కౌగలింత ప్రేమకు సంకేతం. కౌగిలిలో
ఒదిగిన వారికి అంతులేని స్వాంతన లభిస్తుంది.
మంచి ఆరోగ్యానికి అది సంకెతం కూడా. బిగి కౌగిలి బిడియాన్ని సడలిస్తుంది. దూరమైన
మనసుల్ని దగ్గరకు చేరుస్తుంది. దగ్గరి మనుషులకి మరిన్ని ఆత్మీయభావనలు పంచుతుందీ. హృదయంతో
తప్ప .. అక్షరంతో.. స్వరంతో అక్కరపడని పలకరింత
'పరిష్వంగం'. ప్రతీ సంవత్సరం ఈ కౌగిలిని స్మరంచుకుంటూ 'పరిష్వంగ దినం'
రోజుకు కనీసం 8సార్లు కౌగిలించుకోవాలని
విజ్ఞాన శాస్త్రం బోధిస్తుంది. అందుకు అది చెప్పే 10 కారణాలు.
1.
మానసికమైన వత్తిడికి
కౌగిలింత కానీ ఖర్చులేని మంచి యోగాసనం.
కుంగుబాటులో ఉన్నవారికి కౌగిలిని మించిన మంచి నెచ్చలి లేదు, వెచ్చని కౌగిలి
శరరంలోని ఆక్సిటోన్ స్థాయిని పెంచుతుంది. తద్వారా భావోద్వాగాలనుంచి తొందరగా
మనిషిని బైటపడేస్తుంది.
2.
సుదీర్ఘమైన కౌగిలింత
శరరంలోని సెరొటోనిన్ స్థాయినీ పెంచుతుందని.. ఆ
కారణంగా అకారణ భావోద్రేకాలనుంచి బైటపడటం
తేలికవుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
3.
సాంఘికంగా ఆందోళనలో
ఉన్నవారికి దగ్గరివారినుంచి కౌగిలింతలు లభిస్తే సమూహంలో తొందరగా కలిసిపోయేందుకు
సహాయకారిగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు తెలియ చేస్తున్నారు.
4.
మనుషుల మధ్య మాటలతో
సంబంధం లేకుండానే భావాలను పంచుకొనే వారధిగా పనిచేస్తుంది కౌగిలింత. ఇద్దరు
వ్యక్తుల మద్య చెడిన సంబంధాన్ని మాటా పలుకు అవసరం లేని కౌగిలింత తొందరగా చేరువ
చేస్తుందని మానసిక తత్వవేతల అభిప్రాయంగా ఉంది.
5.
బాల్యంలో తల్లి
కౌగిలింతలు.. తండ్రి మురిపింతలు .. తోబుట్టువుల,
స్నేహితుల మధ్య తరచు సంభవించే కౌగిలింతల అనుభవాలు సుషుప్తావస్థలో మధుర భావనులుగా
స్థిరబడిపోయుండంవల్ల.. మనిషి ఎదిగిన
తరువాతా ఆ విధమైన కౌగిలింతల అనుభవానికి లోనయినప్పుడు బాల్యంనాటి ఆ సుమధుర భావనాస్మృతులు మరింత భద్రతా భావనలను పెంచుతాయంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.
6.
గాయమైన సందర్భంలో శరీరానికి
అందే ఆక్సిటోసిన్ వల్ల ఆ బాధ తొందరగా
మాయమవుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఉత్పత్తి కౌగిలింతల్లో కూడా పెరుగుతుందని
పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
7.
హృద్రోగ సంబధమైన
రుగ్మతలకు, అధిక రక్త పీడితులకు సన్నిహుతలనుంచి తరచు లభించే కౌగిలింతలు సత్వర
ఫలితాలిచ్చే ఔషధాల్లా పనిచేస్తాయని ఆరోగ్యనిపుణులూ నిర్ధారిస్తున్నారు.
8.
తెల్లరక్త కణాల
ఉత్పత్తికి కారణమయిన థైమస్ గ్లాండ్ ని కౌగిలింతలు ఉత్తేజపరుస్తాయని.. ఆ కారణంగా
తరచు పరిష్వంగ సౌభాగ్యం లభించే అదృష్టవంతులకు దీర్ఘాయుష్షు అయాచిత వరంగా లభిస్తుందన్నది
వైద్యనిపుణుల అభిప్రాయం కూడా.
9.
క్రోధాన్ని కట్టడి
చేసేందుకు కౌగిలింతలకు మించిన మందు మరోటి లేదని మనస్తత్వ శాస్త్రవేత్తలు నొక్కి చెపుతున్నారు. తరచూ ఆందోళనకు గురయ్యే లక్షణాలున్న వారిని
వీలయినంత తొందరగా శాంతింప చేసేందుకు కౌగిలింతలే మంచి చిట్కా.
10.
ఆఖరుదే అయినా అత్యంత ముఖ్యమైనది. దగ్గరి వారిని
కోల్పోయినప్పుడు, ప్రేమవంటి వ్యవహారాల్లో
విఫలమైనప్పుడు నోటితో చెప్పలేని బాధ గుండెల్ని పిండేస్తుంటుంది. ఆ సందర్భంలో
అనునయించేందుకు దగ్గరికి చేరిన వారికైనా
ఏం మాట్లాడాలో తెలియనంత ఇబ్బందికర స్థితి. సరిగ్గా అల్లాంటి సందర్భాలకోసమే మనిషికి
ఆయాచితంగా దక్కిన గొప్ప వరం కౌగిలింత.
ప్రపంచంలోని అన్ని సంస్కృతుల్లోనూ ఈ
కౌగిలింతల పర్వం ఏదో ఒక రూపంలో బహిరంగ ప్రదర్శనగానే
సాగుతో వస్తోన్నది. భారతీయ సంస్కృతిలో సైతం ప్రేమ
జంటలు ఆంతరంగికంగా సాగించే శృంగార పరిష్వంగాలను మినహాయించి.. తల్లీ బిడ్డల, ఆత్మీయుల,
స్నేహితుల మధ్య సందర్భాన్ని బట్టి సాగే కౌగిలింతల్లో ఎబ్బెట్టుతనం ఏమీ ఉండదు.
ఏదో ఒక మిషతో రోజుకు కనీసం 8 సార్లకు
తగ్గకుండా కౌగిలింతలకు లోనైతే మరో ఖరీదైన జౌషధంతో పనిలేకుండా మనిషి ఆరోగ్యంగా
పనిచేసుకు పోగలడన్నది వైద్య శాస్త్రం సలహా. కౌగిలింతల కారణంగా మానవ జాతికి వనగూడే ప్రయోజనాలను ఏడాదికి ఓసారైనా గుర్తు చేయాలన్న సదుద్దేశంతో ఉద్దేశంతో ప్రతీ ఏడాదీ.. ఫిబ్రవరి 12ని కౌగిలింతల
దినంగా ప్రకటించాయి ప్రభుత్వాలు.
ఆరోగ్యమే మహాభాగ్యమైతే.. అందులో కౌగిలింతలు..
అందమైన ఆనందకరమైన మహద్భాగ్యమైన మందులు.
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment