ఇజ్రాయిల్లో పుచ్చకాయలు బహిష్కరించారు ఒకానొకప్పట్లో. అయినా
ఏ నిందలపాలూ కాలేదు అక్కడి ప్రభుత్వాలు అప్పట్లో. అదే మన ఇండియాలో
అయితేనో? పాలుపోసే
సాంబయ్య చెంబులో
నాలుగు చుక్కల నీళ్లెక్కువ కలిపినా
పాలకులదే ఆ
పాపభారమంతా! ఇండిగో విమానం ‘ఫర్ సేల్ ‘కని
వచ్చినప్పుడు చూసాం గదా ఆ కనీ
వినీ ఎరుగని గోల!
నార్త్ కొరియాలో ‘నో మెక్డొనాల్డ్’ అన్నారింకోసారి.
నారికేళాలతో
సరిపుచ్చుకున్నారే తప్ప నోరెత్తి.. ఒక్క బక్కజీవైనా గద్దించలేదెవర్నీ!
అదే ఇక్కడయితేనా? ఖాళీ మందు గళాసులతో నడిరోడ్ల మీద కొచ్చిపడి చేసే గలాటా
అంతా ఇంతానా!
పాక్షిక మద్యపానమైనా సరే.. సంపూర్ణంగా నిషేధించిందాకా
బీహార్ నితీష్ బాబును
నిద్రపోనిచ్చిందా దేవదాసుల బృందం!
మరీ అంత చుక్క మీద నాలుక పీకితే ఇంచక్కా ఐర్లాండు పోతే సరిట! అక్కడ ఏ
పరీక్ష రాసే నెపంతోనో
హాల్లో చేరగిలబడి బల్ల మీదో కత్తి గుచ్చేస్తే
ఫినిఫ్! ఫ్రీగా పీకల్దాకా ఎన్ని పింటులైనా తాగేసేయచ్చు!
విధ్యార్థులైనా
సరే.. టెస్టులు రాసేటప్పుడు నోట్లో గొట్టాలు గట్రా పెట్టే
టైపు ఆల్కహాల్
టెస్టులు చట్టవిరుద్ధంట అక్కడ!
అంత కన్నా చెత్త చట్టముంది ఓరేగావ్ అని ఓ మరో చిన్న ఊర్లో!
ఎంత వరకు
నిజమో తెలీదు కానీ.. అచ్చోట బళ్లల్లో ఆడపిల్లలు ముచ్చటకైనా అచ్చోసిన
లేగదూడల్లా జుట్టూ జుట్టూ పట్టుకు కొట్టేసుకోడం నేరం. ఆ
తరహా చట్టం మన
దగ్గర సర్దాకోసమైనా పెట్టి చూడండి! టీవీ చర్చల్లో ఒక్క
పురుగైనా
కనిపించదు. చట్టసభల్లో
పోటీకి ఒక్క శాల్తీ అయినా సిద్ధపడుదు.
గ్యారంటీ!
మిన్నెసోటా అనే మరో చోట మగాళ్లు గడ్డాలు గీక్కోడం
నేరం. నెబ్రాస్కా అనే
ఇంకో వింత ప్రాంతంలో
పబ్లిక్ షేవింగులకు చట్టం అడ్డం. మన దగ్గర బాహాటంగా
తలలు తెగతరుక్కుంటున్నా రక్షకదళం ఆ తరహా సిల్లీ గలాటాల జోలికి
ఛస్తే
పోదు.. నరికే శాల్తీ ఏ పెద్దమనిషి తాలూకూ సరుకు కాదని తేలే
వరకు!
థాయ్ లాండులో అండర్ వేర్ లేకుండా అపార్టుమెంటు గ్రౌండులో
కూడా
కనిపించకూడదు.
ఇండియాలో ఆ మాదిరి బండచట్టాలేం పనిచేస్తాయ్? బంజారా,
బూబ్లీ, ఫిల్మ్
నగర్ పరిధులయినా సరే.. నో ప్రాబ్లం! ఎంత జాలీగా
బజార్లల్లో పడి బడితెప్రొటెస్టులు చేసుకుంటే అంత హ్యాపీగా
పాప్యులారిటీ
ప్లస్సయిపోతుంది! పది హిట్ మూవీలల్లో తన్నుకులాడి
చచ్చినా పట్టించుకోని
జనాలు ఒక్క పావుగంట వైరల్ వీడియోతోనే నీరాజనాలు పట్టేస్తారు
వెర్రెత్తిపోయి!
ఇండియన్ పీపుల్ ఎంతో
లక్కీ! ‘ఊటా’ లోలా ఆలి కారూ
గట్రాలు బైటికి తీసి
షికారుకని బైలుదేరితే ఎర్ర పీలికోటి చేతపట్టి మొగుడనేవాడు
ముందు
నడవనక్కర్లేదు.
మిన్నెసోటాలో మరీ సోద్దెం! వంటి మీదొక్క నూలు పోగైనా
లేకుండా కంటి మీదకు
కునుకు రాకూడదు. కాదంటే తెల్లారిసరికల్లా పళ్లు తోముకొనేది
జైలు
ఊచలకవతాలే సుమా!
అన్నట్లు రోజులో రెండోసారి పళ్లుతోమేందుకు ప్రయత్నిస్తే
పోలిసోళ్ళొచ్చి
పట్టుకుపోతారుట
రష్యాలో! ఇదాహో అని మరో వింత ప్రాంతం! ఇదీ
ఎంత వరకు
నిజమో తెలీదు కానీ.. ఇక్కడ తలకు తుండు చుట్టుకుని బైటెక్కడైనా కనిపిస్తే
తక్షణమే శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తు! మరదే మన దేశంలో? తుండు
తుపాకీ గుండు కన్నా
పవర్ ఫుల్! మన నేతాశ్రీలేసే పగటి వేషాలెన్ని
చూస్తున్నాం! గుండు మీద తుండు, మెళ్లో ఓ
ఎర్రటి తువ్వాలూ ఉంటే సరి..
తుక్కుజనాల కష్టసుఖాలల్లో పాలుపంచుకున్నట్లే! తిక్క లెక్క!
ఇటలీది ఇంకో ఇరగబాటుతనం! జుట్టుకు రంగేసుకోడం.. విరగబోసుకు
తిరిగేయడం
అక్కడ మహా విశృంఖలత్వం కింద లెక్క! మరిక్కడో? నోట్లో పళ్లన్నీ రాలిన
పండుకోతి తాతయినా ఓకే! తలకో బెత్తెడు మందాన నల్లరంగు బెత్తి
‘తా తై.. థక్
దిమ్.. తా తై థక్ ధిమ్’ అంటూ రిథమిక్కా ఓ
రెండు స్టెప్పులేసేస్తే సరి!
అభిమాన సందోహాల ఆనంద పారవశ్యాలతో వెండితెరలన్నీ
చిరిగిపోవాలి! నెత్తి మీద
ఏ రంగూ పడనందుకే
కదండీ.. పాపం అంత లావు సీనియర్సయి
ఉండీ ‘అద్వానీజీ
అండ్ కో’ రాజకీయాల్లో మాజీ గుంపులోకెళ్లి పడిందీ!
అంగోలాలో మరో రకం గోల! ఆడజీవిగా పుట్టడం శాపం అక్కడ. అడపా
దడపా అయినా సరే
జీన్స్ డ్రస్సులేసుకోడం నేరం! మన దగ్గరో? నయీం లాంటి బడాచోర్లూ,
వంచకులక్కూడా చోళీ.. లంగాలే తప్పించుకొనే షార్ట్ కట్
రూట్లు. ఆడవేషంలో
అతగాడేసిన వేషాలు పక్క పాకిస్తానులో గానీ అయితేనా.. మడిచి
పొయ్యిలో
పెట్టేస్తారు!
ఫ్లోరిడాలో కోడిపిల్లలు రక్షణ జాతికి చెందిన జీవాలు. తినే
బొచ్చెలో వాటి
బొచ్చింత కనిపించినా చచ్చినట్లు.. మిగతా భోజనమంతా బొక్కలోకెళ్లే
బొక్కేది!
కొలొరాడో పిల్లుల
ఖర్మ! చీకట్లో మ్యావ్ మన్నా
పర్మినెంటుగా వాటి తోకలు
కట్ చేసెయ్యాలన్నది అక్కడి
చట్టం! అదే ఇండియన్ పిల్లులయితేనో? గోడల మీద
చేరడం తరువాయి.. దిగేటంత వరకూ అలకపాన్పు మీది అల్లుడికి మించి
మనుగుడుపులు!
ఇండోనీషియాలో, ఐస్ బెర్గ్ ల్లో కుక్కల్ని వేటాడ్డం, పెంచడం
శిక్షార్హమైన
నేరంట. మన దగ్గర
అందుకు పూర్తిగా విరుద్ధం.
ఆవేశకావేశాల్లో ఏదో కుక్కల
మీదట్లా కాస్తింత ఆక్రోశం వెళ్లనోసినా .. ఎన్నికల
వేళొచ్చే వేళకి
ప్రధానంతటి పై
స్థాయి పెద్దమనిషి కూడా
దేశానిక్కావలి కాసే పెద్ద కుక్క
అవతామెత్తేస్తాడు!
నార్త్ కరోలినాలో రక్తసంబంధీకలు అయినా సరే ‘విత్ ఇన్ లా’ లో ఉంటే ఏ
‘సనో-ఇన్-లా’ నో,,, ‘డాటర్-ఇన్-లా’ నో అయుపోవచ్చు.
సొసైటీకి సైతం నో
అబ్జెక్షన్! 'ఛీఁ పాడూఁ' అంటూ అలా ఫేసులు పెట్టద్దు! గెలిపించిన
పార్టీకే ‘ఛీఁ’ కొట్టేసి మళ్లీ
మరో పార్టీ జెండా పట్టుకొనొచ్చే గో.పీ
లకు ‘ఛీఁర్స్’ కొట్టి మరీ మనం
ఓటేసి గట్టెక్కించేయడంలా ఇక్కడ!
కంప్యూటర్లో ‘సిరి’ని
ససవాలక్ష ప్రశ్నలడుక్కోండి! ఏ మాత్రం ఉడుక్కోదు
ఫ్లోరిడాలో! ఫ్యాక్టో కాదో! ఏదో ఫ్లోలో ఎవరైనా అన్నారో
ఏమో.. తెలీదు
కానీ.. హాస్యానికైనా ’ఫలానా శవం ఏ గదిలో దాగుంద’ని దగుల్భాజీ
ప్రశ్నలు
వేశారనుకోండి! వల్గర్గా మాట్లాడినందుకు ఆనక విచారించాల్సింది కటకటాల
వెనకాల తీరిగ్గా చేరి!
మన దగ్గర నట్టింటి ఆడబిడ్డను ఏ పరువు వంకనో
చిత్రహింసలు పెట్టి చంపినా ఏళ్లకేళ్లు విచారించడాలే తప్ప.. ‘ఫట్ ‘
మని
చర్యలు చేపట్టే చట్టాలేవీ.. చిత్రం కాకపోతే!”
--- --- ---
“అబ్బబ్బ!
ఆపవయ్యా సామీ! అసలే అవతల పెద్దెన్నికలు.. ఆ రవంధాళీతో ఇక్కడ
థణుకులదిరిపోతుంటేనూ.. మధ్యనేంటి నీ సోది! వేళాకోళాలక్కూడా
వేళాపాళాలుంటాయి నాయినా! మరీ అంతలా గిలకాలని చెయ్యి సలపరంగా
ఉందా? మన
దగ్గరే చచ్చుబండ
చట్టాలు సవాలక్ష పడి ఏడుస్తున్నాయ్.. ఏళ్ల తరబడి
బక్కజీవులనదే పనిగా ఏడిపించుకుంటూ! కలేజా ఉంటే వాటి
మీదనయ్యా ముందు నీ
కలం ఝళిపించాల్సిందీ! ఎక్కడో న్యూ జెర్శీ కహానీలు ఇక్కడ
మనకవసరమా..
చెప్పు?
చెప్పులు నేరుగా ముఖాన పడితేనే
దులపరించుకుపోయే దున్నపోతులు మన
నేతలు! అన్యాపదేశంగానే అయినా సరే.. ఇలా ఉపదేశాలకు
తెగబడితే ముందు
అన్యాయమైపోయ్యేది నువ్వే సామీ! నెట్టింట్లో టైం పాసు వరకేరా
పిచ్చోడా
నువ్ చెప్పుకొచ్చే ఈ చెత్త ఊసులన్నీ! ఆ పక్కనెక్కడో ఓ మూల
పడున్నదా
బుల్లి దేశం జపాన్! అక్కడ ఈడొచ్చిన ఆడబిడ్డలు నైన్ టైమ్స్
కి మించి ‘నై’
డేటింగులకు నై అంటే డేంజర్! మొగుడు రాలగొట్టిన పళ్లైనా సరే
.. మళ్లీ
కట్టించుకోవాలంటే ఆ
మొగ్గాడిద పర్మిషనే తప్పనిసరి ‘పెర్మెంటో’లో!
ఆర్కాన్సానా అని మరో దిక్కుమాలిన దేశం. అక్కడా తాళికట్టిన
వెధవ పెళ్లాలను
చిత్తమొచ్చినంత సేపు
చితక్కొట్టుకోవచ్చంట! కానీ ఆ
కోటింగుల కోటా గాని
నెలకోటి దాటిందంటే.. ముందా మొగుడుగాడికే పోలీసోడి బూటుతో సత్కారం! ఒక్క
సెకనుకు మించి ముద్దులాట్టం ‘మైనే’
దేశం చట్టానికి గిట్టదంట! పెళ్లాం
పుట్టిన్రోజు గాని మర్చిపోతే పోలిసోడొచ్చి లాఠీతో
గుర్తుచేస్తాట్ట నమోనా
అనే మరో నరకంలో!
ఇద్గిదిగో.. ఇట్లాంటి చెత్తా చెదారాన్నంతా ఏ నెట్లో
నుంచో కొట్టేసుకొనొచ్చేసి మన చట్టాలను అట్లా పడేసి
వెక్కిరించేస్తున్నావ్ పెద్ద మహా! దేశభక్తి దండు సంగరి మర్చిపోతున్నావ్
మహాశయా! నువ్వే
అదేదో కొత్తగా ఘనకార్యాలన్నీ ఆవిష్కరిస్తున్నట్లు
ఏంటబ్బాయ్ ఆ బడాయ్? మన దగ్గర మాత్రం అంతకన్నా మహా
గొప్ప చట్టాలేమన్నా
అమల్లోఉన్నాయనా నీ ఉద్దేశం? ఈడూ పాడూ చుసుకోకుండా గుళ్లూ గోపురాల
వైపుక్కూడా రావద్దని పెద్దతలలే ఎంతలా రాద్ధాంతాల్ చేస్తున్నాయో..
చుస్తున్నావు గదా! చిన్ని చిన్ని పాపలను పాడుచేసినా ఆ
త్రాష్టులు గానీ
ఈడేరకపోయుంటే ఏ శిక్షకు పాత్రులు కాదంటున్నాయ్ నాయనా మన దగ్గరి అమానుష
చట్టాలు! ఒకటా రెండా? ప్రజాస్వామ్యం పేరు చెప్పి
సన్నజీవాలనలా దశాబ్దాల
బట్టి సలుపుతున్న ఈ మాదిరి సన్నాసి చట్టాలిక్కడ సవాలక్ష!
చెప్పుకుంటూ
పోతే రొప్పురావడమే తప్ప లాభమేంటో చెప్పు! రాజకీయ పార్టీలకొచ్చిపడే
చందాల సొమ్ము మీద ఎవళ్ల నిఘాలు ఉండకూడదంట! అక్రమాలు
విచారణలకూ,
న్యాయమెటుందో తేల్చుకునే వెసులుబాట్లకే గదా రాజ్యాంగపరంగా
మనం అన్నేసి
సంస్థలు గొప్పగా ఏర్పాటుచేసుకుందీ! ఏ ఒక్కటైనా పొరపాటునైనా
పెద్దమనుషులను
టచ్ చేసే చట్టాలు
లా బుక్కులు దాటి ఎప్పుడైనా బైటకొస్తున్నాయా? సాగు
పేరు చెప్పుకుంటే చాలంట..
దొంగాదాయం ఏ దొడ్డిదారి నుంచి వచ్చి పడ్డా
పన్నుశాఖలకా లెక్కల బొక్కలు చెప్పుకొనే పని లేదంట! ఓనామాలైనా ఆనమాలు
పట్టేపాటి తెలివితేటలేమీ అక్కర్లేదు! ఎన్నికల్లో ఏ ఈవియమ్ముల్నో
నమ్ముకొనేపాటి గడుసుదనం వంటబడితే చాలు! ‘ఇదేంట’ని తప్పట్టే
చట్టాలేమన్నా మరి మన మహాప్రజాస్వామ్య్ంలో చాలామణీలో ఉన్నాయా
నాయనా?
జల్లికట్టు, కోడి పందెం బాపతు మూగజీవులనైనా
బలవన్మరణాల నుంచి
కాపాడుకోలేని చట్టాల పర్యవేక్షణలో స్వామీ మనం
బతుకులీడుస్తున్నదీ! తలాక్
లూ, అయోధ్య గుళ్ల చుట్టూతా
ప్రదక్షిణాలు చెయ్యడానికే మన చట్టాలకు ఎక్కడి
టైమూ చాలి చావడంలేదు. పైసా చేత లేని పాపర్ గాడు ఒక్కడైనా
నూటపాతిక
కోట్లమంది ఇండియన్సులో నుండి ప్రాపర్ గా చట్టసభలకెళ్లే
ప్రజాస్వామ్యంలోనే మన మివాళ ఊపిరి పీలుస్తున్నదీ? అవేవో పేర్లు కూడా
నోటికి సరిగ్గా
తిరగని చిట్టి పొట్టి ప్రాంతాలు! సత్యాలో.. అర
సత్యాలో.. ఏవీ నిర్ధారణ కాకుండానే నెట్లో జనాలు పుట్టించే
పుక్కిటిపురాణాలు! వాటితోనా నాయనా నీ కాలక్షేపాలు? జనసంక్షేమం కోరే
చట్టాలను గూర్చి చర్చించుకునే టైమే ఇవ్వకుండా విలువైన ప్రజల ఆలోచనా
సమయాన్నిట్లా చెత్త చట్టాల చుట్టూతా తిప్పడమే నన్నడిగితే
అసలు పెద్ద
నేరం! బక్కోళ్ల దృష్తి వాళ్ల కష్టాలు, కడగళ్ల మీంచి మళ్లించడానికి చేసే
ఎత్తుగలు కదా
ఇవన్నీ! నాగ్గానీ ఈ సారి ఎన్నికల్లో ఏకపక్షంగా చట్టాలు
చేసేపాటి ల్యాండ్ స్లైడ్ మెజార్టీ వస్తేనా! ముందు.. బెయిలు
కూడా దొరకని
వందేళ్ల కఠిన కారాగారశిక్ష వేసే చట్టం తీసుకొచ్చేస్తా ఖాయం!
అంతకన్నా
ముందసలు నీ బోటి బఠానీరాయుళ్లందరి పుఠమార్చేటంద్కు ఈ
పుక్కిటపురాణాలన్నింటినీ ఎలక్షన్ కమీషన్ తరహాలో
ఏక్ దమ్ నిషేధించవతల
పారేస్తా!”
“హ్హా.. హ్హా.. హ్హా!
చైనాలో చదూకునే పిల్లకాయలకు గూగుల్ నిషిద్ధం!
టర్కీ పౌరలందరికీ ట్విట్టరు నిషిద్ధం! ఒమాన్ లో ఆడంగులకు ఫేసుబుక్కూ,
ట్వట్టర్లూ రెండూ నిషిద్ధం. కతార్ లో అమ్మళ్ళకు మేకప్పు
సరుకు నిషిద్ధం.
మోంటానాలో ఆడపిల్లలకు యోగా డ్రస్సులు నిషిద్ధం. రష్యాలో
రోజుకు ఏడు గంటలు
మించి నిద్ర
నిషేద్ధం. కెనడాలో పాతికేళ్ళు లోబడ్డ
బడుద్ధాయిలకు బీరు
గట్రా నిషిద్ధం. ఏ నిషేధ చట్టం ఎక్కడ ఏ మేరకు సవ్యంగా
అమలవుతుందో నా
దగ్గరైతే ఇప్పటికిప్పుడు అంతగాఠ్ఠి సమాచారం లేదుకాని
బాబాయ్.. మన దగ్గర
మాత్రం చట్టాలు ఎంత ఓటిగా ఉన్నాయో.. ఉన్నవి ఎంత మొక్కుబడిగా
చలామణీ
అవుతున్నాయో.. ఉదాహరణలతో సహా సవివరణాత్మకంగా తెలియచేసే బిలియన్ టిబి
డాటా ప్రస్తుతానికి సిద్ధంగా ఉంది. బీ రెడీ! నెట్ ఓపెన్ చేసేస్తున్నా!”
“ఓరి దేవడో.. మా కంఠశోషే తప్ప మీ సోషల్ నెట్ వర్క్ గాసిప్పు
గాళ్లెప్పటికీ ఛస్తే మారర్రో దేవుడోయ్!”
“మైన్ మేటరు ఇంకా నీ ముసలి మైండుకే బోధపడ్డంలేదు పిచ్చి
బాబాయో! ముందటి
సర్కార్లు చేసినవన్నీ ఎట్లాంటి చెత్త చట్టాలో సోషల్ నెట్
వర్కులెంటబడి
చాటుకోబట్టే
ఇప్పటి సర్కార్లకూ ఐదేళ్లపాటు చెత్త చెత్త చట్టాలు
చేసుకొనే ఛాన్సు దక్కింది ముసలి బాబాయో!“
No comments:
Post a Comment