‘ గెలీలియో మహానుభావుడే! సందేహం లేదు. కానీ భూమి
సూర్యుడి చుట్టూ
తిరుగుతోందని కనిపెట్టేందుకు అన్నిబ్బందు లెందుకు
పడ్డట్లో! నా బోటి
ఏ
డోసుబాబుకైనా ఓ క్వార్టర్ కొట్టించి పక్కన కుదేసుకునుంటే బుర్ర తిరిగే
వింతలు బోలెడన్ని బోల్డుగా బైటపెట్టుండేవాడు కదా
బావా!’ అన్నాడు
సోమలింగం.
సోమలింగం మా చెల్లెలి మొగుడు. మొన్న జనవరి ముప్పై..
పరగడుపునే మా
కొంపకొచ్చి నట్టింట వెంట తెచ్చుకున్న మందు
సరుకు మొత్తం
పరుచుక్కూర్చున్నాడు. ఇదీ కొంత బెటరే! బాపూజీ వర్థంతి.
ఈ తాగుడు మేటర్
బైటెక్కడన్నా పొక్కితే వాడలీడరుగా వీడిని ఎన్నుకున్న
పార్టీకే కాదు
కట్టుకున్న పుణ్యానికి మా చెల్లాయిక్కూడా.. పాపం..
పరువుచేటు.
చెల్లాయి
కోసమైనా ఈ ఎమ్మెస్ నారాయణ శైలి కతలు ఆలకించక తప్పదీ పూటకు.
‘కతలు అనుకుంటున్నావని నాకు తెలుసులే.
లోకం మెచ్చిన ఎందరో కథలరాయుళ్లు
పచ్చితాగుబోతులే బావా! ఎర్నెస్ట్ హెమింగ్ వే నుంచి, జేమ్స్ జాయ్స్,
ఎడ్గర్ ఎలెన్ పో దాకా ఎందరో డోసుబాబులు! ఓ. హెన్రీ
తాగుణ్ని గురించైతే ఓ
గ్రంథమే రాసేయచ్చు. మన మహాకవి శ్రీ శ్రీ రుచి
గురించిహ
చేప్పేదేముంది?
కథలు చెప్పేవాళ్లందరూ తప్పతాగుతారని చెప్పకురా.. పాపం
చుట్టుకుంటుంది!
అట్లా అని చెప్పను కానీ తప్పతాగేవాళ్లు మాత్రం
తప్పకుండా మాంఛి కథకులై
ఉంటారు. ఉండాలి కూడానూ! కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా మీ
సిస్టర్
లాంటి ఇంటిళ్లాళ్లకు విడవకుండా కొత్త కొత్త కహానీలు వినిపించే కళంటే
మాటలా ఏంటీ? అల్లాటప్పా వెంకటప్పయ్యల వల్లయ్యే వ్యవహారం కాదులే అది.
నోరు తిరిగిన తాగుబోతుకయినా తడబాటేమీ లేకుండా, నాలుక ఏమీ మడతలు పడకుండా
ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టోరీలల్లి
చెప్పడానికి ఎంతో సృజనాత్మకత
అవసరం. తప్ప తాగితే తప్ప ఆ సృజనాత్మకత
అంతరాత్మను పట్టుకోడం కష్టం.
ఎన్నైనా చెప్పరా! తప్ప తాగడం తప్పు.. తప్పున్నరా!
అక్కడే కాలేది. ‘మందు’ మీద
ఎందుకిన్ని అపనిందలు?! సురాపానం
దురాచారమంటూ
సాగించే దుష్ప్రచారంతో మీ బుద్ధిమంతులంతా
సాధించేదేముంది?! మధుపానం ఈ
రోజే కొత్తగా మా ప్రభువులు కనిపెట్టిందా? అందుకే.. ఈ మాసంలో మా ‘తామసం’
తరుఫు నుంచి నేరుగా సుప్రీమ్ తలుపులే దబదబా
బాదబోతున్నాం.
తామసం అంటే తాగుబోతు మనుషుల సంఘం అని మా సోమలింగం అర్థం! రామరాజ్యం
కాలంలోనే 'రా' చలామణీలో ఉందంటున్నా వింటూ కూర్చోవాల్సిన ఖర్మం
నా కీపూట!
రామాయణాన్ని అంత రసవత్తరంగా మార్చిందెవరూ? చలువ బట్టల పనిచేసుకొనే తులువ
నోటి నుంచి వచ్చిన మందు మాటలు కావూ! రామాయణం
శిరోధార్యం అయినప్పుడు
రామకార్యం నిర్విఘ్నంగా నిర్వహించిన సోమపానం ఏ లెక్కన
యాంటీ- సోషల్
యాక్టివిటీ అయ్యిందంట?
రామ!.. రామ!
సీతమ్మ తల్లిని వెతకడానికని వెళ్ళిన ఆంజనేయుడుకి
లంకలో ముందుగా
కనిపించింది ఈ చీప్ లిక్కర్ సీసాలు.. అవి
సేవించే రాక్షస సమూహాలే
బావగారూ! మహాభారతం మాత్రం..?
కృష్ణ కృష్ణా!
మహాయోధుడు కీచకుడుకి మగువల మీద కన్నా మధువు మీదనే మక్కువ జాస్తి. ఆ
మాటకు వస్తే మగనాళ్లు కూడా మధుపాన చిత్తులయి చిత్తం
వచ్చిన రీతిలో
ప్రవర్తిల్లిన తీరులు మన ప్రబంధాల నిండా బోలెడు
కనిపిస్తాయి. మీ
బుద్ధిమంతుల ముఠాకు ఆ విశ్వనాథ బ్రాండంటే గిట్టదు
కానీ!
ప్రబంధాల మీద కూడా పడ్డాయంట్రా మీ నోళ్లు?
'అసితోత్పలములపై అరుణేం దుధీతతుల్
వెలసినా గనుగువ లెఱ్ఱనయ్యె’అంటూ
నన్నెచోడుడు కుమారసంభవం కావ్యంలో, కళ్లు ఎర్రబడ్డం దగ్గర్నుంచి కాళ్లు
తడబడ్డం దాకా మందు కొట్టిన సుందరాంగుల వగలు సెగలన్నీ
వలిచి మరీ
నిర్మొహమాటంగా చూపించాడు! ఆ పోయెమ్ ప్రతిపదార్థం కళ్లక్కట్టినట్లు
వివరించుంటే ఆ తిక్క టివి ఎపిసోడ్సుకు మించి ఇంతులకు
ఇంగితం అబ్బుండేది
కదా! తాగుబోతులను పద్దాకా ఆడిపోసుకొనే చండికల చేత నన్నెచోడుడి
కుమారసంభవం తిరగేయించండోసారి మొండి ధైర్యం చేసైనా. బడాయిలు.. ఛోటూల చేత
కూడా తాగుబోతులంటూ మమ్మల్ని ‘ఛీ’ కొట్టించమంటేనే
సర్దా మీకు! ‘సురాపానము
చేయువానికిని సన్మానంబులే సిగ్గులే/ వదనాలంకరణంబులే
సుగతిలే వాక్సుద్ధిలే
వాంఛలే
మదిలోనన్ దయ ఇంతలే స్మరణలే మర్యాదలే మట్టులే/ మదమేమాత్రములే సదాశివ
శివా‘ అంటూ కాంతలంతా సూరేకాంతం మేనత్తల్ని మించి మా
మీదెప్పుడూ
చిందులేయడానికి మీలాంటి ముచ్చు నీతిమంతులు కదూ
రీజన్!’
మరే! తప్ప తాగే మీ మొనగాళ్లంతా పాలుతాగే
పసిపిల్లకాయలు! మందు వల్ల కలిగే
లాభాలు మీరే ముందు మీ అప్పచెల్లెళ్ళు, పెళ్లాంబిడ్డల ముందర ఏకరువు
పెట్టుకోవచ్చుగదరా?
ఏ మందుకొట్టుకో వెళ్ళి మరెందుకు ఓ మూల చేరి మందు
కొట్టుకుంటూ ఈ ఏడుపులూ.. పెడబొబ్బలూ? విప్పసారా మహిమనయినా వీరనారీమణులకు
విప్పి చెప్పుకోవచ్చే.. నిజంగా నిజమే ఉంటే? మీ బుడ్డిమంతుల బుర్రలు.
నాలుకలకు ఏమన్నా విప్పులు గట్రా జారీచేసాయా సోమలింగం
బావయ్యా?!
ఓటేసే వాడి నోట ‘నోటా’ మాట రావద్దన్నా ఎన్నికల పూటంతా
పూటుగా నాటు పోయక
తప్పని రోజులు బావయ్యా ఇవి! ఆ పేదోడి ముందు
ముంతక్కూడా చేటు తేవడం
అంతానందమా మీకు? నాటు మీద
కూడా ఎందుకీ మోటు
సరసాలు? ఓటేసిన ఓడ
మల్లయ్య
ఎటూ మీట నొక్కిన మరుక్షణం బట్టే బోడి
మల్లయ్యైపోతున్నాడిప్పుడు. ఓటేయించి
గెలిపించే చీపు లిక్కర్ మీదా ఇంకా ఎందుకయ్యా సామీ మీ
నీటు
పాలిటిక్సోళ్లకు నిష్టూరాలు?
గ్లాసు ముట్టని క్లాసుగాళ్లం బావా మేమంతా. ఏం చేసేమని
మా మీద మీ
తాగుబోతుల యుద్ధం? మద్యం మహమ్మారి కాదంటే.. ఆడజాతి ఊరుకుంటుందనే?
మద్యమేం మహమ్మారి కాదు. చరిత్ర మొత్తం చెత్త బుట్టలో
పడేసి తాగుబోతుల చేత
తిరగరాయించాలి ముందు! ఉజ్జయినీ కాళీమాతకు మద్యమేనయ్యా
మహా నైవేద్యం!
శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరోటి
ముట్టుకోడు. కల్లు,
సారాయి లాంటి గమ్మత్తు సరుకు మీద సమాజంలో సరైన అవగాహన
లేకనే..
అబ్బో! సారాయంటే అంటే అదేందో అమృతమయినట్లు?
పురాణంలా పారాయణం
చేస్తున్నావ్.. చస్తున్నా విన్లేక ఇందాకణ్నుంచి!
పూర్ బావయ్యా! పురాణాలల్లోనూ దీని కోసమే మహాశయా
దేవాసురులు తన్నుకు
చచ్చిందీ! పల్లెపట్టుల వైపున్న అమ్మలక్కలకు ఈ మాత్రం
మద్య పురాణాల మీద
జ్ఞానం లేకపోడం మా బ్యాడ్ లక్! ఓ అరకాయ సారా కిట్టిన కాడికి
ఆమ్మించినప్పుడేగా ఆ వచ్చిన రూపాయిలో పైసా తిరిగి బక్కోళ్లకి ఏ
సంక్షేమం వంకనో దక్కేది! ఆ ఇవ్వడాలవీ గిట్టకే సర్కారోడి మీద
అప్పోజిషనోళ్ల తరుఫు నుంచీ ఆడంగులతో మీరిట్లా
రాళ్లు.. అవీ
రువ్వించడం!
గెలిపించినోడి కడుపుకు నిండుగా కాయా కసరూ
తినిపించడానికి ఏ గవర్నమెంటోడు
పలుగూ పారా పట్టుకుని పొలాలెంటబడి పొర్లాడడు! కల్తీదో
..బొల్తీదో కనీసం ఓ
అరకాయ యిప్పసరుకయినా వండించి పేదోడి
నోటికి అందుబాటులో
ఉంచుతున్నాడు.
అందుకెవరూ మెచ్చరు! ఆ సొళ్లు కన్యాశుల్కాన్ని మీ హైక్లాసోళ్లంతా ఎప్పుడూ
ఒకే రే-బాన్ కళ్లద్దాలతో చూడ్డం ఫ్యాషనయిపోయింది.
పోనీ అందులోని మంచి
మాటలైనా మనసుకు పట్టించుకుంటారా? ద్రేహం గాజు కుప్పె. ద్రేహంలో ఉండేది
పరవాత్మ. గాజు కుప్పెలో వుండేది అన్నసారం. ఈ అన్నసారం
ద్రేహంలో పడితే
గాని పరవాత్మ పెజ్జరిల్లదు. ఈ పరమ రహస్యం వంటబట్టకే
పరబ్రెమ్మం
పట్టువడ్డంలేదు- అన్నాడు బైరాగి. ఆ తత్వంలో ఎంత లోతర్థముందో!
అదర్థమవాలంటే కల్లుదుకాణంలోనే కూర్చొని పరమాత్మ కోసం
వెదుకులాడాలి. మందు
గ్లాసు చూస్తేనే మొహం చిట్లించేస్తే ఇహ పరమాత్మ
ఈ-మెయిల్ అడ్రసైనా ఈ
జన్మకు మీకు దొరుకుతుందా? బైరాగోళ్లే ఇవాళా రేపూ ఈ దేశంలో ధర్మపన్నాలు
వల్లించి జనాలను బాగా ఒప్పిస్తున్నది కూడా. మీ
సుమతీశతకంగాళ్లతో అయ్యేదీ
పొయ్యేదీ కాదు గానీ ఈ సోమపాన మహిమల మీద ఎట్లాగైనా
బళ్లల్లో అయ్యవార్ల
చేతనో, గుళ్లల్లో ఏ
సన్యాసి మహరాజుల చేతనో చెప్పించలి! అప్పుడే బ్రాందీ
బాటిల్ పట్టినోడికి గాంధీతాత గౌరవం దక్కేది.
ఉల్లిపాయ వద్దనే సాధుపుంగవులే పరగడుపునే మడి
కట్టుకుని ఓ పుడిసెడు మధువు
పుచ్చుకుంటే తప్ప త్వరిత గతిన జీవన్ముక్తిని
సాధించలేరని ప్రచారం
చేయాలంటావు! మత్తుపురాణాలు మాత్రమే
ప్రవచనవేత్తల నోట
ప్రపంచమంతా విని
దారికి రావాలంటావ్! భలే గమ్మత్తుగా ఉందయ్యా బావా
మొత్తానికి నీ కొత్త
పొలిటికల్ ఎత్తుగడ!
పోలిశెట్టికి పోలిటిక్సుతో పోలికేంటి.. సెటైరా? చట్టసభలంత కాదులే నాయనా
మరీ ముంతకల్లు కాంపౌండ్లయినా! లోకంలో
లోపిస్తున్న మంచీ
మర్యాదా ఇప్పుడు
కొంచెమైనా కనిపించేది మా మందు భయ్యాల మధ్యనే బావయ్యా! ఎంత ఒళ్లు మరిచి
తాగి వాగినా మరీ పొలిటీషియన్సంత బేవార్సుగా మా నోళ్లు తూలవు.
ఊక మాటలు మానేయ్ బావా! నా టైం వేస్ట్! దీనికన్నా ఓ
తెలుగు సినిమా చూడ్డం
అన్నిందాలా బెస్ట్!
ఉత్తుత్తి మాటలు కాదు బ్రదరిన్లా! మహా తత్వవేత్త ఉమర్ ఖయ్యాం
ఏ
తత్తరపాటు లేకుండా ఎమన్నాడో తెలుసా! ‘గడిచిన ఘడియలేవో
గడచిపోయినయ్!
రాబోయే కాలం మీదా ఏ నమ్మకం లేదిప్పుడు. ఈ వర్తమానమే
బేబీ మన ముందున్న
ఆస్తి! బేవార్సు ఆలోచనలు మానెయ్! పానపాత్ర నిండా
ముందు మందు నింపు! దా..
వీలైనంతగా ఈ బతుకును చింపవతల పారేద్దాం.. ఆనక ఆనందంగా
చద్దాం' అంటాడు.
విని చచ్చే నాథుడేడీ?
ఖయ్యామా అంత గొప్ప కవిత్వం చెప్పిందీ! కాదయ్యా
బావా! అతగాడి చేతిలోని ఆ మందు గ్లాసు’
కిక్కెక్కంది బాగా! ఇహ ఇంటికి నడువు.. బెటరు!
ఆగవయ్యా సామీ! అప్పుడే ఏమయింది? ముంతలో ఇంకా మూడో వంతు మిగిలే ఉంది!
ముంతా? బెల్జియం మేడ్ గాజు గ్లాస్
నీ కళ్లకు ముంతలా
కనిపిస్తుందా?కైపెక్కినప్పుడే తాగుబోతుల నోట ఈ మాదిరి వింత కబుర్లు
వినిపించేది! హ్హా.. హ్హా..హ్హా!
ఎందుకన్నా ఆ ‘హే’ళాకోళం? అజంతా హరప్పా శిథిలాలు తవ్వినప్పుడూ
ముందుగా
బైటపడ్డవి అప్పటికాలం మా తారసం సభ్యులు తాగి పారేసిన చట్లూ, ముంతలే!
సారాయా?.. కల్లా?.. చీపా?.. ఆఫీసర్స్
ఛాయిస్సా? అన్న తేడా ఉండదని
మందంటేనే గిట్టని మీ బోటి మందభాగ్యులకేం తెలుసు!
‘అమరులు త్రావుచో
నమృతమందురు దీని, నహివ్రజం బజ/ స్రముఁ గొని యానుచో నిది రసాయనమందురు’
అన్నాడు నన్నెచోడుడు. దేవుళ్లు తాగితే అమృతం, పాతాళంలోని నాగులు తాగితే
రసౌషధం! శాస్త్రాల ప్రకారం ఒక్కో ‘క్లాసు’ గ్లాసుకు
ఒక్కో పేరు! పేరేదైనా
ఒకే రకంగా కిక్కు, కక్కు పీకల్దాకా తాగ్గలిగితే!
నీకో సీక్రెట్
చెప్పనా! నిప్పు కనిపెట్టకముందు ఆదిమానవుడు
ఎండావానలకు, చలివణుకుళ్లకు
ఎట్లా తట్టుకు నిలబడ్డాడో తెల్సా? అంతా యిప్పసారా గమ్మత్తు. వార్
టైమ్సులో ఏనుగులకి బాగా మద్యం పట్టిస్తే తప్ప శత్రుసైన్యం
మీదకు
దూకుడుగా వెళ్లేవికావు! 'ఇండికా'లో
మెగస్తనీస్ అంతటి మహానుభావుడే
మహత్తరమైనదని మెచ్చుకున్న మద్యాన్నేగదయ్యా మేం
తాగేదెప్పుడూ ఎన్ని
బడ్జెట్ పద్దుల్లో రేట్లు రెట్టింపవుతున్నా! మధ్యలో మీ చెల్లాయికి
ఎందుకంట నెప్పులు.. నా మాడుకు బొప్పులు!
సోమలింగం ఫైటింగ్ మూడ్ కి వచ్చేసాడు.ఇహ ఇంటికి
చేర్చకుంటే మా ఇంట్లో
నేనవుతా బ్యాడవుతా ముందు!
కారు స్టార్ట్ చేసి వచ్చి ‘లే బావా! ఇంటి దగ్గర
డ్రాప్ చేసొస్తా.. కమాన్’ అన్నా.
కమాన్ బావా! కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునులు మధుపానానికి మాత్రం
శాస్త్రాలు రాయకుండా ఉంటారంటావా? తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో
మరికాస్త
మందుకొట్టి వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు
తప్పకుండా బైటపడతాయని
మా
వర్శిటీ ప్రొఫెసర్ ఒహటే నస. నువ్వూ వస్తావా! సర్దాగా
ముగ్గురం కల్సెళ్ళి
ఓ సారి ఆ పుస్తకం కాపీ కొట్టుకొచ్చేద్దాం! పీ.హెచ్డీ
కొట్టేద్దాం!
వస్తాలే కానీ.. నీ ముంతలో సరుకు ఇంచి కూడా మిగల్లేదు.
ఇహనన్నా లేవరా మగడా !
మౌర్యులకాలంలోనే మనవాళ్లు ఈ ఇంచీస్ కనిపెట్టారంటారు బావా యూ.. నో!
లోటాలో మందు కొలుచుకునేందుకు కాకపోతే మరెందుకంటా ఈ కొలతల తంటా?
బలవంతంగా రెక్కలు పట్టుకుని పైకి లేపే తిప్పల్లో
నేనున్నాను. కోఆపరేట్
చెయ్యకుండా ‘చంద్రయాన్’ మిషన్ ఇంజనులో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో
కొట్టించుంటే.. సముద్రంలో కుప్పకూలే బదులుఉ కూల్ గా చందమామ చూట్టూతా
చక్కర్లు కొడుతుండేది ఈపాటికి! అంటూ సోమలింగం సోది!
‘ముందే ఈ మందు ఐడియా రానందుకు మన శ్రీహరి కోట శివ సార్ ఇప్పుడు తెహ
పాశ్చాత్తాప్ప..ప్పా..ప్పా ..ప్పా’
లేవలేక పడిపోయిన సోమలింగాన్ని చూసిం తరువాత ముందు మా
చెల్లాయి మీద చచ్చే
బెంగేసింది నాకు. ‘తాగుబోతులతో ఈ దేశంలో కాబట్టి
ఆడవాళ్లింత ఓపిగ్గా
కాపురాలు నెట్టుకొస్తున్నారు. సర్కార్లు
మారినప్పుడెల్లా తతిమ్మా
ఇంపార్టెంట్ ఇస్యూస్ ఎన్నున్నా ఆన్ని ఊళ్లల్లో అన్ని
తరగతుల ఆడవాళ్లు
మద్యాన్ని ముంసు నిషేధించమని ఎందుకు వేధిస్తున్నారో ఇప్పుడు కళ్లారా
అర్థమవుతుంది.
పడిపోయిన సోమలింగం బావ మళ్లా లేస్తూ ‘దేవుడు కూడా
ఆదాము అవ్వల్ని ఆపిల్
ముట్టుకోవద్దన్నాడే తప్పించి.. తప్ప జోలికి
వెళ్లద్దని హద్దులు పెట్టింది
లేదు బావా! ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే గమ్మత్తైన
ఉపాయం ఈ మత్తు మందులో
ఉంది బ్రోఇన్ లా! వాగడం ఒక్కటే పట్టించుకోవద్దు. ఈ అమృతం తాగినప్పుడే
ఎన్నడూ చదివెరుగని అమరకోశం సూత్రాలు
కూడా సూటిగా నోటి నుంచి
తన్నుకొచ్చేస్తాయ్! ఇట్లాంటి డ్రౌజీ కండిషన్లలో ఉన్నప్పుడే మన
రుషివర్యులు ఎన్నెన్నో కొత్త కొత్త విశేషాలు
శోధించి సాధించింది.
అష్టాంగమార్గాల్లో ఆఖరన 'సమాధి' అని
ఒకటుంది! దాని పవర్ నీకు తెలుసా’
‘తెలీదు.. తెలీదు .. చూపించు..
తొందరగా!‘ అడిగాను ఆశగా!
ఫుల్లుగా ‘రా’ కొట్టి చల్లంగా పడుంటమే!- అంటూ పడుకుండిపోయాడు.. ముందే
నేను ఊహించినట్లు!
అమ్మయ్య! ఈ వర్ధంతికి ‘సమాధి’లోకి వెళ్ళిపోయాడు మా
సోమలింగం బావ.
సోమలింగం బావను కారులో ఇంటికి మోసుకు పోతుంటే దారిలో
ఈ మందు మహమ్మారిని
గురించి మనసులో బోలెడన్ని దిగుళ్లు.. కందిరీగల్లా!
అక్కచెల్లెళ్ల
కాపురాలను తల్చుకుని కళ్లూ తడి అయ్యాయి.. బాపూజీ మీద
ఒట్టు!
***
No comments:
Post a Comment