Monday, December 27, 2021

కవిత: యూనివర్సల్ ట్రూత్

 


కవిత: 

యూనివర్సల్ ట్రూత్


శీరోదయంతో మొదలిడి 

కపాల మోక్షంతో ముగుస్తుంది జీవితం! 

ఇదొ క'యూనివర్సల్ ట్రూత్ 

అయినా  

ప్రతివాడూ  అనుకుంటాడు

తానొక ఎక్సెప్షన్


ఈ శరీరం అగ్నిహోత్రుడికి

ఆహుతవుతున్నపుడు 

ప్రాణం గాలిలో ఏకమైనపుడు 

అస్థికలు మట్టి పాలైనపుడు 

చితాభస్మం నీటిలో కలిసి 

ఆత్మ అంబరాన్ని 

చుంచించేందుకు వెళ్లినపుడు 


అందం, ఆస్తి ఆదుకోవు 

వంశం, గోత్రం అడ్డు రావు 

బంధం. అనుబంధం తో డురావు 

జాతస్య మరణం ధృవం.


అయితే 

కొందరు బ్రతుకుతూ చస్తారు. 

కొందరు చస్తూ బ్రతుకుతారు.  

కొందరేమో చచ్చినా చావరు..  

మరుభూమిలో ఓ మజిలీవేసి 

పంచభూతాలను పలుకరించి. .. 

మళ్లీ మనలో కొచ్చేస్తారు 

లబ్ధ ప్రతిష్టులవుతారు .


-కె. సీతారామగిరి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ 


కవిత : కానుక

కవిత : 


కానుక


( తోటి ఖైదీ, బెల్జియన్ మిత్రుడు ఆండ్రీ కోసం)

రెండవ ప్రపం యుద్ధంలో పాల్గొని మరణించిన రష్యన్ ఫ్రంట్ లైన్ కవులలో మస్సాజలీల్ ముఖ్యుడు. నాజీలు ఇతన్ని 1944లో ఉరితీశారు. నిర్బంధంలో ఉండగా జలీల్ మంచి కవిత్వం రాశాడు. అందులో ఒకటి: 


మాతృభూమిలో

జీవితం తియ్యగా ఉన్న రోజుల్లో

పువ్వుల మధ్య గడిపిన ఆ సమయాల్ని 

మళ్ళీ వెనక్కు తీసుకు రాలేను నేస్తం 

ఆ ఆనందమూ లేదు.


ఇక్కడ తోటలూ లేవు ఇళ్ళూ లేవు

స్వేచ్ఛ అసలే లేదు

ఇక్కడ 

పువ్వులు కూడా వేగంగా వాడిపోతుంది  

ఇక్కడ నేల కూడా నిర్బంధంలో మూలుగుతోంది


కానీ

నా చైతన్యం మాత్రం

సత్యంలా స్వచ్ఛంగా 

పరిశుభ్రంగానే ఉంది 

అందుకే

 నా హృదయంలో వికసిస్తున్న పాటల్ని

నీకు కానుకగా ఇవ్వనీ 

వాటికి మరణం లేదు

అవి చెరసాలలో 

ఈ ఆత్మ పూస్తున్న చెలిమి పువ్వుల్ని 

నా మాతృదేశానికి తప్పక అందిస్తాయి.


రష్యన్ కవిత : మస్సాజలీల్ 

అనువాదం : కొప్పర్తి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ

చిన్న కథ మనసులోని మాట రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి ( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


చిన్న కథ 

మనసులోని మాట 

రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07  - 1956 ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



ఆ నగరంలో మంచి పేరున్న వ్యాపారి నారాయణ్ సేఠ్ . అతని తాతల కాలం నుంచీ వస్తున్న వ్యాపారం. నమ్మకస్తుడు . అతను అమ్మే సరుకు ఎప్పుడూ వివాదం కాలేదు. 


సేఠ్ దగ్గర గుమాస్తా మోహన్ లాల్ . బీదవాడు. సేఠ్ కు అతని మీద నమ్మకం జాస్తి . మోహన్ రాసే లెక్కలు తనిఖీ చేయడం గానీ, తాను లేనప్పుడు అతను కొట్లో కూర్చున్నప్పుడు గానీ ఏ ఫిర్యాదుబా ఉండేవి కాదు. మోహన్ లాల్ నిజంగా డబ్బు అవసర పడ్డప్పుడు సేఠ్ కు చెప్పి ఒప్పించుకుని మాత్రమే తీసుకునేవాడు . 


ఎన్నేళ్లు గడిచినా గొర్రెకు బెత్తెడే తోక అన్నట్లు మోహన్ లాల్  కూడబెట్టుకున్నది ఏదీలేదు . పిల్లవాడి  చదువుకు ఖర్చులు పెరుగుతున్నాయి , ఆడపిల్ల పెళ్లీడు కొస్తున్నది .. ఆలోచించరా? ' అని భార్య సతపోరడం మొదలుపెట్టింది. 


సేఠ్ ఇచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఆయనకు మీ మీద నమ్మకం ఎక్కువా కదా! ఆలోచించండి .. అదనంగా ఎట్లా రాబట్టాలో ! ' అంది ఆ ఇల్లాలు . 


భార్య సలహా విని ఇంతెత్తున లేచాడు మోహన్ లాల్ ' నమ్మిన వాడిని మోసం చెయ్యడం మా ఇంటా వంటా లేదు . చాటుగా సేఠ్ సొమ్ము కొట్టేయడం .. అనే ఆలోచన రావడమే పాపం '  అంటూ . 


అన్నాడే కానీ, రోజా భార్య పెట్టే సోది కారణంగా క్రమంగా మోహన్ లాల్ మనసు కూడా మారడం మొదలు పెట్టింది. బిడ్డ చదువు, కూతురు పెళ్లి . . ఖర్చులు కొండల్లా ఎదురు నిలబడి ఉండేసరికి మోహన్ లాల్ మనసు పూర్తిగా మార్చేసుకున్నాడు. 


అదను కోసం ఎదురు చూసే మోహన్ లాల్ కు అవకాశం రానే వచ్చింది. తప్పుడు లెక్కలు రాసి కనీసం ఐదు  వేల రూపాయలైనా కొట్టేయాలని అనుకున్న రోజునే అదృష్టం కలిసొచ్చినట్లు సేఠ్ దుకాణం వదిలి బైటకు వెళ్లిపోయాడు.  


సేఠ్ వెళ్లంది ఎక్కడికో కాదు, రోజూ ఇంట్లో భార్య పోరు పెడుతుంది ' ఎంత నమ్మకం ఉన్నా యజమాని కింది ఉద్యోగి మీదపూర్తిగా భరోసా ఉంచడం ప్రమాదం. మోహన్‌ లాల్ పాతికేళ్ల బట్టి మన దగ్గర పని చేస్తున్నాడు. మీ పేరు చెప్పుకొని బైట ఎంతసొమ్ము వసూలు చేసుకుంటున్నాడో? ఒకసారి మన కాతాదారులు కొంత మందినైనా విచారించి రండి! చేతులు కాలాకఆకులు పట్టుకుని లాభం ఉండదు ' ఆవటా అని . అర్థాంగి మాటలలోనూ సబబు ఉందనిపించింది. ఈసారి సేఠ్ కి అందుకే బైట తనిఖీకి బైలుదేరాడు. 


ఇక్కడ గుండె నిబ్బరం చేసుకొని... ఐదు వేల రూపాయలూ ఇనప్పెట్టినుంచి తీశాడు మోహన్ లాల్ . చేతులు వణికినయ్! ఏదో భయం వేసింది! మనసులో ఆలోచనలు తిరగటం మొదలు పెట్టాయి .' సేఠ్ కి నేనంటే ఎంతో నమ్మకం! పాతికేళ్ళ బుట్టి , కొట్లో పని చేస్తూ, సేఠ్ డబ్బు తిని సేఠ్ కి ద్రోహం చెయ్యడం ద్రోహం. అంతకు మించి నీచం మరొహటి లేదు. సేఠ్ ఒక వేళ  లెక్కలు అడి గితే  తాను తప్పక దొరికిపోతాడు !పాతికేళ్ల నుంచీ యీ దొంగపని చేస్తున్నానని సేఠ్ కి అనుమానం కలుగుతుంది ! నన్ను పనిలో నుంచి తొలిగిస్తే మళ్లీ తిరిగి యిటువంటి పెద్దమనిషి దగ్గరే నాకు కొలువు అవుతుందన్న  భరోసా కూడా లేదు. ఇంత వయస్సు వచ్చిన తర్వాత కోరి పాపాన్ని తెచ్చు కున్న వాణ్ని అవుతాను. ఈ పని యీజన్మలో చెయ్యను. లక్ష్మీ దేవి తోడు| అనుకుంటూ తీసుకున్న  ఐదు వేలు తిరిగి  ఇనప్పెట్టెలో పెట్టేశాడు!


సేఠ్ కు సగం దూరం వచ్చిన తరు వాత ఆలోచన వచ్చింది . ' మోహన్ లాల్ ని నేను పాతికేళ్ల  నుంచి లెక్కల పనిలో ఉంచుకున్నాను. ఇంత వరకు తాను  లెక్కలు అడిగి ఎరుగడు. అయినా ఎక్కడి నుంచి ఏ ఫిర్యాదు కూడా వచ్చింది కాదు. తనే దొంగతనం చేసేవాడు అయితే చిన్న చిన్న ఖర్చులకు కూడా తనను అడిగే ఎందుకు తీసుకుంటాడు. ఇవాళ హఠాత్తుగా లెక్కలు అడిగితే లాల్ బాధపడకుండా ఉంటాడా ? ఆత్మాభిమానం దెబ్బతింటే  తన దగ్గర చేసే కొలువు మానేసే ప్రమాదం ఉంది.  తనకు మళ్లీ  అంత నమ్మ కస్తుడు దొరకడం అసంభవం.  ' అనుకుని వెనక్కి తిరిగి వచ్చేశాడు. భర్తకు అటువంటి తప్పుడు సలహా ఇచ్చినందుకు సేఠ్ భార్యలో తరువాత బాధ కలిగింది. 


" ఇన్నాళ్లు మన దగ్గర గొడ్డులా పని చేస్తున్నాడు.  అంత విశ్వాసంగా పనిచేసే ఉద్యోగుల మంచీ చెడు చూసుకోవడం మంచి యజమాని ధర్మం. అతనికీ పిల్లలు ఉన్నారు. ఎదుగుతున్నారు, చదువులకు, పెళ్లిళ్లకు చేతిలో సొమ్ము ఆడాలి. వెంటనే పిలిచి ఒక ఐదు వేలన్నా అతని చేతిలో పెట్టండి! ' అంది సేఠ్ భార్య . 




మోహన్ లాల్ డబ్బు ఇనప్పెట్టె లో పెట్టేశాడు! సేఠ్ బండీవి యింటికి తిప్పించేశాడు.……తిరిగి వాళ్ళు నుంచీ నేటివరకూ లాల్ కి అటు వంటి కోరికలు కలుగనూ లేదు ! నేఠ్ లెక్కలు చూడనూ లేదు !! *


నారాయణ్ సేఠ్ తనను దగ్గరికి పిలిచి ఇనప్పెట్టె నుంచి ఒక ఐదు వేలు కట్టతీసి చేతిలో పెడుతుంటే మోహన్ లాల్ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. 


రచన - పిళ్లా సుబ్బారావు శాస్త్రి 

( ఆంధ్రపత్రిక - వా - 02- 07 - 1956 )


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                  26-12-2021 

                   బోథెల్, యా. ఎస్.ఎ



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక చెరసాలలు కావాలి రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 


చెరసాలలు కావాలి 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 



ట్రిపుల్ ఐటీలు ఐఐటీలకు  బదులుగా జైలు లాంటిది ఒకటి మనం అడిగి తెచ్చుకుని ఉంటే బాగుండేది.


అంతమంది ఎంపీలున్నా ముష్టి రెండు పెద్దరైళ్లు తెచ్చుకోవడానికి అన్ని అవస్థలు పడుతున్నాం. ఇంకా జైళ్ల లాంటి పెద్ద పథకాలు మనకు వస్తాయనేనా? అయినా ఇప్పుడీ  ఊచల  ఊసు అంత హఠాత్తుగా నీకు ఎందుకొచ్చినట్లబ్బా? !


వాన కురుస్తున్నప్పుడే కుంట నింపుకోవాలన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేశంలో పాపాలు, నేరాల శాతం పెట్రోలు ఉత్పత్తుల రేట్ల మాదిరి ఎట్లా ఊపందుకున్నాయో చూశావుగా ! దేశంలో ఏ మూల నేరం జరిగినా మూలాలు మన  రాష్ట్రంలోనే కదా బయట పడుతున్నాయి! కార్పొరేట్ రకం కొత్త నేరాలకూ మన యువనేతలే పాఠాలు చెబుతున్నప్పుడు- శిక్షాలయాలూ మన సమీపంలోనే ఉండటం న్యాయమా కాదా? కృష్ణాజలాల్లో వాటాలకోసం వృథాగా  అలా ఆరాటపడే బదులు శ్రీకృష్ణ జన్మస్థలాల స్థాపన కోసం లాబీయింగ్ చేస్తేనే లాభం ఏమంటావ్ ? 


'నిజమేరా... బాబా శివైక్యమైన తరువాత పుట్టపర్తి చూడు ఎట్లా బోసిపోయిందో!  ఆ కేరళవాళ్లకంటే ఏదో గుడి నేలమాళిగల్లో బంగారు కణికలు దొరుకుతుంటాయి. మన దగ్గరున్న నల్లబంగారాన్ని ఎవడికో తవ్వుకో మని తేరగా ధారపోసేస్తిమి. నువ్వన్నది నిజమే. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ తీహార్ జైలునో ఇక్కడ దాకా  తరలించుకు రావడమొక్కటే మనముందున్న ఏకైక మార్గం. 


కానీ మన దగ్గరిప్పుడు జైళ్లు కట్టుకునే పాటి ప్లాట్లెక్క డున్నాయిరా బాబురా?  అవీ సెజ్జులూ పోర్టులూ అంటూ  అప్పనంగా ఎప్పుడో ఎవరెవరికో అబ్బాయిగారి కోసమూ ధారాదత్తం చేసి పారేస్తిమి  గదరా గాడిదా! 


ఏ స్థలాలూ లేకపోతే మెట్రోరైళ్లు లాంటివెలా పుట్టుకొ స్తున్నాయ్ బాబాయ్ ? అన్నేసి ఎకరాలు పోసి ఆ భారీ బస్టాండులు కట్టిస్తే వచ్చేదేముంది- కిలో మీటరుకు ముష్టి రూపాయి నలభై పైసలు. అదే ఏ తీహార్ మోడలు చెరసాలో అత్యంత అధునాతనంగా కట్టించి పారేశామనుకో... బోలెడంత వ్యాపారం. పార్కింగ్ ఫీజుల దగ్గ ర్నుంచీ ఫుడ్ కోర్టులు, హోటళ్లూ, మాళ్లూ జైలుకొస్తున్న నేరగాళ్లు అల్లాటప్పా గోంగూరగాళ్లా? వాళ్లకూ  ఎంత మందీమార్బలం, బంధుబలగం! తమ నేతల  నిత్య సందర్శన కోసం వచ్చిపోతూంటారు. నేరాలకీ ఘోరాలకి కరవులేనంత కాలం చెరసాలల చుట్టూ చెలరేగిపోయే వ్యాపారాలను వ్యవహారాలను ఎంతలావు ఆర్థిక మాంద్యమూ ఏమీ చేయలేదు. తెలుసా!


ఒప్పుకొన్నానురా అబ్బాయ్! బయటకు కనిపించే వ్యాపారాలే కాదు, లోపాయికారీగా జరిగే రూపాయల వ్యవహారాలూ లెక్కలోకి తీసుకుంటే- కటకటాలు కట్టించడంకన్నా గొప్ప లాభసాటి పథకం మరొకటి లేదు. రింగు రోడ్లూ ఫ్లైఓవర్లూ అంటూ ఎప్పుడూ ఏవేవో వివాదాస్పద మైన పనులే ప్రభుత్వాలు ఎందుకు చేపడుతున్నట్లు?  చక్కగా ఏ సినిమా హాళ్లనో  జైళ్లుగా మారిస్తే సరిపోతుంది. గాలి ఆడని ఆ గోడౌన్ థియేటర్లను కారాగారాలుగా మారిస్తే ఎంత లావు మొండి నేరగాడైనా ఒక్క పూటలో నేరాంగీ కారం చేసి తీరాల్సిందే!


ఇందిరమ్మ ఇళ్లంటూ ఇన్ని లక్షల కోట్లు పెట్టి అరకొ రగా జైళ్లలోని సెల్లలంటి ఇల్లు కట్టడమే  గానీ, ఆ సొమ్ములో సగం తిని సగం సద్వినియోగం చేసినా జిల్లాకో తీహార్ జైలును తలదన్నే 'అత్తారిళ్లు' తయారై ఉండేవి ఈపాటికి....


సరే. ప్రస్తుతం జరగాల్సింది చెప్పరా బాబూ! బడిబాట లాగా ' మళ్ళీ జైలుకు'  అనే ఉద్యమం ప్రస్తుతం నడుస్తున్నట్లుంది... కల్మాడీతో మొదలైన వరస రాజా, కనిమొళిలో  అగేలా  లేదు. మారన్లు వెయిటింగ్, మరెందరు

బారులు తీరబోతున్నారో తెలీదు. చూస్తు న్నాంగా, ఎప్పుడూ దేశం నిండా ఏవో ఆందోళనలూ! 'ఓటుకు నోటు కేసు'  ఓటి నడు స్తోంది. జోరుగా గనుల తవ్వకాల్లో ఎంతమంది చెరసాల బాట పడతారో ఇప్పుడే చెప్పడమూ కష్టమే . ఏ కేసు అప్పజెప్పినా సీబీఐవాళ్లు శని ఆదివారాలు కూడా చూసుకో కుండా నిజాలను నిగ్గుతేల్చే పనిలో పడి ఉన్నారు. పేపరు లీకులు, నకిలీ ఔషధ ప్రయోగాలు, దేవుడి ఆర్జిత సేవ ల్లోనూ కుంభకోణాలు తవ్వి తీస్తున్నారు . అబ్బో..  ఇట్లా చెప్పుకొంటూపోతే రొప్పు రావాల్సిందేగానీ...


నిధులూ పథకాలూ పంచాల్సిన ప్రతినిధులు ఉన్నంత కాలం ఈ నేరాల చిట్టాకు చివరంటూ ఉండదని ఒక్కము క్కలో చెప్పేసెయ్  బాబాయ్- ఇన్ని తంటాలెండుగ్గానీ! 


అది సరేరా!  ఎవరైనా మాకు ప్రాజెక్టులు కావాలి.... విమానాశ్రయాలు కావాలి, పోర్టుల సంఖ్య పెంచాలి.. కళాశాలలు కావాలి... అని అడు గుతారు. ఇలా 420 మోసకారులను పెట్టే జైళ్లు కావాలని మరీ అంత బహిరంగంగా అడుగుతారంటావా? నామర్దా కదా?


ఏంటి బాబాయ్ ! చెరసాలలని మరీ అంత తేలిగ్గా తీసిపారేశావు. అవి శ్రీకృష్ణుని  జన్మస్థలాలు . రాముడికి గుడి కట్టించిన రామదాసుకు కూడా నీడనిచ్చిన గోల్కొండ బందీఖానాలు . జర్మనీలో గాలిపటాలు ఎగరేస్తేనే లోపలే వేసేస్తారు తెలుసా! కట్టుకున్న భార్య జుట్టు పీకాడని ఒక పెద్దమనిషిని రాత్రంతా బంధించిన చీకటి కొట్టు బాబాయ్ చెరసాలంటే ! నెహ్రూజీ తీరిగ్గా పుస్తకం రాసుకున్న విశ్రాంతి మందిరం. బ్యాంకు దొంగను ఓ. హెన్రీగా మార్చిన పుస్తకాలయం. జైళ్లు- ఒంటి కొవ్వు తగ్గించే వ్యాయమశాలలు... గ్రంథసాంగులు గ్రంథాలు రాసుకునే విశ్రాంతి మందిరాలు, వోల్టేర్ లాగా వేదాంతిగా మార్చే యోగాశ్ర మాలు కూడా బాబాయ్!


అర్ధమైందిరా బాబూ! బయట కొవ్వొత్తులు చూపిస్తూ ఓదార్పు యాత్రలు చేసే యువరాజులకు, ఆ కొవ్వొత్తులు తయారుచేసే విధానం కూడా నేర్పే శిక్షణాలయాలు అని కూడా కదూ నువ్వు చెప్పాలనుకుంటున్నావ్? మన నేరగా ళ్లను మనం కట్టుకున్న జైళ్లలోనే పెట్టుకుంటే మన పరువు దేశవ్యాప్తం కాకుండా  ఉంటుందని నువ్వెందుకంటు న్నావో తెలిసింది. 


ఎవరి గురించి అంటున్నావో... అది మాతం చెప్పకు బాబాయ్! ఆ చిప్పకూడు పెట్టే ' రెస్టా ' రెండుకు నువ్వే పోతావ్!  


-రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26- 07 - 2011 ) 


Sunday, December 26, 2021

ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం అలుగుటయే ఎరుంగని ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 )


 



ఈనాడు - గల్లిక- వ్యంగ్యం - హాస్యం 


అలుగుటయే ఎరుంగని ... 

రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 


సర్కారు గజగజ వణుకుతోంది.

రాష్ట్రానికి రక్తపోటు పెరిగిపోతోంది. చలిగాలికన్నా మిన్నగా ప్రతిపక్షాల దీక్షలకు బలవన్మరణాల పాలవుతున్నారు. రైతు శ్రేయస్సు  గురించి నేతలమధ్య మాటల యుద్ధంముందు- కోడిపందాలు బలాదూర్. ఇప్పుడు ఎవరి దృష్టి రాహుల్ మీదనో , రాడియామీదనో  లేదు. వికీలీక్సు, నూటపాతికేళ్ళ కాంగ్రెసు ప్లీనరీ, టూజీ రాజా స్పెక్ట్రమ్ లీలలు, సచిన్ శతకాలు, చైనా జియాబావో- రష్యా మెద్వెదేవ్ పర్యటనలు, పెరిగిన పెట్రోలు రేట్లు, ఉల్లిగడ్డ ధరలు, కరిష్మా కపూర్ కొత్తస్నేహాలు- ఏవీ జనాలకు ఇప్పుడు పట్టడం లేదు. ఏ నోటవిన్నా... ఏ ఛానెల్లో కన్నా రైతుప్యాకేజీ గురించే చర్చంతా!


దేవుడు నిజంగా మూడొంతులు దయామయుడు. భూమండలంమీద నేల ఒక వంతు ఉంటేనే సాగుచేసే రైతు బతుకు ఇంత దుర్భ రంగా ఉంది. మిగిలిన నాలుగొంతులూ భూమి ఉండి ఉంటే?  బాబోయ్... తలచు కుంటేనే గుండెలు దడదడలాడిపోతున్నాయి! 


పాండవులు అయిదు ఊళ్లతోనే ఎందుకు సర్దుకుందామనుకున్నారో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది . విష్ణుమూర్తి పాలమీదా, విశ్వేశ్వ రుడు వెండికొండమీదా, విధాత తామరతూళ్ళలో ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చిందో బోధపడుతోంది. దేవుడంటే సాగు బాధ తప్పించుకున్నాడుగానీ- మనిషికి ఆరుగాలం స్వేదయాగం తప్పదు కదా! 


అన్నం పర బ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ బ్రహ్మరూపాన్ని సృష్టించే అన్నదాత, ప్రాణదాత మాదిరి పూజనీయుడే కదా! ఆ ప్రాణదాతే ప్రాణాలు తీసుకునేదాకా పరిస్థితులు దిగ జారటానికి ఎవరు కారణం? 


ప్రకృతి అంటే సరే. రాజకీయాలూ రైతన్నతో పేకాటాడు కుంటామంటే ఎలా? రైతుకన్నా  మద్యం కంపెనీలే సర్కా రుకు ఎక్కువా? దొరల సారా బట్టీలకు దొరికినంత సులువుగా ఎరువులకు పురుగు మందులకు అనుమతులు దొరకటంలేదు. పిట్ట రెట్టేస్తే టప్మని కూలే వంతెనలు కడుతున్న గుత్తేదారులకు దక్కుతున్న నిధుల్లో పదోవంతు దుక్కి దున్నే బక్క రైతుకు దక్కడం లేదు. వేలంపాటలో ఆటగాళ్లను పాడుకోవడానికి కుహనా కంపెనీలకు అత్యంత ఉదారంగా కోట్లు గుమ్మరించే బ్యాంకులు- బక్కరైతుకు ఒక్క పదివేలు అప్పుగా ఇవ్వమంటే సవాలక్ష ఆంక్షలు పెడతాయి! చెడిపో యిన స్టేడియాల మరమ్మతులకు ధారపోసే నిధుల్లో పైసా వంతు బీడుపడిన పంట పొలాలకు ఇవ్వమంటే- రాష్ట్రం కేంద్రంవైపు, కేంద్రం రాష్ట్రంవైపూ వేలు చూపిస్తుంటాయి. 


కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము/ బిల బిలా పక్షులు  తినిపోయె అలలు పెసలు/ బొడ్డుపల్లెను గొడ్డేరి మోసిపోతినెట్లు చెల్లింతు టంకము లేదు మార్గం'  అంటూ ఆనాడు శ్రీనాథుడు ఏ అమరపురికరిగాడో... అదే దారి పడుతున్నాడు అనాథ అవుతున్న ఇప్పటి అన్నదాత కూడా! 


అప్పిచ్చువాడు, ఎప్పుడూ ఎడతెగక పారు ఏరు లేని ఊరులో ఉండవద్దని బద్దెనామాత్యుడు ఎప్పుడో పద మూడో శతాబ్దంలోనే హితమ . ఆ లెక్కన మన రైతన్నలు అచ్చంగా ఏ అమెరికా పంచనో తలదాచుకో వాలి. కాకపోతే క్యూబా పోయి సాగు చేసుకోవాలి. కనీసం పొరుగు రాష్ట్రాలకైనా తరలిపోవాలి. లక్షలు కొట్టుకుపోతుంటే- వంద చేతిలో పెట్టి అదే పదివేలు పరిహారం అనుకోమనే పాలకుల పరిహాసాన్ని ఏ రైతన్నయినా ఎంతకాలమని సహించగలడు ?


గుర్తింపు కార్డులు, సమయానికి సరిపడా బ్యాంకు అప్పులు, కల్తీలేని విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, పనిచేసే మోటార్లు, చౌక విద్యుత్తు, వానలు లేకపోతే సమయానికి కరవు మండలాల ప్రకటనలు, వరదలు ముంచకముందే ముందు జాగ్రత్తలు, పంటలు మునిగితే వెంటనే సహేతుకమైన నష్టపరిహారాలు, సబబైన మద్దతు ధర, సరసమైన పంటల బీమా, మంచి ధరకు సరకు అమ్ముకునే ఏర్పాట్లు, గోదాములు, సర్వేలు, నివేదికలు, పర్యవేక్షణలు, సమగ్రమైన శాస్త్రీయ సాగు విధానాలు... అన్నీ పేరుకు పేపర్లలో పేర్చుకుంటూపోతే చేలో ధాన్యం చేతికొస్తుందా? ఎంత ఘనమైన అంకెనైనా సున్నాతో గుణిస్తే వచ్చే ఫలితం శూన్యమే. చిత్తశుద్ధిలేని పాలకుల పథకాలన్నీ కలిపినా సున్నాను మించి విలువ చేయటంలేదు. అదే- నేటి విషాదం.


రైతును ఊరికే రాజనో, దేశానికి వెన్నెముకనో ఊదరగొడితే చాలదు. వెన్నులో ఇంత సున్నమన్నా మిగిలి ఉంటేగదా తాను నిలబడి నలుగురికి ఇంత అన్నం నోటికి అందించేది. వంద తప్పులవరకు నిబ్బరంగా ఉండ టానికి భూపాలుడు ఏమన్నా గోపాలుడా! పోతనామాత్యుడే ఈ కాలంలో ఉండి ఉంటే, మనకు భాగవతం దక్కి ఉండేదే కాదు. ఎంత రామభద్రుడు వచ్చి పలికించుదామను కున్నా- పొలంపనే చూసుకోవాలా, కలుపు మొక్కలే ఏరుకోవాలా, ఎరువులకని, విత్తనాల దుకాణాల ముందు పడిగా పులు పడిఉండాలా, అప్పుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుండాలా! ఇన్ని తిప్పలుపడి గుప్పెడు గింజలు పండించినా ఏ వానకు తడిసో, వరదలో కొట్టు కుపోతేనో ముందు ఇల్లు గడవడమెలాగో తెలియక తల్ల డిల్లుతూ కూర్చుంటాడు. చదువుల తల్లి కన్నీరు. ఇంకేమి తుడుస్తాడు?


అందుకే చెప్పేది... అలుగుటయే ఎరుంగని... మహామహితాత్ముడు అలిగిననాడు ఏమవుతుందోనని పర మాత్ముడు చెప్పిన దానికన్నా సాగు చేసుకునేవాడు అలిగితే అంతకన్నా ఎక్కువే అనర్థాలు జరిగిపోతాయి! 'సర్వే జనా సుఖినోభవంతు' అనే ఆశీర్వాదం నిజమవాలంటే ముందు 'అన్నదాత సుఖీభవ' అనే దీవెన ఫలించాలి. 231124 


రచన - కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23 -12-2010 ) 

మన ప్రాచీన కవుల చమత్కారాలు

 


మన ప్రాచీన కవుల చమత్కారాలు 


( ఆంప- వా - 28 -08 - 1957 ) 


6 అంగములలోనే మే లుత్తమాంగమందు ను తమంబులు కన్నుల ఉర్విజనుల కట్టి కన్నులు 'లేపను టం తేకాక


ఉ తీసుఁడు కౌఁడె సద్గుణయు కిసతఁడు" కూతురుని ధృత రాష్ట్రున శివ్వడానికి నిశ్చ యించానని గాంధారపతి చెప్పగా బంధు పులు అన్న మాటలు.


‘సర్వస్య శాత్రస్య శిరఃప్రధానఆ సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్ '


అంటారు పెద్దలు. అవయవా అన్నింటా తల ఉత్తమం - సర్వేంద్రియాలలో నయనం ముఖ్యం. ఆలాటి కన్నులు లేవుగాని ధృత రాష్ట్రునికి లో టేమిటీ? ఎన్ని ఉంటే ఏంలాభం? కళ్లులేవు. బలే మంచి పెండ్లి కొడుకు అన్నారు. ఏపిల్ల అయినా, చివరికి నీ రేశిలింగం గారి చౌదస్తపు చలమమ్మకూడా ఒప్పుకోదు "పిండాడడానికి కొని గాంధారి అలా ఉంది. ఒప్పుకొంది. ణీ పెళా


గురువుగారుకోరినట్టు అర్జునుడు ద్రుపదుడై జయించి రథానికి కటి తెచ్చి గురుదక్షిణగా అప్పగించాడు. అప్పుడంటాడు ద్రోణుడు_


‘వీరెవ్వరయ్య ద్రుపదమ హారాజులె ఇట్లు కృపణులయి పట్టుబడక వీరికివలసె నె అహహ! మ హారాజ్యమడాంధి కొర సుదీ వాసెనోరో


అని 9


పిల్లవాడికి పాలకోసం ఆపుకోవాలనీ, సహాధ్యాయికజా ఆమాత్రం ఉపకారం చేయకపోతాడా అనీ ద్రోణుడు ద్రుపగుణ్ణి అర్థించాడు. అప్పుడు మహారాజైన గ్రుహ శారతమ్యం తెలుసుకోకుండా మాటాడుతున్నావు. పరమదరిద్రుడివి నువ్వు మహారాజు నేను. నాకూ నీకూ స్నేహ *మేమిటి పోశా అని తూలనాడాడు ఐ గర్వంతో, - దానికి ఈ నాడు ద్రోణుక - జనాబు చెబుతున్నాడు


ఓహో ద్రుపదమహారాజులా? వీరు? మహా రాజత్వం మాసిపోయినట్టుండే ఇంత దిని


పోయారేమిటి ఎరే, - అని హాసృసూరు అధిక్షేపించాడు.


ఏఘటంలో నేనాసరే సన్న పొర్యుని హాస్యం అంతర్నాళలకు సూది పోటు పొడిచినట్టుంటుంది. స్థూలదృష్టిలో సున్నితీ గానూ, సూక్ష్మవిచారణలో చురుకుగానూ


యామిజాల పద్మనాభస్వామి


తగిలే హాస్యం ప్రకటించడములో నన్నయ సిద్ధహస్తుడు.


విచిత్రవీర్యుడు రాజ కార్యాల ప్రసక్తి వర్ణించి సంతతి కొమోపభో గాలతో కాల క్షేపం చేయడంవల్ల షేయ రోగి అయి పోయాడు. దీనిని నన్నయ


రాజయతీ, బాధితుడయి దేవలోక సుదతీప్రియడయ్యె విచిత్రవీర్యుడున్'


అని అంటాడు. సచ్చిపోయాడని వాద్యంగా అనడు. ఐహిక శాసవాంఛతో తృప్తితీరక దేవలోకంలో ఉన్న నడతులకు ప్రియు ఉయాడంటాడు,


రాజై పట్టం గట్టళన్నాక ప్రజాక్షేమం కోసం రాజకార్యాలు పరిశీలించి పరిపాలస చేయడం నాని విధి. అది మానేసి కొను వాసుడై రోగి అయి చచ్చాడు. గారిని ఆవ ళ పూర్వకంగా సూచిస్తున్నాడు శబ్ద శాసనుడు.


ఆరి వీడి కామం తగలడా! నల విడి ఎ సాము చేశా డుం వీడు,- అనే బుద్ధి చెబుతూ అయింగా' ఇక అన భవించరా, అన్నకుండి


ఒకౌసురవన ఘట్టములో బ్రాహ్మణ వేషా లతో నివసిస్తున్నారు పాండవులు. వారున్న యింటి యజమానివంతు వచ్చింది బకాసురు ఆనాడు ఆహారం గా ఎవరో ఒకరు వెళ్ళలి తల్లి, తండ్రి, కూతురు, చిన్న కొడుకు ఇది వారికుటుంబం నేనంటే నేను అని పెద్దవాళ్ళు ముగ్గురూ ఎనించుకొంటు ఆ సందర్భంలో అవ్యక్త పరను డిన పిల్లవాడు తల్లిదండ్రులకూ, అక్క కూ కన్నీళ్ళు తుడుస్తు


దండుకుల చేత ఏన రెక్క సుఁ గిట్టి చంపి


బులుకి వత్తు మీరేశ్వ గా వలవదనుచు కలయి నూకా ర్చ తీశతొక్కు పలుకు


(వాడి ను టలుకున) వాళ్ళయేడుపు కొసరుణి దంపడానికి ఒక పోయింది చిన్న కర్రపట్టుకొని వారువెళ్ళి చంప వస్తా డట. ఏమి’లో అనుకొన్నాడు వాడు.


పాము పాము అని పెద్దవాళ్ళు గాభరా పడుతూ ఉంటే ఏదీ నేను పంపేత్తాను " అంటాడు ఆ యి దారేళ్ళ వయసువాడు, చేపాటి కర్రలో పరుగెత్తుతాడు. దూచేవారి కందరికీ వింత గానూ నవ్వుగానూ ఉంటుంది.


ఈలాటి భావాలు వెల్లడించే ఘట్టాలలో కూడా నన్నయ ఎదురు లేని వ్యాఖ్యాత గా కనబడతాడు.


జీవితములో సముద్రతరంగాలవలె రేగే బాధలు అనేకం ఉంటాయి. మనస్సుబరువెక్కి సర్వేంద్రియాలకూ సంకెల వేసినట్టు చలనం లేకుండా ఆయి బరువు తలకెత్తినట్టు ఉంటుంది. ఆ బరువును ఇట్లే దింపడానికి మందు హాస్యం. మనస్సుకి వికాసం కలిగించేది హాస్యం.


సంఘములో, నిత్య జీవితంలో తెలిసి, తెలియక వస్తున్న దురాచారాలనూ, దుష్ట బంధాలనూ రూపు మా పి విడగొట్టడానికి హాస్యం ఎంతో ఉపయోగపడుంది కాని దానిని విరివిగా ఉపయోగించి జీవితంలో చైతన్యాన్ని సమగ్రంగాకలిగించేవిధానంలో గ్రంథాలు తెలుగులో ఆటే వెలువడ లేదు. ఎక్కడో నాటా నూటా ఆయా సందర్భాలలో ఒకటి రెండు పద్యాలలో వెక్కిరిస్తున్నట్టు ము డి పెట్టి సవితప్ప హాస్యాన్ని అంగిరసముగా చేసికొని ఆవిర్భ వించిన కౌవ్యాలు లేవు.


నన్నెచోడుని కుమారసంభవములో దక్షాధ్వరధ్వంసం పట్టులో కొంత హాస్యం గోచరిస్తుంది రుద్రుని సైన్యాలు యజ్ఞవాటి కను ధ్వంసం చేసి దేవతౌబృందాన్ని చీకాకుపరచిన ఘట్టం చదువుకూ ఉంటే పకాలున నవ్వు వస్తుంది.


ప్రమథగణాలబారినుండి తప్పించుకో వాలని బ్రహ్మ తన వాహనమైన హంసను అధిరోహించబోయి భయంతో నేలమీద పడిపోయాడు. అప్పుడు హంస తామర తూడుని కఱిచి పట్టుకొన్నట్టు బ్రహ్మను పట్టుకొని పరుగెత్తిందట. వాహనంబు నెక్కి వచ్చి భయంబుళ


వడఁకి నేలఁబడ్డ వనజగర్భుఁ


గమిచికొని మరాళకము నా


కఱచికొని రయమునఁ బఱచి విష్ణువు గరుత్మంతుణ్ణి కౌగలించుకొని


దాని కాళ్లు' వేళ్లూ పట్టుకొని ఇంటికి పారి పోయా ఉంటాడు' “గరుడి నడుము మెడయు కాలును శైలును,


ఇఱికికొనుచు చక్రి వెఱచి పఱ చె కుబేరుడు సరవాహనుడు. ప్రమధగణాల


బాధ తప్పించుకొ నేందుకు ఆయన గారు పడ్డ పాటు 'తన యెక్కిన మానినిఁ దా


సనయము నెక్కంగ మఱచి యాతనిఁ


దన మ పున నిడికొని పటిచె భయం బున ధనపతి తన్నుఁ బిఱుద భూతము వాహనమైన వాడిమీద తాను కూర్చో


దానికి 


బదులు తనమీద వాణి ఎక్కించు కొని పారిపోయాడు. ప్రమధగణాలు 'ఓ అని అరుస్తున్నాయి వాడి తెలివి తేటలు చూసి. అప్పుడు యుక్తాయు కజానం ఎక్కడ వస్తుంది పాపం తన బ్రతుకేమవు తుందో అని కుబేరుడి భయం. వాడి చేష్ట మాత్రం మనకి నవ్వు పుట్టిస్తుంది. ఈలాగే ఒక్కొక్క దిక్పతి పొందిన అవస్థను కవి బీభత్సంగా వర్ణించినా అది తాత్కాలికవర్ణనలో హాస్యభంగిమ నే సూచిస్తుంది.


విరాటపర్వంలో కీచకునివల్ల


జరిగిన అవమానాన్ని సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది కొలువుకి వచ్చి విరటునితో మొర పెట్టుకొంటుంది. ఆసమయంలో శంకభట్టయి వున్న ధర్మరాజు 'సభలో ఇల్లాలు ఇంతసేపు మాటాడడం, ఎదిరించడం తగునా? చాలు వెళ్ళు' అంటాడు. 'సైరంధ్రి వినలేదు. కంక భట్టుకి కోపం వచ్చి, 'పలుపోకలఁ బోవుచు వి చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున


గులసతుల గఱువ చందము దొలగక నిటునికి దగ్గు తోయజవదనా.' అని ఆక్షేపించాడు. అప్పుడు సైరంధ్రి


అన్న మాటలు చురుక్కు లే తగిన హాస్యపు


.


పోటు.


‘నాదు భల్ల భుండు నటుడింత నిక్కంబు పెద్దవారియట్ల పిన్న వారు, కొన పతులవిధమ కాకయే శెలూషి గాననంగరాదు. అంతే కాదు. జూదఱి యాలికి గఱువతనం


బెక్కడిదయ్యా'—అంటుంది. ఒక్కపంక్తిలో తిక్కన తన అసాధారణ • మైన హాస్యరేఖాచిత్రం చూపి కవిబ్రహ్మ అయాడు.


రానురాను ప్రబంధయుగం అవతరించి హస్యానికి స్థానం లేకుండా చేసుకొంది. ప్రాచీన కావ్యాలలో ఈ మాత్రమేనా హాస్యానికి తావుందిగాని తరువాతి వానిలో ఆ ప్రసంగానికే నెలవు లేదు.


శ్రీనాథుని కావ్యాలలో ప్రత్యేకించి హాస్యానికి స్థానం కనబడదుగాని చాటువులలో కొంత సున్నితమైన హాస్యం కనబడుతుంది. ముందే చెప్పాను. ఆశేప ణలో, సంస్కారపక్షంలో చెప్పిన దానిలో హాస్యానికి తావు ఉంటుందని శ్రీనాథుడు పల్నాటిని ఉద్దేశించి చెప్పిన పద్యాలలో ఆ ధోరణి కొంత కనపడుతుంది.


'రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభయైన ఏకులు వడకునా


* మన ప్రాచీన


వసుధేశు డైన దున్నును కుసుమాస్త్రం డైనజొన్నకూడే కుడుచున్ దో సైడు గొంపలో పసుల త్రొక్కిడి మంచము దూడ రేణమున్ చేసిన వంటకంబు పని బాలుర కౌచము వి స్తరాకులు చూసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు వంటకుండలుకో


శాసెడు కట్టెలున్ తలప కాదు పురోహితు వింటి కృ


కృత్యముల్ పలనాడు అంటే ఆనాడు శ్రీనాథుడు తనకు కావలసే భోగాలన్నీ ఇట్టే లభించే సీమ అనుకొని వెళ్ళాడు. అవి యేవీ లేవు. చీకాకు వేసి "బీదరమీద ఆ ఉంటాడు పాపం! గరళము మ్రింగితి నంచున్ ఇలా ఏడ్చి


పురహర! గర్వింపఁబోకు పోపోవా! నీ


బిరుదింక గానవచ్చెడు మెరసెడి రేనాట జొన్న మెతుకులు


కొండవీడులో గాడిద నుద్దేశించి


అక్కడి చిల్లర కవులను నవ్వుల చేశాడు. గాడిద! నీవునుకో కవివి కావుగదా! ఇట కొండవీడు లోక పాలు


అని ఎంత గడు గాయితనం ఇది!


వెలులిం దిలపిషమున్ "మెసవితి


విశ్వస్త వడ్డింపగా' అన్నాడు


ద దేశిసంచారంలో ఒక యింట విందా


కన్నడ రగించిన సందర్భంలో- అసలే అది తెలకపిండి గుండ. దానిలో


వెలులి కలిసింది. రుచికె తే బాగానే ఉంటుందిగాని పరమశివభక్తుని


కది వెగటుగా తోచినట్టుంది. దానికి తోడు గాజులచేయి కాదు వడ్డించింది. విశ్వస్త. కవిసార్వభౌముని అవస్థ ఏమి చెప్పడం!.... తెనాలి రామకృష్ణుణి హాస్య కవి గా చెప్పుకుంటారేగాని అంతి రసవంతమైన హాస్యం ఆయన కృతులలో కన్పడదు. అమవసనికి అన్నమాట అలసని పెదనా' ఇత్యాది బాటుపద్యాలు ఎవడో కల్పించినవి గాని చరిత్రాధారాన్ని బలపరచేవి కావు. “కాదుపోదంటే పాండురంగ మాహాత ములో నిగమ శ రోశ్రీ ఖ్యా పౌరస్య సము లో బోఢ లో కొంత ఆక్షేపగర్భమైన హాస్యం స దేమో; శీలం పిల్లిశీలమనీ, చదువులు చిలకల చదువులనీ అన్నది అక్క నిగమశర్మని... అంతే.. దానికి తార్కాణగా వాడు ఆరాత్రి అందరూ నిద్రిస్తూఉంటే చేసిన అక్క


ముక్కుపుడకతో సహా నగలన్నీ ఒలిచి పట్టుకుపోయాడు. నాని ప్రవృత్తి మాత్రం హాస్యాన్ని సూచిస్తుంది. తుంటరితనానికే అది జయపతాక,


ఈ నిగమశర్మోపాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని కందుకూరి రుద్రయ్య నిరంకుశో పాఖ్యానం అనే నాలు గాళ్వాసాల కావ్యం వ్రాసి అక్కడక్కడ చక్కని హాస్యం సూచించాడు. నిగమశర్మ ప్రవృత్తికీ నిరం కుశుని ప్రవృత్తికీ సాజాత్యం సరిపోవడమే కాక కొన్ని గుణాలలో నిరంకుశుడు నిగమ శర్మకి ఒక మెట్టు పైన కూర్చున్నట లేడు.


వేశ్యనూత పెట్టిన చకొరగుళ్లు తృప్తిగా నిక్కి నిరంకుశుడు పోయాడు. అక్కడ ఒక లింగము కనబడ్డాది. నిరంకుశుడు ఆ లింగాన్ని చూచి నాతోడుతన్


సౌగటాలా డెదవే న వేందుకు సుమ


స్తోతవ్య జూటాంతి కా!”


అని


ధించి జూదరులలో తాను అగ్రణినని బిరుదు మాటలాడుతాడు. కొంగున మూటగట జొన్న సొగటాలు తీసి గెల్పినవాడికి ఓడిన వాడు లంజను తెచ్చి యివ్వాలని పందెం పెటి లింగం పంతుకూడా తెనే సొగటా లాడి దైవగతివల్ల తానే గెలిచాడు. గెలిచి నందుకు దేవ వేశ్య అయిన రంభను తెచ్చి యిమ్మన్నాడు. ఎంతకీ లింగం జవాబివ్పదు. దానిమీద నిరంకుశుడికి కోపంవచ్చి, తగునె పన్నిదమిక యీగతిఁ


దప్పు మౌనముఁ జాల్పఁగా దగు న నీకు ను నాకుఁ బెద్దల దండఁ బెటెదఁ జండి పై గగన కేశ! యటంచుఁ జందురు కాని పేలు


పొగడ దండయిన ర్చైనా విట


భూసురాగ్రణి దిట్టయె తన గుడ్డతీని ఈశ్వరలింగానికి చుట్టి పెద్దలదగ్గర తగపు పెడతాను రమ్మని లాగు తాడు. చక్కని తగవు. విటుని గుర్మా వాన్ని వెల్లడించే హాస్యగర్భితి మైన ఆక్షేపణ ఇది.


పొరంగు తమ్మయ్య వైజయంతీ విలాస దేవ జీవి విప్రనారాయణుని వేశ పరచుకొన్న సందర్భంలో అతి సుకుమార మైన హాస్యం సవరించాడు. దేవదేవి నిట్టూ రులలో, హొలుచూపులలో, లలో, పైట ఊపులలో తిమ్మయ్య శృంగా రానికి చేయూత గా ఇచ్చిన హాస్యం సువర్ణ లేపనంగే భానిస్తూంది.


దేవ దేవీ మధురవాణులు విప్రనారాయ


ణుని దర్శించి సమస్కరించగా, 'చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులపతి డా డారామగ్రుమ


బృందము పుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక “ఇటువంటయ్యలు కొరా చిటుకుమనక యుండ సందెచీకటి వేళ్ళ శా


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంబు


నక్క వినయ మిట్టి నయములెల్ల


అని హేళన చేసింది


- సస మాటే


అయింది. వేశ్యా స హ వాసాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొమ్మా! ఆవల మమ్ములోకు లేమంటారో అని జీవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


“శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సీయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనిభ మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృతమై, యమై పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటి రాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నా బోడి దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వే వాడు నో చ్ఛిష్ట యేస విటజనో. కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హాస్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమన్న - కులను తౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపిస్తూ తిట్టులో నవ్వు పుట్టించినదిట వేసునయోగి


పుణ్య క్షేత్రాలకు గిం చుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు..


పోయి


ణుని దర్శించి సమస్కరించగా, చందురుఁ గను నరవిందము


చందంబున మోమువంచి సంయమికులసం


క్రందనుఁ డారామగ్రుమ బృందము పడుచక్కిని కిమ్మనకుండా పోయారు. ఆదశీ చూసి


ఇతడు చాలా గొప్పవాడే అన్నాది మధుర వాణి. దేవదవి అందుకు ఒప్పుకోక ఇటువంటయ్యలు కొరా చిటుకుమక యుండ సందెచీకటి వేళ్ళ


ఘట చేటీవిటు లై క్కటకంబున తిరుగువారు కంజదళాక్షీ ! 'కడసిచూడ ఘోటక బ్రహ్మచర్యంబు పింగళోజపంబు పిల్లి శీల


మజగరోపవాస మల ఒక ధ్యానంభ నక్క వినయ మిట్టి నయము లెల్ల. అని హేళన చేసింది 'సస


అయింది. వేశ్యా సహవా సాలు శ్రీ వైష్ణవులకు తగునా! కొన్మూ! ఆప ల మమ్ములోకు లేమంటారో అని దేవదేవీ సేవకు అనుమా నించిన మహానీయుడు కాలుజార్చాడు.


శిరసుపై పేసు పొడగన్న చేరబోయి హింస సేయకుమని చేతికిచ్చే పరిస్థితిలోకి డేకింది వజ్రపంజరనీభి మైన వాని సర్భావం లోహ మై గ్రాప మై, దృఢదారువై, తరుణవృక్ష మై, ఫలప్రాయమై, పూవై దానిలో మకరందమై పోనుపోను నీళ కంటెనూ పల్చనై కరగిపోయింది.ఒక్కడికే కాలుచాచి పరుండడానికి చాలని కుటీరం వర్షంపడిన నాటిరాత్రి దేవదేవికీ విప్ర నారాయణునికీ కూడా శరణ్యమైంది. అవు తుంది మరి


అయ్యెడ మిక్కిలి శైత్యం బియ్యడ తెమ్ము నీవు నింతీ! అని ప్రియురాలిని నోరారా, మనసారా పిల్చి దాపునకు చేర్చుకొన్నాడా దాసరయ్య-రంగరంగా అని రంగనాథ స్మరణమే జీవిత పరమార్థంగా ఇనపకచ్చడం కట్టుకొన్న వె వాడు విటజనో చ్ఛిష్టమైన ఆ కుటిల వేశ్యను అంటుకొని బ్రాహ్మణ్య మంటు చేశాడంటాడు తిమ్మయ్య


రానురాను హా ప్యాన్ని తీవ్రంగానూ, మృదువు గానూ చెప్పి చెప్పకుండా రచనలో నీరుపోసి పెంచినవాడు వేమున్న కులమతౌచాశాలను విమర్శిస్తూ దంభ వేషాలను ఆ క్షేపి సూతిటులో నవ్వు


పుట్టించినదిట వేమనయోగి ----


పుణ్య క్షేత్రాలకు గించుకున్న వారికి మంత్రిజలసుకున్న మంగలి జల మెచ్చు' - అని బోధ చేసున్నాడు...


పోయి


గొడుటావు బిసుక కుండ గొంపోయిన


పాల నీదు పండ్లు రాలదన్ను' అని చివరి


చరణంలో ‘లోఖవాని నడుగ లాభంబు లేదయా?


అంటాడు......


మోక్షానికిపోతే మొస లెత్తుక పోయిం


ఉంటారు. గుహలలోకి పోయి జపం చేయ


బోతే పులి ప్రత్యక్షమై మోష్ o


యాసంగా ఇస్తుందన్నాడు వేమన్న -


'మోక్ష మేకదా కౌవలసింది జీవికి తఱచి చదవవలసే రచన వేమన శతకం.. హాస్యంకోసం ప్రాచీన కవుల గ్రంథాలు సాలీపులాక న్యాయంగా ఇంతవరకూ


స్పృశించాము.


ఇటీవలి వారిలో వారి జీవితాలకు సంబం ధించే ముచ్చటలు కొంచెం అనుకొందాము. వీరేశలింగం గారి ప్రహసనాలూ, పాను గంటివారి సాక్షి కొంచెం కరకుగానూ, అక్కడక్కడ చాదస్తంగానూ ఉన్నా హాస్యప్రధానములైన రచనలుగా దానికి ఎన్నుకోవచ్చు:


గ్రంథాలు వ్రాయకపోయినా నడిమింటి సర్వమంగ ళేశ్వర శాస్త్రులు గారు సరసంగా మాట్లా డే కవి అని ప్రసిద్ధి. చెల్లెలూ, తానూ భోగీపండుగకు ఆత వారింటికి వెళ్లారట. తెల్లవారిన తరువాత చెల్లెలు వరహాకుంచెతో నగలు తోముకుం టూంది. శాస్త్రి గారి వదిన గారు ఆ మెను చూచి 'వ ది నే! పందివా? ఏదుపందివాళి అడివిపందివా' అని అడిగిందట. శాస్త్రిగా గారి చెల్లెలు కొంచెం బొద్దుగా ఉంటుంది. అందుకు ఆవిడ హాస్యమాడింది. అక్కడికి కులందోము పుడక కోసం వచ్చిన శాస్త్రులు ఏదుపందివో అడివిపందివో తెలియదుగాని మొత్తంమీద పందివే అన్నా రట. చటుక్కున వదినె గారు లోపలికి పోయారట. వరహాకుంటే ఏపందిరోమంతో కట్టారనే ప్రశ్న చమత్కరించబోయి నది చె గారు పొందిన జవాబిది.


శాస్త్రులుగారు వామనావతారం. వడ్డన బంతి జరిగింది. ఆకుకొసను కందకూర వడిం చారు--వదిన గారు - తె లి సీ. కందకూరంటే శాస్త్రులుగారికి మహాప్రీతి. చూస్తూ కూర్చు న్నారు. అప్పుడు వదిన గారు 'ఏమిటి మరిది గారు అలా కూర్చున్నారు? ఆ కందకా అని అడిగారట. 'ఔను వదినే! ఆ కందకే” అన్నారట. సరేలెండని మళ్ళీ ఇంత కూర తెచ్చి అందేట్టు చేశారట ఆమె. శాస్త్రులుగారు జగన్నాధస్వామి దర్శనానికి పూరీ క్షేత్రానికి వెళ్ళారు. స్వయంపాకం చేసుకొని మత్తాకుల వి సరిలో భోజనం చేస్తు రు. ఆ సమయంలో పెద్దపండా వచ్చి


'ఏమిటి శాస్త్రులుగారూ! అన్నీ తెలిసిన పెద్దలు తమరు. ఏంత అఘాయిత్యప్పని చేస్తున్నారు? మా అవతారం పండుకొనే మఱ్ఱాకును ఉచ్ఛిష్టం చేశేసేరా?' అని ఆక్షే పించాడు. చటుక్కున శాస్త్రులుగారు 'భయపడకండి. మీకంటే నేనుచేసే దానిలో విచారించవలసేది లేదు. నేను మీ అవతారం పాన్పును ఉచ్ఛిష్టంచేశానేకాని మీరు అవ తారాలకు అవతారాలనేమింగేసు రుగా' అన్నారు నదురు బెదురూ లేకుండా. ఆ దెబ్బతో పెద్దపండా తలదిమ్మంది. మరి కంటిచూపులేదు. ఏవ్యం అయిపోయాడు.


ఈ శాస్త్రులుగారు వ్రాసిన జే సమాస కుసుమావళి. సంస స్కృ ఏమాత్రం చదివిస తెలుగు వారికీ అది పరిచి దానిలో విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ శాస్త్రులుగారు సహజహాస్యప్రియత్వమును


చమత్కారంగా వెలిబుచ్చారు. ‘భూనాయకం నా ధవనాయకం బా


భజ భువం వా ధనమేతి లోళ తద్విఘ్న నాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యమ్' లోకంలో భూనాయకుణ్ణిగాని, ధన నాయకుణ్ణిగాని భజిస్తే భూమిని గాని, ధన ముసుగాని పొందుతాడు. అందువల్ల విఘ్న నాధుణ్ణి "నేను భజించను. వేయి విధాలా వానికి మొక్కులు మాత్రం చెల్లించు కొంటాను అంటారు శాస్త్రులుగారు. విఘ్ను నాయకుణ్ణి సేవిస్తే విఘ్నాలు వస్తాయని చమత్కృతి.


అడిదం సూరకవికూడా ఈ ధోరణి కణ వాడే అని అంటారు.


ఒకనాడు నూరకవి గారి భార్య భర్తన చూసి 'ఏమండీ! అవునండీ మన అబ్బాయి


మీద ఓపద్యం చెప్పరండీ అని అడిగింది. వెంటనే చెప్పాడు సూరకవి.


‘బాబా బూచులలో పల


బాచన్నే పెద్దబూచి భావింపంగన్ బూచం బూచంటే రా| రా వెఱతురు


బాచన్నను చూచి పట్టపగలే నెఱతుర్ అని చదివాడు.


(బాచన్న ఆ నేది ముద్దు పేరు. ఈ బాచ స్నే శుద్ధాంధ్ర రామాయ ణ • వ్రాసిన బాల భాస్కరుడు.)


కొడుకు అంత చక్క من నీవాడట. రఘువంశాది కావ్యాలకు వ్యాఖ్యా సంవ్రాసి ఆసేతుశీతాచలం పేరు పొందిన ప్రతిభాశాలిమల్లి నాథసూరిని ఒక నాడు భార్య


రచయితలు: *


'అవునండీ! నామీద ఒక శ్లోకం చెప్పరూ.' అని అడగగా వెంట నే 'ఇదుగో చెబు తున్నాను విను.” అని


'తింత్రిణీదళ విశాలలోచనా నింబపల్లవ సమానకుంతలా మేరుమందర సమానమధ్య రూ మల్లి వాథగృహిణీ విరాజతే '


అని చదివాడట.


చింతాకులవలె వెడల్పయిన కళ్ళు వేప చిగుళ్లకు పొటి వచ్చేకుదులు, మేరు ముందర పర్వతాలను పోలిన నడుము కలదై మల్లి నాధుని యిల్లాలు విరాజిల్లుతూంది. యిల్లాలు ఇది విని ఎల్లా సహించిందో గాని యీరోజులో 'జుల్లో అయితే ?. (1)


ప్రస్తావికంగా చెప్పినదే అయినా తిరుపతి వెంకటక వులలో ఒక రైన తిరుపతిశాస్త్రి గారు చెప్పిన యీ పద్యం ఎంతో గంభీరమైప


అర్థాన్ని చెబుతూ పక్కున నవ్విస్తుంది.


"మును సౌగంధిక పుష్పమున్ గొనగ భీముండే డైరం బోపు త్రో పను సాక్షాత్కృతిచేసి ఖడ్గమృగమున్ వారింపగా సంజనా


తనయుం డెక్టుడు పేర్మి నిచ్చిన పదార్థంచే న యీపయీస్


జసువా డార్జనసేయు వెంకటకవి ! సారస్య మట్లుండుటన్


ఈ పయిని లోకంలో సారస్యమునుబట్టి ఆర్జనకుపోతే వచ్చేది వెండ్రుకలే అనే భావాన్ని శాస్త్రులుగారు ఇంత గంభీర ధ్వనితో చెప్పారు.


చాలా శ్రమపడి హాస్యరసం పోషించి వ్రాయాలనే సదుద్దేశం గల ప్రతిభావంతు ఆలాటి గ్రంథాలు చాలా యేమిటి వేళ్ళమీద చెప్పాలన్నా అటే లేవు.


కూచిమంచి జగ్గకవి చంద్రరేఖావిలాపం తిట్టుక విత్వం గా ఉంది. పొందిన అందులో పేరు బాగా నే హాస్యం లేకపోలేదు. కాని దానిని ప్రమాణగ్రంథం గా పండితులు అంగీకరించినట్టు కప్పట్టగు ఏమైనా హాస్యం ప్రధాన రసంగా ఉద్భవిల్లవలసే కథావస్తు వును తీసుకొని కావ్యాలు ప్రత్యేకం అది మాటలతో కాదు.


వ్రాయవలసే అవసరం ఎంతైనా ఉంది. అయేపనిమాత్రం కాదు. 

--- 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక రచన - కర్లపాలెం హనుమంతరావు సిగ్మా.. సిక్స్ ! ( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 )

 




సిగ్మా..  సిక్స్ ! 

( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 ) 



సిక్స్ పేరు విన్నావా? 


ఏంటో తెలీదుగురూ!? 


అనుకున్నాలే.. సిగ్మా అనగానే కనీసం నీకు సిగ్మండ్ ఫ్రాయిడయినా గుర్తుకొచ్చివుంటే బాగుండేది. 


విషయం చెప్పు ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటున్నది సిగ్మా గురించా ..  సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించా?


రెండూ కాదు... చిన్నప్పటి మావూళ్ళో తిప్పడి గురించి...


తిప్పడి గురించి చెప్పుకోటానికేముంటుందబ్బా!  సరే చెప్పు ! లింకులేకుండా నువ్వే డొంకా  కదిలించవులే..! 


ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీనేషనల్ కంపెనీలన్నీ 'ఎర్రర్ ఫ్రీ ' ఆపరేషన్ల కోసం కొన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాయి. అయినా నూటికో  కోటికో ఓటన్నా  తప్పు జరగనే జరుగుతుందికదా?


కోటికో తప్పంటే అంత చెప్పుకోనక్కర్లేడనుకో 


కోటికో తప్పైనా తప్పు తప్పే ..! ఒకపాయింట్ మిలియన్ ఫ్రాక్షన్ మిస్టేకొచ్చినందుకేగదా మొన్నామధ్య సూపర్సానిక్ స్క్రామ్ జెట్టాపరేషన్ అలా ఫెయిలయిందీ!  కొన్ని మిలియన్ డాలర్ల మనీ వూరికే అలా గాల్లో ఆవిరయిపోయింది..! పవర్ గిర్ట్స్ 

తరచూ ఫెయిలై రాష్ట్రాలకు రాష్ట్రాలు రోజుల తరబడి చీకట్లో కూరుకుపోయినా, మనవాళ్ళకు చీమకుట్టినట్లయినా వుండదు. కానీ  పర్ఫెక్షన్ కోసం పడి చచ్చేవాళ్ళకి పాయింట్ జీరో జీరో జీరో జీరో జీరో డిఫరెన్సొచ్చినా  సహించ లేరు తెలుసా! ఫరెగ్జాంపుల్... మన ముఖ్యమంత్రిగారి ఫ్యూచర్ జె.డి.పి ఫిగర్ చూడు! 


విదేశాన్నుండి వచ్చిన  మినిస్టరొకాయన మా దేశంలో ఇలాంటి ఫిగర్లు చూపిస్తే పిచ్చాసుపత్రిలోనో..  జైల్లోనే జాయిన్ చేస్తారన్నట్లు   గుర్తు! 


విదేశస్తులకిలాంటి విజన్లు అర్ధంకావు.  కానీ నిజానికా విజన్ ప్లాను ప్రకారం చేస్తే సూపర్ విజన్ అవుతుందని మన  ముఖ్యమంత్రిగారి ప్రగాఢ నమ్మకం . దానికే ఆయన పాపం, రాత్రి నిద్రలు కూడా జాతికి త్యాగం చేసి ఇరవైనాలుగ్గంటలూ  జనంకోసమే పనిచేస్తున్నది అయినా  లెక్కల్లో ఎక్కడో మాటిమా

టికీ తేడాలొచ్చి చివరాఖర్లో  అంతా  అభాసుపాలవడం, అమాత్యుల అద్భుత భావం అల్లరిపాలవడం ..! 


మొన్న జరిగిన చదువులపండుగ చివర్లో అధికారులు తయారుచేసిన లెక్కలే అందుకు రుజువు కదా! 


నిజమే. జనాభాలెక్కలనుండి గణాంక వివరాల దాకా, ప్లానింగ్ కమిషన్ ఫిగర్లమొదలు బడ్జెటరీ ఎలాట్ మెంట్ల వరకూ... ఎప్పుడూ ఏవో తికమకలు.. తిర కాసులూ... సర్కసులూ చేస్తుంటారీ సర్కారీ దాసులు ! 


ఈ కంప్యూటర్లొచ్చింది మొదలు మేటర్లో  మరీ కనప్యూజన్‌ పాలువ మరీ  ఎక్కువపోయింది . ఎమ్సెట్  పేపర్చూ..  ఎలక్ట్రిసిటీ  మంత్లీ బిల్సూ , విద్యార్థుల మార్కుల షీట్లూ, స్టాక్ మార్కెట్ల గత్తర కోట్లు, గెజిట్లు చూపే డేటా షీట్లు గట్రా గట్రా లన్నింటిలో  ఎప్పుడూ ఏవో పొరపాట్లు! 


ఇదేమని అడిగితే ఏదో పైపై సంజాయిషీలిచ్చే అలవాట్లూ ..  


 సో..  పట్టించుకొనే నాధుడెవడూ లేడు కాబట్టి . . సూపర్ స్టార్స్  సినిమా రిలీజ్ డేట్స్ , క్రికెట్ ప్లేయర్స్  ట్రాక్ రికార్డ్సూ , ప్రజా ప్రతినిధుల ప్రెస్సు మీట్లు  లాంటి వాటిల్లో ఆ తేడాలొస్తే మాత్రం చాలా గొడవలు అయిపోతాయ్! 


గెజిట్లో డేటాఫ్ బర్తంటే గుర్తుకొచ్చింది. మొన్నామధ్య ఒక పెద్దాయన  పుట్టిన కంగారులో మైమరుపొచ్చేసి మూడేళ్లు ముందు పుట్టినట్లు అరవై ఏళ్లకు గుర్తొచ్చిందట!  చటుక్కున చాటుగా సరిచేయించేసుకున్నా అతగాడి సిన్సియారిటీకి బొత్తిగా  పిటీ లేకపాయ!   చేసిన తప్పు చెబితే చెల్లన్నా వినకుండా పై అధికారులు పాపం ' వల్లకాదు, బ్రెటకు వెళ్లాలన్నా ' రు !   పాపం, కొంతమందికి  కన్నీళ్ళు కూడా ఆగలేదంటున్నారు. 


పిటీ. . పిటీ అంటూ ననువు మాటిమాటికీ నా మాటల ట్రాకును  మళ్లించేస్తున్నావ్! 


సారీ గురూ! సావాసదోషం.. సరే .. నీ తిప్పడి కథనే కంటిన్యూ చేసెయ్ ! 


అక్కడికే వస్తున్నా! సూటిగా చెబితే నీ బోటాడికి మేటర్ బొత్తిగా బుర్రకెక్కదు. కాబట్టి ఈ తప్పొప్పుల పట్క్ టి చదవక తప్పింది కాదు.  


ఓకే! కానియ్! 


పేపర్లో చూశా... మన ముంబయ్ లో  డబ్బావాలాల  ఎర్ర ఏగానీ ఖర్చు లేకుండా  ' సిగ్మా సిక్స్' స్టాండర్డ్ సాధించారు. 


సిగ్మా సిక్స్ అంటే? 


 పది లక్షల పనులుచేస్తే  అందులో కేవలం మూడు తప్పులు మాత్రమే ఉండటం! ... వీళ్ళు చేసే కోటిన్నర పనుల్లో ఒక్క తప్పు మాత్రమే.. అదీ ఏ ఏడాదికో ఒకసారి  పొరపాటున దొర్లుతుందని  ఇంటర్నేషనల్ మేగ్జైనోటి  సర్వేచేసి మరీ సర్టిఫికేటిచ్చేసింది . చదువూ సంధ్యా లేనోళ్ళు.  ఒక గుంపుగా తయారై..  కంప్యూటర్లకు మించి  కరెక్టుగా  లక్షలాది భోజనాల కారియర్లను వందల కొద్దీ  కిలోమీటర్ల వరకు .. సిటీ  శివార్లు టు  సెంట్రల్ పాయింట్ వరకు  . . రిటన్లో సాయంత్రానికి ఎవరి ఇళ్లకు వారి బాక్సులు  పర్ ఫెక్టుగా చేరేస్తుంటారు!


చదువూ సంధ్యా లేని మనుషులూ....


లెక్కా డొక్కా రాని  వాళ్ళు కూడా లెక్కా పత్రం కరెక్టుగా ఎట్లా చేస్తారన్నదే కదా.. నీ ముక్కులూ .. మూలుగుళ్లు ! 


ఒకే. . ఒకే! పోనీ మనమూ ఆ పొరుగు స్టేటు నుండి కొద్ది మంది బుద్ధిమంతులను అరువుతెచ్చుకుంటే నో! 


మన రాష్ట్రంలో కూడా అంతకుమించిన టేలెంటున్నవాళ్ళు పూరికి పదిమందికి తక్కువుండరు. . తెలుసా? ఉదాహరణకి మావూరి తిప్పడినే తీసుకొందాం . పూరు మొత్తానికి వాళ్ళ

దుస్తులు ఉతికే ఫేమిలీ.  వాళ్లాకీ ఒకటంటే ఒకటే డాంకీ .   రెండొందల గడప. గడపొకటికి కనీసం అయిదు బట్టలేసినా  అటూ ఇటూగా  వెయ్యవుతాయి.  ఈ నెయ్యిలో  మళ్ళీ కొన్నొందల వెరైటీలు, చీరెలు, జాకెట్లు, ధోవతులు, పంచెలూ పై పంచెలూ

చొక్కాలూ, పొంట్లూ . . తోళ్లూ తొక్కలూ .. చిరిగినవీ,రంగులు వెలిసి పోయేవీ, చలువ చేసేవీ, చెయ్యనివి, చెయ్యకూడనివీ .. అన్నీ ఒకే మూటలా  కట్టుకుని రేవు ఉతుకులు అయి ఆరిందాకా ఆగి .. తిరిగి చీకట్లోగా వాకిట్లోకి చేర్చే డ్యూటీ! ఎవరి బట్టలు వాళ్ల  ఇళ్లకు వేళ లోపల తడబడకుండా, తప్పులు  ల్లేకుండా , ఏళ్ళ తరబడి చేరవేస్తున్నాడంటే. ' నిజానికి మా తిప్పడి వాషింగ్ ఫేమిలీ ఆపరేషన్ ముందు ఈ సిగ్మా " నగ్మా .. 

సిగ్గా...  ఐనా సరే  సిగ్గుతో  తలొంచుకొవాల్సిందే! 


చదువు సంధ్యలేకుండా, లెక్కా, డొక్కా, రాకుండా...ఇంత చక్కగా ఎలా పనిచేస్తున్నాడో...? పోనీ రాడి ఆపరేషన్ సక్సెస్  సీక్రెటేమిటొ  ఆరాతీసి మన సియంగారి చెవిలో ఊదాల్సింది! సర్కారీ ఉద్యోగుల  కాకి లెక్కలతో పబ్లిగ్గా పరువన్నా పోయే ప్రమాదం తప్పుతుంది ! 


ఆ అయిడితోనే మొన్న మా మారెళ్లినప్పుడు వాడిని కలిసా! 

' నీ ట్రేడ్ సీక్రైటేంటో చెప్పరా ! ' అని గట్టిగా వత్తిడి చేస్తే ఏమన్నాడో తెలుసా? 


ఏమన్నాడ్రా? 


ఇందులో నాగొప్పేంలేదయ్యా! గొప్పంతా మా గాడిదదే! గుడ్డల మూట వాసన బట్టి గడపగడపకి తిరుగుతుందది, దానితోకపట్టుబతిరగటమే మేము చేసేపని' అనేశాడు.


'ఈ లెక్కన గాడిదే చాలా గ్రేట్! 


అవును ' అందుకే స్పెషల్ రిక్రూట్ మెంటు  పెట్టి కనీసం వాటిలోని కొన్నింటినయినా మన గవర్నమెంటు పన్లోకి తీసుకుంటే మన సియం తన సెంచరీ విజన్ లో కనీసం సెంటిమీటర్ సక్సెస్ కన్నా నాందీ పలకవచ్చు! 


- కర్లపాలెం హనుమంతరావు'


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 05 - 09.2002 )

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక దొంగ నాటకం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- ప్రచురితం - 07-02 2014


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక


దొంగ నాటకం 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- ప్రచురితం - 07-02 2014 


దొరలే దొంగలు, దొంగలే దొరబాబులు. కాలజ్ఞాని బ్రహ్మంగారైనా ఊహించి ఉండరేమో ఈ విడ్డూరం!


వేమనదంతా వెర్రి వాదం. బంగారం కావాలంటే ఆకువసర్లు నూరాలా? ఏ బంగారు దుకాణం వెనక ద్వారాన్నో, గుట్టుచప్పుడు కాకుండా తెరవగలిగితే బోలెడంత బంగారం!


బిల్ గేట్స్, లక్ష్మీ మిట్టలు లాంటి లక్ష్మీపుత్రులదంతా వట్టి చాదస్తం. కోట్లు, లక్షలు కూడబెట్టడానికి ప్లాన్లు, ప్రాజెక్టులంటూ పెద్ద పెద్ద బిల్డప్పులు అవసరమా? రెండు రోజులు చాలు. మూడు రౌండ్లు రెక్కీ నిర్వహిం చేస్తే- బస్తాలనిండా బంగారమే బంగారం!


'నిజాయతీ' అని తెగ గింజుకుంటున్నాడు ఈ మధ్య ఓ పెద్దమనిషి. ధర్మంగా సంపాదిస్తే ఎన్ని తిప్పలో ఈ తిక్కదేశంలో తెలీదా? అనంతపద్మనాడికైనా ఆదాయం పన్ను శాఖలతో ఎంత సతాయింపు?  దేశాభివృద్ధికోసం ముందస్తు పన్నులు కాస్తంత ఎక్కువ కట్టినా లెక్కలడిగి బొక్కలో తోసేస్తున్నారే!


లక్షలు పోసి కొనుక్కున్న ఉద్యోగం కాబట్టి, ఆ నష్టం కాస్తంత పూడ్చుకోవాలనుకోవడం నేరమా? గుండె చిక్కబట్టుకుని బల్లకింద నుంచి ఇంతేదో గిల్లుకుందామన్నా లోక్ పాల్  బిల్లనీ, అవినీతి నిరోధక చట్టమని, చట్టుబండలని  ఎన్నెన్ని గుదిబండలు మెడల చుట్టూ! 


గాలినైనా వేలంపాటలకు పెట్టుకుని నాలుగు రాళ్ళు నిబ్బరంగా దాచుకునే సదుపాయం సర్కారు పెద్దలకే కరువైపాయే! ఇనుము. ఇసుక, బొగ్గు, ఎర్రచందనం పేరిట ఎన్నెన్నో యాతనలు పడి. కోట్లు కూడబెట్టినా ఏం లాభం? ఏ ఖజానా పెద్దకో హఠాత్తుగా దేశసేవ చేయాలన్న దుర్బుద్ధి పుడితే చాలు, ఆ పొట్టే పెద్ద నోట్లన్నీ రద్దు! బోఫోర్సు క్యాష్ లాగా విదేశీ బ్యాంకుల బోషాణాల్లో మూసిపెట్టుకోవడానికి అందరికీ ఇటాలియన్ సంబంధాలు కుదరద్దూ?


ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. వందకోట్లు రేషను కార్డుల సంఖ్యకన్నా రెట్టింపు ఓటరు కార్డులు ఉన్న నియోజకవర్గాల్లో నిలబడి ఎదుటి పక్షంలో తలబడాలంటే తలకు వెయ్యేసుకున్నా ఎన్ని కోట్ల రూపాయలు తగలే యాలి! రోజురోజుకూ చిక్కిపోయే రూపాయిని నమ్ముకునే కన్నా, బంగారం కణికెల్ని వీలైనన్ని దారుల్లో  సేకరించి దాచుకోవడం తెలివితక్కువ పనేం కాదుగా ! అయినా, దొంగతనం, దొంగతనం అంటూ దుర్మార్గంగా అభాండాలువేయడం ఎంతవరకు సమంజసం ? 


చతుష్షష్టి కళల్లో చోరకళ ఒకటి. తంజావూరు తాళ పత్ర గ్రంథాలయంలో కెళ్లి వెదికితే, ఎన్ని బొత్తుల పొత్తాలు బయటపడతాయో! ఇరుగు పొరుగు ఇళ్ళలో దూరి, పాలు పెరుగులు మింగిన బాలకృష్ణుణ్ని ఇలాగే వేధించి ఉంటే రాజకీయాల్లో మనకు మార్గదర్శకత్వమంటూ మిగిలుండేదా ? దొంగ లెవ్వరినీ రాజకీయాల్లోకి రావద్దంటే ఎలా?


ఆమ్ ఆద్మీ ప్రభ అన్ని రంగాలా వెలగాలనేగా అందరి మూలుగులు దోచుకుని, దాచుకుని... దొరబాబుల్లాగా ఊరేగే సౌకర్యం!  రెండు మూడు వర్గాలకే పరిమితం చేయడం ఎంత దుర్మార్గం! పనివాళ్ల పేరున గనులు రాసిచ్చే ఉదార హృదయులు అందరికీ దొరుకుతారా? ఉప్పు, పప్పు ధరలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. పట్టపగలు ఏటీఎంలలో చొరబడి దౌర్జన్యంగా ఎంత దోచుకుంటే మాత్రం చెడ్డపేరే గాని, చారెడు నూకలన్నా దొరుకుతున్నాయా?


బంగారుతల్లులు, ఇందిరమ్మ సంచులు అంటూ హంగామాలు చేస్తే మిగిలేది భంగపాటే! బంగారు తండ్రులు, ఏ రాహుల్ గోతాలో పథకాలుగా ప్రవేశ పెట్టి బీదా బిక్కి చేతికి ఓ సుత్తి, దొంగతాళాల గుత్తీ ఇచ్చేస్తే- దారిద్య్ర రేఖ నుంచి మధ్య తరగతికేం ఖర్మ. ఏకంగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కెక్కే  భారతావనినే ఆవిష్కరించవచ్చు గదా!


తన పని తాను చేసుకుపోవడానికి చట్టాలు ఎలాగూ మనకు దిట్టంగానే ఉన్నాయి. ఒకవేళ జైలుకు పంపినా, కొన్నాళ్లు సకల మర్యాదలు చేసి, చిలకమార్కు నేర పరిశోధనతో బయట పడేయవచ్చు. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెడితే ఏమొస్తుంది? ఆమ్ ఆద్మీకి ఇలా ఏదో ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెడితే ఓటు బ్యాంకు బలపడటానికి పనికొస్తుంది. 'ఆహార భద్రతకన్నా ఇలాంటి స్వేచ్ఛావిహార

భద్రతే ఎన్నికల్లో కలిసొచ్చే ఆకర్షణీయ పథకం. పోలీసు ఉద్యోగాలకు పరుగు పందాలు పెట్టి అభాసుపాలయ్యే కన్నా, 'జేబులు కొట్టే దొంగవెధవల' పోస్టులు సృష్టించి ఉద్యోగ హోదా కల్పిస్తే విరాళాల సేకరణలో పెద్ద తలకాయలకు దాసోహ మనే బాధా తప్పుతుంది కదా! పరుగు పందాల్లో గెలిచి పోస్టులు కొట్టేసిన పోలీసులు మాత్రం ఏం పొడుస్తున్నారట? సూరి హంతకుడి వ్యవహారం చూడలా? ఏటీఎంలో చారల చొక్కా ఆగంతకుడి ఆచూకీ తీయగలిగారా? బంగారం దుకాణం దొంగలిద్దరూ జాలిపడి దొరబాబుల్లాగా వచ్చి లొంగిన తరవాతగదా పత్రికా సమావేశాలు పెట్టింది.. బీరాలు పలికింది!


దొంగ జాలిపడితేనే పోలీసులకు కేసులు క్లోజయ్యేది. కీచకులు పాలుమాలితేనే మహిళల భద్రత కాస్త పెరిగేది. ప్రైవేటు బస్సులు పోనీలే... పాపమని నెమ్మదిస్తేనే ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం సంభవమయేది . సర్కారు ఉద్యోగులు చెయ్యి నొప్ఫెట్టి రెక్కలు ముడుచుకుంటేనే ముడుపులు ముప్పు జనాలకు తప్పేది. పంతుళ్లు, వైద్యులు వస్తాయించకుంటేనే సర్కారు చదువులు, వైద్యాలు సక్రమంగా సాగేది.  కబ్జా దారులు దర్జా ఒలకబోయని నేలమీదే చెట్టయినా గుట్ట యినా చివరిదాకా మిగిలేది. ప్రజాస్వామ్యమని పెద్ద ఘరానాగా మనం ప్రకటించుకుంటున్నాం గానీ, దొంగ ఓటర్ల దయాదాక్షిణ్యాలమీదనే సుమా ఈ మహా సౌధం నిలబడి ఉన్నది...


'దొంగ వెధవ' తిట్టు కానేకాదు. వెయ్యి కిలోల బంగారం అనే ధనంతో రాజకీయాల్లోకి వచ్చి వర్ధిల్లు' అనే దీవెన. 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- ప్రచురితం - 07-02 2014 )

ఈనాడు- సంపాదకీయం స్వేదయాగం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 )

 ఈనాడు- సంపాదకీయం 


స్వేదయాగం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 ) 


"పొలాలనన్నీ/హలాల దున్నీ! ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధార ల/తవిలి కురిపించి? ' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు, ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయ పూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరి కుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలై గాలులు వీస్తాయి. నాగులేటి వాగు నీళ్లు కాళ్లు కడు గుతుంటే, జామ కొమ్మ చిలకమ్మ క్షేమసమాచారాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరు పేరునా పలకరించుకొంటూ పొలం పనుల్లోకి దిగే హలధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా పొగుడుతాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసి పాపలకు మల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుంటూ మురిసిపోతాడు ఇంకో గేయకవి సుద్దాల. 'మట్టి దాహం తోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కుర వంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనే గదా పాతరలోని పాత గింజకైనా పోయిన ప్రాణం లేచి వచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులు రైతన్న మంత్రసానితనం వల్లనేగదా చల్లంగా తీరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా తీయడం, బలుపు తగ్గకుండా తగు ఎరువులేయడం, తెగులు తగలకుండ మందు చల్లడం, పురుగు ముట్టకుండ ఆకులు గిల్లడం, పశువు మేయకుండా కంచెలా కాపు కాయడం, పిట్ట వాలకుండా వడిసెతో కొట్టడం- పంట చేతికి దక్క డమంటే చంటిబిడ్డను మీసకట్టు దాకా పెంచడం కన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.


అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ము కున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అది! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమే కాదు. బిడ్డ ఆకలి తీర్చలేని తల్లిపడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచి మా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/భాషాణముల్' జాతికి నింపి పెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు' అని కవి జాషువాలాగా ఆర్తి చెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కోకొల్లలు. సింగమనేని నారాయణ భావించినట్లు నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతి అన్నదాతా కవులకు స్ఫూర్తి ప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి , మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీ వలుడు' అనే కర్షక కావ్యాన్నే సృష్టించారు. శాస్త్ర విజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోయినా  సాగుదారుడు లేకపోతే బతుకు బండి  ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాల నుంచీ ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాల దాకా... అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకులను  మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగు భారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.


జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్యమెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీట మునిగితే తల్లికెంత కడుపు కోతో, పంట మునిగిన రైతుకంత గుండెకోత.  చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటిం చుకున్నా ప్రభుత్వాలకు పట్టదు. గోడలేని పొలాలకు గొళ్లేలు బిగిం చుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ  రాడు. కళ్ళాల దగ్గరే కాదు... అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ చివరి వరకూ పోరాడవలసిన కర్ణుడైనాడు కర్ష కుడు. పొలం గుండె తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి... పంట చేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్లు పడు తున్నాయి... ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణ దాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద? రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతు పవనాలు. వేదికల వాదనలు రైతు వేదన తీర్చవు. అన్నదాత కన్నీ టికి కావాల్సిందిప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొని పోయే ప్రమాదం అట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా ఒక్క వాన చుక్క యినా చాలు/ వచ్చే కారు'కి 'చాలు'లో విత్తే చారెడు గింజలైనా దక్కుతాయి' అన్నది అన్నదాత ఆశావాదం. 'ఇఫ్కో' సాహితీ పుర స్కార ప్రదానోత్సవ సభలో కేంద్ర మంత్రి శరద్ పవార్ వల్లెవే సిన మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత అదే. 'మూల వర్షం ముంచినా జ్యేష్ఠ వర్షం తెలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా బతికిస్తోంది. మనందరికీ బతుకులు మిగులుస్తోంది.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 01 - 12 -2011 )

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...