వ్యాసం
మన ఆట పాటలు
- మలపాక వేంకటాచలపతి
సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
విద్యావిధానంలో మన తండ్రుల కాలము, మన కాలములలోపుగ నే అనేక మార్పులు వచ్చాయి. దినమూ వస్తూనే ఉన్న విద్యాబోధకులకు ఒక టే సమ స్య' శేష ప్రశ్న' గా ఆదినుంచి వస్తూంది "బాల బాలి కల దృష్టి చదువువైపు చెదరకుండా నిల్పడ మెట్లా?" ఆని.
పశ్చిమ దేశాల్లో విద్యాసంస్కర్తల రూసో కాలం నుంచి క్రొత్తమార్గాలు త్రొక్కినారు. దాని ఫలితంగా బాలుడు అభివృద్ధిపొందని వృద్ధుడు కాడనీ, అతని మన స్పతికోమలమనీ, సామాన్యమానవునకుండే రస వికారాలు అతనికి లేవనీ తెలియబడ్డది. అందుచేత పశ్చిమదేశాల్లో బాలుని కఠినపరీక్షలకు గురిచేసే విద్యా విధానము మార్చబడి, బాలుని మనోగత అభిప్రాయా లు, ఐచ్ఛికముల ననుసరించి విద్యాబోధన ప్రారంభింప బడింది.
కాని 'ఫ్రీబెల్' అనే ఆయన కాలమువరకు ఆటపాటలకు విద్యావ్యాప్తిపైగల ప్రభావము గుర్తింపక బడినట్లు కన్పడదు. ఇతడు బిడ్డలకు సహజమును, నైసర్గికమునగు ఆటద్వారా విద్యను నేర్పవచ్చునని గ్రహించెను. ఇతడే మొదట 'ఆటపాటల'ను (Play_ Songs) వ్రాసి ఆటవస్తువులను తయారు చేసి పిల్లలకు విద్య ప్రారంభించాడు. ఇతని కాలమునుంచి కిండర్ గార్ట్ (Kindergarten) పద్ధతి ప్రాముఖ్యత వహించి విద్యాసంస్కర్తల అభిమానపద్ధతి ఆయ్యెను.
మన ఆంధ్రదేశములోకూడ ఈ ఆటపాటలు ఆనాదినుంచి ఉన్నవి. కాని వాటి విలువ గ్రహించినట్లు కన్పడదు. దీనినిబట్టి చూస్తే 'ఫ్రీబెల్' యొక్క పద్ధతి క్రొత్తది కాదని తెలుస్తుంది.
విద్య యొక్క పరమావధి మానవవికాసమని మన వారూ, పాశ్చాత్యులూ అంగీకరించిన విషయమే. విద్య మానవునికి సంపూర్ణత్వ మిచ్చేదని చాలమంది ఒప్పుకుంటారు. అట్టి సంపూర్ణత్వముకోసమే మన ఆచారవ్యవహారాలలో, నోములలో, వ్రతములలో, చిన్నప్పటి ఆటపాటలలో, తల్లి శిశువు నోదార్చే జోలపాటలలో విద్యాతత్త్వ మిమడ్పబడి ఉన్నది.
'ఫ్రీబెల్' (Froebel) తన ఆటపాటల్ని శిశువు యొక్క మొదటి సంవత్సరాన్నించి ఆరవ సంవత్స రమువరకు వ్రాశాడు. అతని ఉద్దేశము బిడ్డల్ని సరిగా పెంచగల తల్లులే ఈ ఆటపాటల్ని ఉపయోగించగలరని. కాని ఆట అనేక రూపాలతో వృద్ధులవరకు అభివృద్ధి చెందిఉన్నది. ఆబాలగోపాలము ఆనందించగల ఆట 'నాటకము' __కవియొక్క, సాహిత్యము యొక్క తుది ఫలము. ఆట ఏవిధముగా బాలకుణ్ణి ప్రభావితుణ్ణిగా చేస్తుంది నాటకముకూడ. అట్లాగే అందర్నీ ప్రభావితుల్ని చేయగలదు.
శిశువు ఆటలను, పాటలను సులువుగా అనుకరించగలదని మనస్తత్వజ్ఞులు తెలుసుకున్నారు. ఆవేశపూరితమైన బాల్యము, అచిరకాలమునకు పూర్వమే నిత్యానందమయ స్వర్గలోకము ఆనందలహరిని ఆమృతమయ గాన, నృత్యములతో రెట్టించి రెట్టించి పాడి తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. తండ్రి శిశువుకు కొంచెము బిస్కత్తు పెట్టినపుడు “ఇంకా కావాలీ ఈ, ఈ" అని రాగము తీస్తూ కాళ్లగజ్జెలు ఘల్లును నేటట్లు గంతులు వేస్తుంది శిశువు. ఇది అనుభవైక వేద్యము, ఇట్టి పిన్నవయసునందు పాటలతో నేర్పబడిన జ్ఞానము, ఆటలతో నేర్పబడిన నడత చిరస్థాయి, ఆనందదాయకము. శిశువు లావేశపూరితులే కాకుండా, అనుకరణ బద్దులుకూడను. అతిచురుకైన వారి యింద్రియములూ, అంతకన్న నిశితమైన వారి మెదడూ చూడబడే విష యాల్నీ, చెప్పబడే జ్ఞానాన్నీ అతిసులువుగా గ్రహిస్తుంది. కనుక ఈకాలములో వారికి బోధపడే విజయాల్ని, అభిప్రాయాల్ని, నేర్చు లిషయాలని తల్లిదండ్రులు పరిశీలిస్తూ తగుజాగ్రత్త తీసుకోవాలి. కనుకనే ఈవయసున నేర్పబడు కథలు , ఆటపాటలు ఎట్టివి ఉంచాలి అనేది విద్యాబోధకులు నిర్ణయించాలి. ఇప్పుడు మక ఆటపొటలలోని ప్రాశస్త్యాన్ని
మొదట మన తల్లులు మనకు నేర్పే ఆటపాటలలో ఒకటి 'ఏనుగు పాట' . తల్లి తన శిశువును తన కాళ్లమీద కూర్చుండబెట్టుకుని
" ఏనుగమ్మ ఏనుగు ఏవూరు వచ్చింది ఏనుగు ఉప్పాడ వెళ్లింది. ఏనుగు ఉప్పునీరు త్రాగింది ఏనుగు చూపూరు వచ్చింది ఏనుగు మంచినీరు త్రాగింది ఏనుగు' అని పాడుతూ శిశువు యొక్క మెడ పట్టుకుని ముందుకు నెట్టుతుంది; శిశువు కాళ్లు బిగదన్ని మరల వెనుకకు వస్తుంది. ప్రారంభదశ దాటగానే ఈ పాట వివడం తడవుగా శిశువు ముందుకూ వెనకకూ ఊగటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శరీరోపాసన (bodily exercise). ఏనుగు యొక్క సతతచలనగుణము ఈపాట లో యిమడ్చబడిఉన్నది.
పసిబిడ్డకు మొదలుకొని పండుముసలికి వరకు చంద్ర డాహ్లాదకరుడే. (ఒక్క విరహుల్ని మినహాయించాలి కాబోలు!) సారస్వతంలో చంద్రుడు చాలా స్థానమాక్రమించుకున్నాడు. ఇట్టి చంద్రుణ్ణి తల్లి
' చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవె నేన పసిడి గిన్నెలో పాలుపోసుకుని వెండి గిన్నెలో పెరుగుపోసుకుని ఒలిచిన పండు ఒళ్లో వేసుకుని ఒలవని పండు చేత్తో పట్టుకుని అట్లా అట్లా వచ్చి అమ్మాయినోట్లో వేయవే ' అని పాడుతూ 'ఆం ' తినిపిస్తుంది. శిశువుకూడా తదేక ధ్యానంతో చిట్టి చేతులతో 'చందమామ'ని చూస్తూ అల్లరి చేయకుండా 'బువ్వ' తింటాడు . అన్నం తినేటప్పుడేకాకుండా చంద్రుడు కనపడినప్పుడు శిశివు తన చేతులతో పిలుస్తాడు. ఈ పాటవల్ల శిశువు క్రమంగా సౌందర్యగ్రహణ శక్తి, ఊహ, ఆకాశమునందలి జీవులను గూర్చి తెలుసుకోవాలనే ఆశక్తి, పెరుగుతుంది. తద్వారా భగవంతుని వైపు దృష్టి మరలడానికి అనేక రకాల అవకాశాలు కలుగుతాయి . ఫ్రీబెల్ 'యొక్క మదటి బహుమానపు శరీరవ్యాయామము ఇక్కడ కలుగుతుంది.
ఇదే వయస్సులో, అనగా రెండేళ్ల వయసులో భోజన పదార్థాలు తెలిపే 'చక్కిలిగింత ' ఆట నేర్పవచ్చు. పప్పు పెట్టి, కూర వేసి , పిండివంటలు చేసి... అత్తారింటికి ఇల్లా, ... అంటూ తల్లి తన చేతి వేళ్లని శిశువుల చేతినింది చంక వరకు నడిపించి గిలిగింతలు పెడుతుంది.
బిడ్డకి రెండేళ్లు వచ్చి బాగా కూర్చోటం అలవాటైనతర్వాత 'కాళ్లాగజ్జా ' ఆట నేర్పవచ్చు. ఆ పొట యిది :
కాళ్ల గజ్జె- కంకాణమ్మ
వేగు చుక్క - వెలగ మొగ్గ
మొగ్గ కాదు - మోతి నీరు
నీరుకాదు - నిమ్మల వాయ
వాయకాదు- వావిలి కూర
కూరకాదు - గుమ్మడి మీసం
మీసం కాదు - మిరియాలపోతు
పోతుకాదు ' బొమ్మల శెట్టి
శెట్టి కాదు - శ్యామల మన్ను
మన్ను కాగు -మంచి గంధవు చెక్క
ఈ నలుగురైదుగురు పిల్లలు వరుసగా కాళ్లు చాపుకుని కూర్చోవాలి . ఒకరు పై పాటలోని ఒక్కొక్క పదానికి ఒక్కొకకాలే కొట్టుచూ అందరి కాళ్లూ వరుసగా తట్టుచూ వెనుకకు ముందుకు తట్టుచూ ఉండాలి. 'మంచి గంధపు చెక్క' అని ఏ కాలిమీదికి వస్తే ఆ కాలం పండినట్లు. పండిని కాలు ముడుచుకోవాలి. ఇట్లాఅందరి కాళ్లూ పండేవరకూ ఈ పాట పాడుకూ ఉండాలి. ఈ ఆటపాటలో బిడ్డకి కొన్ని ఆభరణాల పేర్లు— గజ్జెలు, కంకణము, వేగుచుక్క, వెలగ మొగ్గ మొదలైనవి- కాళ్లు ముడుచుకొనుట అనేజ్ఞానం కలుగుతుంది. ఈ పాటలో వైద్య శాస్త్రము కూడా ఉన్న దని మనకు తెలుసు.
ఈ వయస్సుననే 'గుడుగుడు గుంచము' ఆట ఆడవచ్చు. ఈ ఆటకు నలుగురైదుగురు పిల్లలు కూర్చుండి ముడిచిన గుప్పిళ్లు ఒకదానిమీద ఒకటి పెట్టుదురు . దీనివల్ల వీరికి ఒకవిధమైన పరిమాణ స్వరూపం తెలుస్తుంది. ఈ ఆట 'కాళ్లగజ్జె ' ఆట కంటే పెద్దది. ఇక్కడ బాలునికి కత్తియొక్క పదును, బద్ద యొక్క చరును, వేణ్ణీళ్ల వేడి, చన్నళ్ల చలి తెలుస్తుంది. పైగా వాక్యసరళి తోటి పరిచయ మధికమవుతుంది. చేతులు వెనుకకు దాచుకుని పృచ్ఛ కుడు వేసే ప్రశ్నలకి బాలుడు సరియైన సమాధానం చెప్పటం నేర్చుకుంటాడు. ఉదాహరణకి ప్రశ్నలు, జవాబులు ఇట్లా ఉంటాయి: , నీ చేతులే మైనాయి ? - పిల్లెత్తుకుపోయింది. — పి కిచ్చింది. పిల్లేమి చేసింది? ——కుమ్మరివాడి కిచ్చింది-
ఇట్లా ఎన్నయినా ఆటపాటల్ని చెప్పవచ్చు. ప్రత్యేకముగా అడపిల్లలు అడ్డుకునే 'చింతగింజలు ' , ఆటలో 'గణితము' యొక్క ప్రారంభదశ ఉన్నది. ఇప్పటికిని 'కుచ్చెలు' (కుచ్చె-క) లెక్క మన ముస లమ్మల దగ్గర సజీవంగా ఉన్నది. ఇదో అంకెల పాట . ఎంత బాగుందో చూడండి!
“ఒక్క ఓ చెలియ
రెండు రోకళ్లు
మూడు ముచ్చిలక
నాలుగు నందన
అయిదు బేడీలు
ఆరు చిట్టిగొలును"
ఈవిధం గా పదివరకు లెక్కల పాట ఉన్నది. ఆటపాటలతో కలిపి వైద్యశాస్త్ర మేవిధంగా గుచ్చెత్తారా చూడండి!
"కొండమీద – వెండిగిన్నె
కొక్కిరాజు - కాలు విరిగ
విరిగి విరిగి - మూడాయె.
దాని కేమి మందు?
వేపాకు చేదు
వెల్లుల్లి గడ్డ
నూ నెమ్మబొడ్డు
నూటొక్క ధార
ఇంకా, ‘మాతృభావము’ అభివృద్ధి చేసే 'చిన్ని పిన్ని కెన్నో ఏడు —' అనే పాట చూడండి. దీనిలో పెళ్లి బేరాలు, నగలు పెట్టడాలు మొదలైనవి అద్భుతంగా వర్ణించారు.
ఈదృష్టితో ఆటపాటల్ని ఆంధ్రభాషలోవేగాక ఇతర హైందవ భాష ల్లోంచికూడా సేకరించాలని నా ఉద్దేశం. రాబోయ్ ‘Sargent Scheme of Educa_ tion' (సార్జెంటు విద్యాప్రణాళికలో) కూడా శిశు విద్యాలయాల ప్రసక్తి ఉన్నదిగనుక మన శిశువిజ్ఞాన -విషయమై తగు శ్రద్ధవహించి మన పురాతన పాటల్ని సేకరించడమే కాకుండా క్రొత్తవికూడా సృజించి జ్ఞానాభివృద్ధి కనేకవిధాల ప్రయత్నించవచ్చు.
- మలపాక వేంకటా చలపతి
సేకరణ : కర్లపాలెం హనుమంతరావు
( భారతి - మాసపత్రిక - తారణ చైత్రము )