Wednesday, December 8, 2021

కాఫీరాగాలు – హాస్యం ఆంధ్రప్రభ – కాలమ్ రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రప్రభ - సుత్తిమెత్తగా - 16 -12 - 2017 - ప్రచురితం )

కాఫీరాగాలు  
- కర్లపాలెం హనుమంతరావు 
(ఆంధ్రప్రభ – కాలమ్ )
*

దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధిస్తే ఆరంభంలో  కాలకూటం అనక పీయూషం ఉద్భవించాయి. రాక్షసులకు కాలకూటం దక్కితే, దేవతలు అమృతం లభించింది. ఏమీ దొరకని మనుషుల కోసం   కాలకూటం లోంచి 'కా', పీయూషం లోంచి 'పీ' బైటకు   పీకి ' కాపీ ' అనే కొత్త కాక్ బైల్ సృష్టించాడు. కాలక్రమేణా సదరు కాపీ 'కాఫీ'గా మారి  మనిషిని ఆడిస్తున్నది. 

విషంలోని మాదకశక్తి , అమృతానికుండే  అద్భుత రుచి, రెండూ కాఫీలో కలిసుంటాయి !అమృతం , విషం హంబక్కేమో కానీ.. కాఫీ కిక్కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రియల్ ! కోక్ నుంచి కొబ్బరి బోండాం దాకా ఎన్ని డ్రింకులున్నా  కాఫీకుండే ఆ కిక్కే వేరు!  శ్రీరామనవమి బెల్లప్పానకం, ముక్కు దిబ్బడకు  వాడే మిరియం .. బెల్లం , దూడ  పుడితే  దొరికే జున్నుపాలు..
మాత్రమే తెలిసిన భారతీయుడికి   కాఫీ   మప్పి  పర్మినెంటు సర్వెంటుగా  మార్చుకున్నాడు    తెల్లతోలు తో !  

కుదిరితే కప్పు కాఫీ నాలుగు కబుర్ల  కుర్రకారు కాలంలోనూ    కాటికెళ్లే  ముసలి డొక్కులకు కాఫీ మీదే  మోజు.  ఎంత కాఫిర్ కైనా   కాఫీ దగ్గర కాసుల్లెక్కుండదు.   కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా? అంటూ వెంటబడి మరీ వేపుకు  తింటేనే ఆ కాళ్యాణం కమనీయంగా జరిగినట్లు! 

టర్కీలో  పిల్ల కాఫీ కమ్మంగా కలిపిస్తేనే  సంబంధం కలుపుకునే  ఆచారం. 

అయ్యర్లకు వరల్డువైడుగా పేర్రావడం ఫిల్టరు కాఫీ తయారీలో సైషలిస్టులు కావడం వల్లే! 

కాఫీ కాయడం క్రికెట్టాటల్లో బెట్టింగు కాయడమంతీజీ కాదు. కాఫీ మేకింగులపై అన్ లైన్   క్లాసులు పీకి  మరీ కింగులూ క్వీనులూఅయే వాళ్లకు లెక్కే లేదిప్పు డు.   

మూలక్కూర్చుని మూలిగే ముసలాళ్ళ మురిపాలే కాఫీల మీదింతలా  పెరిగి పోతుంటే పని పాటలు  చేసుకు  బ్రతికే  సంసారుల  బడ్జెటు కథ ఇహ కాఫీ స్పెషల్లా  చెప్పాలా ?

కాఫీల మీద శాస్త్రవేత్తలు కూడా అస్తమానం ఏవో దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తుంటారు. ఒక ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకబృందం  కాఫీ కేన్సరుకు తిరుగులేని మందంటుంది. ఆ మర్నాడే మరో చికాగో విశ్వవిద్యాలయం  చికోరీ లేని కాఫీ మాత్రమే సేఫని స్టేట్మెంటిచ్చేస్తుంది. అన్ లిమిటెడ్ కాఫీతో  యుట్రస్ పని వికటిస్తుందని ఊటా పరిశోధన వాక్రుస్తే ..  అదేం లేదు పుట్టబోయే కిడ్ 'విజార్డ్' అవాలంటే కెఫిన్ కాస్సంట్రేడెడ్ కాఫీ కనీసం రోజుకో పది సారైనా తల్లి 
గొంతులో దిగాలని గుయానా యూనివర్శిటీ గగ్గోలెడుతుంది . మగాళ్లకి మెదడులో కణితలు పెరిగి గభాలున గుండెలు ఆగే  అవకాశం గత శతాబ్దం కన్న అరవై శాతం అధికమయిందని అదేందో అర్థం కాని టెర్మినాలజీలో కాఫీ డ్రింకింగ్ పెరిల్స గురించో జర్మన్ శాస్త్రవేత్త  బెదిరించేస్తే  తాజా పరిశోధనలో  తాజాగా తయారైన కాఫీ తాక్కుండా ముక్కుతో పీల్చినా చాలు మెదడులోని అసిటోన్ ఎంజైమ్స్ ఉద్దీపించి  ఆ రోజంతా ఫీల్ గుడ్ మూడ్ ఉంటుందని  మన దగ్గరే ఓ హెర్బల్ పరిశోధక సంస్థ అభయహస్తం . ఆ అర్ధం కాని పాడు లెక్కలు పట్టించుక్కూర్చుంటే తాగే గుక్కెడు కాఫీ కాలకూట విషంగా తోచి రేపటి కాటి ప్రయాణం ఈరోజే  ఖాయం అవుతుంది.

ఏడో శతాబ్దపు ఈ    కాఫీ గింజలు ఎంతలా విశ్వరూపం దాల్చి ఏడిపిస్తోంది పాడు లోకాన్ని! ఎక్కడి ఇథియోపియా ఎక్కడి మేరా మహాన్ ఇండియా? ఇస్లామిక్ గాజా  వైన్- ఈ డెవిల్ కాఫీ  డ్రింక్! ఇవాళ అదే ఇండియా గుడ్ విల్ డ్రింక్ ! నిషేధించిన  క్రైస్తవమే కాఫీ రుచికి దాసోహమన్నది! మక్కా యాత్రకు  పోయిన బాబూ బుడాన్ సూఫీ వట్టి చేతులలో  రావడ మెందుకని ఏ సుమూహూర్తాన ఆ ఏడు గింజలు గిల్లుకొచ్చినట్లో గాని ,  దాని దుంప తెగిరి కన్నడ దత్తాత్రేయ కొండల గాలి తగిలి,  నూట ఏడు  దేశాల నుంచి  ప్రస్తుతం  అదే మనకు ప్రధాన ఆదాయ వనరైంది!

యూరోపు 'గుడ్ మార్నింగ్ ' మన అరకులోయ కాఫీతోనే! ఇండొనేసియా పిల్లి తిని ఆరగించుకొనే పళ్ళు ఈ కాఫీ గింజలు!  'చరిత్ర మనకెందుకు స్వామీ .. రుచి ప్రధానం  గానీ!'  అని చిరాకు పడక ఓ కప్పు కాఫీ తెప్పించుకు  తాగండి ! అప్పుడు ఏ  చెత్త వాగినా చప్పట్లు కొట్టాలనే అనిపించక తప్పదు.

'జొన్న అన్నమే ఆహారం. జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమీ' అని వాపోయాడొకప్పుడు పాపం.. ఆ తిండిపోతు కవి శ్రీనాథుడు.  ఇప్పుడతగాడే గాని  బతికుండుంటేనా .. ' కాఫీ మహాత్మ్యం ' అనే కావ్యం దివ్యంగా గిలికుండక పోనా? దేశభక్తి కవిత్వానికి ప్రసిద్ధులైన  కవులు సైతం నురుగులు గక్కే కాఫీ పైన   దండకాలు దంచేసారు. 

అభినవ సరస్వతి అనే మాస పత్రికలో గౌరావఝుల సీతారామయగారు  'కాఫీతో  సమానమైన తీర్థం మరోటి లేదు పొమ్మ' ని  తేల్చేశారు. ఏడు పదుల  ఏళ్ల కిందటే ' గృహలక్ష్మి' మహిళా సంచిక పేరు తెలియని ఒక  కవిశ్రేష్టుని దండకం ప్రచురించింది.  అమ్మవారివవుచు  నిఖిల జనంబుల/ గృహములందు దాపురించినావు / నిను భరింపలేము నిమ ద్రోయగా లేము' అని  పాపం దండకాలలో వాపోయాడు .

లీటరు రేటు   పాలకు బదులు వాటరు వాడటం   బెటరు అనిపించేవిప్పటి రోజులు.  కాఫీ పొడరు ధర వింటుంటే  బిపి పెరుగుట ఖాయం. చిటికెడు చక్కర  గుక్కెడు నీటిలో   కలిపి గుటగుట  తాగేద్దామనుకున్నా  ఆ చికోరి రుచి వలలో చిక్కి కాఫీ చుక్క గుక్క  దిగనిదే  పక్క దిగ బుద్ధవటం లేదు !

తాపీ ధర్మారావుగారోసారి కాఫీపై  దండకం చెప్పమంటే పోకూరి కాశీపతిగారు అశువుగా జగన్మోహిని కాఫీ జన్మవృత్తాంతం ఆసాంతం  గురజాడగారి  గిరీశం  మించి  కథ వినిపించారు . తొల్లి శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి సత్యభామకు పారిజాతం తెచ్చిచ్చే సందర్భంలో దారిలో దాని గింజ నేల పై రాలి కాపీ మొక్కై  మొలిచిందని కాశీపతిగారి   కాఫీ థియరీ !

'అనుదినమ్మును కాఫీయే అనలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు 
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు' అంటూ లేటెస్టుగా కాఫీ టేస్టును గూర్చి మిధునం చిత్రం కూడా సెలవిచ్చింది.  "కాఫీశ్వరీ! వెన్స్ కేఫేశ్వరీ! బ్రూకుబాండేశ్వరీ! గంట గంటా  ప్రతీ యింటా ఉప్పొంగవే  పానీశ్వరీ!' అంటూ ప్రాథేయ  పడ్డం కంపల్సరీ. మరేం చేస్తాం? మనిషిగా పుట్టేం కదా.. గిట్టే దాకా కాఫీలు తాగడం అప్పనిసరి!
***

విండో .. షాపింగ్! - కరపాలెం హనుమంతరావు- చిన్న కథ

 చిన్న కథ

ఇదివరకు ఇంటికి కావాల్సిన వస్తువు కొనాలనుకున్నప్పుడు భార్యా భర్తలు ఓ రోజు చూసుకొని దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్ళి వస్తువు మంచి చెడ్డలు కౌంటర్లో అమ్మే  అమ్మాయితోనే అబ్బాయిలోనే విచారించి కొనుక్కొచ్చుకొనేవాళ్ళు.

గ్రైండర్  కొనాలనుకొని వెళ్లిన బార్యా బిడ్డల మధ్య సాధారణంగా జరిగే సంభాషణ ఇలా ఉండేది.

రాజేష్ : ఈ గ్రైండర్ దూసావా రాధాచూట్టానికి ముచ్చటగా ఉంది. స్టైస్ టెస్ స్టీల్ ది. 

రాధ : నిజమ్ రాజేష్! జార్లు, బేడ్లు కూడా విడి విడిగా వచ్చేస్తాయి. ఏది కావాలంటే  అది చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోడం కూడా తేలిక. 

రాజేష్ : అన్నింటికన్నా ముఖ్యం ఇది మన బడ్జెట్లోనే ఉంది.

సదరు ఐటమ్ కొనేసుకుని  ఇంటికి వచ్చేయడంతో అక్కడికి షాపింగ్ కథ ముగిసిపోతుంది.

రోజులు మారాయిప్పుడు. 

అంతటా ఆన్ లైన్ షాపింగులమీద మోజు అందరికీ . దుకాణానికి వెళ్లటానికి బండి బైటకు తీయకపోతే  పెట్రోలు ఖర్చు ఆదా. పార్కింగు ప్రాబ్లెం ఉండదు. ఒక పనికని వెళ్లి మరే పని చేసుకుని . . అదీ.ఏ హోటల్లోనే టిఫిన్.. మీల్సో  చేయడమో.. సినిమా చూసెయ్యడమో! వెయ్యితో అయ్యే ఖర్చు రెండున్నర వెయ్యికి దిగుతుంది .

అదే  ఇంటి పట్టునే ఉండి... లాప్  టాప్ ముందేసుక్కూర్చుంటే ఒక వస్తువుకి వందల రకాల లింకులనుంచి  పలురకాల దుకాణాలవి  సెలెక్టు చేసుకొనే అవకాశం. బాగా చదువుకొన్న ఈ కాలపు జంటలు ఇప్పుడు ఈ ఆన్ లైన్ షాపింగులమీద తెగ మోజు పడిపోతున్నారు..

ఇందాకటి జంటకు  ఇదివరకు కొన్న  గైండర్‌ పార్ట్‌ రిపేరు కొచ్చింది  ఒక కొత్త గ్రైండర్ కొనాలన్న ఉద్దేశం కలిగింది. ఓ వీకెండ్  మధ్యాహ్నప్పూట కంప్యూటర్ ముందేసుక్కూరుచున్నారు రాజేష్, రాధా . 

రాజేష్ : ఇక్కడ చూడు రాధా! ఈ అమెజాన్ లో గ్రయిండర్‌  మనదగ్గరున్న మునపటిని లాగానే డిటాచిబుల్. మేడాఫ్ 

స్టైన్‌లెస్  స్టీల్ . మోడల్ కూడా మోడ్రన్ గా ఉంది . రివ్యూసూ బాగున్నాయి. 

రాధ: నిజమే గానీ.. చాలామంది దీనికి టూ-స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు  రాజేష్

రాజేష్:  నిజమే రాధా!  చాలా రివ్యూస్ దీన్ని అవాయిడ్ చెయ్యమనే చెబుతున్నాయి. పోనీ ఈ మోడల్ చూడు.

రాధ: నిజమే కానీ రాజేష్! దీని క్వాయిర్ ఎక్కువ కాలం ఉండటం లేదని ఓల్టేజ్ కు కాయిల్స్  కాలి పోతున్నాయని ఇక్కడ రాసారు. మరోటి చూద్దాం.

రాజేష్: పోనీ ఇది చూడు రాధా ! రివ్యూస్ కూడా బాగున్నాయి. రాధ: నిజమే కానీ.. నాకా కంపెనీ నచ్చదు.  రాజేష్.  దటీజ్ నాట్ ఏ ఫ్రంట్లీ ఒన్ ! ఇంకేదైనా చూద్దాం. 

రాజేష్: పోనీ.. ఇదో! ఈ కంపెనీకి చాలా ఎవార్డ్స్ కూడా వచ్చాయని రాసుందిక్కడ.  పై పెచ్చు  నీ ఎకో ఫ్రెండ్లీ! 

రాధ : గుడ్! కానీ ఈ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్సు మనకు సూటవుతాయా? డౌట్ రాజేష్ . 

రాజేష్ : ఇది చూడు రాధా ! 

రాధ: ఓహ్! మరీ ఇంత జెయింట్ సైజా! మన కిచెన్ అరల్లో పట్టదు బాబూ! బైటి ఉంచితే దుమ్ముకొట్టుకొని రెండు రోజుల్లోనే పాతదిలా ఐపోతుంది రాజేష్. 

రాజేష్:  ఈ ఐటమ్ నీకు తప్పకుండా నచ్చుతుంది. బుజ్జిముండలా ఎలా ముద్దొస్తుందో!

రాధ : స్టాపిట్ రాజేష్ ! గ్రైండర్ ముద్దు రావడమేంటి? ఎవరైనా వింటే నీ జెండర్ మీద డౌట్ పడతారు. మరి ఇంత చిన్న గ్రైండర్లో పెద్ద పెద్ద కొబ్బరి ముక్కలులు నలుగుతాయా? బైటికి తీసి మళ్లీ నేను గుండ్రాయితో చితక్కొట్టుకుంటూ కూర్చోవాలి. మగాళ్లు. మీకీ గోలలన్నీ తెలీవు బాబూ!

రాజేష్: ఓకే తల్లీ ! ఈ కంపెనీ ప్రొడక్టు చూడు! కిచెన్ అప్లియన్సులో స్పెషలిస్టంట! ఈ గ్రైండర్ సెల్ఫ్ గ్రాఫిక్సులో టాప్  లో ఉందీ వీకంతా. దీని బ్లేడ్సు అబ్సీడియన్ మెటల్ తో చేస్తామంటున్నారు. జార్స్ సర్జికల్ స్టీల్ మేడ్ . ఇంతకన్న మంచి మోడల్ మన ఇండియాలో దొరకడం కష్టం రాధా ! ఇటు చూడు.. దీని టెక్నాలజీ కూడా రాకెట్ మోడల్ టెక్నాలజీనే!

రాధ: కమాన్ రాజేష్!.నీకీ రాకెట్ల పిచ్చొకటి మధ్యలో . ప్రొడక్ట్ రేట్స్ చూసావా? రాకెట్ల రేట్లోనే ఉన్నాయి. దిసీజ్ సింగపూర్ కంపెనీ. రెండు వేల నాల్గొందల డాలర్లు! మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూసుకో.. నీ గుండాగిపోతుంది.

రాజేష్: వొఫ్ఫో : మోరోవర్ షిప్పింగ్ చార్జస్ కూడా ఎగ్స్త్రా మ్యాడమ్! యైటీ పైవ్ డాలర్స్.. దట్ మీన్స్...ఆల్మోస్ట్ .. ప్రైవ్ థౌంజండ్ ప్లస్!

రాధ: మన పాత గ్రైండర్ మరీ అంతేం పాడే పోలేదులే రాజేష్! వీధి చివర్లోనే ఉంది రవి షాప్. ఒక ఐదొందలు పారేస్తే.. స్టకప్ అయిన బ్లేడ్ మార్చి.. క్లీన్ చేసి కొత్తదిలా చేసిచ్చేస్తాడు! ఎప్పట్నుంచో తెల్సినవాడు .. నమ్మకస్తుడు!

రాజేష్: దటిజ్ బెటర్ రాధా!

కంప్యూటర్ క్లోజ్ చేసేయడంతో భార్యాభర్తల విండో షాపింగ్ అంతటితో ముగిసి పోతుంది. 

అన్నట్లు ఆ డెస్క్ టాప్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టం కూడా " విండోస్ - ఎలెవెన్ ! 

- కర్లపాలెం హనుమంతరావు 

02 - 11-2021 

బోథెల్ ; యూ . ఎస్.ఎ 

దయ్యమా.. నీకోదణ్ణం : ఈనాడు వ్యంగ్యం

దయ్యమా! నీకో దణ్ణం! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ( ఈనాడు దినపత్రిక సంపాదపుట సరదా వ్యాసం - 

10 -02 -2010 ) 

బాలామణీ! నీ భక్తికి మెచ్చితిని . ఏదైనా వరంకోరుకో! ..ఇచ్చి పోతాను

ఏం వరం కోరుకోమంటారండీ.

వాటర్ కోరుకోవే! అదీ నేనే చెప్పాలా? 

వాటర్  నావల్ల కాదు. కర్ణాటక వాళ్లెవరు వినరు .  కృష్ణా కావేరీ ల్లాంటివి కాకుండా వేరేవి ఏవైనా  కోరుకోరాదూ !' 

కరెంటైనా ఇచ్చిపో స్వామీ..   కోతల్లేకుండా

కాంగ్రెసోళ్లు  పవర్లోకొస్తే కంటిన్యూవస్ గా  ఇస్తామంటున్నారుగా!  ఇంతలోనే. . తొందరేల బాలామణీ! 

కాదు . వెంటనే ఇప్పిస్తేనే బాగుంటుంది. 

తథాస్తు! 

ఠకాల్మని  కరెంటు పోయింది. 

ప్రొబేషన్లో ఉన్న దేవుడా ఏందీ? ఇదేంటి స్వామీ! ఇలాగయింది? 

మీవర్గానికి పవర్ ఇచ్చే  పవరున్నట్లు లేదే' 

ఏపీలో ఫుల్ పవరంటే ఏ దేవుడి తరం కూడా కాదు గానీ... ఇంకేలైనా  కోరుకో భర్తబాలామగే! 

అదేంటి? మా నాయకుళ్ల మాదిరి క్షణంలో పిలుపు మారింది? 

భక్త బాలామణి మగడువి. అంటే నువ్వు డైరెక్టుగా నా డివోటివి   కావు గదా! నేను భక్తబాలామణికి మాత్రమే హోస్టుని . అందుకే అలా పిలిచింది. తడుముకోకుండా తొందరగా ఏదో ఒహటి తెమిలిస్తే ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడే డ్యూటీ ఎక్కింది. ఇంకా ఎన్నో అప్పాయింట్ మెంట్లు అవతల తరుముతున్నాయి 

పోనీ నీ దగ్గరున్నదేదో మా మొహాన పా పోరాదా స్వామీ!

గ్రాంటెడ్ ! నా దగ్గరో కోటి రూపాయల. . 

థేంక్యూ వెరీమచ్ 

అప్పుంది మానవా!  ఈ క్షణం నుంచీ దాన్ని తీర్చే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను.

బాబాయ్! దేవుళ్ల దగ్గర ఆదాయముంటుందిగానీ. అప్పుంటుందా ఎక్కడైనా ? దేవాదాయ శాఖ వారి దయవల్ల ముడుపులన్నీ నీ హుండీలోనే గదా స్వామీ దండిగా పడుతుండేది దేవాది దేవదేవా! 

కావచ్చు. కానీ ఫర్ యువర్ ఇన్ఫ్ల రేషన్.. నేను దేవుడిని కాదు. దయ్యాన్ని

ద .. ద.. దయ్యమా!  దగా .. మోసం!! నిన్నెవరయ్యా  తగలబడమన్నదిక్కడికీ?   అప్పనంగా అప్పులంటగట్టి పోవ టానికే వచ్చావు లాగుంది. తొండి! .. ముందిక్కణ్ణుంచీ దయచేయండీ! 

మీ ఆవిడే కదయ్యా భక్తిగా పూజ చేసిందీ ?  థింక్ ఆఫ్ డెవిల్‌  అన్నారు. తలుచుకోగానే ప్రత్యక్షమయితేనే దయ్యం.  దేవుళ్ల  టైపులో మేం తాత్సారమేం  చెయ్యం.

దేవుడి పటమనుకుని ఆ మేక్కి తగిలించిన మా బాబీగాడి హేలోవిన్ 'దయ్యం మాస్కు'కి చెంపలేసుకుని మరీ  కొంపముంచింది గదా  మా బాలామణి ! పెళ్ళిలో తలంబ్రాలు నామీద బదులు పురోహితుడి  నెత్తి మీద పోసినప్పుడే కనిపెట్టాను.. మా ఆవిడకు చూపు తక్కువని. . ఆత్రం ఎక్కువని. మూడుముళ్లు పడంగానే మూడు జోళ్లు కొని పెట్టిందందుకే. ఒకటి దగ్గరిది వెతుక్కోటానికి రెండోది దూరానివి వెతుక్కోటానికి . మూడోది రెండుజోళ్లూ వెతుక్కోటానికి. గ్లామరు తక్కువైపోతుందని ఒక్కటీ వాడిచావటం లేదు. ఇప్పుడు కొంపమునిగింది. 

దయ్యంగారి ముందు చెంపలేసుకుంటూ 'దయచేసి మా ఆవిడ పూజమనస్కారాలకో  నమస్కారం దయ్యం సాబ్‌! ! సబ్ కో మాఫ్ కరో! వరాలు వాపస్ తీస్కో! రిక్వస్ట్ .. ప్లీజ్ . . !

'కుదరదు మానవా! మీ పోలిటిక్సులోలా నడవదిక్కడ . ఇచ్చిన వరం  వాపస్ తస్కోడం మా కవమానం.  చేసిన హమీ నెరవేర్చేసే దాకా  పచ్చి రక్తం ముట్టము ' అంటూ మొండికేసిందా  దయ్యం.  ఇంతలో సెల్‌  కాలొచ్చి హెల్  గండం గడిచింది. .

దయ్యాలకు సెల్లెందుకో '?

'సిల్లీ క్వశ్చన్ . అప్పులోళ్లంతా    తలకింతని  చందాలేస్కొవిచ్చిన స్కార్ట్  బ్రాండ్ లేటెస్ట్ మోడలయ్య .. బ్రతి కున్నప్పుడు' అంది దయ్యం కాల్ టక్ మని  సగంలోనే కట్ చేసేస్తూ.  

అర్థమయ్యింది. అప్పులు తీర్చలేక ఆత్మ హత్య చేసుకునొచ్చిన  ఏపీ రైతుల  తాలూకు  దయ్యంలాగుందిది.

కాదు.  నీకు లాగా ధూమపానయోగం  నిత్యమాచారించొచ్చిన పాపిని. అందుకే దయ్యమైపోయాను నాయనా! 

' చైన్ స్మోకరా ? గుడ్. ఒక్క సిగరెట్టు ఇలా కొట్టు' 

'ఇప్పుడు తాగటం మానేశా. స్మోకింగ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ కదా: 

హరిహరీ! హెల్లో కూడా ఈ సిల్లీ రూలేన్నా ? 

'మీకన్నా ఈ దయ్యం నయం. దీన్ని చూసన్నా బుద్ధి తెచ్చుకోండి' అని సతాయిం చటం మొదలు పెట్టింది బాలామణి సందు దొరికిందికదా అని.

ఇంత కాలానికి నన్నభిమానించే ఒక భక్తురాలు దొరికింది. మళ్ళీ వచ్చి కలుస్తా!  అవతల అర్జంటుగా పార్టీ మీటింగుంది' '

' దయ్యాలకు పార్టీనా?'

'కులానికో పార్టీ.. మతానికో పార్టీ ఉన్న ప్పుడు.. ఏం .  మా భూతాలకి మాత్రం  పార్టీలెందుకు నిషేధం?  ఈసారి ఎన్నికల్లో మా పార్టీదే  అంతిమ విజయం' 

అంత ఖాయంగా ఎలా చెప్పగలవూ?'

సెన్స్ దగ్గరుంచుకుకుని సైంటిఫిక్ గా సెన్సెస్ తీస్తే జనాభాలో సగానికి పైగా మా సెక్షన్  దయ్యాలే ! ఢిల్లీ నుంచి గల్లీ  దాకా..  వల్లెల  నుంచి పట్నం దాకా .. భూతలం  మీద భూతాలు తిరుగాడని   సైట్ సెంటయినా  దొరకదని సెంట్ పర్సెంట్  గ్యారంటీగా చెపుతున్నా. భూత సంత తిలా ఇలాతలంపై  దిన దిన ప్రవర్ధమానమవుతున్నా ..  దయ్యాలకి న్యాయమైనా  ప్రాతినిధ్యం లేదనేదే మా ఆవేదన. అందుచేతనే  ముందు మా భూతాలను ప్రత్యేక జాబితాలో చేర్చాలి. జనాభా దామాషా ప్రకారం అధికారంలో వాటా దక్కాలి. లేనిపక్షంలో  అన్ని

పక్షాలలో  అసంఖ్యాకంగా వున్న మా భూత, ప్రేత, పిశాచాలనన్నింటినీ సంఘటితం చేస్తాం! ప్రత్యేక హక్కులకోసం నిత్యం పోరాటమే | విప్లవం వర్ధిల్లాలి.

ఇంట్రెస్టింగ్. మరి మీ దయ్యాలే  అధికారం లోకొచ్చేస్తే  ఏం చేస్తాయో? 

మరిన్ని కచేళాలను  సృష్టిస్తాం. హత్యలకూ , ఆత్మహత్యలకూ  అనేక రీతులో  ప్రోత్సాహం కల్పిస్తాం! మతకలహాలు, ముఠా తగాదాలు రాజకీయాలలో మరింత  చొచ్చుకునేందుకు  మావంతు కృషిని నడమొంచకుండా   చేస్తాం. అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసుకునే అభాగ్యులకు  ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తాం. మధుపానం, ధూమపానం, పేకాట, జూదం, వ్యభి చారం, హార్స్ రేసుల వంటి  వాటిని పరిశ్రమలుగా గుర్తించి, వాటిలో విదేశీ భూతాలు పెట్టుబడుల కోసం పాటుబడతాం. చేతబళ్లు చిన్నబళ్ల నుంచే  కోర్సులుగా చేపెడతాం. మతి భ్రమించిన జాతుల మధ్య    జాతీయ స్థాయి పోటీలు పెట్టి బహుమతులిస్తాం. ఎడతెగుండా  మాయలు చేసే స్వాముల సేవకు ప్రతిఫలంగా ఉదకమండలం  మించిన  స్థలాలలో  ఉచితంగా మఠాలు కట్టి  మరీ సేమిస్తాం. తరిస్తాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ..  ఏటేటా 'డెవిల్స్ డే .. ఐ మీన్ దయ్యాల దినం ఘనంగా నిర్వహించి మీ మనుషులకన్నా మేమెందుకు ఘనాఘనులమో  గంటలు కొట్టి మరీ నిరూపించుకుంటాం, . రేపొచ్చే ఎన్నికల గడువు లోపు మా పార్టీ మరింత  బలోపేతం అయ్యేటందుకు దయ్యం  జాతి సభ్యుల సంఖ్యను  కోటికి చేర్చాలన్నది  మా అకుంఠిత సంకల్పం . అందుకే అగౌరవయాత్రలు పెట్టుకుంది .. 

స్పందన ఎలాగుంది? '

'అద్భుతుం. కోటి టార్గెట్ మొదటి రోజునే  రీచయ్యాం. బురిడీ బ్యాంకులు పెట్టేసి అమాయకుల డబ్బులు  కొట్టేసే  బడాబాబులు, పరీక్ష పేపర్స్ లీకుల్చేసే ప్రొఫెషనల్ ఫోర్ ట్వంటీలు, లేని ఉద్యోగాలతో ఉద్యాగాల్లేనివాళ్ల  జేబులు కొట్టే  జిత్తుల జాకాల్సూ , జనాలదేపనిగా ఛీ . ఛా అంటూ చీదరించినా  సీరియలంటూ టీవీ ఛానెల్స్ చూర్లు పట్టుకు వేలాడే వెర్రి మొర్రి కళాకారులూ.. అబ్బో... చేప్పేందుకు టైమే టైట్! మా పార్టీలో చోటే లేదు. టైమవుట్! ఫిర్ మిలేంగే ! ఫికర్ మత్ కరో!| అంటూ నిమిషంలో మటుమాయమయిందీ మాయదారి దయ్యం. 

బాలామణీ! ముందా బాబిగాడి మాస్కు తీసవతల పారెయ్ ! భజరంగ్ భళీ బ్యాచొచ్చేస్తోంది.. ఫటాఫట్ .. ఆ రాములోరి పటమేదో ముందర్జంటుగా  తగిలించేసెయ్! కాదంటే .. రామరావణ వారయిపోతుందే  మన వాకిట్లోనే! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు దినపత్రిక సంపాదపుట సరదా వ్యాసం - 

I will -02 -2010 ) 

కథానిక: ఆలస్యం - అమృతం.. విషం - కర్లపాలెం హనుమంతరావు

 కథానిక:

ఆలస్యం - అమృతం.. విషం

- కర్లపాలెం హనుమంతరావు 

ఎడ తెరిపి లేకుండా కురుస్తోంది వర్షం.

వాన నీళ్లలోనే ఈదుకుంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది ఆటో. బాడుగ చెల్లించి ఆటో దిగి గేటుముందు కొచ్చి నిలబడ్డాడు సిద్ధార్థ .

సెల్ లో సేవ్ చేసుకున్న చిరునామాతో సరి చూస్పుకున్నాడు. గేటుపక్కన గోడలో బిగించున్న ఫలకంమీది పేరుని పోల్చిచూసుకుని సంతృప్తిగా తల పంకించాడు. పక్కనే ఉన్న భార్యామణి శ్రావణితో

"ఇదిగో 'లక్ష్మీ నిలయం' పేరు.. ఇదే.. పద తొందరగా లోపలికి !" అంటూ తనూ మూడేళ్ళ కొడుకు వేళ్ళు పట్టుకుని ఆ తుప్పరలోనే తడుస్తూ నెమ్మదిగా వరండా మెట్లెక్కాడు. కాలింగ్ బెల్ సుతారంగా

మోగించాడు.

రెండు నిమిషాల తరువాత అంతకన్నా నెమ్మదిగా తలుపు తెరుచుకుంది ఓరగా. "ఎవలూ?" అంది ఒక అమ్మాయి తలమాత్రం బైటకు పెట్టి.

"లక్ష్మీ మేడం గారిల్లేదానా ?" అనడిగాడు  సిద్ధార్థ. 

"ఔ.. ?" అందా  పిల్ల. పనమ్మాయి లాగుంది.

"మ్యాడం గారిని కలవడానికి వచ్చాను. నేను తన స్టూడెంటుని.. ఎలిమెంటరీ స్కూల్లో" అని చెప్పుకున్నాడు సిద్ధార్థ.

"ఒక్క నిమిట్" అంటూ లోపలికి వెళ్ళిం దాపిల్ల.

రెండునిమిషాలు తరువాత మళ్ళా వచ్చి తలుపులు పూర్తిగా తెరిచి "లోపలికి రాండ్రి" అంటూ దారి ఇచ్చింది.

అప్పటిదాకా సిద్ధార్థ, పిల్లాడు మెట్ల మీదా.. శ్రావణి మెట్లకిందా .. తుఫాను తేమ గాలిలో చిన్న వణుకుతూ..

చెప్పులు బైటే వదిలి దంపతులిద్దరూ వద్దికగా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. 

బైటకు కాస్త పాత మోడలే అనిపించినా .. లోపలంతా అధునాతనమైన అలంకరణ. 

గోడలమీది రకరకాల ఫోటోలు. ఈ మధ్యనే వేసినట్లున్నారు రంగులు.. ఆ బ్యాక్ గ్రౌండ్లో గ్రాండ్ లుక్ . 

గదిలో వెచ్చగా హాయిగా ఉంది..హీటరు ఆన్ లో ఉన్నట్లుంది.

"మాడం గారబ్బాయి మంచి పొజిషన్లోనే ఉన్నాడనుకుంటా!.. నేను చెప్పలా.. తన హస్తవాసి అలాంటిది మరి" అన్నాడు మెల్లిగా భార్యకు మాత్రమే వినపడేటట్లు.

గుళ్లోని దేవతను తల్చుకుని భక్తుడు పొందే తన్మయత్వంలాగుంది   సిద్ధార్థ పరిస్థితి. శ్రావణికి ఏం జవాబు చెప్పాలో తోచక మెల్లగా తలూపిమాత్రం వూరుకుంది.

ఇంతలో ఒక మూలనుంచి అలికిడి.

డోర్ కర్టెన్ నెట్టుకుని ఎప్పుడు వచ్చి నిలబడిందోగాని.. ఒక మహిళ.. కాస్త ముదురు రంగుకు తేరుతున్న మొహం.. నెరిసిన వెంట్రుకలు.. చూడంగానే గౌరవించాలనిపించే గంభీరమైన విగ్రహం. 

కళ్లజోడులోంచి ఇటే ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడివుంది. 

ఎక్కడికో బైలుదేరబోతున్నట్లుంది ఆమె తయారైవున్న తీరు. 

తటాలుమని లేచి. నిలబడిపోయాడు సిద్ధార్థ. ఆ నిలబడిన తీరులోనే తెలుస్తుంది అతనికి లక్ష్మీ మ్యాడం అంటే ఎంత గౌరవాభిమానాలో.

శ్రావణికీ లేవక తప్పింది కాదు  .

"నమస్తే మ్యాడమ్!" అన్నాడు సిద్ధార్థ  రెండు చేతులు ఎత్తి నిండు మనసుతో నమస్కరిస్తూ. 

ప్రతిగా చిరునవ్వుతో కాస్త తలూపింది గాని.. ఆ మొహంలో ఇంకా ప్రశ్నమార్కు భావం పూర్తిగా తొలగిపోనేలేదు.

అర్థమయింది సిద్ధార్థకు.

మ్యాడం తనను గుర్తుపట్టినట్లు లేదు 'ఎలా గుర్తు పడతారు ! ఎప్పుడో ఇరవై ఏళ్లకిందట చూసారు. అదీ పొట్టి నిక్కర్లలో. గడ్డాలు మీసాలు

వచ్చేసాయి తనకిప్పుడు. పెళ్ళి చేసుకుని ఒక బిడ్డకు తండ్రికూడా అయాడు. హఠాత్తుగా ఇలా వచ్చేసి 'నేను.. సిద్ధార్థను' అంటే మాత్రం గుర్తుపట్టడం సాధ్యమా! ఒక్కో క్లాసుకి నలభైయ్యేసిమంది పిల్లలుంటారు. ఐదు క్లాసులకి సుమారు రెండొందలమంది. అదీ ఒక ఏడాదికి. ఎన్నేళ్ళ బట్టి చేస్తున్నారో.. ఈ టీచరు ఉద్యోగం! ఎంతమంది సిద్ధార్థలనని గుర్తుపెట్టుకుంటారు. అందులోనూ క్లాసులో తను అంత బ్రైట్ స్టూడెంటు కూడా కాదు.'

"రాజీ..!" అంటూ లోపలికి కేకేసిందా మ్యాడం.

" కూర్చోండి ! "అని సైగ చేసింది మ్యాడం నిలబడి వుండగా తను కూర్చోవడమా! 

 అతని తటపటాయింపు ఆమెకు అర్థమైనట్లుంది.. చిరునవ్వుతో తనూ అక్కడే వున్న ఒక సోఫాలో కూలబడింది.. చేతికర్ర సోఫా పక్కనానించి.

అప్పుడు గానీ కూర్చోలేదు సిద్ధార్థ.

 ఆ కూర్చోవడం కూడా మాటవరసకు కూర్చోవడమే. 

' ఈ కాలంలో కూడా పాఠాలు చెప్పే పంతుళ్లంటే ఇంత గౌరవభావాలున్న వాళ్ళున్నారా!' లక్ష్మీ మ్యాడంకి ఆశ్చర్యంగా ఉంది. ముచ్చటా వేసింది. 

ఆబ్బాయికన్నా ఆ అమ్మాయే కాస్త నయం లాగుంది. ఆ కూర్చునే తీరులోనే తెలిసిపోతోంది' అనుకుంది మనసులో.

"ఎప్పటినుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మ్యాడం! ఇప్పటికి తెమిలింది. " 

శ్రావణి మర్యాదకోసం అంటున్నట్లు వింటోంది, సమయానికి పనమ్మాయి మంచినీళ్ళు తేవడంతో ఆ ప్రసంగానికి బ్రేక్ పడింది. 

మళ్లీ సంభాషణ ఎలాగోలా మొదలు పెట్టాలిగదా.. "మీ నాన్నగారు.. అమ్మగారు బాగున్నారా?" అనడిగిందిలక్ష్మీ మ్యాడం. 

" మీకు తెలీదా..మా నాన్న పోయి మూడేళ్లయింది మ్యాడం. అమ్మా ఆ దిగుల్తోనే మంచం పట్టి మొన్నీ మధ్యనే పోయింది. ఈసారొచ్చింది ఆ పని మీదే. ఎప్పుడొచ్చినా మిమ్మల్ని కలుద్దామనుకుని తెగ ట్రై చేస్తుంటాను. ప్.. ఎప్పుడూ కుదర లేదు. ఇప్పటికి వీలయింది. అదీ ఈ సారి ఎట్లాగైనా మిమ్మల్ని కలుసి తీరాలన్న గట్టి పట్టుదలతో ఉండబట్టి"

 సిద్ధార్థ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 

తప్పిపోయిన తల్లిని మళ్ళీ కలుసుకున్న తువ్వాయి సంతోషంలా ఉందది. 

లక్ష్మిమ్యాడంకి సంభాషణెలా ముందుకి కొనసాగించాలో సమస్యగా ఉంది. 

వూరికే వింటూ కూర్చోవడంకూడా మర్యాదనిపించుకోదు కదా ! 

" చాలా సంతోషం బాబూ ! ఇప్పటికైనా వచ్చావు. ఏం ఉద్యోగం? ఎక్కడా పని ?"అనడిగింది చివరికి. 

"బి ఎస్ ఎఫ్ కి వెళ్లిపోయా మ్యాడం. మొన్నీ మధ్యనే ప్రమోషనొచ్చింది. ప్రస్తుతం అస్సాం బోర్డర్సులో పోస్టింగు. మీకు చెప్పేదేముంది మా కుటుంబం సంగతి ! మీరే కనక ఆరోజు అట్లా అడ్డుకోక పోయుంటే మా నాయన ఆనాడే నన్ను ఏగొడ్ల సావిట్లోనో పడేసుండే వాడు. ఇప్పుడిట్లా మీముందు కూర్చునే యోగం ఉండేదా?"  సిద్ధార్థ కంఠం వణుకుతోంది. 

బహుశా కృతజ్ఞతాభావంతో కూడిన భావోద్వేగంతో కావచ్చు. భార్యతో అంటున్నాడు " ఈ మ్యాడం నన్ను వూరికే హైస్కూల్లో చేర్పించి వూరుకోలేదు శ్రావణీ ! పుస్తకాలకీ .. మధ్యమధ్య ఫీజులకీ తనే భరించేవారు. మలేరియా వచ్చి మూలుగుతూ పడుంటే ఇంట్లో వాళ్లెవళ్లూ పట్టించుకున్న పాపాన పోలా. బడికెందుకు రావడం లేదో కనుక్కుందామని వచ్చి నా అవతారం చూసి అక్కడే బావురుమన్నారీమె. నాకిప్పటికీ నిన్నగాక మొన్న జరిగినట్లుంది.. మ్యాడం మానాన్న మీద కూకలేయడం. 

పెద్దాసుపత్రిలో చేర్పించి బాగై బడికొచ్చిందాకా మా అమ్మకన్నా ఎక్కువగా అలమంటించారీ తల్లి. ఈమె గాని మా గంగానమ్మ తల్లిలాగా నా జీవితంలోకి రాకపోయుంటేనా.." వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అంత పెద్ద మిలటరీ మనిషీ చిన్న పిల్లాడై పోయి పరాయి పంచలో కూర్చొని. 

పక్కనున్న భార్యకు ఇదెంత ఇబ్బందిగా ఉంటుంది ! 

శ్రావణి అసహనంగా కదులుతోంది సోఫాలో. పరాయివాళ్లముందు చెట్టంత మొగుడిని పట్టుకుని సముదాయించడమెట్లా? 

పోనీ మందలిద్దామన్నా ఇబ్బందికరమే! 

లక్ష్మీమ్యాడంకి ఇదంతా నిజంగానే కొత్త అనుభవం . 

 కదిలిపోయింది.

లౌక్యంగా బైటపెట్టింది.

తనకూ ఆసుపత్రికి పోవడానికి ఆలస్యమైపోతుందవతల. ఏ క్షణంలో ఏ కబురొస్తుందోనని మనసులో కంగారుగానే వుంది.

'పాపం..ఎన్నేళ్ళబట్టో వెతుకుతున్నాడుట ఈ అడ్రసు కోసం .. ఒక్క పది నిమిషాలు ఓపిక పడితే పూర్తి సంతృప్తితో వెళ్ళిపోతాడు'.

ఇష్టమైన టీచర్సు ఎన్నో ఏళ్ల తరువాత కలుసుకున్న ఆనందం ఈ అమాయకుడినుంచి దూరం చేయడం భావ్యం కాదనీ అనిపించింది. 

అందుకే..  సెల్ లోపల రాజీ చేతికిచ్చి వచ్చింది. అది లోపలనుంచి ఒహటే సైగలు.. ఎందుకో ? "కాఫీ పంపిస్తాను.. తాగుతుండండి.. బోర్నవిటా తాగుతాడుగా బాబు? ఇప్పుడే వస్తా" అని పనిపిల్లకు చెప్పే మిషతో వంటింట్లోకి వెళ్ళి సెల్ అందుకుంది. 

అవతల్నుంచీ ఏ కబురు విన్నదో కానీ అసలే పాలిపోయిన మొహం మరింత తెలుపు రంగుకి తిరిగింది. 

' అడుగుదామా.. వద్దా' అని ఒక క్షణం తర్జన భర్జన పడి చివరికి ఇక్కడి విషయం డాక్టర్ గారికి చెప్పేసింది.

అతి కష్టంమీద ఆయన్ను వప్పించుకోవడంతో మరో రెండు గంటలు సమయం కలిసివచ్చినట్లయింది.

కొద్దిగా రిలీఫ్!

"రెండు గంటల్లోపయితే నో ప్రాబ్లం అనుకుంటా. ఏదైనా మన చేతుల్లో లేదుగా! వుయార్ ఆఫ్ ట్రాల్ హ్యూమన్ డాక్టర్స్. బట్ యూ షుడ్ బి ఎవేరాఫ్ యువర్ అర్జెన్సీ ఆల్ఫో.. రెస్ట్ ఈజ్ యువర్ ఛాయిస్ " అంటూ చిన్న హింటుతో హెచ్చరించడమైతే మర్చిపోలేదా డాక్టర్.

'అవును.. అర్జెన్సీ తెలుసు. ఐనా ఒక్కో సారి ఇలాంటి పరీక్షలూ తప్పవు. ఈ పరీక్షలు మన విచక్షణకు. 

ఎవరి మనసులకి వాళ్లే డాక్టర్లు ఇటువంటి సందర్భాల్లో. 

 ' కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చే సందర్భంలో తరచూ తను చెప్పే సూక్తుల్లో ఒకటది. 

' ఇప్పుడు తనకు తానే వర్తింపచేసుకోవాల్సిన సమయం వచ్చింది' అనుకుంది లక్ష్మీ మ్యాడం. 

' ఈ సిద్ధార్థ 'విజిట్' ని సాధ్యమైనంత ఎర్లీగా ముగించి క్షేమంగా బైటపడటం అందరికీ మంచిది' అని తనకు తానే హెచ్చరించుకుంటూ బైటికొచ్చిన లక్ష్మీమ్యాడం అక్కడి సీన్ చూసి దాదాపు అవాక్కయిపోయింది.

అప్పటిదాకా నీట్ గా వున్న టీపాయ్ మీద పూలూ.. పళ్లూ.. పసుపూ.. కుంకుమా.. టెంకాయా.. అగరబత్తులూ వగైరా వగైరా పూజా సామాగ్రి!

ఎప్పుడు మార్చారో పిల్లవాడి వంటిమీద అంచులకి పసుపు రాసిన కొత్త డ్రస్సు..

వాడి వళ్ళో కొత్త పలకా.. చేతిలో కొత్త బలపం! 

పెద్ద వెండి పళ్ళెంలో అక్షతలు  కలుపుతోంది శ్రావణి శ్రద్ధగా. 

వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి ఒక్కో ప్యాకే వైనంగా తీసి టీపాయ్ మీద సర్దుతున్నాడు సిద్ధార్థ. 

ఇదో అనూహ్యమైన మలుపు. ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయంగా చూసింది లక్ష్మీ మ్యాడం. 

వినయంగా అన్నాడు సిద్ధార్థ " పుట్టెంట్రుకలు తీయకుండా అక్షరాభ్యాసం కూడదంటారు కదా మీరు! మా తమ్ముణ్ని బళ్ళో వేసే ముందు పుట్టెంట్రుకలు తీయించమని ఎంత పట్టుపట్టారో.. నాకు ఇప్పటికీ గుర్తే. మీ చల్లని చేతుల మీదుగా మా పిల్లాడికి అక్షరాభ్యాసం జరగాలని నా కోరిక మ్యాడం. అందుకే మొన్న మీ అడ్రసు దొరకంగానే ముందు చేసిన పని . . మన చిత్తూరుదాకా పోయి మా గంగానమ్మ గుళ్ళో వీడికి పుట్టెంట్రుకలు తీయించడం. నిజానికి నా సెలవులు ఎప్పుడో ఐపోయాయి. అనాథరైజ్డ్  అబ్ స్కాండంటే మా సర్వీసుల్లో కొద్దిగా రిస్కే. మళ్లా నాకిటువైపు రావడం పడుతుందో.. లేదో ! మీ చేతుల మీదుగా మా బాబు అక్షరాభ్యాసం జరగాలని డేర్ చేసాను.. ప్లీజ్! మావాడి భవిష్యత్తు నాకన్నా ఉజ్వలంగా ఉండాలని దీవించండి ! మీ చల్లని చేతులతో వాడికి ఓనమాలు దిద్దపెట్టండి మ్యాడం " ఒక రకమైన ఉద్వేగంతో మాట్లాడుకుంటూ పోతున్న సిద్ధార్థ మాటలకు లక్ష్మీమ్యాడం నోటమాటరాలేదు. 

ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఉహించని ఈ సిట్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో బోధపడలేదు.

'నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి వానలు.

వాగులు వంకలూ పొంగి పొర్లుతున్నాయి. రవాణా సౌకర్యమంతా అస్తవ్యస్తమయి పోయింది. తప్పకపోతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని టీవీల్లో అరగంట కోసారి హెచ్చరికలొస్తున్నాయి. ఐనా పిల్లాడికి తన ప్రియమైన టీచరు చేతిమీదుగా మాత్రమే అక్షరాభ్యాసం చేయించాలని ఎంత పంతం ఇతగాడికి! టీచరుగారి సెంటిమెంటుని గౌరవించటం కోసం ఫ్రీ ట్రావెలింగ్ కన్సెషన్ని కూడా కాదనుకొన్నాడు సరే.. అది ఆర్థికం.. పసి ప్రాణాన్ని కూడా రిస్కులో పెట్టి  ఇలా తుఫానులో ఈ మూలనుంచి ఆ మూలకు, మళ్ళా ఆ మూలనుంచి ఈ మూలకు.. తిరిగొచ్చిన ఈ పెద్దమనిషిని ఏమనుకోవాలి!

ఎక్కడెక్కడి ప్రవాసులో వీలు చూసుకుని వచ్చి మరీ బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుపోతుంటే.. ఈ చిత్రమైన మనిషేంటి.. సాక్షాత్తూ ఆ చదువులతల్లి చల్లని వడిదాకా వచ్చీ 'లక్ష్మీ మ్యాడమో' అని కలవరిస్తున్నాడు!'

లక్ష్మీమ్యాడం తన ఆశ్చర్యాన్ని అణుచుకోలేక పోయింది. బైటికి అనకుండానూ ఉండలేకపోయింది. 

సమాధానం శ్రావణి చెప్పిందీసారి "మావారి వరకూ మీరే మా ఇంటి చదువుల తల్లి. ఈ లక్ష్మీనిలయమే ఈయనకు బాసర మ్యాడం. మీ గురించి రోజూ మాకు కథలుకథలుగా చెపుతుంటారీయన. మా అందరి దృష్టిలో మీరు మా ఇంటికి ఇంత ప్రసాదం పెట్టిన దేవత. పెద్దమనసుతో ఈ పిల్లవాడికి మీ దీవెనలు అందచేయండమ్మా"

రెండు గంటల్నుంచీ ఇక్కడే కూర్చున్నా.. శ్రావణి ఇన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడే. 

అవి చాలా పదునైన మాటలు. ఎదుటి వాళ్ళను కట్టిపడేసే పలుకులు. 

పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది లక్ష్మీ మ్యాడంకి.

'కాస్త ఆలస్యమైనా తప్పదు.. ఇదీ ఇటువైపు తాను నిర్వహించాల్సిన మరో ధర్మకార్యమని సరిపెట్టుకుంటే సరి.

' మనసులోకి ఇంకే సందేహాలు రానివ్వదలుచుకొలేదు. ఇటే మిడిగుడ్లేసుకుని చూస్తున్న రాజీ వంక చూసి" అలా దీపస్తంభంలాగా నిలబడకపోతే వాళ్ళకి కాస్త సాయం పట్టరాదుటే. పని తొందరగా తెమిలితే వాళ్ళు వేళకి బండికి అందుకుంటారూ" అని పురమాయించి. 

 లోపలి గదిలోకి వచ్చేసింది డాక్టరుగారికి ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకుంటూ విషయం వివరించడానికి ప్రయత్నించింది.

"మీరు చేస్తున్నది నిజంగా మంచి పనేనంటారా? " డాక్టర్ గారి ధర్మ సందేహం 

".. ఆ లక్ష్మీ మ్యాడం హస్తవాసిమీద పిచ్చినమ్మకంతో బిడ్డకు ఇప్పటిదాకా అక్షరమ్ముక్క అబ్బకుండా ఎండబెట్టాడు ఈ మహానుభావుడు. ఆ మ్యాడం నిర్లక్ష్యం వల్లే చెడ్డసావాసాలకు అలవాటుపడ్డ ఆమె బిడ్డ ఈ లక్ష్మీనిలయాన్ని పోగొట్టుకున్నాడని పాపం వీళ్ళకు తెలీదు డాక్టర్. కని పెంచిన సొంతబిడ్డకు కూడా చివరి రోజుల్లో భారమైన ఆ తల్లి.. ఎప్పుడో చిన్నతనంలో పాఠాలు చెప్పించుకున్న పిల్లాడి దృష్తిలో మాత్రం అపర సరస్వతీదేవి ! ఒక్క అతనికే కాదు.. ఆ ఇంట్లో పసివాడితో సహా అందరి దృష్టిలో ఆమె ఓ 'దేవతామూర్తి' లాగే ఉంది. పిల్లలు ఇవాళా రేపు తోటి మనుషుల పట్ల ఎలాంటి తుస్కార భావాల్తో ఎదుగుతున్నారో మనకు తెలుసు. చూస్తూ చూస్తూ నిజం చెప్పేసి ఆ పసివాడి మనసులోని ఒక మంచి భావనను చెదరగొట్టడం భావ్యమంటారా?" అంటూ ఎదురు ప్రశ్న వేసింది మిస్ లక్ష్మీ రమణ. 

డాక్టరు గారి దీర్ఘమైన నిట్టూర్పు వినబడింది ఫోన్లో "ఓకే.. మ్యాడం. ఒక ప్రిస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజీకి పాతికేళ్ళు ప్రిన్సిపాలుగా చేసి రిటైరయిన విజ్ఞత మీది. ఆ లక్ష్మీమ్యాడం ఎవరో కాని నిజంగా చాలా అదృష్టవంతురాలే ! లేకపోతే అదేపేరుతో ఉన్న మీరు ఆమె కొడుకునుంచి ఈ ఇల్లు కొనుక్కోవడమేమిటీ!   ఆ అడ్రసు పట్టుకుని ఇప్పుడామె శిష్యుపరమాణువు ప్రత్యక్షమవడమేమిటీ! వీలైనంత తొందరగా ఈ రీల్-లైక్-స్టోరీని సుఖాంతం చేసేసి వచ్చే ప్రయత్నం మాత్రం చేయండి మ్యాడం. గుడ్ లక్ ! అని ఫోన్ పెట్టేసారు డాక్టర్ గారు.

అక్షరాభ్యాసం తంతు ముగించేందుకు ఇంటి పురోహితుడి సెల్ నెంబరు వెదుక్కోవడంలో మునిగిపోయింది మ్యాడమ్ లక్ష్మీ రమణ. 

ఆలస్యమంటే అస్సలు గిట్టని లక్ష్మీమ్యాడం 'ఇప్పుడే వస్తాన'ని లోపలికి వెళ్ళి ఇంతసేపు ఎందుకు  తాత్సారం చేస్తుందో అర్థం కాక బైట ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాడు సిద్ధార్థ . 

అసహనంగా గోడగడియారం వంక చూస్తోంది శ్రావణి.. ఇవాళ కూడా  బండికి లేటవుతుందేమోనని ఆమె కంగారు ఆమెది . 

                *.                     *.                          *.                         *

ఐన ఆలస్యం ఎలాగూ అయింది. ఇంకొక్క రెండు వాక్యాలు ముక్తాయింపుగా చెప్పుకోక పోతే ఈ కథా శీర్షికకు న్యాయం జరిగినట్లు కాదు.

లక్ష్మీరమణ గారింట్లో అక్షరాభ్యాసం తంతు ఎంత ఆదరాబాదరాగా ముగించుకుని స్టేషనుకు పరిగెత్తినా బండి మిస్సయిపోయింది సిద్ధార్థ కుటుంబానికి. 

బల్హర్షా దగ్గర బ్రిడ్జి మీద పట్టాలు తప్పి నదిలో దూకిన బోగీల్లో ఒకటి సిద్ధార్థ  ఫ్యామిలీ బెర్తులు బుక్కైనవే!

'ఆలస్యం వల్ల విషం అమృతమయింది ' అనుకుని ఆనందించటమా?

లక్ష్మీమ్యాడం పాత్ర అత్యంత ప్రతిభావంతంగా పోషించిన అనంతరం లక్ష్మీరమణ మ్యాడం ఎంత ఆఘమేఘాలమీద ఆసుపత్రికి పరుగెత్తుకెళ్ళినా కని పెంచిన తల్లి ఆఖరి చూపులు దక్కించుకోలేక

పోయింది. 

జీవితాంతం తొలిచే లోటే అది.

'ఆలస్యం- అమృతం వంటి  అమ్మ కడసారి   చూపులకు నోచుకోలేనంత విషాదపు  క్షణాలుగా  ఓ కూతురుకు మిగిలిపోయాయి అని' చింతించడమా ? 

ఆలస్యం వల్ల – విషం అమృతమా ? 

అలస్యం వల్ల అమృతం విష తుల్యమా? 

 ***

- కర్లపాలెం హనుమంతరావు 

05 - 11 - 2021 

బోథెల్ ; యూఎస్ఎ 

విషాదం - కవిత

 విషాదం 

- కర్లపాలెం హనుమంతరావు 

( సాహిత్య ప్రస్థానం - మాసపత్రిక - ప్రచురణ ) 

కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడ్డావు. పాటా!... 

పడింది నవ్వే కాదు... నీ పాదాలు పట్టుకుని వేలాడుతున్నందుకు అందరం

నీ స్వచ్ఛంద మరణంతో చైతన్యం ఒక క్షణం స్పృహ తప్పిన మాట నిజమే. 

కానీ తొందరగానే తేరుకుంటుందిలే....

జీరబోయిన నీ రాగమే తిరిగి సర్దుకోవడం కష్టం. 

తాకట్టు కొట్టు వాకిట్లో తచ్చాడుతున్నప్పుడు 

నీకిదంతా ఎందుకు తోచలేదో...

ఇలాంటి ఒక విషాద పశ్చాత్తాప ఘడియ ఏ గేయానికి రాకూడదు.

'చే' స్పర్శకే వజ్రం పగలటం విషాదం కాక మరేమిటి?

చెమట బిందువు మీదపడి

పరావర్తనం చెందే కిరణానికున్న వెలుగు 

చెమ్కీ దండ  మీద పడితే వస్తుందా?! 

తెలిసి తెలిసీ పాటా!... 

నువ్వు ఈ పరకాయ ప్రవేశం ఎందుకు చేసినట్లో! 

భ్రాంతినీది... దిగ్భ్రాంతి మాది. 

వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని పిట్ట 

చిలుకలాగా పలకాలని ఎందుకనుకుందో! 

కత్తి అంచున నిలబడి గొంతెత్తి ఆడిపాడిన ఆ పాట నిజమా?... 

చేతిలో చెయ్యేసి చెట్టపట్టాల్ పట్టి 

కొత్త రాగంతో పాడుతున్న ఈ పాట నిజమా! 

ఒకటా... రెండా... ఎన్నియుగాల బట్టి 

నిప్పు కణికలను పుక్కిటబట్టి 

రవ్వలు వెదజల్లావు పాటా!

పుటిక్కుమని ఇలా 

రెండు రూపాయలు కొక నీటి పాకెట్ గా మారిపోయావేమిటి?! 

కలల్ని హరాయించుకోవటం అంత తేలికా? 

నిన్ను మోసిన భుజాలే నడిబజార్లో నిన్నిలా నిలదీస్తుంటే 

నీ గురించి కాదు గానీ 

నిన్ను నమ్ముకుని వచ్చిన ఆ కలల్ని గురించే 

జాలిగా ఉంది. 

వేళ్లు నరికినా, తలను తెంపినా 

ఆ కలలు మొండేలు నీ పాటే పాడుకున్నాయి 

వాటి పెదాల కిప్పుడు పదాలు తట్టని పరిస్థితి

తాత్కాలికంగానైనా తెచ్చిపెట్టింది. .. నీవేగా! తప్పు నీదే! 

సుడిగాలి నెదుర్కునేదేగా అసలైనపాట! 

నెత్తురు మీద పూచిన పువ్వు అంత తొందరగా వాడిపోదులే! 

మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా 

అడుగునున్న తడిని అమ్మటం నీ తరం కాదు... 

కొనటం వాడబ్బ తరమూ కాదు 

పాట మెలికపడొచ్చేమోగాని దాని ఆత్మది సూటి దారే! 

శ్రమజీవుల చెమట నుంచి పుట్టినది 

ఏ పరిశ్రమల జీవోలకు లొంగదు 

ఒక పాటకు రెండు నాలికలుంటాయని చెప్పి 

నువ్వే ఎటూ కాకుండా పోయావు. పిటీ! 

కవాతుకు ఒకపాట తగ్గటం మాత్రం ఒక విషాదమే!

- కర్లపాలెం హనుమంతరావు 

( వంగపండు.. బూర్జువా రాజ్యాన్ని పొగుడుతూ చిందేయడం చూసిన విషాదంలో  ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...