Sunday, December 12, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం దణ్నం దశగుణం భవేత్ ! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 05 - 07- 2009 )


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

దణ్నం దశగుణం భవేత్ ! 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు  ప్రచురితం - 05 - 07- 2009 ) 



' గుడ్ మార్నింగ్ ఇండియా' అంటుంది పొద్దున్నే ఎఫ్ఎమ్ రేడియో . 'వందేమాతరం' అని పాడుతుంది అంతకు ముందుగానే  ఆకాశవాణి'  ఏ పనినైనా ' ఓం నమశ్శివాయ' అంటూ  ప్రారంభించడం మన సనాతనాచారం. సంధ్యావందనం చేయందే  దినచర్య ఆరంభించేవాళ్ళు కాదు మన పూర్వీకులు.  | వందేమన్దారుమన్దారుమన్దిరానన్ద కన్దలమ్'  అంటూ  ఆది శంకరులు కనకధారాస్తవం అలపించగానే కనకవర్షం కురిసిందని కథ.  ' సరస్వతీ నమస్తుభ్యమ్' ' అస్సలాం లేకుం ' అన్నా  సత్ శ్రీ  ఆకాల్ అన్నా  ఆమెన్ అన్నా. . అన్నీ ఆ భగవానుడికి వివిధ రూపాల్లో భక్తుడు చేసే నమస్కారాలే గదా


ఏ పుట్టలో ఏ పాముందోనని చెట్టుకూ పుట్టకూ కూడా నమస్కారాలు చేస్తుంటాం మనం . రోడ్డుకు నమస్కారం చేశాడో కవి . ఈ దండం దస్కం  కనిపెట్టిన వాడెవడో! మహా గడుసుపిండమే సుమా! వాడికో దండం! 


అణుబాంబులు, ఆటంబాంబులూ  అంటూ అగ్రరాజ్యాలు  ఊరికే హడావుడి చేసేస్తుంటాయిగానీ- నమస్కార బాణాన్ని మించిన ఆయుధం ప్రపంచం మొత్తంలో ఏదీ లేదు. 


ఇంగ్లీషువాడు ' హలో ' అన్నా చైనావాడు లెయ్  వో అన్నా జపానువాడు ముక్కు పట్టుకుని ముందుకు వంగి ముక్కినా, జర్మనీవాడు కుడి చెయ్యి  గాల్లోకెత్తి ఊపినా, కాంగోవాడు మాంబో అన్నా, ఫ్రెంచి చాడు శాల్యూట్ కొట్టినా, ఇంగ్లాండ్ వాడు  టోపీ గాల్లోకెత్తి చూపెట్టినా.. అవన్నీ ఎదుటివాడిని పడగొట్టడానికి ప్రయోగించే శక్తిమంతమైన ఆయుధాలే.


మన దేశంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నమస్కారబాణాలు  సంధిస్తుంటారు . రాజస్థాన్ ' రాంరాం ' అంటే, గుజరాత్ లో  'కెమ్ చె '  అంటారు. బెంగాల్లో ' నమష్కార్'  అంటే తమిళనాట 'వణక్కం ' అంటారు. చేతులు కలుపుకోవటం, గుప్పెట్లు గుద్దుకోవడం, ' హాయ్ ఫై ' చెప్పుకోవటం ఈతరం కుర్రకారు నమస్కారం బ్రాండ్.  


ఈ మధ్య ప్రసిద్ధికెక్కిన రెహమాన్ ' జయహో ' కూడా ప్రపంచా నికి మనదేశం పెట్టే కొత్తరకం నమస్కారమే! 


 నమస్కారం మన సంస్కారం. ఉత్తరాది వైపైతే పెద్దవాళ్ళ పాదాలకు వంగొంగి  నమస్కారాలు పెట్టాలి. నడుముకు మంచి వ్యాయామం.


ఈ దండాలు పెట్టడంలో తెలుగువాడేమీ తీసిపోలేదు. 'దండమయా విశ్వంభర,దండమయా పుండరీక దళనేత్రహరీ, దండమయా కరుణానిథి  దండమయా నీకునెపుడు దండము కృష్ణా' అంటూ ఆ దేవుడిమీద అదేపనిగా ఐదేసిసార్లు దండ ప్రయోగాలెందుకు చేశాడో తెలుసాండీ? దండమనేదాన్ని ఇలా వచ్చి అలా ఒకసారి పెట్టేసి పోయేదానికన్నా పదేపదే ప్రయోగిస్తూ ఉండాలి. ఆదీ పనున్నప్పుడే కాదు సుమా; ఎప్పుడూ సంధిస్తూంటేనే ఏ పనైనా సజా వుగా సాగేదని ధ్వనించడానికన్నమాట. వేడిమీదున్న వాడిని చల్లబరిచేది, విడిపోదామనుకునేవాళ్ళను కలపగలిగేది కూడా ఈ నమస్కారమే సార్! మొన్నటి ఎన్నికల్లో అమ్మలక్కలకు అందరికన్నా ఎక్కువగా దండాలు పెట్టాడు కాబట్టే  మన సీయం మళ్ళీ సీయం కాగలిగాడని ఓ వర్గం అభిప్రాయం. 


అన్ని దండాలూ ఒకేలా ఉండవండోయ్! ' దండం దశ గుణం భవేత్' అని సంస్కృతంలో అన్నది ఈ దండాన్ని గురించి కాకపోయినా, దీనిక్కూడా  వర్తిస్తుంది. 


రెండు చేతులూ జోడించి గుండెల మీద పెట్టుకుంటే పెద్దలకు పెట్టినట్లు, నెత్తిమీద పెట్టుకుంటే దేవుడికి పెట్టినట్లు, నుదురు నేలను తాకినట్లు వంగితే అల్లాకు పెట్టినట్లు మోకాలి మీద వంగితే బుద్ధ భగవానుడికి పెట్టినట్లు.. క్రాసు చేసుకుంటే యేసుకు పెట్టినట్లు. తలొంచుకుని మౌనంగా నిలబడితే చనిపోయినవారి ఆత్మలకు పెట్టినట్లు, భజన చేస్తూ ఎగిరెగిరి పెడితే గిడిగీలు పెట్టినట్లు గోత్రనామాలు చెబుతూ పెడితే ఏటికోళ్ళు.. బొక్కబోర్లా పెడితే సాష్టాంగ ప్రణామాలు, పొర్లుతూ పెడితే పొర్లుదండాలు.. ఇవికాక ఇంకా టెంకణాలు, జాగిలీలు, గొబ్బిళ్ళు. అబ్బో.. సూర్య నమస్కారాలకన్నా ఎక్కువే లెక్క తేలతాయి! ఇన్ని రకాల దండాలు ఉండగా ..  ఎందుకో మనిషి మరి ' దండం ' .. ఐ మీన్ దుడ్డు కర్రనే  ఎక్కువ ఎందుకు నమ్ముకుంటున్నట్లూ ?


దండాలు పెడితే లాభమా లేదా అనే మీమాంస మాట అటుంచి, అసలు పెట్టకపోతే అసలుకే మోసం వచ్చే సందర్భాలు  మనబోటి మామూలు బోడిమనుషుల జీవితాల్లో మాటిమాటికి వస్తుంటాయి. 


పనిలో మనమెంత తలమునకలుగా ఉన్నా పైఅధికారి కనపడంగానే  లేచి విష్ చేయకపోతే మనపని ఫినిష్;  అందుకే అనేది- ఉద్యోగు లకు నమస్కారం అనేది తప్పనిసరిగా అభ్యాసం చేయవలసిన  యోగం. ఈ 

' హస్తకళ' లో ప్రావీణ్యం సంపాదించినవాడిని దండకారణ్యంలో పారేసినా దొరికింది  'దండు' కుని మరీ తిరిగి రాగలడు. 


' దండాలు స్వామీ! ' అంటే, ' ముందు నీ తండ్రి బాకీ తీర్చు ' అనేవాళ్ళూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త! 


ఈ గజిబిజీ కాలంలో ఎవరూ మనవంక తిరిగి చేతులు జోడించడం లేదని  చేతులు ముడుచుకుని  కూర్చుంటే కుదరదు . తగిన భక్తులు సమకూరిందాకా మనకా ళ్ళకు మనమే మొక్కుకుంటూ ఉండాలి. దాన్నే రాజకీయం అంటారు. 


మన వీపుకు మనమే నమస్కారం చేసుకోలేం గనక మీరు ఎదుటివాడికి ' నమామి' చెబితే ఎదుటివాడు మీకు 'ప్రణమామ్యహం' అనాలనే ఏర్పాటూ చేసుకోవచ్చు.  దీన్నే రాజకీయాల్లో పొత్తులంటారు.




మంత్రాలకు చింతకాయలకు రాలకపోవచ్చేమోగానీ- నమస్కారాలకు పురస్కా రాలు దక్కే ఆస్కారాలు పుష్కలంగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఒక దండం వంద దండల పెట్టు. 


అతి వినయం ధూర్త లక్షణమనే మాట ఈ కాలానికి అతికే సామెత కాదు. నమ్మకంగా నమస్కారాలు పెట్టుకుంటూ పోతే ఏనాటికైనా ప్రధానమైన  ఏ మంత్రిపదవో, మళ్ళీ మాట్లాడితే మరోసారీ అదే పదవి దక్కే అవకాశాలు మెండు ! అందుకే సామీ  ఆ త్యాగరాజస్వామి ' ఎందరో మహానుభావులు .. అందరికీ వందనాలు' అని ముందుగానే దండాల మీదే ఎత్తుకున్నాడు.


నిద్రలేచినప్పటినుంచీ నిద్రపోయేదాకా మనం ఎదుటివాడివంక వేలెత్తి చూపించటానికి ఉపయోగించే శక్తిని దండాలు పెట్టే  వైపు మళ్ళించగలిగితే దేశంలో ఇంత అశాంతి, అరాచకం ప్రబలి ఉండేవి కాదు. సైనికులు, పోలీ సులు- తుపాకులకూ తూటాలకూ పెట్టే ఖర్చును ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు అన్నాడు ఓ సంఘ సంస్కర్త.  


ఇన్ని తెలిసి మరి ఈ మధ్య ఓ ప్రజా ప్రతినిధి, బ్యాంకు ఉద్యోగి మధ్య రుణాల విషయంలో పెద్ద రణమే జరిగింది. 

చెరొక దండం పెట్టేసుకుంటే సమస్య మొదట్లోనే పరిష్కారమైపోయేది కదా!


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు  ప్రచురితం - 05 - 07- 2009 ) 

సమీక్ష: కొకుగారి 'అమాయకురాలు కథ చదివిన తరువాత కలిగిన నా స్పందన -కర్లపాలెం హనుమంతరావు







    • ముందు ‘అమాయకురాలు’ కథ ఏమిటో భోజనం విస్తట్లో రుచికి ఓ మూల వడ్డించే పదార్థం లాగా: 

    • వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద  అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?
    • భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. 'తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?' అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ.. ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద.. చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. 'నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు.. ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.
    • భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో..ఏమో.. మరీ పసిది.. ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.
    • కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ..కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ.. అందరు సంసార స్త్రీలకు మల్లేనే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.'ఊహల్లోనే ఏ సుఖమైనా.. వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు' అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.
    • భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ. భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు. పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథాప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.
    • భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు  తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.
    • ఏదైతేనేమి  భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు  కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి. 
    • అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టెంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.
    • పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.
    • బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన 'ఉచ్చిష్టం' ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే  ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.'వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేశా' అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు. 
    • వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక  ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.
    •  
    • నా సమీక్ష :

    • ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు. ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత.. శాఖాంతరం కాకపోవడం మీద కొంత.. ఎలా ఎవరిమీదో.. వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా.. కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని.. మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియాపరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి.. తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం.. ఆడదై పుట్టడం.. వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.
    • ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫు నుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు.. కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే.. చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ 'అమాయకురాలు' కథలో కొడవటిగంటి వారు.  నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటే తప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.
    • ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని.. మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.
    • ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం..శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా  మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా.. తడిగానే ఉంచుతుంది.
    • కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు,  వాక్యాలలోని ముళ్ళు.. ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.
    • -కర్లపాలెం హనుమంతరావు
    • బోథెల్, యూఎస్ఎ

కొన్ని న్యాయాలు .. కొన్ని లో కోక్తులు - కర్లపాలెం హనుమంతరావు



ఊడుగుగింజ న్యాయం 

ఊడుగుగింజలకు విలక్షణమైన గుణం ఉంది. రాలి చెట్టుకింద పడినవి మట్టిలో కలసి మృగశిర కార్తెలో ఒక్క చినుకు రాలినా చాలు  ఆ గింజలు మళ్లీ చెట్టుకే అతుక్కుంటాయి! 

ఒక పార్టీలో  నుంచి బయటకు వచ్చిన వాడు అదను చూసుకుని మళ్లీ ఆ పార్టీ లోకే గెంతేస్తే  అట్లాంటి జంపింగ్ జిలానీని 'ఊడు గింజ' లాంటోడు అనడం అందుకే. 


అక్కే చేత్ మధు విందేత కిమర్థం పర్వతం వ్రజేత్ ? 


అక్కము సంస్కృత పదం. ఇంటిమూల అని అర్థం. 

ఇంట్లో ఓ మూల  తేనెతుట్ట కనపడుతుంటే దానిని పిండుకోవాలి.  ఆ పని చేయకుండా తేనె కోసం కొండకు వెళ్లడం తెలివి మాలిన చేష్ట . వెతికేది  మన దగ్గరే ఉన్నా ఎక్కడెక్కడో గాలించే   సందర్భంలో వాడే జాతీయం ఇది . 

విజయ డయరీల వంటివి  మన రాష్ట్రంలోనే  పెట్టుకుని ఎక్కడి గుజరాత్ అమూల్  పాల కోసమో  అంగలార్చే సందర్భానికి   ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. 


3

అంధ కూప న్యాయం : 

ఒక గుడ్డి వ్యక్తి బావిలో పడితే, ఆ కబోదిని  గుడ్డిగా అనుసరించే కళ్లున్న వాళ్లూ  ఆ  బావిలోనే పడతారని చెప్పడానికి ఈ లోకోక్తి .  కూపము అనే సంస్కృత పదానికి  బావి తెలుగు అర్థం . 


అర్థజరతీయ న్యాయం: 

జరతీయ అంటే వయసు మీరిన శాల్తీ  . అర్థ జరతీయ-  అంటే సగం ముసలితనం వచ్చిన మనిషి . ఒకటి రెండు వెంట్రుకలు   మాత్రమే నెత్తిమీదివి  చూసి వయసులో ఉన్న స్త్రీ అని భ్రమపడినట్లే, నడుం మీద మడతలు రెండు  కనపడగానే వయసు ఉడిగిన స్త్రీగా భ్రమించినప్పుడు  ఈ న్యాయం వాడతారు. అంటే వస్తువులోని  ఒక పక్షపు లక్షణాన్ని బట్టి వస్తువు మొత్తానికి ఆ లక్షణం ఆపాదించే  ఆపత్తుకు    అర్థజరతీయ న్యాయం అతికినట్లు సరిపోతుంది. . 

ఫలానా రాజకీయ పార్టీ మంచిదని కొంత మంది .. కాదని  కొంత మంది 

వాదించుకోవడం వింటుంటాం . అప్పుడు ఇరు పక్షాలదీ  అర్థజరతీయ న్యాయమే అనిపిస్తుంది! 


అర్థాతురో న గణయత్  అపకర్ష దోషమ్ 

అర్థం ( డబ్బు ) మీద అత్యాశ ఉండేవాడు అవమానాలు లెక్క చేయడు - అని అర్థం. డబ్బు పిచ్చికి సిగ్గెగ్గులు  ఉండవనే  లోకం తీరును అద్దంలో చూపెట్టే సామెత ఇది. 

జైళ్లపాలవుతామన్నప్పటికీ     సిగ్గయినా లేకుండా అమ్యామ్యాలకు తెగబడతారు చాలామంది  పొలిటీషియన్లు! వాళ్లని చూసినప్పుడు  ఈ లోకోక్తి గుర్తుకొస్తుంది . 


6

అసారే  ఖలు సంసారే సారం శ్వశురమందిరమ్ 

అత్తారింటి మీద తమాషా చతురి ఇది. ఈ లోకం సారవిహీనం అయినా ( మజాగా లేకపోయినా ) .. ( శ్వశురమదిరం )   అత్తగారి ఇల్లు మాత్రం సారవంతమైనదేనట! ( అని అల్లుడిగారి ఆలోచన.. కోడలుది కాదు ) 

పాలిటిక్స్ పాడువే   అయినా మంత్రి పదవి మాత్రం మహా మజా! అనుకునేవాళ్లకు ఈ న్యాయం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది  .. కదా! 😊


7

అసిధారావ్రతం - అనే మాట చాలామంది వాడుతుంటారు. దాని సరయిన అర్థం తెలుసో .. లేదో మరి! 

అసిధార అంటే కత్తకి ఉండే పదునైన  అంచు .. దాని మీద చేసే సాము చేయడానికి చాలా వడుపు అవసరం . ఆ కష్టాన్ని సూచించే న్యాయం ఈ అసిధారావ్రతం . 


8

అహి నకుల న్యాయం : 

పాము ముంగిస సామెత .  కేవలం శత్రుత్వం కన్నా పుట్టుకతోనే శత్రుత్వం ( ఆగర్భ శత్రుత్వం )  ఉంటే ఈ న్యాయం   మరింత అతుకుంది .

కాంగ్రెస్, భాజపాల మధ్య ఉండే రగడను చూసినప్పుడు ఈ అహినకుల న్యాయం గుర్తుకొస్తుంది . 


9

ఆమ్రవణ న్యాయం: 

వేరే రకాల చెట్లు చాలా ఉన్నా ..  మామిడి చెట్టు వంటి పళ్లు కాసే చెట్టు  గాని ఉందంటే. . ఆ తోటను మామిడి తోట  అనడం సహజం  . మామిడి తోట అన్నంత మాత్రాన ఆ తోటలో ఉన్నవన్నీ మామిడి చెట్లే కావాలని లేదుగా! గుంపులో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గల  వ్యక్తి ఉన్న సందర్భంలో ఆ గొప్ప వ్యక్తి పేరుతోనే గుంపు మొత్తానికి  గుర్తింపు వస్తుంది. 

ఉదాహరణకు తెలంగాణా రాష్ట్ర సమితి , ఆమ్ ఆద్మీ  పార్టీలు వంటివి ఆ పేర్లతో కన్నా  కెసిఆర్ పార్టీ , కేజ్రీవాల్  పార్టీలుగానే  ప్రసిద్ధి.. అట్లాగని  కెసిఆర్ పార్టీలో కెసిఆర్, కేజ్రీవాల్  ఒక్కరే ఉండరుగా ! ఈ భావాన్ని సూచించే సందర్భం వచ్చినప్పుడే  ఆమ్రవణ న్యాయం అనే లోకోక్తిని వాడాలనిపించేది  . 


10 

ఆహారే వ్యవహారే చ వ్యక్తలజ్జ స్సుఖీభవేత్ !

ఆహారంలో గాని, వ్యవహారంలో గాని మొహమాటం లేని వాడు సుఖపడతాడు  - అని సామెత . 

ఈ సామెత సారం రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్లు బాగా వంటబట్టించుకున్నారు . కాబట్టే వాళ్లు ఆ స్థాయి దాకా ఎదిగి సుఖపడుతున్నారు. ఏమంటారు ? 

- కర్లపాలెం హమమంతరావు 

15 -09- 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 

మనసు మీద నిగ్రహం ఉంటేవచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది-Tచిట్టి కథ

 


ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
‘స్వామీ మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను’ అన్నాడు.
‘రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!’ అన్నాడు.
‘పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం చేయండి!’అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
‘దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది’ అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!’అన్నాడు అక్బర్.
‘దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా!’ అని మహర్షి సమాధానం.
‘పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?’ రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. ‘ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా!’ అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. ‘ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి’ అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
‘స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది’ అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
‘సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు నువ్వుఅ అనుకొంటున్న ‘ఆత్ననిగ్రహం’ అని! అర్థమయిందా?’ అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.
-కర్లపాలెం హనుమంతరావు


అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!

అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష! నిజమే! కనీసం కథానికల వరకు!

'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష!' అనే డైలాగ్ కన్యాశుల్కం కర్త గురజాడవారి పుణ్యమా అని బహుళ ప్రచారంలోకి వచ్చిన పలుకుబడి. నిజమే; కానీ ఆ రావడం వెనక ఉన్న ఉద్దేశంలో కొంత వెక్కిరింతా ఉంది. 

 

నిజానికి వేదాలలో అన్నీ ఉన్నాయో లేదో ఎవరికైనా తెలిసే అవకాశం తక్కువే. అలా తెలియలంటే ముందుగా ఆ వేదాలలో అసలు ఏముందో కొంతైనా అవగాహనకు తెచ్చుకోవడం సబబు. 


ఆ సంగతి అట్లా ఉంచి కథానికలుగా మన ఆధునికులు చెప్పుకునే రూపాలు వేదకాలం నుంచే ఉన్నాయన్న    వాదనా  ఒకటి పండితలోకంలో  ప్రచులితంగా ఉంది. ఆ ప్రతిపాదనకు అనుకూలత ప్రకటిస్తో  డాక్టర్ కె.కోదండరామాచార్యులు '50 వసంతాల వావిళ్ల వాజ్ఞ్మయ వైజయంతి' సావనీర్ లో 'వేదవాజ్ఞ్మయంలో కథానికలు ఉన్నవి' అంటూ ఒక చిరువ్యాసంలో ప్రతిపాదించారు.(పు.117 -125). 


అధ్యయానికి అంతంటూ లేదు. సదరు భావనకు ఊతం ఇచ్చే ఒకానొక చిన్నకథను సైతం ఈ సందర్భంగా ఆయన  చెప్పుకొచ్చారు. 'భరద్వాజో హ త్రిభిరాయుర్భిర్బ్రహ్మచర్యము వాస.. ఏషా ఏవ త్రయీ విద్యా' అనే తైత్తరీయ బ్రాహ్మణకం తాలూకు మూడో అష్టకంలో కనిపించే పదో ప్రపాఠకం పదకొండో అనువాకాన్ని ఉదాహరణగా ఆచార్యులు తీసుకున్నారు.  నేడు కథానిక లక్షణాలుగా విమర్శక లోకం గుర్తించిన సంక్షిప్తత, సమగ్రత, సంభాషణల సొగసు, ఉపదేశం, పరిమితమైన పాత్రలు.. ఈ చిన్నకథలోనూ ఉండడం గమనార్హం. 


భరద్వాజుడు మూడు ఆయుర్దాయ భాగాలను వరంగా పొందిన ఒకానొక రుషి.  జీవితకాలమంతా బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనానికే మీదు కట్టి చివరి దశలో వార్థక్యం చేత శక్తి సన్నగిల్లి శయనావస్థలో ఉన్న దశలో ఇంద్రుని దర్శనభాగ్యం రుషికి లభిస్తుంది. 'నాలుగో ఆయుర్దాయ భాగం సైతం వరంగా ప్రసాదించేందుకు నేను సిద్ధం. కాని  ఆ  వరంతో నువ్వు ఏమి చెయ్యదల్చుకొన్నావో ముందు చెప్పు' అంటూ ఇంద్రుడు ప్రశ్నిస్తాడు. 'మునుపటి మాదిరే వేదాధ్యయనాన్ని కొనసాగిస్తాన'ని భరద్వాజుని బదులు. 


రుగ్, యజు, సామ వేదాల వంక చూపుడు వేలు చూపించి 'మహా పర్వతాలుగా కనిపించే  అవేమిటో తెలుసునా? వేదాలు మహానుభావా!  నీకింత వరకు దక్కిన జీవితకాలంలో వాటి నుంచి నీవు గ్రహించింది కేవలం ఇంత మాత్రమే సుమా!'అంటూ మూడు సార్లు పిడికెళ్లను తెరిచి  చూపిస్తాడు ఇంద్రుడు. 'నిజంగా నీకు ఇంకా వేదాధ్యయన ఫలం మీద బలమైన కోరిక మిగిలుంటే సావిత్రాగ్నిని ధ్యానించు! ఆపైన ఆదిత్యుని సాయుజ్యం పొందు!' అనీ సూచిస్తాడు. అందు మీదట ఇంద్ర ప్రసాదితమైన  నాలుగో జీవిత భాగం కేవలం వేద విద్యాధ్యయనానికి మాత్రమే వినియోగించక,  సాధించిన  జ్ఞాన కాంతి పుంజం సాయంతో పరిసరాలను సైతం తేజోవంతం చేసి విద్య అంతిమ పరమార్థాన్ని రుషి ప్రపంచానికి చాటినట్లు కథ.  


ఈ కథ పరిణామంలో, ప్రక్రియ పరంగా. లక్ష్య నిర్దేశన పరంగా  తాజా కథానికలకు ఏ మాత్రం తీసిపోనిదని డాక్టర్ కె. కోదండరామాచార్యులవారి వాదన. కాదనగలమా?

-కర్లపాలెం హనుమంతరావు

10, డిసెంబర్, 2019 


హనుమంతుడి రాముడు -సరదాగా -కర్లపాలెం హనుమంతరావు

 


ఇంటింటికో రామాయణం. రాముడంతటి దేవుడు తెలుగువాడికి మరోడు లేడు. పుట్టిందిపేగుబంధం


- కర్లపాలెం హనుమంతరావు 


( ఈనాడు, సంపాదకీయం, 03 -08 - 2009 ) 


 అక్కడ అయోథ్యలోనే అయినా  జన్మదినం , పెళ్ళిరోజు క్రమం తప్పకుండా ఇక్కడే కదా  మహాఘనంగా జరుపుకునేది మనం!

 

రామమందిరం లేని ఊళ్ళు చాలా తక్కువ. రామ్ నగర్ లు, రామన్నపేటలు, రామాయంపేటలు, రాములవారి వీధులు.. లేని ఊళ్లూ తెలుగునాట చాలా అరుదు. భద్రాచలం కోసం తెలంగాణా, సీమాంధ్రాలు మొన్నటి విభజనలో బాగా కొట్లాడుకున్న విషయం గుర్తుకొచ్చిందా! దక్షిణాదికి ఏడుకొండలవాడు ఎట్లాగో.. ఉత్తరాదికి ఈ శ్రీరామచంద్రమూర్తులవారు అట్లాగా. అన్నట్లు రామనామంతో పొత్తు ఉండబట్టే ఇద్దరు చంద్రులూ ముఖ్యమంత్రులయారన్న వాదనా కద్దు.

 

చంద్రబాబుకి మామగారు తారక రాముడైతే.. చంద్రశేఖర్రావుకి సాక్షాత్తు కన్నబిడ్డే మరో తారకరాముడు. రామ్మోహన రావు, రామచంద్రమూర్తి, రామన్నపంతులు, రామిరెడ్డి, రామానాయుడు, రామోజీరావు, రామశర్మ, రామశాస్త్రి.. ఇట్లా రామ నామం కోటి రూపాలల్లో  దర్శనమిస్తుంది తెలుగునాట. రామలక్ష్ములు, రామ సీతలు, సీతారామమ్మలు.. ఇలా స్త్రీ పక్షపాతం కూడా లేదు రామనామానికి. రామలక్ష్మణులని ఆదర్శసోదరులకు ప్రతీకలుగా భావిస్తాం. సీతా రాముల దాంపత్యం సర్వకాలాల్లో దంపతులకు శిరోధార్యం. రాముడు వంటి భర్త కావాలని తపించని పడతులుండరు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్యగా జీవితమంతా నిష్ఠగా గడిపిన ఆదర్శ పురుషుడు రామచంద్రుడు.

 

రాముడు అంటే మంచి బాలుడు కింద లెక. రాముడు వంటి బిడ్డ కావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. రాముడు మర్యాద పురుషోత్తముడుగా  మహా ప్రసిద్ధి. మాట తూలడు. మృదుస్వభావి. ఆడిన మాట తప్పి ఎరుగడు. పితృవాక్య పరిపాలన అంటే ముందుగా గుర్తుకువచ్చేది రామచంద్ర మూర్తే. ఒక్క చెడుతో తప్ప ఎవరితో ఆమూర్తికి వైరం లేదు. రావణాసురుణ్నైనా తన భార్యను అపహరించినందుకూ, తప్పు తెలుసుకుని తిరిగి అప్పగించనందుకు శిక్షించక తప్పింది కాదు.

 

 స్నేహితుడు అంటే రామచంద్రమూర్తే. స్వలాభంకోసం సుగ్రీవుడితో స్నేహం చేసాడని ఏ గిట్టని  రంగనాయకమ్మగారో దుష్ప్రచారం చేస్తే చేసివుండవచ్చు గాక.. తన లాగే ప్రేమించిన భార్యను కోల్పోయిన అభాగ్యుడు అయినందుకు.. దానిక్కారణమైన వాలిని ఆయన చెట్టు చాటునుంచి మట్టు పెట్టవ. దుష్టత్వాన్ని తునుమాడటానికి తాను ధర్నాన్నైనా లక్ష్య పెట్టనని రావణాసురుడి లాంటి దురహంకారులకు సందేశం పంపించడానికైనా ఆ పని ఆయన చేసి ఉండవచ్చు. రావణ సంహారానికి ఆయన ఆయన సోదరుణ్ని చేరదీసి ప్రాణ రహస్యాన్ని రాబట్టడం ఇక్కడ గమనించాలి. రావణ సంహరణ అంటే దుష్ట రక్షణ అనే గదా అర్థం! లక్ష్యం మంచిదైతే లక్షణం విషయంలో సర్దుబాటు చేసుకున్నా తప్పు లేదని రామచంద్రుడు  చెప్పినట్లా? మరి రామ భక్తుడు మహాత్మ గాంధీ మాత్రం లక్ష్యం..లక్షణం రెండూ ఉదాత్తంగా ఉండి తీరాలని ఎందుకు పట్టుబట్టినట్లే? భక్తులంతా ఆరాధ్య దైవాల బాటలోనే సాగాలని రూలేమీ లేదుగా!  కంచర్ల గోపన్న ప్రజాధనంతో సీతారాములకు గుడి కట్టించాడు. ఆ నేరానికి కారాగార శిక్షా అనుభవించాడు. భక్తుల చేత ఎంతగా పొగిడించుకున్నాడో అంతగా తిట్టించుకున్న దేవుడూ రాముడే.'ఎవరబ్బ సొమ్మనీ కులుకుచున్నావూ రామచంద్రా!' అంటూ ఆ రామదాసు చేతే శాపనార్థాలు పెట్టించుకోలేదూ పాపం రామయ్య. ఆయనే మన్నా తనకు ఎలాగైనా గుడి కట్టించి తీరాలని పట్టు బట్టాడా?ఇప్పుడు అయోధ్య విషయంలోనూ అదే రభస. అక్కడ ఇదివరకు మసీదే ఉందో.. రామాలయమే ఉందో..  చరిత్రే సరిగ్గా తేల్చని విషయాన్ని పట్టుకుని ఎంతెంత రాజకీయం జరిగింది! ఇప్పుడు భద్రాచలంలో జరుగుతున్నదీ అదే. రామచంద్ర మూర్తి మంత్రపుష్పం విషయంలో విజయనగరం సాధువులు కొత్తగా లేవదీసిన పేచీలను ఏమనాలి? మండలాల వంకతో.. కోదండ రాముడి కొండను విభజన సమయంలో  వివాదం చేసారు! సాంఘికంగానే కాదు.. రాజకీయంగానే కాదు.. ఐహికంగానే కాదు ..పారలౌకికంగానే కాదు.. అన్నింటా భారత దేశంలో రామచంద్ర మూర్తిది ఒక ప్రత్యేక స్థానం. కృష్ణ పరమాత్ముడైనా రామచంద్ర మూర్తి తరువాతే. 'ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్య' అని సినిమా కూడా వచ్చి .సినిమాల వాళ్ళకైతే రాముడు ఎప్పుడూ ఒక బ్లాక్ బస్టర్ సూత్రమే. లవకుశ రంగుల సినిమాగా వచ్చి కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. రామాయణం థీమ్ మీద ఎన్నెన్ని సినిమాలు.. ఎన్నెన్ని భాషల్లో వచ్చాయో!అన్నీ దాదాపు పెద్ద హిట్లే. రామయ్యను నమ్ముకుంటే కష్టం గట్టెక్కుతుందని తెలుగు వాళ్లకి ఓ నమ్మకం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి  ఆదికవి అయాడు. భవభూతి ఉత్తర రామాయణం ముట్టుకుని జన్మ సార్థకం చేసుకున్నాడు. త్యాగయ్య రామ చంద్రమూర్తిని తన ఆత్మగా చెప్పుకున్నాడు. రంగనాథ రామాయణంనుంచి.. రంగనాయకమ్మ రామాయణం దాకా ఎన్నెన్ని రామాయణాలో! విశ్వసాహిత్యంలోనే రామాయణం రచన అత్యధికంగా రాయబడ్డ కావ్యం కింద చరిత్ర నమోదు చేసుకుంది. రాముడు ఒక్క భారతీయులకే కాదు. మలేసియా.. కంబోడియా.. బర్మా(ఇప్పటి మయన్మార్), చైనా, జపాన్ వగైరా దేశాల్లో ఏదో ఓ రూపంలో కనిపిస్తాడు. 'రాముడికి సీతేమవుతుంది?' అని తాపీ ధర్మారావు గారు ఓ వివాదస్పద రచన చేసారు. 'శంభూకుణ్ని దుర్మార్గంగా మట్టుబెట్టాడు రాముడు' అని మన కవిరాజుగారు ద్వజమెత్తిన సంగతీ మర్చిపోరాదు. ఆయన గారి అసలు పేరులోనే (రామస్వామి చౌదరి)  ఆ రాముడు ఉండటం అదో తమాషా.  తమిళనాట రాముడికి కంబన్న హారతులు బడితే..  కరుణానిధిగారి డియెంకె తూర్పార పడుతుంటుంది. రాముడు రావణాసురుణ్ణి సంహరించడానికి  కోతి మూక చేత కట్టించినట్లు చెప్పుకునే వారధి శ్రీలంకకి.. రామేశ్వరానికి మధ్య ఉన్నదేనని  ఒక వర్గం.. కాదు అది అసలు వంతెనే కాదు.. రాముడు కట్టించింది అనటమే కట్టుకథ అని  సందు దొరికినప్పుడల్లా యాగీ చేయడం తమిళనాట రాజకీయ పార్టీలకు మామూలే. రావణాసురుడికి దక్షిణాదినే ఎక్కడో ఓ గుడి కూడా ఉన్నట్లు చెపుతారు. 'రావణాసురుడు ఒక్క స్త్రీల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ అఖండుడు' అని కొంత మంది వాదన. ఆయన గారు ఏలిన లంకాపురి బంగారు నగరి. కుబేరుడి నగరాన్ని స్వాధీనం చేసుకున్న బలశాలి రావణాసురుడు. రానణాసురుడు అనుసరించింది రాక్షస సంస్కృతి, సంప్రదాయలను. మనుషుల ఆలోచనలు దేవతలకు దగ్గరగా ఉంటాయి కనక రావణాసురుడు మన కంటికి పరమ దుర్మార్గుడి కింద లెక్క. ఉత్తరాది వారి సంప్రదాయం ఆర్య సంస్కృతికి అనుకూలంగా  ఉంటుంది కాబట్టి అక్కడ రామలీలలు. రావణ సంహారాలు. తెలుగువాళ్ళది అటూ ఇటూ కాని ఆచారాలు కాబట్టి రాముణ్ణి ఆరాధ్య దేవుడు చేసుకోవడం .. శ్రీరామ నవమిని పెద్ద పండుగ్గా చేసుకోవడం. తెలుగు శుభలేఖలమీద కచ్చితంగా మనకు 'శ్రీరామ చంద్రః శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభి రామః/సీతా ముఖాంబోరుహ చంచరీకో నిరంతరం మంగళ మాత నోతు' అన్న శ్లోకం కనిపిస్తుంది.

సీతా లక్ష్మణ భరత శతుఘ్న ఆంజనేయాది సమేతంగా కొలువై ఉన్న రామచంద్ర మూర్తి   రవి వర్మ చిత్రం తెలుగువాళ్ల సకుటుంబ సంప్రదాయానికి ఓ దైవీక ప్రతీక.

స్వయంగా దుష్ట సంహరణ సమర్థుడై ఉండీ బాల రామచంద్రుడి సాయం అందుకునాడు విశ్వామిత్రుడు. స్వయంగా బుద్ధిశాలి. .ధీశాలి ఐనా రామచంద్రుణ్ని గుండెల్లో దాచుకున్నాడు ఆంజనేయుడు. రాజుల అంతిమ లక్ష్యమైన రాజ్యాధికారం ఆయాచితంగా అంది వచ్చినా సోదరుడి పాదుకులను పెట్టి మాత్రమే రాజ్యపాలనకు సిద్ద్జపడ్డాడు భరతుడు. తనకన్నా  బలవంతుడైన వాలితో విరోధం తెచుకున్న సుగ్రీవుడు పాదరక్షలు సైతం లేని భార్యా వియోగి కేవలం సోదర సమేతంగా వచ్చి స్నేహ హస్తం అందిస్తే ఆ రామ్మూర్తిలో ఏమి చూసి ముందు కడుగు వేశాడో?  ఒక పట్టాన ఎదుటి వారి ఆధిక్యాన్ని ఒప్పుకోని రావణ బ్రహ్మ రాముణ్ణి యుద్ధక్షేత్రంలో మొదటి సారి చూసి నప్పుడు ప్రశంచించకుండా ఉండ లేక పోయాడు. స్వయంగా చూడక పోయినా మండోదరి రామచంద్ర మూర్తి పరాక్రమాన్ని కీర్తిస్తుంది. గుహుడునుంచి శబరి దాకా ఎవరూ ఏ ప్రత్యుపకారం ఆశించకుండానే రామ సేవకు ఉత్సుకత చూపించారు. నాతిని బండరాతి కన్నా హీనంగా చూసింది రావణాసురుడైతే రాతిని  నాతిగా ఆదరించింది శ్రీ రామచంద్ర మూర్తి. అదే రాముడు మరి సొంత భార్య   విషయంలో  అంత   కఠినంగా ఎందుకు  ఉండవలసి వచ్చిందో! రాజధర్మం అంటే  ప్రజాభీష్టానికి  అనుకూలంగా సాగడమేనని  లోకానిని  చాటడానికా? రాముడు అధర్మ చక్రవర్తే ఐతే వాల్మీకి మహర్షి అంతటి జ్ఞాని  ఆ మహానుభావుడిని కథానాయకుడిగా చేసి మహాకావ్య రచనకు పూనుకుంటాడా? రామాయణం ప్రథమ కాండలో నారదుల వారి నోట రామచంద్రమూర్తివిగా చెప్పుకొచ్చిన  పదహారు కళలు అన్ని కాలాల్లో అందరికీ పరమాదర్శనీయ మైనవి. కాబట్టే రామాయణం ఇన్ని వేల సంవత్సరాలు గడిచి ఇంత నాగరీకం అభివృద్ది చెందినా అన్ని సంస్కృతులనూ అన్ని వర్గాలను ఇంకా  అపరిమితంగా  ప్రభావితం చేస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణం భారతీయుల  ఆత్మ.

'రామా అంటే బూతు మాట ఐనట్లు' అంటూ అభిశంసన సమయంలో సైతం ఆ రామ నామ స్మరణను మనం మర్చిపోలేక పోతున్నాం.  రామాయణం పట్టు మన భారతీయులమీద ఎంత బలంగా ఉందో అదే చెబుతోంది.

భారతం మాత్రం! 'రామాయణం రంకు..భారతం బొంకు' అంటూ ఓ వంక  వంక పెడుతూనే వాటిని వదలి పెట్టకుండా చదువుకుంటుంటాం. కావ్యాలుగా రాసుకుంటుంటాం. నాటకాలుగా మలిచి చూస్తుంటాం. పాటల్లోకి మార్చి పాడుకుంటుంటాం. కీర్తనలుగా అల్లుకుని కచేరీలు చేస్తుంటాం. వ్రత కథలుగా చెప్పుకుని పునీతులయినట్లుగా భావిస్తుంటాం. శతకాల్లోకి మార్చుకుని సంఘానికి నీతులుగా బోధించుకుంటుంటాం. శకుని జిత్తులకు,  దుర్యోధనుడు దురభిమానానికి, ధృతరాష్ట్రుడు గుడ్డి ప్రేమకి, ధర్మరాజు గడుసుదనానికి, ఉత్తర కుమారుడు డాంబికాలనకి, భీష్ముడు పెద్దరికానికి, ద్రోణుడు గురుత్వానికి, కుచేలుడు బీదరికానికి, భీముడు బండ బలానికి, బకాసురుడు తిండియావకి, కుంభకర్ణుడు మొద్దు నిద్రకు, దుశ్శాసనుడు.. కీచకుడు కాముకత్వానికి, బృహన్నల పేడితనానికి..ఇలా  నిత్య జీవితంలో ప్రతి లక్షణానికి పురాణాల పాత్రలే మనకి తిరుగులేని సంకేతాలయి పోయాయి. 'నరకాసుర వధ' చేస్తానంటుంది ఒక పార్టీ. రావణ కాష్టంలా తగలబడుతుంది దేశం అంటుంది ఇంకో పార్టీ. నేతలను ఐతిహాసిక పాత్రలతో పోల్చి  ఎద్దేవా చేయడం మిగతా దేశాల్లో కన్నా  గా మన దగ్గరే  చాలా ఎక్కువ.

 

'ఏం భాగోతాలు ఆడుతున్నాడండీ!' అంటే చాలు ఎదుటి వాడివి ఎన్ని టక్కరి వేషాలో ఒక్క ముక్కలో చెప్పేసినట్లు. రెండో కృష్ణుడు.. భామా కలాపం.. సత్య హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు, దూర్వాస మహాముని, రాధా కృష్ణులు, రాస లీలలు, రామలక్ష్మణులు, సుందోపసుందులు, జయవిజయులు, నరసింహావతారం, బలి చక్రవర్తి..ఇలా ఎన్నైనా ఉదాహరణలుగా  చెప్పుకోవచ్చు. ఆంజనేయుడి తోకంత ఉంటుంది. శుక్రాచార్యుడు, వామనావతారం, శూర్పణఖ.. ఇలా మన మాటల్లో మనం అనుకుంటున్నట్లే వేరే సంప్రదాయాల్లోనూ అనుకునే ఆచారం ఉండే ఉంటుంది.  కురుక్షేత్రం అంటే మనకు ఒక యుద్ధ వాతావరణం. గీతా బోధన అంటే  కౌన్సిలింగు.భగవద్గీత అంటే తు.చ తప్పకుండా పాటించడం. బైబిలు. కొరాను . సైతాన్.. ఇలా పరభాషా సంస్కృతుల్లోనూ ఏన్నో ఉండే ఉంటాయి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,యూ.ఎస్.ఎ

13 -1ఒ -2021

కథానిక ( సరిదిద్దాలి) పుష్పాభిషేకం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి వారపత్రిక – 11- 05- 2000 - ప్రచురితం )

 





కథానిక: ( సరిదిద్దాలి) 

పుష్పాభిషేకం




రచన: కర్లపాలెం హనుమంతరావు 

ఆంధ్రభూమి వారపత్రిక - 11/05/2000 -  ప్రచురితం ) 


రాత్రి పన్నెండు గంటలు దాటుతోంది. 


డిసెంబర్ నెల బయట చాలా చలిగా వుంది.


పుస్తకం ముందు కూర్చున్న శరత్ మనసు మనసులో లేదు.


పక్క గదిలో నుండి వుండి వుండి శబ్దాలు వినిపిస్తున్నాయి . 


వరండా నిండా పిండారబోసినట్లు వెన్నెల. నై ట్ క్వీన్ పూలవాసనతో

వాతావ రణం మరింత మత్తుగా ఉంది. 


ఉండబట్టలేకపో మూసేసి లైటార్పేశాడు శరత్ . 


పిల్లిలా వెళ్లి పక్క గది తలుపు దగ్గర నిల్చున్నాడు. 

సన్నటి కంతలో నుండి లోపల జరిగేదంతా అస్పష్టంగా కనిపిస్తోంది. 

 బెడ్లైట్ వెలుతురులో . 


బెడ్ మీద పావని. . అన్నారావు . కాళ్లు వణుకుతుంటే గభాలున వెనక్కు తగ్గి వచ్చి బెడ్ మీద పడిపోయాడు . 

పక్క గదిలో మంచాలు కదులుతున్న చప్పుళ్ళు, .. మధ్యమధ్యలో గాజుల గలగలలు .. ఉండి ఉండి. . మెత్తగా మూలుగులు. మత్తుగా గుసగుసలు, పిచ్చెక్కిపోతోంది శరత్.


తాను చేస్తున్నది. తప్పని హెచ్చరిస్తూనే వుంది అంతరాత్మ. అయినా మనసు వివే మూడో లేదు.  అదుపు చేసుకొనే  కొద్దీ ఆలోచనలు గాడి తప్పి పోతున్నాయి. 


ఎన్ని రోజుల నుండో ఇలా యాతన అమభవించడం! 


మొదట్లో ఎబ్బెట్టుగా అనిపించేది .  ఇప్పుడలాంటి ఆలోచనలు చేయకుండా  ఉండలేని బలహీనత ఆవరించింది. 


నెల రోజులుగా ఇదే వరస . 


కలలో కూడా అవే దృశ్యాలు . పావని.. అన్నారాపు స్థానంలో .. తనూ . . 


ఛీ! ఎంత వద్దనుకున్నా ఆ ఆలోచ సలు వదలడంలేదు. వారం రోజులుగా  మరీ ఎక్కువయ్యాయి తీపులు. 

దీని దెబ్బతో చదువు మీద ఏకాగ్రత కూడా చెదిలిపోతొంది. ఈసారైనా విజయం సాధించాe అని వాళ్లమ్మ కోరిక. 


చనిపోయిన తండ్రి కోరిక కూడా . అదే శరత్ ఆశయం కూడా అదే . ఇక్కడికొచ్చేదాకా. 


ఇప్పుడే తారుమారయింది ఇలాగా. 


అన్నారావు తనకు వరసకు అన్నయ్య .  పెద్దమ్మ కొడుకు . సిటీలో ఆర్ టీసీలో కండక్టర్.కొత్తగా  ఇల్లు కట్టుకున్నాడుబ్యాంకు లోనుతో . ఈఎమ్మైలు బరువవుతున్నాయని బాధపడుతుంటే పెద్దమ్మే తను  ఇక్కడ ఉండేటట్లు  ఏర్పాటు చేసింది.  తను సెంట్రల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగుకని ఎట్లాగూ సిటీకి వచ్చి ఆరునెలలు  ఉండాలి. ' ఆ ఉండేది ఎక్కడో ఎందుకు .. మా అన్నారావు పక్క వాటాలో ఉండి చదువుకో ! రెండు పూటలా భోజనానికి, అద్దెకు కలిపి మూడు వేలు ఇవ్వు! ' అంటూ పెద్దమ్మ చేసిన ఏర్పాటే ఇది . 


అన్నారావుకు రెండువారాలకు ఒకసారి బెంగుళూరు సర్వీస్ డ్యూటీ పడుతుంది . ఆ రెండు రోజులు ఇంట్లో మగదిక్కుగా ఉంటాడన్న ఆలోచనతో పావని కూడా ' సరే ' అన్న తరువాతనే తానిక్కడికి వచ్చి పడింది  . 


వచ్చాడే  కానీ కాన్సె౦ట్రేషన్  కుదరడం లేదు. కొన్ని రోజుల బట్టి మరీ . కాన్షస్నెస్ ఒప్పుకోక పోయినా కళ్ళముందు  పావని బెడ్ రూం దృశ్యమే  పగలూ .. రాత్రీ కూడా ! 


తనను ఏదైనా చేయాలి. అప్పటి దాకా తనకీ పిచ్చి వదలదు. . అని డిసైడయ్యాడు శరత్ చివరికి 


అన్నారావు ఊళ్లో లేనప్పుడు మనసు మరీ గాడి తప్పుతోంది.


పావని  కూడా తనలో చాలా చాలా సరదాగా ఉంటుంది. సినిమాలన్నా, టీవీ అన్నా ఆమెకి చాలా ఇష్టం. భర్త ఊళ్లో లేనప్పుడు బోరుకొడితే శరత్ చేత వీడియోలో అడిగి మరీ తెప్పెంచుకునేంతా చనువు చూపిస్తుంది కూడా .  భోజనం పెట్టేటప్పుడు, పాపను అందించేటప్పుడు ఎన్నిసార్లు ఆమె చేయి తనకు తగిలేది . ఆడవాళ్లు పరాయి మొగాడితో ఉరికే అంత క్లోజ్ గా ఉండరు కదా! 


మొదట్లో మొదట్లో ఏమీ అనిపించేది కాదులు . ఇప్పుడీమధ్యే ఈ వికారం మొదలయింది తనకు! 


ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, బెడ్రూమ్లో బట్టలు మార్చుకుంటు న్నప్పుడు రహస్యంగా తొంగి చూడడం, పనున్నా లేకపోయినా అవిడ వెంటే తిర గడం, అవకాశం దొరికినప్పుడల్లా అవిడని తాకడానికి ప్రయత్నిం చడం... అన్నయ్య లేనప్పుడు మరీ చొరవగా ప్రవర్తించడం... రాత్రయ్యేసరికి పిచ్చి పట్టినట్లుంటుంది. ' ఒక్కసారి ఎలాగైనా పావనిని కల


వాలి అన్నయ్యలాగా, అదే ఆలోచన మెదడును తొలుస్తుంటే పుస్తకంమీద మనసెలా నిలుస్తుంది?


' సంకేషం సగం బలం' అన్నమాట వ్యక్తులకే కాదు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేశానికి వర్తిస్తుంది. ప్రపంచంలో సంతోషంగా ఉన్న వ్యక్తుల క్కోవటంలోనే నిజమైన ఆనందం జాబితాలో అమెరికా ముందుంది. ఆ తర్వాత స్థానం ఇండి మంది అభిప్రాయపడ్డారట. స్నే యాకు లభించింది. 22 దేశాల్లో సర్వే నిర్వహించిన అనంతరం, బంధాలు కూడా బాగా ప్రభావం ఇటీవల ఫలితాలను ప్రకటించారు. జీవితంలో వేర్వేరు అంశాల్లో తేల్చి చెప్పారు. 'మతం ప్రభావం ఏ మేరకు సంతోషం లభిస్తోంది?... అసలు సంతోషం కలిగించే ఉంటుందని. రేటింగ్లో మార్పు


చదువుగాడి తప్పుతుంది. వీక్లీ టెస్టుల్లో మార్కులు బాగా తగ్గుతున్నాయి. ప్రోగ్రెస్ బాగా లేదని లెక్చరర్లు పెదవి విరుస్తున్నారు. 'ఇంకా పరీక్షలు ఐదు నెలలు కూడా చదవడం. మూడీగా వుంటున్నావు. లవ్లో పడ్డావా?" అనడి లేవు. ఇలాగేనా


ఏమని సమాధానం చెప్పాలి?


పావని ముందు తన కోరిక బైటపెడితే ఊరుకుంటుందా?


పెదవి విప్పి చెప్పనిదే ఎలా తెస్తుందామెకు తన మనసు? ముందు తను ధైర్యం చేయాలి. తరువాత అదృష్టం ఎలా వుంటే అలా, కానీ


ఇలాంటి విషయాల్లో సలహాలెవరిస్తారు? అలాగని పూరికే వుండిపోయే మన స్తత్వం కాదు శరత్.


ముగ్గురాడపిల్లల మధ్య మగ నలుసు. అమిత గారాబంగా పెరిగాడింట్లో అన కున్నది అయ్యేదాకా సంతం వదలని మొండితనం అతనిది. ఆలోచించి అలోచించి రాత్రంతా మేల్కొని పాతిక పేజీలు చించి రెండు పేజీల ఉత్తరం రాసాడతను.


"పాపనీ! నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తోంది. అది పొందని బ్రతుకు వృధా. ప్లీజ్ ఒక్కసారి నా కోరిక తీర్పు. లేకపోతే మరణంతప్ప నాకు వేరే దారి లేదు. ”


ఇట్లు

శరత్ 


స్థూలంగా ఉత్తరం సారాంశం అది.


ఉత్తరాన్ని ఆమె కంట పడేట్లు బెడ్రూమ్లో దిండు మీద పెట్టి బైటికెళ్లిపోయాడు శరత్.


అన్నయ్య ఊళ్లోలేడు. వారందాకా రాడు. ఈలో పునే ఏదో తేలిపోవాలి. సినిమాకెళ్లి వచ్చేసరికి పదిగం టలు దాటింది.


తలుపు దగ్గరికి వేసి వుంది.


బట్టలు మార్చుకుని పక్క సర్దుకుంటుంటే పావని వచ్చి ఎదురుగా నిలబడింది.


ఇద్దరి మధ్యా కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పావనే అడి


గింది " అన్నం తిన్నావా?''


"ఆకలిగా లేదు" అన్నాడు శరత్ ముక్తసరిగా. "నిన్నొక మాట అడుగుతాను చెప్తావా?? పావని గొంతు వణకుతోంది దుఃఖంతో..


ఉత్తరం చదివి బాగా ఏడ్చినట్లుంది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి.


“నామీదసలు నీకలాంటి అభిప్రాయం ఎలా


గింది? నా ప్రవర్తనలో ఏమైనా లోపముందా?''


శరత్ మాట్లాడలేదు.


"నాకన్నా మూడేళ్లు చిన్నవాడివి. నిన్నెప్పుడూ ఆ భావంతో చూడలేదు. అన్ని పేజీల ఉత్తరం రాసావు. అది చదివిన తరువాత నిన్నెప్పటిలా చూడగలనా? ఎందుకలా చేసావు? మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవు తుందో ఆలోచించావా?”


"అన్నిటికీ తెగించే రాశాను" అన్నాడు శరత్ నెమ్మదిగా. రోషంతో పావని


గొంతు గజగజ వణికింది.


"నిన్నీ క్షణంలోనే ఇంట్లో నుండి వెళ్లగొట్టాలని వుంది. అలా చేస్తే అల్లరిపాలయ్యేది ముందు నువ్వు, తరువాత నేను. ఆ తరువాత నా సంసారం. మీ అమ్మ నీమీద ఎన్ని ఆశలు పెట్టుకుంది? మీ నాన్న పోయేట


ప్పుడు కోరిన కోరిక తీర్చడానికి ఆ తల్లి ఎన్ని కష్టాలు పడి నిన్ను చదివిస్తోందో అర్ధం కావడంలేదా? శరత్! నా మాట విని ఈ పిచ్చి పిచ్చి ఊహలు మానేయ్. చక్కగా చదువుకో."


“ఎంత ప్రయత్నించినా నావల్ల కావడంలేదు పావనీ! ఇంక చావొక్కటే నాకు మిగిలిన ఏకైక మార్గం" అని రెండు చేతులతో మొహాన్ని కప్పుకుని కుమిలిపోతున్న శరత్ వంక చూసి నీళ్ళుకారిపోయింది పావని. “అలా అనొద్దు. ప్లీజ్ నేను తట్టుకోలేను.”


శరత్ వినిపించుకునే మూడ్లో లేడు. ఒక్క నిముషమాగి పావనే అంది "ఆల్ రైట్. నీకు కావాల్సింది నా శరీరమేగా. నేను రెడీ."


చివుక్కుమని తలెత్తి చూసాడు శరత్. పావని సీరియస్ గానే అంటోంది. "ఎన్నోసార్లు నన్ను చాటుగా చూశానంటున్నావు. గుట్టంతా రట్టయిన తరు వాత గుప్పెట మూసి వుంచడమెందుకు? నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధం.”


శరత్ ఎలర్టయ్యాడు.


"అయితే నాదీ ఒక షరతుంది!”


“చెప్పు. నువ్వు కోరితే ఏదయినా చేస్తాను" అన్నాడు ఆవేశంగా శరత్. "ముందు మీ అమ్మ కోరిక తీర్చు. ఎసెట్లో మంచి రేంకు సంపాదించు. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చిన రోజున ఇదే బెడ్మీద నీకు షేర్ ఇస్తాను. మిస్" అని విసవిసా వెళ్లిపోయింది పావని.


పరీక్షలింకా ఐదునెలలు కూడా లేవు. పావని మీది ధ్యాసతో విలువైన చాలా సమయమే వృధా అయింది. కాంపెన్సేట్ చేసేలా చదవటమంటే మాటలు కాదు. పంతానికి మారుపేరు శరత్. ఫ్రెండ్స్, షికార్లు బంద్. సినిమాలు, హోటళ్ళు అన్నీ పక్కన పెట్టేసాడు.


అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్ప పుస్తకాన్ని వదలడంలేదు. ఇంటికి


వెళ్లి కూడా చాలా రోజులయింది. తపస్సులాగా చదువుతున్న శరత్ గడ్డం పెరిగి


రుషిలాగా తయారయ్యాడు.


మంచి రేంక్ రావాలి. వీరుడిలాగా తను పావనిని గెల్చుకోవాలి. దేబిరించి


పొందే ఆనందంలో సుఖమేముంటుంది?


శరత్ లోని పట్టుదలను చూసి చలించిపోయింది పావని. ఇదంతా తనమీది కోరి కతోనేనా? అనే ఊహ ఆమెను ఒక చోట నిలబడనీయలేదు. భర్తతో కలిసున్నప్పుడు కూడా శరత్ ఆలోచనలే వస్తున్నాయామెకు. పరీక్ష రాసి ఊరికెళ్లిపోయాడు శరత్.


ఫలితాలకోసం అమ్మ కళ్ళల్లోని ఆత్రుతను చూసి ఆలోచనలో పడ్డాడతను. తనకు మంచి రేంకు రావాలని, ఇంజనీరింగ్ సీటు వస్తే కొండకొస్తానని మొక్కు కుందామె.


తనెంత పెద్ద పొరపాటు చేయబోయాడు. పావని మీది వ్యామోహంతో పరీక్ష


ము వుంటే తల్లి గతి ఏమయ్యేది?


తలచుకుంటేనే భయమేస్తుందిప్పుడు. ఎంత కాదనుకున్నా రిజల్బు వచ్చేరో జున నెర్వస్ గా ఫీలయ్యాడు శరత్. నలభై మూడో రేంకు వచ్చిందని తెలియగానే తల్లి మొహంలోని సంబరాన్ని


చూడాలి. తండ్రి ఫోటో ముందు నిలబెట్టి నమస్కారం చేయించింది. *ఇదిగోనయ్యా! నువ్వడిగినట్లు నీ కొడుకును ఇంజనీరును చేస్తున్నాను.


అంటున్నప్పుడు ఆవిడ కంటి నిండా నీళ్ళు! ఊరంతా బ్రహ్మరథం పట్టారు మంచి రేంకు వచ్చినందుకు. తల్లి తనకు ఎన్ని సార్లు దిష్టి తీసిందో ఆ రోజు.


పావని తండ్రి వచ్చి పలకరించాడు. శరత్చేత ఆయన కాళ్లకు నమస్కారం చేయించింది తల్లి. " ఇదంతా మీ కూతురి చలవేనండీ. ఆ చల్లని తల్లి ఇంట్లో ఉండబట్టే మావాడికీ


చదువు అబ్బింది" అంటూ పావనిని తలచుకుని సంబరపడింది.


"కష్టపడి చదువుకున్నది మీవాడు. శ్రమపడి చదివించింది మీరు. మధ్యలో మా అమ్మాయి ఏం చేసింది? దాని మొహం" అన్నాడాయన మురిపెంగా. సర్టిఫికెట్స్ కోసమని సిటీకి పోతున్నప్పుడు మంచి చీర ఒకటి కొనివ్వమని డబ్బిచ్చింది శరత్ తల్లి.


అన్నయ్య ఊళ్లో లేడు. శరతిని చూడగానే సంతోషంగా పలకరించింది పావని. కానీ ఆమె కళ్లల్లోని నీలినీడల్ని శరత్ గమనించకపోలేదు. అమ్మ చెప్పిందని బజా రుకి బయల్దేరదీసాడు. పావనికి చీర కొన్నాడు. భోజనం బైటే చేద్దామన్నాడు. మాట్లాడలేదు పావని. దార్లో మల్లెపూలు కొన్నాడు. చూస్తూ వూరుకుంది. ఉయ్యాలలో నిద్రపోతున్న పాపకు దుప్పటి కప్పి వచ్చి శరత్ కెదురుగా


కూర్చుంది పావని. కొత్త చీరలో చాలా అందంగా వుందామె. “మొత్తానికి పంతం నెరవేర్చుకున్నావులే. నీ ముందు నేనోడిపోయాను. మల్లె పూలు తెచ్చావుగా. ఇక నీ ఇష్టం" అంటూ పావని బెడ్లైట్ వేసి బెడ్మీద వాలిపో యింది. కంట నీరు అతడికి కనిపించకుండా తల పక్కకి వాల్చింది.


మసక చీకటిలో ఇదే సమయంలో ఇదే బెడ్మీద ఆమెని ఎన్నిసార్లు ఎన్ని భంగి మల్లో చాటుగా చూశాడో తను. ఈ సమయం కోసం, ఈ అవకాశం కోసం వెర్రి వాడిలా మారిపోయి తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. నిశ్శబ్దంగా వచ్చి పావని పక్కన నిలబడ్డాడు. నిదానంగా మల్లెచెండు అందుకుని దారాన్ని తెంపి పూలను ధారగా ఆమె పాదాలమీది పోసి కళ్లకద్దుకున్నాడు.


పావని గబుక్కున లేచి కూర్చుంది. “ఇదేం పని?” అంటూ గాబరాగా అతన్ని పొదవి పట్టుకుని పైకి లేపబో


"జన్మనిచ్చేదే తల్లికాదు. జ్ఞానాన్నిచ్చేది కూడా తల్లే. ఇంగితం నేర్పిన తల్లివి. పూలతో నేను చేయాల్సిన పని ఇదే...” అంటున్న శరత్ కంటి నిండా నీళ్ళు!


అంతబాగా కనిపించడం



కథానిక - కర్పూరం రచన - కర్లపాలెం హనుమంతరావు

 







కథానిక : 

కర్పూరం 

రచనః కర్లపాలెం హనుమంతరావు


(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)



అయినవాళ్ళందరికి కబుర్లు వెళ్ళాయి. కొడుకులూ కోడళ్ళూ, కూతుళ్ళూ అల్లుళ్ళూ, సంతానంతోసహా అంతా వచ్చేసారు. ఇంట్లో ఒహటే హడావుడి.


సుందరమూర్తే బెడ్ మీద పడున్నాడు అచేతనంగా. కానీ అతని మనసుమాత్రం  పనిచేస్తోంది..  ఎప్పటికన్నా చురుకుగా!


పక్కగదిలో అందరూ ఏదో 'పారాయణం'లో ఉన్నట్లున్నారు. 


నవ్వులు, చలోక్తులు జోరుగా వినపడుతున్నాయి. 


' అయితే ఓడిన పార్టీ గెలిచిన పార్టీని సినిమాకు తీసుకెళ్ళాలిరా.. అదీ పందెం’ అంటున్నాడు పెద్దకొడుకు.


'వట్టి సినిమానేనా? డిన్నరుకూడా ఉండాలి.. అప్పుడే మజా'  పెద్దల్లుడి వంత.


'బావగారి చూపెప్పుడూ మీల్సుప్లేటుమీదే!' చిన్నకూతురు కౌంటరు. అందరూ విరగబడి నవ్వుకోవడాలు.


ఇవతల గదిలో సుందరమూర్తి మాత్రం మూతిమీద వాలిన ఈగను తోలుకోలేక తంటాలు పడుతున్నాడు. ఒహటే దురద! 


తోలుకొనేందుకు చేతులు లేవు. అవి నెల  కిందట జరిగిన బండిప్రమాదంలో నజ్జునజ్జయిపోయాయి. 


' అసలు ప్రాణానికే ప్రమాదం’ అన్నారు ముందు పెద్దాసుపత్రి వైద్యులు. ఆనక 'చేతుల వరకు  తీసేస్తే ప్రాణానికి కొంతవరకు భరోసా ఇవ్వచ్చు' అని తేల్చారు. 


' యాంప్యుటేషన్’ అంటే మాటలా? మూటలతో పనికానీ!

సుందరమూర్తి చేసేదేమీ సర్కారుద్యోగం కాదు. ఏదో ప్రైవేట్ పుగాకు కంపెనీలో అకౌంటెంటు. 


' యాక్సిడెంటయింది ఆదివారం డ్యూటీ-ఆఫ్ లో ఉన్నప్పుడు కాబట్టి  రూల్సు ప్రకారం  ముట్టేదేమీ లేదు పొమ్మ’న్నారు కంపెనీవాళ్ళు. 


నెలనెలా  జీతంలోనుంచి దాచుకొంటున్న పి. ఎఫ్ కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళకని చేసిన అప్పులకే చెల్లిపోతోంది. 


పెళ్లాం మెళ్ళో వేళ్ళాడే పుస్తెలు మినహా మరేమీ మిగల్లేదు ఇంట్లో.. ఇన్నాళ్ల పిల్లల చదువులు, పెళ్ళిళ్ల తంతులన్నీ ముగిసాక.


అప్పట్లో సుందరమూర్తి అన్ని పాట్లు అట్లా పడబట్టే.. ఇవాళ పెద్దాడు ఇన్ కమ్ టాక్సు ఆఫీసురుగా  కుదురుకొన్నది. చిన్నాడు బ్యాంకాఫీసరు కాగలిగింది. ఉండటానికి సొంత నీడంటూ ప్రస్తుతానికి మిగలక పోతేనేమి.. ఇద్దరు కూతుళ్ళకూ కుదురైన అత్తారిళ్ళు కుదిరిపోయాయి. 


‘ఆఖరివాడి విషయంలోనే కాస్త అన్యాయం జరిగింది. టొబోకో బోర్డులో వేయించగలిగాడుగానీ.. అది అన్నలకు మల్లే అధికార హోదాకలది కాదు.  నాలుగు డబ్బులు చేతుల్లో ఆడుతుంటే చివరాడికి మాత్రం  చిన్నగుమాస్తాగిరీతో సరిపెట్టేవాడినా!' అని మధన పడుతుంటాడెప్పుడూ సుందరమూర్తి ఒంటరిగా ఉన్నప్పుడు. 


ఆ కారణంగా వాడికి తనమేదెంత కోపమో తలుచుకుని తలుచుకొని అపరాధభావనతో  కుంగిపోవడం సుందరమూర్తి బలహీనత.


తండ్రీ బిడ్డలకు ఈ  విషయం మూలకంగా అంతగా మాటలు  లేవు.


' తనకిలా యాక్సిడెంటయిందని అందరితో పాటూ కబురెళ్ళినా..  చివరోడు తీరిగ్గా ఆఖర్లో మాత్రమే  ఎందుకొచ్చాడో తనకు తెలుసు. వచ్చి ఒక్కరోజైనా కాకుండానే 'సెలవుల్లేవు.. అర్జంటు పన్లున్నాయ'ని పెట్టేబేడా ఎందుకు సర్దుకుంటున్నాడో కూడా తనకు తెలుసు’ . 


దీర్ఘంగా నిటూర్చాడు సుందరమూర్తి.


గంటక్రితం అదే గదిలో కుటంబసభ్యులమధ్య జరిగిన సంభాషణలు గుర్తుకొచ్చాయి సుందరమూర్తికి.


' నాన్నగారి ఆపరేషనుకి తలా కొంత ఇచ్చుకోవాలిరా!' అని అడిగింది సుందరమూర్తి భార్య సుగుణమ్మ.. అందరికీ కాఫీలు అందిస్తూ.


' అరె! ఆ సంగతి ముందే చెప్పాలి కదమ్మా! పోయిన్నెల్లోనే పెద్దాడి కాలేజీ సీటుకోసమని ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చాను బ్యాంకునుంచి. మళ్లీ అంత సొమ్మంటే మా ఆఫీసురూల్సు ఒప్పుకోవు' అనేసాడు పెద్దాడు వెంటనే. ముందే తయారు చేసిపెట్టుకున్నట్లుంది అతగాడా  స్పందించిన తీరు చూస్తుంటే!


సుందరమూర్తికి నవ్వొచ్చింది అంత బాధలోనూ. 'నాన్నా!పోయిన్నెలకు ముందే నువ్వెందుకు చేతులు పోగొట్టుకోలేదు?' అని ఆడిగినట్లనిపించింది. 


అయినా పెద్దాడి తత్వం తనకేమన్నా కొత్తా! వాడిప్పుడు అచ్చంగా వాళ్ల మామగారి అడుగుజాడల్లోనే కదా నడుస్తున్నదీ! మామగారి దయవల్లే తనకు ప్రమోషనొచ్చింద'ని ఎన్ని వందల సార్లు తనముందు అనివుంటాడో!


అయినా సుగుణకు వాడిమీదే ప్రేమ జాస్తి. 'మీకులాగా కాదు. నా పెద్దకొడుకు బతకనేర్చినవాడు' అని గర్వంగా చెప్పుకుంటుంటుందెప్పుడూ. '


తగిన శాస్తి చేసాడు తనకిప్పుడు' అనుకున్నాడు సుందరమూర్తి మనసులో చిన్నగా నవ్వుకొంటూ.


సుగుణమ్మ వెర్రిమొహమేసుకొని రెండోవాడివంక చూసినప్పుడు వాడూ అంతకుమించిన  మహానాటకానికే తెరతీసాడు. 


మొహం వేలాడేసుకొని 'ఇంతర్థాంతరంగా లక్షలంటే నా వల్లవుతుందా? నా వంతుగా ఓ పదో.. పాతికో అంటే ఎలాగో తంటాలు పడతాగానీ! దానికీ టైము కావాలమ్మా! లోనుకి అప్లై చేసిన వెంటనే సాంక్షనంటే అయే రోజులా ఇవి?' అని ముక్తాయించేసాడు. అదీ పెళ్లాం వంక బితుకు బితుకుమని చూస్తూ. 


పదికీ పాతిక్కీ కమిటయినందుకు అర్థాంగిగారు ఆనక గదిలో ఏం క్లాసు పీకుతుందోనన్న భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది వాడి కళ్ళల్లో.


పెద్దల్లుడే నయం. 'కొడుకులు మీరట్లా అనడం ఏం బాగోలేదోయ్! మరీ అంత ఇబ్బందయితే చెప్పండి. సర్దడానికి నేను రెడీ! ఆనక మీదగ్గరున్నప్పుడే ఇద్దురుగానీ' అన్నాడు. 


కానీ వెంటనే పెద్దకూతురు అందుకోనే అందుకంది'అవ్వ! బావమరదులకు అప్పిస్తానంటారా! లోకం వింటే నవ్విపోతుంది. అయినా మీదగ్గర అంత సొమ్ము మూలుగుతున్నట్లు నాకూ తెలీదే! కాలేజీకెళ్లే పిల్ల మెడ బోసిగా ఉంది.. కనీసం ఒక చిన్నగొలుసైనా చేయిద్దామని ఎంతకాలంబట్టీ మొత్తుకుంటున్నాను! ఆప్పుడు లేదన్న డబ్బు ఇప్పుడు కొత్తగా ఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చిందో?!  పెళ్ళికి చెల్లాయికి అమ్మ మంచి గొలుసు చేయించి ఇచ్చిందిగదా! ఏమే!  అది బ్యాంకులో పెట్టినా నాన్న అవసరాలు తీరిపోతాయిగదా .. ఇలా అమ్మావాళ్ళు అందరి కాళ్ళు..  గడ్డాలు పట్టుకొని బతిమాలేబదులు!' అంటూ సన్నాయినొక్కులు మొదలుపెట్టింది.


అనుకోకుండా గాలి తనవేపుకి తిరగడంతో వెంటనే ఎలా స్పందించాలో తోచక బిక్కమొగమేసుకుంది చిన్నకూతురు. 


సుగుణమ్మే కలగజేసుకొని అనాల్సొచ్చింది 'కొత్తగా పెళ్లయిన పిల్ల, వంటిమీదకని ఇచ్చిన సొమ్మును ఎంతవసరమొస్తేమాత్రం తిరిగి తీసుకుంటామా? వదిలేయండింకా ఈ టాపిక్కుని ఇక్కడితో!' అనడంతో అమ్మగన్న సంతానమంతా గమ్మునయిపోయారు. 


'అమ్మయ్య! ఈ పూటకీ గండం ఎలాగో గడిచిపోయింద’న్నసంబరమే అందరి కళ్ళల్లో కనిపిస్తున్నది' అనుకున్నాడు సుందరమూర్తి. 


వాతావరణాన్ని తేలిక పరచడానికని తనే కలగజేసుకొన్నాడు చివరికి 'మీ ఆమ్మ పిచ్చిది.  పాతకాలం మనిషి. ఆమె మాటల్నేమీ పట్టించుకోకండర్రా! ఇక్కడున్న నాలుగురోజులు సంతోషంగా గడిపిపోండంతా. మళ్ళా ఎప్పుడు కలుస్తారో  ఏమో ఇట్లా అందరూ! పిల్లాపాపలతో మీరంతా చల్లంగా ఉండటమే మాకు కావాల్సింది' అన్నాడు.


తరువాత తనగదిలోకి వచ్చినప్పుడు సుగుణమ్మ కన్నబిడ్డల మాటల్ని తలుచుకొని తలుచుకొని గుడ్లనీరు కుక్కుకుంటుంటే సుందరమూర్తే సర్దిచెప్పాల్సి వచ్చింది. 


' వూరికే అనవసరంగా  వాళ్లని బాధ పెట్టడమెందుకు? నువ్వూ బాధ పడ్డమెందుకు? ఇప్పుడంత అర్జంటుగా నేనీచేతులు బాగుచేయించుకొని వరగబెట్టేది మాత్రం ఏముంది చెప్పు! ఎలాగూ  రిటైరవబోతుంటిని. ఆర్నెల్లకు  ముందే పదవీవిరమణ చేసానని సర్దిచెప్పుకొంటే సరిపోదా సుగుణా!' అంటూ.


ఎప్పుడు వచ్చాడో లక్ష్మీనారాయణ.. అంతా అప్పుడే  విన్నాడో.. సుగుణమ్మ అంతకుముందే చెప్పుకుందో.. లోపలికొచ్చి కూర్చున్నాడు. 'చూసావుగా సుందరం! నేనాడే హెచ్చరించాను. ఈ కాలం కుర్రసజ్జే అంత. పిలల్ని మనం 'బంగారు కొండల'నుకుంటాం. ఆ కొండలే విరిగి నెత్తిమీద పడితే?  అయ్యో.. మన త్యాగమంతా వృథా అయిపోయిందిగదా అనుకుంటూ అల్లాడిపోతుంటాం.. ఇలాగా!' అంటూ వేదాంతం మొదలుపెట్టాడు.


'పోనీలేరా! కన్నందుకు పిల్లల్ని వృద్ధిలోకి తేవడంకూడా ఓ గొప్పత్యాగమేనా! పుట్టీపుట్టంగానే డొక్కల్లో తంతూ నడక నేర్పించడానికి మనమేమీ ఒంటెలం కాదు. జిరాఫీలం అంతకన్నా కాదు. రెక్కలిరిగినప్పుడు ఆదుకుంటాయనేనా పిట్టలు గువ్వలకి నోళ్ళు పగలదీసి మరీ బువ్వ పెట్టేది! మన రక్తసంబధాలు విచిత్రంగా ఉంటాయిరా! కనకనే మనం మనుషులం. ఎవరి అదృష్టాలనిబట్టి వాళ్లకవి లభ్యమవుతాయి. నా అదృష్టం ఇదీ! దానికింకెవర్నోనిందిస్తూ కూర్చుంటే మనశ్శాంతి తిరిగొస్తుందా!. వస్తుందంటే చెప్పు.. నీ మాటే వింటాను’


'సరేలే! నీ వెర్రివేదాంతం నాకింతప్పట్నుంచీ తెలిసిందేగా! నువ్వెలాగూ వృద్ధాప్యంలో కష్టమొచ్చినప్పుడు ఇలాంటి గోతిలోనే పడతావని  ముందే తెలుసు. ఏడేళ్లకిందట ఇల్లు కట్టేటప్పుడు నీ దగ్గర అప్పు తీసుకున్నాను. గుర్తుందా? ఆ మూడు లక్షలు ఎప్పుడు తిరిగిస్తానన్నా'ఫ్రెండు దగ్గర బాకీ వసూలు చేసుకునే ద్రోహినా?' అంటూ సినిమా డైలాగులు కొట్టేవాడివి. 'కనీసం వడ్డీలేకుండానైనా తీసుకోరా దేవుడా!' అని ఎంత బ్రతిమిలాడాను! నీ  డబ్బుమొత్తం  ఆ రోజుల్లోనే  బ్యాంకులో వేసేసానబ్బాయ్ రికరింగ్ డిపాజిట్టుగా. నిన్ననే మెచూరయింది.. అదిచ్చిపోదామనే వచ్చింది' అని డబ్బున్న సంచీ అక్కడేవున్న సుగుణమ్మ చేతిలో పెట్టేసి  'లెక్క పెట్టించు తల్లీ! మొత్తంఆరున్నర లక్ష ఉండాలి' అన్నాడు లక్ష్మీనారాయణ. 


'లక్ష్మీ! నీకెందుకురా నామీద అంత ప్రేమ?'


'నేను నీ బాల్యస్నేహితుణ్ణి కనక. మరీ ముఖ్యంగా నువ్వు నా కన్నతండ్రివి కాదు కనక' అని నవ్వాడు లక్ష్మీనారాయణ. 


భోరున ఏడ్చేసాడు సుందరమూర్తి. అప్పటిదాకా అదిమిపెట్టుకొనున్న ఉద్వేగమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకొన్నట్లయింది. 


కాఫీ తాగి లేచివెళ్ళే సమయంలో  లక్ష్మీనారాయణని దగ్గరికి పిలిచి చెప్పాడు సందరమూర్తి 'సుగుణదగ్గరున్న ఆ క్యాష్  మా మూడోవాడు రాజుకాతాలో వేసెయ్యరా! వాడు చాలా రోజులబట్టీ డబ్బుకావాలని ఒహటే గోలపెడుతున్నాడు. ఏదో బండికొంటాట్ట! అదికొనిస్తేగాని వాళ్లబాసు ప్రసన్నం కాడనీ.. పైపోస్టుకి తన పేరు క్లియర్ కాదనీ మొత్తుకుంటున్నాడు చాలా రోజులబట్టీ.. పాపం! తప్పేముందిలే! వాడికి మాత్రం వాడి అన్నలకు  మల్లే పెద్ద హోదాలో ఉండాలని ఎందుకుండ కూడదు? ఈ మొండిచేతులు పెట్టుకొని ఇహ ముందు మాత్రం  వాడికి నేను చేసేది ఏముంటుంది? ప్రైవేట్ కంపెనీలో ఓ బోడి గుమస్తాపోస్టు ఇప్పించానని కదా ఇంతకాలం  వాడికి నామీద ఆ  గుర్రు!' అన్నాడు భార్యవైపు తిరిగి.


'మరి మీ సంగతేమిటండీ?' అని లబలబలాడింది అప్పుడే హారతిపళ్లెంతో లోపలికొచ్చిన సుగుణమ్మ.


'సుగుణా! ఈ లక్ష్మీగాడు  నీకు చెప్పడానికి జంకుతున్నాడు. నిన్న వాడే డాక్టరుదగ్గరికి వెళ్ళొచ్చాడు 'సమయం చాలా మించిపోయిందని.. ఇప్పుడు యాంప్యుటేషనంటే అసలు ప్రాణానికే ముప్పు' అని డాక్టర్లు చెబుతున్నార్ట. ఏరా!?' అని గద్దించి అడిగాడు మిత్రుణ్ణి సుందరమూర్తి.


' అవున'నాలో.. 'కాద'నాలో' తేల్చుకోలేక నీళ్ళునిండిన కళ్ళతో అలాగే నిలబడిపోయున్నాడు లక్ష్మీనారాయణ.


సుగుణమ్మ చేతిలో వెలుగుతున్న  హారతికర్పూరం  వాసన గుప్పున అతగాడి   ముక్కుపుటాలకు సోకింది.


- రచనః కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)














అశ్రు నీరాజనం- ఈనాడు సంపాదకీయం - ( సత్యసాయిబాబా నిర్యాణమయిన సందర్భంలో)

 


ఈనాడు సంపాదకీయం: 

అశ్రు నీరాజనం

( సత్యసాయిబాబా  నిర్యాణమయిన సందర్భంలో) 



. దైవం మానుష రూపేణ' అన్నది ఆర్యోక్తి. వేదనకు రోదనకు సాంత్వనగా, అంతకుమించి హృదయ తంత్రులను మెల్లగ మీటే అమృత స్పర్శగా సత్యసాయిని ఆరాధించే భక్తకోటి ఆయన్నే ప్రత్యక్షంగా కొలుస్తోంది. తమ దైవం అవతారం చాలించిందన్న దుర్వార్త  కోట్లాది భక్తజనుల గుండెల్లో విషాదాగ్నులు గుమ్మరించింది.  నేడు ప్రశాంతి నిలయం ఘనీభవించిన అశ్రుజలపాతం. విశ్వ జనీన ప్రేమకు తన పేరునే చిరునామాగా మార్చిన సత్యసాయి మరి లేరన్న పిడుగులాంటి వార్తే కోట్లాది భక్తజనులకు శరాఘాతం. ఎనిమిదిన్నర పదుల వయసులో తీవ్ర అస్వస్థతకు గురైన సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై కొంతకాలంగా తీవ్రాందోళన వ్యక్తమవుతోంది. సాయిబాబా ఆరోగ్యం విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు కొన్నా ళ్లుగా ఆందోళన వ్యక్తీకరిస్తున్నా పూర్తి స్వస్థతతో స్వామి తిరిగి దర్శ నం ఇస్తారన్న విశ్వాసాన్ని భక్తుల్లో పెంచిన భరోసా మరొకటుంది. అది సాక్షాత్తు సత్యసాయే ఇచ్చింది! దశాబ్దాల క్రితంనాటి ప్రవచనాల్లో తాను 2022 దాకా ఈ అవతారంలో కొనసాగి తన జీవన పరమా ర్థాన్ని సాధించగలనంటూ సత్యసాయి చెప్పిన మాటపైనే అశేష భక్తుల గురి. సత్యసాయి చూపుతున్న మహిమలు కేవలం కనికట్టే నని హేతువాదులు కొట్టిపారేస్తున్నా- ఆయన్ను అభిమానించే జన కోటి ఏటికేడు ఎల్లలు దాటి విస్తరిస్తూనే ఉంది. గత జన్మలో షిరిడీ సాయిగా కొలుపులందుకొన్న తాను, వచ్చే జన్మలో ప్రేమసాయిగా అవతరిస్తానని చెప్పే సత్యసాయి పథగమనాన్ని భక్తి ప్రపత్తులతో కొలిచే జనసంద్రం- పదేళ్లముందే ఏమిటీ ఉత్పాతమని కల్లోల తరంగితమవుతోంది! దేశాధినేతలూ భక్తి తత్పరతతో, ముకుళిత హస్తా లతో ప్రణమిల్లే సత్యసాయి- 1940లో తన జీవన లక్ష్యాన్ని నిర్దేశించు కొన్నప్పుడు కేవలం ఒక వ్యక్తి. అదే నేడు- విశ్వమానవ ప్రేమను ప్రబోధిస్తూ ధ్రువతారగా నింగికెగసిన అమేయశక్తి. ఆ మార్గం మలిగిపోదు. ఆ ప్రేమకు మరణం లేదు. 


'కులం ఒక్కటే- అది మానవత్వం... మతమూ ఒక్కటే- అది ప్రేమతత్వం... భాష ఒక్కటే- అది హృదయ సంబంధి... దేవుడూ ఒక్కడే- అతడు సర్వాంతర్యామి!'- ఇదీ సత్యసాయి బోధ . ఓ క్రైస్త వుడు మంచి క్రైస్తవుడిగా, ఓ ముస్లిం మంచి ముస్లిముగా ఎదగాలన్నదే బాబా ఉద్బోధ! సత్యసాయి ఎదుగుదలపై వాద వివాదాలు, తనకు తాను దైవత్వం ఆపాదించుకోవడంపై ఆస్తిక నాస్తిక సంవాదాలు ఎన్నయినా ఉండవచ్చుగాక- తన జీవితాన్నే పచ్చని చెట్టులా మలచి కోట్లమందికి సేదతీర్చిన ధన్యజీవి ఆయన.  సామాజిక అవ సరాల్ని సరిగా గుర్తించి తన ట్రస్టు ద్వారా తాడిత పీడిత శోషిత వర్గాల బతుకుల బాగుసేత లక్ష్యంగా ఆయన పరిశ్రమించిన తీరుకు కళ్లకు కడుతున్న పలు విధాల ప్రాజెక్టులే తిరుగులేని దాఖలా! ఆసుపత్రులు, విద్యాసంస్థలు, తాగునీటి వసతులు, అత్యంత ముఖ్యమైన  సాయి గ్రామాలు- వేల కోట్ల రూపాయలను వ్యయీకరించి ప్రణాళి కాబద్ధమైన కార్యాచరణతో పరమాద్భుతమని ప్రభుత్వాలే అచ్చెరువొం దే స్థాయిలో ఆయా ప్రాజెక్టుల్ని కట్టి, నిలబెట్టిన సత్యసాయి ఆదర్శం ఆయనలోని దైవత్వాన్నే భక్తులకు సాక్షాత్కరింపజేసింది. పదహారేళ్ల నాటి ముచ్చట అనంత దాహార్తితో డస్సిపోతున్న అనంతపురం జిల్లా వాసులకు ఏడాది వ్యవధిలోగా తాగునీటి సేవలందిస్తానని సత్య సాయి ప్రకటించినప్పుడు- అది అమల్లోకి వచ్చినప్పటి సంగతి కదా అని పెదవి విరిచినవారే అందరూ! 3200 కిలోమీటర్ల పైప్ లైన్లు , 2,350 ఓవర్ హెడ్ ట్యాంకులు, 136 ఉపరితల జలాశయాలు, 200 పంప్ హౌస్లు, 250 గొట్టపుబావులు- ఇంత భారీ పథకాన్ని పట్టుమని తొమ్మిదినెలల్లో సాకారం చేసి, దాహార్తి పీడితుల చేరువకు అమృత జలధారల్ని చేర్చిన సత్యసాయి భగీరథ యత్నంలో- మానవసేవే మాధవ సేవ అనే దైవత్వ భావన కనిపించక మానదు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వందలకోట్లు వెచ్చించి సత్యసాయి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు- ఆ పుణ్యజీవి జీవన సార్ధక్యానికి మేలిగురుతులు!


'మీ గుండెల్లో ప్రేమజ్యోతులు వెలిగించడానికే వచ్చాను' అని ప్రవచించిన సత్యసాయి- భావితరంలో జ్ఞానజ్యోతుల ప్రకాశానికి చేసిన కృషి అమోఘం. 'విద్యకు పరమార్థం శీలసంపదే'నంటూ నమూనా విద్యావ్యవస్థను సత్యసాయి ఆవిష్కరించిన తీరు అభినందనీయం. ప్రాథమిక, మాధ్యమిక విద్యాలయాలనుంచి మూడు ప్రాంగణాల విశ్వవిద్యాలయందాకా చదువులమ్మ ఒడిని విస్తరించి, ధనిక-పేద వ్యత్యాసాలు లేకుండా , ఫీజుల ప్రస్తావనే రాకుండా వేలమందికి జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్న సత్యసాయి- రేపటి పౌరుల భవితకు మేలుబాటలు పరచిన చిర యశస్వి! విదేశాలలో  రెండున్నర వేలకు పైగా సాయి కేంద్రాలుంటే, ఎన్నెన్నో పాఠశాలల్ని సత్యసాయి సంస్ధలే నడుపుతున్నాయి. యాభై ఏడేళ్ల క్రితం పుట్టపర్తిలో కేవలం రెండు పడకలతో ప్రారంభమైన సత్యసాయి వైద్యసేవలు నేడు లక్షలమందికి అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ప్రాణ జ్యో తులు మలిగిగుండా కాపాడుతున్నాయి. ఆసుపత్రిదాకా రాలేని గ్రామీణ షాంత రోగులకు  సంచార వైద్య సదుపాయాల్ని కల్పిం చడంలోనే సత్యసాయి ప్రేమతత్వం గుబాళిస్తోంది. అందరినీ ప్రేమించు- అందరికీ సేవలందించు' అన్న నినాదాన్ని జీవన విధానంగా మలచుకొని ఎల్లలెరుగని ప్రేమతత్వాన్ని జగమంతా పరచిన సత్యసాయి భౌతికంగా దూరం కావడం- గుండెల్ని పిండే విషాదం.  సాయిబాబా తల పెట్టిన ప్రతి సేవా ప్రాజెక్టులో ప్రేమాస్పద ముద్ర సత్యం; ఆ ప్రేమజీవి పెంచిన, కోట్లాడు భక్తులకు పంచిన సేవా స్ఫూర్తి అజరామరం. 


 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...