Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Wednesday, December 29, 2021

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


 



చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


( జననం : నవంబరు 10, 1788)


నూరార్లు లెక్క చేయక

పేర్లెక్కిన విబుధ వరుల బిలిపించుచు వే

మార్లర్థ మిచ్చు వితరణి 

చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్.


ఎవరయ్యా ఈ చార్లెసు ఫిలిప్సు బ్రౌన్ సాహెబు? 


పేర్లెక్కిన విబుధవరులను ఎందుకు పిలిపించేవాడు? అర్థ వితరణం ఎందుకు చేసేవాడట? 


మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తూ ఉండిన కాలంలో ఆ కుంఫినీ కొలువులో ఉండి కడప, మచిలీపట్నం మొదలైన చోట్ల చాలా సంవత్సరాల పాటు జడ్జీగా  పనిచేసిన ఇంగ్లీషు దొర-  బ్రౌన్. 


ఎందరు దొరలు మన దేశానికి రాలేదు? ఎందరు ఇక్కడ కొలువు చేయలేదు? తమ దేశం కొలువు చేస్తూ మనదేశాన్ని కొల్లగొట్టలేదు? ఐతే ఈ బ్రౌన్ దొర విశేషం ఏమిటి?


ఈ బ్రౌన్ దొర తన దేశాన్ని కొలుస్తూ ఆ కొలువుకు ఏమాత్రమూ భంగం కలగకుండా అంతకంటే ఎక్కువగా తెలుగు దేశపు కొలువు చేశాడు. మనలను కొల్ల గొట్టలేదు సరికదా తన డబ్బే విస్తారంగా మనకోసం వెచ్చించాడు. నిస్వార్థంగా తెలుగు భాష సేవలో, తెలుగు సాహిత్యం ఉద్ధరణకోసం ఎన్నో ఉత్తమ గ్రంథాలను చెదపురుగుల నోట పడకుండా కాపాడాడు. అనేక కావ్యాల వ్రాత ప్రతులను సంపాదించి తప్పుల కుప్పలుగా ఉన్న వాటిని శ్రద్ధగా పరిశీలించి సంస్కరించి ముద్రింపించాడు. తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును కూర్చాడు.  ఈ మహా భాషా సాహిత్య వ్య యానికి ఆయనే మదుపు పెట్టాడు. మదుపు పెట్టిన దానికి ఆయన ఆపేక్షించిన ప్రతిఫలం ఆంధ్రుల విజ్ఞానమూ, వికాసమూను. 


మరి ఆ భాషా సేవలో తనకు సహాయ పడడానికోసమే బ్రౌన్ దొర పేరెక్కిన విబుధ వరులను పిలిపించి తాను పోషించాడు. వేతనాలు ఇచ్చి ఆయన వేమార్లరమిచ్చు వితరణి కూడా. 


కష్టంలో ఉన్న ఒకాయన కొంత పాండిత్యం ఉన్నవాడై ఉండాలికూడా తనకు సహాయం చేయవలసినదిగా బ్రౌన్ దొరగారిని అర్థిస్తూ దొరగారు పండితుడు కనుక ఆయనను కొంచెం మెప్పించినట్లవుతుందని భాగవతం గజేంద్ర మోక్ష ఘట్టంలోని పద్యం వ్రాసి పంపించాడట!


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపన్ దగున్ రావే యీశ్వర కావవే వరద సంరక్షించు దీనునిన్ భద్రాత్మకా


బ్రౌన్ దొర కొంత సొమ్ము ముట్టజెప్పాడట. ఆ వచ్చిన పద్యపు అర్జీమీద పద్యంలోనే ఒక ఎండార్స్ మెంట్  కూడా వ్రాశా డట. ఆ పద్యంకూడ భాగవతంలోనిదే:


ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబులోపలన్ 

మానుము సంభవంబుగల మానవకోటికి చావు

నిక్కమౌ గాన హరిం దలంపు ఒక గందు జన్మము నీకు ధాత్రిపై

మానవ నాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్ .


బ్రౌన్ దొర పండితుడు. పండితాభిమాని, న్యాయమూర్తి. రావణ దమ్మీయ ద్వ్యర్థికావ్యాన్ని రచించిన పిండిప్రోలు లక్ష్మణ కవి మేనల్లునికి ఒక వ్యాజ్యెంలో అన్యాయం జరిగింది. న్యాయాధి కారి లంచం తీసుకొని అన్యాయమైన తీర్పు చెప్పాడు. అప్పుడు రాజమహేంద్రవరంలో జిల్లా జడ్జీగా ఉన్న బ్రౌన్ దొర దగ్గరికి అప్పీలు వచ్చింది. లక్ష్మణ కవి దొరగారిని దర్శించి ఒక పద్యం చెప్పాడు.


మధువైరికిన్ వనమాలికి గౌస్తుభ

హారునకును సంశ్రితావసునకు రాధికా ప్రియునకు రామసోదరునకు 

జగదీశునకు దయాసాగరునకు 

శ్రీ నాథునకును రక్షిత దేవ సమితికి 

బ్రౌఢ భావునకు నారాయణునకు 

నురగేంద్ర తల్పున కరి శంఖ ధరునకు 

దొగల రాయని గేరు మొగము దొరకు 

రణ నిహత దుష్ట రాక్షస రమణునకును 

గాన మోహిత వల్లవీ కాంతునకును

రిపు విదారికి హరికి శ్రీ కృష్ణునకును 

కిల్పిషారికి నే నమస్కృతి యొనర్తు.


శ్రీ కృష్ణునికి నమస్కారం అని చెప్పిన ఈ పద్యం ప్రతి పాదంలోని మొదటి అక్షరాలను వరసగా చదివితే 'మహారాజశ్రీ బ్రౌన్ దొరగారికి' అని అవుతుంది. 


జరిగిన అక్రమాన్ని ఆలకించి న్యాయమూర్తి బ్రౌన్ దొర న్యాయం చేకూర్చాడట.


విదేశీయులు తెలుగు నేర్చుకోవడానికి సహాయపడే తెలుగు వ్యాకరణాన్ని రచించాడు బ్రౌన్. తెలుగు వారికి ఎంతగానో ఉపకరించే తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును తయారు చేశాడు.


బ్రౌన్ దొర అభ్యుదయ వాది. ఛాందస పండితులు పట్టు కొని వ్రేలాడే అర్ధానుస్వార శకట రేఫాలు వాడుక నుండి ఏనాడో నిష్క్రమించిన అర్థరహితమైన సంజ్ఞలు అని ధైర్యంగా చెప్పగలి గాడు. 


ఆయన తరువాత దాదాపు ఒక శతాబ్దానికి కాని గిడుగు రామమూ ర్తి పంతులు గారి కృషి ఫలితంగా వ్యావహారిక భాషకు మన్నన కలుగలేదు. బ్రౌన్ దొర ఏనాడో వ్యావహారిక భాషకు గౌరవం కలగజేశాడు.


బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పాఠశాలా పరీక్షలలో తరుచు అడుగుతూ ఉండే ప్రశ్న ఒకటి ఉండేది. 

 "బ్రిటిష్ పాలన వలన మనకు కలిగిన లాభములేవి"? అని. 


రైళ్ళు, తపాలా ఆఫీసులు వగైరా ఏవేవో విద్యార్థులు జవాబుగా వ్రాస్తూ ఉండేవారు. 


వాటి మాట ఎలా ఉన్నా బ్రిటిష్ పరిపాలన వలన తెలుగు దేశానికి కలిగిన ఒక పెద్ద ప్రయోజనం..  చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని నిస్సం దేహంగా చెప్పవచ్చు


- ఎన్. శివనారాయణ

Friday, December 24, 2021

పంచతంత్రము; దాని పుట్టుక శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు ( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 )









 



పంచతంత్రము; దాని పుట్టుక

శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 


( ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


శ్రీనివాసపురం నరసింహాచార్యులు, రమారమి ఏడెనిమి దేండ్లనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రి కలో శ్రీవిశ్వాత్ముల నరసింహమూర్తి గారి బొమ్మల పంచతంత్రము ప్రశటింపబడుచుండెను. కాని, అది పూర్తి కాశమునుపే మరదురదృష్ట వశమున నాక ధా చిత్రకారుడు కీర్తి శేషు డగుటచే పత్రికలో పడినంత వరకు పుస్తకరూపముగా వేసిన ఆంధ్రపత్రిక గ్రంథమాలా ప్రకాశ కులు తమమాటగా 'ఈపంచతంత్య్ర గ్రంథము పుట్టుక యెక్కడనో యెరుగ రా' దని వాసిరి. అది చదివినప్పుడు జగము మెచ్చిన శాస్త్ర మును జంతు సంతానముల ద్వారా జనులకు తెలియజేసెడి కృతిని జేసి సుశృతి యైన యీమహాకవి జీవితవి శేషములను ఏతద్గ్రంధము యొక్క జన్మస్థానమును; ఉత్పత్తి కారణములను వీనిని గురించిన విషయ ములు విద్వత్పరిశోధకు లెవ్వరేని తెలిసికొని ప్రకటము గావించుట కింతవరకు ప్రయత్నింపరైరిగదా ! యని విచారించి, యది మొద లావిషయమును తెలిసుకొనుటకై యన్వేషింపసాగగా నిన్నాళ్ళ కిప్పుడు ఆపంచతంత్ర గ్రంధి మెప్పుడు. ఎక్కడ, ఎందుకు ఎట్లు పుట్టినదో నాకు తెలియవచ్చినట్టి విశేషములను సారస్వతాభిమానుల సమక్ష మున నుంచుచుంటిని,


భారత దేశమునందలి సంస్కృతగ్రంధము లెన్నో అన్యభాష లలోని కనూడితము గావింపబడినవి. కాని, ఏదియు నీ పంచతంత్ర కావ్య మువలె పలు భాషలలోనికి పరివర్తనమై ప్రపంచవ్యాప్తి నంది నకల దేశములలోని సంస్కృతవిద్యార్థి విద్యాధికులకు గూడ పఠనీయమై యలరారుచున్న కృతి వెదకినను మరియొకటి కానరాదనుట జ్ఞా లంగీకరించిన నగ్న సత్యము,


ఈగ్రంధమున మిత్రభేదము, సుహృల్లాభము, సంథివిగ్రహము లబ్ధనాశము, అవిమృశ్యకారిత్వము అను ఐదుభాగము లున్నవి. క్రీ.శ. 581_579 సం॥ ప్ర్రాంతమున పర్షియా దేశము నేలు చుండిన ఔషరు


వాన్ అనబడెడి పారసీక రాజు కాలమున సీగ్రంధము వహ్లతీభాషలో వీ నికిని. క్రీ. 18వ శతాబ్దని అరబ్బీ భాషలోనికిని, సైమియాన్ సేథ్ (Symeon 'Seth) అను నాతనిచే స్త్రీ. 1015 ప్రాంతమున గ్రీకు భాష శ లోనికిని, పొస్సిసస్ (Possinus) అన్న యతనిచే ల్యాటిన్ భాషలో నికిని రబ్బీజోయెల్ (Rabbi Joel) అను పండితునిచే క్రీ. 1250 ప్ర్రాంతమున హెబ్రూ భాషలోనికిని ఆతర్వాత నొకటి రెండు సంవత్స రములలో స్పానిష్ భాషలోనికిని పిమ్మట కీ. 15వ శతాబ్దని జర్మను భాషలోనికిని, ఆపై యూరపియను భాషలన్నింటిలోనికి పిల్పే లేక విద్వాయ్ ఫేబుల్స్!(Fables of Pilpay or Vid pai i.e. Vidya pati) అను పేరను ఇట్లు రమారమి రెండువందలమంది విద్యావేత్తలచే అన్ని దేశములలోను మొత్తముమీద సుమారేబది భాషలలోని కీయు ద్గ్రంథ మనువాదము చేయబడియున్న దని హెర్టల్ అను పాశ్చాత్య పరిశోధకుడు తనహిందూ దేశ కథాకావ్యచరిత్రములో వ్రాసియున్నా డు, ఈ కావ్యము యొక్క ప్రశస్తి తెలియుట కీవిషయ మొక్కటి


ఇయ్యది మాతృకయై యుండ దీని ననుకరించియు, అనుసరిం చియు మన దేశమున నెన్ని యేని నీతి కావ్యము లుదయించినవి. దీనికి సంగ్రహరూపమున సంస్కృతమున పంచతంత్ర కావ్య - పంచతంత్ర కావ్యదర్పణ - పంచోపాఖ్యానాదులు పెక్కుకృతులు గలవు. అట్లే ఆంధ్ర భాషయందును దూబగుంట నారాయణకవి, బైచరాజు వేంక టనాధకవి ప్రభృతులు పద్య కావ్యములుగను, కందుకూరు వీరేశలింగ కవి. పరవస్తు చిన్నయసూరి మొదలైన పండితులు గద్యరూపము నను, విశ్వాత్ముల నరసింహమూర్తి, శీలా వీర్రాజు మున్నగు చిత్ర కారులు బొమ్మలకధలుగను ఇంతటిప్రశస్తికి పాత్ర మైన యీకృతిని విద్యాపతిబిరుదనాము డైన విష్ణుశర్మ పండితుడు రచియించెను.


కృత్యాదియందు —


“మన వేవాచస్పతయే శుక్రాయ పరాశరాయ సముతాయ చాణక్యాయ చ విదుపే నమో ఒస్తు నయశాస్త్ర కర్తృభ్యః॥ సశలార్ధశాస్త్రసారం జగతి సమాలోక్య విష్ణుశ ర్మేదమ్, తం తైపంచభి రేత చ్చకార సుమనోహరం శాస్త్రమ్ |


అని చెప్పుటనుబట్టి యితఁడు ప్రాచీనము లైనమను అత్రి;విష్ణు హంత్ర; యాజ్ఞవల్క్య; ఉశన; అంగీరన; యమ; ఆపస్తంబ; సంవర్త; కాత్యాయన; బృహస్పతి; పరాశర; వ్యాస; శంఖ; లిఖిత; దక్ష; గౌతమ; శాతాతప; వశిష్టాదివింశతిధర్మశాస్త్రములనేగాక చాణక్య విష్ణుగు ప కౌటిల్యుని అర్థశాస్త్రము మొదలైన రాజనీతిశాస్త్రముల నన్నింటిని సాకల్యముగ ఆపోశనముపట్టి యాకళింపునకు దెచ్చుకొని ఆకాలమున ‘విద్యాపతి 'బిరుదవిఖ్యాతుడై వినుతింపబడియుండె నని చెప్పనగును.


గ్రంధాన తారికలో :—


"దక్షిణ దేశమందలి మహిళారోప్యపురము నేలెడి అమరశక్తి యనురాజు దుర్వినీతు లైనతన కొడుకులకు నీతి నేర్పు మని కోరగా వారికై నే నీ నీతిశాస్త్రమును రచియించితి” ననుమాటలు వా వ్రాసియుం టను బట్టి యీశవి దక్షిణ దేశవాసి మైనయా జేసియాస్థానమున విద్వత్కవిగా నుండెనని భావింపవచ్చునుగాని, ఈవిషయమునే పరి శోధకులును గుర్తించియుండ లేదు. అందుచే నీమాట గ్రంథ ప్రశస్తికై యాతడు కల్పించివ్రాసినదో లేక నిజమో యూహింప నలవి గాకు న్నది." అని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తను వా సంస్కృతకవిజీవితము పుట 180లలో వాసిరి.


క్రీస్తు మొదటశతాబ్దియందు హిందూ దేశమున క్రైస్తవ


మతము వొడసూపి రెండవ శతాబ్దిలో నది దక్షిణ భారతమున నేటి మదరాసుప్ర్రాంతమున సుస్థిరముగ పాదుకొనినట్టు చరిత్ర తెలియ జేయుచున్నది. అప్పుడు అనఁగా క్రీ.2వ శతాబ్ది యారంభ కాలమున బలాఢ్యు డై నఅమరశక్తి యను రాజు మహిళాతోవ్యపుర మనబడెడి ప్రాచీన హైందవనగరమును రాజధానిగా జేసికొని రాజ్యపాలనము చేయుచుండెను. అదేనేడు మైలాపూరు అని వ్యవహరింపబడుచు మద రాసుమహానగరమున సంతర్భాగ మైపోయినది. ఈమహిళారోప్యపుర మునే గ్రీకు దేశస్థు డైన టాలెమీ (Ptolemy 140-150 A. D.) యనుభూగోళశాస్త్రజ్ఞుడు 1. పశ్చిమ భారత దేశము, ఆఫ్ఘనిస్థానము, డు బెలూచిస్థానము (India Intra Gengem) 2. ఆగ్నేయాసియా, చీనా దేశము (India Extra Gengem) అను పేర్లతో వ్రాసిన భారత దేశభూగోళగ్రంథమున రెండవ భాగమందు దక్షిణ దేశభౌగో ళిక స్వరూపనిర్ణయము చేయుసందర్భమున 'మహిళార' (Mahi larpha) యని పేర్కొనియుండినట్లు శ్రీ అక్షయకుమార్ మజుందార్ గారు తమహిందూహిస్టరీ యనుగ్రంథమున 844వుటలో వాయు చున్నారు.


పై నిచెప్పిన అమరశక్తి రాజునకు బాహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి యనెడినిరక్షరకుక్షలు మూఢులు నై నముగ్గురు కొడుకు రమూర్ఖన్యు లైనయాకుమారత్రయమునకు విద్యా లుండిరి. మూర బుద్ధులు గరపి గుణవంతులుగ చేయుటకై యారాజు చేసిన ప్రయ త్నము లన్నియు నిష్ప్రయోజనము లయ్యెను. తుట్టతుదకు దైవవశ మున అశీతివర్ష ప్ర్రాయుడును, విద్యావృద్ధుడును ఆకాలమున పేరు మోసినపండితుడును నై నవిష్ణుశర్మను ప్రార్థింపగా రాజుకోరిక సంగీక


రించి యాయువరాజతయము నాశ్మశిష్యులుగా గ్రహించి వారిమన సున కిష్టమైనవిధమున వశుపక్ష్యాదులసంభాషణము చేసినట్లు నీతిధర్మ ములు నిండై యుండ అద్భుతము లైనకథలు చెప్పుచు వారిని వశవర్తు లను గావించుకొని మనసునకు నొప్పి గలుగనీయక నీతినేగాక జీవిత రహస్యములును, రాజ్యతంత్రములును మొదలై నసర్వవిషయము లును బోధించి వారిని గుణకోవిదులను గావించి తండ్రి కప్పగించి యాతనిచే మన్ననలు పొందెను. ఈవిషయములు శ్రీ వి. కె. మజుం దార్ గారు తనుగ్రంథము 716 పుటలో వ్రాసియున్నారు. ఇట్లగుట చేతనే కథలు, కట్టుకథలు వినికూర్పు నేర్పున భారతీయులు సర్వ ప్రపంచమందలిమానవజాతికిని బోధకు లైరని గుణపక్షపాతి యైన ఎలిఫిన్ స్టన్ మహాశయుడు తసహిందూ దేశ చరిత్ర తొమ్మిదవ ముద్రణ 172వపుటలో నుల్లే ఖంచియున్నాడు.


ఈయాధారములతో సంస్కృతశ విజీవిత కారునిసంశయము తీరి మన కొకమార్గము దొరికిన ట్లయినది.


ఇంతకును విద్వన్మణి యైనవిష్ణుశర్మజీవిత చరిత్రము పూర్తిగా లభింపదయ్యెను. ఈతడు తనకథలలో నవకాశముగల్గినప్పు డంతయు బౌద్ధబిక్షువులను, జైనసన్యాసులను, యాయావరీయ బ్రాహ్మణులను తఱచుగా నుపాలంభము చేసియుండెను. ఒకకథలోని సందర్భమును పురస్కరించుకొని యొకానొక నక్కనోట 'అహో! నేడు భట్టారక వారముగదా! మాంససంబంధమైన యీసరమును నాదంతములతో నెట్లు స్పృశింపగలను!' అని పలికించుటను పరిశీలనా దృష్టితో నాలో చింతు మేని ప్ర్రాచీన కాలమున భానువాసరమున మాంసాహారము నిషేధింపబడిన పెచ్చటను కానరాకున్నది. గనుక ఆకాలమున నీ మహిళారోప్యపురము (Mylapore)న నెలకొనియుండిన క్రై స్తవులు ఆదివారమున మాంసాహారము, మద్యసేవనము, దైనందిన చర్యయు


మాని విధిగా సుపవసించి యారాధనా మందిరములలో గుమిగూడి శ్రద్ధాళువులై తమ మతగ్రంథమైన బైబిలును పఠించుచుండెడి వారి -యాచారముల వాలకము నతిచమత్కారముగ నవహాస్యము చేసి సహేతుకమైన వ్యాజ వినయమును ప్రదర్శించి యుండే నని తోపక -మానదు.


మదరాసు ప్ర్రాంతమునందలి మైలాపూరున బుట్టి ప్రాముఖ్యత నంది కాలక్రమమున సకలజగత్సంస్తూయమాన మైన గ్రంధ మని తెలిసియే పరవస్తు చిన్నయసూరి ప్రత్యేకించి దీనియాం ధీకరణమునకు బూనుకొని యుండెనేమో యనిగూడ తలంప వీలు లేకపోలేదు. గ్రంధము సాంతముగ ముగిసియుండినచో దీని చరిత్రను గురించి ఆమహామనీషి గ్రంధప్రస్థావనములో వ్రాసియుండు నేమో శదా?


'విష్ణుశర్మ యొక్క యీకృతి గుణాఢ్యుని బృహత్క ధలోని కొన్ని కధలకు వచనరూపమైన సంక్షేపానువాదము. ఈగ్రంధమున నందందు గానవచ్చెడి శ్లోకములు కొన్ని యీతడు స్వయముగా రచి 3 యించినవే యనవచ్చును గాని, పెక్కు శ్లోకములు మనుస్మృత్యాది పూర్వగ్రంధములనుండి స్వీకరించినవే యనదగును. కాని, క్రీ. శ. 8వ శతాబ్దివాడైన దామోదరగుప్తుని శంభళీమతనామాంతర కుట్టనీ మతమునందలి "పరఙ్కః స్వాస్తరణః పతి రనుకూల” యన్నల్లోక సా చితని పంచతంత్య్ర మిత్రభేద ప్రశరణము నందును. కీ. 9వ శతాబ్ద ఉత్తరార్ధమువాడును ఔత్తరాహుడును నైన రుద్రభట్టుయొక్క శృంగారతిలశములోని “సార్థంమనోరధశతై” అనెడి శ్లోక మాం ఛమున లబ్ధనాశతంత్రము నందును గనిపించుచుండుట వలనను ఇంగ్లం డులోను జర్మనీ దేశమునందును ముద్రితమైన “పం చతంత్రము”నకును భారత దేశమున వ్యాప్తిలోనున్న గ్రంధమునకును కొన్ని చోట్ల భేదము


కానవచ్చుచున్న దాని సర్. సి, పి, బ్రౌను పండితుడు చెప్పుటచేతను, గ్రంధము దేశమున వ్యాపించినకొలది రోజులలోనే క్రమేపి అర్వా చీనులకృతులలోని శ్లోకము లీపంచతంత్రమున ప్రక్షిపము లైనట్లు. విమర్శనా చక్షువులకు విదితముగాక పోదనుట సత్యదూరము కాదు.


ఇంతవరకును గ్రంధప్రశస్తి దానిమార్పు జన్మస్థానము కృతి కర్త వెదుష్యము వీనింగూర్చిన విషయము లుటంకించితిని, ఇంత కాల నిర్ణయమును గూర్చి మల్లాది వారనిస మాటలంజెప్పి మతాంతరములు. జూపించి పర్యవసానముం జెప్పి యీనావ్యాసమును ముగింతును,


క్రీస్తు ఆరవశతాబ్దిని మొట్ట మొట్టమొదట నీపంచతంత్య్ర గ్రంథము. పర్షియను భాషలోని కనువదింపబడినది కనుక అంతకుమున్నె యీ గ్రంధముపుట్టినదని కొందరును, దౌర్మంత్యా న్నృపతిరిత్యాదిభర్తృ హరిసు భాషిత త్రిశతిలోని శ్లోక మిం దుండుటంబట్టి దానిత ర్వాత నిది జనించిన దని మరికొందరును ఏతచ్చోక మిదిపుట్టిన తర్వాత చేరియుండు ననెడి భావమున సుభాషిత త్రిశతిశన్నను వంచతంత్య్రమే ప్రాచీన మని పల్కుచున్నారు గనుక విష్ణుశర్మకాలము సునిశ్ఛితము కాకున్న దని సంస్కృతకవి జీవితము 18 పుటలో వ్రాసిరి.


ఏవిధముగ జూచినను భర్తృహరి క్రీస్తు కుపూర్వు డగునని పలు వురు పండితులభిప్రాయము నొసంగియున్నారు. కావున మన మీ సందే హమును వీడిమతాంతర మైన యభిప్రాయముల నరయుదము,


డాక్టర్ : యం. కృష్ణమాచారియార్ (మదాసు) గారు తమ హిస్టరీ ఆప్ క్లాసికల్ సాట్ లిటరేచర్ అన్న పేరున 1937 సం॥ ప్ర్రకటించిన గ్రంధమున నీవిష్ణుశర్మను క్రీ.పూ. 776 సం॥ నాటిదాడుగా గుణాఢ్యునిశన్నను ముందు కూర్చుండ పెట్టుట యెట్లొ పరిశోధకులు నిర్ణయింతురు గాక !


 

67


పంచతంత్రము; దాని పుట్టుకు


మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు 'మెట్లయిన నితడు శా. శ. 450 కి పూర్వడు గాని పరుడు మాత్రము కా'డని ముగ తముయభిప్రాయమును చెప్పిరి.


విషయ మంతటిని సముస్వయము జేసి చూచినచో విష్ణుశర్మ


తప్పక స్క్రీ. 2వ శతాబ్ది ప్రధమపాదము నాటివాడనియు నేటిమదరాసు మహానగరమున నొక భాగమైన నాటి మహిళారోప్య పురము నేటి మైలాపూరునంది పంచతంత్రము వుటైననియు ప్రపంచమునకు తెలియ వచ్చుట సాహిత్యారాధకులకు సంతోషదాయకము కదా !


ఈవ్యాసమును వ్రాయునెడల నేను పేర్కొన్న గ్రంధకర్తల కును, ప్రకాశకులకును కృతజ్ఞతలు చెప్పుచు విరమింతును.


- శ్రీ శ్రీనివాసపురం నరసింహాచార్యులు 

( మూలం - ఆంధ్రసాహిత్య పరిషత్పత్తిక' 1957 - ఇస్యూ 6 ) 


సేకరణ 

కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూ. ఎస్.ఎ.

24 -12-2021 










Sunday, December 19, 2021

నేటి కాలపు కవిత్వం - పై సంపాదకీయం- చేకూరి రామారావు


















 

నేటి కాలపు కవిత్వం - పై 


సంపాదకీయం


"దేశంలో భారతీయ సంస్కార ప్రవాహాలు ఇంకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపు మాసినవి. భారతీయ సంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదం కాక ఆత్మ విముఖత్వాన్ని, పర సంస్కార దాస్యాన్ని మనకు ఆపాదించినవి"


ఈ పుస్తకం చివర రాసిన పైమాటల్లో అక్కిరాజు ఉమాకాంతం (1889-1942)గారి సర్వసాహిత్య కృషి నేపథ్య సారాంశం తెలుస్తుంది. ఆయన జీవించింది 53 సంవత్సరాలే అయినా అమోఘమైన పాండిత్యంతో, అసమాన వాదపటిమతో, అవిచ్ఛిన్న సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకు పోయిన విశ్వాసాలను కుదిపి వేసిన సాంస్కృతిక విప్లవకారుడు అక్కిరాజు ఉమాకాంతం గారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోటానికి ఆయన జీవిత చరిత్ర ఎవరూ రాయలేదు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారి శత జయంతి సంపుటం (1986) లో "త్రిలిఙ్గ తొలినాళ్ళ సంపాదకులు ఉమాకాంత విద్యా శేఖరులు" అనే పేరుతో అక్కిరాజు రమాపతి రావుగారి అయిదు పేజీలు చిరు వ్యాసమూ తెలుగు విజ్ఞాన సర్వస్వమ మూడవ సంపుటంగా వచ్చిన 'తెలుగు సంస్కృతి' అనే వాల్యూమ (1959) లో అబ్బూరి రామకృష్ణారావుగారి ఒక పేజీకి మించని చిన్న నోటూ మాత్రమే ప్రధాన ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.


అక్కిరాజు ఉమాకాంతంగారు గుంటూరు జిల్లా పల్నాడు తాలుకా గుత్తికొండ అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుత్తికొండకు సుమారు ఏడెనిమిది మైళ్ళ



X


దూరంలో ఉన్న జానపాడు అనే ఊళ్ళో సంస్కృత భాషాభ్యాసం చేశారు. శిష్ట్లా సీతాకాంతశాస్త్రి గారు వీరి గురువుగారు. ప్రస్తుత గ్రంథంలో మొదటి శ్లోకంలో వారి ప్రస్తావన ఉంది. పదిహేను పదహారేళ్ళ వయసులో గుంటూరు లూథరన్ మిషన్ వారి హైస్కూలులో ఇంగ్లీషు చదువులు చదివారు. మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లో ఈయన శతావధానం చేశారు. బెజవాడలో కన్యకా పరమేశ్వరి హిందూ పాఠశాలలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. 1912 లో తెరచిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు మద్రాసు కార్యాలయంలో జయంతి రామయ్యగారి ఆహ్వానంపై కొన్నాళ్ళు మేనేజరుగా పనిచేశారు. వేషధారణపై వచ్చిన పేచీ వల్ల ఉమాకాంతంగారు ఉద్యోగం మానేసినట్లు రమాపతి రావుగారు పైన పేర్కొన్న వ్యాసంలో రాశారు. ఈయన బెంగాల్లో నవద్వీప సంప్రదాయాన్ననుసరించి భాష్యాంతముగా సంస్కృత వ్యాకరణమూ, తర్కశాస్త్రమూ, అభ్యసించి 'విద్యాశేఖరు' లైనా రని అబ్బూరి రామకృష్ణారావుగారు రాశారు. "తమ తర్క వ్యాకరణ విద్యా వ్యాసంగాన్ని వంగ దేశంలో జరుపుతూ వచ్చారు; వంగ సాహిత్య వేత్తలతో సాహచర్యం వల్లా, లోకజ్ఞానం వల్లా, స్వానుభవం వల్లా, వంగ సాహిత్యాభ్యుదయానికి గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వల్లా తమకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసికొని తమ మాతృభాష అయిన తెనుగును పరామర్శించడం ఆరంభించారు" అని అన్నారాయన. ఆయన వావిలి కొలను సుబ్బారావుగారి తరవాత (1929లో) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1913-1914 మధ్య కాలంలో త్రిలిఙ్గ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. 'త్రిలిఙ్గ' అనే పేరు ఆయన పెట్టిందేనని త్రిలిఙ్గ రజతోత్సవ సంచిక (1941) కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశంలో ఇంగ్లీషులో కామెంటు (comment) అనే మాటకు పర్యాయంగా వ్యాఖ్యా శబ్దాన్ని పరీక్ష పత్రాల్లో తానే మొదట వాడినట్టు పేర్కొన్నారు.


1913-1014 సంతురాల లో ఆయన శిబి




అయ్యాయి. ఉమాకాంతం గారు తమ కథల పీఠికలో 'ఇట్టి కథల వాఙ్మయము తెలుగునకు కొత్తది' అని గుర్తించారు. అప్పటి కాయన రచనాశైలి ప్రాచీన భాషకు సన్నిహితం. సంధి నియమాలను సడలించి ఆధునిక రచనాభాషను ఏర్పరచటానికి ఉమాకాంతం గారు కూడా కృషి చేసినట్టు ఈ సంపుటం ద్వారా తెలుసుకోవచ్చు. ఈయన కథల్లో కూడా తొలినాటి ఇతరుల కథల్లో లాగే లక్ష్యం సాఘిక సంస్కరణే. మూఢ విశ్వాసాల నిర్మూలనే బ్రాహ్మణ సమాజంలో పాదుకొన్న మూఢ విశ్వాసాల వల్ల స్త్రీల బతుకుల్లో ఉన్న బాధల్ని వివిధ రీతుల్లో ఈ కథల్లో వర్ణిస్తారు.


ఈ కథల్లో 'ఎదుగని బిడ్డ' ఆంధ్ర సాహిత్యాన్ని కన్న తెలుగుతల్లి ఉత్తమ పురుషలో చెప్పిన కథ. చివరివరకు ఎలిగొరీ అనే కథా శిల్పాన్ని పాటించిన ఈ కథలో 'ఆంధ్ర సాహిత్యం ఎప్పుడూ ఎదగని బిడ్డయే' అని తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు. సుమారు పాతికేళ్ళ ప్రాయంనుంచి ఆయనకు తెలుగు సాహిత్యంపై సదభిప్రాయం లేనట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు. అదల్లా ఉంచి ఎలిగొరీ పద్ధతిలో ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి తెలుగు కథ ఇదే కావచ్చు.


తెలుగు సాహిత్యంలో అభివృద్ధి కాని నూతన ప్రక్రియలను అభివృద్ధి చెయ్యాలనే ఆకాంక్ష ఆయనకు గాఢంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ కోరికే ఆయన చేత చిన్న కథలను రాయించింది. ఫిలిప్ మెడోస్ టైలరు (Philip Meadoues Tailor, 1808-1876) అనే ఆంగ్ల నవలా కారుడు రచించిన టిప్పు సుల్తాన్ నవలను ఆంధ్రీకరించి 1912 నవంబరులో ప్రకటించారు. ఈ నవల పీఠికలో కూడా ఆంధ్ర సాహిత్య స్థితిని గూర్చిన చర్చ ఉంది. టైలరు హైందవ సంప్రదాయాభిమాని కావటం వల్ల అతని రచనను తెలిగించానని ఉమాకాంతం గారు పీఠికలో చెప్పుకున్నారు.




'ఉమాకాంతం గారు 1921 లో తెలుగు దేశ వాఙ్మయ పత్రికను స్థాపించి సంస్కృత వ్యాకరణ ప్రదీపం, పాణినీయ ఆంధ్ర వివరణం. రసమీమాంస, నైషధ తత్వ జిజ్ఞాస వంటి ప్రశస్త రచనలు వెలువరించారు' అని అక్కిరాజు రమాపతి రావుగారు రాశారు.


'లౌకిక దృష్టితో చెప్పుకోదగిన సంఘటన లేవీ ఆయన జీవితంలో లేవు. పాండిత్యానికి తగిన శరీర దార్థ్యం ఆయన కెన్నడూ లేకపోయింది.' అని అబ్బూరి రామకృష్ణారావు తెలుగు విజ్ఞాన సర్వస్వంలో అన్నారు.


ఉమాకాంతంగారి రచనలపై సమగ్ర సమీక్ష జరగలేదు. సంపూర్ణమైన అంచనా రాలేదు. ఆయన రచనలు దొరికినంత వరకూ (అన్నీ దొరకవు) పరిశీలిస్తే ఆయనకు తెలుగు సాహిత్యంపై నిర్దిష్టమైన అభిప్రాయాలు, విలక్షణమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రచనలన్నింటా తెలుగు సాహిత్య స్థితిని గూర్చి ఆవేదన కనిపిస్తుంది. ప్రచురణ వివరాలు దొరకలేదు గాని రమాపతి రావుగారి సౌజన్యం వల్ల ఆయన చిన్న చిన్న వ్యాసాలు కొన్ని దొరికాయి.


సాంఘికంగా ఆయనకు అభివృద్ధికర భావాలే ఉన్నట్టు. సాంఘిక సంస్కరణలకు ఆయన అనుకూలుడే అయినట్టూ ఆయన కథలను బట్టేకాక ఆయన విడివిడి వ్యాసాలనుబట్టి కూడా చెప్పవచ్చు. 'తెలుగు దేశము నందలి చండాలురు' అనే వ్యాసంలో "చండాలురని చెప్పుటకు ఏ ప్రమాణమూ లేని మాదుగులను, ఆంధ్రదేశము నందలి మొదటి తెగలగు చెంచులు బలిజెలు మొదలైన వారివంటి మాదుగులను అస్పృశ్యులుగా బాధించుచున్నాము. ఊళ్ళనుండి బయటికి వెళ్ళగొట్టినాము. బావుల వద్దకు రానీయము. దేవాలయములలో ప్రవేశించనీయము. ఇంతకంటే తెలుగు దేశము ఆచరించుచున్న అధర్మము మఱియొకటి లేదు. ఈ దురాచారము అప్రామాణికమైనది అనర్ధహేతువైనది అని చెప్పుచున్నాను' అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.



విదేశయానం చేసినందుకు నడింపల్లి నరసింహారావు గారిపై తెచ్చిన అభియోగానికి ఉమాకాంతం గారు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. దాన్ని ఒక విమర్శన వ్యాసంగా రాస్తూ సముద్రయానం చెయ్యటం వల్ల పతితుడవుతాడనటానికి శాస్త్ర ప్రమాణం లేదని నిరూపించారు.


ఉమాకాంతం గారు సాహిత్యాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఎంతటి గొప్పవారి అభిప్రాయాలను ఖండించటానికైనా వెనుదీసే వారు కాదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1923 సంవత్సరానికి పెట్టిన పురాణపండ మల్లయ్య శాస్త్రిగారి శుక్రనీతిని విమర్శిస్తూ.'బ్రదిమి ఏనిక, దిగ్గియ ఒండె. ఉలుపా, ఎకిమీడు' వంటి పాతపడ్డ మాటలను వాడటాన్ని నిరసించారు. ఆ పుస్తకానికి యోగ్యతా పత్ర మిచ్చిన జయంతి రామయ్య గారి స్వవచో వ్యాఘాతాలను ప్రదర్శించారు.


ఇంగ్లీషు పాఠ్య నిర్ణాయక సంఘంలో ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లీషు బోధించే వారిని వేసి, తెలుగు పాఠ్య నిర్ణాయక సంఘంలో తెలుగు బోధకులను వేయక పోవటాన్ని నిరసించారు.


విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన సభలో వేదం వెంకటరాయశాస్త్రిగారు. కట్టమంచి రామలింగా రెడ్డిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తూ వాఙ్మయపత్రికలో వ్యాసాలు రాశారు. ఆముక్త మాల్యదలో చాలా గొట్టుమాటలున్నాయి కాబట్టి అది గొప్ప కావ్యం అయినట్టు వేదం వెంకటరాయశాస్త్రి గారన్నారని చెపుతూ ఆ మాటలందు నాకు ప్రమాణ బుద్ధి కలగలేదు అన్నారు. మను చరిత్రలో రసాభాస ఉన్నది కాబట్టి దాన్ని మంచి కావ్యం కాదన గూడదన్నారు (అంతమాత్రం చేత మను చరిత్ర ఉత్తమ కావ్యమనికాదు. ఇతర కారణాలు చూపించాలని ఆయన అభిప్రాయం.) రసాభాస నిషిద్ధం కాదని అది అంగంగా ఉండవచ్చునని సిద్ధాంతం చేశారు. ఇంతకీ మనుచరిత్రలో ఉన్నది రసాభాసకాదని, వరూధిని కది వాస్తవమేనని వాదించారు. సందర్భంలోనే మనుచరిత్రను పెద్దన రచించ లేదనీ, కృష్ణరాయలు



విమర్శిస్తూ "కృష్ణరాయలు రచించిన కృష్ణశ్రేష్ఠి రచించినా. కృష్ణామాత్యుడు రచించినా, కృష్ణ భట్టు రచించిన పుస్తకములోని మంచి చెడ్డలు మారవు గనుక ఆ విచారణ నేనిక్కడ పెట్టుకోలేదు" అని వస్తుగత విమర్శ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.


కట్టమంచి రామలింగా రెడ్డిగారు మద్రాసు గోక్లేహాల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పత్రికల్లో చదివి వాఙ్మయ పత్రికలో విమర్శించారు. రామాయణం కంటే భారతం ప్రాచీనం అని రెడ్డిగారా ఉపన్యాసంలో చెప్పారు. భారతం కావ్యంకాదు. సంహిత అని రెడ్డిగారన్నారు. భారతం కావ్యమేనని, భారతం కంటే రామాయణం పూర్వమనే ఉపపత్తులను ప్రదర్శిస్తూ ఉమాకాంతం గారు వాదించారు. ఆ సందర్భంగా "వాస్తవముగా సంఘమును సంస్కరింపవచ్చును. సర్వసమత్వము ప్రతిష్ఠించ యత్నించవచ్చును. వీటికన్నిటికి రామలింగా రెడ్డిగారు మరికొన్ని మార్గములు అవలంబించ వలసియున్నది గాని భారత వర్షేతిహాసములను గురించి భారతీయుల ప్రాచీన వాఙ్మయము గురించి తెలిసీ తెలియని మాటలు మాట్లాడుట మాత్రము అనుచితమైన కార్యము" అని స్పష్టంగా నిర్భయంగా ప్రకటించారు.


'నైషధ తత్త్వ జిజ్ఞాస' అనేది సంస్కృత నైషధ కావ్యంపై విమర్శ. శ్రీహర్షుని మేధాశక్తిని, పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే నైషధము ఉత్తమ కావ్యము కాదని తేల్చారు. శ్రీహర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చినదని, కావ్య గుణం తగ్గిందని వివరించారు. "అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము, గొప్ప కవిత్వము కుంటువడిన సమయము" అని అభిప్రాయ పడ్డారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ "ఏనాడు అర్ధము హస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను... ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్ఛిన్నము లాయెను. మహమ్మదీయుల విషయ లోలత్వము దేశమున వ్యాపింప జొచ్చెను." అని దేశపరిస్థితులను వివరించారు. భారతదేశ సాంస్కృతిక పతనానికి మహమ్మదీయులు కారణంగా భావించే ఒక ఆలోచనా ధోరణి మన దేశంలో చాలా కాలంగా ఉన్నది.



అక్కిరాజు ఉమాకాంతం గారి సంస్కృత భాషా పాండిత్యం, ప్రాచీన భారత సంస్కృతిపై ఆయనకున్న అభిమానం ఎరిగిన వారికి ఆయన ఈ ఆలోచనారీతి ఆశ్చర్యకరం కాదు. హిందువులలో సంస్కరణ లాయన కిష్టమే. మహమ్మదీయుల విషయములో ఆయనపై ఆర్య సమాజపు ఆలోచనా ధోరణి ప్రభావం ఉండి ఉండవచ్చును.


గుంటూరు జిల్లా కారెంపూడిలో 1928 జూన్ 9 న జరిగిన సభలో చేసిన ఉపన్యాసం 'ఆంధ్ర భాషోపన్యాసం' గా అచ్చయింది. అందులో "నాకు దేశ భాషోద్యమంలో విశ్వాసంగలదు. విజ్ఞాన వ్యాప్తి దేశ భాషయందు వలె అన్య భాషయందు జరుగ నేరదు" అన్నారు. తదనుగుణంగా సంస్కృత గ్రంథాలను తెలిగించారు. సంస్కృత చంద్రా లోకాన్ని తెలుగు వచనంలో అనువదించారు. పాణినీయాన్ని తెలుగు చేసినట్టు తెలుస్తున్నది. 'పాణినీయము సాంధ్ర వివరణము' పేరుతో 9 సంచికల సంపుటంలో గట్టి బైండుతో వచ్చినట్టు ప్రకటన ఉంది. సంస్కృత వ్యాకరణ ప్రదీపము కారకం వరకు రచించినట్టు కూడా అదే ప్రకటనలో ఉంది. ఉమాకాంతంగారికి ఎక్కువ పేరు తెచ్చి పెట్టినవి ఆయన పరిష్కరించి ముద్రించిన పల్నాటి వీరచరిత్ర (1911, 1938) నేటి కాలపు కవిత్వం (1928).


పల్నాటి వీర చరిత్ర మొదటి ముద్రణకు రచించిన పీఠికలో అమూల్యమైన చారిత్రకాంశాలను పొందుపరిచారు. ఇతిహాసాలను గురించి, పల్నాడు గురించి, శ్రీనాథుని గురించి ఎనభైరెండు పేజీల విపుల చారిత్రక భూమిక ఇది. దాని సారాంశాన్ని ఇంగ్లీషులో ఐదు పేజీల్లో చెప్పారు. డెబ్భైమూడు పేజీల ద్వితీయ భూమిక (1938) లో 3 తెలుగు సాహిత్యంపై తమకున్న అభిప్రాయాల్ని వివరించారు. రెండో పీఠికకు ముందే నేటి కాలపు కవిత్వం వచ్చింది. ఈ రెంటిలోనూ పూర్తిగా తర్కపద్ధతి అవలంబించారు. ఏ విషయాన్నెత్తుకున్నా సమగ్రంగా చర్చించటం ఆయనకు అలవాటు. అందువల్ల ఆయన పీఠికల్లోనూ వ్యాసాల్లోనూ విషయాన్ని విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నట్టనిపించినా అవన్నీ విజ్ఞాన వికాస హేతువు 9 of 22 టం విశేషం. ఈ రెండో పీఠికలో



"పల్నాటి వీర చరిత్రను విచారించడానికి పూర్వం తెలుగు వాఙ్మయాన్ని గురించి క్లుప్తంగా తెలుపుతాను" అని ప్రారంభించి తెలుగు సాహిత్యాన్ని గురించి తమ విలక్షణాభిప్రాయాలను వ్యక్త పరచారు.


"మూలం యొక్క స్వరూపం అవికలంగా భాషాంతరంలో తెలపడమే అనువాదానికి పరమ ప్రయోజనం. నన్నయాదులవి అనుచితానువాదాలు" అని ఆంధ్ర భారతాది గ్రంథాలను విమర్శించారు. తెలుగు ఎప్పుడూ ఉత్తమ విద్యాద్వారంగా ఉండలేదు కాబట్టి తెలుగు అభివృద్ధి కాలేదన్నారు. తెలుగు కావ్యాలు అధమాధికారులకే అని ఉమాకాంతంగారి అభిప్రాయం. ఆ స్థితి మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చిన తరువాత కూడ మారలేదని ఆనాటి తెలుగు పాఠ్యాదీతర గ్రంథాలనుంచి అధికంగా ఉదాహరించారు. శబ్దరత్నాకరంలో 'సఖుడు' అకారాంత పుంలింగం అనటాన్ని విమర్శిస్తూ అది ఇకారాంత పుంలింగం అనే విషయంగూడా ఈ పీఠికలో ప్రస్తావించారు. సంస్కృతం సరిగ్గా రాని రచయితలను ఆక్షేపిస్తూ వారిని దూడ పేడ సంస్కృతం వారని ఆక్షేపించారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, చిలుకూరి నారాయణ రావు వంటి పండితుల రచనల్లోని దోషాలను కూడా చూపించారు.


ఉత్తమ సంస్కృత కావ్యాలను తెలుగులో తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆయన రఘువంశానువాదం తల పెట్టినట్టు కనిపిస్తుంది. ఆయన రఘువంశ పీఠికలో --


అక్షరమ్ముల ఆట కవితగ


పెంటకుప్పల జేసి కృతులను చిందు దొక్కెడి వారి గంతులు


చిన్న పిల్లల వేడుక.


అన్నారు. ఉమాకాంతంగారి అభిప్రాయాలను ఆయన సహచరులు "దశోపదేశిగా" సంగ్రహించారు. వాటిని ఇక్కడ తిరగరాస్తున్నాను.


1. గద్యంలో లేని విశేషం పద్యానికి ఛందస్సు సమకూర్చగలిగినది గతి మనోజ్ఞత.


2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్ధిస్తున్నది.


అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనివి. 4.


3.


5. శబ్దాలంకారాలు స్వయంగా ఆపతితమైతేనే తప్ప ఆవశ్యకంగా స్వీకార్యం కావని, వీటిని ప్రధానంగా స్వీకరిస్తే కావ్యం అధమ మవుతుందని సాహిత్య వేత్తల మతం.


6. ఇద్దరన్, మానుగ. అనఘ, అమల, ఓలి. ఒగి, పరుగు, చెన్నుగ యిట్లాటి దండగ చెత్తకు లేదా యతి భంగానికి హేతువై అనర్ధ ప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (వళి ప్రాసలు) ఆవశ్యకంగా ఉపాదేయంకాదు.


7. యతి అంటే విచ్చేదం వారింద్రియ విశ్రాంతిని, శ్రావ్యతను, పద్యం యొక్క సుపఠత్వ, రమ్యత్వాలను సిద్ధింప చేస్తుంది గనుక దీర్ఘ పాదాల్లో మధ్య యతీ సర్వత్ర పాదాంత యతీ నియతం.


8. పద్యం గానీ, పద్యాలు గానీ, శీఘ్రంగా గాని, విలంబంగా గాని అల్లిన మాత్రాన పద్యకర్త అవుతాడు. కవి కానేరడు. విజ్ఞానశాలి కానేరడు. విద్వదోషుల్లో శాస్త్రాభ్యాసజన్యం విజ్ఞానం.


9. జన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్వదోష్ఠుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్ధి, చరాచరలోకప్రభావ పరిశీలనం. కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని మమ్మటుడు.


10. పద్యరూపానగాని గద్య రూపాన గాని అనువాదం చేస్తే అనువాది కాగలడుగాని కవి కాజాలడు. రసభావ నిష్పాదక మైన సృష్టికి సంబంధించినది కవిత. కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తాను వాది. అనూదిత కావ్యంలో సృష్టి విశేషాదులు అనువాదివి కాజాలవని స్పష్టం.


వీటి ఆధారంగా ఆయన అనుయాయులు కొందరు అనువాదాలు సాగించి ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసినట్టు కొమరవోలు చంద్రశేఖర మంత్రిగారు ప్రకటించిన లక్ష్యఖండం (1937) వల్ల తెలుస్తుంది. ఉమాకాంతం గారి లక్షణాలకు వీరు రచించినవి లక్ష్యాలని వీరుద్దేశించి



నట్టు 'లక్ష్యఖండం' అనే పేరు పెట్టడం లోనే తెలుస్తున్నది. ఉమాకాంతం గారు రఘువంశ పీఠికలో --


మూలమున లేనట్టిదానిని వ్రాయననపేక్షితము చెప్పను అన్న నాథుని మాట దలచగ అర్హుడనొ కానో!


అన్నారు. 'మూలంలో లేనిది చెప్పను. మూలంలో ఉద్దేశించనిది కూడా చెప్పను'. అన్న మల్లినాథసూరి మాట తల్చుకున్నారు. ఆయన్ననుసరించి ఆలంపూరు కృష్ణస్వామిగారు


'వదలి మూలస్థమ్ము లేనిది కుక్కి అనువాదమ్ము చేసెడి అజ్ఞ మార్గము తొలగిపోవుత నాకు గురువుల కరుణచే' అన్నారు


ఇక్కడ 'గురువులు' అనే మాటలో ఉమాకాంతం గారిని ఉద్దేశించినట్టు భావించవచ్చు.


ఈ మార్గం లోనే కన్నెకంటి ప్రభులింగాచార్యులు గారు కాళిదాసు కుమార సంభవాన్ని అనువదిస్తూ


ఆర్ష భూయస్త్వోత్తమములగు కాళిదాస కవిత్వనిధులను మా కొసంగిన మల్లినాథా! నిన్ను వినుతింతు


అని మల్లి నాథుని ప్రశంసించి -- విడువగా రాదున్నదానిని లేనిదానిని కుక్కగూడదు ఇదియె అనువాదాలు తెరువను ప్రవచనమ్ము తలంచెదన్.



ఉమాకాంతం


అని అనువాద పునరుద్ఘాటించారు. విధానంలో గారి మార్గాన్ని


ఉమాకాంతం గారు, వారి అనుయాయులు ఈ అభిప్రాయాలను ప్రచారం చేశారు. సంస్కృత వృత్తాలతో పాటు తెలుగు పద్యాలను కూడా వర్ణమైత్రి లేకుండా ప్రయోగించారు. గీతాది లఘు పద్యాలకు పాదాంత విరతిని మాత్రమే నియమంగా పాటించారు. పెద్ద పద్యాలలో పాదమధ్య విరతిని కూడా పాటించారు.


వీరంతా ముత్యాల సరాన్ని ఆదరించడం చారిత్రకంగా గుర్తించ దగిన ఒక విశేషం. అయితే వీరి రచనల్లో ఎక్కడా గురజాడ అప్పారావుగారిని విరివిగా స్మరించినట్టు గాని (ఈ పుస్తకంలో ఒక్క చోట తప్ప) ముత్యాలసరం పేరును ప్రస్తావించినట్టు గాని కనపడదు. అయినా ముత్యాల సరాలను ధారాళంగా వాడారు. అదీ గురజాడ పద్ధతిలోనే. యతి ప్రాసలు నియమాలుగా కాక అలంకారాలుగా మాత్రమే పరిగణించిన అప్పారావు గారి మార్గం, ఉమాకాంతం గారికి నచ్చినట్టు భావించవచ్చు. భావకవులకూ, ఉమాకాంతంగారికీ ముత్యాల సరం విషయంలో మాత్రం ఏకీభావం కనిపిస్తుంది. భావకవుల్లో రాయప్రోలు సుబ్బారావుగారు తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారి వంటివారు వర్ణమైత్రీయుత వళినిగాని ప్రాసనుగాని ముత్యాల సరాల్లో కూడా పాటించారు. కృష్ణశాస్త్రి గారి ముత్యాల సరాల్లో వర్ణమైత్రి లేనివి కనిపిస్తాయి.


ఉమాకాంతం గారు ఆంధ్ర వాఙ్మయాన్ని అంతటినీ సూత్ర పద్ధతిలో చెప్పదల్చుకున్నారు. ఆ సూత్రాలకు మళ్ళీతానే భాష్యం చెప్పదల్చుకున్నారు. అయితే చెయ్యదల్చుకున్నవన్నీ చెయ్యటానికి జీవితం చాలింది కాదు. వాఙ్మయదర్శనము పేరుతో 'ప్రాచీన ఖండా'న్ని తొమ్మిది భాగాలు (ఆలోకములు) గా సూత్ర పద్ధతిలో రచించారు. ఈ సూత్రాలు గ్రాంథిక భాష (కావ్య భాష) లో ఉన్నాయి. ఈ సూత్రాలు చూస్తే చాలా విస్తృత ప్రణాళికనే వేసుకున్నట్టు తెలుస్తుంది. భాష్యం



లేకపోయినా, ఉమాకాంతంగారి వాఙ్మయ దృష్టిని అర్థం చేసుకోటానికి ఈ వాఙ్మయ దర్శన సూత్రాలు ఉపయోగపడతాయి. ద్వితీయాలోకంలో


1. అభారతీయము గనుక 2. సంప్రదాయ విచ్ఛేదము గనుక 3. త్యాజ్యము క్రీస్తు శకము 4. ఆత్మీయము గనుక 5. అఖండ కాలదర్శన సాధనము గనుక 6.శ్రుతి, స్మృతి పురాణేతిహాస దేశీయ కథాదులనుండి అవిచ్ఛిన్నత్వము ప్రతిపాదించును గనుక 7. సంప్రదాయ సిద్ధము గనుక 8. గ్రాహ్యము కలిశకము 9. అవిశేషము వల్ల కలిశకము కృష్ణ శకమని 10. అంతర్భూతము గనుక శాలివాహనము పాక్షికముపధ


ఉమాకాంతంగారు క్రీస్తు శకాన్ని కూడా గుర్తించని సంప్రదాయ ప్రియుడు. ఆయన తన పీఠికల కిందా ముద్రించిన రచనల పైనా శాలివాహన శకాన్నే వేసేవారు.


ఉమాకాంతంగారు వాఙ్మయ దర్శనంలో భారతీయ సంస్కారాదుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇది కాక వేరే ఇంకా ప్రాచీనాంధ్ర వాఙ్మయ సూత్రాల గురించి ఏమైనా రాశారేమో తెలీదు. 'నేటి కాలపు కవిత్వం' అని నామాంతరం ఉన్న ఈ వాఙ్మయ సూత్ర పరిశిష్ట భాష్యంలో మూడు అధ్యాయాలలో ఆధునికాంధ్ర వాఙ్మయాన్ని సూత్రీకరించారు. అందులో మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. దాన్ని మాత్రమే విపులీకరించారు. నేటికాలపు కృతి రచన, నేటికాలపు విద్య అనే అధ్యాయాలు సూత్ర రూపంలోనే ఉన్నాయి. భాష్యం రాయలేదు. ఈ పరిశీష్టాన్ని ఆలోకనాలు అనకుండా అధ్యాయాలుగా విభజించటం వల్ల వాఙ్మయ దర్శనం కన్నా భిన్నమైన వాఙ్మయ సూత్రాలు అనే గ్రంథాన్ని రాసినట్టుగానో, కనీసం రాయ తలపెట్టినట్టు గానో ఊహించాలి. అయితే మనకు పూర్తిగా భాష్య రూపంలో దొరుకుతున్నది ఈ పరిశిష్ట సూత్ర భాష్య రూపమే(అదీ మొదటి అధ్యాయమే). మొదటి సారి వావిళ్ళ ప్రచురణగా 1928 లో వెలువడింది.


ఉమాకాంతం గారు ఈ పుస్తకంలో ప్రధానంగా భావకవిత్వం


పేరుతో ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు.



తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనాన్ని రేపిన గ్రంథం ఇది. "కాని వారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానేలేదనే అనుకోవలసి వస్తోంది" అని అబ్బూరి రామకృష్ణారావు గారన్నారు. "మహాపండితులైన ఉమాకాంతం విమర్శలకు ఆనాడెవరూ జవాబు చెప్పలేక పోయారు" అని శ్రీశ్రీగారు 1960 లో విశాలాంధ్ర వారి ఆంధ్ర దర్శినిలో రాశారు. భావకవిత్వాన్ని సమర్ధిస్తూ ప్రశంసిస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలూ, పుస్తకాలూ చాలా వచ్చాయి. కాని, ప్రత్యేకంగా ఉమాకాంతం గారి ఆక్షేపణలకు సమాధానంగా ఇంతవరకూ పుస్తకరూపంలో ఏమిరాలేదన్న మాట నిజమే. అట్లాగే ఉమాకాంతంగారు తిట్టినా అదో గొప్పగా ఆనాటి కవులు చెప్పుకునే వారని అ.రా.కృ గారు అంటుండేవారు. అంతటి మహాపండితుడి దృష్టిలో పడటమే గొప్పగా ఆనాటి కవులు భావించేవారన్న మాట. ఆనాటి భావకవుల్లో బహుశా ఎవరినీ ఆయన క్షమించలేదు. విస్తర దోషాన్ని గురించి విస్తరణాధి కరణంలో చెబుతూ చెప్పవలసినదానికంటే ఎక్కువగా చెప్పటం విస్తర దోషమని నిర్వచించి, ఈ కాలపు కృతుల్లో ఇది విస్తారంగా ఉందని ప్రస్తావించి "యెంకి పాటల వంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీ కాలపు కృతుల్లో అనేకాల్లో యీ దోషం కనబడుతున్నది" అని యెంకి పాటలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మాత్రం మినహాయింపు ఇయ్యటం కూడా విశేషమే ననుకుంటాను.


ఆధునిక కవిత్వం ప్రాచీన ధోరణుల నుంచి విడివడి కొత్త దారులు వెతుక్కుంటున్న సమయంలో అక్కిరాజు ఉమాకాంతం గారు సాహిత్య విమర్శలో ప్రవేశించారు. సంప్రదాయ పండితులు చాలామంది భావకవిత్వాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఉమాకాంతం గారి మార్గం భిన్నమైనది. ఆయనకు తెలుగులోనే కవిత్వం కనపడలేదు. ఆయన ప్రమాణాలు ప్రాచీన సంస్కృతాలంకారికులవి. వాద పద్ధతి సంస్కృతంలో తర్కపద్ధతి. ఈ పద్ధతిలో సిద్ధాంతం పూర్వపక్షం, ఆక్షేపణ సమాధానం అనే విభజనలుండటం వల్ల దీనికి ప్రామాణికతే గాక హేతుబద్ధత కూడా వచ్చింది. ఈయనకు పాశ్చాత్య తర్కపద్ధతితో




ఈ కూడా పరిచయమున్నట్టు ఈ గ్రంథం లోనే అనౌచిత్యాధికరణంలో Fallacy of undue Assumption అనే పద్ధతి ప్రస్తావన వల్ల తెలుసుకోవచ్చు.


ఉమాకాంతం గారి తర్కపద్ధతికి, ఆధునిక శాస్త్ర ప్రతిపాదనల పద్ధతికి కొన్ని పోలికలున్నాయి. ఆధునిక శాస్త్ర పద్ధతిలో ఒక ప్రతిపాదన చేసినపుడు ఆ ప్రతిపాదనకు ప్రతికూలమైన అంశాలను కూడా ప్రస్తావించి వాటిని తన ప్రతిపాదన ఎట్లా పరిష్కరిస్తుందో చెప్పాలి. అప్పుడే ఆ ప్రతిపాదన సిద్ధాంత మవుతుంది. ఉమాకాంతంగారి వాద పద్ధతి ఎంత ప్రాచీనమో అంత ఆధునికం కూడా. ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి పరిశీలించటానికి ఉమాకాంతం గారి తర్క పద్ధతి పనికొచ్చింది.


ఇదికాక ఉమాకాంతంగారి శైలి సూటిదనం, సారళ్యం అనే రెండు లక్షణాల వల్ల ఆకర్షణీయంగా ఉంటుంది. 'ఆపతితం, ద్రష్టవ్యం, వక్ష్యమాణం' వంటి మాటలు ఆయన పాండిత్యం వల్ల అరుదుగా దొర్లినా సాంకేతికత లేని సాధారణ పదాలు వాడటం ఆయన అలవాటు. ఊగుడు మాటలు, పులుముడు, వికారాలు, దూడపేడ సంస్కృతం, దండగ్గణం వంటి అతి సామాన్య పద జాలంతో తన భావాలను చెప్పగలిగారు. సిద్ధాంత పూర్వ పక్షాలు, అక్షేప సమాధానాలు అనే - పద్ధతి వాద ప్రతివాదాల సంభాషణ (dialogue) పద్ధతి. ఈ నిర్మాణం (structure) వల్ల శైలి సంభాషణశైలికి సన్నిహితమై మరింత ఆకర్షకమైంది. భాష విషయంలో ఆయన మారిన దృష్టి కూడా ఇందుకు తోడ్పడింది. దానికి తోడు ఉమాకాంతం గారికి విషయ వివరణకుప యోగించే దృష్టాంతాలను, పిట్ట కథలను ఎన్నుకొని విషయ వివరణ చెయ్యటంలో అద్భుతమైన నేర్పుంది. సంస్కృతాంగ్లాలలో విశేషమైన పాండిత్యం ఉన్న ఆయన తన రచనలలో ఉదాహరించిన సంస్కృతాంగ్ల వాక్యాలకు తరచుగా ఆంధ్రాను వాదాలను కూడా ఇస్తుంటారు. ఆయన చెప్పిన విషయాల్లో భేదించినా ఆయన వాద పద్ధతి నుంచి ఈ నాటి విమర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉపపత్తులు చూపకుండా



11:37 AM Sun Dec 19


79%


00


అస్పష్టంగానూ చెప్పలేదు. ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకం సాహిత్యాభి మానులందరికీ అవశ్య పఠనీయం.


ఈ పుస్తకానికి చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఒక విద్యావేత్త పరాధీనమైన తన జాతి పతనమై పోతున్నదని, విలువలు క్షీణిస్తున్నాయని, ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోటానికి కూడా ఈ పుస్తకం చదవటం అవసరం. దాదాపు .అర్ధాయుష్కుడైన ఒక సాహిత్య కృషీవలుడు ఉన్న కొద్ది జీవితకాలం లోనే ఎన్ని విద్యలు నేర్వవచ్చునో, తాను లోక కళ్యాణమని ఎంచిన దాన్ని ఆచరించటానికి ఎంత కృషి చేశాడో తెలుసుకోటానికి ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.


అయితే ఉమాకాంతంగారు భావకవిత్వం గురించి చేసిన నిర్ణయాలు కాలంలో నిలవలేదు. మారుతున్న అభిరుచులు కనుగుణంగా భావ కవిత్వం చరిత్రలో నిలిచింది. స్థిరదోషాలుగా ఉమాకాంతంగారు గుర్తించినవి 'అస్థిర మైనవిగా మారినాయి. వాటిని దోషాలుగా పాఠకులు గుర్తించ లేదు. అయోమయత్వం. పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం అని పేర్లు పెట్టి ఆయన నిరసించిన వాటిని తరవాత పాఠకులు గుణాలుగా మెచ్చుకొని ఆస్వాదిస్తున్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్య శాస్త్ర మర్యాదలు సర్వకాల సర్వదేశ సాహిత్యాలకీ సంపూర్ణ ప్రమాణాలుగా నిలుస్తాయని ఉమాకాంతం గారు నిజాయితీగానే నమ్మారు. ఆయన ఆనాటి కవులను కఠినంగా విమర్శించారు. చరిత్ర ఇంకా కఠినమైనది. ఉమాకాంతంగారి ఆక్షేపణలను తోసిపుచ్చింది. కాలం మరీ క్రూరమైనది. ఉమాకాంతం గారినే మరుగున పడేట్టు చేసింది. నిర్భీకత కాలానికి ఎదురీదే లక్షణం, పాండిత్యం, కృషి. చెప్పేవిషయంలో నిజాయితీ, స్పష్టత, సూటిదనం, సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలను మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు.



11:38 AM Sun Dec 19


79%


00


సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతంగారి నిర్ణయాలు ముఖ్యంకాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాశ్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు.


ఈ ముద్రణలో సంపాదకుడుగా నేను చేసిన మార్పులకూ, చెయ్యని మార్పులకు కొంత సంజాయిషీ ఇచ్చుకోటం భావ్యం అనుకుంటాను.


ఈ గ్రంథం తొలి ముద్రణలోనే కొన్ని పొరపాట్లు దొర్లినాయి. వాటిని అన్ని చోట్లా సవరించటం సాధ్యం కాలేదు. సంస్కృతంలో అచ్చు తప్పులను ఆచార్య రవ్వా శ్రీహరిగారు సవరించారు. తెలుగు పద్యాల్లో స్పష్టంగా దోషాలుగా కనిపించే వాటిని సవరించాను కాని కొన్నిటిని వదిలేశాను. ఉదాహరణకు 'ఏకాంత సేవ అనే పుస్తకాన్ని 'యేకాంత సేవ' అని రాయటమే కాక పుటల సూచిక (ఇండెక్స్) లో కూడా అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఆ కావ్యంనుంచి ఉదాహరించిన పద్య భాగంలో "మధుర మోహన కళామహితమై వుండ (పే.జీ 71, 88, 94) అనే పాదంలో ఉండ అనే క్రియా పదాన్ని 'వుండ' అని రాశారు. యకార, వకారాగమాలు కవ్యుదిషాలు కావనుకుంటాను. అయినా ఉమాకాంతం గారు కావాలనే అట్లా రాశారని అభిప్రాయ పడి వాటిని మార్చలేదు. అట్లాగే ఉమాకాంతంగారు ఉదాహరించిన పద్యపాదాలు ఇప్పుడు దొరికే ప్రతుల్లో వేరుగా కనిపిస్తున్నా, ఆయన చూసిన ప్రతుల్లో అట్లా ఉండి ఉండవచ్చునని మార్చలేదు. స్పష్టంగా ఛందో దోషాలున్నచోట మాత్రం ముద్రిత ప్రతుల ననుసరించి సవరించాను. అట్లాంటి మార్పులు తెలుగు భారతం నుంచి, ఆ ముక్తమాల్యద నుంచి ఉదాహరించిన చోట్ల అవసరమయ్యాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నుంచి ఉదాహరించిన భాగం (పే.జి. 136) లో ఇంగ్లీషులో Jonffroy అనీ తెలుగులో 'జాన్ ఫ్రాయి' అని స్పష్టంగా ఇచ్చారు. ఈ పేరులో ఏదో 3


 

11:38 AM Sun Dec 19


79% (


...


వల్ల అట్లాగే ఉంచాను. ఉదాహృత పద్య పాదాలను సాధ్యమైనంతవరకు ఈ కూర్పులో పాద విభజన చేసి చూపించాను. కొన్ని సంస్కృత శబ్దాల వర్ణక్రమాన్ని ఉమాకాంతం గారు నియతంగా పాటించినట్టు కనిపించదు. వాటిని అట్లానే ఉంచాను.


ఈ పీఠికారచనకు ప్రేరేపించిన మిత్రులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి సమాచార సామగ్రిని సాదరంగా అందించిన అక్కిరాజు రమాపతిరావుగారికీ, చలసాని (విరసం) ప్రసాదుకూ కృతజ్ఞతలు. -


హైదరాబాదు. 1994 జనవరి 26.


చేకూరి రామారావు.

Tuesday, December 14, 2021

తెలుగు పాత్రికేయం సమానార్థకాలకు ప్రయత్నలోపం - సి. రాఘవాచారి -- సేకరణ- కర్లపాలెం హనుమంతరావు

తెలుగు పాత్రికేయం

సమానార్థకాలకు ప్రయత్నలోపం

- సి. రాఘవాచారి

-- సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 

తెలుగు పత్రికల భాషాసేవ అనన్య సామాన్యమైనది. వివిధ రంగాల్లోని సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడంతో పాటు తెలుగుభాషా వికాసం కూడా పత్రికల కర్తవ్యంలో భాగంగా ఉండేది. వార్తాసంస్థలు ఇంగ్లీషులో పంపించే వార్తలను అనువాదంచేసి, ప్రచురించేటప్పుడు  సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వినియోగించాలని ఒకనియమం స్వచ్ఛందంగానే పాటించడం జరిగేది. దానిని నియమం అనడంకన్నా స్వభాషపట్ల అనురక్తిగా చెప్పడం ఇంగ్లీషు పదాలకు సమానార్థకాలు సృష్టించడం, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో రూపొందించడం ఆరోజుల్లో సంపాదకవిభాగంలో పనిచేసేవారి ప్రాథమ్యంగా ఉండేది. కొత్తపదం వచ్చినప్పుడు మక్కికి మక్కి కాకుండా అర్ధాన్ని బట్టి, తెలుగులో సులభంగా అర్ధంగ్రహించటానికి వీలయ్యే సమానార్థకాన్నే స్థిరపరచి వాడేవారు. తెలుగును అధికారభాషగా ప్రకటించిన తరువాత ఈ ప్రయత్నంపట్ల ఉండాల్సిన శ్రద్ధాశక్తులు ఏ కారణంతో లోపించినా విచారకరం.


తెలుగుపాత్రికేయుల్లో సంపాదకులతోపాటు అనుభవజ్ఞులైనవారు ఈ విషయమై ఆవేదన పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు అనేకాదు, సంస్కృతం, ఉర్దూ పదాల వెల్లువలో తెలుగుభాష తన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నదా అనే బాధ సహజం. అవసరమైనప్పుడు అన్యభాషా పదాలు బాగా ప్రచారంలో ఉన్నవయితే వాటిని తెలుగుభాష విసర్గ సౌందర్య సౌష్టవాలు చెడకుండా వాడడంలో ఆక్షేపణలకు తావుండరాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అదికాదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమున్నట్లు ఇంగ్లీషుపదాలు శీర్షికల్లోనూ, వార్తల్లోనూ విశృంఖల స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి పాత్రికేయులతోబాటు విశ్వవిద్యాలయాలు, వివిధ అకాడమీలు (ప్రత్యేకించి ప్రెస్ అకాడమీ) కలిసి ప్రయత్నిస్తే సమానార్థకాలసృష్టి అసాధ్యమేమీకాదు. తెలుగుభాష సమయ సందర్భాలనుబట్టి అన్యభాషాపదాలను స్వీకరించడానికి అనువైనది. ప్రాచీన సాహిత్యంనుంచి నేటి పత్రికలభాష వరకు వెయ్యేళ్ళచరిత్ర ఈ విషయాలను నిరూపిస్తోంది. గతంలో తెలుగుపత్రికలకు తెలుగులోనే వార్తలు పంపాలని విధిగా ఆదేశాలున్నరోజుల్లో సమానార్థకాలకోసం విలేకరి కొంత ప్రయాస పడాల్సివచ్చేది. కానీ ఆ ప్రయాస ఫలప్రదంగా

భాషకు, విలేకరి భాషాభివృద్ధికి తోడ్పడుతుండేది. 


అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా ఇంగ్లీషు పదాల వాడకం పెరగడం ఒక విచిత్రమైన వైవిధ్యం, 

గతంలో వలె పత్రికల్లో రాజకీయాలకు పరిమితం కాకుండా, ఈ రోజు అనేక శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందజేయడం విరివిగా పత్రికల్లో అదాజేయడం జరుగుతున్నది. పత్రికలలో ఉండే సహజమైన వత్తిళ్ల  కారణంగా పారిభాషక పదాలకు సమానార్థకాల ఇబ్బందితో కూడుకున్నప్పటికీ, ఆ కారణంతో అన్యభాషాపదాలను అదేపనిగా ఉపయోగించడం సరైనదికాదు. పరిభాష వెనుకఉండే భావాన్ని - సమానార్థకాలు స్వీకరించే సదవకాశం ఎక్కువ. సోవియట్ యూనియన్ లో గోర్బచెవ్  సంస్కరణలుగా 'గ్లాస్ నోస్త్ ', 'పెరిస్త్రోయికా' అనేపదాలు విరివిగా వార్తల్లో వచ్చేవి.  వాటికి  స్థూలంగా దగ్గరైన  'గోప్యరాహిత్యం', 'పునర్వ్యవస్థీకరణ' అనేపదాలు తెలుగులో వాడినందువల్ల పాఠకులు సులభంగా గ్రహించేపరిస్థితి ఉండేది. ఏదైనా సమానార్థకంకన్నా అన్య భాషా  పదమే పాఠకులకు అర్థమవుతుందనుకుంటే అది వినహాయింపు తప్ప సూత్రం కారాదు.


పారిభాషిక పదాలకు తెలుగులో సమానార్థకాలు రూపొందించడం లక్ష్యంగా తెలుగు అకాడమీవంటి సంస్థలను ఏర్పాటుచేశారు. శాసన, పరిపాలనా సంబంధమైన పదాలకు స్పష్టమైన ప్రసిద్ధమైన సమానార్థకాలు రూపొందించినప్పటికీ వాటివినియోగం పత్రికల ద్వారా ఆశించినంతగా లేకపోవడం బాధాకరమే. ఉదాహరణకు 'టాక్స్'ను తీసుకుంటే దానికి పన్ను' అని రాస్తుంటాం. అంతేగాకుండా సెస్సు, డ్యూటీ, లెవీ అనే బడ్జెట్ పారిభాషిక సాంకేతికార్థం భిన్నంగా ఉంటుంది. అయినా పైసంస్థలు రూపొందించిన పదాలకంటే ఎక్కువగా పాఠకులకు  ఆమోదయోగ్యమైనవాటిని పత్రికలు తమకుగా తాము సృష్టించుకుంటే అభ్యంతరం ఉండరాదు . ఆ ప్రయత్నం లేకపోగా సమానార్థకాలపట్ల అలసత్వం, తేలికభావన చోటుచేసుకోవడం విచారించదగిన విషయం.


జన వ్యవహారంలో అలవాటుపడిన అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి. వాటికి భాషా ఛాందసం జోడించి విశ్వామిత్ర సృష్టితో సమానార్థకాలు రూపొందించాల్సిన పనిలేదు. ఒకవేళ అలా సృష్టించినా అవి ఆమోదయోగ్యత పొందడం కష్టం. తెలుగుమాత్రమేవచ్చి అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని పత్రికలద్వారా తెలుసుకోవాలనుకొనే పాఠకుడు ప్రమాణంగా ఉండాలి. తెలుగు పత్రిక చదవటానికి మరో రెండుభాషల పరిచయం అర్హతగా ఉండాల్సినస్థితి అపహాస్యభాజనం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో అధికారభాషాయంత్రాంగం నిర్వహించిన కీర్తిశేషులు పి.వి. నరసింహరావు, పరిపాలనారంగంలో తెలుగు వినియోగంపై శాసనసభలో శ్వేతపత్రం (వైట్‌ పేపర్) ప్రకటించినప్పుడు అందులోని సమానార్థకాలపట్ల పత్రికల్లో పెద్దవిమర్శ సాగింది. 


ఒక ప్రసిద్ధసంపాదకుడు అయితే ధారావాహిక సంపాదకీయాల్లో భూరాజసము (ల్యాండ్ రెవిన్యూ) లాంటి పదాలను ఉటంకించి ప్రత్యాఖ్యానం వెలువరించారు. దీనికి స్పందించి నరసింహారావుగారు తెలుగురాక మరిన్ని భాషలు చదివినవారు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకమని చెప్పినదాంట్లో అతిశయోక్తి ఉండవచ్చేమోగానీ ఇప్పటి స్థితినిబట్టి ఎంతో కొంత సరైన ప్రతిస్పందన అనిపిస్తోంది.


ప్రస్తుతం తెలుగు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో అవసరంలేకున్నా ఇంగ్లీషుపదాలు వాడటం ఎబ్బెట్టుగా తోస్తోంది. అచ్చమైన తెలుగుమాట దేవుడెరుగు, అసలు ఇంగ్లీషుమాటలు వాడితేనే అదేదో శ్రేష్ఠమన్న భావన చోటు చేసుకున్నది. ఒక పత్రికలో గతంలో పతాకశీర్షికల్లో కూడా భారత్ బదులు ఇండియా అని వాడేవారు. అది అప్పుడు చివుక్కుమనిపించినా ఇప్పటి పరిస్థితుల్లో కొంత మేలేమో అనిపిస్తోంది.  ప్రాంతీయ ప్రత్యేకతలను బట్టి భాషలో అక్కడికక్కడే అర్థమయ్యే పదాలు ఇతరత్రా వాడినందువల్ల గందరగోళం తప్ప మరేమీ

ఉండదు, 

కోస్తా ప్రాంతాల్లో వెలువడే ఎడిషన్లలో 'షురూ' అనే ఉర్దూ పదం కనిపిస్తోంది. ఏమైనా ఏ భాషపట్ల వ్యతిరేకత అక్కర్లేదుగానీ, మనభాషను సుసంపన్నం చేసుకోవడం అభిలషణీయం. ఈ అంశంపై పాత్రికేయుల్లోనే ఆత్మపరిశీలన అవకాశం కల్పించడం ద్వారా మిత్రులు టంకశాల అశోక్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జర్నలిస్టులు, ప్రెస్ అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలు భాగస్వాములైతే ఆ ఫలితం అందరికీ చెందుతుంది.

( ' వార్త' 15-06-05- ఆధారంగా ) 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                   07-11-2021

Monday, December 13, 2021

తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ కర్లపాలెం హనుమంతరావు ( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య )










తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ 

కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య ) 




బెంజమెన్ షుల్జ్ - తొలి తెలుగు ముద్రాపకుడు


తెలుగులో తొలిసారిగా గ్రంథాన్ని ముద్రించి చరిత్రకెక్కిన బెంజమెన్ షుల్జ్ చిరస్మరణీయుడు. ఇతడు 1689లో జర్మనీలో జన్మించాడు. 1719 × తన 29వ ఏట దక్షిణ భారతదేశం వచ్చాడు. డెన్మార్క్ రాజు ఐదవ ఫ్రెడరిక్ పంపగా జర్మనీ నుంచి దక్షిణ భారతదేశంలోని తరంగంబాడికి క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చిన రెండవ జట్టు ఫాదరీల్లో షుల్జ్ ఒకరు. చెప్పులు సైతం లేకుండా నిరాడంబరంగా పాదచారిగా మత ప్రచారం చేశాడు. అనారోగ్య కారణాల వల్ల స్వదేశం తిరిగి వెళ్లిన తర్వాత కూడా తెలుగు టైపులు పోతపోయించి, తెలుగు గ్రంథాలు రచించి ముద్రించాడు. జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహాన్ ఆర్నెడ్ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలను షుల్జ్ తెలుగులోకి హాలేలో ముద్రించాడు. 23 సంవత్సరాల ముద్రణారంగంలో శ్రమించాడు. స్వదేశం వెళ్లిపోయాక కూడా 17 సంవత్సరాల పాటు తెలుగు పుస్తకాలు ముద్రించాడు. స్వయంగా 'GRAMMATICA TELUGICA' (1728) పేర 8 ప్రకరణాల్లో తెలుగు వ్యాకరణం రచించాడు. దీనిని హాలే విశ్వవిద్యాలయం వారు భద్రపరచి 1984లో తొలిసారి ముద్రించారని ఆరుద్ర తెలియజేశారు.8 తమిళం, పోలీసు, డేనిష్ భాషల్లో 20 పుస్తకాలను ఆరేళ్లలో ముద్రించాడు. మద్రాసులో సెంట్ జార్జ్ కోటలో కుంపిణీ గవర్నరు ఒప్పించి భారతీయుల కోసం పాఠశాల పెట్టించడమే గాక అందులో తెలుగు విభాగాన్ని ప్రారంభించి పిల్లల్లో తానూ ఒకనిగా కేవలం రెండు నెలల్లో తెలుగు నేర్చుకున్నాడు. అంతేకాదు బైబిల్ను సాహసోపేతంగా తెలుగులోకి అనువదించి ముద్రించాడు. 1760 నవంబర్ 25న షుల్జ్ కన్నుమూశాడు.


K. జేమ్స్ గ్రాంటు - దేశీయ విద్యలపై దృష్టి


కుంపిణీ వారికి మన దేశంలో మొట్టమొదట వశమైనవి ఉత్తర సర్కారులు. ఈ ప్రాంతాల సంక్షిప్త రాజకీయ చరిత్రను, విపులమైన రెవెన్యూ చరిత్రను వ్రాసిన తొలి ఆంగ్లేయిడు జేమ్స్ గ్రాంటు నిజాం దర్బారులో బ్రిటిషు రాయబారిగా పనిచేశాడు. దేశీయ విద్యలు మూలపడ్డాయని, వాటిని ఉద్దరించాలని చెప్పాడు.


ఛార్లెస్ వైట్ - నిఘంటు నిర్మాణానికి అంకురార్పణ


సెంట్ జార్జ్ కోటలో సివిల్ సర్వెంట్ హోదాలో పనిచేసిన ఛార్లెస్ వైట్ తెలుగులో నిఘంటు నిర్మాణానికి 1793 ప్రాంతాల్లో అంకురార్పణ చేశాడు.మంచి నిఘంటువు తయారు చేసిన వారికి బహుమతులివ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. అంతేకాదు తెలుగు నేర్చుకొనేవారికి ఉపయోగపడే ప్రాథమిక గ్రంథాలను రాయించాలని సూచించాడు. ఈయన సూచనవల్లే సెంట్ జార్జి కోట

పాలకులు మామిడి వెంకయ్య 'ఆంధ్ర దీపిక' హక్కులను కొన్నారని భావించవచ్చునని తెలుగు భాషా సారస్వతాల రంగాన్ని బ్రౌసు మహోజ్వల కాంతులతో నింపాడు. తెలుగు భాషా సాహిత్యాల పునరుద్ధరణకు, పునరుజ్జీవానికి అతడు ధారవోసిన శ్రమ అపారం. 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఇంగ్లండులో విద్యాభ్యాసం తర్వాత 1817లో కుంపిణీ ప్రభుత్వ సివిల్ సర్వెంట్గా భారతదేశంలో అడుగుపెట్టాడు. దక్షిణ భారత క్యాడర్లో బ్రౌను నియామకం ముఖ్యంగా తెలుగు వారు చేసుకున్న పుణ్యం.

కలెక్టరు సహాయకునిగా, మెజిస్ట్రేటుగా, పర్షియన్, తెలుగు పోస్ట్మాస్టర్ జనరల్ కునిగా, గా, విద్యామండలి సభ్యునిగా, కాలేజ్ బోర్డు కార్యదర్శిగా అనేక హోదాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. 38 సంవత్సరాలు కుంపిణీ వారి కొలువులో ఉన్నాడు. తాను దేశంలోనూ, తిరిగి ఇంగ్లండు వెళ్లాకకూడా మొత్తం దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. ఇది ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. తెలుగు గ్రంథాల రచనలో, తాళపత్ర గ్రంథాల సేకరణలో, ఉద్ధరణలో, భద్రపరచడంలో, పరిష్కరణలో, ముద్రణలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పనిచేశాడు బ్రౌన్. బ్రౌన్ వేమన పద్యాల ఆంగ్లానువాదం 1825లోనే చేపట్టాడు. తెలుగు ఛందస్సు (1827) ముద్రించాడు. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు, తెలుగు వ్యాకరణం, ఆంగ్లంలో తెలుగు వ్యాకరణం ప్రచురించాడు. ది లిటిల్ లెక్సికాన్, ది జిల్లా డిక్షనరీ కూర్చాడు. కొత్త నిబంధనను అనువదించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలో 1829లో 693 పద్యాలతో, 1839లో 1164 పద్యాలతో ప్రచురించాడు. ఆయన ఎన్నో విధాలా శ్రమించి వ్యయప్రయాసల కోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంథాల సంఖ్య వేలల్లో వుంది. మాజేటి సర్వేశలింగం సంకలనం నుండి సేకరించిన గ్రంథాలు 613 కాగా 227 గ్రంథాలు తెలుగు, 386 సంస్కృత గ్రంథాలు. మచిలీపట్నంలో కొన్నవి 1830 గ్రంథాలు. ప్రత్యేకంగా కడపలో భవనాన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, దిగ్ధంతులైన పండితులను నియమించి అనేక కావ్యాలు, శతకాలకు సంబంధించిన వేరు వేరు చోట్ల లభ్యమైన ప్రతులను పోల్చి చూపి (Collation) శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరింపజేశాడు. వాటిల్లో వసు చరిత్ర, మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, దశావతార చరిత్ర మొదలైనవి ఉన్నాయి. పోతన భాగవతాన్ని పరిష్కరించడమే కాక తెలుగు భారతం 18 పర్వాల పరిష్కరణకు, శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చు చేశాడు. తెలుగు నేర్చుకోదలచే ఇంగ్లీషు వారి కోసం, ఇంగ్లీషు నేర్చుకోదలచే తెలుగు వారి కోసం వాచకాలు తయారు చేశాడు. మద్రాసులో, కడపలో, మచిలీపట్నంలో స్వంత ఖర్చులతో ఉచిత పాఠశాలలు నడిపాడు. ఆయనే అన్నాడు " In 1825 found Telugu Literature dead in thirty years I raised it to life "10 అని. అది అక్షరాలా నిజం. 1855 ఏప్రిల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తిరిగి ఇంగ్లండు వెళ్లిపోయాడు. లండన్ యూనివర్సిటీలో తెలుగు గౌరవ ఆచార్యునిగా పనిచేశాడు. గ్రంథ రచన, ముద్రణ నిర్వహించాడు. ఆయన చివరి ప్రచురణ 'తాతాచార్యుల కథలు'. 1884లో కన్నుమూశాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్న వేమన పద్యానికి నిదర్శనంగా తెలుగుజాతి ఎన్ని తరాలకైనా మరువరాని పుణ్య పురుషుడు సి.పి. బ్రౌన్.


సర్ థామస్ మన్రో ప్రజల గవర్నరు -

తన 19 ఏళ్ల వయసులో మద్రాసుకు సైనిక విద్యార్థిగా వచ్చిన సర్ థామస్ మన్రో తన 66వ ఏట మద్రాసు గవర్నర్ గా చేస్తూ చనిపోయాడు. తెలుగు నేర్చుకున్న తెల్ల దొరల్లో ఈయన సుప్రసిద్ధుడు. రాయలసీమ తెల్లదొరల అధీనంలోకి వచ్చాక ఈయనను పాలకునిగా నియమించారు. దత్త మండలాల్లో ఉన్న 80 మంది పాలెగాండ్లను అదుపులోకి తెచ్చి రైతులకెంతో ఉపకారం చేశాడు. పాఠశాలలు నెలకొల్పేందుకు, ప్రజోపయోగకరమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందించాడు. రాయలసీమ అంటే ప్రాణం.

1783లో రైటర్గా మద్రాసు వచ్చిన విలియం బ్రౌన్ మచిలీపట్నం, విజయనగరం, విశాఖ, గంజాం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక హోదాల్లో 50 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1817లో 'జెంటూ' (తెలుగు) వ్యాకరణం ముద్రించాడు. అందులో పూర్వ వ్యాకర్తలను స్మరించడమే గాక కొన్ని పూర్వ వ్యాకరణాలు నిరుపయోగాలన్నాడు. 1818లో ఆయన ప్రచురించిన జెంటూ వొకాబులరీ వల్ల ఆనాటి సాంఘిక చరిత్ర తెలుసుకోవచ్చు. 1832లో తెలుగు అనువాదకునిగా పనిచేశాడు. మచిలీపట్నంలోని మామిడి వెంకయ్య, గుండుమళ్ల పురుషోత్తం వంటివారు విలియం బ్రౌను తెలుగు వ్యాకరణ రచనకు సహాయం చేశారు. ఆయన తెలుగు వ్యాకరణం చాలా విశిష్టమైనది. ఇంగ్లీషు వర్ణక్రమం ప్రకారం తెలుగు అక్షరాలు 22 మాత్రమేనని వర్గీకరించాడు. ఇది ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకొనేందుకు దోహదం చేసింది. తెలుగు భావ ప్రకటనకు గంభీరంగానూ, వినడానికి కమ్మగానూ ఉంటుందని అన్నాడు.


ఎ. డి. క్యాంబెల్ - ప్రామాణిక వ్యాకరణం


అలెగ్జాండర్ డంకన్ క్యాంబెల్ 1807లో రైటర్గా మనదేశానికి వచ్చాడు. బళ్లారి, తంజావూరు కలెక్టరుగా పనిచేశాడు. ప్రభుత్వ తెలుగు, పర్షియా అనువాదకునిగా పనిచేశాడు. బళ్లారి మిషన్కు ఈయన కృషివల్లే ముద్రణశాల లభించింది. 1817లోనే సెంట్ జార్జికోట కాలేజ్ బోర్డుకు కార్యదర్శి అయ్యాడు. రెవెన్యూ బోర్డు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తెలుగును నిశితంగా అధ్యయనం చేయడమేగాక తెలుగులోనూ, తెలుగును గురించి ఆంగ్లంలోనూ ప్రామాణిక రచనలు చేసిన కొద్ది మందిలో క్యాంబెల్ ఒకరు. ఉదయగిరి నారాయణయ్య అనే పండితుని దగ్గర ఆంధ్ర శబ్ద చింతామణిని ఆమూలాగ్రం చదువుకున్నాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక పీఠిక, ఆంధ్రకౌముది, అహోబిల పండితీయం మొదలైనవి 10 ఏళ్లపాటు శ్రద్ధగా పఠించాడు. ఈ పరిజ్ఞానంతో తర్వాతి వారికి ఉపయుక్తంగా ఉండేలా ఆరు అధ్యాయాలు, 519 సూత్రాలతో తెలుగు వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రచించాడు. అప్పట్లో ఇంగ్లీషు వచ్చిన తెలుగు వ్యాకరణాల్లో క్యాంబెల్ వ్యాకరణ గ్రంథం ప్రామాణికమైనదిగా పరిగణనకెక్కింది.


1812 నుంచి దేశ భాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. అదే తర్వాత కాలేజ్ బోర్డుగా మారింది. 1816లో వ్యాకరణం ముద్రణ జరిగింది. 1812 నుంచి 1820 వరకు ఎనిమిదేళ్లు కాలేజ్ బోర్డు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా పనిచేశాడు. ఆయన ప్రతిభా విశేషాలకు మెచ్చి ప్రభుత్వం వారు నిఘంటువు రాయమన్నారు. క్యాంబెల్ ఆంధ్ర దీపికను ప్రాతిపదికగా తీసుకొని కొత్త పదాలు కలుపుకుంటూ తెలుగు ఇంగ్లీషు అర్థాలిస్తూ నిఘంటువు పూర్తి చేశాడు. దాని తొలి ముద్రణ 1821లోనూ, రెండవ ముద్రణ 1848లోనూ జరిగింది. తన వ్యాకరణానికి ఆయన రాసిన ప్రవేశిక చాలా గొప్పది. ఆంధ్ర భాషా చరిత్రను, ఆంధ్రదేశ చరిత్రను సంక్షిప్తంగా రాసినా అది కూడ ప్రామాణికమైనది. ఆంధ్ర చరిత్ర రచించిన వారిలో క్యాంబెల్ మొదటివాడు కావచ్చునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.11 తన గ్రంథంలో త్రిలింగ శబ్దానికి విపులమైన పీఠిక రచించాడు. ప్రాచీన పాశ్చాత్య చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించిన అంశాల్ని ప్రస్తావించాడు. వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్రప్రసక్తి ఉన్న ఘట్టాలను క్రోడీకరించాడు. మెకంజీ సేకరించిన వ్రాత ప్రతులను, శాసనాలను ఆధారం చేసుకొని విజయనగర రాజుల జాబితా రూపొందించాడు.


ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ - తులనాత్మక అధ్యయనం


మద్రాసులో రైటర్ 1796లో సివిల్ సర్వీసు ప్రారంభించిన ఎల్లిస్ 1802లో రెవెన్యూ బోర్డు సభ్యునిగా, జిల్లా జడ్జిగా, కలెక్టర్ గా అనేక హోదాల్లో పనిచేశాడు. మచిలీపట్నంలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాడు. తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు దక్షిణ భారతీయ భాషల విషయంలో చెప్పుకోదగిన కృషి చేశాడు. తమిళ, సంస్కృత, మళయాళ భాషలలో తెలుగును తులనాత్మకంగా అధ్యయనం చేసి ద్రావిడ భాషావాదం బలపడడానికి ఎల్లిస్ దోహదం చేశాడు.


ఎ. డి. క్యాంబెల్ తెలుగు వ్యాకరణానికి పరిచయంగా ఎల్లిస్ తెలుగుతో ద్రావిడ భాషకు గల సామ్యాన్ని గురించి రాసిన నోటును (1816) పొందుపరచడం జరిగింది.


భారతీయుల సాంఘిక పరిస్థితుల పట్లా, చరిత్ర పట్లా ఎంతో శ్రద్ధ కనబరచి ఆ విషయాలపై ప్రామాణిక రచనలు చేశాడు. "జనని సంస్కృతంబు సకల భాషలకును" అన్న కొందరు ఆంగ్ల పండితుల వాదాన్ని ఎల్లిస్ ఖండిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలనీ, సంస్కృతం నుంచి జనించినవి కావని నిరూపించాడు. వాక్య నిర్మాణ పద్ధతిలో దక్షిణాది భాషలు సంస్కృతంతో ఎలా విభేదిస్తున్నాయో రాశాడు. మామిడి వెంకయ్య 'అంధ్ర దీపిక' ఉపోద్ఘాతంలో చెప్పిన తత్సను, తద్భవాలను గురించి చర్చించాడు. లక్ష్మధరుని షడ్భాషా చంద్రికను ఉటంకించాడు. ఇది భాషా శాస్త్ర విషయకంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకోదగింది. ఎల్లిస్ మరణానంతరం ఆయన భాషా శాస్త్ర పరిశోధన పత్రాలన్నిటినీ సర్ వాల్టర్ ఇలియట్క అందే ఏర్పాటు జరిగింది. ఇలియట్ డాక్టర్ పోపు ఇచ్చి ఆక్స్ఫర్డ్ బోదిలియన్ గ్రంథాలయంలో భద్రపరచేట్లు చేశాడు.


కోలిన్ మెకంజీ - చారిత్రక సంపద


తెలుగుతో పాటు 15 భారతీయ భాషల్లో వేలాది వ్రాతప్రతులు సేకరించి అనంతర తరాలకు అమూల్యమైన విశేషాలను అందించిన పాశ్చాత్య ప్రముఖుడు కోలిన్మెకంజీ. లూయిస్ ద్వీపానికి చెందిన మెకంజీ 1783లో ఈస్టిండియా కంపెనీ వారి ఇంజనీర్స్ క్యాడెట్లో ఎంపికై భారతదేశం వచ్చాడు. మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేలో పాల్గొన్న ఇంజనీర్లలో మెకంజీ ఒకరు. కోయంబత్తూరు, దిండిగల్, నెల్లూరు, గుంటూరు ఎక్కడికి సర్వే కోసం వెళ్లినా తనతో జిజ్ఞాసువులైన పండితులను తీసుకెళ్లేవాడు. 1809లో మద్రాసు సర్వేయర్ జనరల్, 1817లో కలకత్తా సర్వేయర్ జనరల్ గా ఉండి దాదాపు 70 వేల చదరపు మైళ్ల మేర సర్వే జరిపించాడు. కావలి వెంకట బొర్రయ్య. లక్ష్మయ్య అనే ఇద్దరు ప్రతిభావంతులైన తెలుగు సోదరుల సహాయంతో దేవాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, శాసనాల ప్రాచీన చరిత్రను మెకంజీ వెలికితీశాడు. ఆయన కృషిని సెంట్ జార్జి కోట ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రశంసించింది.

తాను సేకరించిన 1620 ప్రాంతాల స్థానిక చరిత్రల కైఫీయతుల విశ్లేషణ, కేటలాగింగు చేపట్టిన కొంత కాలానికి 1821లో కలకత్తాలో మెకంజీ మరణించాడు. మెకంజీ సేకరించిన సమాచారన్నంతటినీ గపిండియా కంపెనీ కొనుగోలు చేసింది. 

ఏషియాటిక్ జర్నల్ మెకంజీ సేకరించిన విషయ సంపదను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది.


విల్సన్స్ మెకంజీ కలెక్షన్స్ పేరుతో 1828లో కలకత్తాలో కేటలాగింగ్ ఆరంభమైంది. మెకంజీ సేకరించిన 176 తెలుగు లిఖిత ప్రతుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. 36 పౌరాణిక, వైతాళిక సాహిత్య గ్రంథాలు, 23 స్థానిక చరిత్రలు, 82 ప్రతులు కావ్యాలు, నాటకాలు, గాధలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి సహాయంతో సాధికారికమైన స్థానిక చరిత్ర నిర్మాణం చేయవచ్చు.


వీరేగాక ఇంకా ఎందరో తెల్లదొరలు తెలుగు ప్రాంతాల్లో, తెలుగువాళ్ల మధ్య తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు. వారందరి గురించి విపులంగా చర్చించడం ఈ అధ్యయనంలో సాధ్యమయ్యేది కాదు. అయితే వారిని నామమాత్రంగానైనా స్మరించడం బాధ్యత. బెంజిమెన్ బ్రాన్ఫీల్, జాన్. పి. మారిస్, థామస్ కన్ సెట్టస్, సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్, హెన్రీ థామస్, కోల్ బ్రూక్, జె. బి. గిల్ క్రిస్ట్, విలియం కేరీ, జార్జి అబ్రహం గ్రియర్ సన్, రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ (సి. పి. బ్రౌన్ తండ్రి) క్లాడినస్ బఛ్యస్, జాషువా మార్ష్మన్, హెన్రీ మార్టిన్, డేనియల్ కోరీ, డా. జాన్ లీడెన్... ఇలా వారి వారి స్థాయిల్లో, పరిమితుల్లో తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు.


- కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...