చిన్న కథ
ఇదివరకు ఇంటికి కావాల్సిన వస్తువు కొనాలనుకున్నప్పుడు భార్యా భర్తలు ఓ రోజు చూసుకొని దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్ళి వస్తువు మంచి చెడ్డలు కౌంటర్లో అమ్మే అమ్మాయితోనే అబ్బాయిలోనే విచారించి కొనుక్కొచ్చుకొనేవాళ్ళు.
గ్రైండర్ కొనాలనుకొని వెళ్లిన బార్యా బిడ్డల మధ్య సాధారణంగా జరిగే సంభాషణ ఇలా ఉండేది.
రాజేష్ : ఈ గ్రైండర్ దూసావా రాధాచూట్టానికి ముచ్చటగా ఉంది. స్టైస్ టెస్ స్టీల్ ది.
రాధ : నిజమ్ రాజేష్! జార్లు, బేడ్లు కూడా విడి విడిగా వచ్చేస్తాయి. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోడం కూడా తేలిక.
రాజేష్ : అన్నింటికన్నా ముఖ్యం ఇది మన బడ్జెట్లోనే ఉంది.
సదరు ఐటమ్ కొనేసుకుని ఇంటికి వచ్చేయడంతో అక్కడికి షాపింగ్ కథ ముగిసిపోతుంది.
రోజులు మారాయిప్పుడు.
అంతటా ఆన్ లైన్ షాపింగులమీద మోజు అందరికీ . దుకాణానికి వెళ్లటానికి బండి బైటకు తీయకపోతే పెట్రోలు ఖర్చు ఆదా. పార్కింగు ప్రాబ్లెం ఉండదు. ఒక పనికని వెళ్లి మరే పని చేసుకుని . . అదీ.ఏ హోటల్లోనే టిఫిన్.. మీల్సో చేయడమో.. సినిమా చూసెయ్యడమో! వెయ్యితో అయ్యే ఖర్చు రెండున్నర వెయ్యికి దిగుతుంది .
అదే ఇంటి పట్టునే ఉండి... లాప్ టాప్ ముందేసుక్కూర్చుంటే ఒక వస్తువుకి వందల రకాల లింకులనుంచి పలురకాల దుకాణాలవి సెలెక్టు చేసుకొనే అవకాశం. బాగా చదువుకొన్న ఈ కాలపు జంటలు ఇప్పుడు ఈ ఆన్ లైన్ షాపింగులమీద తెగ మోజు పడిపోతున్నారు..
ఇందాకటి జంటకు ఇదివరకు కొన్న గైండర్ పార్ట్ రిపేరు కొచ్చింది ఒక కొత్త గ్రైండర్ కొనాలన్న ఉద్దేశం కలిగింది. ఓ వీకెండ్ మధ్యాహ్నప్పూట కంప్యూటర్ ముందేసుక్కూరుచున్నారు రాజేష్, రాధా .
రాజేష్ : ఇక్కడ చూడు రాధా! ఈ అమెజాన్ లో గ్రయిండర్ మనదగ్గరున్న మునపటిని లాగానే డిటాచిబుల్. మేడాఫ్
స్టైన్‌లెస్ స్టీల్ . మోడల్ కూడా మోడ్రన్ గా ఉంది . రివ్యూసూ బాగున్నాయి.
రాధ: నిజమే గానీ.. చాలామంది దీనికి టూ-స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు రాజేష్
రాజేష్: నిజమే రాధా! చాలా రివ్యూస్ దీన్ని అవాయిడ్ చెయ్యమనే చెబుతున్నాయి. పోనీ ఈ మోడల్ చూడు.
రాధ: నిజమే కానీ రాజేష్! దీని క్వాయిర్ ఎక్కువ కాలం ఉండటం లేదని ఓల్టేజ్ కు కాయిల్స్ కాలి పోతున్నాయని ఇక్కడ రాసారు. మరోటి చూద్దాం.
రాజేష్: పోనీ ఇది చూడు రాధా ! రివ్యూస్ కూడా బాగున్నాయి. రాధ: నిజమే కానీ.. నాకా కంపెనీ నచ్చదు. రాజేష్. దటీజ్ నాట్ ఏ ఫ్రంట్లీ ఒన్ ! ఇంకేదైనా చూద్దాం.
రాజేష్: పోనీ.. ఇదో! ఈ కంపెనీకి చాలా ఎవార్డ్స్ కూడా వచ్చాయని రాసుందిక్కడ. పై పెచ్చు నీ ఎకో ఫ్రెండ్లీ!
రాధ : గుడ్! కానీ ఈ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్సు మనకు సూటవుతాయా? డౌట్ రాజేష్ .
రాజేష్ : ఇది చూడు రాధా !
రాధ: ఓహ్! మరీ ఇంత జెయింట్ సైజా! మన కిచెన్ అరల్లో పట్టదు బాబూ! బైటి ఉంచితే దుమ్ముకొట్టుకొని రెండు రోజుల్లోనే పాతదిలా ఐపోతుంది రాజేష్.
రాజేష్: ఈ ఐటమ్ నీకు తప్పకుండా నచ్చుతుంది. బుజ్జిముండలా ఎలా ముద్దొస్తుందో!
రాధ : స్టాపిట్ రాజేష్ ! గ్రైండర్ ముద్దు రావడమేంటి? ఎవరైనా వింటే నీ జెండర్ మీద డౌట్ పడతారు. మరి ఇంత చిన్న గ్రైండర్లో పెద్ద పెద్ద కొబ్బరి ముక్కలులు నలుగుతాయా? బైటికి తీసి మళ్లీ నేను గుండ్రాయితో చితక్కొట్టుకుంటూ కూర్చోవాలి. మగాళ్లు. మీకీ గోలలన్నీ తెలీవు బాబూ!
రాజేష్: ఓకే తల్లీ ! ఈ కంపెనీ ప్రొడక్టు చూడు! కిచెన్ అప్లియన్సులో స్పెషలిస్టంట! ఈ గ్రైండర్ సెల్ఫ్ గ్రాఫిక్సులో టాప్ లో ఉందీ వీకంతా. దీని బ్లేడ్సు అబ్సీడియన్ మెటల్ తో చేస్తామంటున్నారు. జార్స్ సర్జికల్ స్టీల్ మేడ్ . ఇంతకన్న మంచి మోడల్ మన ఇండియాలో దొరకడం కష్టం రాధా ! ఇటు చూడు.. దీని టెక్నాలజీ కూడా రాకెట్ మోడల్ టెక్నాలజీనే!
రాధ: కమాన్ రాజేష్!.నీకీ రాకెట్ల పిచ్చొకటి మధ్యలో . ప్రొడక్ట్ రేట్స్ చూసావా? రాకెట్ల రేట్లోనే ఉన్నాయి. దిసీజ్ సింగపూర్ కంపెనీ. రెండు వేల నాల్గొందల డాలర్లు! మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూసుకో.. నీ గుండాగిపోతుంది.
రాజేష్: వొఫ్ఫో : మోరోవర్ షిప్పింగ్ చార్జస్ కూడా ఎగ్స్త్రా మ్యాడమ్! యైటీ పైవ్ డాలర్స్.. దట్ మీన్స్...ఆల్మోస్ట్ .. ప్రైవ్ థౌంజండ్ ప్లస్!
రాధ: మన పాత గ్రైండర్ మరీ అంతేం పాడే పోలేదులే రాజేష్! వీధి చివర్లోనే ఉంది రవి షాప్. ఒక ఐదొందలు పారేస్తే.. స్టకప్ అయిన బ్లేడ్ మార్చి.. క్లీన్ చేసి కొత్తదిలా చేసిచ్చేస్తాడు! ఎప్పట్నుంచో తెల్సినవాడు .. నమ్మకస్తుడు!
రాజేష్: దటిజ్ బెటర్ రాధా!
కంప్యూటర్ క్లోజ్ చేసేయడంతో భార్యాభర్తల విండో షాపింగ్ అంతటితో ముగిసి పోతుంది.
అన్నట్లు ఆ డెస్క్ టాప్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టం కూడా " విండోస్ - ఎలెవెన్ !
- కర్లపాలెం హనుమంతరావు
02 - 11-2021
బోథెల్ ; యూ . ఎస్.ఎ
No comments:
Post a Comment