Sunday, December 12, 2021

పేగుబంధం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 )

పేగుబంధం

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 

చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది.'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణాఅని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధమగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదువినుకాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారునీ/ యరుదగు కంబు గంఠమున కంజలినీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్బెళుకు క్రౌనుకు మ్రొక్కెదబంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదుఅర్జనుడి రాక ముందు నుంచే రాజ్యందర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూనేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్నభార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ..కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం.

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలుఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతోనిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీన దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో మ్మ’ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం.  ఆమె ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

తరతరాల వెలుగు తాలుపులైనాతరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు కౌసల్య’ మాతనుతలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్య కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!అంటూ అంతలాతల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్యధనధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగాఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయిమందరశూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదోజరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో..ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు!

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులనుమిత్రులనుముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే  సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువుకేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం.స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనాకాలం ఎప్పటిదైనాప్రాంతం ఎక్కడిదైనావైవిధ్యాలువైరుధ్యాలుఅంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతిఅంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైనముది వెంగలి యైనగురూపి యైననున్త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించియొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతికి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరనుయంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ 

మగువంటే మగవాడి మర-యంత్రమా?

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకుకాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

  యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకునమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ?

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండంనుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

-    కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

పేగుబంధం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 )

 పేగుబంధం

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 

వత్సం అంటే ఆవుదూడ. అది పుట్టినప్పుడు దాని ఒంటినిండా మావి అలముకుని జుగుప్సావహంగా ఉంటుంది. అప్పుడు వత్సల(గోమాత) బిడ్డ దేహంమీద మకిలి అంతటినీ స్వయంగా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ప్రేమగా, ఆత్మీయంగా, శ్రద్ధగా తల్లిగోవు ఆ పని చేస్తున్నప్పుడు వ్యక్తమయ్యే గొప్ప భావాన్నే వాత్సల్యం అంటారు. వాత్సల్యం తల్లుల సొత్తు. మాతృత్వం అనేది సృష్టిలోని ఒకానొక మహత్వపూర్ణమైన అనుభూతి. అది బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ! తల్లి అనిపించుకోవడానికి స్త్రీ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. అమితమైన బాధను ఓర్చుకుంటుంది. ప్రసవ వేదన ఎంతటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది. రైలు పట్టాలమీద పెట్టిన నాణెం చక్రాలకింద నలిగి వెడల్పవుతుంది చూశారా! కాన్పులో బాధను దానితో పోల్చి చెప్పిందొక కవయిత్రి. దుర్భరమైన నొప్పులను ఓర్చుకున్న అమ్మ నలుసును చూడగానే సంతోషంగా నవ్వుతుంది. అమ్మనొప్పులకు కారణమైన ఆ బిడ్డ మాత్రం ఏడుస్తాడు. అదే సృష్టిలోని చిత్రం! కన్నాక కూడా కొన్నాళ్ళపాటు తన నోటిని కట్టేసుకుని తల్లి పథ్యంచేస్తూ బిడ్డకు మాత్రం తియ్యని పాలిచ్చి పెంచుతుంది. సంతానాన్ని పెంచి పెద్దచేసే క్రమంలో ముఖ్యభూమిక వహిస్తుంది. తల్లి పెంపకంలో గొప్పగొప్ప యోధులైనవారు చరిత్రలో మనకు చాలామంది కనిపిస్తారు. పురాణ కాలంలో పాండవులు మొదలు, ఆధునిక యుగంలో శివాజీ దాకా మహాయోధులైన వారెందరిపైనో తల్లి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. దాన్ని గుర్తించాడు కాబట్టే 'ప్రపంచంలో గొప్పవారంతా తమ తల్లుల లక్షణాలను అధికంగా పుణికిపుచ్చుకున్నవారే' అని నిర్ధారించాడొక తత్వవేత్త. 'ఒడిలో కూర్చొనియుండ, నీవు మమతాయోగమ్ము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునపుడేమో గాఢసంరక్షలో గుడిలో దీపము వోలెనుంటి...' అన్న ఒక మహాసహస్రావధాని మాట- అమ్మ ఒడిలోని భద్రస్థితికి కవితాకర్పూర నీరాజనం.

అమ్మ జన్మదాత అనుకుంటే- నాన్న జీవదాత! దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషేహవా... అనే ఐతరేయమంత్రం- తండ్రి శుక్రం ద్వారా తల్లి గర్భంలో దేహాన్ని పొందడం జీవుడికి మొదటి జన్మగా చెప్పింది. శిశువు రూపంలో భూమిమీద పడటం రెండో జన్మ. అక్కడినుంచి తండ్రి సంరక్షణ మొదలవుతుంది. తల్లీతండ్రీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళకోసం అవసరమైతే, తాము పస్తులుండటానికి సిద్ధపడతారు. తమ పిల్లలు తమకన్నా అన్నివిధాలా పెద్దస్థాయిలో జీవించాలని కోరుకుంటారు. తపనపడతారు. త్యాగాలు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెద్దవాళ్ళను చెయ్యడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇష్టంగా నిర్వహిస్తారు. ఊహ తెలియగానే పిల్లవాణ్ని 'నీ బతుకు నువ్వు చూసుకో' అనడానికి భారతీయ తల్లిదండ్రులకు మనసొప్పదు. 'భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే- ఆ ముడి సంతానం' అన్నాడు భర్తృహరి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ పేగుముడే- మనిషి అసలైన జీవ లక్షణం. చమురు ఆవిరైతే దీపం ఏమవుతుంది? బంధం శిథిలమైతే బతుకులో ఇక ఏముంటుంది? భార్యాభర్తలు విడిపోవచ్చు, చెడిపోవచ్చు గాని- తల్లిదండ్రులుగా మారాక బాధ్యతగా జీవించవలసిందేనని మన పెద్దల తీర్మానం. భార్యాభర్తల మధ్య ముందు ఏర్పడ్డ దూరం పిల్లలనే ముడితో తరిగిపోతుందంటారు వేటూరి ప్రభాకరశాస్త్రి. 'సంతానం కలగడంతో ఎన్నో సమస్యలు సమసిపోయి భార్యాభర్తలు దగ్గరకావడం మనం చూస్తున్నాం. అలాగే ప్రేమపెళ్ళిళ్లను ఆమోదించలేక విడిపోయిన కుటుంబాలు సైతం కొత్త జంటకు పిల్లలు కలిగేసరికి తిరిగి కలగలసిపోవడం మనం ఎరుగుదుం. అదే 'సుతాకారపు ముడి' అంటే! దాని ప్రభావం తియ్యనిదేకాదు, బలమైనది కూడా!

అనుబంధాలూ ఆత్మీయతలూ లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని సాదరంగా, ఆత్మీయంగా చూసుకోవాలి. ఆ సంప్రదాయ పరంపర తరవాతి తరానికి ఆదర్శం కావాలి. గడపడానికీ, జీవించడానికీ మధ్య తేడా అదే! తన తల్లిదండ్రుల పాదపద్మాలను ప్రీతిగా 'ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్నను విమల తరము...' అని స్తుతించాడు పాండురంగడు. స్వతహాగా చదువూసంధ్యా అబ్బకపోయినా- కౌశికుడంతటివానికి జ్ఞానబోధ చేయగలిగే స్థాయి వివేకం తనకు దక్కడానికి కారణం తల్లిదండ్రులకు చేసిన సేవలే అన్నాడు- భారతంలో ధర్మవ్యాధుడు. ఆడపిల్లలు తండ్రిమీద, మగపిల్లలు తల్లిపైన ప్రేమ అధికంగా కలిగిఉంటారని చెబుతారు. మనమూ పిల్లల్ని 'నువ్వు అమ్మ పార్టీయా, నాన్న పార్టీయా' అని ఆరా తీస్తుంటాం. 'వాడు అమ్మ కూచి... ఆమె నాన్న కూచి' అంటూ ముద్రలు వేస్తుంటాం. ఏ రకంగా ముద్రలు వేసినా, ఎటువైపు మొగ్గుచూపినా పిల్లలందరూ తమ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు. అమ్మానాన్నా ఒకరినొకరు మనసారా ప్రేమించడం, గౌరవించడమే పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇటీవల హైకోర్టు ధర్మాసనం సైతం ఇదే విషయాన్ని ఒక జంటకు వివరించింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కాపురంలో కలతలు మొదలై ఆ జంట విడిపోయింది. పిల్లలిద్దరూ చెరో చోటా ఉండిపోయారు. అయిదేళ్ళు గడిచాక విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు చిన్నపాపను న్యాయమూర్తి పిలిచి 'నీకు అమ్మానాన్నల్లో ఎవరు కావాలి?' అని అడిగారు. ఆ పిల్ల చేతులు జోడించి 'నాకు అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ కావాలి' అని దీనంగా అడిగింది. దాంతో న్యాయమూర్తి చలించిపోయారు. జనం కరిగిపోయారు. తల్లీతండ్రీ కన్నీటితో సతమతమయ్యారు. కరుణ రసాత్మకమైన ఆ ఘటనతో వారిద్దరూ పశ్చాత్తాపానికి లోనయ్యారు. తిరిగి ఒకటవుతామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పేగుబంధం తన ప్రభావాన్ని చూపించింది. ఆ కుటుంబం ఆనందాశ్రువులతో ఒక్కటైంది. సమాజంలో వస్తున్న గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది.

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 

గుండు జాడీ - సరదా కథానిక -కర్లపాలెం హనుమంతరావు

గుండు జాడీ- కథానిక

T

'ఆవగాయ అయిపోయింది. మీ అల్లుడిగారికి ముద్ద దిగడం లేదు. అర్జంటుగా ఓ చిన్నగుండు జాడీడైనా పమ్మిం'చమని మా తోడల్లుడుగారి మూడో కూతురు ఉత్తరం రాసింది.

ఆ పిల్ల మొగుడు వినాయకరావుకు అదేదో బ్యాంకులో ఉద్యోగం. ఈ మజ్జెనే బెజవాడ బదిలీ అయింది.

కృష్ణలో మునగాలనీ, కనక దుర్గమ్మను చూడాలనే వాంఛితం వల్ల నేనే బండెక్కా జాడీ పట్టుకుని.

తెనాలి దగ్గర ఓ ఎర్ర టోపీ పెట్టెలో కొచ్చింది. 'పేలుడు సామాను బండిలో ఉండకూడద'ని పేచీ పెట్టుక్కూర్చుంది సీటు కిందున్న జాడీ చూసి. అది పేలే పదార్థం కాదని నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

లంఖణాల బండి ముక్కుతూ మూలుగుతు బెజవాడ చేరేసరికి చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి.

అదెక్కడి ఫ్లాట్ ఫారం! పెళ్లిపందిరిలా వెలిగిపోతో ఉంది. ఏవిఁ జనాలూ! ఎంత హడావుడీ! మా వూరి సంతే అనుకుంటే అంతకు వంద రెట్లు ఎక్కువగా ఉందీ వింత! ఈ సందోహంలో మా వాణ్ణి ఎట్లా పసిగట్టడం? అసలా శాల్తీనే గుర్తుపట్టడం కష్టం. పదేళ్ల కిందట పెళ్ళి వెల్తుర్లో చూడ్డవేఁ. ఇంకా అట్లాగే ఈకలు పీకిన కోడిలా ఉంటాడా?

అయోమయంగా జాడీ పట్టుకుని నడి ప్లాట్ ఫామ్మీద తచ్చాట్టం మొదలుపెట్టాను. ఈ కాఖీవాలా, రైల్వేపోలీసనుకుంటా.. కర్రకొట్టుకుంటూ వచ్చాడు.

'అగ్గిపెట్టుందా?'

ఇచ్చాను.

'సిగిరెట్టూ?'

నాకు చుట్టలు పీల్చడం అలవాటు. 'లేద'న్నాను.

'సిగిరెట్టు లేకుండా వట్టి అగ్గిపెట్టెందుకుందీ? ఎక్కడ అగ్గిపెట్టబోతున్నావ్? నీ వాలకం అనుమానంగా ఉంది. నీ చేతిలో అదేంటీ? టైం బాంబా?'

'బాంబు కాదండీ! ఆవగాయ జాడీ!'

'ఆవగాయా? వో క్యా హైఁ! ఖోల్దో!' ఏందో గోల!

జాడీ క్కట్టిన వాసెన విప్పి చూపించక తప్పింది కాదు.

లోపలికి తొంగి చూసి ఉలిక్కిపడ్డాడు. 'అమ్మో! రక్తం.. రక్తం!'

'తెలుగు వాడై ఉండడు. ఆవగాయంటే అర్థమవడంలేదు.

'రక్తం కాదండీ! నూనె!' నమ్మించడానికి జాడీలో వేలు ముంచి ఆ పోలీసోడి నాలిక మీదింత రాశాను.

అంతేఁ! ఎగిరి గంతేశాడు.

'పెలింది. గూబ్బేలింది' అంటు చెవులు రెండూ పట్టుక్కూర్చున్నాడు. నష్టపరిహారం కిందో వంద రూపాయలు వదులుకుంటే గాని వాడు నన్ను వదల్లేదు.

వినాయకరావిక రాడు. కార్డంది ఉండదు. ఇట్లాంటి ఉపద్రవాలన్నీ ముందే పసిగట్టే అతగాడింటి వివరాలన్ని రాయించి రొంటిన పెట్టుకునుంది. స్టేషన్ బైట సగం మెట్ల మీదుండగానే ఓ కుర్రాడొచ్చి నా జాడీ మీద పడ్డాడు. ఇంకా చాలామంది ఆ అవకాశం కోసం చుట్టూ మూగిపోయారు. అంతా కలసి నా చంకలోని జాడీని గుంజేసుకుంటున్నారు. బూతులు!.. గోల!

'ముందు నేనూ పట్టుకుంది. ఇది నాదీ!'

'ముందు నేన్చూశానెహె! జాడీ నాదీ..'

'కాదు నేం జూశాన్రా లం.. కొడకా!'

'ఇలాగిచ్చీసెయ్యండి సార్ .. జాడీని'

నా జాడీని పట్టుకుని నాది.. నాదని వాదులాడుకునే వాళ్లను చూసి ముందు నేను బెంబేలెత్తిపోయాను. బెజవాడ మనుషులు ఎంతకైనా తగుదురని మా బామ్మర్ది మాటలు గుర్తుకొచ్చి బలం కొద్దీ పరుగెత్తాను జాడీతో సహా!

వెనక నుండి ఈలలు.. గోల! బూతు మాటలు కూడా!

 నవ్వుల్తో కలిసి! వాళ్లంతా రిక్షావాళ్లట! తర్వాత తెలిసింది!

ఆదుర్దాలో ఎంత దూరం పరుగెత్తుకొచ్చానో నాకే తెలీదు. కుదుపులకు జాడీ మీద మూత కదిలినట్లుంది. వాసెనక్కట్టిన గుడ్డ ఆవనూనెకు  ఎరుపు రంగుకు తిరిగింది. మాడు కూడా కొద్దిగా మంటెత్తుతోంది.

ఇహ నడక నా వల్ల కాదు. ఎంత దూరవఁని నడుస్తా మీ దిక్కూ మొక్కూ లేని ఊళ్ళో! అందునా మా వినాయకరావుండే 'ఆంజనేయ వాగు' ఆనవాలు బొత్తిగా లేదు!

దార్న పోయే రిక్షాను పిలిచాను. వాడు దగ్గర దాకా వచ్చి జాడీని చూసి ఝడుసుకున్నట్లున్నాడు.. అదే పోత.. ఓ మాటా పలుకూ లేకుండా!

అతి కష్టం మీద మరో బండి పట్టుకున్నా! వాడి క్కొంచెం గుండె ధైర్యం ఎక్కువే సుమండీ! 'ఎక్కడికీ?' అనడిగాడు.

'వాగు లోకి' అని ఇది కూడా ఉందని జాడీని చూపిస్తూ. వాడూ ఝడుసుకున్నాడు. 'ఏంటదీ? ఎర్రంగా కార్తా ఉంది? మడిసి తలకాయ కాదు గందా?' అని ఆడిగాడు నా వంక అదోలా చూస్తూ!

ఈ గుండు జాడీ నా కొంప ముంచేట్లుందివాళ!

'ఏడు రూపాయలివ్వండి!  మూడో కన్నుకు కానకుండా వాగులోకి దింపించేత్తాను. రగతం రిసుకు మరి!' అన్నాడు దగ్గరి కొచ్చి గొంతు తగ్గించి.

ఆవకాయరా బాబూ! అని అక్కడికీ చిలక్కి చెప్పినట్లు చెప్పి చూశా. నా మాట నమ్మడంలే! అట్లాగని వదలటవూఁ లేదు. ఇట్లాంటి సాహసాలు ఇంతకు ముందు ఎన్ని చేశాడో! ఇప్పుడు నాకు వణుకు మొదలయింది.

'బెజవాడలో రిక్షా రేట్లు దారుణంగా ఉంటాయి. రిక్షా తొక్కె వాళ్లు అంత కన్నా దారుణంగా ఉంటారు. సాధ్యవైనంత వరకు పబ్లీకు మధ్యన బస్సుల్లో తిరగడవేఁ మేలు' అని హెచ్చరించివున్నాడొకప్పుడు మా తోడల్లుడు. ఆ ముక్కలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. రిక్షావాణ్నక్కడే వదిలేసి అప్పుడే వచ్చిన బస్సు దిక్కు పరుగెత్తాను.

అది ఇరవై నాలుగో నెంబరు బస్సు.

అమ్మాయి ఉత్తరంలో రాసిన నెంబర్లు గభాలున గుర్తుకొచ్చి చావడం లేదు. ఎవర్నైనా అడుక్కోక తప్పదు. అక్కడే నిలబడి తాపీగా చుట్ట పీక పీల్చుకునే పెద్దమనిషొకతను కనిపించాడు.

'ఈ బస్సెక్కడికి పోతుంది?' ఆడిగా.

'నువ్వేడకి పోవాలా?' ఎదురు కొచ్చెను.

'వాగులోకి'

'ఇది కాటికి పోయేదయ్యా! అల్లదిగో! ఆడాగి వుందే నాలుగో నెంబరు బస్సు.. అదెక్కెల్లిపో! తిన్నగా వాగులో దింపేత్తది.. బేగి పో' ఉత్తరాంధ్ర సరుకులాగా ఉంది. బెజవాడ కదా! అని బాషల వాళ్లూ గుమిగూడ్తార్లా ఉంది.

 నాలుగో నెంబర్ బస్సు నిద్రలో గురక పెడుతూ తూలిపడేవాడిలా వూరికే వూగిపోతావుంది వెనక్కీ.. ముందుకీ!

బస్సంతా కోళ్ల గంపలా కిక్కిరిసిపోయుంది. అయిస్కాంతం అంచుల దగ్గర ఇనప తుక్కు పేరుకున్నట్లు రెండు డోర్ల దగ్గరా జనాలు పొర్లిపోతున్నారు. అయినా మనిషికి మనిషికీ మధ్యన ఇంకా సందుండిపోయిందని మధన పడిపోతున్నాడు బస్సు కుర్రాడు.

'రావాలండీ .. రావాల! మార్కెట్ పంజా కాలేజ్ జండా వాగు చిట్నగర్ లంబాడీ.. రావాలండీ.. రావాలా..'

చెవి తెగ్గోసిన మేకకి మల్లే ఒహటే అరుస్తున్నా ఆ కుర్రాడి దగ్గరికెళ్లి అడిగా 'వాగులో కెళతందా?'

అంతే! మాటా పలుకూ లేకుండా నా పెడ రెక్కలు పట్టేసుకుని బస్సులోకి ఈడ్చేసుకున్నాడ కుర్రాడు నా భుజం మీది జాడి పక్క మనిషి నెత్తి మీదకెక్కింది కుర్రాడి గత్తర్లో!

రామాయణంలోని పుష్పకవిమానం దారి తప్పొచ్చి బెజవాడ వీధుల్లో వాలినట్లుంది. ఎంత మందిని కుక్కినా బస్సోళ్లకు తృప్తి కలగడం లేదు.

'.. ఎదరకు జరగండి బావూఁ.. ముందుకు జరగండి.. ముందుకు పదండి.. ఊఁ ఊఁ.. పదండి ముందుకు .. పదండి ముందుకు..'

మనస్ఫూర్తిగా మనల్నింకా ముందుకు పదమనే వాళ్లింకా దేశంలో మిగిలున్నందుకు మహా ముచ్చటేసింది కానీ.. అదా స్థలం? సందర్భం?

చినుక్కీ చినుక్కీ మధ్య నుంచి గుర్ర్రం తోల్తూ బాణాలేసే పురాణపురుషుడి చాకచక్యం మించి పేసింజర్స్  భుజాల మీద పాక్కొస్తూ, బూతులు కూస్తో, 

టిక్కెట్లు కోస్తో వస్తోన్న కండక్టర్ని నిజంగా అభినందించాలి!

నిద్రలో నడిచేవాళ్లా బైల్దేరిన బస్సుకు ఏం మూడిందో, మూడు నిమిషాల్లో ముక్కుతాడు తెంచుకున్న గుర్రంలా పిచ్చ పరుగందుకొంది. మజ్జె మజ్జెలో సకిలింపులు.. బస్సు కుర్రాళ్ల రంకెలు!

వెనకమాల్నుంచి మరో మదమెక్కిన బస్సుగుర్రం తరుముకొస్తోందట!

అప్పుడు చూశా డ్రైవర్ సీటుకు సరిగ్గా నెత్తి మీద పెద్దక్షరాలతో రాసున్న హెచ్చరిక 'దేవుని స్మరింపుము'

ప్రస్తుతం నేను చేస్తోన్న పని కూడా అదే!  నేనూ, జాడీ క్షేమంగా వాగులోకి దిగితే అదే పదివేలు!

గవర్నమెంటాసుపత్రి ముందు అయిష్టంగా బస్సాగింది.

కండక్టరు అరుస్తోన్నాడు 'ఆసుపత్రి కెవరెళతారండీ!;

ఈ బస్సిట్లా ఇంకో పది నిముషాలు గెంతితే అందరం అక్కడికి పోవాల్సిన వాళ్లమే!

ప్రస్తుతానికి ఓ భారీ కాయం మాత్రం ఆపసోపాలు పదుతూ సీట్లోంచి లేచింది.

ఆ కాయాన్ని ఆస్పత్రి పాల్జేయడానికి అయిన ఆలస్యాన్ని కాంపెన్సేట్ చేయడానికి డ్రైవర్ పూర్తిగా స్టీరింగ్ మీంచి చేతులు ఎత్తేశాడు. బహుశా పెడలు మీది పాదం కూడా అదే పని చేసుండచ్చు. మొత్తంగా బస్సు మెత్తంగా గాలిలో తేలిపోతోందీ సారి. బోడెమ్మ సెంటర్ దగ్గర బ్రేక్ పడక తప్పలేదు.

'బోడెమ్మ ఎవరండీ? బోడెమ్మ ఎవరండీ?' కండక్టరు రంధి.

'నేనేనండీ!' అంటూ లేచిందో పునిస్త్రీ.

'నువ్వం కాళ్లమ్మంటివి కదమ్మా? 'అంకాళమ్మ గుడి స్టాప్' అని కండక్టర్ ధ్వని!

'నేను కాదయ్యా అంకాళమ్మ! నా ఈపరాలు. ఇదిగో ఈడనే కూకోనుండాది. బోడెమ్మ నేనే!'

ఆ శాల్తీని బస్సులో నుంచి దాదాపు తోసేసి బెల్లుకొట్టాడు కండక్టర్.

పీరు చెట్టు దగ్గర పీరెవరో లేచి రమ్మంటే ఓ శాస్త్రులు గారు దిగడానికి తయారయ్యారు. 'గాంధీ బొమ్మ' దగ్గర అట్లాగే కండక్టర్ 'గాంధీ..గాంధీ ఎవరు బాబూ.. గాంధీ' అని మొత్తుకుంటుంటే ఓ తాగుబోతు 'ఓయ్' అంటూ ఇద్దరు పేసింజర్ల చేతి సాయంతో తూలుకుంటూ దిగిపోయాడు.

హఠాత్తుగా     బస్సొక్కక్షణం ఆగి.. మరుక్షణమే వెనక్కి నడవడం మొదలెట్టింది!

'అందరూ దిగాలి. దిగాలి. బస్సింక ముందుకు పోదు' అని అరుపులు లంకించుకున్నాడు కండక్టర్!

వనక బస్సుతో పోటీ తట్టుకోడానికి హఠాత్తుగా ఇట్లా దారి మళ్లించడం బెజవాడ బస్సుల కలవాటైన ముచ్చటేనట. 

అదేమని అడిగితే 'మెడ మీద చెయ్యేసి తోసేస్తారు, బెజవాడ బసులోళ్లు యములోడికైనా జడవరు' అంది అప్పటి దాకా నా గుండు జాడీ మోసిన గుండు శాల్తీ.

అందర్తో సహా హడావుడిగా బస్సు నుండి నేనూ  బైటకుదూకేశా.

ఎత్తు మీంచి దూకడంతోజాడీ బీటలిచ్చినట్లుంది.. జుత్తంతా ఆవ జిడ్డుతో ముద్ద ముద్ద! నుదుటి మీంచి నుదురు మీదికి జారిన ఆవ నూనె మరకలు ఎండి ఎప్పుడో చారికలు కట్టున్నాయి. కళ్లూ.. వళ్లూ అంతా మంట మంట!

చీకట్లో ఎవరూ చూదకుండా మావాడిల్లు కనుక్కోడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది.

అప్పటికే అర్థరాత్రి దాటింది.

బాడీ, జాడీ వెరసి శరీరమంతా బట్టలతో రక్త సిక్తంగా మారిపోయింది.   చంకలోని గుండు జాడీ ఖండిత శిరస్సును తలపిస్తోంది.

    ఎవరైనా చూస్తే హంతకుణ్నని వెంటబట్టం ఖాయం.

చలి వల్ల వణుకు..

ఆకలి వల్ల నీరసం..

ఆవగాయ వల్ల  మంట..

ప్రయాణం వల్ల అలసట..

నిద్ర వల్ల మత్తూ..

వళ్లు తూలిపోతూంటే, కాళ్లు వణికిపోతోంటే, ఆ నడి రాత్రి చీకట్లో ఎట్లాగైతే ఏం వినాయకరావిల్లు పట్టుకుని తలుపులు దబదబా బాదేస్తున్నా.

ఐదు నిముషాలగ్గానూ మెల్లిగా తలుపు తెరుచుకుంది కాదు.

'ఎవరూ?' ఏదో ఆడగొంతు మెల్లిగా.

'నేనమ్మా! పెదనాన్నను.  ఇదిగో! ఆడిగావుగా! తెచ్చా నీ కోసం!' అంటూ గుండు జాడీని గడప మీదకు దించానంతే!

 'కెవ్వుఁ!' కేక! ఒకసారి కాదు.. వరసగా ఏ పది సార్లో!

ఆ పిల్ల అమాంతం అల్లాగే విరుచుకుపడిపోయింది.

భగవంతుడా! ఇప్పుడేం చేయడం!

పారిపోడమా! ఉండిపోయి దెబ్బలు తిండమా!

మీమాంస నడుస్తూండగానే గదిలోంచి  బైటికొచ్చిన వినాయకరావు ఒక్క క్షణం అవాక్కయిపోయి మరుక్షణంలో 'మర్డర్! మర్డర్!' అంటో వీధిలోకి పరుగేట్టి వీరంగాలు  మొదలెట్టాడు.

అరవడానికి పోగైన వీధి కుక్కలు చీకట్లో ఆవగాయ బద్దల్నే మాంసం ముక్కలనుకున్నాయో.. ఏంటో.. ఆవురావురమని మెక్కెస్తున్నాయి.

అమ్మాయికని తోడల్లుడు శ్రద్ధగా చేయించిన ఆవగాయ మొత్తం వీధి కుక్కలపాలు!

అవునూ!.. కుక్కలు ఆవగాయ ముక్కల కాశపడతాయా.. మరీ విడ్డూరం కాపోతే? అని సొడ్డు నా మీద మాత్రం వేయకండి!

అప్పుడూ ఇప్పుడూ .. బెజవాడలో జరిగే విచిత్రాలు బ్రహ్మంగారికే అందలే! ఇహ మీకూ.. నాకూనా?!

-కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రప్రభ వారపత్రిక సెప్టెంబర్, 1982 ప్రచురితం -రికార్డులో 16  -09 -1982 అని ఉంది)

వివాహమే మహాభాగ్యం- ఈనాడు సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు

జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్‌ వాక్యం.

ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,

దేవతల రుణాన్ని యజ్ఞాలతో,

పితృదేవతలరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఆదేశం.

తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునేందుకు వివాహాన్ని ఓ ధార్మిక సంస్కారంగా తీర్చిదిద్దుకున్న  సంప్రదాయం మనది.

'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవాళ్ళు బయటపడాలని తహతహలాడుతుంటే.. బయట ఉన్నవాళ్ళు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతారు' అని ఓ మేధావి చమత్కరించాడు. అయినా,  భారతీయ సంస్కృతి ప్రకారం మోక్షగామి పాటించవలసిన నాలుగు ధర్మమార్గాలలో  గృహస్థాశ్రమం  తప్పనిసరిది . ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగు పెట్టే పొదరిల్లు వివాహబంధం! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము..' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పిన మాట మనం మర్చిపోలేం కదా! భారతీయుల సంప్రదాయం ప్రకారం ఆ మూడో పురుషార్థం ధర్మబద్ధంగా సిద్ధించే మార్గం గృహస్థాశ్రమం. సుఖదుఃఖాలలో, కలిమిలేములలో సహభాగస్వాములుగా భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహం ఓ  దీపంలా దిక్సూచి ధర్మం నిర్వహించాలన్నది  భారతీయ సమాజంలోని నియమం. 'మాయ, మర్మము లేని నేస్తము/మగువలకు, మగవారికి ఒక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు సమాన ఫాయిదా 'రాజమార్గము'ను నిర్దేశించిన  వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయహస్తం అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యం రుచి చూపించవలసిన చొరవ ఓం ప్రధమంగా  పురుషుడిదే.

'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల్,‌ భార్య ఎర్త్' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే  ఆ సెట్టు పలికే మట  సున్నా అన్నాడు.

భార్యాభర్తల సాహచర్యం సమశ్రుతి చేసిన స్వరవాయిద్యం తీరులో సంసార పేటికలో  ప్రతి నిమిషం పాతలాగా కాగాలి.

దాంపత్యమంటే మూడు ముడులతో పేనిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాల వలె విడదీయలేనంత గాఢంగా పెనవేసుకుని ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవనమనే మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్‌ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గాన మాధుర్యంలో సప్తస్వరాలై ఊపిరులూదడందాంపత్యమంటే- స్త్రీ పురుషుల జంట ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులు. సప్తాశ్వాలు పూన్చిన వారి సంసార రథం మలిసంధ్యలోనూ తొలిసంధ్యలోని తేజరింపు రవంతైనా తరగకుండా సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెల సాహచర్యం. కోరికలన్నీ తీరి,  చివరి మజిలీకి చేరుకున్న తదుపరి 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని..' నిరీక్షించే క్షణాలు ఇంకా నిలబడిగాని ఉండుంటే  సార్థకతతో కూడిన  సంసారం ఆలుమగలు నడి మధ్యన ఇన్ని దశాబ్దాలూ సవ్యంగా సాగినట్లు లెక్కే!  శృంగారం అవసరం కాని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమానంగా ఉంటుంది.  పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళికతో పోల్చదగినది అంటారు ఆ తరహా అన్యోన్య దాంపత్యాన్ని  ముళ్లపూడివారు.

ఇతర దేశాల తరహాలో కాకుండా మన భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది ఈ వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ, పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో నిర్ధారణ అయిన నిజం. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటి  వాటి వల్ల వివాహబంధాలు సడలిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిపోతున్న రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో, వివాహ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నవారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని శాస్త్రీయంగా తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి  ఆదునిక పరిశోధనలూ పట్టం కట్టడం ఆహ్వానించదగ్గ అంశం. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని గతంలోని  అధ్యయనాలు పేర్కొంటే.   స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసికంగా స్వాస్థ్యత చేకూరుస్తుందని తాజా పరిశోధనల వల్ల వెల్లడవుతున్నదిప్పుడు. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళల కన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగుబాటుకు లోనవుతున్నట్లు  పరిశోధనల ఫలితాల సారాంశం.  పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్వారి కన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు కూడా. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ ఒకరి మీద ఒకరు నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ పురుషులు వివాహబంధంతో నిమిత్తం లేని   బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండబోదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతంగా ఉండటం ప్రధానం!

కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 03 -01 -2010)

________________________________

ఫ్యామిలీ- చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

ఫ్యామిలీ- చిన్న కథ 

- కర్లపాలెం హనుమంతరావు 

నాన్నా!

ఏంట్రా చిన్నా?

రోజుకు నువ్వెంత నాన్నా సంపాదించేది?

ఉలిక్కిపడ్డాడు   నాన్న.  చుర్రుమని కాలింది. వేలెడంత లేడు. వీడేందీ.. పిచ్చి ప్రశ్నలు!   బదులివ్వదలుచుకోలేదు. అయినా చిన్నా  వదలదలుచుకోలేదు తండ్రి. 

'చెప్పు నాన్నా! పోనీ గంటకు ఎంతిస్తారో ఆఫీసులో అదన్నా చెప్పు. అప్పుడే నేను పోయి పడుకునేది'

రెండు పెడ్దామనిపించింది .  అతి కష్టం మీద ఆపుకొంటూ 'గవర్నమెంటాఫీసుల్లో రోజూ జీతాలిస్తార్రా? నెలకో అరవై వేలొస్తాయేమో! ఇహ ఫో! తొమ్మిదవుతుంది. పోయి పడుకో!' గట్టిగానే గసిరాడీసారి తండ్రి.  

అయినా చిన్నా వదల్లేదు 'ఒక్క రోజుకు ఎంతొస్తుందో అది  చెప్పు నాన్నా! అప్పటి దాకా నేను పడుకునేదే లేదు గ్యారంటీ!'

బిడ్డ మొండితనం తండ్రికి ఎరికే. ఏదో ఒహటి చెప్పేదాకా   వదిలే రకం కాదు. అయినా ఇవాళేందీ పిలగాడు ఇట్లా జీతాల మీద తగులుకున్నాడు! 'రోజుకో రెండొందల చిల్లరొస్తుందేమోరా నాయనా! అయినా.. వేలడంత లేవు నీకెందుకురా ఈ వెధవారాలన్నీ! వెళ్లి పడుకో ఫో! మళ్లీ బైటికెళ్ళే పనుంది నాకు!' 

చిన్నా తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు 'నాన్నా! ప్లీజ్ నాకో ట్వంటీ రూపీస్ అప్పివ్వవా అర్జంటుగా? కావాలంటే వడ్డీ తీసుకో పెద్దయింతరువాత!'

ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఇరవై రూపాయల అప్పా? దానికీ వడ్డీ చెల్లింపులా? వీడు పెద్దయిందాకా ఆగి తాను వసూలుచేసుకోవాలా?' వళ్లు మండిపోయింది తండ్రికి ఒక్క ఊపులో వచ్చిన వీరావేశానికి. 'ఎల్కేజీ కుంకగాడివి. డబ్బుల్తో నీకేంట్రా పనసలు? స్కూల్లో ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుందీ ఇంట్లో.. ముందు నాకు తెలియాలి ?' అంటూ విసురుగా వంటింటి వైపుకు దూసుకెళ్లిపోయాడా నాయన వక్కసారిగా ముంచుకొచ్చిన వెర్రావేశంతో. 

ఆ దురుసుగా పోవడంలో కిందపడి ఏడిచే పసిబిడ్డ సంగతి కూడా పట్టించుకునే మూడ్ లో లేకుండాపోయింది తండ్రికి. 

***

 అరగంట గడిచిన తరువాత ఆవేశాలు చల్లారాయి ఇంట్లో. తన దురుసు ప్రవర్తనకు తండ్రిలో పశ్చాత్తాపం మొదలయింది. చిన్నా పడుకొన్న గది వైపు చూసాడు. దుప్పటి కప్పుకుని కప్పు వంక చూస్తూ తల్లి పక్కనే పడుకుని ఉన్న పదేళ్లు కూడా నిండని కొడుకును చూసి తండ్రి గుండె చెరువయింది. గిల్టీగా చిన్నా పక్కలోకి చేరాడు నాన్న. ' సారీరా! బుజ్జిగా! ఇందాక నేను నీతో అట్లా  మాట్లాడకుండా ఉండాల్సింది.తోసేసానేమో కూడా కదా! వెరీ సారీ రా కన్నా! ఇదిగో నువ్వడిగిన ఇరవై రూపాయలు. ఇప్పుడు  నువ్వు హ్యాపీనే గదా?'

ఇరవై నోటు చేతిలొ పడగానే గభాలున లేచి కూర్చున్నాడు చిన్నా. అప్పటిదాకా ఏడ్చినట్లు వాడి లేతబుగ్గల మీద చారలు కట్టిన కన్నీళ్లే తెలియచేస్తున్నాయ్. ఇప్పుడవేమీ పట్టించుకునే మూడ్ లో లేడు చిన్నా! తండ్రి ఇచ్చిన ఇరవై నోటును  దిండు కింద దాచిపెట్టుకుని ఉన్న మరికొన్ని అట్లాంటి నోట్లతోనే కలిపి లెక్క   పెట్టేపనిలో పడిపోయాడు. చిన్నా దిండు కింద నోట్లు చూసిన తండ్రికి మళ్లీ కోపం తన్నుకురాబోయింది. 

కానీ అదే క్షణంలో చిన్నా.. గభాలున తండ్రిని గట్టిగా కౌగలించుకుని అన్నాడు 'థేంక్యూ పాపా! థేంక్యూ వెరీ మచ్! ఈ ఇరవైతో  రెండొందలు సరిపోయింది. ఇవన్నీ అచ్చంగా నీవే ఇక నుంచి!' చిల్లర నోట్లన్నీ తన   గుప్పెట్లో కుక్కి మూసేసే చిన్నా వంక అయోమయంగా చూసాడా తండ్రి. ' 'రేపు అమ్మ బర్త్ డే డాడీ !  నువ్వచ్చంగా ఇంట్లోనే ఉంటున్నావ్. అమ్మతో, నాతో కలిసి గుడికి సినిమాకి వస్తున్నావ్!  ఫుల్ డే ఆఫీసుకు డుమ్మా. నీ  జీతం రెండొందలు ఇచ్చాగా!  నువ్వూ హ్యాపీనేగా!' 

ఉత్సాహంగా చిన్నా అన్న ఆ మాటలకు  బిత్తరపోయిచూడడం నాన్న వంతయింది. 

-కర్లపాలెం హనుమంతరావు 

07- 04 -2021 

దండనీతి - ఈనాడు ప్రచురితం - కర్లపాలెం హనుమంతరావు

 దేవుళ్లను ఏమన్నా అంటే కళ్లు పోతాయని మనకో నమ్మకం. కబోదులు క్రమంగా పెరిగిపోతున్నారీ మధ్యన దేశంలో. అంటే దైవదూషణ కూడా అదే మోతాదులో ఎక్కువైందనేగా సూచన! ఈ లాజిక్‌ను వదిలేసి దేవుళ్ల విధులు దీక్షగా నిర్వహించే మా రక్షకభటులను ఆడిపోసుకోవద్దని హెచ్చరించేందుకే లాఠీగా నేనీపూట ఈ భేటీ పెట్టింది!

మెత్తనివాణ్ని చూస్తే మొత్తబుద్ధవడం మీ మనుషులందరిలోనూ ఉండే సహజ దుర్గుణం. ఏనుగు నోట్లో బాంబు పెట్టిన నేరగాడినే ఉరితీయాలని తెగ రచ్చ రేగుతున్నది కదా సామాజిక మాధ్యమాల్లో! ఇక జనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఎన్ని ఏనుగుల పెట్టు? ప్రభువుల దగ్గరుండే పెద్దల మీదనే ఎదురూ బెదురూ లేకుండా బాంబుల్ని మించిన ప్రమాదకర ట్వీట్లా?! మరి మేం ఇక్కడున్నది రక్షకభటుల చేతిలో స్వీట్లు తినిపించడానికా?

మక్కెలిరగదన్నడం తప్ప మరో మార్గం లేకుండా మాకు చెడ్డ పేరు తెస్తున్నది మీరు... న్యాయం చేసే లాఠీలం మేమే న్యాయంగా న్యాయస్థానాల తలుపు తట్టాలి!

పోలింగ్‌ కేంద్రాల్ని జయించి గద్దెలెక్కిన పెద్దమనుషులు ఎవరైనా ఆటొమేటిగ్గా దైవాంశ సంభూతులైపోతారు. అదివరకు మాదిరి అడ్డదిడ్డమైనవాళ్లకు ప్రతి అడ్డాలో అడిగినప్పుడల్లా దర్శనమిచ్చేస్తే దేవుడెట్లా అవుతాడు ఏ పాలకుడైనా?కనీసం ప్రెస్‌ మీట్లన్నా పెట్టడంలేదని అల్లర్లు చేస్తే గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవడానికా కొన్ని కోట్లు పోసి మా లాఠీ కర్రల్ని సర్కారు కొని దాచిపెట్టింది? బోలెడంత మంది మా ప్లీడర్లు చెట్టుకిందా చోటు దొరక్క గగ్గోలు పెడుతున్నారు. గోరంతయినా ఉపాధి కల్పించిన పుణ్యం దక్కుతుంది మా పోలీసు బెత్తాలకు. దైవం కనిపించదన్న ధీమా వద్ధు లా అండ్‌ ఆర్డర్‌ కి ప్రత్యక్ష గార్డులు... రక్షక భటులు.

బుల్లి దేవుళ్ల మీద బురద పడ్డా కళ్లుపోవుట ఖాయం... ఆ ఇంగితం మరోసారి మీ మట్టి బుర్రలకు ఎక్కిద్దామనే- ఎన్ని పనులున్నా ఇప్పుడీ సమావేశం పెట్టుకున్నది!

నాస్తికులు, ఆస్తికులన్న రాగద్వేషాలుండవు మా లాఠీలకు. మా పెద్ద దేవుడికి తేడా అని తోస్తే ఎంత పిస్తాకైనా మేం తోలు తీయడం ఖాయం. నియంతృత్వమా, నీతిమంతమా, ప్రజాస్వామ్యమా, పెద్దమనిషితనమా అన్న బఠాణీ చర్చలు మా ఠాణాల్లో ఉండవు భాయీ! చిర్రాకు పెంచితే చివరికి చిరిగేది మీ చీప్‌ వీపులే... విచారణలు గిచారణల విచారాలన్నీ ఆ తరవాతనే!

మనుధర్మశాస్త్రమని మీ మనుషుల దగ్గరే ఓ శాస్త్రముంది. మీకది మన ధర్మశాస్త్రంలా అనిపించకపోవచ్చునేమో కానీ- ఆ శాస్త్ర కర్త మనువుతాత మాటలే మా రక్షకభట దేవుళ్లకు సదా శిరోధార్యాలు. మీరు రాసుకున్నారు కదా అని రాజ్యాంగంలోని ప్రతి ఆదేశాన్ని శాసనంలా మేం ఎందుకు పాటించాలి? నెవర్‌! మా లాఠీలకు కొన్ని ప్రత్యేక రైట్స్‌... అదే హక్కులుంటాయని మీ మట్టి బుర్రలకు ఎందుకు తోచలేదో!

లా అండ్‌ ఆర్డర్‌ అంటేనే ప్రభువుల ముందు ఎల్లవేళలా బోర్లాపడివుండే శాఖ. వాడి ముందు ఎవరూ నిటారుగా నిలబడకుండా చూసుకోవడమే మా బుల్లి గాడ్స్‌ ఆయుధాలుగా మా పని. వందలాది సెక్షన్లు, క్లాజులు, ఆర్టికల్స్‌ ఉన్న రాజ్యాంగంలో ఏ తరహా దండనీతి ఎవరి ప్రత్యేకహక్కుగా రాసుందో...

ఎవర్రా ఆ రహస్యం గాలించగల సమర్థులు ఇవాళ? కోర్టులు, భాష్యాలు, తీర్పులు గట్రా గట్రా అంటావా? సర్కార్ల మీద దావా పడ్డప్పుడల్లా ఏ ‘సత్వర సుపరిపాలన పునః సంస్థాపనార్థం’ అంటూ చక్కని సమాస మొకటి అఫిడవిట్‌కో కుచ్చుతోకలా తగిలించేస్తే సరి! మీ లాయర్ల నోరు తిరిగి ఆ తింగరి పదం వెలికివచ్చే లోగానే చటుక్కున మా ప్రభువుల పని చక్కబెట్టుకొచ్చేస్తాం మేం. ఎవరెన్ని కారాలూ మిరియాలూ నూరుకున్నా నో ప్రాబ్లమ్‌! మా బుల్లి గాడ్స్‌ నమ్ముకున్నది మనువాది చెప్పిన ముచ్చటైన ‘దండనీతి’ సూత్రం మాత్రమే!

దండాలు పెట్టించుకునే దేవుళ్ల పీఠాల్లో మార్పు రావచ్చేమో కానీ... కిందున్న మా బుల్లి దేవుళ్ల దండనీతి పాఠ్యాంశాల్లో మాత్రం మార్పుండదెప్పుడూ. ఆ ఇంగితం లేకనే బుద్ధిమంతులు కొందరు మా బుల్లిదేవుళ్లతో గిల్లికజ్జాలకు దిగి చివరికి పిచ్చాసుపత్రుల పాలయ్యేది! లోకం తీరూ తెలుసుకుని మసలుకోవడం మీకే మంచిది. ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేదు. పెత్తనంచేసేవాడి తరఫునే ఏ యుగంలోనైనా బెత్తం ఆడేది. అమెరికన్‌ న్యాయదేవతైనా సరే- ఆ యుగధర్మంలో మార్పు తేలేదు. న్యాయస్థానాల స్థాయి ఏ దేశంలో అయినా ఆదేశాలిచ్చే వరకే. ఆచరణ స్థాయి మా బుల్లి దేవుళ్ల చేతుల్లోని మా దండాలది. మున్ముందు గొంతెత్తే ముందు మా లాఠీలను కాస్త గుర్తు తెచ్చుకుంటే రాష్ట్రమేంటి, దేశమేంటి, చివరికి ప్రపంచమంతటా సుఖమూ, శాంతీ! మనుధర్మశాస్త్రంలోని దండనీతులన్నీ మా బుల్లి దేవుళ్లకెప్పట్నుంచో కరతలామలకం. కర్రొక్కటే లోకాన్ని దారిలో పెట్టే దివ్య శక్తి. ఈ దండయాత్రలను తప్పుపట్టడం దైవద్రోహం కిందకే వస్తుంది మీ ఇష్టం... ముందే హెచ్చరించాం! మా దేవుళ్లను ఏమన్నా అంటే కళ్లు పోవడం మాత్రం ఖాయం! తస్మాత్‌ జాగ్రత్తని మరో మారు ఈ భేటీ ద్వారా హెచ్చరిస్తున్నాం!

- కర్లపాలెం హనుమంతరావు

తల్లీ... నమస్తుభ్యం! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు , సంపాదకీయం - 11:05:2013)

కౌసల్య తన పేరేమిటో చెప్పమంది. అమ్మతోనే కాని... ఆమె పేరుతో పనేమిటి చంటి పిల్లలకు? 'అమ్మగాలు' అంటాడు- 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని ఆ బాలరాముడు అత్యంత కష్టంమీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డణ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక తిప్పడం రాని రాముడి కళ్లలోని చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా! వట్టి అమ్మనేరా నా చిట్టి రామా!' అంటూ అమాంతం ఆ పసికందును తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథవారి 'రామాయణ కల్పవృక్షం'లోనిది. నవమాసాలు మోసి రక్తమాంసాలను పంచి కన్న పాప కనుపాపకన్న ఎక్కువ అనడం 'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు 'తాయి సంతతి సంతత యోగ దాయి'. 'చల్లగ కావుమంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కు' మాత వాత్సల్యాన్ని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్ మాటల్లో చెప్పాలంటే- 'తల్లి నివేదనకన్నా, ముందుగా బిడ్డ కామన చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్ధ ఏర్పడింది. మయూర వాహనుడికి సర్వ తీర్థాల్లో తనకన్నా ముందుగా అన్నగారే మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికి ఆ విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం వల్లీనాథుడికి అప్పుడుకాని బోధపడలేదు. వానలో వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చినదాకా ఆగకూడదా!' అంటూ వానకే శాపనార్థాలు పెడుతూ బిడ్డ తల తుడుస్తుందట. అమ్మంటే అదీ!

ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా తృప్తిచెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదా దేవియున్ నీవు మా/ తండ్రిం దల్లియు నంచు నుండుదుము... ఇంతటి వారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటూ రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటివాడు నందుడి సందర్శనార్థమై రేపల్లె వచ్చిన సందర్భంగా- భాగవతంలో. జగన్నాథుణ్ని అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన గొప్ప సంపద అమ్మే' అని కదా శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాల్లో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి. దుర్గా, ఫాతిమా, మేరీ, బుద్ధుడి మేనత్త గౌతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుడి తల్లి త్రిషాల... మాతృ ప్రేమకు కులమతాలని, దేశకాలాలని ఎల్లలేముంటాయి? గ్రీకులకు వార్షిక వసంతోత్సవాల్లో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. ఇంగ్లాండులో తల్లులందరికీ 'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి వందేళ్లు! ప్రపంచీకరణ ప్రభావాన ఇవాల్టి రోజును మరెన్నో దేశాలూ తల్లికి కృతజ్ఞతలు చెప్పే ఓ సంబరంగా జరుపుకొంటున్నాయి. ప్రేమాభిమానాలు భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ కావడం అబ్బురం కాదు.

కాలం సనాతనమైనా, అధునాతనమైనా- అమ్మ పాత్రలో మాత్రం మారనిది సౌజన్యం; బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగ గుణం; కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్ని అడిగాడు ఓ సత్యాన్వేషి- 'అమ్మ' అంటే ఏమిటని. 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!' అని దేవుడి ప్రత్యుత్తరం. భిక్షమడిగే బికారిని అడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకు'లని సమాధానం. నడిచే దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల మీదే సదా దాగుండేది అమ్మేనని. విలువ తెలియనివారికి అమ్మ అంటే 'ఇంతేనా'!; తెలుసుకున్నవారికి 'అమ్మో... ఇంతనా!'. 'ఆపద వచ్చినవేళ నారడి బడినవేళ/ పాపపు వేళల భయపడిన వేళ/ వోపినంత హరినామమొక్కటే గతి...' అనే అన్నమాచార్యులవారి సంకీర్తనలోని హరినామానికి అమ్మ పదమొక్కటే ఇలలో సరి. అడ్డాలనాటి బిడ్డలకు గడ్డాలు మొలుచుకొచ్చి- ఆలి బెల్లం, తల్లి అల్లమవుతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ... పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు, రాబోదు. అందుకేనా చులకన? బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే చివరి దశన కాస్తంత చెట్టునీడ కరవవుతున్నది. పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్ని ఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్టి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/ లల్లుకుని వచ్చాను/ అందులో సగభాగ/ మాశపెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/ మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహరాలు... అమ్మ పాదాలు కొండంత అండ! 'అమ్మపండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగే!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు , సంపాదకీయం - 11:05:2013)

ఎన్నికల కమీషన్ పని తీరు ఎందుకు తరచూ ప్రశ్నలకు గురి అవుతున్నట్లు? -కర్లపాలెం హనుమంతరావు

 ఎన్నికల కమీషన్ పని తీరు ఎందుకు  తరచూ  ప్రశ్నలకు గురి అవుతున్నట్లు?

-కర్లపాలెం హనుమంతరావు

 దేశంలోని  న్యాయస్థానాలిప్పుడు రెండో దశ కోవిడ్ సంక్షోభానికి కేంద్ర ఎన్నికల కమీషనుకే బాధ్యత అంటగడుతున్నాయి.. కఠిన వ్యాఖ్యలూ చేస్తున్నాయి! మద్రాస్ న్యాయస్థానం ఎన్నికల అధికారుల పై హత్య కేసు నమోదు చేయాలని  ఆగ్రహంతో ఊగిపోయింది. ‘ప్రాణానికి మించి మరేదీ ముఖ్యం కాదు. రాష్ట్ర ఎన్నికలు ఇప్పుడా నిర్వహించడం?’ అంటూ మరో రాష్ట్ర న్యాయస్థానం శిలవేసింది.  భారీ జన సందోహం నివారించడం అసాధ్యమని తెలిసినప్పుడు చాలినన్ని నిషేధాజ్ఞలు ఎందుకు లేవు; ఉన్నవాటి అమలుకైనా చిత్తశుద్ధి ఎందుకు కరువు? కాబట్టే  న్యాయవ్యవస్థ ఇప్పుడిన్నిందాలా  తప్పుపట్టడం! ఇది జనావళి నిరసన స్వరమే! 

ఏళ్ల కిందట కేంద్ర ఎన్నికల ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన కీ.శే టి.ఎన్. శేషన్ ప్రస్తావన ఇప్పుడు విస్తృతంగా వినవస్తోంది. ప్రస్తుత ఎన్నికల కమీషన్ నిస్తేజమే అందుకు ప్రధాన కారణం అనుకోవాలి.  శేషన్ చొరవలో పదో శాతమైనా ఇప్పటి ఎన్నికల  కమీషన్ ప్రదర్శించదెందుకు? అంటూ ఓ న్యాయస్థానం తలంటు వరకు వ్యవహారం వెళ్లడం కేంద్ర ఎన్నికల సంఘం స్వయం కృతాపరాధం.   

కమీషన్ విఫలమైన పక్షంలో కోర్టులే స్వయంగా నియంత్రణ బాధ్యతలు  చేపట్టేందుకు సిద్ధమవుతున్నవంటేనే దేశంలో కరోనా మహమ్మారి సృష్టించే సంక్షోభం ఏ స్థాయిలో పెచ్చుమీరుతున్నదో అర్థంచేసుకోవచ్చు. కోర్టులు ప్రత్యక్షంగా అనవు  కానీ, దేశంలోని రాజకీయ పండితుల, విశ్లేషకుల అభియోగం  ప్రకారం ఎన్నికల కమీషన్ కేంద్రంలోని పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే! 

2019 ఏప్రియల్  8 తారీఖున దేశంలోని బుద్ధిజీవులు కొద్ది మంది ఉమ్మడిగా  దేశాధ్యక్షుడిని ఉద్దేశించి  ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో 'ఎన్నికల కమీషన్ విశ్వసనీయత ఏ స్థాయి దాకా దిగజారిందో వివరించారు. ఇప్పటి  దుస్థితి అంతకు  మించిన అధ్వాన్నం!  

స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత భారత  రాజ్యాంగం కేంద్ర ఎన్నికల  కమీషనుకు ప్రసాదించింది. రాజకీయ పక్షాలను గుర్తించడం నుంచి ఏ పార్టీకి ఏ ఎన్నికల గుర్తు ఆమోదించాలన్న అంశం వరకు సర్వే సర్వత్రా సర్వస్వతంత్రంగా బాధ్యతలేవైనా నిర్వర్తించుకునే హక్కు  కల్పించింది. దానర్థం అధికారానికో, మరో లౌల్యానికో లొంగి ప్రశ్నలకు అతీతంగా   బాధ్యతలు  నిక్షేపంగా నిర్వహించుకోవచ్చనా?! మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విధించడం నుంచి  ఎన్నికల ఖర్చు  సైతం అదుపు చేసే  అధికారం వరకు సర్వాధికారాలు ధారపోసినా   కమీషన్ గత కొంత కాలంగా ప్రవర్తిస్తున్న తీరు తరచూ దేశమంతటా ఎందుకు విమర్శల పాలవుతున్నది? ఒక సారైనా  ఆత్మవిమర్శ చేసుకోవద్దా? 

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల   దుర్వినియాగం, ఓటరు జాబితాల సవరణలపై అవకతవకల వంటి ప్రధానాంశాలపై సైతం   కమీషన్ శీతకన్ను వంటి అపవాదులు  ఎప్పటి నుంచో వస్తున్నవే1 ఇప్పటికి మించిన  కఠోర పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి వర్తమాన ప్రపంచానికి దర్పణప్రాయంగా  నిలిచిన సందర్భాలు కేంద్ర ఎన్నికల  కమిషన్ చరిత్రలో కోకొల్లలు! కానీ, గత కొంత కాలంగా షెడ్యూల్స్ ప్రకటించే తీరు మొదలు, ఫలితాల ప్రకటనలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే అంశం వరకు అడుగడుగునా విమర్శల వడగళ్ల వానంలోతడిసి ముద్దవడం..! కొత్తగా నకిలీ ఓటరు కార్డుల తయారీ       ప్రత్యక్ష సాక్షాలతో సహా వివాదమవుతున్నా       నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నది  ఎన్నికల కమీషన్! న్యాయవ్యవస్థ చేత సైతం మొట్టికాయలు తినడానికి ఇట్లాంటివే సవాలక్ష కారణాలు! కమీషన్  పని తీరులో     సమూలన  ప్రక్షాళన అందుకే తక్షణం   అగత్యం  అనిపించడం!           

1986 -1990 కాలం నాటి ఆర్.వి.ఎస్ పేరిశాస్త్రి ఆధ్వర్యంలో ఈ.వి.యం ల విధానం, ఓటరు వయస్సు 18 ఏళ్లకు కుదించడం వంటి సంస్కరణలు ఆరంభమయిన   మాటనూ కొట్టిపారవేయలేం.  అస్మదీయులకు  అనుకూలంగా  పని తీరు లేదన్న అసహనంతో ప్రధాన ఎన్నికల కమీషనర్ కు  సమాంతర అధికార వ్యవస్థను కొత్తగా  చొప్పించే ప్రయత్నం మొదలవడం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాము నుంచి. పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రి స్థానంలో అధిష్ఠించిన అనంతరం  కమీషన్ స్వతంత్రను దెబ్బతీసే కొన్ని చర్యలు వెనుకంజ వేసిన మాట నిజం. ఆ ప్రజాస్యామ్య     శుభ ఘడియల్లోనే  కేంద్ర   ఎన్నికల  ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన  కీ.శే టి.ఎన్. శేషన్ (1990 -96) కేంద్ర ఎన్నికల కమీషన్ శక్తి సామర్థ్యాలు ఏమిటో స్వయంగా నిర్వహించి చూపించారు.

ఎన్నికల వేళ  రాజకీయ పక్షాలు అనుసరించే అప్రజాస్వామిక విధానాలను ఏ విధంగా కట్టడిచేయవచ్చో   నిష్పక్షపాతంగా  ప్రత్యక్షంగా శేషన్ నిర్వహించిన తీరును న్యాయస్థానాలు సైతం ఇప్పుడు స్మరించుకుంటున్నాయి.

శేషన్ కు ముందున్న ఎస్. వై. ఖురేషీ వంటి కమీషనర్లు ఎన్నికల  కమీషన్ కు ఉండవలసిన మరన్ని  అధికారాలకై కంఠశోష పెట్టారు. సంకల్పం ఉండటమే ప్రధానం,  ధన బలం, మంద బలం, కుల మతాల  వంటి రాజకీయ పక్షాలు ప్రదర్శించే అప్రజాస్వామిక విధానాలను  కట్టడిచేసే  అధికారాలు కేంద్ర ఎన్నికల యంత్రాంగానికి ఇప్పటికున్నవే  పుష్కలం.  రాజ్యాంగం కల్పించిన ఆ ప్రత్యేక అధికారాల ప్రస్తావన   న్యాయస్థానాలు పదే పదే చేస్తున్న   ఆంతర్యం ఎన్నికల సంఘం గ్రహించాలి.. అదే తక్షణావసరం! సంకల్ప లేమి వల్లనే ఎన్నికల కమీషన్ యంత్రాంగానికి ఇవాళ అన్ని  దిక్కుల నుంచి ఇన్నిన్ని అక్షింతలు.

ఎన్నికల కమీషన్ లో అసలు  సంస్కరణల ఊసే లేదని  కాదూ!  పనితీరులో పారదర్శకత, నిష్పక్షపాత మెరుగు పడే క్రమంలో  సంఘం   తరుఫు నుంచే సుమారు 50 సంస్కరణల వరకు  ప్రభుత్వానికి సమర్పించిన మరపురాని  అపూర్వ ఘట్టం సదా స్మరణీయం. నేరపూరిత రాజకీయాలను  దూరం పెట్టడం, పార్టీ విరాళాల సేకరణ పై పారదర్శకతకు పట్టుబట్టడం, పెయిడ్ న్యూస్, లంచం వంటి విషయాలు బైటపడినప్పుడు ఏకంగా ఎన్నికలను రద్దుచేసే అధికారం కలిగి ఉండడం వంటి కొన్ని కొత్త కోరలు మొలిచిన  మాట విస్మరించలేం! రాజకీయ పక్షాలకు రాష్ట్ర స్థాయిలో  ఎలక్ట్రానిక్ మాధ్యమాల వినియోగ సౌకర్యం, ఎన్నికల జాబితా కంప్యూటరీకరణ, ప్రతి ఓటరుకు ఓటరు గుర్తింపు పత్రం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను కచ్చితంగా పాటించవలసిన అగత్యం.. వంటి సంస్కరణలు కొన్ని  ఆచరణలోకి రాకపోనూలేదు.  

అయినా డబ్బు తాలూకు  విచ్చలవిడితనం ఎన్నికల తాలూకు  ప్రజాస్యామిక పవిత్రతను దెబ్బతీస్తున్న క్రమమే అభ్యంతరకర స్థాయికి పెరిగి పోయిందిప్పుడు.   2019 నాటి ఎన్నికల ఖర్చు సుమారు 60,000 కోట్లు. ఇది ప్రపంచంలోనే  రికార్డ్! మీడియా స్టడీస్ సెంటర్ గణాంకాల ప్రకారం మునుపటి ఎన్నికల ఖర్చుకు ఇది రెట్టింపు! 

. . 

ప్రపంచంలోనే అతి పెద్దదిగా  చెప్పుకుంటున్నది కదా  మన దేశ  ప్రజాస్వామ్యం! మరి   దాని పరిరక్షణకు నాడి వంటి  ఎన్నికల క్రతువు నిర్వహణకు ఉండవలసిన దీక్షాదక్షతలేవీ? ఎన్నికల క్రతువు  నిష్పక్షపాతంగా, పారదర్శకంగా   నిర్వహించడంలో లోపాలు చొరపడినప్పుడే న్యాయస్థానాల కార్యశీలత తప్పనిసరయేది!

నిజం చెప్పాలంటే నిర్వాచన్ సదన్  నిర్వహించే అధికారుల సమర్థతలో లోపం ఉండి కాదు ఈ దుస్థితి. రాజకీయపరమైన వత్తిళ్లకు ఎదురొడ్డి నిలబడవలసినంత  పట్టుదల  లోపిస్తున్నదనే దేశం గిలి. తాజాగా వివిధ న్యాయస్థానాలు వెలిబుచ్చుతున్న దురుసు వ్యాఖ్యానాలు  అశేష భారతావని తరుఫున వినవచ్చే అసమ్మతి స్వరాలు.  

-కర్లపాలెం హనుమంతరావు

05 -05 -2021

సాహిత్యం : సరదాగా ఒక సున్నా కథ - కర్లపాలెం హనుమంతరావు

సాహిత్యం : సరదాగా 

ఒక సున్నా కథ 

- కర్లపాలెం హనుమంతరావు 

కాళిదాసుగారు ఓసారి చదరంగం ఆడుకుంటూ .. మధ్యలో తన పరిచారిక అందించిన  తాంబూలం నోట్లో పెట్టుకుని, ' అబ్బ! సున్నం ఎక్కువయ్యింది! ' అన్నాడుట! 

ఆ సమయంలో  సోటి కవి భవభూతి రాసిన 'ఉత్తరరామ  చరిత'   అనే కావ్యం అతగాడు పంపిన్ దూత  చదివి వినిపిస్తున్నాడు.  కాళిదాసు మహాకవి కాబట్టి కావ్యంలోని మంచీ చెడ్డా వివరంగా పరిశీలించి  సూచనలిస్తాడని భరభూతిగారి ఆశ.  

కావ్యం  అయితే వినిపించడం జరిగింది. కాని,  తిరిగొచ్చిన దూత భవభూతిగారు  పదేపదే అడిగిన మీదట 'మహాకవి గారి  ధ్యాసంతా ఆ చదరంగం ఆటమీదా , అతగాని పరిచారిక మహాతల్లి తెచ్చిచ్చిన  తాంబూలం మీదనేనాయ! మీ కావ్యం ఎంత వరకు విన్నాడో .. నాకయితే అనుమానమే! మధ్యలో మాత్రం  ఓ శ్లోకం దగ్గర ' సున్నం  ఎక్కువయింద'ని  ముక్తుసరిగా అన్నాడండీ ! 

' ఏదీ ? ఆ శ్లోకం ఎక్కడిదో .. చూపించు! ' అ భవభూతిగారు అడిగిన మీదట

'ఇదిగో ఈ  ' కిమపి కిమపి' శ్లోకం అని చెప్పుకొచ్చాడుట దూతగారు. 

'కిమపి కిమపి  మందం మందమాసక్తి యోగా

దవిరల కపోలం జల్పతో రక్రమేణ

అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో

రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్' 

- ఇదీ శ్లోకం. 

భవభూతిగారు కూడా కవే కాబట్టి కాళిదాసు నర్మగర్భంగా అన్నది.. దూతగారికి అర్థం కాకపోయినా తనకర్థమయింది.. 

శ్లోకంలోని  ఆఖరి పాదంలో ' ఏవం వ్యరంసీత్‌' అనే పదప్రయోగానికి బదులుగా  ‘ఏవ వ్యరంసీత్’ అని ఉండాలని  కాళిదాసుగారి  సూచన. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్లన్న  మాట.  భవభూతిగారూ కాళిదాసు సూచన ప్రకారమే   మార్చి శ్లోకాన్ని మరింత అర్థవంతం చేశాడని కథ. 

కథ, దాని అర్థం కేక! కరతాళధ్వనులు మిన్నుముట్టడానికి తగినట్లే  ఉన్నాయి. అనుమానం లేదు. కానీ ఇది ఇక్కడ ఉదాహరణ కింద చెప్పడానికి కారణం  వేరే ఉంది. 

మన వాళ్లకు చరిత్ర .. కవి కాలాదుల పట్ల  బొత్తిగా పట్టింపు లుండవనే అభియోగం ఒకటి మొదటి నుంచీ కద్దు .  దానికి మరింత  బలం చేకూరేలా ఉందనే ఇంత విపులంగా చెప్పడం  ఈ  కట్టుకథ . 

భవభూతి కాలం దాదాపు ఎనిమిదో శతాబ్దం;  కాళిదాసు జీవించిన కాలం బహుశా నాలుగో  శతాబ్దం! ఈయనగారు  ఆయనగారికి  ఒక దూత ద్వారా తన కావ్యం  వినిపించడం కామెడీగా లేదూ? 😁

ఒకానొక తెలుగు చలనచిత్రంలో కూడా ఇట్లాగే భద్రాద్రి రామదాసుగారు , భక్త కబీరును   కలిసి వేదాంతచర్చలు సాగిస్తారు! అదీ సంగతి !  😁

ఇట్లాంటి కామెడీలే  చూసి చూసి  మాన్యులు శ్రీ  వెల్చేరు నారాయణరావుగారు ' I like these fantastic lifespans and anachronistic legends. Indian literature is full of them. Remember Kalidasa and Bhavabhuti and Dandin meeting together in caatu tradition?'

( Refer to the Afterword in A Poem at the Right Moment) అనేశారు. 

అన్నారంటే అనరా మరి? 

- కర్లపాలెం హనుమంతరావు 

30 - 10-2021 

బోథెల్ ; యూఎస్.ఎ

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...