కొలములని
జాతులని మేలుకోవలనుచు
పేరు
పేరున భేదభావ
ముగ్గడించుట
యవనికో యొప్పుగాని
కర్షకా, నీకు జెల్లదా కాపథంబు!
***
ఆలతో
లేగపిండుతో అహరహంబు
కాపురము
సల్పు నీ కేల కాని త్రోవ!
నిఖిల
జీవుల కాశ్రయ నిలయమైన
కృషియె
నీ జీవితమునకు గీర్తి తెచ్చు.
***
కలిమిలేముల
త్రొక్కిళ్ల వలన నమిత
మోద
ఖేదము లందుట కాదు నీతి;
కాలచక్రంబు
పరవళ్లు లీల దాటి
వడిదుడుకు
లేక మసలుట గడుసుదనము.
***
వేడి
వెలిగ్రక్కు పడమటి గాడుపులకు
గాంతి
తరిగిన తీవెల దొంతియట్లు
విమల
పూర్వసత్సంప్రదాయములు నేడు
సన్నగిల్లుట
గురితింపు మన్న నీవు!
***
పాలకుల
వేషభాషల ప్రాభవమున
పాలితుల
వైఖరియు మారుపాటు నొందు;
అందు
విద్యాధికుల సంఘమందు ముందు
గలుగు
పరిణామ మది నీకు హితము గాదు!
***
సర్వశాస్త్త్ర
విచారము సలిపి విభుధ
సంఘ
మూహించి విజ్ఞానసార మెల్ల
నాట
పాటల ననుభవమున
చిత్తమున
హత్తుకొనుట నీ వృత్తియగును.
***
వర్తకము
రాచఠీవి సంప్రతులజులుము
చదువుసంధ్య
వారి సంసారగోష్ఠి
సర్వమానవగ్రాసవాసముల
తృప్తి
నీదు
వృత్తికి శాఖలై నెత్తికెక్కె!
***
దున్నగా
దూడల జేరు నన్న రీతి
కాయకష్టంబు
వంక కేగకయె, దండి
లాభముల కాసపడి మాయవైభవంబు
లంది
కులికెడి వ్యక్తుల నయయుమన్న.
**
పరుగు
పరుగున బ్రాప్తించు పాలకన్న
నిలిచి
శాంతించి త్రావిన నీరె మేలు;
లక్షల
కొలంది జేకూర్చు లాతివృత్తి
కన్న
శ్రేయంబు నీ వృత్తియన్న నిజము.
***
పశుపతికి
నీకు సంబధ బాంధవంబు
లుండు
నన్న అసత్యము మేముండు నన్న!
శిశువు
కన్నను నిచ్చలు పశువు నెంతో
గారవింతురు
నీవుగా కేరు చెపుమ!
***
అలు-
పిల్లలు జెల్లలు-నాలుపిండు
గొడ్డుగోదలు-దూడలు-దొడ్డు
లొక్క
చేతిన
నడిచిన రీతి నున్న
గలుగు
సంతోష మింతని చెప్పగలమె!
***
ఆరుగాలము
కష్టించి ఆలుమగలు
బిడ్డపాపలు
తమ దృష్టి పడ్డ మెదుకె
యారగింతురుగా
కంతె, పారతంత్ర్య
బుద్ధి
యవ్వారి పొంతకు పోవదన్న!
***
అతని
కష్టార్జితమున కాసపడెడి
'పర భృతంబుల' లెక్కకు తరుగులేదు,
వాని
'సిద్ధాన్నము'ను నోటవైచుకొనుచు
నెగిరిపోజూచు
డేగ ల వెన్నో కలవు!
***
నారుపోసినవాడెపొ
నీరు వోయు
నను
వేదాంత సూక్తి నీ కమృతగుళిక;
నమలి
భక్షించుకన్నను నాణె మరయు
మ్రింగుటే
యన్న సూక్తి యెరుంగవన్న.
***
లోకమును
ధాత సృజియించుగాక, దాని
తిండి
దండిగ సృష్టించు తెరవు నీదె,
ఉద్ధియగుదువు
ధాతకు నోయి నీవు
చూడ
నెచ్చటిదో యీ చుట్టరికము.
***
'ఆత్మవ త్సర్వ భూతాని'యనెడి మాట
అక్షరాలను
బాటింప నర్హు డెవడో!
ఎవరి
కయ్యది సరిపడు నవని నీకు
దప్ప
తక్కినవారిలో నెప్పుడైన?
-శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి
(ఆంధ్రపత్రిక- శ్రీ చిత్రభాను సంవత్సరాది)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
28 -06 -2020
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
28 -06 -2020