బ్రహ్మపురాణం చెప్పనే చెప్పింది ' యుగాంతం సమీపించే కొద్దీ కవి కాని వాడు ఎవడూ ఉండడని! 'న కశ్చిదకవిర్నామ యుగాంతా సముపస్థితా!' అన్న ప్రవచనానికి అదే అర్థం. పురాణాలూ ఇంతలా భరవాసా ఇచ్చినా ఉబలాటానికి తగ్గట్లు తమ దగ్గర వ్యుత్పత్తి సామాగ్రి లేదని వాపోయే జడపదార్థాలు ఇంకా కొన్ని కవితామ తల్లిపై కత్తి కట్టడానికి సంకోచిస్తున్నాయ్! తెలుగు సాహిత్యం ఈ ద్రోహం పసిగట్టి ఏదో ఓ ప్రతిచర్యకు పూనుకొనే లోగానే మనిషి పుటక ఎత్తిన ప్రతి జీవీ కనీసం రోజుకో పది పుటల మీద అయినా తోచిన అక్షరాలు గిలక్క తప్పదు!
తినగా తినగా వేము తీపి అయినప్పుడు రాయగా రాయగా అక్షరం మాత్రం కవిత్వం కాక ఛస్తుందా? కవులు కావాలన్న జ్వరం ఎంత వేగిరం నిరక్షరాస్యుల వరకూ పాకితే తెలుగు కవితామ తల్లికి అంత తొందరగా చెర విముక్తి!
మొద్దు నిద్రపోయే బుద్ధిమంతులకు ధీమా కలిగించే ముఖ్యమైన ఓ ముక్క బైటకు ఊదాల్నా? శ్రీగిరి మల్లికార్జున స్వామి
అనీ.. ప్రసిద్ధ కవిసత్తములుగా ప్రఖ్యాతి కలిగించుకొన్న పెద్దలు ఒకరు సాంప్రదాయ
సాహిత్యం చండశాసనం చేసే రోజుల్లోనే 'మహాముని(దుష్ట సమాసం),
సోంవారం(భ్రష్ట ప్రయోగం) వంటి ఆనాటి వ్యాకరణ సూత్రాలు ఏ మాత్రం సమ్మతించని పదాల ప్రయోగాలలో తొడగొట్టి మరీ
దూకుడు ప్రదర్శించారు. వారు విరచించిన ‘సోంవార వ్రత మహాత్మ్యం’ లాంటి ఏదో గమ్మత్తైన ఓ కావ్యం బౌండు
బుక్కులో 'అని సూత మహాముని యాద్యుల కెల్ల వినిపించె పసోంవార విత చరిత్ర! (డి.1019)- ఆంటూ ఎంతో సాహసపూరితమైన (అప్పటి రోజుల బట్టి) ముళ్ల డొంకన దూరి మరీ
చూపించారు భావి ఔత్సాహిక కవి సమూహాలకు దారి. అయినా కవిత్వం ఆధునికోత్తర గోడ కూడా దాటేసి దిక్కు తెలియని ఇంకేదో దిశగా
దూసుకుపోతున్నట్లు చెప్పుకునే ఈ దశలో కూడా ఇంకా 'ఆ పదం పొసగలేదు! ఈ పదం ఇమడలేదు.. అబ్బే! ఈ మాదిరి డొంకల్లో పడి ఈడ్చుకుపోడం వల్ల కవిత్వానికి వరగబడే వరహాలు, వజ్రాలేం లేవు' అంటో వినిపించే నసుగుళ్ళ వల్ల కవ్విత్వానికి పెద్ద వరిగేదేంలేదం'టూ పెదాలు విరిచే పదారణాల సమీక్షకులకు బెదురుతూ మునుక్కుని కూర్చోవద్దు! 'పేరు పరుగు పందేలల్లో ' పతకాలే ముఖ్య మనుకునే కాలంలో వెనకెనక్కి వెళ్ళిపోయే
ప్రమాదం కద్దు !
ఇంత చెప్పినా
నిఖార్సైన ఆగ్ మార్క్ కవిత్వం కోసమే మా కసంతా అంటూ భీష్మించుక్కూర్చుంటానంటారా!
మీ ఖర్మం.. ఆ గుంటుపల్లి జగన్నాథకవిగారిలా
'శ్రీరంగ చరిత్రము వి/
స్తారంబుగ నాంధ్ర కావ్య సరణిని జెప్పే /
నేరుపు చాలక చింతిల/
నాతాతరి స్వప్నమున మహాద్భుతలీలన్’ (ఆర్.247) అని కుందుకుంటూ రాయదలుచుకున్న ఆ శ్రీ రంగనాథుని చరిత్రమేదో రాయకుండా రోజూ నిద్రకు ముందు కుమిలి కుంగిపోవడమొక్కటే మిలిగిపోయేది సుమా! మీరు నకలు తీయదలుచుకున్న ఆ కవిల కట్ట మరే అకవి చేతిలో గాని పడిందా.. ఆనక మీ ఇష్టం.. అతగాడే రేప్పొద్దున ఏ సాహిత్య అకాడమీకో, తెలుగు విశ్వవిద్యాలయానికో సంచాలకుడైపోయి మీరు బతికి వుండగా
'మహాకవి' కాదు కదా.. అసలు ‘కవి’ అనే బిరుదు ఛాయలక్కూడా ఛస్తే మిమ్ములను రానివ్వడు గాక రానివ్వడు! బ్రహ్మాండ పురాణం ఘోషించిన ‘సర్వం కవితామయం’ థియరీ కి మీరొక్కళ్ళు మాత్రమే బైట ఉండిపోయేది సుమా!
***
కర్లపాలెం హనుమంతరావు,
25 -12 -2019, బోథెల్
వాషింగ్టన్ రాష్ట్రం, అ.సం.రా
'శ్రీరంగ చరిత్రము వి/
స్తారంబుగ నాంధ్ర కావ్య సరణిని జెప్పే /
నేరుపు చాలక చింతిల/
నాతాతరి స్వప్నమున మహాద్భుతలీలన్’ (ఆర్.247) అని కుందుకుంటూ రాయదలుచుకున్న ఆ శ్రీ రంగనాథుని చరిత్రమేదో రాయకుండా రోజూ నిద్రకు ముందు కుమిలి కుంగిపోవడమొక్కటే మిలిగిపోయేది సుమా! మీరు నకలు తీయదలుచుకున్న ఆ కవిల కట్ట మరే అకవి చేతిలో గాని పడిందా.. ఆనక మీ ఇష్టం.. అతగాడే రేప్పొద్దున ఏ సాహిత్య అకాడమీకో, తెలుగు విశ్వవిద్యాలయానికో సంచాలకుడైపోయి మీరు బతికి వుండగా
'మహాకవి' కాదు కదా.. అసలు ‘కవి’ అనే బిరుదు ఛాయలక్కూడా ఛస్తే మిమ్ములను రానివ్వడు గాక రానివ్వడు! బ్రహ్మాండ పురాణం ఘోషించిన ‘సర్వం కవితామయం’ థియరీ కి మీరొక్కళ్ళు మాత్రమే బైట ఉండిపోయేది సుమా!
***
కర్లపాలెం హనుమంతరావు,
25 -12 -2019, బోథెల్
వాషింగ్టన్ రాష్ట్రం, అ.సం.రా
(సూచనః కవిత్వానికి నింబంధనలు ఉండే విధానానికి నేనూ నూటికి నూరు పాళ్లు వ్యతిరేకమే! కానీ పేలవమైన వాక్యాలను తునకలు తునకలు గా తుంచి దాన్నే కవిత్వం అనుకోమని ఇబ్బంది పెట్టే తమ్ముళ్ల, చెల్లెళ్ళ వత్తిళ్లకూ శుద్ధ వ్యతిరేకం. ఆ దృష్టితోనే పై రైట్-అప్ ను చూస్తే వర్తమాన కవితాలోకం పట్ల నా దృక్పథం కొంత అర్థమవుతుందని వినతి!)
-కర్లపాలెం హనుమంతరావు
24 -12 -2019
No comments:
Post a Comment