Showing posts with label Criticism. Show all posts
Showing posts with label Criticism. Show all posts

Thursday, December 9, 2021

కథలు రాసేందుకు సామాజిక అవగాహన చాలా? - పి.రామకృష్ణ - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 కథలు రాసేందుకు సామాజిక అవగాహన చాలా?

- పి.రామకృష్ణ 


ఒకప్పటి కదలకంటే ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. వస్తు విస్తృతీ పెరిగింది. అయితే, అప్పటి కథలు ఇచ్చిన సంతృప్తినీ, ఒస్పందననూ ఇప్పటి కథలు ఇస్తున్నాయా? పాత్రలతో సహా అప్పటి కథలు ఇప్పటికీ జ్ఞాపకంవున్న సంగతి తల్చుకుంటే, ఇవ్వడం లేదని ఒప్పుకోవలసిందే. ఎందుకని? ఇప్పటికీ సాహిత్యం చదివే పాఠకులతో ఈ అంశం చర్చించా లనే ఈ ప్రస్తావన


స్వేచ తనకు అవసరమైనంత మేరకు విస్తరించి, తననొక స్వతంత్ర ప్రక్రియగా ప్రకటించుకునేది. కథా ప్రతిపాదన నచ్చినా నచ్చకపోయినా దాని నిండు దనంలో లోపం వుండేది కాదు. ఇప్పుడు కథకు ఆ స్వతంత్రం లేదు. కథకు లేదంటే కథకు లకు లేదనే అల్లసాని పెద్దన కోరికల్లాంటివి అవసరం లేదు కానీ, అందులో మొదటిదైన 'నిరుపహతి స్థలం' అంటే నిబం ధనలు లేని జాగా కథకు అవ సరం. అది నేటి పత్రికల్లో లభ్యం కావటం లేదనేది అందరికీ తెలి సిందే కనుక, ఆ సంగతి వది లేద్దాం. అయితే, ఆ ఏకైక కారణమే కథ ఈ స్థితిలో వుండటానికి కారణమా అని మాత్రం ఆలో చించాలి. ఒక్క వాక్యం కూడా సాహిత్యమవుతుందని ఇంతకు ముందు పెద్దలు చెప్పారు. ఆ లెక్కన చిన్న కథకైనా సాహిత్యం కాగల అర్హత వుంటుంది. కథ సాహిత్యమైతే తప్పనిసరిగా స్పందింపజేస్తుంది. మరి ఇప్పటి కధ 'బావుంది' అనిపించడం మినహా, ఎప్పటికీ జ్ఞప్తికుండేలా ఎందుకు చెయ్యలేకపోతోంది? అది చెప్పవలసిన బాధ్యత ఈ ప్రస్తావన తెచ్చిన నామీదనే


ఉందని అనుకుంటున్నాను. అయితే, నేను చెబుతున్న


కథ చదివినప్పుడు తప్ప తర్వాత జ్ఞాపకం లేకుండా పోతున్నది. అందుకు కారణం కథకులకు సాహిత్య నేపథ్యం లేకపోవడం. సమాజంలో మనం చూస్తున్న అసమానతలనూ, అన్యాయాలనూ ఎత్తిచూపేందుకు సాహిత్య అవగాహన అక్కర్లేదు. సామాజిక అవగాహన చాలు అనే అభిప్రాయమూ వినిపిస్తూ వుంది. సామాజిక అన్యాయాలను సాహిత్యం ద్వారా చెప్పదల్చుకున్నప్పుడు, అది సాహిత్యం అవ్వాల్సిన అవసరం వుంది కదా!


కారణాలు నా అభిప్రాయాలే. ఇవి ఇంకే ఒకరిద్దరి అభిప్రాయాలైనా


నా ప్రయత్నం ఫలించినట్లే.


కథా రచన అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. ఈ అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరనుకుంటున్నాను. అంటే, కథకు తగినంత స్థలం వుండటం అవసరమే అయినా, అంతకంటే ముఖ్యం అది సాహిత్యం అవడం. సమాజంలో జరుగుతున్నవి మాత్రమే చెబితే అది సాహిత్యం అవదు. కథకుడి సృజన సామర్ధ్యమే దాన్ని సాహిత్యం చేస్తుంది. ఆ సృజనశక్తి ఎలా వస్తుంది? సాహిత్య నేపథ్యం దాన్ని సమకూరుస్తుంది. కధ సాహిత్యమయిందా, లేదా అని పాఠకులు ఆలోచించాలని కాదు. స్పందింపచెయ్యడంలోనే ఆ సంగతి నిర్ణయమవుతుంది. అందుకు పాఠకులకు పరీక్ష అవసరం లేదు. స్పందింపచెయ్యకపోతే, 'బావుంది' అనే తాత్కాలిక పరిమిత స్పందన వరకే పాఠకులుండిపోతారు. అదీ సమస్యనైనా సరిగా చెప్పినప్పుడే.


అందువల్లనే కథ చదివినప్పుడు తప్ప తర్వాత జ్ఞాపకం లేకుండా పోతున్నది. అందుకు కారణం కథకులకు సాహిత్య నేపథ్యం లేకపో వడం. సమాజంలో మనం చూస్తున్న అసమానతలనూ, అన్యాయా లను ఎత్తిచూపేందుకు సాహిత్య అక్కర్లేదు. అవగాహన సామాజిక అవగాహన చాలు అనే అభిప్రాయమూ వినిపిస్తూ. వుంది. సామాజిక అన్యా ద్వారా చెప్పదల్చుకున్న పడు. అది సాహిత్యం అవ్వాల్సిన అవసరం వుంది కదా!


ఇప్పటి కథకులు సాహిత్య సంబంధం లేనివాళ్ళయితే, మరి వున్నవాళ్ళు రాయొచ్చు. అనవచ్చు. రాయొచ్చు. కానీ వాళ్ళకు వుండదు. సృజనకు పూర్తి అవకాశం లేని కథ రాయడంపై వాళ్ళకు ఆసక్తి వుండదు. సాహిత్య పరిచయం వుండీ, ఒకప్పుడు కథలు రాసీ, ఇప్పటికీ ఉన్నవాళ్ళు కథలు రాయడం మానెయ్యడానికి ఓపిక లేకపోవడమే కాక అదీ కారణం కావచ్చు. ఇంతకూ చెప్పదల్చుకున్నది ఒక్కటే. భౌతిక నిర్మాణానికే కాదు, భావ నిర్మాణానికైనా పునాది అవసరం. అది రచయితలకే కా, పాఠకులకు అవసరమే. లేకపోతే, ఏది సాహి త్యమో తెలీకపోవడమో, ఏదైనా సాహిత్యమనుకునే పరిస్థితో ఏర్పడే ప్రమాదం వుంది. నిజానికి, ఈ ప్రమాదాన్ని రెండుగా చెప్పనక్కర్లేదు. ఏది సాహిత్యమో తెలీనప్పుడు, ఏదైనా సాహి తమే అవుతుంది కదా!


పి. రామకృష్ణ

( సేకరణ : కర్లపాలెం హనుమంతరావు ) 

Wednesday, December 8, 2021

సాహిత్య వ్యాసం: బేతాళ పంచవింశతి -కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు వెలుగు మాసపత్రిక - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం)

 









సాహిత్య వ్యాసం:

బేతాళ  పంచవింశతి

-కర్లపాలెం హనుమంతరావు

( తెలుగు వెలుగు మాసపత్రిక  - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం) 



బేతాళ కథలను గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.    బాలల మాస పత్రిక 'చందమామ' చలవ.. తెలుగునాట తరాల బట్టి బేతాళుడు ప్రతీ ఇంటికీ నెలకో సారొచ్చి చక్కని కథ వినిపించే కథల భూతంగా   చిరపరిచితుడు.

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీది శవాన్ని భుజాన వేసుకొని స్మశానం కేసి నడవడం.. శవంలోని బేతాళుడు  మహారాజుకు  దారిశ్రమ తెలియకుండా కథలు అల్లి చెప్పడం బేతాళ కథల   రివాజు.  విక్రమార్కుడు వినే ఆ వింత  కథలనే   'చందమామ' పాఠకులూ చిన్నా పెద్దా  తేడా లేకుండా ఎంతో ఉత్కంఠతో చదవడం  అదో మోజు. ఆ మైమరుపుకు కారణం నెలకో తీరులో సాగే  కథలలో కొనసాగే  కొసమెరుపు. బేతాళుడి  ప్రశ్నలకు జవాబులు తెలిసీ పెదవి విప్పకుంటే   రాజు తల వెయ్యి వక్కలయ్యే ప్రమాదముంది. మహారాజు  ఆ నెల  ఏ తెలివైన జవాబు చెప్పి గండం  నుండి తప్పుకుంటాడోనని  దిగులు!  చిత్ర విచిత్రమైన భావోద్వేగాలతో దశాబ్దాలపాటు చందమామ పాఠకులను ఉర్రూతలూగించిన  బేతాళుడు ఎవరు?  చిక్కుముడి కథల అసలు  పరమార్థం ఏమిటి?  బేతాళ కథలు  రేకెత్తించే పలు  సందేహాలు  నివృత్తి కావాలంటే  'బేతాళ పంచవింశతి' గురించి కొంతయినా  తెలుసుండాలి.    

అనగనగా ఒక వీరుడు. అతగాడి పేరు విక్రమసేనుడు.  ప్రతిష్టాపురానికి ఆయన మహారాజు.  శీలభద్రుడనే ఓ యోగి పదేళ్ల పాటు ప్రతీ రోజూ  క్రమం తప్పకుండా రాజుగారికి రోజుకో విచిత్రమైన పండొకటి కానుకగా సమర్పిస్తాడు. నిజానికి  ఆ బహుమానాలన్నీ మణులు.. మాణిక్యాలు! రాజు నిలదీసిన మీదట యోగి నోట బేతాళుడి వివరాలు బైటపడతాయి. కోరుకున్న రూపంలోకి మారిపోగల కామరూప శక్తి మాయ బేతాళుడి బలం. ఆ భూతాన్ని   తన పరం చేయమని వేడుకుంటాడా తాంత్రిక యోగి. 

శైవ తాంత్రిక సంప్రదాయాల అనుసారం బేతాళుడు ఒక భూతం. మంత్ర తంత్రాలతో వాడిని వశం చేసుకోవడం సులభం.  స్మశానాలలో శవాలలో నివాసముండే వాడు  తన వశమయితే  సర్వశక్తులు  సిద్ధిస్తాయని తాంత్రిక యోగి దురాశ.   సాహసం, మేధస్సులకు  సైదోడుగా  బోలెడంత సహనం గల విక్రమసేనుడే తన  వాంఛితం ఈడేర్చే  సమర్థుడని యోగి ఇంత మంత్రాంగానికి పూనుకున్నది. సన్యాసి దురూహ పసిగట్టని రాజు ఎన్ని రాత్రులైనా జాగారాలు చేసి బేతాళుడిని యోగి పరం చేయాలని పంతం పడతాడు. విక్రమసేనుడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భంగం చేసే బేతాళుడి ప్రయాస  నేపథ్యంగా సాగే పాతిక  విచిత్ర కథల సమాహారమే 'బేతాళ పంచవింశతి'. 

పంచవింశతి అంటే ఇరవైకి అయిదు అదనం. బేతాళుడు చెప్పిన  పాతిక కథలు కాబట్టి ఇవి 'బేతాళ పంచవింశతి' పేరుతో సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధ కథాకావ్యంగా ప్రసిద్ధమయాయి. ‘చందమామ’ పత్రికలో నిరంతరాయంగా కొనసాగిన కల్పిత కథలన్నిటికి బేతాళ పంచవిశంతిలోని  కథలే ప్రేరణ.  

బేతాళుడి పుట్టుక కథ చాలా ప్రాచీనమైనది.  జనశ్రుతంగా  విన వచ్చిన ఈ  కథలను అజ్ఞాత కవి ఎవరో గ్రంథస్థం చేసినట్లు  సాహిత్య పరిశోధకులు భావిస్తున్నారు. బేతాళ కథల మూలాలు శైవ తాంత్రిక సంప్రదాయంలో ఉన్నప్పటికీ..  బౌద్ధుల తాంత్రిక యోగ సంప్రదాయంలోకీ వచ్చి తిష్ఠవేసినట్లు చెబుతారీ  బేతాళుడు. 

క్రీ.శ ఒకటవ శతాబ్ది, శాతవాహనుల కాలం నాటి ప్రాకృత భాషాకవి గుణాఢ్యుడు పైశాచి భాషలో రాసిన  బృహత్కథలోని కొన్ని కథలే  బేతాళ కథలని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది.   బృహత్కథాలహరి కాశ్మీరం ప్రతిలో బేతాళ పంచవింశతి ప్రస్తావన ఉన్నట్లు పాశ్చాత్య  పండితుడు వింటర్ విట్స్ కూడా భావించాడు. ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి అనువాదమయిన క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలో, సోమదేవుడి  కథాసరిత్సాగరంలో కనిపించే బేతాళ కథలు నేపాళ కవి బౌద్ధస్వామి సంస్కృత బృహత్కథాశ్లోకసంగ్రహంలో కనిపించవు! బేతాళ పంచవింశతికి  మూలమని భావించే కాశ్మీరం ప్రతి ప్రస్తుతం అలభ్యం.   ఈ నేపథ్యంలో  నిజానిజాలు  నిర్ధారించడం కష్టం. ఆయా కాలాలల్లో కవులు తమ సమకాలీన సామాజిక  పరిస్థితులకు  తగ్గట్లుగ ఈ కథల్లో మార్పులు చేసుకున్నారు. ఆ కారణంగా ఏవి మూలరూపాలకు దగ్గరివో, ఏవి  చొప్పించిన  ప్రక్షిప్తరూపాలో  నిగ్గుదేల్చడమూ క్లిష్టతరంగా మారింది ప్రస్తుతం! 

జంబలదత్తు గద్య రూపంలో, వల్లభదేవుడు  సంక్షిప్త రూపంలో, మరో పేరు తెలియని కవి క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలోని పద్యరూప కథలను గద్యంలోకి  మార్చినట్లు చెబుతారు. గద్య పద్య మయ హృద్యశైలిలో కూర్చిన   12 వ శతాబ్ది నాటి శివదాసు కృతే ఉన్నంతలో మూలరూపానికి కాస్తింత  సమీపంగా నడిచినట్లు ఇప్పటి విమర్సకులు భావిస్తున్నారు.

ఇక తెలుగులో.. 

జక్కన తెలుగు 'విక్రమార్క చరిత్రము' తెలుగునాట   విస్తారంగా ప్రచారంలొకి వచ్చినప్పటి బట్టి విక్రమసేనుడు విక్రమార్కుడుగా మారిపోయాడని వినికిడి. తెలుగులో వెన్నలకంటి అన్నమయ్య  రాసిన  షోడశకుమార చరిత్రములోని మిగతా కథలతో పాటు కొన్ని కథలు ఈ బేతాళ పంచవింశతి నుంచీ ప్రేరణ పొంది రాసినవే అంటారు. చిన్నయసూరి కాలం వరకు సామాన్య పాఠకులు వెన్నెలకంటివారి కావ్యాన్ని ‘బేతాళ పంచవింశతి’గానే పిలుచుకొనేవాళ్లు కూడా! మిక్కిలి మల్లికార్జునుడనే కవీ బేతాళ పంచవింశతి పేరుతో మరో  కావ్యం రాసినట్లు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మూడవ సంపుటి) పేర్కొన్నారు.  కూచిరాజు ఎర్రన సకలనీతి కథావిధానంలో సైతం బేతాళ పంచవింశతి కథలు కొన్ని కనిపిస్తాయి. వెన్నెలకంటి, ఎర్రనల కన్న ముందే పద్మనాయక యుగంలో కవివల్లభటుడూ తన వంతుగా మరో బేతాళ పంచవింశతి పుష్పాన్ని తెలుగు సాహిత్య తోరణానికి జతచేసాడు. పోతరాజు అనే కవి రాసినట్లు  చెప్పుకొనే మరో పది బేతాళ పంచవింశతి  పద్యాలను ఒక అజ్ఞాతసంధాత వెలికితీసినట్లు విదితమవుతోంది.  

ఆలయ నిర్మాణాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన  పద్మనాయకరాజుల నాటి   రేచర్ల గోత్రీకుడు బేతాళరెడ్డిని ప్రస్తుతిస్తూ  చిన్న వీరయ్య అనే కవి సంసృతంలో ఒక లఘుకావ్యం రచిస్తే బంగారు రంగప్ప దానిని ‘బేతాళ చరిత్ర’ పేరుతో ద్విపద  కావ్యంగ  అనువదించాడు.  ఆ  అనువాదం తరచూ బేతాళ కథలుగా పొరపడటం జరుతుతోంది.. ఇదో గమ్మత్తు.. సాహిత్యంలో!

బేతాళ పంచవింశతిలో బేతాళుడు విక్రమసేన మహారాజుకు ప్రతీ రాత్రీ ఒకటి చొప్పున వరుసగా  రెండు డజన్ల కథలు చెపుతాడు. 


తెలివైన పద్మావతి పంపిన మార్మిక  సందేశాలను మంత్రిపుత్రుడు తన బుద్ధికుశలతతో పరిష్కరించి యుక్తియుక్తంగా  ఆమెను తన రాకుమారుడికి జతచేసిన మొదటి కథ నుంచి.. బాలుడి మృత దేహంలోనికి పరకాయప్రవేశం చేసే ముందు రోదనలు, చిందులతో  ఓ ముసలి యోగి చేసిన హంగామా దాకా  ఎక్కడా ఆగకుండా, నడక మందగించకుండా సాగుతుంది బేతాళుడి కథాప్రవాహం.  అనాథలైన  తల్లీ కూతుళ్ళు  విధివశాన ఓ తండ్రి, కొడుకులకు భార్యలవుతారు. ఈ రెండు జంటలకు కలిగిన సంతానం మధ్య సంబంధాలలో సంక్లిష్టత ఏర్పడినప్పుడు ఆ తికమక సంబంధాల సమస్యకు రాజు వద్ద నుండి సబబైన సమాధానం రాదు.  అక్కడికి బేతాళుడి ప్రశ్నలు ఆగిపోయినా ఆ మరునాటి రాత్రి జరిగిన పతాకసన్నివేశాలతో కథాకావ్యం సుఖాంతమవుతుంది, 


నడిమధ్య  కథలలో పునరుజ్జీవితురాలైన మందారవతి, మనుషుల పాప పుణ్యాలను గూర్చి చర్చించే చిలుక.. గోరింక, యజమాని కోసం సకుంటుంబంగా సాహస త్యాగాలకు ఒడిగట్టే భృత్యుడు వీరవరుడు, ఉమ్మడి ప్రజ్ఞల కారణంగా పునరుజ్జీవించిన  సమప్రభను ఎవరు ఏలుకోవాలన్న మీమాంసలో పడిన బ్రాహ్మణ కుమారులు, తలలు.. మొండేలు తారుమారుగా అతికించుకొని తిరిగి బతికిన భర్త.. సోదరులలో ఎవరి పాణి గ్రహించాలో అంతుబట్టక ధర్మసంకటంలో పడ్డ యువతి..  వంటి వింత చిక్కుముడులలో  చిక్కిన పాత్రలు  ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి కొన్ని కథలలో. 

 వివాహమైనా భర్త అనుమతితో  ఇల్లు దాటిన ఇల్లాలు, కాముకుడైనా నిష్కలంకమైన ప్రేమ ప్రదర్శించే   చోరుడు, లోకం ఊహించలేని  దుష్టపాత్రల శిష్టస్వభావాలు విస్తుగొలిపిస్తాయి మరికొన్ని కథలలో! 

సముద్రగర్భ నగరాలు, దివ్యలావణ్యాలతో మెరిసే రాజకుమార్తెలు,  కలువల తాకిడికే దేహం కందే అతి సుకుమారులు, చంద్రకిరణం సోకినా వళ్లు కాలిపోయే   వయ్యారిభామలు, దంపుడు బియ్యం దెబ్బల మోతకే  చేతులు బొబ్బలెక్కే  అబ్బురాండ్రు.. ఊహకైనా అందని చిత్ర విచిత్ర పాత్రలు   ఇంకొన్ని కథలలో!

సుఖలాలసులైన యశఃకేతు వంటి దౌర్భాగ్య మహారాజులు, అమృతం తాగినా విషం మింగినట్లు మరణించే   హరిస్వాములు వంటి దురదృష్ట జాతకులు,  వధ్యశిల ఎక్కిన ముష్కురుని కోరి మరీ వరించి సతీ సహగమనానికి సిధ్ధపడ్డ సుదతీమణులు.. పాఠకులకు ఊపిరి సలుపనీయని విచిత్ర వ్యక్తులు రెప్పకొట్టకుండా చదివిస్తారు  అన్ని కథలూ!

మంత్ర గుళికల మహిమతో  ఇద్దరికి ఇల్లాలైన శశిప్రభ సంకటస్థితి నిజజీవితంలో  మనకే ఎదురైతే కిం కర్తవ్యం?   నాగు రక్షణ కోసం స్వీయ దేహాన్ని  శంఖచూడుడంత సంతోషంగా    గరుత్మంతునికి ఆహారంగా మనం  సమర్పించుకోగలమా? ధర్మం, మోహం మధ్య నలిగే దుర్భర పరిస్థితులు కనక మనకే తటస్తిస్తే ‘సుందరి ఉన్మాదం' కథలోని మహారాజుకు మల్లే సులువుగా మనం ఉసురు తీసుకొంటామా? జీవితమంటే కష్టనష్టాల కలినేతన్న తత్వం తెలిసినప్పటికీ బేతాళ కథల్లో మాదిరి బతుకులో నిజంగానే కష్టాలు ఎదురైతే బేతాళ కథల పాత్రలంత విశుద్ధంగ, విస్పష్టంగ, విచిత్రంగ ప్రవర్తిస్తామా?  అభీష్టవరదాయినీ మంత్రవిద్యను నేర్పే సాధనాక్రమంలో అనూహ్యంగా గురుశిష్యులిద్దరూ  ఆ వింతవిద్యనే  పోగొట్టుకొంటారో  కథలో!  తండ్రి కోసం చేసిన పిండప్రధానంలో  విచిత్రమైన ధర్మసంకటం ఎదుర్కొంటాడో కన్నకొడుకు మరో కథలో! కాసుల కోసం కన్నవాళ్ళు, స్వీయ ప్రాణరక్షణ కోసం మహారాజు ..ఇలా తలా ఒక స్వార్థ ప్రయోజనార్థం  దైవోపహతుడైన ఏడేళ్ళ బాలుణ్ణి బలివ్వడానికి సిధ్ధపడతారు  మరో కథలో! వింటేనే చాలు వెన్నులో వణుకు పుట్టించే  అరుదైన ఘటనలు నిజంగా కంటి ముందే జరుగుతుంటే పాఠకుల మానసిక పరిస్థితుల గతేమిటి? మోహాతిశయంతో ప్రాణాలు విడిచిన స్త్రీని చూసి తట్టుకోలేక  ప్రాణాలు విడుస్తాడా ఎంత ప్రియుడైనా కథల్లో కాకుంటే నిజంగా జీవితంలో? ఇదే అబ్బురమనుకుంటే ఆ భార్య, భార్యాప్రియుల అర్థాంతర మరణ వార్త విని స్వీయప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజిస్తాడు అసలు భర్త మరీ విడ్డూరంగా మరో కథలో!  చచ్చిన సింహానికి జీవం పోసి బతికించి దాని దాడికి బలయి చచ్చిన  మూర్ఖ విద్వాంసుల వంటి వారి మూఢత్వాన్నీ వదలకుండా చెప్పినందుకే బేతాళ కథలు సంస్కృత సాహిత్య రంగాన కథల   ఖజానాగా ప్రసిద్ధికెక్కింది శాశ్వతంగా. భారతీయుల కథాకల్పనా పటిమకు బేతాళ  పంచవింశతిలోని ప్రతీ కథా ఒక విశిష్ట  ఉదాహరణే.

కథలోని విక్రమసేనుడు వాస్తవానికి త్రివిక్రమకసేనుడని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. ఆ త్రివిక్రముడి అభీష్టం మేరకు ‘బేతాళ పంచవింశతి’ శతాబ్దాల కిందటే ప్రపంచవ్యాప్తంగా ‘ప్రశ్న సమాధాన’ ప్రక్రియాపరంగ సాగే కథావిభాగంలో ఉత్తమ శ్రేణి కావ్యంగ  కీర్తి గడించింది. పలు ప్రపంచ భాషలలోకి తర్జుమా కావడమే బేతాళ కథల ప్రఖ్యాతికి గట్టి నిదర్శనం. 

'భేతాళ పంచవింశతి' ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, భేతాళ, పిశాచ, రాక్షసాది దుష్టశక్తుల సంచారం   నిషిద్ధమని భూతం పాఠకులకిచ్చిన అభయం బేతాళ కథలని భారతీయ పురాణాల స్థాయికి పెంచే ప్రయత్నంగా భావించినా  భావించవచ్చునేమో!

 ఆ కథల కమామిషు ఎటు పోయినా  ఇప్పటి సాధారణ తరాలకు మాత్రం కథల బేతాళుడి పరిచయం  ‘చందమామ’ మాసపత్రిక పఠన పుణ్యఫలమే. సాహసాద్భుతాలతో కూడిన  బేతాళ కథల  నిర్మాణం భారతీయుల  కథనకౌశలానికి ఆటపట్టు. ఆ పట్టు ఏ  మాత్రం సడలకుండా   దశాబ్దాల తరబడి  కథలు కల్పించి మరీ  బేతాళుడి నోట చెప్పించి తెలుగుసాహిత్యాన్నీ సుసంపన్నం చేసినందుకు తెలుగువారందరం  'చందమామ' కు సదా మనసారా అభివందనలు తెలుపుకుంటూనే ఉందాం

- కర్లపాలెం హనుమంతరాపు

( తెలుగు వెలుగు మాసపత్రిక  - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం) 

అక్షరంలో చొరబడ్డ వేదనా సాగరం - దేవులపల్లి కృష్ణశాస్త్రి ' ఆంధ్ర ప్రభ - దినపత్రి- సాహితీ పరామర్శ

 


సాహితీ పరామర్మ : 

అక్షరంలో చొరబడ్డ వేదనా సాగరం 

- కర్లపాలెం హనుమంతరావు

( ఆంధ్రప్రభ దినపత్రిక- సాహితీపుట- బుధవారం 1, నవంబరు, 2017 ' ప్రచురితం) 


వర్డ్ స్ వర్త్  , కోల్‌రెడ్జి, బైరన్ , కీట్సు తరహా యురోపియన్ కవులు రొమాంటిసిజంలో గీటురాళ్లతో పోల్చవగ్గ మహానుభావులు. దేవులపల్లి కృష్ణశాస్త్రి  వారి సరసన అధిష్టించే సామర్ధ్యం  భావకవితా వైతాళికుడు.  కృష్ణశాస్త్రి  కవిత రొమాంటీసమ్ సాగరంలో  ఒక అల మాత్రమే . అయినా ఆ అలే మిగతా అలలకు మించి  కృష్ణశాస్త్రి  ఔన్నత్యాన్ని మరింత ఎత్తులకు ఎగరేసింది. 


సంప్రదాయ కవిత్వం తాలాకు వస్తువును భావకవిత్వం ఆశ్రయిస్తుందనే  ఒక భావన కద్దు. . 'నేను' లేకుండా కృష్ణశాస్త్రి కవిత్వం లేదు! భావనాబలంతో కొత్తలోక ద్వారాలని తెరవవచ్చని రొమాంటిస్టులు ప్రకటించక ముందే.. మన పోతన సరస్వతిని 'భావాంబరి

వీధిని శ్రుత విహారిణి ' గా సంబోధించినాడు  భాగవతంలో! మోడూపా

అనే రాక్షసి తలను షెల్లీ 'లవ్లీనెస్ ఆఫ్ టెర్రర్ ' గా అభివర్ణించిన విధంగానే మన తిక్కనే  యుద్ధ భూమిని ఉద్యానవనం... సరోవరం.. అంటూ వర్ణించుకు వచ్చాడు భారతంలో! కాకపోతే ఆ తరహా రొమాంటిసిజమ్ మార్కుకు విభిన్నంగా ఇప్పటి కృష్ణశాస్త్రి భావకవిత్వ రొమాంటిసిజానికి వ్యక్తివాదం, వ్యక్తిస్వేచ్ఛ పునాదులు. 


కృష్ణశాస్త్రి కవిత్వం నిండా ఈ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి . అతని భావకవిత్వం ఆత్మాశ్రయత, స్వేచ్ఛాప్రియత్వం, ప్రకృతి ప్రీతి, ఊహా సౌందర్యం.. వంటి లక్షణాలను పుణికి పుచ్చుకుంది . భావకవితా ధారను ఉధృత  దశకు తీసుకు వెళ్లిన  ఘనత కృష్ణశాస్త్రిది.


కృష్ణశాస్త్రి  గొప్పగా చెప్పుకొనే ' ఏననంత శోకభీకర తిమిర లోకైక  పతిని'. 'జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులు నింతు ' ' నేను ప్రళయ ఝంఝా ప్రభంజన స్వామి' .. వంటి చరణాలు కాజీన జుల్,  వాల్ట్ విట్మన్ కవిత్వాలలో ఎప్పటినుంచో  వినిపిస్తున్నవే! కృష్ణశాస్త్రి  కవిత్వంలో అంతర్వాహినిగా కట్టలు తెంచుకొని మరీ ప్రవహించే శోకరసం. . రొమాంటిసిజంలో రివోల్ట్  తెస్తానన్న చలాన్ని అరుణాచలం  తరిమేస్తే,  కృష్ణశాస్త్రిని  మాత్రం జనం మధ్యనే  ఉంచి భావి రసభావుకుల చేత  జే జే లు కొట్టించి మరిన్ని మంచి రచనలు చేయించింది.


ప్రేమలో ఎన్ని దశలున్నా శాస్త్రిగారిని ఆకర్షించింది మాత్రం విక ర్షణ పార్శ్వం మాత్రమే. బైబిలు సోలోమన్ గీతాలు, భాగవతం భ్రమర గీతాలు, టాగోర్ గీతాంజలి,  వేంకట పార్వతీశ కవుల ఏకాంత సేవ . . తరహా ఆధ్యాత్మిక విడంబనకు  సంబంధించినవి . 

కృష్ణశాస్త్రి రొమాంటిసిజం కవిత్వంలోని 'నేను' - అళ్వారుల పాశురాల్లో కనిపించే నీవు 'లాంటిది.  కృష్ణశాస్త్రి  'ఊర్వశి ' ఊహాలోకంలో మాత్రమే లభ్యమయే ఆకర్షణీయ ప్రేయసి . ఉర్వశి పురాణాలలో  కూడా ఉన్నా ఆ  పాత్ర లక్ష్యాలకు కృష్ణశాస్త్రి  కల్పిత  ఊర్వశికి పొంతన లేదు .


అసలైన రొమాంటిసిజమ్ అంటే అద్భుతమైన అతిలోక విశిష్టతయి  కావ్యవిశేషాలుగా రూపాంతరం చెందడం. ఊహల్లో ప్రతీ దానికీ అనంగీకారం తెలియచేస్తూ దానికి ప్రత్యామ్నాయం ఏమిటో  చెప్పకుండా తప్పించుకు తిరగడం రొమాంటిసిజం ప్రత్యేక లక్షణం అంటారు . ఈ విచిత్రమైన మొండి మనస్తత్వమే భావకవితావాదులను యధార్ధవాదుల నుంచి విడదీసి ప్రత్యేక భ్రమాత్మక వాదులుగానిలబెట్టింది. ఆ తరహా భ్రమాత్మక  ముభావుకుల పరుగు పందెంలో ముందటి బసవరాజు, కొనకళ్లల వంటి వారి కన్నా కృష్ణశాస్త్రిదే ఒక  అడుగు ముందు.  ఆ అడుగుల్ని దాటి ఎవరూ ముందుకు సాగలేక పోవడమే  కృష్ణశాస్త్రి అనితార పనతకు తార్కాణం .


కృష్ణశాస్త్రి మీది  వాద వివాదాలన్నీ  ఓ  మూలన  పెట్టేద్దాం . ప్రస్తుతం కృష్ణశాస్త్రి  రగిలించిన  తెలివిడి  ( Newer Sensibility) కొంత తరచి చూసుకొని  ఆ భావకవితా యుగ  వైతాళికుడిని అభినందించి ముగిద్దాం.


కృష్ణశాస్త్రి గారు తేటి వలపు' అనే ఖండకావ్యంలో  ఏడు ఏడు మాలలను రచించారు. 'కోమల  జల జాత పత్రముల మాటున నేటికి దాగితివో?' అన్న ప్రశ్న ఏడుసార్లూ పల్లవిలాగ మాటి మాటికి  కనిపిస్తుంది . . శతక మకుటం లాగా! స్వేచ్ఛాగానం  రెండో ఖండికలో కూడా కృష్ణశాస్త్రి గారు 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్న పాదాన్ని 38 ద్విపదులలో 8 సార్లు పల్లవిలా గానం చేసారు. ' మాయమయ్యెదను' ఒక మారు ఆదిలో. . మరో మారు చివర్లో!  


భావ కవిత్వ శిల్ప నైపుణ్య ప్రధాన ఆకర్షణ పాటకు దగ్గరగా వెళ్లడమే!  ఆ పంజర వీర విహార విన్యాసం  కృష్ణశాస్త్రి కవితలో వలె అంత సుందర మధురంగా నిర్వహించిన భావకవి తెలుగులో ఇంత వరకూ లేడు. 


1984లో కాన్సర్ కారణంగా స్వర పేటిక తొలగించినా మూగకవిగా కాలం కొనసాగించిన నిత్యసాహిత్య కృషీవలుడు కృష్ణశాస్త్రి. '  మూగవోయిన నా గళమ్మునను కూడ/ నిదురవోయిన సెలయేటి రొదలు గలవు' అంటూనే 1900, ఫిబ్రవరి, 24న ఆ ఎద రొదలు  వినిపించేందుకేనేమో  అఇట్లుగా  గంధర్వలోకం తరలి పోయారు . ' నా నివాసమ్ము తొలుత గంధర్వలోక/ మధుర సుషష్టి' అంటూ ఆ సుమధుర వేదనా భావ గాయకుడే తన పూర్వ జన్మవృత్తాంతం చెప్పుకొన్నాడు! ' ఏను మరణించుచున్నాను, ఇటు నశించు/ నా కొకు చెమ్మగిలిన వయనమ్ము లేదు' అన్న కృష్ణశాస్త్రి నిష్ఠురం అక్షరాలా అబద్ధం. 


' కృష్ణశాస్త్రి  బాధ ప్రపంచానికి బాధ' అంటూ చలం వంటి ప్రాజ్ఞులతో చురకలు  వేయించుకొని మరీ మురుసుకొనేందుకైనా అంతులేని ప్రతిభా వ్యుత్పత్తి సామాగ్రి దండిగా ఉండి తీరాలి. 


పాత శబ్దాలే కృష్ణశాస్త్రి చేతిలో కొత్త పరిమళాలను వెదజల్లాయి. అచ్చమైన తెలుగు మాటలు కూర్పు  మధ్య కమనీయమైన సంస్కృత పదాల పొహళింపు కృష్ణూస్త్రి నుంచే తెలుగు కవి నేర్చుకోవాలి. శాస్త్రిగారి భావం స్మృతులను  'సౌకుమార్య మాధుర్యములకు చరమ సీమలు' గా  ఆధునికాంధ్ర కవిత్వంలోని సంప్రదాయ ప్రయోగాల మీద పరిశోధన చేసిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి  ఉత్తిగా  అయితే శ్లాఘించరు కదా! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఆంధ్రప్రభ దినపత్రిక- సాహితీపుట- బుధవారం 1, నవంబరు, 2017 ' ప్రచురితం) 


Tuesday, December 7, 2021

యుగద్రష్ట గురజాడ - ఆధునిక తెలుగు నాటకం - కె. రవివర్మ సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 





యుగద్రష్ట గురజాడ -  ఆధునిక తెలుగు నాటకం

- కె. రవివర్మ

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


(కేరళనుంచి వెలువడుతున్న హిందీ మాసపత్రిక “సాహిత్య మండర్ పత్రిక" ప్రధాన సంపాదకులు కె. రవివర్మ. తెలుగు సాహిత్యానికి మిత్రులు. ప్రజా సాహితి “గురజాడ కన్యాశుల్కం ప్రదర్శన శతాబ్ది" సంచికను ఆగస్టు 92లో వెలువరిస్తున్నామని వారికి ప్రజాసాహితి తెలియజేస్తో, ఈ నాటకం మళయాళంలోకి అనువాదం జరిగిందా ? అయితే ఓ సరిచయ వ్యాసం హిందీలో రాసి పంపమని కోరింది. మళళంలోకి అనువాదం కాలేదని ప్రజాసాహితికి తెలియజేస్తూ, 'కన్యా శుల్కం' పై హిందీలో పరిచయ వ్యాసం రాసి పంపమని వర్మ ప్రజాసాహితిని కోరారు. 'ప్రజాసాహితి' ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ లెక్చరర్ కృష్ణ గారిచేత వ్యాసం రాయించి పంపించింది. ఆ వ్యాసాన్ని 'సాహిత్య మండల్ పత్రిక' జూలై 1992 సంచికలో ప్రచురిస్తూ, వర్మగారు ఆదే సంచికలో రాసిన సంపాదకీయం “యుగద్రష్టాః ఏక్ తెలుగు నాటక్” కోసం ఈ క్రింద ప్రచురిస్తున్నాము. తెలుగు అనువాదం ప్రజాసాహితి పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం . 


విజయనగరం (ఆంధ్ర) లోని జగన్నాధ విలాసినీ సభ అనేసాంస్కృతిక  సంఘం కేవలం సంస్కృత నాటకాలే ప్రదర్శిస్తూ వచ్చేది. అలాంటిది  అదే సంస్థ ఓ తెలుగు నాటకం ప్రదర్శించి, తెలుగు సాహిత్యంలో, రంగ స్థలంలో ఓ సంచలనం  సృష్టించింది. ఈ నాటకం యధాస్థితివాదులు, సాహిత్య సమాలోచకుల విమర్శకు గురి అయింది. నాటకం పేరు "కన్యాశుల్కం" . 


వివాహం పేరిట యుక్తవయుసు రాని కన్యల్ని, వారి తల్లిదండ్రులకి డబ్బుయిచ్చి  కొనుక్కో వడం. ఈ నాటకం ఇతివృత్తం. ఈ నాటకం ద్వారా  రచయిత గురజాడ వేంకట అప్పారావు తెలుగు త్యంలో శాశ్వత స్థానం పొందారు. 


శ్రీ గురజాడ అప్పారావు విజయనగరం యం. ఆర్. కాలేజీలో ఇంగ్లీషు, సంస్కృత అధ్యాపకులు. అయినప్పటికీ (తెలుగులో) గ్రాంథిక రచనలు చేసే పద్దతికి స్వస్తి చెప్పి, ప్రపథమంగా  తెలుగు నాటకంలో వ్యావహారిక భాషనీ, నుడికారాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల ఈనాడు వారు ఆధునిక తెలుగు సాహిత్యానికి వెలుగుదారి చూపినవారుగా గుర్తింప బడుతున్నారు. 


'కన్యాశుల్కం' ఆధునిక నాటక లక్షణాలని తూ.చ. తప్పకుండా అనుసరించి ఉండక పోవచ్చు. అయినా ఎక్కువ శాతం నిరక్షరాశ్యులు ఉన్న సమాజంలో భావవ్యాప్తికి మాధ్యమంగా నాటక ప్రక్రియని ఎంచుకోవడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. చెప్ప దలచుకున్న విషయానికి హాస్యాన్ని జోడించి ప్రేక్షకుల ముందుంచితే అది తన

లక్ష్యాన్ని తక్షణం  సాధించుకుంటుంది . 'కన్యాశుల్కం' నాటకం రాయడంలో శ్రీ గుర జాడ ఉద్దేశం సాంఘిక దురాచారాల మూలాలను  చీల్చి చండాడటం.


కన్యాశిల్కం 1892 ఆగస్టు 13వ తేదీన తొలిసారిగా రంగస్థలం మీ ద ప్రదర్శింపబడింది. 1897 సం॥రంలో గ్రంథరూపంలో వెలువడింది. నాటకానికి రాసిన 'భూమి'క'లో శ్రీ గురజాడ యిలా అన్నారు. "విజయనగరం మహారాజు గారి ఆదేశం ప్రకారం పదేళ్ళ క్రితం నేను బ్రాహ్మణ శుల్క  వివాహాలను గురించిన కొన్ని వాస్తవాలను పోగుచేశాను. విశాఖపట్నం ప్రాంతంలో గత మూడు ఏళ్ళగా (1880–83) ఇలాంటి వివాహాలు 1034 జరిగాయి.  ఈ సంఖ్య పరిపూర్ణ మయినది కాదు. కారణం– తత్సంబంధిత వ్యక్తులు తమ కన్యల్ని కుల్కం తీసు కొని వివాహం జరిపినట్టుగా అందరూ ఎలా ఒప్పుకుంటారు ?"


“పైన ఉదహరించిన అంకెలను గురించి ఒక ఏడాదిలో సగటున కుల్క వివాహాలు 334 జరిగాయి. 99 మంది అల్ప వయసులో, 44 మంది నాలుగేళ్ళ అమ్మాయిలకీ, 36 మంది మూడేళ్ళ అమ్మాయిలకి, ఆరుగురు రెండేళ్ళ అమ్మాయిలకీ, ఏడాది వయసు ముగ్గురమ్మాయిలకి శుల్కం తీసుకొని పెళ్ళిళ్ళు జరిగాయి. అమ్మా యిలకోసం తీసుకొన్న శుల్కం  350 రూపాయల నుంచి 400 రూపాయల మధ్య ఉంటుంది. యుక్త వయసు రాకుండానే శుల్క వివాహాలు జరిపించే ఈ దుష్ట సాంప్ర దాయం ఎంతవరమా పోయిందంటే గర్భంలో ఉన్న శిశువుకి సయితం శుల్కం తీసుకొని పెళ్ళి ఖాయం చేసుకోవటం దాకా వెళ్ళింది. ఇంతకన్నా అవమానకర మయిన విషయం సమాజానికేం ఉంటుంది ? ఇటువంటి సాంఘిక దురాచారాల

నిర్మూలనకు  సాహిత్యం నడుం కట్టాలి. ఈ నాటక రచనకి ప్రేరణ ఈ భావమే. 


" కుల్కం లేక వెలయిస్తే ముసలి వగ్గులకి సయితం ముక్కుపచ్చలారని బాలికలు లభిస్తున్నారు. కౌమార్యంలోనే వైధవ్యం ప్రాప్తించే వీరి చేత యిళ్ళల్లో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు.”


కేరళలో సంబూద్రీల (కేరళ బ్రాహ్మణులు) మధ్య సయితం బాల్య వివా హాలు పరిపాటి. అయితే అవి శుల్కం యిచ్చికాక, వరకట్నం ఇచ్చి జరిగేవి. బహు భార్యా వివాహాలు కూడా సర్వసాధారణ విషయం. డబ్బుల అవసరాన్ని బట్టి ఏకన్య తోనయినా వివాహం జరిపించేసేవారు. ఒక్కో పురుషునికి నలుగురేసి భార్యలు . వాళ్ళ మధ్య కీచులాటలు, తగవులాటలు ,అంతఃపుర సవతి  కలహాలు సాధారణం. స్త్రీ లు పరదా  పద్ధతి  పాటించేవారు. పరాయి మగవాని ఎదుటికి వచ్చేవారు కారు. నంబూద్రీ బ్రాహ్మణుల్లో  యింటి పెద్ద కొడుకు మాత్రమే నంబూద్రీ కన్యలనే వివాహం చేసుకునేవాడు. అందువల్ల కన్యాధారంనుంచి విముక్తి కోసం ఆమె తల్లిదండ్రులు ఎంత వరకట్నమయినా సమర్పించుకొని, కాటికి కాళ్ళు సాచుకొన్న నంబూద్రీ వృద్ధునికి  సయితం తమ కన్యల్ని కట్టబెట్టేవారు. 


ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా 1930వ దశకంలో నంబూద్రీ యువకులు పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టారు. తెలుగులో 'కన్యాశుల్కం'లా, (మళయాళంలో సయితం) నాటకాలు రాసి ప్రదర్శించేవారు. నవలలూ, కథలూ రాసే వారు. ఈ ఉద్యమం విజయవంతమయింది. సాహిత్యానికి ఉన్న శక్తి ఏమిటో, సంఘసంస్కరణకి సాహిత్యం ఎంతలా దోహద పడగలదో ఋజువయింది.


గిరిజనులలో సయితం ఓలి యిచ్చి కన్యల్ని కొనుక్కొనే ఆచారం ఉందని అంటారు. అయితే చిన్న వయసుగల బాలికల్ని కాదు. వయసు వచ్చిన యువతీ యువకులు పరస్పరం యిష్ట వడ్డ తర్వాతనే గిరిజనులలో వివాహాలు జరుగుతాయి. అంతేగాని 'కన్యాశుల్కం' నాటకంలోలాగ ముక్కుపచ్చలారని పసికందులతో క్రూరంగా చెలగాటం ఆడుకోవటంకాదు.


—అనువాదం : నిర్మలానంద

( ప్రజాసాహితి - జనవరి 1993 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


 

ఎమర్జెన్సీలో వచ్చిన తెలుగు లొంగుబాటు కవిత్వం

 


6:28 PM

 

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

 

పేరుకే ప్రజాస్వామ్యం. దానికి కష్ట మొచ్చినప్పుడు మన తెలుగు కవులు నిర్వహించిన పాత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది. లబ్దప్రతిష్ఠులు ఎందరో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితికి వత్తాసుగా కవిత్వం రాయడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమ్ముడుపోయిన కవులలలో శ్రీ శ్రీ గురించి అందరం చెప్పుకుంటుంటాం. ఆయనకు తోడుగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినార్, ప్రభుత్వ కవి దాశరథి, జె,బాపురెడ్డి, భీమన్న, దివాకర్ల, పరిమళా సోమేశ్వర్, ముని సుందరం, పి.ఎస్. ఆర్. ఆంజనేయ శాస్త్రి, గుత్తికొంద సుబ్బారావు, విహారి&శాలివాహన, జ్యోతిర్మయి, లసూరా, భద్రిరాజులు గట్రా.

జనం శ్రమ నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సొమ్మును సర్కారిచ్చే సంబావనల కింద పుచ్చుకుని పేదల గురించి కన్నీళ్లు పెట్టుకున్న కవులు కొందరైతే, ఇవాళుండి రేపు పోయే ప్రాణానికి భయపడి కలాన్ని కదిలించిన ఉద్యమకవులు ఇంకొందరు. అలవాటుగా ప్రభుత్వం ఏది  చేసినా తప్పెట్టలు కొట్టే  పాంప్లెట్ కవులను గురించి పెద్దగా చెప్పుకొనవలసిన అవసరం లేదు. కానీ అప్పటి వరకు తమ భావజాలమని సగర్వంగా ప్రకటించుకున్న ఉద్దేశాలకు పూర్తి విరుద్ధంగా ప్రసిద్ధ కవులు రాసిన కవితలే అబ్బురం కలిగిస్తాయి.

 

దేశీయులలో తనకు కలిగిన అప్రతిష్ట సంపూర్ణంగా తెలిసున్న ఇందిర కొత్త పంథాలో కొద్ది మంది మేధావులకు ఇన్ని రొట్టె ముక్కలు విసిరి పోగుచేసుకున్న ప్రగల్భాల కవిత్వాన్ని పాకెట్స్ రూపంలో విదేశాలలో పంచి ప్రపంచం దృష్టిలో తానో విప్లవ పాలకురాలిగా ముద్ర వేయించుకునే ప్రయత్నం అప్రతిహతంగా సాగింది. 'ఇందిరే ఇండియా.. ఇండియానే ఇందిర' అనే భావన బలంగా ముద్రపడే దిశగా అంతఃపుర తైనాతీలు చేపట్టని నికృష్ట చర్యలు లేవు. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రతిస్పందన గురించి ఇంత చిన్న వ్యాసంలో వివరంగా చర్చించుకోడం కుదరదు. కానీ తెలుగు గడ్డ వరకు కవులు ప్రజావ్యతిరేకతకు స్వార్థబుద్ధితో చేసిన కొంత లాలూచీ చీదర కవిత్వం గురించి రేఖామాత్రంగా చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

 

కొంత మంది తెలుగు కవుల  కవిత్వం ఏ విధంగా సాగిందో ఓసారి తిలకించి తరిస్తారనే ఈ చిన్న వ్యాసం.

వీర నారి మన ఇందిర

విజయ శంఖ మూదిందిరా!

ప్రజాస్వామ్యమును పడద్రోసే

వారిని అణచి వేసిందిరా!

  • అనే పదాలతో గవర్నమెంట్ కవి దాశరధి తొలి శంఖం పూరించారు. ప్రజాస్వామ్యాన్ని పడద్రోసిందెవరు? ఇందిరాగాంధీనా, జయప్రకాశ్ నారాయణా, మొరార్జీయా, అటల్ బిహారీ వాజ్ పేయీనా? నిజాం రాజు బూజు దులిపిన ఉద్యమంలో ఘనమైన పాత్ర వహించినట్లు చెప్పుకునే దాశరథి కే తెలియాల్సుంది.
  • 'ప్రగతి శక్తుల బలం పెరిగింది నేడు

విషమ శక్తుల నడుం విరిగింది నేడు'

తన పేరుకు ముందు జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత అని ట్యాగ్ లైన్ తాగిలించుకోనిదే తోచని కవి సి. నారాయణరెడ్డిగారి స్త్రోత్ర గానం ఇది.

'పూర్వదిక్కున పూర్వ పుణ్యమే దిక్కుగా

హృదయేందిరదె వెలసె, హృదయ మ!' అని బోయి భీమన్నగారు ఉద్బోధన సాగిస్తే ..

దివాకర్లవారు సైతం తన వంతు పంచరత్నాలతో నియంత  ఇందిరమ్మకు మరింత శొభను చేకూర్చే  అలంకారాలు సమకూర్చి  ధన్యులయారు.

 పెద్దలే ఈ మాదిరి తమ దద్దమ్మతనం నిర్బీతిగా ప్రకటించుకున్న సందర్భంలో అసలు సిసలు గవర్నమెంట్ పాంప్లెట్ జె. బాపురెడ్డి అధికారంలో ఉన్నవారిని అన్ని విధాలా ప్రస్తూతిస్తూ కవిత్వం రాయడంలో అబ్బురమేముంది.  

ఆయనగారి కవిత్వం ఎలా సాగిందో జస్ట్ మచ్చుక్కిః

'అరాచకత్వ వర్షం వెలిసింది

అలజడుల బురద బెడద తగ్గింది

ఇరవై రంగుల ఇంద్రధనుస్సు

ఈ దేశాన్ని పాలిస్తున్నది'

ఇందిరమ్మ ఇరవై సుత్రాల పథకం ఇరవై రంగుల ఇంద్రధనుస్సు లా తోచింది కవిగారికి.

పరీక్ష సమయం వచ్చింది

విజృభించింది ఇందిరా ప్రియదర్శిని'

అంటూ పరిమళా సోమేశ్వర్ గారు మరో తప్పెట పుచ్చుకున్నారు అప్పట్లో.

 ముని సుందరం అనే మరో కవిమహాశయులకు ఈ మాత్రం నాజూకుతనం కూడా నచ్చింది కాదు ప్రగతి శీల శక్తుల పట్ల ఆయనకున్న కక్షనంత ఆక్షరాలలో కూర్చి మరీ 'పత్రికల్ని, ప్రజా వ్యతిరేకుల్ని బుట్టలో బంధించిన యీ దినం - నీకూ నాకూ పర్వం' అంటు అత్యవసర కాలపు అఘాయిత్యాలను సూటిగా ఎదుర్కొన్న పత్రికలను, ప్రజలను తిట్టిపొసేశారు. అతనికి చరిత్ర చెప్పిందట సామాన్యులు కోరేది హక్కులు కానే కాదుట!

'బ్రేకుల్లేని బ్రెయిన్లతో జాతి జీవనాన్ని

కలుషితం చేస్తున్న కడు పెద్ద మనుషులు..

అందుకే ఈ అత్యవర పరిస్థితి '

అంటూ ఇంత 'కూడూ-గుడ్డా-గూడా' సంపాదించుకుని తరించాడు.  సరసుడు- పాపం -ఆధునికుడు.

పి.ఎస్. ఆర్. శాస్త్రి కైతే 'ఇదే ఇదే శాసనాసి - పాపం, శమించుగాక!

ఇక గుత్తికొండ సుబ్బారావు, విహారి & శాలివాహన & కో, జ్యోతిర్మయి, లసూనా, భద్రిరాజులు  ఈ దారిలో సాగిపోయిన 'బాటసారులు' .

ఇక్కడ పేర్కొన్నది కొద్ది మంది మాత్రమే. ప్రసిద్ధులు, కాస్తో, కుస్తో పది మంది దృష్టిని ఆకర్షించే ప్రబుద్ధిజీవులు కనక.

ఈ బాణీలో సాగిన కవుల కవాతు వినిపిస్తూ పోతున్న కొద్దీ  ఈ చిన్ని వ్యాసం లక్ష్యం పలచబడుతుందన్న  దిగులుతో ఇటీవలి కాలంలో ఈ తరహా లొంగుబాటు ప్రదర్శించిన మరో దివంగత  ప్రఖ్యాత ప్రజాగాయకుని వైఖరిని నిరసిస్తూ నేను  రాసుకున్న నిరసన కవిత ప్రస్తావన అసందర్భం కాదనుకుంటా!

 

 

 

"పాట రద్దయి పోదు!"

(ప్రజాకళ-జూలై-2012 సంచికలోని నా కవిత)

 

కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఎంత దయనీయం!

ఇలాంటి విషాద ఘడియ ఒకటి వచ్చి పడుతుందని ఊహించనే లేదు .

భ్రాంతి దిగ్ భ్రాంతి గా మారిన దురదృష్టపు క్షణాలివి.

 

వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని చిలుక

కొండచిలువతో కలిసి బృందగానం ఆలపించటం కన్నా విషాదం మరేముంటుంది ?

కత్తి అంచున నిలబడి గొంతెత్తి పాడుతూ ఆడి పాడిన ఆ పాట నిజామా?

కొత్త నేస్తం తో చెట్టపట్టాల్ పట్టి చిందులేసే ఈ పాట నిజామా?

నిప్పుకుండను పుక్కిట పట్టిన ఆ పాటేనా

బజారులో రెండు రూపాయలకమ్మే నీటి పాకెట్లా ఇలా కలుషితమయిపోయిందీ!నీ పాట తాకట్టు కొట్టువాకిట్లో తచ్చాడుతున్నప్పుడే నాకు స్పృహ వచ్చి వుండవలసింది

కలల్ని మింగి హరయించుకోవటం కష్టమని నీ కిప్పుడనిపించిందా!

మరి నీ రాగాన్ని భుజాన మోసుకు తిరుగుతున్న వాడి గతేమిటి పాటగాడా!

దగా, మోసమని నడి బజారులో వాడు నిన్నలా నిలదీస్తోంటే

నీ గురించి కాదు గాని

నిన్ను నమ్ముకున్న పాటను గూర్చి జాలేస్తుంది.

జనం భుజాలమీద మోసుకునే పదాలను నువ్వలా రాజు పాదాల ముందు పరచావు

పాట పరుసవేది స్పర్స అంటకముందు నీవూ ఆ జనం మనిషివేనని మరిచావు

ఏ బలహీన క్షణాలలో రుద్రుడు కాముడి మాయలో పడి ఓడిపోయాడో

ఆ మాయదారి క్షణాలే మళ్ళి నీ పాటకూ దాపురించాయని సరిపెట్టు కోమంటావా?

వేళ్ళు నరికినా తలను తెంపినా

నీ పాటనే మొండిగా పాడుకొనే మొండెం నిన్నిప్పుడు అడుగుతుంది మిత్రమా!

బదులు చెప్పు!

కవాతుకు ఒక పాట తగ్గింది ..అంతేగా !

వేల గీతాలు ఈ అపస్వరాన్న్నితొక్కుకుంటూ వెళ్ళిపోతాయి

పాట ఆగితే ఆట ఆగదు

ఇది దొరలు గడీలో ఆడుకునే కుర్చీలాట కాదుగా !

సుడిగాలినెదుర్కునేదే అసలయిన పాట

నెత్తురు గడ్డ మీద పూచిన పూవు అంత తొందరగా వాడిపోదులే!

పాట మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా

అడుగునున్న తడి మాత్రం ఏ అమ్మకానికీ కుదరదు.

నాలిక మెలికలు తిరిగినంత తేలికగా పాట ఆత్మ మడత పడదు.

నువ్విలా చివరి అంకపు స్త్రోత్ర పాఠపు సర్వేజనా సుఖినో భవన్తులాగా

ఎంత జీరబోయినా

పాట రద్దయి పోదు

రద్దయేది పాటగాడిగా నువ్వు మాత్రమే మిత్రమా !

-కర్లపాలెం హనుమంత రావు

***

(జనవిజయం పేరుతో శ్రీ సదాశివరావు వెలువరించిన చిన్ని పొత్తం లోని ("కవులంటే"- వ్యాసం ఆధారం పు. 277 -287)

 

 

 

 

Friday, October 1, 2021

పచ్చ నాకుల రాణి వాసపు కవిత కృష్ణశాస్త్రిది - కర్లపాలెం హనుమంతరావు



కృష్ణశాస్త్రి కవిత్వం పై శ్రీ శ్రీ స్పందన - 'ఆస్వాదానికి ఆహ్వనం' శీర్షికతో ' అమృత వీణ'  ముందుపుటల్లో కనిపిస్తుంది.

సముద్రం ఎక్కడ ఉందో తెలీదు. కాని కృష్ణశాస్త్రి సృజించిన ఇక్షురస సముద్రం మాత్రం పురాణాల్లో వర్ణితమయిన క్షీరసాగరానికి వెదుకులాడే అగత్యాన్ని తప్పించింది- అంటాడు అందులో శ్రీ శ్రీ . నిజమా? చూద్దాం!

'వేయ బోవని తలుపు తీయమని పిలుపు /

రాధ కెందుకొ నవ్వు గొలుపు /

నీలోన నాలోన నిదురపోయే వలపు /

మేలుకుంటే లేదు  తలుపు'

 ఇది కృష్ణశాస్త్రి 'కృష్ణాష్టమి' కవితా ఖండికలోని కొన్ని  పంక్తులు. ఖండిక మొత్తం చదివితే శ్రీ శ్రీ ఒలకపోసిన అతిశయోలంకారంలో అతిశయం ఆవగింజంతయినా లేదనే అనిపిస్తుంది. 

 కృష్ణశాస్త్రి కవిత్వంలో  కనిపించే రసం మధురంగా ఉంటుందనేది  సర్వే సర్వత్రా వెల్లడయ్యే భావనే. కాని శ్రీ శ్రీ మరో మెట్టు పైకెళ్లి   మాధుర్యం అంటేనే  అసలు  నిర్వచనం  అనిర్వచనీయమైన   కృష్ణశాస్త్రి కవిత్వం'  అనే భావన వెల్లడిస్తాడు.

'అంతరాంతము నీ అమృత వీణే యైన /

మాట కీర్తన మౌను! /

ఈ అనంత పథాన  /

ఏ చోటి కా చోటు నీ ఆలయ్యమ్మగును, నీ ఓలగ మ్మౌను '

 'అమృత వీణ' ఆలపించే ఈ పంచమరాగం కర్ణపుటాలకంత కమ్మని  విందు చేస్తుంటే అవకాశం లభించినప్పుడు  ఎవరిమైనా శ్రీ శ్రీ మాటకు  వంత పాడక ఉండగలమా! 

'తినగ తినగ వేము తియ్యగ నుండు'. కాని, ఇక్షురసానికి ఆ స్వాదు గుణం లేదు. అదే పనిగా సేవించడానికి పూనుకుంటే రెండు లోటాల పరిమితి దాటితే చెరుకు రసపు తీపైనా వెగటనిపిస్తుంది. కృష్ణశాస్త్రి తన ఇక్షురస కవిత్వానికి ఆ అతిపాన దోషం అంటకూడదు అనుకున్నాడేమో! మిరియాల పొడివంటి ఘాటు ప్రయోగాలు, కరక్కాయల కటువు  తలపించే భాషా ప్రయోగాలు అక్కడా ఇక్కడా చేసి మరీ మహాకవి మాట నిలబెట్టాడు.

'పూజ కంటే వస్తిని, ఏ/

మోజు లేని 'చిన్నవిరిని' /

ప్రభువు కొలువున దాసిని శ్రీ/

పదములకు 'తివాసిని'

'పూల జాతర' అనే కృష్ణశాస్త్రి మధుర పాతరలో  ఇక్కడ కోట్స్ రూపంలో కనిపించే పదప్రయోగాలు, భాషలో .. భావంలో  ఘాటుగానో, కటువుగానో  ఉండటం గమనించాలి. కాకపోతే శాస్త్రిగారి  కలం, గళం నుండి ఎన్నడో గాని ఈ మాదిరి వగరు కాయల వరుసలు కురిసింది లేదు. అదృష్టం. చందమామకైనా చిన్న మచ్చ ఉంటేనే కదా అందం చందం! 

శ్రీ శ్రీ మరో చోట అంటాడూ .. 19వ శతాబ్ది తొలి దశాబ్ది వరకు జిమీందారీ వ్యవస్థకు మాత్రమే ' గొడ్డు'  చాకిరీ   చేసిన  తెలుగు కవిత, కృష్ణశాస్త్రి  పూర్వీకులు రాయప్రోలు, అబ్బూరి వంటి అభ్యుదయ కవుల రాకతో  బంధ విముక్త అయింది. అనంతరం కృష్ణశాస్త్రి తరం నుంచి భావకవిత్వం పేరు మీద యువతరాన్ని ఉర్రూతలూగించిందని. ఏ రసపట్టు కనికట్టు లేకపోతే ఎంత నూత్నమైనదైనా అటు బళ్లారి  నుంచి ఇటు బరంపురం వరకు భావకవిత ఊరికే ఊరేగగలుగుతుందా ?

'ఎడబాసి పోకోయి /

 నీ దాసి నీ రేయి /

ఈ ఎదకు నిముసమే/

నెడబాటు విసమే ' అంటూ ఆ 'జులపాల జుట్టు కట్టుతో సహా భావికవికి ఓ ఆహార్యమంటూ గళసీమకు వేళాడు హార్మోనియంతో తన కంటూ  'ట్రెండు' నొకటి సృష్టించుకోగలడు కృష్ణశాస్త్రి! భావకవిగా కవిలోకాన్ని ప్రభావితం చేసిన  అతగాని ప్రతిభా పాటవాలకు జతకాని  మధుర స్వారస్య సారస్వత వచనాలు   మచ్చుకకు మాత్రమే ఎక్కడో ఒకటీ.. అరా .. అక్కడా.. ఇక్కడా!ఈనాటికీ చెక్కుచెదరని  కృష్ణపక్షం  ఒక్కటి  చాలు భావకవి వైతాళికునిగా కృష్ణశాస్త్రి సాధించిన అర్హతలన్నిటి పైనా ఆమోదా ఆముద్ర ప్రమోదపూర్వకంగా పడేటందుకు.

కాకపోతే ప్రతిభావంతులైన ఏ వైతాళికగణ విజయ యాత్రలకయినా ఆదిలో హంసపాదులా ఆరంభంలో ఆటంకాలు తప్పవు. ఆ రివాజు తప్పకూడదని కాబోలు, ఆ కాలం నాటి మహాపండితుడొకాయన  అక్కిరాజు ఉమాకాన్తమ్ కేవలం కృష్ణశాస్త్రిని వెక్కిరించటానికేనా అన్నట్లు 'నేటి కాలపు కవిత్వం' పేరున ఓ దిక్కుమాలిన గ్రంథం వెలువరించింది.   తెలుగు ఉమాకాంతాన్ని సంస్కృత ఉమాకాన్తంగా చెప్పుకునే ఆ పండితుడికి సంస్కృతంలో తప్పించి  మరెక్కడా కవిత్వం కనిపించని హ్రస్వదృష్టి కద్దు. నన్నయను సైతం కవుల పద్దు నుంచి కొట్టిపారవేయగల సమర్థుల  వక్రదృష్టికి సమకాలీన కవికోకిల కాకిలా అనిపించక మానుతుందా? 

'పలుక లేను పలుక లేను /

భయము సిగ్గు వొడము దేవ ! /

అలయని దయ నా యందే నిలిపి వదలవోయి దేవ! /

మలిన  మలిన బ్రతు కిది; పలుక లేను నీ నామము' వంటి చిలుక స్వరాలతో రాసి పాడినా నాటి  బ్రహ్మసమాజ ఉద్యమానికి ఊతమిచ్చే వందలాది రసగుళిక పద్యాలు ఎంత హృద్యమయితేనేమి, మడి కట్టుకున్న బధిరాంధ పండితుల చెవులకు దిబ్బెళ్లు  అనిపించవా? 

యువ కవి లోకమంతా ఉత్తమమైనదంటూ సంభావించిన వృక్షరాజపు కొత్త శాఖ భావకవిత. ఆ కొమ్మ నుంచి మొలకెత్తిన మరో కొత్త చివురు చూసి మండిపడే నైజముండే ఏ పండితలోకమైన చిర్రుబుర్రులాడక తప్పదు.వేదుల సత్యనారాయణ వంటి ఎన్నో కవి కోకిలలకు ఆశ్రయమిచ్చిన ఆ నూతన తరుశాఖ మీదనే మొగ్గ పూవైన చందంగా  భావకవి కృష్ణశాస్త్రి అందాల భావలోకం కనులు విప్పార్చింది .  కాబట్టే  'పచ్చ నాకుల రాణి  వాసపు /

పడతినే, సంపెంగనే / 

సరసులను, సామంతులను /

నా స్వాదు  వాసనా పిలుచునే '( పూల జాతర) అని  ఎలుగెత్తి పాడినా  చెల్లించుకోగలిగింది. రస పిపాసువుల హృదయాలకు  అదే కొత్త రాగాల  విందయింది.

'నేటి కాలపు కవిత్వ౦' పుస్తకానికి  కొనసాగింపుగా అనంతపంతుల రంగస్వామి  అనే మరో వెకిలి కవీ 'కృష్ణపక్షం'  పూర్వపక్షంగా 'శుక్లపక్షం' అనే మరో వెక్కిరింత పద్యకావ్యం వెలయించాడు. ఆ రోజుల్లోనే వేదుల  వంటి ఉద్దండ భావకవులు 'సారస్వతారిష్టం అనే శుక్ల నష్టం' గా ఛీత్కరించిన 'శుక్లపక్షం' ఉమాకాన్తమ్ గారి కావ్యం పక్కనే బూజుగూటిలో మగ్గిపోయింది.

'నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?/

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?/

కలవిహంగమ పక్షముల దేలియాడి/

తారకా మణులలో తారనై మెరసి/ 

మాయ మయ్యెదను నా మధురగానమున!' అన్న కృష్ణశాస్త్రి మాటే  అతని భావకవిత సాధికారతను  అచ్చంగా నిజం చేసింది.   

నాటికే కాదు నేటికీ శాస్త్రిగారి భావకవిత్వపు బాణి తెలుగు సాహితీ రాణి పాదాల పారాణి అనడంలో  అందుకే అతిశయోక్తి రవ్వంతైనా లేదు అనేది!

-కర్లపాలెం హనుమంతరావు

01 - 10-2021

బోథెల్ ; యూ ఎస్.ఎ

Saturday, February 27, 2021

కొకుగారి 'అమాయకురాలు కథ చదివిన తరువాత కలిగిన నా స్పందన -కర్లపాలెం హనుమంతరావు



వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద  అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?

భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. 'తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?' అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ.. ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద.. చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. 'నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు.. ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.

భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో..ఏమో.. మరీ పసిది.. ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.

కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ..కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ.. అందరు సంసార స్త్రీలకు మల్లేనే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.'ఊహల్లోనే ఏ సుఖమైనా.. వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు' అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.

భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ. భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు. పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథాప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.

భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు  తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.

ఏదైతేనేమి  భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు  కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి.

అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టెంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.

పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.

బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన 'ఉచ్చిష్టం' ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే  ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.'వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేశా' అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు.

వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక  ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.

 

ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు. ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత.. శాఖాంతరం కాకపోవడం మీద కొంత.. ఎలా ఎవరిమీదో.. వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా.. కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని.. మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియాపరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి.. తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం.. ఆడదై పుట్టడం.. వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.

ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫు నుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు.. కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే.. చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ 'అమాయకురాలు' కథలో కొడవటిగంటి వారు.  నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటే తప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.

ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని.. మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.

ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం..శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా  మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా.. తడిగానే ఉంచుతుంది.

కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు,  వాక్యాలలోని ముళ్ళు.. ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

(అంతర్జాల పత్రిక వాకిలి లొ ప్రచురితం)

Monday, February 15, 2021

జనం మంచి - కథల లక్ష్యం- సాహిత్య వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు




కొన్ని కథలు ఎప్పుడు చదివినా కొత్త పాఠాలు అప్పగిస్తాయి. అ కథలు కథల కార్పొరేట్ విశ్వవిద్యాలయాల నుంచి తర్ఫీదు పొందినవా.. బతుకు వీధి బళ్లల్లో గుంట ఓనామాలు నానా తంటాలు పడి దిద్ది నేర్చుకొచ్చినవా ఇట్టే వాసనపట్టేయచ్చు. మట్టి రంగు కొట్టుకొచ్చిన ఆ కథల వంటి మీద వెంటనే గుర్తుపట్టే యూనీఫారాలేమీ తొడిగుండవు. అయితేనేం,  వానొచ్చినప్పుడు తాటాకు గొడుగేసుకుని, ఎండ ప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నప్పుడు మాడు మీద ఇంత ముసుగేసుకొని అయినా పరామర్శకు రాకుండా ఉండవు. చలి బెబ్బులలకు జడిసే రకం కావు బురద మళ్లను దాటుకుంటూ వచ్చే కథలు! బైట పడేందుకు నీరెండ ఎప్పుడు కాస్తుందా .. కాస్తింత వళ్లు ఆరుబయలు వేడిమికి ఆరబెట్టేసుకుని వీలైనంత తొందరగా మళ్లీ గదుల్లో దూరిపోదామనుకునే రకం కథలను వాకిలి ముంగిట్లోనే ఇట్టే గుర్తుపట్టేయచ్చు సులువుగా. ఏ వెన్నెల కోసమో, గంట కూడా కాకుండానే బైటకెళ్లిన మరే మధుర ప్రియభావుకుడి కోసమో విరహాలు నటిస్తో ఎదురు తెన్నులు చూసే నున్నితమైన కథల దారి వేరు. మొరటు కథలు ఎంత మంచు సోనలనైనా, వరద ఉధృతినైనా, అగ్గి గుండం తాకిడినైనా సరే.. ఆటకోటితనంగా  తట్టుకుని ఏదో ఓ వేషంలో చదువరి కంఫర్ట్ జోనులోకి జొరబడక మానవు.  వెదురు పొదల్లా వేణురాగాలు పలవరించి వలలోకి దింపేసే తరహా  కుట్రలు చెయ్యాలని అసలు ఆ పిచ్చి కథలకు తట్టనే తట్టవు. గిరిజనం సంబరాలొచ్చేదాకా  ఆగుతుందా ఏమిటీ.. దసరా పండగలకు మాత్రమే సరదాగా కోలాటాలాడుకునే ఖర్మ మాయామర్మమేమీ ఎరుగని అమాయక కథల కేమిటికి? చీమొచ్చి కుట్టినప్పుడు చివుక్కుమని ఎట్లా అనిపిస్తుందో.. చింత చెట్టు చిటారు కొమ్మ మీంచి పండు చేతి కందే లోపే కాల్జారి కిందపడ్డా అట్లాగే అనిపిస్తోందా కథలకు. ప్రకృతి కొట్టే మొట్టికాయల కెప్పుడూ జడిసింది లేదు కానీ.. ఇదిగో ఈ మానవ మృగంగాడె గాడెక్కువై వంటికి చేసే గాయానికి మరో మందేమీ దొరక్క విలవిలలాడ్డం కథలయి పుట్టిన పాపానికి అక్షరాల గుత్తులు!  చిన్నబళ్లో పెం బెత్తమాడిస్తూ అయ్యోరు సాయిలెన్స్ అన్నప్పుడే మూతి మీద వేసుకున్న వేళ్ల సందుల గుండా కిసకిసలాడడం ఆపుకోడం రాని పిచ్చి కతలకు.. ఎన్నేళ్లు వంటి మీద కొచ్చి  సలపరింఅలు పెడితేనేమి.. కాకీ నిక్కరోళ్ల తోలు బెల్టుల చురుకులకు, లాఠీ కర్రలాడినప్పుడు పిర్రల కయ్యే కమురు దెబ్బలకు వెన్నక్కి తగ్గుతాయనే!  పెద్దలు పనులు చక్కబెట్టుకునే వేళ  పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటయిన్ చెయ్యాలన్న బుద్ధీ జ్ఞానం మప్పాలంటే ముందీ బుద్ధీ జ్ఞానం కరుడు కట్టిన కథలను కాన్వెంటు నరకాలలోకి తోసి ఏం పెట్టి కొడితె దెబ్బ తగులుతుందో కూడా ఆనవాలు  పట్టే వీల్లేని పనిష్మెంటులివ్వడం ఒక్కటే ట్రిక్! కథలు చెప్పడమంటే  పిల్లకాయలాడుకునె ఆటపాటలా? కోతి కొమ్మచ్చులా? అని అడిగే బుర్ర బరబరా గొరుక్కొనేదు భయభక్తులు దండిగా మప్పున్న ఫుల్ వైట్ కాలర్డ్  జనాలకు గానీ..   ఎన్ని ధర్నా చౌకుల బహిష్కరణలైనా అణచలేని ఆందోళనలతో ఏదో దిక్కు కుండా కట్టు దిట్టమైన ఖరీదు కాపలాను ఛేదించైనా తెగించి ముళ్ల కంచెలు కూకొచ్చే రణరంగ సిపాయీ కతల బారులకా!  పిచ్చోళ్లల్లారా! తీరి కూర్చుని కొలతల లెక్కలేసుకుంటూ ఉత్తమత్వాన్ని కొలుచుకుంటూ ఎక్కించే పుస్తకాల బస్తాలకు ఈ కాయా కసరూ కతలు కనరు అనిపించి  చోటివ్వకపోవచ్చును. కథలకు కావాల్సింది చదువుకునే మనిషి బుర్రలోని  అన్కంఫర్ట్ జోనులో  కాస్తింత తన  వేదనాక్షరం ఇరుక్కునైనా సర్దుక్కూర్చునే చోటు. పూల కుండీలల్లో ఖరీదైన ఎరువులేసి ఎండ కన్నెరగక్కుండా  వేళ కిన్ని నీళ్లూ నిప్పులు పోసి  పెంచుకునే బోన్సాయ్ కథల మీద  మోజుంటే ఈ చిట్టడివి ప్రయాణం పెట్టుకోకపోవడమే మేలు!   దుబ్బుగా పెరిగి దారెక్కడికో ముందే తెలీని చీకటి కోనలో పెరిగే  గద్డీ గదాన్ని పలకరిద్దామంటేనే  ఈ తుప్పల్లోకి ఆహ్వానం. 

నిర్వచనాలు చూసుకుని కథలు పుట్టలేదు. పుట్టిన కథలకే నిర్వచనాలు పుట్టుకొచ్చిన నిజం మర్చిపోరాదు.  ఒక్కో మనిషికి, ఒక్కో మనసుకు, ఒక్కో జాతికి, ఒక్కో దెశానికి, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో కులానికి, ఒక్కో ధర్మానికి, ఒక్కో నియమానికి, ఒక్కో నీతి రీతికి, ఒక్కో జాతి తీరుకి, ఒక్కో కాలాని బట్టి, ఒక్కో పెత్తనం అనుసరించి, ఒక్కో గుంపు నడకను బట్టి, ఎన్నైనా కథలు వస్తూనే ఉంటాయి. మనిషి ఉంది, మేధస్సు వికాసం చెందుతున్నంత కాలం కాల్పనిక లోకానికి ఎవరం హద్దులంటూ గీయలేం. గీసినా సఫలం కాలేం. ఈ సత్యం సత్యాన్వేషణకై ప్రస్థానించిన వైతాళికుల ప్రయాణం సగం దారిలోనే నిరోధించే ప్రయాస చేసేన గతకాలపు ప్రగతి నిరోధ శక్తుల వైఫల్య పరంపరలను బట్టే అర్థమవాలి నిజానికి. అయినా, తమ ఒక్క మాట మాత్రమే నిత్యం చెల్లుబాటు కావాలని తుళ్లింతలు పోయిన ఏ దుష్టశక్తికీ శాశ్వత సంస్మరణం లభించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనిపించవు. వక్రీకరించి మలచబడిన మంచితనం ఎంతకాలమని బలంగా వీచే ప్రకృతి సహజ ధర్మానికి ఎదురీది మనగలుగుతుంది? జీవంలోని సానుకూల పదార్థమేదో  ఎవరెంత  పన్నాగాలు పన్నినా మానుషత్వ ప్రగతిని నిరోధించలేని  అసంకల్పిత శక్తిని కల్పిస్తుంది. కవులు, కళాకారులు ఆ మానుషత్వానికి ఏజెంట్లు ఎప్పుడూ! రాముడిని గూర్చిన రాసిన రామాయణానికి ఎవరి ప్రోద్బలమూ అవసరం లేకుండానే దైవత్వం సిద్ధించింది. తామే కొత్త అధినాయకులమంటూ ఎప్పటికప్పుడు రెచ్చిపోయే  రాక్షసత్వ జాతికి ఎప్పుడు సమాజంలో మన్నించే స్థానం దక్కింది కాదు. అయినా రావణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, భస్మాసురుడు, నరకాసురుడు .. రావడాలు ఆగిపోలేదు. వారి కథల కో అంత మంటో వచ్చే దాకా రాముడు, కృష్టుడు, నరసింహుడు. బలరాముడు వంటి కథానాయకుల పుట్టుకల కథలూ అగడమూ   లేదు. కాకపోతే కాగల సత్కార్యం కాస్తింత  ముందుకు లాగేందుకే కళాకారుల సన్మార్గ సూచనలు.. దుర్మార్గ ఆలోచనలను తుంచె ప్రక్రియలు! అందులో ఒక ప్రక్రియ  ‘ కథ’ ! మంచిని ప్రోత్సహించడం, చెడు పొడగడితే ఎండగట్టడం.. అందుకే ఏ కథకైనా కంచికి పోయే ముందు ‘జనం మంచి’  లక్ష్యం కావాల్సుంది. 

- కర్లపాలెం హనుమంతరావు

జనవరి 21, 2021 

- బోథెల్ ; యూఎస్ఎ  

16 - 02 – 2021 

 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...