Showing posts with label short-story. Show all posts
Showing posts with label short-story. Show all posts

Tuesday, December 7, 2021

గేయకథ పిల్లల కోసం అనుమానం - పెనుభూతం - జె.జానకి ( ఆంధ్రపత్రిక - వారపత్రిక - 02-01 - 1952 సంచిక సేకరణ: కర్లపాలెం హనుమంతరావు


గేయకథ : పిల్లల కోసం 
అనుమానం - పెనుభూతం 
- జె.జానకి 
( ఆంధ్రపత్రిక - వారపత్రిక - 02-01 - 1952 సంచిక 
సేకరణ: కర్లపాలెం హనుమంతరావు 

ఎచ్చటికో, బాటసారి పయనం? 
చరచర సాగిస్తున్నాడు గమనం. 
సమయం కాని సమయం, 
అంతా అంధకారమయం 
నదురులేక బెదురు లేక, 
ఇటుచూడక అటుచూడక, 
సాగిస్తున్నాడు పయనం, 
ఎచ్చటికో ఆగమనం?

అతని కేదొ కనుపించింది, 
రోడ్డుప్రక్క నిలుచుంది, 
చేతులు చాచుకు చూచింది 
అమ్మొ భూతం అయ్యొ దయ్యం!

బాటసారికి వేసింది భయం 
అకస్మాత్తుగా ఆగింది పయనం 
ముందుకుపోతే పై బడు తుందేమొ? 
వెనుకకుపోతే వెంబడిస్తుందే మొ?

అని కలిగిం దతనికి సందేహం

స్ఫురణకు వచ్చింది ఆంజ నేయ దండకం
 "శ్రీ ఆంజ నేయం”అని మొదలు పెట్టాడు పఠనం

“దిక్కు లేనివారికి దేముడే దిక్కు 
నీకిదే మొక్కు తప్పించు ఈముప్పు" 
అని సాగించాడు ముందుకు గమనం.

అర రె దెయ్యం కాదు 
అది భూతంకాదు 
ఆ ఊరుకు-  అటుదారి 
ఈ ఊరుకు - ఇటుదారి 
అని చూపించే బల్ల అది . 

అంతా వట్టి అనుమానం, 
అనుమానమె పెనుభూతం, 
అన్న పెద్దలమాట నిజం సుమీ 
అనుకున్నాడా ఆసామీ. 
***

Saturday, December 4, 2021

సన్ మానధనులు -కర్లపాలె హనుమంతరావు - ఈనాడు ప్రచురితం

 'కామేశ్వర్రావుకు కమ్యూనిటీ హాల్లో ఘనంగా సన్మానం చేస్తున్నార్టగా?' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కామాక్షి.

'సన్మానమేగా! కాలనీ-మేటు. సంతోషపడాలి.. కన్నీళ్ళెందుకూ!' కన్ ఫ్యూజయ్యా

'ఇవి కన్నీళ్లు కాదు. ఆనందబాష్పలు' అన్లేదు అర్థాంగి.

పై పెచ్చు గొంతు హెచ్చించింది 'మీరూ ఉన్నారెందుకూ! పద్దస్తమానం ఆ లావుపాటి ‘లా’ పుస్తకాలు ముందేసుక్కూర్చోడమొక్కటే తెలుసు! అట్లా గేటు దాటి బైటికెళ్లడం.. నలుగుర్తో భేటీ- గీటీకంటూ క్కూర్చుంటేగా ఏదైనా.. జరిగేదీ' ముక్కు చీదింది మళ్లీ.

'ఏం జరగాలీ? సన్మానమా? నేనేం ఒరగబెట్టాననీ సన్మానాలకీ.. సత్కారాలకీ?'

'ఆ చేయించుకునేవాళ్లంతా ఏం ఒరగబెడుతున్నట్లో!' మూతి మూడు తిప్పుళ్ళు తిప్పిందీ సారి.

 

మా కామేశ్వర్రావ్ మేటర్లో కామాక్షి ఎందుకో కంప్లీటుగా అపోహపడినట్లుంది. ఆయన ఆ మధ్య ఓ ప్రజాపత్రికలో రెండు దఫాలుగా సామాజిక స్పృహ గల  ‘సఫా’కవితలు అచ్చేయించుకుని ఉన్నాడు.. దిగ్విజయంగా. అదీ గాక ఆయనకా ఆదాయప్పన్నుల శాఖలో అదనపు ఛార్జి కూడా దక్కివుంది ఇటీవలనే!

 

మళ్లీ సాయంత్రం గుడ్ల నీరు కక్కుకుంటూ వచ్చి గుర్తుచేసింది 'ఆయనగారి పెళ్ళాంగారొచ్చి బొట్టు పెట్టి మరీ పిలిచెళ్లింది కూడానూ; లేవండిహ! వెళ్లక పోతే మాట దక్కదు' అంటూ ముక్కింది.

 

కామేశ్వర్రావుది మా ఫ్లాట్స్ లోనే నెత్తి మీదంతస్తులో కాపురం. ఎంత తప్పించుకున్నా లిఫ్టులో కలవక తప్పదు. అదీ గాక,  పైనా కిందా అన్న తరువాత చెయ్యి సాయం చేసుకోపోతే ఎట్లా?

అసలే తెలుగువాళ్లకు ఒహళ్లంటే ఒహళ్లకు సరిపడదు మంటన్న అపప్రథ కూడా ఉండె.

 

ఆటోలో సన్మానసభకు  పోతున్నంత సేపూ ఆవిడగారి గొణుకుళ్లే.. 'నలభై రూపాయలు క్షవర'మంటూ. పెద్ద మార్కేట్ మీంచి పోతున్నప్పుడు ఓ చిన్న దండయినా తీసుకుందామని ట్రై చెశా. పడనీయలా .. 'దండగం'టూ.  ఓ చిన్న రోజా పూవు కొని పది రూపాయలు ఆదాచేశామని ఆవిడ మురుసుకుంటుంటే.. హాలు ముందు ఆటోవాడు మీటరు మీద పదన్నా ఇవ్వాల్సిందేనని పేచీపెట్టుక్కూర్చుని ఆ సంబడానికి గండికొట్టేశాడు.. అరగంటలో.

 

హాలు ముందు కామేశ్వర్రావు వచ్చినవాళ్లను హూందాగా రిసీవ్ చేసుకుంటున్నాడు.  వాళ్లావిడ ముహంలో వెలుగు. మా ఆవిడ ముహంలో ఎంత దాచినా దాగని దిగులు.

 

కామేశ్వర్రావు నా రెక్క పుచ్చుకుని పక్కకు ఈడ్చుకెళ్లి స్తేజీ మీద  తెర పక్కన ఇంచక్కా పేర్చున్న వెండి షీల్డు, నాలుగో అయిదో మెమెంటోలు, ఐదారు చెమ్కీపూల దందలూ, ఫ్రేమ్ కట్టించుంచిన పంచరత్నమాల ముందుగానే ప్రదర్శిచేశాడు.

'పంచరత్నాలన్నీ నేనే రాసుకొన్నా! వినిపించమంటారా?' అనంటుంగానే ఆర్గనైజర్ రంగారావొచ్చి రక్షించాడు మమ్మల్ని.

 

రంగారావు ఈ తరహా సన్మానాలు చేయించడంలో చెయి తిరిగిన మొనగాడని పేరీ ఏరియాలో! 'కౌస్తుభం' అని బిరుదివ్వాలని అనుకుంటున్నాం మాష్టారూ ఈనగారికి. ఎట్లాగుంటుంది?' అని నన్నడిగాదు. 'కవి కౌస్తుభం' అన్న బిరుదు ఒక ప్రసిద్ధ కవిగారికి గతంలోనే దఖలు పడున్నట్లు గుర్తు. ఆ మాటే అన్నా. మా కామేశ్వర్రావు నా వంక కాస్తంత అనుమానంగా చూశాడు 'జెలసీ' కొద్దీ కుట్రచేయడం లేదు కదా' అన్నట్లు.

 

'మొత్తం పదివేలయింది మిత్రమా! పర్శుకింకో పదివేలు' అనేవో లెక్కలు చెప్పే పనిలోగా ఉండగా ఎక్కణ్ణుంచో ఆయన కోసమో కేక పినివించింది.

 

ఆరింటికి జ్యోతి ప్రజ్వలనమని ఆహ్వానం కార్డులో ప్రింటయివున్నా ఏడు గంటలక్కూడా ఎక్కడా చడీచప్పుడూ లేదు! 'పరశురామన్ గారొస్తే ఏ తతంగమైనా మొదలయేది.’అన్నాడు నా పక్కన కూర్చున్న మరో  ప్రేక్షకుడు.

'ఆయనెవరూ?'

'బోర్దర్ స్టేట్లో పాడి పరిశ్రమాభివృద్ధి స్టేట్ ర్యాంక్ మినిష్టరని చెప్పుకుంటున్నారు' అన్నాడా పెద్దమనిషి గుంభనగా.

చి

న్ని చిన్ని పిల్లలేవో పెడ్ద పెద్ద డ్యాన్సులేశారు కాస్సేపు.. వాళ్ల వాళ్ల అమ్మానాన్నల ఆనందం కోసం. 'కామేశ్వర్రావ్ బాగానే ఏర్పాట్లు చెసుకున్నాడూ' అని గునుస్తూనే ఉంది పక్కన కూర్చున్న  మా అర్థాంగి.

 

హఠాత్తుగా హాల్లో కోలాహలం! వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలూ, విరజిమ్మే వీడియోల వెలుగుల్లో.. కెమేరా ఫ్లాషుల మధ్య మందంగా కదిలివస్తోన్న శాల్తీని చూసి 'అప్పుడే మన కామేశ్వర్రావ్ ఖద్దర్ డ్రస్సులోకి మారిపోయాడండీ' అని విస్తుపోయింది మా ఆవిడ.

'ఆయన మీ కామేశ్వర్రావు కాదమ్మా! బార్ అండ్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్స్  అసోసియేషన్ ప్రెసిడెంట్ పానకాల్రావు. మీ కామేశ్వర్రావిడిగో!' అన్నాడు ఇందాకటి పక్కమనిషి, స్టేజీ మీద కుర్చీలు సర్దుతోన్న శాల్తీని చూపిస్తో.

 

మంత్రిగారొచ్చి మీటింగ్ మొదలయ్యే సరికి ఎనిమిద్దాటింది. హాల్లో యాభై తలలైనా లేవప్పటికి.. అందులో మూడొంతులు మా కాలనీవే.

 

అందరి చేతుల్లోనూ గిఫ్ట్ ప్యాకెట్లు. ఏదో పెళ్లికొచ్చినట్లు వచ్చారంతా. గిఫ్టుల సప్లై బాధ్యతా తనే మోశాడు పాపం.. కామేశ్వర్రావ్’ అంది జాలిగా మా కామాక్షి. కామాక్షికిచ్చిన గిఫ్టుకు కాళ్లొచ్చినట్లుంది.. ఓ రోజా పువ్వుతో సరిపెట్టే ఆలొచనలో ఉంది.

 

ప్రార్థన, జ్యోతి ప్రజ్వలన, పరిచయాలు, కార్యదర్శి నివేదిక.. గట్రా గట్రాలయింతరువాత పంచరత్నాల పఠన నిమిత్తం ఎవర్నో తయారుచేసుకున్నట్లున్నాడు మా కామేశ్వర్రావ్.. పంచె పైగెగ్గటి మైకు ముందుకురుకుతుందో  చందనం బొట్టు బ్రండ్ శాల్తీ!  ఆర్గనైజర్ రంగారావు సందివ్వడంలేదు.

 

మంత్రిగారికి అర్జంటుగా  హస్తినకెళ్లాల్సిన గత్తరేదో గుర్తుకొచ్చిందట అర్థాంతరంగా ఆయన అభిభాషణ ఆరంభమయిపోయింది. ఆయన జాతీయ అంతర్జాతీయ విషయాలను అన్నింటినీ లోతుగా చర్చించేసి..  'అంచేత మా బోర్డర్ ప్రభుత్వం  స్థిరంగా పాలన చేయాలంటే ఇక్కడి ప్రజలంతా కూడా మరన్ని త్యాగాలు చేసేందుకు ఉత్సాహం చూపించాల'ని పిలుపిచ్చేరు.  టైము తొమ్మిద్దాటిందని బాదే వంతు వెంతనే  వెంటనే బార్ అండ్ రెస్టారెంట్స్ పానకాల్రావు బలవంతాన లాగేసుకున్నాడు. ఆయనింకీ అరగంట బాది మధ్యం పాలసీలో తేవాల్సిన సంస్కరణల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని తక్షణావశ్యకతను గూర్చి ఎక్కడి మంత్రిగారి ద్వారానో  ఇక్కడి ముఖ్యమంత్రికి మొరపెట్టేసుకోడంతో .. జ్ఞాపికల ప్రదాన ప్రకటనలు కార్యక్రం ఆరంభమయిపోయింది హడావుడిగా.

మంత్రిగారికి వెండి షీల్డు బారాయన ప్రదానం చేస్తే, బారాయనకు మెమెంటో ఇచ్చి మంత్రిగారు బదలా తీర్చుకున్నారు. మిగిలిన వక్తలందరి కోరిక మేరా మంత్రిగారి చేతుల మీదుగా మిగిలున్న మెమెంటోలు మహా గ్రాండ్ గా ఇప్పించేశాడు కార్యక్రమ నిర్వాహకుడు రంగారావు ఆహ్వానితులైన ప్రముఖులందరికీ.

 

'మరిహ ఈ పూటకు మా కామేశ్వర్రావుకి సన్మానం, సత్కారం లేనట్లేనా!' అంది ముఖం చింకి చేటంత చేసుకుని మా ఇంటావిడ. అప్పటికే సమయం పద్దాట్టం వల్ల ఆమెలో ఆ మాత్రం ఆశ చివురించడం సహజమే గదా!

 

'వందన సమర్పణ అయిందాకా ఏ సంగతీ ఖాయంగా తేల్చలేం తల్లీ!' అన్నాడిందాకటి పక్క పెద్ద మనిషి టీజింగ్ ధోరణిలో.

 

ఒక్కయిదు నిమిషాలల్లో వేదిక మొత్తం ఖాళీ అయిపోయింది తమాషాగా! యుద్ధ భూమిలో వళ్లంతా గాయాలయినా తట్టుకొని నిలబడ్డ వీర జవానుకు మల్లే గట్టిగా నిలబడున్నది మాత్రం  మా కామేశ్వర్రావొక్కడే!

 

ఒక దిక్కున వందన సమర్పణ.. మరో దిక్కు నుంచి మూసుకొస్తున్న తెర.. !

 

ఆర్గనైజర్ రంగారావు కంగారుగా మూసుకుపోయే తెర ముందుకు ఉరికి ఆఖరి అనౌన్స్ మెంట్ చేసేశాడు 'నిజానికిది కామేశ్వర్రావుగారి సన్మాన సభ. సమయాభావం వల్ల కార్యక్రమం కుదించడం జరిగింది. క్షంతవ్యులం. వాస్తవానికి కామేశ్వర్రావుగారి వంటి మహా ఉద్దండ సంగీత పండితులకు ఏమిచ్చినా తక్కువే! ఏదో ఉడతా భక్తిగా, చంద్రునికో నూలు పోగన్నట్లు మా సంస్కార కళా సంస్థ తరుఫున ఈ చిన్ని పర్సు కానుకగా సమర్పించుకుంటున్నాం. దీంతో పాటు వీరి ప్రతిభకు దర్పణంగా  మా కళా సంస్థ తరుఫు నుంచే 'వృష భం' అనే బిరుదిచ్చి సత్కరించుకుంటున్నాం.’

సభలో ఆగకుండా కరతాళ ధ్వని.

ఆ శబ్దమొచ్చిన దిక్కు కేసి చూస్తే పాపం ఒక్కతే బిక్కు బిక్కు మంటూ చప్పట్లు కొట్టుకుంటూ కనిపించింది. కామేశ్వర్రావు ధర్మపత్ని..శ్రీమతి రమామణి.

 

కామేశ్వర్రావు పంచరత్నాలతో తనే తెరముందుకు దూకే ప్రయత్మంలాటిదేదో జరగబోతుండంగా  అదృశ్య హస్తమేదో ఆయన మెడ పట్టుకుని వెనక్కి గుంజేసి వేదిక మీద తెర పూర్తిగా లాగేసింది. లైట్లార్పేసింది.

హాలు క్షణాల్లో ఖాళీ అయిపోయిందని వేరే  చెప్పాలా!.

---

రెండ్రోజుల దాకా కాలనీలో ఎవరికీ కామేశ్వర్రావ్ దర్శనాల్లేవు.

మూడో రోజు కొంత మందికి ఎదురైనా తలతిప్పుకు పోతున్నాడన్న వదంతులు వ్యాపించాయి. .

 

'చెక్ బౌన్సయితే క్రిమినల్ కేస్ అవుతుంది కదండీ!' అనడిగింది మా ఆవిడ  ఓ రోజున తన లాయర్ పెళ్లాం తెలివితేటలన్నీ ఉపయోగించి.

'అందుకు సందేహమేముంది? కానీ ఎందుకు కలిగిందో శ్రీమతిగారికి ఆ సందేహం?' అనడిగా అబ్బురపడిపోయి.

'కామేశ్వర్రావుకు ఆ కళా సంస్థ వాళ్లిచ్చిన చెక్ బ్యాంకులో వేస్తే బౌన్స్ అయిందంట. రమామణి.. పాపం.. ఒహటే గగ్గోళ్లు’ అంది కులాసాగా కన్నీళ్లు పెట్టుకుంటూ.

'మరి ఇంత ఖాయిలా తినీ  ఇంకా కామేశ్వర్రావు ఇంటి తలుపులకు ఆ 'వృషభం' చెక్కపేడు ఎందుకో!?'

'ఎదో ఓ  చెక్కపేడు తలుపుకు వేలాడాలని కదా మా రమామణి ఇన్నాళ్ల బట్టి మోజూ. ఇరవై వేలొదిలాయండీ మొత్తం. అంత తొందరగా  పీకనిస్తుందా.. పేడు! మొగుడి పీక కోసేయదూ!' అంది  కామాక్షి ఆనందంతో వెక్కిళ్ళు పెట్టేస్తో   





 

 

 

 

సరదాకేః ఆదివారం శీర్షికకు నీతిలేని బూతుకథ నీతి -కర్లపాలెం హనుమంతరావు

 

 

M


ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది. లేచెళ్ళి కాసిని

మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు.

ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు! ఈ సారి కాస్త ఎక్కువగా!

నొప్పికూడా  పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.   కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్

ఎగదంతే గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో విన్నాడు.

ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం పండుకూడా తినలేదు..  వళ్లంతా ఒహటే

ఆవిర్లు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి  మంచంమీద కూలబడ్డాడు.

గుండెల్లో నొప్పి  తెరలు తెరలుగా వస్తూనే ఉంది.

కరోనా?.. హార్ట్ ఎటాక్?!’

అనుమానంతో  గుండె కొట్టుకొనే వేగం  మరింత హెచ్చింది.

ఇప్పుడేం చేయడం?

సమయానికి ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరు. అందర్నీ తానే ఊరికి తరిమేశాడు. ఏదో

పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు దగ్గర పడుతోంది. ఇంట్లో

పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో.. మూడ్ స్థిరంగా ఉండటం

లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి పంపించాడు.. వారం రోజుల తరువాత

తిరిగి తనే   తీసుకు వస్తానని వాగ్దానం చేసి మరీ.

కథ ఇప్పుడిలా తిరగబడుతుందని తనేమైనా కల కన్నాడా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా

జరిగుంటే తగు  జాగ్రత్తల్లో తానుండేవాడే కదా!

కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే ముందే..  వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి.

డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు ఆపద్బాంధవుల ఫోన్ నెంబర్లు

దొరికాయి. డాక్టర్ గోవిందు, డాక్టర్ బండ కోదండం, డాక్టర్ దుర్వాసిని.

డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.

'గోవిందో  గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే పనిగా

మోగుతోంది.  అయినా   ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి.  సెల్ కట్

చేద్దామనుకొనే లోపుగుర్.. గుర్’ మంటూ గొంతు వినిపించింది.

'హలో!.. ఎవరూ?'

'డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!.. గ్గుండెల్లో...

న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే.. ప్ప..ట్నుంచీ'

అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ సార్! అందర్లాగా మీరూ నన్ను

వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'

'కాదా?'

'కాదండీ బాబూ! మనది పంగనామం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్.

బెల్లం సాగుతో అధికాదాయం సాధించే నవీన విధానాలు’ అనే అంశంమీద   పరిశోధన

చేసినందుకు..’  సుబ్బారెడ్డి ఫోన్ ఠక్కుమని కట్ చేసేసాడు. ‘ఇప్పుడా

సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’

రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం.. నెంబర్ వెంటనే కలసింది.

'యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'

 'ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితినంతా గుండెలవిసిపోయేలా  వివరించాడు.

ఆసాంతం  తాపీగా విని.. ఓ సుదీర్ఘ ఉచ్ఛ్వాసం  తీసుకొని మరీ 'సారీ!

మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా డాక్టర్ పట్టా తెలుగు

సాహిత్యానికి సంబంధించింది బ్రో! ‘ప్రాచీనకాలంలో జంతువుల జీవన

విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన  పాత్ర' అనే అంశం మీద కుంభకోణం

విద్యాపీఠం వారిచ్చిన స్నాతకోత్సవానంతర  పట్టా! ‘బండ కోదండం’ అన్న పేరు

విన్న తరువాతైనా మీకు నా గురించి  అర్థం కాకపోవడం విచారకరం..' ఉండేలు

సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో బాదేసినట్లు  గుండెలు

కలుక్కుమన్నాయి.  ఫోన్ కట్ చేసేసాడు.

 

మిగిలిందిక డాక్టర్ దుర్వాసిని.  సమయం చూస్తే అర్థరాత్రి దాటి అర్థ

గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు చేసేస్తేనో!  సంకోచిస్తూనే

నెంబర్ రింగ్ చేసాడు  సుబ్బారెడ్డి మార్గాంతరం లేక.

చాలాసేపు చడీ చప్పుడు  లేదు.. ఊరికే రింగవడం మినహాయించి! అదే పనిగా

ప్రయత్నించిన మీదట  అవతలి వైపు నుంచి రెస్పాన్స్ వచ్చిందీసారి!

ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో సూరేకారం పోసినంత రౌద్రం!

సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక   సమర్పించడం సగం కూడా కాలేదు

అవతలి వైపు  శాల్తీ కాళికాదేవి అవతారమే ఎత్తేసింది.

'ఎవడ్రా నువ్వు? నీకసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..  కాల్

 చేసేదికాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు!

ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు

పేషెంటేవన్న గ్యారంటీ ఏంటంట? నిజంగా నీది గుండెనొప్పేనని రుజువేంటి?

నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ ఆసుపత్రికో..

అంబులెన్సుకో!  నేరుగా ఇలా  ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?

పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు  ‘దిశ’ పోలీస్ స్టేషన్

సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా.. బీ కేర్ ఫుల్!' ఠక్కుమని

ఫోన్ కట్టయి పోయింది.

 

సుబ్బారెడ్డిట్లా  నేరుగా ఇట్లా డాక్టర్లనే తగులుకోడానికి కారణం

లేకపోలేదు. రాతకోసం  ప్రశాంతత కావాలని వేధిస్తుంటే  ఫ్రెండువెధవ తననీ

అడ్రసు తెలీని  అజ్ఞాతంలో వదిలేసి పోయాడు రాత్రి.  మళ్లీ తెల్లారి

వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా ఏంటో  తెల్సిచావదు!

ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో ఫుల్లుగా

మందుగొట్టి  గొడ్డులా పడున్నాడు.  తనదగ్గర సమయానికే  ఆసుపత్రుల నెంబర్లూ

ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ  పడక.

ఉన్న  మూడు నెంబర్లూ  బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!

పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ గుండెల్లో నొప్పి ఎక్కువై

పోతోంది. చెమటలూ ధారాపాతంగా కారిపోతున్నాయి. అక్కడికీ    నొప్పి నుంచి

దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని   న్యూస్ ఛానెలేదో ఆన్ చేసాడు.

ఐటి దాడులకు సంబంధించిన వార్తలేవో వెల్లువలా వచ్చిపడుతున్నాయ్! కేంద్ర

పన్నుల శాఖవాళ్లకు ఉన్నట్లుండి పూనకం వచ్చినట్లుంది. ఆర్థిక అక్రమాల

ప్రక్షాళన కార్యక్రమేదో పెట్టుకున్నట్లు.. బ్రీఫ్ కేసుల్తో సహా సార్ల

దండు  రెండు తెలుగు రాష్ట్రాల మీదా వచ్చిపడింది. దాడుల్లో దొరికింది

ముష్టి రెండువేల కొత్త రూపాయనోటు ఒక్కటీ! వాళ్లిచ్చిపోయిన పంచనామాలో

ఎంచేతనో అంకె పక్కన అక్షరాలు సరిగ్గా అచ్చయ్యాయి కాదు. ఆ అచ్చు తప్పును

నేతలంతా తమకొచ్చిన పరిజ్ఞానంతో పూర్తి చేయడంతో తెలుగు నేతల అక్రమార్జనల

ఖాతాలు లక్ష నుండి కోట్లకు ఉబ్బిపోయాయ్ సందు దొరికిందే  తడవుగా!

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్ ప్రచారానికి సంబంధించిన

వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి.  ట్రంపు మహాశయుడు శత్రువర్గం

మీద పడి  అడ్డమైన కారు కూతలూ అడ్డూ ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే

స్థాయిలో అవతలి వైపు నుంచీ తగ్గకుండా భాషా ప్రయోగాలు !

 

మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి రాజకీయాలమీద విరక్తి పుట్టించే

దుర్భాషలు అవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న సుబ్బారెడ్డికి మాత్రం

హఠాత్తుగా  తారక మంత్రం దొరికినట్లయింది.  మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు

సెల్ ఫోన్ అందుకున్నాడు.

 

మళ్లీ డాక్టర్ దుర్వాసిని  బెడ్ రూంలోని  సెల్ మొరుగుడు మొదలు పెట్టింది

అదే పనిగా.  ఎన్ని సార్లు నోరుమూసేసినా   మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో

దుర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న  మొగుడుగారు గయ్యిమని

లేచారు మేడమ్ గారిమీద 'మీ ఆసుపత్రి నుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవకపోతే

ఎట్లాఆనక సమస్యలొచ్చి పడితే సర్ధిపెట్టలేక చచ్చేది నేనేగా! ముందా ఫోన్

చూడు!' అంటూ.

 భర్త హెచ్చరించరికలతో ఇహ తప్పదన్నట్లు చిరాగ్గా లేచి   సెల్  అందుకొంది

డాక్టర్ దుర్వాసనమ్మ.

  …

 సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో

ఉండేలు సుబ్బారెడ్డి యమగండం నుండి బైటపడ్డాడు  చివరికి ఎట్లాగైతేనేం!

 పోలీసులు సమయానికి వచ్చి  కలగచేసుకోక పోయుంటే ప్రముఖ రచయిత

సుబ్బారెడ్డి  ఈ పాటికి పై లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా   నవల పూర్తి

చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దుర్వాసిని ఇచ్చిన అర్థరాత్రి

'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని  ‘దిశ’  టీం సీరియస్ గా తీసుకోబట్టి

గుండెనొప్పితో లుంగలు  చుట్టుకుపోతోన్న  సుబ్బారెడ్డిని 'సగం  నిర్మాణంలో

ఉన్న ఊరి బైటి భవంతిలో గాలించి మరీ పట్టుకొన్నారు పోలీసులు.   అత్యవసర

ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆగమేఘాలమీద పోలీసులే

దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్పించడం వల్ల సుబ్బారెడ్డి కథ

సుఖాంతమైంది.

అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దుర్వాసిని సైతం న్యూసెన్సు కేసులో

మరింక ముందుకు పోదల్చుకోలేదు.

***

వాస్తవానికి మనం మెచ్చుకోవాల్సింది సుబ్బారెడ్డిని.. అతగాడి

సమయస్ఫూర్తిని  కాదు. అతగాడు అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు

సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని సమకూర్చి పెట్టిన  రాజకీయ నేతాగణాలని.

అచ్చంగా ట్రంప్ భాషే సుబ్బారెడ్డి   వాడి ఉంటే ఈ కథలో ఇంత వాడి.. వేడి

పుట్టుండేవి కావు.

ఈ మధ్యన తెలుగు రాష్ట్రాలలో నిత్యం నడుస్తున్న రాజకీయ రామరావణ యుద్ధాల

పుణ్యం. ఆ సందర్భంగా ప్రజలు ముచ్చటపడి ఎన్నుకున్న ప్రముఖనేతలు ఆ ప్రజలకే

ముచ్చెమటమలు పట్టే రేంజిలో యమధాటీగా పుట్టిస్తున్న దుర్భాషాసాహిత్యం!

 

రాజకీయనేతల్లో రాను రాను మంచీ మర్యాదలనేవి పూర్తిగా అడుగంటిపోతున్నాయని

కదా     ఆదర్శవాదులు  దురపిల్లడం! అందుకు బదులుగా నేతాగణం కష్టపడి

సృష్టిస్తున్న  దుర్భాషా సాహిత్యం.. దాని ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి

అవసరం ఉందన్నదే ఈ బూతు కథ నీతి!

 కథ అంటే నీతి ఉండాలని కదా మన పెద్దలు చెబుతుండేది! ఈ ‘నీతిలేని బూతుకథ’ నీతి ఇదే!

***

 

From <https://mail.google.com/mail/u/0/#search/%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%BE/CrpPVdKwLFbtBbNsjzZrwVtwnJstVzpNglcfZHpsQtcDPTbDjdgknJbcFMZdkgxNhbQGpBCZVBkJjFLxKDJV>

 

Wednesday, November 10, 2021

ఎవరు గొప్ప? - బాలల కథ

 


ఒక చిన్న కథ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

( పాత భారతి మాసపత్రిక నుంచి సేకరించినది. ) 


ఒక దేశంలో ఒక రాజు న్నాడు. అతని వద్దకు ఒక బీద వాడు వచ్చాడు. ఆబీదవాడు తన కూతుర్ని వివాహ మాడటానికి తన పేదరికం చే భయపడుచున్నాడని రాజు అనుకున్నాడు. . అనుకుని అ పేదవానితో "నాకూతురుతో పాటు ప్రస్తుతం సగం రాజ్యము వస్తుంది. నాతదనంతరం మిగతా రాజ్యం వస్తుంది" అని ఆపేదవాని మెడలో పూలహారం వేళాడు. 


ఆ పేదవాడు హారమును మెడలో నుండి తీసి వేసి "ఏమిటీ పిచ్చి నేను పెండ్లి చేసుకోను' అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.


కాని రాజుగారి కూతురు మాత్రం “యీ పేదవానిని ఎటులయినా సాధించి పెళ్ళి అయినా చేసుకోవాలి, లేకపోతే ప్రాణాలైనా  విడవాలి అని” అతనిని తీసుకు రాపడానికి వెంబడించింది. 


రాజా గారు, అతని అనుచరులు వీరిద్దరిని వెంబడించారు. ఈ పేదవాడు కొన్ని మైళ్ళు నడిచి, కొన్ని మైళ్ళు పరుగెత్తి ఒక ఆడవిలో ప్రవేశించాడు. ఆ అడవి యితనికి  చిరపరిచయంలాగ కడనిపించింది. అడివిలోని మర్మాలన్నీ యితనికి  విశదమేనని  స్ఫురించింది. 


ఇట్లుండగా సాయంకాలమై చీకట్లావరింప  మొదలిడాయి. చీకట్లో  ఒక దూకు దూకి పేదవాడు మాయిమై పోయినాడు. 


రాకుమారి  వెతికి వెతికి వేసారి నిరాశ చేసుకుని ఆడివిలోనుండి బయటికి పోయేమార్గం తెలిసికోలేని దుస్థితిలో ఒక చెట్టుకింద చతికిలబడింది. 


ఇంతలో రాజును  ఆటవికులు సమీ పించి "విచారింపకు. అడివిలోనుండి బయటకు పోయే దారి  మాకు తెలుసు. అయితేయిపుడు గాడాంధ కారం అంతటా కమ్ముకుంది. యిపుడు దారి తెలుసుకోలేము. ఇదుగో యిక్కడొక పెద్ద చెట్టుంది. దాని క్రింద యీరాత్రికి విశ్రమిద్దాము . ఉదయం కాగానే లేచి పోవచ్చును" అని అన్నారు.


ఆ చెట్టు మీద  ఒక పక్షి కుటుంబం గూడు కట్టుకుని కాపురం చేస్తూంది. ఒక మగపక్షి. ఒక ఆడపక్షి మూడు చిన్న పక్షులు ఉన్నవి.  మగపక్షి క్రింద వున్న  వారిని చూచి భార్యతో యిట్లు చెప్పింది. "చలి అతి తీవ్రంగా ఉంది. ఇక్కడ చాలామంది  అతిధులు పరున్నారు. చలి కాచుకోవహానికి  ఏమీ లేదు .. అంటూ ఆంతట  యెగిరి వెళ్ళి ఎచ్చటనో ఎండినపుల్లలను ముక్కుతో కరచుకొని ఆతిధులముందు పడవేసింది. 


వారు వాటి సహాయంతో మంట చేసుకున్నారు. అయినా  మగపక్షికి మాత్రం తృప్తి కలుగ లేదు. భార్యతో మళ్ళీ యిట్లా చెప్పింది.

"ఇప్పుడేం చేద్దాం. ఆతిధులకు తింటాని కేమీ లేదు. వారు ఆకలితో  పరున్నారు . మనం సంసారులము. అతిథులను మర్యాద చేసే లక్షణం గృహస్తునిది. కనుక నా శక్తికొలది సహాయం చేయాలి.  నా శరీరాన్ని వారి కిచ్చి వేస్తాను" అని ఆమండుతూన్న మంటలో పడుతూండగా అతిధులు చూచి రక్షించటానికి ప్రయత్నించారు.  కానీ లాభం లేకపోయింది.


తన భర్త మంటలో పడిపోవటం చూచి ఆడపక్ష్మి తనలో తానిట్లనుకుంది.

“ చెట్టుకింద పెక్కు రతిథులున్నారు . వారికి తినుటకు ఒక పక్షే ఉంది. అది చాలదు. నా భర్త ప్రారంభించిన కార్యం ఆసంపూర్తిగా  విడవటం నాధర్మం కాదు. కనుక నాశరీరాన్ని కూడా వారి కర్పించుకుంటాను” అని అనుకుంటూ ఆడపక్షికూడా మంటలో పడింది. 


మూడు చిన్న పక్షులును తమ తలితండ్రులు చేసిన పనిని చూచి వారి పనిని అసంపూర్తిగా  వదలటం బిడ్డలుగా ధర్మం కాదని అనుకుని అవికూడా మంటలో వడ్డవి.


కిందనున్నవారు ఆత్యాశ్చర్యముతో చూడసాగారు. వారు తిండిలేకనే రాత్రి గడిపివేసి యిటువంటి ఉదారస్వభావం గలిగిన పక్షుల మాంసము తినడంకంటె తిండి లేక చనిపోవడమే ఉత్తమనసుకొని వుదయమున నే లేచి యింటికి వెళ్ళారు. 


మంత్రివర్యున కీపమాచారమును వినిపించగా అతడు ఈ  విధమున జవాబిచ్చాడు.

" ఓరాజా, యెవరి స్థానములో వారు గొప్ప అని నీవు దృష్టాంతపూర్వకముగా చూచావు . ప్రపంచంలో జీవించాలంటే ఆపక్షుల మాదిరిగా జీవించవలె. ఏక్షణమున కాక్షణము ఆత్మార్పణం చేసుకోటానికి సంసిద్దంగా ఉండాలి. ప్రపంచాన్ని నీవు విసర్జించాలంటే అందమైన కూతుర్ని రాజ్యాన్ని ఒక్కసారిగా తృణీకరించి వైచిన ఆ పేదవానిని అనుసరించు. నీవు గృహస్తుగా  ఉం డాలంటే  యితరుల క్షేమం కోసం నీ ప్రాణాన్ని అర్పించుకో. కనుక అందరు తమ తమ స్థానాల్లో గొప్పవారే. ఒకరికి విధికృత్యమైతే మరొకరికి విధికృత్యంగాదు. 


( భారతి - కథ ) 

తప్పనప్పుడు .. - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

తప్పనప్పుడు ..  - కథానిక

 -కర్లపాలెం హనుమంతరావు

 

'నీకు ఛెస్ ఆట్టం వచ్చా?' సగం ఖాళీ అయిన గ్లాసులో మరంత విస్కీ   వంపుకుంటూ  అడిగాడు వాసుదేవరావు.

'ఏదో సార్.. కొద్దిగా! కాలేజీ డేస్..  కాంపిటీషన్లలో..  తప్పనప్పుడు.. ‘  అంది పల్లవి బాస్ తన సోడాలో వంపిన  కోక్ లో మరంత సోడా  కలుపుకుంటూ,

కాఫీనే తాగదు పల్లవి. బాస్ పదే పదే ప్రెస్ చేస్తే ఇల్స్స్ కోక్ అయినా తాగక తప్పింది కాదు.

రాత్రి తొమ్మిదిన్నర దాటింది. గ్లాస్ విండోస్ గుండా ఫ్రాంక్ ఫర్ట్ నగరవీధులు  మిరిమిట్లుగొలుపుతున్నాయ్! బాస్ ఎర్రబారుతోన్న   కళ్ల జీరల్లో నుంచి ఓ మగాడు తనలోకి తొంగిచూస్తున్నట్లు గ్రహింపుకొచ్చింది  పల్లవికి. పెళ్లీడు తెలుగు ఆడపిల్ల పల్లవి, మధ్య తరగతిది.    తడబాటెటూ  సహజమే! కాకపోతే,  అలవాటైన    వృత్తిధర్మం మెళుకువగా దాన్నో మూల   అదిమిపెట్టి ఉంచింది   

బైట  చలి.. లోపలి రూమ్-ఫైర్  వెచ్చదనం. ఆమెకూ ఇబ్బ౦దిగానే ఉంది కానీ, అన్నీ అందరికీ ఇళ్లల్లోనే చెప్పుకోలేని   పరిస్థితులు ఇవాళ్టివి.    ఒహ చోట కొలువంటూ కుదురుకున్నా కొన్ని సహించాలి.. తప్పవు!

 వయా రూట్  జర్మన్ ఫ్రాంక్ ఫర్ట్ లో హెల్డప్పయ్యన్నాడు ప్రస్తుతం  వాసుదేవరావు. యూఎస్  సియోటల్లో బిజినెస్  సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని  బ్యాక్ టు హైదరాబేడొస్తో..   అఫ్ఘనీ స్కైస్ ఫ్లైయింగికి  అనుకూలంగా లేకపోవడం చేత! 

కాంప్లికేటెడ్ ప్రొజెక్ట్స్ వచ్చినప్పుడు పర్శనల్ అసెస్టెంట్ పల్లవిని ఏరి కోరి తన వెంట తెచ్చుకోడం వాసుదేవరావుకో   సెంటిమెంట్.. ఆమె అదృష్టం బాగుండి ఈ సారీ ఎప్పట్లానే ఈ ఒన్ మిలియన్ ప్రాజెక్టు లైన్ షేర్     కంపెనీకే సానుకూలమవడంతో బాస్ మంచి జాలీ మూడ్ లో ఉన్నాడు. అది పసిగట్టే మూడోసారి తన ప్రమోషన్ విషయం కదిపింది పల్లవి  సియోటల్లో బైలుదేరినప్పుడే. వీక్ డేస్ టెన్షన్నుండి పూర్తిగా    రిలాక్సయే దారులు వెదికే బాసుకు  హఠాత్తుగా పల్లవి రిక్వెస్ట్  గుర్తుకొచ్చింది.  

మధ్య దారిలో ఇబ్బందులేవైనా వస్తే  ఫ్లైట్ తిరిగి రిజ్యూమయ్యే దాకా ఎగ్జిక్యూటివ్ క్లాస్  కు ఆ లైఫ్ స్టైల్ కు తగ్గట్లు  సూట్స్ అలాటయ్యే రూలొకటుంది.  నిబంధనల కింద తెల్లారి ఫ్లైట్  తిరిగి బయలుదేరే దాకా విశ్రాంతి తీసుకునే నిమిత్తం వాసుదేవరావుకో ఫైవ్ స్టార్ హోటల్ టాప్ మోస్ట్ ఫ్లోర్ చివర్న ఎకామిడేషన్ ఎలాటయింది. రిక్వస్టు మీద పల్లవికీ  పక్క రూమే ఇవ్వడంతో  వాసుదేవరావు మైండ్ ను   మొదటిసారి ఈ ఆలోచన మెలిపెడుతోంది..  పల్లవిని ఎలాగైనా తన ముగ్గులోకి దింపుకొని ఈ నైట్ ఎంజాయ్ చెయ్యాలని! ఒకప్పటి గ్రాండ్ మాస్టర్  మిస్టర్ వాసుదేవరావు పనిగట్టుకుని మరీ  చదరంగం ప్రస్తావన  తన ముందుక్కు తెచ్చిన ఆంతర్యం గ్రహించలేనంత అమాయకురాలైతే కాదు మిస్ పల్లవి.

 

పాతికేళ్ల పల్లవి ఇండియన్ ఫెమినిష్  ఎథీరియల్    బ్యూటీనంతా ఒకే చోట కుప్పేనంత అందంగా ఉన్నా,  ఇప్పటి దాకా ఆమె సెఫ్టీ జోనుకేమీ పరీక్ష ఎదురయింది కాదు. అందుక్కారణం తన బాస్ లోని  జెంటిల్ మన్ షిప్పేనని ఆమెకూ తెలియకపోలేదు.  కానీ, మొగాడులోని మొగాడు  ఏ క్షణంలో తన ప్ర'తాపం' చూపిస్తాడో ఎవడికి తెలుసు!  'వేరే దగ్గర మాత్రం ఇంతకు మించి మంచి వాతావరణం ఉంటుందన్న గ్యారంటీ ఏముంటుంది? తెలీని గందరగోళం కన్నా.. తెలిసున్న ఈ మేళంతోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుంద'న్న ఫిలాసఫీలో గల  మిస్ పల్లవికిప్పుడు దేశం కాని దేశంలో కొత్త సమస్య ఎదురయింది!

ఛెస్ బోర్డ్ మీద పావులు సర్దే పల్లవితో 'పందెం ఏంటి పల్లవీ?' అనడిగాడు వాసుదేవరావ్ సాధ్యమైనంత  చిరునవ్వు మొగంతో.

'మీతో నాకు పందేలేంటి సార్.. సిల్లీగా!' అంది పల్లవి సిగ్గుపడుతూ.

'పందెం లేకుంటే ఏ ఆటా పసందుగా ఉండదు మ్యాడమ్! జస్ట్ ఫర్ ఫన్ సేక్.. ఏదో ఒకటుండాలి'

'మీ ఇష్టం సర్! అదీ మీరే చెప్పండి! నా బుర్రకు అట్లాంటి  ఐడియాలు తట్టవ్!'

'ప్రమోషన్ అడుగుతున్నావుగా చాలా కాలం బట్టి! విన్నయితే  ఆర్డర్ ఇప్పుడే నీ చేతిలో పెట్టేస్తా!'

'మరి లూజయితే సర్?'

'ఏమీ లేదు' అన్నాడు బాస్ మరో సిప్ గొంతులోకి తీసుకుంటూ.

హర్టయినట్లు చూసింది పల్లవి 'అదేం బావుంటుంది సర్! ఏదో ఒహటి చెప్పండి.. చిన్నదైనా సరే.. ప్లీజ్' అంది పల్లవి దృఢంగానే.

‘ఆ స్వాభిమానమే ఈ పిల్లలోని  స్పెషల్ అట్రాక్షన్. వేరే ఎంప్లాయీస్ కు మల్లే తను దేనికీ దేబిరించదు!’ అనుకున్నాడు వాసుదేవరావు

'సర్సరే పల్లవీ! చెక్ చెప్పిన ప్రతి సారీ వెనక్కి తీసుకోడానికి నేనైతే ఓ 'కిస్' తీసుకుంటా! నువ్ గానీ చెప్పి వెనక్కు తీసుకుంటానంటే ఓ టూ థౌజంట్ కేష్ఇచ్చుకుంటా! ఎవరికైనా త్రీ రౌండ్సే ఛాన్స్. ఓకేనా?'

పల్లవి సైలంటయిపోయింది.

'పోనీలే! నీ కంత ఇదిగా ఉంటే.. ఆట వద్దులే! హాయిగా నీ రూముకు పోయి పడుకో పల్లవీ! ఎర్లీ హవర్సులో ఓ సారి వచ్చి నన్ను లేపి పో!' అంటూ ఆవులిస్తూ లేవబోయాడు వాసుదేవరావు.

'సరే సర్! ఈ ప్రమోషనూ, మనీ రెండూ నాకూ మా ఫ్యామిలీకి అవసరమే!' అంది పల్లవి.

'డోంట్ వరీ పల్లవీ! గెలుపోటములు ఏ ఒక్కరి సొత్తూ కాదు' అంటూ  సిసీలియన్ ఓపెనింగ్ వేశాడు వాసుదేవరావు. '

ఆట నడక ఆరంభమయింది.

పల్లవి బలగాలు వడివడిగా తరుగుతున్నాయి. వాసుదేవరావులో ఉత్సాహం పెరుగుతోంది. ఎదురుచూసే  అవకాశం ఇంత సులభంగా చేతికందుతుందని అతగాడనుకోలేదు. పల్లవికి చదరంగంలో కేవలం బేసిక్స్ మాత్రమే తెలుసు! కాలేజీ కాంపిటీషన్స్ కేవలం తన దగ్గర ప్రదర్శించిన డాంబికమే!

 ఐదు నిమిషాలయినా కాకుండానే 'చెక్' అన్నాడు వాసుదేవరావు.

రెండు నిముషాలు ఆలోచించి..'ప్లీజ్ విత్ డ్రా సర్!' అని  అడిగింది పల్లవి సిగ్గుపడుతూ.

'మరి.. '

‘ప్లీజ్! మరింకేదైనా పందెం చెప్పండి.. సులువైనది. రెండూ చెంపలూ వాయించుకోమంటారా.. అందుకు బదులుగా!’

‘సంపెంగ రేకుల్లా ఉన్నాయా చెంపలు! నువ్ తప్పు చేస్తే వాటికా శిక్ష?’ బిగ్గరగా నవ్వుతూ ‘సారీ’ అన్నాడు వాసుదేవరావ్ అదోలా బేలమొహం పెట్టి. తాగే డ్రింక్ చూపించే ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

'ఫస్ట్ టైం ! ఎంబ్రేసింగ్ గా ఉంది. తప్పదంటున్నారు.  పోనీ, ప్లీజ్! హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోర్ హ్యాండ్ సర్!' అంది ప్లీజింగ్ వాయిస్ తో చేయి  ముందుకు చాపుతూ.

తామరతూడు వంటి ఆమె చేతిని అందుకొని లిప్ తో ఫోర్ హ్యాండ్స్ ను టచ్ చేస్తోంటే.. గుడెలు దడదడలాడాయి వాసుదేవరావుకు.  మనసు ఎటెటో వెళ్లిపోతోంది.. అధీనం తప్పి!

'చేతి మీదనే ఇంత రంజుగా ఉంటే ఇహ చెంపల మీదా.. ఆ పైన  లిప్స్ మీదా ..'

ఊహకే వాసుదేవరావ్ గుండెలు గుబగుబలాడాయి!

బాస్ చెక్ మూవ్ రివర్స్ చెయ్యడంతో ఆట మళ్ళీ ముందుకు సాగడం మొదలుపెట్టింది.

పల్లవి ఈ సారి అంత తొందరగా దొరకడంలేదు.  ‘తన దగ్గర ఇంత ఆట ఉందని ఇందాక అనిపించలేదే’ అనుకున్నాడు బాస్;

మరింత శ్రద్ధగా ఆట  మీద దృష్టి పెట్టినా ఈ సారి చెక్ చెక్ చెప్పడానికి పది నిమిషాలు టైం పట్టింది వాసుదేవరావుకు.

'వెనక్కి తీసుకోనా? అని అడిగాడు వాసు బాసు వాయిస్ లో కొంటెతనం పెంచి.  

'తప్పేదేముంది సర్!' అంటూ తలెత్తకుండానే చెయ్యందించింది పల్లవి.

'నో!.. నో!..నో! పునరుక్తి దోషం పనికిరాదు. 'ఈసారి' అంటూ తన చెంప చూపించాడు బాస్.

'మరి మూడో సారయితే?' భయంగా ఆడిగింది పల్లవి.

'అన్ని సార్లూ నేనే చెప్పాలనేముందమ్మాయ్? చూస్తున్నాగా! యూ ఆర్ ఆల్సో అ  స్మార్ట్ ప్లేయర్.' అన్నాడు బాసు పల్లవి మరీ బెదిరి వెనక్కివెళ్లిపోతుందెమోనని!

ఒక్క క్షణం ఆగి నిదానంగా అంది పల్లవి 'స్మాల్ రిక్వెస్ట్ సర్! ఈ సారిది.. అయితే గియితే మూడో సారిది కూడా.. ఒకేసారి తీసుకోవచ్చుగా! ప్లీజ్.. ప్లీజ్..'

'వై.. పల్లవీ.. ఎందుకలాగా?'

'సర్! నేను మీలాంటి గ్రాండ్ మాస్టర్ని కాను. రెండు,  అయామ్ జస్ట్ ఎ గర్ల్.. దట్ టూ ఎ నొవిస్!. మీ ఫస్ట్ కిస్ కే బాగా డిస్టర్బయ్యున్నాను సర్! ఇప్పుడే సెకండ్ ది కూడా అంటే ! ఈ మాత్రం కూడా ఆడలేను సర్! ప్లీజ్ కన్ సిడర్ సర్!'

అందమైన ఆడపిల్ల అలా అడిగేస్తుంటే  ఎ పురుషపుంగవుడికైనా ఎట్లా 'నో' అని బుద్ధేస్తుంది?

వాసుదేవరావ్ పల్లవిని హ్యాపీ మూడ్ లో ఉంచి ఎంజాయ్ చెయ్యాలని ముందు నుంచే ఫిక్సై ఉండె!

నొప్పించి పుచ్చుకునేవి, ఒప్పించి పుచ్చుకునేవి .. రెండింటి మధ్య ఉండే తేడా వాసుదేవరావ్ వంటి హై-క్లాస్ ఎగ్జిక్యూటివి తెలీకుండా ఉండవు! ఈ ముద్దులు వంటి శృంగార చేష్టలు బిట్లు బిట్లుగా కాకుండా ఒకె ఫ్లోలో ఇచ్చి పుచ్చుకుంటే పుట్టుకొచ్చే అనుభూతే కదా అసలైన అనుభూతి!

 నిజానికి పల్లవి కోరిక వల్ల తనకే మరంత ఉపయోగం! వెంట వెంటనే పక్కనా .. పైనా  గాఢంగా తీసుకునే ముద్దు  ఘాటుకు పల్లవి తరహా ఆడపిల్లలు మళ్లీ తేరుకోవడం అంత సులభం కాదు.  

తన పని అనుకున్న దాని కన్నా సులువయే సూచనలు కనిపించడంతో సంతోషంగా తలాడించి మంత్రిని వెనక్కు తీసుకుని బదులుగా బంటుతో ఎత్తువేసి ఆమెకు ఆడేందుకు అవకాశం కల్పించాడు బాస్ వాసుదేవ్ రావు.

మూడో సారి కూడా ‘చెక్’ చెప్పేసి ఎప్పుడెప్పుడు ఆమెను ఆక్రమించుకుందామా .. అని ఒహటే తొందరపెట్టేస్తోంది మనసు.

కానీ, ఎటు నుంచి వస్తున్నా ఆ పిల్ల మహా వడుపుగా తప్పుకుంటోందీ సారి.. కాలేజీ కాంపిటీషన్ల వరకే ఆమె అట.. అంటే.. నమ్మేందుకు లేదు!

వాసుదేవరావు ఆటలో తడబాటు ఎక్కువయింది. పొరపాట్లు చెయ్యబోయి సరిదిద్దుకున్నాడు .. భావోద్వేగం కలిగిస్తున్న వత్తిడి ఒకటైతే.. ఖాళీ అవుతున్న మూడో రౌండు గ్లాస్ మరోటి!

'ఈ పిల్ల దగ్గర ఇంత ఆటుందని ఊహించలేదు! తెలిసుంటే ఈ ప్రమోషన్ తాయిలం చూపించేవాడు కానే కాదు!

ప్రమోషన్ ఇవ్వాల్సొస్తుందని కాదు గాని, వాసుదేవరావు బాధ.. ఇక ముందు ఈ ఆశతో ఆమెనో, ఆ ప్లేస్ ను ఆశించే మధురిమనో  ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉండదేమోనని.

'ఎలాగైనా సరే.. మూడో సారి ఆమె రాజును దిగ్బధం చేసి ఆమెను తన కౌగిట్లో బంధించి తీరాల్సిందే! రాక రాక వచ్చిన అవకాశం! మిలియన్ డాలర్ బిజినెస్ ను ఈజీగా  చేజిక్కించుఉన్న వాసుదేవరావ్.. ఒక మిడిల్ క్లాస్ ఆడపిల్లను చేజిక్కించుకునే విషయంలో తలకిందులయిపోతున్నాడు!

' గ్రాండ్ మాస్టర్ వాసుదేవరావు సర్వశక్తులు వడ్డి ఆటలో పావులు కదుపడం చాలా కాలం తరువాత ఇది మొదటిసారి.  

పల్లవి తదేకంగా బోర్డు వంకే చూస్తూ పావులు కదుపుతున్నది ప్రశాంతంగా. ఆమె పక్కనున్న గ్లాసులోని కోక్ మూడో వంతు కూడా పూర్తికాలేదింకా!

మరో పావు గంట తరువాత అర్థమయిది వాసుదేవరావుకు తాను పూర్తిగా డిఫెన్సులో పడిపోయాని.

ఉక్రోషం ముంచుకొచ్చేసిందీ సారి అతనికి. పెదాల దాకా వచ్చిన ముద్దులు మిస్సయిపోతున్నాయన్న నిస్పృహ ఒక వంక. ఊరించిందేదీ అవకపోగా, ఒక  మిడిల్ క్లాస్ గర్ల్ చేతిలో  ఓటమి పాలవబోతున్నందుకు అవమానం మరో వంక!

 ఒక చోట స్థిరంగా ఉండనీయని  మానసిక  వత్తిడి  నేపథ్యంలో  వాసుదేవరావ్ తొందరపడి వేసిన తప్పుడు ఎత్తు నుంచి సత్వరమే లాభం పిండుకుంటూ 'చెక్' అనేసింది పల్లవి.

వాసుదేవరావు కళ్లు బైర్లుకమ్మాయొక్కసారి! తన రంధిలో తానుండగా పల్లవి తెలివిగా ప్రత్యర్థి రాజును గోతిలో దింపేసింది. ఆ రాజును తప్పించే దారింకే మాత్రం కనిపించలేదు వాసుదేవరావుకు శతవిధాల ప్రయత్నించినా.. పది నిమిషాల పాటు.  

రెండు వేలు పారేసి  రాజుకు అవకాశం ఇప్పించవచ్చు. అడిగితే ‘కాద’నే సాహసం ప్రయివేట్ కంపెనీల కింది ఉద్యోగుల్లో ఉండదు. కానీ, ఒక సబార్డినేట్ ముంచు చేతులు చాచి చులకన అయ్యే కన్నా .. ఆమె తపించే ఆ ప్రమోషనేదో  పారేస్తే  తన పరువు నిలబడుతుంది.. తన  దృష్టిలోని ఇమేజ్ కీ భంగం వాటిల్లకుండా కథ సుఖాంతమవుతుంది.

తరువాతయినా ఆమె  ముందు  ఇహ ఎన్నటికి ఇంతకన్నా మెరుగైన ప్రదర్శన చేయగలడన్న ఆత్మస్థయిర్యం సన్నగిల్లిన బాస్ వాసుదేవరావు  పూర్తిగా డిస్టర్బయిన మూడ్ లో పల్లవి ప్రమోషన్ ఆర్దర్ మీద అప్పటికప్పుడు సంతకం గిలికేశాడు.

---

'మన బాస్ చెస్ లో గ్రాండ్ మాస్టర్ కదే!. నువ్వేమో అసలు చెస్ ఆటంటేనే బొత్తిగా గిట్టనిదానివాయ! అయినా,, అంత ధైర్యంగా పందెం ఎలా కాశావ్! అందులోనూ ఇలాంటిది?!..' అని అడిగింది వనజ రిటనొచ్చిన తరువాత ఆఫీసు క్యాంటీన్లో కూర్చుని ఈ తమా’షా’ కథంతా విన్న తరువాత.

'నాకు ఛెస్ లు చెక్ లు.. అంతగా తెలీని మాట నిజమేనే! .. కానీ మగాడి నైజం మా బాగా తెలుసు! కాబట్టే మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా  చేతి మీద వరకు మాత్రమే ఆ దిక్కుమాలిన ముద్దు కథ నడిపించా!  అసలు ‘ముద్దు’ ప్రపోజల్ కే ఓకె అనడం తప్పంటావా? తప్పనప్పుడు.. మనకై మనం తప్పు చెయ్యనప్పుడు ఏదీ ‘తప్పు’ కాదు! ఇది మా బామ్మ నాకు నేర్పిన తన కాలం నాటి పాఠం!’ అంది పల్లవి చల్లగా నవ్వేస్తూ!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక 16 -10 -2008 లో ప్రచురితం)   

  

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...