Showing posts with label domestic. Show all posts
Showing posts with label domestic. Show all posts

Sunday, December 19, 2021

ఉప్పూ - మానవ సంబంధాలు - శ్రీరమణ ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు



ఉప్పూ - మానవ సంబంధాలు


- శ్రీరమణ

 ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


" నీ ఉప్పు తిని నీకు అన్యాయం చేస్తానా" అనేది చాలా పాప్యులర్ సామెత. “వాడి ఉప్పు తిని "నీ వాడికే అన్యాయం చేశాడు" అని రోజూ వినిపిస్తూ వుండే సత్యం. అందుకని ఉప్పుతో ముడిపడి బోలెడు మానవ సంబంధాలు వున్నాయి. 


మరీ పిచ్చి కోపం వస్తే "ఉప్పుపాతర వేస్తా!  నా సంగతి సాంతం నీకు తెలియదు" అనడమూ కద్దు. మనిషి జీవనానికి "ఉప్పుతో పదహారు తప్పని అవసరాలు" గా  అప్పటి మనిషి గుర్తించాడు. ఇందులో మళ్లీ ఉప్పు ప్రాధాన్యతను మనం గమనించాలి. 


మనిషి నేల, నింగి, సముద్రం, కొండ, కోన అన్నిటినీ శోధించి తనకు కావల్సినవి నిర్మొహమాటంగా లాగేసుకోవడం అనాది నుంచీ అవలంబిస్తున్నాడు. సముద్రంలో నీళ్లు ఉప్పు ఖనిజాన్ని కషాయాలుగా వున్నాయని తెలిసి, ఉప్పు కూడా వొక రుచే అని గ్రహించాడు. అక్కడ నుంచి సముద్రానికి  ఏతం వేసి ఉప్పును పండించడం మొదలుపెట్టాడు. ఉప్పును తయారు చేయడాన్ని ' ఉప్పు పండించడం'  అంటారు. అంటే దీనిని పంటగా భావించారు. మానవ సంబంధాలు చాలా గట్టివని దీనినిబట్టే అర్థం అవుతోంది. 


" ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ..." అన్నాడు సుమతీ శతకకారుడు. "ఏటికేతామెత్తి ఎన్ని పుట్లు పండించినా గంజిలో ఉప్పెరుగుమన్నా..." అని శ్రమజీవులు గుండెలు పిండేలాగా పాడారు. "ఉప్పు మెప్పు కోరేటోల్లు తప్ప వొప్పు చేసేటోల్లం" అని మనిషి సహజ లక్షణాన్ని చెబుతూ, అందులో ఉప్పు పాత్రని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఉప్పు కారం తినేవాళ్లకు రోషం భాషం వుంటుందని వొక నమ్మకం.  ఉప్పు లేని పప్పు చప్పుగా చస్తుంది అన్న నిజాన్ని "కట్టుకున్న పెళ్లాంలా" అని పొడిగించాడు.


ఏ వంటకంలో ఎంత ఉప్పు వెయ్యాలో నలుడికి తెలుసు .. భీముడికి తెలుసు. అసలు పాకశాస్త్రం పురుష కళ. క్రమేపీ పురుషుల నుంచి ఆ కమ్మటి కళ చేజారి స్త్రీల హస్తగతం అయింది. అక్కడ నుంచి వారి చేతులు వడ్డించేవి అయినాయి. పైచేయి కూడా అయింది ఆటోమేటిక్ గా. 


వంటకాల తయారీ గురించి రాసేటప్పుడు ఉప్పు దగ్గరకు వచ్చేసరికి “తగినంత”గా అని వొక మాట వాడతారు. అక్కడే వుంది తిరకాసు. మిగిలినవన్నీ కొలతలు, తూకాలు చెప్పి, ఉప్పు విషయంలో తేల్చకుండా తగినంత అనడంలో ఫార్ములా ముడి విప్పకుండా దాటివేయడమే! ఇలాంటి చోట మానవ సంబంధాలు సఫర్ అవుతాయి తప్పదు. శ్రీశ్రీ "ఇతరేతర’ శబ్దం లాంటిదే ఇక్కడ “తగినంత" అన్నమాట. ఇంతటితో యీ ప్రస్తావన ముగించకపోతే "ఉప్పు పత్రి కాకుండా” నన్ను తిట్టే ప్రమాదం వుంది. 


ఉప్పు దిగతుడిస్తే జనదిష్టి పోతుందిట. పూర్వం ఉప్పు కల్లు, కల్లుప్పు అని వ్యవహరించేవారు. కల్లు అంటే రాయి అని అర్థం. "తిరగలి కల్లు" అంటే తిరిగే రాయి అని అర్థం. ఈ శబ్ద చర్చని మరీ తిప్పితే మానవసంబంధాలు పిండి పిండి అయిపోయే అవకాశం వుంది. 


రాత్రి పూట "ఉప్పు" అనకూడదట! "దీపాలు ఆరిపోతాయ్" అని చెప్పేది మా నాయనమ్మ. అందుకని చవి, రుచి, లవణం, బుట్టలోది అని దీపాలు ఆరకుండా ఛాందసులు జాగ్రత్త పడేవారు. ఉప్పు చేతిలో వెయ్యకు గొడవలు వస్తాయని పెద్దవాళ్లు చెప్పేవారు. అంటే మానవ సంబంధాలు చెడిపోతాయనే. దానివెనుక శాస్త్రీయ లక్ష్యం గురించి హేతువాదులు తర్కించుకుని ఏకాభిప్రాయానికి రావాలి. వారి శాస్త్రీయ పరిశోధనలను సామాన్య మూఢులకు అందించి పుణ్యం కట్టుకోవాలి. హేతువాదులు పుణ్యాన్ని, అదృష్టాన్ని నమ్మరు, కాని అనుభవిస్తారు. అసలు కరెంటు దీపాలు వచ్చాక ఉప్పు అన్నా ఉఫ్ అన్నా కొండెక్కే అవకాశం లేదని వాళ్లు వాదిస్తారు. 


ఉప్పు మీద బోలెడు సామెతలున్నాయి. చెమట కన్నీళ్లు ఉప్పగా వుంటాయి. శ్రమ, దుఃఖం యీ రెండూ మానవ సంబంధాలకు సంబంధించిన వస్తు సామగ్రిలో ప్రధానమైనవి. 'అడవిలో ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు- కలిస్తే ఊరగాయ" అంటుంటారు. దీని వెనుక మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా యిమిడి వుంది. భార్యాభర్తల సంబంధం వుందనుకోండి. అమ్మాయి అమలాపురంలో పుట్టి పెరుగుతుంది. అబ్బాయి అట్లాంటాలో గ్రీన్ కార్ట్ హోల్డరు. వాళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. జాడీలో పడతారు. యిలాగ వివాహ వ్యవస్థకు ఆపాదించుకోవచ్చు. అలాగే పి.వి. ఆంధ్రాలో పుట్టి, పెరిగి రాంటెక్లో నిలిచి గెలిచి ప్రధాని కావడం వుందనుకోండి. ఇక్కడ పి.వి. వుసిరికాయ. రాంటెక్ వోటర్లు ఉప్పురాళ్లు. ప్రధాని పదవి ఊరగాయ- మిగిలిన యీక్వేషన్లు, కొటేషన్లు మీరు పూరించుకోండి. 


నిజం. ఒక పెళ్ళిలో వియ్యంకుడికి వడ్డించిన వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద గొడవ అయింది. ఆడపెళ్లి వారు క్షమాపణ చెబితే గాని లాభం లేదనీ, పీటల మీద పెళ్లి ఆగిపోతుందనే దాకా వచ్చింది. చివరకు పెద్ద మనుషులు కల్పించుకుని, మళ్లీ యిన్ని వంకాయ ముక్కలు వుడికించి కూరలో కలిపి, సరిపోయిందనిపించారు. అప్పుడు గాని పెళ్లికొడుకు తండ్రి కుదుట పడలేదు. 


మన ప్రాచీన వేదాలు జాగ్రత్తగా చదివినట్లయితే “ఉప్పు”కి వొక అధిష్టాన దేవత వున్నట్లు స్పష్టం అవుతుంది. ఆవిడ నివాసం సముద్రం. దేవతలు రాక్షసులు మంధరగిరిలో  క్షీరసాగరాన్ని మధించినపుడు ఆమెకు కోపం వచ్చింది. అంతటి చరిత్రాత్మక సన్నివేశం తన వద్ద కాకుండా క్షీరసాగరంలో చేశారని ఖిన్నురాలైంది. "నేనే కనుక పతివ్రతని అయితే నా వొక్క కల్లుతో కడివెడు క్షీరము విరిగిపోవు గాక" అని శపించింది. ఆవిడ నిజంగానే పతివ్రత అవడం వల్ల యిప్పటికీ శాపం అమలులో వుంది. 


ముఖ్యంగా భారతీయులకు, ఉప్పుతో వున్న సంబంధం యింకెవరికీ వుండదు. దండి సత్యాగ్రహం, అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుమీద తెల్లదొరలు పన్ను వేశారని ఆగ్రహించాం. ప్రస్తుతం అదే ఉప్పు నల్లదొరల పాలనలో పెట్టుబడిదారులకు రహదారి అయింది. కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. ఇప్పుడు ఉప్పు రైతులు లేరు సాల్ట్ కింగ్స్ తప్ప. వీటన్నిటి వెనుక వున్న మానవ సంబంధాలను మీరు గుర్తించాలి. 


రక్తపోటు వున్న వాళ్లు ఉప్పు తగ్గించాలంటారు. ఏదైనా లోగుట్టు చెబితే ఉప్పు అందించాడంటారు. కొన్ని పేపర్లూ ఉప్పు అందించమని పాఠకులను కోరుతూ వుంటాయి. కొందరు అందిస్తూనే వుంటారు. బయట పడిందంటే మానవ సంబంధాలు బాగా చెడిపోతాయి. 


బాల్యంలో ఉప్పు అద్దుకుని మామిడి పిందెలు తిన్నాం. పెద్దయ్యాక ఖరీదైన బార్ కు  వెళితే చేతిమీద గంధం రాసినట్టు తడి ఉప్పు రాసి, “యిది తాగుతూ మధ్య మధ్య నాలికతో దానిని రుచి చూడండి" అన్నాడు. ఏమిటిది అంటే “చకిటా” అంటే యిదే అన్నాడు బార్ వాడు. 


కస్తూరిబాకి బి.పి. వుంటే వైద్యుడు ఉప్పు వాడద్దని చెప్పాడట. ఆమె మాత్రం మానెయ్యలేక మామూలుగానే తింటోంది. ఆ సంగతి తెలిసి గాంధీజీ వుప్పు మానేశారు. చప్పిడి తినడం మొదలు పెట్టారు. ఆవిడ లబోదిబోమని వెంఠనే ఉప్పుకి స్వస్తి చెప్పిందిట. ఇవన్నీ ఉప్పుతో మానవ సంబంధాలు కాదూ!


విశ్వనాథ సత్యనారాయణవి విచిత్రమైన అలవాట్లు. సాయంత్రం నలుగురు మిత్రులనో శిష్యులనో వెంట వేసుకుని కూరల మార్కెటుకు  వెళ్లడం వొక ఆటవిడుపు. అక్కడ మసాలా దినుసుకి నిలువుగా కోసిన వొక కొబ్బరి ముక్క రెండు పచ్చి మిరపకాయలు, ఇంటి దగ్గర్నించే గుర్తుగా తెచ్చుకున్న చిటికెడు ఉప్పు నోట్లో వేసి రుబ్బేవారుట. ఆయనకు కొబ్బరి పచ్చడి తిన్నట్లు వుండేది. మరి జిహ్వ అంటే అదీ జిహ్వ!


- శ్రీరమణ ' ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-11-2021 ; బోథెల్ : యూ ఎస్ ఎ


Tuesday, December 14, 2021

తాంబూలం - వ్యాసం - కర్లపాలెం హనుమంతరావు

వ్యాసం 

తాంబూలం


- కర్లపాలెం హనుమంతరావు 


కృష్ణదేవ రాయలు, అష్ట దిగ్గజ కవులూ తెలుగు కవిత్వాన్ని అంబరచుంబిగా చేసిన తర్వాత – మళ్ళీ ఆధునిక యుగం వచ్చేదాకా ఉన్న కాలంలో – చెప్పుకోదగ్గ ఏ ఇద్దరు ముగ్గురో కవుల్లో చేమకూర వెంకట కవి అగ్రగణ్యుడని చెప్పుకోవచ్చు. విజయవిలాసంతో ‘చేమకూర మంచి పాకాన పడింది’ అని అనిపించుకున్న కవి ఇతను. ప్రతి పద్యం లోనూ చమత్కారం చూపిస్తానని శపధం చేశాడట ఈయన. అలాగే ప్రతి పద్యమూ ఆలోచనామృతం చేశాడని చెప్పవచ్చు. పైకి చూస్తే ఒక భావంతో కనిపించే పద్యంలో తవ్వుకుంటూ పోతే ఎన్నో విశేషార్థాలు ద్యోతకమౌతాయి. తాపీ ధర్మారావుగారు ఈ కావ్యాన్ని అంగాంగ పరీక్ష చేసి, ఎన్నో అందమైన భావాలు, చమత్కారాలు దాదాపు అన్ని పద్యాల్లోనూ ఉన్నాయని నిరూపించాడు. అప్పటిదాకా చాలామంది పండితులకు గూడా ఆ చమక్కులూ, అందాలూ స్ఫురించలేదు. అటువంటి గొప్ప స్వారస్యాలు అందించాడు వెంకటకవి. వందలకొద్దీ ఉన్న అలాంటి పద్యాలనూ, వాటి విశేషాలనూ వర్ణించటానికి ఇది సమయం కాదు కానీ, మచ్చుకొక్కటి మనవి చేస్తాను. ఆ వూళ్ళో మంచి చెట్లున్న వనాలు, ముత్యాల మేడలు చాలా వున్నాయి.

 

పోక మ్రాకుల మహిమ కప్పురపుటనటి

యాకు దోటల సౌభాగ్యమందె గలదు

ప్రబలు మౌక్తిక సౌధ సంపదల మహిమ

వీటి రహి మెచ్చవలయుబో వేయునోళ్ళ!

 

పోక మ్రాకులున్న వనాలు, అరటి తోటలలో పెరిగే ఆకుతోటలు, మౌక్తిక సౌధాలు – వీటి సమృద్ధిని వేయినోళ్ళ మెచుకోవాలి అని పద్య భావం. ఇది బాగానే ఉంది. పద్యానుకూలమైన తాత్పర్యం బాగానే వచ్చింది కాబట్టి ఇక ఈ పద్యంలో తరచి చూడవలసినదేమీ లేదు; తరవాతి పద్యానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారేమో. అదేమీ కుదరదు. కాస్త తరచి చూడండి అంటాడు వెంకట కవి. పద్యంలో పోకలున్నాయి, ఆకులు ఉన్నాయి. సున్నం కూడా ఉంది. ఎలాగంటారా. ముత్యాలు కాల్చి సున్నం చేస్తారు. భోగ భాగ్యాలున్నవారు ఇలాంటి సున్నాన్నే వాడతారు. మౌక్తిక సౌధం అంటే ముత్యాల తాలూకు సుధ. సుధ అంటే సున్నం అనే అర్థమూ ఉంది. ఆకులు, వక్కలు, సున్నం ఉన్నాయి కాబట్టి తాంబూలం వున్నట్టే. “వీటి రహి మెచ్చవలయుబో వేయునోట్ల” అన్నాడు కదా. అంటే తాంబూలం, తాంబూలపు రుచిని మెచ్చవలె గదా. ‘వేయునోళ్ళ’ అంటే తాంబూలం వేయు నోళ్ళతో అన్నమాట. ఎంతో స్వారస్యంగా వుంది గదా ఈ వివరం. ఇలాంటివి చాలా వున్నాయి ఈ విజయ విలాసంలో.

http://www.eemaata.com/em/issues/201205/1946.html

దేశాంతరంబోయిన భర్తల కోసం “దంపతుల తాంబూలపు నోము”, భర్త ఆదరణ కోసం “పువ్వుల తాంబూలపు నోము”, శరీరం వాసనగా ఉండడం వల్ల భర్త ఆదరించక పోతే దానికోసం “గంధం తాంబూల నోము”, వేశ్యాలోలుడైన భర్తను మందలించడం కోసం “కైలాసగిరి నోము”, మతి తప్పి ఎటో వెళ్ళిపోయిన పిచ్చి భర్తకోసం “కుంకుమ గౌరీ నోము”, భర్త కాశీకి వెళ్ళి తిరిగి రాకపోతే “కరుళ్ళ గౌరీ వ్రతం”, పడుచు మొగుడు రావడం కోసం “అట్లతద్ది నోము”, గుడ్డితనం పోవడానికి “కాటుక గౌరి నోము”, అన్నదమ్ముల ఆయుష్షుకోసం “బచ్చలి గౌరీ నోము”, ధైర్యంకోసం “ధైర్య గౌరీ నోము”, గండాలు పోగొట్టుకోవడం కోసం “గండాల గౌరీ నోము” ఆలుమగలు అనురాగంగా ఉండడం కోసం ” అంగరాగాల నోము”, సవతి తల్లి ప్రేమకోసం “కన్నె తులసమ్మ నోము”, సంసార శుభం కోసం “ఐదు పువ్వుల తాంబూలం నోము”, ఇంకా మిగిలిన నోములన్నీ ముత్తైదువ తనకోసం, సంతానం కోసం, అదీ మగ సంతానం కోసం, సిరిసంపదలకోసం ఆచరించేవి. వైధవ్యం, సంతానం లేకపోవడం వంటివి స్త్రీల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అన్నీ కలిగిన స్త్రీల పట్లనే వివక్ష చూపుతున్న సమాజం, తమ పట్ల ఇంకెంత క్రూరంగా ఉంటుందోనన్న (అభద్రతా) భావం నుండే వ్రతవిధానాలు పుట్టుకొచ్చాయి. వ్రత కథలను పరిశీలించినప్పుడు మరొక రూపంలో ఉన్న స్త్రీల సమస్యలుగానే ఇవి గోచరిస్తాయి. వీటికి పరిష్కార మార్గాలు సమాజంలోనే వెతుక్కోవాలి. వీటి ఆచరణలో పితృస్వామ్యం విధించిన ఆంక్షలు, ఆంక్షాతిక్రమణల ఫలితాలు ప్రాచీన మానవ మనస్తత్వాన్ని, మత స్వరూపాన్ని, స్త్రీల అసహాయతలను తెలియజేస్తాయి.

 మన తెలుఁగు పంచమహాకావ్యాల్లో ఒకటిగా పరిగణించబడిన పాండురంగ మాహాత్మ్యము అనే మహాకావ్యాన్ని తెనాలి రామకృష్ణకవీంద్రుడు విరూరి వేదాద్రి మంత్రికి అంకితమిచ్చి అతడిని అమరుణ్ణి చేశాడు. ఈ వేదాద్రి మంత్రి పొత్తపినాటి చోడ ప్రభువైన పెద్ద సంగభూపాలుని వద్ద వ్రాయసకాడు. కృతి స్వీకరించే సందర్భంలో వేదాద్రి మంత్రి మహాకవికి తాంబూలం ఇచ్చాడు. కవి ఆ తాంబూలాన్ని ఈ రమణీయమైన పద్యంలో వర్ణిస్తున్నాడు.

గ్రామంలో ‘రజకులు’ కొన్ని కుటుంబాలకు ఒక కుటుంబం చొప్పున రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతూ ప్రతి దినం అన్నం పెట్టించుకొని వెళ్ళేవారు. పదవులు నిర్వహించే వారు, భాగ్యవంతులు చాకలికి ‘ఇస్త్రీ పెట్టె’(iron box) ఇచ్చి బట్టలు ‘చలువ’ చేయించుకొనే వారు. సంవత్సరానికి కుటుంబానికి నిర్ణయించిన ‘మేర’ ప్రకారం ధాన్యం వగైరా తీసుకనే వారు. చాకలి వాళ్ళే రైతుల సహాయంతో ‘బట్టీ’ల ద్వారా సున్నం తయారుచేసి కుటుంబానికి కావలసినంత ఇచ్చేవారు. తాంబూలం వేసుకొనే వారికి వీరు ప్రత్యేకమైన సున్నం ఇచ్చేవారు. పెళ్ళి మొదలైన శుభకార్యాలకూ, దైవకార్యాలకూ రజకులు పందిళ్ళు వేసి మామిడి తోరణాలు కట్టేవారు. వంట చెరకు విషయంలో కూడా వీరు రైతులకు ఎంతో సహకరించే వారు.

‘‘పరగడుపున, సభలోపల,

తరుణుల యెడ, భుక్తమైన తరియొక విడెమున్‌

దొరకని నరునకు సౌఖ్యము

కరువప్పా కుందవరపు కవి చౌడప్పా!’’

 

‘ఆయన పండితుడు. కొత్తగా పెండ్లయింది. అత్త గారింటికాడ అల్లెం తింటుండాడు. ఆ రోజు మద్దేన్నం పంచభక్ష పరమాన్నాలతో కడుపునిండా తిని కూచున్నేంక తాంబూలం పల్లెం ఆయప్ప ముందుంచింది మరదలు పిల్ల. ఆకు వక్క కుంకం పువ్వు … అన్ని సంబారాలుండాయి గాని సున్నం లేదు … ఆ పక్కా ఈ పక్కా చూసిండు. వాకిలి సాటున మరదలు కనబడేతలికి తన పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకున్నేడు …

‘‘పర్వత శ్రేష్ట పుత్రికా పతివిరోధి

యన్న పెండ్లాము యత్తను గన్న తండ్రి

పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ

సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి’’ అని నవ్వుతూ అడిగిండు.

అంటే అర్థమేంది? ఎవురికెన్నా తెలుసునా? … పదం పదం ఇడదీసుకుంటా పోతే ‘‘ఓ పెద్దమ్మా! ఓ దరిద్ర దేవతా! సున్నం తీసకరా!’’ అని.ఆమెకు అర్థమైంది. చిన్నప్పట్నించి తండ్రికాడ పురాణాలు సదూకున్నె పిల్లగాబట్టి పద్యాన్ని అర్థం జేసుకున్నది. తండ్రి నుంచి నేర్చుకొన్నె పాండిత్యాన్ని ఆమె వృధాగా పోనీదల్చుకోలే … దొడ్లోకి పోయి సున్నం తీసుకొని పచ్చి బావకు అందించబోయే లోపల ఆయప్పకు సమాధానంగా ఇంకో పద్యం అల్లుకొన్నెది.బావకు సున్నం అందిస్తా …

శతపత్రంబుల మిత్రుని

సుతు జంపినవాని బావ సూనుని మామన్‌

సతతము తలదొల్చిన సును

సుతవాహన వైరివైరి సున్నంబిదిగో …అంటూ పద్యం చెప్పింది.దాని అర్థం ‘‘ఓ కుక్కా! ఇదుగో సున్నం …’’ అని.అతను తేటగీతలో అడిగితే -ఆమె కందంలో అందంగా చెప్పింది.

దేవదాసు సుబ్బరామన్‌ విషయంలో కూడా విషాదాంతమే. ఆ పాటల ప్రజాదరణను ఆయన చూడడం జరగనేలేదు. నిర్మాతలతో ఘర్షణ ఆయనకు ప్రాణాంతకమే అయింది. సుబ్బరామన్‌ ఒకసారి తాను ఏర్పాటుచేసిన రికార్డింగ్‌కు ఘంటసాల రాలేదని అలిగి “ఓ దేవదా” వగైరా పాటలన్నిటినీ మొదట్లో పిఠాపురంచేత పాడించారట. ఆ తరవాత రాజీ కుదిరి “కుడి ఎడమైతే,జగమే మాయ” వగైరాలు రికార్డు చేశారట. వ్యక్తిగత స్పర్ధలవల్ల జరిగినవే అయినా ఇవన్నీ సుబ్బరామన్‌ వ్యక్తిత్వాన్ని సూచించే విషయాలు. దీన్ని బట్టి సుబ్బరామన్‌ కల్పనాశక్తి ఎంతటి వేగంతో పరుగులు తీసేదో, ఇతరులపట్ల ఆయనకు ఓర్పు ఎంత తక్కువగా ఉండేదో తెలుస్తుంది. క్రియేటివ్‌ కళాకారుడి రెస్ట్‌లెస్‌నెస్‌ ఆయనలో ఎక్కువగాఉండేదేమో. ఆయన అద్భుతంగా పాడి, హార్మోనియం వాయించే వారట. పచ్చనిచాయతో, ఎప్పుడూ తాంబూలం నములుతూ అందర్నీ నవ్వుతూ పలకరించేవారని మా నాన్న(కుటుంబరావు)గారు నాతో అనేవారు. అన్నట్టు “ఓ దేవదా” యుగళగీతం తానే పాడాననీ, నిర్మాతతో గొడవల వల్ల కె.రాణి పేరు వేశారనీ జిక్కీ ఒకసందర్భంలో చెప్పారు. ఆ పాటలో ముందు “ఓహోహో” అన్నది మాత్రం రాణి. అది తరవాత తెచ్చి, అతికించినట్టుగా కాస్త వేరు శ్రుతిలో వినిపిస్తుంది.

రాజులు కవుల్ని ఏవో కావ్యాలు రాసి తమకు అంకితం ఇవ్వమని అలాటి సభల్లో అడిగేవారు (మనుచరిత్ర పీఠిక నుంచి ఇది స్పష్టం). అలాటి సభల్లోనే కవులు తమ కావ్యాల్ని అంకితం ఇచ్చేవారనటానికి సూచాయగా ఆధారాలున్నాయి (కావ్యం రాయమని అడిగే సమయంలో కర్పూర తాంబూలం ఇవ్వటం, కావ్యాన్ని తీసుకునే సమయంలో ఇంకా పెద్ద పెద్ద దానాలు అంటే అగ్రహార, గో, హిరణ్య దానాల్లాటివి ఇవ్వటం జరిగినట్లు నమ్మవచ్చు. కాని అలాటి కృతిసమర్పణ సమయంలో జరిగే కార్యక్రమాలు ఏవో మనకు తెలీదు.  

మనువులలో స్వారోచిష

మనుసంభవ మరయ రససమంచిత కథలన్‌

విననింపు కలిద్వంసక

మనఘ భవచ్చతురరచన కనుకూలంబున్‌

 

 

ప్రబల రాజాధిరాజ వీరప్రతాప

రాజపరమేశ బిరుదవిభ్రాజి యెవ్వ

డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు

డొక్కనాడు కుతూహలంబుప్పతిల్ల

భువనవిజయాఖ్య సంస

ద్భవన స్థిత భద్రపీఠి ప్రాజ్ఞులగోష్టిన్‌

కవితామధురిమ డెందము

తవులన్‌ కొలువుండి సదయతన్‌ నను-అంటే

హితుడవు చతురవచోనిధి

వతుల పురాణాగమేతిహాస కథార్థ

స్మృతియుతుడ వాంధ్రకవితా

పితామహుడ వెవ్వరీడు పేర్కొన నీకున్‌

 పల్కెన్‌'..కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పుమని కర్పూరతాంబూలంబు వెట్టినం పట్టి మహాప్రసాదం బని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకు ప్రారంభించితి నేతత్కథా నాయకరత్నంబగు నమ్మహీనాథు వంశావతారం బెట్టిదనిన

పరదేశి బ్రాహ్మడొకడు ఆ తిరునాళ్ళకి వచ్చి రాజపురోహితుడి యింట్లో విడిదిచేసేడు. తిరునాళ్ళు చూసి, అతని ఆతిథ్యంలో చక్కటి భోజనం చేసి, తన వూరికి ప్రయాణమయ్యేడు. రాత్రయింది. దార్లో మథురలో ఓ అరుగు మీద మిగిలిన బాటసారుల్తో కలిసి విశ్రాంతికి సంచి తలగడగా పెట్టుకు పడుకున్నాడు. కాలక్షేపానికి సుభాషితాలు పాడటం మొదలెట్టేడు.

రాయలు రాసిన ఆముక్తమాల్యదలో సందర్భం వచ్చినప్పుడల్లా తాంబూలం ప్రసక్తి వస్తూనే వుంటుంది.ఇది చూడండిః

సరిగ్గా అదే సమయంలో మత్స్యధ్వజ మహారాజు తన భోగిని దగ్గరికి బయల్దేరేడు. అప్పుడతనికో సుభాషితం వినిపించిందిలా

“వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలల్లో కూడగడతాం. రాత్రికి కావలసింది పగలు. ముసలితనానికి కావలసింది యవ్వనంలో. అలాగే పరలోకానికి కావలసింది కూడ యీ లోకంలోనే సమకూర్చుకోవాలి.”

పిడుగుల్లా తగిలేయా మాటలతనికి. తన స్థితిని తల్చుకునే సరికి దుఃఖం వచ్చింది. చక్రవర్తుల్నీ మహాపురుషుల్నీ కూడా ఏట్లో నావలా కదిలీ కదల్నట్టు కదిలి కాలం ఎలా మోసం చేసిందో ఆలోచించుకున్నాడు. మెరుపులాటి క్షణికమైన రాజభోగాల గురించి కాక శాశ్వతమైన సత్యం గురించి విచారించాలనుకున్నాడు.

తాంబూలం పెట్టెలోంచి కొంత ముల్లె తీసి తలారి చేత ఆ బ్రాహ్మడికిప్పించేడు. వెనక్కి తిరిగి యింటికి వెళ్ళేడు. ఉదయాన్నే కొలువు తీరి విద్వాంసులందర్నీ పిలిపించేడు. శాస్త్రాలన్నీ చూసి మోక్షం వచ్చే మార్గం ఏమిటో కనుక్కుని చెప్పమన్నాడు. వాదం గెలిచి తనకు తత్వం చెప్పగలిగే వారికని బీరపువ్వుల్లాటి బంగారునాణేల్ని జోలెలో పోయించి వేలాడదీయించాడు సభలో!

తలగడగా రుక్మిణి తొడలు. కాళ్ళొత్తుతూ సత్యభామ. సురటి (గుండ్రటి విసనకర్ర)తో భద్ర. వింజామర వీస్తూ మిత్రవింద. కాళంజి (తాంబూలం వూసే పాత్ర) ధరించి కాళింది. తమలపాకులిస్తూ జాంబవతి. గొడుగు, పాంకోళ్ళు పట్టుకుని నాగ్నజితి. నీళ్ళ గిన్నెతో లక్షణ మెరుపుతీగల పక్క నల్లమబ్బులాగా అష్టభార్యల్తో కృష్ణుడుంటే నిండు నెలవంకలా అక్కడికొచ్చింది శుచిముఖి!

ఆడవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు అలా నదురు బెదురూ లేకుండా వస్తున్న రాజహంసిని చూసి.(ప్రబావతీ ప్రద్యుమ్నం-

గురజాడగారి కన్యాశుల్కంలోని  “వీళ్ళమ్మా శిఖా తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే! తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి” అన్న వాక్యం నేటికీ ప్రజల్లో వినబడుతుంది.తాంబూలమెంత కాలముంటుందో అంతకాలం దాని స్థానం జనహృదయాల్లో.

 

 

      పలుకుం దొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలు నయ్యింతి చె

    క్కులఁ బోలుం దెలనాకులయ్యువిద పల్కుల్వంటి కప్రంపుఁ బ

    ల్కులతోఁ గూడిన వీడియంబొసఁగు నాకుం బద్మనాభార్చనా

    కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్

 

సరస్వతీదేవి (పలుకుల తొయ్యలి) పెదవుల (మోవి) కాంతికి సమానమైన (ఎనయౌ) పోకచెక్కలు (బాగాలు); [మౌళి కాంతి కెనయౌ - అనే పాఠాంతరం కూడా ఉంది. సర్వశుక్లాం సరస్వతీ అన్నారు; ఆవిడ ఆపాదమస్తకం తెలుపేనట!] ఆ ఇంతి చెక్కులను పోలే పండుతమలపాకులు (తెలనాకులు); [తమలపాకుల్లో కవటాకులెంత భోగమో పండుటాకులు అంతకంటే భోగమట] ఆమె పలుకులవంటి పచ్చకర్పురపు పలుకులతో కూడిన తాంబూలాన్ని ఇచ్చాడట. ఏ చేతులతో అయితే పద్మనాభస్వామిని నిత్యం అర్చిస్తాడో ఆ చేతులతో – కంకణాలు ఝణఝణ ధ్వనులు చేస్తున్న ఆ హస్తాలతో ఈయనకి తాంబూలం అందించాడట. http://www.eemaata.com/em/issues/201201/1876.html

తెనాలి రామకృష్ణకవి పాందురంగ మాహాత్మయంలో తాంబూల ప్రస్తావన-ఇంతలో ఒకరోజు ఉన్నట్టుండి “చుక్క తెగిపడిన వడుపున” ఇంటికి వచ్చాడు నిగమశర్మ. చాలా రోజుల తర్వాత చూసింది గదా అని కౌగిలించుకోబోయింది కాని, వాడి వంటినిండా నఖక్షతాలున్నాయిట. వాటిని చూసి అసహ్యించుకుంది. పాపం మనసులో కూడా అపవిత్రతకు తావీయక దేవతార్చనలు గావించుకునే ఇంటి ఇల్లాలు గదా. ఐనా వాడిని విముఖుని చేసుకోరాదనే సంగతి తెలుసు. మేనల్లుని ఎత్తుకోమని అందించింది. నిమిషంలో శాకపాకాలు తయారు చేస్తాను, మీ బావతో కలిసి భోంచేద్దువు గాని, స్నానం చేసి రమ్మంది. అతనికి చేయవలసిన ఉపచారాల కోసం మరదలికి కనుసైగ చేసింది. అభ్యంగన స్నానం చేయించింది. ఉతికిన ధోవతీ, ఉత్తరీయమూ ఇప్పించింది. తల తానే శుభ్రంగా తడి లేకుండా తుడిచింది. ఒంటికి గంధం రాచింది. తలలో పూలు తురిమింది. బావా తలిదండ్రుల పంక్తిలో కూర్చోబెట్టి షడ్రసోపేతమైన భోజనం వడ్డించింది. అనంతరం, అరుగు మీద కూర్చుని వుండగా మరదలి చేత తాంబూలపు చిలకలు ఇప్పించింది. తనూ తమ్ముని దగ్గరకు చేరింది. చంటి పిల్లవాడిని ఎత్తుకుని, వాడికన్నా ముందువాడు తన పక్కపక్కనే తిరుగుతూ వుండగా, తమ్ముడి తలముడి విప్పింది. ఈరువానతో (పెద్ద పండ్లు గల దువ్వెన) తలవెండ్రుకల చిక్కు తీసి దిగ దువ్వి, కుచ్చు విడదీసి పైకెత్తి, పేలను గాలించి గోరుముక్కులతో నలిపింది. లేచి శుభ్రంగా (గరగరగా) చేతులు కడుక్కొని వచ్చింది. మరదలు తనకు తాంబూలం ఇస్తే నోట పెట్టుకున్నది. మరదలు విసనకర్రతో విసురుతూ పక్కన నిలబడి వుండగా, దాసీ తెచ్చిన పీటపై కూర్చుని, బిడ్డ చనుబాలు త్రాగుతూ వుండగా, కుడివైపుకు కొంచెము ఒత్తిగిల్లి, పద్మవనంలో కొలువున్న లక్ష్మీదేవిలా కూర్చొని, తమ్మునికి హితబోధ ప్రారంభించింది. ఇది రెండో నేపథ్యం.

http://www.eemaata.com/em/issues/200907/1446.html

శ్యామశాస్త్రి, త్యాగరాజు మంచి స్నేహితులని సాంబమూర్తి గారు ‘ది గ్రేట్ కంపోజర్స్’ లో రాస్తూ ఓ కథ చెప్పారు. శ్యామశాస్త్రికి తాంబూలం అలవాటు ఎక్కువగా ఉండేది. అస్తమానూ ఉమ్మి వేయడానికి కూర్చున్న చోటునుండి లేచి బయటకు వెళ్ళేవాడు. త్యాగరాజుకి ఎంతో శుభ్రతా నియమాలున్నా శ్యామశాస్త్రి వచ్చినప్పుడు మాత్రం ఆయనకు మినహాయింపుండేదని చెబుతూ కథలా రాసారు. ఇలాంటి కథలకి ఆధారాలేమిటో తెలీదు. శ్యామశాస్త్రి ఆలయ అర్చకుడు. అలా పదిమంది ముందూ తాంబూలం నమిలినా, అక్కడే ఉమ్మి వేసే ప్రవర్తనుంటుందని ఎవరూ భావించరు. ఇలాంటి కథలు పదిమందికీ చెప్పడంలో ఆంతర్యమేమిటో తెలీదు. ఈ కథ ఇద్దరు వాగ్గేయకారుల్నీ ఓ మెట్టు క్రిందకే దింపుతుందని నా అభిప్రాయం. ఈ ఒక్క సంఘటనా తప్ప, సంగీత పరంగా వేరే సంఘటనలు ఎవరూ ఉటంకించలేదు. త్యాగరాజు చరిత్ర రాసిన వెంకటరమణ భాగవతార్ కానీ, ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కానీ, మిగతా శిష్యులు కానీ ఎవరూ శ్యామశాస్త్రి గురించి రాయలేదు. 

http://www.eemaata.com/em/issues/200905/1435.html

ఎంతో సహజంగా, మనోహరంగా, సాంసారికంగా, ఆత్మీయంగా వున్నది గదా ఈ దృశ్యం. ఇంత చక్కని ఛాయాచిత్రాలతో, ఎంతో ప్రతిభతో నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాడు రామకృష్ణ కవి. అక్క ఇక ఉపదేశం ప్రారంభించింది. ఆ సందర్భంలోని మొట్టమొదటి పద్యం మనం పైన చదువుకున్నది.

“కూపోదకం, వటచ్ఛాయా, తాంబూలం, తరుణీకుచం, శీతకాలే భవేదుష్ణం, ఉష్ణకాలేతు శీతలం” శ్లోకం ఇంకా ఇష్టం. ఇందులోనే “నిరుపహతిస్థలంబు” పద్యంలో వున్న కప్పురవిడెము కీ, “మృగమద సౌరభ” పద్యంలోని “మగువ పొలుపు తెలుపు” మృగమద తాంబూలానికీ వున్న బాదరాయణ సంబంధం కూడా వివరించేరు. 

తాంబూలాలు మార్చుకోవడం ... తాంబూలం సమర్పించడం ... తాంబూలం వేసుకోవడం ... ఇలా తాంబూలానికి మన ఆచార వ్యవహారాలలో అగ్రస్థానం వుంది. అయితే అలాంటి తాంబూలం ఎప్పుడు వేసుకోకూడదనేది కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా భోజనం చేశాక వెంటనే తాంబూలం వేసుకుంటూ వుంటారు. అయితే ఆ భోజనంలో కొన్ని రకాల పదార్థాలు వాడినప్పుడు ... కొన్ని రకాల వ్యాధులు వున్నప్పుడు తాంబూలం వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.ఇస్లామీయ సాంప్రదాయాలను గౌరవించడం వల్ల విజయనగర రాజాస్థానంలోకి కబాయి వచ్చినా, దాని వాడుక మరింతగా వేళ్ళూనడానికి ఇంకో కారణం ఇస్లామీయ సంప్రదాయమైన ఖిల్’ఆత్ – రాజులు రాయబారుల ద్వారా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం. ఈ సంప్రదాయం, రెండు రాజ్యాల మధ్య దౌత్య సంబంధాలని నిర్ధారిస్తుంది. ఖిల్’ఆత్ లో సామాన్యంగా దుస్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ దుస్తులు ఆ రాజాస్థానపు దుస్తులను పోలి అత్యంత ఖరీదైనవి, మేలిమి నాణ్యత గలవీ అయివుంటాయి. ఈ రకమైన ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం ఎప్పటినుంచో హిందూ సాంప్రదాయంలో వుంది. అయితే, విజయనగర రాజుల కాలపు వాడుకలో ఇది ఇస్లామీయ సాంప్రదాయానికి చేరువయింది. పట్టుపంచలు, సుగంధ ద్రవ్యాలు, రత్న హారాలు, తాంబూలం ముఖ్యంగా ఉండే హైందవ సాంప్రదాయం కొంచెం మరుగై, పట్టుపంచల స్థానే మేలిమి పట్టుతో నేసిన కబాయి, తలపాగాల స్థానే కుళ్ళాయి వచ్చి చేరాయి. విజయనగర సైన్యంలో టర్కీ యోధుల దళాలు, వాణిజ్యంలో అరేబియా, పర్షియా మారకులు, ఇరుగు పొరుగు ముస్లిం రాజ్యాల దౌత్యవేత్తలు, విజయనగర ప్రజానీకంలో ప్రధానభాగమైన ఈ కాలంలో ఈ మార్పు మరింత ప్రస్ఫుటంగా రాజాస్థాన సాంప్రదాయంగా మారడంలో అనౌచిత్యమేమీ లేదు

ఇస్లామీయ సాంప్రదాయాలను గౌరవించడం వల్ల విజయనగర రాజాస్థానంలోకి కబాయి వచ్చినా, దాని వాడుక మరింతగా వేళ్ళూనడానికి ఇంకో కారణం ఇస్లామీయ సంప్రదాయమైన ఖిల్’ఆత్ – రాజులు రాయబారుల ద్వారా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం. ఈ సంప్రదాయం, రెండు రాజ్యాల మధ్య దౌత్య సంబంధాలని నిర్ధారిస్తుంది. ఖిల్’ఆత్ లో సామాన్యంగా దుస్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ దుస్తులు ఆ రాజాస్థానపు దుస్తులను పోలి అత్యంత ఖరీదైనవి, మేలిమి నాణ్యత గలవీ అయివుంటాయి. ఈ రకమైన ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం ఎప్పటినుంచో హిందూ సాంప్రదాయంలో వుంది. అయితే, విజయనగర రాజుల కాలపు వాడుకలో ఇది ఇస్లామీయ సాంప్రదాయానికి చేరువయింది. పట్టుపంచలు, సుగంధ ద్రవ్యాలు, రత్న హారాలు, తాంబూలం ముఖ్యంగా ఉండే హైందవ సాంప్రదాయం కొంచెం మరుగై, పట్టుపంచల స్థానే మేలిమి పట్టుతో నేసిన కబాయి, తలపాగాల స్థానే కుళ్ళాయి వచ్చి చేరాయి. విజయనగర సైన్యంలో టర్కీ యోధుల దళాలు, వాణిజ్యంలో అరేబియా, పర్షియా మారకులు, ఇరుగు పొరుగు ముస్లిం రాజ్యాల దౌత్యవేత్తలు, విజయనగర ప్రజానీకంలో ప్రధానభాగమైన ఈ కాలంలో ఈ మార్పు మరింత ప్రస్ఫుటంగా రాజాస్థాన సాంప్రదాయంగా మారడంలో అనౌచిత్యమేమీ లేదు

 

మధుమేహం ... చర్మరోగం ... క్షయ ... శ్వాస ... నేత్ర పరమైన వ్యాధులతో బాధ పడుతున్నప్పుడు, పైత్యం ... జ్వరం ... అతి మూత్రం ... అతిదాహం మొదలైన వ్యాధులు వున్నప్పుడు తాంబూలం వేసుకోకూడదని ఈ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే భోజనంలో అరటిపండు ... మామిడి పండు ... పనసపండు ... పాలు ... నేతి పదార్థాలు వాడినప్పుడు తాంబూలం వేసుకోకూడదని చెబుతున్నాయి. కనుక ఆరోగ్యానికి హాని చేసే ఈ సందర్భాల్లో తాంబూలం వేసుకోకపోవడమే అన్నివిధాలా మంచిది.

మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది. ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది.

 

హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులను చేర్చి ఇవ్వడం తెలిసిందే.

 

ఇలా తమలపాకులను ఇవ్వడం వల్ల సర్వవిధాలా శుభం చేకూరుతుంది. అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని పండితులు చెప్తున్నారు.

 

ఇక ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. అలాగే ఆయుర్వేద శాస్త్రం తమలపాకు సేవనం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది.

            పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం వుండేది.  ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము పెద్ద కుటుంబము.  ఆయనకు ముగ్గురు కుమారులు పెద్ద వారిద్దరికీ వివాహాలు అయి చక్కగా జీవిస్తున్నారు.  మూడవవానికి కూడా వివాహం చేశాడు.  అదేమీ ప్రార్బ్ధమోగాని ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోను చీటికి మాటికి గొడవలు జరుగుతుండేవి.  అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భాశలాడుతుండేవారు.  వారందరితో ఎంతో మంచిగా మసలుకోవాలన్న ఆమెకు సాధ్యమయ్యేది  కాదు.  

           కాలం గడచి పోతున్నదేకాని పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు నిష్టూరాలు ఎక్కువై పోయాయి.  అందుకు తమవల్ల దోషమేమితో తెలియని ఆ చిన్న కోడలు వారందరి మధ్య మసలుకోలేక ఒకనాటి రాత్రి ఊరూ పోలిపెరలోని శివాలయానికి వెళ్లి గోడుగోడున విలపించాసాగింది.  తనతప్పేమిటి ఈ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి, చావే నాకు శరణ్యమా!  అని అమాయకంగా ప్రశ్నించింది.  ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి బిడ్డా నీ వలన దోషమేమిలేదు.  నేవెంత సౌమ్యంగా వినయవిధేయతలతో మసలుకున్నా చులకనగా హేళనగా నీ జీవితమూ సాగుతుంది.  ఇందుకు గల కారణము గత జన్మలో దంపతతాంబూలాల నోము నోచి మధ్యలో ఆపివేశావు.  ఆ కారణం చేత స్త్రీలకు పురుషులకు నీపట్ల ద్వేశాభావాలు కలుగుతున్నది.  ఇది తోలగాలంటే నీవు నీ ఇంటికి పోయి దంపతతాంబూలాల నోము నోచుకో ఈ నోముకారనముగా నీ చుట్తో గల ఇరుగు పొరుగు వారు నీ ఇంటివారు మేట్టినిన్తివారు నీమీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు.  అని ప్రభోదించాడు.  

              ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్లి దంపతతాంబూలాల నోము నోచుకోని అయినవారందరిలో గౌరవమర్యాదలు మన్ననలతో హాయిగా జీవిస్తారు.  ఉద్యాపన:  పార్వతీ పరమేశ్వరులకు పీటం ఏర్పాటు చేసి శతనామావలితో ఆ ఆదిదంపతులను ఆరాధించాలి.  గుణవంతులైన దంపతులను ఆహ్వానించి వాళ్లకు తలంటి నీళ్ళు పోసి నూతన వస్త్రాలు కట్టబెట్టి పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు ఆరగిమ్పజేసి దక్షిణ తాంబూలాలతో గౌరవించి వారికి పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి.  ఇలా పదిహేను వారాలు చేసి ఆఖరున అన్న సంతర్పణ చేయాలి.  ఇలా చేయడము వలన సాతివారిలో తోటివారిలో మేటిగా గుర్తిమ్పబడి గౌరవ మర్యాదలు గల జీవితాన్ని గడపగలుగుతారు. 

 

    అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.

 

సాగుచేయు విధానం

 

తమలపాకు సంవత్సర వర్షపాతం 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.

 

మే-జూన్ నెలలలో భూమిని బాగా దున్ని చదునుచేసి ఎకరాకు 16-20 కిలోల అవిశ విత్తనాలను సాలుకు సాలుకు మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. ఈ అవిశ విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి.

 

విత్తిన 2 నెలల తర్వాత సాళ్ళ మధ్య మట్టిని చెక్కి అవిశ మొదళ్ళ వద్ద వేసి కయ్యలు చేసి వాటి మధ్య 50 సెం.మీ. లోతు 20 సెం.మీ. వెడల్పు గల గుంతలను 20 సెం.మీ. ఎడంలో తీసి ఎకరాకు 20,000 తమలపాకు తల తీగలను 6-8 కణుపులు ఉండేటట్లు ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5 % బోర్డో మిశ్రమం+250 పి.పి.యం స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధిచేసి నాటుకోవాలి. ఈ విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించాలి. నాటడానికి ముందుగా నీరు పెట్టే కాలువలు, మురుగునీరు కాలువలను చేసుకోవాలి. చలి మరియు ఎండాకాలాల్లో తోటల చుట్టూ గాలులు సోకకుండా దడలు కట్టుకోవాలి.

 

తీగలు నాటిన మొదటి ముడు రోజుల వరకు రెండు పూటలా నీరు కట్టాలి. తర్వాత రోజూ ఒక పూట (సాయంత్రం) మాత్రమే కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు కట్టాలి. తర్వాత 10 రోజుల కొకసారి ఒక తడి చొప్పున నీరు పెట్టాలి. వేసవి కాలంలో 2-3 రోజులకొకసారి తడి ఇవ్వాలి.

 

చిగురించిన తీగలను, పెరగడానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిశ మొక్కలను కట్టి ప్రాకించాలి. ఈ పనిని 15-20 రోజుల కొకసారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిశ మొక్కలు వంగే ప్రమాదమం ఉండడం వలన వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి, సాలు చివర నాటిన వెదురు గడలకు కట్టాలి. సరిపడేటంత వెలుతురు, నీడ ఉండేలా అవిశ కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. రెండు సంవత్సరాల కొకసారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి.

 

తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం, 40 కిలోల పొటాష్ వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి నత్రజనిని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి + యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేసుకోవాలి.

 

నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులకు ఇనుప గోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో తోట నుండి ఎకరాలు 30,000 నుండి 40,000 పంతాలు (పంతం అంటే 100 ఆకులు), రెండవ సంవత్సరంలో 40,000 పంతాల దిగుబడి వస్తుంది.

తమలపాకు

 

ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది. ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం వుంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.

ఆరోగ్యకరమైన ఉపయోగాలు :

 

ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.

 

తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.

 

నూనెలూ ఇతర తైల పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె... ఇలాంటి నూనెలు చెడిపోకుండా వుండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వచేయండి.

 

తమలపాకులో ‘చెవికాల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.

 

తమలపాకులో ఉండే స్థిర తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.

 

ఒక ముఖ్య విషయం. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.

 

తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.

 

తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.

 

తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.

 

ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.

 

రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.

 

రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.

 

స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.

 

తమలపాకు రసం, తేనె సమపాళ్లలో కలిపి కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. (వైద్య పర్యవేక్షణ అవసరం) తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.

 

తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి. తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం) గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది. తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి. ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

 

చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.

 

తమలపాకు కాండంను (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.

 

పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.

 

హిస్టీరియాలో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.

 

తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది. తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.

 

తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం) తమలపాకును కడుపులోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్థంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.

 

తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.

 

తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

 

తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.

తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.

తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.

శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.

తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.

తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.

అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు

తాంబూలం

తాంబూల చర్వణం ఆరోగ్యానికి మంచిది.జాజికాయ,జాపత్రి,లవంగం,ఏలకులు,కాసు,ఒకింత కలకండ

గుల్లసున్నం,వక్కపొడి తగుమాత్రంగా వేసుకొని తాంబూలం సేవించాలి.తమలపాకులు నీటితో కడిగి ,తుడిచి వాటికోసలు తుంచి, కాడలు తుంచి ,ఆకుని వెనకకు మడిచి మధ్యనున్న ఈనె తీసి అప్పుడు ఆకులకి సున్నం రాసి తాంబూలం సేవించాలి.

ఈపద్యం చూడండి-

పత్ర మూలంబునను రోగపటలమున్డు

అగ్రమది పాపములకెల్ల అతి ప్రియమ్బు

నడిమి ఈనియి బుద్ది వినాశ కరము

వీని వర్జించి తగచేయు వీడియంబు

తాంబూలాలిచ్చేసాం!

"చేటీ భవన్ నిఖిల భేటీ .....

పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరి పాటీం

ఆగాధిప సుతా! ఘోటీ ఖురా దధిక ధాటీ ముదార

ముఖ వీటీ రసేన తనుతాం."

శ్రీ కాళిదాసు „ దేవీ స్తుతి శ్లోక త్రయోదశి“లో ప్ర ప్రధమ శ్లోకములోని నాలుగవ పంక్తి.

"కడిమి చెట్లు కల కదంబ ఉద్యాన వనములలో సమస్త దేవతా వనితలూ చెలికత్తెలై, వయ్యారంగా ఆమెను అనుసరిస్తూన్నారు.స్వర్గ లోక నివాసులైన దేవతా సమూహములు ధరించిన కిరీటాలకు చెందిన మిక్కిలి మనోజ్ఞమైన మణుల కిరీట కాంతులు,దేవీ పద పద్మముల పైన వ్యాప్తి చెందినవి.

నగాధిపుని కుమార్తె ఐన పార్వతీ దేవి తాంబూలమును సేవించినది.

ఆ వీటీ రసముము వలన పరిసరాలు అన్నీ పరిమళ భరితమౌతూన్నాయి.

అట్టి మహిమోపేతమైన తాంబూల రసము అశ్వ ధాటిని మించిన ఆశు కవితా శక్తిని నాకు ప్రసాదించును గాక!"

అని కాళిదాసు ప్రార్ధన చేసాడు.

ఘోటీ ఖురాత్ = " ఆడు గుఱ్ఱముల గిట్టల కంటే ఎక్కువ వడి, ధాటి గల కవిత్వ పరి పాటిని వృద్ధి చేయ వలె"నని

మహా కవి కాళి దాసు మనసారా తల్లి గిరిజా దేవిని వేడుకున్నాడు.

తన కవిత్వము సర్వ జన ఆమోదం పొందాలని వాంఛిస్తున్న కాళిదాసు ఉపమానము,

తల్లి పార్వతీ దేవి సేవించిన వీటికామోదము!

మహా కవి రచనలలో ప్రముఖ స్థానము గడించిన ఈ తాంబూలము

క్రీస్తు పూర్వము నాటి నుండియే భారత దేశములో ప్రజల నిత్య వాడుకలో ఉండేది.

తాంబూలంలో రవంత సున్నము రాసి, వక్కాలను చేర్చి నమిలితే ,

" నోరు ఎర్రగా పండుతుందని" కనిపెట్టినారు;

ప్రతి రోజూ భోజనానంతరం తమల పాకులను వేసుకునే భారతీయులు భోజనమును కళగా మలిచారు!

@త్యాగరాజు ఒక సాంప్రదాయ భజనలో అంటారు.....

"శ్వేతనాగవల్లీ దళసంయుత పూగీఫల సకలం రుచిరం

కర్పూరాంచిత చూర్ణసమన్విత తాంబూలం స్వీకురు వరదా

జయజయ దేవాదిదేవవిభో జయ గోపాలకృష్ణ కృపాజలధే......."

"తాంబూల చర్వణంబులన్ పుణ్య కథా శ్రవణంబులన్ పొందుచు"రని‚

"కాశీ ఖండము"లోని వర్ణన.

ఎక్కువ సేపు నమిలే కొద్దీ తాంబూల రసము యొక్క రుచి అధిక తమమౌతుంది.

అందులకే అది"తాంబూల చర్వణము" గా నుడికెక్కినది.

మన దేశములో తాంబూలం తయారీ అద్భుత కళగా వృద్ధి గాంచినది.

కస్తూరి, ముత్యాల పొడి, లవంగము, గంధము ఇత్యాదులు జత చేర సాగాయి .

1. పండుటాకుల కర్పూర భగములను చొక్కమౌనట్టి – మౌక్తిక చూర్ణమమర (గయోపాఖ్యానము)

2. ఖండిత పూణీ నాగర ; _ ఖండంబుల ఘన శశాంక ఖండంబులచే;

- హిండితమగు _ తాంబూలము (ఆముక్త మాల్యద);;;;;;;

శ్రీ నాధుడు తన రచనలలో ప్రజలు తినే ఆహార పదార్ధములలోని

ప్రతి చిన్న అంశాన్నీ విపులంగా వర్ణిస్తూ,

చదువరుల నోళ్ళలో లాలాజలము ఊరేటట్లు చేసాడు.

 

"తమ్ములము సేయుచో నొక్క తలిరు బోణి " (శ్రీ నాధ నైషధము)

 

క్రమ క్రమముగా తమల పాకులకు (betle leaves) సంఘంలో ప్రముఖోన్నత స్థానం లభించింది.

కేవలం భోజనానంతర సేవనమునకు మాత్రమే పరిమితం అవ్వలేదు;

గౌరవ మర్యాదలకు ప్రతీకా స్వరూపిణిగా రూపు దాల్చినది మన తాంబూల విడియం గారు.

 

అగ్ర తాంబూలం, తాంబూలం పుచ్చు కొనుట ఇత్యాదిగా

నిజ జీవిత మర్యాదా మన్ననల పాటవముతో పెన వేసుకున్నది.

చక్ర వర్తులు, ప్రతిభా పాటవములను వెలువరిచిన కవి పండితులకు,సైనికులకు, ఉద్యోగులకు

బిరుదులను ప్రదానం చేస్తూ సత్కరించేటప్పుడు

"తాంబూలములో దక్షిణ పెట్టి మరీ ఇచ్చే వారు.

ఈ సంప్రదాయము నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతూన్నది కదా!

"అగ్ర తాంబూలం ఇవ్వడము" ప్రత్యేక గౌరవ స్థానాన్ని ఇచ్చుట అని అర్థము.

 

తాంబూలాలు పుచ్చుకున్నారు -

“ ఇరు కుటుంబాలలోని అబ్బాయికీ, అమ్మాయికీ పరిణయమును ఖాయం చేయుట – అని ఇట్టే అర్థమౌతుంది.

"నిశ్చయ తాంబూలాలు" అనగా,"ఫలానా యువతీ యువకులకు/ పిల్ల, పిల్ల వాడికీ వివాహం జరుగుతుంది." అంటూ పది మంది ఎదుట ప్రకటన చేసే సందర్భంలో, చేసుకునే వేడుక; ఫలానా తేదీన జరగ బోయే పెళ్ళికి

ఇది శుభారంభము అన్న మాట.

అందరి ఎదుట, మగ పెళ్ళి వాళ్ళూ, ఆడ పెళ్ళి వారూ పరస్పరమూ వక్కలను ఉంచిన తాంబూలమును ఇరు పక్షముల వారు ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం విశిష్టంగా ఆచరణలో ఉన్నదే కదా!

 

ఇంత విపులంగా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు;

" తాంబూలాలు పుచ్చు కున్నారు" అనగానే,

ఈ యావత్తు సీనూ, మన మనో నేత్రంలో చిటికెలో సాక్షాత్కరిస్తుంది,

అంటే ఈ మహోన్నత సాంప్రదాయం యొక్క విలువ అమోఘమైనదే కదా!

 

తొలి ప్రబంధము "మను చరిత్రము"లో

కవి అల్లసాని పెద్దన ఈ "బీటిల్ లీవ్సు బొత్తుల" సంరంభాన్ని మిళాయించాడు.

"మృగ మద సౌరభ విభవ - ద్విగుణీకృత ఘన సార సాంద్ర వీటీ గంధ స్థగితేతర పరిమళమై;

మగువ పొలుపు తెలుపు నొక్క మలయ మారుత మొలసెన్.“

 

వరూధినీ ప్రవరాఖ్య ఘట్టములో

తాంబూల పరిమళాలను లాలిస్తూ, మోసుకు వచ్చిన "చిరు గాలి" ధన్యమైనదే!

 

ఆకులలో కెల్లా మేలైన ఆకు ఇది.

"ప్రోక మ్రాకుల సొంపు మురువు కొనగ........" అన్నది "కాశీ ఖండము" .

 

తాంబూల విడెపు తయారీలో పాలు పంచుకున్న వస్తువులు –

అనేక పర్యాయ పదాలతో శోభిల్లుతున్నాయి.

 

కావ్యాలలోనూ, నిఘంటువులలోనూ నవ రత్న మణులలాగా అనేక పద గుచ్ఛాలతో శోభిల్లుతూన్న

ఆ వైనాన్ని పరికించుదాము.

 

@ తమలపాకు = „ఆకు వక్క – అంటే తాంబూలము అనే భావము. ఆకు, తెల్లనాకు,

నాగ వల్లి, దళము, ఫణాధర వల్లీ దళము,వెలియాకు,తమాల పల్లవము

 

@ వక్క = పోక, పోక చెక్కలు, వక్క, వక్కలు, వక్క పలుకులు, వక్క పొడి, వీతి, సిగినాలు, పోఢము, అడ , చికినము, చికిని ( అడ కత్తెరలో పోక చెక్క వలె – అని సామెత)

 

@ కాచు = కవిరి, కాచు వడియము, కైర వడి, ఖాదిరము, ఖదిర సారము, ఖాదిర ఘటిక, అద్భుత సారము

 

@కస్తూరి = సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణ మదము, ఇట్టి గోరోజనము,

సహస్ర వేధి, లత, మోదిని

 

@కస్తూరి మృగ నాభి నుండి లభించే పరిమళ ద్రవ్యము కస్తూరి.

 

@ కర్పూరము = తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తా ఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, ఘన రసము, గంబుర, గంబూరము, గంబురా, భూతికము, లోక తుషారము, శీత కరము, శీత ప్రభము, శుభ్ర కరము, హిమ కరము, హిమ వాలుక, హిమాంశువు, సోమము, సోమ స్యంజ్ఞ

 

**************************************

 

ఇక వక్కతో పాటు, జంట కవులలాగా తప్పని సరిగా ఉపయుక్తమయ్యే కిళ్ళీ ద్రవ్యము “సున్నము“.

 

సున్నము = చూర్ణము, చుర సుధ

"చూర్ణ కారుడు" అని ,సున్నము ప్రోడక్టు చేసే వానికి గల పేరు.

 

@ జాపత్రి = జాతి పత్రి, జాపత్తిరి, జాతి కోశము, కోశి

 

@ లవంగము = కరం పువు, దివ్యము, దేవ కుసుమము, వశ్యము, ముఖ ప్రియము, శ్రీ సంజ్ఞము

 

@ ఏలక్కాయ = ఏలకి, ఏలకులు, ఏలక్కాయలు, నిష్కుటి, మాలేయము, మేష పృధ్వీక

 

 

"భోజనము చేయుట" మన భారత దేశములో ఒక కళా సాంప్రదాయముగా పరిఢవిల్లుతూన్నది. విందు కుడిచిన పిమ్మట తాంబూల సేవనము చేస్తేనే సుఖ భోజనము చేసినట్లు.

 

కేవలం వక్కతో సరి పెట్టు కోకుండా

జాపత్రి, కరక్కాయ, లవంగాలు, ఏలకులు, కస్తూరి, కర్పూరము

ఇత్యాది దినుసులు కూడా తాంబూల విడియములో అంతర్భాగాలు ఐనవి.

కరక్కాయ, కాచు మిన్నగునవి ఆయుర్వేద వైద్య విధానములో

అనూచానముగా ఊపయుక్తమౌతూన్నవి;

కనుకనే తాంబూలములో ఇవి అదనపు కానుకలు;

ఇవి దంతములకు, చిగుళ్ళకూ ఆరోగ్యాన్నీ, దృఢత్వాన్నీ పరిపోషించే ఆహార పదార్ధాలే!

 

ఇలాగ ఇన్ని రకాల మేళవింపులతో మనము తయారు చేసుకుంటున్నదే తాంబూలము.

కిళ్ళీ _ నేడు కిళ్ళీలలో గులాబీ రేకులను తేనెలో కలిపి సిద్ధము చేసిన “గుల్కందా“ను కూర్చుతున్నారు.

వీధి వీధినా కిళ్ళీ డబ్బాలు/ pan shop లు ఉంటున్నాయి.

కిళ్ళీ కొట్లు, పాన్ మసాలాల అంగడి ల వలన లక్షలాది మందికి జీవనోపాధి దొరుకుతూన్నది .

 

మరి ఇప్పుడు "కిళ్ళీ" కి కల నామ ధేయాల తోరణాలను తిలకించుదామా!

 

తాంబూలము = విడియము, వక్కాకు, తాంబూల విడియము, విడియ, వీడ్యము, వీటి, వీటిక , తము, తమ్ములము, తములము, ముఖ భూషణము

 

@ వక్కలకు ఉన్న నామావళిని వీక్షించాము కదా!

 

అలాగే, పోక చెక్కలు - కు గల నామములను అవలోకిద్దామా!!?

 

పోకలు = నెల వత్తి, పూగ భాగములు, పోక చెక్కలు, పోక పలుకులు, భాగాలు

 

ఈ రీతిగా తాంబూలమేనా- దానితో పాటే "తాంబూల విడెము"లోని ఇతరేతర దినుసులు కూడా "మాన్య పండిత ప్రకాండుల విద్వత్తు"చే నానా విధ నామ ధేయములతో సంభావింప బడినవి.

„సున్నపు కాయ, కత్తెరయు జొక్కడ కొత్తును ;

వక్క లాకులున్ వన్నెగ జాల వల్లిక , లవంగము లాదిగ కూర్చి........ "

తమాల వల్లరుల వర్ణనలతో మన కావ్యాలలో సుగంధములు వెద జల్లినాయి.

లక్షలాది మందికి బతుకు తెరువును కల్పిస్తూ, కోట్లాది జనుల జిహ్వలను రంజింప జేస్తూన్న కిళ్ళీ మీద పాటలుsuper hit లు ఐ, ప్రేక్షక ప్రజావళి కూని రాగాలకు ఆలవాలమైనాయి.

 

విభిన్న భాషలలో తాంబూలము పేర్లు ;;;;

_________________________

 

క్రీస్తు పూర్వము 600 సంవత్సరములో వెలువడిన "సుశ్రుత సంహిత" లో "నాగ వల్లి/ తాంబూలము" పేర్కొన బడినది. దీనిని బట్టి ఎంతటి ప్రాచీన సాంప్రదాయ విశిష్టతను , దాని మూలంగా చారిత్రక వైశిష్ట్యతనూ కలిగి ఉన్నదని, తాంబూలము ప్రాముఖ్యత ద్యోతకమౌతూన్నది.

 

“నాగూర్ వేల్ “ అని గుజరాతీ భాషలో పిలుపు.

 

మన తెలుగు దేశములో జరుగుతూన్న పెళ్ళి వేడుకలలో „ నాగ వల్లీ సదస్యము“ ఎల్లరకూ కన్నుల పండుగయే!

 

నాగ వల్లి, తమాలము, తాంబూలము, అనేవి దాదాపు అనేక భరతీయ భాషలలో వాడుకలో ఉన్నది.

అరబ్బులు, పర్షియన్ భాషలలో "తాంబన్" అనే పదం ఉన్నది, తాంబూలము నకు సోదరీ పదమే ఇది.

క్రీస్తు పూర్వము నుండీ వ్యాపార స్థాయిలో "తాంబూల తీగలను" చెట్ల నీడలలో పెంచుట ఆరంభమైనది. హిందూ స్థాన్ లో వాణిజ్య స్థాయిలో ఆవిష్కరించ బడిన తమలపాకులు క్రమంగా ప్రపంచ దేశాలకు పరిచయం ఐనాయి.

 

నాలుకలను ఎర్రని రంగుల పూవులుగా సుందరంగా చేస్తూన్న "కిళ్ళీ" వెరసి "తాంబూలము"నకు జేజేలు!

 

 

పుష్ప గృహ శయ్య పత్ని తాంబూల వస్త్ర

గంధ భూషణా లష్టభోగంబులగును

జగతి ధర్మార్థకామ మోక్షములు నాల్గు

ననిరి పురుషార్థములటంచు నార్యజనులు.

 శ్రీ శంకరుల లలి (కవి) తాసౌందర్య లహరి –44(చివరి భాగం )

 

 

 

98 –‘’కదా కాలే మాతః కధయ కలితా లక్తక రసం –పిబేయం ,విద్యార్దీ ,తవ చరణ నిర్నేజన జలం

 

        ప్రకృత్యా ,మూకానా ,మపిచ ,కవితా కారణ తయా –కదా ధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం ‘’

 

        తాత్పర్యం –మంగళాక్రుతీ మాతా !జన రంజకత్వం కోసం పూతగా పూసుకొన్న యెర్రని లత్తుక రసం తో ఉన్న నీ చరణాలను కడిగిన పాద్యోదకాన్ని ,బ్రహ్మ విద్య ను అభ్య సించె విద్యార్ధి నైన నేను ,మరణించే లోపల ,యే సమయం లోనైనా పుచ్చు కోగాలనా  ? ఆ నీ పవిత్ర పాదోదకం చెవిటి వారికి వినికిడి శక్తిని ,మూగ వాడికి మాటను కలిగించి ,కవిత్వం చెప్ప టానికి కారణం అవటం చేత ,వాణీ ముఖ కమల రస సారస్యాన్ని ఎప్పుడు స్వీకరిస్తుందో కదా ?

 

              విశేషం –శంకర భగవత్పాదులు సామీప్య భక్తీ ని కోరు కొన్నారు .తాంబూల కవిత సరస్వతీ వాదన వాగ్విలాసం తో పోల్చా దాగిన సూక్తి ప్రవాహం .కాళి దాసాదులు సరస్వతి ముఖ కమలస్త తాంబూలం వల్ల మహా కావు లైనారు .భగవతి పాదజాలం లాక్షారసావుకితం కనుక భారతీ ముఖ కమస్త వీటీ (తాంబూలం )రూపం పొంది ,సత్కవితా హేతువు అయింది .మూగ వాడిన ఒకనికి కంచి కామాక్షి అమ్మ తాంబూల రసం నాలుక మీద పడ గానే మహా ఆశుదార గా మహా కవిత్వం అలవోక గా నోటి నుండి వెలువడింది ..ఆయననే ‘’మూక కవి ‘’అంటారు ..ఆయన ఆర్యా శతకం మొదలైన అయిదు శతకాలనుఅమ్మ వారి పై  చెప్పారు . వీటినే ‘’మూక పంచ శతి ‘’అంటారు . అద్భుత కవితా ప్రవాహం అందులో ఉంటుంది .ఆయనే తర్వాతా కంచి కామ కోటి పీఠానికి అది పతి కూడా అయారు .అమ్మ దయ అంట గొప్పదని ,ఆమె తాంబూల రసం లో అంతటి మహత్తు ఉందని శంకరుల భావం .అంటే కాదు అంత మహా విద్వాంసుడు వేద వేదాంగాలను ఆవ పోసాన పట్టిన వాడు అయిన ఆయన తనను ‘’విద్యార్ధి ‘’గానే చెప్పుకోవటం వారి వినయానికి ప్రతేక .అమ్మ దయ ఉంటె రానిదేమీ లేదని అర్ధం .

దుర్యోధనుడు శకుని కొడుకు ఉలూకుణ్ణి పిలిచి పాండవుల దగ్గరికి వెళ్లి కొన్ని మాటలు చెప్పిరమ్మని పంపాడు. అతను వెళ్లి ధర్మరాజుకా విషయం చెప్తే, అతను “అలాగే, ఆ బుద్ధిమంతుడు చెప్పిపంపిన తులువ మాటలేమిటో బయటపెట్టు, అందరం వింటాం” అన్నాడు. ఉలూకుడిలా అన్నాడు ధర్మరాజుతో – “పెద్ద పోటుగాడిలాగా యుద్ధానికి బయల్దేరొచ్చావ్, మీదగ్గరేవో అస్త్రశస్త్రాలున్నయ్యని మిడిసిపడుతున్నావ్. భీష్మ ద్రోణుల ముందు అవన్నీ ఎందుకు పనికిరావని చూడబోతున్నావ్. వాళ్లచేతిలో అర్జునుడి చావు తప్పదు”. ఆ తర్వాత భీముడివైపు తిరిగి “దుశ్శాసనుడి రొమ్ము చీలుస్తా, రక్తం తాగుతా అని బీరాలు పలికావుగా, వచ్చి అదేదో చేసి చూపించు. నూతిలో కప్పలా నీ బలం తల్చుకుని నువ్వే పొంగిపోవటం కాదు, అవతల వాళ్ల బలం గురించి తెలుసుకో” అని ఎత్తిపొడిచాడు. అర్జునుణ్ణి చూసి “తాటిచెట్టంత విల్లు గాండీవం వుందని మిడిసిపడకు. అంత పోటుగాడివైతే అదేదో సభలో పాంచాలిని పరాభవించినప్పుడే చూపించాల్సింది” అని చివరగా “ఏదో కృష్ణుడు కొన్ని మాయలు, ఇంద్రజాలాలు చేస్తేనో, లేకపోతే అర్జునుడి పరాక్రమానికో రాజ్యం వస్తుందనుకోకండి. వెయ్యిమంది కృష్ణులు, వెయ్యిమంది అర్జునులు వచ్చినా యుద్ధం చేస్తాం, రాజ్యంలో ఒక్క అంగుళం ఇవ్వం” అని దుర్యోధనుడి సందేశాన్ని వినిపించాడు ఉలూకుడు.

 

తిక్కన ఇలా చెప్తున్నారు:

ఓ హరిహరనాథా ! ఇక భారతయుద్ధ వృత్తాంతం విను. 

అదంతా విని పాండవులు కోపంతో ఊగిపోతుంటే కృష్ణుడు నవ్వుతూ ఉలూకుడితో “అందరూ వినేట్టుగా దుర్యోధనుడితో నువ్వూ ఇలా చెప్పు. యుద్ధంలో నువ్వెక్కడున్నా చావు తప్పించుకోలేవ్, భీముడు నువ్వు చూస్తుండగనే దుశ్శాసనుడి రక్తం తాగుతాడు” అంటుండగా అందుకుని అర్జునుడు ” సొంతంగా గెలిచే చేవలేక కాటికి కాళ్లు చాచిన భీష్ముణ్ణడ్డంపెట్టుకుని యుద్ధంలో గెలుద్దామనుకుంటున్నాడు దుర్యోధనుడు. పాపం ఆ ముసలాయన మాకు తొలికబళమై కాటికి పోవటం ఖాయం. ఆ తర్వాత ద్రోణుడు, కర్ణుడు చస్తారు. భీముడి గద దెబ్బలకి తన తొడలు విరుగుతుంటే అప్పుడు దుర్యోధనుడికి తన దుర్మార్గప్పనులు తెలిసొస్తయ్ లే. రేపే యుద్ధం మొదలు. వచ్చి తలపడమను” అని చెప్పాడు.

 

తాంబూలం, ఆభరణాలు ఇచ్చి ఉలూకుణ్ణి సాగనంపాడు ధర్మరాజు.

ఈ వరసలో ఒక పెద్ద మార్పు తిక్కనే నిర్వచనోత్తర రామాయణంలో చేశాడు. నన్నయ భారతంతో మొదలు పెట్టి తిక్కన భారతం లోను, ఇంకా తరువాత గాను, ఏర్పడిన పద్ధతి ఏమిటంటే కవి తన గ్రంథాన్ని ఒక కృతిభర్తకు అంకితం ఇవ్వడం. ఆ కృతిభర్త కవిని తన ఆస్థానానికి పిలిపించుకొని (లేదా తిక్కనకు జరిగినట్టుగా కలలో కనిపించి) తన పేర ఫలానా పుస్తకం రాయమని పురమాయించి, తాంబూల జాంబూనదాలు (అంటే బంగారం) ఇచ్చి సత్కరిస్తాడు. కవి అదే పరమార్థమనుకొని ఆ తాంబూలం గ్రహించి ఇంటికి వెళ్ళి ఒక సుముహూర్తంలో తన కావ్య రచన ప్రారంభిస్తాడు. ఆ కావ్య రచనకు ముందు ఉపోద్ఘాతంగా కృతినాయకుని వంశావతారం వర్ణిస్తాడు. ఆ వరసలో కావ్యాన్ని కృతినాయకునికి వినిపిస్తున్నట్టుగా రచిస్తాడు. అంటే మొదట్లో కృతినాయకుణ్ణి సంబోధించి తన కథ వినమని చెప్పి, ప్రతి ఆశ్వాసం చివర మళ్ళా ఆయనను సంబోధించి ఆశ్వాసం అయిపోయిందని చెప్పి, తరవాతి ఆశ్వాసం మొదలు పెడతాడు. 

వివాహ వేడుకల్లో మాంగల్యపూజ ఒక ముఖ్యమైన తంతు. మాంగల్యపూజ: కొన్ని బియ్యం పళ్లెంలో పోస్తారు. వీటిని పళ్లెం నిండుగా పరచాలి. అందులో మంచి కొబ్బరిబొండం, తాంబూలం పెట్టి తమలపాకుల్లో మంగళసూత్రాలు, మట్టెలుతో కొబ్బరిబొండం పై పెట్టాలి. వాటికి వధూవరులచే షోడశ విధ పూజలు నిష్ఠగా చెయ్యాలి. మంగళసూత్రాల్ని మంచి ఆచారాలున్న వారిచే, శుభప్రద మనసులచే చలువ చేతుల వారిచే స్పృశింపజేయాలి.

 

 

ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. కాళిదాసు, భవభూతి ఈ కథలో ఒక కాలం వాళ్ళు. భవభూతి తన ఉత్తరరామచరిత్రని పూర్తి చేసి తన కవిత్వం కాళిదాసుకి నచ్చుతుందో లేదో చూద్దామని తన సేవకుడి ద్వారా ఒక శ్లోకాన్ని ఆయన దగ్గరకు పంపిస్తాడు. కాళిదాసు ఆ శ్లోకాన్ని చదివి ఏమీ అనకుండా వూరుకుంటాడు. చాలా నిరాశపడిన భవభూతి, ‘కాళిదాసు ఏమీ అనలేదా, అసలు నువ్వున్నంతసేపూ ఆయన ఏమీ మాట్లాడలేదా?’ అని తన సేవకుణ్ణి గుచ్చిగుచ్చి అడుగుతాడు. ‘అయ్యా, ఆ శ్లోకం కాళిదాసుగారు చదివిన సమయంలో ఆయన ప్రియురాలు తన దూతిక ద్వారా కాళిదాసుగారికి తాంబూలం పంపించింది. ఆ తాంబూలం వేసుకుని, ఈ పద్యం చదువుతూ కాళిదాసుగారు ఇందులో కొద్దిగా సున్నం ఎక్కువయ్యింది, అని మాత్రం అన్నారండి,’ అని చెప్తాడు. భవభూతి వెంటనే తన శ్లోకంలో ఒక సున్నా యెక్కువగా వుంది అని గ్రహించి ఆ సున్నా తీసేస్తాడు. ఆ శ్లోకం ఇది.

 

కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్

అవిరలిత కపోలం జల్పతో రక్రమేణ

అశిథిలపరిరంభవ్యాపృతైకైకదోష్ణో

రవిదిత గతయామా రాత్రిరేవం వ్యరంసీత్

 

ఈ శ్లోకంలో చివరి పాదంలో ఏవం అన్న దగ్గర సున్నా తీసి చదవండి.

 

రాత్రిరేవ వ్యరంసీత్.

 

అంటే, గడిచిపోయింది రాత్రి మాత్రమే అని.

 

ఈ చిన్న కథ చారిత్రకం కాదని, కాళిదాసు, భవభూతి ఒక కాలం వాళ్ళు కాదని కొట్టిపారేసే ఆధునిక చరిత్రకారులు గమనించని విషయం ఒకటుంది. ఇది చరిత్ర కాదు. ఇది సాహిత్యాభిరుచి చరిత్ర అని ఇందాక అన్నాను. ఆ దృష్టితో ఈ కథని మరికొంచం జాగ్రత్తగా చూద్దాం. ఈ కథలో కాళిదాసు గొప్ప కవే కాదు, గొప్ప సహృదయుడు కూడా. తను తనతోటి కవి పద్యం లోని లోపాన్ని బండగా, ‘ఆ సున్నా తీసేయ్’ అని చెప్పకూడదు. పరోక్షంగా సూచించాలి. అలా సూచిస్తే గ్రహించగల సూక్ష్మజ్ఞానం భవభూతికి ఉంది. పైగా ఈ మాటలు చెప్తున్నప్పుడు కాళిదాసు చుట్టూ వున్న వాతావరణం పరమరమణీయమైన వాతావరణం. ఆయన తన ప్రియురాలు పంపిన తాంబూలం వేసుకుంటున్నాడు. సాహిత్యానుభవం తాంబూలచర్వణానుభవం లాంటి ఇంద్రియానుభవం. తాంబూలంలో లాగే పద్యంలో చేరిన దినుసులన్నీ సమపాళ్ళల్లో వుండాలి. ఏది యెక్కువైనా అనుభవంలో అందం దెబ్బ తింటుంది. ఇంత పరిణతమైన సాహిత్య విమర్శతో పాటు ఈ కథ ఇంకో విశేషాన్ని కూడా చెప్తుంది — కవిత్వంలో అందాల్ని ఇంకో కవే చెప్పగలడు. భవభూతి పద్యాన్ని కాళిదాసే గ్రహించగలడు

యముడికి మొగుడు అన్న సినిమాలో పాట వినండి.

 

అందం ఇందోళం అథరం తాంబూలం

అసలే చలికాలం వయసే జలపాతం… ఇది పోస్ట్‌ మోడర్న్‌ పాట కాదని ఎవరన్నా అనగలరా? ఒప్పుకోరూ? మరి రావోయి చందమామ లోది, ఈ పాట కనీసం అల్ట్రా మోడర్న్‌ అని అన్నా ఒప్పుకుంటారా లేదా?

 

 


Thursday, February 4, 2021

గారెల భారతం -కర్లపాలెం హనుమంతరావు -సరదా వ్యాసం

 



వింటే భారతమే వినాలని ఆరాటపడే తెలుగువాడికి తింటే గారెలు మాత్రమే తినాలని వెంపర్లాట! భారతంలో ఎక్కడా గారెల ప్రస్తావన లేదు. అయినా రామాయణంలో పిడకల వేటలా    భారతంలో గారెల కోసం తెలుగోడి వెతుకులాట!  గారెలు స్వీయ సృష్టి అని తెలుగువాడికో గట్టి నమ్మకం. సున్నా కనిపెట్టింది ఉత్తరాదివాడైతే  అంత కన్న కన్నాలున్న సున్నాలాంటి గారెలు కనిపెట్టింది తనేనని బడాయి. తినిపెట్టేవాళ్లు తప్ప ఏదైనా కొత్తది కనిపెట్టేవాళ్లు కలికానిక్కూడా కనిపించని రోజుల్లో గారె’ను సృష్టించినందుకు తెలుగువాడు గర్వపడ్డంలో తప్పేముంది?   

చప్పటి పిజ్జాలు, బర్గర్లే తప్ప   ఇప్పటి పిల్లతరానికి గారెల గరిమ గురించి ఆట్టే తెలియదు.  ఆదిమహావిష్ణువు చేతి వేలి మీదుండే చక్రం చూపించినా  పిక్చర్ పూర్తిగా రాదు. బండి చక్రం మాదిరి దొడ్డి గుమ్మంలో పడి ఉండేదని కాకుండా ..నోట పెట్టకుండానే లొటలొటా లోటాడు లాలాజలం  ఊరించేదని చెబితే బెటరేమో .. ధ్యాస కొంతైనా ఇటు మళ్లుతుంది!

గోంగూర కన్న గారెలు వాస్తవానికి తెలుగువాడి జిహ్వపుష్టికి ఆగ్ మార్క్. విశ్వామిత్రుడి సంతు సుమా మనమంతా!  సృష్టికి ప్రతిసృష్టి చేసిన  తండ్రిగారి పంథాలోనే  బూరెలకు బదులుగా గారెలు సృష్టించుకున్న ఘనులం మనం.

తెలుగువాళ్ల కాఫీ ప్రియత్వం సర్వే సర్వత్రా ప్రసిద్ధం. క్షీరసాగరం నుంచి వెలికొచ్చిన అమృతాన్ని మించీ కాఫీ పైనే తెలుగువాళ్లకు  మక్కువ ఎక్కువని కదా  నమ్మకం? ఆ సర్వజనాకర్షణీయ పానీయం కాఫీలో కూడా ఈర్ష్యాసూయలు రేకెత్తించగల   అసాధారణమైన రుచి  గారెలది.

'వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం/ పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ/ సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే/ నుడుకుం గాఫిని, యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!’ అని కాఫీ పానీయం కుయ్యో మొర్రో మన్నట్లు  ఓ ముచ్చట.  పెరుగు వడ, పకోడీ, హల్వా ముక్క, బూందీ పలుకు, ఉప్మా ప్లేటు,  రవ్వ ఇడ్లీ, బోండా, సేమియా పాయసం.. లాంటి పిండివంటకాల వరకంటే  ఓకే! చివరికి వేడి వేడి గారెల రుచి  మీదా ఉడుకుడుకు కాఫీ తన ఉడుకుమోతుతనం దాచుకోలేకపోయింది! గారె రుచికి దక్కే గొప్ప ధృవపత్రం ఇంతకు మించేముంది? ఆరు రుచులు కలగలసి తొడగొట్టినా విస్తరి గోదాలో తెలుగోడి  గారె ముందు బలాదూర్ అన్న జనవాదే నిజమయింది.

సృష్టి సర్వం నిర్దుష్టంగా సృష్టించిన నిరంజనుడు కూడా  నీరుల్లి  గారెల రుచి కోసమే ధర్మసంస్థాపన వంకతో అడపా దడపా భూమ్మీదకు దయచేసేది! అయోధ్యలో పుట్టినవాడు అక్కడే రామాయణంకథ పూరా నడిపించుకోవచ్చు కదా  శ్రీరామచంద్రుడు! అమ్మ వైపు వాళ్లెవరో చెప్పింది విని కమ్మని గారెల పైన మోజు పెంచుకున్నాడు. కాబట్టే లంకారాజ్యాధిపతి వధ వంకన ఆంధ్రా సైడ్ దండకారణ్యాల దారిట్టాడు. అడవి నడిమిన అప్పటికప్పుడు బాణలి పెట్టి వండి వడ్డించే వ్యవధానం లేక  గానీ.. రామసోదరుల రాక ముందే పసిగట్టుంటేనా మన  శబరమ్మ మహాతల్లి ఏరుకొచ్చిన ఎండు పండ్లకు బదులుగా  పచ్చి కొబ్బరి కలిపి నానబెట్టిన మినప గారెలే పెద్ద బుట్టెడు ఆరగింపుకు పెట్టేదికదూ!

అంతా రామమయం’ అంటూ  అంత కమ్మంగా గానం చేయడం వెనుక దాగి ఉన్న రస రహస్యం ..  త్యాగయ్య తెలుగువాడుగా  అవతరించడమే కాదు.. ప్రతీ పూటా భగవదారానెపాన తయారయే గారెలు  తనివితీరా లాగించి తరించడం కూడా కావచ్చును! ముఫ్ఫై రెండు వేల సంకీర్తనలలు  రాశి పోసిన  తెలుగు అన్నమయ్యా    ఏదో ఓ  శృంగార సంకీర్తనల మధ్యన గారె గరిమను గూర్చి ఘనంగానే కీర్తించుంటాడు. కరిగిపోయిన రాగి రేకులతో పాటు గారె మీది కీర్తనలు కూడా మలిగిపోయుంటాయి.. తెలుగోడి బ్యాడ్ లక్! కంటబడ్డ ఏ దురాచారాన్నైనా చెండుకు తినకుండా వదిలిపెట్టని ప్రజాయోగి మన వేమన. గాడిద పాలను గురించి కందంలొ రాపాడేడే  ప్పించి.. గారెల రుచిని గురించి ఏనాడైనా పన్నైత్తి ఒక్క  చెడ్డ పదం వాడాడా ఎక్కడైనా? బీహారు కన్నయ్య చేత తెలుగిళ్ల వెన్న ముద్ధలు తినమరిగించిన గడుసుదనం కవి పోతనది.  గోపాలబాలుల గుంపు మధ్యన చేరి ఆ  బాలగోపాలుడు నంజిన   మాగాయ పసందు వర్ణనల సందున చెప్పి   పెరుగు గారెల రుచులు తగ్గించడం ఎందుకులెమ్మని   వదిలేసాడు! 

కలియుగంలో జంతుహింస నిషిద్ధం. కాబట్టి మేషం(మేక) బదులు మాషం, చక్రాలుగా వండుకు తినవచ్చు అన్నప్పటి బట్టి తెలుగువాడి గారె ప్రభకు తిరుగే లేకుండా పోయింది. తమిళమా.. తెలుగా .. కన్నడమా.. ఏదప్పా అత్యంత ప్రాచీన  భాష అని అడగడం ఆలస్యం..  కొప్పూ కొప్పూ పట్టుకునే రాధ్ధాంతంగాళ్లు కొప్పులోని వెంట్రుకలంత మంది. ఆ కొప్పు బ్యాచ్  సైతం గారె  ప్రాచీనత దగ్గర గప్ చుప్! అదీ మన గారె ఘనత.

కానీ గారె   తెలుగోడి ఆస్తి. అందుకే దాని  పుట్టుపూర్వోత్తరాల మీద  అన్యులకంత అనాసక్తి.   నో ప్రాబ్లం. బాపూజీకి భరతరత్నకు మించిన స్థాయి ఉన్నట్లే మన గారె ముక్కకు మనకు మించిన ఖ్యాతి కద్దు. తిండి ప్రపంచంలో గారెలకు ప్రత్యామ్నాయం నిల్. మీ నూడిల్సు, మెక్డొనాల్డ్సు రుచిలో వాటి ధాటికి ఆటిరాలేవు. ప్లేటులో  వేడి వేడిగా  రెండు గారెలు వడ్డిస్తే మూతి కాలినా  అమెరికా ప్రెసిడెంటు అరక్షణంలో ఇరాను మీద కయ్యం   ప్లేట్ ఫిరాయించేస్తాడు!

వడలు పేరు వింటేనే చాలు ఒడలు పులకరిస్తుందని బడాయిలు పోయే తిండిపోతులంతా ముందు బుద్ధికి బాగా ఎక్కించుకోవలసిన ముఖ్యమైన అంశం.. వడకైనా, ఆవడకైనా మూల సూత్రం మన తెలుగువాడి గారే!  తెలుంగువాడుగా పుట్టనందుకు అప్పయ్య దీక్షితులు అంతలా దిగాలుపడింది ఈ అప్పచ్చులు వండుకు తినే సౌభాగ్యం దక్కనందుకే! వచ్చే జన్మకయినా సరే.. తెలుగు నేల పై బడి శుభ్రంగా శుద్ధమైన గొనసపూడినేతి గారెల  మోజు తీర్చుకోవాలని సుభ్రహ్మణ్య భారతీ కలవరించాడు మరి.  

గారెల గొప్పతనం తగ్గించేందుకే విందు వినోదాల మెనూలలో   కనిపించద్దని  నిబంధనని ఓ అనుమానం! అయినా, పెళ్ళీ పేరంటాల మధ్యన ఏ వడ ముసుగులోనో విస్తట్లో దూరి భోక్తల దవడల్లో నీరూరించనిదే వూరుకోదు.. మన ఘరానా తెలుగు గారె!

పేరుకే తద్దినం భోజనం. విస్తట్లో  ఆవపెట్టిన చట్మీ వధువు పక్కన నోరూరిస్తూ గారె వరుడు కనిపిస్తే విందు భోజనం మించి పసందుగా ఉండదూ! తికినంత కాలం రెండు ముద్దలు కడుపారా కతికెరుగని పెద్దలు ఎందరో ఈ పిదప కాలంలో! పితృదేవతల హోదా దక్కిన పిదపైనా   ఏ వాయస రూపంలోనో వచ్చేసి  భుక్తాయాసం తీర్చేసుకునే అవకాశం కల్పిస్తుంది  గారె. మరి తెలుగు గారె అంటే ఎవరికుండదు గౌరవం? పసికూనల నుంచి పండుటాకుల వరకు గారెలంటే ఎవరికీ చేదు కాదు. బాలభారతం సినిమాలో గారెల మీదో గొప్ప పాటుంది. వింటుంటే అదీ వీనులకు విందే! గారెల గరిమ తెలుగు కవుల పద్యాలలో మరీ మారుమోగుతుంది. 

పుట్టిన ముహూర్తం శుభంగా లేనప్పుడు  మేనమామ వచ్చి శిశువు మెడలో గారెల దండేస్తేనే  సర్వ గ్రహాలూ  శాంతించేది. శివయ్యను అదరగొట్టిన శనిగ్రహమే తలవంచిన   గారెల రుచి ముందు మానవమాత్రులం మనం మాత్రం ఎలా నిగ్రహం చూపించడం?

కలిగినవాడయితే మనసు మళ్లినప్పుడల్లా చప్పున చేసుకుని తినేయచ్చుఖరీదైన అప్పచ్చులు! లేనివాడో? కనీసం పండుగ పబ్బాలప్పుడు లేమి దాచుకునేందుకైనా  చేసుకు తీరక తప్పదు కదా!  అప్పు చేసి అయినా సరే పప్పుకూటికి ‘సై’ మనే   తెలుగువాడు. గారెను మాత్రం ఎందుకు దూరం పెడతాడు?

పడక దిగింది మొదలు, పడక ఎక్కే దాకా బతుకు నిండ ఎన్నో అరాచకాలు! సంబంధంలేని సవాలక్ష సమస్యలతో ప్రజలను పీడించే ప్రభుత్వాలు! మామూలు జనం ఇష్టానుసారం  చేసుకునే అవకాశం ఒక్క తిండితిప్పల వరకే పరిమితం. ఆ తిండి తిప్పల్లో కూడా   ఉప్పు చప్పుల రాజీ ఎందుకు? బడాబాబులకయితే  బడా బడా బ్యాంకులు కూడా  గారెల వంటలకైనా సరే లక్షల కోట్లు కుమ్మరిస్తాయ్. చిల్లర మనుషులకు చిల్లుచెంబో,  సొత్త తప్పేళో   తాకట్టు కొట్టుకు నడిస్తే తప్ప గారె బాణలి పొయ్యిపై కెక్కదు. అయినా సరే! భరత ఖండం దక్షిణాదిమళ్లా ఎప్పుడు తెలుగు బిడ్డగా పుట్టొచ్చామో! వంటికి నిండుగా గుడ్డా గుడుసూ  గొడవలు ఎప్పుడూ ఉండేవే! పండగా పబ్బం వచ్చిందంటే తెలుగోడి వంటింటి పొయ్యి మీది   సలసల  కాగే బాండీ  నూనెలో  గారెల పిండి చుయ్యిఁ ..చుయ్యిఁ’ మంటూ పడి తీరాల్సిందే!

గారె ఒలంపిక్స్ షీల్డును తలపిస్తుంది. ఆటల్లో గోల్డులు గట్రా కొట్టుకొచ్చే  తంటా తెలుగువాడికి లేదు.  ఏ పండుగ పబ్బమొచ్చినా రుబ్బురోలు ముందో రెండు గంటలు కూలబడ్డా చాలు! సుబ్బరంగా వంద ‘ఒలంపిక్’ పతకాలను మించి  గోల్డ్ గారెలు తయార్! 

వివాహ భోజనంబు వింతైన వంటకంబు

వియ్యాలవారి విందు ఓ హోహ్హొ నాకె ముందు

ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల

ఓహ్హోరె అరెసెలుల్ల హహహ్హహహ్హహా

ఇయెల్ల నాకె చెల్ల ..’

చెల్ల సరే! అసలీ మినప గారెల తయారీ ఎల్లా అని గదా?

మినప పప్పో  పావు కిలో, అల్లం    రెండంగుళాల పొడవు,          పచ్చి మిర్చి  ఓ ఆరు కాయలు చిన్నివి,  ఉల్లిపాయలు బుల్లివి ఓ వంద గ్రాములు,  కరేపాకు కత ఇహ నీకు మాత్రం తెల్వనిదేమున్నది..  దొరికితే ఓ రెండు రెబ్బలు, కమ్మటి గుంటూరు నెయ్యి ఓ చెంచాడు,  ఘుమ ఘుమ లాడే ఇంగువ అర చెంచాడు, ఉప్పు తగినంత.. ఐదొందల గ్రాముల  నువ్వుల నూనె! నూనె బాణలిలోకి ఒంపి పెట్టుకోవాలి! గారంటే  గట్టిగ ఉండాలి గదా!  పప్పు ని ఒక గంట పాటు  నానపెట్టి, మెత్తంగా రుబ్బి పెట్టుకోవాలి. అల్లం, మిర్చి, ఉల్లి, రేపాకు, మన్నూ మశాన్నంన్నీ సన్నగా తరిగిపెట్టుకోవాలి. రుబ్బిన పిండి లో ఉప్పు, నెయ్యి, ఇంగువ, మిరప, అల్లం, రేపాకు, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. డీప్ ఫ్రై పాన్ లో నూనె  పోసి వేడెక్కాక పిండిని అర చేయి  సైజు మందాన  వత్తుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే! గారె గోల్డెన్ బ్రౌన్ రంగుకు వచ్చే వరకు వేయించుకుంటే సూపర్ గారెలు రడీ! అన్నట్లు మధ్యలో కన్నం పెట్టినప్పుడే అది ఆంధ్రా గారె!

బహిరంగంగా మార్కెట్లలో వేరుశనగ నూనె ధరలు వేసే వీరంగం చూస్తుంటే  ఎంత ‘లావు’ ట్రంపుగారికైనా ఇంత పిక్కె గారైనా వండి రుచి చూపించే మాట కల్ల! పండుగ మర్యాద కోసమైనా పిసరంత పక్క పాకిస్తోనోడికి  వండి తినిపిద్దామంటే మినుముల రేట్లు రేకట్లతో పోటీకి దిగి మన శ్రీహరి కోట  నుంచే ఆకాశంలోకి దూసుకెళ్లిపోతున్నాయ్!

ప్రసిద్ధ తెలుగు జంటకవులలో తిరుపతి వేంకట శాస్త్రిగారని ఘరానా పండితులు. వెంకట రామకృష్ణకవులతో వారికి ఏ కారణం చేతనో హమేశా సంకటాలు! ఇద్దరు పండిత ప్రకాండుల మధ్యనా బురద జల్లుడు పద్యాలు వరదలా పోటెత్తినప్పుడు   శాస్త్రిగారి గురువుగారే  శిష్యుణ్ని దెప్పుతూ గారెల ప్రస్తావతో ఓ గొప్ప హితవు చెప్పారు. 'గారెల పిండివంటకయి కాంతుడు కాంతను పృచ్ఛ సేయ నా/ సారసనేత్ర వ్రేలొకటి చయ్యన జూపి ‘యిదొక్కడున్న దా ధారం’ అన్నదటఒక ఇంట్లో! గారెలు వండిపెట్టమని ఓ తిండియావ సంసారి భార్యను పీడించుకు తింటుంటే  'గారెకు మధ్యలో చిల్లు పెట్టే నా చూపుడు వేలు తప్పించి కొంపలో ఇంకే  సరంజామా లేదు.. పోయి తెమ్మన్నదని ఆ వెటకారం! ఆ దయనీయ స్థితిలోనే ప్రస్తుతం మనం ఉన్నది కూడాను!

‘తెలుసు! పెద్ద పండుగకు కూడా గారెలు  వండుకు తినే యోగం బడుగోడుకి ఎట్లాగూ లేదనేగదా.. గారెల గురించి ఇన్నిన్ని నోరూరించే ముచ్చట్లు చెప్పుకొచ్చిందీ!

ఔరౌర గారెలల్ల.. అయ్యారె బూరెలిల్ల

ఓహ్హోరె అరెసెలుల్ల.. హహహ్హహహ్హహ

ఇయెల్ల నాకు కల్ల ..’

హహహ్హహహ్హహా! హహహ్హహహ్హహా! హహహ్హహహ్హహా!’

-కర్లపాలెం హనుమంతరావు

05  -03 -2021

బోథెల్, యూఎస్ఎ

***

 


 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...