Monday, December 27, 2021

కవిత: యూనివర్సల్ ట్రూత్

 


కవిత: 

యూనివర్సల్ ట్రూత్


శీరోదయంతో మొదలిడి 

కపాల మోక్షంతో ముగుస్తుంది జీవితం! 

ఇదొ క'యూనివర్సల్ ట్రూత్ 

అయినా  

ప్రతివాడూ  అనుకుంటాడు

తానొక ఎక్సెప్షన్


ఈ శరీరం అగ్నిహోత్రుడికి

ఆహుతవుతున్నపుడు 

ప్రాణం గాలిలో ఏకమైనపుడు 

అస్థికలు మట్టి పాలైనపుడు 

చితాభస్మం నీటిలో కలిసి 

ఆత్మ అంబరాన్ని 

చుంచించేందుకు వెళ్లినపుడు 


అందం, ఆస్తి ఆదుకోవు 

వంశం, గోత్రం అడ్డు రావు 

బంధం. అనుబంధం తో డురావు 

జాతస్య మరణం ధృవం.


అయితే 

కొందరు బ్రతుకుతూ చస్తారు. 

కొందరు చస్తూ బ్రతుకుతారు.  

కొందరేమో చచ్చినా చావరు..  

మరుభూమిలో ఓ మజిలీవేసి 

పంచభూతాలను పలుకరించి. .. 

మళ్లీ మనలో కొచ్చేస్తారు 

లబ్ధ ప్రతిష్టులవుతారు .


-కె. సీతారామగిరి

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 27-12-2021 

                 బోథెల్ ; యూఎస్ఎ 


No comments:

Post a Comment

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...