Showing posts with label Literature. Show all posts
Showing posts with label Literature. Show all posts

Friday, December 24, 2021

కుమారి మొల్ల - కీ.శే. వారణాసి శ్రీనివాసరావు ( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 24-12 - 2012



కుమారి మొల్ల 

- కీ.శే. వారణాసి శ్రీనివాసరావు 

( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012 


పూల మొక్కలు ఉన్న తోటలో నొక కాలుపగట్టున కూర్చున్న నన్ను సమీ

పిస్తూ కుమ్మరి మొల్ల—]

ఏం నాయనా , నన్నాహ్వానించారు? 

నేను: తమరు  నమస్కారం మానేసి, ఏకవచనాన్ని  ప్రయోగిస్తేగాని నేనేమీ మాట్లాడాను.


మొల్ల : అదేవిటి మీరు బ్రాహ్మణులు; మేము కుమ్మర్లం . 


అయితే నేమమ్మా? నాకంటే పెద్దలు అన్ని విధాలా


ఐతే మటుకు  కులమెక్కడికిపోతుంది?


మీరు దణ్ణాలు పెడితే అందుకోవడం, పేర్ల చివర రావు తగిలించుకోవడం, మీ చేత బహువచన ప్రయోగాలు  అందుకోవడం అవన్నీ మీ కాలపు వాళ్లకే తగిపోయింది. మేమేదా పాత కాలపువాండ్లం. మూర్ఖప్రపంచ సంబంధీకులం. మా వ్యక్తిత్వాన్నట్లా ఉండనీయండి .


తమ విషయం నాకు ముచ్చటగా వుంది. కాని ఐనా నా పట్ల, ప్రేమ కోరిన చనువును చూపించండి 


సరే, నీకంత పట్టుదలెందుకు? అల్లాగే కాని, నన్ను పిల్చిన కారణమేమి నాయనా ? .


మీ రాంధ్రంలో కవిత్వం చెప్పారు కదా! 


నన్నూ నా కవిత్వాన్నే చెప్పు శాయనా ! ఆంధ్రంలో కవిత్వం చెప్పి నలుగురి మెప్పు పొందుదామని ఆశ పడ్డ  మొదటి స్త్రీ వ్యక్తిని నేనే అనుకుంటా.  అది నాకేం  పొండత్యం ఉండి కవిత్వం చెబుదామని కాదు .  చిన్నప్పుడు నాకు ఎంతసేపూ  చదువు కుందామని పుండేది. మా వృత్తిలో  త్రిప్పడం కోసం మా అమ్మ కుండలిస్తే  రెండు మూడు సార్లు నా చేతుల్లో పగిలిపోయాయ్. ఆది చూచి మా ఆమ్మ తిడుతూంటే , మా వూళ్లో కొక బ్రాహ్మణ పండితుడు కని పెట్టి నాకు చదువు చెప్తా రమ్మని, కొంత కాలంలో పంచకావ్యాలు వంటపట్టించారు. ఆయన గారికి ఆంధ్రం,భారత, భాగవతాలంటే ప్రాణం. వారు రోజూ చదువుతుంటే వినేదాన్ని. కొంతకాలానికి శ్రీ సరస్వతీ కటాక్షం వల్ల నాకు పద్యాలు రాయడం అలవడ్డది . అప్ప ట్నుంచీ యేకథ వ్రాద్దామా  అనుకుని, రామ కథమీదికి మనస్సు ప్రాకితే దాన్ని వ్రాయడ మారంభించి పూర్తి చేసా. అదే నాయనా  నేను వ్రాసిన గ్రంథం. ఆదేమీ గొప్పదేంకాదు . 


చిత్తం. తమరా గ్రంథం విషయంలో పడ్డ ఆశ నెరవేరలేదా ?


నెరవేరకేం? 


అంటే నాకర్దం గాలా! 


అర్థం కావడానికేముంది నాయనా! నేను ఆడదాన్ని, నా కవిత్వ మంతపటుత్వమైందికాదు .


అదేమిటండీ, ఆడవా  చెప్పిన కవిత్వ మని తప్పక మెచ్చుకోవాలే! 





ఆడది కుండ లోముధోకక విశ్వం చెప్పడ వేమిటి యీ మాత్రం పద్యాలు చెప్పక పోతే భాషకేం పరువుతుందాని మా కాలం లో నోగలవాండ్ల ఊహ. నీవన్న భావం మీ కాలంలో ప్రబలినంత మా కాలంలో ప్రజలలో 1: అదేం మ్యాటండీ? నాయకురాలి వీర త్వం పొగడ్త స్కెలా ?


మొ: నాయనా, ఇది కవిత్వంగా, నాయకు కాలీ ఛైన్యకయి - బ్లాగ నా కవిత్వం మగా కృమము లగూర్చోపెట్టేది కాదుగా, నే: పొరబాటన వాళుకురాలి సంగతి కడివా, స్త్రీ కవనాన్ని సున్నితమైన విషయ


ముగా వెంచకపోవడం పౌరుపలోపం. మొ : ఈ భావాల్నేటివి గాని, వాటివి కావు. 1 అంచేత తమకో స్క్ర్కీ డేర లేదన్నమాట!


వీడేరలా. పామరల్లో డొక్క శుద్ధియైన వాం చింతా అభిమానించి మల్లమ్మ కాగా చిక్కని కజనం కెళ్తారని పొగిడేవారి ఆపా X నాకు రుచిస్తుందా నాయనా : ఎవడైనా పండిత


1: ఓహో ! (కొంచెముండి) నా కిప్పుడర్ధ మౌతూంది. ఆదా రపకు నొప్పి కలిగించింది! కొన్ని శతాబ్దాలైనా యింకా మరపు పుట్టిం చంది ! చిత్తం, నాన్ని మరిచి యింత సేపు తరచినందుకు నన్ను క్షమించండి.


మొః అయితే శేం చివర కాశ్య మాడ్చా రచుకోండి. నేటికి లోపించినపుడలా యెందరున్నా "ముల్లా: చే ఇంత తొందరి బడి నిన్నిట్లాగంటిని !" అని నొచ్చు కుంటారను కోండి ఏం లాభం! అవాళలుగుల్లో తిలకంపు ___లైంది కదా!


సే పోనీందమ్మా! ఎవరో ఒక రఇక పోతే మునిగిపోయింకా, ఆంధ్రలోకమంతా ఏకగ్రీవం గా, మొల్ల రామాయణం కారు టుందంటూంటే!


మొ: ఔననుకోండి! ఆ పధలో వసభ్య వాక్యం బుట్టిందా, లేదా? నే: అనకూడదనుకోండి.


మర్నాడు... మొ : ఆC, ప్రొద్దున్న వచ్ళారు: కూర్చ న్నారు: చదువిస్తున్నారు. అన్నిపొవాదులు మరచి సాయంత్రం దాకా కూర్చుని విన్నారు. ఏమైనా ఆడదాన్నని అంత నిరసన చేసారు.


కాలంలో మావాళ్ళు మగాళ్లకు మల్లే పర్వివిష యాల్లో శక్తి మంతుల మని నిరూపించారు. అంక పని మేము చేయలేకపోలా కాలానికి మా కమః సంఘసారానికి కట్టుబడ్డాంకాని, అప్ప కీమాందరు శ్రీ రాక్రమా దేవి ఝాన్సీ och మ్మభాయంటివారు కొంత సాహసించారు...


నే తనురేదో రెండు పేర్లుమాత్రమే చెప్పారు. ప్రపంచచరిత్ర పరిశీలిస్తే పేరో గిన కాంతామణులు కొన్ని వేలమందుటారేమో?! అంతవరకెందుకు? తెల్లాళ్ళ సిద్ధాంతా ల్నిజ ‘మైతే మానససంఘంలో నో ప్రథమం లో సర్వాధి కారు డవాండ్ల దేమో ! తిమరుస్వర్గంలో • ముంటారుకదా! వారిలో పర్వహ • రంటారు. • వాల్లోనే పెద్ద పై నా అడిక్కనం క్కోకపొయ్యారా?


మొ: మీ కీవాం ధుండడం సహజమే కాని ఆ దీడిగడానికొక్క అభ్యంరముఁది, వారంతా పర్వజ్ఞరేగాని వార్లో చెవర్నైనా పలకరించే వీలుందా ? అట్లాటిరేకై నా వార్లో నెవరినై నా కదిలించడంతో లే చిరు నవ్వు నవ్వి మరొక విషయ మెత్తుతారు. నా రెంట సేపటి కీ మానవులు - తమకు భగవంతుడు కటాక్షించిన శక్తిసామర్థ్యా లతో సకలము తెలుసుకొన బ్రయత్నించాలని వుంటుందనుకుంటా. అట్లా లేకుం ప్రేమన కున్న యే కొద్దిపాటు ప్రేమలో పూర్తైం తర్వాత మనకు కాలక్షేపమెటాగా అని ఊహిస్తా దనుకుంటా. ఆటాటివిషయాలు మా కెవరి కైజా తెలిపితే మే మీరోకారికి రాకపోక


మనము అంటూంటాం. (ఆకాశంనుండి) మొల్లా, శచీదేవి గారి


: ఆరురంతో రేచి) వాయశా (నిష్క్రమణ) సే ఆరే! మిగతా వారంతా కొంత తనివి తీక మాట్లాడిజిల్లా రీమెగా రుహశాత్తు గా వెళ్లారు. పోనీ, ఐనా మన మనిగాల్సిన విక చే మున్నాయీ మెను ? పాప మేవో కవిత్వం చెప్పాగుకాని తా మెన్నడు నే విషయంలోనూ ఘనుల మనుకోలా. సరే, యింకా కవులలో నెదరు మిగి లున్నారు. మిగులకేం! చాలామం దున్నారు కాని, పైవారి పంధల పడిచిన వారేగాని వారిలో స్వతంత్రం లెక్టరూ కాన్పిం చరు, మన కాలంలో వారిని కదిలిద్దా మెంటే లాభం లేదు; పైనబడి కరుస్తారు; కొడ్తారు. కూడాను — లేకపోతే పాకిపాడొ వారి లక్ష ణాన్ని గ్రహించి పొడిర్భంపినా చంపుతారు. వీరు మనల్ను ఏదిబడితే అదడి మాత్రంవాడా అని. అకొక నేనెట్టెను కదిలించినట్లవుతుందినేని దొరకదన్న మాట. సరే ఇక చక్రవర్తుల వాప్వోసిద్దాం. ఇంఠతో ఆగుదాం. ఇంకోసారి ఎప్పుడైనా?


( ఆంధ్రపత్రిక- 1948, జనవరి 14 - సంచిక నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

24-12 - 2012

బోథెల్‌; యూ. ఎస్.ఎ

Sunday, December 19, 2021

నేటి కాలపు కవిత్వం - పై సంపాదకీయం- చేకూరి రామారావు


















 

నేటి కాలపు కవిత్వం - పై 


సంపాదకీయం


"దేశంలో భారతీయ సంస్కార ప్రవాహాలు ఇంకిపోయినవి. విద్యాపీఠాలు అస్తమించినవి. గురుకులాలు రూపు మాసినవి. భారతీయ సంస్కారం లేని కేవల పాశ్చాత్య సంస్కారం బలప్రదం కాక ఆత్మ విముఖత్వాన్ని, పర సంస్కార దాస్యాన్ని మనకు ఆపాదించినవి"


ఈ పుస్తకం చివర రాసిన పైమాటల్లో అక్కిరాజు ఉమాకాంతం (1889-1942)గారి సర్వసాహిత్య కృషి నేపథ్య సారాంశం తెలుస్తుంది. ఆయన జీవించింది 53 సంవత్సరాలే అయినా అమోఘమైన పాండిత్యంతో, అసమాన వాదపటిమతో, అవిచ్ఛిన్న సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకు పోయిన విశ్వాసాలను కుదిపి వేసిన సాంస్కృతిక విప్లవకారుడు అక్కిరాజు ఉమాకాంతం గారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోటానికి ఆయన జీవిత చరిత్ర ఎవరూ రాయలేదు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు గారి శత జయంతి సంపుటం (1986) లో "త్రిలిఙ్గ తొలినాళ్ళ సంపాదకులు ఉమాకాంత విద్యా శేఖరులు" అనే పేరుతో అక్కిరాజు రమాపతి రావుగారి అయిదు పేజీలు చిరు వ్యాసమూ తెలుగు విజ్ఞాన సర్వస్వమ మూడవ సంపుటంగా వచ్చిన 'తెలుగు సంస్కృతి' అనే వాల్యూమ (1959) లో అబ్బూరి రామకృష్ణారావుగారి ఒక పేజీకి మించని చిన్న నోటూ మాత్రమే ప్రధాన ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.


అక్కిరాజు ఉమాకాంతంగారు గుంటూరు జిల్లా పల్నాడు తాలుకా గుత్తికొండ అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుత్తికొండకు సుమారు ఏడెనిమిది మైళ్ళ



X


దూరంలో ఉన్న జానపాడు అనే ఊళ్ళో సంస్కృత భాషాభ్యాసం చేశారు. శిష్ట్లా సీతాకాంతశాస్త్రి గారు వీరి గురువుగారు. ప్రస్తుత గ్రంథంలో మొదటి శ్లోకంలో వారి ప్రస్తావన ఉంది. పదిహేను పదహారేళ్ళ వయసులో గుంటూరు లూథరన్ మిషన్ వారి హైస్కూలులో ఇంగ్లీషు చదువులు చదివారు. మెట్రిక్యులేషన్ చదివే రోజుల్లో ఈయన శతావధానం చేశారు. బెజవాడలో కన్యకా పరమేశ్వరి హిందూ పాఠశాలలో కొన్నాళ్ళు తెలుగు పండితులుగా ఉద్యోగం చేశారు. 1912 లో తెరచిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు మద్రాసు కార్యాలయంలో జయంతి రామయ్యగారి ఆహ్వానంపై కొన్నాళ్ళు మేనేజరుగా పనిచేశారు. వేషధారణపై వచ్చిన పేచీ వల్ల ఉమాకాంతంగారు ఉద్యోగం మానేసినట్లు రమాపతి రావుగారు పైన పేర్కొన్న వ్యాసంలో రాశారు. ఈయన బెంగాల్లో నవద్వీప సంప్రదాయాన్ననుసరించి భాష్యాంతముగా సంస్కృత వ్యాకరణమూ, తర్కశాస్త్రమూ, అభ్యసించి 'విద్యాశేఖరు' లైనా రని అబ్బూరి రామకృష్ణారావుగారు రాశారు. "తమ తర్క వ్యాకరణ విద్యా వ్యాసంగాన్ని వంగ దేశంలో జరుపుతూ వచ్చారు; వంగ సాహిత్య వేత్తలతో సాహచర్యం వల్లా, లోకజ్ఞానం వల్లా, స్వానుభవం వల్లా, వంగ సాహిత్యాభ్యుదయానికి గల కారణాలను వివేకంతో సూక్ష్మంగా పరిశీలించడం వల్లా తమకు కలిగిన జ్ఞానాన్ని ఆధారంగా తీసికొని తమ మాతృభాష అయిన తెనుగును పరామర్శించడం ఆరంభించారు" అని అన్నారాయన. ఆయన వావిలి కొలను సుబ్బారావుగారి తరవాత (1929లో) మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1913-1914 మధ్య కాలంలో త్రిలిఙ్గ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. 'త్రిలిఙ్గ' అనే పేరు ఆయన పెట్టిందేనని త్రిలిఙ్గ రజతోత్సవ సంచిక (1941) కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశంలో ఇంగ్లీషులో కామెంటు (comment) అనే మాటకు పర్యాయంగా వ్యాఖ్యా శబ్దాన్ని పరీక్ష పత్రాల్లో తానే మొదట వాడినట్టు పేర్కొన్నారు.


1913-1014 సంతురాల లో ఆయన శిబి




అయ్యాయి. ఉమాకాంతం గారు తమ కథల పీఠికలో 'ఇట్టి కథల వాఙ్మయము తెలుగునకు కొత్తది' అని గుర్తించారు. అప్పటి కాయన రచనాశైలి ప్రాచీన భాషకు సన్నిహితం. సంధి నియమాలను సడలించి ఆధునిక రచనాభాషను ఏర్పరచటానికి ఉమాకాంతం గారు కూడా కృషి చేసినట్టు ఈ సంపుటం ద్వారా తెలుసుకోవచ్చు. ఈయన కథల్లో కూడా తొలినాటి ఇతరుల కథల్లో లాగే లక్ష్యం సాఘిక సంస్కరణే. మూఢ విశ్వాసాల నిర్మూలనే బ్రాహ్మణ సమాజంలో పాదుకొన్న మూఢ విశ్వాసాల వల్ల స్త్రీల బతుకుల్లో ఉన్న బాధల్ని వివిధ రీతుల్లో ఈ కథల్లో వర్ణిస్తారు.


ఈ కథల్లో 'ఎదుగని బిడ్డ' ఆంధ్ర సాహిత్యాన్ని కన్న తెలుగుతల్లి ఉత్తమ పురుషలో చెప్పిన కథ. చివరివరకు ఎలిగొరీ అనే కథా శిల్పాన్ని పాటించిన ఈ కథలో 'ఆంధ్ర సాహిత్యం ఎప్పుడూ ఎదగని బిడ్డయే' అని తమ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు. సుమారు పాతికేళ్ళ ప్రాయంనుంచి ఆయనకు తెలుగు సాహిత్యంపై సదభిప్రాయం లేనట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవచ్చు. అదల్లా ఉంచి ఎలిగొరీ పద్ధతిలో ఉత్తమ పురుష కథనంలో రాసిన మొదటి తెలుగు కథ ఇదే కావచ్చు.


తెలుగు సాహిత్యంలో అభివృద్ధి కాని నూతన ప్రక్రియలను అభివృద్ధి చెయ్యాలనే ఆకాంక్ష ఆయనకు గాఢంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ కోరికే ఆయన చేత చిన్న కథలను రాయించింది. ఫిలిప్ మెడోస్ టైలరు (Philip Meadoues Tailor, 1808-1876) అనే ఆంగ్ల నవలా కారుడు రచించిన టిప్పు సుల్తాన్ నవలను ఆంధ్రీకరించి 1912 నవంబరులో ప్రకటించారు. ఈ నవల పీఠికలో కూడా ఆంధ్ర సాహిత్య స్థితిని గూర్చిన చర్చ ఉంది. టైలరు హైందవ సంప్రదాయాభిమాని కావటం వల్ల అతని రచనను తెలిగించానని ఉమాకాంతం గారు పీఠికలో చెప్పుకున్నారు.




'ఉమాకాంతం గారు 1921 లో తెలుగు దేశ వాఙ్మయ పత్రికను స్థాపించి సంస్కృత వ్యాకరణ ప్రదీపం, పాణినీయ ఆంధ్ర వివరణం. రసమీమాంస, నైషధ తత్వ జిజ్ఞాస వంటి ప్రశస్త రచనలు వెలువరించారు' అని అక్కిరాజు రమాపతి రావుగారు రాశారు.


'లౌకిక దృష్టితో చెప్పుకోదగిన సంఘటన లేవీ ఆయన జీవితంలో లేవు. పాండిత్యానికి తగిన శరీర దార్థ్యం ఆయన కెన్నడూ లేకపోయింది.' అని అబ్బూరి రామకృష్ణారావు తెలుగు విజ్ఞాన సర్వస్వంలో అన్నారు.


ఉమాకాంతంగారి రచనలపై సమగ్ర సమీక్ష జరగలేదు. సంపూర్ణమైన అంచనా రాలేదు. ఆయన రచనలు దొరికినంత వరకూ (అన్నీ దొరకవు) పరిశీలిస్తే ఆయనకు తెలుగు సాహిత్యంపై నిర్దిష్టమైన అభిప్రాయాలు, విలక్షణమైన ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన రచనలన్నింటా తెలుగు సాహిత్య స్థితిని గూర్చి ఆవేదన కనిపిస్తుంది. ప్రచురణ వివరాలు దొరకలేదు గాని రమాపతి రావుగారి సౌజన్యం వల్ల ఆయన చిన్న చిన్న వ్యాసాలు కొన్ని దొరికాయి.


సాంఘికంగా ఆయనకు అభివృద్ధికర భావాలే ఉన్నట్టు. సాంఘిక సంస్కరణలకు ఆయన అనుకూలుడే అయినట్టూ ఆయన కథలను బట్టేకాక ఆయన విడివిడి వ్యాసాలనుబట్టి కూడా చెప్పవచ్చు. 'తెలుగు దేశము నందలి చండాలురు' అనే వ్యాసంలో "చండాలురని చెప్పుటకు ఏ ప్రమాణమూ లేని మాదుగులను, ఆంధ్రదేశము నందలి మొదటి తెగలగు చెంచులు బలిజెలు మొదలైన వారివంటి మాదుగులను అస్పృశ్యులుగా బాధించుచున్నాము. ఊళ్ళనుండి బయటికి వెళ్ళగొట్టినాము. బావుల వద్దకు రానీయము. దేవాలయములలో ప్రవేశించనీయము. ఇంతకంటే తెలుగు దేశము ఆచరించుచున్న అధర్మము మఱియొకటి లేదు. ఈ దురాచారము అప్రామాణికమైనది అనర్ధహేతువైనది అని చెప్పుచున్నాను' అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.



విదేశయానం చేసినందుకు నడింపల్లి నరసింహారావు గారిపై తెచ్చిన అభియోగానికి ఉమాకాంతం గారు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. దాన్ని ఒక విమర్శన వ్యాసంగా రాస్తూ సముద్రయానం చెయ్యటం వల్ల పతితుడవుతాడనటానికి శాస్త్ర ప్రమాణం లేదని నిరూపించారు.


ఉమాకాంతం గారు సాహిత్యాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఎంతటి గొప్పవారి అభిప్రాయాలను ఖండించటానికైనా వెనుదీసే వారు కాదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో 1923 సంవత్సరానికి పెట్టిన పురాణపండ మల్లయ్య శాస్త్రిగారి శుక్రనీతిని విమర్శిస్తూ.'బ్రదిమి ఏనిక, దిగ్గియ ఒండె. ఉలుపా, ఎకిమీడు' వంటి పాతపడ్డ మాటలను వాడటాన్ని నిరసించారు. ఆ పుస్తకానికి యోగ్యతా పత్ర మిచ్చిన జయంతి రామయ్య గారి స్వవచో వ్యాఘాతాలను ప్రదర్శించారు.


ఇంగ్లీషు పాఠ్య నిర్ణాయక సంఘంలో ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లీషు బోధించే వారిని వేసి, తెలుగు పాఠ్య నిర్ణాయక సంఘంలో తెలుగు బోధకులను వేయక పోవటాన్ని నిరసించారు.


విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన సభలో వేదం వెంకటరాయశాస్త్రిగారు. కట్టమంచి రామలింగా రెడ్డిగారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తీవ్రంగా విభేదిస్తూ వాఙ్మయపత్రికలో వ్యాసాలు రాశారు. ఆముక్త మాల్యదలో చాలా గొట్టుమాటలున్నాయి కాబట్టి అది గొప్ప కావ్యం అయినట్టు వేదం వెంకటరాయశాస్త్రి గారన్నారని చెపుతూ ఆ మాటలందు నాకు ప్రమాణ బుద్ధి కలగలేదు అన్నారు. మను చరిత్రలో రసాభాస ఉన్నది కాబట్టి దాన్ని మంచి కావ్యం కాదన గూడదన్నారు (అంతమాత్రం చేత మను చరిత్ర ఉత్తమ కావ్యమనికాదు. ఇతర కారణాలు చూపించాలని ఆయన అభిప్రాయం.) రసాభాస నిషిద్ధం కాదని అది అంగంగా ఉండవచ్చునని సిద్ధాంతం చేశారు. ఇంతకీ మనుచరిత్రలో ఉన్నది రసాభాసకాదని, వరూధిని కది వాస్తవమేనని వాదించారు. సందర్భంలోనే మనుచరిత్రను పెద్దన రచించ లేదనీ, కృష్ణరాయలు



విమర్శిస్తూ "కృష్ణరాయలు రచించిన కృష్ణశ్రేష్ఠి రచించినా. కృష్ణామాత్యుడు రచించినా, కృష్ణ భట్టు రచించిన పుస్తకములోని మంచి చెడ్డలు మారవు గనుక ఆ విచారణ నేనిక్కడ పెట్టుకోలేదు" అని వస్తుగత విమర్శ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.


కట్టమంచి రామలింగా రెడ్డిగారు మద్రాసు గోక్లేహాల్లో ఇచ్చిన ఉపన్యాసాన్ని పత్రికల్లో చదివి వాఙ్మయ పత్రికలో విమర్శించారు. రామాయణం కంటే భారతం ప్రాచీనం అని రెడ్డిగారా ఉపన్యాసంలో చెప్పారు. భారతం కావ్యంకాదు. సంహిత అని రెడ్డిగారన్నారు. భారతం కావ్యమేనని, భారతం కంటే రామాయణం పూర్వమనే ఉపపత్తులను ప్రదర్శిస్తూ ఉమాకాంతం గారు వాదించారు. ఆ సందర్భంగా "వాస్తవముగా సంఘమును సంస్కరింపవచ్చును. సర్వసమత్వము ప్రతిష్ఠించ యత్నించవచ్చును. వీటికన్నిటికి రామలింగా రెడ్డిగారు మరికొన్ని మార్గములు అవలంబించ వలసియున్నది గాని భారత వర్షేతిహాసములను గురించి భారతీయుల ప్రాచీన వాఙ్మయము గురించి తెలిసీ తెలియని మాటలు మాట్లాడుట మాత్రము అనుచితమైన కార్యము" అని స్పష్టంగా నిర్భయంగా ప్రకటించారు.


'నైషధ తత్త్వ జిజ్ఞాస' అనేది సంస్కృత నైషధ కావ్యంపై విమర్శ. శ్రీహర్షుని మేధాశక్తిని, పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే నైషధము ఉత్తమ కావ్యము కాదని తేల్చారు. శ్రీహర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చినదని, కావ్య గుణం తగ్గిందని వివరించారు. "అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము, గొప్ప కవిత్వము కుంటువడిన సమయము" అని అభిప్రాయ పడ్డారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ "ఏనాడు అర్ధము హస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాధీనతను ప్రాపించెను... ఆర్య సంప్రదాయములు క్రమక్రమముగా విచ్ఛిన్నము లాయెను. మహమ్మదీయుల విషయ లోలత్వము దేశమున వ్యాపింప జొచ్చెను." అని దేశపరిస్థితులను వివరించారు. భారతదేశ సాంస్కృతిక పతనానికి మహమ్మదీయులు కారణంగా భావించే ఒక ఆలోచనా ధోరణి మన దేశంలో చాలా కాలంగా ఉన్నది.



అక్కిరాజు ఉమాకాంతం గారి సంస్కృత భాషా పాండిత్యం, ప్రాచీన భారత సంస్కృతిపై ఆయనకున్న అభిమానం ఎరిగిన వారికి ఆయన ఈ ఆలోచనారీతి ఆశ్చర్యకరం కాదు. హిందువులలో సంస్కరణ లాయన కిష్టమే. మహమ్మదీయుల విషయములో ఆయనపై ఆర్య సమాజపు ఆలోచనా ధోరణి ప్రభావం ఉండి ఉండవచ్చును.


గుంటూరు జిల్లా కారెంపూడిలో 1928 జూన్ 9 న జరిగిన సభలో చేసిన ఉపన్యాసం 'ఆంధ్ర భాషోపన్యాసం' గా అచ్చయింది. అందులో "నాకు దేశ భాషోద్యమంలో విశ్వాసంగలదు. విజ్ఞాన వ్యాప్తి దేశ భాషయందు వలె అన్య భాషయందు జరుగ నేరదు" అన్నారు. తదనుగుణంగా సంస్కృత గ్రంథాలను తెలిగించారు. సంస్కృత చంద్రా లోకాన్ని తెలుగు వచనంలో అనువదించారు. పాణినీయాన్ని తెలుగు చేసినట్టు తెలుస్తున్నది. 'పాణినీయము సాంధ్ర వివరణము' పేరుతో 9 సంచికల సంపుటంలో గట్టి బైండుతో వచ్చినట్టు ప్రకటన ఉంది. సంస్కృత వ్యాకరణ ప్రదీపము కారకం వరకు రచించినట్టు కూడా అదే ప్రకటనలో ఉంది. ఉమాకాంతంగారికి ఎక్కువ పేరు తెచ్చి పెట్టినవి ఆయన పరిష్కరించి ముద్రించిన పల్నాటి వీరచరిత్ర (1911, 1938) నేటి కాలపు కవిత్వం (1928).


పల్నాటి వీర చరిత్ర మొదటి ముద్రణకు రచించిన పీఠికలో అమూల్యమైన చారిత్రకాంశాలను పొందుపరిచారు. ఇతిహాసాలను గురించి, పల్నాడు గురించి, శ్రీనాథుని గురించి ఎనభైరెండు పేజీల విపుల చారిత్రక భూమిక ఇది. దాని సారాంశాన్ని ఇంగ్లీషులో ఐదు పేజీల్లో చెప్పారు. డెబ్భైమూడు పేజీల ద్వితీయ భూమిక (1938) లో 3 తెలుగు సాహిత్యంపై తమకున్న అభిప్రాయాల్ని వివరించారు. రెండో పీఠికకు ముందే నేటి కాలపు కవిత్వం వచ్చింది. ఈ రెంటిలోనూ పూర్తిగా తర్కపద్ధతి అవలంబించారు. ఏ విషయాన్నెత్తుకున్నా సమగ్రంగా చర్చించటం ఆయనకు అలవాటు. అందువల్ల ఆయన పీఠికల్లోనూ వ్యాసాల్లోనూ విషయాన్ని విస్మరించి ఏవేవో మాట్లాడుతున్నట్టనిపించినా అవన్నీ విజ్ఞాన వికాస హేతువు 9 of 22 టం విశేషం. ఈ రెండో పీఠికలో



"పల్నాటి వీర చరిత్రను విచారించడానికి పూర్వం తెలుగు వాఙ్మయాన్ని గురించి క్లుప్తంగా తెలుపుతాను" అని ప్రారంభించి తెలుగు సాహిత్యాన్ని గురించి తమ విలక్షణాభిప్రాయాలను వ్యక్త పరచారు.


"మూలం యొక్క స్వరూపం అవికలంగా భాషాంతరంలో తెలపడమే అనువాదానికి పరమ ప్రయోజనం. నన్నయాదులవి అనుచితానువాదాలు" అని ఆంధ్ర భారతాది గ్రంథాలను విమర్శించారు. తెలుగు ఎప్పుడూ ఉత్తమ విద్యాద్వారంగా ఉండలేదు కాబట్టి తెలుగు అభివృద్ధి కాలేదన్నారు. తెలుగు కావ్యాలు అధమాధికారులకే అని ఉమాకాంతంగారి అభిప్రాయం. ఆ స్థితి మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చిన తరువాత కూడ మారలేదని ఆనాటి తెలుగు పాఠ్యాదీతర గ్రంథాలనుంచి అధికంగా ఉదాహరించారు. శబ్దరత్నాకరంలో 'సఖుడు' అకారాంత పుంలింగం అనటాన్ని విమర్శిస్తూ అది ఇకారాంత పుంలింగం అనే విషయంగూడా ఈ పీఠికలో ప్రస్తావించారు. సంస్కృతం సరిగ్గా రాని రచయితలను ఆక్షేపిస్తూ వారిని దూడ పేడ సంస్కృతం వారని ఆక్షేపించారు. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, చిలుకూరి నారాయణ రావు వంటి పండితుల రచనల్లోని దోషాలను కూడా చూపించారు.


ఉత్తమ సంస్కృత కావ్యాలను తెలుగులో తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆయన రఘువంశానువాదం తల పెట్టినట్టు కనిపిస్తుంది. ఆయన రఘువంశ పీఠికలో --


అక్షరమ్ముల ఆట కవితగ


పెంటకుప్పల జేసి కృతులను చిందు దొక్కెడి వారి గంతులు


చిన్న పిల్లల వేడుక.


అన్నారు. ఉమాకాంతంగారి అభిప్రాయాలను ఆయన సహచరులు "దశోపదేశిగా" సంగ్రహించారు. వాటిని ఇక్కడ తిరగరాస్తున్నాను.


1. గద్యంలో లేని విశేషం పద్యానికి ఛందస్సు సమకూర్చగలిగినది గతి మనోజ్ఞత.


2. అది గణాల ఆరోహణావరోహణల వల్లనే సిద్ధిస్తున్నది.


అక్షర వినోదం (వళిప్రాసలు) శబ్దాలంకారాల్లో చేరినది. శబ్దాలంకారాలు అలంకారశాస్త్రంలోనివి. 4.


3.


5. శబ్దాలంకారాలు స్వయంగా ఆపతితమైతేనే తప్ప ఆవశ్యకంగా స్వీకార్యం కావని, వీటిని ప్రధానంగా స్వీకరిస్తే కావ్యం అధమ మవుతుందని సాహిత్య వేత్తల మతం.


6. ఇద్దరన్, మానుగ. అనఘ, అమల, ఓలి. ఒగి, పరుగు, చెన్నుగ యిట్లాటి దండగ చెత్తకు లేదా యతి భంగానికి హేతువై అనర్ధ ప్రదం కావటం వల్ల అక్షరాల ఆట (వళి ప్రాసలు) ఆవశ్యకంగా ఉపాదేయంకాదు.


7. యతి అంటే విచ్చేదం వారింద్రియ విశ్రాంతిని, శ్రావ్యతను, పద్యం యొక్క సుపఠత్వ, రమ్యత్వాలను సిద్ధింప చేస్తుంది గనుక దీర్ఘ పాదాల్లో మధ్య యతీ సర్వత్ర పాదాంత యతీ నియతం.


8. పద్యం గానీ, పద్యాలు గానీ, శీఘ్రంగా గాని, విలంబంగా గాని అల్లిన మాత్రాన పద్యకర్త అవుతాడు. కవి కానేరడు. విజ్ఞానశాలి కానేరడు. విద్వదోషుల్లో శాస్త్రాభ్యాసజన్యం విజ్ఞానం.


9. జన్మాంతర సంస్కార రూపమైన ప్రతిభ విద్వదోష్ఠుల్లో ఉత్తమ విజ్ఞాన లబ్ధి, చరాచరలోకప్రభావ పరిశీలనం. కావ్యజ్ఞ శిక్ష కావ్యత్వహేతువని మమ్మటుడు.


10. పద్యరూపానగాని గద్య రూపాన గాని అనువాదం చేస్తే అనువాది కాగలడుగాని కవి కాజాలడు. రసభావ నిష్పాదక మైన సృష్టికి సంబంధించినది కవిత. కొంత తీసివేసి కొంతచేర్చి అనువాదం చేస్తే అప్రశస్తాను వాది. అనూదిత కావ్యంలో సృష్టి విశేషాదులు అనువాదివి కాజాలవని స్పష్టం.


వీటి ఆధారంగా ఆయన అనుయాయులు కొందరు అనువాదాలు సాగించి ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేసినట్టు కొమరవోలు చంద్రశేఖర మంత్రిగారు ప్రకటించిన లక్ష్యఖండం (1937) వల్ల తెలుస్తుంది. ఉమాకాంతం గారి లక్షణాలకు వీరు రచించినవి లక్ష్యాలని వీరుద్దేశించి



నట్టు 'లక్ష్యఖండం' అనే పేరు పెట్టడం లోనే తెలుస్తున్నది. ఉమాకాంతం గారు రఘువంశ పీఠికలో --


మూలమున లేనట్టిదానిని వ్రాయననపేక్షితము చెప్పను అన్న నాథుని మాట దలచగ అర్హుడనొ కానో!


అన్నారు. 'మూలంలో లేనిది చెప్పను. మూలంలో ఉద్దేశించనిది కూడా చెప్పను'. అన్న మల్లినాథసూరి మాట తల్చుకున్నారు. ఆయన్ననుసరించి ఆలంపూరు కృష్ణస్వామిగారు


'వదలి మూలస్థమ్ము లేనిది కుక్కి అనువాదమ్ము చేసెడి అజ్ఞ మార్గము తొలగిపోవుత నాకు గురువుల కరుణచే' అన్నారు


ఇక్కడ 'గురువులు' అనే మాటలో ఉమాకాంతం గారిని ఉద్దేశించినట్టు భావించవచ్చు.


ఈ మార్గం లోనే కన్నెకంటి ప్రభులింగాచార్యులు గారు కాళిదాసు కుమార సంభవాన్ని అనువదిస్తూ


ఆర్ష భూయస్త్వోత్తమములగు కాళిదాస కవిత్వనిధులను మా కొసంగిన మల్లినాథా! నిన్ను వినుతింతు


అని మల్లి నాథుని ప్రశంసించి -- విడువగా రాదున్నదానిని లేనిదానిని కుక్కగూడదు ఇదియె అనువాదాలు తెరువను ప్రవచనమ్ము తలంచెదన్.



ఉమాకాంతం


అని అనువాద పునరుద్ఘాటించారు. విధానంలో గారి మార్గాన్ని


ఉమాకాంతం గారు, వారి అనుయాయులు ఈ అభిప్రాయాలను ప్రచారం చేశారు. సంస్కృత వృత్తాలతో పాటు తెలుగు పద్యాలను కూడా వర్ణమైత్రి లేకుండా ప్రయోగించారు. గీతాది లఘు పద్యాలకు పాదాంత విరతిని మాత్రమే నియమంగా పాటించారు. పెద్ద పద్యాలలో పాదమధ్య విరతిని కూడా పాటించారు.


వీరంతా ముత్యాల సరాన్ని ఆదరించడం చారిత్రకంగా గుర్తించ దగిన ఒక విశేషం. అయితే వీరి రచనల్లో ఎక్కడా గురజాడ అప్పారావుగారిని విరివిగా స్మరించినట్టు గాని (ఈ పుస్తకంలో ఒక్క చోట తప్ప) ముత్యాలసరం పేరును ప్రస్తావించినట్టు గాని కనపడదు. అయినా ముత్యాల సరాలను ధారాళంగా వాడారు. అదీ గురజాడ పద్ధతిలోనే. యతి ప్రాసలు నియమాలుగా కాక అలంకారాలుగా మాత్రమే పరిగణించిన అప్పారావు గారి మార్గం, ఉమాకాంతం గారికి నచ్చినట్టు భావించవచ్చు. భావకవులకూ, ఉమాకాంతంగారికీ ముత్యాల సరం విషయంలో మాత్రం ఏకీభావం కనిపిస్తుంది. భావకవుల్లో రాయప్రోలు సుబ్బారావుగారు తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగారి వంటివారు వర్ణమైత్రీయుత వళినిగాని ప్రాసనుగాని ముత్యాల సరాల్లో కూడా పాటించారు. కృష్ణశాస్త్రి గారి ముత్యాల సరాల్లో వర్ణమైత్రి లేనివి కనిపిస్తాయి.


ఉమాకాంతం గారు ఆంధ్ర వాఙ్మయాన్ని అంతటినీ సూత్ర పద్ధతిలో చెప్పదల్చుకున్నారు. ఆ సూత్రాలకు మళ్ళీతానే భాష్యం చెప్పదల్చుకున్నారు. అయితే చెయ్యదల్చుకున్నవన్నీ చెయ్యటానికి జీవితం చాలింది కాదు. వాఙ్మయదర్శనము పేరుతో 'ప్రాచీన ఖండా'న్ని తొమ్మిది భాగాలు (ఆలోకములు) గా సూత్ర పద్ధతిలో రచించారు. ఈ సూత్రాలు గ్రాంథిక భాష (కావ్య భాష) లో ఉన్నాయి. ఈ సూత్రాలు చూస్తే చాలా విస్తృత ప్రణాళికనే వేసుకున్నట్టు తెలుస్తుంది. భాష్యం



లేకపోయినా, ఉమాకాంతంగారి వాఙ్మయ దృష్టిని అర్థం చేసుకోటానికి ఈ వాఙ్మయ దర్శన సూత్రాలు ఉపయోగపడతాయి. ద్వితీయాలోకంలో


1. అభారతీయము గనుక 2. సంప్రదాయ విచ్ఛేదము గనుక 3. త్యాజ్యము క్రీస్తు శకము 4. ఆత్మీయము గనుక 5. అఖండ కాలదర్శన సాధనము గనుక 6.శ్రుతి, స్మృతి పురాణేతిహాస దేశీయ కథాదులనుండి అవిచ్ఛిన్నత్వము ప్రతిపాదించును గనుక 7. సంప్రదాయ సిద్ధము గనుక 8. గ్రాహ్యము కలిశకము 9. అవిశేషము వల్ల కలిశకము కృష్ణ శకమని 10. అంతర్భూతము గనుక శాలివాహనము పాక్షికముపధ


ఉమాకాంతంగారు క్రీస్తు శకాన్ని కూడా గుర్తించని సంప్రదాయ ప్రియుడు. ఆయన తన పీఠికల కిందా ముద్రించిన రచనల పైనా శాలివాహన శకాన్నే వేసేవారు.


ఉమాకాంతంగారు వాఙ్మయ దర్శనంలో భారతీయ సంస్కారాదుల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. ఇది కాక వేరే ఇంకా ప్రాచీనాంధ్ర వాఙ్మయ సూత్రాల గురించి ఏమైనా రాశారేమో తెలీదు. 'నేటి కాలపు కవిత్వం' అని నామాంతరం ఉన్న ఈ వాఙ్మయ సూత్ర పరిశిష్ట భాష్యంలో మూడు అధ్యాయాలలో ఆధునికాంధ్ర వాఙ్మయాన్ని సూత్రీకరించారు. అందులో మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. దాన్ని మాత్రమే విపులీకరించారు. నేటికాలపు కృతి రచన, నేటికాలపు విద్య అనే అధ్యాయాలు సూత్ర రూపంలోనే ఉన్నాయి. భాష్యం రాయలేదు. ఈ పరిశీష్టాన్ని ఆలోకనాలు అనకుండా అధ్యాయాలుగా విభజించటం వల్ల వాఙ్మయ దర్శనం కన్నా భిన్నమైన వాఙ్మయ సూత్రాలు అనే గ్రంథాన్ని రాసినట్టుగానో, కనీసం రాయ తలపెట్టినట్టు గానో ఊహించాలి. అయితే మనకు పూర్తిగా భాష్య రూపంలో దొరుకుతున్నది ఈ పరిశిష్ట సూత్ర భాష్య రూపమే(అదీ మొదటి అధ్యాయమే). మొదటి సారి వావిళ్ళ ప్రచురణగా 1928 లో వెలువడింది.


ఉమాకాంతం గారు ఈ పుస్తకంలో ప్రధానంగా భావకవిత్వం


పేరుతో ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు.



తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనాన్ని రేపిన గ్రంథం ఇది. "కాని వారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానేలేదనే అనుకోవలసి వస్తోంది" అని అబ్బూరి రామకృష్ణారావు గారన్నారు. "మహాపండితులైన ఉమాకాంతం విమర్శలకు ఆనాడెవరూ జవాబు చెప్పలేక పోయారు" అని శ్రీశ్రీగారు 1960 లో విశాలాంధ్ర వారి ఆంధ్ర దర్శినిలో రాశారు. భావకవిత్వాన్ని సమర్ధిస్తూ ప్రశంసిస్తూ, విశ్లేషిస్తూ వ్యాసాలూ, పుస్తకాలూ చాలా వచ్చాయి. కాని, ప్రత్యేకంగా ఉమాకాంతం గారి ఆక్షేపణలకు సమాధానంగా ఇంతవరకూ పుస్తకరూపంలో ఏమిరాలేదన్న మాట నిజమే. అట్లాగే ఉమాకాంతంగారు తిట్టినా అదో గొప్పగా ఆనాటి కవులు చెప్పుకునే వారని అ.రా.కృ గారు అంటుండేవారు. అంతటి మహాపండితుడి దృష్టిలో పడటమే గొప్పగా ఆనాటి కవులు భావించేవారన్న మాట. ఆనాటి భావకవుల్లో బహుశా ఎవరినీ ఆయన క్షమించలేదు. విస్తర దోషాన్ని గురించి విస్తరణాధి కరణంలో చెబుతూ చెప్పవలసినదానికంటే ఎక్కువగా చెప్పటం విస్తర దోషమని నిర్వచించి, ఈ కాలపు కృతుల్లో ఇది విస్తారంగా ఉందని ప్రస్తావించి "యెంకి పాటల వంటి వాటిలో కొన్నిటిలో తప్ప తక్కిన యీ కాలపు కృతుల్లో అనేకాల్లో యీ దోషం కనబడుతున్నది" అని యెంకి పాటలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మాత్రం మినహాయింపు ఇయ్యటం కూడా విశేషమే ననుకుంటాను.


ఆధునిక కవిత్వం ప్రాచీన ధోరణుల నుంచి విడివడి కొత్త దారులు వెతుక్కుంటున్న సమయంలో అక్కిరాజు ఉమాకాంతం గారు సాహిత్య విమర్శలో ప్రవేశించారు. సంప్రదాయ పండితులు చాలామంది భావకవిత్వాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఉమాకాంతం గారి మార్గం భిన్నమైనది. ఆయనకు తెలుగులోనే కవిత్వం కనపడలేదు. ఆయన ప్రమాణాలు ప్రాచీన సంస్కృతాలంకారికులవి. వాద పద్ధతి సంస్కృతంలో తర్కపద్ధతి. ఈ పద్ధతిలో సిద్ధాంతం పూర్వపక్షం, ఆక్షేపణ సమాధానం అనే విభజనలుండటం వల్ల దీనికి ప్రామాణికతే గాక హేతుబద్ధత కూడా వచ్చింది. ఈయనకు పాశ్చాత్య తర్కపద్ధతితో




ఈ కూడా పరిచయమున్నట్టు ఈ గ్రంథం లోనే అనౌచిత్యాధికరణంలో Fallacy of undue Assumption అనే పద్ధతి ప్రస్తావన వల్ల తెలుసుకోవచ్చు.


ఉమాకాంతం గారి తర్కపద్ధతికి, ఆధునిక శాస్త్ర ప్రతిపాదనల పద్ధతికి కొన్ని పోలికలున్నాయి. ఆధునిక శాస్త్ర పద్ధతిలో ఒక ప్రతిపాదన చేసినపుడు ఆ ప్రతిపాదనకు ప్రతికూలమైన అంశాలను కూడా ప్రస్తావించి వాటిని తన ప్రతిపాదన ఎట్లా పరిష్కరిస్తుందో చెప్పాలి. అప్పుడే ఆ ప్రతిపాదన సిద్ధాంత మవుతుంది. ఉమాకాంతంగారి వాద పద్ధతి ఎంత ప్రాచీనమో అంత ఆధునికం కూడా. ఒక విషయాన్ని అన్ని వైపుల నుంచి పరిశీలించటానికి ఉమాకాంతం గారి తర్క పద్ధతి పనికొచ్చింది.


ఇదికాక ఉమాకాంతంగారి శైలి సూటిదనం, సారళ్యం అనే రెండు లక్షణాల వల్ల ఆకర్షణీయంగా ఉంటుంది. 'ఆపతితం, ద్రష్టవ్యం, వక్ష్యమాణం' వంటి మాటలు ఆయన పాండిత్యం వల్ల అరుదుగా దొర్లినా సాంకేతికత లేని సాధారణ పదాలు వాడటం ఆయన అలవాటు. ఊగుడు మాటలు, పులుముడు, వికారాలు, దూడపేడ సంస్కృతం, దండగ్గణం వంటి అతి సామాన్య పద జాలంతో తన భావాలను చెప్పగలిగారు. సిద్ధాంత పూర్వ పక్షాలు, అక్షేప సమాధానాలు అనే - పద్ధతి వాద ప్రతివాదాల సంభాషణ (dialogue) పద్ధతి. ఈ నిర్మాణం (structure) వల్ల శైలి సంభాషణశైలికి సన్నిహితమై మరింత ఆకర్షకమైంది. భాష విషయంలో ఆయన మారిన దృష్టి కూడా ఇందుకు తోడ్పడింది. దానికి తోడు ఉమాకాంతం గారికి విషయ వివరణకుప యోగించే దృష్టాంతాలను, పిట్ట కథలను ఎన్నుకొని విషయ వివరణ చెయ్యటంలో అద్భుతమైన నేర్పుంది. సంస్కృతాంగ్లాలలో విశేషమైన పాండిత్యం ఉన్న ఆయన తన రచనలలో ఉదాహరించిన సంస్కృతాంగ్ల వాక్యాలకు తరచుగా ఆంధ్రాను వాదాలను కూడా ఇస్తుంటారు. ఆయన చెప్పిన విషయాల్లో భేదించినా ఆయన వాద పద్ధతి నుంచి ఈ నాటి విమర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉపపత్తులు చూపకుండా



11:37 AM Sun Dec 19


79%


00


అస్పష్టంగానూ చెప్పలేదు. ఇన్ని సుగుణాలున్న ఈ పుస్తకం సాహిత్యాభి మానులందరికీ అవశ్య పఠనీయం.


ఈ పుస్తకానికి చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ఒక విద్యావేత్త పరాధీనమైన తన జాతి పతనమై పోతున్నదని, విలువలు క్షీణిస్తున్నాయని, ప్రమాణాలు పడిపోతున్నాయని ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోటానికి కూడా ఈ పుస్తకం చదవటం అవసరం. దాదాపు .అర్ధాయుష్కుడైన ఒక సాహిత్య కృషీవలుడు ఉన్న కొద్ది జీవితకాలం లోనే ఎన్ని విద్యలు నేర్వవచ్చునో, తాను లోక కళ్యాణమని ఎంచిన దాన్ని ఆచరించటానికి ఎంత కృషి చేశాడో తెలుసుకోటానికి ఆయన జీవితాన్ని గురించి కూడా తెలుసుకోవాలి.


అయితే ఉమాకాంతంగారు భావకవిత్వం గురించి చేసిన నిర్ణయాలు కాలంలో నిలవలేదు. మారుతున్న అభిరుచులు కనుగుణంగా భావ కవిత్వం చరిత్రలో నిలిచింది. స్థిరదోషాలుగా ఉమాకాంతంగారు గుర్తించినవి 'అస్థిర మైనవిగా మారినాయి. వాటిని దోషాలుగా పాఠకులు గుర్తించ లేదు. అయోమయత్వం. పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం అని పేర్లు పెట్టి ఆయన నిరసించిన వాటిని తరవాత పాఠకులు గుణాలుగా మెచ్చుకొని ఆస్వాదిస్తున్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్య శాస్త్ర మర్యాదలు సర్వకాల సర్వదేశ సాహిత్యాలకీ సంపూర్ణ ప్రమాణాలుగా నిలుస్తాయని ఉమాకాంతం గారు నిజాయితీగానే నమ్మారు. ఆయన ఆనాటి కవులను కఠినంగా విమర్శించారు. చరిత్ర ఇంకా కఠినమైనది. ఉమాకాంతంగారి ఆక్షేపణలను తోసిపుచ్చింది. కాలం మరీ క్రూరమైనది. ఉమాకాంతం గారినే మరుగున పడేట్టు చేసింది. నిర్భీకత కాలానికి ఎదురీదే లక్షణం, పాండిత్యం, కృషి. చెప్పేవిషయంలో నిజాయితీ, స్పష్టత, సూటిదనం, సహేతుక వాదపటిమ ఆయన నిర్ణయాలను మించి విలువైనవి. అవే ఆయన తన తరువాత తరానికి అందించిన విలువలు.



11:38 AM Sun Dec 19


79%


00


సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతంగారి నిర్ణయాలు ముఖ్యంకాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాశ్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు.


ఈ ముద్రణలో సంపాదకుడుగా నేను చేసిన మార్పులకూ, చెయ్యని మార్పులకు కొంత సంజాయిషీ ఇచ్చుకోటం భావ్యం అనుకుంటాను.


ఈ గ్రంథం తొలి ముద్రణలోనే కొన్ని పొరపాట్లు దొర్లినాయి. వాటిని అన్ని చోట్లా సవరించటం సాధ్యం కాలేదు. సంస్కృతంలో అచ్చు తప్పులను ఆచార్య రవ్వా శ్రీహరిగారు సవరించారు. తెలుగు పద్యాల్లో స్పష్టంగా దోషాలుగా కనిపించే వాటిని సవరించాను కాని కొన్నిటిని వదిలేశాను. ఉదాహరణకు 'ఏకాంత సేవ అనే పుస్తకాన్ని 'యేకాంత సేవ' అని రాయటమే కాక పుటల సూచిక (ఇండెక్స్) లో కూడా అట్లాగే ఇచ్చారు. అట్లాగే ఆ కావ్యంనుంచి ఉదాహరించిన పద్య భాగంలో "మధుర మోహన కళామహితమై వుండ (పే.జీ 71, 88, 94) అనే పాదంలో ఉండ అనే క్రియా పదాన్ని 'వుండ' అని రాశారు. యకార, వకారాగమాలు కవ్యుదిషాలు కావనుకుంటాను. అయినా ఉమాకాంతం గారు కావాలనే అట్లా రాశారని అభిప్రాయ పడి వాటిని మార్చలేదు. అట్లాగే ఉమాకాంతంగారు ఉదాహరించిన పద్యపాదాలు ఇప్పుడు దొరికే ప్రతుల్లో వేరుగా కనిపిస్తున్నా, ఆయన చూసిన ప్రతుల్లో అట్లా ఉండి ఉండవచ్చునని మార్చలేదు. స్పష్టంగా ఛందో దోషాలున్నచోట మాత్రం ముద్రిత ప్రతుల ననుసరించి సవరించాను. అట్లాంటి మార్పులు తెలుగు భారతం నుంచి, ఆ ముక్తమాల్యద నుంచి ఉదాహరించిన చోట్ల అవసరమయ్యాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నుంచి ఉదాహరించిన భాగం (పే.జి. 136) లో ఇంగ్లీషులో Jonffroy అనీ తెలుగులో 'జాన్ ఫ్రాయి' అని స్పష్టంగా ఇచ్చారు. ఈ పేరులో ఏదో 3


 

11:38 AM Sun Dec 19


79% (


...


వల్ల అట్లాగే ఉంచాను. ఉదాహృత పద్య పాదాలను సాధ్యమైనంతవరకు ఈ కూర్పులో పాద విభజన చేసి చూపించాను. కొన్ని సంస్కృత శబ్దాల వర్ణక్రమాన్ని ఉమాకాంతం గారు నియతంగా పాటించినట్టు కనిపించదు. వాటిని అట్లానే ఉంచాను.


ఈ పీఠికారచనకు ప్రేరేపించిన మిత్రులు ఆచార్య పేర్వారం జగన్నాథం గారికి సమాచార సామగ్రిని సాదరంగా అందించిన అక్కిరాజు రమాపతిరావుగారికీ, చలసాని (విరసం) ప్రసాదుకూ కృతజ్ఞతలు. -


హైదరాబాదు. 1994 జనవరి 26.


చేకూరి రామారావు.

Tuesday, December 14, 2021

ఆంధ్ర మహా భారత అవతరణ - సేకరణ - కర్లపాలెం హనుమంతరావు ( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి )



ఆంధ్ర మహా భారత అవతరణ 

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 


చాళక్యుల కాలంలో మత, కుల విభేదాలు రాజ్య భద్రతకే విచ్ఛిన్నకరంగా తయారయాయి. సుస్థిర రాజ్యపాలన అసంభవమౌతుండేది. ఇతర రాష్ట్రాల నుండి దండెత్తి వచ్చే రాజులను ఆహ్వానించే మతస్థులు, కులస్థులు ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవారు. కుట్రలను, అరాచకాన్ని ప్రోత్సహించేవారికి మతం ఒక ముసుగుగా ఉపయోగపడేది. ఆ సందర్భంలో అవతరించినది ఆంధ్ర మహా భారతం . 


ఆంధ్ర మహాభారత అవతరణ


విచ్ఛిన్నకర ధోరణులను కొంతవరకైనా అరికట్టి ఐక్యజాతి పరిణామాని కవసరమైన సంస్కృతిని నిర్మించిన ఘనత తెలుగు సాహిత్యానిది.  అందుకు మహాభారతం నాంది.


మత ప్రవక్త దృక్పథం సంకుచితం. తన దేవునిపై భక్తి కంటె పొరుగు దేవుడిపై ద్వేషం జాస్తి. దేవతల ద్వేషం ప్రజలలో వ్యాపించి అంతఃకలహాలకు కారణమైంది.


కవుల దృక్పథం వేరు. జీవితంలోని కుల, మత భేదాలకు అతీత మైన, సామాన్య మానవ భావాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తీకరించటమే కవి కర్తవ్యము. ఈ గురుతర బాధ్యతను నిర్వహించిన కావ్యాలు భారత, భాగవతాలు. అయితే ఈ కర్తవ్యం -  నాటి ప్యూడల్ సమాజ పరిధికి లోబడి జరిగింది. సామాన్య ప్రజల జీవితం ఈ సాహిత్యంలోకి ఎక్కలేదు.


మహాభారతం సర్వజన వంద్యంగా వుండవలెనని తాను రచించి

నట్లు నన్నయభట్టు ఇలా వివరించాడు.


'ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని 

అధ్యాత్మ విదులు వేదాంత మనియు 

నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని 

కవి వృష  మహా కావ్య మనియు

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని 

ఐతిహాసికులితిహాసమనియు 

పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ

 యంబని మహ గొనియాడుచుండ


గీ. వివిధ వేద తత్వవేది వేదవ్యాసు 

డాదిముని పరాశరాత్మజుండు 

విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై 

పరగుచుండ జేసె భారతంబు.


తామెంతటి మహత్కార్యానికి పూనుకున్నారో మహాభారత కవులు

గుర్తించారు.


“నానా రుచిరార్థ సూక్తినిధి 

నన్నయభట్టు తెనుంగునన్, మహాభారత 

సంహితా రచన బంధురుడయ్యె 

జగద్ధితంబుగాన్”


"గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుంగు వారికిన్ వ్యాస ముని ప్రణీత"మైన మహాభారత గాథను వివరిస్తున్నానని నన్నయభట్టు మరొక చోట చెప్పాడు.


ఇదే విషయాన్ని భారతంలో అత్యధిక భాగాన్ని రచించిన కవి బ్రహ్మ తిక్కన యింకా స్పష్టంగా చెప్పాడు.


ఉ॥ కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి, 

ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ 

సంస్కృతి శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధినొందిపద్యములగద్యములన్ రచియించెదన్కృతుల్ ——


అంతేకాదు.


తెలుగు భాషలో ప్రజాసామాన్యానికందరికీ అర్థమయ్యేటట్లు వ్రాయటంలో పురుషార్థ సాధన ఇమిడి వున్నదని కూడా తిక్కన భావించాడు.


తే॥ తెనుగుబాస వినిర్మింప దివురుటరయ

భవ్యపురుషార్థ తరు పక్వ  ఫలము గాదె ॥


ఆంధ్ర మహాభారతం నన్నయ ప్రారంభించిన తర్వాత 200 సంవత్సరాలకు గాని పూర్తికాలేదు. ఏ ఆశయంతో నన్నయభట్టు భారత రచన కుపక్రమించాడో, అదే ఆశయంతో క్రీ.శ. 1260 ప్రాంతంలో తిక్కన ఆ కావ్యాన్ని పూర్తిచేశాడు.


ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాలలోని అన్ని కులాలలోను మహా భారతం అంతటి విస్తార ప్రచారంగల గ్రంథం మరొకటి లేదు. పాండవ కౌరవ గాథలు, నాటినుండి నేటివరకు సామాన్య ప్రజలకు విజ్ఞానాన్ని లోకానుభవాన్ని అందజేస్తూనే ఉన్నాయి.


నాడు ప్రజలలో జైన, హిందూ మతాలు వ్యాప్తిలో ఉన్నాయి. పూర్వ మీమాంసాకారుడైన కుమారిలభట్టు ఆంధ్రుడైనందు వలన, ఆంధ్రలో ఆ సిద్ధాంతానికి ఆలంబనం హెచ్చుగా ఉండేది.


నిర్జీవమైన కర్మకాండకు జైన, పూర్వ మీమాంసా ధోరణులు రెండూ విశేష ప్రాధాన్యత నిచ్చినవి. అర్థంతో నిమిత్తం లేకుండానే మంత్రోచ్చారణ ద్వారానే ఫలితాలు వస్తాయన్న మూఢ నమ్మకాలు విరివిగా ఉండేవి.


క్రీ. శ. 787 లో మలబారులో  పుట్టి అద్వైత వాదాన్ని ప్రచారం చేసిన శంకరాచార్యుని బోధనలు దేశమంతా వ్యాపించినప్పటికీ, పాత ధోరణులింకా బలంగానే వున్నాయి. శంకరుని ఆద్వైతం జ్ఞానప్రధానం; కర్మకాండను నిరసించింది.


నన్నయ్యభట్టు మహాభారత రచన అద్వైత ధోరణికి ఎనలేని సహాయం చేసింది. శైవ, వైష్ణవ ద్వేషాలను ఖండించింది. నిర్జీవ కర్మ కాండపైనుండి ప్రజల దృష్టిని వాస్తవ జీవితంవైపు మళ్ళించింది. 


రాజ్యలోభం, ద్వేషం, కక్ష మొదలైన ఆవేశాలకు లోనైనప్పుడు మహా సామ్రాజ్యాలు పతనమైపోతాయన్న నీతిని ప్రచారం చేసింది. కర్మలు అప్రధానమని, జ్ఞానం, సమవృష్టి, అద్వైతభావం ముఖ్యమని కథా రూపంలో ' ప్రజలకు బోధ చేసింది.


ఈ ఉపకృతితోపాటు, మరొక అపకారం కూడా జరిగింది. నన్నయ భట్టుకు పూర్వమే చాలా కాలం నుండి తెలుగులో రచనలు సాగుతూ వచ్చాయని ప్రాచీన శాసనాలే తెలియజేస్తున్నాయి. కాని నాటి గ్రంథాలేవి లభించటం లేదు. అట్టి ప్రజా వాఙ్మయాన్ని, “గాసట బీసట" అని నన్నయభట్టు హేళన చేసి ప్రజావాఙ్మయం పట్ల నిరసన కలిగించాడు. 


ఈ నిరసన వైఖరిపై తిరుగుబాటుగానే, రెండు శతాబ్దాల అనంతరం వీరశైవ మతం, వీరశైవ వాఙ్మయం తలయెత్తాయి.

- సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

14 -11-2021 


( మూలం - ఆంధ్రుల సంక్తిప్త చరిత్ర - ఆంధ్ర మహా భారత అవతరణ - శ్రీ ఏటుకూరి బలరామమూర్తి ) 

Monday, December 13, 2021

కవిత్వ ప్రయోజనము : - కర్లపాలెం హనుమంతరావు




విత్వ ప్రయోజనము :

- కర్లపాలెం హనుమంతరావు


అభినవగుప్తుడు లెక్క ప్రకారం వాఙ్మయుం  ప్రభుసమ్మితం , మిత్రసమ్మితం, కాంతాసమ్మితం.  


వేదాయి  ప్రభునమ్మిఅలు . పురాణములు మిత్ర సమ్మితాలు.  కావ్యాలు  కాంతాసమ్మితాలు . 


కాంతాసమ్మితాలు  అంటే స్వాధీనపతిక సాథ్వీమణి తన రూప లావగ్యాలతో భర్తను వశపరుచుకునే పద్ధతి. ఆమె భర్తకు ఆ సందర్భంలో చేసే ఉపదేశం కావ్యం అవుతుంది, ఆ కావ్యం పరమార్ధం హృదయానందం. 



తరువాతి  కాలంలో ఈ కావ్య ప్రయోజనాల జాబితాను భరతుడు అనే మరో అక్షణికుడు ధర్మకామాలు, ఉత్సాహం , హితోపదేశం , విశ్రామజనకత్వం లాంటి వాటితో పెంచేశాడు.  

ఆ విశ్రామజనకత్వ'మే క్రమంగా  'ఆనంద' రూపంలో కలసిపోయింది.  


భామహుడు అనే మరో లాక్షణికుడు కావ్య ప్రయోజనాలకు ఆనందానికి అదనంగా కలిపాడు. 


 దండి  - సాహిత్యానికి  సామాజిక జీవన చిత్రణం  ప్రయోజనమన్నాడు.  


ఆనందవర్ధనుడయితే  తనకు ముందున్న  లాక్షణికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చిన  ప్రీతి, కీర్తి, హితోపదేశాలలో  ఒక్క మనోప్రీతిని మాత్రమే కావ్యప్రయోజనంగా ఒప్పుకున్నాడు.  అభినవగుప్తుడూ కావ్యప్రయోజనాలన్నిం టిలోనూ ' ప్రీతిరేవ ప్రధానమ్' అన్నాడు. 


మమ్మటుడు ప్రాచీనాలంకారికులు కావ్యప్రయోజనాలుగా చెప్పుకొచ్చినవాటివన్నంటినీ ఒక జాచితాకి కుదిస్తూ  వాటన్నింటిలో   సద్యఃపర నిర్వృతి, ఉపదేశం ఎన్నదగినవి అన్నాడు .


ఇక పాశ్చాత్యుల దగ్గరికొస్తే,  ఆనంనం, ఉపదేశాలనే ప్రధానమైన  కావ్యప్రయోజనాల తీసుకున్నారు. 


వర్డ్సువర్తుది  ఆనందమే ప్రధానమనే వాదన . డ్రైడెన్, బ్లేక్ లు అ అందంతో పాటు నీతిబోధకం కూడా  అయివుండాలని అభిప్రాయపడ్డారు.   మిల్టన్ అయితే కేవలం నీతిబోధే  ప్రధానం అన్నాడు.   ఎడ్గర్ ఎలన్ పో కవిత్వధర్మం-   ఆనందానికి  సత్యంతో నిమిత్తంలేని ఆనంద అనుసంధానం.    ఫిలిప్ సిడ్నీకి  కవిత్వప్రయోజనాలకు  ఆనందసందేశాలు రెండూ ముఖ్యమే.  


చివరికి బ్రాడ్లీ మహానుభావుడు కావ్యప్రయోజనాలు ఏంటా అని తర్కించుకుంటూ కూర్చంటే అసలు కవిత్వమే పలచబడి పోతుంది  పొమ్మని కొట్టేశాడు . 


 ఆస్కార్ వైల్డ్  మరీ దారుణం. కళలన్నీ నీతిబాహ్యాలని ఈసడించుకుంటాడు .   నీతి అనేది మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లకే తప్పించి మేథావులకు అక్కర్లేదని  ఆయన వాదన. 


పాశ్చాత్యులకు .. ప్రాచ్యులకు మధ్య తేడా ఒక్కటే! నీతిబోధ విషయంలో ఏకీభావం ఉన్నా .. నీతి బాహ్యం  విషయంలో  మాత్రం మరీ పడమటి అలంకారికుల్లాగా ప్రాచ్య మేధావులు  పోలేదు . 


నిజానికి అందంగా అల్లినంత మాత్రాన ఏ కావ్యమూ ఉత్తమమైనది కాలేదు . ముద్దుపళని  ' రాధికా సాంత్వనం ' ఇందుకో ఉదాహరణ. ఆ కావ్యం చదివే సమయంలో హృదయం  ఓ రకమైన ఆనంద డోలికల్లో ఊగవచ్చు .  కానీ, మొత్తంగా చూసుకుంటే ఆ అనుభూతి సభ్యతా సంస్కారాలకు అనువుగా ఉండదు. 


నీతిబాహ్యమైన వస్తువే  రమణీయంగా ఉంటుందని అనుకుంటే పేక్స్పియర్ ' క్లియోపాట్రా ' గానీ,  అభిజ్ఞాన  శాకుంతలం ' శకుంతల ' గానీ అనుభోగ్యాలు అవాలి . అదెంత మాతం సమ్మతం కాదు ' అంటారు దువ్వూరి రామిరెడ్డి ఒక సందర్భంలో. 


కావ్యాలలో నీతిప్రస్తావన  కూడా అనవసరమేనరి బ్రాడ్లీ చేసిన వాదనా సమంజసంగా లేదు. సదుద్దేశాలను ఉపదేశిస్తుండ బట్టే న్యూ టెస్టిమెంట్ గానీ పిల్ గ్రిమ్స్  ప్రొగ్రెస్  కానీ వాల్టేర్, బైరన్, స్విఫ్ట్ రచనలు గానీ రామాయణ భారతాదులు గానీ కాళిదాసు రఘువంశ చరిత్రగానీ చదివేటప్పుడు ఆత్మానందం కలిగిస్తాయి . అయినా వాటిని 'కావ్యాలు  అనటానికి లేదు. .  అందులో కవిత్వమే లేదు ' అని బుకాయించగలమా? వాటిలో ఉత్తమ పరమార్ధాన్ని ప్రబోధించే ఉపదేశాలు ఉన్నాయి. చదివే సమయంలో ఆ పరమార్ధం గ్రహింపుకు రావడం వల్ల పాఠకులలో కలిగే ఆత్మానందమే ఇక్కడ కావ్యప్రయోజనం. అలాంటి ఉత్తమ పరమార్థాలు లోపించనందువల్లనే ' ఏన్సియంట్ మారినర్ , శుక సప్తశతి. తారాశశాంకం లాంటివి కావ్యాలే అయినా ఉత్తమ కావ్యాలు కాలేవు. 


ఇకపోతే, డ్రైడెన్ చెప్పినట్లు ఆనందసందేశాలు ఉన్న కావ్యాలలో ఆనందం ప్రథమం .. ఆ తరువాతే సందేశం  అన్న సిద్ధాంతమూ ఎన్నదగినదేమే . 

సంస్కృతలాక్షణికులలో అభినవగుప్తుడు లాంటి వాళ్లు కూడా  'తథాపి ప్రీతిరేవ ప్రధానమ్' అని ఇట్లాంటి  అభిప్రాయాన్నే వెలిబుచ్చినట్లు ఇందాకే చెప్పుకున్నాం కదా! 


' తైతరీయోపనిషత్ భృగవల్లి ' ఆనందం'  తాలూకు మహిమను గూర్చి  వివరిస్తూ అంటుందీ  .. 


'ఆనందాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే

ఆనందాద్ధ్యేవ  జాతాని జీవంతి 

ఆనందం ప్రయాం త్యభిసంవిశంతి.' 


  ఆ ఆనందం తాలూకు అనుభూతిని  ఉత్తమాభిరుచి గల పాఠకులకు  కలిగిస్తో  క్రమక్రమంగా  వాళ్లను కర్తవ్యం  దిశగా తీసుకువెళ్లడమే కవిత్వ ప్రక్రియ  పరమ ప్రయోజనం. 

పేరుకు పోయిండే మాలిన్యం మొత్తాన్ని   ప్రక్షాళన చేసి మనిషి మనసును శరత్కాల కాసారం లాగా మార్చేసే మంతశక్తి  ఆనందం సొంతం .  ఆ ఆనందం ఆత్మకు సిద్ధింప చేస్తూనే  సంఘానికి ఉపయుక్తమయే కర్తవ్యాన్ని ప్రబోధించడమే అంతిమంగా ఏ కావ్యానికయినా, కవిత్వానికయినా ఉండవలసిన ప్రధాన ప్రయోజనం . 


- కర్లపాలెం హనుమంతరావు 

13 - 12 -2021 

బోథెల్; యూ . ఎస్.ఎ


( ఆధారం: డా॥ సి.నారాయణ రెడ్డి గారి ' ఆధునికాంధ్ర కవిత్వము  - సంప్రదాయములు ; ప్రయోగములు )  





 

Sunday, December 12, 2021

సమీక్ష: కొకుగారి 'అమాయకురాలు కథ చదివిన తరువాత కలిగిన నా స్పందన -కర్లపాలెం హనుమంతరావు







    • ముందు ‘అమాయకురాలు’ కథ ఏమిటో భోజనం విస్తట్లో రుచికి ఓ మూల వడ్డించే పదార్థం లాగా: 

    • వెంకటేశ్వర్లు, భ్రమర చిన్నప్పటినుంచి స్నేహితులు. వెంకటేశ్వర్లుకి పదహేడో ఏట భ్రమర మీద వికారం మొదలవుతుంది. ఆ వికారం పేరు ప్రేమ అనుకోవడానికి లేదు. కాంక్ష పుట్టనిదే ప్రేమ కలగదన్న జ్ఞానం ఇంకా వంటబట్టని వయసు వెంకటేశ్వర్లుది. భ్రమర మీద  అలాంటి ఊహ ఏదీ లేకపోవడం మూలాన అతగాడిలోనే ఒక రకమైన అయోమయం. భ్రమర పని మరీ అన్యాయం. ఇంకా రజస్వల కూడా కాని పసిది. ఈ విషయాలన్నీ ఎలా తడతాయి?
    • భ్రమరకు పెళ్లి ఖాయమైందని తెలిసి వెంకటేశ్వర్లులో అదేమిటో అర్థం కాని చిరాకు మొదలవుతుంది. 'తాను భ్రమరని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడా?' అని అతనికే ఏదో ఒక మూలన అనుమానం. అలాగైతే అలాగని వెళ్ళి తండ్రిని అడిగేయచ్చు కానీ.. ఆ తండ్రిగారి మనస్తత్వం పూర్తిగా మరీ చాలా పాత కాలంనాటి ముక్కిపోయిన సరుకు. పిల్లలకేది కావాలో నిర్ణయించాల్సింది పెద్దలేనని అతని అభిప్రాయం. పిల్లలకు సంబంధించిన విషయాలేవీ పిల్లలతో చర్చించనక్కర్లేదని, ఒక వేళ వాళ్ళ ఇష్టాలేమన్నా చెవిలో పడితే దానికి పూర్తి విరుద్ధంగా చేయడంలోనే పిల్లల క్షేమం దాగి ఉందని దృఢంగా నమ్మేవాడు. కనక వెంకటేశ్వర్లు తెగించి తండ్రితో ఏదీ చెప్పదలుచుకోలేదు. కానీ అతి కష్టంమీద.. చనువున్న అమ్మ దగ్గర మనసులోని మాట బైట పెట్టేడు. వెంకటేశ్వర్లుది, భ్రమరది ఒకే కులం. బ్రాహ్మలే ఐనా శాఖలూ ఒకటే అవడంతో చిక్కు వచ్చిపడింది. 'నోరు మూసుకోమని తల్లి మందలించేసరికి ఇక పెళ్లి ఆలోచన ముందుకు సాగదని తెలిసి మనసుతో ముసుగు యుద్ధం మొదలు పెట్టేడు. భ్రమర పెళ్ళికి వుండకుండా వెళ్ళిపోయాడు. ఎవరు అడిగినా ఉండలేదు.. ఆఖరికి భ్రమరే వచ్చి అడిగినా మెట్టు దిగిరాలేదు.
    • భ్రమర పెళ్ళికి ఉండమని అడగడంలో ప్రత్యేకమైన ఆసక్తి ఏదీ లేదనుకుంది కానీ.. ఏదో ఉందని కొద్దిగా మనసు మూలలో ఉందేమో..ఏమో.. మరీ పసిది.. ఎలా ఆలోచిస్తున్నదే అప్పటికి రచయిత బైటపెట్టలేదు మరి.
    • కాలక్రమంలో భ్రమర పెద్దమనిషి కావడమూ..కాపురానికి పుట్టింటికి వెళ్ళిపోవడమూ.. అందరు సంసార స్త్రీలకు మల్లేనే మెట్ట వేదాంతం వంటబట్టించుకోవడమూ అయింది. పుట్టింటికని వచ్చినప్పుడు వెంకటేశ్వర్లుతో ఒకసారి ఈ వేదాంత పైత్యం వెళ్లబెడుతుంది కూడా.'ఊహల్లోనే ఏ సుఖమైనా.. వాస్తవంలో అవేమీ ఉండనే ఉండవు' అని వెంకటేశ్వర్లు మనసులో మళ్లీ వికారం మొదలవడానికి కారకురాలవుతుంది.
    • భ్రమర కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటవుతుంది. భర్త క్షయ వ్యాధితో రెండేళ్ళన్నా గడవకుండానే బాల్చీ తన్నేయడంతో భ్రమర పుట్టింటికొచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతమేమీ లేకుండానే గుండూ చేయించుకుంటుంది. ఆమె వద్దంటే బలవంత పెట్టేవాళ్లెవరూ లేకపోయినా అలా ఎందుకు వికారంగా తయారవాలోనని వెంకటేశ్వర్లు చాలా చిరాకు పడిపోతాడు. ఎదురింట్లో ఉన్నా ఒక్కసారన్నా ఆమెను చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయడు. భ్రమరకు అది కష్టంగా అనిపిస్తుంది. సిగ్గు విడిచి వెంకటేశ్వర్లు తల్లి దగ్గర తన బాధ బైటపెట్టుకుంటుంది కూడా. వెంకటేశ్వర్లు తల్లి పాతకాలం మనిషి. నవీన భావాల లోతుపాతులు పట్టించుకునేపాటి తెలివితేటలు తక్కువనే అనుకోవాలి. అందుకే వెంకటేశ్వర్లు ముందు భ్రమర గోడు బైట పెడుతుంది. వెంకటేశ్వర్లు భ్రమర శిరోముండనం చేయించుకుని తనకు అన్యాయం చేసినట్లు కోపం పెంచుకోనున్న మనిషాయ. భ్రమరను కలవడానికి వెళ్లనే వెళ్ళడు. పైపెచ్చు తన మనసులోని కచ్చను కూడా తల్లి దగ్గర వెళ్లగక్కుతాడు. ఆ తల్లి యథాప్రకారం ఈ మాటలు భ్రమరకు అమాయకంగా చేరవేస్తుంది.
    • భ్రమరలో ఆలోచనలు మొదలవుతాయి. తన తప్పు కొద్ది కొద్దిగా తెలిసివస్తున్నట్లనిపిస్తుంది. వెంకటేశ్వర్లు  తన పెళ్ళికి ముందు పడ్డ చిరాకంతా నెమరు వేసుకుంటే తన దోషం తెలిసివస్తుంది.
    • ఏదైతేనేమి  భ్రమర మళ్లీ జుత్తు పెంచుకోవడం మొదలు పెడుతుంది. చీరలు జాకెట్లు  కూడా వాడుతుందని తెలుస్తుంది వెంకటేశ్వర్లుకి. 
    • అప్రెంటిస్ పూర్తయి ఒక లాయరు గారి దగ్గర అసిస్టెంటుగా కుదురుకున్న తరువాత వెంకటేశ్వర్లుకి సంబంధాలు రావడం మొదలవుతాయి. రెండు లంకలున్న మంచి జమీందారీ సంబంధం ఖాయమూ అవుతుంది.
    • పిన్నిగారి వూరికని వెళ్ళిన భ్రమరకు ఈ విషయం తెలిసి ముళ్ళమీదున్నట్లయి పోతుందక్కడ. నెల్లాళ్ళుందామని వచ్చిన పిల్ల తట్టా బుట్టా సర్దుకుని లేచిపోతుంటే ఆ పిన్నిగారు అవాక్కయిపోతుంది.
    • బండిని నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిముందే ఆపించి సామానుతో సహా లోపలికి పోతుంది భ్రమర. వెంకటేశ్వర్లు, భ్రమర చాలాకాలం తరువాత ఒకరికొకరు ఎదురవుతారు. భ్రమరను చూసి వెంకటేశ్వర్లుకు మతి పోయినంత పనవుతుంది. ఆ క్షణంలో తను అప్పటిదాకా అనుకుంటూ వచ్చిన 'ఉచ్చిష్టం' ఊహ గుర్తుకే రాదు. పెదాలుకూడా సన్నగా వణుకుతాయి కాని మనసులోని మాటను ధైర్యంగా బైటపెట్టలేని పిరికితనం ఎప్పటిలా అలాగే  ఉంటుంది చెక్కుచెదరకుండా. అక్కడికీ భ్రమరే కాస్త సాహసం చేసి నర్మగర్భంగా మాట విడుస్తుంది కూడా.'వెంకటేశ్వర్లూ! నీ పెళ్ళి అని తెలిసి ఉండలేక వచ్చేశా' అంటూ. వెంకటేశ్వర్లులోని పిరికి మనిషి స్పందించడు. భ్రమర తెచ్చుకున్న పెట్టే బేడాతో తిరిగి సొంత ఇంటికే వెళ్ళి పోతుంది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఏదో చెప్పాలనుకుంటాడు కానీ.. తీరా అతను చూసే అసహ్యపు చూపులు గుర్తుకొచ్చి నోరు పెగలదు. ఏదో సందర్భంలో భ్రమరను కలవాలని వచ్చిన వెంకటేశ్వర్లుకి ఆమె గదిలో ఏడుస్తూ కూర్చుని ఉండటం.. గదంతా అసహ్యంగా ఆమె కత్తిరించుకున్న జుత్తు వెంట్రుకలతో నిండి వుండటమూ చూసి వెనక్కి వచ్చేస్తాడు. 
    • వెంకటేశ్వర్లు పెళ్ళి అవుతుంది. భ్రమరను తలుచుకుందామని అనుకున్నప్పుడల్లా జుత్తులేని ఒక  ఒంటరి ఆడదాని ఏడుపు వికారపు మొహం గుర్తుకొచ్చి తలుచుకోవడమే మానేస్తాడు.
    •  
    • నా సమీక్ష :

    • ఇది నిజానికి ఒక ప్రేమ కథ. వెంకటేశ్వర్లు, భ్రమర ఒకరినొకరు ఇష్టపడ్డ మాట నిజం. మొదట్లో అది ఇష్టమని తెలీక కొంత.. తెలిసినాక ఏ రకమైన ఇష్టమో తేల్చుకోలేక అయోమయంలో పడి కొంత తంటాలు పడ్డారు ఇద్దరూ. భ్రమరకన్నా ఆ ఇబ్బంది ఎక్కువగా వెంకటేశ్వర్లే పడ్డాడు. ఏ దశలోనూ కాస్తంతన్నా సాహసం చూపించలేని పిరికివాడికి ప్రేమ దక్కేది ఎలా? భ్రమర తనను కాకుండా వేరే ఎవరినో ఎంచుకున్నదని ముందులో కొంత.. శాఖాంతరం కాకపోవడం మీద కొంత.. ఎలా ఎవరిమీదో.. వేటిమీదో కంటికి కనబడని వాళ్ళమీదా.. కారణాలమీదా పెట్టి మానసిక తృప్తి పొందాడే కాని.. మనసులో నిజంగా ఉన్నదేమిటో.. దాన్ని సాధించడానికి చేయాల్సినదేమిటో ఎప్పుడూ యోచన చేయని నిష్క్రియాపరుడైన ప్రేమికుడు వెంకటేశ్వర్లు. భ్రమర అతనికన్నా ఎన్నో రెట్లు మెరుగు. పసిదనం వదిలి ఊహ వచ్చిన దశలో భర్తతో కాపురానికి మెట్టవేదాంతంతో సర్దుకునే పరిపక్వత చూపించింది. వెంకటేశ్వర్లు మనసు అర్థమయి.. తన మనసు తనకు అర్థమవడం మొదలయిన తరువాత వీలైనంత సాహసం చేయడానికి కూడా వెనకాడ లేదు. పాపం.. ఆడదై పుట్టడం.. వెంకటేశ్వర్లు వంటి పిరికివాడు తటస్థపడడం వల్ల విఫల ప్రేమికురాలైంది భ్రమర.
    • ప్రేమించుకున్న జంటను విడదీయడానికి సంఘం తరుఫు నుంచి ఎప్పుడూ ఏవేవో అభ్యంతరాలు.. కుట్రలూ ఉంటూనే ఉంటాయి. వాటిని తోసిరాజని ప్రేమను పండించుకునే సాహసికులు కొందరైతే.. చాలామంది తమ మానసిక దౌర్బల్యంతో యుద్ధం చేయడం మాని సంఘాన్ని తప్పుపట్టేసి సెల్ఫ్ సింపతీతో సంతృప్తి పడే సర్దుబాటు చూపిస్తారు అని చెప్పదలుచుకున్నట్లుంది ఈ 'అమాయకురాలు' కథలో కొడవటిగంటి వారు.  నిత్యహరితమైన సమస్య!ఎంతో చెయ్యి తిరిగుంటే తప్ప ఇలాంటి కథను ఎన్నుకుని కడదేర్చడం కుదరదు.
    • ఎప్పటిలాగానే కుటుంబరావు గారు సంఘదురాచారాలని.. మానసిక డొల్లుతనాన్ని తనదైన నిశ్శబ్ద శైలిలో చాలా బలంగా ధ్వనించిన తీరుతో గొప్ప కథై కూర్చుంది అమాయకురాలు కథ. కథనం ఆయన మిగతా అన్ని కథల ధోరణిలోనే చాప కింద నీరులాగా ఆలోచనాపరుల మనసులను ముంచెత్తుతుంది.
    • ఎప్పుడో పంథొమ్మిది వందల ముప్పైతొమ్మిదో ఏట రాసిన కథ. వైధవ్యం..శిరోముండనం వంటి దురాచారాలు లేని ఈ కాలంలో కూడా  మానసిక కోణంనుంచి కొకుగారు కథను ఆవిష్కరించిన తీరు కథను ఎప్పటికీ పచ్చిగా.. తడిగానే ఉంచుతుంది.
    • కొకుగారు కథనంలో వాడే పలుకుబళ్ళు,  వాక్యాలలోని ముళ్ళు.. ఎప్పటిలాగానే ఆయన అభిమానులను కథ అంతటా అలరిస్తుంటాయి.
    • -కర్లపాలెం హనుమంతరావు
    • బోథెల్, యూఎస్ఎ

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...