Friday, February 15, 2019

నాగరికత కథానాయకుడు -కర్లపాలెం హనుమంతరావు - కవిత







నాగరికత కథానాయకుడు 
-కర్లపాలెం హనుమంతరావు 


వాన వచ్చిందని ఇంట నక్కడు 
ఎండ మండిందని నీడ చేరడు
వణుకించే  చలికైనా ఎన్నడూ ముణగదీయడు  

పొలం పలక..  హలం బలపం 
కాడెద్దులు సహవాసులు
ప్రకృతి బడిలో రుతువుల గురువులు 
దిద్దబెట్టించిందీ  అక్షరమంటి మంటి సేద్యం 

నాటటం, నారు నీరు చూడటం 
కంచెలు కట్టి కాపాడటం 
పురుగు పుట్రా,  తాలూ తప్పా  ఏరడం 
ఏరువాక నుంచి ఎత్తిపోతల వరకు 
ఏదీ ఏమరక జాతికి పెట్టే పట్టెడు బువ్వ కోసమని 
రేయీ పగలూ
బతుకును ఆసాంతం మీదు కట్టే కృషీవలుడు
అక్షర సేద్యం చేసే ప్రతీ 'కృతీ'వలుడికి  గురుతుల్యుడు    
నిస్వార్థ నిబద్ధ  సామాజిక కవులందరకు 
నిత్యం  ప్రాత: కాలాన స్మరించ దగ్గ 
నాగరికతా కథానాయకుడు!

 -కర్లపాలెం హనుమంతరావు 
14-02-2019
బోథెల్ , యూ.ఎస్. ఏ 

No comments:

Post a Comment

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...