దయ్యమా! నీకో దణ్ణం!
- కర్లపాలెం హనుమంతరావు
( ( ఈనాడు దినపత్రిక సంపాదపుట సరదా వ్యాసం -
10 -02 -2010 )
బాలామణీ! నీ భక్తికి మెచ్చితిని . ఏదైనా వరంకోరుకో! ..ఇచ్చి పోతాను
ఏం వరం కోరుకోమంటారండీ.
వాటర్ కోరుకోవే! అదీ నేనే చెప్పాలా?
వాటర్ నావల్ల కాదు. కర్ణాటక వాళ్లెవరు వినరు . కృష్ణా కావేరీ ల్లాంటివి కాకుండా వేరేవి ఏవైనా కోరుకోరాదూ !'
కరెంటైనా ఇచ్చిపో స్వామీ.. కోతల్లేకుండా
కాంగ్రెసోళ్లు పవర్లోకొస్తే కంటిన్యూవస్ గా ఇస్తామంటున్నారుగా! ఇంతలోనే. . తొందరేల బాలామణీ!
కాదు . వెంటనే ఇప్పిస్తేనే బాగుంటుంది.
తథాస్తు!
ఠకాల్మని కరెంటు పోయింది.
ప్రొబేషన్లో ఉన్న దేవుడా ఏందీ? ఇదేంటి స్వామీ! ఇలాగయింది?
మీవర్గానికి పవర్ ఇచ్చే పవరున్నట్లు లేదే'
ఏపీలో ఫుల్ పవరంటే ఏ దేవుడి తరం కూడా కాదు గానీ... ఇంకేలైనా కోరుకో భర్తబాలామగే!
అదేంటి? మా నాయకుళ్ల మాదిరి క్షణంలో పిలుపు మారింది?
భక్త బాలామణి మగడువి. అంటే నువ్వు డైరెక్టుగా నా డివోటివి కావు గదా! నేను భక్తబాలామణికి మాత్రమే హోస్టుని . అందుకే అలా పిలిచింది. తడుముకోకుండా తొందరగా ఏదో ఒహటి తెమిలిస్తే ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడే డ్యూటీ ఎక్కింది. ఇంకా ఎన్నో అప్పాయింట్ మెంట్లు అవతల తరుముతున్నాయి
పోనీ నీ దగ్గరున్నదేదో మా మొహాన పా పోరాదా స్వామీ!
గ్రాంటెడ్ ! నా దగ్గరో కోటి రూపాయల. .
థేంక్యూ వెరీమచ్
అప్పుంది మానవా! ఈ క్షణం నుంచీ దాన్ని తీర్చే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను.
బాబాయ్! దేవుళ్ల దగ్గర ఆదాయముంటుందిగానీ. అప్పుంటుందా ఎక్కడైనా ? దేవాదాయ శాఖ వారి దయవల్ల ముడుపులన్నీ నీ హుండీలోనే గదా స్వామీ దండిగా పడుతుండేది దేవాది దేవదేవా!
కావచ్చు. కానీ ఫర్ యువర్ ఇన్ఫ్ల రేషన్.. నేను దేవుడిని కాదు. దయ్యాన్ని
ద .. ద.. దయ్యమా! దగా .. మోసం!! నిన్నెవరయ్యా తగలబడమన్నదిక్కడికీ? అప్పనంగా అప్పులంటగట్టి పోవ టానికే వచ్చావు లాగుంది. తొండి! .. ముందిక్కణ్ణుంచీ దయచేయండీ!
మీ ఆవిడే కదయ్యా భక్తిగా పూజ చేసిందీ ? థింక్ ఆఫ్ డెవిల్ అన్నారు. తలుచుకోగానే ప్రత్యక్షమయితేనే దయ్యం. దేవుళ్ల టైపులో మేం తాత్సారమేం చెయ్యం.
దేవుడి పటమనుకుని ఆ మేక్కి తగిలించిన మా బాబీగాడి హేలోవిన్ 'దయ్యం మాస్కు'కి చెంపలేసుకుని మరీ కొంపముంచింది గదా మా బాలామణి ! పెళ్ళిలో తలంబ్రాలు నామీద బదులు పురోహితుడి నెత్తి మీద పోసినప్పుడే కనిపెట్టాను.. మా ఆవిడకు చూపు తక్కువని. . ఆత్రం ఎక్కువని. మూడుముళ్లు పడంగానే మూడు జోళ్లు కొని పెట్టిందందుకే. ఒకటి దగ్గరిది వెతుక్కోటానికి రెండోది దూరానివి వెతుక్కోటానికి . మూడోది రెండుజోళ్లూ వెతుక్కోటానికి. గ్లామరు తక్కువైపోతుందని ఒక్కటీ వాడిచావటం లేదు. ఇప్పుడు కొంపమునిగింది.
దయ్యంగారి ముందు చెంపలేసుకుంటూ 'దయచేసి మా ఆవిడ పూజమనస్కారాలకో నమస్కారం దయ్యం సాబ్! ! సబ్ కో మాఫ్ కరో! వరాలు వాపస్ తీస్కో! రిక్వస్ట్ .. ప్లీజ్ . . !
'కుదరదు మానవా! మీ పోలిటిక్సులోలా నడవదిక్కడ . ఇచ్చిన వరం వాపస్ తస్కోడం మా కవమానం. చేసిన హమీ నెరవేర్చేసే దాకా పచ్చి రక్తం ముట్టము ' అంటూ మొండికేసిందా దయ్యం. ఇంతలో సెల్ కాలొచ్చి హెల్ గండం గడిచింది. .
దయ్యాలకు సెల్లెందుకో '?
'సిల్లీ క్వశ్చన్ . అప్పులోళ్లంతా తలకింతని చందాలేస్కొవిచ్చిన స్కార్ట్ బ్రాండ్ లేటెస్ట్ మోడలయ్య .. బ్రతి కున్నప్పుడు' అంది దయ్యం కాల్ టక్ మని సగంలోనే కట్ చేసేస్తూ.
అర్థమయ్యింది. అప్పులు తీర్చలేక ఆత్మ హత్య చేసుకునొచ్చిన ఏపీ రైతుల తాలూకు దయ్యంలాగుందిది.
కాదు. నీకు లాగా ధూమపానయోగం నిత్యమాచారించొచ్చిన పాపిని. అందుకే దయ్యమైపోయాను నాయనా!
' చైన్ స్మోకరా ? గుడ్. ఒక్క సిగరెట్టు ఇలా కొట్టు'
'ఇప్పుడు తాగటం మానేశా. స్మోకింగ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ కదా:
హరిహరీ! హెల్లో కూడా ఈ సిల్లీ రూలేన్నా ?
'మీకన్నా ఈ దయ్యం నయం. దీన్ని చూసన్నా బుద్ధి తెచ్చుకోండి' అని సతాయిం చటం మొదలు పెట్టింది బాలామణి సందు దొరికిందికదా అని.
ఇంత కాలానికి నన్నభిమానించే ఒక భక్తురాలు దొరికింది. మళ్ళీ వచ్చి కలుస్తా! అవతల అర్జంటుగా పార్టీ మీటింగుంది' '
' దయ్యాలకు పార్టీనా?'
'కులానికో పార్టీ.. మతానికో పార్టీ ఉన్న ప్పుడు.. ఏం . మా భూతాలకి మాత్రం పార్టీలెందుకు నిషేధం? ఈసారి ఎన్నికల్లో మా పార్టీదే అంతిమ విజయం'
అంత ఖాయంగా ఎలా చెప్పగలవూ?'
సెన్స్ దగ్గరుంచుకుకుని సైంటిఫిక్ గా సెన్సెస్ తీస్తే జనాభాలో సగానికి పైగా మా సెక్షన్ దయ్యాలే ! ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. వల్లెల నుంచి పట్నం దాకా .. భూతలం మీద భూతాలు తిరుగాడని సైట్ సెంటయినా దొరకదని సెంట్ పర్సెంట్ గ్యారంటీగా చెపుతున్నా. భూత సంత తిలా ఇలాతలంపై దిన దిన ప్రవర్ధమానమవుతున్నా .. దయ్యాలకి న్యాయమైనా ప్రాతినిధ్యం లేదనేదే మా ఆవేదన. అందుచేతనే ముందు మా భూతాలను ప్రత్యేక జాబితాలో చేర్చాలి. జనాభా దామాషా ప్రకారం అధికారంలో వాటా దక్కాలి. లేనిపక్షంలో అన్ని
పక్షాలలో అసంఖ్యాకంగా వున్న మా భూత, ప్రేత, పిశాచాలనన్నింటినీ సంఘటితం చేస్తాం! ప్రత్యేక హక్కులకోసం నిత్యం పోరాటమే | విప్లవం వర్ధిల్లాలి.
ఇంట్రెస్టింగ్. మరి మీ దయ్యాలే అధికారం లోకొచ్చేస్తే ఏం చేస్తాయో?
మరిన్ని కచేళాలను సృష్టిస్తాం. హత్యలకూ , ఆత్మహత్యలకూ అనేక రీతులో ప్రోత్సాహం కల్పిస్తాం! మతకలహాలు, ముఠా తగాదాలు రాజకీయాలలో మరింత చొచ్చుకునేందుకు మావంతు కృషిని నడమొంచకుండా చేస్తాం. అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసుకునే అభాగ్యులకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తాం. మధుపానం, ధూమపానం, పేకాట, జూదం, వ్యభి చారం, హార్స్ రేసుల వంటి వాటిని పరిశ్రమలుగా గుర్తించి, వాటిలో విదేశీ భూతాలు పెట్టుబడుల కోసం పాటుబడతాం. చేతబళ్లు చిన్నబళ్ల నుంచే కోర్సులుగా చేపెడతాం. మతి భ్రమించిన జాతుల మధ్య జాతీయ స్థాయి పోటీలు పెట్టి బహుమతులిస్తాం. ఎడతెగుండా మాయలు చేసే స్వాముల సేవకు ప్రతిఫలంగా ఉదకమండలం మించిన స్థలాలలో ఉచితంగా మఠాలు కట్టి మరీ సేమిస్తాం. తరిస్తాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ .. ఏటేటా 'డెవిల్స్ డే .. ఐ మీన్ దయ్యాల దినం ఘనంగా నిర్వహించి మీ మనుషులకన్నా మేమెందుకు ఘనాఘనులమో గంటలు కొట్టి మరీ నిరూపించుకుంటాం, . రేపొచ్చే ఎన్నికల గడువు లోపు మా పార్టీ మరింత బలోపేతం అయ్యేటందుకు దయ్యం జాతి సభ్యుల సంఖ్యను కోటికి చేర్చాలన్నది మా అకుంఠిత సంకల్పం . అందుకే అగౌరవయాత్రలు పెట్టుకుంది ..
స్పందన ఎలాగుంది? '
'అద్భుతుం. కోటి టార్గెట్ మొదటి రోజునే రీచయ్యాం. బురిడీ బ్యాంకులు పెట్టేసి అమాయకుల డబ్బులు కొట్టేసే బడాబాబులు, పరీక్ష పేపర్స్ లీకుల్చేసే ప్రొఫెషనల్ ఫోర్ ట్వంటీలు, లేని ఉద్యోగాలతో ఉద్యాగాల్లేనివాళ్ల జేబులు కొట్టే జిత్తుల జాకాల్సూ , జనాలదేపనిగా ఛీ . ఛా అంటూ చీదరించినా సీరియలంటూ టీవీ ఛానెల్స్ చూర్లు పట్టుకు వేలాడే వెర్రి మొర్రి కళాకారులూ.. అబ్బో... చేప్పేందుకు టైమే టైట్! మా పార్టీలో చోటే లేదు. టైమవుట్! ఫిర్ మిలేంగే ! ఫికర్ మత్ కరో!| అంటూ నిమిషంలో మటుమాయమయిందీ మాయదారి దయ్యం.
బాలామణీ! ముందా బాబిగాడి మాస్కు తీసవతల పారెయ్ ! భజరంగ్ భళీ బ్యాచొచ్చేస్తోంది.. ఫటాఫట్ .. ఆ రాములోరి పటమేదో ముందర్జంటుగా తగిలించేసెయ్! కాదంటే .. రామరావణ వారయిపోతుందే మన వాకిట్లోనే!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు దినపత్రిక సంపాదపుట సరదా వ్యాసం -

I will -02 -2010 )

No comments:
Post a Comment