Tuesday, February 12, 2019

అనిల్ కుమార్ 'ఆంకురం' కథానికపై. అభిప్రాయం


http://www.prasthanam.com/node/10
అనిల్‌ప్రసాద్ ' అంకురం ' అధునాతనమైన అంశం చుట్టూతా పాఠకుడిని తిప్పుకొచ్చిన చక్కని కధానిక 


ఎంత ముచ్చటగా ఉందో అచ్చంగా చందమామ కథలాగా! చదువుకున్న  ఆడపిల్ల నిష్కళ. పెళ్లి చేసి అత్తారింటికి పంపాలనే తల్లిదండ్రులు దిగులు పడుతుంటారు. ఊర్లోని రామారావుకి మల్లె కూతురుతో పాటు కొడుకూ ఉండి ఉంటే ఆడపిల్లని అత్తారింటికి పంపించినా ఊళ్లో పేరు నిలిపేటందుకు కొడుకు పనికొచ్చే వాడు - అని వెత చెందుతుంటారు కన్నవారందరిలాగే! నిష్కళ తనకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చదివి ఉద్యోగాలు దొరక్క  ఆటోలు బాడుగకు తిప్పుకునే ఇంజనీరు పట్టభద్రులందరికీ అందివచ్చే యాప్ ను అభివృద్ధి చేయిస్తుంది. స్థానిక యువకుడి చేత . నగరాలలో మాదీరి జిపిఆర్ సిస్టమ్ మండలం మొత్తానికి ఉపయోగపడే వ్యవస్థకు జీవం పోయిస్తుంది. ఊరిలోని పంచాయితీ ప్రాంగణంలోని గ్రంథాలయం స్థలాన్ని కంప్యూటర్ల సాయంతో డిజిటలైజ్ చేయిస్తుంది. బోలేడంత డబ్బు పోసే రిస్కుతో నగరాలకు పోయి చదువుకొనే బాదరబందీ నుంచీ విద్యార్థులకు తిప్పలు తష్పించే ప్రణాళిక ఆచరణలోకి తీసుకువస్తుంది . ఆడపిల్లలు ఎందరికో అందుబాటులోకి వచ్చే ఈ సుఖమైన , సులువైన పథకాన్ని సుసాధ్యం చేసేటందుకు  ప్రేరణ తన కన్నవారికి మగబిడ్డ లేని లోటు మనసును తొలిచేయకుండానట! గ్రామ సీమాలను తన సాంకేతిక పరిజ్ఞానంతో సాయం అందించే యువకుడు తటస్థపడితే అతని చెయ్యి అందుకుని . . అమెరికా , ఆస్ట్రేలియాలంటూ విదేశాల బాట పట్టనన్న  తన సంకల్పం కూడా ప్రకటిస్తుంది. సహజ శైలిలో , అతి శయోక్తులకు పోకుండా, ఆదర్శాల వల్లెవేత లేకుండా నేడు సమాజంలో కనుపడుతున్న ఆకలి ఆరాటాన్ని, అభివృద్ధి పురోగతిని చక్కగా సమన్వ యిస్తూ నాటకీయతకు దూరంగా చక్కని కథను అల్లిన రచయిత అనిల్‌ ప్రసాద్  కచ్చితంగా అభినందనీయుడు! మంచి వికాస లక్షణ సమన్వితమైన కథను అందించినందుక్కూడా ధన్యవాదాలు!

No comments:

Post a Comment

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...