Sunday, February 20, 2022

వ్యాసం శ్రీరాముడు - వసంతం

  వ్యాసం 

శ్రీరాముడు - వసంతం 

శ్రీమతో కోలవెన్నుమలయవాసిని

చిత్ర - సకుటుంబ సచిత్ర మాస పత్రిక - మాస - మార్చి 2015) 


 శ్రీరామునికి  వసంత ఋతువుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది


భారతీయుల కాల పరిగణనలో రుతువుకు 2 నెలలు చొప్పున  ఒక  సంవత్సరాన్ని ఆరురుతువులుగా భావించారు క్రనుంలో చైత్ర వైశాఖలలో  వచ్చే రుతువు వసంతం ఉగాదిపర్వదినం తటస్తించేది  రుతువులోనేదశావతారలలోని మొదటి మూడింటికి చైత్రమేతల్లిచైత్ర బహుళ పంచమిమత్స్య జయంతిచైత్ర బహుళ త్రయోదశి వరాహ జయంతివసంత ఋతువులోని మరో మాసమైన వైశాఖ మాసంలోశుద్ధ ద్వాదశి పరశురామజయంతి. . శుద్ధ చతుర్దశినృసింహ జయంతి. .   వసంత రుతువు నారాయణుని ఐదుఅవతారాలకు నాంది వసంత రుతువు


తెలుగువాళ్లం ఉగాది నుండి  నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం . ఇవే  వసంత నవరాత్రులురుయు సంబంధిత నవరాత్రులకు  శ్రీరామ సంబంధం కూడా ఉంది రాముడు తల్లిగర్భంలో వర్ధమానమయే సమయం కాబట్టి ఇది గర్భనవరాత్రులూ అయ్యాయి.  


రాముడి  జీవితక్రమంలో వసంత ఋతువుకు.. ముఖ్యంగా చైత్రమాసానికి చాలా  ప్రాముఖ్యత  కద్దు


 వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ పన్నెండో సర్గ మొదటి శ్లోకంలో  తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్సు మనోహరే వసంతే సమనుప్రాప్తి రాజోయష్టుం మనో.. రవత్. ( 1.12.11) " అంటూ చేసిన వసంత కాల ప్రస్తావన దశరథుని పుత్రకామేష్టి  యాగానికి తద్వారా శ్రీ రామజననాకి దారితీస్తుంది దానికి ముందు దశరథుడు సంకల్పించిన అశ్వమేధమూ వసంత  రుతువు చైత్ర మాసంలోనే


యజ్ఞపురుషుడి దివ్య పాయసం సేవించిన దశరధుని ముగ్గురు భార్యలు గర్భవతులయి  మళ్లీవచ్చిన వసంత చైత్రమాసంలో నవమి తిథి - శుక్ల పక్షంపునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో  పట్టపు రాణి కౌసల్య గర్భం నుండి శ్రీరామ జననం  సంభవించింది


రావణ సంహరణ లక్ష్యంగా సాగిన రామావతార ప్రయాణంలో అతి ముఖ్యమైన మలుపుకుదశరథుని గత్తర రామపట్టాభిషేక సంకల్పం మూలమైంది . కైక కోరిక కారణంగా రామపట్టాభిషేకం భంగమయిందీ వసంతకాలం ఆగమించే చైత్ర మాసంలోనే . 


రాముడి వనవాస ప్రయాణం .. వారిస్తూ వెంటబడిన సోదరుడిని నివారిస్తో తన పాదుకలకు  పట్టాభిషిక్తం చేసుకుని ప్రతినిధిగా  తమ్ముడు పాలన చేసేందుకు దాశరథి అంగీకరించినకారణంగా   ..  చిత్రకూటంలో చిత్రంగా  జరిగినా ' పాదుకా పట్టాభిషేకం కూడా వసంతఋతువు  వైశాఖ మాసంలోకేవాడం విచిత్రమే చిత్రకూటంలో  చిత్రమైన పాదుకాపట్టాభిషేకం జరిగింది.


వనవాసంలో రావణాసురుడు చైత్రమాసంలో సీతాపహరణానికి ఒడిగట్టిన కారణాన  రామునికి పత్నీ వియోగం సంభవించిందీ వసంత రుతువు ఆరంభంలోనే


అదే సందర్భంలో రామసోదరులకు జటాయుమ సందర్శనా భాగ్యం సంభవమయిందీవసంత రుతు కాలంలోనే


శబరి ఏరి తెచ్చిన మధురఫలాలతో రామ లక్ష్మ ణులు సేదదీరిందీ వసంత ఋతువులోనే


సీతాన్వేషణలో రామలక్ష్మణులు పంపాతీరాన్ని చేరుకున్న సందర్భంలో పంపాసరోవరప్రాంతంలోని వసంత శోభను చూసిన రాముడు సీతా తట్టుకునే నిగ్రహం కోల్పతాడు.   పుష్పమాసే సుదుస్సహః' - పుష్పాలతో నిం డిన చైత్రమాసంలో  సీతలేని జీవితం నాకుభరింప శక్యం కాకుండా ఉందిఅంటూ విలపించడం  వసంత మాస మరో పార్శ్వాన్నీప్రదరిస్తుంది


 ప్రియురాలి తలుపులను రేకెత్తించినందు వల్లనే అంత ధీరోదాత్తుడయివుండీ రాముడుపంపా సరోవర వసంత శోభ  ముందు తేలిపోతాడు.   వసన్తోయది తత్రాపి యత్రమే వసతిప్రియా నూనం పరవతా సీతాపి శోచత్యహం యధా ' - 

నా ప్రియు రాలు సీత ఉన్నచోటా  వసంతఋతువే  ఉండి  తననూ నన్ను లాగే పీడిస్తుందికదా! 'అంటూ మితభాషి రాముడు సైతాం అమితంగా వాపోవడం  చూస్తే ఎంతటిశక్తివంతులయినా ప్రకృతి ముందు బలహీనులే కదా అనిపించక మానదు . 


రామభక్తి రాజ్య సామ్రాట్  హనుమ  తొలి శ్రీరామ శుభ పరిచయమూ    వసంత ఋతువులోనేమిత్ర శబ్దానికి సార్థక నామధేముడు  సుగ్రీవుడు   వ్యవహరించిన  శ్రీరామునితోఅగ్నిసాక్షిగా సఖ్యం చేసుకున్న శుభ తరుణమూ వసంతరుతు కాలమే


సీతాన్వేషణ నేపథ్యంలో  హనుమ జాంబవంతాదులు స్వయంప్రభ  పుణ్యమా అనిచిక్కడిన గుహ నుంచి బైటపడే సమయానికి వసంతం వచ్చేస్తుందితమ రాజు సుగ్రీవుడుఇచ్చిన గడువు దాటి పోయిందని వానరసేన భీతి చెందిందీ అప్పుడప్పుడే వృక్షాలి చిగురుతొడిగే వసంతకాలన్ని చూసేనని ఓా చక్కని శ్లోకంలో వాల్మీకి వర్ణిస్తారు


వసంత శోభ శుభస్కరంగా ఉంటుందని నమ్మిక . అందుకు విరుద్ధంగా భీతి కలిగిస్తున్నదనిదురపిల్లే వానరయోధులకు సంపాతి జటాయువు మార్గ మధ్యంలో తటస్థించి రామపత్నిఅపహరణ సన్నివేశం పూసగుచ్చినట్లు చెప్పి  ఎత్తుకెళ్లిన రావణుడు ఉండే దిశ కూడాచూపించి వసంతం శుభదాయకమైనదే అని నిరూపిస్తాడు


కథాక్రమంలో ఫాల్గుణ మాసం చివరి రోజు అమావాస్యనాడు రావణాసురుడి సహరణ జరిగి   విభీషణ పట్టాభిషేకంపుష్పక విమానంలో   సపరివార సమేతంగా కైకేయి ఇచ్చిన గడువుకునంది గ్రామం చేరిన శ్రీరామచంద్రుడు సోదరుడు భరతునితో  పునస్సమాగమనం చేసిందివసంతరుతు కాలంలోనే . 


ఆఖరుకు అయోధ్యలో సీతారాముల పట్టాభిషేకం మహాఘనంగా జరిగింది కూడా వసంతరుతువు ప్రసాదించిన ఆహ్లదకర వాతావరణంలోనే

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...