Sunday, December 19, 2021

నేటి కాలపు కవిత్వం - పై సంపాదకీయం- చేకూరి రామారావు


















 

నేటి కాలపు కవిత్వం - పై 


సంపాదకీయం


"దేశంలో భారతీయ సంస్కార ప్రవాహాలు ఇంకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపు మాసినవి. భారతీయ సంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదం కాక ఆత్మ విముఖత్వాన్ని, పర సంస్కార దాస్యాన్ని మనకు ఆపాదించినవి"


ఈ పుస్తకం చివర రాసిన పైమాటల్లో అక్కిరాజు ఉమాకాంతం (1889-1942)గారి సర్వసాహిత్య కృషి నేపథ్య సారాంశం తెలుస్తుంది. ఆయన జీవించింది 53 సంవత్సరాలే అయినా అమోఘమైన పాండిత్యంతో, అసమాన వాదపటిమతో, అవిచ్ఛిన్న సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకు పోయిన విశ్వాసాలను కుదిపి వేసిన సాంస్కృతిక విప్లవకారుడు అక్కిరాజు ఉమాకాంతం గారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోటానికి ఆయన జీవిత చరిత్ర ఎవరూ రాయలేదు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారి శత జయంతి సంపుటం (1986) లో "త్రిలిఙ్గ తొలినాళ్ళ సంపాదకులు ఉమాకాంత విద్యా శేఖరులు" అనే పేరుతో అక్కిరాజు రమాపతి రావుగారి అయిదు పేజీలు చిరు వ్యాసమూ తెలుగు విజ్ఞాన సర్వస్వమ మూడవ సంపుటంగా వచ్చిన 'తెలుగు సంస్కృతి' అనే వాల్యూమ (1959) లో అబ్బూరి రామకృష్ణారావుగారి ఒక పేజీకి మించని చిన్న నోటూ మాత్రమే ప్రధాన ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.


అక్కిరాజు ఉమాకాంతంగారు గుంటూరు జిల్లా పల్నాడు తాలుకా గుత్తికొండ అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుత్తికొండకు సుమారు ఏడెనిమిది మైళ్ళ



X


దూరంలో ఉన్న జానపాడు అనే ఊళ్ళో సంస్కృత భాషాభ్యాసం చేశారు. శిష్ట్లా సీతాకాంతశాస్త్రి గారు వీరి గురువుగారు. ప్రస్తుత గ్రంథంలో మొదటి శ్లోకంలో వారి ప్రస్తావన ఉంది. పదిహేను పదహారేళ్ళ వయసులో గుంటూరు లూథరన్ మిషన్ వారి హైస్కూలులో ఇంగ్లీషు చదువులు చదివారు. మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లో ఈయన శతావధానం చేశారు. బెజవాడలో కన్యకా పరమేశ్వరి హిందూ పాఠశాలలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. 1912 లో తెరచిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు మద్రాసు కార్యాలయంలో జయంతి రామయ్యగారి ఆహ్వానంపై కొన్నాళ్ళు మేనేజరుగా పనిచేశారు. వేషధారణపై వచ్చిన పేచీ వల్ల ఉమాకాంతంగారు ఉద్యోగం మానేసినట్లు రమాపతి రావుగారు పైన పేర్కొన్న వ్యాసంలో రాశారు. ఈయన బెంగాల్లో నవద్వీప సంప్రదాయాన్ననుసరించి భాష్యాంతముగా సంస్కృత వ్యాకరణమూ, తర్కశాస్త్రమూ, అభ్యసించి 'విద్యాశేఖరు' లైనా రని అబ్బూరి రామకృష్ణారావుగారు రాశారు. "తమ తర్క వ్యాకరణ విద్యా వ్యాసంగాన్ని వంగ దేశంలో జరుపుతూ వచ్చారు; వంగ సాహిత్య వేత్తలతో సాహచర్యం వల్లా, లోకజ్ఞానం వల్లా, స్వానుభవం వల్లా, వంగ సాహిత్యాభ్యుదయానికి గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వల్లా తమకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసికొని తమ మాతృభాష అయిన తెనుగును పరామర్శించడం ఆరంభించారు" అని అన్నారాయన. ఆయన వావిలి కొలను సుబ్బారావుగారి తరవాత (1929లో) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1913-1914 మధ్య కాలంలో త్రిలిఙ్గ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. 'త్రిలిఙ్గ' అనే పేరు ఆయన పెట్టిందేనని త్రిలిఙ్గ రజతోత్సవ సంచిక (1941) కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశంలో ఇంగ్లీషులో కామెంటు (comment) అనే మాటకు పర్యాయంగా వ్యాఖ్యా శబ్దాన్ని పరీక్ష పత్రాల్లో తానే మొదట వాడినట్టు పేర్కొన్నారు.


1913-1014 సంతురాల లో ఆయన శిబి




అయ్యాయి. ఉమాకాంతం గారు తమ కథల పీఠికలో 'ఇట్టి కథల వాఙ్మయము తెలుగునకు కొత్తది' అని గుర్తించారు. అప్పటి కాయన రచనాశైలి ప్రాచీన భాషకు సన్నిహితం. సంధి నియమాలను సడలించి ఆధునిక రచనాభాషను ఏర్పరచటానికి ఉమాకాంతం గారు కూడా కృషి చేసినట్టు ఈ సంపుటం ద్వారా తెలుసుకోవచ్చు. ఈయన కథల్లో కూడా తొలినాటి ఇతరుల కథల్లో లాగే లక్ష్యం సాఘిక సంస్కరణే. మూఢ విశ్వాసాల నిర్మూలనే బ్రాహ్మణ సమాజంలో పాదుకొన్న మూఢ విశ్వాసాల వల్ల స్త్రీల బతుకుల్లో ఉన్న బాధల్ని వివిధ రీతుల్లో ఈ కథల్లో వర్ణిస్తారు.


ఈ కథల్లో 'ఎదుగని బిడ్డ' ఆంధ్ర సాహిత్యాన్ని కన్న తెలుగుతల్లి ఉత్తమ పురుషలో చెప్పిన కథ. చివరివరకు ఎలిగొరీ అనే కథా శిల్పాన్ని పాటించిన ఈ కథలో 'ఆంధ్ర సాహిత్యం ఎప్పుడూ ఎదగని బిడ్డయే' అని తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు. సుమారు పాతికేళ్ళ ప్రాయంనుంచి ఆయనకు తెలుగు సాహిత్యంపై సదభిప్రాయం లేనట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు. అదల్లా ఉంచి ఎలిగొరీ పద్ధతిలో ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి తెలుగు కథ ఇదే కావచ్చు.


తెలుగు సాహిత్యంలో అభివృద్ధి కాని నూతన ప్రక్రియలను అభివృద్ధి చెయ్యాలనే ఆకాంక్ష ఆయనకు గాఢంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ కోరికే ఆయన చేత చిన్న కథలను రాయించింది. ఫిలిప్ మెడోస్ టైలరు (Philip Meadoues Tailor, 1808-1876) అనే ఆంగ్ల నవలా కారుడు రచించిన టిప్పు సుల్తాన్ నవలను ఆంధ్రీకరించి 1912 నవంబరులో ప్రకటించారు. ఈ నవల పీఠికలో కూడా ఆంధ్ర సాహిత్య స్థితిని గూర్చిన చర్చ ఉంది. టైలరు హైందవ సంప్రదాయాభిమాని కావటం వల్ల అతని రచనను తెలిగించానని ఉమాకాంతం గారు పీఠికలో చెప్పుకున్నారు.




'ఉమాకాంతం గారు 1921 లో తెలుగు దేశ వాఙ్మయ పత్రికను స్థాపించి సంస్కృత వ్యాకరణ ప్రదీపం, పాణినీయ ఆంధ్ర వివరణం. రసమీమాంస, నైషధ తత్వ జిజ్ఞాస వంటి ప్రశస్త రచనలు వెలువరించారు' అని అక్కిరాజు రమాపతి రావుగారు రాశారు.


'లౌకిక దృష్టితో చెప్పుకోదగిన సంఘటన లేవీ ఆయన జీవితంలో లేవు. పాండిత్యానికి తగిన శరీర దార్థ్యం ఆయన కెన్నడూ లేకపోయింది.' అని అబ్బూరి రామకృష్ణారావు తెలుగు విజ్ఞాన సర్వస్వంలో అన్నారు.


ఉమాకాంతంగారి రచనలపై సమగ్ర సమీక్ష జరగలేదు. సంపూర్ణమైన అంచనా రాలేదు. ఆయన రచనలు దొరికినంత వరకూ (అన్నీ దొరకవు) పరిశీలిస్తే ఆయనకు తెలుగు సాహిత్యంపై నిర్దిష్టమైన అభిప్రాయాలు, విలక్షణమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రచనలన్నింటా తెలుగు సాహిత్య స్థితిని గూర్చి ఆవేదన కనిపిస్తుంది. ప్రచురణ వివరాలు దొరకలేదు గాని రమాపతి రావుగారి సౌజన్యం వల్ల ఆయన చిన్న చిన్న వ్యాసాలు కొన్ని దొరికాయి.


సాంఘికంగా ఆయనకు అభివృద్ధికర భావాలే ఉన్నట్టు. సాంఘిక సంస్కరణలకు ఆయన అనుకూలుడే అయినట్టూ ఆయన కథలను బట్టేకాక ఆయన విడివిడి వ్యాసాలనుబట్టి కూడా చెప్పవచ్చు. 'తెలుగు దేశము నందలి చండాలురు' అనే వ్యాసంలో "చండాలురని చెప్పుటకు ఏ ప్రమాణమూ లేని మాదుగులను, ఆంధ్రదేశము నందలి మొదటి తెగలగు చెంచులు బలిజెలు మొదలైన వారివంటి మాదుగులను అస్పృశ్యులుగా బాధించుచున్నాము. ఊళ్ళనుండి బయటికి వెళ్ళగొట్టినాము. బావుల వద్దకు రానీయము. దేవాలయములలో ప్రవేశించనీయము. ఇంతకంటే తెలుగు దేశము ఆచరించుచున్న అధర్మము మఱియొకటి లేదు. ఈ దురాచారము అప్రామాణికమైనది అనర్ధహేతువైనది అని చెప్పుచున్నాను' అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.



విదేశయానం చేసినందుకు నడింపల్లి నరసింహారావు గారిపై తెచ్చిన అభియోగానికి ఉమాకాంతం గారు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. దాన్ని ఒక విమర్శన వ్యాసంగా రాస్తూ సముద్రయానం చెయ్యటం వల్ల పతితుడవుతాడనటానికి శాస్త్ర ప్రమాణం లేదని నిరూపించారు.


ఉమాకాంతం గారు సాహిత్యాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఎంతటి గొప్పవారి అభిప్రాయాలను ఖండించటానికైనా వెనుదీసే వారు కాదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1923 సంవత్సరానికి పెట్టిన పురాణపండ మల్లయ్య శాస్త్రిగారి శుక్రనీతిని విమర్శిస్తూ.'బ్రదిమి ఏనిక, దిగ్గియ ఒండె. ఉలుపా, ఎకిమీడు' వంటి పాతపడ్డ మాటలను వాడటాన్ని నిరసించారు. ఆ పుస్తకానికి యోగ్యతా పత్ర మిచ్చిన జయంతి రామయ్య గారి స్వవచో వ్యాఘాతాలను ప్రదర్శించారు.


ఇంగ్లీషు పాఠ్య నిర్ణాయక సంఘంలో ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లీషు బోధించే వారిని వేసి, తెలుగు పాఠ్య నిర్ణాయక సంఘంలో తెలుగు బోధకులను వేయక పోవటాన్ని నిరసించారు.


విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన సభలో వేదం వెంకటరాయశాస్త్రిగారు. కట్టమంచి రామలింగా రెడ్డిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తూ వాఙ్మయపత్రికలో వ్యాసాలు రాశారు. ఆముక్త మాల్యదలో చాలా గొట్టుమాటలున్నాయి కాబట్టి అది గొప్ప కావ్యం అయినట్టు వేదం వెంకటరాయశాస్త్రి గారన్నారని చెపుతూ ఆ మాటలందు నాకు ప్రమాణ బుద్ధి కలగలేదు అన్నారు. మను చరిత్రలో రసాభాస ఉన్నది కాబట్టి దాన్ని మంచి కావ్యం కాదన గూడదన్నారు (అంతమాత్రం చేత మను చరిత్ర ఉత్తమ కావ్యమనికాదు. ఇతర కారణాలు చూపించాలని ఆయన అభిప్రాయం.) రసాభాస నిషిద్ధం కాదని అది అంగంగా ఉండవచ్చునని సిద్ధాంతం చేశారు. ఇంతకీ మనుచరిత్రలో ఉన్నది రసాభాసకాదని, వరూధిని కది వాస్తవమేనని వాదించారు. సందర్భంలోనే మనుచరిత్రను పెద్దన రచించ లేదనీ, కృష్ణరాయలు



విమర్శిస్తూ "కృష్ణరాయలు రచించిన కృష్ణశ్రేష్ఠి రచించినా. కృష్ణామాత్యుడు రచించినా, కృష్ణ భట్టు రచించిన పుస్తకములోని మంచి చెడ్డలు మారవు గనుక ఆ విచారణ నేనిక్కడ పెట్టుకోలేదు" అని వస్తుగత విమర్శ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.


కట్టమంచి రామలింగా రెడ్డిగారు మద్రాసు గోక్లేహాల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పత్రికల్లో చదివి వాఙ్మయ పత్రికలో విమర్శించారు. రామాయణం కంటే భారతం ప్రాచీనం అని రెడ్డిగారా ఉపన్యాసంలో చెప్పారు. భారతం కావ్యంకాదు. సంహిత అని రెడ్డిగారన్నారు. భారతం కావ్యమేనని, భారతం కంటే రామాయణం పూర్వమనే ఉపపత్తులను ప్రదర్శిస్తూ ఉమాకాంతం గారు వాదించారు. ఆ సందర్భంగా "వాస్తవముగా సంఘమును సంస్కరింపవచ్చును. సర్వసమత్వము ప్రతిష్ఠించ యత్నించవచ్చును. వీటికన్నిటికి రామలింగా రెడ్డిగారు మరికొన్ని మార్గములు అవలంబించ వలసియున్నది గాని భారత వర్షేతిహాసములను గురించి భారతీయుల ప్రాచీన వాఙ్మయము గురించి తెలిసీ తెలియని మాటలు మాట్లాడుట మాత్రము అనుచితమైన కార్యము" అని స్పష్టంగా నిర్భయంగా ప్రకటించారు.


'నైషధ తత్త్వ జిజ్ఞాస' అనేది సంస్కృత నైషధ కావ్యంపై విమర్శ. శ్రీహర్షుని మేధాశక్తిని, పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే నైషధము ఉత్తమ కావ్యము కాదని తేల్చారు. శ్రీహర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చినదని, కావ్య గుణం తగ్గిందని వివరించారు. "అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము, గొప్ప కవిత్వము కుంటువడిన సమయము" అని అభిప్రాయ పడ్డారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ "ఏనాడు అర్ధము హస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను... ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్ఛిన్నము లాయెను. మహమ్మదీయుల విషయ లోలత్వము దేశమున వ్యాపింప జొచ్చెను." అని దేశపరిస్థితులను వివరించారు. భారతదేశ సాంస్కృతిక పతనానికి మహమ్మదీయులు కారణంగా భావించే ఒక ఆలోచనా ధోరణి మన దేశంలో చాలా కాలంగా ఉన్నది.



అక్కిరాజు ఉమాకాంతం గారి సంస్కృత భాషా పాండిత్యం, ప్రాచీన భారత సంస్కృతిపై ఆయనకున్న అభిమానం ఎరిగిన వారికి ఆయన ఈ ఆలోచనారీతి ఆశ్చర్యకరం కాదు. హిందువులలో సంస్కరణ లాయన కిష్టమే. మహమ్మదీయుల విషయములో ఆయనపై ఆర్య సమాజపు ఆలోచనా ధోరణి ప్రభావం ఉండి ఉండవచ్చును.


గుంటూరు జిల్లా కారెంపూడిలో 1928 జూన్ 9 న జరిగిన సభలో చేసిన ఉపన్యాసం 'ఆంధ్ర భాషోపన్యాసం' గా అచ్చయింది. అందులో "నాకు దేశ భాషోద్యమంలో విశ్వాసంగలదు. విజ్ఞాన వ్యాప్తి దేశ భాషయందు వలె అన్య భాషయందు జరుగ నేరదు" అన్నారు. తదనుగుణంగా సంస్కృత గ్రంథాలను తెలిగించారు. సంస్కృత చంద్రా లోకాన్ని తెలుగు వచనంలో అనువదించారు. పాణినీయాన్ని తెలుగు చేసినట్టు తెలుస్తున్నది. 'పాణినీయము సాంధ్ర వివరణము' పేరుతో 9 సంచికల సంపుటంలో గట్టి బైండుతో వచ్చినట్టు ప్రకటన ఉంది. సంస్కృత వ్యాకరణ ప్రదీపము కారకం వరకు రచించినట్టు కూడా అదే ప్రకటనలో ఉంది. ఉమాకాంతంగారికి ఎక్కువ పేరు తెచ్చి పెట్టినవి ఆయన పరిష్కరించి ముద్రించిన పల్నాటి వీరచరిత్ర (1911, 1938) నేటి కాలపు కవిత్వం (1928).


పల్నాటి వీర చరిత్ర మొదటి ముద్రణకు రచించిన పీఠికలో అమూల్యమైన చారిత్రకాంశాలను పొందుపరిచారు. ఇతిహాసాలను గురించి, పల్నాడు గురించి, శ్రీనాథుని గురించి ఎనభైరెండు పేజీల విపుల చారిత్రక భూమిక ఇది. దాని సారాంశాన్ని ఇంగ్లీషులో ఐదు పేజీల్లో చెప్పారు. డెబ్భైమూడు పేజీల ద్వితీయ భూమిక (1938) లో 3 తెలుగు సాహిత్యంపై తమకున్న అభిప్రాయాల్ని వివరించారు. రెండో పీఠికకు ముందే నేటి కాలపు కవిత్వం వచ్చింది. ఈ రెంటిలోనూ పూర్తిగా తర్కపద్ధతి అవలంబించారు. ఏ విషయాన్నెత్తుకున్నా సమగ్రంగా చర్చించటం ఆయనకు అలవాటు. అందువల్ల ఆయన పీఠికల్లోనూ వ్యాసాల్లోనూ విషయాన్ని విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నట్టనిపించినా అవన్నీ విజ్ఞాన వికాస హేతువు 9 of 22 టం విశేషం. ఈ రెండో పీఠికలో



"పల్నాటి వీర చరిత్రను విచారించడానికి పూర్వం తెలుగు వాఙ్మయాన్ని గురించి క్లుప్తంగా తెలుపుతాను" అని ప్రారంభించి తెలుగు సాహిత్యాన్ని గురించి తమ విలక్షణాభిప్రాయాలను వ్యక్త పరచారు.


"మూలం యొక్క స్వరూపం అవికలంగా భాషాంతరంలో తెలపడమే అనువాదానికి పరమ ప్రయోజనం. నన్నయాదులవి అనుచితానువాదాలు" అని ఆంధ్ర భారతాది గ్రంథాలను విమర్శించారు. తెలుగు ఎప్పుడూ ఉత్తమ విద్యాద్వారంగా ఉండలేదు కాబట్టి తెలుగు అభివృద్ధి కాలేదన్నారు. తెలుగు కావ్యాలు అధమాధికారులకే అని ఉమాకాంతంగారి అభిప్రాయం. ఆ స్థితి మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చిన తరువాత కూడ మారలేదని ఆనాటి తెలుగు పాఠ్యాదీతర గ్రంథాలనుంచి అధికంగా ఉదాహరించారు. శబ్దరత్నాకరంలో 'సఖుడు' అకారాంత పుంలింగం అనటాన్ని విమర్శిస్తూ అది ఇకారాంత పుంలింగం అనే విషయంగూడా ఈ పీఠికలో ప్రస్తావించారు. సంస్కృతం సరిగ్గా రాని రచయితలను ఆక్షేపిస్తూ వారిని దూడ పేడ సంస్కృతం వారని ఆక్షేపించారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, చిలుకూరి నారాయణ రావు వంటి పండితుల రచనల్లోని దోషాలను కూడా చూపించారు.


ఉత్తమ సంస్కృత కావ్యాలను తెలుగులో తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆయన రఘువంశానువాదం తల పెట్టినట్టు కనిపిస్తుంది. ఆయన రఘువంశ పీఠికలో --


అక్షరమ్ముల ఆట కవితగ


పెంటకుప్పల జేసి కృతులను చిందు దొక్కెడి వారి గంతులు


చిన్న పిల్లల వేడుక.


అన్నారు. ఉమాకాంతంగారి అభిప్రాయాలను ఆయన సహచరులు "దశోపదేశిగా" సంగ్రహించారు. వాటిని ఇక్కడ తిరగరాస్తున్నాను.


1. గద్యంలో లేని విశేషం పద్యానికి ఛందస్సు సమకూర్చగలిగినది గతి మనోజ్ఞత.


2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్ధిస్తున్నది.


అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనివి. 4.


3.


5. శబ్దాలంకారాలు స్వయంగా ఆపతితమైతేనే తప్ప ఆవశ్యకంగా స్వీకార్యం కావని, వీటిని ప్రధానంగా స్వీకరిస్తే కావ్యం అధమ మవుతుందని సాహిత్య వేత్తల మతం.


6. ఇద్దరన్, మానుగ. అనఘ, అమల, ఓలి. ఒగి, పరుగు, చెన్నుగ యిట్లాటి దండగ చెత్తకు లేదా యతి భంగానికి హేతువై అనర్ధ ప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (వళి ప్రాసలు) ఆవశ్యకంగా ఉపాదేయంకాదు.


7. యతి అంటే విచ్చేదం వారింద్రియ విశ్రాంతిని, శ్రావ్యతను, పద్యం యొక్క సుపఠత్వ, రమ్యత్వాలను సిద్ధింప చేస్తుంది గనుక దీర్ఘ పాదాల్లో మధ్య యతీ సర్వత్ర పాదాంత యతీ నియతం.


8. పద్యం గానీ, పద్యాలు గానీ, శీఘ్రంగా గాని, విలంబంగా గాని అల్లిన మాత్రాన పద్యకర్త అవుతాడు. కవి కానేరడు. విజ్ఞానశాలి కానేరడు. విద్వదోషుల్లో శాస్త్రాభ్యాసజన్యం విజ్ఞానం.


9. జన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్వదోష్ఠుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్ధి, చరాచరలోకప్రభావ పరిశీలనం. కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని మమ్మటుడు.


10. పద్యరూపానగాని గద్య రూపాన గాని అనువాదం చేస్తే అనువాది కాగలడుగాని కవి కాజాలడు. రసభావ నిష్పాదక మైన సృష్టికి సంబంధించినది కవిత. కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తాను వాది. అనూదిత కావ్యంలో సృష్టి విశేషాదులు అనువాదివి కాజాలవని స్పష్టం.


వీటి ఆధారంగా ఆయన అనుయాయులు కొందరు అనువాదాలు సాగించి ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసినట్టు కొమరవోలు చంద్రశేఖర మంత్రిగారు ప్రకటించిన లక్ష్యఖండం (1937) వల్ల తెలుస్తుంది. ఉమాకాంతం గారి లక్షణాలకు వీరు రచించినవి లక్ష్యాలని వీరుద్దేశించి



నట్టు 'లక్ష్యఖండం' అనే పేరు పెట్టడం లోనే తెలుస్తున్నది. ఉమాకాంతం గారు రఘువంశ పీఠికలో --


మూలమున లేనట్టిదానిని వ్రాయననపేక్షితము చెప్పను అన్న నాథుని మాట దలచగ అర్హుడనొ కానో!


అన్నారు. 'మూలంలో లేనిది చెప్పను. మూలంలో ఉద్దేశించనిది కూడా చెప్పను'. అన్న మల్లినాథసూరి మాట తల్చుకున్నారు. ఆయన్ననుసరించి ఆలంపూరు కృష్ణస్వామిగారు


'వదలి మూలస్థమ్ము లేనిది కుక్కి అనువాదమ్ము చేసెడి అజ్ఞ మార్గము తొలగిపోవుత నాకు గురువుల కరుణచే' అన్నారు


ఇక్కడ 'గురువులు' అనే మాటలో ఉమాకాంతం గారిని ఉద్దేశించినట్టు భావించవచ్చు.


ఈ మార్గం లోనే కన్నెకంటి ప్రభులింగాచార్యులు గారు కాళిదాసు కుమార సంభవాన్ని అనువదిస్తూ


ఆర్ష భూయస్త్వోత్తమములగు కాళిదాస కవిత్వనిధులను మా కొసంగిన మల్లినాథా! నిన్ను వినుతింతు


అని మల్లి నాథుని ప్రశంసించి -- విడువగా రాదున్నదానిని లేనిదానిని కుక్కగూడదు ఇదియె అనువాదాలు తెరువను ప్రవచనమ్ము తలంచెదన్.



ఉమాకాంతం


అని అనువాద పునరుద్ఘాటించారు. విధానంలో గారి మార్గాన్ని


ఉమాకాంతం గారు, వారి అనుయాయులు ఈ అభిప్రాయాలను ప్రచారం చేశారు. సంస్కృత వృత్తాలతో పాటు తెలుగు పద్యాలను కూడా వర్ణమైత్రి లేకుండా ప్రయోగించారు. గీతాది లఘు పద్యాలకు పాదాంత విరతిని మాత్రమే నియమంగా పాటించారు. పెద్ద పద్యాలలో పాదమధ్య విరతిని కూడా పాటించారు.


వీరంతా ముత్యాల సరాన్ని ఆదరించడం చారిత్రకంగా గుర్తించ దగిన ఒక విశేషం. అయితే వీరి రచనల్లో ఎక్కడా గురజాడ అప్పారావుగారిని విరివిగా స్మరించినట్టు గాని (ఈ పుస్తకంలో ఒక్క చోట తప్ప) ముత్యాలసరం పేరును ప్రస్తావించినట్టు గాని కనపడదు. అయినా ముత్యాల సరాలను ధారాళంగా వాడారు. అదీ గురజాడ పద్ధతిలోనే. యతి ప్రాసలు నియమాలుగా కాక అలంకారాలుగా మాత్రమే పరిగణించిన అప్పారావు గారి మార్గం, ఉమాకాంతం గారికి నచ్చినట్టు భావించవచ్చు. భావకవులకూ, ఉమాకాంతంగారికీ ముత్యాల సరం విషయంలో మాత్రం ఏకీభావం కనిపిస్తుంది. భావకవుల్లో రాయప్రోలు సుబ్బారావుగారు తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారి వంటివారు వర్ణమైత్రీయుత వళినిగాని ప్రాసనుగాని ముత్యాల సరాల్లో కూడా పాటించారు. కృష్ణశాస్త్రి గారి ముత్యాల సరాల్లో వర్ణమైత్రి లేనివి కనిపిస్తాయి.


ఉమాకాంతం గారు ఆంధ్ర వాఙ్మయాన్ని అంతటినీ సూత్ర పద్ధతిలో చెప్పదల్చుకున్నారు. ఆ సూత్రాలకు మళ్ళీతానే భాష్యం చెప్పదల్చుకున్నారు. అయితే చెయ్యదల్చుకున్నవన్నీ చెయ్యటానికి జీవితం చాలింది కాదు. వాఙ్మయదర్శనము పేరుతో 'ప్రాచీన ఖండా'న్ని తొమ్మిది భాగాలు (ఆలోకములు) గా సూత్ర పద్ధతిలో రచించారు. ఈ సూత్రాలు గ్రాంథిక భాష (కావ్య భాష) లో ఉన్నాయి. ఈ సూత్రాలు చూస్తే చాలా విస్తృత ప్రణాళికనే వేసుకున్నట్టు తెలుస్తుంది. భాష్యం



లేకపోయినా, ఉమాకాంతంగారి వాఙ్మయ దృష్టిని అర్థం చేసుకోటానికి ఈ వాఙ్మయ దర్శన సూత్రాలు ఉపయోగపడతాయి. ద్వితీయాలోకంలో


1. అభారతీయము గనుక 2. సంప్రదాయ విచ్ఛేదము గనుక 3. త్యాజ్యము క్రీస్తు శకము 4. ఆత్మీయము గనుక 5. అఖండ కాలదర్శన సాధనము గనుక 6.శ్రుతి, స్మృతి పురాణేతిహాస దేశీయ కథాదులనుండి అవిచ్ఛిన్నత్వము ప్రతిపాదించును గనుక 7. సంప్రదాయ సిద్ధము గనుక 8. గ్రాహ్యము కలిశకము 9. అవిశేషము వల్ల కలిశకము కృష్ణ శకమని 10. అంతర్భూతము గనుక శాలివాహనము పాక్షికముపధ


ఉమాకాంతంగారు క్రీస్తు శకాన్ని కూడా గుర్తించని సంప్రదాయ ప్రియుడు. ఆయన తన పీఠికల కిందా ముద్రించిన రచనల పైనా శాలివాహన శకాన్నే వేసేవారు.


ఉమాకాంతంగారు వాఙ్మయ దర్శనంలో భారతీయ సంస్కారాదుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇది కాక వేరే ఇంకా ప్రాచీనాంధ్ర వాఙ్మయ సూత్రాల గురించి ఏమైనా రాశారేమో తెలీదు. 'నేటి కాలపు కవిత్వం' అని నామాంతరం ఉన్న ఈ వాఙ్మయ సూత్ర పరిశిష్ట భాష్యంలో మూడు అధ్యాయాలలో ఆధునికాంధ్ర వాఙ్మయాన్ని సూత్రీకరించారు. అందులో మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. దాన్ని మాత్రమే విపులీకరించారు. నేటికాలపు కృతి రచన, నేటికాలపు విద్య అనే అధ్యాయాలు సూత్ర రూపంలోనే ఉన్నాయి. భాష్యం రాయలేదు. ఈ పరిశీష్టాన్ని ఆలోకనాలు అనకుండా అధ్యాయాలుగా విభజించటం వల్ల వాఙ్మయ దర్శనం కన్నా భిన్నమైన వాఙ్మయ సూత్రాలు అనే గ్రంథాన్ని రాసినట్టుగానో, కనీసం రాయ తలపెట్టినట్టు గానో ఊహించాలి. అయితే మనకు పూర్తిగా భాష్య రూపంలో దొరుకుతున్నది ఈ పరిశిష్ట సూత్ర భాష్య రూపమే(అదీ మొదటి అధ్యాయమే). మొదటి సారి వావిళ్ళ ప్రచురణగా 1928 లో వెలువడింది.


ఉమాకాంతం గారు ఈ పుస్తకంలో ప్రధానంగా భావకవిత్వం


పేరుతో ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు.



తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనాన్ని రేపిన గ్రంథం ఇది. "కాని వారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానేలేదనే అనుకోవలసి వస్తోంది" అని అబ్బూరి రామకృష్ణారావు గారన్నారు. "మహాపండితులైన ఉమాకాంతం విమర్శలకు ఆనాడెవరూ జవాబు చెప్పలేక పోయారు" అని శ్రీశ్రీగారు 1960 లో విశాలాంధ్ర వారి ఆంధ్ర దర్శినిలో రాశారు. భావకవిత్వాన్ని సమర్ధిస్తూ ప్రశంసిస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలూ, పుస్తకాలూ చాలా వచ్చాయి. కాని, ప్రత్యేకంగా ఉమాకాంతం గారి ఆక్షేపణలకు సమాధానంగా ఇంతవరకూ పుస్తకరూపంలో ఏమిరాలేదన్న మాట నిజమే. అట్లాగే ఉమాకాంతంగారు తిట్టినా అదో గొప్పగా ఆనాటి కవులు చెప్పుకునే వారని అ.రా.కృ గారు అంటుండేవారు. అంతటి మహాపండితుడి దృష్టిలో పడటమే గొప్పగా ఆనాటి కవులు భావించేవారన్న మాట. ఆనాటి భావకవుల్లో బహుశా ఎవరినీ ఆయన క్షమించలేదు. విస్తర దోషాన్ని గురించి విస్తరణాధి కరణంలో చెబుతూ చెప్పవలసినదానికంటే ఎక్కువగా చెప్పటం విస్తర దోషమని నిర్వచించి, ఈ కాలపు కృతుల్లో ఇది విస్తారంగా ఉందని ప్రస్తావించి "యెంకి పాటల వంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీ కాలపు కృతుల్లో అనేకాల్లో యీ దోషం కనబడుతున్నది" అని యెంకి పాటలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మాత్రం మినహాయింపు ఇయ్యటం కూడా విశేషమే ననుకుంటాను.


ఆధునిక కవిత్వం ప్రాచీన ధోరణుల నుంచి విడివడి కొత్త దారులు వెతుక్కుంటున్న సమయంలో అక్కిరాజు ఉమాకాంతం గారు సాహిత్య విమర్శలో ప్రవేశించారు. సంప్రదాయ పండితులు చాలామంది భావకవిత్వాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఉమాకాంతం గారి మార్గం భిన్నమైనది. ఆయనకు తెలుగులోనే కవిత్వం కనపడలేదు. ఆయన ప్రమాణాలు ప్రాచీన సంస్కృతాలంకారికులవి. వాద పద్ధతి సంస్కృతంలో తర్కపద్ధతి. ఈ పద్ధతిలో సిద్ధాంతం పూర్వపక్షం, ఆక్షేపణ సమాధానం అనే విభజనలుండటం వల్ల దీనికి ప్రామాణికతే గాక హేతుబద్ధత కూడా వచ్చింది. ఈయనకు పాశ్చాత్య తర్కపద్ధతితో




ఈ కూడా పరిచయమున్నట్టు ఈ గ్రంథం లోనే అనౌచిత్యాధికరణంలో Fallacy of undue Assumption అనే పద్ధతి ప్రస్తావన వల్ల తెలుసుకోవచ్చు.


ఉమాకాంతం గారి తర్కపద్ధతికి, ఆధునిక శాస్త్ర ప్రతిపాదనల పద్ధతికి కొన్ని పోలికలున్నాయి. ఆధునిక శాస్త్ర పద్ధతిలో ఒక ప్రతిపాదన చేసినపుడు ఆ ప్రతిపాదనకు ప్రతికూలమైన అంశాలను కూడా ప్రస్తావించి వాటిని తన ప్రతిపాదన ఎట్లా పరిష్కరిస్తుందో చెప్పాలి. అప్పుడే ఆ ప్రతిపాదన సిద్ధాంత మవుతుంది. ఉమాకాంతంగారి వాద పద్ధతి ఎంత ప్రాచీనమో అంత ఆధునికం కూడా. ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి పరిశీలించటానికి ఉమాకాంతం గారి తర్క పద్ధతి పనికొచ్చింది.


ఇదికాక ఉమాకాంతంగారి శైలి సూటిదనం, సారళ్యం అనే రెండు లక్షణాల వల్ల ఆకర్షణీయంగా ఉంటుంది. 'ఆపతితం, ద్రష్టవ్యం, వక్ష్యమాణం' వంటి మాటలు ఆయన పాండిత్యం వల్ల అరుదుగా దొర్లినా సాంకేతికత లేని సాధారణ పదాలు వాడటం ఆయన అలవాటు. ఊగుడు మాటలు, పులుముడు, వికారాలు, దూడపేడ సంస్కృతం, దండగ్గణం వంటి అతి సామాన్య పద జాలంతో తన భావాలను చెప్పగలిగారు. సిద్ధాంత పూర్వ పక్షాలు, అక్షేప సమాధానాలు అనే - పద్ధతి వాద ప్రతివాదాల సంభాషణ (dialogue) పద్ధతి. ఈ నిర్మాణం (structure) వల్ల శైలి సంభాషణశైలికి సన్నిహితమై మరింత ఆకర్షకమైంది. భాష విషయంలో ఆయన మారిన దృష్టి కూడా ఇందుకు తోడ్పడింది. దానికి తోడు ఉమాకాంతం గారికి విషయ వివరణకుప యోగించే దృష్టాంతాలను, పిట్ట కథలను ఎన్నుకొని విషయ వివరణ చెయ్యటంలో అద్భుతమైన నేర్పుంది. సంస్కృతాంగ్లాలలో విశేషమైన పాండిత్యం ఉన్న ఆయన తన రచనలలో ఉదాహరించిన సంస్కృతాంగ్ల వాక్యాలకు తరచుగా ఆంధ్రాను వాదాలను కూడా ఇస్తుంటారు. ఆయన చెప్పిన విషయాల్లో భేదించినా ఆయన వాద పద్ధతి నుంచి ఈ నాటి విమర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉపపత్తులు చూపకుండా



11:37 AM Sun Dec 19


79%


00


అస్పష్టంగానూ చెప్పలేదు. ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకం సాహిత్యాభి మానులందరికీ అవశ్య పఠనీయం.


ఈ పుస్తకానికి చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఒక విద్యావేత్త పరాధీనమైన తన జాతి పతనమై పోతున్నదని, విలువలు క్షీణిస్తున్నాయని, ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోటానికి కూడా ఈ పుస్తకం చదవటం అవసరం. దాదాపు .అర్ధాయుష్కుడైన ఒక సాహిత్య కృషీవలుడు ఉన్న కొద్ది జీవితకాలం లోనే ఎన్ని విద్యలు నేర్వవచ్చునో, తాను లోక కళ్యాణమని ఎంచిన దాన్ని ఆచరించటానికి ఎంత కృషి చేశాడో తెలుసుకోటానికి ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.


అయితే ఉమాకాంతంగారు భావకవిత్వం గురించి చేసిన నిర్ణయాలు కాలంలో నిలవలేదు. మారుతున్న అభిరుచులు కనుగుణంగా భావ కవిత్వం చరిత్రలో నిలిచింది. స్థిరదోషాలుగా ఉమాకాంతంగారు గుర్తించినవి 'అస్థిర మైనవిగా మారినాయి. వాటిని దోషాలుగా పాఠకులు గుర్తించ లేదు. అయోమయత్వం. పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం అని పేర్లు పెట్టి ఆయన నిరసించిన వాటిని తరవాత పాఠకులు గుణాలుగా మెచ్చుకొని ఆస్వాదిస్తున్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్య శాస్త్ర మర్యాదలు సర్వకాల సర్వదేశ సాహిత్యాలకీ సంపూర్ణ ప్రమాణాలుగా నిలుస్తాయని ఉమాకాంతం గారు నిజాయితీగానే నమ్మారు. ఆయన ఆనాటి కవులను కఠినంగా విమర్శించారు. చరిత్ర ఇంకా కఠినమైనది. ఉమాకాంతంగారి ఆక్షేపణలను తోసిపుచ్చింది. కాలం మరీ క్రూరమైనది. ఉమాకాంతం గారినే మరుగున పడేట్టు చేసింది. నిర్భీకత కాలానికి ఎదురీదే లక్షణం, పాండిత్యం, కృషి. చెప్పేవిషయంలో నిజాయితీ, స్పష్టత, సూటిదనం, సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలను మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు.



11:38 AM Sun Dec 19


79%


00


సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతంగారి నిర్ణయాలు ముఖ్యంకాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాశ్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు.


ఈ ముద్రణలో సంపాదకుడుగా నేను చేసిన మార్పులకూ, చెయ్యని మార్పులకు కొంత సంజాయిషీ ఇచ్చుకోటం భావ్యం అనుకుంటాను.


ఈ గ్రంథం తొలి ముద్రణలోనే కొన్ని పొరపాట్లు దొర్లినాయి. వాటిని అన్ని చోట్లా సవరించటం సాధ్యం కాలేదు. సంస్కృతంలో అచ్చు తప్పులను ఆచార్య రవ్వా శ్రీహరిగారు సవరించారు. తెలుగు పద్యాల్లో స్పష్టంగా దోషాలుగా కనిపించే వాటిని సవరించాను కాని కొన్నిటిని వదిలేశాను. ఉదాహరణకు 'ఏకాంత సేవ అనే పుస్తకాన్ని 'యేకాంత సేవ' అని రాయటమే కాక పుటల సూచిక (ఇండెక్స్) లో కూడా అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఆ కావ్యంనుంచి ఉదాహరించిన పద్య భాగంలో "మధుర మోహన కళామహితమై వుండ (పే.జీ 71, 88, 94) అనే పాదంలో ఉండ అనే క్రియా పదాన్ని 'వుండ' అని రాశారు. యకార, వకారాగమాలు కవ్యుదిషాలు కావనుకుంటాను. అయినా ఉమాకాంతం గారు కావాలనే అట్లా రాశారని అభిప్రాయ పడి వాటిని మార్చలేదు. అట్లాగే ఉమాకాంతంగారు ఉదాహరించిన పద్యపాదాలు ఇప్పుడు దొరికే ప్రతుల్లో వేరుగా కనిపిస్తున్నా, ఆయన చూసిన ప్రతుల్లో అట్లా ఉండి ఉండవచ్చునని మార్చలేదు. స్పష్టంగా ఛందో దోషాలున్నచోట మాత్రం ముద్రిత ప్రతుల ననుసరించి సవరించాను. అట్లాంటి మార్పులు తెలుగు భారతం నుంచి, ఆ ముక్తమాల్యద నుంచి ఉదాహరించిన చోట్ల అవసరమయ్యాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నుంచి ఉదాహరించిన భాగం (పే.జి. 136) లో ఇంగ్లీషులో Jonffroy అనీ తెలుగులో 'జాన్ ఫ్రాయి' అని స్పష్టంగా ఇచ్చారు. ఈ పేరులో ఏదో 3


 

11:38 AM Sun Dec 19


79% (


...


వల్ల అట్లాగే ఉంచాను. ఉదాహృత పద్య పాదాలను సాధ్యమైనంతవరకు ఈ కూర్పులో పాద విభజన చేసి చూపించాను. కొన్ని సంస్కృత శబ్దాల వర్ణక్రమాన్ని ఉమాకాంతం గారు నియతంగా పాటించినట్టు కనిపించదు. వాటిని అట్లానే ఉంచాను.


ఈ పీఠికారచనకు ప్రేరేపించిన మిత్రులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి సమాచార సామగ్రిని సాదరంగా అందించిన అక్కిరాజు రమాపతిరావుగారికీ, చలసాని (విరసం) ప్రసాదుకూ కృతజ్ఞతలు. -


హైదరాబాదు. 1994 జనవరి 26.


చేకూరి రామారావు.

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు - కర్లపాలెం హనుమంతరావు ( ఒక జానపద కథ ఆధారంగా )

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 



పూర్వం మన దేశంలో అవుమాంసం తినేవారు. మన కనేక విధాల సహాయపడే ఆవును చంపి తినడం న్యాయమేనా అని ఒక రోజున రాజు గారు ఆలోచించారు. ఆవును చంపడం చాలా తప్పని తోచింది రాజుగారికి, తక్షణమే మంత్రిని పిలిచి గోమాంస మెవరూ తినకూడదనీ, తినిన వారికి ఉరి శిక్ష విధించబడుననీ దండోరా వేయించమని ఆజ్ఞాపించారు.


ప్రజలందరికీ రాజాజ్ఞ ప్రకటితమైంది. అందరూ గోవును చంపడం మానేశారు. కాని ఒకాయన గోమాంసం తినకుండా ఉండలేకపోయాడు. ఎవరూ చూడకుండా రహస్యంగా ఆవును చంపేసి దాని గిట్టలు భూమిలో పాతేశాడు. ఆయన గిట్టలు పాతిపెట్టిన చోటునుండి, ఒక మొలక వచ్చింది.

ఆడే వెల్లుల్లి, ఆవు గిట్టలనుండి పుట్టింది. కనక వాటిలాగా వెలుల్లి  నాలుపాయలుగా ఉంటుంది. ఇదీ వెల్లుల్లి జీవిత రహస్యం.


ఇంక నీరుల్లి సంగతి: 


ఒకరోజున కాయగూరలన్నీ సభ చేశాయి. 

వంకాయ లేచి సభికులనందరినీ ఉద్దే శిస్తూ ఇలా అంది.


"స్నేహితులారా ! ఇవాళ మన మందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషం. అన్ని దేశాలకీ రాజు మానవలోకంలోనూ, దేవలోకంలోనూ కూడా ఉన్నారు. ఒక్క మనలోనే లేరు. అన్ని దేశాల వలె మనకికూడా రాజుంటే బాగుం టుంది.”


అందరూ వంకాయఅభిప్రాయానికి సంతోషించారు. గుమ్మడి, పొట్ల కాయలు వచ్చి వంకాయ ఉద్దేశాన్ని బలపరిచాయి.


మిరపకాయ లేచి, “వంకాయగారు చెప్పినది, సత్యమే. మనకికూడా రాజు కావాలి. ఈ విష యం అందరూ గుర్తించి ఒప్పుకొన్నందుకు చాలా సంతోషం. కాని రా జెవరిని చెయ్యాలో చర్చించాల్సిన విషయం.” అని చెప్పి కూర్చుంది.


మిరపకాయ తెలివితేటల కందరూ మెచ్చుకున్నారు. తర్వాత వంకాయ, "భగవంతుడు పుట్టుకతో టే నాకు కిరీట మిచ్చాడు. మీ అందరికన్న నాలో సార మెక్కువ. రుచి అధికము. వంకాయ ఇష్టము లేనివా రెవరైనా ఉన్నారా? కనక నేను రాజపదవి కర్హుడనని తలచుచున్నాను” అని పలికింది.


పొట్లకాయ వెంటనే లేచి, “వంకా యగారు పొరబడినారు. నేను చాలా భారీగా ఉంటాను. అందంగా ఉంటాను. నన్ను మర్చిపోయి, తనకు రాజలక్షణా లున్నా యనుకుని అలా చెప్పి ఉంటా రు” అని యథాస్థానంలో కూర్చుంది.


రాజెవరో తేలలేదు. ఎవరికివారే తాము రాజపదవికితగుదు మని వాదించారు. గుమ్మిడికాయ, “సోదరులా రా మన మిట్లు వాదించుకోవడం అనవసరంగా  దెబ్బలాట?  మనని పుట్టించిన బ్రహ్మ దేవుణ్ణి నిర్ణయించమందాం,' అంది. దానికి అందరూ అంగీకరించారు.


బ్రహ్మ దేవునివద్దకుపయాణమైవెళ్లారు. మార్గమధ్యంలోనే దొండకాయ పండిపోయింది. పొట్లకాయ కుళ్లి పోయింది. మిరపకాయ, వంకాయ  ఒడిలిపోయాయి. అలాగే అన్నీ కలిసి బ్రహ్మదేవుడిదగ్గర కెళ్లాయి.


బ్రహ్మ దేవుడు వారి తగవు విని, "మీకూ పుట్టిందీ ఈ జబ్బు! పదవీవ్యా మోహం, మానవులకే అనుకున్నా; నిద్రకళ్లతో సృష్టించి ఉంటా మిమ్మల్ని" అని నసుక్కున్నాడు. 


బ్రహ్మదేవుడు గుమ్మడిని   రాజు చేద్దా మనుకున్నాడు. కాని తనయెదుట నిర్లక్ష్యంగా అంతఠీవిగా కూర్చున్నందుకాయనకి కోపం వచ్చింది. నలుగురి మధ్యనూ ఒదిగిఉన్న ఉల్లిపాయని ఆయన చూశాడు. దానిని వినమ్రతకి బ్రహ్మదేవుడెంతో సంతోషించాడు. ఉల్లిపాయని నిర్ణయించాడు. అందరికీ కోపం వచ్చింది. 'ఛీ ఇదా మా రాజ'ని అన్నీ చీదరించుకున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఉల్లికి పల్చటి రేకులాటి వస్త్రాలిచ్చాడు. శంఖచక్రా లిచ్చాడు. అందుకనే ఉల్లి నడ్డంగా తరిగితే చక్రం, నిలువుగా తరిగితే శంఖం కనిపిస్తాయి.


***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక కటింగ్ అండ్ ఫిటింగ్ రచన - కర్లపాలెం హనుమంతరావు ( భలేజాబులు - పేరుతో ఈనాడు - 22- 04 - 2005 న ప్రచురితం )


 


 


"మావాడికి అదేదో కాస్మోపాలిటన్ కంపెనీ..  అందులో మాంఛి మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్ ఉద్యోగం వచ్చిందిరా?" అన్నాడు కేశవాయి  ఎగ్జయిటింగ్ గా. 


మంత్లీ లెవెన్ ప్లస్ ' టెన్ K'  సాలరీ ! .. మరి ఎగ్జయిటింగ్ ఎందుకుండదూ!


"కోటీ కాలేజీ ముందు ఆడపిల్లలకోసం 'కూంబిం ' గ్  చేస్తుంటే ఈ జుత్తుపోలిగాణ్ని చూసి ఎవరో తలకుమాసినవాడు .. అని జాబిప్పించార్రా " అన్నాడు శివాయి గేలిగా. 


 శివాయి కొడుకు కాలం కలిసిరాక కానిస్టేబుల్ గా  చేస్తున్నాడులే. అదీ వాడి అసూయకు కారణం.


శివాయి , కేశవాయి నా స్నేహితులు. 


బిడ్డ జాబుకు డిపాజిట్ కట్టాలంటే కేశవాయికి లక్ష రూపాయల లోను నేనే చేసి ఇప్పించాల్సొచ్చింది. మర్నాడే ఘొల్లుమంటూ వచ్చిపడ్డాడు "జాబుకెళ్ళిన మావాడు  కనిపించటంలేదురా!.... ఆఫీసులో అడిగితే అదోరకంగా సమాధానం చెబుతున్నారు" అని బావురుమన్నాడు. 


" ఉద్యో గమొచ్చిన ఉద్వేగంలో  ఎక్కడో పడి పొర్లు తుంటాడులే. వస్తాడు" అని ధైర్యం చెప్పి పంపించా. 


ఆ మర్నాడు పొద్దున్నే  మళ్లీ వచ్చిపడ్డాడు. "స్టేషన్లో కంప్లయింటిద్దాంరా.... శివాయి కొడుకు చేత వెతికించి పెట్టు... ఇంట్లో ఎవరికీ కంటిమీద కునుకు లేదంటే ఒట్టు" అంటూ పిల్లాడి ఫొటో చేతిలో పెట్టాడు. 


ఆడపిల్లలకు మల్లే వెనక జుట్టుతో నిజంగానే జులాయిలాగా ఉన్నాడా భడవ. 


శివాయి కొడుక్కోసం స్టేషను కుపోయాం. 


అక్కడ లేడు; అంతా గొడవగా ఉంది.


"ఎవరో ఏజెంట్లట... యమభటుల్లాగా వెంటబడుతుంటే కంటబడకుండా తలో ఓ డ్యూటి వేయించుకుని బైటబైటే తిరుగుతున్నా రట" అన్నాడు శివాయి తరువాత..


"మావోయిస్టుల మీద ఒంటికాలిపై లేస్తారే! మామూలు శాల్తీనైతే  ఎన్ కౌంటరంటూ లేపేస్తారే! ఏ హెల్మెట్ పెట్టుకోలేదనో... బండి నెంబర్ ప్లేటుమీద తెలుగు రాసుందనో మూసెయ్యచ్చుగదా! ఆఫ్ట్రాల్ ఏజెంటుగాళ్లకే భయపడతారేంట్రా వీళ్లు" అని గయ్యిమని లేచాడు కేశవాయి .


ఆ ముక్కే శివాయిగాడితో అంటే "ఏజెంట్లంటే  ఐ.ఎస్.ఐ. ఏజెంట్లనుకుంటున్నారేయో!  ఎల్.ఐ.సి. ఏజంట్లురా బాబూ! పైవాడి రికమెండేషన్... ఒక్కసారి దొరికామా... చచ్చిందాగా  బుక్కయిపోయామే! పోలీసోడి లాఠీ కన్నా పాలసీవాడి పెన్ను  పోటు పవర్ ఫల్ రా 

 బాలిగా! లాకప్ డెత్ లంటూ రోజు రచ్చ చేస్తారే మీ పేపర్లలో... పోలీసోడు చేసే చిత్రహింసను గురించి మాత్రం పట్టించుకొనే  నాధు  లేడు. పగవాడిక్కూడా వద్దురా బాబూ ఈ పాడు జాబు" అనేశాడు. 


జీతాల రోజులు. ఏజెంట్ల గాలింపులు మరీ  ముమ్మరంగా సాగే నేపథ్యంలో  ముందు ఈ పోలీసోడి జాడ కనుక్కోటమే అసాధ్యంగా ఉంది.


" ఈ నైటుదాకా వెయిట్ చెయ్యండి. అప్పటికీ, దొరక్క పోతే మనమే వెళ్ళి ఏదో ఒహటి చేద్దాంలే" అన్నాడు టూకీగా. 


ఇంతలో చీకటి పడకుండానే కేశవాయిదగ్గర్నుంచి పిలుపొచ్చింది. వెళ్ళాం. ఎవడో కొత్తశాల్తీ.... బిత్తర చూపులు చూస్తూ ఓ మూల కూర్చొని, లేస్తారే ఉన్నాడింట్లో. చలిమిడి ముద్దలాగుంది గుండు. చలిజ్వరం తగిలిన వాడికిమల్లే వణికేవాడిని  చూపిస్తూ 'మావాడేరా' అన్నాడానందంగా కేశవాయి. 


" మా దొడ్లోనే దాక్కోనున్నాట్ట ఇన్నాళ్లు. ఇప్పుడు పసిగట్టిందిది" అన్నాడు తోకాడిస్తూ నిలబడ్డ కుక్కను చూపిస్తూ.


"జాబొచ్చిందని కొండకెళ్లొచ్చావా? ఇంట్లో చెప్పే పనిలే? " అని గదమాయించా. 


" ఇది కొండగుండు కాదంకుల్! ఆఫీసు గుండు" అని భోరుమన్నాడు అంతా లావూ ఒడ్డూ  భడవాయి . 


డ్యూటీ కెళ్ళిన గంటలోనే సైలెంటుగా  బుర్ర చెక్కేశారట. నేనింక ఆ ఆఫీసుకి పోనేపోను' అని గారాలు కుడిచే కొడుకు గుండు మీదొక్కటి చ్చుకుని "ఊడితే మళ్ళీ వస్తుందిరా బొచ్చు. ఉద్యోగం వస్తుందా? ఈ జాబుకు నీ బాబు లక్ష రూపాయల అప్పు తెచ్చి మరీ కట్టాడని గుర్తుం చుకోరా" అన్నాడు కేశవాయి.


అయినా జాబుకీ జుత్తుకి లింకేంటో?... ఇదేవన్నా గుళ్ళో పూజారుద్యోగమా గుండుకొట్టించెయ్యటానికీ, కనుక్కుందాం ఉండు స్వయంగా వెళ్లి  " అంటూ మర్నాడాఫీసు కెళ్ళి అడిగితే గానీ అన్ని విషయాలూ సవిస్తరంగా బైటపడలేదు. 


" కంపెనీ ఎండీ గారబ్బాయి అమెరికాలో హెయిర్ కటింగ్ కోర్సులో ఎమ్మెస్ చేసొచ్చాడండీ! ఇండియాలో సూపర్ స్పెషాలిటీ సెలూన్లు పెట్టాలని తహ తహ. మా కంపెనీ ఎంప్లాయీస్ నే  మార్కె టింగ్ ఏజెంట్లుగా మలచాలనే  కొత్త కాన్సెప్ట్ జాబుతో చేరినవాళ్లందరికీ ముందుగా గుండ్లు గీయిస్తున్నాం" అంది సి.ఇ.వో సీట్లో కూర్చున్న శాల్తీ సొంత గుండు నిమురుకుంటూ. 


"జుత్తు కత్తిరించే హక్క అ సలు మీకుందా ? కోర్టు కెళితే మీ పని గోవిందా ! తెలుసా? ' అని అక్కడిగదమాయించి చూశా. ఉహూ... తగ్గితేనా!


"ఆ ఛాన్సే లేదు సార్! నెలనెలా స్వచ్ఛందంగా గుండు గీయించుకొంటామని అండర్ టేకింగిచ్చిన తరువాతే ఇక్కడ పని ఇచ్చేది" అన్నాడు  సి.ఇ. ఓ. 


"అసలిక్కడ మీరు పీకే పనేంటయ్యా"


"గుళ్లముందు, బస్టాండ్ల ముందు తిరిగే మీ అబ్బాయి లాంటి  జుత్తు పోలిగాళ్లను గాలించి పట్టుకు రావడమే మా కంపెనీ మెయిన్ డ్యూటీ"


"సెలూనాళ్లకు జులపాలాళ్లతో పనేంటంట? " 


"ఈ ఇండస్ట్రీలో బైప్రొడక్టు కిందొచ్చే జుత్తును సవరాలు, విగ్గుల కింద రీప్రాసెసింగ్ చేసే యూనిటొకటి ఎండిగారి కోడలుగారు ఫ్లోరిడాలో ఫ్లోట్ చేస్తున్నారండీ! గుండు ఇక్కడ మేండేటరీ అయితే... విగ్ డ్రస్ కోడ్. ప్రతి ఎంప్లాయీ కంపల్సరీగా కంపెనీ విగ్లే  వాడి తీరాలని రూలు!" అంటూ ఓ విగ్ తీసి మా కేశవాయి  కొడుకు మాడుమీద పెట్టాడు!


" యాక్సెప్టైడ్ " అని సంతకం చేసే ముందు రూల్బన్సీ చూసుకోబోతే ఇలాగే అవుతుందమ్మా మరి" అంటూ సొంత గుండు తడుముకున్నాడా సి. ఇ. ఓ. 


"కేశవాయి కొడుక్కి జాబొచ్చిందంటే టేలెంటును చూసి అనుకున్నాంగానీ నెత్తిమీది జుట్టును చూసన్న మాట" అని పడీ పడీ నవ్వా డాపూట శివాయి చాలా సేపు.


"పోనీలేరా ఒన్ టైం  షేవింగ్ ఖర్చన్నా సేవ్ అయింది" అని సర్ది చెప్పాల్సి వచ్చింది కేశశవాయికి.


"ఆ మాటయితే నిజమే. నెలకు పదకొండు వేల నూటపదకొండు రూపాయలంటే ఊరికే ఇస్తారా?" అన్నాడనుకోండి శివాయి తరువాత.


సేలరీ రోజు ఆ బండారం కూడా బైటప డింది. కేశవాయి గుండెల్లో ఇంకో బండ పడింది. 


" షేవింగుకి వెయ్యి... విగ్గుకి పది వేలూ పోగా మిగిలింది నూట పదకొండే. నెల నెలా ఇదే తంతట. కొండకుపోయి వేరేగుండు గీయించుకోవటమెందుకు! " అని కూలిపోయాడు పాపం కేశవాయి. 


ఈ ముక్క శివాయి చెవిలో కూడా వేయటం మంచిదని వెళ్ళానా.. అనుకు న్నంతా అయింది. వాడి కొడుకు పోలీసుద్యోగానికి రాజీనామా చేసి నిన్ననే ఆ ' కటింగ్ అండ్ ఫిటింగ్ ' కాస్మోపాలిటన్ కంపెనీలో కలిసిపోయాట్ట ! 


' అరె! పైవాళ్ళు పంపే ఏజంట్ల తంటాకన్నా ఇలా గుండుకొట్టించుకుని బస్టాండ్లలో .. కోటీ వుమెన్స్ కళాశాల  ముందు ' కూంబిం' గు లు చేసుకుంటూ బతకడం బెటరని నిన్ననే డిసైడైపోయాడురా మావాడు" అనేశాడు శివాయి దిగాలుగా. 


- కర్లపాలెం హనుమంతరావు

( భలేజాబులు - పేరుతో ఈనాడు - 22- 04 - 2005 న ప్రచురితం ) 

Saturday, December 18, 2021

పాత బంగారం - కథ అల్లుడి అలక - మారుతి ( ఆంధసచిత్రవారపత్రిక 28-6-63) సేకరణ- కర్లపాలెం హనుమంతరావు





పాత బంగారం - కథ 

అల్లుడి అలక 

- మారుతి 

( ఆంధసచిత్రవారపత్రిక 28-6-63) 

సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 


విడిదిలో పెళ్ళికొడుకు అలిగి కూచున్నాడు. మగ పెళ్ళివారు భోజనాలకు రామని భీష్మించుకుని కూర్చున్నారు. 


పెళ్ళికొడుకు తల్లి చీర చెంగుతో ముక్కు తుడుచుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. మొహ మంతా కందగడ్డ చేసుకుని పక్కనే కూచున్న ఇద్దరు కూతుళ్ళు ఏవో చెప్పుతూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.


ఉదయం పది గంటల ఏడు నిముషాలకు సూత్ర ధారణ జరిగింది.  ఆ తర్వాత ఆరంభ మయిందీ ప్రచ్ఛన్న యుద్ధం!


వెంకయ్యవంతులుగారు కాలు కాలిన పిల్లిలాగ తిరుగుతున్నారు . . పెళ్ళివారిని శాంత పరచాలని. అయిన ఖర్చు అవుతూ ఈ అల్లరి ఏమిటని ఆయన బాధ.


పెళ్లి పందిట్లో ఎవరో అన్నారుట "అందుకే సాంప్రదాయం చూసి చేసుకోవాలని. ఒక మంచీ మర్యాదా ఏమీలేదు. మెహం వాచినట్టు ఆ ఫలహారాలకు ఎగబడడ మేమిటి- తింటూ ఆ వంకలు పెట్టడమేమిటి" అని.


'ఆడ పెళ్ళివారు ఇలాంటి మాటలతో అవమానం చేస్తారా' అని, మగ పెళ్ళివారు అలిగారు. 


వెంకయ్యవంతులుగా రసలే ముక్కోపి.  అయినా మనిషిలో ఎంతో మార్పు కనిపించిం దా సమయంలో! ఎర్ర పట్టుబట్ట కట్టుకుని తెల్లటి జరీ అంచు పట్టు ఉత్తరీయం మీద వేసు కుని విడిదికి బయలుదేరుతుంటే 'అసలే ఈయనది దుడుకు స్వభావం. లేనిపోని గొడవలు చేసి రసాభాసం చేస్తాడేమో'నని వెంట ఆయన తోడల్లుడు సుందరామయ్య కూడ వెళ్ళాడు.


వెంకయ్య పంతులుగారు నవ్వుముఖంతో ప్రాధేయ పూర్వకంగా వియ్యంకుడి చేతులు పట్టుకుని బ్రతిమలాడారు.' 'ఎవరో ఏదో అన్నారని ఇలా భోజనాలు చెయ్యకుండా ఉండటం న్యాయమా చెప్పండి బావగారూ! మేముగా ఏమయివా తెలియక పొరపాటున చేసి ఉంటే చెప్పండి; క్షమాపణలు కోరుకుంటాను"    


ఆయనంటున్న మాటలకు వియ్యపురాలి పక్కన కూచున్న ఎవరో ఒకావిడ లోపలినుంచి అన్న మాటలు వినిపించాయి. 


' ఎవరో ఏదో అంటే మా కెందు కింత బాధ ! పెళ్ళికూతురికి స్వయాన అమ్మమ్మట ఆ మాట అన్నది. మేమేమీ తిండికి మొహంవాచి రాలేదు.  మా మంచీ మర్యాదా మీచేత పరీక్ష చేయించుకో టానికి రాలేదు'


'ఆవిడ పెద్దది. తొందరలో ఏదో అని ఉంటుంది. ఆమె మాటలు అంతగా పట్టించుకోవా ల్సిన పనిలేదు. ఇక భోజనాలకు లేవండి బావ గారూ ! 'విస్తళ్ళు వేశారు. వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారక్కడ. మీరు లేవాలి పంతులుగారు ప్రాధేయపడ్డారు. 


ఇక వెంకయ్య వెంట వచ్చిన సుందరామయ్యకు తను ఎన్నడూ చూడని సౌమ్యత ఆయనలో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది.


' అనే మాటలు వేసి తొందరలో అన్నది —— పెద్దది అంటే ఎలాగండి, మా కెంత కష్టంగా ఉందో ఆలోచించారా మరి!' వరండాలో స్తంభానికి ఆనుకుని కూచుని పుగాకు చుట్ట చుట్టు కుంటున్న ఒక బంధువు ఎదురుప్రశ్న వేశాడు. ఆ విడిదిలో ఉన్నవాళ్ళు మూడు వంతు లకు పయిగా ఉదయం ఏడుగంటలనుండి అప్పటి దాకా ఆడ పెళ్ళివారికి కబుర్లు మీద కబుర్లు పెట్టి తెప్పించుకున్న ఇడ్లీ - ఉప్మా, కాఫీ నాలుగైదు సార్లయినా ఖాళీ చేశారు.


ఇదంతా చూసి ఆ ముసలావిడకు వళ్ళుమండి పోయి, ఆ మాట అన్నది, అయిదోసారి కాపీ గుండిగ పట్టించుకు పోదామని వచ్చిన ఆమె వినేట్లుగా! 


విడిది ఒకవేపుగా మంచంమీద "స్నేహితులతో ముచ్చట్లాడుతున్నాడు పెళ్లి కొడుకు . 


'రేడియో అడగరా మీ మామను .' 'రేడియో కమ్   ట్రాన్సిస్టరడగరా ఇప్పుడు గాకపోతే ఇంకెప్పుడిస్తాడు ?' అని సలహాలిస్తున్నారు

మిత్రులు. 


' ఆయన్ని మనవేపు రానీ అసలు' పెళ్ళికొడుకు సందేహం వెళ్ళబుచ్చాడు.


'ఓరి చవటా! అప్పుడే నీరు గారి  పోతావేమిరా ! ఆయన వచ్చి 'లేవోయ్ భోజనానికి' అని అనగానే లేచి ఆయన వెంట పరిగెత్తక. కొంచెం బెట్టు చెయ్యి. మిగతా సంగతి మేము పూర్తి చేస్తాము ' అని ధైర్యం చెప్పారు మిత్రులు. పెళ్ళికొడుకు అంగీకార సూచకంగా బుర్ర ఊపాడే గాని తన వయిపువాళ్ళు ఒక పట్టాన తెగనిచ్చేటట్టు కనబడలేదు వ్యవహారం.'


మామగారు ఒంటరిగాడయిపోయినాడు. బతిమలాడుతున్న కొద్దీ తీరుబడిగా విజృంభిస్తున్నారు. ఎవరికి తోచినట్లు వారు, 


వెంకయ్య పంతులు గారు క్షణక్షణానికి సహనం

కోల్పోతున్నారు. అయినా తప్పదు ! ఇటు వంటి సమయాల్లోనే ఓర్పు, నేర్పు అవసరం! ఇదే తను తలపెట్టిన శుభకార్యం ! అంతా నవ్యంగా జరిగిపోయిందనుకుంటే, సరీగా భోజ వాల ముందు పేచీ వచ్చిపడింది. 


అసలు వాళ్ళని మాట్లాడనివ్వకుండ ఉన్నవాళ్ళు తలా ఒక మాట విసురుతున్నారు. వియ్యంకుడు ఎటూ చెప్పలేక గుంజాటన పడుతున్నాడు. పెళ్ళి చేసి చూడు; ఇల్లు కట్టిచూడు అన్నారందుకే! 


వేలకు వేలు డబ్బు ఖర్చయినా వచ్చే మాట రానేవస్తుంది. వెంకయ్య పంతులుగారి వివాహంలో తనవాళ్ళు ఇంతకన్న ఎక్కువ అల్లరే చేశారు. పాపం! 

ఆయన మామగారు ఆరితేరిన అనుభవజ్ఞుడు కావడంచేత అన్నీ సునాయాసంగా సమర్థించుకుపోయాడు. ప్రతిదానికి అడుగడు గునా వంకలు పెట్టటమే మగపెళ్ళివారు. అప్పుడు జరిగిన దానికంటే ఇప్పటి పరిస్థితిలో ఎన్నో ఆ విషయం జ్ఞాపకంవచ్చి ఆయన కోపాన్నంతా దిగమింగుకుని వియ్యంకుడిని, ఆయన బంధులవును సమాధాన పరచాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. 


ఒక అరగంట జరిగిందీ వరసన. ఎంత సేవ యినా, మళ్ళీ మొదటికే వస్తున్నదీ వ్యవహారం!


భోజనాలకు లేచే  వాతావరణం ఎక్కడా కనిపించనే  లేదు. ఆలస్యం జరుగుతున్నకొద్దీ విడిదిలో ఏం జరుగుతున్నదో తెలుసుకుందామని పెళ్ళివారింటి నుంచి ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్నారు. 


' సరే మీరంత పట్టుదల పడితే ఏం చెయ్యగలను ? 

నేనూ ఇక్కడే కూచుంటాను' అని వెంకయ్య పంతులుగారు వియ్యంకుడి పక్కనే కూచున్నారు. ఆయన తోడల్లుడు సుందరామయ్యకు మాత్రం సహనం నశించింది. 


 'వీళ్ళు మనుషులా లేక కారణ రాక్షసులా' అనిపించిందాయనకు. 


వెంకయ్య పంతులుగారు కూచోవడం గమనించిన ఒక బంధువు 'మీరు అనే మాటలు బాగానే ఉన్నాయి గానీండి; తప్పంతా మాదే నుంటారు  ఇంతకీ !' అన్నాడు అయిదోసారి పుచ్చుకున్న కాఫీ వెళ్ళి. టిఫిను పీకదాకా ఎగదన్నుతుంటే తాపీగా కంఠం సరిజేసుకుంటూ.


ఇంక లాభం లేదనుకున్నాడు సుందరామయ్య. కూచున్న వాడల్లా దిగ్గున లేచి 'అన్నమాటలేవో  అన్నాము. కావాలని మేమే ఆ ముసలమ్మచేత అని పించాము. సరా !.... ఇప్పుడు మీరు భోజనాలకు పదండి లేస్తారా లేవరా ! ఒక్కటే మాట. రెండు నిము షాలే టయిము' అన్నాడు హెచ్చు స్వరంతో.


ఆయన ముఖ కవళికలు చూసి అక్కడ అందరూ హడలిపోయారు. అప్పటిదాకా ఒకళ్ళ కొకళ్ళు సంబంధం లేకుండా మాట్లాడుకుంటున్న

మాటలతో రణగొణ ధ్వనిగా ఉన్న విడిది నిశ్శబ్దంగా

అయిపోయింది.


ఆడవాళ్ళంతా గజగజలాడారు. పెళ్ళికొడుకు గుండెల్లో రాయిపడింది. వెంకయ్య పంతులుగారు పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూనే తోడల్లుని సమీపించి 'తొందరపడకు తమ్ముడూ!' అన్నారు.


' మీరూరుకోండి అన్నగారూ ! క్షమించండి. అంతకంటే ఏమీ చెప్పలేను' అని కోపంతో వెంకయ్యవంతులుగార్ని తప్పించుకుని రెండడుగులు ముందుకు వేసి 'అందరి మర్యాదా మంట కలసిపోకముందే - భోజనాలకు నడవండి - ఏమండి వియ్యంకుడుగారూ చూస్తారేం ?...  ఒరేయ్ చెంచయ్యా ! భజంత్రీలను  రమ్మను— మేళం చెయ్యమను... ' ఆజ్ఞలు సుందరామయ్య. జారీచేశాడు 'లేవలేకపోతే ఏం జేస్తాడో!' అని ఒకమూల నుంచి అన్న మాటలు ఆయన చెవుల్లో పడ్డాయి. 'నేనేం చేస్తానో, చేయిస్తానో మీతో చెప్పి చేయవలసిన అవసరం నా కేమిలేదు. మూర్ఖంగా ప్రవర్తించక హృదయమున్న మనుషుల్లాగా  ప్రవర్తించండి!' గర్జించాడు. 

 ఇంతలో చెంచయ్య అందించిన ప్రకారం బాజా భజంత్రీలు వచ్చి విడిదిముందు నిలిచారు. 


ఆశ్చర్య మేమిటంటే వెంకయ్య పంతులుగారు కూడ తన తోడల్లుని వేపు చూడడానికి సాహసించలేకపోయారు. 


అప్పటిదాకా కుడితిలో పడిన ఎలుకలాగా కొట్టుకుంటున్న వియ్యంకుడు లేచి లోపలికి వెళ్ళి 'నే చెబితే విన్నారుటమ్మా !.... సవ్యంగా సాగిపోతున్న దానికి ఒక మెలిక వేస్తిరి. ఇప్పుడు అవమానం పాలయ్యేది వాళ్లా మనమా! అసలే పల్లెటూరు ఇది. పదిమందిని పిలిచి మనమీదకు ఉసిగొలిపితే ఇక్కడ మన పరువేంకావాలి !.... ఆయన చూడు — వీరభద్రుడి అవతారం ఎత్తాడు !" అని మొత్తుకున్నాడు. 


దానితో ఎవరి మటుకు వాళ్ళు తెలివి తెచ్చుకుని లేనిపోనిది భలానా వాళ్ళ పెళ్ళికి వెళ్ళి చావు దెబ్బలు తిని వచ్చారంటూ - కలగబోయే అపనిందకు జంకి భోజనాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. 


సుందరరామయ్య  విడిదంతా కలియ చూశాడు. అందరూ లేచి సిద్ధ మవుతున్నారు గాని పెళ్ళి కొడుకు మాత్రం నడిమంచం మీద కూచున్నాడు తిష్ట  వేసుకుని.

' ఏమిషర్లేలే! వాళ్ళంతా బయలుదేరారు. ఇప్పటికే కాలాతీత మయిపోయింది' అన్నాడు సుందరామయ్య పెళ్ళికొడుకు దగ్గరకు

వెళ్ళి.

ప్రళయం సరాసరి తవమీదికే వచ్చినందుకు ఆలోచించే వ్యవధికూడ దొరక్క ఠపీమని లేచి నుంచున్నాడు పెళ్ళికొడుకు . పక్కనున్న స్నేహితులు నొక్కి పెడుతున్నా వినకండా; వూడిపోతున్న మధుపర్కం సరిజేసుకుంటూ 'అబ్బే నాదేముంది, ' అన్నాడు.


అందరినీ కూడగట్టుకుని పెళ్ళివారింటికి చేరేలోగా ఈ వార్త పాక్కిపోయింది పెళ్ళి సందిట్లో సందరామయ్య అంతపని చెయ్యగలిగాడా! అనేదే ప్రతివారిని ఆశ్చర్యపరిచిన విషయం.


భయంతో భోజనాలకు బయలుదేరారే గాని మగ పెళ్ళివారి కిది అవమానకరంగానే తోచింది. పౌరుషం పెరిగింది. భోజనాల దగ్గర గొడవ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరి మటుకు వారు నిశ్చయించుకున్నారు. కొంతమంది బయటికే అనుకున్నారు. అవి మెల్లిగా పాకి మగ పెళ్ళివారి కంటె ముందుగానే వెంకయ్యవంతులుగారింటి చేరినయి.


ముహూర్త బలం మంచిది కాదన్నారు. అంతా సవ్యంగా అయిపోయిందని సంతోషిస్తుంటే ఈ కొసరు ఏమిటని బాధ వ్యక్తం చేశారు. సాంప్రదాయం అవీ చూడకుండ సంబంధం కలిపితే ఇట్లాగే ఉంటుందని వ్యాఖ్యానించారు కొందరు.


'ఇటువంటి వాళ్ళతో ఎట్లా నెగ్గుకు వస్తుందో పాపం జానకి!' అని పెళ్ళికుమార్తె మీద సానుభూతి చూపించారు.


సుందరామయ్య ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు: 'మీరేం భయపడద్దు మీ పని మీరు కాని

వ్వండి' అన్నాడు. వెంకయ్య పంతులుగారు మాత్రం “లేనిపోని గొడవ ఏమిటిది సుందర్రామయ్యా!” అని చేతులు పట్టుకున్నాడు ఎటూ పాలుపోక, 'మీరేం భయపడకండి. అంతా జరిగిపోయేట్లు చూచే భారం నాది' అన్నాడు సుందరరామయ్య. 


అల్లరి చేద్దామనుకున్న వాళ్ళెవరూ నోరెత్త లేదు భోజనాల దగ్గర. దానికి కారణం మందరామయ్య అడుగడుగునా ప్రత్యక్షమవుతుండటమే.


అంతా సక్రమంగానే జరిగిపోయింది గాని, పెళ్లి కొడుకు కోరికే ఇంకా కొరవ ఉండిపోయింది. స్నేహితులు, అప్పచెల్లెళ్ళూ కాకుల్లా పొడవటం మొదలుపెట్టారు పెళ్ళికొడుకు రామారావును.


“వాళ్ళు అన్నమాటలకే తలవంపులుగా ఉంటే, నవ్వు చవటలాగ ఇలా వూరుకోవటం ఏమీ బాగాలేదు. ఫలానావాడి పెళ్ళికి వెళ్ళి, అవమానం పాలయి వచ్చామని మేము ఏ మొహం పెట్టుకుని చెప్పుకోము.'' ఇట్లా రామారావు చెవిని ఇల్లు గట్టుకుని పోరారు. 'ఏమయినా సరే, అలక పానుపుమీద విలువయిన వస్తువేదయినా కోరాల్సిందే!' అని రూలింగ్ ఇచ్చారు.


సాయంత్రం అయిదు గంటలయింది.


ఆడ పెళ్ళివారు ఘనంగా అయిదు వందల రూపాయలు ఖర్చుపెట్టి రకరకాలుగా అలంకరించిన కారు మాట్లాడారు ఊరేగింపుకు; ఫుల్ బ్యాండు సెట్టుకూడా ఏర్పాటు చేశారు.


కాని, పెళ్ళికొడుకు అలిగాడు! ఆరు గంటలు అయినా, పెళ్ళికొడుకు పట్టెమంచంమీద బైఠాయింపు సమ్మె చేస్తున్నాడు !


వెంకయ్య పంతులుగారు తల పెట్టినది ఇదే మొదటి శుభకార్యం, జానకి ఆయన ప్రథమ సంతానం . కలిగినంతలో గొప్ప సంబంధం తెచ్చి చెయ్యా అని రెండు సంవత్సరాలపాటు గాలించి ఆఖరికి ఈ సంబంధం స్థిరపరుచుకున్నారు అన్ని విధాలా నచ్చటంచేత.


అల్లుడు డిగ్రీ పుచ్చుకున్నవాడని, కొద్దిపాటి అదీ ఉన్నది, అత్తమామలు ఉన్న కుటుంబం గనుక అమ్మాయి సుఖపడుతుందనడంలో సందేహం లేదని వెంకయ్య అనుకుని పంతులుగారు నిశ్చయిం చుకుని ముందుగా నిర్ణయించుకున్న లోపాయికారి కట్నంలో అయిదువేలరూపాయలు లగ్నాలు పెట్టుకున్నప్పుడే ఇచ్చేశారు. అదిగాక ఆడబడుచుల లాంఛనాలకింద వెయ్యి రూపాయలు, పెళ్ళి కుమారుడికి వెండికంచం - పట్టు బట్టలకు బదులు సూటు, రిస్టువాచీ  లగ్న మప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం అన్నీ సక్రమంగా జరిపారు.


ఇంత ఖర్చు భరించడానికి ఆయన సంతోషంతో తప్పుకోడానికి కారణం ప్రథమ సంతాన మయిన జానకి - వివాహం ఘనంగా జరిపించాలని సంకల్పించడమే ! అప్పటికే నాలుగు వేలు అప్పు  తగిలింది ఆయనకు.

అల్లుడు అలిగాడనగానే  పరిగెత్తుకుంటూ ఉత్తరీయం సరిజేసుకుంటూ వెళ్ళారు.

' ఏం నాయనా! ఏమిటి సంగతి' అని నవ్వు తూనే అడిగారు.

నూనె తడిలేక కళ్ళ మీదకు పడుతున్న జుట్టును చేత్తో పయికి నెట్టడానికి వృథా ప్రయత్నం చేస్తూ ముఖం చిట్లించి  కోపం నటించాడు రామారావు. చేతికున్న కొత్త రిస్టువాచీకి ఉత్తుత్తి ‘కి' ఇచ్చాడు కాసేపు.


వీడెటూ చెప్పలేడని  గ్రంహించిన పక్కనున్న స్నేహితుడు 'వాడు అలిగాడండీ! అడగటానికి మొహమాటపడుతున్నాడు' అన్నాడు. 'అనుకున్న ప్రకారం అన్నీ ఇచ్చాను గదుటోయ్! ఇంకా ఏమిటి అవతల ఊరేగింపుకు టయిము అయిపోతున్నది' అన్నారు వంతులుగారు బతిమాలుతున్న ధోరణిలో.


ఉదయమే, ఆడబడుచు కట్నంలో తన వాటాకు వచ్చిన రెండువందలూ పుచ్చుకుని పెట్టెలో దాచుకున్న పెళ్ళికొడుకు అప్పగారు "వేడుకలన్నీ జరిపి తీరాల్సిందే ! అదేమన్నమాటండోయ్ !" ఇవ్వాళ కాకపోతే ఇంకెప్పుడు చెల్లుతయి వాడి ముచ్చట్లు మాత్రం ! ఈ కాస్తా అయిపోతే ఆ తర్వాత మీరేం పెడతారో, వాడేం తీసుకుటాండో మే మేమన్నా చూడొచ్చామా .. అడగొచ్చామా' అన్నది తమ్ముడికి వత్తాసిగా. భళిభళి అన్నారు ఇంకో ఇద్దరు ఆమె అన్న దానికి.


కుడితిలో పడిన ఎలుకలాగ అయింది వెంకయ్య పంతులుగారి పని. చుట్టూ ఆడవాళ్ళ మెజారిటీయే ఎక్కువగా ఉంది. అప్పటికే ఖర్చులన్నీ కలిసి తలకు మోపెడయినయి. ఇంకా ఇంకా ఒక దాని కొకటి ఇట్లా పెరిగిపోతుంటే ఎట్లాగని ఆలోచిస్తున్న ఆయన చెవులకు 'అడగరా ! మళ్ళీ అవతల ఊరేగింపుకు వేళవుతున్నదని సుందర్రా మయ్యగారొచ్చి  బెదిరిస్తే మళ్ళీ కష్టం' అన్న మాటలు వినిపించినయి.


'ఏమడగనూ నా మొహం ' అని జుట్టు పై కి నెట్టుకుని 'స్కూటరు' అన్నాడు రామారావు. వెంకయ్య పంతులుగారు నీళ్ళు గారిపోయారు. రెండువేల అయిదు వందల రూపాయలు ఆయన కళ్ళముందు మెదిలినయి . పసిపిల్లవాడు కారు కొని పెట్టమన్నట్టుగా ఉన్నది అల్లుడు 'స్కూటరు' కొనిపెట్ట మనటం ! అతనేమంత అజ్ఞావా! తెలివితక్కువ వాడా! అన్నీ తెలిసే అట్లా అడుగుతున్నాడు. ఆయనకు చాలా బాధ కలిగింది. పయిగా వియ్యపు రాలు, వియ్యంకుడు తమ కివేమీ పట్టనట్టు

కొంచెం దూరంగా కూచున్నారు వేడుక చూస్తూ. రాని  నవ్వును బలవంతాన తెచ్చి పెట్టుకు కుని 'చూడు రామారావ్ ! కష్ట సుఖాలు తెలిసినవాడివి;

చదువుకున్నవాడివి. అందుచేత దాపరికం లేకుండా చెబుతున్నాను. 'స్కూటరు' అంటే వందా రెండు వందలకు వచ్చే వస్తువేమీకాదు. అంత పెద్దగా కోరటం బాగాలేదు. ఏదో నాకు తోచింది నేను సంతోషంగా ఇస్తాను తీసుకో !' అని వంద రూపాయల నోటు ఇవ్వబోయారు పంతులుగారు.


కళ్ళమీద పడిన జుట్టులోంచి వందరూపాయల నోటువేపు చూసి తటపటాయించాడు రామారావు, 'టు బీ ఆర్ నాట్ టు బి' అనే ముక్క జ్ఞాపకం వచ్చి.


'బాగుందిరోయ్ వరస.  చావుకు పెడితే లంకణాని కన్నట్టు — ఇదేమిటి!' అన్నా డొక మిత్రుడు మెంటులాగ పళ్ళన్నీ వెళ్ళబెట్టి. ఇవేమీ వినిపించుకో 

కుండ, పంతులుగారు అల్లుడిని సమాధాన పరచ డానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం మెల్లగా  పాకింది పెళ్ళిఇంటికి. పందిరి చల్లదనంలో  విశ్రాంతిగా  పడుకుని ఆడవాళ్ళతో సరదాగా

మాట్లాడుతున్న నుందరరామయ్య గుర్రుమన్నాడు. 

"వీళ్ళు మనుషులా కట్నమిచ్చి, సలక్షణ మయిన పిల్లనిచ్చి అన్ని లాంఛనాలతో పెళ్ళి చేస్తే ఇంకా గొంతెమ్మ కోరికలకు అంతెక్కడ!' అని చిందులెయ్యడం మొదలుపెట్టాడు.


మాతన వధువు జానకి కళ్ళ నీళ్ళ పర్యంత మయింది. ఇంత హృదయంలేని మనుషులు కూడ ఉంటారా లోకంలో, అనుకుంది. తన తండ్రి ఎంత సరదా పడుతున్నాడో, అంత కించ పరుస్తు న్నారు.  పెళ్ళివారు వచ్చిన దగ్గర నుంచీ కోరిక  కోరికలకు కూడ మితముండాలి ! ఇష్టంవచ్చినట్టు 'నాకు రైలు కావాలి, విమానం కావాలి' అంటే, ఎక్కడి మంచి తేగలరు ఎవరు మటుకు! జానకిని మూగ బాధ ఆవరించింది. ఎంతో మధురమయినదిగా ఊహించుకున్న వివాహం ఇంత జుగుప్సాకరంగా ఉంటుందమకోని జానకి బాధపడింది.


సందరామయ్య లేచి విడిదికి వెళ్ళబోతుంటే జానకి భయపడింది. 'బాబాయ్! ఒక్క మాట' అని పిలిచి గదిలో నుంచి ఇవతలకువచ్చి, సుందర్రా మయ్య దూకుడుగా వెళ్ళబోతున్న వాడల్లా  వెనక్కు తిరిగి జానకి దగ్గరికి వెళ్ళి "ఏంమ్మా'  అన్నాడు. జానకి మొహం చిన్నబోయి ఉన్నది.


'అంతా విన్నాను బాబాయి ! ఇటువంటి మను ష్యులనుకోలేదు' ఇప్పుడు నువ్వు వెళ్లి నోరు చేసు కుంటే, అల్లరి అవటం తప్ప మరేంలేదు' అని కాసేపు తటపటాయించి 'ఇదిగో బాబాయ్ ఎవరికీ తెలీకుండ ఈ కాగితం వారికి అందజేయి. ఇదే నిన్ను కోరేది' అన్నది జానకి కాగితం మడత ఆయన

చేతుల్లో పెడుతూ,


సుందరామయ్య ఆ కాగితం అందుకున్నాడు, ఆయనలో రేగిన కోపం చల్లారింది. ముఖం ప్రశాంత మయింది.' 'అలాగే తల్లీ " అని జానకి తల నిమిరి విడిదివేపు దారితీశాడు.


ఈయన్ని చూస్తూనే అలక పాన్పున లంక రించిన పెళ్ళికొడుకు— చుట్టూ చేరిన సగంమంది వెనక్కి తగ్గారు.  ఇవ్వేమీ పట్టించుకో కుండా, 'ఏమిటి' మామా అల్లుడు మంతనా లాడుతున్నారు తీరిగ్గా' అన్నాడు సుందరామయ్య అతి ప్రశాంతంగా నవ్వుతూ.


'అబ్బే ఏముందీ !.... అల్లుడు ఏదో వేడుక కొద్దీ కోరాడు. ఆ విషయంమీదే మాట్లాడు తున్నాం' అన్నారు వెంకయ్య పంతులుగారు నుదిటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ. అప్పటికే ఆయన సహనం చచ్చిపోయింది.


సుందరామయ్య నవ్వుతూ పెళ్ళికొడుకు పక్కగా మంచంమీద కూచున్నాడు. లోపల పీచుపీచుమంటున్నా, పయికి బింకంగానే కూచు. న్నాడు రామారావు.


మంచంచుట్టూ అందరి మొహాలూ సావధానంగా చూసి, సుందరామయ్య పెళ్ళికొడుకు చెవులో రెండు మాటలు రహస్యంగా చెప్పి, కాగితం మడత అతని చేతుల్లో ఉంచాడు.


పెళ్ళికొడుకు రెండు క్షణాలు చలనం లేకుండ అట్లాగే కూర్చుని మంచంమీద నుంచి దిగి 'ఇప్పుడే

వస్తానురా' అని మిత్రులకు సంజ్ఞ చేసి, బాత్ రూమ్ లోకి వెళ్ళి కాగితం మడత విప్పి చదువు కున్నాడు. ఆ వెంటనే 'ఛీఛీ'! అనుకున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. చేదుమందు మింగినవాడిలా మెహంపెట్టి, ఆ కాగితం అతి భద్రంగా దాచు కున్నాడు.' ఎంత తప్పుపని చేశాను' అనుకున్నాడు.


సబ్బుతో కసాబిసా మొహమంతా కున్నాడు. గదిలోకి వెళ్ళి రెండు నిముషాల్లో డ్రమ్ చేసుకుని వూరేగింపుకు సిద్ధమయి బయటికి వచ్చిన పెళ్ళికొడుకుని చూసి సుందరామయ్య మినహా అందరూ ఆశ్చర్యపోయారు.


'అప్పుడే అలక తీరిందా ఏమిట్రా' అన్నారు. మిత్రులు.


'ఆ! తీరినట్టే!' అన్నాడు ముక్తసరిగా, అలంకరించిఉన్న కారువేపు నడుస్తూ. వెంకయ్యపంతులుగారు అయోమయంగా తోడల్లుని వేపు చూశారు. 'అదంతా ఉందిలేండి అన్నగారూ' అని నిండుగా నవ్వాడు సుందర్రామయ్య. అప్పుడే విడుదలయిన కొత్త సినిమాలో పాట అందుకున్నారు బ్యాండువాళ్ళు.


ఊరేగింపు కారు బయలుదేరుతున్నదన్నారు. అందరూ సంబర పడిపోయి. - పెళ్ళికూతురు సిగ్గు దొంతరలతో హంసలా నడిచివచ్చి కారులో కూర్చుంది తన హృదయేశ్వరుని పక్కన హృదయమంతా మల్లెపందిరి కాగా..


పెళ్ళికొడుకులో హఠాత్తుగా ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటో ఎంత తల బద్దలు కొట్టుకున్నా, అర్థం కాలేదు ఎవరికీ.


😊😊😊


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక భళారే.. చిత్రం ! రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 24 -03- 2004 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

భళారే.. చిత్రం ! 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 24 -03- 2004 ) 



"రాజకోట రహస్యం తారలందరికి తెలిసి పోయినట్లుంది. ఈసారి ఎన్నికల సీజనంతా  సినీజనాలతో తెరవెలిగిపోతుంది. 'వార్ తో  మొదలైన సీన్లు స్టార్స్ తో  సా తున్నాయి... స్టారా.... వారా'' అన్నది కైమాక్సులో ఓటరు మహానుభావుడు తేర్చాల్సిన మేటరు. 


' పాలిటిక్సులో ఈ సినిమా ట్రిక్కేంటీ ? పాలల్లో నీళ్లు పోసినట్లు పల్ననైపోతున్నాయి రోజురోజుకూ  ఈ పాడు రాజకీయాలు ' అంటూ నుదురు బాదుకోబోయిన తాతబ్బాయి  చేతినలాగే గట్టిగా పట్టేసుకుని వచ్చేడు. 


' తల అంతలా గట్టిగా కొట్టుకోవద్దంటే  లిన్నావా? అందులోనూ  నువ్వొట్టి మనిషివి కూడా కాదు' అని అప్పల  రాజు అనేసరికి బిత్తరపోవటం నావంతయింది. 


'మరేంలేదులే.... మనోడి దగ్గర ఓ ఓటుంది కదా... అందుకని అలగనేసాను' అని సర్దుకున్నాడు అప్పలరాజు.


' చూస్తూ చూస్తూ  నేనీ సినిమాలవాళ్లకి ఓటేయలేనురా' అని మూతి బిగించుక్కూ ర్చున్న తాతబ్బాయినొక్క తాపుతున్నాలని పించిందట గానీ... ఎన్నికల సీజను కదా... ఎందుకులే మళ్ళీ...' అని తమా యించుకొని తన వాణినిలా  వినిపిం చాడు అప్పులరాజు.


'తాతబ్బాయ్' నీవన్నీ తాతలకాలం నాటి భావాలురా... ! సినిమాల్లో రాజకీయాలున్నప్పుడు, రాజకీయాల్లో సినిమా లుంటే తప్పేంటంట! ఆ మాటకొస్తే సినిమాలకీ, పోలిటిక్బుకీ బోలెడన్ని సిమిలీసూ, పోలికలూ ఉన్నాయి. తెలుసా? ఎటునుంచీ ఎటు చూసినా ఒకటే లాగని పించే సూపర్ ' న- ట- న ' ఇద్దరిపొత్తూ. అవునా... కాదా? టిక్కెట్లూ... ప్రెస్ మీట్లూ .. సీట్లు, ప్రచారాలూ, ప్లాన్లూ , 'షూటింగ్ ' లూ ..  రెండుచోట్లా ఉంటాయి. రాజకీ యాల్లో రిలీజుకు ముందు రోడ్ షో లుంటే.. సినిమాల్లో రిలీజు తరువాత రథయాత్రల్లాంటివి ఉండటం రివాజు. బూతు లిద్దరికీ కావాలి. పార్టీ మేనిఫెస్టోనే సినిమాకి స్టోరీ లాంటిది. ఏ స్టోనైతేనేంలే పళ్లు  రాలటానికంటావా...! ప్రివ్యూలు, రివ్యూలూ, ఎగ్జిట్ పోల్సూ , ఎల క్షన్ రిజల్టులాంటివే స్వామీ పోలికలు! బేలెట్ అండ్ బాక్సాఫీస్ '.. చూశావా .  'బాక్సు లిద్దరికీ కామనే! ఇన్కమ్ టాక్సు గొడవలూ డిటోనే! 


ఓ రకంగా  ఈ ఎం.పీలు, ఎమ్మెల్యేల కు మించి సినిమావాళ్లే లైట్ గా మేలన్నా! ... జూబ్లీ ప్లాటంటే  ఫ్లాటయిపోతారు'  అన్నా. 


 మధ్యలో కల్పించుకొని ' అవునవును . తెరవేల్పులు అల్పసంతోషులు . రాజకీయాల మీద రోత ఉన్న నీలాంటి పీతలు  కూడా సినిమా మోజుతో సభలకెలావస్తున్నారో చూస్తే రాముడికన్నా సినిమా దేవుడిని నమ్ము కుంటే ఒడ్డునపడతామని హేమాహేమీలూ  సినీతారల వెంటబడుతున్నారు. తటస్తుల్ని  కూడా తటాలున తట్టాబుట్టా పట్టుకురమ్మని పిలుస్తున్నారు. బిగ్ లాంటి వాళ్లే ఎందుకో తటాపటాయిస్తు న్నారు గానీ .. మెజార్టీ  ఈపాటికే ఆ బాటపట్టేసారు. ' 


' సినీజనాలకు జనాలెంత నీరాజనాలు పడతారో చివరి సీనుదాకా తేలదులేగానీ... లాంగ్ షాట్లో  నువ్వు చెప్పినట్లు అంతా ఒహటే  లాగున్నా.. క్లోజప్పుల్లో కొన్ని తేడాలు కూడా కొట్టాచ్చినట్లు కనిపిస్తుస్తున్నాయ్ .. అన్నాయ్ ! నువ్వే చూడు!' అన్నాడు తాతబ్బాయి.


' సినిమాలో విలనెవరో హీరో ఎవరో క్లియర్ గా  తెల్సిపోతుంది. పాలిటిక్సులో ఒక్కో కోణంలో కుంభకోణాలు కూడా గొప్ప సంస్కరణల్లా మనసును గుంజేస్తాయ్ . ఖర్మ! సినిమా ఐపీలందరూ పోలిటిక్సులో వి.ఐ.పీలుగా చెలామణి అయిపోవాలని చూస్తారు. నువ్వెన్నైనా చెప్పరా.... అప్పల్రాజా! నేనెప్పటికీ సినిమాలకు నెగెటివ్వే ! ' 


' సినిమాలకీ పోలిటిక్సుకి ఉన్న లంకె ఈనాటిది కాదురా అబ్బాయ్! రోనాల్డ్ రీగన్ రోజుల్నాటిది. నిన్నటికి నిన్న స్క్వాన్నెట్టరా .. పాడా ... అదేదో పేరు. నోరు తిరిగి చావటంలే గానీ... ఆయన అమాంతం గవర్నరయి కూర్చున్నాడా లేదా!  తమిళ రాజకీయాలు చూడు। సినిమాల మిళాయింపు . అన్నాదురై కాలం నుంచి ఆలా నిరాటంకంగా సాగుతునే ఉన్నాయా .. లేదా?  అదే బాటలో ఇప్పుడు మన బాలీవుడ్, టాలీవుడ్ నడుస్తుంది . తప్పేంటంటా! ' 


' అద్వానీలాంటాయాన్నైనా  రాజేష్ ఖన్నా ఓడించేడొకప్పుడు.  ఈసారి వాజపేయి మీద మరెవరో నిలబడి గెe చినా నోరెళ్ల బెట్టద్దు . సినిమా గ్లామర్ ముందు నీ పొలిటికల్ గ్రామర్ బలాదూర్రా బాబూ!' 


' పార్టీ టిక్కెట్టుకు షార్ట్ కట్టు  సినిమా రూటే నంటావా?... రూట్స్ నుంచి పనిచేసే  కార్యకర్తది వట్టి ' లాంగ్ 'మార్చేనంటావా .. ఖర్మ! మాయాబజారు సినిమాలో కథ పాండవుల్దే ;  అయినా తెరమీదెక్కడా వాళ్ల రోళ్లు కనిపించవు! ... ఎన్నికలూ సినిమాలే.. ఓటరు రోలు కూడా అంతే.. అంటానంటావ్ ! ' 


' అవును బ్రో ... ఎన్నికల్లో ఓటర్రోలు  సన్నెకల్లే ! ' 


'కల్లా? అంటే'


' కల్లు కాదసే! సన్నెకల్లు . అంటే పిండి రుబ్బుకునే  రోలు. . మీద రాయిలే!  


' రైము కోసమే అలా అన్నా... పదం భలే కుదిరిందిరా  అప్పల్రాజా!  రోలూ రాయితో రాజకీయాల్నీ, సినిమాల్నీ కలిపి తెగరుబ్బేస్తున్నారీ మధ్య నీలాంటో ళ్లంతా కలగల్సి.  సినేమా విషయంలో పొరపాటయితే  మూడుగంటల్లో మన్లాంటి ప్రేక్షకుడి బాధకు ' ది ఎండ్ ' .  అదే ఎన్నికల్లో పొరపాటయితే మాత్రం అయిదేళ్ల దాకా  శుభం కార్డు పడే ఛాన్సే లేదురా  బాబూ'' అని తలపట్టుక్కూర్చున్నాడు తాతబ్బాయి.


తారలకు పార్టీ బలం కావాలి. పార్టీ లకు తారాబలం కావాలి ఏ నియోజక వర్గం ఏ తారకు స్వర్గం అవుతుందో... ఏ కంచుకోట ఏ లీడరుకు ముంచుకోట అవుతుందో ఎవరికి తెలుసు? ... మొత్తానికి ఈసారి అందరూ సినీవాలీ లైపోయారు. అంటే సినిమాల మీద వాలిపోయినవాళ్లని అర్ధంలే ! నువు మాత్రం పెద్దమనసు చేసుకుని మన పెద్దమనుషులుండే  పార్టీకే ఓటు మీట నొక్కాలి సుమా! ఎన్ని మంత్రాంగాలేసినా ఈ ఎలక్ట్రానిక్ యంత్రం మొరాయిస్తే మొదటికే మోసం! దాని రాజ కోట రహస్యం ఛేదించడం నాయకుల వల్లే కాలేదు - సినీ కథానాయకుల వల్లా కాదు గానీ ఆట్టే మనసుకోకు! 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 24-03-2004 ) 







మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...