అశోకుని యర్రగుడి శాసనాలు
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు
గుత్తి-ఆదోని
రోడ్డు ఒక రాష్ట్ర రహదారి. గుత్తి నుంచి గమ్యస్థానం 13
కిలోమీటర్ల దూరంలో ఉంది యర్రగుడి. అక్కడి నుంచి అశోకుని శాసనాలున్న చోటు మరో 1 కి.మీ దూరం. స్థలాన్ని కనుక్కోవడం
సులభంగానే ఉంటుంది.
ఈ అశోకుని రాతి నిర్మాణం రాష్ట్ర రహదారికి కిలోమీటరు దూరంలో
కాంక్రీట్ రోడ్డుతో కలుపబడి ఉంది. సైట్ నిర్వహణ
మెచ్చుకోతీరులో ఉంటుంది. బాధ్యుల చిత్రశుద్ధి, అంకితభావం
క్షేత్రంలో పుష్కలంగా ఆరోగ్యంగా
పెరిగే చెట్లు, పూలమొక్కలు చెబుతున్నాయి.
రోడ్డును
వదిలి ఒక కాలి బాట కొండ వెళుతుంది. ద్వారం వద్ద ఎఎస్ ఐ కర్నూలు సబ్ సర్కిల్
వారు ఏర్పాటు చేసిన
గ్రానైట్ పలకల జత మీద ఉన్న
ఆంగ్ల పాఠాన్ని తెలుగులో అనువదించుకుంటే ఈ విధంగా ఉండవచ్చు.
“క్రీ.పూ 3వ శతాబ్దంలో ఈ
ప్రదేశంలో గొప్ప మౌర్య చక్రవర్తి అశోకుడు శిలాఫలకాన్నిచెక్కించాడు. ఈ రాతి
శాసనం బ్రహ్మీ లిపిలోను, ప్రకిత్ భాషలోను చెక్కబడింది. శాసనం ధర్మానికి సంబంధించింది: దేవతల ప్రియుడు ఈ విధంగా అన్నారు: “దేవతల
ప్రియుని ద్వారా మీరు ఆదేశించిన విధంగా ప్రవర్తించాలి. రజకులను వారి వంతుగా
గ్రామప్రజలు, స్థానిక అధికారులను ఈ క్రింది మాటలలో ఆదేశించవలెను. "అమ్మా,
నాన్న, పెద్దలను ప్రేమించాలి, జీవుని దయతో చూడాలి. నిజం మాట్లాడాలి".
హిందూ పత్రిక కర్నూలు ఎడిషన్ లో
2013 మే 31 న అశోకరాతి ప్రదేశాన్ని
పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి డి.శ్రీనివాసులు ఆసక్తి కలిగించే సమాచారం వ్యాస
రూపంలో ఇచ్చారు.
కళింగ దండయాత్ర తరువాత అశోక చక్రవర్తి చేసిన పర్యటనల సమయంలో రాయబడిన బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాష శాసనాలు కూడా
ఈ విధంగా ఉన్నట్లు పరిశోధకులు భావన. 256 రోజుల పాటు జరిగిన ఈ పర్యటన కార్యక్రమంలో చక్రవర్తి చాలా చోట్ల క్యాంపు లు నిర్వహించినట్లు తెలుస్తుంది. స్థానిక చరిత్రకారుల కథనం ప్రకారం, మౌర్యుల కాలంలో స్వర్ణగిరిగా పిలిచిన జొన్నగిరి ని ఆ రాజ్యానికి దక్షిణ భారత
రాజధానిగా వ్యవహరించినట్లు అనుకోవాలి.
శాసనంలోని అంశం ఇతర అశోకుని అ తరహా శాసనాలతో
సంబంధం లేనట్లుగా కనిపిసుంది. అక్కడ రాజును ప్రియదాసి, దేవతల ప్రియునిగా ప్రస్తావించడం జరిగింది.
తొమ్మిది శిలలపై 28 భాగాలున్న యర్రగుడి శాసనాలు, తల్లితండ్రులకు విధేయంగా ఉండాలని,
అలాగే పెద్దల పట్ల విధేయత ఉండాలని, ప్రాణులపట్ల దయ ఉండాలి, సత్యం మాట్లాడాలి,
ధర్మం యొక్క లక్షణాలను ప్రచారం చేయాలి, బలికోసం ఏ ప్రాణిని వధించరాదు. ‘రోడ్ల
పక్కన చెట్లు
నాటడానికి, జంతువులు, మనుషుల ఆనందం కోసం బావులు తవ్వారు’
అని ఆ రాతి బండల మీదుంటాయి. ‘ధర్మానికి
సంబంధించిన ఈ శాసనాలు నా (అశోకుడు) ద్వారా వ్రాయబడినవి. నా కుమారులు, మనుమలు అందరి క్షేమం కోసం
కృషి చేయాలని’ శాసనం పేర్కొన్నట్లు సమాచారం.
ఈ శిలా శాసనం ప్రపంచంలోని అన్ని
వన్యప్రాణుల సంక్షేమం కోసం చేసిన మొదటి చట్టంగా పరిగణించవచ్చని ఎస్.జె. కాలేజీ
ప్రిన్సిపాల్, చరిత్రకారుడు డాక్టర్ అబ్దుల్ ఖాదర్ అభిప్రాయం. నిజానికి అవి మౌర్యన్
రాజ్య విధానం నాటి నిర్దేశక సూత్రాలు. ఆ స్థల విశేషాన్ని వివరిస్తూ, భద్రపరచవలసిన ఆవశ్యకతను ఉద్బోధించే
వ్యాసాలు గణనియంగానే వచ్చినట్లు సమాచారం.
ఈ ప్రదేశంలో ఇంకా 8 శిలాశాసనాలు కనిపించాయి. అక్షరాల పరిమాణంలో పరిణామం సుస్పష్టం. బండరాయిలోకి తొలవడం వల్ల లోతుల్లో వచ్చిన తేడా వల్ల ఈ తారతమ్యం
సంభవించివుండచ్చన్నది పరిశోధకుల భావన. కొన్ని అక్షరాలు సుద్దముక్కతో రాసినట్లు
అనిపిస్తుంది. ఈ చిత్రంలో మూడు శాసనాలు ఉన్నాయి. ఒకటి దిగువ
భాగంలో, త్రిభుజాకారంలో ఉన్న రాయి, వెనుక భాగంలో పెద్ద
బండరాయి. ఇక్కడ కనిపించే ఈ శిలలన్నీ తూర్పు ముఖంగా ఉండగా, మిగిలిన శిలాశాసనాలు
ఉత్తర-ముఖంగా ఉన్నాయి.
శాసనాలను నిశితంగా గమనించండి.
ఉపరితలం అందంగా ముతకగా ఉంటుంది..
ఈ ఉపరితలం మృదువుగా ఉంటుంది.
ఇక్కడ శాసనాలు కేవలం ఉపరితలంపై
ఉన్నాయి, ఎచ్చింగ్స్ లో లోతు లేదు, ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి.
కర్ణాటకలోని శాసనాలతో పోలిస్తే
అక్షర పరిమాణాలు చాలా చిన్నవి. కర్ణాటక క్షేత్రాలల్లో
గరిష్టంగా 3అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు ఉండగ, ఇక్కడ గరిష్టంగా 3 అంగుళాల లోతు అక్షరాలను మాత్రమే చూడగలం. లభ్యమయే సందేశం పొడవు, వెడల్పులను
మీద ఈ లోతులు ఆధారపడివుండవచ్చని పరిశోధకుల అభిప్రాయం. .
ఉపరితలం పోక్ మార్క్ చేయబడింది చెక్కేవాని(ఇన్
స్క్రైబర్ )గొప్ప పనితనానికి
ఈ శాసనం ఒక మంచి ఉదాహరణ.
ఈ మెట్లకు పైన, ఎడమల వైపున్న రాళ్ళ జత మీద
శాసనాలను కనిపిస్తున్నాయి. ఇవి ఉత్తరాభిముఖంగా కనిపిస్తాయి.
ఈ రాయి అంచుకు దగ్గరగా ఉంటుంది, మెటల్ రెయిలింగ్ కూడా స్థిరంగా, బలంగా
ఉండటం నిర్వహణలోని శ్రద్ధను సూచిస్తోంది. ఉత్తరముఖంగా ఉన్న మరొక శాసనం. ఈ మార్గం రాతి
నిర్మాణం యొక్క పశ్చిమ కొనకు దారితీస్తుంది.
ఈ సౌకర్యవంతమైన చోటు సందేశ రీడర్ల ద్వారా ఆక్రమించబడినట్లుగా
కనిపిస్తుంది. చల్లగా ఉండే ఈ చోటు నుంచి కింద పరుచుకున్న మైదానాల అందాన్ని ఆస్వాదించవచ్చు.
ఈ చిన్న వీడియో చూడండి,
ద్వారం వద్ద ఒక చిన్న గుండ్రని
రాయి నిఉంచారు. వచనం తెలుగు. యర్రగుడి
గ్రామంలో ఈ శాసనం కనుగొనబడి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోయింది.
చివరగాః
మౌర్యుని కాలంలో జొన్నగిరి
స్వర్ణగిరిగా ప్రసిద్ధి చెందినదని చరిత్రకారులు చెబుతారు. ఇదే నిజం అయితే,
ఇప్పటి దాకా భావిస్తూ వస్తున్నట్లు
కర్ణాటకలోని కనకగిరి
సువర్ణగిరి కాకూడదు మరి
.
Source: with Thanks to
karnatakatravel.blogspot.com/2015/05
major-and-minor-rock-edicts-of-ashoka.html......