Showing posts with label Andhra Bhoomi. Show all posts
Showing posts with label Andhra Bhoomi. Show all posts

Thursday, December 30, 2021

వలపు -తాత కృష్ణమూర్తి ( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ )

 వలపు 

-తాత కృష్ణమూర్తి


( ఆంధ్ర భూమి - మాసపత్రిక- 1933, అక్టోబర్ ) 



పుస్తకాలలో ఉన్న నాయికానాయకులకేగాక, మెదడు, శరీరావయవాలు సవ్యంగా ఉన్న ప్రతి మని షికీ యీడువచ్చిన పిమ్మట వలపంటే యేమిటో, కొంతవరకు అనుభవమవుతుంది. మహాకవులు నాయికిల వలె ప్రతీఆడదీ విరహవేదనలో మన్మధుణ్ణి, చంద్రు ణ్ణి, గాలిని, పిట్టల్ని నోరుతిరగని సమాసాలతో తిట్టి, చెలికత్తెలను కొట్టి, జుట్టు పీకుకొని, ఒళ్లు రక్కుకొని, మెడలోనిహారాలు తెంచేసుకొని, కాంభోజీరాగంలో వెక్కివెక్కి యేడవక పోవచ్చు ; ఉద్యానవనాలలో ఉండే లతలతో ఉరిపోసుకోకపోవచ్చు. ప్రతీమగ వాడూ కథలలోని రాజులవలె నిద్రాహారాలు మాని వేసి, కలలో కనిపించిన కన్యాలలామకోసం మహా రణ్యాలకుపోయి తపస్సులు చేయలేకపోవచ్చు; వలపు తీవ్రత కోర్వలేక కత్తితో కంఠంకోసుకొనో, విషం త్రాగో, చావడానికి సాహసించలేక పోవచ్చు. కాని ప్రతీమనిషికీ ప్రేమతత్వం ఏదోవిధంగా తెలియరాక మానదు.


అయితే లోకంలో చాలామందికి తమ అనుభవా లెట్లా ఉన్నా, వలపును గూర్చి అభిప్రాయాలు మాత్రం 3 మహావిపరీతంగా ఉండడానికి కారణం బహుళః కవుల తలతిక్క వ్రాతలే నేమో! దేనినైనా సరే, మసిపూసి మారడికాయ చేయగల సమర్ధులు కవులు, జంతువులు,


పిట్టలు, కీటకాలు సహితం అనుభవించి తెలుసుకోగల సెక్సు ప్రేమను మహా అపురూపమైన వస్తువుగా వర్ణించి దానికి తమ ఊహాశ క్తివలన లేనివెన్నో అర్థాలు కల్పించి, లోకంతో సంబంధంలేక ఏకొండగుహలోనో ముక్కు మూసుకొని మూడవ నేత్రంతో సర్వమూ తిలకించగల మహారుషులకును, కల్పితకథలద్వారా నిజాన్ని అబద్ధం గాను అబద్ధాన్ని నిజంగాను చెయ్యగల ఊహాజ్ఞాన సంపన్నులను కవిపుంగవులకును తప్ప, సామాన్యుల కది యెంతమాత్రమూ తెలియరాని రహస్యమని బోధిస్తా మంటారు !


సెక్సు ప్రభావంవలన స్త్రీ పురుషులకు ఒండొరుల యడల జనించే అనురాగమే వలపు. దీనినే పేరు, మోహం, మనసుల కలయిక, కామం, మన్మధవికారం, మమత యిత్యాది పేర్లతో వ్యవహరిస్తారు జనులు. వలపులో సుఖం దుఃఖం, అభిమానం యీర్ష్య, పశుత్వం దేవత్వం, స్వార్ధం స్వార్ధత్యాగం, మంచి చెడ్డ- అన్నీ లీనమైఉంటాయి. తెల్లని సూర్యకాంతిలో యింద్ర ధనస్సు రంగులన్నీ యిమిడియున్నట్లు వలపులో దయ, ద్వేషం, భక్తి, భయం మొదలైన గుణాలెన్నో విశద పడుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి.


ప్రేమ అనేమాటకు వాడుకలో అనేక అర్ధాలు ఉంటున్నాయి. మాతృప్రేమ, బంధుప్రేమ, దేశప్రేమ


దైవపేరు మొదలైనవి సెక్సుతో సంబంధం లేనివి. ఇక సెక్సుతో సంబంధం ఉన్న ప్రేమలో కూడా ము ఖ్యంగా రెండుకాలు ఉన్నాయి. శరీర సంపర్క వాంఛ ప్రధానంగాల ప్రేమ ఒకరకం. దీనినే కామ మనీ, పశుప్రేమమనీ అంటారు. శరీరభోగాలతో జోక్యంలేని ప్రేమ రెండోరకం. ఇది కేవలం మానసిక మనిన్నీ, మిక్కిలి పవిత్రమైనదనిన్నీ చెప్తారు. వల పులో నిజంగా యీ రెండురకాల ప్రేమలూ విడదీయ డానికి వీలు లేకుండా ఐక్యమైఉంటాయి.


ప్లేటో అనేది కథలలో సహజం గా నే కనిపించవచ్చును గాని మానవప్రకృతికి విరుద్ధ మే అనిపిస్తుంది. వలపుగలచోట శరీరసౌఖ్యా పేరు ఉండక తప్పదు. అయితే, ప్రేమించుకునే నాళ్ళకందరికీ అట్టి సౌఖ్యాలు లభించక పోవచ్చును; కోర్కెలు తీర్చుకుం దుకు తగిన అవకాశాలు లేకపోవచ్చును; కోర్కెలు, అవకాశాలు కూడా గలవారు యింద్రియనిగ్రహంవలన తమ శరీరవాంఛల నణచుకోవచ్చును. కాని, ఇంద్రియ సుఖవాంఛారహితమైన వలపుమాత్రం అసహజం!


అట్లే శరీవసంబంధం ఉన్నచోట నల్లా తప్పకుండా ప్రేమ ఉండితీరాలని తలచడం తప్పు. స్త్రీ పురుషులిద్దరు ఎట్టిప్రేమయు లేకనే శరీరసంపర్కం కలిగి ఉండ వచ్చును; బిడ్డలనుకూడ కనవచ్చును. ఇట్టినడత కడు నీచమైనదే అయినా, అస్వాభావికంమాత్రం కాదన డానికి మానవసంఘంలోగల వేశ్యావృత్తి ఒక గట్టి నిదర్శనం.


స్త్రీపురుషు లిద్దరికి శరీరసంబంధమాత్రమైన ఐక మత్యం యేర్పడినప్పు డది తుచ్ఛమగు కామమనిన్నీ, మన సుల కలయిక మాత్రం సంభవించినప్పు డది పవిత్రమగు స్నేహమనిన్నీ, మనోతనువులు రెండిటి బాంధవ్యమూ చేకూరినప్పు డది పేమమనిన్నీ చెప్పుకుంటారు, సాధా రణంగా. కాని తరుచుగా కామంలో స్నేహం, స్నే హంలో ప్రేమ, ప్రేమలో కామం కలసి పొడగడుతూ ఉంటాయేకాని, దేని కది విడిగా విళదకుడదు. కాబ బట్టే అర్ధం ప్రియులచేష్టలు యితరుల కప్పుడప్పుడు ఏమీ కాకుండా, విపరీతంగా కనబడతాయి.


స్త్రీపురుషులిరువురికి' అన్యొన్యాను రాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియుల కే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపువలపు' నాయికానాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రూపలావణ్యాలం చూసుకొని మోూహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనం చూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెన్డ్ మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గలవాళు లేకపోలేదు--హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బల లమైన హేతువులని చెప్పకతప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, వయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది. కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సె ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి, క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా మచ్చిక జంతువులలోన కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, వైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకేపుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


(స్త్రీపురుషులిరువురికి' అన్యోన్యానురాగం కలగడా నికి నిజమైన కారణం నిర్ణయించడం పైవాళ్లకు సులభ సాధ్యమగుపనికాదు. ఒక్కొక్కప్పు డాప్రియులకే తెలియదు, తామెందుకు ప్రేమించు కొంటున్నారో. సాధారణంగా మన ప్రబంధాలలో ఉదహరింపబడే ప్రేమ 'తొలిచూపుదలవు'. నాయికా నాయకులలో నూటికి తొంభైమంది ఒండొరుల రహదశులావణ్యాలు చూసుకొని మోహించుకున్న వాళ్ళే! అతని తనూవిభవం చూసి ఆమె, ఆమె సొగసుందనంచూసి అతడు, వలచు కుంటారు. రూపా లెట్లా ఉన్నా, కొంత పరిచయంపైని ఒకరి గుణాలు చేష్టలు ఒకరు అర్ధం చేసుకొని ప్రేమిం చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒథెల్లో, డెస్టి మోనా వంటివాళ్లు. ఇక రూపం, గుణం, నడవడిక, ఏదీ చూసుకో నవసరంలేకుండా వలచుకో గల వాళ్లు లేకపోలేను-హిందూదంపతులవంటి అమాయకులు!


ఇతర కారణా లింకా ఎన్ని ఉన్నా, ముఖ్యంగా రూపం, యౌవనం వలపును పుట్టించడానికి బలమైన హేతువులని చెప్పక తప్పదు. అందుకనే కవులు తాము చిత్రించే నాయికానాయకులలో ఎవరినీ అందహీనుల గాను, నయసుమీరిన వారిగాను చేయరు. శృంగార మనేది యౌవనంలో ఉన్న సుందరాంగులకే వర్తిస్తుంది కాబోలన్నట్లుంటాయి, పుస్తకాలలో కథలు!


సెకు ఆకర్షణకు నిజంగా రూపం ఎంత సహ కారో, క్రొ త్తదనంకూడా అంతసహకారి. క్రొత్తవాళ్ళ ను చూసినప్పుడు మనసు చలించినట్లు చిన్నవాటి పరి చయులను చూసినప్పుడు చలించదు. ముఖ్యంగా రక్త సంబంధంగల దగ్గిర చుట్టాల పట్ల కామేచ్ఛ బొత్తిగా ఉండదు. పక్షులలోను, మచ్చిక జంతువులలోను కూడా యీచిత్రమే పొడగడుతుంది. చిన్నప్పటినుండీ ఒక్క గూట్లోనే పెరిగిన పావురాలు ఎన్నడూ కలి యవు. తేనెటీగ తనునివసించే పట్టులోని యీగల కొరకు దేవులాడక, పైచోట్లకు ఎగిరి సంబంధం కుదు ర్చుకుంటుంది. ఒకే పుట్టలో ఉన్న రెక్క చీమలు వాటి లో అవి వలచుకోక, దూరంగా నివసించే చీమలగుంపు తో పరిచయం చేసుకుందుకు ప్రయాణాలు చేస్తాయి.


అమెరికా, యూరప్ వంటి దేశాలలో ఒకేతరగతిలో కలసి చదువుకునే బాలురు, బాలికలు సాధారణంగా పెండ్లాడుకుందుకు యిష్టపడరట. సగోత్రీకులకు, వివా హబాంధవ్యాలు నిషేధించిన హిందూధర్మశాస్త్రవేత్త లకు యీరహస్యం తెలుసు!


వెలుతురు, వేడిమి, విద్యుచ్ఛక్తి మొదలైనవాటి వలె వలపొక బాహ్యశక్తికాదు. ఆకలి, తలనొప్పి వంటి శరీర బాధయుకాదు. ఇంద్రియానుభవాల వలన మొదట జనించి, పిదప మనసులో స్థిరపడి, క్రమం గా మెదడునుకూడ వశ పరచుకోగల దారుణమహిమ కలది, అది. పంచేంద్రియాలలోను చూపు మిక్కిలి చురుకైనది కనుక, ప్రేమ సంకురింపజేయుటలో దానికి గల సామర్ధ్యాలు మరిదేనికీ లేవు. కళ్ళకుగల యీ దా రుణశక్తికి వెరచి కాబోలు మానససంఘంలో కొందరు ఘోషాపద్ధతిని విధించుకున్నారు తమ స్త్రీలకు! హిం దూవిధవకు సంఘం విధించిన పాడుముస్తాబుకూడా పురు వదృష్టికి వెరచియే నేమో!


మొదట చతుప్రభావంవలన ఉద్భవించిన వలపును మిగతా. యింద్రియాలు కొంతవరకు బలపరచగలవు. కాబట్టే ప్రియాలు కంటికింపగు ముస్తాబు చేసికొనుట తో తృప్తిపడరు, పువ్వులు, పరిమశద్రవ్యములు విరి విగా వాడతారు. కమ్మని మిఠాయిలు భుజిస్తారు. జిలి బిలి పలుకులతో సంభాషించుకుంటారు. పాడుకుం టారు. నృత్యంచేస్తారు. ముద్దులాడుకుంటారు. కాగ లించుకుంటారు. కరుచుకుంటారు. పిచ్చిపిచ్చి పను లెన్నో చేస్తారు. పంచేంద్రియాలకూ పరవశత్వం వస్తే నేగాని వాళ్ళకు తనివి తీరదు.


• ఎలవును జనింపజేయుటలోను, జనించిన వలపును వృద్ధినొందించుటలోను, ఒక్కొక్కప్పు డొక్కొక్క యింద్రియం ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రియురాలి అను గ్రహం సంపాదించడానికి ఆమెనిద్రించే గది కిటికీ వద్ద చేరి, ఫిడేలో వీణో వాయినూ పాడేవాడట, పూర్వ కాలపు ఐరోపాప్రియుడు! పిల్లనగ్రోవి ఊది గొల్లపడు చులను వశపరచుకు నేవాడట శ్రీకృష్ణుడు. గానం, వా యిద్యం, సంభాషణ, ఏడుపు, నవ్వు మొదలైనవి కణ్ణం


ద్రియాన్ని రంజింపజేసే సాధనాలు. ఇక ఘ్రాణేంద్రి యాన్ని మెప్పించి, ప్రేమను పెంపొంద జేయగలవి. పువ్వులు, మంచిగంధం, పన్నీరు, అత్తరు, కస్తూరి మొ దలైనవి. ప్రియుల నొక్కొక్కప్పుడు కొన్ని కొన్ని వాసనలు వెర్రెత్తించగలవు. యోజనగంధిని ఆమె ఘుమ ఘుమకు వలచినాడట శంతన మహారాజు! అట్లే తియ్యని మిఠాయిలు, కమ్మనిపిండివంటలు, పండ్లు, పాలు, తేనె, సారాయిలు జిహ్వేంద్రియం ద్వారా మోహోద్రే కాన్ని స్ఫురింపజేసి వృద్ధిచేయగలవు. వలపును సాధిం చడంలో ఒక్కొక్కప్పుడు స్పర్శేంద్రియం చదువు కంటె తీక్ష్యంగా పనిచేస్తుంది. అయితే తనప్రతాపం చూపెట్టుకుందుకు కంటికిగల అవకాశాలు స్పర్శకు లభించవు, కలసి నాట్యం చేసుకునే సందర్భంలో ఒం డొరుల యొడలితాకుడుకు మోహో ప్రేకులై దంపతు లైన పాశ్చాత్య యువతీయువకు లెందరో ఉన్నారట! తన మొగంతీరుకూ, పాటనేర్పుకూ, మాటతీపికీ, దేనికీ సాధ్యుడుకాక కొయ్యబొమ్మవలె నిల్చున్న ప్రవరుణ్ణి చూసి, తుదకు క్షణబాహు మూలరుచితో


"పాంచద్భూష


బాలిండ్లు పొంగారఁబై యంచుల్ మోపగఁ గౌఁగిలించి యధరంబాసింప -” సాహసించిందట సరూధిని. ఉగ్గుపాలతో కళాశాస్త్ర మార్మాలన్నీ నేర్చుకున్న ఆప్రౌఢకు, అతగాడిని లొంగదీయడానికి స్పర్శేంద్రియమే అంత్యసాధనమని తోచింది!


ఇంద్రియసుఖాలు వలపు కెంత అవసరములైనా, కేవలం వాటిపోషణ మీదనే ఆధారపడి ఉండ దది. అందుకనే ప్రేమకు చంచల స్వభావం ఆరోపించారు. పెద్దలు. శరీరం, మనసు, మెదడు ఏకీభవించి కాపా డితేనేగాని నిలవదు వలపు! స్త్రీపురుషు లిద్దరికి ఒకసారి నిజమైన వలపు కుదిరినప్పుడు, అట్టి ప్రేమ స్థిరంగా నిలుస్తుందనీ, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చలించదనీ, వాదిస్తారు కొందరు విడాకులు, ద్వితీ యవివాహాలు, ప్రియులకలహాలు మానవసంఘంలో అరుదైనట్లు పుట్టుక, పెరుగుట, చావుగల జీవ


ప్రేమకు స్థిరత్వం ఆరోపించడం వెర్రి. కాని, ఇంద్రియాల ప్రేరేపణకు లెక్క చేయక, హృదయాన్ని లొంగదీసు కొని, బుద్ధిబలంవలన స్థిరంగా ఒక్కరినే ప్రేమించ గలుగుట మానవునికి అసాధ్యంకాదు. పతీవ్రతలు, ఏక పత్నీ వ్రతులు అట్టి మనోబలంగల ఘనులు.


వలపు విషయంలో అవకతవకగా ప్రవర్తించే వాళ్ళం. దరూ మెదడుతకు వరాళ్ళే అని రూఢిపరచగ లరు నేటి శాస్త్రజ్ఞులు. మెదడుశక్తి అంటే పుస్తకాలు చదు పుకున్న జ్ఞానమని కాదు. బడిచదువు, పరిక్షలు, శా శాస్త్ర జ్ఞానం—వీటితో సంబంధంలేక, ప్రతీ మనిషికీ పుట్టుక 'నే భగవంతు డనుగ్రహించే శక్తి అది! సమాన మైన అవకాశాలతో,ఒకేగురువు వద్ద శిక్ష నభ్యసించిన విద్యా . ర్థులందరూ ఒకేమో స్టరు తెలివితేటలు గల వాళ్ళుగా ఉండకపోవడానికి యిదేకారణం. మనిషికీ మనిషికీ, జం తువుకూ మనిషికీగల తేడాలను యేర్పరిచేది యీజ్ఞాన శక్తే! వలపు నిలకడలేనిదే అయినా, దానిని బళవరచు కొని, స్థిరంగా ఒకరిమీదనే నిలచేటట్లు చేసుకోవడం మానవుని ప్రజ్ఞ. అది వానిమేధాశక్తిని నిరూపిస్తుంది. సంఘానికి కొంత మేలు చేస్తుంది. వాని జీవితానికి శాంతి


వలపుకు చంచల స్వభావం ఉండడమే కొంతవరకు మానవుడికి ఉపచరిస్తూ ఉంది. లేకపోతే, జోళ్ళుకుట్టు కుసేవాడు రాజు కూతుర్ని చూసి మోహించి, మనసు మరల్చుకోలేక గుండెపొడుచుకొని చావవలసినదే. వలచినవారిని పొందలేని మనిషికి మరి జీవితంలో ఆనం దమ నేది ఉండదన్న మాట. దొంపత్యను నేది అర్థంలేని బాంధవ్యమవుతుంది. కలిగినవలపును నిలుపుకుందుకు గాని, మరల్చుకుందుకు గాని మానవుడికి సాధ్యమవుతూ. ఉంది గనుక నే, సంఘానికి కొంత గౌరవం, ప్రత్యేక వ్యక్తులకు కొంతచిత్తశాంతి లభిస్తున్నాయి.


కొన్నికొన్ని పరిస్థితులందు కంటికి నచ్చిన వాళ్ళను చూసినప్పుడుగాని, పరిచయంగల వాళ్ళతో ముచ్చ టించేటప్పుడు గాని, ప్రతీమనిషికీ హృదయంలో అర్థం లేని వెర్రి వెర్రికోర్కెలు రగలడం సహజం. అయితే, కొంతఆలోచనాశక్తి, మెదడు అనేవి ఉంటాయి కనుక, కలిగిన ప్రతికోర్కెకూ దాసుడు కానక్కర


లేదు మనిషి. వలపును తన చెప్పుచేతలలో ఉంచుకో లేని మనిషిది దుర్బలమైన మెదడన్నమాట!


తెలివితక్కువవాళ్ళను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తూ ఉంటుంది వలపు. అది మనదేవుళ్ళను, రుషులనుకూడా కొందరిని పరాభవించి సకల బాధలూ పెట్టింది. ఇంద్రుడు, శంక రుడు, శ్రీకృష్ణుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు. వీళ్ళందరూ దానికి లొంగిపోయిన మహానుభావులే! ఇక ఆల్పప్రజ్ఞావంతులగు సామాన్యజనులు దాని ప్రభకు దాసోహమనడంలో ఆటే వింతలేదు. మళ్ళీ జీవరాసు లలో కల్లాజ్ఞా నవంతుడనని గర్విస్తాడు నరుడు; తుద కిట్లాంటివాటిలో వెర్రికు ట్టెవలె ప్రవర్తిస్తూ ఉంటాడు. వలపుమూలాన మానససంఘంలో నిత్యమూ ఎన్నో ఘోరాలు, అసందర్భాలు జరుగుతునే ఉంటాయి -' ఆత్మహత్యలు, కూనీలు, దెబ్బలాట్లు, మోసాలు, దొంగతనాలు, యుద్ధాలు, బలవంతం పెళ్లిళ్లు - యిత్యా, దులు. అందుకనే, వలపు గుడ్డిదనీ, వలపులో ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళకంటే అసందర్భంగా ప్రవర్తిస్తారనీ చెప్తారు పెద్దలు. ఒక్కొక్కప్పుడు దెయ్యం పట్టినట్లు మనిషి నా వేశించి,పీడించి, పశువును చేయగలదువలపు; మహామారివ్యాధివలె బాధించి, ప్రాణాలు తీయగలదు.


అట్లే నరున కిహలోకమందే స్వర్గమిచ్చి, సకల సౌఖ్యాలూకూర్చి, వానినిఘనకార్యాలు చెయ్యడానికి పురికొల్పి, బిచ్చగాని సహితం సింహాసనమెక్కించి, వానిజీవితాన్ని ఆనందమయంగా చెయ్యగలదు వలపు. అల్పుని ఘనునిగాను, లోభిని త్యాగిగాను, వృద్ధుని పడుచువానిగాను, పిరికివానిని ధైర్యవంతుని గాను, బలహీనుని శక్తివంతునిగాను మార్చగలదు. మానవ హృదయంలోగల ఔన్నత్యాన్ని పైకి తెచ్చి,. చెడునడ తగల వారిని బాగుపరచి, సంఘానికి ఐకమత్యం, గృహా నికి శాంతి నెలకొల్పగలదు. బంధుత్వాలు, స్నేహాలు, వివాహాలు, సంతానాలు వలపుమీదనే ఆధారపడి ఉంటున్నాయి. పేమకొరకు నరుడు తన ప్రాణాల నా ధారపోయగల త్యాగశీలుడౌతాడు. వలపు అతనిజీవితానికి వెలుగునిచ్చే దివ్యజ్యోతి ; ఆత్మకు శాంతినొసగే తారకమంత్రం !


వలపులో మంచి, చెడుగు, రెండూ ఉన్నాయన్న సంగతి గుర్తెరిగి, సాధ్యమైనంతవరకు ఆమంచే సామా న్యుడికి లభ్యమయేటట్లు చెయ్యడానికి యత్నించారు, మన శాస్త్రకారులు.. సంఘనియమాలు, వివాహాచా రాలు, నీతులు, మతబోధ, అన్నీ యిట్టి సదుద్దేశం గలవే. అనుభవం, పరిశోధనాశక్తి, ఊహాజ్ఞానం మెం డుగాగల మహానుభావులు అన్ని దేశాలలోను, అన్ని యుగాలలోను యిట్టి సిద్ధాంతాలు నిర్మిస్తు నేఉంటారు. ఆది అంతము లేని పరిశ్రమ వారిది! ఏమంటే, నేటి జనులకు నిన్నటి శాస్త్రాలు మనస్కరించవు; రేపటి జనులకు నేటి సిద్ధాంతాలు సరిపడవు..


వలపు విషయంలో ధర్మశాస్త్రవేత్తలు విధించిన యేనియమా:ూ తమకు తృప్తికరంగా లేకపోవుటవలన, నేటి రష్యాలో కొందరు "స్వేచ్ఛ' పేమ"ను అనుసరి స్తున్నారు. అంటే, ప్రకృతిలోగల మృగపక్ష్యాది స్వేచ్ఛజీవుల యిచ్ఛానుసారంగా జనులు వావి వరుసలనుకూడ గణించక వలపు సుఖముల ననుభవిం చుట! ఇది ప్రత్యేకవ్యక్తుల కొక్కొక్కప్పుడు కొంత సదుపాయంగా ఉన్నట్లు కనిపించినా, సంఘానికీ, సం తానానికీ లాభకరంగా ఉంటుందని తోచదు. ఉత్తమ జాతి పక్షులు, జంతువులు, సహితం కొన్ని నియమాలు ననుసరించి మళ్లీ ప్రవర్తిస్తాయి. చక్రవాకాలు, పావు రాలు మనిషికి బుద్ధి చెప్పేటంత నీతితో మెలగుతా యట, తమజోడుపిట్టలపట్ల, ఏకట్టుబాట్లూ లేని స్వే చ్ఛప్రేమ మానవునికి 'సౌఖ్యప్రదం కాకపోవడమేగాక, యీర్ష్యగుణం మెండుగాగల వాని ప్రకృతికి బొత్తిగా సరిపడదు. నేటి సాంఘికాచారములలో లోటుబాట్లు పెక్కులుండవచ్చును ; ఆచరణలో ఉన్న శాస్త్రనియ మాలు నవీన నాగరికతకు అనుగుణ్యములుగా లేక పోవ చ్చును; దేశకాలపరిస్థితుల ననుసరించి సంఘాన్ని సం స్కరించుకొని, మానవుడు తన జీవితాన్ని సవరించుకో వలసినదేకాని, కట్టుబాట్లు లెక్క చెయ్యక, సంఘాన్ని ధిక్కరించి, కళ్ళెంలేని గుర్రంవలె వెర్రిగా పరుగెత్త దలచుట తెలివితక్కువ.


-తాత కృష్ణమూర్తి.





Sunday, December 12, 2021

కథానిక ( సరిదిద్దాలి) పుష్పాభిషేకం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి వారపత్రిక – 11- 05- 2000 - ప్రచురితం )

 





కథానిక: ( సరిదిద్దాలి) 

పుష్పాభిషేకం




రచన: కర్లపాలెం హనుమంతరావు 

ఆంధ్రభూమి వారపత్రిక - 11/05/2000 -  ప్రచురితం ) 


రాత్రి పన్నెండు గంటలు దాటుతోంది. 


డిసెంబర్ నెల బయట చాలా చలిగా వుంది.


పుస్తకం ముందు కూర్చున్న శరత్ మనసు మనసులో లేదు.


పక్క గదిలో నుండి వుండి వుండి శబ్దాలు వినిపిస్తున్నాయి . 


వరండా నిండా పిండారబోసినట్లు వెన్నెల. నై ట్ క్వీన్ పూలవాసనతో

వాతావ రణం మరింత మత్తుగా ఉంది. 


ఉండబట్టలేకపో మూసేసి లైటార్పేశాడు శరత్ . 


పిల్లిలా వెళ్లి పక్క గది తలుపు దగ్గర నిల్చున్నాడు. 

సన్నటి కంతలో నుండి లోపల జరిగేదంతా అస్పష్టంగా కనిపిస్తోంది. 

 బెడ్లైట్ వెలుతురులో . 


బెడ్ మీద పావని. . అన్నారావు . కాళ్లు వణుకుతుంటే గభాలున వెనక్కు తగ్గి వచ్చి బెడ్ మీద పడిపోయాడు . 

పక్క గదిలో మంచాలు కదులుతున్న చప్పుళ్ళు, .. మధ్యమధ్యలో గాజుల గలగలలు .. ఉండి ఉండి. . మెత్తగా మూలుగులు. మత్తుగా గుసగుసలు, పిచ్చెక్కిపోతోంది శరత్.


తాను చేస్తున్నది. తప్పని హెచ్చరిస్తూనే వుంది అంతరాత్మ. అయినా మనసు వివే మూడో లేదు.  అదుపు చేసుకొనే  కొద్దీ ఆలోచనలు గాడి తప్పి పోతున్నాయి. 


ఎన్ని రోజుల నుండో ఇలా యాతన అమభవించడం! 


మొదట్లో ఎబ్బెట్టుగా అనిపించేది .  ఇప్పుడలాంటి ఆలోచనలు చేయకుండా  ఉండలేని బలహీనత ఆవరించింది. 


నెల రోజులుగా ఇదే వరస . 


కలలో కూడా అవే దృశ్యాలు . పావని.. అన్నారాపు స్థానంలో .. తనూ . . 


ఛీ! ఎంత వద్దనుకున్నా ఆ ఆలోచ సలు వదలడంలేదు. వారం రోజులుగా  మరీ ఎక్కువయ్యాయి తీపులు. 

దీని దెబ్బతో చదువు మీద ఏకాగ్రత కూడా చెదిలిపోతొంది. ఈసారైనా విజయం సాధించాe అని వాళ్లమ్మ కోరిక. 


చనిపోయిన తండ్రి కోరిక కూడా . అదే శరత్ ఆశయం కూడా అదే . ఇక్కడికొచ్చేదాకా. 


ఇప్పుడే తారుమారయింది ఇలాగా. 


అన్నారావు తనకు వరసకు అన్నయ్య .  పెద్దమ్మ కొడుకు . సిటీలో ఆర్ టీసీలో కండక్టర్.కొత్తగా  ఇల్లు కట్టుకున్నాడుబ్యాంకు లోనుతో . ఈఎమ్మైలు బరువవుతున్నాయని బాధపడుతుంటే పెద్దమ్మే తను  ఇక్కడ ఉండేటట్లు  ఏర్పాటు చేసింది.  తను సెంట్రల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగుకని ఎట్లాగూ సిటీకి వచ్చి ఆరునెలలు  ఉండాలి. ' ఆ ఉండేది ఎక్కడో ఎందుకు .. మా అన్నారావు పక్క వాటాలో ఉండి చదువుకో ! రెండు పూటలా భోజనానికి, అద్దెకు కలిపి మూడు వేలు ఇవ్వు! ' అంటూ పెద్దమ్మ చేసిన ఏర్పాటే ఇది . 


అన్నారావుకు రెండువారాలకు ఒకసారి బెంగుళూరు సర్వీస్ డ్యూటీ పడుతుంది . ఆ రెండు రోజులు ఇంట్లో మగదిక్కుగా ఉంటాడన్న ఆలోచనతో పావని కూడా ' సరే ' అన్న తరువాతనే తానిక్కడికి వచ్చి పడింది  . 


వచ్చాడే  కానీ కాన్సె౦ట్రేషన్  కుదరడం లేదు. కొన్ని రోజుల బట్టి మరీ . కాన్షస్నెస్ ఒప్పుకోక పోయినా కళ్ళముందు  పావని బెడ్ రూం దృశ్యమే  పగలూ .. రాత్రీ కూడా ! 


తనను ఏదైనా చేయాలి. అప్పటి దాకా తనకీ పిచ్చి వదలదు. . అని డిసైడయ్యాడు శరత్ చివరికి 


అన్నారావు ఊళ్లో లేనప్పుడు మనసు మరీ గాడి తప్పుతోంది.


పావని  కూడా తనలో చాలా చాలా సరదాగా ఉంటుంది. సినిమాలన్నా, టీవీ అన్నా ఆమెకి చాలా ఇష్టం. భర్త ఊళ్లో లేనప్పుడు బోరుకొడితే శరత్ చేత వీడియోలో అడిగి మరీ తెప్పెంచుకునేంతా చనువు చూపిస్తుంది కూడా .  భోజనం పెట్టేటప్పుడు, పాపను అందించేటప్పుడు ఎన్నిసార్లు ఆమె చేయి తనకు తగిలేది . ఆడవాళ్లు పరాయి మొగాడితో ఉరికే అంత క్లోజ్ గా ఉండరు కదా! 


మొదట్లో మొదట్లో ఏమీ అనిపించేది కాదులు . ఇప్పుడీమధ్యే ఈ వికారం మొదలయింది తనకు! 


ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, బెడ్రూమ్లో బట్టలు మార్చుకుంటు న్నప్పుడు రహస్యంగా తొంగి చూడడం, పనున్నా లేకపోయినా అవిడ వెంటే తిర గడం, అవకాశం దొరికినప్పుడల్లా అవిడని తాకడానికి ప్రయత్నిం చడం... అన్నయ్య లేనప్పుడు మరీ చొరవగా ప్రవర్తించడం... రాత్రయ్యేసరికి పిచ్చి పట్టినట్లుంటుంది. ' ఒక్కసారి ఎలాగైనా పావనిని కల


వాలి అన్నయ్యలాగా, అదే ఆలోచన మెదడును తొలుస్తుంటే పుస్తకంమీద మనసెలా నిలుస్తుంది?


' సంకేషం సగం బలం' అన్నమాట వ్యక్తులకే కాదు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేశానికి వర్తిస్తుంది. ప్రపంచంలో సంతోషంగా ఉన్న వ్యక్తుల క్కోవటంలోనే నిజమైన ఆనందం జాబితాలో అమెరికా ముందుంది. ఆ తర్వాత స్థానం ఇండి మంది అభిప్రాయపడ్డారట. స్నే యాకు లభించింది. 22 దేశాల్లో సర్వే నిర్వహించిన అనంతరం, బంధాలు కూడా బాగా ప్రభావం ఇటీవల ఫలితాలను ప్రకటించారు. జీవితంలో వేర్వేరు అంశాల్లో తేల్చి చెప్పారు. 'మతం ప్రభావం ఏ మేరకు సంతోషం లభిస్తోంది?... అసలు సంతోషం కలిగించే ఉంటుందని. రేటింగ్లో మార్పు


చదువుగాడి తప్పుతుంది. వీక్లీ టెస్టుల్లో మార్కులు బాగా తగ్గుతున్నాయి. ప్రోగ్రెస్ బాగా లేదని లెక్చరర్లు పెదవి విరుస్తున్నారు. 'ఇంకా పరీక్షలు ఐదు నెలలు కూడా చదవడం. మూడీగా వుంటున్నావు. లవ్లో పడ్డావా?" అనడి లేవు. ఇలాగేనా


ఏమని సమాధానం చెప్పాలి?


పావని ముందు తన కోరిక బైటపెడితే ఊరుకుంటుందా?


పెదవి విప్పి చెప్పనిదే ఎలా తెస్తుందామెకు తన మనసు? ముందు తను ధైర్యం చేయాలి. తరువాత అదృష్టం ఎలా వుంటే అలా, కానీ


ఇలాంటి విషయాల్లో సలహాలెవరిస్తారు? అలాగని పూరికే వుండిపోయే మన స్తత్వం కాదు శరత్.


ముగ్గురాడపిల్లల మధ్య మగ నలుసు. అమిత గారాబంగా పెరిగాడింట్లో అన కున్నది అయ్యేదాకా సంతం వదలని మొండితనం అతనిది. ఆలోచించి అలోచించి రాత్రంతా మేల్కొని పాతిక పేజీలు చించి రెండు పేజీల ఉత్తరం రాసాడతను.


"పాపనీ! నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తోంది. అది పొందని బ్రతుకు వృధా. ప్లీజ్ ఒక్కసారి నా కోరిక తీర్పు. లేకపోతే మరణంతప్ప నాకు వేరే దారి లేదు. ”


ఇట్లు

శరత్ 


స్థూలంగా ఉత్తరం సారాంశం అది.


ఉత్తరాన్ని ఆమె కంట పడేట్లు బెడ్రూమ్లో దిండు మీద పెట్టి బైటికెళ్లిపోయాడు శరత్.


అన్నయ్య ఊళ్లోలేడు. వారందాకా రాడు. ఈలో పునే ఏదో తేలిపోవాలి. సినిమాకెళ్లి వచ్చేసరికి పదిగం టలు దాటింది.


తలుపు దగ్గరికి వేసి వుంది.


బట్టలు మార్చుకుని పక్క సర్దుకుంటుంటే పావని వచ్చి ఎదురుగా నిలబడింది.


ఇద్దరి మధ్యా కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పావనే అడి


గింది " అన్నం తిన్నావా?''


"ఆకలిగా లేదు" అన్నాడు శరత్ ముక్తసరిగా. "నిన్నొక మాట అడుగుతాను చెప్తావా?? పావని గొంతు వణకుతోంది దుఃఖంతో..


ఉత్తరం చదివి బాగా ఏడ్చినట్లుంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి.


“నామీదసలు నీకలాంటి అభిప్రాయం ఎలా


గింది? నా ప్రవర్తనలో ఏమైనా లోపముందా?''


శరత్ మాట్లాడలేదు.


"నాకన్నా మూడేళ్లు చిన్నవాడివి. నిన్నెప్పుడూ ఆ భావంతో చూడలేదు. అన్ని పేజీల ఉత్తరం రాసావు. అది చదివిన తరువాత నిన్నెప్పటిలా చూడగలనా? ఎందుకలా చేసావు? మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవు తుందో ఆలోచించావా?”


"అన్నిటికీ తెగించే రాశాను" అన్నాడు శరత్ నెమ్మదిగా. రోషంతో పావని


గొంతు గజగజ వణికింది.


"నిన్నీ క్షణంలోనే ఇంట్లో నుండి వెళ్లగొట్టాలని వుంది. అలా చేస్తే అల్లరిపాలయ్యేది ముందు నువ్వు, తరువాత నేను. ఆ తరువాత నా సంసారం. మీ అమ్మ నీమీద ఎన్ని ఆశలు పెట్టుకుంది? మీ నాన్న పోయేట


ప్పుడు కోరిన కోరిక తీర్చడానికి ఆ తల్లి ఎన్ని కష్టాలు పడి నిన్ను చదివిస్తోందో అర్ధం కావడంలేదా? శరత్! నా మాట విని ఈ పిచ్చి పిచ్చి ఊహలు మానేయ్. చక్కగా చదువుకో."


“ఎంత ప్రయత్నించినా నావల్ల కావడంలేదు పావనీ! ఇంక చావొక్కటే నాకు మిగిలిన ఏకైక మార్గం" అని రెండు చేతులతో మొహాన్ని కప్పుకుని కుమిలిపోతున్న శరత్ వంక చూసి నీళ్ళుకారిపోయింది పావని. “అలా అనొద్దు. ప్లీజ్ నేను తట్టుకోలేను.”


శరత్ వినిపించుకునే మూడ్లో లేడు. ఒక్క నిముషమాగి పావనే అంది "ఆల్ రైట్. నీకు కావాల్సింది నా శరీరమేగా. నేను రెడీ."


చివుక్కుమని తలెత్తి చూసాడు శరత్. పావని సీరియస్ గానే అంటోంది. "ఎన్నోసార్లు నన్ను చాటుగా చూశానంటున్నావు. గుట్టంతా రట్టయిన తరు వాత గుప్పెట మూసి వుంచడమెందుకు? నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధం.”


శరత్ ఎలర్టయ్యాడు.


"అయితే నాదీ ఒక షరతుంది!”


“చెప్పు. నువ్వు కోరితే ఏదయినా చేస్తాను" అన్నాడు ఆవేశంగా శరత్. "ముందు మీ అమ్మ కోరిక తీర్చు. ఎసెట్లో మంచి రేంకు సంపాదించు. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చిన రోజున ఇదే బెడ్మీద నీకు షేర్ ఇస్తాను. మిస్" అని విసవిసా వెళ్లిపోయింది పావని.


పరీక్షలింకా ఐదునెలలు కూడా లేవు. పావని మీది ధ్యాసతో విలువైన చాలా సమయమే వృధా అయింది. కాంపెన్సేట్ చేసేలా చదవటమంటే మాటలు కాదు. పంతానికి మారుపేరు శరత్. ఫ్రెండ్స్, షికార్లు బంద్. సినిమాలు, హోటళ్ళు అన్నీ పక్కన పెట్టేసాడు.


అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్ప పుస్తకాన్ని వదలడంలేదు. ఇంటికి


వెళ్లి కూడా చాలా రోజులయింది. తపస్సులాగా చదువుతున్న శరత్ గడ్డం పెరిగి


రుషిలాగా తయారయ్యాడు.


మంచి రేంక్ రావాలి. వీరుడిలాగా తను పావనిని గెల్చుకోవాలి. దేబిరించి


పొందే ఆనందంలో సుఖమేముంటుంది?


శరత్ లోని పట్టుదలను చూసి చలించిపోయింది పావని. ఇదంతా తనమీది కోరి కతోనేనా? అనే ఊహ ఆమెను ఒక చోట నిలబడనీయలేదు. భర్తతో కలిసున్నప్పుడు కూడా శరత్ ఆలోచనలే వస్తున్నాయామెకు. పరీక్ష రాసి ఊరికెళ్లిపోయాడు శరత్.


ఫలితాలకోసం అమ్మ కళ్ళల్లోని ఆత్రుతను చూసి ఆలోచనలో పడ్డాడతను. తనకు మంచి రేంకు రావాలని, ఇంజనీరింగ్ సీటు వస్తే కొండకొస్తానని మొక్కు కుందామె.


తనెంత పెద్ద పొరపాటు చేయబోయాడు. పావని మీది వ్యామోహంతో పరీక్ష


ము వుంటే తల్లి గతి ఏమయ్యేది?


తలచుకుంటేనే భయమేస్తుందిప్పుడు. ఎంత కాదనుకున్నా రిజల్బు వచ్చేరో జున నెర్వస్ గా ఫీలయ్యాడు శరత్. నలభై మూడో రేంకు వచ్చిందని తెలియగానే తల్లి మొహంలోని సంబరాన్ని


చూడాలి. తండ్రి ఫోటో ముందు నిలబెట్టి నమస్కారం చేయించింది. *ఇదిగోనయ్యా! నువ్వడిగినట్లు నీ కొడుకును ఇంజనీరును చేస్తున్నాను.


అంటున్నప్పుడు ఆవిడ కంటి నిండా నీళ్ళు! ఊరంతా బ్రహ్మరథం పట్టారు మంచి రేంకు వచ్చినందుకు. తల్లి తనకు ఎన్ని సార్లు దిష్టి తీసిందో ఆ రోజు.


పావని తండ్రి వచ్చి పలకరించాడు. శరత్చేత ఆయన కాళ్లకు నమస్కారం చేయించింది తల్లి. " ఇదంతా మీ కూతురి చలవేనండీ. ఆ చల్లని తల్లి ఇంట్లో ఉండబట్టే మావాడికీ


చదువు అబ్బింది" అంటూ పావనిని తలచుకుని సంబరపడింది.


"కష్టపడి చదువుకున్నది మీవాడు. శ్రమపడి చదివించింది మీరు. మధ్యలో మా అమ్మాయి ఏం చేసింది? దాని మొహం" అన్నాడాయన మురిపెంగా. సర్టిఫికెట్స్ కోసమని సిటీకి పోతున్నప్పుడు మంచి చీర ఒకటి కొనివ్వమని డబ్బిచ్చింది శరత్ తల్లి.


అన్నయ్య ఊళ్లో లేడు. శరతిని చూడగానే సంతోషంగా పలకరించింది పావని. కానీ ఆమె కళ్లల్లోని నీలినీడల్ని శరత్ గమనించకపోలేదు. అమ్మ చెప్పిందని బజా రుకి బయల్దేరదీసాడు. పావనికి చీర కొన్నాడు. భోజనం బైటే చేద్దామన్నాడు. మాట్లాడలేదు పావని. దార్లో మల్లెపూలు కొన్నాడు. చూస్తూ వూరుకుంది. ఉయ్యాలలో నిద్రపోతున్న పాపకు దుప్పటి కప్పి వచ్చి శరత్ కెదురుగా


కూర్చుంది పావని. కొత్త చీరలో చాలా అందంగా వుందామె. “మొత్తానికి పంతం నెరవేర్చుకున్నావులే. నీ ముందు నేనోడిపోయాను. మల్లె పూలు తెచ్చావుగా. ఇక నీ ఇష్టం" అంటూ పావని బెడ్లైట్ వేసి బెడ్మీద వాలిపో యింది. కంట నీరు అతడికి కనిపించకుండా తల పక్కకి వాల్చింది.


మసక చీకటిలో ఇదే సమయంలో ఇదే బెడ్మీద ఆమెని ఎన్నిసార్లు ఎన్ని భంగి మల్లో చాటుగా చూశాడో తను. ఈ సమయం కోసం, ఈ అవకాశం కోసం వెర్రి వాడిలా మారిపోయి తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. నిశ్శబ్దంగా వచ్చి పావని పక్కన నిలబడ్డాడు. నిదానంగా మల్లెచెండు అందుకుని దారాన్ని తెంపి పూలను ధారగా ఆమె పాదాలమీది పోసి కళ్లకద్దుకున్నాడు.


పావని గబుక్కున లేచి కూర్చుంది. “ఇదేం పని?” అంటూ గాబరాగా అతన్ని పొదవి పట్టుకుని పైకి లేపబో


"జన్మనిచ్చేదే తల్లికాదు. జ్ఞానాన్నిచ్చేది కూడా తల్లే. ఇంగితం నేర్పిన తల్లివి. పూలతో నేను చేయాల్సిన పని ఇదే...” అంటున్న శరత్ కంటి నిండా నీళ్ళు!


అంతబాగా కనిపించడం



అడ్డదారి - కథానిక కర్లపాలెం హనుమంతరావు - (ఆంధ్రభూమి వారపత్రిక ప్రచురితం)

అడ్డదారి - కథానిక

కర్లపాలెం హనుమంతరావు


సులభ కెనరాబ్యాంకులో ఆఫీసర్. 

ఇయర్ ఎండింగ్ సీజన్.  ఆఫీసులో పని వత్తిడి ఎక్కువగా  ఉంటోంది ఎప్పటిలానే. 

తొందరగా తెముల్చుకుని బైటపడదామన్నా చీకటి పడనేపడిందా పూట.  పైన దట్టంగా మబ్బులు కూడా. సెల్ చూస్తే  టైమ్  ఏడుకు  ఇంకా ఐదే నిముషాలున్నట్లు గత్తర పెడుతోంది! ఆర్టీసి క్రాస్ రోడ్స్ కు వెళ్లే  లాస్ట్ బస్ టంచనుగా ఏడింటికి వచ్చి పోతుంది. 

ఎంత గబగబా అడుగులు వేసినా కనీసం పదినిముషాల నడక 

బస్టాండుకు. దాదాపు పరిగెత్తినంత పనిచేసిందామె. 

 నిర్మానుష్యంగా ఉంది బస్టాండంతా! డైలీ తనతో పాటు వచ్చే గ్యాస్ ఆఫీస్ పిఆర్ఓ  లేడీ   కూడా కనిపించలేదక్కడ. 

సామాను సర్దుకుంటోన్న పల్లీల అవ్వను అడిగింది సులభ  'సిటీకీ పోయే ఏడింటి బస్సు పోయిందా అవ్వా?' 

'ఇప్పుడే పోయింది బిడ్డా! ఇంకే బస్సులూ  రావే!ఎట్టా చేస్తావూ?'    తట్ట నెత్తికి  ఎత్తి పెట్టుకుని జాలిగా అడిగిందా అవ్వ. 

'ఏదైనా ఆటో చూస్తాలే! నువ్ పో!'

'పెద్ద మబ్బు తల్లీ! చినుకులు రాల్తావున్నాయి!  ఏ ఆటో సచ్చినోడు ఇటేపొచ్చి చస్తాడో! పాపం, ఆడబిడ్డవి! బేగి ఇల్లు చేరుకో తల్లీ!' అని గొణుక్కుంటూ వెళ్లిపోయిందా అవ్వ . 

సులభకు అప్పుడు గాని అర్థమయింది కాదు తన పరిస్థితి. 

బస్సు లేక, ఆటో దొరక్క, ఈ గాలివానలో ఇక్కడే ఇరుక్కుపోతే నలభై కిలో మీటర్ల దూరంలో ఉండే ఇల్లు చేరేదెట్లా? 

ఉన్న ఒకట్రొండు చిన్న దుకాణాలు కూడా కట్టేసుకుంటున్నారు మెల్లమెల్లగా! 

బస్టాండులో  ఆడమనిషొక్కతే బిక్కు బిక్కు మంటూ నిలబడుండటం అప్పుడే దారే పోయే మనుషుల కంట్లో  పడ్డం మొదలుపెట్టింది. ఒకళ్లిద్దరు మగాళ్లయితే మొరటుగా నిలబడి తేరిపారా చూస్తూ పోవడంతో భయం పట్టుకుంది సులభకు. 

'ఎంత తొందరగా ఇక్కణ్ణుంచీ కదిలితే అంత సేఫ్!'   

ఇంగితం హెచ్చరించడంతో సెల్ తీసి రాజశేఖర్ నెంబర్  నొక్కింది. రెండు కాల్సయినా   రెస్పాన్స్ లేదు. రాదని తెలుసు. శేఖర్ సెల్ ఈ టైములో ఆఫ్ లో ఉంటుంది!   అతగాడు అక్కడెక్కడో మాధాపూర్ చివర్లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అనలిస్ట్.  డ్యూటీ స్టార్టయ్యే ముందు డైలీ టీం డిస్కషన్  ఉంటుంది. ఆ టైమ్ లో సెల్ ఆన్-లో  ఉండదు. అది రూలు. రోజూ తను ఇంటికి చేరిం తరువాత మెసేజ్ పెట్టినా  వెంటనే రిప్లై రాదందుకే.  రూల్స్ స్ట్రిక్టు గా పాటించక తప్పని  ఆ కంపెనీలో  ఆఫీసు వదిలిందాకా శేఖర్ తో  కాంటాక్టంటే స్ట్రిక్ట్లీ వయా మెసేజెస్సే! 

అన్నీ తెలిసీ కాల్ చెయ్యడం.. కంగారు అణుచుకోలేకే! లక్కీగా భర్త నుంచి ఏదైనా సలహా  వస్తుందని కూడా ఆశ. కుదరక, మెసేజ్ పెట్టి నడక మొదలుపెట్టింది సులభ!

నిజంగానే లక్కీ! శేఖర్ నుంచి కాల్! సులభ చెప్పేది సగమే విని 'గొప్ప చిక్కుల్లో పడ్డావ్ సులభా! ఆ ఏరియా అస్సలు సేఫ్ కాదు. ముందేదైనా దొరికిన వెహికల్ పట్టుకుని యాదగిరి టాకీస్ సెంటర్  దాకా వచ్చేసెయ్! బేరం గీరుతూ కూర్చోక ఆటో దొరికితే. మీ లేడీస్ కు అదో వీక్ నెస్! సెంటర్ కొచ్చేయగానే మెసేజ్ పెట్టు. ఇట్లాగే ఏ టాయ్ లెట్ లోకో  దూరైనా మాట్లాడతా! ఇప్పటికే చాలా టైమయింది. బాస్ పిలవకముందే వెళ్లాలి' అంటూ కాల్ కట్ చేశాడు రాజశేఖర్.

ఒకటి రెండు ఆటోలు వస్తున్నట్లే వచ్చి దూసుకుపోయాయి. జల్లు జోరు పెరిగింది. ఇంటికి కాల్ చేస్తే చాలా సేపటికి గానీ ఎత్తారు కాదు అత్తగారు. 'ఎక్కడున్నావు సులభా?' పెద్దావిడ కంగారు. 'పిల్లలిద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఇప్పటికే నిన్ను గూర్చి అరడజను సార్లు అడిగారు. తొందరగా రా!' ఆమె బెంగ  ఆమెది. 

విషయం చెప్పి 'కాస్త లేటవచ్చేమో అత్తయ్యా! పిల్లలకు సర్ది చెప్పండి! కాస్సేపు చదువుకుని పడుకోమనండి! మీరూ తినేయండి! నా కోసం వెయిట్ చెయ్యద్దు! షుగర్ టాబ్లెట్స్ వేసుకోడం మాత్రం మర్చిపోవద్దు' అని ఫోన్ పెట్టేసింది. 

ఎవరో ఆటోవాడు ఎదురుగా బండి నిలిపి 'ఎక్కడికమ్మా పోవాలి?' అనడిగాడు. 

'చిక్కడపల్లి వస్తావా?' ఆశగా అడిగింది సులభ. 

'సిటీలోకి పర్మిషన్ లేదు మేడమ్! కావాలంటే యాదగిరి సెంటర్ దాకా వస్తా! వందవుద్ది' అన్నాడు కరాఖండిగా.  

బండిలో ఎక్కి కూర్చున్న  తరువాత గొణుక్కుంది సులభ  'అందరూ అంతే! అవకాశం వస్తే ఏదీ  వదిలిపెట్టరు.. ఐదు కిలో మీటర్లు కూడా ఉండదు సెంటర్. ముప్పై అంటేనే గొప్ప. మీటరు వేస్తే పరిస్థితి అర్థమవుతుంది.'

 భర్త చెప్పిన మాట గుర్తుకొచ్చి కిమ్మనకుండా  కూర్చుండిపోయింది. 'ఎట్లాగో అట్లా క్షేమంగా ఇల్లు చేరితే చాలు. అదే పది వేలు' అనుకుంది  పదో సారి. 

వర్షం దంచి కొడుతుంటే టార్పాలిన్ కవర్ రెండు వేపులా కిందికి దించాడు ఆటోఅబ్బాయ్!

 

బండి ఎటు పోతుందో అర్థమవడం లేదు. డైవర్ వేసుకున్న పాన్ పరాగ్ వాసనకు కడుపులో దేవుతున్నట్లుంది.  కర్చీఫ్ తీసి ముక్కులకడ్డు పెట్టు క్కూర్చుంది. 

పది నిముషాలు కూడా నడిచింది కాదు.. బండి ఆగిపోయింది. డైవర్ రెండు మూడు సార్లు  పెడల్ గేర్ లాగి లాగి ట్రై చేశాడు. బండి మొరాయింపులు  మానలేదు.

'ఏమయింది?' భయంగా అడిగింది సులభ. 

వాడు బదులేమీ ఇవ్వకుండా  ఆటో దిగి వెనక ఏదో సరిచేయడానికి తంటాలు పడుతున్నాడు. ఈ సందులోనే రెండు మూడు సార్లు ఫోన్లు. సంభాషణంతా ఏదో అర్థం కాని భాషలోనే. బహుశా గోండు అయుండాలి.

రిపేరింగు  వాడి వల్ల కాలేదు లాగుంది. 'ఆటో దిగండమ్మా!' అన్నాడు టార్పాలిన్  కవరొకటి పక్కకు తొలగతోసి. 

బైటికి తొంగి చూసింది సులభ. కటిక చీకటి. వీధి దీపాలు వెలుగు దూరం నుంచి కనిపిస్తోంది. తనెక్కడుందో అర్థం కాలేదామెకు. 

కిందికి చూస్తే గలగలా శబ్దం. పాదాలు తడిసేటంత లోతులో రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయ్. 

'ఇదేంటి? ధియేటర్ దాకా కదా తీసుకెళ్లాలి' అంది సులభ కోపాన్ని దిగమింగుకుంటూ. 

'అల్లదిగో ఆ ఎత్తు మీద కనిపిస్తావుందే.. అదే  థియేటర్! బండి ట్రబులిచ్చింది. చూస్తున్నారు కదా! దిగి నడుచుకుంటూ వెళ్లండమ్మా.. పైసలిచ్చి' అన్నాడు  నిర్లక్ష్యంగా ఆటో మనిషి.

'ఎట్లానయ్యా! ఇంత నీళ్లల్లో! చీకట్లో! నాకిదంతా కొత్త చోటు!' అంది సులభ మొండిగా. 

'బండి ట్రబులిస్తే నాదా తప్పు!   ఏం మాట్లాడతవ్! ముందు గాడీ దిగుండ్రి! పైసల్దియుండ్రి! ముచ్చట్లు ఆనక ! నే పోవాల!' 

డైవర్ మాటల్లో ఎంతో తేడా! ఏం చెయ్యాలో పాలుపోలేదు బ్యాంకాఫీసర్ సులభాకుమారికి. 

పర్సు  తీసి యాభై నోటు అతగాడి చేతిలో పెట్టింది. 'ఇంకో ఇరవై ఇయ్యమ్మా! ఇంత బారిస్ లో  కూడా గీడ  దాకా తోలుకొచ్చినా. కష్టం చూడరా దొరసానులు!'

వాడి దబాయింపుకు వళ్ళు మండింది. కానీ, ఒంటరి ఆడది. అక్కడున్న పరిస్థితుల్లో ఏం చేయగలదు తను? 

బైలుదేరే ముందు ఆటో నెంబరైనా నోట్ చేసుకోలే.. కంగారులో. ఎంత పెద్ద మిస్టేకయిందో  ఇప్పుడర్థమవుతోంది.

మరీ రచ్చ చేస్తే మొదటికే మోసమవుతుందేమో! వాడు  పర్సు మొత్తం గుంజుకున్నా తానేంచేయగలదు! 

ముందెట్లాగో కొంప చేరాలి. మారు మాట్లాడకుందా మరో ఇరవై వాడి చేతిలో పడేసి బండి దిగిపోయింది సులభ. 

వాన జోరు అట్లాగే ఉంది. వళ్లంతా తడిసి ముద్దయిపోయిందప్పటికే. హ్యాండ్ బ్యాగ్ ను జల్లుకు అడ్డుగా పెట్టుకొని దూరంగా కనిపించే థియేటర్ వైపుకు అడుగులు వేసింది  సులభ. 

నడక అలవాటే పూర్తిగా తప్పిపోయిందీ మధ్యన! పదడుగులు పడేసరికి నీరసం ముంచుకొచ్చింది. ఆయాసం కూడా. థియేటర్ సెంటర్ చాలా మెరకలో ఉంది. అంత ఎత్తు తానిప్పుడు  ఎక్కగలదా!..  అదీ వాన నీరు ధారగా ఫోర్సుగా కిందికి జారుతున్నప్పుడు!

దారి సరిగ్గా కనపడ్డం లేదు. ఎక్కడ ఏ గుంటలేడ్చాయో  పాడు ..  తెలీదు! మ్యాన్ హోల్సు గానీ ఉండి  కాలు  వాటిలో  పడితే! వణుకొచ్చింది సులభకు!  

కాళ్ల కింద నుంచి ఏదో జర జర పాకి పోయినట్లనిపించింది. ఏడుపొక్కటే తక్కువ పాపం  బ్యాంకాఫీసర్ సులభమ్మకు..ఆ క్షణంలో! 

'ఎక్కడికమ్మా! ఈ యేల  అట్లా ఒంటిగా  పడిపోతావుండావు?'  

ఆ గొంతు వినిపించిన వైపుకు చూస్తే ఓ సగం కూలిన పెంకుటింటి  వసారాలో ముసిలామె కనబడింది వానజల్లుకు తడవకుండా ఓ వార కూలబడి!

'ఆ థియేటర్ సెంటర్ దాకా పోవాలవ్వా! అక్కడికి బస్సులొస్తాయిటగా! నాది  సిటీ!' అంది సులభ.

'ఈ ఎత్తు యేపు ఎందుకు బిడ్డా?   అసలే సరిగ్గా ఉండత్తల్లీ అటేపు! ఇంత లావు  వర్షంలో జారకుండా పోగలగవనే! తాగుబోతు సచ్చినోళ్లు అంకాళమ్మ గుడి కాడ అంకఛండాలప్పనులు చేస్తావుంటారమ్మా అహర్నిశలూ! ఒంటరి ఆడబిడ్డవి. ఈ టైములో..  నిన్ను గాని ఇట్లా   చూస్తే  వదిలేస్తారనేనా     త్రాష్టులు!' అంది అవ్వ.

అప్పుడు చూసుకుంది సులభ తన వంటి వంక. వర్షానికి తడిసి ముద్దయిన బట్టలు  వంటిని దాచిపెట్టే డ్యూటీకి ఎప్పుడో రిజైన్ చేసేశాయి. లోపలి తెల్ల రంగులు దుస్తులు  అంత చీకట్లో కూడా మెరుపులొస్తున్నప్పుటు బైటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

ఆటో మనిషి తన వంక అదోలా చూడడం అప్పుడు గుర్తుకొచ్చి సన్నటి వణుకు వచ్చింది.. కానీ తమాయించుకుందెలాగో!

'అవ్వా! ముందు ఇల్లు చేరడం కావాలి  నాకు.  దేవుడిదే భారం ! మూడు కిలో మీటర్లు నడిచొచ్చా! ఇంకో రెండు కిలో మీటర్లేగా..'

'ఇట్టా చుట్టూ  తిరిగిపో తల్లీ!  అయితే ఇంకో రెండు కిలోమీటర్లవుద్ధి ఎక్కువ అయిన ఆలీసం ఎట్లాగూ అయింది గదా! పెద్ద ముండాదాన్ని! ఎందుకు చెబుతా వున్నానో అర్థం చేసుకో బిడ్డా! రోడ్డు వారా లైట్లుంటాయి కిందైతే. వచ్చే పోయే జనాలు కనపడతా వుంటారు. నీ అదురుష్టం బావుంటే అటేపెళ్లే బళ్ళు తగలచ్చు. చౌరాస్తా కాడ పోలీసు ఠాణా కూడా   ఉండింది బిడ్డా!' అంది అవ్వ తడుముకుంటూ చేతిలోకి ఊత కర్ర తీసుకుని ఇంట్లోకి  పోతూ!  

సులభ గొప్ప  మీమాంసలో పడిపోయింది. కష్టమైనా సరే, ఎత్తు దారి ఎక్కేసి తొందరగా సెంటర్ కెళ్లి పోవడమా? 

అవ్వన్నట్లు, పోలీసు స్టేషనూ, జనసంచారం, లైట్లూ ఉండే పల్లం దారెంట పడి సెంటర్ చేరుకోడమా?  

పెద్దావిడ. ఈ లొకాలిటీ మనిషి. ఏ అనుభవం మీద ఇంతలా చెబుతోందో? కాస్త చుట్టు తిరుగుడైనా రోడ్డు వారగా పోవడమే మేలు అనిపించింది సులభకు. వచ్చిన దారినే మళ్లీ  కాళ్లూ కాళ్లూ కొట్టుకుంటూ వెనక్కు  తిరిగి రోడ్డు బాట వేపుకు నడక మొదలుపెట్టిందాఖరుకు. 

రోడ్డు మీద ఇందాక తనెక్కి వచ్చిన ఆటో కనిపించలేదు! ముసలవ్వ చెప్పిన పోలీస్ ఠాణా దాటుతుండగా ఉప్పల్ గుండా పోయే బస్సొకటి కనిపించింది.  చెయ్యెత్తంగానే ఠక్కుమని ఆగింది. గభాలున ఎక్కి ఓ  సీటులో కూలబడ్డ  తరువాత గాని ఊపిరి తేలికగా వచ్చింది కాదు. 

'బాగా తడిసిపోయారే.. పాపం!'  అంది లేడీ కండక్టర్ సికిందరాబాద్ స్టేషన్  టిక్కెట్ కోస్తూ! 

బస్సు సిటీ జౌట్-స్కర్ట్స్ లోకి  ఎంటరవగానే దిగిపోయి   దొరికిన ఆటో పట్టుకుని ఇల్లు చేరింది సులభ. అప్పటికి  రాత్రి పది..  పది!  . 

అత్తగారు బోజనం కూడా చేయకుండా జాగారం చేస్తున్నారు.. పాపం.. తన కోసమే   ఎదురు తెన్నులు చూస్తూ. పిల్లలు తమ తమ రూముల్లో పడి నిద్రపోతున్నారు. భర్తకు మెసేజ్ పెడదామని సెల్ బయటకు తీస్తే అప్పటికె ఐదు  మిస్డ్ కాల్స్ .. పది  మెసేజెస్సూ! 

తనే కాల్ చేసింది భర్తకు!  వెంటనే ఎత్తేడు రాజశేఖర్! ఎంత సేపు అలాగే ఫోనులో భోరుమని ఏడ్చేసిందో మాటా పలుకూ లేకుండా! అత్తగారు అలా అమ్మలా వెన్ను నిమురుతూనే ఉన్నారు భర్తతో సంభాషణ కొససాగుతున్నంత  సేపూ!

---

మర్నాడు బ్యాంకుకి శెలవు పెట్టేసింది సులభ. అటు మర్నాడు బ్యాంకు కెళ్లినప్పుడు రాత్రి అనుభవాన్ని తన కొలీగ్సుకు  చెబుతుంటే.. అంతా విన్న తరువాత మూర్తి అన్నాడు  చివర్లో 'సులభగారూ! మీరు ఆ అవ్వ చెప్పినట్లు విని మంచి డెసిషన్ తీసుకున్నారు.  ఆ రూట్ లో పైకి  వెళ్లకపోవడమే మంచిదయింది. నిన్న రాత్రి  సరిగ్గా అదే స్పాట్లో .. పాపం..  గ్యాస్ కంపెనీలో పన్చేసే      పి ఆర్ వో.. ఎవరో పాపం.. ఆవిడ.. దొంగ రాస్కెల్స్ బారిన  పడి సర్వనాశనం జరిగపోయింది  !' అంటూ ఈనాడు రంగారెడ్డి ఎడిషన్ లోని ఓ పేజీ పరిచి చూపించాడు. 

'సామూహిక అత్యాచార ప్రయత్నం'  శీర్షిక కింద ఫలానా మహిళా ప్రయాణీకురాలిపై తుంటరులు  తలపెట్టిన గ్యాంగ్ రేపుకు  సంబంధించిన వార్తాంశం అది. 

తమ తమ వాహనాలలో ఎక్కే ఒంటరి స్త్రీలను మాయమాటలు చెప్పి దారి మళ్లించడం. ఆనక మిత్రబృందంతో  కలసి లొంగతీసుకోవడం..  గురించి వివరంగా రాసిన ఆ కథనం  చూడగానే  సులభ గుండెలు ఒక్కసారి గుభేల్మన్నాయి!   

ఠాణాలో స్టేషన్ ఆఫీసర్ వెనక చేతులు కట్టుకు నిలబడ్డ రేపిస్టుల ఫొటోలో  మొన్న రాత్రి తాను ఎక్కిన ఆటో డ్రైవరు కూడా ఉండడం చూసి ఆమె అవాక్కయిపోయింది కొన్ని క్షణాలు!

అంతకు మించి షాకిచ్చిన వార్తాంశం  అక్కడే మరోటి కనిపించింది సులభకు! 

అదే ఫొటోలో పోలీసులకు అసుంటా దూరంగా బెంచీ మీద ముణగదీసుకుని కూర్చోనున్న ఆడమనిషి..  వేరెవరో కాదు..   'మెరక బాటలో  తనను పైకి వెళ్లకుండా వారించిన  పుణ్యమూర్తి .. ముసిలవ్వ! 

ఆ పాడు   ఘోరానికి    సరిగ్గా తన కొంపే వేదికవడంతోసరిగ్గా   కళ్లు లేకపోతేనేమీ, ఆ గుడ్డి అవ్వ చూడలేకపోయిందిట!   చేతిలోని ఊత కర్రతో అందినోడి నడ్డి   అందినట్లు విరగ్గొట్టేసివట !    

'ఆనక పోలీసోళ్లకు  సమాచారం అందించిందీ  ఆ ముసిల్దే మేడమ్! మా పేటలో అందరూ మా గొప్పగా చెప్పుకుంటుండ్రు.  ఆ రేప్ కేసు  త్రాష్టుల్లో తన కొడుకుండాడని  తెలిసీ    వెనక్కి తగ్గడం లేదీ    గుడ్డితల్లి' అంది బైటి  నుంచి      టీ.. కాఫీలు తెచ్చిచ్చే  మహాలక్ష్మి.  

'నువ్వు   అడ్డదారిలో పోతుంటే ఆపగలిగిన ఆ గుడ్డితల్లి తన  కొడుకు అడ్డదారిలో పోతుంటే ఆపలేకపోయింది చూశావా సులభా!సరే అయినా సరే..     చట్టానికి పట్టిచ్చే  అవకాశం రాగానే అంతలా తెగించేసింది! .. రియల్లీ హ్యట్సాఫ్ టు ధి  గ్రేట్ మదర్!' అంటూ విషయం విన్న రాజశేఖర్ కామెంట్ పాస్ చేస్తుంటే       సులభ  కళ్లల్లో నీళ్లు  గిర్రున  తిరిగాయి! 

కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక 27 -01 -2013 ప్రచురితం)

***


స్కెచ్ - కథానిక -కర్లపాలెం హనుమంతరావు (ఆంధ్రభూమి వారపత్రిక-2౦ -10 -2008- ప్రచురితం)

 


 పున్నారావు ఫ్యామిలీ తిరుపతి వెళ్లి తిరుగొచ్చే సరికి దొంగలు పడి ఇల్లు గుల్లయింది. పదిగ్రాముల బంగారం, పాతిక్కిలోల వెండి, పట్టుచీరలు, నగానట్రా అంతా కలిపి సుమారు ఐదు లక్షల వరకు కరావడి అయిందని పున్నారావు అర్థాంగి కనకమ్మ ఒకటే గగ్గోలు.

'పోలీసు కంప్లయింట్ ఇద్దామండీ!' అని మొత్తుకుందా ఇల్లాలు. గయ్యిమన్నాడు పున్నారావు 'మతుండే మాట్లాడుతున్నావా? పోలీసులు ఆరాలు మొదలుపెడితే పోయేది ముందు మన పరువే!'అంటూ.

పున్నారావు వాటర్ వర్క్స్ డిపార్డ్ మెంటులో సీనియర్ అకౌంటంట్ హోదాలో ఉన్నాడు. సోదాలు మొదలుపెడితే ఆదాయానికి మించిన ఆస్తులు బైటకుపొక్కుతాయని అతగాడి బెంగ.

ఈ ఘటన జరిగిన పదిరోజుల తరువాత కనకమ్మ సాయిబాబా గుళ్లో శని వదిలించుకొనే పూజేదో చేయించడానికని వెళ్లినప్పుడు వెనక వీధి  సూర్యారావుగారి పెళ్లాం మెళ్లో వేళ్లాడే గొలుసు అచ్చం తన మెళ్లో ఉండేది లాంటిదే అనిపించిందిట. రొప్పుకుంటూ రోసుకుంటూ ఇంటికొచ్చి పడి మొగుడి పీక పట్టుకుంది.. ఏదో ఒకటి చేసి తీరాల్సిందనంటూ. 

కనకమ్మకు  తనే వెళ్లి ఆరాలు తీద్దామనివుంది కానీ, వాళ్లెవరో కొత్తగా వచ్చినవాళ్లు. కాలనీలోకొచ్చి నెలరోజులు కూడా కాలేదు. ఎట్లాంటి మొరటు మనుషులో బొత్తిగా తెలీదు.

పున్నారావు పూనుకుంటే కాని పని అయ్యే దారి లేదు. ఆయనెందుకో ఈసారి బెల్లం కొట్టిన రాయికి మల్లే  ఉండిపోయాడు!

ఆడవాళ్ల నోట నువ్వు గింజైనా నానదు కదా! ఆ నోటా ఈ నోటా కాలనీ అంతా పాకిపోయింది దొంగతనం వ్యవహారం..  ఎవరో పనిగట్టుకుని మరీ ప్రచారంరం చేసినట్లు! సూర్యారావు ఫ్యామిలీకి కష్టాలొచ్చిపడ్డాయి. సామాను కొనుక్కుని సూర్యారారావు  తిరిగొచ్చేటప్పుడు  ఒకటికి రెండు సార్లు చుట్టూ తరచి చూసుకుంటున్నాడు కాలనీలోని పచారీ దుకాణంవాడు. గుళ్లో ఆయబ పెళ్లానికి  శఠగోపం పెట్టేటప్పుడు హారతి పళ్లెం తగినంత దూరంలో ఉండేటట్లు జాగ్రత్త పడుతున్నాడు పూజారిగారు. సూర్యారావు కొడుకును ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనివ్వడానికి తటపటాయిస్తున్నది కాలనీ యువ క్రికెట్ టీమ్.  ట్రెజరర్ గా ఎన్నుకొని నెలన్నర కూడా కాలేదు.. ఏదో ఓ మిష మీద సూర్యారావును తొలగించాలనే ఆలోచనలో పడింది కాలనీ వెల్ఫేర్ సొసైటీ .  ఇలాంటి పరిస్తితుల్లో సూర్యారావు కాలనీ నుంచి ఒకరాత్రి  కాపురం ఎత్తేశాడు ఎవరికీ చెప్పాపెట్టకుండా.

ఏడాది గడిచింది.

పున్నారావు రిటైరయాడు. పెన్షన్ క్లియరెన్సు కోసం తత్సంబంధిత ఆఫీసుల చుట్టూ  తిరుగుళ్ళు అయిన తరువాత చివరి అంచెకు ముందున్న టేబుల్ దగ్గరి కొచ్చింది ప్రస్తుతం ఫైల్. అక్కడ ఉన్నది సూర్యారావే అయిపోయాడు.

నేరుగా వెళ్లి కలిసే ధైర్యం చాలక  చిన్నప్పటి స్నేహితుడు కృష్టంమూర్తిని వెంట పెట్టుకుని వెళ్ళాడు పున్నారావు. సూర్యారావు కాలనీలో ఉండి, పోయిన కిరాయి ఇల్లు కృష్ణమూర్తిదే. ఆ విధంగా ఆ ఇద్దరికి కావలసినవాడు కృష్ణమూర్తి.

పని అనుకున్న దానికన్నా ముందుగా పూర్తి చేసిపెట్టాడు సూర్యారావు. కరిగి నీరైపోయాడు పున్నారావు. ఛాంబర్లోకి తనే స్వయంగా వెళ్లి బాస్ సంతకం చేయించుకుని వచ్చి పున్నారావు చేతిలో పెన్షన్ ఆర్డర్   పెడుతున్నప్పుడు 'సూర్యారావుగారూ! మీతో ఒకసారి మాట్లాడాలి. దయచేసి ఒకసారి అటు వస్తారా?' అంటూ క్యాంటిన్ కు  తీసుకు వెళ్లాడు. 

బిల్లు వచ్చే సమయంలో గభాలున సూర్యారావు చేతులు రెండూ పట్టేసుకుని  'సారీ సర్! ఐ యామ్ ఎక్స్టీమ్లీ సారీ! ఆ రోజు మీ ఫ్యామిలీ మీద అలాంటి అభాండం వేయాల్సి వచ్చింది. అట్ దట్ టైమ్ ఐ వాజ్ టోటల్లీ ఇన్ ఏ హెల్ప్ లెస్ కండిషన్!' అన్నడు వణికే గొంతుతో.

సూర్యారావు నిదానంగా అన్నాడు 'మీ ఇల్లు వీధికి అటు తూర్పు ముఖంలో ఉంది. మా ఇల్లు పక్క వీధిలో ఇటు పడమటి వైపుకు ఫేస్ చేసి ఉంది. పెరట్లోని గోడ ఒక్కటే కదా మనకు కామన్? అంత మాత్రానికే మీ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని గోడ దూకి దొంగతనం చెయ్యాల్సిన అగత్యం మాకు ఎందుకుంటుంది మాష్టారూ? చేయని నేరాన్ని చేసినట్లు ప్రచారం చేసి మేమక్కడ ఉండలేని పరిస్థితి కలిపించారు ఎవరో.. ఎందుకో! నా భార్య మెడలోని గొలుసు పెళ్ళి నాడు వాళ్లమ్మ తన మెడలో వేసింది. పాతికేళ్ల బట్టి ఆమె అది వేసుకు తిరుగుతోంది. దాని మీద అంత రచ్చా? ఇంకా ముందు ముందు ఏమేమి వినాల్సొస్తుందోనని భయపడి, నేనే వాలంటరీగా ఇల్లు ఖాళీ చేసేశాను. కృష్ణమూర్తిగారు నైబర్ కనక సరిపోయింది. లేకపోతే లైఫ్ లో ఇలాంటి చేదు ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఫేస్ చెయ్యాల్సొచ్చేదో హోల్ ఫ్యామిలీ! '

'మీరు నన్ను క్షమించాలి.  క్షమించినా, క్షమించకపోయినా ఉన్న విషయం ఒకటి చెప్పేస్తాను. చేసిన పాపం చెబితే పోతుందంటారు. నిజానికి ఆ రోజు మా ఇంట్లో ఏ దొంగతనం జరగనే లేదు. నేను ఏమరపాటుతో ఉండుంటే జరిగి ఉండేదేమో! సిగ్గు విడిచి మీకు నిజం చెబుతున్నా సూర్యారావుగారూ! నా డాటర్, మీ సన్ ఆ సొమ్ముతో ముంబయ్ చెక్కేసి పెళ్లిచేసుకుందామనే ప్లానులో ఉన్నారు అప్పట్లో! మా తిరుపతి ప్రయాణానికి ఒక్క రోజు ముందు తెలిసింది నాకా  సంగతి. మా వాళ్లను ముందు  రైలు స్టేషనుకు పంపించి ఇంట్లోని సొమ్మును ఇదిగో ఈ కృష్టమూర్తి గాడకి అప్పగించి, ఆ తరువాత వెళ్లి వాళ్లను కలిశాను. సొమ్ము దొరకలేదు కాబట్టి మీ పిల్లవాడి లేచివెళ్ళిపోయి పెళ్లిచేసుకునే ప్లాన్ కేన్సిల్ అయిపోయింది. మా అమ్మాయికి ఫేక్  ప్రేమ విలువ ఎట్లా ఉంటుందో అప్పుడు తెలిసొచ్చింది.' అని లేచాడు పున్నారావు.

'నిప్పు రవ్వంత మిగిలి ఉన్నా ఎప్పటికైనా ప్రమాదమే' అని ఎరిగి ఉన్నవాడిని కాబట్టి ఆ దొంగతనం నాటకం నిజంగానే కంటిన్యూ కానించా!'

సూర్యారావు మరింక మాటా పలుకూ లేకుండా లేచి వెళ్లిపోయాడు.

 

'నా ఇంట్లో నాకు తెలీకుండానే ఇంత కథ నడిచిందిట్రా?' అని అబ్బురపోయాడు అంతా వింటున్న కృష్ణమూర్తి సగం దారిలో.

'అసలు కథ అది కాదురా కృష్టమూర్తీ! సొమ్ము ఖర్చవుతుందన్న కాపీనంతో ఇక్ష్వాకుల కాలం నాటిదైనా నువ్వా కొంపను బాగు చేయించవు! చిన్న చిన్న రిపేర్లైనా తెగించి చేయిస్తే ఇన్ని సమస్యలుండకపోను. మీ కిరాయి వాటా బాత్ రూము గోడలకు ఎన్ని కంతలున్నాయో నీకు తెలీదా? మగవాళ్లం మనకు పట్టింపేమీ ఉండదు కానీ, ఫ్యామిలీ లేడీసుకు ఎంత అంబ్రాసింగుగా ఉంటుందో నీ కేం తెలుసు? ప్రవరాఖ్యుళ్లా ఇప్పుడు పేద్ద ఫోజు పెట్టిన ఈ పెద్దమనిషి   సూర్యారావు ఏం చేసేవాడో తెలుసా? మా ఇంట్లోని ఆడపిల్లలు స్నానానికని వెళ్లినప్పుడల్లా గోడకు అటువైపు నున్న వాళ్ల స్నానాల గదిలోకి దూరి కంతలకు కళ్లప్పగించి చచ్చేవాడు. పెద్దది ఎట్లాగో భరించింది కానీ కొన్నాళ్లు, చిన్నది తట్టుకోలేక వాళ్లమ్మకు చెప్పి ఒహటే ఏడుపు. నీ  బాస్ రికమండేషన్ మీద నువ్వా పోర్షన్  వాడికి ఇవ్వక తప్పింది కాదని నాకు తెలుసనుకో! నీ నిస్సహాయత తెలుసు కనకనే నీ సైడ్ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నేనూ రిటైర్మెంటుకు దగ్గర్లో ఉండినవాడినాయ.  పెన్షన్ పేపర్లు క్లియర్ చేసే డ్యూటీలో ఉన్న ఈ సూర్యారావుతో నేరుగా సున్నం పెట్టుకుంటే ఎమవుతుందోనని భయం! కనకనే ఇట్లా కాలనీ జనాలను అడ్డమేసుకుని  రచ్చ చేసి  వాడంతట వాడే కొంప ఖాళీ చేసి వెళిపోయే స్కెచ్ ఇంత పకడ్బందీగా వేసింది నాయనా!'

'మరి వీడు చేసిన పనికి పాపం ఆ పిల్లగాడిని ఎందుకురా అంతలా బద్నాం చేయడం?' అన్నాడు కృష్ణమూర్తి నిష్ఠురంగా.

'వాడూ ఏమంత తక్కువ తినలా బాబూ? పెరటి గోడ పక్కన పెరిగే డొంకలో దూరి కూర్చుకుని పద్దస్తమానం ఫోనులో బూతు సినిమాలు చూస్తుండేవాడు. ఆ సౌండు గోలలు పసిగట్టి నేనే రెండు, మూడు సార్లు  గడ్డిపెట్టా! అయినా బుద్ధి రాలా అబ్బకు మల్లేనే' అన్నాడు పున్నారావు. కృష్ణమూర్తి మర్నాడే పాత ఇంటికి మరమ్మత్తులు మొదలుపెట్టాడు.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక-2౦ -10 -2008- ప్రచురితం)

***

 

చిదంబర రహస్యం – కథానిక -కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి డిసెంబర్,4 2008 ప్రచురితం)

 


'నిజం చెప్పండి! డాక్టర్ల దగ్గర రోగంలానే, డిటెక్టివ్ల దగ్గర నిజం దాస్తే నష్టం.' అన్నాడు ప్రైవేట్ డిటెక్టివ్ చిదంబరం ధర్మతేజ  తటపటాయింపు తగ్గించే నిమిత్తం స్టేట్ ఎక్స్ప్రెస్ టిన్ అతని ముందుకు తోసి..  తానోటి వెలిగించి.

'నో.. థేంక్స్!' అంటూ నోరు విప్పాడప్పుడు ధర్మతేజ.

చెబుతోన్నంత సేపూ అతగాని మొహం కందగడ్డే. ఆఖర్లో అన్నాడూ 'ఇలా చెప్పడం గుండెలు కోసినట్లుంది. అంతగా ప్రేమిస్తున్నా ఆమెని. అందుకే ముందు నిజమో కాదో తేలాలి'

'నిజమని తేల్తే?'

'చంపుకోడవేఁ. ముందు తననీ.. ఆనక నన్ను నేను' అన్నాడు ఠకీమని. వెంటనే  తమాయించుకుని 'మీ ఫీజెంతో చెప్పండి ముందు!'  అనడిగాడు టాపిక మారుస్తూ.

'ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడివ్వండి! బేలెన్స్ టూ పాయింట్ ఫైవ్  లేక్స్ .. ఒన్స్ కేస్ ఈజ్ క్లోజ్డ్'

సైన్ చేసిన చెక్ అందిస్తూ 'మళ్లీ ఎప్పుడు కనిపించాలి'  

లేచి నిలబడుతూ అడిగాడు ధర్మతేజ..

'డే ఆఫ్టర్ టుమారో! ఈవెనింగ్.. ఎగ్జాట్లీ.. బై సిక్స్ వో క్లాక్.  మా ఇంట్లో కలుద్దాం. 'బిఫోర్ దట్.. ' అంటూ ధర్మతేజతో కలసి బైటికి నడిచాడు చిదంబరం.

'యూవార్ వెల్కం. బట్.. తనకివేమీ తెలీకూడదు' విజిటింగ్ కార్డిచ్చి ముందుకు కదిలిపోయాడు ధర్మతేజ.

 

హైదరాబాద్ అమీర్ పేట్ లో 'ఫ్లై డాడీ' ఎయిర్ లైన్స్  ఏజెన్సీ యజమాని ధర్మతేజ. వెరీ బిజీ అండ్ సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్శన్. భార్య శకుంతలంటే ఏడో ప్రాణం. ఆరో ప్రాణం వాళ్ళిద్దరి మూడేళ్ల పాప.

హద్దులు మీరిన పొసెసివ్ నెస్ అనుమానాలకు తావిస్తుందంటాడు ఫ్రాయిడ్. మూవీ-యాక్టింగ్ కోర్సులో ట్రయినింగయ్యేందుకని వచ్చిన బాబాయి కొడుకు భరత్ వైపుకు భార్య చూపు మళ్లినట్లు ధర్మతేజ అనుమానం.

బెడ్ రూంలో దిండు కింద అతగాడి అండర్-వేర్ కనిపించినప్పట్నుంచి ఆ మధన. బైటపడి అడిగేందుకు సంస్కారం అడ్డు! కడుపులో దాచుకునేందుకు ప్రేమ ఒప్పదు.

'అనుమానం అంటూ మొదలయ్యాక జరిగేవన్నీఅది బలపడేలానే  ఉంటాయిలే.. సహజం. 'ఇలాంటి సంకటాలొచ్చినప్పుడే మనకు నిజాలు తేలాలంటే నిఖార్సైన  డిటెక్టివ్  అవసరం' అంటూ కథంతా విన్న క్లోజ్ కాలేజ్‍మేట్ శశిధర్ మిత్రుడికి చిదంబరాన్ని సూచించాడు.

---

కేస్ విషయాలన్నీ డిక్టేటేషన్లో నోట్సుగా రాసుకుంటూ పి.ఏ మిస్ రోజా అడిగింది 'బాస్.. మీరీ మిస్టరీని ఎట్లా ఛేదించబోతున్నట్లో?'

'మామూలే! ఉందిగా మన 'మిషన్ ఫ్రాంక్' తంత్రం!' అన్నాడు చిదంబరం చిర్నవ్వులు చిందిస్తూ.

'మనమీ తంత్రం మీద మరీ ఎక్కువ డిపెండవుతున్నామని నా  అనుమానం బాస్! మొన్నంటిదంటే అదో అనెడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ కపుల్ కేస్..'

‘ముందు నీ డౌట్ క్లియర్ చెయ్యడం ముఖ్యం!’ అంటూ రోజా  గ్లాసెస్  అందుకుని  స్పైక్స్ మీద  సమ్‌-థింగ్ నాన్-స్టికీ ఆయింట్ మెంట్ లాంటిదేదో పూసి  పెట్టుకోమని తిరిగిచ్చేశాడు చిదంబరం.

జోడు పెట్టుకున్న రోజాకు కొద్ది క్షణాల్లోనే కళ్ళు రెండూ తేలిపోతున్నట్లో ఫీలింగ్ మొదలయింది!

చిదంబరం జస్ట్ ఓ మూడే మూడు ప్రశ్నలు   వేసి జోడు తీసేయించాడామె చేత.

'స్పైక్సు క్లీన్ చేసుకో ఆనక!' అంటూ రోజా చెప్పగా తాను విన్నది రిపీట్ చేసి 'యామై రైట్?' అనడిగాడు మిస్టీరికల్ గా నవ్వుతూ చిదంబరం.

రోజా సిగ్గుపడి తల తిప్పుకుంది.

---

నెక్స్ట్ డే సండే! ఈవెనింగ్  చిదంబరం ఇంటికి ధర్మతేజ దంపతులు, భరత్ తో సహా కలసి వచ్చారు. మిస్ రోజా ఆ సమయంలో అక్కడే ఉంది ఏదో టైపింగ్ వర్క్ ఎడిట్ చేసుకుంటో.

చిదంబరం బ్యాచిలరే ఇంకా. 

పార్టీ మధ్యలో చిదంబరం ధర్మతేజనో సైడుకు తీసుకెళ్లాడు.  'మిషన్ ఫ్రాంక్' ఆపరేషన్  గురించి వివరిస్తుంటే ధర్మతేజకు ఇదంతా 'ట్రాష్' అనిపించింది. ఆ మాటే అన్నాడు కూడా.

'మీ నమ్మకం కోసం మీ మీదే ప్రయోగించి చూపిస్తానోసారి.. ఇఫ్ యూ పర్మిట్ మీ!' అన్నాడు చిదంబరం.

ధర్మతేజ తలాడించాడంతో. 'మిషన్ ఫ్రాంక్' ఆపరేషన్ యథావిధిగా రోజా మీదకు మల్లేనే ఓ ఐదు నిమిషాలు ఆపరేట్ చేసి అనంతరం  చిదంబరం చిలిపిగా  'సార్! తమరూ తక్కువేం తినలేదుగా మరి..!' అంటూ  ధర్మతేజ ముఖతః తాను విన్న సమాచారం కొంత తిరిగి వినిపించాడు.

ఖంగు తిన్నా.. వెంటనే తెప్పరిల్లి అన్నాడు ధర్మతేజ డిఫెన్సివ్ గా 'దెన్ ఐ వజ్ ఇన్  యన్ ఎడొల్సెంట్ స్టేజ్..! శకుంతల పరిచయం తరువాత నా సర్వస్వం తనే!  పాప మీద ఒట్టు'

'ఓకే సార్! వై షుడై హేవ్ ఎనీ బిజినెస్ విత్ ఆల్ దీజ్ యువర్ థింగ్స్! ఇదైనా  జస్ట్ ..మీకు ఈ  మిషన్ ఫ్రాంక్ ఆపరేషన్ మీదున్న  అపోహలన్నీ తొలగిద్దామనే!' అన్నాడు చిదంబరం తన బిజినెస్ మార్క్ చిర్నవ్వులు చిందిస్తూ.

'ఇప్పుడైనా మీకు నమ్మకం కుదిరిందనుకుంటా?' అని అతగాడు అడిగినప్పుడు తలాడించక తప్పలేదు ధర్మతేజకు.

'గుడ్! ఇదే ట్రిక్ ఇప్పుడు మీ భరత్ మీదా ప్రయోగిద్దాం! అతగాడి నోటి నుంచి వచ్చే మాటలే నా ఇన్వెస్టిగేషన్ అఫిషియల్ రిపోర్ట్ సర్! ఈ మేటర్ వివరించడం కోసమే మిమ్మల్నీ పై అంతస్తు దాకా  తీసుకొచ్చింది' అంటూ ధర్మతేజతో సహా కిందికి దిగి వచ్చేశాడు చిదంబరం.

ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే శకుంతలనీ, పాపనీ ఇల్లు చూపించే నిమిత్తం లోపలికి తీసుకెళ్లివుంది మిస్ రోజా. భరత్ ఒక్కడే  టీ.వీ చూస్తున్నాడు. అప్పుడే లోపలికొచ్చిన చిదంబరాన్ని, ధర్మతేజను చూసి తన కళ్లజోడు టీ పాయ్ మీద పెట్టి వాష్-రూం లోకి వెళ్లాడు 'జస్ట్ టూ మినిట్స్ ప్లీజ్' అంటూ భరత్.

భరత్ తిరిగొచ్చే లోగా ఆపరేషన్ ఫ్రాంక్ సీన్ కు సెటప్పంతా  సిద్ధం చేసుంచాడు చిదంబరం.

 తిరిగొచ్చి జోడు తగిలించుకున్న భరత్ ఒక్కరనిముషంలోనే విచిత్రంగా బిహేవ్ చెయ్యడంతో ధర్మతేజకు నమ్మకం కుదిరింది. 'ఇతగాని మైండ్  ఇప్పుడు పూర్తిగా మన అధీనంలోనే ఉంది మిష్టర్ ధర్మతేజా!  డైరెక్టుగా మీ మనసులోని శంకలన్నిటినీ మిరే అడిగి తీర్చుకోండి' అన్నాడు చిదంబరం.

ధర్మతేజను వేధించే సందేహానికి  భరత్ ఇచ్చిన సంజాయిషీ   'శకుంతల నాకు సిస్టర్తో సమానం. తనక్కూడా నాలానే  మూవీలంటే మహా పిచ్చి. బ్రదర్ కేమో అవంటే అస్సలు పడదు.  సినిమా కబుర్ల కోసమని పాపం  నాతో భేటీలకు తపించేది వదినమ్మ. అంతకు మించి.. పాపం.. సిస్టరిన్లాకి మనసులో ఎవరి మీదెలాంటి  పర్శనల్ ఇంట్రెస్టూ లేదు. అట్లా ఆలోచించడమే మహా పాతకం!'

'అద్సరేరా! మరా  బెడ్ రూంలో పిల్లో కింద నీ డర్టీ ఇన్-సైడ్ థింగ్? దాని  మేటరేంటి బేఁ? ముందది తేల్చి చావు!' 

కంట్రోల్ తప్పుతున్న ధర్మతేజను చిదంబరం  నిలవరించే ప్రయత్నం చేస్తున్నా.. భరత్ లో మాత్రం ఏ వికారం లేదు.  అంతే ప్రశాంతంగా జవాబులివ్వడం చూస్తే 'మిషన్ ఫ్రాంక్' పనిచేసే తీరుకు రివ్యూస్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వక తప్పదెవరైనా.

ఆఖరు ప్రశ్నగా ధర్మతేజను ఇన్నాళ్లు సలిపేస్తోన్న    దిక్కుమాలిన సందేహానికీ భరత్ ఎంతో కూల్ గా ఇచ్చిన  సమాదానం

 'పడగ్గదిలో మేం పిచ్చాపాటీలో ఉండంగా బొద్దింకోటి హఠాత్తుగా నా స్మాల్ నిక్కర్లోకి దూరిందన్నయ్యా! చిన్నప్పట్నుంచి నాకు బొద్దింకలంటే చచ్చే భయం. నా చిందులు అవీ చూళ్ళేక పాపం వదినమ్మే చొరవ చేసి నిక్కర్లన్నీ కిందకి లాగేసింది. ఇంతలోనే ఇంట్లోకి  మీ సడెన్ ఎంట్రీ.  ఆ కంగార్లో ఏది పికప్ చేసుకున్నానో, ఏది అక్కడ వదిలేశానో ఐడియా లేదు.   అందులో ఏదో ఒకటి మీ పిల్లో కిందకు వెళ్లిందనుకుంటా! అన్నెససరీ డౌట్సన్నింటికీ  అది కారణం అవుతుందేమోనన్న వదినమ్మ భయం వల్లే ఇప్పుడీ  అల్లరంతా!  అన్నం పెట్టి ఆశ్రయమిచ్చే అన్నపూర్ణమ్మ వదిన. ఎవరా దృష్టితో చూసినా రౌరవాది నరకాలు పట్టిపోక తప్పదు!' అంటూ కుమిలిపోయే భరత్ ను చివరికి ధర్మతేజే దగ్గరకు తిసుకుని అనునయించాల్సిన  పరిస్థితి వచ్చిపడింది. 

'మిషన్ ఫ్రాంక్' ఇన్ఫ్లుయెన్స్ మనిషి మైండ్ మీదుండేది జస్ట్ ఫస్ట్ ఫైవ్ మినిట్సేనని చిదంబరం ముందుగానే   చెప్పుండడం వల్ల  భరత్ ఆ బేడ్ మూడ్ నుంచి   బైటికి రావడం ధర్మతేజలో మళ్లీ ఏ డౌట్సుకూ కారణం కాలేదు. అతని అన్ని డౌట్సూ పర్మినెంట్ గా క్లియరవడంతో శకుంతల, పాప రోజాతో తిరిగొచ్చేసరికి వాతావరణం సాధారణ స్థితికొచ్చేసింది. అందరూ నవ్వుతూ పార్టీ పూర్తిచేసుకుని ఆనందంగా  ఇళ్లకు వెళ్లే వేళకు సమయం రాత్రి పన్నెండు దాటింది.

---

నెక్ట్స్ డే శకుంతల దర్మతేజ ఆఫీసుకొచ్చి చేతులు పెట్టుకుని కన్నీళ్లుపెట్టుకుంది 'నా కాపురం నిలబెట్టారన్నయ్యా! మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది' అంటూ.

'మీరు  రుణపడి వుండాల్సింది నాకు కాదు మ్యాడమ్! మీ మూడేళ్ల  పాపకు. బంగారు బొమ్మలా ఉన్న  ఆ చిన్నారి తల్లికి అమ్మానాన్నా లేకుండా చేసేందుకు నా మనసొప్పింది కాదు. ఎట్లాగూ అన్నయ్యా అన్నారు కాబట్టి, సోదర భావంతో ఓ చిన్ని సలహా! మీరన్నట్లు ధర్మతేజ మ్యారేజ్ కి ముందు ఏమైనా చెస్తే చేసుండచ్చేమో! ఒన్స్ హి సా యూ.. హి హాజ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ యూ ఓన్లీ! ఆ వైపు నుంచి కూడా నేను ఇన్వెస్టిగేట్ చేసి చెబుతున్న మాట తల్లీ ఇది! హి ఈజ్ లవింగ్ యూ మోర్ దేన్ హి హిమ్ సెల్ఫ్! పగలు, ప్రతీకారాలు బయటి లోకానికి. పగలూ రాత్రి ఒకే చూరు కింద ఒకరికి ఒకరుగా బతికే భార్యాభర్తలకు కాదు. దయచేసి ఇహ ముందైనా కన్నబిడ్డ కోసం  కట్టుకున్న భార్యాభర్తలు మీరు   కట్టు నుంచి విడిపోకండి! ధర్మతేజకైనా ఇదే చెబుదును కానీ.. ఆ అవసరం లేదిప్పుడు.  అమ్మానాన్నల కలహాలతో కన్నపిల్లల జీవితాలు ఎంతలా కల్లోలమవుతాయో అనుభవించిన ఓ అనాధబాలుడిగా మీకు ఇదే నేనిచ్చే  సలహా' అన్నాడు డిటెక్టివ్ చిదంబరం.

---    

మర్నాడు ధర్మతేజ ఇచ్చిన బేలెన్స్ ఎమౌంట్ చిదంబరం బ్యాంక్ ఎకౌంటులో జమ చేస్తూ రోజా అడిగింది 'బాస్! నాకింకా నమ్మబుద్ధవడంలేదు! నిజంగా ఇదంతా   'మిషన్ ఫ్రాంక్' తాలుకూ మిరకలేనంటారా? ఏళ్ల బట్టి మనుషులు గుండెల్లో అదిమిపట్టుంచుకున్న నిజాలను వెలికి తీసే స్ప్రేలు ఉన్నాయంటారా?'

'లేవు  రోజా! ఉండే అవకాశాలు కూడా లేవు' చిద్విలాసంగా నవ్వాడు  చిదంబరం.

నోరెళ్లబెట్టింది మిస్ రోజా. 'మరి నా నుంచి, మిస్టర్ భరత్ నుంచి ఫ్యాక్ట్స్ అలా ఎలా  రాబట్టారు బాస్?'

'ధర్మతేజ నుంచి కూడా రాబట్టాను మేడమ్ రోజాగారూ! మీ దాకా ఆ సంగతి ఇంకా రానీయలేదంతే! నిన్న మనాఫీసులో నువ్వు బైటపెట్టినట్లు నేను చెప్పిన విషయాలేవీ నిజానికి  నువ్వు నిజంగా బైటపెట్టినవి కాదు. కేసు తీసుకున్న వెంటనే నేనొక్కణ్ణే వెళ్ళి ముందు మిసెస్ ధర్మతేజను వంటరిగా కలసి  గట్టిగా నిలదీసిన విషయం ఎవరికీ తెలీదు. ఆమె కన్ఫెషవుతూ కారణంగా చెప్పుకొచ్చిన ధర్మతేజ ప్రీ మేరీడ్ లైఫ్ లోని రిలేషన్స్ గ్రంథంలో ఓ ఛాప్టర్  తమది కూడా ఉంది మ్యాడమ్ గారూ! ఆ  సమాచారమే నీ విషయంలో, ధర్మతేజ విషయంలో నాకు కలిసొచ్చిన పాయింట్స్! ఇక .. భరత్ ధర్మతేజ ముందు చదివిందీ జస్ట్ ఓ స్టేట్ మెంట్ మాత్రమే.  నా కౌన్సిలింగ్ తరువాత తప్పు తెలుసుకున్న భరత్ అది  సరిదిద్దుకొనే క్రమంలో  నేను ప్రిపేర్ చేసిచ్చిన స్క్రిప్ట్ అది ' చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు చిదంబరం.

'ఐ యామ్ సారీ' అని మిస్ రోజా తలొంచుకొన్నప్పుడు 'ఇట్సాల్ రైట్ మిస్ రోజాగారూ! నౌ యూ ఆర్ ఏ వెరీ గుడ్ గర్ల్. మాకా నమ్మకం పూర్తిగా ఉంది. దట్స్ వై ఈ లైక్ యూ సో మచ్ !' అంటూ రోజా చేయి తన చేతిల్లోకి తీసుకుని సున్నితంగా ఓ స్వీట్ కిస్ ఇస్తూ చిలిపిగా నవ్వేశాడు డిటెక్టివ్ చిదంబరం.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక డిసెంబర్, 4 2008 లో ప్రచురితం)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...