Tuesday, February 8, 2022

ఆంధ్రప్రభ- హాస్యం - వ్యంగ్యం - గల్పిక గ్రంథ చోరులు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ప్రచురితం - 02 -12 - 2017 )


 ఆంధ్రప్రభ- హాస్యం - వ్యంగ్యం - గల్పిక

గ్రంథ చోరులు 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 02 -12 - 2017 ) 

 

 

ఆన్ లైనులో కెళ్లి కెలుక్కుంటే చాలుకాపీ రైట్ చట్టం పట్టింపు లేకుంటే కామ్గా కాపీపేస్టు చేసుకొని కర్త పేరు మార్చేసుకోడం మహా సులువు.  ఆకాశమంత జ్ఞానానికి ఆవిష్కర్తలం అనిపించు కోవచ్చు .. ఇవాల్టి డిజిటల్యుగంలో కోక్ తాగినంత సేపట్లోకేవలం అచ్చు బుక్కులు మాత్రమేలభ్యమయే దిక్కుమాలిన కాలంలో గ్రంథ చోరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. పాపం!

 

వనితవిత్తనాదుల తస్కరణలక్కూడా సులువు  సూత్రాలు చెప్పే శాస్త్రాలున్నకాలంలో పుస్తకాలు కొట్టేసే చిట్కాలకు  గైడ్లు మచ్చుక్కి ఒక్కటైనా  దొరక్కపోవడం గ్రంథచోరులకు పూడ్చలేని  లోటేఅరవై నాలుగు కళల్లోచౌర్యమూ ఒక విభాగమేఅయినా..  శాఖ అభివృద్ధి ఎందుకుపుంజుకోలేదోచిత్రమే కదా?

 

పుస్తక చౌర్యం   మరీ అంత అకార్యమైన కళేం కాదుయమధర్మరాజులుగారుగ్రంథదౌర్యం మీద   ఉద్గ్రంథమే  రాసారని వినికిడి.   దొంగ వెధవగుట్టు చప్పుడుగా నొక్కసాడో గాని .. ఇప్పుడా తాళపత్రాలు గ్రంధాలయంలోనూ కనపడ్డంలేదు!

 

పుస్తక చౌర్యానికి  బోలెడంత గ్రంథముందిఆశించిన పుస్తకంఅందుబాటుకు  రావాలికోరుకున్న విషయం అందులో కళ్లబడాలిఇప్పట్లా   సెల్ ఫోనో అరచేతిలో ఉండుంటే ఠప్పమని  క్లిక్కుతో అంశం మొత్తంమన సొంతమవుతుందిజిరాక్సులకే దిక్కులేని కాలంలో ముత్తెమంతసమాచారం సేకరించాలన్నా పుస్తకం మొత్తం ఎత్తేయడం  ఒక్కటే ఉత్తమమార్గంగా ఉండేది.

 

అరువు అడిగి పుచ్చేసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగేమరో దారి ఉన్నా.. కొంతమంది పుస్తకదాతల  శక్తి మరీ దారుణంగాఉంటుందిఏనుగు మెమరీ కూడా వాళ్ల ధారణా శక్తి ముందు చీమ తలంతఏళ్లు పూళ్లు గడిచి.. ఎన్ని

యోజనాల దూరంలో స్థిరపడ్డా  ప్రయోజనం శూన్యంఆనవాళ్లవీ లేకుండాఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రారబ్దం బాగోలేకుంటే ఫలితంసున్నా.  నిశ్శబ్దంగా వెనక పాటుగా  వచ్చి ' ఏవండాయ్ మూర్తిగారూ ... ఎట్లా ఉన్నారూ '  అంటూ వీపు మీద  ధబ్బుమని  విమానం మోతమోగించేయచ్చుఆనక ముసి ముసి నవ్వుల్తో నిలదీయడంతో దోష విచారణకథ మొదలవక తప్పదు కోర్టు.. బోను... సీనొక్కటే తక్కువతలపండినవకీలుగారు  కీలుకు  కీలు విరిచేసినట్లు సాగే  పుస్తకదాత విచారణనుఎదుర్కోవడం ఎంత అబద్ధాలకోర్సు డాక్టరేటుకైనా తలకు మించిన పని. 'ఫలానా సంతొమ్మిదొం దల అరవై తొమ్మిది మార్చి మూడో తారీఖు మిట్టమధ్యాహ్నం పూట ఎండన పడి తమరు మా ఇంటి కొచ్చారు మర్చారూ!ఏదోమిత్రులు కదా అని ఆతిథ్య ధర్మ నిర్వహణార్ధం కాశీ చెంచెడు  మజ్జిగ నీళ్ళునిమ్మరసం పిండి మరీ తమరికి సమర్పించుకున్న సంగతీ మర్చే ఉంటారు అప్పుడు తమరేం ఉద్ధరించారో తమరికి  గుర్తుండదు గనక గ్రంథ దాతగాఇప్పుడు గుర్తుచేయడం నా ధర్మం.    ఎండ చల్లబడిందాకా బైటికివెళ్లలేనంటే 'పోనీలే... టైమ్ కిల్లింగుగా  ఉంటుందని నా సొంతగ్రంథాలయం నుంచి ఎప్పట్నుంచో సేకరించి దాచుకున్న చలం 'ఊర్వశిఅరుణాచలంలో

చలంలో ఆయన స్వహస్తాలతో అట్టమీద పొట్టి సంతకం గిలికిచ్చినఅపురూపమైన పుస్తకం తమరికి ధారాదత్తం చేసానుబుద్ధిజ్ఞానంఅప్పటికింకా పూర్తిగా వికసించలేదులేండి  నాకుఅపుకోలేని కాలకృత్యం  పని మీద నేనటు లోపలికి వెళ్లి తిరిగొచ్చిన ఐదు నిమిషాలలోపే తమరుజంపుఖరీదైన వస్తువులింకేమైనా చంకనేను కొని ఉడాయించా రేమోననిఅప్పుడు మా రమారాణి  గుండెలు బాదుకొన్న చప్పుళ్లు ఇంకా  నా చెవుల్లోప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి సుమా మా ఆవిడ శోకన్నాలు నాకు నిత్య కర్ణశ్రవణానందాలే కనక దానికి అట్టే ఫీలవలేదు కానీ నా 'ఊర్వశిని తమరు  గుట్టు చప్పుడు కాకుండా   చంకనేసుకొనలా చెక్కేయడమే చచ్చేబాధేసిందండీ మాస్టారూ !   నిజమైన స్నేహం కన్నా పుస్తకమే విలువైందనితమరానాడు ప్రాక్టికల్గా నా కళ్లు తెరిపించారు  చూఉండేఅందుకు థేంక్స్

చెప్పుకుందామనుకొన్నాఏదీ తమరి అడ్రసురామాయణంలో సీతమ్మవారి  దర్శనం కోసం  శ్రీ రామచంద్ర మూర్తయినా  అంతలా ఆర్తి చూపించాడోలేదో ! నా ఊర్వశి కోసంతమరి వేరెబౌట్సు  కోసం నేను చెయ్యని ప్రయత్నంలేదుఇప్పటికైనా కనిపించారు అదేపది వేలు ఎన్ని వేలు కావాలోఅడగండి .. ఇచ్చేస్తాకానీ.. మళ్లీ నా ఊర్వశిని మాత్రం నాకు తిరిగిఇచ్చేయండి తమరింటికెళదాం రండి! '  అంటూ జబ్బు పట్టుకొని నడిరోడ్డుమీదే నిలబెట్టి దెబ్బలాటకు దిగే దిక్కుమాలిన  పుస్తకాల పురుగులుఇప్పటికీ తారసపడుతూనే ఉంటారుఅందుకే తస్కరించే ముందు పుస్తకంవివరాలతోనే కాదు.. పుస్తక నైజంతోనూ    అప్రమత్తంగా ఉండడం  అవసరం.

 

అవును మరి.. ఒక గ్రంథం తయారీకి అది రాసేవాడి శరీర కష్టంవిఘ్నేశ్వరుడి బాధను మించి ఉంటుంది! 'భగ్నపృష్ట కటిగ్రీవ  స్తబ్ధ  దృష్టిం అథో   ముఖః కష్టేన లిఖితః గ్రంథంయత్నేన పరిపాలయేత్ '  అనిఊరికే అనరు కదా ఎవరైనావెన్ను వంకరవుతుంది ; మెడ కొంగలాసాగిపోతుందికళ్లు పొడుచుకుని తల కిందకు వేలాడేసుకుని నానా తంటాపడతారండీ  పుస్తకం గిలకటానికీఅష్టాదశ పర్వాల మహాభారతాన్ని వ్యాసులవారలా   వ్యాసంలాగడగడా చెపుకు   పోవచ్చుఅది వట్టి  నోటిపనికానీ.. చెప్పింది చెప్పినట్లు క్షణమైనా గంటం ఆపకుండాచెవులతోవింటూ బుద్ధితో ఆలోచిస్తూ చేత్తో బరాబరాతూచా తప్పకుండా  రాసుకుపోవడం మీ వల్లవుతుందా .. నా వల్లవుతుందా  ?! దేవుళ్లు కాబట్టిఏమాయో మర్మమో చేసి కార్యం 'ఇతి సమాప్తంఅనిపించి ఉండవచ్చుమానవ మాత్రులం మన  కెట్లా సాధ్యం అందునా పిట్ట ఈకలతో ఎండుతాటాకుల మీద గుండ్రటి అక్షరం ఆకారం చెడకుండా రంధ్రాలు పొడవడంఎంతా కష్టం ! 

 అంత కష్టం కాబట్టే పుస్తకాలను బంగారం కన్నా ఎక్కువ భద్రంగాదాచుకోవా లని  పెద్దలు సుద్దులు చెప్పింది కష్టమూ లేకపోతే   వేదాలునీళ్లలోకి చేజారినప్పుడు విధాత  విధంగా బేజారవుతాడు గ్రంథాలువిలువ తెలుసు కాబట్టీ  కవిత్వం  కట్టలు కంటబడగానే లటుక్కుమని నోటకరుచుకొన పారిపోయాడు సోమకాసురుడు ! " పోతేపోయాయి లేవయ్యామళ్లీ రాయించుకో.. పోఅని కసురుకొని వదిలేయలేదు కదా  పరమాత్యుడుపనిమాలా మత్స్యా వతార  మెత్తి మరీ మొరాటు  రాక్షసుడితో ప్రాణాలకు తెగించి పోరాడాడుతిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చి 'ఇహముందైనా జాగ్రత్తగా ఉండమని మందలించాడంటానే తెలియడం లేదాపుస్తకాల విలువవిలువైన సామాను  ఎక్కడుంటాయో దొంగతనాలూఅక్కడ తప్పకుండా జరుగుతుంటాయిగ్రంథాలయాల దగ్గర అందుకే పగటిదొంగలు తారట్లాడేది.  పుస్తకం చూస్తున్నట్లే చూసి కటిక్కున పుటను చించి  జేబులో కుక్కేసుకునే  కుక్క పాట్లు పడ్డం   పుస్తకాల తస్కరణం   గతంనుంచే  చాలా మంది  సాధన చేస్తుండే  వాళ్లు వెసులుబాటుంటే అసలుప్రతిని ప్రతినే  లేపేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించే గజదొంగలుఉండబట్టే తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలో మన తెలుగు తాళపత్రగ్రంథాలు చాలా వాటికి కాళ్లొచ్చినట్లు  మధ్య  తమిళనాడుసాయంకాలం దినపత్రిక వివరాలతో సహా ప్రచురించిందండీ

 

 డిజిటల్ కాలమే కాదు.. పది  డిజిట్స్  జీతమొచ్చే  గొప్ప కొలువున్నా  మనిషి తనలోని  తస్కరణ  తీపరం ఆపుకోకపోవడం ఆశ్చర్యంఅనిపిస్తుంది  గొడవంతా ఇప్పుడెందు క్కానీ.. ముందు నా చలం ఊర్మిళపుస్తకం తేల్చండినడవండి తమరింటికి ' అని వెంటబడి తరిమే గ్రంథదాతలూ ఉంటారుఅందుకే తస్మాత్ ఓాగ్రత్త పుస్తకాల చోరులూ ! 

 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 02 -12 - 2017

 

ఈనాడు- సంపాదకీయం కృషీవలుని విలాపం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో - ప్రచురితం - 18 -01 - 2015 )

 ఈనాడు- సంపాదకీయం 

 కృషీవలుని విలాపం 

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- సంక్రాంతి పథం పేరుతో  - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

'తిండి  లేకుండా జీవించే మానవ వంగడాన్ని ఎవరూ సృష్టించ లేరు' అంటారు ప్రఖ్యాత చారిత్రక తత్వవేత్త డి.డి. కోశాంబి. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచి మా/ గాణములన్‌  సృజించి, ఎము/ కల్ నుసిజేసి పొలాలు దున్ని' ఇంత అన్నం పెడుతున్నది రైతే.  ఏ జాతికైనా అతడే వెన్నెముక. వరదల అనంతరం పేరుకుపోయిన బురద ఒండ్రుమట్టిలో విత్తులు చల్లి ధాన్యం పండించిన తొలి అనుభవం మొదలు ప్రపం చవ్యాప్తంగా కాలానుగుణంగా వస్తున్న మార్పులకు దీటుగా నిలదొ క్కుకునే నేటి యోచనలదాకా రైతుకథ ఒక మహాభారతమంత. తొలిదశ కథలను, జాతక కథలను చెబితే... జానపదుల గాథలు ప్రతీ అడుగును తడుముతుంటాయి. 'ఏరువాకమ్మకు ఏం కావాలి?' అని అడిగి 'ఎర్రెర్రని పూలమాలలు, ఎరుపు తెలుపులు మబ్బుటెండలు, పొలంగట్టున టెంకాయ వడపప్పులు' అంటూ ఆరుబైటి హారతి పరిమళాలుగా పల్లెపట్టులు సాగుసంబంధాలను కొనసాగించడం ఒక్క భరత ఖండానికే చెల్లుతుందేమో! సప్తసముద్ర ముద్రితమైన భూమండలాన్ని పరశురాముడు సంతర్పణ చేసే. సందర్భంలో యాచించి బతకడం తలవంపుగా ఉంది.. చిన్న మడిచెక్కనైనా దానం పట్టమని ఆదిభిక్షువు చెవిలో పోరుపెడుతుందట పార్వతీదేవి. మిత్రుడు కుబేరుడిని అడిగి  విత్తులు, బలరాముడినడిగి నాగలి, యమధర్మరాజునుంచి దున్నలు తెచ్చి త్రిహలం సాయంతో వ్యవసాయం చేసి గౌరవంగా బతుకుదామని ఆ గౌరమ్మతల్లి ఆశ. 'అడిగిన జీతంబివ్వని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటే/ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు' అన్నది మహిలోని సుమతుల భావన. 'ఉండి తిన్నను లేక పస్తున్న  గాని/ యాస చేయవు పరుల కష్టార్జితంబు' అని కదా కృషీవలుడి గురించి దువ్వూరివారి ప్రస్తుతి.

 

కళ్ళంలో పైరు నూర్చి ఏడాదంతా నమ్ముకుని పనిచేసిన సాటి పనివాళ్లందరికి నియమానుసారం పొల్లుపోకుండా పాళ్లు పంచిన పదప మాత్రమే  మిగులు ధాన్యాన్ని బళ్లకెత్తించి ఇళ్లకు మళ్ళించే రైతన్నను మించిన  ప్రజాపోషకుడు జగాన ఎంత గాలించినా ఏ యుగానా కనిపించడు. 'దొరలు ఇచ్చిన పాలు కంటే ధరణి పుత్రుడిచ్చిన పాలు మేలు' అన్న నానుడి ఊరకే పుట్టిందా! కానీ, 'కొర్రు గుచ్చిన దేశమందు కరవులుంటాయా? దుక్కి దున్నిన దేశమందు దుఃఖ ముంటుందా? కావు నడచిన భూమి మీద ఏపు తగ్గిందా?'  అన్న పాట మోట నాగలి దున్నుకుంటూ పాటలేవో పాడుకుంటూ పాటుపడే రైతుకు ఊరట ఇచ్చే రోజులు వెళ్ళిపోయాయేమో! సమకాలీన మాయాజాలంలో రైతు చిక్కిన దుస్థితిని ఒక ఆధునిక కవి వ్యంగ్య వైభవంగా వెలిబుచ్చిన వైనమే ఈ పరిస్థితికి అద్దంపడుతుంది. గొప్ప నాయకులు కొద్దిమంది కుప్పగా  వచ్చి 'ఎద్దుల జత మాకు జమ్ము సుమ్మి/ నిన్ను ఉద్ధరించి మిన్నగా జేతుము' అని హామీ ఇచ్చి పశువులను తోలుకెళ్ళారట. 'నీదు కొడవలిమ్ము లేదు అనకు/ నీకు సేవ చేయ నేలపై పుట్టినాము' అని మాట  ఇచ్చి  కొడవలితో మాయమయిందట మరో మాయదారి గుంపు. 'అవుదూడల నిమ్ము అన్ని విధముల నీకు/ సేవ చేయగలము' అని గోపు సాక్షిగా మాయచేసిన మూక మరొకటి. బక్కరైతును అప్పుడైనా వదిలారా! 'నిన్ను చేరదీయ   వచ్చినాము సుమ్మి భగవాను సాక్షిగా/ వేగ తెమ్ము నీదు నాగలి 'కొని' ' అని తీపిమాటలు చెప్పి అదీ తీసుకుని పోతే- చివరికేమీ లేక రైతు దీనుడైన వైనం ఇప్పటి రైతన్న దైన్యాన్ని   అద్దంలో చూపించే చేదు విషాదమే! 

 

సామాజికంగా వ్యవసాయదారుడు  ఎన్నో వ్యవస్థల పీడితుడు. పన్నులు, జరిమానాలు, హింసలు, దౌర్జన్యాలు రాజుల కాలంనుంచే రైతును సలుపుతున్న పీడలు. ఫ్యూడల్ వ్యవస్థ నాటి  భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, గ్రామాధికారులు బహుముఖాలతో సతాయించిన సైతానులు. కరవులు, వరదలు- ప్రకృతిపరమైన శాపాలు నిరక్షరాస్యత, నిరుపేదరికం- విజ్ఞానాన్ని, అభివృద్ధిని మింగేస్తున్న భూతాలు. రైతు జీవితంలో మెరుగుదల ఉంటేనే అధిక ఆహారో త్పత్తి... మరేదైనా' అంటుంది ఆరు దశాబ్దాల కిందటి 'గ్రోమోర్ ఫుడ్ కమిటీ.  ప్రపంచీకరణం ప్రతికూల ప్రభావంలో, ఆధునిక విలాస ఇంద్రజాలంలో చిక్కింది యువ రైతాంగం. వలసలు, మానవ వనరుల కరవు, అరకొర నీటి సదుపాయం, సేంద్రియ విధానాలకు దూరం, మితిమీరిన ఎరువుల వాడకం, నాణ్యతలో నాసిరకం, తడిసి మోపెడవుతున్న వ్యయభారం, ఎడాపెడా వాయించే రుణాల రణగొణ ధ్వనులు. అందని మద్దతుధర, దళారుల మాయాబజారులో చిక్కి చేతికందిన పంటకు నిప్పు పెట్టుకోవడమో చేయి కాలిందని చివరికి 'పురుగు మందు' తాగడమో... ఇదీ నడుస్తున్న రైతుకథలోని ప్రస్తుత విషాదాంకం. 'బురదమళ్లను సుధా- వరదల ఉంది/ వరద వెన్నుల వీజె సరిగల్మీటి/ నాగేటి చాలులో- రాగరసాలు/ పారకచ్చులలోన సారస్వతంబు' సృష్టించిన సైరికుడికా ఈ  విలాపం? 'కృషితో నాస్తి దుర్భిక్షం' సూత్రం నేతిబీర చందంగా  మారడానికి  కారణాలు అనేకం. దాశరథి అన్నట్లు 'ఈ ధరా భూమి మధురాధరాన/ అమృతమొలికిస్తున్న హాలికుడికి ఇదమిత్థంగా  దక్కుతున్నదేమిటి? రామపాదం లాంటి రైతుపాదం తాకిన భీళ్లన్నీ శాపవిమోచనం పొందుతున్నా అన్నదాత ఇంట కరవు ఛాయలుండటమేమిటి? తెలుగు గడ్డమీద రైతు శిరసెత్తుకు నిలిచి నడిచిన నాడే  కదా అసలు సిసలు సంక్రాంతి!

 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈ నాడు - ప్రచురితం - 18 -01 - 2015 ) 

 

 

 

 

Wednesday, February 2, 2022

బాపూజీనే మళ్లీ బతికిరావాలా?- వ్యాసం సూర్య - 02 - 10-2019 - కర్లపాలెం హనుమంతరావు





బాపూజీనే మళ్లీ బతికిరావాలా?

-కర్లపాలెం హనుమంతరావు

తెలిసీ తిలియకుండా రాజకీయ అవసరాల కోసం ఇటీవల అమెరికన్ అధ్యక్షుడు భారతదేశ ప్రధాని మోదీజీని 'జాతిపితఅంటూ ప్రశంసించాడు. భరతీయుల నిజమైన జాతిపిత మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. శతాబ్దాల బట్టీ  స్వతంత్ర జీవనం కోసం ఆరాట పడి ఎన్నో రాకాలుగా పోరాటాలు చేసిన  భారతీయుల ఆంకాక్షలను అఖరికి  వాస్తవం చేసిన మహాయోధుడు గాంధీజీ. మొదటి సారి నోబెల్ గ్రహీత  ఠాగోర్జీ నోటి నుంచి వినిపించిన వేళా విశేషం.. 'మహాత్మాఅన్న ఆ పిలుపు బాపూజీకి పర్యాయపదంగా స్థిరపడింది! ప్రపంచ నేతల చరిత్రల పరంగా చూస్తే ఇదో అపురూపమైన విచిత్రం.  1869 అక్టోబర్ నాడు గుజరాత్  పోరుబందర్‌లో జన్మించినప్పటి నుంచి  1948 జనవరి 30న హత్యకు గురైన క్షణం వరకు గాంధీజీ జీవితంలోని ప్రతీ ఘట్టంలోనూ ఒక హాలివుడ్ చిత్రం సూపర్ హిట్ ఫార్ములాకి సరితూగే స్థాయి నాటకీయత ఉంది. కాబట్టే అటెన్ బరో 'గాంధీపేరుతో శ్రమించి తీసిన మూవీ అన్నేసి ఆస్కార్ అవార్డుల పంట పండించుకుంది. 

 

'నా జీవితమే నా సందేశంఅన్న  కర్మయోగి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయన నీతి నిజాయితీలతో కూడిన  సత్య నిబద్ధ జీవితం నిజానికి దేశ ప్రజలతో మమేకమై జీవిస్తున్నట్లు  చెప్పుకునే  ప్రజానేతలందరికీ ఆదర్శం కావాలి. క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.   

సత్యాగ్రహం అనగానే ముందుగా నేటి తరానికైనా కళ్ల ముందు కదలాడే మూర్తి  కరెన్సీ నోటు పైన బోసి నవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చే బాపూజీ  ప్రొఫైల్.  సత్యాగ్రహాన్ని మించిన  పదునైన ఆయుధం మరొకటి లేదని  ఓ సందర్భంలో బాపూజీ అంటారు.    ఆయుధం బాపూజీ చేతికి  అందేనాటికే ఆంగ్లంలో 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'  గా ప్రసిద్ధం. హిందూ వలస జాతులకు వత్తాసు వకీలుగా బాపూజీ వెళ్లే నాటికి దక్షిణాఫ్రికాలో   ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా.. తెల్లవాళ్లతో సమానంగా  విలాసవంతమైన బోగీలలో  ప్రయాణించడం నిషిద్ధం. రైలు బోగీ నుంచి కిందకు తోసివేసినప్పుడు సాటి వలస జీవులకు మల్లే   గాంధీజీ కూడా తలొంచుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ ఉండేదే కాదు. తల్లి దండ్రుల ద్వారా అబ్బిన ఆత్మ సమ్మాన బుద్ధి  గాంధీజీని కుదురుగా ఉండనిచ్చింది కాదు. ఈ తరహా వివక్ష రాక్షసి అంతమయ్యే వరకూ పోరాడలన్న సంకల్పం   ఆ సందర్భంలో  గాంధీజీలో పురిగొల్పిన ప్రముఖుడు   రచయిత 'టాల్ స్టాయ్'. ఆ రచయిత వ్యాసంలోని 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'   బాపూజీ చేతిలో సత్యాగ్రహ ఆయుధంగా మారి మరింత పదునెక్కింది తదనంతర కాలంలో. ఆనాటికి సూర్యుడు అస్తమించని  సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ సామ్రాజ్యంలో సైతం చీకట్లు కమ్మునేటంత దుమారం సృష్టించింది.  ఆ సత్యాగ్రహాయుధం  ధర్మ సూత్రం గురించి వివరించే సందర్భంలోనే తన పుస్తకంలో ఒక చోట బాపూజీ అంటారూ-         ప్రజాస్వామ్యం అనే అభిలాష  ఇంకెవరో వచ్చి  బలవంతాన రుద్దితే రగిలే స్ఫూర్తి కాదు.  స్వీయ వ్యక్తిత్వం  సంస్కరించుకునే అవసరం స్వయంగా గుర్తించి.. ఆ దిశగా ఆచరణాత్మకమైన కృషి కొనసాగించాలన్న సంకల్పం దృఢంగా అచరణలో పెట్టినప్పుడే కాలక్రమేణా దాని వికాస ఫలాలు అనుభవానికి వచ్చేవిఅని. ప్రస్తుతం కంటి ముందు నడిచే రాజకీయాలలో పదే పదే ప్రజాస్వామ్యం అనే పదం రామకోటికి మించి  మారుమోగుతున్నది. అయినా  ప్రత్యక్షంగా ప్రజల భాగస్వామ్యం నేతి బీరకాయలోని నేయి చందంలా మాత్రమే బులిపిస్తున్నది.  బాపూజీని జాతిపితగా చెప్పుకుంటో  నూట యాభై సంవత్సరాల  ఉత్సవాలు ఘనంగా జరిపించే ఉత్సాహంలో ఉన్న ప్రజా నేతలలో ఏ ఒక్కరికైనా  మరి సత్యాగ్రహ ఆయుధం ప్రయోగించాలనే  ఆలోచన రావడం లేదు! అదే విచారిచదగ్గ  విచిత్రం!

'చెడును నిర్మూలించే లక్ష్యంతో ఆయుధాలు చేపట్టడంలో తనకెప్పుడూ  వ్యతిరేకత లేదని బాపూజీనే స్వయంగా చెప్పుకొచ్చారు కదా చాలా సందర్భాలలో! అయితే ఆ చేపట్టిన ఆయుధం కారణంగా ఏ పక్షమూ రక్తం చిందించరాదు- అన్నదే జాతిపిత అభిమతం.  బొట్టు నెత్తురు నేల రాలకుండా శతాబ్దాల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలకులను నిశ్శబ్దంగా సరిహద్దుల కావలకు నెట్టివేసి మరీ  అహింసా పోరాటం సాగించే పద్ధతులను ప్రపంచానికి ప్రదర్శించి చూపించిన ప్రయోగశీలి మహాత్మా గాంధీ. సుందరాంగుల ముక్కులుముఖాల మీద మోజుతో యుద్ధాలకు తెగబడి వేలాది అమాయకులను బలవంతంగా యుద్ధ రంగాల రొంపిలోకి దింపి అపారమైన ప్రాణఆస్తి నష్టాలు కలిగించడమే యుద్ధాలుగా  చదువుకున్నది ప్రపంచ చరిత్ర అప్పటి వరకు. చేతి కర్రకిర్రు చెప్పులుకొల్లాయి ధోతీబొడ్డు గడియారం,  బోసి నవ్వులనే ఆయుధాలతో కూడా  ఎంతో బలవంతుడైన విరోధిని ప్రేమతో నిరోధించవచ్చు. లాలించి లొంగదీయవచ్చని బాపూజీ ప్రదర్శించిన 'అహింసా పోరాటంచాటి చెప్పే పాఠం. ప్రపంచ చరిత్రలోని ఈ కొత్త సిలబస్  వంట బట్టించుకున్న తరువాతే  మార్టిన్ లూథర్ కింగ్ వంటి పోరాట యోధులు తమ జాతి హక్కులను అహింసాయుతంగా సాధించుకోగలిగింది. ప్రపంచం ముందు తెలెత్తుకుని బాపూజీ సగర్వంగా  నిలబెట్టిన ఆ భారతీయ అహింసా యోధ మూర్తిత్వానికి   ప్రస్తుతం కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు సాగుతున్న హింస రచన   కళంకం తెచ్చెపెట్టే అంశం కాడం బాధాకరం. బతికివుండుంటే బాపూజీని సైతం ఎంతో    కలవరానికి గురిచేసే  అంశమయివుండేది ఖచ్చితంగాఇది.   సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఐక్యరాజ్య సమితి వేదిక  నుంచి అనకాపల్లి సందు వరకు బాపూజీ భజన చేయడం మరిచిపోని మన ప్రజానేతలు మరి ఈ అహింస అనే ఆయుధాన్ని ఎందుకు అశ్వత్థామ వృక్షం ఎక్కించేసినట్లో?! ఆ అయుధం కిందికి దిగడానికి ఇంకా ఎన్ని గో గ్రహణాలు జాతి అనుభవించవలసివుందో?

ఆత్మాభిమానంగౌరవం వేరెవరో వచ్చి పరిరక్షించే శీల సంపదలు కావు కదా! 'చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలన్న కాంక్ష ఉంటే  ముందుగా ఆత్మ సమ్మానాన్ని కాపాడుకోవాలిఆన్న బాపూజీ సూక్తి మీద ఆసక్తి గల ప్రజానేతలు ఎంత మంది మిగిలున్నారు ఇప్పుడు?   బి-ఫారం ఇచ్చి,  నిధులిచ్చి,  గెలించేందుకు అహర్నిశలు అంతులేని కృషి చేసిన సొంత పార్టీలకే నామాలు పెట్టేసి అధికారంవ్యాపారం వంటి వ్యక్తిగత లాభాపేక్షల నిమిత్తం గెలిచిన మరు క్షణమే పాలక పార్టీలలోకి దూకే ప్రజాప్రతినిధుల పట్లే  ఎక్కువగా ప్రజలూ ఆకర్షితులవుతున్నారిప్పుడు!అక్టోబరు రెండుకోజనవరి ముఫ్ఫైకో  బాపూజీ గుణగణాలను శ్లాఘిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తే సరి.. ఓ పనయిపోతుందనే భావనే సర్వే సర్వత్రా. బిర్లా భవన్ ప్రాంగణంలో ప్రాణాలు గాలిలో కలిసే ముందు బాపూజీ 'హే! రామ్!అని ఆక్రోశించినట్లు ఆ సమయంలో  దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. ఆ మహాత్ముడి ఆక్రోశానికి  కేవలం తనపై జరిగిన అఘాయిత్యం ఒక్కటే కారణం కాదేమో భావి భారత దేశ రాజకీయ దివాళాకోరుతునం ముందే ఊహించి 'హే రామ్!అని ఆక్రోశించలేదు కదా మహాత్ముడు?

'ఆచరణ కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టరాదు. ఓర్పుతో అయినా  వాటిని పాటించాలి' అన్నది  నోటి మాటగానే కాదు.. తన జీవితం ద్వారా కూడా  ఆచరించి చూపించిన నిజాయితీ బాపూజీది. మేక పాల పానం నుంచిమద్యపాన నిషేధం  వరకూ ఏ పని పట్లా ఆయనకు నీచభావన లేదు.  నేటి నేతల నోటి మాటలకు భిన్నంగా బాపూజీ  పాయిఖానాల క్షాళన పట్లా హేళన ప్రదర్శించిందిలేదు. ఆయన అడుగు జాడలలోనే తమ నడక సాగుతున్నదని నమ్మబలికే నేతలు ఆచరణ సాధ్యం కావని తెలిసే ఎన్నికలలో ఓట్లు దండుకొనే దురుద్దేశంతో  అసాధ్యమైన హామీలు అనేకం  అమాయకులపై గుప్పిస్తున్నారు.    ప్రజాస్వామ్యం పేరిట సాగే రకరకాల రొటీన్ పేరంటాల పట్ల  ఆఖరికి ప్రజల హక్కుల కోసమని పనిచేస్తున్నామని చెప్పుకునే  స్వచ్ఛంద సంస్థలు సైతం  కిమ్మిన్నాస్తి!    మరో మారు నిజమైన సత్యాగ్రహ సమరంతో దేశం  మారుమోగాలంటే మళ్లీ మహాత్ముడు వస్తే మినహా  సాధ్యం కానంత మందగొడితనం దేశమంతటా దట్టంగా అలుముకుని ఉన్న నేపథ్యంలో బాపూజీ నూట యాభై సంవత్సరాల జన్మదిన సందర్భం తటస్థించింది.   తటపటాయింపులేవీ లేకుండా జాతిపిత  జీవితాన్నే పరమాదర్శంగా తీసుకోక తప్పని దుస్థితి ప్రస్తుతం సమాజం అంతటా నెలకొని ఉంది. ప్రజాక్షేత్రంలోని ప్రతీ వ్యక్తీ   ప్రతి అడుగులోనో మహాత్ముని ప్రవచనాలను  గుర్తుంచుకుని నడిస్తేనే తప్ప  ప్రస్తుతం  దేశం ఎదుర్కొనే గడ్డు సమస్యల నుండి గట్టెక్కే పరిస్థితిలేదు. 

'కంటికి కన్నుసిద్ధాంతంతో  ప్రపంచాన్ని మరంత అంధకారంలోకి నెట్టివేసేందుకు తప్ప సాధించే మరో ప్రయోజనం లేదు. సుదీర్ఘంగా సాగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల విశ్వవ్యాప్తంగా  వాతావరణం ఏమైనా చల్లబడిందాఓటుసత్యాగ్రహం- ఈ రెండూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే  ఆయుధాలు-అంటారు బాపూజీ! వాటి వినియోగాన్ని బట్టే ప్రజల  ఆలనా పాలనా సమర్థంగా సాగేది అని  మొదటి నుంచి గాంధీజీ గట్టి నమ్మిక. ఓటును ఓ కొనుగోలు సరుకుగా మార్చి చేజిక్కించుకోడమే కాదు.. దేశానికి స్వాత్రంత్ర్యం సాధించిపెట్టిన  సత్యాగ్రహ ఆయుదాన్ని సైతం.. ప్రస్తుతం దుష్ట రాజకీయం  ఆడే నాటకంలో ఓ అంకం ప్రాపర్టీగా మార్చివేసిన మాయాజాలం నేటి రాజకీయానిది. పాలకులను అదిలించే ఆయుధాలు రెండూ వట్టి పోవడం దురదృష్టం. బాపూజీ తిరిగి వచ్చినా ఈ పరిస్థితి ఓ పట్టాన చక్కబడేనా  అన్నది అనుమానమే!

 

భారతావని  వేలాది సంవత్సరాల పాటు పరాయి పాలకులకు ఊడిగం చేయవలసి వచ్చింది. బిడ్డల అంతర్గత కుమ్ములాటలే భరతమ్మ పారతంత్ర్యానికి  మూల కారణంగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు. మళ్లీ కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా మనలో మనం కలహించుకుంటూ   కలసి మెలసి సాధించుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తిరిగి పరాయి పంచలపాలుచేసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాంఇటీవల అమెరికన్ అధ్యక్ష మహాశయుడు ట్రంప్ అమెరికాలో హౌడీ-మోడీ కార్యక్రమ సందర్భంగా స్వంత రాజకీయ లబ్ది కోసం చిలకరించిన కాస్తింత  లాలింపు పన్నీరు జల్లులకే మనం  పులకరించిపోవడం బతికి వుంటే బాపూజీని బాధించే అంశం అయివుండేదే!    

స్వాతంత్ర్యం సాధించుకొన్న నలభైల నాటి తరం ఇప్పుడేమంత ఉనికిలో లేదు. పుట్టుకతోనే  ఆయాచితంగా దక్కిన కారణంగా  స్వేచ్ఛాయుత జీవితం ఎంత అమూల్యమైనదో నేటి తరాలకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఇప్పటి కుర్రకారు దృష్టిలో బాపూజీ అంటే కేవలం అటెన్ బరో తీసిన  చిత్రంలో కిన్ బెన్స్ లే వేసిన కథానాయిక పాత్ర. అదీ తెలియని మరీ కుర్ర తరానికి ఆ బోసినవ్వుల తాతయ్యంటే రూపాయి నోట్ల మీద కనిపించే ఓ గ్రాఫిక్ బొమ్మ.

 

   మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే  కొత్త బంగారు లోకం గురించి స్వప్నించే అర్హత సిద్ధించేదని సిద్ధాంతరీకరించిన  నిత్య చైతన్యశీలి మహాత్మాగాంధీ. కుటీర పరిశ్రమలుగ్రామస్వరాజ్యంస్వదేశీ వస్తు ఉద్యమంనిరాడంబర జీవన శైలిదేశవాళీ వైద్య విధానంస్వచ్ఛంద బ్రహ్మచర్యంరామ్ రహీమ్ లిద్దరినీ సమాన దృష్టితో కొలిచే తీరుబలహీనుల పట్ల అనురాగంస్త్రీల పట్ల ప్రత్యేక గౌరవ ప్రపత్తులుసమాజంలోని అన్ని తరగతులూ సామరస్య భావనతోసహజీవనం కొనసాగించడంనిత్య జీవితానికి అక్కరకొచ్చే ఏ పని పట్లా ఉపేక్ష వహించకపోవడంవృత్తులతో నిమిత్తం లేకుండా అన్ని కులాలనుజాతులను  సోదరవర్గంలో చేర్చుకోవడంముఖ్యంగా దిగువ తరగతుల పట్ల సమాదరణ, స్త్రీల పట్ల సమ్మనభావన, సనాతన ధర్మం పట్ల నిరసన లేని విశాల దృక్పథంతో నవీన సంస్కృతలను మనసారా ఆహ్వానించడంఅన్ని భాషల పట్ల ఒకే తరహా ఆదరణప్రజల పలుకుతో ప్రత్యేక అనుభంధం ఏర్పరుచుకోవడం.. 'సత్యంతో నా ప్రయోగాలుపేరిట బాపూజీ రాసుకున్న 'ఆత్మకథనిండా ఈ తరహా  నిత్య స్వచ్ఛ జీవన శైలికి సంబంధించిన ఎన్నో అంశాలు చదువరులలో ఉత్కంఠ రేకెత్తించే తీరులో ప్రతి పుటలో  కనిపిస్తాయి. తన జీవితంలోని    ఎత్తు పల్లాలనువెలుగు నీడలను  ప్రపంచం ముందు తెరిచిన పుస్తకంలా బాపూజీ పరిచిన తీరు ప్రపంచంలోని మరే ఇతర ప్రముఖ వ్యక్తీ ఊహలో అయినా ప్రదర్శిచలేనంత సాహసపూరితమైనది. బాపూజీ వారసులుగా ప్రజల ముందుకు వచ్చి ప్రజానేతలుగా వ్యవహరించే నేటి నాయకులలో మచ్చుకకైనా ఒక్క మహాత్ముని మంచి లక్షణం కనిపించక పోవడం దేశప్రజలు చేసుకున్న దురదృష్టం. 

రాజకీయాలే కాదు.. సామాజిక జీవన సరళీ బాపూజీ బోధించిన బాట నుంచి క్ర్రమక్రమంగా  దూరంగా జరగడం కలవరం కలిగించే అంశం. 

పాముకాటు శరీరానికి చేసే హానికి కన్నా మద్యపానం ఆత్మకు కలిగించే నష్టం ఎక్కువ-అంటారు బాపూజీ. కనీసం ఆ జాతిపిత మాట మీద గౌరవం చూపించాలన్న సంస్కారం లోపించడం వల్లే గాంధీజీ జయంతివర్ధంతుల రోజులలో కూడా మత్తు పదార్థాల వినియోగాల రేటు తగ్గడం  లేదు! పుస్తక పఠనం కాదు..  మనిషిలోని ఉత్తమ వ్యక్తిత్వాన్ని వెలికితీయడమే అసలైన విద్య  లక్ష్యం- అన్నది బాపూజీకి విద్య మీద ఉన్న అభిప్రాయం.  ఆలోచనఆచరణా క్రమబద్ధంగా లేని పక్షంలో ఎన్ని విద్యలు నేర్చినా ఆ నైపుణ్యమంతా వృథానే కదా! 'మానవతను మించిన మంచి పుస్తకం మరొకటి లేదుఅన్న బాపూజీ సూక్తి చెవిన పెడుతున్నదెవరు విద్య వ్యాపారంగా మూడు పువ్వులు, ఆరు కాయలు పూయించే ఈ కాలంలో? 

 

 

'ప్రేమ  అన్నిటి కన్నా అత్యంత శక్తివంతమైనది.    శక్తి ముందు సాక్షాత్ భగవంతుడైనా  చేతులెత్తేయవలసిందే!అని ఉవాచించే బాపూజీ భావనలో ఆధ్యాత్మికత మీద కన్నా ఆత్మీయత వైపే తూగు ఎక్కువ కనిపిస్తుంది.   పెదాలపైన చిరునవ్వులు ధరించకుండా వంటికి ఎన్ని విలువైన దుస్తులు వేలాడదీసినా ఆ అలంకరణ రాణించేది కాదు-అన్నాడు అర్థ నగ్న యోగి బాపూజీ. బ్రిటిష్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ 'హాఫ్ నేకెడ్ పకీర్గా హమేశా ఎద్దేవా చేసిన మహాత్మాగాంధీ ఆ కొల్లాయి ధోతీ బిగించి సబర్మతీ ఆశ్రమం నుంచి కాలు  బైట పెడితే  చాలు.. ఆసేతు హిమాచల పర్యంతం ఆనంద పరవశమై అభిమానంతో చిందులుఉ వేసే పరిస్థితి. ప్రపంచం నలుమూలలకు సుపరిచితుడైన ప్రఖ్యాత హాస్యనటుడు ఛార్లీ చాప్లిన్ సైతం ఒక సందర్భంలో 'తాను గాంధీజీ గ్లామర్ చూసి అసూయ చెందుతున్న'ట్లు ప్రకటించుకున్నాడు.   అన్ని కళల కన్నా జీవితం గొప్ప కళ. సౌజన్యంతో జీవించే వ్యక్తి కన్నా గొప్ప కళాకారుడు లేడని బాపూజీ విశ్వాసం. ఆ లెక్కన చూస్తే మహాత్మా గాంధీ తరువాతే ఎంతటి మెగా హాలివుడ్కథానాయకుడైనా!  

బాపూజీ దృష్టిలో ప్రార్థన   పరమార్థం హృదయ శోధన. అనుభూతికి తప్ప లొంగని ఏ అదృశ్య శక్తి ఆశీస్సులు లేకుండా ఎంత గొప్ప కార్యమైనా సంపూర్ణంగా విజయవంతం కాలేదన్నది గాంధీజీ భావన. ఆ కనిపించని శక్తి మహిమే వెనక ఉండి తనను ఎల్లవేళలా సన్మార్గం నుంచి తూలకుండా కాపాడుతూ వచ్చిందని బాపూజీ తన సందర్శనార్థం వచ్చిన వారితో సందర్భం తటస్థించిన ప్రతీ సారీ చెప్పుకొస్తుండేవారు. 

 

ఆయా సందర్భాలలో  స్పందించిన తీరును ఒక క్రమ పద్ధతిలో గమనించ గలిగితే బాపూజీ సంపూర్ణ వ్యక్తిత్వంలోని కొంత భాగాన్ని మనం పట్టుకోవచ్చు. కైరా సత్యాగ్రహం పాక్షికంగా మాత్రమే విజయవంతమైన సమయంలో ప్రజల సంతోష సంబరాలను చూసి గాంధీజీ   'సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం  నాకు బాధ కలిగిస్తున్నది' అని బాహాటంగానే తన అసంతృప్తిని  బైటపెడతారు. రిలే నిరాహార దీక్షల వంకతో నాలుగేసి గంటల పాటు  నిరసనల నాటకం  నడిపించేసి లక్ష్యం నేరవేరినట్లు ఆనక  విజయయాత్రలు భారీ ఎత్తున నిర్వహించే  నేటి తరం నాయకులను చూసి మరి బాపూజీ బతికుంటే ఏ విధంగా స్పందిస్తారో!

రౌలత్ చట్టం ఆచరణలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో అశాంతి నెలకొన్నది.   బాపూజీ బోధనలు ఆలకించైనా  జనం కాస్త చల్లబడతారేమో అన్న ఆశతో అక్కడి ప్రాంతీయ నేతలు గాంధీజీని ఢిల్లీ పిలిపించుకుంటారు. జాతినేతగా అప్పటికే బాపూజీకి జనంలో  గొప్ప గుర్తింపే ఉంది. సెక్యూరిటీకి విఘాతంవంకతో  రైలు దిగీ దిగగానే గాంధీజీని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బందితో  'నేనిక్కడకు వచ్చింది శాంతి భద్రతలు తిరిగి సాధించుకోవడం కోసం.  అశాంతి జ్వాలలను మరింత ఎగదోయడం  కోసం కాదుఅంటారు. అకారణంగా కక్షలు రేకెత్తించి ఆ కార్పణ్యాల మధ్య తమ పబ్బం గడుపుకునేందుకు చూసే కుళ్లు రాజకీయాలకే ప్రస్తుతం చెల్లుబాటు. 

 బాపూజీ బోసి నోటితో చేసిన వ్యాఖ్య  జనం మధ్య తిరిగే  ప్రజానేత  బాధ్యత ఎంత సున్నితమైనదో చెప్పకనే చెబుతుంది. సీనియారిటీని ఓ అనర్హతగా ప్రకటించి  పక్కన పెట్టే నేటి రాజకీయాలలో  బోసి నవ్వుల తాతయ్య బోధనలు ఆకాశవాణి సంస్కృతం  వార్తలకు మించి విలువిస్తుందా నేతాగణం? ఎవరిని తమకు ప్రతినిధులుగా ఎన్నుకొనాలోనన్న విషయంలో ఏడు దశాబ్దాలు దాటినా జనావళిలో ఓ స్పష్టత రాకపోవడం రామరాజ్యం గురించి కలలు కన్న బాపూజీకి బాధ కలిగించే అంశం కాదా? 

నాగపూర్ జాతీయ కాంగ్రెస్ మహాసభల వేదిక మీద నుంచి నియంత పోకడల వల్ల పజాస్వామ్యానికి  ఏర్పదే పెను ప్రమాదం గుర్తించమని గాంధీజీ హెచ్చరించారు. 'స్వీయాభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల   నిజమైన స్వాతంత్ర్యం సాధించుకొనే అర్హత కోల్పోతామన్న ఆ హెచ్చరికకు పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షం పొడే గిట్టనంత అసహనం అధికార పక్షాలలో విశ్వరూపం దాలుస్తున్నది రోజు రోజుకీమహాత్ముడే మళ్లీ ఏ వామనావతారమూర్తిగానో దిగి వచ్చి నియంత బలి మాడును పాతాళానికి అణగదొక్కితే తప్ప సాగే ప్రజాస్వామ్య క్రతువు సలక్షణంగా సంపూర్ణమయే పరిస్థితి కనిపించడంలేదిప్పుడు.  

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ అచ్చెరువొందినట్లు 'ఇటువంటి ఒక వ్యక్తి భూమ్మీద నిజంగానే పుట్టి మన మధ్య సంచరించాడా?' అనే అనుమానం మరింత పెరగక తప్పదు మహాత్ముని జీవితం తరచి చూసే కొద్దీ! బాపూజీ భావనలలోని మన్నికమిగతా నేతలంతా యధాతధంగా వాటిని అనుసరించక తప్పని ఆవశ్యకతను గురించి వక్కాణించే సందర్భంలో మరో హక్కుల నేత మార్టిన లూధర్ కింగ్ చెప్పిన ఒకే ఒక్క ముక్కలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మూర్తిత్వం మొత్తం కళ్ల ముందు కనబడుతుంది. 'కోరుకొన్నదాని కోసం అహింస దారిలో పయత్నించడంఅన్యాయం అని తోచినప్పుడు సాయమందించేందుకునిరాకరించడం యేసు సూచించిన బాట. ఆ బాటలో ఎలా సాగి లక్ష్యం సాధించాలో మొదటి సారి  స్వయంగా నడిచి ప్రపంచానికి చూపించిన ఘనత మహాత్మా గాంధీది.' అన్న నీలిజాతుల హక్కుల నేత మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. 

'కొల్లాయి గట్టితేనేమి.. మా గాంధి కోమటై పుట్టితేనేమిఅని   బసవరాజు అప్పారావు అప్పారావు పాట కట్టిన తీరును తప్పు పట్టవచ్చునేమో కాని..  ఆ పాటలో బాపూ నడిచి చూపించిన బాటను ఎవరం ఈ నాటికీతప్పు పట్టలేం. ప్రపంచమంతా గౌరవించి నెత్తిన పెట్టుకుంటున్న బాపూజీ భావజాలాన్ని.. పుట్టిన దేశంలోని పాలనాసామాజిక వ్యవస్థలు పూర్తిగా పక్కన పెట్టేయడమే బాధాకరం. పెరటి చెట్టు మందుకు పనికి రాదన్న సామెతను నిజం చేస్తే ముందు నష్టపోయేది మనమే సుమా! గాంధీజీ జన్మించి ఈ 2019, అక్టోబర్ నాటికి  నూటయాభై ఏళ్లునిండుతున్నాయి.  ఆ మహాత్ముడి జీవన విధానంఆలోచనా ధారఆచరణ మార్గాల పరంగా పునర్విమర్శ చేసుకోవలసిన అవసరం మునుపటి కన్నా మరింత పెరిగిందనే సత్యం మనం జీర్ణించుకోక తప్పదు.   బాపూజీ భావజాలం నేటి సాంకేతిక యుగానికి అనువుగా ఎలా మలుచుకోవాలో ఒక చర్చగా అయినా తక్షణమే ఆరంభమవడం భరతజాతికి అన్నివిధాలా  మేలు. లేని పక్షంలో  హక్కుల సాధన పట్ల తప్ప బాధ్యతల నిర్వహణ పైన బొత్తిగా శ్రద్ధ చూపని నేటి సమాజం పోకడలను చక్కదిద్దడానికైనా  బాపూజీ పుడమి పైకి తిరిగి రావడమొక్కటే చివరికి మిగిలే దారి- అనిపించక మానదు!

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య- దినపత్రిక - 02 -10 - 2019 - ప్రచురితం ) 

***

 

***

 

 

 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం పావలా కాలధర్మం రచన- కర్లపాలెం హనుమంతరావు


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

పావలా కాలధర్మం 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 ) 

 

చిల్లర రాజకీయాలు పెరుగుతున్న కొద్దీ చిల్లర నాణాలు క్రమంగా కనుమరుగైపో తున్నాయి. పైసా, అయిదు పైసలు, పది పైసలు, ఇరవై పైసలు... ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఇరవై అయిదు పైసలవంతు. త్వరలో అర్ధ రూపాయి గతీ అంతే కావచ్చు  


భిక్షగాడికి కూడా అక్కర్లేని డొక్కు నాణెంగా తయారైంది పావలా  వంద పావలా బిళ్ళల తయారీ కే నూట అరవై రూపాయలు ఖర్చవుతున్నాయని కేంద్ర అమాత్యులు వాపోతున్నారు. ఈ కరవు కాలంలో వాటిని తయారుచేయడం తమవల్ల కాదని ఓ దండం పెట్టేస్తున్నారు. జులై ఒకటినుంచి పావలా 'మరణం' అధికారికంగా నిర్ధారణయింది!


దమ్మిడీకి కొరగాని నేతల్ని ఎన్నుకోవడానికి ఎన్నికల్లో కోట్లు  రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అలాగని ఎన్నికలనే రద్దు చేయాలని ఎవరన్నా అంటున్నారా! బడుగు జీవి బతుకులాగా పావలా నాణెం అందరికీ అలుసయి పోయిందనేదే బెంగ . నెత్తిమీద రూపాయి ఉంచినా పావలాకు అమ్ముడుకాని నేతలను మనం భరించాలి  గానీ, పర్సులో పావలాని మాత్రం బరువని చెప్పి గిరాటేస్తున్నాం. 


కారు డిక్కీలో, బస్సు టాపులమీద పత్తిబేళ్ల మాదిరిగా కట్టలు కట్టలు వెయ్యి నోట్లు రవాణా అయే  కాలంలో- ఇంకా ఈ పావలా, అర్ధ రూపాయల గురించి పలవరింతలు ఎందుకని నవ్వుకొంటున్నారా! అయినవాడికి పదవి కట్టబెట్టడానికి గిట్టనివాడిని చట్టసభనుంచి వెళ్ళగొట్టినట్లు... అయిదు, రెండు, ఒక రూపాయినోట్లకు నాణాల స్థాయి కల్పించారు. పేద వాడి నాణెం పావలా, అర్ధరూపాయలను మాయం చేస్తామంటున్నారిప్పుడు . చిల్లర మహాలక్ష్మి అంటే ఎంత చుల కన? 


గుళ్ళో దేవుడి హారతి పళ్ళెంలో వేయడానికి ఇక రూపాయి, అర్ధరూపాయలే సమర్పించుకోవాలి కాబోలు. పిల్లాడు కిడ్డిబ్యాంకులో వేసుకోవడానికి ఇక రూపాయలే ఇచ్చుకోవాలి. పాపాయిల భోగిపళ్లలో కలపడానికైనా పావలా బిళ్లలు చలామణీలో ఉంటే నిండుగా ఉండును పండువు . శవయా త్రలో వెనక్కు విసురుకుంటూ పోయే చిల్లరలో పావలాలు కాక రూపాయి బిళ్లలు కలపాలంటే- బతికున్న వాడి బంధువులు భరించలేక చచ్చూరుకోవాల్సిందే. అసలైన ఆర్థికమాంద్యం దెబ్బ అప్పుడు  తెలిసొస్తోంది.


బడుగు జీవికి జనాభాలో ఏ పాటి విలువుందో పావలాల్లాంటి చిల్లర బిళ్లలకూ కరెన్సీ లోకంలో అంతే విలువుందిప్పుడు. కూడికలూ తీసివేతల లెక్కల వరకేగానీ, ఇంద... తీసుకో అంటూ ఇవ్వడానికి పావలాలు ఎక్కడున్నాయి? టీవీల్లో తెలుగులా, నేతల్లో నిజాయతీలా, దుకాణాల్లో నికార్సయిన సరకులా, చేత్తో రాసే ఉత్తరాల్లా... పావలాలూ పది పైసల బిళ్లలూ మాయమైపోయాయి. 


అమలుకాని వాటిని ఇప్పుడు పావలా వడ్డీ పథకాలనే పిలుస్తున్నారు. బంగారం కొట్లో ధర్మకాటాలో వేసి తూచడానికితప్ప, ఇతర సమయాల్లో పావలాలు, అర్ధలూ పనికిరాని పదా ' ర్థాలు ' . 


ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎంత సవ్యంగా ఏడ్చిందో  - డబ్బు లెక్కల్లో పావలాలకు, అర్ధరూపాయలకు అంతే విలు వుందిప్పుడు . పేదోడిని పట్టించుకుంటున్నారు కనకనా, పావలాను ఎవరైనా లెక్క పెట్టడానికి! 


కుంభకోణాల విలువా వేలకోట్ల రూపాయల స్థాయికి చేరిపోయింది. రాష్ట్రప్రభుత్వాల బడ్జెట్లూ లక్షల కోట్లు మించుతున్నాయి. పావలాలను, పైసలను సర్దుబాటు చేసే తీరిక, ఓపిక ఇప్పుడెక్కడున్నాయి? 


పావలాలను, రూపా యల్ని కాదని, కోట్ల రూపాయల్ని ఆరగించినవారు వాటిని సర్దుబాటు చేయలేకే ఇప్పుడు తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. 


ఒకప్పుడు పావలా బిళ్ళ అంటే ఎంత విలువ? కప్పు చాయ్ తాగాలంటే పావలా

చాలు. ఇంకా వెనక్కు వెళితే- మానెడు బియ్యం కొలిచేవారు. ఓ పావలాబిళ్ళ గనక జేబులో ఉంటే- ఆ రోజుకు అతను పెద్ద దివానే. పిల్లాడిచేతిలో పావలా పెడితే- ఐస్ సోడా , సోంపాపిడి, మామిడితాండ్ర, రబ్బరు పెన్సిలు, రంగు బెలూన్లు రెండో మూడో కొనుక్కున్నా- ఇంకా పైసో .. రెండు పైసలో మిగిలుండేవి. ఇప్పుడు పీచు మిఠాయినుంచి పాప్ కార్న్ పాకెట్ దాకా ఏది కొనాలన్నా రూపాయలు  అచ్చుకోవాలి . 


దీపా వళి పండుగకు పావలాకు సగం బుట్టెడు టపాసుల చ్చేవి. పెద్దపండగ నాడు హరిదాసు అక్షయపాత్రలో అరసోల బియ్యం ఓ పావలాబిళ్ళతో పాటు కలిపి పోస్తే ఇంటిల్లపాదీ అప్లైశ్వర్యాలతో చల్లగా ఉండమని మనసారా దీవలనందించేవాడు . 


పావలా రైలు టికెట్ తో  పాతిక మైళ్ళు సుఖంగా ప్రయాణం చేసేవాళ్లం. సైకిలు అద్దె గంటకు పావలా.  శివరాత్రి పండక్కు పావలా ఇచ్చి మూడు సినిమాలు వరసగా చూసి మురిసిపోయేవాళ్లం. అందాకా ఎందుకు, అప్పట్లో ఆలిండియా కాంగ్రెసులో ప్రాథమిక సభ్యత్వం ఖరీదు- కేమం ఒక్క పావలా!


నాణెమా అంటే నాలుక్కాలాలపాటు నిలబడుం డేదీ... విలువగలదీ అని నిఘంటువు అర్ధం. నాణేల చరిత్ర రెండువేల ఏడొందల నాటిది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాల తయారీకి లోహాలకు కరవొస్తే ఆదుకున్నది అప్పటి నాణేలే! శాసనాలకు మాదిరిగానే నాణేలూ చారిత్రక పరిశోధనకు చక్కని సాధనాలు,


అలాంటి నాణేలకు ఇప్పుడు మూడింది. పిల్లకాయ లకు పావలా బిళ్లల్ని ఇంక ఏ మ్యూజియాలలోనో,  నాణేల సేకరణ పుస్తకాలలోనో  చూపించుకోవాలి.


వెయ్యి నోటు ఇస్తే, వెనక్కూ ముందుకూ వెయ్యి సార్లు తిప్పిచూసుకుని తీసుకునే ఈ కాలంలో- పావలా బిళ్ళ గురించి విలపించడం వృథా అంటారా?


ఆర్ధిక సమరంలో బడుగువాడి పక్కన నిలబడి పోరాడే పావలా యోధుడికి ఇలాగైనా ఆశ్రునివాళి సమర్పించడం మన కనీస ధర్మం.




రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 )   

Tuesday, February 1, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక ఎందరో మేతగాళ్లు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 )

 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక 

ఎందరో మేతగాళ్లు 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 



రోజూ ఉండే రాజకీయాలకేంగానీ, ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచికథ చెప్పాలనుందిరా? 


చెప్పు బాబాయ్! కహానీలు చెప్పడంలో నిన్ను మించిన మొనగాడు లేడులే, కానీయ్! 


సృంజయుడనే ఓ మహారాజు, సంతానం లేదు. నారదులవారు ఓసారి చూడ్డానికొచ్చి- గుణవంతుడు, రూప వంతుడు అయిన కొడుకు పుడతాడని ఆశీర్వదించాడట. 'గుణాన్ని ఏమన్నా కోసుకు తింటానా? రూపంతో పనేమి లేదు... రూకలు సృష్టించే పుత్రుణ్ని ప్రసాదించండి స్వామి! వాడి చెమట, కన్నీళ్లు, లాలాజలం కూడా బంగారంలా మారిపోవాలి మరి ' అని కోరుకొన్నాడట మహారాజు . అట్లా పుట్టినవాడే సువర్ణష్ఠీవి.


వాడే గనక ఇంకా జీవించి ఉంటే మన ఆదాయప్పన్ను వాళ్ళకి నిండా బోలెడంత పని


హుష్ ! ముందు కథ విను! వాడినొకసారి దొంగలు ఎత్తుకెళ్ళారు. ఆశకొద్దీ బంగారంకోసం కడుపుకోసి చూస్తే నెత్తురు, మాంసం, పేగులూ తప్ప ఏమీ లేవు. చచ్చిన కొడుకును చూసి రాజుగారు ఏడుస్తుంటే నారదుడొచ్చి ఓదార్చాడు. ' శ్రీరామచంద్రుడి లాంటి మహానుభావుల్ని కోరుకోవాలి గానీ, బంగారం కోసం యావపడితే ఇట్లాగే ... చివరికి బూడిదే మిగిలేది ' అని బుద్ధిచెప్పి ఆ కొడుకును మళ్ళీ బతికించి పోయాడు నారదుడు.


బాగుంది. ఇంతకూ ఇవాళ నీకెందుకీ హరికథ హఠాత్తుగా గుర్తుకొచ్చింది!


పత్రిక చూస్తుంటే లంచాలను గురించి ఓ కథనం కంటబడిందిరా! కూరగాయలు, పెట్రోలు రేట్లు పెరిగి పోతున్నట్లు లంచాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయట! అవినీతి నిరోధకశాఖ పట్టిక ప్రకారమే పట్టుబడ్డ ఉద్యో గుల అక్రమార్జన నిరుడు సగం మెట్రోరైలు ప్రాజెక్టు ఖర్చంత ఉందిట! ఏసీబీవాళ్లు దాడిచెయ్యని, చెయ్యలేని సొమ్మంతా పోగేస్తే- ఏకంగా పోలవరం ప్రాజెక్టునే పూర్తి చెయ్యొచ్చునేమో! సమాచార హక్కు చట్టాలు, అన్నా హజా రేలు, అవినీతి నిరోధక శాఖలు, అడుగడుగునా విజిలెన్సు కమిషన్లు, కొరడాలు ఝళిపించే న్యాయస్థానాలు, జనాల చీదరింపులు.. ఎన్నున్నా... ఇదేందిరా పచ్చిగడ్డే పరమాన్న 'మనుకునే లంచాల పిచ్చి మనవాళ్లకు వదలకుండా పట్టుకుంది?


'లంచం- ఏంటి బాబాయ్... మరీ అంత మొరటుగా పిలుస్తావ్! ముడుపులు, నైవేద్యాలు, మామూళ్లు, చాయ్  పానీలు, విరాళాలు, నజరానాలు, ప్రసాదాలు అంటూ ఎన్నేసి నాజూకు పేర్లున్నాయ్! అయినా, ఇవాళే ఈ పద్ధతి కొత్తగా ప్రవేశించినట్లు తెగ ఇదైపోతున్నావ్! రోజూ నువ్వు నాకిది కావాలి.. అది కావాలి అంటూ చెంపలేసుకొనే ముందు దేవుడికి కొట్టే టెంకాయను ఏమంటారేంటి ? దేవుడే దేవేరి  అనుగ్రహం కోసం పారిజాతాన్ని అపహరించి మరీ సమర్పించుకోక తప్పింది కాదు . రాజులిచ్చే అగ్రహాలకోసం కాదూ కవులు ప్రబంధాలను అంకితాలిచ్చింది! భూమి పుట్టినప్పుడే బహుమానాలు పుట్టాయి బాబాయ్! ఆదాము అవ్వలచేత సంసారం చేయించటానిక్కూడా పాము ఆపిల్ పండును లంచంగా ఇచ్చుకోవాల్చొచ్చింది. 


అది వేరురా... చాకిరీ చేయడానికి నెలనెలా జీతాలు అందుకునే నౌకరీల్లోనూ రోజూ చెయ్యాల్సిన పనికి చాయ్ పానీలు  ఆశించడమేంటి?


నూలు పోగు అందించకపోతే చందమామ ఏమన్నా వెన్నెల తగ్గిస్తాడా ! చందమామకు ఆ పోగు అందం ఎట్లాగో .. కొన్ని సర్కారు పోస్టులకు బల్లకింది చేతులు ఆదో అందం. నువ్వు ఇందాక చెప్పావే హరికథ... సర్కారు పనివాళ్ళ బుర్రకథ ముందు ఎవరికీ వినపడదు. పిల్లాడిని బడికిపోరా అంటే నువ్వు జీడి కొనుక్కోవడానికి డబ్బులిస్తేనే పోతానంటాడు. నోరులేని గేదె నోటికి పచ్చగడ్డి అందించకపోతే పాల పొదుగుమీద చెయ్యి వెయ్యనివ్వదు. నోరున్న మనిషి మరి కట్టేసుకుంటాడా! ఇన్ని చెబుతున్నావు... నీ నాలిక మీద తేనెబొట్టు పడితే చప్పరించకుండా ఉండగలవా? డబ్బు వ్యవహారాల్లో మునిగి తేలేవాడు డబ్బునెట్లా  ఆశించకుండా బిగపట్టుకుంటాడు  బాబాయ్! 


గడ్డి తినడం మహా ఘనమైన లక్షణమని మరి చంకలు గుద్దుకోమంటావా నువ్వు! 


మేయడం కూడా  గొప్ప సృజనాత్మక కళే! ఇన్నేసి వేల మంది సర్కారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క సరసాదేవి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ లాంటివాళ్లే మనకు ఎందుకు గుర్తుం డిపోతున్నారంటావ్? జీతంమీదగాక మరీ గీతంమీదే మరలు బిగిస్తే సర్కారులో దస్త్రాల బళ్లు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలవు.. గుర్తుంచుకో! అమెరికాలాంటి అగ్రరాజ్యాలు కూడా చతికిలపడ్డ రోజుల్లో  మనా దేశార్థికం ఇంత చురుగ్గా ఉందంటే దానికి కారణం కార్యాలయాల్లో చేతులు కింద

పెట్టుకునే బల్లలు ఇంకా ఉన్నాయి కాబట్టే 


ఇంతకీ నువ్వనేది ఏందిరా! లంచాలు ఇలాగే పదికాలా లపాటు వర్ధిల్లాలంటావ్! 


అంతేకాదు... అక్రమార్జనను ఉద్యోగుల హక్కుగా పరిగణించాలి. సిటిజన్ ఛార్జుల మాదిరిగా ఆఫీసుల్లో ఈ పనికి ఇంత అని పబ్లిగ్గా రేట్లు నిర్ణయించాలి. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారిని గుర్తించి ప్రోత్సాహించాలి. ఆదాయపన్ను పత్రాల్లో జీతంతో పాటు గీతాన్ని ప్రకటించుకునే సంస్కరణలు అమలు చేయాలి. గీతాలమీద తగినన్ని రాయితీలు ఇవ్వాలి. అవినీతి నిరోధకశాఖ విజిలెన్సు కమిషన్లు వంటివాటిని వెంటనే రద్దుచేసి ఆ సిబ్బందిని నీతి నిరోధక కార్యక్రమాల నిర్వహణవైపు మళ్ళించాలి. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించిన పద్ధతిలోనే అక్రమార్జనను క్రమబద్ధీకరించే చట్టాలు వెంటనే అమలుచేయాలి . నేతలు నానా గడ్డ కరిచి సంపాదించుకొన్న మొత్తాలను దాచుకునేందుకు  తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాలు వంటివాటి నిధులను మళ్లించి వెంటనే తగినన్ని నేలమాళిగలను ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వ గిడ్డంగులను ఖాళీ చేయించి నల్లధనాన్ని దాచుకునే సౌకర్యం కలిగించాలి. లంచగొండులకు తగిన రక్షణ కల్పించగలిగితే విదేశాల్లోని మన నల్లధనం మొత్తం మనదేశంలోకే ధారాళంగా ప్రవహిస్తుంది. అప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతులున్న దేశం మనదే అయితీరుతుంది. ఏమంటావ్! 


ఇంకేమంటాను. నా మనసులోని మాట చెప్పాలంటే నువ్వు నాకు ఒక అయిదొందలు ఆమ్యామ్యాగా అచ్చుకోవాలి. 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 





Thursday, January 13, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక మాయలోళ్లు రచన కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 21-01-2014 )


 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


మాయలోళ్లు 


రచన కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 21-01-2014 ) 


కంటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని మొత్తానికి ప్రస్తుతానికి నడుస్తున్నదంతా టోపీ రాజకీయమే.


'పదమూడు నెలలు తిరక్కుండానే ఆమ్ ఆద్మీకి అధికారం కట్టబెట్టింది హస్తిన ప్రజ. అప్పటి బట్టి  బడానేతలందరి దృష్టి హ్యాట్ ట్రిక్ పైకే మళ్లింది. ఇప్పటిదాకా అమాయకుల నెత్తికి మాత్రమే టోపీలు . ఇప్పుడు పోటీ అంతా తమ నెత్తిన తామే పెట్టుకునేందుకు .  తిరగడానికి . జనాల టైపు  టోపీలు  కనిపించవు . సొంతానివి మాత్రం తళతళా మెరుపులు ! 


ప్రారంభంలో మనవి తలపాగాలే. టోపీ పరిచయం తెల్లవాడితో. ఓడ దిగీదిగగానే బుర్ర మీది  'టోపీ' ఎత్తి భారతీయులను బుట్టలో పడేశాడు. సరకులు అమ్ముకుంటామని వచ్చి దేశం ఆసాంతం  మురుకుల్లా నమిలేశాడు. తెల్లవాడి పీడా  వదిలినా, వాడి 'టోపీ' మాయ మాత్రం మన నెత్తిమీదనుంచి దిగటంలా! 


బాపూతో  పాటు దక్షి ణాఫ్రికానుంచి దిగుమతయిన  టోపీ? పాపం, బాపూజీ ఆ టోపీ వాడకం  నిరాడంబరానికి గుర్తు.  ఆయన గుర్తుకు అని చెప్పుకొనే శిష్యుల వాడకానికి రకరకాల కోణాలు.  మాత్రం . . ' టోపీ పార్టీ ఇక వద్ద' ని మొత్తుకున్న పెద్దాయనకే చివరికి ' టోపీ ' పెట్టిందాయన శిష్యగణం ! 


పురానా జమానాలో పనామా కాలువ తవ్వే జనాలకు ఎండపొడకు రక్షణగా పుట్టిందీ టోపీ . టోపీ పెట్టుకు తిరిగే  చరిత్ర క్రీస్తుపుట్టక పూర్వానిది. మెక్సికోలో పురాతన కట్టడాలు  తవ్వేటపపుడే ఓ శవం  నెత్తి పై టోపీ ప్రత్యక్షమయిందని చరిత్ర. చచ్చినా వదలని టోపీ గురించి  ఎంత చెప్పినా తక్కువే! 


  ప్రతి బడుగుజీవికి నెత్తిన ఓ టోపీ  పాలసీ మన దగ్గర. నూట ఇరవై రెండు కోట్లకు పైబడిన జనాభా ! ఎన్ని రకాల టోపీలిక తయారు కావాలి! కాబట్టే  మన దగ్గర  కనిపించేటన్ని  టర్కీ టు ఇటలీ మార్కు మొత్తం కూడినా  తక్కువే! టోపీలకు బ్రిటన్ అమెరికాలు  మహా ప్రసిద్ధి.   మన దగ్గర మాత్రం ' ఇటలీ' మేడ్ కి మహా రద్దీ! 

టోపీలూ  హ్యాట్లూ మన టైపు సంస్కృతీ సంప్రదాయాలకు సూటు కాదు, కానీ టోపీలు పెట్టడం .. పెట్టించుకోడంలో మన రేంకే టాపు . 


విష్ణుమూర్తి సుదర్శనం  ప్రయోగించిన చివరి క్షణంలో గాని ప్రత్యక్ష మయేది కాదు. మన నేతలు పెట్టే టాపీలు అలాకాదు. దెబ్బై పోయిన తరువాతనే నెత్తికి పెట్టారని తెలిసేది!


 ఇంద్రజాలికుడు పి.సి.సర్కారు పిల్లపిప్పర మెంటు బిళ్లల నుంచి, ఆడపిల్లలకు  బొట్టుబిళ్లల దాకా ఏది కావాలన్నా  టోపీ నుంచే తీసిచ్చేది! మనా సర్కారు ముందు  పి.సి సర్కారు మాయ బలాదూర్ .  సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి హామీలు, ఆహార భద్రతలు, అవినీతిని అడ్డుకునే చట్టాలు, అర్హులకంటూ   ప్రదానం చేసే భూ   పట్టాలు... గట్రా గట్రాలు అడక్క  ముందే టక్కున టోపీ నుంచే  తీసిచ్చేస్తారు ! 


కళ్యాణకట్టల దగ్గర  అట్టముక్కల  పైన గుండుకు ఓ నామం ఉచితం, నామానికి ఓా టోపీ ఉచితం అని రాసుంటే చూసి నవ్వుకుంటాం . సర్కారు చేసే మాయలను  మాత్రం  మా బాగా నమ్ముకుంటాం . 'ఓటు' పత్రాన్ని  భక్తిగా బ్యాలట్ పళ్లింలో  పెట్టి మరీ  నేతలకే దేవుల్లాకు సమర్పించు కుంటాం. గుప్తుల బ్రాండ్ స్వర్ణయుగం కోసం కళ్లు  రెండు కాయలు కాసేలా ఎదురుతెన్నులు  చూస్తుంటాం . గుప్తులకాలంలో  కనిపించని టోపీలపై  మన పాలకులకు మహమోజని ఆలస్యంగా గుర్తిస్తాం . గుడ్లు అప్పుడు వెళ్ల బెట్టేస్తాం!  


రామాయణ కాలంలో భరతుడు అంత "మీద పెట్టి అమాయకంగా అడవులు పట్టిన అన్నగారి పాదుక లను పట్టుకొచ్చి సింహాసనం పాలన సాగించాడు. అదే కథ ఈ కలికాలంలో కనక పునరావృతమై ఉంటే పాదుకులకు బదులు 'టోపీ' కూర్చుని ఉండేదేమో సింహాసనంమీద. జటోపీ లేకుండా రామాయణమైనా, మహాభారతమైనా సరే రక్తికట్టే కాలం కాదిది. కమలనాథులూ కాషాయం టోపీల మీద పడ్డారంటే కథ ఎండాకా ముదిరిందో అర్థమవుతుంది.


సొంత నెత్తికి గొప్పగా కనిపించేటట్లు హ్యాట్లు తగిలించు కుని ఊరేగడం, ఓటేసేవాడి నెత్తికి ఏమాత్రం నొప్పి తెలీ కుండా కుచ్చుటోపీ తగిలించడమేగా పటాటోపం' అంటే జనం సొమ్ము లక్షల కోట్లు కుమ్మేసి ఆ కేసుల నుంచి నిక్షేపంగా బయటపడటానికి దేశాలు పట్టుకు తిరిగే యువనేత ఓదార్పు పేరుతో మంది నెత్తికి పెడుతున్నవి టోపీలు కావూ? పొద్దస్తమానం నిజాయతీ గురించి ఉపన్యాసాలు దంచే ఆ పెద్దమనిషి నిజానికి ఎన్నికల గుర్తుగా ఎంచుకోవాల్సింది 'టోపీనే


మోరెత్తి కాస్త అటు హస్తినవైపు ఓపిక చేసుకుని చూస్తే తెలుస్తుంది- 'టోపీ' రాజకీయాలెంత పటాటో పంగా నడుస్తున్నాయో!


'అమ్మ' ఏడుపు' సెంటిమెంటు పనిచెయ్యలేదు. ఇక లాభం లేదని యువరాజు కిరీటం ఇంట్లో దాచేశాడు. విరాటపర్వంలో, ఉత్తర కుమారుడి మాదిరిగా నవ్వూ కోపం కలగలిసిన కొత్త మొహంతో, కొత్త ఆమాద్మీ రకం టోపీతో జనంలోకి రాబోతున్నాడు. సహచట్టం, ఆధార్కార్డు, విద్యాహక్కు ఆహార భద్రత టోపీలు: నప్పలేదని, వంటగ్యాసు బండలు అవినీతి నిరోధక


చట్టాలు అంటూ కొత్తరకం టోపీలు బుట్టలో పెట్టు కుని ఓట్లకోసం బయలు దేరుతున్నాడు. బట్టతలకు దువ్వెనలు అమ్మేవాడికి పోటీగా బట్టతలకు టోపీ పెట్టడా నికి వస్తున్నాడు.


కనిపించే టోపీలు ఏవి పెట్టుకున్నా పరవాలేదు. కని పించని టోపీలతోనే సామాన్యుడు భద్రంగా ఉండాలి. ఎన్నికలు దూసుకొస్తున్నాయి. 'టోపీ'లొస్తున్నాయి.


కర్లపాలెం హనుమంతరావు




 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 


పదండి ముందుకు.. పదండి తోసుకు! 


-కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


ఆఫీసుకు పోగానే, 'ఆలస్యమయిందే' అనడి గాడు కామేశం . 


' బండిమొండికేసింది. పాద యాత్ర చేసొచ్చా' అన్నా. 


అలాంటి మాటలే. అన్నందుకు బాసు చేత చచ్చే చివాట్లూ తిన్నా. 


'ఎప్పుడూ విమానాల్లో ఎగిరేవాడు ఎప్పు డైనా రెండడుగులు నడిస్తే జాలి పడతారు. క్రీస్తు పుట్టక ముందెప్పుడో అయిదొందలేళ్ల కిందట సిద్ధార్థుడు మహారాజు కొడుకై ఉండీ రథం దిగి నడిచాడని మనమిప్పటికీ గొప్పగా చెప్పుకుంటాం . పల్లెల్లో ఆడవాళ్లు  నీళ్ళ కోసం మైళ్లకొద్దీ నడుస్తారు.... ఎవడికి పట్టింది? డొక్కుబండి మీద తిరిగే నీబోటివాడు.. బోడి.. నడిస్తే ఎవడిక్కావాలి. పాకితే ఎందుకు జాలి? నువ్వేమన్నా వై. యస్.వా.. ఎమ్మెస్ బాసువీ  నీ వెంటబడి మరీ పొగట్టానికి' అన్నాడు కామేశం.


యస్. వై.యస్.. అంటే గుర్తొచ్చింది. పేపర్లలో వారం పది రోజుల్నుండీ ఆయన్దే  ఊసంతా. 


ఊసుపోక కాంటీన్లో ఆ విషయమే కదిపా.  చర్చ అంటే కామేశం రెచ్చిపోతాడు. పైపెచ్చు హస్తం అభిమాని.


''అందుకే 'దేశం' ఉసూరుమంటుంది. హనుమంతుడు. కుప్పిగంతులేస్తుంది. మంత్రదండముందా అని మంత్రులు దండె త్తుతుంది. వై .. ఎప్పుడనాలో... యస్.. ఎప్పు డనాలో తెలిసిన గడుసువాడు నాయకుడైతే విపక్షం, స్వపక్షంలోని విపక్షం కూడా పక్ష పాతం లేకుండా ఏకపక్షంగా ఇలాగే పక్ష వాతం పాలబడుతుంది. మొత్తానికి గురు వును ముంచిన శిష్యుడు మా'వాడు' ' అన్నాడు కామేశం కులాసాగా. 


'గురువెవరు గురూ? '


' పేరెందుకులే.. బాధపడతావు. పైసా ఖర్చుపెట్టి పది రూపాయలు ప్రచారం చేసు కొనే విద్యకు మెరుగు పెట్టి అసలు ఏ పెట్టు బడీ లేకుండానే కీర్తిని రాబట్టే కొత్త టెక్నిక్  కనిపెట్టాడే ఆయనే శిష్యుడు. నడక తనది. తిమ్మిరి 

సీ యమ్ ది.  పాదాలు తనవి . బొబ్బలు తనవాళ్లవి.  పెడబొబ్బలు పెడుతున్నారుగా.. వినపట్టంలా? ' ముసిముసి నవ్వులు నవ్వాడు. 


' అవును హస్తం పాదయాత్ర వట్టి సర్కస్ ఫీట్' అంటున్నారు చాలమంది' 

అన్నా అక్కసుకొద్దీ. 


ఆయన నడక పడక అలా అంటున్నారు. గానీ, పాదయాత్ర సూపర్ హిట్. దిగ్విజ "యంగా నడుస్తున్నది మూడో వారం... ఓవర్ టేక్ చెయ్యాలంటే ఒహటే దారి. పరిగెత్తే యాత్ర పెట్టుకోవటమే! 


' వైయస్ కీ  వయసులో నడవాలని మనసెందుకైంది బాస్? 


సిటీలో నీళ్ళు లేవు. కరెంటు లేదు. పొల్యూషన్. ఎండలు మండిపోతున్నాయి. రైలెక్కుదామంటే పట్టాలు తప్పుతాయని

భయం. బన్సెక్కుదామంటే లగేజ్ ప్రాబ్లమ్. కార్లలో షికారు చేసే రోజులా..  కావు. అసెంబ్లీ సీజన్ అయిపోయింది. కరవుకు తప్ప మీడియాలోదేనికీ కవరేజీ లేని రోజులు. ఏవరేజిగా ఆలోచించగల ఏ నాయకుడికి అయినా  వచ్చే ఐడియానే ఈ అనంత ఆక్రందన! ... చూశావుగా ఎంత స్పందనో! దటీజ్ అవర్ బాస్' 


'అవునవును ఇది చూసే సీమ అవేదన.. కోస్తా అవస్త... గట్రాలు బైలుదేరాయని  జైలుదేరాయని నా థీరీ.  కరవు రోజుల్లో ఎవరు  పల కరించినా జనం బావురుమనటానికి సిద్ధంగా ఉంటారనేదే వీటి వెనక సిద్ధాంతం  . అవునా?' 


' దేవుడు బుట్టలో ఉన్నాడనే యమునా నది వసుదేవుడికి దారిచ్చింది. ప్రతిపక్షం బుట్టలో పవరుందని పసిగట్టింది కనకనే 'వార్ '  అయినా.. తె.రా.స. వారయినా... ఎవరైనా దానికి దారిస్తున్నది. బుష్ కా  మాత్రం పుష్ ఉండుంటే దండయాత్రకు బదులు ఇరాకులో పాదయాత్ర చేస్తుండే వాడు. ఏ చిరాకు లేకుండా చవురు బావులు చులాగ్గా దక్కుండేవి. మీ ముఖ్య

మంత్రిగారిరవైనాలుగ్గంటలూ నిద్రపోకుండా... నిద్రపోనీయకుండా 'జన్మభూమో అని వెంటబడుతుంటే జనంలో చైతన్యం మరీ ఎక్కువైనట్లుంది... ప్రతిపక్షం వెంట బడి పోతున్నారు.' 


'అవును స్పూర్తి సి.యమ్ ది. కీర్తి వై.యస్ ది . ప్రజల వద్దకు పాలన చివరి సీనులో ప్రజల వద్దకు ఆలనగా ఎలా మలుపు తిరిగిందో చూడు. దటీజ్ పొలిటిక్స్.. ' 


' కరవులో రాజకీయం సబబా గురూ !' 


' పడనివాళ్ళు అలా అంటుంటారుగానీ నడక పవరు నీకేం తెలుసు? పదవులు పోయిన పాండవులకి పాదయాత్ర చేస్తేగాని మళ్ళీ రాజ్యం

దక్కలేదు. ఉన్న ఊళ్ళో ఉప్పు దొరక్కటండీ  గాంధీగారు ' పదండి దండిగా! 

ఉప్పు చేద్దా' మని దండియాత్రకని బైలుదేరిందీ! ప్రజల్లో స్థానం కోసం అప్పుడప్పుడూ ఇలాంటి డప్పు ప్రస్థానాలు, ప్రజాప్రస్థానాలు..

పుట్టుకొస్తుంటాయి మహాశయా! మావో  మహాశయుడు  కూడా డెబైయేళ్ల కిందట ఎన్నో వేలకిలోమీటర్లిలాగే నడిచాడయ్యా మహానుభావా...! ' 


' పొద్దుపొడిచింది మొదలు పొద్దు గడిచిందాకా ఇళ్ళల్లో ఇల్లాళ్లు తిరిగేదానికి మీటరేస్తే ఇంతకన్నా ఎన్నో వేల రెట్లు తిరిగుంటారు బాస్: ఇదో పెద్ద మేటర్ కాదు. శాసనసభల్లో ముక్కలు ముక్కలుగా చేస్తారే మన నాయ కులు... వాకౌట్లు..., వాటినన్నింటినీ కలిపి కూడితే మావో ప్రస్థానానికన్నా మరో మీటర న్నా పొడుగుండుంటుంది. ' 


' పాదయాత్రలెన్ని యోజనాలున్నాయన్నది కాదు ప్రశ్న.. జనా

లకెన్ని ప్రయోజనాలున్నాయన్నది పాయింట్. ' 


' రాముడు నడిచిన బాటలో రాయిక్కూడా ప్రాణం వస్తుంది. మా పెద్దాయన నడుస్తున్న బాటలో ఊళ్లకి ఊపిరి వస్తుంది. అన్న నడిచే బాటలోని ముళ్లని లక్ష్మణస్వామి ముందే ఏరి ' పారేసినట్లు... మా నాయకుడు నడుస్తున్న దారిలోని పెండింగ్ పన్లన్నింటినీ ప్రభుత్వం ముందే పూర్తిచేస్తున్నదా లేదా?  అదే పెద్ద ప్రయోజనం. పేపరు చూట్టంలా? '  అన్నాడు ఎద్దేవాగా. 


' అది చూసే మా దిబ్బపాలెం మామయ్య ఆ పెత్తనం మీదేసుకుని నెత్తి మీదకు తెచ్చుకున్నాడు' అన్నా చివరికి. 


' ఎవరా దిబ్బపాలెం మామయ్య? ఏమిటా కథ? ఎప్పుడూ చెప్పలేదే? ' అనడిగాడు కామేశం. 


' ఇప్పుడు చెబుతున్నా. విను. మా మామయ్య దిబ్బపాలెం ఉప సర్పంచి.  నీకులాగే పెద్దాయనకు పెద్ద అభిమాని.  రూట్ లేకపోయినా పాలెం మీద నుంచి పాద యాత్ర ఏర్పాటు చేసుకున్నాడెలాగో తంటాలు పడి . ఉప్పందిన అధికారులు ఏం చేశారో తెలుసా? రాత్రికిరాత్రి ఆత్రంగా ఊరి బైటి  చెత్తనంతా ఊళ్ళోకెత్తిపోసి... పెద్దా యన దారి మాత్రం ఫినాయిల్ పెట్టి కడి గేసి కూర్చున్నారు. ' 


' నమ్మేదేనా? .... ఏ పేపర్లో రాలేదే? ' 


' అన్నీ పేపర్లో రావు. అడుగో.... మా మామయ్య ఊళ్ళో వాళ్లు తంతారని మా ఇంట్లో దాక్కున్నాడు. అడుగు! ' అన్నా  అప్పుడే మా ఆఫీసుకొచ్చిన మా మామయ్యని చూపించి . 


'నిజమేరా అబ్బాయ్..' అని అడక్కుం డానే అన్నీ ఆయనే చెప్పుకొచ్చాడు 'సర్ పంచి పదవికి తాడేస్తే.. ఉన్న ఉప సర్ పంచి పదవి ఊడినట్లయింది. నా పని. ఎన్నికలయితేగాని అన్ని విషయాలూ తేలవు' అన్నాడు దిగులుగా.


' పోనీలే అంకుల్... ఓడితే మాత్రమేం.. ఒలింపిక్స్లో మారథాన్ రేసని ఉందొకటి దానికి పనికొస్తుంది మన కాంగిరేసు' అన్నాడు కామేశం ఓదార్పుగా.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-04-2003 ) 


కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...