Showing posts with label Surya. Show all posts
Showing posts with label Surya. Show all posts

Wednesday, February 2, 2022

బాపూజీనే మళ్లీ బతికిరావాలా?- వ్యాసం సూర్య - 02 - 10-2019 - కర్లపాలెం హనుమంతరావు

బాపూజీనే మళ్లీ బతికిరావాలా?

-కర్లపాలెం హనుమంతరావు

తెలిసీ తిలియకుండా రాజకీయ అవసరాల కోసం ఇటీవల అమెరికన్ అధ్యక్షుడు భారతదేశ ప్రధాని మోదీజీని 'జాతిపితఅంటూ ప్రశంసించాడు. భరతీయుల నిజమైన జాతిపిత మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. శతాబ్దాల బట్టీ  స్వతంత్ర జీవనం కోసం ఆరాట పడి ఎన్నో రాకాలుగా పోరాటాలు చేసిన  భారతీయుల ఆంకాక్షలను అఖరికి  వాస్తవం చేసిన మహాయోధుడు గాంధీజీ. మొదటి సారి నోబెల్ గ్రహీత  ఠాగోర్జీ నోటి నుంచి వినిపించిన వేళా విశేషం.. 'మహాత్మాఅన్న ఆ పిలుపు బాపూజీకి పర్యాయపదంగా స్థిరపడింది! ప్రపంచ నేతల చరిత్రల పరంగా చూస్తే ఇదో అపురూపమైన విచిత్రం.  1869 అక్టోబర్ నాడు గుజరాత్  పోరుబందర్‌లో జన్మించినప్పటి నుంచి  1948 జనవరి 30న హత్యకు గురైన క్షణం వరకు గాంధీజీ జీవితంలోని ప్రతీ ఘట్టంలోనూ ఒక హాలివుడ్ చిత్రం సూపర్ హిట్ ఫార్ములాకి సరితూగే స్థాయి నాటకీయత ఉంది. కాబట్టే అటెన్ బరో 'గాంధీపేరుతో శ్రమించి తీసిన మూవీ అన్నేసి ఆస్కార్ అవార్డుల పంట పండించుకుంది. 

'నా జీవితమే నా సందేశంఅన్న  కర్మయోగి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఆయన నీతి నిజాయితీలతో కూడిన  సత్య నిబద్ధ జీవితం నిజానికి దేశ ప్రజలతో మమేకమై జీవిస్తున్నట్లు  చెప్పుకునే  ప్రజానేతలందరికీ ఆదర్శం కావాలి. క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.   

సత్యాగ్రహం అనగానే ముందుగా నేటి తరానికైనా కళ్ల ముందు కదలాడే మూర్తి  కరెన్సీ నోటు పైన బోసి నవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చే బాపూజీ  ప్రొఫైల్.  సత్యాగ్రహాన్ని మించిన  పదునైన ఆయుధం మరొకటి లేదని  ఓ సందర్భంలో బాపూజీ అంటారు.    ఆయుధం బాపూజీ చేతికి  అందేనాటికే ఆంగ్లంలో 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'  గా ప్రసిద్ధం. హిందూ వలస జాతులకు వత్తాసు వకీలుగా బాపూజీ వెళ్లే నాటికి దక్షిణాఫ్రికాలో   ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా.. తెల్లవాళ్లతో సమానంగా  విలాసవంతమైన బోగీలలో  ప్రయాణించడం నిషిద్ధం. రైలు బోగీ నుంచి కిందకు తోసివేసినప్పుడు సాటి వలస జీవులకు మల్లే   గాంధీజీ కూడా తలొంచుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ ఉండేదే కాదు. తల్లి దండ్రుల ద్వారా అబ్బిన ఆత్మ సమ్మాన బుద్ధి  గాంధీజీని కుదురుగా ఉండనిచ్చింది కాదు. ఈ తరహా వివక్ష రాక్షసి అంతమయ్యే వరకూ పోరాడలన్న సంకల్పం   ఆ సందర్భంలో  గాంధీజీలో పురిగొల్పిన ప్రముఖుడు   రచయిత 'టాల్ స్టాయ్'. ఆ రచయిత వ్యాసంలోని 'సివిల్ డిజ్ ఒబీడియన్స్'   బాపూజీ చేతిలో సత్యాగ్రహ ఆయుధంగా మారి మరింత పదునెక్కింది తదనంతర కాలంలో. ఆనాటికి సూర్యుడు అస్తమించని  సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ సామ్రాజ్యంలో సైతం చీకట్లు కమ్మునేటంత దుమారం సృష్టించింది.  ఆ సత్యాగ్రహాయుధం  ధర్మ సూత్రం గురించి వివరించే సందర్భంలోనే తన పుస్తకంలో ఒక చోట బాపూజీ అంటారూ-         ప్రజాస్వామ్యం అనే అభిలాష  ఇంకెవరో వచ్చి  బలవంతాన రుద్దితే రగిలే స్ఫూర్తి కాదు.  స్వీయ వ్యక్తిత్వం  సంస్కరించుకునే అవసరం స్వయంగా గుర్తించి.. ఆ దిశగా ఆచరణాత్మకమైన కృషి కొనసాగించాలన్న సంకల్పం దృఢంగా అచరణలో పెట్టినప్పుడే కాలక్రమేణా దాని వికాస ఫలాలు అనుభవానికి వచ్చేవిఅని. ప్రస్తుతం కంటి ముందు నడిచే రాజకీయాలలో పదే పదే ప్రజాస్వామ్యం అనే పదం రామకోటికి మించి  మారుమోగుతున్నది. అయినా  ప్రత్యక్షంగా ప్రజల భాగస్వామ్యం నేతి బీరకాయలోని నేయి చందంలా మాత్రమే బులిపిస్తున్నది.  బాపూజీని జాతిపితగా చెప్పుకుంటో  నూట యాభై సంవత్సరాల  ఉత్సవాలు ఘనంగా జరిపించే ఉత్సాహంలో ఉన్న ప్రజా నేతలలో ఏ ఒక్కరికైనా  మరి సత్యాగ్రహ ఆయుధం ప్రయోగించాలనే  ఆలోచన రావడం లేదు! అదే విచారిచదగ్గ  విచిత్రం!

'చెడును నిర్మూలించే లక్ష్యంతో ఆయుధాలు చేపట్టడంలో తనకెప్పుడూ  వ్యతిరేకత లేదని బాపూజీనే స్వయంగా చెప్పుకొచ్చారు కదా చాలా సందర్భాలలో! అయితే ఆ చేపట్టిన ఆయుధం కారణంగా ఏ పక్షమూ రక్తం చిందించరాదు- అన్నదే జాతిపిత అభిమతం.  బొట్టు నెత్తురు నేల రాలకుండా శతాబ్దాల పాటు దేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలకులను నిశ్శబ్దంగా సరిహద్దుల కావలకు నెట్టివేసి మరీ  అహింసా పోరాటం సాగించే పద్ధతులను ప్రపంచానికి ప్రదర్శించి చూపించిన ప్రయోగశీలి మహాత్మా గాంధీ. సుందరాంగుల ముక్కులుముఖాల మీద మోజుతో యుద్ధాలకు తెగబడి వేలాది అమాయకులను బలవంతంగా యుద్ధ రంగాల రొంపిలోకి దింపి అపారమైన ప్రాణఆస్తి నష్టాలు కలిగించడమే యుద్ధాలుగా  చదువుకున్నది ప్రపంచ చరిత్ర అప్పటి వరకు. చేతి కర్రకిర్రు చెప్పులుకొల్లాయి ధోతీబొడ్డు గడియారం,  బోసి నవ్వులనే ఆయుధాలతో కూడా  ఎంతో బలవంతుడైన విరోధిని ప్రేమతో నిరోధించవచ్చు. లాలించి లొంగదీయవచ్చని బాపూజీ ప్రదర్శించిన 'అహింసా పోరాటంచాటి చెప్పే పాఠం. ప్రపంచ చరిత్రలోని ఈ కొత్త సిలబస్  వంట బట్టించుకున్న తరువాతే  మార్టిన్ లూథర్ కింగ్ వంటి పోరాట యోధులు తమ జాతి హక్కులను అహింసాయుతంగా సాధించుకోగలిగింది. ప్రపంచం ముందు తెలెత్తుకుని బాపూజీ సగర్వంగా  నిలబెట్టిన ఆ భారతీయ అహింసా యోధ మూర్తిత్వానికి   ప్రస్తుతం కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు సాగుతున్న హింస రచన   కళంకం తెచ్చెపెట్టే అంశం కాడం బాధాకరం. బతికివుండుంటే బాపూజీని సైతం ఎంతో    కలవరానికి గురిచేసే  అంశమయివుండేది ఖచ్చితంగాఇది.   సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఐక్యరాజ్య సమితి వేదిక  నుంచి అనకాపల్లి సందు వరకు బాపూజీ భజన చేయడం మరిచిపోని మన ప్రజానేతలు మరి ఈ అహింస అనే ఆయుధాన్ని ఎందుకు అశ్వత్థామ వృక్షం ఎక్కించేసినట్లో?! ఆ అయుధం కిందికి దిగడానికి ఇంకా ఎన్ని గో గ్రహణాలు జాతి అనుభవించవలసివుందో?

ఆత్మాభిమానంగౌరవం వేరెవరో వచ్చి పరిరక్షించే శీల సంపదలు కావు కదా! 'చరిత్రలో చిరస్థాయిగా నిలబడాలన్న కాంక్ష ఉంటే  ముందుగా ఆత్మ సమ్మానాన్ని కాపాడుకోవాలిఆన్న బాపూజీ సూక్తి మీద ఆసక్తి గల ప్రజానేతలు ఎంత మంది మిగిలున్నారు ఇప్పుడు?   బి-ఫారం ఇచ్చి,  నిధులిచ్చి,  గెలించేందుకు అహర్నిశలు అంతులేని కృషి చేసిన సొంత పార్టీలకే నామాలు పెట్టేసి అధికారంవ్యాపారం వంటి వ్యక్తిగత లాభాపేక్షల నిమిత్తం గెలిచిన మరు క్షణమే పాలక పార్టీలలోకి దూకే ప్రజాప్రతినిధుల పట్లే  ఎక్కువగా ప్రజలూ ఆకర్షితులవుతున్నారిప్పుడు!అక్టోబరు రెండుకోజనవరి ముఫ్ఫైకో  బాపూజీ గుణగణాలను శ్లాఘిస్తూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తే సరి.. ఓ పనయిపోతుందనే భావనే సర్వే సర్వత్రా. బిర్లా భవన్ ప్రాంగణంలో ప్రాణాలు గాలిలో కలిసే ముందు బాపూజీ 'హే! రామ్!అని ఆక్రోశించినట్లు ఆ సమయంలో  దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. ఆ మహాత్ముడి ఆక్రోశానికి  కేవలం తనపై జరిగిన అఘాయిత్యం ఒక్కటే కారణం కాదేమో భావి భారత దేశ రాజకీయ దివాళాకోరుతునం ముందే ఊహించి 'హే రామ్!అని ఆక్రోశించలేదు కదా మహాత్ముడు?

'ఆచరణ కష్టమని మూలసూత్రాలను విడిచిపెట్టరాదు. ఓర్పుతో అయినా  వాటిని పాటించాలి' అన్నది  నోటి మాటగానే కాదు.. తన జీవితం ద్వారా కూడా  ఆచరించి చూపించిన నిజాయితీ బాపూజీది. మేక పాల పానం నుంచిమద్యపాన నిషేధం  వరకూ ఏ పని పట్లా ఆయనకు నీచభావన లేదు.  నేటి నేతల నోటి మాటలకు భిన్నంగా బాపూజీ  పాయిఖానాల క్షాళన పట్లా హేళన ప్రదర్శించిందిలేదు. ఆయన అడుగు జాడలలోనే తమ నడక సాగుతున్నదని నమ్మబలికే నేతలు ఆచరణ సాధ్యం కావని తెలిసే ఎన్నికలలో ఓట్లు దండుకొనే దురుద్దేశంతో  అసాధ్యమైన హామీలు అనేకం  అమాయకులపై గుప్పిస్తున్నారు.    ప్రజాస్వామ్యం పేరిట సాగే రకరకాల రొటీన్ పేరంటాల పట్ల  ఆఖరికి ప్రజల హక్కుల కోసమని పనిచేస్తున్నామని చెప్పుకునే  స్వచ్ఛంద సంస్థలు సైతం  కిమ్మిన్నాస్తి!    మరో మారు నిజమైన సత్యాగ్రహ సమరంతో దేశం  మారుమోగాలంటే మళ్లీ మహాత్ముడు వస్తే మినహా  సాధ్యం కానంత మందగొడితనం దేశమంతటా దట్టంగా అలుముకుని ఉన్న నేపథ్యంలో బాపూజీ నూట యాభై సంవత్సరాల జన్మదిన సందర్భం తటస్థించింది.   తటపటాయింపులేవీ లేకుండా జాతిపిత  జీవితాన్నే పరమాదర్శంగా తీసుకోక తప్పని దుస్థితి ప్రస్తుతం సమాజం అంతటా నెలకొని ఉంది. ప్రజాక్షేత్రంలోని ప్రతీ వ్యక్తీ   ప్రతి అడుగులోనో మహాత్ముని ప్రవచనాలను  గుర్తుంచుకుని నడిస్తేనే తప్ప  ప్రస్తుతం  దేశం ఎదుర్కొనే గడ్డు సమస్యల నుండి గట్టెక్కే పరిస్థితిలేదు. 

'కంటికి కన్నుసిద్ధాంతంతో  ప్రపంచాన్ని మరంత అంధకారంలోకి నెట్టివేసేందుకు తప్ప సాధించే మరో ప్రయోజనం లేదు. సుదీర్ఘంగా సాగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల విశ్వవ్యాప్తంగా  వాతావరణం ఏమైనా చల్లబడిందాఓటుసత్యాగ్రహం- ఈ రెండూ ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండే  ఆయుధాలు-అంటారు బాపూజీ! వాటి వినియోగాన్ని బట్టే ప్రజల  ఆలనా పాలనా సమర్థంగా సాగేది అని  మొదటి నుంచి గాంధీజీ గట్టి నమ్మిక. ఓటును ఓ కొనుగోలు సరుకుగా మార్చి చేజిక్కించుకోడమే కాదు.. దేశానికి స్వాత్రంత్ర్యం సాధించిపెట్టిన  సత్యాగ్రహ ఆయుదాన్ని సైతం.. ప్రస్తుతం దుష్ట రాజకీయం  ఆడే నాటకంలో ఓ అంకం ప్రాపర్టీగా మార్చివేసిన మాయాజాలం నేటి రాజకీయానిది. పాలకులను అదిలించే ఆయుధాలు రెండూ వట్టి పోవడం దురదృష్టం. బాపూజీ తిరిగి వచ్చినా ఈ పరిస్థితి ఓ పట్టాన చక్కబడేనా  అన్నది అనుమానమే!

భారతావని  వేలాది సంవత్సరాల పాటు పరాయి పాలకులకు ఊడిగం చేయవలసి వచ్చింది. బిడ్డల అంతర్గత కుమ్ములాటలే భరతమ్మ పారతంత్ర్యానికి  మూల కారణంగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు. మళ్లీ కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా మనలో మనం కలహించుకుంటూ   కలసి మెలసి సాధించుకున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తిరిగి పరాయి పంచలపాలుచేసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాంఇటీవల అమెరికన్ అధ్యక్ష మహాశయుడు ట్రంప్ అమెరికాలో హౌడీ-మోడీ కార్యక్రమ సందర్భంగా స్వంత రాజకీయ లబ్ది కోసం చిలకరించిన కాస్తింత  లాలింపు పన్నీరు జల్లులకే మనం  పులకరించిపోవడం బతికి వుంటే బాపూజీని బాధించే అంశం అయివుండేదే!    

స్వాతంత్ర్యం సాధించుకొన్న నలభైల నాటి తరం ఇప్పుడేమంత ఉనికిలో లేదు. పుట్టుకతోనే  ఆయాచితంగా దక్కిన కారణంగా  స్వేచ్ఛాయుత జీవితం ఎంత అమూల్యమైనదో నేటి తరాలకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఇప్పటి కుర్రకారు దృష్టిలో బాపూజీ అంటే కేవలం అటెన్ బరో తీసిన  చిత్రంలో కిన్ బెన్స్ లే వేసిన కథానాయిక పాత్ర. అదీ తెలియని మరీ కుర్ర తరానికి ఆ బోసినవ్వుల తాతయ్యంటే రూపాయి నోట్ల మీద కనిపించే ఓ గ్రాఫిక్ బొమ్మ.

   మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే  కొత్త బంగారు లోకం గురించి స్వప్నించే అర్హత సిద్ధించేదని సిద్ధాంతరీకరించిన  నిత్య చైతన్యశీలి మహాత్మాగాంధీ. కుటీర పరిశ్రమలుగ్రామస్వరాజ్యంస్వదేశీ వస్తు ఉద్యమంనిరాడంబర జీవన శైలిదేశవాళీ వైద్య విధానంస్వచ్ఛంద బ్రహ్మచర్యంరామ్ రహీమ్ లిద్దరినీ సమాన దృష్టితో కొలిచే తీరుబలహీనుల పట్ల అనురాగంస్త్రీల పట్ల ప్రత్యేక గౌరవ ప్రపత్తులుసమాజంలోని అన్ని తరగతులూ సామరస్య భావనతోసహజీవనం కొనసాగించడంనిత్య జీవితానికి అక్కరకొచ్చే ఏ పని పట్లా ఉపేక్ష వహించకపోవడంవృత్తులతో నిమిత్తం లేకుండా అన్ని కులాలనుజాతులను  సోదరవర్గంలో చేర్చుకోవడంముఖ్యంగా దిగువ తరగతుల పట్ల సమాదరణ, స్త్రీల పట్ల సమ్మనభావన, సనాతన ధర్మం పట్ల నిరసన లేని విశాల దృక్పథంతో నవీన సంస్కృతలను మనసారా ఆహ్వానించడంఅన్ని భాషల పట్ల ఒకే తరహా ఆదరణప్రజల పలుకుతో ప్రత్యేక అనుభంధం ఏర్పరుచుకోవడం.. 'సత్యంతో నా ప్రయోగాలుపేరిట బాపూజీ రాసుకున్న 'ఆత్మకథనిండా ఈ తరహా  నిత్య స్వచ్ఛ జీవన శైలికి సంబంధించిన ఎన్నో అంశాలు చదువరులలో ఉత్కంఠ రేకెత్తించే తీరులో ప్రతి పుటలో  కనిపిస్తాయి. తన జీవితంలోని    ఎత్తు పల్లాలనువెలుగు నీడలను  ప్రపంచం ముందు తెరిచిన పుస్తకంలా బాపూజీ పరిచిన తీరు ప్రపంచంలోని మరే ఇతర ప్రముఖ వ్యక్తీ ఊహలో అయినా ప్రదర్శిచలేనంత సాహసపూరితమైనది. బాపూజీ వారసులుగా ప్రజల ముందుకు వచ్చి ప్రజానేతలుగా వ్యవహరించే నేటి నాయకులలో మచ్చుకకైనా ఒక్క మహాత్ముని మంచి లక్షణం కనిపించక పోవడం దేశప్రజలు చేసుకున్న దురదృష్టం. 

రాజకీయాలే కాదు.. సామాజిక జీవన సరళీ బాపూజీ బోధించిన బాట నుంచి క్ర్రమక్రమంగా  దూరంగా జరగడం కలవరం కలిగించే అంశం. 

పాముకాటు శరీరానికి చేసే హానికి కన్నా మద్యపానం ఆత్మకు కలిగించే నష్టం ఎక్కువ-అంటారు బాపూజీ. కనీసం ఆ జాతిపిత మాట మీద గౌరవం చూపించాలన్న సంస్కారం లోపించడం వల్లే గాంధీజీ జయంతివర్ధంతుల రోజులలో కూడా మత్తు పదార్థాల వినియోగాల రేటు తగ్గడం  లేదు! పుస్తక పఠనం కాదు..  మనిషిలోని ఉత్తమ వ్యక్తిత్వాన్ని వెలికితీయడమే అసలైన విద్య  లక్ష్యం- అన్నది బాపూజీకి విద్య మీద ఉన్న అభిప్రాయం.  ఆలోచనఆచరణా క్రమబద్ధంగా లేని పక్షంలో ఎన్ని విద్యలు నేర్చినా ఆ నైపుణ్యమంతా వృథానే కదా! 'మానవతను మించిన మంచి పుస్తకం మరొకటి లేదుఅన్న బాపూజీ సూక్తి చెవిన పెడుతున్నదెవరు విద్య వ్యాపారంగా మూడు పువ్వులు, ఆరు కాయలు పూయించే ఈ కాలంలో? 

'ప్రేమ  అన్నిటి కన్నా అత్యంత శక్తివంతమైనది.    శక్తి ముందు సాక్షాత్ భగవంతుడైనా  చేతులెత్తేయవలసిందే!అని ఉవాచించే బాపూజీ భావనలో ఆధ్యాత్మికత మీద కన్నా ఆత్మీయత వైపే తూగు ఎక్కువ కనిపిస్తుంది.   పెదాలపైన చిరునవ్వులు ధరించకుండా వంటికి ఎన్ని విలువైన దుస్తులు వేలాడదీసినా ఆ అలంకరణ రాణించేది కాదు-అన్నాడు అర్థ నగ్న యోగి బాపూజీ. బ్రిటిష్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ 'హాఫ్ నేకెడ్ పకీర్గా హమేశా ఎద్దేవా చేసిన మహాత్మాగాంధీ ఆ కొల్లాయి ధోతీ బిగించి సబర్మతీ ఆశ్రమం నుంచి కాలు  బైట పెడితే  చాలు.. ఆసేతు హిమాచల పర్యంతం ఆనంద పరవశమై అభిమానంతో చిందులుఉ వేసే పరిస్థితి. ప్రపంచం నలుమూలలకు సుపరిచితుడైన ప్రఖ్యాత హాస్యనటుడు ఛార్లీ చాప్లిన్ సైతం ఒక సందర్భంలో 'తాను గాంధీజీ గ్లామర్ చూసి అసూయ చెందుతున్న'ట్లు ప్రకటించుకున్నాడు.   అన్ని కళల కన్నా జీవితం గొప్ప కళ. సౌజన్యంతో జీవించే వ్యక్తి కన్నా గొప్ప కళాకారుడు లేడని బాపూజీ విశ్వాసం. ఆ లెక్కన చూస్తే మహాత్మా గాంధీ తరువాతే ఎంతటి మెగా హాలివుడ్కథానాయకుడైనా!  

బాపూజీ దృష్టిలో ప్రార్థన   పరమార్థం హృదయ శోధన. అనుభూతికి తప్ప లొంగని ఏ అదృశ్య శక్తి ఆశీస్సులు లేకుండా ఎంత గొప్ప కార్యమైనా సంపూర్ణంగా విజయవంతం కాలేదన్నది గాంధీజీ భావన. ఆ కనిపించని శక్తి మహిమే వెనక ఉండి తనను ఎల్లవేళలా సన్మార్గం నుంచి తూలకుండా కాపాడుతూ వచ్చిందని బాపూజీ తన సందర్శనార్థం వచ్చిన వారితో సందర్భం తటస్థించిన ప్రతీ సారీ చెప్పుకొస్తుండేవారు. 

ఆయా సందర్భాలలో  స్పందించిన తీరును ఒక క్రమ పద్ధతిలో గమనించ గలిగితే బాపూజీ సంపూర్ణ వ్యక్తిత్వంలోని కొంత భాగాన్ని మనం పట్టుకోవచ్చు. కైరా సత్యాగ్రహం పాక్షికంగా మాత్రమే విజయవంతమైన సమయంలో ప్రజల సంతోష సంబరాలను చూసి గాంధీజీ   'సంపూర్ణ విజయ లక్షణాలు లోపించడం  నాకు బాధ కలిగిస్తున్నది' అని బాహాటంగానే తన అసంతృప్తిని  బైటపెడతారు. రిలే నిరాహార దీక్షల వంకతో నాలుగేసి గంటల పాటు  నిరసనల నాటకం  నడిపించేసి లక్ష్యం నేరవేరినట్లు ఆనక  విజయయాత్రలు భారీ ఎత్తున నిర్వహించే  నేటి తరం నాయకులను చూసి మరి బాపూజీ బతికుంటే ఏ విధంగా స్పందిస్తారో!

రౌలత్ చట్టం ఆచరణలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో అశాంతి నెలకొన్నది.   బాపూజీ బోధనలు ఆలకించైనా  జనం కాస్త చల్లబడతారేమో అన్న ఆశతో అక్కడి ప్రాంతీయ నేతలు గాంధీజీని ఢిల్లీ పిలిపించుకుంటారు. జాతినేతగా అప్పటికే బాపూజీకి జనంలో  గొప్ప గుర్తింపే ఉంది. సెక్యూరిటీకి విఘాతంవంకతో  రైలు దిగీ దిగగానే గాంధీజీని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బందితో  'నేనిక్కడకు వచ్చింది శాంతి భద్రతలు తిరిగి సాధించుకోవడం కోసం.  అశాంతి జ్వాలలను మరింత ఎగదోయడం  కోసం కాదుఅంటారు. అకారణంగా కక్షలు రేకెత్తించి ఆ కార్పణ్యాల మధ్య తమ పబ్బం గడుపుకునేందుకు చూసే కుళ్లు రాజకీయాలకే ప్రస్తుతం చెల్లుబాటు. 

 బాపూజీ బోసి నోటితో చేసిన వ్యాఖ్య  జనం మధ్య తిరిగే  ప్రజానేత  బాధ్యత ఎంత సున్నితమైనదో చెప్పకనే చెబుతుంది. సీనియారిటీని ఓ అనర్హతగా ప్రకటించి  పక్కన పెట్టే నేటి రాజకీయాలలో  బోసి నవ్వుల తాతయ్య బోధనలు ఆకాశవాణి సంస్కృతం  వార్తలకు మించి విలువిస్తుందా నేతాగణం? ఎవరిని తమకు ప్రతినిధులుగా ఎన్నుకొనాలోనన్న విషయంలో ఏడు దశాబ్దాలు దాటినా జనావళిలో ఓ స్పష్టత రాకపోవడం రామరాజ్యం గురించి కలలు కన్న బాపూజీకి బాధ కలిగించే అంశం కాదా? 

నాగపూర్ జాతీయ కాంగ్రెస్ మహాసభల వేదిక మీద నుంచి నియంత పోకడల వల్ల పజాస్వామ్యానికి  ఏర్పదే పెను ప్రమాదం గుర్తించమని గాంధీజీ హెచ్చరించారు. 'స్వీయాభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వల్ల   నిజమైన స్వాతంత్ర్యం సాధించుకొనే అర్హత కోల్పోతామన్న ఆ హెచ్చరికకు పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షం పొడే గిట్టనంత అసహనం అధికార పక్షాలలో విశ్వరూపం దాలుస్తున్నది రోజు రోజుకీమహాత్ముడే మళ్లీ ఏ వామనావతారమూర్తిగానో దిగి వచ్చి నియంత బలి మాడును పాతాళానికి అణగదొక్కితే తప్ప సాగే ప్రజాస్వామ్య క్రతువు సలక్షణంగా సంపూర్ణమయే పరిస్థితి కనిపించడంలేదిప్పుడు.  

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ అచ్చెరువొందినట్లు 'ఇటువంటి ఒక వ్యక్తి భూమ్మీద నిజంగానే పుట్టి మన మధ్య సంచరించాడా?' అనే అనుమానం మరింత పెరగక తప్పదు మహాత్ముని జీవితం తరచి చూసే కొద్దీ! బాపూజీ భావనలలోని మన్నికమిగతా నేతలంతా యధాతధంగా వాటిని అనుసరించక తప్పని ఆవశ్యకతను గురించి వక్కాణించే సందర్భంలో మరో హక్కుల నేత మార్టిన లూధర్ కింగ్ చెప్పిన ఒకే ఒక్క ముక్కలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మూర్తిత్వం మొత్తం కళ్ల ముందు కనబడుతుంది. 'కోరుకొన్నదాని కోసం అహింస దారిలో పయత్నించడంఅన్యాయం అని తోచినప్పుడు సాయమందించేందుకునిరాకరించడం యేసు సూచించిన బాట. ఆ బాటలో ఎలా సాగి లక్ష్యం సాధించాలో మొదటి సారి  స్వయంగా నడిచి ప్రపంచానికి చూపించిన ఘనత మహాత్మా గాంధీది.' అన్న నీలిజాతుల హక్కుల నేత మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. 

'కొల్లాయి గట్టితేనేమి.. మా గాంధి కోమటై పుట్టితేనేమిఅని   బసవరాజు అప్పారావు అప్పారావు పాట కట్టిన తీరును తప్పు పట్టవచ్చునేమో కాని..  ఆ పాటలో బాపూ నడిచి చూపించిన బాటను ఎవరం ఈ నాటికీతప్పు పట్టలేం. ప్రపంచమంతా గౌరవించి నెత్తిన పెట్టుకుంటున్న బాపూజీ భావజాలాన్ని.. పుట్టిన దేశంలోని పాలనాసామాజిక వ్యవస్థలు పూర్తిగా పక్కన పెట్టేయడమే బాధాకరం. పెరటి చెట్టు మందుకు పనికి రాదన్న సామెతను నిజం చేస్తే ముందు నష్టపోయేది మనమే సుమా! గాంధీజీ జన్మించి ఈ 2019, అక్టోబర్ నాటికి  నూటయాభై ఏళ్లునిండుతున్నాయి.  ఆ మహాత్ముడి జీవన విధానంఆలోచనా ధారఆచరణ మార్గాల పరంగా పునర్విమర్శ చేసుకోవలసిన అవసరం మునుపటి కన్నా మరింత పెరిగిందనే సత్యం మనం జీర్ణించుకోక తప్పదు.   బాపూజీ భావజాలం నేటి సాంకేతిక యుగానికి అనువుగా ఎలా మలుచుకోవాలో ఒక చర్చగా అయినా తక్షణమే ఆరంభమవడం భరతజాతికి అన్నివిధాలా  మేలు. లేని పక్షంలో  హక్కుల సాధన పట్ల తప్ప బాధ్యతల నిర్వహణ పైన బొత్తిగా శ్రద్ధ చూపని నేటి సమాజం పోకడలను చక్కదిద్దడానికైనా  బాపూజీ పుడమి పైకి తిరిగి రావడమొక్కటే చివరికి మిగిలే దారి- అనిపించక మానదు!

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య- దినపత్రిక - 02 -10 - 2019 - ప్రచురితం ) 

***

***

Sunday, December 12, 2021

పేగుబంధం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 )

పేగుబంధం

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 

చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది.'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణాఅని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధమగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదువినుకాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారునీ/ యరుదగు కంబు గంఠమున కంజలినీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్బెళుకు క్రౌనుకు మ్రొక్కెదబంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదుఅర్జనుడి రాక ముందు నుంచే రాజ్యందర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూనేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్నభార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ..కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం.

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలుఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతోనిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీన దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో మ్మ’ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం.  ఆమె ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

తరతరాల వెలుగు తాలుపులైనాతరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు కౌసల్య’ మాతనుతలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్య కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!అంటూ అంతలాతల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్యధనధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగాఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయిమందరశూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదోజరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో..ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు!

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులనుమిత్రులనుముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే  సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువుకేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం.స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనాకాలం ఎప్పటిదైనాప్రాంతం ఎక్కడిదైనావైవిధ్యాలువైరుధ్యాలుఅంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతిఅంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైనముది వెంగలి యైనగురూపి యైననున్త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించియొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతికి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరనుయంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ 

మగువంటే మగవాడి మర-యంత్రమా?

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

  యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...