‘ దేవుడి పాలన'.. 'దేవుడి పాలన' అంటూ
అంతా అలా ఊదరగొట్టే
సజ్జేగానీ.. ఆ పాలించే దేవుడుగారెవరో ఇతమిత్థంగా ఎవరూ తేల్చిచెప్పరు! ఎందుచేతనంటావ్ బాబాయ్!'
సజ్జేగానీ.. ఆ పాలించే దేవుడుగారెవరో ఇతమిత్థంగా ఎవరూ తేల్చిచెప్పరు! ఎందుచేతనంటావ్ బాబాయ్!'
'నీ ద్యాసీ పొద్దు దేవుడిగారిమీదకు మళ్లిందే! వివరాలేమన్నా తెలిస్తే ప్రజాప్రయోజన
వ్యాజ్యమేదన్నా లాగిద్దామన్న దుర్భుద్ధి కాదుగదా!'
'అపార్థాలొద్దు బాబాయ్! మన ప్రపంచ
జనాభా ఏడొందలకోట్ల పైచిలుకు మైలురాయికి చేరుకుంది కదా ఇప్పటికే! అదే దామాషాలో దేవుళ్లసంఖ్యా పెరుగుతున్నదా..
లేదా.. అని నాకో ధర్మసందేహం!
మనకి ముక్కోటి దేవతలున్నట్లు ఎక్కడో చదివాను. ఆ
లెక్కన ఒక్కో దేవుడికి రెండువందల ముఫ్ఫైముగ్గురు భక్తులను ఆదుకోవాల్సిన బాధ్యతా
ఉందిగదా! ఈ కరువు రోజుల్లో అదెంత బరువు! అందుకే వాళ్ళ కష్టనష్టాలేమిటోకూడా కాస్త
వాకబు చేద్దామనీ,,!'
'ఇహనేం! జనగణన మాదిరిగా దైవగణనకీ బైలుదేరూ! ఎలాగూ పనీ పాటా లేనట్లుందిగా నీకీ మధ్య!'
***
అబ్బాయి ముందుగా
బ్రహ్మలోకంలోకి ప్రవేశించాడు.
తామరతూడులో
తామరాసనుడు లేడు! అక్కడే మానససరోవరం మడుగులో కునికిపాట్లు పడే హంసవాహనం అంది
'మీ లోకానికి సెకనుకి నాలుగు శాల్తీలయ్యా
తయారవ్వాలి! ఇక్కడికి తిరిగొచ్చేవి మాత్రం రెండంటే రెండే!
ఈ లెక్కన మనుషుల్నిచేసే ముడిసరుక్కి ఎంత కరువొచ్చి పడిందో తెలుసా
అబ్బాయ్! పనిభారమూ ఎక్కవపోయింది పాపం మా పెద్దాయనకి.
బ్రహ్మ రాసిన నుదుటిరాతల్నీ మీరవేవో కంప్యూటర్లో.. పాడో.. వాటి
సాయంతో తిరగరాసేసుకుంటున్నారంటగా! బోలెడన్ని ఫిర్యాదులు
వచ్చిపడుతున్నయ్ బాబూ బ్రహ్మలోకానికి రోజూ! వీటన్నిటికీ
చెక్ పెట్టేసే కొత్త సాఫ్టువేరేదన్నా దొరుకుంతేమోనని వాకబు చేయడానికి
వెళ్లారు విశ్వకర్మ దగ్గరకు విధాతగారు'
'వాణీమాతకూడా కనిపించడం లేదే!'
'బ్రహ్మ కష్టాలు బ్రహ్మవి. అమ్మ కష్టాలు అమ్మవి.
మీ మానవుల బుర్రల్లో బుద్ధి ఎక్కువ దోపడం బుద్ధితక్కువ పనయిందనుకుంటున్నారయ్యా ఇక్కడంతా! అంత కష్టపడి ఎన్నో భాషలు కనిపెట్టి ఇంచక్కా
ఎవరి పుట్టుకభాష వాళ్ళు మాట్లాడుకోమంటే.. మీరేం చేస్తున్నారబ్బాయ్! అన్నింటినీ కలగలిపేసి ఓ కొత్త సంకరభాష తయారు చేసేశారు! ‘నా భాష గొప్పదం’టే నా భాష గొప్పద’ని దుర్భాషలు మొదలుపెట్టారు!
మైకులముందు మీరు కూసే కూతలు.. పత్రికల్లో మీరు
రాసే రాతలు భాషామతల్లికే ఓ పట్టాన బుర్రకెక్కి
చావడం లేదు! 'మానవా! దూర్భాష
మానవా!' అని మీకు అర్థమయేలా అర్ధించాలన్నా ఆమ్మకూ సంకరభాషే గతయిపోయింది..
ఖర్మ! ఎవరో టీ.వీ యాంకరమ్మట!
ఆమె దగ్గర సంకరట్యూషను పెట్టించుకొందీ మధ్య.
అక్కడికెళ్లింది.. ఇంకా రాలేదు’
అబ్బాయి అటునంచటే
విష్ణులోకానికి పయనమయ్యాడు.
పాలకడలిమీది
పాముపడగా బోసిగా ఉంది. పరమాత్ముడేమన్నా
కొత్త అవతారం ఎత్తేందుకని వెళ్లాడేమో! ఆ మాటే ఆదిశేషుని అడిగితే
ఇంతెత్తున బుస్సుమని లేచింది!
'అదొక్కటే తక్కువయ్యా ఇప్పుడు మా పరంధాముడికి! మీ లోకంలో
ఎవరో
గాలి సోదరులంటగా! నలభైమూడు కోట్లుపోసి వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటమొకటి స్వామివారి నెత్తికి తగలేసారు అప్పుడెప్పుడో! అప్పుడొచ్చిన మాడుపోటు.. ఇప్పటికీ తగ్గలేదు. మా ధన్వంతరిగారేమో వల్లకాదని చేతులెత్తేసాడు! మంచి వైద్యుడేమన్నా దొరుకుతాడేమోనని మీలోకంలోనే.. గాలించడానికని ఎక్కడికో వెళ్ళారు.. ఇంకా రాలేదు’
గాలి సోదరులంటగా! నలభైమూడు కోట్లుపోసి వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటమొకటి స్వామివారి నెత్తికి తగలేసారు అప్పుడెప్పుడో! అప్పుడొచ్చిన మాడుపోటు.. ఇప్పటికీ తగ్గలేదు. మా ధన్వంతరిగారేమో వల్లకాదని చేతులెత్తేసాడు! మంచి వైద్యుడేమన్నా దొరుకుతాడేమోనని మీలోకంలోనే.. గాలించడానికని ఎక్కడికో వెళ్ళారు.. ఇంకా రాలేదు’
'మరి సిరి? అమ్మగారూ అయ్యగారి వెంటనే వెళ్లారా?’
'అమ్మో! మీ లోకమే! డబ్బుకాకలో కొట్టుమిట్టాడుతున్నారంటగా
మీరంతా! ఎక్కడే పాపాత్ముడు కట్టిపారేస్తాడోనని స్వామివారే లక్ష్మమ్మను వెంట రావద్దన్నారు. అయినా.. మీ మానవులమీదే ఆ తల్లికి ఆదరం ఎక్కువ. అక్కడి బీదాబిక్కిని ఆదుకుందామని వస్తే ఆదిలక్ష్మనికూడా గౌరవం లేకుండా ఏంచేసారయ్యా
మీ పెద్దమనుషులు! నల్లరంగు పూసేసి నేలమాళిగల్లో దాచేస్తారా! అహ్వ..!'
అంటూ జిహ్వనిండా నిప్పులు గుమ్మరించింది ఆదిశేషు.
ఇంకాసేపు అక్కడే
ఉంటే ఏం జరుగుతుందో తెలీనంత పిచ్చికొయ్యేంకాదు అబ్బాయి. అమాంతం కైలాసం జంప్!
వెండికొండా
భూత్ బంగళానే తలపిస్తోంది.
తెల్లకార్డువాళ్లకి
చంద్రన్నలిద్దరూ రూపాయిక్కిలో బియ్యం పంచుతున్నారు కదా ఈ మధ్య! దారిద్ర్యరేఖకు ఎల్లప్పుడూ దిగువునే ఉండే మారాజాయ ఈ ఆదిభిక్షువు! చౌకబియ్యంకోసం అటుగానీ వెళ్లాడేమో!
అదే అడిగితే 'కాదయ్యా!' అంది నంది 'ఆ ముక్కసరుక్కి కొండలెక్కి దిగాలా! మింగి
హరాయియించుకోడానికి ఆ నూకలేమన్నా అలనాటి
హాలాహలమా నాయనా! వ్యాహ్యాళికని వెళ్లిన అమ్మవారు
వెండికొండకు ఇంకా తిరిగి
రాలేదు. ‘విచారిద్దామ’ని వెళ్లారు మా స్వామివారు!'
అంది నంది.
దేవుళ్ళంటే
ఒక్క త్రిమూర్తులే కాదుగదా!
బాపట్ల భావనారాయణ
స్వామివారేమన్నా వివరాలు చెబుతారేమోనని అటుగా వెళ్లాడు అబ్బాయి.
ఆ మధ్యనే ఏదో చిన్నగాలితెర వీస్తే నెత్తిమీది గాలిగోపురంకాస్తా ఠప్పుమని
కూలిపోయిందట! ఆ కుములుడింకా తీరనే లేదేమో! బైటికొచ్చి మొహమే చూపించలేదు నారాయణస్వామి!
శ్రీ కాళహస్తీశ్వరుడిదీ
అదే చేదుఅనుభవం. దర్శనభాగ్యం
కలగలేదు!
'ఏడుకొండలవాడి గుడికి బంగారు తాపడాలేమిటి? చిన్నగుళ్లమీద
చిన్నచూపేమిటి? దేవుళ్లంతా సమానమే అయినప్పుడు ఒక్కోగుడికి ఒక్కో
తీరు కెటాయింపులు.. అన్యాయం! నడవనివ్వం'
అంటూ కొట్లాడేందుకు చిల్లర దేవుళ్లంతా కలిసి కొత్తగా ఓ సంఘం
(చిదేసం) పెట్టుకొనే పనిలో బిజీగా ఉన్నార’న్న సమాచారం అందింది అబ్బాయికి.
'గాలి సోదరుల్లాంటి మాఫియా దెబ్బలకు సుంకాలమ్మల్లాంటి
గ్రామదేవతలకు నిలవనీడా! కరువు కాటకాలతో అల్లాడే చిన్న చితకా జనతా.. ఎక్కడ చిన్నపిల్లలకు కాన్వెంటు బళ్లల్లో ఫ్రీ సీట్లు..పెద్దతలకాయలకు స్టారాసుపత్రుల్లో బెడ్లు అడుగుతారోనని కలల్లోనైనా కనిపించాడానికి జంకుతున్నారయ్యా దేవుళ్లంతా!' అని మళ్లీ నిద్రకు పడ్డాడు పోతురాజు.
గ్రామదేవతలకు నిలవనీడా! కరువు కాటకాలతో అల్లాడే చిన్న చితకా జనతా.. ఎక్కడ చిన్నపిల్లలకు కాన్వెంటు బళ్లల్లో ఫ్రీ సీట్లు..పెద్దతలకాయలకు స్టారాసుపత్రుల్లో బెడ్లు అడుగుతారోనని కలల్లోనైనా కనిపించాడానికి జంకుతున్నారయ్యా దేవుళ్లంతా!' అని మళ్లీ నిద్రకు పడ్డాడు పోతురాజు.
ఒక్క చిన్నదేవుడితోనైనా
మాట కలవకుండానే అబ్బాయి దైవగణన కార్యక్రమం ఆ విధంగా విఫలమయింది.
***
'పెట్రోలు సుంకాలు తగ్గించమని, పచారీ సామాను చవక దుకాణాల్లోనైనా
చవగ్గా ఇప్పించమని, కోతల్లేని కరెంటు కంటిరెప్ప పాటైనా కనికరించమని, నలకలున్నా సరే నాలుగు నిమిషాకు
ఆగకుండా నల్లాల్లో నీళ్లు ధారకట్టాలని.. ఏవేవో
మనం గొంతెమ్మ కోరికలు కడుపులో
పెట్టుకొని వెంటబడితే పాపం..
దేవుళ్లుమాత్రం ఏం చేయగలరూ! దోమలు ‘జైకా' వైరస్సున మోసుకుంటూ ప్రపంచమంతటా ఝామ్మ న
జైత్రయాత్రలు చేసే తరుణంలో
దైవగణనకని బైలుదేరాను చూడూ.. నాదీ బుద్ధితక్కువ!
నా ముక్కోటి దేవతల సందేహం ప్రస్తుతానికి అలాగే పెండింగులో పడిపోయింది బాబాయ్ చివరికి.. ప్చ్!’ అని
నుదురుబాదుకొన్నాడు అబ్బాయి.
'ముక్కోటి ఏం ఖర్మరా పిచ్చోడా! మూడొందల
కోట్లమంది దేవతలున్నారు.. మన చూట్టూతానే! ఆ దేవుళ్ల దగ్గరికి నువ్వసలు వెళ్లనే
లేదు. వెయ్యినోటు చూపిస్తే బొందితో కైలాసానికైనా తోసేస్తామని ప్రకటనలు గుప్పించే బాపతు చిల్లర దేవుళ్ళు.. ఎంత మందున్నారో నీ లెక్కలేం
తేలుస్తాయ్.. అమాయకుడా! ఎన్నికలముందు ‘దేవుడి పాలన’
అందిస్తాం.. 'దేవుడి పాలన' అందిస్తామని మన నేతాశ్రీలు.. ఓహో.. అదేపనిగా హామీలు కుమ్మేస్తుంటారు కదా! ఆ దేవుళ్ళు ఈ దేవుళ్లేరా పిల్లగాడా! ఆ చిల్లర దేవుళ్ల ఆశీర్వాదాలతోనే మనం ఓట్లేసి
గెలిపించే నేతలు మనల్ని తోకున పరిపాలించేస్తున్నది!’ అనేసాడు
బాబాయ్!
***
-కర్లపాలెం హనుమంతరావు
'
No comments:
Post a Comment