భావికాలజ్ఞానాన్ని
ఇంగ్లీషులో చెబితే వీజీగా అర్థమవుతుందనుకుంటే ‘విజన్’ అనుకోండి.. సర్దుకుపోవచ్చు. ఇదివరకు జరిగిన సంగతులను ఇప్పటికీ గుర్తుంచుకుని వాటి అనుభవాలు పాఠాలుగా భవిష్యత్ అవసరాలకు
తగ్గట్లు ఇప్పటి నడత మార్చుకునే పద్ధతి. బుద్ధిమంతులు చేసే దిద్దుబాటు చర్య.
టు ఎర్ ఈజ్
హ్యూమన్– అన్నారు కదా అని పద్దాకా తప్పులు జరిగినా ఇబ్బందే. సరిదిద్ద రాని
పొరపాట్లు జరిగితే చరిత్ర చెడుగా
గుర్తుంచుకుంటుంది. కాలానికి ఎవరి మీదా ప్రత్యేకంగా గౌరవం ఉండదు.
జరగబోయే ఘటనల
గురించి అందరికీ ఒకే తీరున సంకేతాలందడం రివాజు. అర్థమయిన బుద్ధిజీవులు పద్ధతి
మార్చుకుని కాలం మీద తమ ముద్ర వేస్తారు. అర్థంకాని బుద్ధిహీనులు అట్లాగే అనామకంగా
కాలగర్భంలో కలిసిపోతారు.
భావికాల
జ్ఞానలేమి కలిగించే నష్టం ఏ రేంజిలో ఉంటుందో చెప్పేందుకు అడాల్ఫ్ హిట్లర్ చరిత్ర ఓ పాఠం. తమను తాము
స్థాయి మించి ప్రేమించుకునే ఆ నియంత వంటి
వాళ్లకు హితవు చెప్పేవాళ్ళు ఎంత సన్నిహితులైనా సరే శత్రువులయిపోతారు. గిట్టనివాళ్ల మీద కక్షతో
కొంతమంది దుష్ప్రర్తనకు తెగబడితే, సంభవం
కాని లక్ష్యాలు పెట్టుకుని సమకాలీన పరిణామాల పట్ల శ్రద్ధ పెట్టనితనం వల్ల మరికొంత
మంది అల్లరిపాలవుతారు. ఈ రెండు రకాల
పాలకులనూ మనం సమకాలీన వ్యవస్థలోనే గమనించవచ్చు.
హిట్లరు
మనసులో నిరంతరం ఒకటే ఊహ తిరుగుతుండేది.
ప్రపంచం ఓ ముద్దయితే.. అది తన అంగిట్లో మాత్రమే పడవలసిన ఖాద్యపదార్థమని.
అతగాడి భావిజ్ఞాన లేమి ప్రపంచానికి
తెచ్చిపెట్టిన మొదటి ప్రపంచ యుద్ధ వినాశనం అందరికీ తెసిసిందే. అసంభవమైన ఆ లక్ష్యం
సాధించే ప్రక్రియలో సమకాలీన సమాజం ప్రదర్శించే
పరిణామాల పట్ల అలక్ష్యమే హిట్లర్
సర్వనాశనానికి ప్రధాన కారణం. మనిషి నైజంలోని ఈ తరహా కనిపించని గుడ్డితనం (inattentional blindness) కొత్త శతాబ్దం మొదటి ఏడాదిలో ఒకానొక అమెరికన్
విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచానికి ప్రదర్శించి చూపించారు.
ఓ బాస్కెట్
బాల్ మ్యాచ్ ను తెరపై చూపిస్తూ బంతి ఎన్ని
సార్లు చేతులు మారిందో కచ్చితమైన లెక్క చెప్పాలని విద్యార్థులకు పోటీ పెట్టి, ఆట
మధ్యలో అప్పుడప్పుడూ ఓ గొరిల్లా
కన్రెప్పపాటు సమయంలో గుండెలు
బాదుకునే దృశ్యం కూడా ప్రదర్శించారు. బంతి చేతులు మారడం మీద మాత్రమే ధ్యాస పెట్టిన
చాలా మంది విద్యార్థులకు గొరిల్లా గుండెలు
బాదుకునే దృశ్యమే దృష్టిపథంలోకి రాలేదు.
వాస్తవ
ప్రపంచంలో ఈ తరహా పొరపాటు చేసినందు వల్లనే మోటరోలా సెల్ ఫోన్స్ కంపెనీ ఖాతాదారుల
మార్కెట్ ని చేజేతులా నోకియాకు
జారవిడుచుకుంది. ధ్యాసంతా అప్పటికి
ఉన్న ఖాతాదారులను సంతృప్తి పరచడం మీద మాత్రమే
లగ్నం చేయడంతో ఖాతాదారుల్లోని 'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్ళు' గమనించే అవకాశం
లేకుండాపోయింది. నోకియాదీ అదే మిస్టేక్.
సాంకేతిక నైపుణ్యాల పరంగా కూడా భావి కాలంలో జరగబోయే పెనుమార్పులను ఊహించాలన్న జ్ఞానం లేకపోవడంతో మార్కెట్ ఆనేక
చిన్న ధారాదత్తం చేసింది.
ఇక
చరిత్రలోకి తొంగి చూస్తే ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. క్రీ.శ 1217 ప్రాంతంలో
సమర్ఖండ్ లోని ప్రాంతాలెన్నింటినో కైవసం చేసుకున్న అల్లావుద్దీన్-2 ప్రపంచం తనని 'బాద్ షా'గా
గుర్తించాలని ఆశపడ్డాడు. బాగ్దాద్ అధినేత ఖలీఫా ససేమిరా అనేసరికి అల్లావుద్దీన్
అహం దెబ్బ తినేసింది. ఆ కక్ష కడుపులో పెట్టుకుని వాణిజ్య సంబంధాల కోసం పదే పదే
ప్రయత్నించిన చెంగిజ్ ఖాన్ ను ఎన్నో సార్లు అవమానించాడు అల్లావుద్దీన్. అక్కడికీ
డిప్లొమసీ బాగా వంటబట్టిన చెంగిజ్ ఖాన్
అవమానలన్నిటినీ దిగమింగుకుని రాయబేరానికో ముగ్గురు మధ్యవర్తులను పంపిస్తే, భవిష్యత్తులో ఏం జరగనుందో ఊహించలేని అల్లావుద్దీన్ ఆ ముగ్గురినీ రాజనీతికి విరుద్ధంగా
ఉరితీయించాడు. సహనం కోల్పోయిన చెంగిజ్ ఖాన్ అల్లావుద్దీన్ స్వాధీనంలోని
నగరాలెన్నిటినో నేల మట్టం చేసిందాకా నిద్రపోనేలేదు.
పాలకుల
వ్యక్తిగత అహంకారానికి లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు ఆ విధంగా బలికావడం చూసిన
తరువాతా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను
ఊహించకుండా పగ, ప్రతీకారం తీర్చుకోవడమే
ప్రధానమనుకుంటే పాలకులకు ఏ గతి పడుతుందో పాఠాల్లా నేర్పేటందుకు బోలెడన్ని సంఘటనలు
ఇట్లాంటివే చరిత్ర నిండా కనిపిస్తాయ్!
కనిపించని
గుడ్డితనం (భావికాలజ్ఞాన లేమి)తో బాధపడే పాలకులు.. ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారం
పెంచుకోవడం పొరపాటు. మారిన కాలంలో ప్రజాస్వామ్యం
వ్యవస్థ అధికార మార్పిడి అంతిమ శక్తి సామాన్యుడి చేతిలో పెట్టిన తరువాతా
రాజరికాలలో మాదిరి ఇష్టారాజ్యంగా పాలకులు ప్రవర్తిస్తే హిట్లర్ కు, అల్లావుద్దీన్-2 లకు పట్టిన
గతే పట్టడం ఖాయం.
పాలకుడు
అనేవాడు ప్రజలలో కనిపించకుండా నిరంతరం సాగే
'గొరిల్లా గుండె బాదుడు చప్పుళ్లు' తప్పకుండా
వింటుండాల్సిందే!
-కర్లపాలెం
హనుమంతరావు
-24 -04
-2021