Saturday, December 4, 2021

యాత్రా రాజకీయాలు - ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం

 




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

యాత్రా రాజకీయాలు

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- తేదీ లేదు ) 


బాబ్లీని  చూడాలని మందితో అన్నేసి బస్సుల్లో అలా పొలోమని దండ యాత్రలా పోవడం దండగ్గదా బాబాయ్! ఏ చీకటి మాటునో చటుక్కుమని ఆ ప్రాజెక్టు ఫొటోలు నాలుగు కొట్టుకొచ్చి నలుగుర్లో పెట్టిఉంటే గుట్టు బైటపడకుండా ఉంటుందా? ఇప్పుడేమో అంతా రాజకీయమని ఆడిపోసుకుంటున్నారు.


మరట్లా ఆడిపోసుకునేవాళ్ల మాజీ మహానేతా అధికారప క్షంలో లేనప్పుడు గుట్టుగా ఓ చెట్టుకిందో మఠం వేసుకుని కూర్చొని జనాల బాధలు వినే సావకాశమున్నా మరెందుక ని.. అలా పాదయాత్రంటూ అన్నేసి మైళ్ళు ఎండల్లో పడి చెడతిరిగింది ? అది రాజకీయం కాక ప్రజాసేవా? పదవులు దక్కటానికి పాదయాత్రో, రథయాత్రో, బస్సు యాత్రో ... ఏదో ఒక ప్రజాపథం పేరు పెట్టుకుని దేశం నాలుగు చెరగులా తిరిగిరావాలని... ఆనాడే అద్వానీ అందరికీ ఓ దగ్గరి దారి చూపించారు నాయనా! శాంతియాత్రో, సౌహార్ధ యాత్రో, ఓదా ర్పుయాత్రో... పేరేదైతేనేంగానీ- అన్ని యాత్రలూ పెళ్లిలో వరుడు కన్యాదానం అందుకునేముందు చేసే ఉత్తుత్తి కాశీయాత్రలవంటివేనని ఇవాళ రాష్ట్రంలో చంటి పిల్లాడినడిగినా చటుక్కున చెప్పేస్తాడు. ఇప్పుడు ఇక్కడే కాదు... దేశమంతటా నడుస్తున్నది  ఈ టూరు రాజకీయాలే తెలుసా!


నిజమే బాబాయ్. పొరుగురాష్ట్రం కర్ణాటకలోనూ గాలి సోదరుల గనులగోలకు నిరసనగా చెయ్యిగుర్తు వాళ్ల పెద్దయెత్తున పాదయాత్రలు ప్రారంభించారు. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర కూడా జనం మధ్యకొచ్చి తిరగాలని తెగ మోజు పడుతున్నారు. ఇవన్నీ టూరు రాజకీయాల జాబితా కిందకే వస్తాయా?


దేవుడికి జరిగే అన్యాయాలను ఆ దేవదేవుడికే విన్న వించుకోటానికి నిజంగానే భక్తజీవుడు మెట్ల మీదట్లా ఆరాటపడుతూ పొర్లుదండాల యాత్ర పెట్టుకున్నాడంటే నమ్మాలంటావా? దేవుడి బాధలే అలాగుంటే... ఓటరు దేవుడి బాధలెలా ఉండాలి? ఆ రాజీవపుత్రుడు అన్నేసి ఏళ్లబట్టి కుదురూ కుమ్మూ లేకుండా ఆసులో కండెలాగా దేశమంతా పడి గుట్టుచప్పుడు కాకుండా అట్లా చెడతిరగటం వెనకున్న 'గుట్టు'లో అసలే రాజకీయమూ లేనే లేదంటావా? ఏ రాజ కీయాలూ లేకపోతే ఎవరైనా ఎందుకురా అంతలా యాతనపడుతూ దేశదిమ్మర్లలాగా తిరుగుతారు?!


నువ్వు మరీ బాబాయ్! తననూ తనవారినీ దేశద్రోహులనుంచి కాపాడుకోవడానికి మావోసేటుంగ్ మహా యాత్ర చేశాడు. దక్షిణాఫ్రికానుంచి దిగీదిగగానే మన మహాత్మాగాంధీ దేశయాత్ర పెట్టుకున్నాడు. అవన్నీ రాజ కీయాలేనా ఏమిటి? 


మరి కాకపోతే ఆ మహానుభావుల లక్ష్యాలకు మన మహానుభావుల లక్ష్యాలకు లక్షణాల్లో యక్షులకూ రాక్షసులకూ  ఉన్నంత తేడా . అసలు గణాధిపత్యంకోసం వినాయ కుడు, కుమారస్వామిల మధ్య భూప్రదక్షిణాల పోటీ పెట్టినప్పుడే ఈ యాత్రా రాజకీయాలకు బీజం పడిందిరా అబ్బాయ్ ! పవర్ కోసం చేసే యాత్రల శక్తి ఆమ్మో... గద్దె దిగినవాళ్ళకు రోడ్డు ఎక్కడం  తప్ప మరో దగ్గరి దారి లేనేలేదు.'


నికార్సయిన త్యాగధనులు కాకిగుంపులో కోకిల మాదిరిగా రాజకీయాల్లో ఏకాకులవుతారు నాయనా! ఎండుకట్టెలు , మట్టిబెడ్డలు, దుమ్మూధూళి దేనికైనా పనికిరావచ్చేమోగానీ- పదవిలేనివాడు కట్టి విడిచిన బట్టకన్నా కనాకష్టమని పెద్దవాళ్లు ఎప్పటినుంచో చెప్పు కొస్తున్నారు . పదవి పోయిన వాడిని, వాడిపోయిన పూవును ఎవరు భరిస్తారు. . ధరిస్తారు చెప్పు? కాలూ చెయ్యీ సరిగ్గా ఆడక పోయినా గద్దె దిగిపోవాలని  కోరుకోవడం తప్పు .  ఒక్క కైకేయి మనసును మళ్లించటానికే మంధరకు  రెండు నిండు వారాలు పట్టిందని రామాయణం చెబుతోంది. ఎంతమంది మంధరల గడుసుతనం చూపించకపోతే ఇన్ని కోట్ల మంది జనం మనసులను నేతలు తమవైపు తిప్పుకోగలరు చెప్పు!  వట్టి కతే చెప్పుకొంటూ పోతే ఎంత మంచి సినిమాకైనా నిద్ర ముంచుకొస్తుంది. ఫైట్లూ, పాటలూ, హీరోయిజాన్ని పెంచినట్లే- పదవిలేనివాళ్లు పాదయాత్రలు, బస్సుయా త్రలు, రథయాత్రలు అంటూ ఏవో పెట్టుకుంటూ జనంమధ్య తిరుగుతూ ఉండాలి...


నిజమే బాబాయ్! ఎన్నికలనేవి కచ్చితంగా ఇన్ని రోజులకొస్తాయని ఖాయంగా ఎవరూ చెప్పలేని పాడు రోజులు. వీలున్నప్పుడల్లా ఏ యాత్ర పేరుతోనో రోడ్డున పడటం తప్ప నేతలకు ఉత్తమమైన దారి మరొకటి లేదు


మరీ ముఖ్యంగా ప్రజాపునాదులు లేని నాయకులు వారానికొకసారైనా హస్తిన యాత్ర పెట్టుకుంటేనే అదృష్టం తిరగబడకుండా ఉంటుంది. చంద్రబాబు బాబ్లీ యాత్ర , చిరంజీవి బాలాజీ యాత్ర, జగన్ ఓదార్పు యాత్రలంటూ రాజకీయాలనుంచి రచ్చ చేసుకుంటున్నారేగానీ, రోశయ్య హస్తినయాత్రల వెనకున్న గడుసుతనాన్ని ఎవరూ గమనించటంలేదులాగుంది


నిజమే బాబాయ్! పెద్దాయనా ఈ మధ్య మన రాజకీయాలను  మీరిపోయాడు. మెట్రో రైలు ప్రాజెక్టు వంకతో ఢిల్లీ రైలులో చేసిన ప్రయాణం  వెనక ఏదో ఉందని నాకూ అనుమానంగా ఉంది. 


తొందరలోనే మన ఆంధ్రదేశానికి ద్రాక్షసారా పరిశ్రమ తెచ్చే ఆలోచనా ఉందిరా. దాని పరిశీలనకు ఏ మహారాష్ట్రకో, కర్ణాటకకో వెళ్ళి ఏం చేస్తాడో చూస్తేగానీ- ఏ రాజకీయం సంగతి చెప్పలేం ఇప్పటికిప్పుడు.  గోడ అడ్డమొస్తే వెనక్కి తగ్గటం పరాజయం. గుద్దుకుని ముందుకు పోవటం మొండితనం. దూకాలనుకోవడం  దుడుకుతనం. కన్నమేయాలనుకోవడం కంతిరితనం .  చుట్టు తిరిగిపోవాలనుకోవడం గడుసుతనం. ఆ భడరాయితనం పేరే రాజకీయం. అలా చుట్టూ తిరగటమే యాత్రారాజకీయం! ఇప్పుడర్ధమయిందా.. యాత్రా రాజకీయాలెందుకు పెరిగిపోతున్నాయో! 


'ఇంకానా బాబాయ్! అదిగో పిన్ని దండయాత్రకు  వస్తుంది నీమీదకే కాబోలు బాబాయ్! తప్పుకో.. ఇది గృహరాజకీయం! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- తేదీ లేదు ) 


ఈనాడు - గల్పిక- హాస్యం రంగుల రాజకీయం - కర్లపాలెం హనుమంతరావు . ( ఈనాడు - గల్పిక- 06-03 - 2015 )

 





ఈనాడు - గల్పిక- హాస్యం 

రంగుల రాజకీయం 

- కర్లపాలెం హనుమంతరావు .

( ఈనాడు - గల్పిక- 06-03 - 2015 ) 


ప్రకృతి పూర్తిగా పాలిపోయి ఈసురోమం మంటే, హుషారుగా ఉండమని రంగులు చల్లుకుంటూ రంగప్రవేశం చేసేది హోలీ

పండుగ.  


కేంద్రం ఆర్థిక పద్దులదీ అదే పద్ధతి. సర్కారు శాఖలు ఆకులు రాలిన చెట్ల మాదిరి వెలా తెలబోయే వేళకు, నీళ్లడుగంటిన జలా శయాల మాదిరి సర్కారు బొక్కసాలు బోసిపోయే నాటికి ... కాసుల గలగలలు చెవికి వినిపిస్తూ దూసుకు వస్తుంది కేంద్ర బడ్జెట్.


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈసారి హోలీకి ముందే రావడం దేనికి సంకేతం? రంగుల్లో సామ్యమా? 


మోదీ మార్కు బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకూ చివరికి టోపీనే మిగిలింది. ప్రతి తెలుగు మొహమూ ''తెల్ల'బోయింది. 


కడుపు మండిన కుర్రకారు ఎర్రజెండాలు పట్టారు. నీరసించిన ఉద్యోగులు 'నల్ల' బ్యాడ్జీలు పెట్టారు. ఒక్క బడ్జెటనే ఏముందిలే, స్థూలంగా చూస్తే రాజకీయం సమస్తం వర్ణ సంకర సంరంభం!


హోలీ రంగుల వేడుక ఒక్క పూటే. రాజకీ యాల్లో రంగుల ఆట ఏడాదంతా. 


అడ్వాణీ నుంచి అదానీ దాకా , రాహుల్ బాబు నుంచి... రాందేవ్ బాబావరకు  'మరక' తప్పిం చుకోలేరు.  


పండుగ గడిచే వరకు 'హోలీ' అంటూ పలకరించి రంగులు చిలకరిస్తారేమోనన్న భయంకొద్దీ పాతాళంలో దాక్కునట్టు న్నారు- రాహుల్ గాంధీ! మరక పడటానికి మనిషి కనపడాలా? మదర్ థెరిసా ఏ చట్టసభలో ఉన్నారని ఆమెపై మతం మార్పిడి రంగులు పిచికారీలతో చిమ్ముతున్నారు!


రాళ్లు విసురుకునే శత్రువులు సైతం రంగులు చల్లుకునే సౌహర్ద పర్వం హోలీ అంటారా... అంతకన్నా హోలీకార్యం కదా రాజకీయం!


హోలీ పిల్లలకు మాత్రమే సంబరం కావచ్చు.  రాజ కీయం పెద్దలకు కూడా పెద్ద సరదా తీర్చే క్షేత్రం. 


హోలీలో రంగులు కేవలం 'ఆట'కే పరిమితం. రాజకీయాల్లో 'రంగులు' ఆటపట్టించడానికి వాటంగా ఉండేవి. 


ఒక్క ఈ రంగుల పండుగ రోజునే దత్తన్న గులాబీ రంగులో మునిగి కనిపించేది. జగనన్న పచ్చరంగు అంగీలో మురి పించేది. కాస్త కష్టపడి తుడిపిస్తే ఇష్టనాయకుణ్ని గుర్తుప ట్టడం కష్టంకాబోదు పండగ మర్నాడు!.


మరీచి మహర్షి కనిపెట్టింది కేవలం ఏడు రంగుల్నే. హోలీలో వాడేవి వాటికే పరిమితం. మరి మన మరీచవారసులు వాడే రంగులో? కౌరవుల కాళ్లు చేతులు కూడా ఓ మూలకు చాలవు వేళ్లు ముడిచి లెక్కించుకోవడానికి! 


హోలీలో రంగుల పరమార్ధం హుషారు, వినోదం మాత్రమే. రాజకీయాల్లో రంగుల పరమార్ధం బహుళార్థకం. మూలపడ్డ పథకాలకు కొండపల్లి రంగులు వేసి బజారులోకి మళ్ళిస్తే బోలెడంత పేరు, ఆదరణ! ఎన్డీయే ఆహార పథకం యూపీయే పాత పన్నాగమేనని సోనియాజీ అభియోగం! యూపీయే ఉపాధి సాయం వాజ్ పేయీ పాపాయికి కొత్త మేకప్ కాదా అన్నది మోదీజీ ఎదురు వాదం. 


' రంగు పడుద్ది' అంటూ ఓ చిత్రంలో ఎదురుపడ్డ ప్రతి బెదురుగొడ్డునూ అదిలిస్తుంటుంది. ఒక దుష్టపాత్ర. ఎవడో వచ్చి పనిగట్టుకుని పోస్తేగాని పడని రంగు మరక హోలీ పండుగది. ఎవడికివాడుగా వాడుకగా సమయ సందర్భాలనుబట్టి రంగులు వాడుకునే పద్ధతి రాజకీయా లది. 


మహా నటుడైనా నటించే కాసేపే మొహంమీద రంగులు కనిపించేది . రాజకీయాల్లో నేతలు పెయింట్ డబ్బాలు కోటు జేబుల్లో పెట్టుకుని తిరిగితేనే రాణించేది. 


సీతాపహరణార్థం సాధువేషం వేసిన రావణాసురుడు విమానం ఎక్కిన మరుక్షణంలోనే అసలు రూపంలోకి వచ్చేశాడు! దుర్యోధనుడు మయసభా మధ్యంలో జారిపడటం చూసిన పాంచాలి, దుఃఖం నటించడం రాక కడగండ్లపాలయింది . ఎంత మహారాజైతే మాత్రం సుఖమేముంది? శకుంతల వంటి ముద్దుగుమ్మ భార్యనంటూ వచ్చి స్వీకరించమంటే వేళకు గుర్తుకు రాలేదని వద్దు పొమ్మన్నాడేమిటి దుష్యంత మహారాజు? అదే కలియుగంలోగాని జరిగి ఉంటే- చప్పున ముఖానికంత ప్రేమ రంగు పులుముకొని వచ్చిన అవకాశాన్ని సద్విని 'యోగం చేసుకోడా నవీన దుష్యంతుడు! 


ప్రసంగానికి ముందు విత్తమంత్రి మోసే తోలుపెట్టె రంగు, వేసుకునే పెట్టీకోటు రంగు మీదనే జాతీయ ఛానళ్ల కళ్లన్నీ!  అదే పనిగా ప్రత్యేక ప్రసారాలు  చేసేదెందుకు? 


 తెల్లకార్డు, గులాబీకార్డు అంటూ పౌరులకిచ్చే గుర్తింపు పత్రాలకు రంగే ప్రధానం. 


నెత్తిమీద తెల్లటోపీ తప్పిస్తే, ఆమ్ ఆద్మీ నేతను గుర్తుపట్టడం ఎంత కష్టం? పచ్చ రంగు అంగీలల్లో  బహిరంగంగా కనబడినంత సేపే తెదేపాలో సభ్యత్వమున్నట్లు.  పచ్చ ధనం  కోసం తెలంగాణ సర్కారు పడే పాట్లు, నల్లధనం కోసం కేంద్రప్రభుత్వం చేసే ఫీట్లు... రంగులతో లింకులు లేకుంటే రాజకీయాలకు రంజే ఉండదు. 


ఏ రంగురాయి ధరిస్తే నాలుగురాళ్లు గుట్టుచప్పుడు కాకుండా కూడగట్టుకోవచ్చో చెప్పే రంగురాళ్ల శాస్త్రానికి రాజకీయాలలో ఎంతో  గ్లామరే! 


ఇంద్రధనుస్సులో ఉండేవి ఏడు రంగులే. రాజకీయాలలో నలిగే రంగులు చూసి ఊసరవెల్లైనా  ఖంగు తినాల్సిందే. 


హోలీ రాక సాధారణంగా ఫాల్గుణ పున్నమికే. జైట్లీ బడ్జెటు దెబ్బకు కాళరాత్రిగా మారిందీ సారి తెలుగువాడికి .  మళ్ళీ వచ్చే హోలీనాటికైనా మన తెలుగు రాష్ట్రాల ఖజానాలు  నిండుగా గలగలలాడాలి . అప్పడే అసలైన రంగుల పండుగ. 


- కర్లపాలెం హనుమంతరావు

 ( ఈనాడు - గల్పిక- 06-03 - 2015 ) 

ఇల్లే ఒక పార్లమెంట్ - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయ పుట ప్రచురణ)

 


ఇల్లే ఒక పార్లమెంట్

-     కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు సంపాదకీయ పుట ప్రచురణ) 

 

ఇల్లొక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకుంటే ఇంటాయన ప్రసిడెంటాప్రధానమంత్రా?’ 

పాకిస్తానయితే ప్రధానమంత్రి.. ఇండియా ఐతే ప్రెసిడెంట్ అనుకోరాదూ?శ్రీమతి  లండన్లో మాదిరి  ప్రధాన మంత్ర్ర్రిగా పవర్ ఫుల్ గా ఉంటేనే ఉంటేనే ఇంటికిమగాడి వంటికి మంచిదని నా అభిప్రాయంఅంది  చెంచులక్ష్మి.

చెంచులక్ష్మి పత్రికలలో స్త్రీల పక్షం వహించి ఘాటుగా  రాస్తుంటుందిహైదరాబాద్ లో మా ఆడపడుచుగారింటికి వెళ్లినప్పుడు ఆవిడ వాళ్ల ఫ్లాట్స్ లోనే ఉంటుందని తెలిసి ఒక మధ్యాహ్నం పూట మా ఆడపడుచుతో కలసి చూడ్డానికి వెళ్లానుచెంచులక్ష్మి బాగా రాయటమే కాదు.. బాగా మాట్లాడుతుంది కూడాఇంటిని పార్లమెంటనడంలోనే గొప్ప పాయింట్ లాగిందావిడ

'… ఎగువ సభ సభాపతిలా మామగారుదిగువ సభ ప్రతిపక్షంలా అత్తగారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు మామూలే అది పిల్లలు రకరకాల రాజకీయ పార్టీలుఇరుగుపొరుగువారు చైనా పాకిస్తాన్ లాంటి వాళ్లుమిత్రబృందాలు కల్చరల్ ఎక్ఛేంజికి వస్తుంటారువీళ్లందర్నీ పర్యవేక్షించాల్సిన వాళ్లం మాత్రం మనమే కదా చివరికి !'

'లెక్చర్ పిచ్చగా ఉందిప్రొసీడ్అని ఎగదోసింది మా ఆడపడుచు ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొడుతూ ట్రెజరీ పక్షాల వాళ్లు ప్రధాని మాట్లాడినప్పుడు మధ్య మధ్యలో బల్లలు బాదేస్తారే .. ఆ  మోడల్లోడైనింగ్ టేబుల్ మీద మోదేస్తూ ఈవిడ ఇలా ప్రోత్సహించడంలో ఇద్దరి మధ్యా ఏదైనా లోపాయికారి ఒప్పందంలాంటివి ఏమన్నా ఉన్నాయేమోఅని నాకు అనుమానం మొదలయిన మాట నిజం సుమా!

చెంచులక్ష్మి రెచ్చిపోతూ 'ఇంట్లో ఏ ప్రాబ్లమొచ్చినా డైనింగ్ టేబుల్ దగ్గర చర్చకు వచ్చి తీరాల్సిందే ఏ కొంపలో  అయినాదాన్నే మేం ముద్దుగా రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ అని పిలుచుకుంటుంటాం ఇంట్లోమేటరెంత కాన్ఫిడెన్సయినా సరే,  ఎట్లా లీకవుతుందో తెలీదు .. మాకన్నా ముందు పక్కింట్లో చర్చ మొదలయిపోతుంది ఈ మధ్య  ఈ అపార్ట్ మెంట్స్ లో

'స్వగృహ రహస్యాలను పొరుగిళ్లకు చేరవేసే కోవర్టులు ప్రతీ ఇళ్లలోనూ ఏదో రూపంలో ఉంటారులే’ అని గునిసింది మా ఆడపడుచు  నా వంక చూపులు సాధ్యమైనంత వరకు పడకుండా జాగ్రత్త పడుతూఆవిడగారి నిందార్థాలు బహుశా మా అమ్మ మీద అయివుంటాయని అర్థమయింది

'మేటర్ మరీ సీరియస్సయితే ఉభయసభలనూ సమావేశపరచి లోతుగా చర్చించ వలసిన అవసరం ఉంటుందిమా అమ్మాయి ఈ మధ్య రాత్రుళ్లలో వీరప్పన్ ను గురించి ఒహటే కలవరిస్తోందిదీం దుంపతెగపోయి పోయి ఆ దుంగల దొంగ వెధవ వలలో  పడిందేమిటి చెప్మాఅని మా వారు ఉప్మా తింటున్న ప్రతి పరగడుపునా కన్నీళ్లు పెట్టుకొనే సీను చూసి చూసి నాకూ  ఝడుపు జొరం పట్టుకుంటుందేమోనని అనుమానం మొదలయిందిఒక రోజు పిల్లదాన్ని పట్టుకుని గట్టిగా నిలదీస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పాపం పసిదానికిఆ బూచాడికి బారెడు మీసాలు మొలుస్తుంటాయి కదారెండేపులా గుమ్మడికాయలు నిలబెట్టినా  లొంగనంత ధృఢంగా ఉంటాయిఏ చందనం తైలం వాడుతున్నాడో చచ్చినోడు .. కనుక్కోడమెట్లా అని అలోచిస్తూ పడుకుంటున్నానే మమ్మీనేరుగా నిద్రలోకే వచ్చి ఆ ఒక్కటి తప్ప మిగతా ముచ్చట్లన్నీ చెప్పి చస్తున్నాడుఅని బావురుమనేసిందినమ్మక చస్తామా?

'దేశమో వంక తగలడి చస్తోంటే మీసాలకు రాసుకునే సంపెంగ నూనె వివరాలంత అవసరమా దీనికి?' అని మా మగాయన గెంతులేస్తుంటే నేనే గుడ్లురుమి ఎట్లాగో అదుపులో పెట్టా!'

'ఈ కాలం పిల్లకాయలను గురించి ఈ మగాళ్లకేం తెలుసుకెరీర్ ఓరియెంటెడే కాని.. కాలేజీకి తీసుకెళ్లే కేరేజి ఎలా సర్దుకు చావాలో కూడా కోర్సులో చేరితే తప్ప బుర్రకెక్కని మట్టిముద్దలుపిల్లల్ని అట్లా పెచుతున్న పాపం నిజానికి మన పేరెంట్సుదేసరేమీ మైనస్సును గురించి చెప్పావుమరి ప్లస్సును గురించి కూడా మా ఆడపడుచుచెవిలో వెయ్యి!' అంది మా ఆడపడుచు

'యూ మీన్ .. మా అబ్బాయాఅబ్బాయిల్ని ప్లస్సులుఅమ్మాయిల్ని మైనసులు అనుకుని పెంచడానికి మనమేమన్నా సంసారాలని వ్యాపారాలకు మల్లే నడుపుతున్నామా?డెబిటైనాక్రెడిటైనా రెండు సైడ్లు చివర్లో సమంగా ఉంటేనే అది సరైన బ్యాలన్స్ షీట్ అవుతుందని మా వారెప్పుడూ అదేదో వాళ్ల బ్యాంకు గోలలో ఘోషిస్తుంటారునిజం చెప్పాలంటే మా వాడో పెద్ద వాజపేయిమేథావే గానీఏదీ ఇతమిత్థమని ఒక పట్టాన తెమల్చడుమొన్నటికి మొన్న పరీక్షలని తెల్లార్లూ చదివి చదివి తీరా పరీక్ష హాలు కెళ్లి తెల్లకాగితం ఇచ్చొచ్చాడు. 'రాయడానికి మరీ అంత బద్ధకమేంట్రా వెధవా?' అని గట్టిగా నిలదీస్తే ఈ కింది దానిలో ఏదేని రెండిటికి మాత్రమే సమాధానం వ్రాయుడు!' అని రాసుందట. 'టూ ఓ క్లాక్ దాకా కూర్చునే ఓపిక లేక తిరిగొచ్చేసాను మమ్మీ!' అని దిక్కుమాలిన జవాబుపిల్లల్ని ఇట్లా చెడగొట్టింది వాళ్ల డాడీ గారాబమే!'

'పవరంతా ఈవిడ చేతిలో పెట్టేసుకుని అప్పోజిషన్ వాళ్లను పి.యం తిట్టినట్లు ఎట్లా తిడుతుందో చూసావా మహాతల్లి! ' అంటూ నా చెవిలో గుసగుసలు పోయింది మా ఆడపడుచుఆవిణ్ణి అట్లా పక్కకు పోనిచ్చి

'అన్నయ్యగారు ఓన్లీ ప్రెసిడెంట్ లాంటి వాళ్లని నువ్వే అన్నట్లు గుర్తుఅ ని మళ్లీ రెచ్చగొట్టే పని మొదలుపెట్టింది మా ఆడపడుచు. ' 

'ఆడది మొగుడు అడుగుజాడల్లో నడిచి తీరాలని కదండీ మన  శాస్త్రాల నుంచి తెలుగు సినిమాల వరకు అన్నీ ఘోషిస్తున్నదిఅని అడిగాను అక్కడికి నేనూ కొద్దిగా లేని ధైర్యం కూడగట్టుకొని 

'మొగుడు అడుగుజాడల్లో నడిస్తే మన దేశంలో ముప్పావు వంతు మంది ఆడవాళ్లు ఏ బారుల్లోనోపేకాట క్లబ్బుల్లోనో తేలుండేవాళ్లు.' అని గుర్రుమందావిడ

'నీ తీరు చూస్తుంటే  నువ్వింట్లో మీ వారి మీద వార్ గ్రూప్ మాదిరి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుందేఇట్లా అయితే అన్నయ్యగారెప్పుడో 'భాబా’  సంఘంలో చేరిపోతారేమో వదినాముందది చూసుకో!' అంది మా ఆడపడుచు

'భాబా సంఘమాఅంటే?'

'భార్యా బాధితుల సంఘం'

'తలకిందులుగా నడిస్తే నవ్వొస్తుంది కదా అని మగాళ్లే ఇలాంటి తలతిక్క సంఘాలు పెట్టి మన పరువు తీసేదిపత్రికల్లో వచ్చే అప్పడాల కార్ట్యూన్లన్నీ మన ఆడవాళ్ల ఇమేజీని నెగటివ్ గా చూపిస్తున్నాయని నేనంటానుమనం ఆకాశంలో సగం అంటారు కానీ.. మూడో వంతు వాటా ఇవ్వడానిక్కూడా ఎన్నేసి నాటకాలు ఆడుతున్నారో చూడుపేరుకెన్ని రిజర్వేషనులుంటే ఏమిఅవన్నీ మొగాడు ఆడదాని ముసుగులో వేసే వేషాలేహక్కులు దేబిరించి తెచ్చుకుంటే  వచ్చిపడేవాపోరాడి గెల్చుకునేవిరాజకీయలనగానే మనకు ఒక్క ఇందిరమ్మ పేరు మాత్రమే ఎందుకు గుర్తుకురావాలిజయలలితోమాయావతో, మమతమ్మ  బెనర్జీనోఇలా ఏవో ఓ పుంజీడు పేర్లు మాత్రమే పలుకుతున్నామంటే  మనమెంత వెనకబడి ఉన్నామో అర్థంచేసుకోవాలి? 'అర్థరాత్రి పూటయినా ఆడదిస్వతంత్రంగా బైట తిరగ్గలిగే రోజు వచ్చినప్పుడే మనకు నిజమైన్న స్వాతంత్ర్య్యమొచ్చినట్లని బాపూజీ అన్నాడంటే, 'ఆడది అసలు అర్థరాత్రిళ్లు బైటెందుకు తిరగడంఅనేసే మాగాళ్లు.పొట్టపగిలిపోయేటట్లు  అదో జోకన్నట్లు నవ్వి చచ్చే జోకరుగాళ్లు  ఉన్నారంటే  ఆ తప్పెవరిది? 'మగాడు ఎందుకు తిరుగుతున్నాడో అందుకుఅని ఆడది తెగించి జవాబు చెప్పినప్పుడు కదా మనకు నిజంగా స్వతంత్రం వచ్చినట్లు గుర్తు!' అంది చెంచులక్ష్మి ఆవేశంగా

మేటర్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా ఆవిడగారి ఆందోళన అర్థం చేసుకోదగ్గదేఎమోషన్లో పదాలేవో అటూ ఇటూ పడతాయిఅది కాదువిషయం ప్రధానంరిజర్వడ్ చైర్లకు ఎన్నికైన ఆడవాళ్లలో ఎక్కువ భాగం ఆయా మొగుళ్ల చేతిలో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని ఒకానొక ప్రముఖ దినపత్రికలో ఆవిడ రాసిన వ్యాసం చదివిన రోజు నుంచి మా ఊరి మహిళామండలి సభ్యురాళ్లందరికీ ఆవిడంటే తగని అభిమానం పుట్టుకొచ్చినమాట నిజంఒకసారి చెంచులక్ష్మిగారిని మా ఊరు తీసుకెళ్లి సభ పెట్టిస్తే నాకు మంచి క్రెడిట్ దక్కుతుంది.  ఆ విషయమే అడగడానికి  అసలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా.  నా ఆహ్వానం విన్న మీదట నవ్వుతూ 'దాందేముందండీమా వారెప్పుడు ఖాళీగా ఉంటారో కనుక్కొని చెబుతానుఇద్దరికీ టిక్కెట్లు బుక్ చెయ్యాల్సుంటుంది మరిఒక్కదాన్నే అంత దూరం ప్రయాణమంటే ఏమంటారో మరి.. రోజులు అసలే బాగా లేవు కూడా !' అంటూ లేచి నిలబడింది!

'మమ్మీఇంకెత సేపేడాడీ నిన్ను టిక్కెట్లు తీసుకోమన్నాడులేడీస్ క్యూలో అయితే రష్ తక్కువగా ఉంటుందట!' అంటూ పుత్రరత్నం సెల్ చేతిలో పట్టుకుని పరుగెత్తుకుంటు వచ్చేసాడు

'సినిమాకా?' అని అడిగింది మా ఆడపడుచు. 'అవును ఏడుపు టీవీలు చూడలేక పిక్చర్కే ప్లాన్ చేసారు మా వారుసీరియల్ అయితే మళ్లీ రేపు కూడా వస్తుందిగాఅందునా మగాళ్లు అడిగినప్పుడు కాదంటే ఇల్లో పార్లమెంట్ అయిపోతుందిఅని హడావుడిగా లోపలికి పరుగెత్తిందితయారవడానికి కాబోలు !

'ఏం సినిమారా.. చిన్నా?' అని మా ఆడపడుచు అడిగిన ప్రశ్నకు రేణుకాదేవి మాహాత్యంఅనేసాడు అభం శుభం తెలియని ఆ ఇంటి పార్లమెంట్ నామినేటెడ్ మెంబర్ భడవా !

-కర్లపాలెం హనుమంతరావు

31 -08 -2020

***

(ఇల్లే పార్లమెంట్ పేరుతో ఈనాడు దినపత్రిక 17 -02 -2003 లో ప్రచురితం)

 

 

ఈనాడు - వ్యంగ్యం గడ్డే పెట్టండి మహాప్రభో! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయ పుట - 18 - 09- 2002 - ప్రచురితం)

 




ఈనాడు  - వ్యంగ్యం 


గడ్డే పెట్టండి మహాప్రభో! 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయ పుట - 18 - 09- 2002 - ప్రచురితం) 


'మాకరపు జిల్లాల్లో గడ్డిస్వామి పవరు విన్నారా బావగారూ? అనడిగాడు మా బావ మరిది - మొన్న పండక్కి వాళ్లూరు కవిసమ్మేళ నానికెళ్లినప్పుడు. 'గడ్డంలోంచీ గడ్డిని మొలిపిస్తాడాయన ' అన్నాడు గర్వంగా


'గడ్డంలోంచి పేలు పుట్టించొచ్చుగానీ.. గడ్డినెలా మొలిపిస్తాడోయ్!'


' శూన్యంలోంచి లింగాలను లాగుతున్న ప్పుడు... ఆకుల్నుండీ పెట్రోలు పిండుతున్న ప్పుడు... గడ్డంలోంచి గడ్డిని పీకటంలో వింతేముందండీ ? ' 


'ఏమైనా మీ గడ్డిస్వామి గారి సామాజిక స్మృహకు నా జోహార్లు. నోరులేని మూగ జీవాల మేతను అంత ఉదారంగా మొలిపించి ఉచితంగా పంచటం నిజంగా ముదావహం.' 


'గడ్డిస్వామిగారికున్నంత భూతదయలో వందోవంతు మన గవర్నమెంటుకుంటే మాకు ఈతిప్పలన్నా తప్పేవి కదా! కరవు మూలకంగా భూములు బీడుపడిపోయాయి. కరుణించి కాస్త 'గడ్డి పెట్టండి మహాప్రభో!' అని కాళ్లా వేళ్లా పడంగా, పడంగా, కరవు కాటకాల్ని ఇన్నాళ్టికి ఓ  నాట కంలా చూసిపోయింది కేంద్ర బృందం!'


'జిల్లాల్లో తిరిగినప్పుడు కరవు చూసి గుండెలు చెరువయ్యేలాగా బాగానే కన్నీళ్లు కార్చుకున్నారుగానీ, ఢిల్లీ గాలి సోకంగానే గుండె రాయిగా మారినట్లుంది... సవాలక్ష యక్షప్రశ్నలు సంధిస్తూ హైదరాబాదధికారుల్ని హడలు గొట్టేస్తున్నార' ని  విన్నాను.' 


' నిజమే. నిరుటి కరవుకు విడుదలైన నిధుల మిగులు వివరాలు కూడా ఇప్పుడడు గుతున్నారని దిగులుపడుతున్నారు. ఢిల్లీ నిండా నాయకులేనాయె!... అక్కడ మాత్రం గడ్డిక్కరవుండదూ! అందుకే తృణానికి బదులు తృణమో ఫణమో విత్తనాలు నెత్తికి రుద్దాలని చూస్తున్నట్లున్నారు.' 


'అందుకే... విత్తనాలొద్దు... గడ్డే కావాలని మొత్తుకొనేది. గడ్డి తినే జీవాల వివరాలన్నీ వెంటనే పంపిస్తేనే గ్రాంటు సంగతి వింటాం. అంటున్నార్ట సెంట్రలువాళ్లు' 


' ఆ లెక్కలిప్పుడెక్కడ దొరుకుతాయోయ్!... అంతర్జంటుగా ఏ ఏసీబీ వాళ్ల దగ్గరో... సి.బి.ఐ. ఫైళ్లలోనో... రోజువారీ పేపర్లలోనో కొన్నున్నా కోట్లలో గ్రాంటన్నప్పుడు ఇంకా ఎన్నో వివరాలు పంపాల్సుంటుంది!' 


' బాగా చెప్పార్సార్ ' అన్నాడు తలుపు దగ్గర నిలబడినాయన వినయంగా చేతుల్లోని కాగితాలూపుకుంటూ..


'వినాయకచవితయిపోయింది గదయ్యా! ఇప్పుడేంటి మళ్ళీ చందాలూ? ' 


' చందాలు కాదు బావగారూ! మావూరు పంతులుగారు, జంతువుల వివరాలు రాసుకుందుకొచ్చాడు' అంటూ కూర్చునేందుకు నులకమంచం చూపించాడు మా బావమరిది.


'మా గాడిదకేమన్నా రెండు ముక్కలు వంటబట్టేటట్లున్నాయా సార్.. అడుగో... అడ్డమైన గడ్డీ నములుతూ ఇక్కడే నిలబ డ్డాడు' అన్నాడు రెండో కొడుకువైపు మిర్రిమిర్రి చూస్తూ.


'గాడిదలు కూడా ఇలా గడ్డితింటే ఎలా గండీ? అందుకే ఇక్కడ ఇంత కరవొచ్చింది!' అని  గుడ్లురుమిచూశాడు... పక్కనే నిలబడ్డ  పెద్దాయన. 


పశుగణాంక వివరాలనుపర్యవేక్షించే అధికారిట ఆయన. హైదరాబాద్ టీవీ నుంచీ వచ్చాడు. 


ప్రశ్నపత్రం చూపి క్వశ్చన్నడగటం మొదలు పెట్టాడు గడగడా


' మీ ఇంట్లో మొత్తం జంతువులెన్నీ?... అందులో గడ్డి తినేవెన్నీ? ... అన్నం తినేవెన్నీ? అన్నం తరువాత నీళ్లు తాగేవెన్నీ? ... తాగనివెన్నీ? .... పిల్లలూ... కుక్కలూ... ఏమైనా ఉన్నాయా?' 


' అబ్బే.. అవేవీలేవండీ!' అన్నాడు మా మామగారు భయంభయంగా.


' పోనీ.... నల్లులూ? ... బల్లులూ...? ఈగలూ... దోమల్లాంటివైనా ఉన్నాయా? ' 


'అవి లేకుండా కొంపెలాగుంటుందండీ!' అన్నాడీసారి వినయంగా . 


'అయితే నల్లులు షుమారెన్నుం డొచ్చూ? .... బల్లుల్లో ఆడవెన్నీ! ... మగవెన్నీ? ఈగలన్నీ ఈ ప్రాంతంవేనా?... వేరేచోటు -నుండి వలస వచ్చాయా? దోమలకు బోదకాల్లాంటి వ్యాధులేమైనా ఉన్నాయా? నల్లులకు అనీమియా రాకుండా జీవకారుణ్యం వాళ్ల పథకాలున్నాయి. అవి అమలుచేస్తున్నారా? ..... 


అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పా రింట్లో అందరూ కలిసి.


' కరవు కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో అయితే ఈ ఏరియాలో వివరాలు సేకరిస్తున్నారేంది సార్!' అనడిగానాఖర్లో.


ఇప్పటికిప్పుడు అంత దూరం గడ్డి కమిటీని పంపడం కుదర్దుకనక... అందుబాటులోఉన్నవరకూ ఇక్కడే వివరాలు సేకరిస్తున్నాం. సాయంకాలానికల్లా ఫిగర్లు ఢిల్లీ వెళ్లాలిమరి' అని కంగారుగా లేచి నిలబడ్డాడాయన. 


' క్రైసిస్ మేనేజ్మెంట్ని కవర్ చేయటంలో మనవాళ్లని మించిన మొనగాళ్లు లేరోయ్!'


'ఏదో.. గవర్నమెంట్ గ్రాస్ సాలరీస్ తీసు కొనే వాళ్లం. ఈ గ్రాసం కోసం ఆ మాత్రం సాయంపట్టకపోతే విశ్వాసమన్నమాట కసలు మీనింగ్ లేదుకదాసార్! అవునూ.... ఇందాక మీవాడు తిన్న ఆ గడ్డెక్కడ దొరుకు తుందో కాస్త చెబితే... అక్కడో 'గడ్డిమేళా'లాంటి దేదన్నాఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాంగా! '  అన్నాడు ప్రసన్న చిత్తంతో . 

మేళాలెందుకయ్యా బాబూ ! మేతపెట్టండి చాలూ......| 


' మేతకేనయ్యా ఈ యాతనంతా!  జంతువుల మేత జంతువులే తినాలని మా ఉద్దేశం. జంతు సమేతంగా రావాల్సుం టుంది మేళాకి.  బీహార్లో దాణా కుంభకోణం తరువాత ఆ అనుభవంతో కొత్త కోణంలో నుంచి ఆలోచించి మరీ ఆచరిస్తున్న పథకమిది' అంటూ వెళ్లిపోయాడాయన.


గడ్డివాముల్లో కూడా స్కాముల్లేకుండా ముఖ్యమంత్రిగారు ముందుచూపుతో తీసు కున్న చర్యలాగుంది. బాగుంది.


' పల్లెల్లో కూడా జనం తెలివిమీరిపోతున్నా రండీ! లేటెస్టు లెక్కల ప్రకారం ఇంటికో మనిషి... నాలుగు గొడ్లూ ఉన్నట్లు లెక్కతే లిందిప్పుడు ' అన్నాడు. మర్నాడు సాయంత్రం పంతులుగారు బస్టాండులో కల్సినప్పుడు. 


' మనం, జంతువుల్ని మేపుతు న్నామా? జంతువులు మనల్ని మేపుతు న్నాయా? అని వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రిగారు మండిపడ్డాట్ట. ఆయనసలే కరాఖండి. అంటే కరవులో రాజకీ యాల్ని ఖండించే మొండి మనిషన్నమాట.' 


కాకిలెక్కల్లో కాకలుతీరిన అధికారులు ఇక్కడ ఏవో కాకమ్మ కతలుచెప్పి తప్పించు కుంటారేమోగానీ... సెంట్రల్లో ఇంకా కాకలు తీరిన 'కాకా'లున్నారు. గడ్డికైనాసరే.. వూరికే గుడ్డిగవ్వ గ్రాంటుగా ఇవ్వరు. పనికి ఆహారం' పథకం మానేసి పనికి గడ్డి పథకం' పెట్టేసినా పెట్టేస్తారు... ఈ మితిమీ రిన 'జంతుసంతతి లెక్కల'తంతు చూసి...'


'ఆ గడ్డయినా వూరికే దొరుకుతుందా... ఏందీ?... ఏ గడ్డి స్వామిలాంటివాళ్ల గడ్డమో పట్టుకొని జిల్లాల వారీగా పీక్కునే పథకం పెట్టుకోవాల్సిందే' అన్నాడు మా బావమరిది.


'కరవు పోర్టుఫోలియో ఒకటి వేసి 'గడ్డి'ని కూడా దానికి జతచేసి నిన్ను మినిష్టరుగా చేస్తే భేషుగ్గా వుంటుందోయ్... బావమరిదీ'' అన్నాను బన్సెక్కుతూ అతని భుజంతట్టి.


'అట్లాచేస్తే వచ్చే కరవు కాలంనాటికి మరింత మంది గడ్డిస్వాముల శిష్యుల్ని తయారుచేయించి గ్రాంటుకు సిద్ధంగా వుండనూ' అన్నాడతను కులాసాగా భూజాలెగరేసి. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయ పుట - 18 - 09- 2002 - ప్రచురితం) 

సాక్షాత్ పర బ్రహ్మమ్ ! - ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం గురు

 



ఈనాడు - గల్పిక - హాస్యం - వ్యంగ్యం 

ఉచల్లేని బోను 

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం - 18 -08 -2002 ) 


పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటి లాగా మౌనుగా శృశానంకేసి నడువసా గాడు. అప్పటికే శమంలోని బేతాళుడు ఒకై దొందల తొంభై నాలుగు చందమామ కతలు చెప్పి మహారాజుకు మౌనభంగం కలిగించిన దీమాతో మరోమారదే కార్యక్ర మానికి శ్రీకారం చుడుతూ 'రాజా! ఒక పొడుపు కథ పొడుస్తా విడుస్తావా'అంటూ చెప్పటం మొదలు పెట్టాడు.


అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సుమారొక ఐదొందల పైచిలుకు బోర్డు మెంబర్లుండొచ్చు. అందులో నూట పాతిక మంది బి.నామీ నేముల్తో బ్యాంకు లోన్లు కొట్టేసి ఐపీలు పెట్టిన వీఐపీలు, సగం మంది ఇన్కంటాక్సు  మొదలు ఇంట్లో కరెంటు బిల్లు, ఇంటి పన్నులవరకూ బకా యిలు పెట్టందే  గిట్టని శిష్టాచార సంప న్నులు, బ్యాంకు బ్యాలన్సు లేకుండా బర్రుమని చెక్కులు చించిచ్చేసే మస్కాగాళ్లు, క్రెడిట్ కార్డులు కావాలని ఓవర్ డ్రా చేసి కట్టమంటే తప్పించుకు తిరిగే మాయగాళ్లు, సూపర్ మార్కెట్లో ఎవరూ చూడకుంటే చీపురు పుల్లలయినా కొట్టేసే చీపు టైపు టోపీగాళూ.. గట్రాలు సగానికిపైగా ఉండే ఆ కంపెనీ చేసే పనేమిటో తెలుసా? తెలిసికూడా చెప్పకపోయావో, తెలుసుగా, నీ తల ఇక్కడే, ఇప్పుడే వెయ్యి వక్కలైపో తుంది' అని బెదిరించినా పెదవి విప్పుని రాజును చూసి. . ఈ సత్యకాలం విక్రమార్కుడికింకా  వివరంగా విడమరిచి చెబితే గానీ విషయం బోధపడి మౌనభంగం కాదని కథని కంటిన్యూ చేశాడు బేతాళుడు. 


రాజా! నీ పట్టుదల చూస్తుంటే ముచ్చ టేస్తుంది. కానీ నీకన్నా పట్టుదలగల సభా ఒకటి పుట్టివుంది. విసుగు పుట్టకుండా ఉండేందుకు నీకాకథ చెబుతా వింటావా! అంటూ చెప్పసాగింది.


అనగనగా ఒక దేశం. ఆ దేశానికాదేశాలిచ్చేందుకో సభ . అది ఐదేళ్లకోసారి మారుతూ వుంటుంది . అర్ధాంతరంగా ఏదైనా రభస జరిగితే మాత్రం మధ్యంతర

ఎన్నికలు తప్పనిసరి. మళ్ళీ జనం దగ్గరి కెళ్ళి ఓట్లేయించుకు రావాలి సభ్యులు. ఓట్లంటే ఎన్ని పాట్లు! ఎన్ని ఒట్లు వెయ్యాలో . . తెలుసా!


ఎప్పుడూ ఓడిపోయే పార్టీలన్నీ కలిసి ఈసారీ గెలవంలే అనే ధీమాతో ఒక ఊపులో పాపం 'రాజకీయాల్నుండీ నేరాల్ని దూరంగా తరిమేస్తామ'ని ఘోర ప్రతిజ్ఞలు చేసిపారేసాయొకసారి.  పదవులొచ్చిన తరవాతైనా పోనీ మెదలకుండా వున్నాయా! పదేపదే అదే పదాలని పెదాల మీదనుండి వదలకుండా వల్లె వేస్తున్నాయి . కానీ, ' చేతల్లో చేస్తున్నది మాత్రం సున్నా! ' అని ఓ చాదస్తపు ప్రజాసంస్థ  సరాసరి న్యాయస్థానం తలుపుతట్టింది.


ఓ ఫైవ్ పాయింట్ ఫార్ములాతో పంచ కూళ్ళ కషాయం కాయించి పొలిటికల్ పార్టీలన్నీ అది సేవించాల్సిందేనని న్యాయమూర్తి సెలవిచ్చారు. కోర్టు వారి సెలవేమీ శిలాశాసనం కాదు . పోయింది ప్రభుత్వం కదా! పైకోర్టుకు పోయింది ప్రభుత్వం. 


'పంచశీల ఫార్ములాను పంచ్యువల్ గా పాటిస్తే సభలో వేళ్లమీద లెక్కించేందు క్కూడా వీల్లేనంత తక్కువ మంది మాత్రమే మిగిలుంటారు యువరానర్' అని మొరపెట్టుకుంది. కిడ్నాపులూ దోపిడీలు, మర్డర్లూ, మానభంగాలు, డ్రగ్గులు... ఉగ్రులూలాంటి వాటితో సంబంధాలు ఉన్నవాళ్లు ప్రజాప్రతినిధులుగా పనికిరారం టూ- కనీసం రాబోయే ఎన్నికల్నుండైనా కాసిన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చుకదా..  అని

ఎన్నికల కమీషన్ని  కోప్పడిందా శ్రీ కోర్టు . చట్టాలు చేసే పని తమ చట్రంలో లేదనీ, చట్టసభలా పని చేస్తే ఆచరణలో చట్టుబండలు కాకుండేలా చూసేందుకే 'లా 'వుందనేలా ఒక వివరణ కూడా ఇచ్చింది.


ఎన్నికల బరిలోకి వురికే ముందే తమ చరిత్రలో ఏముందో స్వచ్ఛందంగా  చెప్పా

లని, అప్పులూ ఆస్తులూ, చదువులూ సంధ్యలూ, నేరాలూ ఘోరాలూ వగైరాల నిర్వాకాలేవైనా వుంటే బహిరంగపరచాలంటున్న పైకోర్టు సూత్రానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్వచనంతో నివ్వెరపోయిన రాజ కీయపక్షాలన్నీ, ఏకపక్షంగా ఒక చట్టాన్ని తేబోతున్నాయి. సర్వసత్తాక వ్యవస్థ సత్తా ఏమిటో ఈ చట్టం చేసి మరీ చూపెట్టబో తున్నాయి!


రాజా! దాని ప్రకారం నేరకపోయి చేసిన నేరం ఒకసారయితే సారీ అనేస్తే సరిపోతుంది. ఆరునెలల్లోపయితే ఏ పాపమయినా అభ్యర్థుల జాబితాలో చూపనవ సరమే లేదనేది దాని సారం. కనీసం రెండు వేరువేరు న్యాయస్థానాలయినా నిర్ధారణ చేయని ఏ నేరమయినా వ్యర్ధ మని పరమార్థం . పెండింగ్ లో  ఉన్నా, బెయిలు దొరికినా ఆ నేరం నిస్సారం. ఎల క్షన్ కమిషన్ ముందైనా సరే, సలక్ష ణంగా ఏ సంకోచం లేకుండా స్వేచ్ఛగా  నేరాలను దాచుకుంటూ చంకలు గుద్దు కునే సౌకర్యం అభ్యర్థులకు సంక్రమి స్తుందీ కొత్త చట్టం వల్ల. 


మహారాజా! ఈ కొత్త చట్టం మూలకంగా నాకు కొన్ని ధర్మ సందేహాలొస్తు న్నాయి. ఫోర్జరీలు... ఫోర్ ట్వంటీలు లాంటివసలు నేరాలే కానవసరంలేని నేపథ్యంలో నిష్కారణంగా తమను కేసుల్లో ఇరికించి వేధించారని చంద్రస్వామిలాంటి మహాత్మో, హర్షద్ మెహతా ప్రేతాత్మో కోర్టుకెక్కి పరువు నష్టం కింద కోట్లు కక్క మనే ఆస్కారముందంటావా?


కొత్త ఏక్టు ఫోర్సులోకొస్తే భోఫోర్సులో ఫోర్సు పోయి కేసే ఒక ఫార్సుగా  మారి పోయే అవకాశం లేదంటావా?


కొత్త చట్టం తెచ్చిన తరువాత తహల్కా టేపుల్ని చుట్టచుట్టి తలకింద పెట్టుకుని గుర్రుకొడుతూ ఎవరైనా హాయిగా నిద్రపోవచ్చంటావా?


పశుదాణా కుంభకోణం, పంచదార పందారం, యూరియా నిర్వాకం, శవపేటి కల వ్యవహారం, టెలికాం స్కాం, ఆదాయాల వివాదాలు, ఖల్నాయక్ కాంటాక్టులు, రామ్ నాయక్ పెట్రోలు పంపులు... అవేవీ అవినీతి పనులు కానేకావని ఎవ రైనా దావావేస్తే ఎంత కొమ్ములు తిరిగిన లాయర్లయినా కవర్ చేయగలరంటావా? 


వీధులూడ్చే ఉద్యోగానికైనా నేర విచా రణ చేయనిదే ఫైలు క్లియర్ కాని రోజుల్లో సభలోకి అలా  'నేరుగా' ఎవరికైనా ఎంట్రీ ఇవ్వటం ఎంతవరకు సబబంటావూ? 


పాస్పోర్టు జారీకైనా పోలీసెంక్వయిరీ కంపల్సరీ అనే సర్కారు- ఎన్నికల్లో పోటీకి ఏ నేరవిచారణ లేకుండా ఎవరిని బడితే వారిని ఎలా నిలబెడుతుంది ?


పొట్టకూటికి చిల్లర కాజేసే  చేసే చిల్లర దొంగలు సభల్లోకే నేరస్తులను నేరుగా పోనిస్తున్నప్పుడు మమ్మల్నెందుకు శిక్షిస్తున్నారని బోనులో నిలబడి న్యాయదే వతను నిలదీస్తే  సమాధానమేమొస్తుంది?


రాజా; నేరాలు చేసేవాళ్లందరూ చట్టాలతో చుట్టరికం నెరిపేందుకే ప్రజాప్రతిని ధుల పాత్ర పోషించే పాడుకాలం దాపురించవచ్చునేమో అని  నా సందేహం. ఇప్పుడైనా నా సందేహాలకు సమాధానాలు చెప్పగలవా? ఇంతకుముందు నేనడిగిన పొడుపు కథ విప్పగలవా? అని బేతాళుడు అడిగిందే తడవుగా


బేతాళా! నీ సందేహాలలోనే  అన్ని సమా ధానాలు వున్నాయి. నీ ప్రశ్నల్లోనే జవా బుల దాగున్నాయి. ఇంతకుముందు నువ్వడిగిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పేరు నేను చెప్పగలిగినా చెప్పలేను కాని.. అది చేసే పని మాత్రం తప్పక చెప్పగలను. 'ఊచలు లేని  బోనులు' తయారుచేస్తుంది కదూ! అన్నాడు విక్రమార్కుడు.


'శభాష్ విక్రమార్కా! మార్కులు కొట్టేశావ్! మరి మౌనభంగమయిందిగా.. మళ్ళీ కలుస్తా' అంటూ తుర్రుమని ఎగిరి తిరిగి చెట్టెక్కి కూర్చున్నాడు బేతాళుడు.


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం - 18 -08 -2002 ) 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం తెలుగువాడి తిండి యావ - రచన- కార్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 07-06-2009 - ప్రచురితం )

 



 



తెలుగువారు పాలిటిక్సులో ఎంత చురుకో పాకశాస్త్రంలో అంతకన్నా చురుకు . తింటే గారెలే తినాలనే రకం . నలు డికి, భీముడికి నవగాయ వంటకాలు నేర్పి పెట్టింది మన తెలుగువాడే . పంచదార కన్న పాల మీగడ కన్న, జుంటు తేనియకున్న జున్నుముక్క కన్న, వెన్న కన్న, దోరమాగిన మామిడి కన్న తెలుగు తియ్యగా ఉంటుందన్న ఓ భాషాభిమాని- పాకాభిమా నాన్ని కూడా నిర్మొహమాటంగా చాటుకున్నాడు. గొల్లపిల్లల వేళ్లసందు మాగాయ పసందును రుచి చూపించినవాడు మన పోతన . కర్పూర విడెమును గురించి కవిసార్వభౌముడెప్పుడూ గొప్పగా చెప్పుకుంటుండేవాడు.


' భరత ఖండంబు చక్కని పాడియావు' అన్నది చిలకమర్తివారి ఊహ. 'చిక్కటి పాల మీద మిసమిసలాడే మీగడను పంచదారతో కలిపి తిన్నట్లు నీ అమ్మత రూపాన్ని ప్రేమతో దాస్యం దోసిలి బట్టి జుర్రుకుంటాన' ని  భద్రాచల రామదాసు ఆశపడ్డాడు. అలంకారాలలో ఉష్మాలంకారం.. పండగల్లో అట్లతదియ  మన ప్రత్యేకత. పిల్లాడు దుర్ముహూర్తంలో పుడితే మేనమామ మెడలో గారెల దండ వేస్తేనే అల్లుడిని చూడనిచ్చే ఆచారం మనది . బందరులడ్డు, కాకినాడ కాజా, హైదరాబాదు బిర్యాని అంటూ ఊరుకో పాకం పేరు పెట్టేసుకుని మురిసిపోతాం మనం . పిల్లలక్కూడా కాకి-రొట్టె కథే ముందు చెప్పటం అనాదిగా వస్తోన్న వరవడి . 'తిండి గలిగివే కండగలదోయ్. కండ గలవాడేను మనిషోయ్' అని గురజాడవారు కూడా తిండిగోలతోనే మొదలుపెడతారు. 'రొట్టెముక్కా అరటితొక్కా' .. దేన్నీ పక్కన పెట్టద్దంటాడు ఋక్కల్లో మహాకవి శ్రీ శ్రీ . పరబ్రహ్మం దగ్గర్నుంచీ పకోడీ దాకా పద్యాలల్లారు అవధానం కవులు . పీత్వా  పేర్వా పున :పీత్వా  స్వర్గలోకమవాప్నుయేత్' అనేది ఓ కవి కాఫీ ప్రేమ .


మనం వట్టి అల్పసంతోషులం . గోంగూర పేరు చెబితే ఒళ్ళు మరచిపోతాం. పిల్లలు అమెరికా పోతుంటే ఏ పచ్చళ్ళు ప్యాక్ చేయించాలా అని తల్లి తల్లడిల్లిపోతుంది. సాష్ట్ వేరంటే  ఇప్పుడొచ్చింది కానీ. తెలుగువాడికి అంతర్జాతీయంగా పేరుతెచ్చింది అప్పట్లో ఊరగాయ పచ్చళ్లే. మన గుత్తొంకాయ  కూరమీదింత వరకూ ఎవరూ పరిశోధన చేసి డాక్టరేటు కొట్టకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని తెలుగువాడి నమ్మకం. మనం వేపాకును కూడా వదిలి పెట్టలేం.. 'తినగ తినగ వేము తీయగనుండు'  అని దానిపనీ పడతాం.


మాయాబజారు సినిమా మీద మనకీ నాటికీ  అంత మోజెందుకో తెలుసా! పెళ్ళివాళ్లకని చేసిన వంటకాలన్నింటినీ వంటింటిలో చేరి ఘటోత్కచుడు టకటకామని ఊదేస్తాడు చూడండి! ఆ సీనుని ఎంజాయ్ చేయని వాడింతవరకూ తెలుగు నేలమీద లేడు.  ఆ 'వివాహ భోజనంబు'లోని అనుపాకాల పేర్లు వింటుంటేనే నోటివెంట నీరు ఊరిపోతుంటుంది. పెళ్ళిని మనం పప్పన్నమని  ముద్దుగా పిలుచుకుంటాం. అప్పుచేసైనా సరే పప్పు కూడు తినేసేవాళ్ళు మనలో చాలా మందున్నారు. అసలు తిండి ఊసులేకుండా ఏ పండగా పబ్బమూ మనకుండదు. పెళ్ళిచూపుల్లో ఒకప్పుడు మగపెళ్ళివాళ్ళు పిల్లను అడిగే మొదటి ప్రశ్న 'వంట వచ్చా? '  అని' ఏ పాటుతప్పినా సాపాటు తప్పదు గదా! క్షీరసాగర మధనమప్పుడు మనవాళ్లే ఉండుంటే అమృతానికి  బదులుగా  ఓ అర కప్పు కాఫీ ముందిప్పించమని మోహినితో  కచ్చితంగా పెచీపడి ఉండేవాళ్లు.  తిండిపోతు పోటీలే కనుక ఒలింపిక్సులో ఉండి ఉంటే మనవాళ్లకి ప్రతిసారీ ' స్వర్ణాలు' గ్యారంటీ.  ఆడటంలోనేకాదు. . తినడంలో కూడా మనవాళ్లు దిట్టలే . 'మన రాష్ట్రాన్ని 'అన్నపూర్ణ'ని చెప్పుకొంటాం . మన రైతుని అన్నదాతని గౌరవించుకుంటాం. ఇప్పుడంటే ఎక్కడబడితే అక్కడ మందుపాతరలు బైటపడుతున్నాయి గానీ  నిన్నమొన్నటిదాకా ఆంధ్ర రాష్ట్రం దేశం మొత్తానికి బియ్యంపాతర లేకపోతే కిలో రెండుకియ్యటం ఎలా సాధ్యం?  మనల్ని చూసే గదా కేంద్రం మూడు కివ్వాలనుకుంటుంది! మనలాగే మనదేవుళ్లకీ ప్రసాదాలంటే పరమ ప్రీతి తిరుపతి లడ్డు... తిరుపతి వెంకన్నంత ఫేమస్ .  రుద్రాక్ష మాల తిప్పేవారైనా 'ద్రాక్ష" అనగానే ఓసారి నాలికనలా చప్పరించుకోకుండా ఉండలేరు. మన తెలుగు బాలకృష్ణుడిచేత వెన్నకోసం పోతన చేయించిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇంతకే ఈ తిండిగోలెందుకని కదండీ మీ సందేహం? 


కందిపప్పు కిలో యాభై ఆరు పలుకుతోంది. ఎండుమిర్చి డెబ్బైయ్! వేరుసెనగ నూనె అరవయ్యదు! చెక్కర ఇరవై ఆరు! ఉల్లి కొనేటప్పుడే కన్నీళ్లు తెప్పిస్తోంది. అందని ద్రాక్షలాగయిపోయాయి అన్ని దినుసులూ ! పాత బియ్యల సామాన్యుడు కొని తినే పరిస్థితిలేదు. ఎండల్లాగే మండుతున్నాయి  మండీలల్లో ధరలు . నో స్టాకు బోర్డులు పెడుతున్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సీజన్లో  ఉండుంటే పదహారువేలమంచి  గోపి కలను పోషించలేక ఆర్ధాంతరంగా అవతారం  ముగించుకుని ఉండేవాడు. 


అన్న బలమే అన్ని బలాలకూ మూలమన్నారు. రావణాసురుడు ముందు తన పదినోళ్లకి ఆహారమందించటానికి లంకనే ఏ అమెరికాకో కుదువ పెట్టవ లసి వచ్చుండేది. ఆ రోజుల్లోనే కౌరవులను కనీసం ఒక్కూరైనా ఇవ్వమని పాండవులు రాయబారాలు పంపించారు. ఈ ధరలు పెరిగిన సమయంలో కనీసం  ఒక జిల్లా అయినా ఇవ్వమని అడిగుండక తప్పేదికాదు . బకాసురుడు రోజూ బండెడన్నం పప్పూ కూరలు పంపించాలని పెట్టిన షరతును ఈ రోజుల్లో అయితే ఒప్పుకోవటం సాధ్యమా?  వేలుపోసినా నోట్లోకి నాలుగు వేళ్లు పోవడం కష్టంగా ఉంది ! ఈ ధరలను గురించి నిలదీస్తారనేనేమో తిరుపతి గుళ్ళో సైతం భక్తులని ఒక సెకను కూడా దేవుడి ముందు నిల బడనీయటంలేదు. ఈ పరిస్థితులిలాగే కొనసాగితే ఆ దేవుడిక్కూడా 'శబరి' ప్రసాదం తప్పదేమో, పాపం! సౌదీఅరేబియాలో భర్తకు కాఫీ ఇవ్వకపోతే భార్యకు విడాకులిచ్చేయచ్చుట . ఇక్కడా అలాంటి పరిస్థితులు రాకముందే అధికారులు, విజిలెన్సు వాళ్ళు మేలుకోవటం మేలు.


లేకపోతే అందరం యోగరత్నాకరంలో చెప్పిన నియమాన్ని పాటించాల్సిందే!


ధరలు పెరిగే రోజుల్లో పెరుగు... పెరుగు అంటూ కూర్చోకుండా మజ్జిగ చేసుకుని తాగితే ఇంటికీ వంటికి మంచిదని వైద్యశాస్త్రం చెబుతోం ది. కైలాసంలో మజ్జిగ దొరకకే శివుడు నీలకంఠుడైనాడు. వైకుంఠంలో మజ్జిగ దొరికుంటే విష్ణుమూర్తి నల్లబడి ఉండేవాడు కాదు.  స్వర్గంలో అమృతానికి బదులు మజ్జిగ వాడివుంటే ఇంద్రుడు అలా బలహీనపడేవాడే కాదు. వినాయకుడికి మజ్జిగ తాగే అలవాటు ఉండుంటే ఆ బొజ్జ వచ్చేది కాదు. మంది ఎక్కువైతే పెరుగు మజ్జిగవుతుంది. నిజమేగానీ ధరలు ఇలా ఆ కుండా పెరిగిపోతుంటే.. ఆ మజ్జిగ నీళ్లు  కూడా మరీ పల్చనయే అవకాశం హెచ్చు . పెరుగుట విరుగుట కొ రకే.. అంటారా ? ... ఆ ధరల భారం  విరిగి పడకుండా  ఉండాలిగదా . . బలుసాకైనా అని బతికేందుకూ? 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...