Showing posts with label Finance. Show all posts
Showing posts with label Finance. Show all posts

Sunday, December 12, 2021

కోదండం- కథానిక: - కర్లపాలెం హనుమంతరావు ( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో ప్రచురితం)

కథానిక: 

కోదండం 

- కర్లపాలెం హనుమంతరావు

( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో  ప్రచురితం) 


శ్రీలక్ష్మీనారాయణ - అది వాడి పూర్తి పేరు.


వట్టి 'లక్ష్మీనారాయణ' అని పిలిస్తే పోట్లాట పెట్టుకునే


వాడు.


'శ్రీ' అంటే వాడికంత ఇష్టం.


'శ్రీ' ఎవరి కిష్టం ఉండదు కనక! కానీ... వాడి ఇష్టం ప్రత్యేకమైనది.


మా ఊరి గడియార స్తంభం సెంటర్లో రామమందిరం వెనకాల ఉండేది వాళ్ల ఇల్లు. రోడ్డు వైపుకి దిగిన పెంకుటిల్లు వసారాలో నాలుగు పాత డబ్బాల వరసల వెనక కాటా ముందు కూర్చునుండేవాడు వాళ్ల నాన్న - శ్రీరాములు.


ముతక బనీను, మోకాలు చిప్పలపై దాకా పంచెకట్టు.. గుళ్లో వినాయకుడికి మల్లే ఎప్పుడు చూసినా అదే ఆయన అవతారం.


వాడి కోసం వెళ్లినప్పుడల్లా ముందు కొట్లో ఈయన ఆపేసేవాడు. నోరారా పలకరించేవాడు.


"సుబ్బారావు పంతులుగారబ్బాయి వచ్చాడ్రా! బైటికిరా!" అని లోపలికి కేకేసేవాడు.


నన్ను మాత్రం ఎప్పుడూ నేరుగా లోపలికి పొమ్మనేవాడు


కాదు. కొట్టు వెనకున్న గదుల్లో ఏముంటుందో!... మాకు అప్పట్లో ఒక పెద్ద సస్పెన్స్,


"వాడిని వాళ్ల నాన్న కోదండం వేయిస్తుంటాడురా! అందుకే ఒక పట్టాన వీడు బైటికి రాడు" అనేవాడు మా కామన్ ఫ్రెండ్ చంద్రశేఖర్.


'కోదండం పేరు వినడమేగానీ... ఎప్పుడూ ఎట్లా ఉంటుందో చూడలేదు.


"రెండు కాళ్లు నడిమికి విరిచి వాటి మధ్యలో నుంచీ చేతులు బయటికి లాగి మెడ చుట్టూ గట్టిగా పట్టుకోనుం డాలి. పోలీస్టేషన్లో మా నాన్న దొంగల్ని అట్లాగే చేయిస్తుం టాడు" అని చెప్పాడు చంద్రశేఖర్.


వాళ్ల నాన్న కానిస్టేబుల్. నమ్మబుద్ధి కాలేదు. నేరుగా ఒకసారి శ్రీలక్ష్మీనారాయణగాడినే అడిగితే అదోలా చూసాడు నా వంక.


రెండు రోజులు నాతో మాట్లాడలేదు.


దొంగలకు పడే శిక్ష వాడికెందుకు వేయాలో అర్థం కాలేదు. తొమ్మిదో ఎక్కం కూడా వెనక నుంచి గడగడా వప్పచెబుతాడు. నోటి లెక్కలు వాడి నాలిక మీదే ఉంటాయి. బుక్కులో ఇచ్చిన లెక్కలయితే వాడికన్నా ముందు చేసి చూపించడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చేది మాకు. అట్లాంటి వాడికి మరి ఈ 'కోదండం' ఎందుకో!


హైస్కూల్లో కూడా మా ఇద్దరిదీ ఒకటే సెక్షన్ ప్రతిదానిలో పోటీ ఉండేది మా ఇద్దరి మధ్య.


ఒక్క దాంట్లో మాత్రం వాడి ముందు నేను తేలిపోయే వాణ్ణి.


పైస, రెండు పైసలు, మూడు పైసలు, కొత్త బిళ్లలు ముద్రించేవాళ్ల రోజుల్లో. కొత్త నాణేల కోసం అందరం వెంపర్లాడుతుండేవాళ్లం. వాడు కొట్లో నుంచి కొట్టుకొచ్చిన కొత్త బిళ్లల్ని లాభానికి మారు బేరం చేస్తూండేవాడు. అయిదు పైసలకు మూడు పైసల కొత్త బిళ్ల, మూడు పైసలకి పైస కొత్త బిళ్ల - ఇట్లా సాగుతుండేది 'చిల్లర' వ్యాపారం.


పంతుళ్లకు మాత్రం లాభం చూసుకోకుండా ఇస్తుండే వాడు. వాడి లౌక్యం ముందు 'ముందు నుంచీ' మేం దిగదుడుపే!


మా ఊరి గ్రంథాలయంలో ఒక ఖాన్ మేష్టరుగారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ల పరీక్షలకు పిల్లల్ని తర్ఫీదు చేస్తుండేవారు. ఆడపిల్లలే ఎక్కువ ఆ క్లాసుల్లో. మా అక్కకు తోడుగా వెళ్లే నన్నూ పరీక్షలకు కూర్చోబెట్టేరు మేష్టారు. సెకండ్ ఫారానికే మూడు పరీక్షలు పాసయ్యాను. నన్ను చూసి శ్రీ లక్ష్మీనారాయణ కూడా! ఆడపిల్లలతో కలిసి కూర్చోడం నామోషీ అనిపించి నేను క్లాసులకు వెళ్లడం మానేస్తే... వాడు మాత్రం చదువు కొనసాగించి పదకొండో

తరగతికే 'విశారద' పూర్తి చేసేసాడు.


డిగ్రీ చదువుకి నేను బందరు వచ్చేయడం వల్ల వాడి విశేషాలు తెలియడం మానేసాయి. అప్పుడప్పుడూ చంద్ర శేఖరే ఏవో వార్తలు చెవులో వేస్తుండేవాడు. సెవెంత్ ఫారం పూర్తయింతరువాత వాడు చెన్నై పోయి 'విజయచిత్ర' అనే సినిమా పత్రికలో సబ్-ఎడిటర్గా చేరాడని చెప్పాడొకసారి.


డిగ్రీ అయి ఉద్యోగం కోసం ప్రయత్నించే రోజుల్లో... మా బాబాయికి వంట్లో బాగోలేదంటే చూడటానికి మా ఊరు వెళ్లా. అనుకోకుండా శ్రీరాములు దుకాణం ముందు


నుంచీ వెళ్లాల్సొచ్చింది. దుకాణం అట్లాగే ఉంది.


మా నాన్నగారొకసారి క్లాసులో వాడి వీపు మీద పేం బెత్తం ఆడించారు. పాపం భయంతో లాగూ తడుపుకు న్నాడు. మూడు రోజుల దాకా బడికి రాలేదు. ఏమయిందో కనుక్కుందామని ఇంటికెళితే... అప్పుడూ శ్రీరాములు నన్ను లోపలికి పోనీయనే లేదు. 'రేపొస్తాడులే' అంటూ ఇంత కలకండ ముక్క చేతిలో పెట్టి పంపిచేశాడు.


ఆ సంగతులన్నీ తలుచుకుంటూ సరదాగా గడిపేశాం ఇద్దరం ట్రయినింగ్ వారం రోజులూ.


అదే ముతక బనీను... మోకాలు చిప్పల పై దాకా మాటల సందర్భంలో మా ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉందని తెలుసుకుని చిరునామా అడిగి తీసుకున్నాడు.


పంచకట్టులో కాటా ముందు శ్రీరాములు!


ప్రాణం ఉసూరుమనిపించింది.


 మా బ్యాంకులోనే అధికార భాష (హిందీ) ఆఫీసరుగా చేరి మూడేళ్లయిందిట. హిందీ క్లాసులు తీసుకోవడానికి ఇట్లా ట్రయినింగ్ సెంటర్ కొస్తుంటానని చెప్పాడు.


లంచ్ అవర్లో పిలిచి కూర్చోబెట్టుకుని, “నా క్లాస్మేట్ నన్ను పేం బెత్తంతో బాది ఇంత పెద్దవాడిని చేసిన మాతరగతికే 'విశారద' పూర్తి చేసేసాడు.


డిగ్రీ చదువుకి నేను బందరు వచ్చేయడం వల్ల వాడి విశేషాలు తెలియడం మానేసాయి. అప్పుడప్పుడూ చంద్ర శేఖరే ఏవో వార్తలు చెవులో వేస్తుండేవాడు. సెవెంత్ ఫారం పూర్తయింతరువాత వాడు చెన్నై పోయి 'విజయచిత్ర' అనే సినిమా పత్రికలో సబ్-ఎడిటర్గా చేరాడని చెప్పాడొకసారి.


డిగ్రీ అయి ఉద్యోగం కోసం ప్రయత్నించే రోజుల్లో... మా బాబాయికి వంట్లో బాగోలేదంటే చూడటానికి మా ఊరు వెళ్లా. అనుకోకుండా శ్రీరాములు దుకాణం ముందు నుంచీ వెళ్లాల్సొచ్చింది. 

దుకాణం అట్లాగే ఉంది. 

"వీడు చెన్నైలో మంచి ఉద్యోగమే వెలగబెడుతున్నాడు గదరా! అమ్మానాన్నల్ని తీసుకెళ్లచ్చు గదా!" అన్నాను చంద్రశేఖర్.


"వాడి తల్లి పోయిందిరా పోయినేడాది వచ్చి వారం రోజులు కూడా లేడిక్కడ. ఇంక తండ్రి నేం తీసుకెళతాడు! తెనాలమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడంతా ఆవిడదే రాజ్యం అంటున్నారు" అన్నాడు చంద్రశేఖర్.


ఇంక వాడి సంగతి తలుచుకోవాలనిపించలేదు.


బ్యాంకులో ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసు కున్నాను. కావాలనే వాడిని పిలవలేదు. జీవితంలో మళ్లీ కలవాలనీ అనుకోలేదు.


పదేళ్లు గడిచాయి.


మా బ్యాంకు వాళ్లిచ్చే ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం హైదరా బాద్ వచ్చినప్పుడు అనుకోకుండా తగిలాడు మళ్లా శ్రీలక్ష్మీ నారాయణ.


ఫ్యాకల్టీ లిస్టులో వాడి పేరును చూసాను గానీ... క్లాసు కొచ్చిందాకా వాడేనని తెలుసుకోలేకపోయాను. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడు విద్యార్థిగా ముందు వరసలో నేను. హిందీ పాఠాలు చెప్పే ఇన్స్ట్రక్టర్ డయాస్ మీద వాడు!


సుబ్బారావు పంతులుగారబ్బాయి” అని తోటి ఫ్యాకల్టీకి సంతోషంగా పరిచయం చేస్తుంటే... నా మనసులో అప్పటి దాకా ఉన్న వ్యతిరేక భావం కరిగిపోయింది.


మా నాన్నగారొకసారి క్లాసులో వాడి వీపు మీద పేం బెత్తం ఆడించారు. పాపం భయంతో లాగూ తడుపుకు న్నాడు. మూడు రోజుల దాకా బడికి రాలేదు. ఏమయిందో కనుక్కుందామని ఇంటికెళితే... అప్పుడూ శ్రీరాములు నన్ను లోపలికి పోనీయనే లేదు. 'రేపొస్తాడులే' అంటూ ఇంత కలకండ ముక్క చేతిలో పెట్టి పంపిచేశాడు.


ఆ సంగతులన్నీ తలుచుకుంటూ సరదాగా గడిపేశాం ఇద్దరం ట్రయినింగ్ వారం రోజులూ.


అదే ముతక బనీను... మోకాలు చిప్పల పై దాకా మాటల సందర్భంలో మా ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉందని తెలుసుకుని చిరునామా అడిగి తీసుకున్నాడు.


వాడి కారులోనే నన్ను మా ఇంటి దాకా వచ్చి దింపి పోయాడు. మా పిల్లలిద్దర్నీ చూసి బాగా ముచ్చట పడ్డాడు.


"రేపాదివారం నువ్వు ఫ్యామిలోతో సహా మా ఇంటికి భోజనానికి రావాలిరా! మా పిల్లలకి మీ పిల్లల్ని చూపిం చాలి" అని ఇంటి అడ్రసిచ్చాడు.


వీడి కోసం కాకపోయినా శ్రీరాములు కోసమన్నా వెళ్లి చూసి రావాలి. చిన్నప్పుడు ఎప్పుడు ఇంటికెళ్లినా నోరారా ఆప్యాయంగా పలకరించేవాడు. ఇంత కలకండ పలుకో, బెల్లం ముక్కో చేతిలో పెట్టకుండా వదిలిపెట్టేవాడు కాదు.


“మీ నాయన దయవల్లే మా బడుద్ధాయికి ఈ మాత్ర మన్నా అక్షరం ముక్క వంట బట్టింది” అంటూ మా నాన్న గారిని తలుచుకోకుండా మాత్రం వూరుకొనేవాడు కాదు.



ఆ ఆదివారం ఫ్యామిలితో సహా శ్రీలక్ష్మీనారాయణ ఇచ్చిన చిరునామా పట్టుకుని వెదుక్కుంటూ వెళ్లా. ఈస్ట్ ఆనంద్బాగ్ రైలుకట్ట కవతల ఎక్కడో ఉందా ఇల్లు. కొత్తగా కట్టుకున్నాడు లాగుంది - పక్కనున్న ఇంట్లో అద్దెకుంటున్నాడు.


ఆటో శబ్దం విని కూడా ఎవరూ బైటకు రాలేదు. కాలింగ్ బెల్ మోగించిన మూడోసారికి మెల్లగా తలుపు తెరుచుకుంది.


ఆమె శ్రీలక్ష్మీనారాయణ భార్య లాగుంది. మా పరిచయం చెప్పుకున్నా పెద్దగా స్పందన లేదు. “కూర్చోండి....” అంటూ సోఫా చూపించి లోపలికి పోయింది.


లోపలనుంచీ ఏవో మాటలు. పది నిమిషాల తరువాత గానీ శ్రీలక్ష్మీనారాయణ బైటికి రాలేదు.

‘‘శ్రీకనకధారస్తవం' చేస్తున్నారా! మధ్యలో లేవడం అరిష్టం. బ్రాహ్మలబ్బాయివి నీకు తెలేనిదేముంది!"


అన్నాడు. తెలివిగా. అప్పుడొచ్చి పలకరించిపోయింది వాడి భార్య. పిల్లలు కనపడలేదు.


“ఏరీ?” అనడిగితే, "ఆదివారం గదా వాళ్ళ మామయ్య వాళ్లింటికెళ్లారండీ! మీరిట్లా వస్తారని తెలిస్తే ఆపి ఉండే దాన్ని" అంది మళ్లా బైటికొచ్చి, ఆమె వాడిని లోపలికి


తీసుకెళుతూ.


ఇద్దరూ లోపల ఏవో మల్లగుల్లాలు పడుతున్నారు. ముళ్ల మీద కూర్చున్నట్లుంది మాకు. మా ఆవిడ మొహం చూడాలి. పిల్లలకు భోజనాల టైము కూడా దాటి పోయింది. వరస చూస్తే భోజనం ఏర్పాట్లేమీ జరిగినట్లు లేవు. మర్యాద కాపాడుకోవడం మంచిదనిపించింది.


వాడిని బైటికి పిలిచి మా చిన్నాడు కడుపులో నొప్పంటు న్నాడురా! వెంటనే వెళ్లి డాక్టరుకు చూపించాలి. మళ్లీ కలు ద్దాంలే తీరిగ్గా” అని ఎట్లాగో బైట పడ్డాను.


మేం తిరిగి వచ్చేటప్పుడు మొగుడూ పెళ్లాల మొహాల్లో కనిపించిన 'రిలీఫ్ ని నేనెప్పటికీ మర్చిపోలేను. “మా కొత్త ఇల్లు చూపించాలనుకున్నానే!" అని వాడూ, "ఇక్కడే ఉంటున్నాడా... ఇంకా?” అనడిగాను



గృహప్రవేశానికి రమ్మనమని ఫోనులో ఆహ్వానం. “టైం ఎక్కువ లేదురా! పర్సనల్గా వచ్చి పిలవలేదని అనుకోవద్దు. కార్డ్ పంపిస్తా. కంపల్సరీగా రావాలి" అంటూ ఇంకోసారి ఇంటి అడ్రెసు అడిగి తీసుకున్నాడు.


కార్డు రాలేదు. వచ్చినా మేము పోదలుచుకోలేదు. ఇంక జీవితంలో వాడిని తలుచుకోదలుచుకోలేదు.


చంద్రశేఖర్ కొడుకు పెళ్లంటే మళ్లా మా ఊరు పోవాల్సొచ్చింది చాలా ఏళ్ల తరువాత.


మాటల మధ్యలో వాడే శ్రీలక్ష్మీనారాయణ ప్రసక్తి తీసు కొచ్చాడు.


వాడి ఇంట్లో మా అనుభవాన్ని గురించి చెప్పాను. “శ్రీరాముల్ని చూస్తావా?” అన్నాడు చెప్పిందంతా ఓపిగ్గా విని చివరకు.










మాటల మధ్యలో వాడే శ్రీలక్ష్మీనారాయణ ప్రసక్తి తీసు కొచ్చాడు.


వాడి ఇంట్లో మా అనుభవాన్ని గురించి చెప్పాను. “శ్రీరాముల్ని చూస్తావా?” అన్నాడు చెప్పిందంతా ఓపిగ్గా విని చివరకు. 

" ఇక్కడే ఉంటున్నాడా.. ఇంకా? " అనడిగాను 

ఆశ్చర్యంగా.


పెళ్ళి హడావుడి తగ్గింతరువాత బైక్ మీద నన్నొక చోటికి తీసుకెళ్లాడు.


బెస్తపాలెం వెళ్లే దారిలో ఉన్న ఆశ్రమం అది. ఊరుకు బాగా బయటగా జీడి మామిడి తోపుల మధ్యలో ఉందది. ‘వృద్ధాశ్రమం' బోర్డు చూసి, "శ్రీరాములు ఉంటుంది ఇక్కడా?" అని నివ్వెరపోయాను.


“మరి!” అన్నాడు చంద్రశేఖర్.


విశాలమైన ఆవరణలో మూడు వైపులా చిన్న చిన్న గదులు మధ్యలో రామమందిరం. దానిని ఆనుకున్న చిన్న తోట. కొంతమంది ముసలివాళ్లు అందులో పనిచేస్తున్నారు. ఇంకొంతమంది గుడి ముందు అరుగుమీద ఎండపొడకు సేద తీరుతున్నారు. ఎక్కడా శ్రీరాములు కనిపించలేదు.


ఆఫీసు గదిలోకి వెళ్ళి అడిగాడు చంద్రశేఖర్.


కంప్యూటర్ ముందు కూర్చోనున్న అమ్మాయి చాలా ప్రశ్నలే అడిగింది. సంతృప్తి పడింతరువాతగానీ లాంగ్బుక్ ఓపెన్ చేయలేదు.


“ఆయనకు చానాళ్లుగా వంట్లో బాగుండటం లేదు. ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి" అని సలహా ఇచ్చి ఆ విజిటర్స్ బుక్ మా ముందుకు జరిపింది సంతకాల కోసం. 

అది శ్రీరాములు పర్సనల్ షీట్ లాగుంది - అట్టే విజిటర్స్ సంతకాలు లేవు. శ్రీలక్ష్మీ నారాయణవి మాత్రం నాలుగైదు కనిపించాయి. అదీ ఏడాదికి రెండుసార్లు. శ్రీరాములు చేరి రెండేళ్లయినట్లుంది.







 కిచెన్ పక్కనున్న చిన్న గదిలో ఉన్నాడాయన. 

కట్టు. నిస్త్రాణగా పడుకోనున్నాడు ఐరన్ మంచం మీద. ఏమని పలకరించాలి? పేరు చెబితే గుర్తుపట్టలేడు.


'సుబ్బారావు పంతులు గారబ్బాయి'నని చెప్పుకున్నా. కళ్లల్లోకి కాంతి వచ్చింది.


నోటి వెంట ఏవో శబ్దాలు వచ్చాయిగానీ... మా కర్థం కాలేదు.


పది నిముషాలకు మించి కూర్చోలేకపోయాను. మన సంతా పిచ్చి కాకరకాయను కొరికినంత చేదుగా ఉంది.


‘ఒక్కడే కొడుకు. ఎంత గారాబంగా పెంచుకున్నాడు! ఎప్పుడూ కొడుకు నామస్మరణే! బిడ్డను వృద్ధిలోకి తేవాలని ఆ డొక్కు డబ్బాల వెనక కాటా ముందు కూర్చుని ఎంతలా ఆరాటపడేవాడో!'

తలుచుకుంటే కళ్ల వెంబడి నీరు గిర్రునతిరిగింది. 


"నువ్వు పట్టించుకోలేదు కనక నీకు తెలీదురా! వాడి ప్పుడు బ్యాంకులో లేడు. వి.ఆర్.ఎస్. తీసుకున్నాడు ఎప్పుడో. ఆ వచ్చిన బెనిఫిట్స్తో బావమరిది వ్యాపారంలో షేర్లు తీసుకున్నాడు. మామగారు తెనాలిలో వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడుటగదా! బావమరిది ఇప్పుడు దాన్ని హైద్రా బాద్ హైటెక్ లెవెలికి తీసుకెళ్ళాడు. 'మనీ ట్రీ' అని పెట్టారు - చిట్ ఫండ్ కంపెనీ ఒకటి. దానికి వీడే ఇప్పుడు బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఈ మధ్య చీరాలలో బ్రాంచి ఓపెన్ చెయ్యటానికి సర్వేకని వచ్చాడు. తిరుగుళ్ళ మూలకంగా తండ్రిని పట్టించుకోవడం కుదరడంలేదని ఇక్కడికి తెచ్చి పడేశాడు. చూస్తున్నావుగా ఈయన పరిస్థితి!” అంటూ జేబులో నుంచి శ్రీలక్ష్మీనారాయణ వాడి కిచ్చిన విజిటింగ్ కార్డ్ నా చేతిలో పెట్టాడు.


చించి పోగులు పెడదామనుకున్నా ఆ కార్డును. దాని మీద ఫోన్ నెంబరు ఉండటం చూసి పర్సులో పడేశా. వాడిని నేరుగా కడిగి పారేస్తే కాని నా కడుపు మంట చల్లారదు. 


విషయమంతా విని మా ఆవిడ అంది.


"ఇందులో వింతేముంది? ఆ రోజు మనం వాళ్ళింటి కెళ్ళినప్పుడే నా కర్థమయింది. అసలా ముసలాయన్నా ఇంట్లో ఉంచుకున్నారన్నది కూడా నా కనుమానమే! ఆమెను చూస్తే అర్థం కావడం లేదా! మనం ఆటోలో వెళ్ళినందుకు భోజన యోగం లేకపోయింది. మీరు మన పిల్లల్ని గురించి బాగా డప్పు కొట్టుంటారు ఆయనతో. మనమొస్తున్నామని తెలిసే కావాలని ఆమె వాళ్ళ పిల్లల్ని తప్పించేసింది. గృహ అదే ముతక బనీను.. మోకాలి చిప్పల పైదాకా పంచ ప్రవేశానికి పిలిచారు కానీ... నిజంగానే ఎక్కడ వెళతామో నని కార్డు కూడా పంపకుండా జాగ్రత్త పడ్డారు”



“ఛ.... వాడిని గురించి మరీ అంత దారుణంగా మాట్లా డకోయ్. చిన్నతనం నుంచీ తెలుసు నాకు. డబ్బుకు గడ్డి కరుస్తాడేమోగానీ, స్నేహానిక్కూడా విలువ ఇస్తాడు" అన్నాను బాధగా మరీ ఆవిడ అంతలా విమర్శిస్తుంటే వినలేక.


“నేనంటున్నది పూర్తిగా మీ ఫ్రెండుగారిని గురించే కాదు మహానుభావా! మీకు లోకం తీరు అర్థం కావడం లేదింకా. ఇంత సంపాదిస్తున్నా తండ్రినట్లా దిక్కులేని వాడిలాగా వదిలే సారంటే మరేమిటర్థం? ప్రేమ ఆయనకుండవచ్చు. ఆమె కుండాలని రూలేమన్నా ఉందా? లోకం తీరే అట్లా నడుస్తుం దిప్పుడు. ప్రత్యేకంగా మీరిప్పుడేమీ ఫోన్లు చేసి ప్రవచనాలు చెప్పాల్సిన పనిలేదు. మనకు బిల్లు ఖర్చు తప్ప... పెద్దాయనకు ఒరిగేదేమీ ఉండదు” అని దులిపి పారేసరికి ఫోను ఆలోచన విరమించుకున్నాను.


'శ్రీలక్ష్మీనారాయణ తల్లి ఎప్పుడో పోయి బ్రతికి పోయింది. తండ్రి బ్రతికుండి చచ్చిపోతున్నాడు' అనిపిం చింది.


ఇంక వాడి ఆలోచన పూర్తిగా చాలించడం మంచిదని పించింది కానీ, టీవీల్లో, పేపర్లలో 'మనీ ట్రీ' ప్రకటనలు చూసినప్పుడల్లా ముందు 'శ్రీరాములే' మనసులో మెదులుతున్నాడు.


ఆ రోజు టీవీలో వచ్చిన 'బ్రేకింగ్ న్యూస్' చూసి షాకయ్యాను. 'మనీ ట్రీ' బోర్డు తిప్పేసిందిట!


ఐదేళ్ల బట్టీ ఆంధ్రప్రదేశ్ అంతటా యాభై శాఖల ద్వారా మూడొందల కోట్ల టర్నోవర్తో లక్షమంది ఖాతాదారులకు సేవలందిస్తున్న చిట్ ఫండ్ కంపెనీ రాత్రికి రాత్రే దివాలా తీయడం నమ్మదగ్గ న్యూస్ కాదు. చిట్లు పాడిన వాళ్లందరూ హ్యాపీనేగానీ... వాళ్లలో చాలామంది కంపెనీ డైరక్టర్ల బినామీ లనీ పోలీస్ విచారణలో తేలిందిట. చిట్ హోల్డర్సందరూ గగ్గోలు పెడుతున్నారు. పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం సాగు తోంది. శ్రీలక్ష్మీనారాయణ బావమరిది విదేశాల్లో ఉండటం వల్ల ప్రస్తుతం సేఫ్. కొడుకులిద్దర్నీ వీడు ఎప్పుడు ఈ రొంపి లోకి దింపాడో... పార్టనర్స్ అరెస్టయిపోయారు. శ్రీలక్ష్మీ నారాయణ పేరు మాత్రం ఎక్కడా వినిపించకపోవడం కొంత రిలీఫ్ కలిగించే అంశం. కానీ వాడు ముచ్చటపడి కొడుకులిద్దరికీ పెట్టుకున్న శ్రీనివాస్, శ్రీనాథ్ పేర్లలోని 'శ్రీని వత్తి వత్తి పలుకుతూ టీవీ వాళ్లు చేస్తున్న వెటకారపు వ్యాఖ్యా నాలకు మనసంతా ఏదో చేదు కాకరకాయ కొరికినట్లుగా తయారయింది.


చంద్రశేఖర్ ఇచ్చిన విజిటింగ్ కార్డులోని నెంబరుకు చాలాసార్లు రింగ్ చేసాను. రెస్పాన్సు లేదు. మూడు రోజులుగా అదే పరిస్థితి.


నా అవస్థ చూసి, “పోనీ.. ఒకసారి పర్శనల్గా వెళ్లి పలకరించి వద్దాం పదండి. పాపం, ఆవిడ కూడా ఎంతలా కుమిలిపోతుందో బిడ్డల పరిస్థితి చూసి” అంది మా శ్రీమతి. 

విజిటింగ్ కార్డులోని రెసిడెన్షియల్ అడ్రసు పట్టుకుని వెళ్లాం. శ్రీనగర్ కాలనీలో ఉందా ఇల్లు.


అది ఇల్లా! ఇంద్రభవనంలాగుంది.


పోలీసు పహరాలో ఉంది. 

ప్రవేశానికి అనుమతి లభించక తిరిగి వచ్చేసాం. 


నెల రోజుల తరువాత అనుకుంటా... మా అన్నయ్య కొడుక్కి వంట్లో బాగోలేదంటే చూడటానికి వెళ్ళాం. వాడికి నిండా పాతికేళ్లు లేవు. కీళ్ల నొప్పులు - ఉన్నట్టుండి వళ్లంతా కర్రలా బిగుసుకుపోతుంది. జాయింట్స్ విపరీతంగా వాచి పోయి... కదిలితే చాలు... విపరీతమైన నొప్పులు. బాధకు ఓర్చుకోలేక కేకలు పెడుతుంటే వినేవాళ్ళం తట్టుకోలేము. ఎంతమంది డాక్టర్సుకు చూపించినా... ఎన్నిరకాల మందులు మింగినా బాధకు తాత్కాలిక ఉపశమనమేగాని... శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.


'వినయాశ్రమం ప్రకృతి చికిత్సాలయం'లో ఉన్నాడంటే చూడటానికి వెళ్లాను.


చికిత్స చేసే యోగాచార్యులు ఒక విచిత్రమైన విషయం చెప్పారు.


"కీలు బందుల్లోని రాపిడికి షాక్ అబ్జార్బర్సుగా పనిచేసే గుజ్జు పదార్థం చాలినంత ఉత్పత్తి చేయలేని దేహాల్లో ఇలాంటి రుగ్మతలు సంభవిస్తుంటాయి. ఇలాంటి వ్యాధి ఉన్నవాళ్లు చిన్నతనం నుంచే కొన్ని కఠినమైన ఆసనాలు. సాధన చేస్తూ ఉండాలి" అంటూ కొన్ని ఆసనాలు చూపిం చారు.


అందులో ఒకటి రెండు కాళ్లు నడిమికి విరిచి వాటి మధ్యలో నుంచి చేతులు బయటికి లాగి మెడ చుట్టూ


గట్టిగా బంధించి ఉంచే ఉత్తాన కూర్మాసనం వంటి ఆసనం. చంద్రశేఖర్ చెప్పిన కోదండం' గుర్తుకొచ్చింది ఎందుకో. వాడి మాట నిజమే అయితే శ్రీలక్ష్మీనారాయణకు రోజూ ‘కోదండం' పడేది... ఈ రకం కీళ్ల జబ్బు ముందు ముందు ముదరకుండానేమో!


ఇప్పుడు గుర్తుకొస్తుంది. వాడికా జబ్బు ఉన్నట్లే ఉంది. మా నాన్నగారు పేంబెత్తం వీపు మీద ఆడించినప్పుడల్లా విరుచుకుపడిపోతుండేవాడు. మా అన్న కొడుకూ అట్లాగే  


విరుచుకు పడిపోయేవాడు - 'ఎమోషనల్'గా 'ఇంబేలన్స్' అయినప్పుడల్లా. ఒకసారి ఎటాక్ వస్తే కనీసం మూడు రోజుల దాకా మంచం దిగలేని పరిస్థితిట!


ఆ లెక్కన ఇప్పుడు శ్రీలక్ష్మీనారాయణ పరిస్థితి!? 'మనీ ట్రీ' మునిగి కొడుకులిద్దరూ జైలు పాలయితే ఎంతటివాడయినా ‘ఇంబేలన్స్' అవకుండా ఉండగలడా!?


రెండు కాళ్ళూ మడిచి వాటి గుండా చేతులు బయటకు తీసి మెడచుట్టూ బంధించి పట్టుకుని 'కోదండం' వేసి ఉన్నాడు శ్రీలక్ష్మీనారాయణ.


వాడినెట్లాగైనా ఒకసారి చూడాలి. ఎంతయినా చిన్ననాటి 

నుంచీ మిత్రుడు. 

చంద్రశేఖరికి కాల్ చేసాను.


కూల్గా సమాధానం చెప్పాడు వాడు.


"వేటపాలెం కూడా వచ్చిపో! మన చిన్ననాటి సస్పెన్స్ కూడా విడిపోయినట్లవుతుంది. గొప్ప జీవిత సత్యం తెలుసు కుంటావు" అన్నాడు.


వెంటనే వేటపాలెం బైలుదేరాను.


బస్టాండులోనే నన్ను  పట్టుకున్నాడు చంద్రశేఖర్. "మన శ్రీలక్ష్మీనారాయణని చూపిస్తా పద!" అంటూ గడియార స్తంభం సెంటర్ వెనకాలున్న రామమందిరం

దగ్గర శ్రీరాములి పెంకుటింటికి తీసుకెళ్ళాడు. పాత డొక్కు డబ్బాల వెనక కాటా ముందు ఎప్పటిలాగానే వినాయకుడిలాగా ముతక బనీను... మోకాలి చిప్పల పైదాకా ధోవతి కట్టులో శ్రీరాములు ! 


ఈసారి మమ్మల్ని బైటే ఆపలేదు. లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు.


రెండు కాళ్ళూ మడిచి వాటి గుండా చేతులు బయటకు తీసి మెడచుట్టూ బంధించి పట్టుకుని 'కోదండం' వేసి ఉన్నాడు శ్రీలక్ష్మీనారాయణ.


ఆసనం మధ్యలో లేవకూడదని బైటికి తీసుకొచ్చేసాడు శ్రీరాములు.

తిరిగొస్తూ ఉంటే కలకండ ముక్క చేతిలో పెట్టలేదు కానీ... అంతకన్నా ముఖ్యమైన జీవిత సత్యాన్ని ఒకటి వినిపించాడు శ్రీరాములు.


“మనీ ట్రీ వ్యవహారం మీకు తెలుసుగా! మనవళ్లిద్దరూ జైలు కెళ్లారు. బావమరుదులు తప్పుకున్నారు. వీడు విరుచు కుపడిపోయాడు. కోడలు గోడు గోడున ఏడుస్తూంటే ఇక్కడకు తీసుకొచ్చాను. బిడ్డ దివాలా తీసి జబ్బుతో బాధ పడుతుంటే అక్కడ వృద్ధాశ్రమంలో కూర్చోబుద్ధికాలేదు. పరిస్థితులు కాస్త బాగుపడేదాకా మళ్లీ నాకీ 'దుకాణం సంత' తప్పదు” అన్నాడు.


నిజంగా శ్రీరాములులోని తండ్రికి మనస్ఫూర్తిగా ఓ దండం పెట్టాలనిపించింది.


- కర్లపాలెం హనుమంతరావు 

( రచన మాసపత్రిక- కథాపీఠం పురస్కారంతో  ప్రచురితం) 




Thursday, December 9, 2021

శ్రీ శ్రీ జ్ఞాన నేత్రం - కర్లపాలెం హనుమంతరావు

 సరదా 'కీ' సరదా



శ్రీ శ్రీ జ్ఞాన నేత్రం 

- కర్లపాలెం హనుమంతరావు 


శ్రీశ్రీకి దేవుడి మీద నమ్మకం లేదుగానీ... ఆయనిచ్చే వరాల మీద బోలెడంత ఆశ ఉంది. ఆ కారణంగా ఘోర తపస్సు చేయగా, చేయగా 'మహాకవి' కదా ఏమి కోరుకుంటాడో చూద్దామన్న ఆసక్తితో ప్రత్యక్షమయ్యాడు దేవుడు.


"అయ్యా, నేను బోలెడన్ని పుస్తకాలు రాశాను. సినిమాలకు మంచి మంచి పాటలు చేశాను. అయినా డబ్బు మిగలటం లేదు. ధనం సంపాదించే కనీస అర్హత నాకు ఉందా? లేదా? అంటూ శ్రీశ్రీ దేవుడిని దబాయించాడు. దేవుడు చిర్నవ్వు చిందిస్తూ “నువ్వు

ఇప్పుడు పాట రాస్తోన్న సినిమా నిర్మాతను కలువు" అని ఉచిత సలహా ఒహటి పారేసి చిత్రంగా మాయమయ్యాడు దేవుడు. 


నిర్మాతను కలిసి శ్రీశ్రీ మళ్లీ అదే ప్రశ్న వేశాడు. 


"మీరు గుడ్డి గుర్రం మీద పందెం కాసినా లక్షలకు లక్షలు రూపాయలు వస్తాయి. ఆ కిటుకేమిటో నాకూ చెబితే, మీకు లాగా ఒహ మంచి సినిమా తీయాలని ఉంది" ఆశగా నిర్మాత ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు శ్రీశ్రీ.


"చెప్పటం ఎందుకు?, స్వయంగా చూద్దురుగానీ ఉండండి." అంటూ తన పెద్ద కొడుకును పిలిచి "గోడ మీదున్న ఫొటోని చూడు! ముగ్గురు పెద్దాళ్లు, ఏడుగురు పిల్లలు - ఏడూ ఇంటూ మూడూ .... లెక్కేసి ఆ సంఖ్యగల గుర్రం మీద పందెం కాసిరా." అని పది వేల రూపాయలు ఇచ్చి పంపించాడు నిర్మాత.


అంతే శ్రీశ్రీకి జ్ఞాననేత్రం విచ్చుకుంది. తనూ వెళ్లి ఆ నంబరు గుర్రం మీద ఉన్నదంతా ఊడ్చి పందెం కాశాడు. 


అయితే 27వ నంబరు గుర్రం గెలిచింది.


" ఇదేంటి ఈసారి మీ జోస్యం ఇలా వికటించింది! " నిర్మాతను నిలదీశాడు శ్రీశ్రీ విచారపడుతూ.


"అదేం లేదే! మావాడు జాక్పాట్ పది లక్షల రూపాయలు కొట్టుకొచ్చాడుగదా! ” ఎదురుగా బల్లమీద పేర్చి ఉన్న డబ్బు కట్టల్ని చూపిస్తూ వివరించాడు నిర్మాత.


"అదెలాగా? ఏడు ఇంటూ మూడు ఈజిక్వల్టూ ఇరవై ఒకటేగదా?"


"మీరు మహాకవి కనుక అలా ఆలోచించారు. బడుద్దాయి గనుక మా వాడు 27 అని లెక్కవేశాడు." అన్నాడు తాపీగా నిర్మాత.


శ్రీశ్రీకి అప్పుడు తెలిసొచ్చింది. సంపద సృష్టికీ తెలివి తేటలకూ లంకె లేదనీ, కావాల్సింది సుడి  మాత్రమేనని. 


అదెటూ తనకు లేదని తెలుసుకున్నాక 'ఖడ్గసృష్టి' రాయటంతో సరిపెట్టుకున్నాడు మహాకవి. 

( శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో ) 

( ఈ కట్టుకథ కేవలం నవ్వుకునేందుకే సుమా!)

- కర్లపాలెం హనుమంతరావు 

01 -01-2021 

సరదాకే! డబ్బులు గొప్పా- చర్చిలు గొప్పా-

 



సరదాకే! 

డబ్బులు గొప్పా- చర్చిలు గొప్పా- 

- కర్లపాలెం హనుమంతరావు 



చర్చిల్ పేరు తెలీనివారు ఉండరంటే అతిశయోక్తికాదు. 


మాట తీరుతో ఆకట్టుకునే గుణం ఆయనకు ప్రత్యేకం. 


ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఒకసారి బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. 


రేడియో స్టేషనుకని బయలుదేరాడు. పాపం దారిలో కారు పాడయిపోయింది. అటుగా వెళ్తున్న కార్లను ఆపాలని ప్రయత్నించాడు. కానీ చీకటి పడటంతో ఎవ్వరూ ఆయనను గుర్తుపట్టక వాహనాన్ని నిలపలేదు.


చివరికి ఓ టాక్సీ రావటం చూసి దారికి అడ్డంగా నిలబడ్డాడు చర్చిల్. 


బండి ఆగింది. డ్రైవరు తొంగి చూసి

" అడ్డం లేవయ్యా!, అర్జంటుగా ఇంటికి వెళ్లాలి. రేడియోలో చర్చిల్ స్పీచ్ వచ్చే టైం అయింది! " అంటూ విసుక్కున్నాడు.


"పది పౌండ్లు ఇస్తాను, రేడియో స్టేషనులో డ్రాప్ చేస్తావా?" డ్రైవర్ని బతిమాలాడాడు చర్చిల్. 


అయితే తమాషా చూద్దామనుకున్నాడో, లేకుంటే తన కోసం ఆదాయాలు కూడా వదులుకునేవారున్నారని చెప్పుకునేందుకోగానీ, తనే చర్చిలని మాత్రం వెల్లడించలేదు.


"కుదరదు" అంటూ డ్రైవరు తలుపేసుకోబోయాడు.


"అయితే ఇరవై పౌండ్లు ఇస్తాను" బేరానికి దిగాడు చర్చిల్. 


దాంతో డ్రైవరు ఒక్క క్షణం తటపటాయించి "సరే! ఎక్కు!" అన్నాడు.


దారిలో డ్రైవర్ని చర్చిల్ అడిగాడూ "మరి నీ అభిమాన నాయకుడి ప్రసంగం మిస్సయిపోతున్నావేమో గదా పాపం!"


దానికి "అయితే ఏంటంట? ఆయన కబుర్లు వింటూ కూర్చుంటే నా కడుపు నిండుతుందా?? నాకు ఆయనకులాగా మాటలు చెప్తే డబ్బిచ్చే వాళ్లెవ్వరూ లేరు కదా! అనేశాడు డ్రైవరు.


అందుకే అంటారు డబ్బు ముందు ప్రేమలూ, అభిమానాలూ బలాదూర్ అని. ఈ సత్యమే డ్రైవరు ద్వారా ఆనాడు చర్చిలుకూ  చక్కగా బోధపడిందిd.




ఆత్రేయ - తన మూలం ఇదం జగత్

 


ఆత్రేయ గోత్ర నామం: మన'సు కవి'

అసలు పేరు: కిళాంబి వేంకట నరసింహాచార్యులు

పేరు తెచ్చిన పేరు: ఆచార్య ఆత్రేయ


ఆచార్య అంటే ప్రొఫెసర్ కాదు. అసలు పేరులోని తోక. రాయటం రాని రచయిత. ఎంతసేపటికీ ఎదుట కూర్చున్న రాతగాడికి డిక్టేట్ చేయటమే. రాత్రి సుష్టుగా భోచేసి, వెంటనే పడుకుని, రెండు గంటల వేళ లేచి తెల్లారే వరకూ రచనలు చేసే ఆత్రేయ - 'రాత్రేయ' బూతు పాటలు రాస్తారు గనుక 'బూత్రేయ'. ఎవరేమని పిలిచినా పట్టింపులేని మనస్తత్వం అంటారు ఆయనది. హాస్య స్ఫూర్తి ఉన్నా హాస్యం రాయటం రాదు. రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్నీ ఏడిపించే మనసుకవి. మన 'సుకవి'. సరస్వతీ పుత్రుడేగానీ, లక్ష్మీపుత్రుడుగాదు. పొద్దున పదివేలు చేతి కొస్తే సాయంకాలానికి ఖాళీ! శుక్రవారంనాడు నిర్మాతల్నుంచి చచ్చినా ఒక్క పైసా రాలదు. కానీ ఆయన సాధించేవాడు! 'ఏ రోజు ఎంత కావాలో తెచ్చుకో! రేపటికి దాచుకోవద్దు!' అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా 'చిన్నారి మనసులు' చిత్ర నిర్మాణానికి పూనుకున్న మహానుభావుడు. డబ్బు పెడతానన్న ఓ పెద్దమనిషి మాటల్ని నమ్మి సినిమా యజ్ఞానికి పూనుకుని సమిధగా మారిన ఎందరో మహానుభావుల్లో ఆత్రేయ మొదటివాడు కాదు, చివరి వాడూ కాదు. చివరికి చేసేది లేక 'చిత్రం'గా అనుకున్నదాన్ని 'పిల్లలతో చెలగాటం - పెద్దలకే ఇరకాటం' పేరుతో దూరదర్శన్‌ కు  పదమూడు భాగాలుగా తీయాల్సి వచ్చింది. కాల్చుకోవాల్సి వచ్చింది. . చేతులు

చివరి దశలో పెద్ద ఇల్లుపోయి చిన్న గదుల ఓ మేడమీద ఓ చిన్ని వాటాలో చిన్ని మంచం మీద గడిపినవాడు.


"మనిషి పుట్టినప్పుడు ఎలా ఉంటాడో. (గిట్టనప్పుడు) గిట్టనప్పుడూ  అలాగే ఉండి 'పోతాడు'. చివరి దశా తొలిదశ ఒకేలాగా మారటం అంటే ఆ మనిషి జీవితం అనే గీతంలో పదాలు, చరణాలు.. సరిగ్గా పడలేదనే అర్ధం" అంటాడు ఆత్రేయ వేదాంత ధోరణిలో! ఎంతయినా మనసు కవి కదా!


' సీను రాస్తే రాత్రేయే రాయాలి' అనిపించుకున్నాడుగానీ, 'బ్రతికితే ఆత్రేయలాగే. బ్రతకాలి' అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. అతని ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే అందుకు కారణం. '

- కర్లపాలెం హనుమంతరావు 

( రియల్ ఎస్టేట్స్ - మాసపత్రిక - ధనమూలం ఇదం జగత్ కాలమ్ - ప్రచురితం ) 

ధనమూలం ఇదం జగత్

 


కహానీలు : కర్లపాలెం హనుమంతరావు 

( రియల్ ఎస్టేట్స్ : కాలమ్ - మాసపత్రిక - ధన్ మూలమ్ ఇదం జగత్ ) 


పావలా శక్తి!


నేల మీద పడింది చెల్లని పావలా బిళ్లయినా సరే... వంగి తీసుకోకుండా ఉండలేరు. నడుము నొప్పి ఉన్నవాళ్లయినా సరే!


7


తెలుగు మార్క్ !


భూమిలోన పుట్టు భూసారమెల్లను

తనువులోన పుట్టు తత్వమెల్ల

శ్రమలోన పుట్టు సర్వంబు ధనమౌను

విశ్వదాభిరామ వినురవేమ !


అచ్చ తెనుగులో ఉన్న దీన్ని వివరించాల్సిన పనిలేదు. శ్రమలోన పుట్టు సర్వంబు ధనమౌను' అంటూ మారి కన్నా ఎంతో ముందుగా మన వేమన చెప్పటమే ఇక్కడ విశేషం.


'ఏడు(పు)


ఏదైనా లెక్కించేటప్పుడు గత తరంవాళ్లు ఒకటికి బదులు లాభం అంటూ మొదలు పెట్టేవాళ్లు. ఏడు అంకెకు బదులు ఆరున్నొక్కటి అనేవాళ్లు. ఏడు అంటే అశుభం ధ్వనిస్తుందని భావించేవారు మరి. లెక్కల్లోనయినా ధనలక్ష్మికి ఇష్టం లేని మాటలను ఉపయోగించటం మంచిది కాదని మన పెద్దవాళ్ల ఆలోచన. తథాస్తు దేవతలుంటారని భయం పాపం!


జోకాభిరామాయణం


ఉపాధ్యాయుడు : 

మన దేశంలోనే అప్పులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయిరా? 


విద్యార్థి : తీసివేతలు నేర్పే రోజుల నుంచీ మాకు. చిన్న అంకెలో నుంచి పెద్ద అంకె పోకపోతే పక్క స్థానం నుంచి అప్పు తెచ్చుకోవటం నేర్పుతుంటారు గదా సార్! అందుకూ!

- కర్లపాలెం హనుమంతరావు 

03-11-2021 


( REAL ADVISER - DECEMBER 2011) 


Saturday, July 17, 2021

జీత భత్తేలు -కర్లపాలెం హనుమంతరావు

 


సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి  శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి,  ఆ తర్వాత  ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.

దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ  ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్ వారి పాలన కాలంలో  ప్రధాని జీతం అతని  క్యాబినెట్ మంత్రుల  జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక  ఇతర ప్రయోజనాలు సరే సరి.  స్వతంత్ర  భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః

ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ.  ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.

రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల జాబితాలో హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.

దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్ కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ  సీఈఓ జి.పి.గుర్నాని  ప్రస్తుతం రూ.165 కోట్ల వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.

-కర్లపాలెం హనుమంతరావు 



 


Tuesday, April 13, 2021

శ్రమకు తగ్గ ఫలం - వ్యంగ్యం ఈనాడు -కర్లపాలెం హనుమంతరావు

 



ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. దేశంలోనీ నూట పాతిక పై చిలుకు కోట్ల జనాభాకు ముష్టి ఏడొందల తొంభై మూడు మంది మాత్రమేనా ప్రతినిధులం! మా కన్నా తక్కువ స్థాయి పనోళ్లకి మాకు మించిన జీతభత్తేలా? మా గౌరవనీయులైన ప్రజాప్రతినిధుల  మానమర్యాదలు నిలబందుకైనా  వాళ్ల కన్నా కనీసం ఓ రూపాయన్నా ఎక్కువ జీతంగా దక్కాల్సిందే! .. ఎవరు బాబూ నువ్వు? ఎందుకు నీకా నవ్వు?

గుర్తుపట్టవులే? నీ అంతరాత్మను కద! ఎన్నికల సంఘానికి నువ్వు సమర్పించిన దొంగలెక్కల ప్రకారం చూసుకున్నా.. నీ ఒక్క పూట ఆదాయం .. ఈ దేశంలోని తెల్లకార్డువాడి ఏడాదాయనికి వందరెట్లెక్కువ! అందుకే నవ్వాగలా! ఫ్రీ బంగళా, ఉచితంగా ఫోన్ కాల్సు, నియోజకవర్గంలో తిరిగినా తిరక్కున్నా మీరు ఆఫీసు సాదర ఖర్చులకన్చెప్పి  ఏవేవో బిల్లులు పుట్టించి ఇంకెంత బొక్కుతున్నారో..  కాగ్ వాడికే నోరాడని పరిస్థితి. ఇహ విమాన ప్రయాణాలని, రైల్లో బంధుబలగానిక్కూడా ఫస్ట్ క్లాస్ సదుపాయాలని.. అవీ ఇవీ మీరు నొక్కేవన్నీ చూపిస్తూ సర్కారు బొక్కసానికి ఏటా ఎంతో కొంత బొక్కేస్తూనే ఉంటివి! ఇంకా చాల్చావడం లేదంటూ తెల్లారంగానే ఈ కొత్త ఆగమేంటి సోదరా? ఈ కరవు, కరోనాల కష్టకాలంలో  అసలు నీకు దక్కుతున్నదే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయ్! మన్లో మన మాట.. అసలుకి మీకు జీతభత్యాలెందుకు  పెంచాలి? ఒక్క కారణం చెప్పు.. నవ్వకుండా నోరు మూసుకుంటా!

ఒక్కటి కాదు.. వంద చెబుతా.. వినే ఓపిక మరి తగ్గకుండా ఉండాలి నీకే! ఈ ప్రజాప్రతినిధి వృత్తిలోకి రాక మునుపు నా సంపాదన ఎంతో నీకూ తెలుసని నాకూ తెలుసు.  మామూళ్లు, సెటిల్మెంట్లు, రింగులు గట్రా నేరుగా చేసుకునే సౌకర్యం గతంలోలా ఇప్పుడుండదుగా మరి! పనోళ్లకు సిమెంటు ఫ్యాక్టరీలున్నా పట్టించుకోని పబ్లిక్.. అదేంటో మేం ఇసుమంత ఇసుక దందాకు ప్రలోభ పడ్డా.. అదేందో మహా విసుగుదల చూపిస్తూంది! కాబట్టే ప్రభుత్వ వైద్యులకు మల్లే మాకూ నాన్ ప్రాక్టీస్ ఎలవన్సులాంటిదేదైనా భారీగా ఉండాలని డిమాండ్. ఏం తప్పా?

పాయింటేనబ్బీ!

చేంతాడంత మా ఆదాయాల లిస్టు చదవడమే నీకింట్రెస్టు.  మా ఖర్చుల పట్టికేనేడన్నా  పట్టించుకున్నావా అన్నా?  సర్కారు మార్కు ముష్టి ముగ్గురు సెక్యూరిటీ మా అక్కరకేం సరిపోతుంది చెప్పు! కాలు బైటపెడితే ఎంత హంగూ ఆర్భాటం  కావాలి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులన్న తరువాత! పెట్రోలు రేట్లు రేకెట్ల వేగంతో పోటీ పడుతున్నట్లు పబ్లిక్కే పడతిడుక్కుంటుంటిరి. సెక్యూరిటీలో ఒక్కోరికేమన్నా రెడ్ ఫెరారే కారేమన్నా కోరుకున్నామా? అక్కడికీ,  ప్రయివేట్ సైన్యం పాట్లేవో సొంతంగానే పడుతుంటిమిప్పడి దాకా! బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు, బాంబులు, బుల్లెట్లకయ్యే ఖర్చులు ఎంతని అచ్చుకోము సామీ ఈ కరవుకాలంలో! అన్నీ బైటికి చెప్పుకునే ఖర్చులే ఉంటాయా చెప్పు ప్రజా ప్రాతినిథ్యమనే తద్దినానికి తయారైం తరువాత. ఎన్నికల ప్రహసానాల మర్మం నీకూ  తెలుసు. ఎన్నెన్ని రకాల వత్తిళ్లయితే 'బూత్ గండాల' నుండి బైట పడ్డం!

 

నిజవేఁ! ఇది వరకు మాదిరి ఏదో ఓ సందు చూసుకొని సర్కారు భూముల మీద జెండాలు పాతేసే సీన్లు .. పాపం  సన్నిగిల్లాలాయ మీ ప్రజాప్రతినిధుల కిప్పుడు! దేవుడి సొమ్ము దేవుడికే తెలీకుండా మాయమైపోతుండె! ఇహ మీ వాటా కొచ్చే దెంత..  చిటికెడు బూడిద.. సింగిల్ చెవిలో పూవు!

 

ప్రభుత్వాలేమన్నా స్థిరంగా ఉండుంటే, ఆ నిబ్బరం  వేరు .. మన వాటా మన పరమయిందాకా, ఏ కేంటీంలో చాయ్ తాగుతూనో, లాబీల్లో కులాసా చేస్తూనో గడిపేయచ్చు. ఎప్పుడు ఏ బిల్లు మోషన్ కొచ్చి కొంప ముంచుతుందో.. కాల్ సెంటర్ గార్ల్ కన్నా మెలుకువ తప్పనిసరయిందిప్పటి ప్రజాప్రతినిధికి. మరి  ఆ మేరకైనా జీతభత్యాలలో మాకు  మెరకా పల్లం సరిచేయాల్నా వద్దా? లాభదాయక పదవుల్లో ఉండద్దని రూలు పెట్టగానే సరా!  ఆ వారా మాకు జరిగే నష్టం పరిహరించే  లెక్కలు  మాత్రం  చూసుకోవాలా.. లేదా?   లెక్కన చూసుకుంటే మేమిప్పుడు అడిగే  ఐదురెట్ల హెచ్చింపు పులుసులో ముక్క. అదేందో! ప్రజాప్రతినిధి అంతరాత్మవయి వుండీ పద్దాకా జనం తర్ఫున  పీకులాడే రోగం నీకు!  బొత్తిగా అప్రజాస్వామికం నీ వ్యవహారం!

 

సారీ బ్రో! నువ్వింతగా ఒప్పించిం తరువాత కూడా   మైండ్ సెట్ మారకపోతే నేనీ పోస్టుకే వేస్ట్.  మీ జీతభత్యాల పెంపు ఐదేంటీ.. ఇంకో అయిదు రెట్లు ఎక్కువున్నా  తక్కువే సుమా!

 

థేంక్స్ అంతరాత్మా! ఇప్పడికైనా దార్లో  పడ్డావ్!

 

కానైతే నాదీ ఓ చిన్న విన్నపం బ్రదర్! జీతానికి తగ్గట్లు పనీ పాటా ఉండటం సహజన్యాయం. అరవై ఏళ్ల కిందట ఏటా అరవై ఎనిమిది బిల్లులు పాసయేవి చట్టసభల్లో. ఇప్పుడో?   సంవత్సరానికి యాబై ఆమోదమయేందుకే అస్సులు.. బుస్సులు! అవీ చర్చలేవీ లేకుండానే చట్టాలైపోయే పరిస్థితులు! చట్టసభల్లో మీ ప్రజాప్రతినిధుల హాజరు మరీ చిన్నబళ్లల్లో బుడతల హాజరు కన్నా హీనంగా ఉందని జనం బెంగ.

 

అయితే ఏంటంటావ్?

 

ఎకౌంటబలిటీనే బట్టే ఎక్కౌంట్స్   సరిచేయాలంటాను. గంటకు ఇంతని హాజరు భత్యం  ఉండాలి. హాజరుపట్టీ ప్రకారమే జీతాల పట్టి తయారవ్వాలి. వాకౌట్ చేసిన రోజున  జీతం మొత్తం కట్! సభాపతి లేకుండా మాట్లాడిన పక్షంలో పదానికింతని పెనాల్టీ విధించాలి. మార్షల్స్ బలవంతంగా మోసుకుపోయే సందర్భాలలో  కిలోకింతని బాడీ బరువును బట్టి రుసుం విధించడం అవసరం. ఫలహారశాలల్లో  అనుమతి మేరకు లాగించడం వరకు ఓకే.  అదనపు మేతకు మాత్రం అధికంగా వసూలుచేసి తీరాలి. రాజకీయాల్లోకి రాక ముందూ.. వచ్చిం తరువాత ఉండే ఆదాయాలలోని వ్యత్యాసాన్ని బట్టి శిస్తులు వసూలు చేసే కొత్త విధానం తీసుకొస్తే మీ ప్రజాప్రతినిథుల నెలసరి జీతభత్యాలు ఎనిమిది లక్షలేంటి.. పద్దెనిమిది లక్షల మీద ఒక్క రూపాయి పెంచుకున్నా ఆక్షేపించేందుకు లేదు.  దట్సిట్!

 

సడి! నీ లెక్కన ఇక మాకంటూ మిగిలేదేముంది.. ఆ ఒఖ్క రూపాయి తప్ప!

 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుట వ్యంగ్యం - తారీఖు నమోదు కాలేదు)



 

 

 

 

 

 

 

 

 

 

!

 

 

 

 

 

 

Monday, March 1, 2021

రుణానుబంధాలు - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

కథానిక : 

రుణానుబంధాలు 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)


పెరట్లో గిలక బావి దగ్గర స్నానం  చేస్తున్నాను. . శారదమ్మ తత్తరపడుతూ పరుగెత్తుకొచ్చింది 'రాధాకృష్ణయ్యగారు పోయార్టండీ!' అంటూ.


గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చినట్లయింది. 'ఛ! ,, ఊరుకో!' అని కసిరాను. 


'నిజమేనండీ! రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నార్ట. శాస్తుర్లుగారు వాళ్ళింటి కెళ్ళి ముహూర్తాలు కూడా విచారించుకుని వెళ్లార్ట! ఇంతలోనే ఏం ముంచుకొచ్చిందో ఏమో.. ఇట్లాగయింది'


ఆ ఇంటి వైపు పరుగులు తీయబోతున్న శారదమ్మను ఆపి 'నీ కెవరు చెప్పారివన్నీ? ఏట్లా విన్నావో .. ఏమో?' 


'బజారంతా వాళ్లింట్లోనే ఉంది. ఎంత ఎతిమతం దాన్నైతే మాత్రం ఇట్లాంటి విషయాల్లో పొరపాటు పడతానా! నే పోతున్నా.. మీరు తాళం వేసుకు రండి!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమయిపోయింది మా శారదమ్మ.


స్నానం ఎట్లాగో అయిందనిపించి, బట్టలు మార్చుకుని మళ్లీ వాకిట్లోకొచ్చాను. 


చాలా మంది అటే పోతున్నారు. ఇంటికి తాళం వేస్తుంటే ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. ఇక కదల్లేక అక్కడే గుమ్మం ముందున్న అరుగు మీద కూలబడిపోయాను. వారం రోజుల కిందట జరిగిన విషయం వద్దనుకున్నా కళ్ల ముందు కదులుతోంది.


రాధాకృష్ణయ్యా నేనూ బాల్య స్నేహితులం. వాడు జడ్.పి లో టీచర్ గా చేసి రిటైరయ్యాడు. నేనో బ్యాంకులో పనిచేస్తూ రిటైరవడానికి సిద్ధంగా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య వయసులో నా కన్నా మూడేళ్లు పెద్ద. సర్వీసులో ఉండగానే ఎట్లాగో పెద్దపిల్లకు పెళ్లిచేశాడు. రెండో పిల్ల పెళ్లే వాడికి పెద్ద సమస్యయి కూర్చుంది. 


పిల్లా ఆట్టే చదువుకోలేదు. మరీ సంసారపక్షంగా పెంచింది వాళ్లమ్మ. అన్నిహంగులూ ఉన్నవాళ్ళకే పెళ్లిళ్ళు అవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రెండు మూడు లక్షలన్నా పెట్టలేని వీడికి మంచి సంబంధాలు రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. 


ఎట్లాగయితేనేం పెళ్లి సంబంధం ఒకటి ఖాయమయిందని వాడొచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి?


పెన్షన్ డబ్బులు పూర్తిగా అందలేదు. పెళ్లికని దాచిన డబ్బులో కొంత తీసి కొడుక్కి పంచాయితీ బోర్డులో ఉద్యోగం వేయించాడు. ఇప్పుడు అర్జంటుగా ఓ లక్ష సర్దమని వచ్చి కూర్చున్నాడో రోజు. 


సమయానికి నా దగ్గరా అంత డబ్బు లేకపోయింది. డాబా మీద పోర్షన్ వేయడం వల్ల చేతిలో డబ్బాడటం లేదు. 


' పోనీ.. తెల్సినవాళ్లెవరి దగ్గర నుంచైనా ఇప్పించరా! పెన్షన్ డబ్బు అందగానే సర్దేద్దాం' అని బతిమాలుతుంటే బాధేసింది. 


'ఛఁ! చిన్ననాటి స్నేహితుడి అవసరానికి ఓ లక్ష రూపాయలు సర్దలేకపోతున్నానే!' అని మనసు పీకింది.


ఆ సమయంలోనే తటస్థపడ్డాడు శివయ్య. 


శివయ్య రైల్వే గార్డుగా చేసి రిటైరయ్యడు. అతనికి పెన్షన్ మా బ్యాంక్ ద్వారానే వస్తుంది. మొదట్లో కమ్యూటేషన్, గ్రాట్యుటీ అంతా వచ్చింది కరెక్టేనా కాదా అని లెక్కలు కట్టి చూపించింది నేనే. 


మూడు లక్షలు దాకా వస్తే కొంత ఫిక్సడ్ డిపాజిట్ చేయించాను మా బ్యాంకులోనే. 


నెల నెలా బ్యాంకుకు వచ్చిపోయే మనిషవడం వల్ల పరిచయం కాస్త ఎక్కువే అన్నట్లుండేది పరిస్థితి. 


ఎందుకో, అతనికి నా మీద అదో రకమైన గురి కూడా. డిపాజిట్లు రిన్యూవల్ చేయించుకోడానికి వచ్చినప్పుడెల్లా ఎక్కడెక్కడ ఎంత వడ్డీలు ఇస్తున్నారో విచారించుకుని పోతుండేవాడు. 


ఎప్పటిలా ఆ రోజూ శివయ్య నా దగ్గరికొచ్చి కూర్చున్నాడు. 


'పంతులుగారూ! డిపాజిట్లలో వడ్డీ మరీ తక్కువ వస్తున్నది సార్! ఇంకా మంచిది ఏమైనా ఉంటే చెప్పండి సార్!' అని అడిగాడతను.


అప్పుడు మెదిలింది మనసులో ఆ ఆలోచన. శివయ్య ఏమనుకుంటాడో అన్న తటాయింపు ఉన్నా స్నేహితుడికి సాయం చెయ్యాలన్న తపన నన్నట్లా అడగనిచ్చింది. 


'శివయ్యా! నా కర్జంటుగా ఒక లక్ష కావాల్సొచ్చింది. బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాలే! నెల నెలా ఇస్తాను. రెండు నెలల్లో తీర్చేస్తాను. వీలయితే ఈ లోపే ఇస్తాలే!' అన్నాను.


శివయ్య కాదనలేదు, 'బ్యాంకు వడ్డీ ఇవ్వండిలే సార్! చాలు!' అంటూ ఆ రోజే లక్ష రుపాయలూ డ్రా చేసి ఇచ్చాడు. 


'నోటు రాసిస్తాను' అన్నాను. 'మీ నోటి మాట కన్నా విలువైనదా నోటు? వద్దు' అంటూ కొట్టిపారేశాడు శివయ్య. 


ఒక కాగితం ముక్క మీద మాత్రం రాయించుకున్నాడు. 


'శివయ్య నా మీదుంచుకున్న నమ్మకాన్ని వమ్ము చెయకూడదు' అనుకున్నానా రోజు. అదే మాట రాధాకృష్ణయ్యతోనూ అన్నాను డబ్బిస్తూ. 


'పెన్షన్ రాగానే ముందు ఈ బాకీనే తీరుద్దాం. నీ పరువోటీ,, నా పరువోటీనా? అందాకా నోటు రాసిస్తాను తీసుకో!' అన్నాడు  రాధాకృష్ణయ్య. 


'మిత్రుల మధ్య పత్రాలేమిటి?' అంటూ నేనూ ఆ రోజు కొట్టిపారేశాను. 


ఇప్పుడు విధి రాధాకృష్ణయ్యను కొట్టిపారేసింది. 


ఎంత వద్దనుకున్నా లక్ష రూపాయల విషయం మర్చిపోలేకుండా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య ఇంట్లో ఈ బాకీ సంగతి చెప్పాడో లేదో? చెబితే మాత్రం నోటులేని బాకీని చెల్లుబెట్టాలని రూలేముంది? తన స్నేహం రాధాకృష్ణయ్యతోనే కానీ, వాడి కొడుకుతో కాదుగా!


శాస్త్ర్రులగారబ్బాయి వచ్చి అరుగు మీద కూర్చునున్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. 


'ఇంకా మీరిక్కడే కూర్చుని ఉన్నారేంటంకుల్? అవతల వాళ్లంతా మీ కోసం ఎదురుచూస్తుంటేనూ? పదండి పోదాం' అంటూ నన్ను లేవదీసి వాళ్ళింటి వేపుకు తీసుకెళ్లిపోయాడు.


వరండాలో చాపేసి దాని మీద పడుకోబెట్టున్నారు రాధాకృష్ణయ్యను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది వాడి ముఖం. 


'నా బాకీ సంగతేం చేశావురా?' అని ఆడగాలనిపించింది అంత దు:ఖంలోనూ. 


ఆడవాళ్ళు కొందరు ఏడుస్తున్నారు లో గొంతుకతో. 

అప్పటికే బంధువులంతా పోగయివున్నారు. 


రాధాకృష్ణయ్య కొడుకు దుఃఖాన్ని దిగమింగుకొని ఏర్పాట్లు చూస్తున్నాడు. 


నన్ను చూడగానే దగ్గరికొచ్చి కంట తడిపెట్టుకున్నాడు. ఓదార్పుగా వాడి భుజం మీద చెయ్యేసి తట్టేనే గాని నా కళ్లలో మాత్రం నీరు ఊరవా! వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను. 


'ఎట్లా జరిగిందిరా ఈ ఘారం?' 


'రాత్రి వరకు బాగానే ఉన్నారంకుల్! మధ్య రాత్రి  నిద్రలో లేచి అమ్మతో 'గుండెలు బరువుగా ఉన్నాయ'న్నారుట. 


చెల్లెలి పెళ్లి గురించే అలోచించడం వల్లనుకున్నాం. 'అంతా సజావుగా సాగుతుందిలే నాన్నా!' అన్నా ఏదో గుండె ధైర్యం చెప్పడానికి. 


'అంతేనంటావా!' అని మళ్లీ పడుకుండిపోయారు. మళ్లీ ఇక లేవలేదు. తెల్లవారుఝామున గుండెల్లో నొప్పితే మెలికలు  తిరిగిపోతుంటే అర్థమయింది రాత్రొచ్చింది గుండె పోటు ముందు సూచన అని. 


అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఉంటే..' మాట పూర్తవక ముందే గొంతు పూడుకుపోయింది ఆ పిల్లాడికి. 


'పోయే ముందు నీ కేమీ చెప్పలేదుట్రా?' అని అడిగాను ఆశగా. 

తల అడ్డంగా ఊపేడు. 'ఆ అవకాశమే లేకుండా పోయిందంకుల్. అదే బాధ..'


ప్రసాద్ నుంచి వచ్చిన ఆ జవాబుతో ఉన్న ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.


ఇక్కడ చేరినవాళ్లలో కొంత మంది కూతురు పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోతుందన్న విచారం వ్యక్తపరిచారు. 


విచిత్రంగా నా బాధ మాత్రం వేరేగా ఉంది. నా సొమ్ము సంగతి ఏమిటి? అనేదే నా ఆలోచన. 


వాడూ నేనూ ఇంతప్పటి నుంచి ఒకటిగా తిరిగాం. కాలేజీలు వేరు వేరు అయినా సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఒకళ్లను ఒకళ్లం వదలకుండా లవకుశలకు మల్లే కలిసే తిరిగాం.  ఉద్యోగాల మూలకంగా విడిపోయినా ఇద్దరి మధ్య ఎన్నడూ  ఎడం పెరగలేదు. 


రిటైరయిన వాడు సొంత ఊళ్లో ఉంటే, రిటైర్ మెంటుకు దగ్గరగా ఉన్నందున నేనూ సొంత ఊళ్లోనే పనిచేస్తున్నా. 


ఇప్పుడు విధి మాత్రం మమ్మల్నిద్దర్నీ ఈ విధంగా విడదీసింది. 


పాడె మీద పార్థివ  దేహాన్నుంచి అంత్యక్రియలు ఆరంభించారు. 


ఇంకో పది నిముషాలలో నా ప్రాణస్నేహితుడి రూపం కూడా కంటి కందనంత దూరంగా కనుమరుగయిపోతుంది. 


పచ్చనోట్ల వ్యవహారాన్ని ఎట్లాగైనా మర్చిపోవాలి. 


అందుకు ఒక్కటే మార్గం. వాడిని భుజం మీద మోసుకుంటూ అంతిమస్థలి దాకా అందరితో కలసి నడవడమే! 


వాడు చితిలో కరిగిపోయే దృశ్యం కళ్లారా  కనిపించినప్పుడు కానీ చేదు వాస్తవం మనసు పూర్తిగా జీర్ణించుకోలేదు. 


పై చొక్కా విప్పేసి, కండువా భుజం మీద వేసుకుని తయారవుతున్న నన్ను చూసి శారదమ్మ దగ్గరకొచ్చింది. 'మీ కసలే బాగుండటం లేదు. అంత దూరం మోయగలరా?'


'వాడు నా మీద మోపిన రుణభారం కన్నా ఇది గొప్పదా?' అని అందామనుకున్నా కానీ, అతికష్టం మీద తమాయించుకున్నా.


కట్టుకున్నదానికైనా చెప్పుకోలేని గడ్డు నిజం. శారదమ్మకు ఈ అప్పుగొడవలేమీ అప్పట్లో తెలియనివ్వలేదు. 


అంతిమ యాత్రలో అందరితో కలిసి నడుస్తున్నా ఆగడమే లేదీ పాడాలోచనలు. 


నేనే వృథాగా వర్రీ అవుతున్నానేమో! అంత పెద్ద మొత్తం! తన దగ్గర రుణంగా తీసుకున్న విషయ రాధాకృష్ణయ్య కొడుక్కు చెప్పకుండా ఉంటాడా? పెన్షన్ డబ్బు అందగానే ప్రసాద్ తన బాకీ తీరుస్తాడేమో! 


అట్లా తీర్చని పక్షంలో తానేం చెయ్యాలి? ఒకటా రెండా! వడ్డీతో కూడా కలుపుకుంటే పెద్ద మొత్తమే అవుతుంది. తీర్చాలని ఉన్నా అంతా తీర్చలేడేమో! వాడు అసలు నేనెందుకు తీర్చాలని  అడ్డానికి తిరిగితేనో? 


మిత్రుడి కొడుకు మీద కోర్టుకెళ్లే ఆలోచనే జుగుప్సా అనిపించింది నాకు. 


ఆస్తులు పంచుకున్నట్లే, అప్పులూ పంచుకోవడం కన్నబిడ్డల్లా కొడుకుల బాధ్యత.ప్రసాద్ కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునే రకం కాదు.. ఇట్లా సాగుతున్నాయి దారిపొడుగూతా నా ఆలోచనలు . 


కర్మకాండల తతంగం ముగిసి బంధుమిత్రులు వెళ్లిపోయి ఇల్లంతా మెల్లిగా  ఆ విషాదానికి సర్దుకునే సమయంలొ .. అదను చూసి అడిగాను ప్రసాదును అక్కడికీ ఆశ చావక 'ప్రసాదు! నాన్న ఇంటి సంగరులెప్పుడూ నీతో చెప్పలేదా?' అని.


'మాట్లాడుతూనే ఉంటారంకుల్! ఇదిగో.. ఈ పెళ్లి తలపెట్టినప్పటి నుంచే మూడీగా మారిపోయారు. సొమ్ము సమకూరదనేమన్నా దిగులేమో! చేసిన అప్పులు తీర్చడ మెట్లాగన్న ఆలోచనా నాన్నగారిని బాగా కుంగదీసింది. సగం ఆ దిగులుతోనే కన్నుముశారేమోనని నా అనుమానం' అన్నాడు ప్రసాద్.


నాకు కొద్దిగా ఉత్సాహం వచ్చింది 'తాను చేసే అప్పుల గురించి ఎప్పుడైనా నీతో చర్చించేవాడా?' అనడిగాను ఆశగా. 


'నోటితో చెప్పలేదు కానీ.. ఇదిగో ఈ డైరీలో రాసి పెట్టుకున్నారు. కొద్ది మందికి అప్పుపత్రాలు రాసినట్లున్నారు. అంతా కలసి ఒక అయిదారు లక్షలు అయినట్లుంది' 


'మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావ్?'


'ముందు చెల్లెలి పెళ్లి పూర్తి చెయ్యాలి. అప్పుడే నాన్నగారికి కన్యాదాన ఫలం దక్కేది. ఆ తరువాత కూడా పెన్షన్ డబ్బులేమన్నా మిగిలుంటే  వీలయినంత వరకు పత్రాలకు సర్దుదామనుకుంటున్నా. మీరేమంటారంకుల్?' 


'మంచి ఆలోచనరా! బాకీలు తీర్చి తండ్రిని రుణవిముక్టుణ్ణి చెయ్యడం కొడుకుగా నీ బాధ్యత కూడానూ! అందరూ  నోట్లే రాసివ్వలేదేమో! చే బదుళ్లూ..'


'మధ్యలోనే తుంచేశాడు ప్రసాద్ 'నోట్లు విడిపించుకోవడమే తలకు మించిన పని. నోటి మాట  బదుళ్లూఎలా తీర్చగలం? అందులోనూ అందమా  నిజమే చెబుతారని గ్యారంటీ ఏంటంకుల్?చనిపోయినవాళ్ల పేరు చెప్పుకుని డబ్బులు దండుకునేవాళ్ళు కోకొల్లలు ఈ కాలంలో! అవన్నీ తీర్చడమంటే నా వల్లయ్యే పనేనా?..


'ప్రసాద్ సమాధానంతో నా నవనాడులూ కుంగిపోయాయి. 


'పోనీ.. ఆ డైరీలోనే నా పేరేమైనా రాసేడేమో! డైరీ చూపించమని ఓ సారి అడిగితే!' నా ఆలోచన నాకే సిగ్గనిపించింది. కానీ, లోపలి మధనను ఆపుకోలేని బలహీనత. 


ప్రసాద్ స్నానాల గదికి వెళ్లిన సందు చూసి అక్కడే టేబుల్ మీదున్న డైరీ తీసి ఆత్రుతగా తిరగేశా. 


ఊహూఁ! ఏ పేజీలోనూ నా పేరే కనిపించ లేదు! 


నాకుగా  నేను  ఆ చేబదులు ఊసెత్తితే ప్రసాద్ నన్ను ఏ కేటగిరీలో చేరుస్తాడో తెలుసు! పరువే ప్రధానంగా గడిపే మధ్య తరగతి జీవిని నేను. 


'లక్ష రూపాయలకు నీళ్లొదులుకోక తప్పదు' అని ఆ క్షణంలోనే ఒక నిశ్చయానికి వచ్చేశాను. 


రాధాకృష్ణయ్య నన్ను తప్పింకుని పోగలిగాడు కానీ, శివయ్య నుంచి నేనెలా తప్పించుకోగలను!


అప్పటికీ సాధ్యమైనంత వరకు శివయ్య కంటబడకుండా ఉండేందుకు ప్రయత్నించాను. 


ప్రసాద్ తండ్రి పింఛన్ సొమ్ము అందుకున్నాడు.  కిందా మీదా పడి చెల్లెలి పెళ్లి అయిందనిపించాడు. పెళ్ళిలో నా భార్య బాగా పూసుకు తిరిగింది. నేనే, మనసు పెట్టి మిత్రుడి కూతురి కళ్యాణ శుభవేళంతా కలవరంతో గడిపేసింది! 


రాధాకృష్ణయ్య పేరు చెవిన పడగానే ముందు లక్ష రుపాయల రుణం కళ్ల ముందు కదలడం నా దురదృష్టం. 


ఆబ్దికాలకు హాజరయి వచ్చిన తరువాత .. వీలయినంత వరకు వాడిని ఊహల్లోకి రానీయకపోవడమే మిత్రుడిగా నేను వాడికి చేయదగ్గ న్యాయం అనిపించింది.


శివయ్య పెట్టిన గడువు రానే వచ్చింది. ఆ రోజు అతను బ్యాంకుకు వచ్చాడు కూడా. కానీ, బాకీ సంగతి హెచ్చరించలేదు! నేనూ నాకై నేను ఆ ఊసు జోలికి పొదలుచుకోలేదు. కానీ, ఎంత కాలమని ఇట్లా?!


నా మీద నమ్మకంతో ఏ నోటూ లేకుండానే  అతి తక్కువ వడ్డీతో అంత పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చిన పెద్దమనిషి నుంచి మొహం చాటేసే దౌర్భాగ్య పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నానే! 


'మిత్రుడయితే ఏంటి? అంత పెద్ద మొత్తం అప్పుగా ఇస్తున్నప్పుడు రాధాకృష్ణయ్య దగ్గర నోటు రాయించుకుని ఉండాల్సింది. నా పొరపాటే నా నేటి దౌర్భాగ్య పరిస్థితికి నూటికి నూరు పాళ్లు కారణం' అని అనుకోని క్షణం ఉండటంలేదు ఈ మధ్య కాలంలో!


బ్యాంకు కొచ్చిన మూడో సారి కూడా తన బాకీ  ఊసెత్తని నన్ను అదోలా చూశాడు శివయ్య. 'సారీ శివయ్యా! అనుకున్న టైముకు డబ్బందలేదు. వడ్డీ ఇస్తాను. అసలుకు నోటు రాసిస్తాను.. కాదనకుండా తీసుకో!' అన్నాను.


వడ్డీ పైకం తీసుకుని నోటు తయారుచేయించి తెచ్చాడు. సంతకం చేసి ఇచ్చేటప్పుడు 'వచ్చేనెలలో నా బిడ్డ పెళ్లి  పెట్టుకున్నాను సార్! ఎట్లాగైనా సొమ్ము సర్దాలి' అంటున్నప్పుదు శివయ్య ముఖం చూడలేక నేను  సిగ్గుతో చచ్చిపోయిన మాట నిజం.


శివయ్య ఇప్పుడు బ్యాంకుకొచ్చినా నన్ను కలవడం లేదు. నేను పలకరించినా ముభావమే సమాధానం.


ఓ శుక్రవారం  బ్యాంకు కొచ్చి ఉన్న డబ్బంతా విత్ డ్రా చేసుకున్నాడు శివయ్య. 


నా దగ్గరికొచ్చి 'సోమవారం నోటు తీసుకువస్తాను. ఎట్లాగైనా సొమ్ము చెల్లించాలి. వడ్డీ అక్కర్లేదు. అసలు ఇస్తే అదే పదిలక్షలు!' అని తాఖీదు  ఇచ్చిపోయాడు. 


శివయ్య దృష్టిలో నేను అంతలా పడిపోవడానికి కారణమెవరు? 


రాధాకృష్ణయ్యా? రాబోయే మరణాన్ని వాడేమైనా కలగనలడా? ఆ మృత్యుదేవత రాధాను కాకుండా తననైనా ఎంచుకుని ఉండొచ్చుగా! అప్పుడీ శివయ్య ఏం చేసివుండేవాడు? 


శివయ్యను మాత్రం తప్పెలా పట్టగలను?అంత పెద్ద మొత్తాన్ని స్వల్ప వడ్డీకి ఏ ఆధారం లేకుండా తనకు ధారపోసిన గొప్పవ్యక్తిని ఎట్లా తప్పుపట్టడం? 


ఏ వత్తిడుల కారణంగానో తానిప్పుడు వైఖరి మార్చుకున్నాడో? 


సమయానికి తాను చెసిన సాయాన్ని గురించి సమాచారం లేనందువల్లనే కదా మిత్రుడి కొడుకు ప్రసాదైనా తన చే బదులును లెక్కలోకి తీసుకోనిది? ఇన్ని పాత రుణాలను చెల్లిస్తోన్న అతని మంచి గుణం కేవలం నోటు లేదనే ఒకే ఒక సాకుతో ఎగవేసేందుకు  ఒప్పుకుంటుందా? 


పరిమితికి మించిన నమ్మకాలు, సమాచార లోపాలు.. విధి ఆడించిన నాటకాల కారణంగానే  వ్యక్తిత్వాలు ఇక్కడ ప్రశ్నార్థకాలు అయ్యాయే తప్పించి.. ఆర్థిక బంధాలు మానవీయ సంబంధాలకు మించిన బలమైనవిగా భావించడం సరయిన దిశలో సాగే అవగాహన కాదేమో!  


ఏదేమైనా శివయ్య బాకీ తీరిస్తే గాని, నా మనశ్శాంతి నాకు తిరిగి రాదు. 


ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీతభత్యాల ఎరియర్స్  తాలూకు మధ్యంతర చెల్లింపులకు ఆదేశాలు ఆ శనివారమే వెలువడ్డంతో ఆదివారం అంతా బ్యాంకులో కూర్చుని సిబ్బంది మొత్తం ఉత్సాహంగా ఆ పని చూసుకున్నాం. 


సొమవారం ఉదయానికల్లా అందరి ఖాతాలలో సొమ్ము జమ. 


ఈ సారి ఎరియర్స్ సొమ్ముతో వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకోవాలని శారదమ్మ ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తోంది. 


సోమవారం శివయ్య బ్యాంకు వైపుకు వస్తాడనుకున్నాను. రాలేదు! 


మరో రెండు రోజులు చూసి నేనే సొమ్ముతో సహా శివయ్య చిరునామా వెతుక్కుంటూ వెళ్లాను. 


ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమయింది. అది  ఒక మురికిపేటలో ఉంది. శివయ్య ఇల్లు చాలా అధ్వాన్నంగా ఉంది. 


తలుపు కొట్టాను. ఒక నడివయసు ఆడమనిషి గడియ తీసింది. 

నన్ను ఎగాదిగా చుసి 'ఎవురు కావాల?' అంది. 


చెప్పాను. 


నిర్లక్ష్యంగా పక్కగది చూపించి వెళ్లిపోయింది.


శివయ్య మంచం మీదున్నాడు. మంచం చాలా మురికిగా ఉంది. 


శివయ్య మొహంలో కళ లేదు. నెలరోజులు లంఖణాలు చేసిన రోగిష్టిమారిలా కనిపించాడు. 


నా పలకరింపులు అయినంత సేపూ డోర్ కర్టెన్ వెనక ఏవో కదలికలు. 


డబ్బు ఇవ్వడానికి బేగులో చెయ్యి పెట్టాను. 


అతను బలహీనమైన చేతితో ఆ పని ఆపుచేయించాడు 'మీ ఫ్రెండు గారి అబ్బాయే వచ్చి ఇచ్చి వెళ్లాడు. నోటు మీకు ఇద్దామనుకునే లోపలే అడ్దంపడ్డాను.' అంటూ పరుపు కింది  దాచుకున్న పత్రాలలో నుంచి ఒక పత్రం ఏరి తీసిచ్చి 'ఇక మీరు వెళ్లవచ్చు' దండం పెట్టేశాడు. 


 ఏదో అడగబోయేటంతలో ఇందాకటి ఆడమనిషి లోపలి కొచ్చింది అనుమానంగా చూస్తూ. 


శివయ్య అటు తిరిగి పడుకుండిపోయాడు. 


అంటే ఇక నేను 'బైటికి దయచేయచ్చు'  అని అర్హ్తమనుకుంటా. 


సవాలక్ష అనుమానాలతో నేను తిరిగివచ్చేశాను. 


ప్రసాదుకు ఈ బాకీ సంగతి తెలుసన్నమాట! 


రాధాకృష్ణయ్య చూచాయగా కూడా చెప్పినటట్లు  లేదే! 


ప్రసాదుతో మాట్లాడితే గాని విషయాలు తేలవు. 


చికాకు కారణంగా నేను ఆ దిక్కుకు పోవడమే మానేశాను. 


పాడు డబ్బు పితలాటకం మూలకంగా ప్రాణస్నేహితుడి కుటుంబానిక్కూడా దూరమయిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. 


వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో  నేను ఆ కుటుంబానికి రాధాకృష్ణయ్యలాంటి వాడిని. ప్రసాద్ ఎన్నో సార్లు సలహా కోసరంగాను తన దగ్గరి కొస్తుండేవాడు. 


తన ముభావం  కారణంగా రాకలు తగ్గించేశాడు. 


నేను ప్రసాద్ ను కలవడానికి బైలుదేరుతుంటే శారదమ్మ అన్నది నిష్ఠురంగా 'ఆ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ లేడుగా! కొత్త బావగారు తనకు దుబాయ్ లో కొలువిప్పించాడు. ఆ సంగతి చెప్పడానికని ఎన్ని సార్లు వచ్చినా మీరు  మొహం చాటేశారు.. మహగొప్పగా!'  


నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. 


అయిందేదో అయింది. ముందీ డబ్బు మిస్టరీ తేలాలి. 


శారదమ్మ ద్వారా ప్రసాద్ దుబాయ్ చిరునామా సేకరించి ఇంత పెద్ద ఈ మెయిల్ పంపించాను. 


ఫోనులో నేరుగా మాట్లాడవచ్చు. కానీ, అత్మాభిమానం.. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడనీయదు: 


చే బదులు విషయంలో ముందు  నుంచి జరిగిందీ.. తరువాత నా ప్రవర్తనా..  అందుకు కారణాలు గట్రా అంతా ఓ సోదిలా వివరించి.. చివరగా శివయ్య బాకీ తీర్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియచేశా. 


తెల్లారే సరికల్లా ప్రసాద్ నుంచి తిరిగు మెయిల్! 


'ఆ శివయ్య ఎవరో నాకు తెలీదు  అంకుల్! నేను అతనికి డబ్బిచ్చిందేమీ లేదు! నాన్నగారు అలా మీ ద్వారా అతని దగ్గర్నుంచి అప్పు తీసుకున్నట్లు నాకు ఎప్పుడూ చెప్పను కూడా చెప్పలేదు. ఆ సంగతి ఇదిగో ఇప్పుడు మీ ఉత్తరం అందిన తర్వాతనే తలిసింది. అందరి అప్పులూ తీర్చేశాను. ఈ ఒక్కటి మాత్రం ఎందుకు? ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. తండ్రిని రుణశేషుణ్ణిగా మిగల్చడం కన్నబిడ్డకు భావ్యం కాదని మీరే అంటారుగా! అమౌంట్ పంపుతున్నా! దయచేసి అతని బాకీ అణా పైసల్తో సహా తీర్చేయండి!'


ప్రసాద్ పంపిన డబ్బు అందిన తరువాత బలవంతంగానైనా శివయ్యకు ఆ డబ్బిచ్చెయ్యాల్సిందేనని వెళితే .. అంతకు మూడు రోజుల కిందటే పోయినట్లు తెలిసింది. 


కొడుకు జులాయిట. ఎక్కడి డబ్బు పేకాటకు పోస్తుంటే .. అడ్డొస్తున్నందుకు దుడ్డు కర్రతో బుర్ర రాంకీర్తన పాడించాడుట! 


అప్పటికి తిరిగొచ్చినా శివయ్య సొమ్ము నా దగ్గరుంచుకో బుద్ధేయలేదు. 

అతని కష్టార్జితాన్ని సద్వినియోగం చేయడమెట్లాగా అని మధన పడుతుంటే.. మాటల సందర్భంలో బాకీ అడిగిన రోజు శివయ్య చేసిన పెద్దల వెల్ ఫేర్ సెంటర్ల ప్రస్తావన గుర్తుకొచ్చింది.


నాకు తెలిసిన ఓల్డేజ్ హోమ్   కు శివయ్య పేరున ఆ పెద్ద మొత్తం శాశ్వత విరాళం కింద ఇచ్చిన తరువాత గాని మనసుకు శాంతి లభించింది కాదు. 

***

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)







'








 

 

 

'

 

 

'

Saturday, February 20, 2021

తియ్యండిరా బళ్లు- సరదా వ్యాఖ్య -కర్లపాలెం హనుమంతరావు

 


'తియ్యండిరా బళ్లు' అని అరవందే  విలన్ పాత్రకు   న్యాయం జరిగినట్లు కాదు తెలుగు యాక్షన్ సినిమాలో!ఇవాళ ఆ బళ్లు బైటికి తియ్యడం నిన్నటి కన్నా ఖరీదైన వ్యవహారం. తొమ్మిది రోజుల కిందట కాని ఈ బళ్ల సన్నివేశం జరిగివుండుంటే పాపం, ప్రతినాయకుడి కాతాలో ఒక్కో బండికి లీటరు పెట్రోలు  ఐదు రూపాయలు,  డీజిల్ నాలుగు రూపాయల ఎనభైఏడు పైసలు ఆదా అయేది. విలన్ అంటే నలుగుర్ని తన్నో, బెదిరించో వసూలు చేసేది కాబట్టి అతగాడి సొమ్మేం పోయేది కాదు.  సగటు పౌరుడికయితే నడ్డి  విరగుడు ఖాయం. గతుకుల రోడ్ల మీద ప్రయాణాలతోనే కాదు సుమా, మన దేశంలో సామాన్యుడి నడ్డి విరగడంలో అసాధారణమైన పాత్ర చమురు ధరలకే ఎక్కువ.'పెరుగుట విరుగుట కొరకే' అనే మెట్ట సిద్ధాంతం మెరక మీద  మెత్తటి బెంజి బళ్లలో  నిత్యం ప్రయాణం చేసే సౌకర్యం ఉన్న దొడ్డప్రబువులకే! గంజి తాగే జీవైనా సరే ప్రయాణాలకు బస్సులు, షేర్ ఆటోలూ వాడక తప్పదు కనక ధరల పెనుభారంలో వాడి వాటా కూడా ఉన్నట్లే!కోవిద్ పంథొమ్మిది వ్యాప్తి కోసం కృషిచేసే కరోనా వైరస్ కథలానే మన దేశంలో చమురు ధరల పెరుగుదల మూల రూపమూ ఒక పట్టాన అంతుపట్టదు. ముడి సరుకు ధరలని ఒకసారి, శుద్ధి చేసే ఖర్చులకని మరోసారి, అమ్మకంలో కంపెనీల వాటాలు ఆటి రావడం లేదని ఇంకోసారి.. ఇట్లా ఏదో ఒక పాము వైకుంఠపాళి ఆటలో  సగటు మనిషి బతుకుతో పేకాడుతూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా తాళాలేసేసాం.. ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉండండి అన్నాయా ప్రభుత్వాలన్నీ! పోనీలే పెట్రోలు ఖర్చన్నా కలిసొస్తుందన్న మురుసుకున్నంత సేపు పట్టలేదు! అట్లా గొళ్లాలు తీసీ తియ్యంగానే ఇట్లా పెట్రోలు, డీజిళ్ల బాదుళ్లు మొదలైపొయ్యాయ్! వేతనాలకు కోత పెట్టండని తాకీదులు పంపించిన పెద్దలది చమురు ధరల జిడ్డు దగ్గర.. అంతర్జాతీయం.. అనుసంధానం అంటూ ఎప్పుటి రోటిపాటే! ఉద్యోగాలు పీకేయడంలో కనిపించిన ఉత్సాహం, ఉద్దీపనలప్పుడు ఎట్లాగూ చప్పడిపోయింది. కష్టకాలం కదా..  పోనీ తమ ఎక్సైజ్, వ్యాట్ పన్నుల వాటాలైనా ఉదారంగా కాస్తింత వదులుకున్నాయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు? 

మందు తాగబోయండని ఆందోళన చేసినప్పుడు లేని డబ్బు వృథా మేటర్ ..  బళ్లకు చమురు పోసే వేళనే  గుర్తుకొస్తుందా? అని వేళాకోళానికి దిగితే మొహం వేళాడేయాల్సిందే పౌరసమాజం. యథా ప్రజా తథా రాజా! ముఖ్యంగా వృథా ఖర్చుల్లో!

ముడి చమురు ధర పడిపోయినా, పన్నులు ధాటిగా నిలబడే ఉండటం మన దేశం ప్రత్యేకత. జనవరిలో బారెల్ ధర దారుణంగా దిగివచ్చిందన్నారు. అయినా పన్నులు మొండిబుద్ధే చూపించాయ్! ఇప్పుడు పెట్రోలు మూల ధర మీద  పన్ను శాతం దాదాపు 254- అని కేర్ రేటింగ్స్ పరిశోధనలు  హెచ్చరిస్తున్నాయ్! అయినా 'డోంట్ కేర్' మూడ్ లోనే ఉన్నాయ్ ప్రజలెన్నుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు!  ధరల పెరుగుదలలో పన్నులదే సింహభాగం పాపం. 

పాపం ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయ్! ఇంధనం పన్నులు పెంచినందు వల్ల  ధరలు తగ్గినప్పుడు జనాలు చేసే వృథా ఖర్చులకు కళ్లెమేసే బాధ్యత దేవుడి కొదిలేయలేవు  కదా!లాక్ డౌన్ మూలకంగా లాభం కుదేలయిన వర్గాలలో ప్రభుత్వాలదే పెద్దపీట. ఎనభై రెండు రోజులు ఉగ్గబట్టుకునుండటమే పన్నుల శాఖలో పెద్ద రికార్డు.  ఇంధనం మీద పన్నుల రూపంలో వచ్చే ధనమే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం. ఘరానాగా చెప్పుకునే ఖజానా లెక్కల్లో చమురు పన్ను లెక్కలు కోసేస్తే ప్రభుత్వాలకు మిగిలేది జానా బెత్తెడు ఆదాయం.

బార్ లో  మందంటే వీజీగా బుర్రకెక్కుతుంది. కానీ ఈ బారెల్స్.. డాలర్స్, ప్రపంచ ధరల సూచిక, వినియోగదారుల ధరల సూచిక, ద్రవ్యోల్బణంలాంటి తకరాలు  జనాల తలలకేమెక్కేను? అదీ ధీమా!  మందు బాబులతో పోటికి దిగినట్లు బళ్లువాడేవాళ్లూ  చమురు ధర క్రతువులో మూడొంతులు పన్నుల రూపంలో సమిధలు సమర్పించుకుంటున్నారు.  డాలరు కన్నా రూపాయి కండపడితే తప్ప ఈ చిల్లర ధరలతో సామాన్యుడు కుస్తీపట్టలేడు. 

పెట్రోలు నీళ్లలా వాడే దేశాలలో మనం ముందున్నట్లు ఒబామా హయాం నుంచి ఓ అభియోగం ఎటూ  ఉంది. పోనీ ఆ పరిస్థితుల్లో అయినా మార్పు తెచ్చే ప్రయాస కనిపిస్తుందా? ప్రొటోకాల్ పేరుతో గల్లీ నేతగారి   ముందూ వెనకా సాగే కార్ల దండు రిపబ్లిక్ పెరేడ్ వందన సమర్పణ గుర్తుకుతెస్తుంది! పన్ను దెబ్బ సామాన్యుడి మీద ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా అంతకు మించి ఎన్నో రెట్లు. రావాణా ఛార్జీల నిర్వహణ వంకతో శవాలు తరలించే మహాప్రస్థానం సైతం పన్నులు వసూలు చేసే రోజులు ఆట్టే దూరంలో లేవేమో కూడాను. 

ఆదాయం రాబట్టటమా,  ద్రవ్యోల్బణం పెరుగుతుంటే గుడ్లప్పగించి చూడడమా?  నింద పడితే పడ్డది లెమ్మని అందుకే ప్రభుత్వాలెప్పుడు పన్నులు బాదే బాధాకరమైన బాధ్యత దేవుడి కొదిలేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోనిది.  

***

Tuesday, January 19, 2021

పెద్దల జీతభత్యాలు -కర్లపాలెం హనుమంతరావు


 

సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి  శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి,  ఆ తర్వాత  ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.

దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ  ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్ వారి పాలన కాలంలో  ప్రధాని జీతం అతని  క్యాబినెట్ మంత్రుల  జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక  ఇతర ప్రయోజనాలు సరే సరి.  స్వతంత్ర  భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః

ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ.  ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.

రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల జాబితాలో హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.

 

దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్ కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ  సీఈఓ జి.పి.గుర్నాని  ప్రస్తుతం రూ.165 కోట్ల వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.

-కర్లపాలెం హనుమంతరావు

(27 -09 -2020 నాటి ఒక వ్యాసంలో)

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...