Thursday, November 10, 2016

ఎందుకో?!.. ఎందుకో?!.. ఎందుకో?! -కవిత


ఆమెః






పాప ఏడుస్తున్నప్పుడు
పనిమనిషి రానప్పుడు
కేంపులో ఉన్న శ్రీవారు
రాత్రిదాకా ఒక్కసారన్నా
ఫోన్ లో పలకరించనప్పుడు
ఎందుకో
నేను
మనుషుల్లో ఉండను

అతనుః








బాసు పిలిచి
‘శభాశూ’ అన్నప్పుడు
బేరుమంటున్న నా షేర్లు
స్టాక్ మార్కెట్లో బుల్లుల్లా దూసుకెళుతున్నప్పుడు
నడిరోడ్డు మీద
నా బైకాపి
టీనేజి బ్యూటీ లిఫ్టడిగినప్పుడు
నిజం చెప్పద్దూ
ఎందుకో
నేనూ
మనుషుల్లో ఉండను


పాపః








లక్కపిడతల్లో
అన్నాలు ఉడుకుతున్నప్పుడు
కుక్కపిల్ల తోకకు
బుజ్జిగాడు బండరాయి కట్టి ఏడిపిస్తున్నడు
చూరుకింద జారే
వానదారాలనుంచీ
వెండిపతీగలు పోగేసుకుంటునప్పుడు
నేనూ
ఎందుకో
మనిషిని కాను.
మరీ ముఖ్యంగా
అమ్మ తీరిగ్గా అద్దం ముందు చేరి
జడపాయలల్లుకుంటో
జావళీల్లో పారుతున్నప్పుడూ
నాన్న
మాసిన గడ్డంతో
ఆఫీసుటైములో
బెడ్రూముమంచుముక్కై
గడ్డకట్టుకు పోయినప్పుడూ
ఎందుకో
నేనస్సలు మనిషిని కాను
అమ్మానాన్నలు ఒకేసారి
నా చెరో బుగ్గమీదా
ముద్దులై వేళ్ళాడితేగానీ
మళ్ళా మనిషిని కాలేను

ఎందుకో!.. ఎందుకో!.. ఎందుకో.. ఎందుకో!

-కర్లపాలెం హనుమంతరావు
***





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...