శిబి
చక్రవర్తి గొప్ప దాత. దయా గుణం జాస్తి. ఉశీనరుడు అనే మహారాజుకు కుమారుడుగా జన్మించిన ఇతని చరిత్ర
మహాభారతం, రామాయణంలాంటి పురాణాలలో, బుద్ధుల జాతక కథలోసైతం పేర్కొనబడింది.
భృగుతుంగ పర్వతంమీద ఓ సారి పెద్ద ఎత్తున యజ్ఞం చేసాడు శిబి
చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా
సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే
ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడివరకూ వెళ్ళింది. ఆయన చక్రవర్తి
ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు. ఒక పావురంగా మారాడు దేవరాజు.
'రాజా! నన్నొక డేగ తరుముకొంటూ వస్తోంది! రక్షించు!' అని వేడుకొంది. రాజుగారు 'నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను. భయపడకు!' అంటూ
ఆ పావురానికి అభయమిచ్చాడు.

శిబి
ఖిన్నుడవడంచూసి సభలోని విదూషకుడు 'మహారాజా! మీరు అనవసరంగా
వంటినిండా గాయాలు చేసుకొన్నారు.
పావురాయికి సరితూగే సాధనం నా దగ్గర ఉంది' అంటూ అంగీలోనుంచి
ఒక సీసాతీసి అందులోని ద్రవాన్ని మూడొంతులు గొంతులో వంపుకొని నాలుగోవంతు మిగిలిన
సీసాని త్రాసు సిబ్బెలో వేసాడు. ఆప్పటిగ్గాని పావురం సరితూగింది కాదు!
ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమై శిబి అసమాన దానశీలతకు,
విదూషకుడి నిరుమానమైన తెలివితేటలకు సంతసించి కోరిన వరాలిచ్చి
వెళ్ళిపోయారు.
ఇంతకీ
ఆ సీసాలో ఉన్నది ఏమిటి?
పావు..
రమ్!
పావురానికి
సరితూగేది పావు రమ్మేగదా!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఎప్పుడో చదివి రాసిపెట్టుకొన్న నోట్ సునుంచి కొద్ది సొంతపైత్యంతో-సోర్సు నోట్ చేసుకోలేదు.. సారీ!)
No comments:
Post a Comment