సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి, ఆ తర్వాత ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.
దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం
నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్
వారి పాలన కాలంలో ప్రధాని జీతం అతని క్యాబినెట్ మంత్రుల జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక ఇతర ప్రయోజనాలు సరే సరి. స్వతంత్ర భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి
న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం
తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే
జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః
ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద
పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ. ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం
రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.
రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల
జాబితాలో హర్యానా,
జార్ఖండ్, మధ్యప్రదేశ్,
ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు,
కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.
ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం
అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.
దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్
కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ సీఈఓ జి.పి.గుర్నాని ప్రస్తుతం రూ.165 కోట్ల
వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే
కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment