పాత బంగారం - కథ
ఇల్లాలు
రచన - వై.ఎస్. ప్రకాశరావు
( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక )
ಆ ఆదివారం . క్రితం రోజు నే జీతాలు ముటాయి.
అకస్మాత్తుగా పుట్టింది కోరిక . . ఎక్కడికైనా ప్రయాణం చేసిరావాలని. వెంటనే బయలు దేరాను.
మెయిల్ లో కాకినాడ వెళ్ళి తిరిగి సాయం కాలానికి వచ్చేదామని.
నీటుగా కటకప్ చేసుకొని కళ్లకు గాగుల్స్ పెట్టి రిక్షాలో రాజమండ్రి టవున్ స్టేషన్ చేరాను. తీరా వెళ్లేటప్పటికి మెయిల్ గంటలేటు అని తెలుసుకొని ప్రయాణంమీద నిరాశపడ్డాను.
తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది . . పనిలేక ప్రయాణం చేసే నాలాటి ప్రయాణీకుడు పనిపైన ప్రయాణం చేసే ఇతర ప్రయాణీకులను అవస్థ పెట్టటాని కిష్టం లేక.
కాని ప్రయాణం చెయ్యాలని కోరుతున్న మనస్సును నిరాశ పెట్టడాని కిష్టం లేక వెనుదిరిగి వెళ్ల లేకపోయాను.
ప్లాట్ ఫారమ్మీద కొంత సేపు తిరిగాను. కాలం గడవటం బహుకష్ట మెంది. ఇంతిలో రోడ్ మీ ద కాఫీ 'కేంటీన్' వైపు దృష్టి మరలింది.
కేంటీన్ లోకిపోయి కాఫీ తీసుకున్నట్లయితే కొంత కాలం గడుస్తుందికదా అని బయలు దేరి వెళ్ళి 'స్పెషల్ సెక్షన్'లో పంకా క్రింద కూర్చు న్నాను. సర్వర్ కు కాఫీకి ఆర్డర్ ఇచ్చి గాగుల్సతీసి ముఖంమీది చమటను చేతి రుమాలుతో తుడుచుకుంటుండగా ఆ బల్లకు ఎదురుగా కూర్చున్న ఓ పెదమనిషి 'ఎక్క డకు వెళ్ళాలి, నాయనా?' అని ప్రశ్నిం చాడు.
'కాకినాడ వెళ్ళాలి' అని సమాధాన మిచ్చాను.
ఆయన వాలకంచూస్తేనే గవర్నమెంటు ఆఫీసర్ లా కనుపిస్తు న్నాడు. తెల్లని సగం చేతుల చొక్కా, రంగువెలిసిన కాకీ ఫుల్ పేంటులో 'టకప్’ చేసి కళ్ళకు చత్వారంజోడు పెట్టాడు. ఆయన్ను చూడగానే కొంతసేపు ఆయనతో సంభాషణ చేయాలని మనస్సు పుట్టింది. '
' చదువుకుంటున్నావా?' అని మరల ప్రశ్నించాడాయన. '
' లేదు, ఉద్యోగం చేస్తున్నా' నని సమా ధానమిచ్చాను.
సంతోషమన్నట్లుగా ఆయన ముఖసూచన చేసి మళ్ళీ ప్రశ్నించాడు.
' ఏడిపార్టుమెంటులో పనిచేస్తున్నావు? '
ఆయన వేసే ప్రశ్నలధోరణిచూచి, ఇంకా వివరాలన్నీ కనుక్కుంటాడని ముందుగానే గ్రహించి, ఆయన అడగబోయే వివరాలన్నీ చెప్పేసేను.
నామాటలు వింటూనే ఆయన ఏదో ఆలోచనలో పడ్డాడు.
'ఏమండీ అలా ఆలోచిస్తున్నారు? నేనేమైనా మీకు తెలుసా?' అని అడిగాను.
ఆ, ఏమీలేదు, నీవు చెప్పింది వింటూంటే నాకేదో చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొస్తున్నది' అన్నా డు గొంతుక సవరించుకుంటూ.
రైలు కింకా చాల టైమున్నది కదా - ఆయనదగ్గరనుండి తెలుసుకోవాలను కునే లోపు సర్వర్ కాఫీ తీసుకొచ్చి ఇంతలో నాముందు పెట్టాడు.
ఆ కాఫీ ఆయన కందిస్తూ, మరో కప్పు తీసుకురమ్మని సర్వర్ తో చెప్పాను.
' నేనిప్పుడే తీసుకున్నా, ఫరవాలే, నీవు తీసుకో! ' అన్నాడాయన.
కాఫీ ముగించి ఇరువురం బయటకు వచ్చాం. నేను రెండు కిళ్ళీలుకొని ఒకటి ఆయనకిచ్చి రెండవది నేను వేసుకున్నా. నేరుగా స్టేషన్ కు పోయి ప్లాట్ ఫారం చివర్న ఒక పెద్ద చెట్టు క్రింద ట్రాలీమీద కూర్చున్నాం.
'రిటైరైనారండీ? ' అని ప్రశ్నించాను, విషయ మేమిటో తెలుసుకుందామని.
"
'రేడిపార్టుమెంటులో పనిచేసి రిటైరయ్యానని ఆయన చెప్పాడు.
ప్రభుత్వోద్యోగంలో రిటైర్ అయ్యాడు.
' నా విషయం వింటే మీ చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొచ్చిం దన్నారు?' అన్నాను.
' అవును. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. నేను చేసిన పాపం చెప్పుకుంటే నాకూ కొంత మనస్థిమితం కలుగుతుంది. నీకూ ఒక ఉదాహరణగా ఉంటుంది, విను నాయనా! ' అన్నా డాయన.
ఇంచుమించు ముప్పై సంవత్సరా లుండవచ్చు. ఒకరోజున ఆఫీసు పనిపైన ఒక పల్లెటూరు వెళ్ళా. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు కావస్తోంది. గ్రామమునసబు గారింటికి వెళ్ళి నా హోదా చెప్పుకుని నాకు భోజన -పానాదులు సమకూర్చుకున్నా.
గృహస్థు నలభైయేళ్లు పైబడిన మనిషి. ఇంట్లో ఆయన భార్య, మూడునాలుగేళ్ల ఆడపిల్ల తప్ప మరెవ్వరూ లేరు.
ఆయన భార్య పెద్ద అందగత్తె కాకపోయినా కురూపి మాత్రం కాదు. ఇరవై సంవత్సరాలు పైబడిఉండవు. ద్వితీయవివాహమనుకోవచ్చు.
నా స్నాన మైన తరువాత గృహస్థుతో కలిసి భోజనం ముగించాను. ఆరుబయట వసారాలో నాకు మునసబు గారికి వేర్వేరు మంచాలు వేసి ఆయన భార్య వసారా సనుసరించి మంచం మీద పిల్లను వేసుకొని పడుకొంది.
నాకు కావలసిన సౌకర్యా లన్నీ కూడ మునసబుగారు భార్య చేతనే ఏర్పాటు చేయించారు. ఆమెకూడా అరమరిక లేక చాల చనువుగా మసిలింది.
ఆమె నడవడికనుచూచి నే నామెను తప్పు అర్థం చేసుకున్నాను.
రాత్రి సరిగా పన్నెండు గంటలు దాటి ఉంటుందేమో. నాకు మాత్రం నిద్రపట్టలేదు. ప్రక్కను గృహస్థు గాఢనిద్రలో ఉన్నాడు.
నాకు కలిగిన భావములు నన్ను ఆమెగురించి కలవరపరిచాయి.
నే నెటువంటి ఉద్రేకానికి గురి అవుతున్నానో నా కప్పటి పరిస్థితులలో తెలియలేదు. నెమ్మదిగా లేచి చూచాను. గృహస్థు గాఢనిద్రలో వున్నా డని నిశ్చయపర్చుకొని, నెమ్మదిగా తడబడు తున్న అడుగులతో గదిలోకి వెళ్ళాను. ఆమె పిల్లపక్కన పడుకుని గాఢం గా నిద్రపోతోంది. నేను వెళ్ళి ఒణకుతున్నా.. ఆమెను తట్టాను .
ఆమె ఆ నిద్రలో కళ్లు తెరచిరూచి కలవరపడింది. నే నామె చేయి పట్టుకో ప్ర యత్ని చేశాను. ఆమె వొణికిపోతూ "వస్తానుంఉండ ”ని చెప్పి పిల్లతో సహా బయటకు వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టింది .
ఆ రాత్రి నేను పడ్డ అవస్థ భగవంతునికే తెలుసు. మనస్సులో ఏదోభీతి దృఢంగా నాటుకుంది. నేను చేసిన తుచ్ఛమైన పని కి నన్ను నేనే నిందించుకున్నా.
స్త్రీ మనస్తత్వ మెరక్కుండా ప్రవర్తించి నందుకు నన్ను నేనే తిట్టిపోసుకున్నా. ఆగదిలో నే తెల్లవారేలోగా ప్రాణం విడిచేద్దామా అనిపించింది.
కాని మళ్ళీతట్టింది. నేను చేసినపని తిన్న ఇంటి వాసాలు లెఖ్క పెట్టటం. వారింట ప్రాణం తీసుకోటం మర్యాదస్తుడైన గృహస్థుకు ప్రాణాపాయం తెచ్చి పెట్టడమే కాక, వారి వంశమర్యాదను భంగపర్చటమని భావించి వెనుదీశాను.
గ్రామస్థుల ఎదుట నన్ను నిలదీయగలరని దృఢంగానమ్మాను. దానితో శరీరం కంపించింది.
తెల్లవారేలోగా ఇంచు మించు ఇరవై ముప్ఫై సార్లు తలుపులాగి చూచాను, కాని రాలేదు. దానితో మరింత భయపడ్డాను.
తెల్లవారింది. వారింట్లో కోడి ఎలుగెత్తి ‘కొక్కురోకో' అని చూసింది.
అదిరిపడి మళ్ళీ వెళ్ళి తలుపులాగి చూచాను. తలుపు గొళ్లెం తీసివుంది.
మునసబు గారు మంచంమీది ఇంకా నిద్రపోతున్నారు.
ఇలాలు దొడ్లో ఏ దో ఇంటిపని చేసు కుంటోంది.
నేను గాభరాపడుతూ సామాన్లు సర్దుకొని అక్కడ ఉండడానికి ఇష్టం లేక వెంటనే బయలు దేరాను.
అది గమనించి ఇల్లాలు వెంటనే భర్తను లేపింది. ఆయన లేవటంతో నాకు మరింత గాభరా ఎక్కు వైంది.
ఆయన మరో గదిలోనికి వెళ్ళి బట్టల సవరించువచ్చి 'ఏమండీ అంత కంగారు పఉతారెందుకు? తాపీగా స్నానంచేసి కాఫీ వెళ్ళండి. అది గృహస్థధర్మం. అన్నాడు . కాని ప్రేమపూర్వకంగా ఆయన అన్న ఆమాటలతో నాకు శరీరం దహించుకు పోతున్నట్లయింది.
ఎట్లాగో ముళ్ళమీద నుంచున్నట్లు వారికోరికను మన్నించి తరువాత వెళ్తూ ' వెళ్ళొస్తాను చెల్లెమ్మా' అన్నాను.
' వెళ్లి రాండి అన్నయ్య గారూ! ' అందిఇల్లాలు. నాకామాట బల్లెంతో పొడిచినట్లయింది.
వెళ్ళి వెంటనే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనిపించింది.
స్త్రీ మనస్తత్వం నీకు తెలియంది కాదు, నాయనా. సంవత్సరాలనుండి ఈ విషయం జ్ఞాపకమొచ్చినప్పుడల్లా నేను చేసినతప్పు ఎవరికి చెప్పి పశ్చాత్తాపం పొంది దాని ద్వారా కొంత మనఃస్తిమితం కలుగ చేసుకుంటున్నాను' అని ఆయన కథ ముగించాడు.
అప్పట్లో ఆయన ముఖం చూస్తే నాకే జాలి వేసింది.
ఓ విధంగా ఓదార్చకపోతే బాగుండదని మొదలు పెట్టా.
' తప్పు మానవుడు చెయ్యకపోతే పశువు చేస్తుందిటండీ? చేసిందానికి మీరు పశ్చా త్తాపం చెప్పుకోనే చెప్పుకుంటున్నారు. చేసిన తప్పు ఈ రోజుల్లో ఎవరు చెప్పు కుంటారండీ? మీరు చేసినపాపం చెప్పు కున్నందువల్ల అప్పుడే పోయింది. ' అని సముదాయించేప్పటికి ఆయనముఖంలో కొంత వికాసం కన్పించింది. . '
' నాయనా! యువకుడవు. నాకథ జ్ఞాపకముంచుకోవడం నీకు మంచిది నాయనా.; . అని తలవంచుకుని మౌనంగా కూర్చున్నాడు.
నేను ఆలోచనలో పడ్డాను, ఆయన చెప్పిన సంఘటనలో ఆయన పడ్డ అవస్థకన్న ఆ ఇల్లాలి తెలివి తేటలు, సహనం ఆలోచనలు ప్రథమ స్థానం పొందాయి. ఎంతో నేర్పరితనంగా తన మానం రక్షించుకొని అతిథిని అగౌరవపర్చ కుండా పంపింది!
ఆడవాళ్ళందరూ అంత తెలివిగా ఉంటే ప్రపంచ మే బాగుపడి పోను- అనిపించింది.
రచన - వై.ఎస్. ప్రకాశరావు
( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక )