Friday, January 24, 2020

అమ్మ ఆలాపనలో.. కవిత






కాలం
ఎన్ని ఎక్స్  గాలాల ఎరో!
లైఫ్ మానిటర్ మీది
లైవ్ పిక్చర్సన్నీ
మన ఫింగర్ టిప్ కమాండ్స్ కే
కదులుతాయని ఇల్యూజన్
ప్రీ ప్రోగ్రామ్డ్ జీవితంలో
'హెచ్ టి టి పీ 404 నాట్ ఫౌండ్' ఎర్రర్!
సర్వర్లు డౌనైతే
సర్వమూ డౌనయే డింగరీలం
సృష్టి మొత్తంలో
సర్వోత్కృష్టమైన  స్పీసీసుమని
చంకలు బాదుకోడం వింతగా లేదూ!

మేకతోకకు మేకా?
తోకమేకకు మేకా?
క్యా?.. క్యా?..
క్వాంటమ్ థీరీనా?
క్షీరనీరపు రాయంచా?
ఏదీ తీర్చేదీ
 ఈ కార్యకారణ శంక?

సైకోట్రానిక్స్ స్టాటిస్టిక్స్
ప్యరామీటర్స్ మాస్ ఫ్యాక్టర్స్
ఎట్సెట్రా.. ఎట్సెట్రా
కాలం పరమాత్మముందు
సర్వం సాష్టాంగప్రణామము లాచరించు
రుషి కోటి సముదాయములు మాత్రమేనా?!

ఎనిమిదంకెను పడదోసి
ఇన్ ఫినిటీ అనుకోమనటం,
వాల్యూ తెలీకుండా దాచేసి
ఆన్సర్ ఆప్షన్సులో
వెతుక్కోమనటం!
ఏ ఇన్విజిబుల్ మెజీషియన్ చేసే
లెక్కల ట్రిక్కో గదా ఈ జీవితం! 
బిల్లియన్ ఫార్ములాలు అప్లై చేసినా
ఎవరూ  నాటౌట్ గా  మిగిలటం లేదిక్కడ!
వాటెబౌట్  మరి
ఎంపిరికల్ ఎటర్నీటీ?!

వట్టి తాపత్రయం మాత్రమేనా?
సెంటెడ్ బాడీ లోపల్దంతా
మలమూత్రశ్వాదాదులేనా?
వాడూ.. అదీ
మిన్నూ..  మట్టీ
అంతా
నిమిత్తమాత్రులమేనా?

విధి, దైవం,
నసీబ్, కిస్మత్,
ఫేట్, డెస్టిట్యూట్
వుయారాల్ లైక్ డైసెస్
త్రోన్ ఇన్ ది గేమాఫ్
వర్చ్యూస్ & వైసెస్
ఈజిన్టిట్?

గుడ్  హోపు
కూరలో పోపు
గ్యారీబాల్డు
గారెముక్క హోలు
'హాయ్ బాయ్' లు
'హలో' బోలోలు
అసతోమా సద్గమయా
ఆ సమయం వస్తే
అయ్యో.. అంతా
'యా మా సా మాయా'  మయమేనా?!

బిగ్ బ్యాంగ్  చిద్రం
పికాసో గిలికిన  చిత్రం
అయ్యో..ఇదేనా జీవితం!

అంతర్ వ్య క్తికి
అంతరాంతర శక్తికి
అనునిత్యం జరిగే
అంతులేని పోరాటం
మనిషికోర్సుకి ఔటాఫ్ సిలబస్సా?

'ది ఎలెవన్ కాజస్
ఫర్ ది డీజెనరేషన్ ఆఫ్
డివినిటీ'ని గూర్చి
లెక్చర్లు దంచే లార్డ్లూ, గాడ్లూ
మరి గప్పా గిరీశాల గురువుల తంతేనా!

మనకు మనమే ప్రశ్నలం.
ఎదుటి శాల్తీల కెప్పుడూ ఎక్స్లమేషన్లం.
ఫుల్ స్టాపా?.. కామానా?..
ఏది ఎక్కడ పెట్టాలో
ఎప్పటికీ తేలని,
కర్తెవరో తెలియని
క్రియ కర్మ పదాల సముదాయాలమా?!
ప్రశ్నాశ్చ్రర్యార్థకాల మధ్య
నిత్యం నలిగే అర్థానుస్వరాల
అంతరార్థాల అంతర్మథన
సాగరాలం మాత్రమేనా మనం?
-కర్లపాలెం హనుమంతరావు
(2013 వ సంవత్సరం, మార్చిలో అమ్మ, రుక్మిణమ్మ చనిపోయిన తరువాత రాసుకున్న కవితల్లో ఒకటి)



(పై కవితలోని కొన్ని సాంకేతిక పదాలకు నాకు తెలిసిన అర్థ వివరణః
1.ఫ్రెడరిక్ మేక్స్ మ్యుల్లర్ (డిసెంబరు 6, 1823 - అక్టోబరు 28, 1900) జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశములకు పరిచయము చేసాడు. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతము తో పోల్చడం) అనే విద్యాప్రణాళికను ప్రారంబించాడు. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే 50-పుస్తకముల గ్రంధమును ఇంగ్లీషు లోకి తర్జుమా చేయించాడు.
2.Chauvinism: By extension, it has come to include an extreme and unreasoning partisanship on behalf of any group to which one belongs, especially when the partisanship includes malice and hatred towards rival groups.
3.The 404 or Not Found error message is a HTTP standard response code indicating that the client was able to communicate with the server, but the server could not find what was requested.
Perfectionists have also been described as those who strain compulsively and unceasingly toward unobtainable goals, and who measure their self-worth with their productivity and accomplishment. Pressuring oneself to achieve such unrealistic goals inevitably sets the individual up for disappointment. Perfectionists tend to be harsh critics of themselves when they do not meet the standards they set for themselves.

5.Empirical evidence (also empirical data, sense experience, empirical knowledge, or the a posteriori) is a source of knowledge acquired by means of observation or experimentation.[1] Empirical evidence is information that justifies a belief in the truth or falsity of an empirical claim. In the empiricist view, one can only claim to have knowledge when one has a true belief based on empirical evidence. This stands in contrast to the rationalist view under which reason or reflection alone is considered to be evidence for the truth or falsity of some propositions.[2] The senses are the primary source of empirical evidence. Although other sources of evidence, such as memory, and the testimony of others ultimately trace back to some sensory experience, they are considered to be secondary, or indirect.[2]

In another sense, empirical evidence may be synonymous with the outcome of an experiment. In this sense, an empirical result is an unified confirmation. In this context, the term semi-empirical is used for qualifying theoretical methods which use in part basic axioms or postulated scientific laws and experimental results. Such methods are opposed to theoretical ab initio methods which are purely deductive and based on first principles.

Statements and arguments depending on empirical evidence are often referred to as a posteriori ("from the later") as distinguished from a priori ("from the earlier"). (See A priori and a posteriori). A priori knowledge or justification is independent of experience (for example "All bachelors are unmarried"); whereas a posteriori knowledge or justification is dependent on experience or empirical evidence (for example "Some bachelors are very happy").

The standard positivist view of empirically acquired information has been that observation, experience, and experiment serve as neutral arbiters between competing theories. However, since the 1960s, a persistent critique most associated with Thomas Kuhn,[3] has argued that these methods are influenced by prior beliefs and experiences. Consequently it cannot be expected that two scientists when observing, experiencing, or experimenting on the same event will make the same theory-neutral observations. The role of observation as a theory-neutral arbiter may not be possible. Theory-dependence of observation means that, even if there were agreed methods of inference and interpretation, scientists may still disagree on the nature of empirical data.
  a. Relying on or derived from observation or experiment: empirical results that supported the hypothesis.
b. Verifiable or provable by means of observation or experiment: empirical laws.
2. Guided by practical experience and not theory, especially in medicine.

6.Psychotronics is a term coined in 1967 by Zdeněk Rejdák for the study of parapsychology. Rejdák used this term to avoid the negative connotations of parapsychology and to define it as interdisciplinary subject, studying both the interaction between living organisms and their internal and external environment and energy processes in both these interactions.[1] The main objectives of psychotronics were to verify and study the phenomena of telepathy, clairvoyance and psychokinesis, to discover new principles of nature. He founded International Association for Psychotronic Research - I.A.P.R.. He was especially focused on perspectives in extrasensory perception and telepathy. In substantial ways, Rejdák picked up the threads of the work of Břetislav Kafka, famous Czech hypnologist and one of the founders of parapsychology
7. ఏకాక్షర శ్లోకం

యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా ||
పదవిభాగం 
యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా
తాత్పర్యం
భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు  మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం. 
(శ్రీ వేదాంత దేశికుల పాదుకాసహస్రం’ నుండి)
 ధ్యానామృతం మాయ
 మాయ’ అనే పదానికి నిర్వచనం ‘‘యా మా సా మాయా’’ అని.
యా = ఏదైతే మా = లేదో
సా = అది(దానిని) మాయా = మాయ అని అంటారు.
అంటే ‘‘ఏదైతే లేదో’’ అంటే ‘‘దేనికైతే ఆస్థికత లేదో’’ దానికి ‘‘మాయ’’ అని పేరు.
నిజానికి, ప్రపంచంలో రెండే రెండు వస్తువులు ‘‘మాయ’’.
ఒకటి- ‘‘చావు’’ అనే భావన.
రెండు - ‘‘నేను వేరే, నువ్వు వేరే’’ అనే భావన.
‘‘చావు’’ ఎక్కడా లేదు. ఉన్నదల్లా ఆది, అంతం లేని పరిణామ క్రమమే!
‘‘చావు’’ లేదని తెలుసుకున్న వాడే ‘‘మాయ’’ లోంచి బయటపడినవాడు!
అలాగే ‘‘అహం బ్రహ్మాస్మి... తత్త్వమసి’’. అంటే, ‘‘నేనూ అదే’’, ‘‘నువ్వూ అదే’’.
‘‘మహాత్మా సర్వ భూతాత్మా’’ అని తెలుసుకున్న వాడే మాయ లోంచి బయటపడినవాడు.
‘‘దేహాత్మ భ్రాంతి’’ వున్నవాడే మాయలో చిక్కినవాడు.
‘‘దేహాత్మ భ్రాంతి’’ అంటే దేహమే నేను అన్న భ్రాంతి కలవాడు.
‘‘ఆత్మే దేహం’’ అన్న జ్ఞానం వున్నవాడే మాయ లేని వాడు.
అంటే ‘‘నేను’’ అనే భావనే తన ‘‘దేహం’’, తన ‘‘స్వరూపం’’ అని తెలుసుకున్నవాడు.
ధ్యానం ద్వారానే దేహాత్మవూభాంతి తొలుగుతుంది.
నిజం- అర్థం నిఘంటువుల్లోనే దొరికేది
నిజానికి నిజజీవితంలో వెదకటం వ్యర్థం
డార్వినిజమో..డాడాయిజమో
హ్యూమనిజమో..మేల్ చౌవనిజమో
నిట్టనిలువుగా మునిగేవేళ
నమ్ముకున్న వాదమే
గుదిబండగ మారటం నిజం
యతిప్రాసల గతిభంగం 
యతిరాజులకే తప్పలేదు
పర్ ఫెక్షనిజమంటావా
ఓ పరమ సూపర్ ఫిక్షన్!
***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...