Tuesday, April 14, 2020

సున్నాలం కరోనా .. మాఫ్ కరోనా! - కర్లపాలెం హనుమంతరావు



ఒక్క పెట్టున వచ్చి పడితివే .. దిక్కు తోచడం లేదిక్కడ మాకు !
రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా మా తిక్కమానవజాతిని
మూడో కన్ను తెరిచి మాడ్చి మసి చేస్తున్నావిదేమి   న్యాయం కరోనా!
నాలుగు రాళ్లు గడించినంతనే  కరోనా
పంచభూతాల కధినాథుల  మనుకుంటామనా శిక్ష ?

ఆరు ఖండాల నిండా ఆరున్నొక్క  రాగాలే యీ రోజున
సప్తసముద్రాలూ నీకేమాత్రం అడ్డంకులు     కాకపోయె  
అష్టదిగ్బంధనా లెందుకిలా  ? తగునా కసి కరోనా మా అర్భకజాతి పైన ?

నవరసాల మహాకావ్యం  మాది, మే మరులయని   వీర్రవీగుతాం; అందుకనా
పది పదులైనా నిండక ముందే  కోవిడ్ -పంథొమ్మిదిలా  దుర్బలుల మీదిలా దుందుడుకుతనం?

సున్నాలం కరోనా ! ఒప్పుకుంటున్నాం,  మా సన్నాసి తప్పులు మాఫ్ కరోనా!
కరుణించు! కలియుగాంతం దాకా   నీ వైరస్ ఘరానాలనే కథలు కథలుగా తలుచుకుంటాం.. హఠోనా !

- కర్లపాలెం హనుమంతరావు
14 - 04 - 2020




Monday, April 13, 2020

అలెగ్జాండరు జగజ్జేతా?!- -కర్లపాలెం హనుమంతరావు






'అలెగ్జాండర్ , ది గ్రేట్' అని మాకు ఎనిమిదో తరగతిలోనో, తొమ్మిదో తరగతిలోనో   ఇంగ్లీషు పాఠం ఉండేది. ఆ పాఠం పంతులుగారి నోట వింటున్నప్పుడు, అచ్చులో రోజూ చూస్తున్నప్పుడు 'ఆహా! అలెగ్జాండర్.. నిజంగా ఎంత గ్రేటో!' అనుకుంటుండేవాళ్లం ఆ చిన్నతనంలో.
పెరిగి పెద్దవుతున్నా చాలాకాలం వరకు ఆ అభిప్రాయంలో మార్పు రాలేదు. కానీ ఆ మధ్య సుధాకర్ ఛటోపాథ్యాయ అనే చరిత్ర పుస్తక రచయిత రాసారని చెబుతున్న ' ద అకమీనీడ్స్ అండ్ ఇండియా' పుస్తకంలోని కొద్ది భాగం ఆంధ్రజ్యోతి సంపాదక పుటలో శ్రీమతి ముదిగొండ సుజాతారెడ్దిగారు రాసింది అనుకోకుండా చదవడం జరిగింది. 'ఆహా! అయ్య.. అలెగ్జాండరుగారిలోని గొప్పతనం ఇదా!' అని ఆశ్చర్యపోవడం నా వంతయింది.
ప్రపంచం మొత్తాన్ని జయించాలన్న పిచ్చి కోరికతో చేసిన యుద్ధాల్లో  ఆయనగారు అవసరమైన చోట యుద్ధనీతులక్కూడా తిలోదకాలిచ్చేసినట్లు చదివితే అవాక్కవక తప్పదు ఎవరికైనా. పెషావరు యుద్ధంలో అలెగ్జాండరుకి ఎదురైన ప్రతిఘటన చాల బలమైనది. తానే స్వయంగా యుద్ధరంగంలోకి ఆయుధం పట్టుకుని దిగినా గెలుపు అంత సునాయాసంగా దక్కే అవకాశం కనిపించలేదు.  అశ్వకులఅనే బలమైన శత్రుజాతిని  వీరోచితమైన పద్ధతిలో ఎదుర్కోలేక రాత్రి పూట చాటుగా చీకటి మాటున కోటలోకి జొరబడి  మూకుమ్మడిగా ఉచకోత కోయించాడని రాసుందా గ్రంథంలో!
అలెగ్జాండరు రక్తంలో ఉన్నది యోధత్వమా? ప్రపంచదేశాల సంపదనంతా కొల్లగొట్టి స్వదేశానికి తరలించుకుపోవాలన్న డబ్బువుబ్బరమా? ఆ వ్యాసంలో రాసింది చదివేవారికి ఎవైరికయినా ఆ అనుమానం రాక తప్పదు.
మేసిడోనియా దేశం(ఇప్పటి స్లోవాకియా) రాజు ఫిలిప్స్ ముద్దుల బిడ్ద అలెగ్జాండరు. అతనికి చిన్నప్పట్నుంచే యుద్ధాల పిచ్చి. అరిస్టాటిల్ శిష్యరికంలో మెరికలాగా తయారయాక ప్రపంచ దేశాలన్నింటి మీదా పెత్తనం చెలాయించాలన్న కొత్త తుత్తర మొదలయిందంటారు.
సైన్యాన్ని, వనరులని దండిగా సమకూర్చుకుని ముందుగా దగ్గర్లోనే ఉన్న అకీమీనియన్ దేశం మీదకు దండయాత్రకెళ్లాడు. అప్పటికే మూడో తరం ఏలుబడిలో పడి   బలహీనంగా ఉందా దేశ రక్షాణ వ్యవస్థ.  డేరియన్ని ఓడించడం మంచినీళ్ల ప్రాయమయింది. ఆ విజయం ఇచ్చిన అత్మవిశ్వాసంతో ధనాగారంగా వర్ధిల్లే మన భరతఖండం మీద కన్నుపడింది అలెగ్జాండరుకి.
దారిలోని ఈజిప్టు, అసీరియాలాంటి దేశాలను ఒక్కొక్కటిగా వశపరుచుకుంటూ పర్షియా రాజధాని పెర్సిపోరస్ చేరుకొన్నాడు అలెగ్జాండర్. కొన్నాళ్లపాతు తనకూ. తన సైన్యానికి విరామం అవసరమనిపించిందేమో..  ఆ దేశం రాజు మీద పై చేయి సాధించినా అతని కూతుర్ని వివాహమాడి మనుగుడుపు అల్లుడు మాదిరి సుఖాలు అనుభవించాడు. సామదానభేదదండోపాయాలలో ఏది ఎప్పుడు ప్రయోగించాలో అరిస్టాటిల్ శిష్యరికంలో బాగా ఆకళింపు చేసుకున్న జిత్తులమారి! లేకపోతే దక్షిణ గాంధారం రాజు అంబి తక్షశిలలో అలెగ్జాండర్  ముందు అంత సులభంగా ఎందుకు    స్వీయాత్మార్పణ చేసుకొంటాడు? అక్కడి గెలుపు ఇచ్చిన కిక్కులో అలెగ్జాండర్ జీలం.. చీనాబ్ నదుల మధ్య ప్రాంతాల్లో ఉన్న పౌరస్ మీదకొచ్చి పడ్డాడు.
పౌరస్ పౌరుషం అలెగ్జాండర్ మునుపెన్నడూ రుచి చూడనిది. పౌరస్ గజబలం ముందు  అలెగ్జాండర్ ఆశ్వికదళం డీలాపడిందంటారు.
నిజానికి అక్కడ అలెగ్జాండరుకి ఏ మేరకు విజయం లభించిందో ఇతమిత్థంగా చెప్పలేం. యూరోపియన్ హిస్టోరియన్స్ రాసిన చరిత్రే మనకు ఆధారం అప్పట్లో. తమ యూరోపు యుద్ధవీరుడికి ఆసియావాసుల ముందు  పరాజయం కట్టబెట్టడం తలవంపులుగా భావించినట్లుంది.. మధ్యగోళ చరిత్రకారులు ఆ అపజయాన్ని కనీసం రాజీగా కూడా చిత్రించేందుకు ఇష్టపడలేదంటారు సుధాకర్ ఛటోపాధ్యాయ. పౌరస్ మీద పై చేయి సాధించినా అలెగ్జాండర్  శత్రువుకు రాజ్యాన్ని ఉదారంగా  వదిలేసి వెనక్కి మళ్లినట్లు తమ చరిత్రలో రాసుకున్నారని ఆ చరిత్రకారుడి  ఫిర్యాదు.
‘The classical authors have evidently twisted the facts to glorify their one hero'(p.21) అని ఆ పుస్తకంలో రాసి ఉన్న దాన్ని బట్టి అలెగ్జాండర్ విజయం అనుమానస్పదమే అనిపిస్తుందిప్పుడు.
ముందున్న ప్రాంతమంతా ఎగుళ్లు దిగుళ్లు. సముద్రాలు, నదులు, దట్టమైన అడవులు. పాములు, తేళ్లులాంటి ప్రాణాంతకమైన జీవులు సంచరించే ప్రాంతాలే అన్నీ. దట్టంగా వర్షాలు దంచికొడుతున్నాయ్ ఆ సమయంలో. వరస యుద్ధాలతో బాగా అలసిపోయుంది సైనికదళం. అన్నిటికీ మించి అప్పటి వరకు వివిధ దేశాలలో దోచుకున్న సంపదతో తృప్తి చెంది తిరిగి స్వదేశంలో తమవారితో సుఖపడాలన్న కోరిక.. ఆ సైనికులలో మొండితనాన్ని కూడా పెంచిందంటారు.  అతికష్టం మీద అలెగ్జాండర్  వాళ్లకు నచ్చచెప్పుకుని ముందుకు నడిపించినా.. సింధునది దక్షిణ ప్రాంతంలో మల్లులు, క్షుద్రకులు అనే రెండు జాతులు ఉమ్మడిగా చేసిన దాడిలో అలెగ్జాండరే స్వయంగా విషపూరితమైన  అమ్ము శరీరానికి తాకి గాయపడ్డట్లు కథనం.
ఏదేమైనా ప్రపంచ విజేత కావాలన్న తన కల నేరవేరక ముందే అలెగ్జాండర్ తిరిగి స్వదేశానికి పయనమయిన మాట మాత్రం పచ్చి వాస్తవం.
అంభంలో కుంభం అన్నట్లు.. ఆ తిరుగు ప్రయాణం మధ్య దారిలో మలేరియా జ్వరం తగులుకొని బాబిలోనియాలో(సూసానగరం అని కొందరంటారు) క్రీ.పూ 324లో ఆఖరి
శ్వాస విడిచాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని లొంగదీసుకోవడం మాట అటుంచి మృత్యువుకు తాను అంత నిస్సహాయంగా లొంగిపోయాడు.
అయినా 'అలెగ్జాండర్ .. జగజ్జేత' అంటూ యూరోపియన్లు  తమకు అనుకూలంగా రాసుకున్న తప్పుల తడక చరిత్రను తెల్లవాడి పుణ్యమా అని మనం వల్లెవేసాం!  మన పిల్లల చేతా ఇప్పుడు వల్లెవేయిస్తున్నాం!
చరిత్రలూ చాలా రకాలుగా ఉంటాయి. ఎవరి విశ్వాసానికి తగ్గవి వాళ్లు  చదువుకుంటున్నారిప్పుడు! అలాంటప్పుడు ఏ సమాచారాన్నని తప్పు పట్టగలం? ఏ సమాచారం కరెక్టని నెత్తి మీద పెట్టుకోగలం?
-కర్లపాలెం హనుమంతరావు
13 -04 -2020
బోథెల్, యూ.ఎస్.ఎ


Saturday, March 21, 2020

సరదాకేః ఆదివారం శీర్షిక కోసం ఉత్తర కాండ -కర్లపాలెం హనుమంతరావు




ఉత్తరాలు రాయడం  కళఅందులోనూ పత్రికలకు ఉత్తరాలు రాయాలంటే 
ప్రత్యేకమైన ఓర్పునేర్పు తప్పనిసరిలేఖల శైలి విభిన్నంగా ఉండాలిఅంశం
అరుదైనది అయితే సంపాదకుడి దృష్టిని ఇట్టే పట్టేస్తుందిఉత్తర రచయిత
ప్రథమ పాఠకుడు పత్రికాసంపాదకుడే కదా!

ఉత్త ఉత్తరాలతో ఉద్ధరించేదేముందిఅనుకోవద్దుప్రియురాలు
అంగీకరిస్తుందనేనా ప్రియుడు రక్తంలో ముంచి మరీ తన ప్రేమను లేఖల మూలకంగా
తెలియపరచడంలక్కుండడం ముఖ్యంఅది లేకుంటే ఎంత ' పాజిటివ్గ్రూపు తో
గోడు వెళ్లబోసుకున్నా  నెత్తురు చుక్కలు ఉత్తరంలోనే ఇంకిపోయేది.


పత్రికల ఉత్తరాల పంథా వేరువాస్తవ రచయితలు ఎవరో తెలియదువాస్తవంగా
ఎవరన్నా దృష్టి పెట్టి చదువుతున్నారాఅని అడిగినా సమాధానం తెలియదు.

వినవలసినవాళ్ళు  విన్నపాలు వింటున్నారో.. నలిపి దిబ్బవతల
పారవేస్తున్నారో పట్టించుకోకుండా తెల్లటి ఉత్తరాన్ని నలుపు చెయ్యాలంటే
రాసే రచయిత చందమామ మార్కు విక్రమార్కుని వంశానికి చెందినవాడయి ఉండాలి.

మామూలు మహజర్లకు మల్లే కాదు.. పత్రికకు రాసే ఉత్తరాలల్లో కొన్ని
ప్రత్యేకమైన సౌకర్యాలూ కద్దుఎంత పెద్ద ట్రంపుతోనయినా.. పేకముక్కల
ట్రంపాట’ ఆడుకోవచ్చుఎదురుపడే ఛాన్సే లేని కొరియా మొం
ది కింగ్ కిమ్ తో అయినా సరే  కుమ్ములాటకు దిగిపోవఛ్చుమోదీషాలతో

తలమోదుకునేలాంటి తమాషాలు సామాన్యుడికి ఉత్తరాలతో మాత్రమే సాధ్యమయ్యే
సాహసం.

కొహ్లీకి జై కొట్టటానికైనా,  ఉమ్రాన్ ఖాన్ ను 'ఛీఁకొట్టడానికైనా
ఉత్తరాలే గత్యంతరం ఎంత లావు అభిమానందురభిమానం పొంగిపొర్లిపోతున్నా!
తాడూ బొంగరం చేత లేకుండానే బాలచంద్రుణ్ని మించి  ఎంతటివారి మీద
చెలరేగిపోవాలన్నా పత్రికలకు రాసే ఉత్తరాల వల్లే అది సాధ్యంబిల్ గేట్స్
భుజం తట్టడానికికంప్యూటర్ సత్యాన్ని కసితీరా తిట్టడానికి కామన్ మ్యాన్
అనే సామాన్య ప్రాణికి ఉత్తరాలను మించిన మరో  శక్తివంతమైన ఆయుధం ఏదీ లేదు
ఎంత  ‘ఫైట్ ఫర్ జస్టిస్’ ఉద్యమం నడిచే ప్రజాస్వామ్యంలో అయినా?


పత్రికల్లో పడే ఉత్తరాలు ఎవరు చదువుతారన్న నిర్వేదం వద్దు.
ధృతరాష్ట్ట్రుడు వింటాడనేనా విదురుడు అంతలా ఆపకుండా సలహాలు
దంచికొట్టిందిస్వార్థం లేనిదే  పని తలపెట్టడమైనా వ్యర్థమనుకునే 

కలికాలంలో అయిదో పదో వదిలితేనేమికలంతో జాతి అంతరాత్మను నిద్రలేపి
తీరాలన్న పంతం పట్టడం అంత సామాన్యమైన విషయమేమీ కాదుఉత్తర రచయితలు
ఉత్తర కుమారులతో పోల్చడం పొరపాటు.


అచ్చు ముచ్చట నుంచి పుట్టుకొచ్చింది  ఉత్తర రచనా వ్యాసంగం.
ప్రజాస్వామ్యానికి పిల్లార్స్(మూలస్తంభాలు).. పత్రికలవాళ్లకి  ఉత్తరాలే
స్పేస్ ఫిల్లర్స్ఎక్కడో ఇరాన్  సులేమాన్ ని అమెరికన్  దళాలు
మట్టుపెట్టేస్తే ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్రేనని.. అంతర్జాతీయ శాంతి
భద్రతల ఒప్పందాలకు విఘాతం కలిగించే దుస్సాహసానికి పూనుకుంటే చూస్తూ
ఊరుకోమని .. అనంతపురం జిల్లా మారుమూల పల్లె పాములపాడు నుంచి కూడా  రంకెలు
వేసెయ్యగలగడం సామాన్యపౌరుడికి ఒక్క పత్రికలకు రాసే ఉత్తరాల ద్వారా

మాత్రమే పాజిబుల్.

శ్రీదేవి విదేశాలల్లో చనిపోతే ఆమె అభిమానులందరూ దుబాయ్ దాకా పోయి
భోరుమనలేరు కదాపత్రికలవాళ్లే కాస్త పెద్ద మనసు చేసుకుని  రెండు మూడు
వాక్యాలకు మించకుండా  ప్రగాఢమైన శోకతప్త హృదయావేదనని వెళ్లబోసుకొనే
వెసులుబాటు తమ  ఉత్తరాల శీర్షిక ద్వారా కల్పిస్తారుఇంట్లో కూర్చుని ఈత

ముంజెలు తింటూ కూడా సంతాప సూచకంగా -మెయిళ్లు పంపుకునే వెసులుబాటు
పత్రికల ఉత్తరాల ప్రత్యేకత-కాలంలో కూడా  ఉత్తరాల కాలమ్  ప్రాధాన్యత
ఇంచ్ అయినా తగ్గకపోడానికి ఇదీ  కారణమే!


క్రికెట్టాటలో కొహ్లీ సెంచరీ కొట్టినాఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో
తెలుగుతేజం నామినేషన్ వేసినానాసా తయారీ వ్యోమనౌక శ్రీహరి కోట నుంచి
అంతరిక్షంలోకి దూసుకు వెళ్లినా.. కాలు బైటపెట్టకుండా కార్యక్రమ
నిర్వాహకులకు జైకొట్టవచ్చు.. అభినందనల మందారమాలలను అందించవచ్చు

భాగ్యం కేవలం ఉత్తరాల శీర్షిక వల్లనే సామాన్యుడికి సాధ్యం.

పాఠకుల నాడి పట్టుకునేందుకు  పత్రికలకూ  ఉత్తరాలే ప్రధాన సాధనం.
మచ్చుక్కి కొన్ని పత్రికల్లో అచ్చయిన ఉత్తరాలను లోతుగా పరిశీలిస్తే
కాలానుగుణంగా లోకుల ఆలోచనలలో కలిగే మార్పు ఎంత ఆసక్తికరంగా ఉంటుందో
అర్థమవుతుంది.

రోకళ్ల రామకృష్ణ అనే పాఠకుడు ఒక దినపత్రికకు రాయచూరు నుంచి రాస్తాడూ

'డివైడర్ల వంకతో నడిరోడ్డు మధ్యన కోటగోడలు కట్టేస్తున్నారు హైదరాబాదులో.
సికందరాబాదు నుంచి సంజీవయ్య పార్కు చేరాలంటే ట్యాంక్ బండ్ ఎక్కి
బుద్ధవిగ్రహం మీదుగా వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి రావాలికాలహరణంచమురు
వృథాబిజీ సమయాలల్లో .. కరువు కాలాలల్లో సామాన్యుడుకి భారం కదా!

పిల్లలువృద్ధులుమహిళలుదివ్యాంగులు రోడ్డు దాటేందుకుగాను ప్రత్యేక
సహాయకబృందాలు ఏర్పాటు చెయ్యడం అవసరమని ప్రభుత్వానికి మనవిసంబంధిత
అధికారులు సత్వరమే స్పందించాలి!'. అందరి మనసులలోని చింత దాదాపుగా అదే
ఉంటుందిలేఖల కాలమే కనుక లేకపోయివుంటే  ఉత్తిపుణ్యానికి గాలిలో
కలిసిపోయే చింతన కదా  ఉత్తరాల రచయితలు నస్వార్థంగా పూనుకోకపోతే!


పత్రికలలోని ఉత్తరాల శీర్షికకు పలు కోణాల నుంచి బాణాలు
దూసుకొచ్చిపడుతుంటాయ్యాభై పైసల చెల్లుబాటును గురించి కరీంనగర్ నుంచి
రమాకాంతరావు అనే పౌరుడు  విధంగా వాపోతుయాడో ప్రాంతీయ సాయంకాలంపత్రికలో.
'ఐదుపదిఇరవైపావలా బిళ్లలు కాలదోషం పట్టడానికి  కారకులైన అజ్ఞాత
శక్తులే మళ్లీ ఇప్పుడు యాభై పైసల బిళ్ల చిల్లుగవ్వ విలువైనా చెయ్యవని
దుష్ప్రచారం మొదలుపెట్టాయియాభై నోటునకిలీది అయినా కళ్లకద్దుకుని
పుచ్చుకునేవాళ్ళే అసలు సిసలు యాభై పైసల బిళ్ల స్వీకరించడానికిమాత్రం

ఠలాయిస్తున్నారుఅర్థరూపాయి బిళ్లల చెలామణిపై పెద్ద ఎత్తున ఉద్యమం
చేపట్టాల్సిన అవసరం ఉందిజాతికి చెందిన విలువైన వనరులతో ముద్రించే 
చిల్లర బిళ్లలు ఇప్పటికే ముష్టివాళ్ల దృష్టిలో కూడా ముష్టిబిళ్లలుగా
మారిపోయాయిమరింత నిర్లక్ష్యం  తరహాలోనే గానీ కొనసాగే పక్షంలో తమ అంతిమ
యాత్రలలో చల్లేందుకు పాడె మీది శవాలు ఒప్పుకోని ప్రమాదం ముంచుకురావచ్చు.

ఏడాదికి ఒక్కసారి వచ్చే పసిబిడ్డల భోగిపళ్ల కోసరమని ఎంతని చిల్లర
పోగేసుక్కూర్చోడంజేబు బరువు అన్న చిన్నచూపు తగదుహారతి పళ్లెంలో యాభై

పైసలు పడంగానే గుడ్లు ఉరిమి చూసే  గుడిపూజారుల మీద తక్షణమే ఆర్థికనేరాల
సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం..' ఎన్ని
రూపాయలు పోస్తే ఇంత పెద్ద లేఖ రాయడం అవుతుందోఅందునా పత్రికలకు!
ఇన్నిన్ని ప్రభుత్వాలు మారుతున్నా  ఒక్కటీ కరీంనగర్ వాసి
రమాకాంతరావుగారి మొర ఆలకించినట్లులేదుయాభైపైసల బిళ్లలిప్పుడు కనీసం
పిల్లలు ‘బొమ్మా.. బొరుసా?’ ఆటాడుకునేందుకైనా కనిపించడం లేదు!


మాతృభాష మీద ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులను పక్షానికి ఒక పర్యాయం
నిరసిస్తూ మండిపడే టైపు ఉత్తరాలు ఎన్ని దశాబ్దాలు దాటినా రావడం ఆగడంలేదు
పత్రికలల్లో.  మండపేట నుండి  జ్వాలా శర్మతెలుగు భాషా పండితుడు;

హైయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్నెలకు రెండు రౌండ్లు,  పత్రిక మార్చి
పత్రికలో ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకిస్తూ మండిపడ్డం రివాజు. ' ‘తెలుగు
నేర్చుకోండని చదువు రానివాళ్లను కూడా హడలుగొట్టే ప్రభుత్వాలు ముందు
'హుడా'ని  'హైనస' (హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ)గా ఎందుకు మార్చుకోవు?’
అని అయ్యవారి కలంవాత.  శర్మగారి రాతలే తప్పించి తెలుగు భాష ‘తలరాతలో
వీసమంతైనా మార్పు కనిపించడంలేదుఅది వేరే కత.

ఓపికతీరక ఉండాలి..  నెల రోజుల  పత్ర్రికలు నానా రకాలవి
ముందేసుక్కూర్చున్నా చాలు ప్రపంచాన్నిదేశాన్నిరాష్ట్రాన్ని,

ప్రాంతాలనుప్రజలను ఎన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయో ఇట్టే
తెలిసిపోతుంది.  పాలిటిక్సు మీద వచ్చే రొటీన్ లేఖలు పక్కన పెట్టినా
ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్న  ప్రమాదం మీద కనీసం  అయిదారు ఆందోళనకరమైన
ఉత్తరాలు కంపల్సరీగా దర్శనమిస్తాతయివాతావరణ కాలుష్యాల మీద  వారానికి

కనీసం ఒకటైనా హెచ్చరికలతో కూడిన లేఖ తప్పనిసరిప్రభుత్వ రంగ సంస్థల్లో
జరిగే అవినీతిబ్యాంకులవారు  విధుల పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరుల
మీద నిప్పులు కక్కే ఉత్తరాలు తప్పనిసరిగా నాలుగయిదుకు తగ్గకుండా ఉండకపోతే

ఒట్టుజాతి విలువలు పడిపోతున్నాయనిదేశభక్తి గణనీయంగా తగ్గిపోతోందని,
విద్య వ్యాపారమయమైపోయి సామాన్యుడికి అందని ద్రాక్షగా తయారవుతుందనే టైపు
ఏడుపుగొట్టు లేఖలు రోజు మార్చి రోజు ఏదో  పత్రికలో గ్యారంటీగా

కనిపిస్తుంటాయి.
మద్యాన్ని బహిష్కరించాలని గర్జించే లేఖల సంగరి ఇహ సరే సరి!


అచ్చువేయని పక్షంలో ప్రజాపక్షంగా తాము పనిచేస్తున్నట్లు మరో రుజువు
చూపించి నమ్మించడం కష్టమని పత్రికలు భావించే అన్ని రకాల అంశాల పైన
అంకుశాల వంటి లేఖాస్త్రాలు సంపాదకుకుల పేజీలలో సంధింపడే రోజులు ఇప్పడివి.
ఉత్తరాల రచయితలను ఉత్త రాలుగాయి సరుకుగా భావించరాదని భావించే

ప్రజాస్వామ్య పంథా కదా  ప్రస్తుతం నడుస్తున్నట్లు కనిపిస్తున్నది!
ఎక్కణ్ణుంచి  ఉత్తరం ముక్కయినా రాని పక్షంలో 'ఎన్నార్సీ చట్టం అందరి
కోసమా.. కొందరి కోసమా?’ అంటూ ఏదో  సందర్భం చూసుకుని పెద్దక్షరాలతో 
బుల్లి ఉత్తరం పత్రికలే బనాయిస్తాయని వాదు.  జనాభిప్రాయం తీర్చి

దిద్దడంలో  తమ వంతు పాత్ర  సక్రమంగా నిర్వహిస్తున్నట్లు అచ్చుపత్రికలు
రుజూ చూపించుకునేవీ  ఉత్తరాల శీర్షిక ద్వారానే కదా!  సర్క్యులేషన్లో
గొప్ప మార్పేమీ లేకపోవచ్చును.  కానీ ‘లేఖల కాలమ్’ అంటూ ఒకటి  మూలో  లేని
పక్షంలో సంపాదక పుట వన్ సైడెడ్ లవ్ లెటర్స్  కట్ట తరహాలో వండేసిన
వంటకాలన్న  అన్న నిజం భైట పడుతుందని పత్రికల బెంగ!


ఫ్లోరోసిస్ ఇస్యూల మీద ఇస్సులుతొక్కే ఉత్తరాలు ఇప్పట్లా కాకుండా గత
దశాబ్దిలో చాలా పెద్ద  ఎత్తునే పత్రికల్లో వస్తుండేవి దిశగా
లేఖాసాహిత్యం ఒక్కసారిగా సద్దుమణగడానికి ఉల్లేఖించలేని కారణాలు ఏవో
ఉండుంటాయికానీ పాలకులు తమ ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. ‘ఏలికల మొండి
వైఖరి కారణంగా జనంలో ఆవరించిన నిస్సత్తువని   సహజంగానే ప్రతిపక్షాలు
కసురుతుంటాయికసుర్లకయినావిసుర్లకయినా అడ్రస్ లేని మనిషికి మాత్రం
పత్రికల లెటర్స్ మాత్రమే గతిప్రజాస్వామ్యం ఉండిప్రజలకు గొంతున్నంత
కాలం పత్రికలలోని ఉత్తరాల శీర్షికకు మాత్రం ఛస్తే ఢోకా ఉండదుఇది నిజం.


ఎయిడ్స్ధూమపానంసెల్ దుర్వినియోగంపాఠశాలల్లో అరకొర సౌకర్యాలు,
పరీక్షల తేదీలుపండుగ ముహర్తాలుఅరకొర రవాణా సౌకర్యాలురైళ్ళ
రాకపోకడులువేళకు రాని ఎరువులుకల్తీ విత్తనాలుకృత్రిమ మార్గాలలలో
పదార్థాలు మాగబెట్టడంధర్మాసుపత్రుల్లో వైద్యుల కొరతరేషను దుకాణాల
సరుకు సరఫరాపరీక్షల తేదీలుమూల్యాంకనాల మీద శంకలుఫలితాల పైన
అయోమయాలుపభుత్వోద్యోగుల జీత భత్యాలురాని సర్కారు మార్కు కొలువులు,
అచ్చు కాని పాఠ్యపుస్తకాలుఅచ్చయినా వాటిలోఅడుగడుగునా కనిపించే దోషాలు..

ఒహటనేమిటి.. ఏరువాకల వేళలకు రుతుపవనాల రాక ఆలస్యం నుంచిఏరు గట్లు తెగి
నీరు ఊళ్ల మీదకొచ్చిపడే వరకు  పత్రిక ఉత్తరాల రచయితలు టచ్ చెయ్యని టాపిక్

అంటూ  దాదాపు భూమ్మీద ఏదీ ఉండదుకామారెడ్డిగూడెంలో కండోమ్స్ సమస్యను
గురించి స్వామి బ్రహ్మానందస్వామి పేరుతో  ప్రముఖ పత్ర్రికలో ఉత్తరం

అచ్చయిందంటే.. లేఖలకు పత్రికలలో ఉండే ప్రాథాన్యత ఎంతటిదో ప్రత్యేకంగా
చెప్పనక్కర్లేదిహ.

మరీ ఆకాశరామన్న  ఉత్తరాలకు అచ్చుపత్రికలలో అవకాశం దక్కకపోవచ్చుకానీ,
ఆకాశ పురాణాలు ఏవైనా విశదంగా వివరించి మరీ తిట్టిపోసే ఛాన్స్  పత్రికలలో
ఒక్క  ఉత్తరాల రచయితలకే సొంతంఎవరెన్ని  విమర్శలైనా చేసుకోనీయండి.. ఓషో
భక్తి ఉద్యమం నుంచి ఓజోన్ పొర చిరుగుడు వరకు పత్రికా లేఖకులకు పనికిరాని
అంశం అంటూ భూమండలం మీద ఏదీ ఉండదు.

ఉత్తరాల శీర్షికే కదా అని పుట తిప్పి పారేయద్దుఆస్వాదించగల మనసుండాలే
కానీ   లేఖా సాహిత్యంలో లేని రసం  ఉండదురాష్ట్ర సరిహద్దుల వద్ద అడ్డూ

ఆపూ లేకుండా సాగే అక్రమ  ఇసుక రవాణా వ్యాపారం వద్దని  గోదావరిఖని నుంచి
ముకుందరావనే మేధావి ఉత్తరం ద్వారా ఎంత ఆర్ద్రంగా ఆక్రోశిస్తున్నాడో!
'.. ఇసుక లారీల విచ్చలవిడితనాన్ని అరికట్టమని ఎన్ని ఏళ్ల బట్టో సంబంధిత
అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నాంచూద్దాం అన్న  పెద్దలే ఇప్పుడు

గుత్తేదారులతో కుమ్మక్కై జనం కళ్లల్లో దుమ్ము కొడుతున్నారుబంగారం లాంటి
చెరువు ఇసుకపరాయి రాష్ట్రాలకు తరలిపోతుంటే గుండె చెరువైపోతున్నది

కుతంత్రాలకు ఇక ముందైనా అడ్డుకట్ట వెయ్యకపోతే గోదావరిఖని వాసులకు  సెంటు
భూమి మిగలదునీరే తప్ప భూమిలేని జనానికి నిలువునా గోదావరిలో
మునకేయటమొక్కటే నిఖార్సుగా మిగిలిపోయిన పని ఇక..' ఒక్కయిదు వాక్యాల
ఉత్తరంలో ఎన్నేసి కవిసమయాలుప్రధానాంశం పక్కదారి పట్టినా ఉత్తరం తాలూకు
సాహితీ సౌరభాలను శిరసున ధరించక తప్పదు.. కదా!


పెట్టే శీర్షికలు కూడా  ఉత్తేకరంగా ఉండటం ఉత్తరాల పెట్టె మరో కొత్త
విశేషంఅంత పెద్ద పుటలో ఇంత బుల్లి బాక్సు చదువరుల దృష్టిని చటుక్కున
ఆకర్షించడమంటే వట్టి మాటలతో అయ్యే పని కాదుఅందుకోసమై శీర్షికల చేత
శీర్షాసనం వేయించయినా సరే ఏదో  కొత్త ఆకర్షణ రాబట్టడం అవసరంవందేమాతరం

జాతీయగీతం సార్వజనీనతను గూర్చిరచ్చ నడిచే రోజుల్లో అత్యధిక సర్క్యులేషన్
గల ప్రముఖ పత్రికలోని  ఉత్తరం వేసిన శీర్షాసనం  'వందేమాతరం ఆందోళనలకు
అంత మందా హాజరు?!  వంద  మాత్ర్రం?'  ఉత్తరం మకుటం పుట్టించిన మంటల

సంగతి ఇహ ప్రత్యేకంగా చెప్పాలా?

ఉత్తరాల రచయితలను  తక్కువ చేసే ఉద్దేశం బొత్తిగా లేదని మనవి.  అదుపు
లేకుండా పెరుగుతున్న అపరాల ధరల నుంచికుదుపులే తప్పించి నిలకడ మరచిన
స్టాక్ మార్కెట్ల షేర్ల వరకు  ఎక్కడా సామాన్య మానవుడికి ఊపిరి సలపనీయని

రోజులివిఉపశమనం కోసం హాస్య చిత్రాలు చూద్దామన్నా
ఏడుపులొచ్చేస్తున్నాయిమండే ఎండలుఇంగ్లీషు బళ్ళునిర్భయ కేసులురచ్చ
ఎన్నికలురౌడీ రాజకీయాలుకొత్తగా తత్తర పుట్టిచ్చేస్తున్న  మహమ్మారి 

కరోనా వైరస్ కోవిడ్-పంథొమ్మిదులు!  ఇన్ని దుఃఖాల మధ్యన ఎన్ని
పారాసిటమాల్ బిళ్లలు కడుపులో పడినా ఫలితమేముంటుందని?

కర్ఫ్యూలులాక్డౌన్లుస్కూళ్ల మూతలుకళ్లు మూతలేసుకొని ఎన్ని గంటలని
ఇట్లా కాళ్లాడిస్తూ కుళ్లు టీవీలోకి చూస్తూ జుత్తు పీక్కోడంముక్కూ
మూతీనోరు చెవులూ సర్వం ముసుక్కూర్చోక తప్పదని వైద్యనారాయణల అంత గట్టిగా
హెచ్చరించినాక .. చేసే ఘనకార్యం మాత్రం ఇంకేముంది గనక?

అందుకే.. దాచుకున్న పాత పత్రికలు కొన్ని అటక మీద అట్లాగే మిగులుంటే
భద్రంగా కిందకి దించిందిడేటొక్కటి మార్చుకుంటే చాలు సుమాదశాబ్దాల
కిందటి  పాత పత్రికల ఉత్తరాల  పురాణాలే చిన్ని చిన్ని మార్పులతో
ఇప్పటికీనూ!  దిక్కుమాలిన కరోనా వైరస్ బెంగ నుంచి దృష్టి మళ్లించుకొనే
ప్రయత్నంలో భాగంగా ఉల్లాసం కలిగించే  పత్రికల ఉత్తరాల సాహిత్యాన్ని

ఆశ్రయించడం ఉత్తమ మార్గం!

కుటుంబానికి పిల్లలు ఒక్కరు చాలా.. ఇద్దరు కావాలాఅన్న అంశం పైన

పార్లమెంటులో తీవ్రంగా చర్చ నలిగే రోజులవి. ‘పాలకపక్షం నుంచి గౌరవనీయులు
శ్రీ వాజ్పాయిజీప్రతిపక్షం నుంచి గౌరవనీయురాలు శ్రీమతి   సోనియా
గాంధీజీ ఏకాభిప్రాయానికి వస్తే కుటుంబ నియంత్ర్రణ ఏమంత సాధ్యం కాని
కార్యం కాదు గదా?' అని చీపురుపల్లి నుంచి పీపాల పాపారావానే సామాజిక
చించనాపరుడు చేసిన లోతైన సూచన  ప్రముఖ దినపత్రిక లేఖల కాలమ్ లో
కనిపించిందిఉల్లాసంగా ఉండదా మరి తరహా ఇంచక్కని హాస్యరసం చిప్పిల్లే
ఉత్తరాలే అలసిన మనసులకు ఉపశమనం కలిగించేది!
 ప్రజా సమస్యలకు ఫలితాలు రాబట్టడంతో నిమిత్తం పెట్టుకోకుండా  కష్టకాలంలో

కూడా కష్టపడి ఉన్న విలువైన సమయాన్నిధన్నాని వెచ్చించి మరీ
వార్తాపత్రికల ద్వారా జాతిని జాగృతం చేసే ప్రయాస నిరంతరాయంగా
చేస్తోన్నందుకు వార్తాపత్ర్రికల లేఖారచయిత గణాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు

తెలుపుకునే సంకల్పమే  సరదా వ్యాసం వెనుక ఉన్న ఉద్దేశంఉత్తపుణ్యానికి
ఉత్తర కుమారులు నొచ్చుకోవద్దని ప్రార్థనేం!
'
=కర్లపాలెం హనుమంతరావు 
బోథెల్; యా










మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...