూటమైపోతుందట! ఏదేమైనా రాజకీయాలు పత్తి మార్కెట్ల మాదిరిగా తయారయ్యాయనేది నూటికి నూరుపాళ్ళు నిజం.  జనాలని నమ్ముకోవాల్సిందిపోయి, అభ్యర్థుల జాతక చక్రాలను నమ్ముకుంది మొన్నటి ఎన్నికల్లో జయలలితమ్మాళ్: మన దగ్గర ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తం పార్టీ చీట్లు తీసినట్లు!  గోడదూకే వాళ్లెక్కువైపోతున్నారని గోడను మరింత ఎత్తుగా కట్టుకుంది  ఓ జనం పార్టీ.  ఓటమికి గుర్తు కలిసి రావటంలేదనుకుంటోందేగానీ , జనంలో గుర్తింపులేదని ఇంకా గుర్తించలేకుండా ఉంది ఇంకో కొత్తపార్టీ! 


నేతల తలరాతలను తేల్చేది నిజానికి అయిదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ, ఎత్తులూ తాయెత్తులూ కానేకాదని ఇన్నేళ్లకైనా  ప్రజాప్రతి నాయకులనుకునేవాళ్ళ కళ్లు తెరిపిడి పడకపోవడమేమిటి! 


రోజులూ అట్లాగే ఏడ్చాయి. ఎన్నికల్లో గెల్చినోడు సరిగ్గా  ప్రమాణస్వీకారం చేసే రోజే ప్రాణాల మీదకు తెచ్చుకుంటే , యావజ్జీవం పడినవాడు దర్జాగా బయటకొచ్చి పచ్చి చీకటి  వ్యాపారం  చేసుకుంటాడు. రాసిపెట్టుంటే చర్లపల్లిలో ఉన్నా బిర్యానీ పొట్లాలు, సిమ్ కార్డులు సరఫరా ఆగవు ! నూకలు చెల్లిపోతే  గోకులాచాట్ కెళ్ళినా ప్రాణాలు పోతాయిమరి ! దేవుడు దయతలచి ' ఊ ' అన్నా పూజారి పుణ్యముంటేనేగాని ప్రసాదమైనా దక్కని ఈ కాలంలో ముందు పూజారిగారి మనసు మనవైపు మళ్లటమే  అసలు అదృష్టానికి సిసలు దృష్టాంతం.  


కాలం కలిసిరాదనుకో !  పెట్టుకున్న  'నానో' కారు ఫ్యాక్టరీకీ  రెక్కలొచ్చి ఎటెటో ఎగిరిపోతుంది! చేటుకాలం తోసుకొస్తే జైకొట్టిన చేతులే చెప్పులు విసిరేస్తే చేటు కాలం  దాపురించింది వేరే చెప్పాలా? అందుకే అదృష్టం మీదందరికీ కన్ను . అదృష్టమేమన్నా మన గర్ల్ ఫ్రెండా, చప్పట్లు కొట్టి పిలిస్తే 'హాయ్|  అంటూ చప్పునొచ్చేసి వచ్చి ఒళ్ళో వాలిపోవటానికి!


సోనియాజీ 2004లో ప్రధాని పదవికి మన్మోహన్ సింగు గారిని సూచించింది. అప్పటికి  ఆయన లోక సభ  సభ్యుడు కూడా కాదు. దేశానికి సేవ చేయాలని రాసిపెట్టి ఉంది. అంచేతనే ఆయన అంత పెద్ద నేతయారు. 


రాసిపెట్టి ఉంటే ఎక్కడున్నా దక్కుతుందనే సిద్ధాంతం నమ్మకముంటే రాద్ధాంతాలు చేయనక్కర్లే!


దేనికోసమూ దేబిరించకుండా  దేవుడిచ్చిన  పాత్రను సక్రమంగా పోషించడమే స్థితప్రజ్ఞుడి విజ్ఞత.  


జీవితం ఒక పాత్రఅనుకో! కింది సగం కృషి, పై సగం అదృష్టం. అదృష్టం నోటిదాకా రావాలంటే  కృషి చేయక తప్పదు.


దుర్యోధనుడు ధర్మరాజుతో  జూదమాడి గెలిచింది అదృష్టం వల్లకాదు... శకుని పాచికలవల్ల.  గురు త్వాకర్షణశక్తి సూత్రం తట్టినప్పుడే  న్యూటన్ ఆ ఆపిల్ చెట్టు కింద చేరడమూ  అదృష్టంవల్ల కాదు... ఆపిల్ పండు నేల రాలిపడ్డంతో సహా అంతా కాకతాళీయం. సముద్ర తీరం దాటేముందు వాయుగుండం ఏ సిద్ధాంత గ్రంథమూ తిరగేయదు. వాటాన్ని బట్టి జరిగే ఆ పకృతి చర్యను ఏ యాగమూ యజ్ఞమూ ఆపలేదు. 


తలరాతలు మనచేత్తో మనమే రాసుకునేవి: ఆ సత్యం  సత్యంరాజు ఉదంతం సుస్పష్టంగా తెలియచేస్తోంది . అయినా ఇంకా అదృష్టం చూరు  పట్టుకు  వేలాట్టం  కార్యశూరులు  చేయవలసిన  చర్యేనా? !


అదృష్టలక్ష్మి వద్దన్నా వచ్చి మన ఇంటి తలుపు ఎప్పుడో ఓరోజు తట్టి తీరుతుంది . ఆ టైమ్ మన బెడ్ టైం కాకపోవడమే అదృష్టం . 


ఇప్పుడైనా మన అదృష్టానికేం లోటు?! స్వైన్ ఫ్లూ   సీజన్లో జల్లీ ఫ్లూ రావడమే అదృష్టం.  వానల్లేని  కార్తెల్లోను బలవంతంగా బ్యాంకు లోన్లు అంటకట్టడం లేదు. అదీ అదృష్టమే.  అమెరికాలోనూ మాంద్యమున్న రోజుల్లో మన దగ్గర ఉద్యోగాలాట్టే ఉడటంలేదు. అదీ అదృష్టమే.  కందిపప్పుకి బదులు పెసర పప్పు, సన్నబియ్యం ప్లేసులో  దొడ్డుబియ్య బలవంతంగా సంచుల్లో  పొయ్యడం  లే.. లక్కు! లేటయితేనేమిగాని బైటకెళ్లిన ఆడపిల్లల ఏ యాసిడ్ దాడుల్లేకుండా  ఇళ్లు చేరుతున్నారు. అదెంత అదృష్టం! 


ఇట్లా నాలుగైదు ముక్కలయినా అదృష్టానికి దృష్టాంతాలుగా రాయడానికి మిగలడం రచయితగా  నా అదృష్టం . 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం 05 - 10 - 2009 ) 



Wednesday, December 29, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక బెక బెక రాజకీయం రచన - కర్లపాలెంహనుమంతరావు ( ప్రచురితం - 12 - 03-2014 )


 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

బెక బెక రాజకీయం 

రచన - కర్లపాలెంహనుమంతరావు

( ప్రచురితం - 12 - 03-2014 ) 


'కప్పుల బెకబెకలు మరీ ఎక్కువైపోతున్నాయి. రాత్రుళ్లే కాదు. పగలూ నిద్రపట్టడం లేదు ఈ కప్పుల గోలకు' '


అకాల వర్షాలు కదన్నా! కప్పల సందడి ఆ మాత్రమన్నా ఉండదా? 


ఆ కప్పులు కాదురా వెంగళప్పా నా గోల ! ఈ రాజకీయ గోదురు కప్పుల గురించిరా బాబూ!  ఇప్పటిదాకా ఏ రాళ్ల కడుపుల్లో వెచ్చగా బబ్బున్నాయోగానీ, నాలుగు చినుకులు పడేసరికి బొబ్బలు మొదలు పెడుతున్నాయి.


వానలన్నాక కప్పలు, ఎన్నికలన్నాక రాజకీయ కప్పలు సహజమే కదన్నా! కాకపోతే లోపల ' కాక ' మరీ ఎక్కువైనట్లుంది . ఈసారి ఎప్పటికన్నా కాస్త ఎక్కువగా బయటపడుతున్నాయి.


కొత్త కప్పలు  కూడా ఎక్కడెక్కడినుంచో పుట్టుకొస్తున్నాయప్పా !  అంతంత గొంతులేసుకుని గంతులేస్తున్నాయి. గోకప్పల్ని మించి ముదిరిపోతున్నాయి. దురు


ఇప్పట్నుంచే కప్పల్ని తిట్టుకుంటూ కూర్చుంటే లాభమేముం చెప్పన్నా! కప్పల్ని కన్నా ఆకాల వర్షాల్ని అనాలి గాని! నిన్నమొన్నటి దాకా ఎక్కడా ఒక్క వాన చుక్క కనిపించలేదు. గంగానమ్మ జాతర్ల నుంచి గాడిదల జంటలకు పెళ్ళిళ్ల దాకా దేన్నీ వదిలిపెట్టింది లేదు కాదా మనవాళ్లు!  అందుకేనేమో చాలా కాలం తరువాత వానలు దంచి  కొడుతున్నాయి .


వట్టి వానలైతే ఫర్వాలేదురా అబ్బీ ఒకవంక ప్రాణాలు తీసే వడగళ్లతోపాటు కప్పుల గోలా  మాలావుగా ఉంది . మరోవంక ఎన్నికల మీద ఎన్ని కలు జనాలు నెత్తిన పిడుగుల్లా వచ్చి పడి కష్టం రెట్టింపైంది. ఎన్నికలనేవి అసలు లేకుండా పోయుంటే, ఈ రాజకీయ కప్పుల వంగుళ్లు దూకుళ్ల గోలన్నా తప్పిఉండేది కదా!


ఉగ్రవాదుల మాదిరిగా వాదిస్తున్నావేందన్నా! ఎన్నికలు ఉండబట్టే గదా మనలాంటి ఓడమల్లయ్యలున్నా రని పెద్దమనుషులకు తెలిసొచ్చేది! .నియంతృత్వం మీదకానీ మోజు పెరుగుతోందా ఏంది నీకు! 


అక్కడికి ఇప్పుడు నడుస్తున్నదంతా పెద్ద ప్రజాస్వా మ్యమే అయినట్లు!  నాకు తెలీక అడుగుతా, రెండింటికీ తేడా ఎక్కడుందిరా? ఓట్టేసి అనక నోర్మూసుకుని ఉంటాం. నియంతృత్వంలో.  నియంతల పాలనలో  ఆ ఓట్ల పాట్లూ  ఉండవు అంతే! 


సే భాషలో నువ్వేం చెప్పినా, ఎన్నికలనేవి ఉండబట్టే మనకు ఈ మాత్రమైనా మంచి జరుగుతోంది. నగదు బదిలీ రోగం వదిలిందా ! వంటగ్యాస్ సిలిండర్లు మళ్ళీ గతంలోలా పన్నెండు వరకూ దిగిందా! చిల్లర వ్యాపా రాలు చేసుకునేవాళ్లకు పోలీసు మార్కు  సత్కారాలు తప్పుతు

న్నాయా! కోరలున్నా లేకపోయినా లోక్ పాలు  బిల్లంటూ ఓటి ముందుకు కదిలిందా! ఎన్నికలే  లేకుంటే ఈ మాత్రమైనా జనం గురించి ఆలోచించేవాళ్లీ  గద్దెల మీది  పెద్ద ప్రభువులు? 


ఎన్నికలపై నాకూ తప్పుడు అభిప్రాయమేమీ లేదురా అబ్బీ!  జరుగుతున్న తంతు గురించే నా దిగులంతా ! ఎన్నికలనేసరికి ఎక్కడలేని హడావుడి .. హంగామా!  వేడివేడి పెసరట్టులాగా ఉదయాన్నే వార్తలొచ్చేస్తాయి. ఈ అల్పాహారం రుచికి అలవాటు ఓటరు పౌష్టికాహారం పూర్తిగా పక్కన పెట్టేస్తాడన్నదే నా బాధ. అభివృద్ధి గురించి గానీ, నిలబెట్టుకోవాల్సిన సంపద గురించి గానీ  ఎక్కడైనా ఒక్క చక్కని చర్చ జరుగుతోందా? ఎన్నికలకు వందరోజుల ముందు మాత్రం విరుగుడు మంత్రంగా మందులేస్తే ఈ దేశానికి పట్టిన పెద్దరోగం నయమవుతుందా? మాయదారి రాజకీయాల మూలంగా కాదూ, మనం వద్దని  ఎంత మొత్తుకున్నా విదేశాల తుక్కు అణుపరిశ్రమలు మన నెత్తిమీదకు వచ్చి పడింది! మనదగ్గరే వీధికొక చిల్లర దుకాణం చల్లగా వ్యాపారం చేసుకుంటున్నా ఏం ఉద్ధరించాలని బలవంతంగా పరాయిగడ్డ దుకాణాలను రుద్దబోయింది। వద్దన్న చోట సెజ్జులు! కావాలన్నా ఇవ్వరు పరిశ్రమలు ! జనం మాట నిదానంగా ఆలకించి ఆచరించిన పాపాన పోయారా మనం ఓట్లేసి గెలిపించిన నేతలు?  


ప్రజాస్వామ్యం అంటే అదేదో పచ్చి కాకరకాయ చేదు అన్నంత వితండంగా వాదిస్తున్నావేందన్నా?  ఎప్పుడో ఒకప్పుడన్నా ఎన్నికలొచ్చి పోయే  సదుపాయం చిన్నదా.. చిత కదా ? ఉత్తప్పుడు ఎంత చెల, రాజకీయాలకు పాల్పడ్డా  , కనీసం ఎన్నికల ముందైనా అంత రాత్మ అంటూ ఒకటి ఏడ్చిందని, , దానికీ అంతో ఇంతో ఆత్మాభిమానం ఉంటుందని, తగిన గుర్తింపు ఇవ్వకుంటే  మొత్తం రాజకీయాలని  తారుమారు చేసేస్తుందని  తెలుస్తుంది గదా! ప్రభుత్వాలని  నడపటం ఎలా, సామాన్యుడి జీవితాన్ని గాడిలో పెట్టడం ఎలా అని ఊరికే ఇంట్లో ఓ మూల కూర్చుని కాగితాలు నలుపు చేసుకునే మేధావులకూ చిన్నదో చితకదో ఒక పార్టీ అంటూ పెట్టుకునే గొప్ప తరుణం ఎన్నికలంటూ ఉండబట్టేగదా వచ్చేదీ! 


అవును . నిజమే పాత పార్టీల్లోంచి కొత్త పార్టీలు పుటుకొస్తున్నాయి.  ఆ కొత్త పార్టీల్లో కొన్ని చీలి, మళ్ళీ పాత పార్టీలో కలుస్తున్నాయి. అవి ఇవి కలకలిసిపోయి, చివరకు కొత్తపార్టీ ఏదో, పాత పార్టీ ఏదో అర్ధమవకుండా పోతుంది . ఇందులోనివారు అందులోకి..  . అందు లోనివారు ఇందులోకి దూకుతున్నారు. వారూ వీరూ ఉమ్మడిగా  ఇంకెందులోకో గెంతుతున్నారు. ఈ దూకపళ్ళు చూసి, కప్పరే తమ స్పెప్పులు  మరచిపోయేట్టున్నాయి. 


ఆగన్నా ఆగు... నాకు తల తిరిగిపోతోంది.


ఈ ఒక్క నాలుగు ముక్కలకే నీకు ఇలా తలా మొలా తిరిగిపోతుంటే, మరి మామూలు మనిషికి ఇంకెంతలా తిరిగిపోవాల్రా... ఆలోచించు!  ధరల పెరుగుదల జోరు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పెట్రోలు బంకుల్లో, బ్యాంకుల్లో బయటపడుతున్న మోసాలు ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవైతే కావు. ఇవాల్టి కివాళ ఆగిపోయేవీ కావు.. విద్యుత్ కోతల సమయం రెట్టింపైంది. ఉద్యోగాలు ఉపాధులు ప్రకటనలకే పరిమితం.  వాస్తవంగా ఒక్కటన్నా వచ్చి ఒరగబెట్టిందేమీ లేదు. చదువులు సాగటం లేదు . సరిగ్గా ప్రైవేటు బస్సులు, బళ్లు జనాల మీదపడి చేసే నిలువుదోపిడికి అడ్డూ ఆపూ లేదు. సైనికుల వాహనాల నుంచి జనతాకు పంచే చిల్లర సరకుల సంచుల దాకా కుంభకోణాలు.  అయినా, ఆ అక్రమార్కులే మళ్ళీ జనం మధ్యకు వచ్చి వాహనాలపై నిలబడి నిజాయతీ గురించి ఉపన్యాసాలు దంచేస్తారు. . జనాలు చప్పట్లు బాదేస్తారు . ఓట్లు రాబట్టుకోవడానికేనా ఎన్నికలు? 


కప్పదాట్లన్నీ  ఓట్లకు సీట్లకు కాకపోతే.. మరెందుకన్నా! 


రచన - కర్లపాలెంహనుమంతరావు

( ప్రచురితం - 12 - 03-2014 ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం పదకొండో అవతారం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

పదకొండో అవతారం 


రచన- కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 ) 


' దేవుడు భక్తులకు వరాలివ్వటం రివాజు. దేవుడిమీదే వరాల జల్లు కురిపిస్తున్నారు మీ భక్తులు ఈ రోజు'  అంది పతిదేవుడి పాదాలు నొక్కుతూ లక్ష్మీదేవి.


దేవుడు ముడుపులకు పడిపోతాడా?' అనడిగాడు శ్రీమన్నారాయణుడు చిద్విలాసంగా అరమోడ్పు కన్నులతో నిద్రను అభినయిస్తూ.


'ద్వాపరంలో తమరు మణిమాణిక్యాలను కూడా కాదని వట్టి తులసిదళానికే దాసులైపోలేదా స్వామీ! అందుకే ఈ కలికాలంలో కూడా ఏ టీవీ పెట్టో, వందనోట్లు పెట్టో దాసోహం చేసుకోవాలని చూస్తున్నారు తమ భక్తులు' అంది లక్ష్మి దెప్పుతున్నట్లు.


దేవుడి నాడి పట్టుకోవడం అంత సులభమా దేవీ! పక్క పార్టీవాళ్ళ రెక్కపుచ్చుకుని లాక్కొచ్చుకున్నంత తేలికని భ్రమ! 


పోయినసారి పదవీ స్వీకారమప్పుడు తమమీదే ప్రమాణం చేశారు గదా దేవా మన భక్తులు.... ఏమైంది? రామవారధి శ్రీరాములవారే కట్టలేదంటున్నారు ఇప్పుడు। అయోధ్యలో ఆలయం కడతామన్న మాటలు టమాటాలంత విలువైనా చేయటం లేదు. 


నిజమే దేవీ ! బెజవాడ దుర్గ విగ్రహానికే నకిలీ బెడద తప్పలేదు. మాటామంతీ నేర్పిన మన విధాతా సతీమణి వాణినే మాతృభాష అని చులకన మంత్రులూ... నాయకులూ' చేస్తున్నారు.


ఆడదానిమీద మీ మగాడికెప్పుడూ శీతకన్నేగా స్వామీ! తమరు కూడా మినహాయింపు కాదు. ఎన్ని యుగాలబట్టి మీ పాదాల దగ్గర ఇలా పడున్నాను... గజేంద్ర మోక్షం నాడు గభాలున అలా చెప్పా పెట్టకుండా లేచెళ్ళిపోయారు। వరాలిచ్చే వేళైనా ఒక్కసారైనా నా సలహా తమరు తీసుకున్నారా? యథా 'దేవా తదా భక్తా! ' . మనిషి మాత్రం మరోలాగా ఎందుకుంటాడు !  అందుకే ' ఆకాశంలో సగానికి పైగా మేము ఉన్నా చట్టసభల్లో మాత్రం అవకాశాలు సున్నా' అంది లక్ష్మి శ్రీవారి పాదాలను మరింత కసిగా మర్ధిస్తూ,


చట్టసభల్లో మాదిరి ఈ కొట్టుకోవటాలేమిటి తల్లీ! అక్కడ మీ గుళ్ళనూ, గుడిలో లింగాలనూ మింగే రాక్ష సులు మళ్ళా పదవుల్లోకి రావాలని యజ్ఞాలు  చేస్తు న్నారు. యాగాలు మీకు.. భోగాలు వాళ్ళకు.  మీ ఆల యాలు అవినీతికి నిలయాలుగా మారాయి నారాయణా! మీ భూమినీ సొమ్మునూ పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రసాదాల్లా పంచుకుంటున్నారు. విడిది గృహాలను విచ్చలవి డిగా వాడుకుంటున్నారు. మీరిలాగే కళ్ళు మూసుకుని తన్మయత్వం నటిస్తుంటే గర్భగుళ్ళలోనూ  తమ పిత్నదేవుళ్ల  విగ్రహాలు ప్రతిష్టించుకునేట్లున్నారు'  అన్నాడు. . అప్పుడే వచ్చిన నారదుడు హడావుడి పడిపోతూ.


నారదుడు చెప్పింది నిజం స్వామీ! తిరుమలలో మనం పవళించే వేళనీ చూడకుండా పైవాళ్ళకు ప్రత్యేక దర్శనాలి వ్వమని వేధించే నాయకులు ఎక్కువైపోతున్నారు. ఏవేవో కల్యాణాల పేర్లు చెప్పి రెండు పట్టుచీరెలు, పంచలూ మన మొహాన కొట్టి ఇన్ని ముత్యాల తలంబ్రాలు తలమీద పోసి పోతే తమ తప్పులకు తలాడిస్తామనుకుంటున్నారు. పండగల వంకలో పేపర్ల నిండా మాది దేవుడి పాలన అని రెండేసి పేజీల ప్రకటనలిచ్చి బ్రహ్మాండంగా ప్రచా రాలు చేసుకుంటున్నారు' అంది లక్ష్మి ఆవేదనగా,


అంతేనా! వేళకు వానలు పడితే వరుణదేవుడు వాళ్ళ పార్టీలోకి మారాడనీ, రెహమానుకి ఆస్కారవార్డు వస్తే అదంతా వాళ్ళ మహిమేననీ, అణు ఒప్పందానికి మీ ఆమోదముద్ర ఎప్పుడో పడి పోయిందనీ, గాంధీగారి కళ్ళజోళ్ళూ.. కాలిజోళ్ళు వాళ్ళు చెబితేనే మీరు వాళ్ళ దేశానికి ఇప్పించారనీ, క్రికెట్లో ఓవరుకు ముఫ్ఫైయారు పరుగులు వాళ్ళ మాటమీదే మీరు యువరాజ్ చేత చేయించారని తెగ డప్పులు కొట్టేసుకుంటున్నారు మహాత్మా! సర్వసాక్షివి నీ పేరునే వాళ్ళు పత్రికలకీ, టీవీలకి వాడుకొంటూ సర్వం నాశనం చేస్తున్నారు. 'అభయహస్తం' అంటేనే జనం భయపడుతున్నారు. దొరకని బియ్యం కిలో రెండు .. దొరికితే ఉల్లి కిలో ఇరవై ! నీళ్ళు లేకుండానే డాములు కడతామంటున్నారు. నకిలీ పైపులు  పగిలి జలయజ్ఞానికన్నా ముందు జలప్రళయం ముంచుకొస్తుందేమోనని జనం వణికి చస్తున్నారు. గుండెనొప్పి వస్తే ఆసుపత్రివైద్యం... ఆకలినొప్పికి మాత్రం కల్తీ మద్యమే వైద్యమట... చోద్యం! ఆణా వడ్డీ నారాయణమంత్రంలాగా అదేపనిగా పదేపదే జపిస్తున్నారు. క్షమాభిక్షలతో రాక్షసులు బైటికొచ్చారు. అక్రమార్కుల మీద సర్కారు జీఓల మంత్రజలం చల్లి విక్రమార్కులుగా మార్చి దేశంమీదకు వదిలేశారు. ధరలు దిగిరాకపోయినా, ఉద్యో గాలు ఊడిపోతున్నా, ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నా ఆడవాళ్ళమీద అఘాయిత్యాలను ఆపలేకపోతున్నా, ఆపద్బాంధవుడిలాంటి తమ నామధేయాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. మహాత్మా! రెండువేల పన్నెండులో ప్రపంచానికి ప్రళయం వస్తుందంటున్నారు. ఈ వరస చూస్తే ఈ దేశానికి మూడేళ్ళు ముందుగానే ముంచుకొచ్చేటట్లుంది గోవిందా?


అన్నీ వింటున్న శేషశయనుడు కనులు తెరిచి అడిగాడు ఆఖరికి


'వేదాల కోసం మత్స్యావతారం, భూదేవికోసం వరాహావతారం, అమృతం కోసం కూర్మావతారం, ధర్మాల కోసం నరసింహావతారం, దానాలకోసం వామనావతారం, మర్యాదకోసం రామావతారం, విజయాలకోసం పరశురామావతారం, మంచి రాజకీయా లకోసం కృష్ణావతారం, బుద్ధికోసం బుద్ధావతారం... ఆఖరికి ఆకలికోసం కలికి అవతారం కూడా ఎత్తేశాను గదా నారదా! పది అవతారాలూ వృథాయేనా? అన్ని అవలక్ష ణాలతో మళ్ళీ జన్మ ఎత్తిన ఈ దుష్టరాజకీయాన్ని శిక్షిం చటానికిప్పుడు మళ్ళీ ఏమి చేయాలి?


పదకొండో అవతారం ఎత్తాలి పరంధామా! ఓటరు జన్మ ఎత్తి 'బ్యాలెట్' ఆయుధాన్ని అందుకోవాలి నారా యణా! అప్పుడే సర్వజనావళికి సంక్షేమం- అన్నాడు నారదుడు రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ. 


'నిజమే నాథా! ముందు లేవండి!' అంది లక్ష్మి నారదుడి మాటలకు  మద్దతుగా పాదసేవ అప్పటికి ఆపి. 


కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 ) 

Tuesday, December 28, 2021

ఈనాడు ' హాసం వ్యంగ్యం గల్పిక బొంకుల దిబ్బ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 ,


 


ఈనాడు ' హాసం వ్యంగ్యం గల్పిక


బొంకుల దిబ్బ

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 , 


అబద్ధాలు ఆడాలంటే ఎంతో నిబద్ధత కావాలని, గోడ కట్టినట్లుగా ఉండాలని బుద్ధిమంతుల బోధ. ఆపద్ధర్మంగా ఇటునుంచి అటు దూకినట్లే... అవసరార్థం మళ్ళీ రేపు అటు నుంచి ఇటు దూకేందుకు వాటంగా ఉండాలి  నిజం చెప్పాలంటే. నిజం మీద నిలబడటానికి అట్టే నిజాయతీ అవసరం లేదు. ఆడిన అబద్ధానికి కట్టుబడి ఉండాలంటేనే ఆటుపోట్లు తట్టుకునే గుండె నిబ్బరం ఉండాలి. అది లేకే సత్యం రాజు, అమెరికా బిల్ క్లింటన్ అన్ని కడగండ్ల పాలైంది. అందరూ హరిశ్చంద్రులకు చుట్టాలైతే ఈ చట్టాలెందుకు?


పనామా పత్రాలు విడుదలైనా, అందులోని పంగనామాల పెద్దలెవరూ పెదవి విప్పడమే లేదు! ఎన్నికల యుద్ధంలో నిలబడినప్పుడు అభ్యర్థ యోధులంతా ఎన్నెన్ని అబద్ధాలకు అందమైన హామీ చమ్కీ దండలు తొడిగి మరీ ప్రచార పర్వాలు రక్తి కట్టిస్తారో!  ఆడిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ అడేసి  ఎన్నుకునే జనాలకు అన్నీ పచ్చి నిజాలేనన్న భ్రమ కలిగించడం అన్నిచోట్లా రాజ కీయాలలో  పండే సాధారణ చమత్కారమే!


నిజానికి, నిజం మీద నిలబడేందుకు ప్రతిభతో పని లేదు. ఒక్క అమా యకత్వం ఉంటే చాలు.. ఆడిన మాట అబద్ధమని ఒప్పేసుకుని కన్నీళ్ళు పెట్టుకోవడానికి! పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకోవడానికేగా  అబద్ధాల సృష్టి జరిగింది?


అబద్ధాన్ని  నిజమని నమ్మించేందుకు 'అమ్మతోడు' ఒట్లు సహా కాణిపాకం గుళ్ళో దీపాలార్చేయడం వంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. గురజాడ కన్యా శుల్కంలో గాయత్రి పట్టుకుని ప్రమాణం చేసిన వాడొకడైతే, దీపాలార్వేసి, ప్రమాణం చేసిన ఘనుడు ఇంకొకడు.  అందుబాటులో ఉన్న సవాలక్ష ఉపాయాలను ఉపేక్షించి ఆడిన అబద్ధాలకు పశ్చాత్తాపాలు ప్రకటించు కుంటూపోతుంటే, చేజేతులా భవిష్యత్తు పటానికి పూలదండలు వేసుకొన్నట్లే!


గోడ దూకేటప్పుడు లీడరన్నవాడు గోడ కట్టినట్లు అబద్ధాలాడతాడని అడి పోసుకుంటాం. తెరచాటున జరిగే బేరాలన్నీ యథాతథంగా చెప్పుకొంటూ పోతే ప్రజాసేవకుడి కథ ముగిసినట్లే కదా! నమ్ముకున్న కార్యకర్తల ఉసురు పోసుకోకూడదన్న సదుద్దేశమే నాయకుడి నోటితో అబద్ధాలాడించేది... అర్థం చేసుకోవద్దూ!


'నిజం చెప్పమంటారా. అబద్ధం చెప్పమంటారా? ' అని రాజునే అడుగుతాడు పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్.  అపరిమితమైన లాభాలు ఏవో ఆశించేగదా వేన్ పిక్  మోపిదేవి, సుబ్రతోరాయ్ నుంచి శారదా ఫండ్ దాదాల దాకా, ఆగ్రిగోల్డ్ నుంచి కింగ్ ఫిషర్ వరకు నల్ల వ్యాపారాలని కూడా చూడకుండా నిలువెత్తు బురదలోకి దిగబడిపోయింది, నష్టాలు నెత్తికి చుట్టుకుంటాయని తెలిసీ నిజాలను నమ్ముకుంటారా తెలివున్న పెద్దమనుషులెవరైనా! గురజాడవారి గిరీశం అడుగుజాడల్లో నడిచే మహాశయులు అన్ని రంగా లోనూ ఇప్పుడు అందలాలెక్కి ఊరేగుతున్నారు. కాదంటే, అదే ఓ పెద్ద శుద్ధ అబద్ధం.  అవును కన్యాశుల్కం ఆసాంతం శుద్ధ అబద్ధాల పుట్ట. ప్రపంచంలోని ఏ అబద్దపు వ్యవహారమైనా 'కన్యాశుల్కం'లో తప్పకుండా ప్రత్యక్షమై తీరవలసిందే. మన రాజకీయాల మాదిరిగా అయినా, ఆ నాటకంలో జరిగిందంతా నిజమేనని, అయస్కాంతాలు పెట్టి గాలించినా అబద్ధమనేది అణువంతైనా కనిపించదని  అందరం అమాయకంగా నమ్ముతుంటాం. ఆ చమత్కారమే యథాతథంగా రాణించే రంగం- రాజకీయం.  అందుకే రాజకీయాలు ఇవాళ ఇంతలా అబద్ధాల దుకాణాల మాదిరి కళకళలాడిపోతున్నది . 'నిజం బొమ్మ అయితే, అబద్దం బొరుసు" అన్నవాడికి రాజకీయ గోతుల లోతులు బొత్తిగా తెలియవని అనుకోవాలి. రెండువైపులా ఉన్నవి బొరుసులే అయినా బొమ్మలే అన్నట్లు కథ నడిపించగల సమర్థులే  రాజకీయ రంగంలో రాణించేది. అబద్ధాన్ని నిజంగా..  నిజాన్ని అబద్ధంగా  చేసేస్తాం' అని డబ్బాలు కొట్టుకుంటాడు కన్యాశుల్కంలో బైరాగి. అ  మార్కు గడుసుపిండాలకే ఎంత నిజాయతీ పార్టీలో ఉన్నా మంచి మార్కులు పడేది.


నిజాయతీపరులెవరూ రాజకీయాల జోలికి రావద్దు. వచ్చినా రాహుల్ బాబులా నాలుగు కాలాలు మాగినా పండటం కుదిరే పనికాదు .  'కన్యాశుల్కం' మార్కు 'బొంకుల దిబ్బ' సెట్టు లాంటివే రాజకీయాల రంగుల లోకం.  నిజాన్ని నమ్ముకుని మాత్రమే రాజకీయం నడపాలనుకొన్న  లోక్ సత్తా  జేపీ రథం పరుగుపందెంలో వెనక ఎందుకు పడిందో అర్ధం చేసుకుంటే చాలు- నేటి రాజకీయాలు నిజమైన అబద్ధపు స్వరూపం కళ్లకు కట్టినట్లు అవగతమవుతుంది. సత్యం మీదే బొత్తిగా ఆధారపడటం రాజకీయాలతో పెద్ద అడ్డంకి. 


ఈ రాజకీయ సూత్రం అర్థంకాని అమాయకులెవరైనా ఇంకా మిగిలి ఉంటే మారిపోవాలి. '  ట్రూ రిపెంటెన్సుకి ట్వంటీ ఫోర్ అవర్చు చాలు' అన్నాడు గిరీశం మహాశయుడు. ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నికలు ముంచుకొచ్చే వస్తున్నాయి. నార్కో ఎనాలసిస్ టెస్టులకయినా  నాలిక మడతలు అందకూడదు. లై డిటెక్టర్ల ముందు మతులు పోగొట్టుకోకూడదు. టికెట్ల కోసం ఎన్ని కోట్లయినా పొయ్యి , పోలీసు రికార్డుల్లో ఎంత రికార్డుస్థాయి నేర చరిత్రయినా  ఉండనీయి ..   స్వల్ప ఆస్తులు, స్వచ్ఛమైన చరిత్ర ప్రక టించే గుండెదిటవు అవసరం.


కడుపు నుండిన జనం చెప్పులు విసిరినా దడుపు  దాచుకొనే ఒడుపు ఒక్కటి ఒడిసి పట్టుకుంటే చాలు- ఏ పార్టీ టికెట్ మీదైనా ఇట్టే టిక్కు పెట్టించుకోవచ్చు. అబద్ధాలు రంగరించి బిడ్డలందర్నీ గద్దెలెక్కించాడు లాలూజీ.  రాజకీయాల్లో నాలుకలు ఎన్ని చీలికలైనా నో ప్రాబ్లమ్ . అవి మొద్దు బారకుండా పదునుగా ఉంచుకుంటే  చాలు.  సత్యహరిశ్చంద్రుడి కథ మర్చిపోయేటంత కీర్తి ప్రతిష్ఠలతోపాటు, వారసులందరికీ చెక్కు చెదరని స్విస్ బ్యాంకు ఖాతాలు సాధించుకోవచ్చు.  ఏ ప్రజా సేవకుడి అంతిమ లక్ష్యమైనా అంతకుమించి మరేముంటుంది?


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 , 


Monday, December 27, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక చెరసాలలు కావాలి రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 


చెరసాలలు కావాలి 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 



ట్రిపుల్ ఐటీలు ఐఐటీలకు  బదులుగా జైలు లాంటిది ఒకటి మనం అడిగి తెచ్చుకుని ఉంటే బాగుండేది.


అంతమంది ఎంపీలున్నా ముష్టి రెండు పెద్దరైళ్లు తెచ్చుకోవడానికి అన్ని అవస్థలు పడుతున్నాం. ఇంకా జైళ్ల లాంటి పెద్ద పథకాలు మనకు వస్తాయనేనా? అయినా ఇప్పుడీ  ఊచల  ఊసు అంత హఠాత్తుగా నీకు ఎందుకొచ్చినట్లబ్బా? !


వాన కురుస్తున్నప్పుడే కుంట నింపుకోవాలన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేశంలో పాపాలు, నేరాల శాతం పెట్రోలు ఉత్పత్తుల రేట్ల మాదిరి ఎట్లా ఊపందుకున్నాయో చూశావుగా ! దేశంలో ఏ మూల నేరం జరిగినా మూలాలు మన  రాష్ట్రంలోనే కదా బయట పడుతున్నాయి! కార్పొరేట్ రకం కొత్త నేరాలకూ మన యువనేతలే పాఠాలు చెబుతున్నప్పుడు- శిక్షాలయాలూ మన సమీపంలోనే ఉండటం న్యాయమా కాదా? కృష్ణాజలాల్లో వాటాలకోసం వృథాగా  అలా ఆరాటపడే బదులు శ్రీకృష్ణ జన్మస్థలాల స్థాపన కోసం లాబీయింగ్ చేస్తేనే లాభం ఏమంటావ్ ? 


'నిజమేరా... బాబా శివైక్యమైన తరువాత పుట్టపర్తి చూడు ఎట్లా బోసిపోయిందో!  ఆ కేరళవాళ్లకంటే ఏదో గుడి నేలమాళిగల్లో బంగారు కణికలు దొరుకుతుంటాయి. మన దగ్గరున్న నల్లబంగారాన్ని ఎవడికో తవ్వుకో మని తేరగా ధారపోసేస్తిమి. నువ్వన్నది నిజమే. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ తీహార్ జైలునో ఇక్కడ దాకా  తరలించుకు రావడమొక్కటే మనముందున్న ఏకైక మార్గం. 


కానీ మన దగ్గరిప్పుడు జైళ్లు కట్టుకునే పాటి ప్లాట్లెక్క డున్నాయిరా బాబురా?  అవీ సెజ్జులూ పోర్టులూ అంటూ  అప్పనంగా ఎప్పుడో ఎవరెవరికో అబ్బాయిగారి కోసమూ ధారాదత్తం చేసి పారేస్తిమి  గదరా గాడిదా! 


ఏ స్థలాలూ లేకపోతే మెట్రోరైళ్లు లాంటివెలా పుట్టుకొ స్తున్నాయ్ బాబాయ్ ? అన్నేసి ఎకరాలు పోసి ఆ భారీ బస్టాండులు కట్టిస్తే వచ్చేదేముంది- కిలో మీటరుకు ముష్టి రూపాయి నలభై పైసలు. అదే ఏ తీహార్ మోడలు చెరసాలో అత్యంత అధునాతనంగా కట్టించి పారేశామనుకో... బోలెడంత వ్యాపారం. పార్కింగ్ ఫీజుల దగ్గ ర్నుంచీ ఫుడ్ కోర్టులు, హోటళ్లూ, మాళ్లూ జైలుకొస్తున్న నేరగాళ్లు అల్లాటప్పా గోంగూరగాళ్లా? వాళ్లకూ  ఎంత మందీమార్బలం, బంధుబలగం! తమ నేతల  నిత్య సందర్శన కోసం వచ్చిపోతూంటారు. నేరాలకీ ఘోరాలకి కరవులేనంత కాలం చెరసాలల చుట్టూ చెలరేగిపోయే వ్యాపారాలను వ్యవహారాలను ఎంతలావు ఆర్థిక మాంద్యమూ ఏమీ చేయలేదు. తెలుసా!


ఒప్పుకొన్నానురా అబ్బాయ్! బయటకు కనిపించే వ్యాపారాలే కాదు, లోపాయికారీగా జరిగే రూపాయల వ్యవహారాలూ లెక్కలోకి తీసుకుంటే- కటకటాలు కట్టించడంకన్నా గొప్ప లాభసాటి పథకం మరొకటి లేదు. రింగు రోడ్లూ ఫ్లైఓవర్లూ అంటూ ఎప్పుడూ ఏవేవో వివాదాస్పద మైన పనులే ప్రభుత్వాలు ఎందుకు చేపడుతున్నట్లు?  చక్కగా ఏ సినిమా హాళ్లనో  జైళ్లుగా మారిస్తే సరిపోతుంది. గాలి ఆడని ఆ గోడౌన్ థియేటర్లను కారాగారాలుగా మారిస్తే ఎంత లావు మొండి నేరగాడైనా ఒక్క పూటలో నేరాంగీ కారం చేసి తీరాల్సిందే!


ఇందిరమ్మ ఇళ్లంటూ ఇన్ని లక్షల కోట్లు పెట్టి అరకొ రగా జైళ్లలోని సెల్లలంటి ఇల్లు కట్టడమే  గానీ, ఆ సొమ్ములో సగం తిని సగం సద్వినియోగం చేసినా జిల్లాకో తీహార్ జైలును తలదన్నే 'అత్తారిళ్లు' తయారై ఉండేవి ఈపాటికి....


సరే. ప్రస్తుతం జరగాల్సింది చెప్పరా బాబూ! బడిబాట లాగా ' మళ్ళీ జైలుకు'  అనే ఉద్యమం ప్రస్తుతం నడుస్తున్నట్లుంది... కల్మాడీతో మొదలైన వరస రాజా, కనిమొళిలో  అగేలా  లేదు. మారన్లు వెయిటింగ్, మరెందరు

బారులు తీరబోతున్నారో తెలీదు. చూస్తు న్నాంగా, ఎప్పుడూ దేశం నిండా ఏవో ఆందోళనలూ! 'ఓటుకు నోటు కేసు'  ఓటి నడు స్తోంది. జోరుగా గనుల తవ్వకాల్లో ఎంతమంది చెరసాల బాట పడతారో ఇప్పుడే చెప్పడమూ కష్టమే . ఏ కేసు అప్పజెప్పినా సీబీఐవాళ్లు శని ఆదివారాలు కూడా చూసుకో కుండా నిజాలను నిగ్గుతేల్చే పనిలో పడి ఉన్నారు. పేపరు లీకులు, నకిలీ ఔషధ ప్రయోగాలు, దేవుడి ఆర్జిత సేవ ల్లోనూ కుంభకోణాలు తవ్వి తీస్తున్నారు . అబ్బో..  ఇట్లా చెప్పుకొంటూపోతే రొప్పు రావాల్సిందేగానీ...


నిధులూ పథకాలూ పంచాల్సిన ప్రతినిధులు ఉన్నంత కాలం ఈ నేరాల చిట్టాకు చివరంటూ ఉండదని ఒక్కము క్కలో చెప్పేసెయ్  బాబాయ్- ఇన్ని తంటాలెండుగ్గానీ! 


అది సరేరా!  ఎవరైనా మాకు ప్రాజెక్టులు కావాలి.... విమానాశ్రయాలు కావాలి, పోర్టుల సంఖ్య పెంచాలి.. కళాశాలలు కావాలి... అని అడు గుతారు. ఇలా 420 మోసకారులను పెట్టే జైళ్లు కావాలని మరీ అంత బహిరంగంగా అడుగుతారంటావా? నామర్దా కదా?


ఏంటి బాబాయ్ ! చెరసాలలని మరీ అంత తేలిగ్గా తీసిపారేశావు. అవి శ్రీకృష్ణుని  జన్మస్థలాలు . రాముడికి గుడి కట్టించిన రామదాసుకు కూడా నీడనిచ్చిన గోల్కొండ బందీఖానాలు . జర్మనీలో గాలిపటాలు ఎగరేస్తేనే లోపలే వేసేస్తారు తెలుసా! కట్టుకున్న భార్య జుట్టు పీకాడని ఒక పెద్దమనిషిని రాత్రంతా బంధించిన చీకటి కొట్టు బాబాయ్ చెరసాలంటే ! నెహ్రూజీ తీరిగ్గా పుస్తకం రాసుకున్న విశ్రాంతి మందిరం. బ్యాంకు దొంగను ఓ. హెన్రీగా మార్చిన పుస్తకాలయం. జైళ్లు- ఒంటి కొవ్వు తగ్గించే వ్యాయమశాలలు... గ్రంథసాంగులు గ్రంథాలు రాసుకునే విశ్రాంతి మందిరాలు, వోల్టేర్ లాగా వేదాంతిగా మార్చే యోగాశ్ర మాలు కూడా బాబాయ్!


అర్ధమైందిరా బాబూ! బయట కొవ్వొత్తులు చూపిస్తూ ఓదార్పు యాత్రలు చేసే యువరాజులకు, ఆ కొవ్వొత్తులు తయారుచేసే విధానం కూడా నేర్పే శిక్షణాలయాలు అని కూడా కదూ నువ్వు చెప్పాలనుకుంటున్నావ్? మన నేరగా ళ్లను మనం కట్టుకున్న జైళ్లలోనే పెట్టుకుంటే మన పరువు దేశవ్యాప్తం కాకుండా  ఉంటుందని నువ్వెందుకంటు న్నావో తెలిసింది. 


ఎవరి గురించి అంటున్నావో... అది మాతం చెప్పకు బాబాయ్! ఆ చిప్పకూడు పెట్టే ' రెస్టా ' రెండుకు నువ్వే పోతావ్!  


-రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 


Sunday, December 26, 2021

ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం అలుగుటయే ఎరుంగని ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 )


 



ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం 


అలుగుటయే ఎరుంగని ... 

రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 


సర్కారు గజగజ వణుకుతోంది.

రాష్ట్రానికి రక్తపోటు పెరిగిపోతోంది. చలిగాలికన్నా మిన్నగా ప్రతిపక్షాల దీక్షలకు బలవన్మరణాల పాలవుతున్నారు. రైతు శ్రేయస్సు  గురించి నేతలమధ్య మాటల యుద్ధంముందు- కోడిపందాలు బలాదూర్. ఇప్పుడు ఎవరి దృష్టి రాహుల్ మీదనో , రాడియామీదనో  లేదు. వికీలీక్సు, నూటపాతికేళ్ళ కాంగ్రెసు ప్లీనరీ, టూజీ రాజా స్పెక్ట్రమ్ లీలలు, సచిన్ శతకాలు, చైనా జియాబావో- రష్యా మెద్వెదేవ్ పర్యటనలు, పెరిగిన పెట్రోలు రేట్లు, ఉల్లిగడ్డ ధరలు, కరిష్మా కపూర్ కొత్తస్నేహాలు- ఏవీ జనాలకు ఇప్పుడు పట్టడం లేదు. ఏ నోటవిన్నా... ఏ ఛానెల్లో కన్నా రైతుప్యాకేజీ గురించే చర్చంతా!


దేవుడు నిజంగా మూడొంతులు దయామయుడు. భూమండలంమీద నేల ఒక వంతు ఉంటేనే సాగుచేసే రైతు బతుకు ఇంత దుర్భ రంగా ఉంది. మిగిలిన నాలుగొంతులూ భూమి ఉండి ఉంటే?  బాబోయ్... తలచు కుంటేనే గుండెలు దడదడలాడిపోతున్నాయి! 


పాండవులు అయిదు ఊళ్లతోనే ఎందుకు సర్దుకుందామనుకున్నారో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది . విష్ణుమూర్తి పాలమీదా, విశ్వేశ్వ రుడు వెండికొండమీదా, విధాత తామరతూళ్ళలో ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చిందో బోధపడుతోంది. దేవుడంటే సాగు బాధ తప్పించుకున్నాడుగానీ- మనిషికి ఆరుగాలం స్వేదయాగం తప్పదు కదా! 


అన్నం పర బ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ బ్రహ్మరూపాన్ని సృష్టించే అన్నదాత, ప్రాణదాత మాదిరి పూజనీయుడే కదా! ఆ ప్రాణదాతే ప్రాణాలు తీసుకునేదాకా పరిస్థితులు దిగ జారటానికి ఎవరు కారణం? 


ప్రకృతి అంటే సరే. రాజకీయాలూ రైతన్నతో పేకాటాడు కుంటామంటే ఎలా? రైతుకన్నా  మద్యం కంపెనీలే సర్కా రుకు ఎక్కువా? దొరల సారా బట్టీలకు దొరికినంత సులువుగా ఎరువులకు పురుగు మందులకు అనుమతులు దొరకటంలేదు. పిట్ట రెట్టేస్తే టప్మని కూలే వంతెనలు కడుతున్న గుత్తేదారులకు దక్కుతున్న నిధుల్లో పదోవంతు దుక్కి దున్నే బక్క రైతుకు దక్కడం లేదు. వేలంపాటలో ఆటగాళ్లను పాడుకోవడానికి కుహనా కంపెనీలకు అత్యంత ఉదారంగా కోట్లు గుమ్మరించే బ్యాంకులు- బక్కరైతుకు ఒక్క పదివేలు అప్పుగా ఇవ్వమంటే సవాలక్ష ఆంక్షలు పెడతాయి! చెడిపో యిన స్టేడియాల మరమ్మతులకు ధారపోసే నిధుల్లో పైసా వంతు బీడుపడిన పంట పొలాలకు ఇవ్వమంటే- రాష్ట్రం కేంద్రంవైపు, కేంద్రం రాష్ట్రంవైపూ వేలు చూపిస్తుంటాయి. 


కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము/ బిల బిలా పక్షులు  తినిపోయె అలలు పెసలు/ బొడ్డుపల్లెను గొడ్డేరి మోసిపోతినెట్లు చెల్లింతు టంకము లేదు మార్గం'  అంటూ ఆనాడు శ్రీనాథుడు ఏ అమరపురికరిగాడో... అదే దారి పడుతున్నాడు అనాథ అవుతున్న ఇప్పటి అన్నదాత కూడా! 


అప్పిచ్చువాడు, ఎప్పుడూ ఎడతెగక పారు ఏరు లేని ఊరులో ఉండవద్దని బద్దెనామాత్యుడు ఎప్పుడో పద మూడో శతాబ్దంలోనే హితమ . ఆ లెక్కన మన రైతన్నలు అచ్చంగా ఏ అమెరికా పంచనో తలదాచుకో వాలి. కాకపోతే క్యూబా పోయి సాగు చేసుకోవాలి. కనీసం పొరుగు రాష్ట్రాలకైనా తరలిపోవాలి. లక్షలు కొట్టుకుపోతుంటే- వంద చేతిలో పెట్టి అదే పదివేలు పరిహారం అనుకోమనే పాలకుల పరిహాసాన్ని ఏ రైతన్నయినా ఎంతకాలమని సహించగలడు ?


గుర్తింపు కార్డులు, సమయానికి సరిపడా బ్యాంకు అప్పులు, కల్తీలేని విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, పనిచేసే మోటార్లు, చౌక విద్యుత్తు, వానలు లేకపోతే సమయానికి కరవు మండలాల ప్రకటనలు, వరదలు ముంచకముందే ముందు జాగ్రత్తలు, పంటలు మునిగితే వెంటనే సహేతుకమైన నష్టపరిహారాలు, సబబైన మద్దతు ధర, సరసమైన పంటల బీమా, మంచి ధరకు సరకు అమ్ముకునే ఏర్పాట్లు, గోదాములు, సర్వేలు, నివేదికలు, పర్యవేక్షణలు, సమగ్రమైన శాస్త్రీయ సాగు విధానాలు... అన్నీ పేరుకు పేపర్లలో పేర్చుకుంటూపోతే చేలో ధాన్యం చేతికొస్తుందా? ఎంత ఘనమైన అంకెనైనా సున్నాతో గుణిస్తే వచ్చే ఫలితం శూన్యమే. చిత్తశుద్ధిలేని పాలకుల పథకాలన్నీ కలిపినా సున్నాను మించి విలువ చేయటంలేదు. అదే- నేటి విషాదం.


రైతును ఊరికే రాజనో, దేశానికి వెన్నెముకనో ఊదరగొడితే చాలదు. వెన్నులో ఇంత సున్నమన్నా మిగిలి ఉంటేగదా తాను నిలబడి నలుగురికి ఇంత అన్నం నోటికి అందించేది. వంద తప్పులవరకు నిబ్బరంగా ఉండ టానికి భూపాలుడు ఏమన్నా గోపాలుడా! పోతనామాత్యుడే ఈ కాలంలో ఉండి ఉంటే, మనకు భాగవతం దక్కి ఉండేదే కాదు. ఎంత రామభద్రుడు వచ్చి పలికించుదామను కున్నా- పొలంపనే చూసుకోవాలా, కలుపు మొక్కలే ఏరుకోవాలా, ఎరువులకని, విత్తనాల దుకాణాల ముందు పడిగా పులు పడిఉండాలా, అప్పుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుండాలా! ఇన్ని తిప్పలుపడి గుప్పెడు గింజలు పండించినా ఏ వానకు తడిసో, వరదలో కొట్టు కుపోతేనో ముందు ఇల్లు గడవడమెలాగో తెలియక తల్ల డిల్లుతూ కూర్చుంటాడు. చదువుల తల్లి కన్నీరు. ఇంకేమి తుడుస్తాడు?


అందుకే చెప్పేది... అలుగుటయే ఎరుంగని... మహామహితాత్ముడు అలిగిననాడు ఏమవుతుందోనని పర మాత్ముడు చెప్పిన దానికన్నా సాగు చేసుకునేవాడు అలిగితే అంతకన్నా ఎక్కువే అనర్థాలు జరిగిపోతాయి! 'సర్వే జనా సుఖినోభవంతు' అనే ఆశీర్వాదం నిజమవాలంటే ముందు 'అన్నదాత సుఖీభవ' అనే దీవెన ఫలించాలి. 231124 


రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...