Showing posts with label Female. Show all posts

Sunday, December 12, 2021

అబల కాదు తబలే.. ఇప్పటికీ!

అబల కాదు తబలే .. ఇప్పటికీ!

 -కర్లపాలెం హనుమంతరావు

బ్రహ్మదేవుడు ఏ బ్యాడ్ మూడ్  లో ఉండి సృష్టించాడో, ఆడదాని బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలి కింది ఎండుకొమ్మే!

కిందే కాదు.. పై ప్రపంచంలోనూ! బ్రహ్మయ్యకు రిమ్మ తెగులు. శివయ్య సగం శరీరం భార్యకు ఇచ్చినట్లే  ఇచ్చి మరో గంగానమ్మను నెత్తికెత్తుకున్నాడు. హరి మాత్రం!  హరి.. హరీ! కట్టుకున్న దానిని ఆకట్టుకోవలసింది పోయి కాళ్ల దగ్గర అచ్చంగా కట్టిపడేసుకున్న మహానుభావుడాయన.

'ఆడదానికి స్వేచ్ఛిసేస్తే మహా అపాయం' అని ఆ మనువెవరో అన్నాట్ట కదా! ఆయనన్న మిగతా సుద్దుల్ని మాత్రం గట్టున పెట్టేసి, ఈ ఒక్క ముక్కను వేదంలా మన మగమహారాజులు  ఈ ఇరవైయొకటో శతాబ్దం దాకా వేదంలా ఈడ్చుకొచ్చారు!

ఒక్క మగాడనేమిట్లే, గ్యాసుబండలు, యాసిడ్ సీసాలు, సెల్ఫోన్ కెమేరాలు, సినిమా బడితె బొమ్మలు, కట్నం వేధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణహత్యలు, పరువుహత్యలు, లైంగిక వేధింపులు, గాడిద చాకిర్లు, తక్కువ జీతాలు.. అబ్బో.. జల్లెడ చిల్లుల కన్నా ఎక్కువ ఆడదాని కడగండ్లు!

వేళకు వంట చేసి వడ్డించడానికి, మగాడికి బిడ్డల్ని కని.. పెంచడానికి, ఇంటిని కనిపెట్టుకునుండటానికి, వంటికి సుఖమందించడానికి, బైట బడాయి షోలకు, వేణ్నీళ్లకు చన్నీళ్లని వంక పెట్టి సంపాదించిందంతా కుమ్మేయడానికి, సినిమాల కెళ్లినప్పుడు క్యూలల్లో త్వరగా టిక్కెట్లు కోయించుకోడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లనూ అక్రమంగా అక్రమించడానికి, బ్యాంకుల్లో దొంగపేర్లతో ఖాతాలు తెరుచుకోడానికి.. మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడనుకుంటున్నాడు మగాడు.

బల్లిని చూసి భయపడేటంత సున్నితమైన మనస్సు నిజానికి ఏ అమ్మడుకయినా. అయినా ఒక మగాడి సంసారం గాడినపెట్టడానికి నవమాసాలు నరకయాతన నవ్వుతూ సహించేందుక్కూడా సిద్ధపడే సాహసి సహచరి. బిడ్డ పుట్టుకకు అవసరమైతే కత్తికోతకైనా తను సిద్ధపడే త్యాగశీలి తరుణి.

గంట పనికే వందలు డిమాండు చేసే వ్యాపార ప్రపంచంలో పాచి పని  నుంచి రాత్రి పడక పని దాకా సహస్రావతారాలతో సమర్థంగా శ్రమించే స్త్రీ మూర్తి శుశ్రూషకు పైసల్లో, పెన్నీల్లో విలువ గడితే పది మంది బిల్ గేట్స్, అంబానీల సంపాదలన్నీ కలిపినా ఒక వారానికి మించి సరిపోతాయా?

మగమనుషులు మద మాత్సర్యాలతో ఒకరినొకరు ఆడిపోసుకునే నీచ సంస్కృతిలో కూడా పాపం ఏ ప్రమేయం లేని అమ్మలక్కల ప్రస్తావనలే వస్తాయి! మనుషులలో సరే.. మనసులలో సంగతి!

పులి అడవిలో కదిలేటంత చురుగ్గా ఇంటిలో కలితిరిగే శక్తి కలది స్త్రీ. ఇంటి నాలుగు గోడల మధ్య పనిపాటల చేసుకొనే సందర్భంలో అమ్మ నడిచే దూరం ముందు  ఏ మారథాన్ పరుగుపందెం విజేత రికార్డయినా బలాదూర్! ఇంటి బరువు బాధ్యతలను ఒంటిచేతి మీదుగా నిర్వహించే ఆమె దారుఢ్యం ముందు ఎంత మంది కరణం మల్లీశ్వరులు ధృఢంగా నిలబడగలిగేది!

ఇంటికి ఆమే యమర్జెన్సీ వైద్యురాలు. ఏ శిక్షణా అక్కర్లేని సుశిక్షణగల ఉపాథ్యాయురాలు. అనుక్షణం బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే జీతమివ్వని వార్డెన్ కూడా ఆమే. కుటుంబ సభ్యులు ఎవరికైనా కష్టం వాటిల్లితే పైసా ముట్టకుండా చక్కని కౌన్సిలింగు ఇచ్చే సామర్థ్యం ఆమె సొంతం. ఎవరి ఇష్టాయిష్టాలేమిటో పెదవి విప్పకుండానే ఇట్టే పసిగట్టి వీలును బట్టి ఉన్న వనరులతో అందరికి సంతృప్తి కలిగించే ట్రబుల్ షూటర్ అమ్మ తరువాతే భూమ్మీద ఇంకెవరైనా.

సంసారమనే విమానానికి ఆమే ప్రధాన చోదకురాలు. ఎయిర్ హోస్టెస్. రచ్చలో కూర్చున్న రాజేంద్రునికి మల్లే భర్త కాలు కదపక పెత్తనం చెలాయిస్తున్నా, ఆమె కలికి కామాక్షికి మల్లే వదిగి  ఉంటున్నందు వల్లనే ఇల్లు ఓ కైలాసగిరిగానో.. అమరావతికి మల్లేనో బైటి కళ్లకు శోభకలిగించేది.

ఆధార్ కార్డ్ సైతం ఓ పట్టాన దొరకని ఈ కలికాలంలో ఇంటిల్లిపాదీ గుడ్డిగా ఆధారపడ్డా ఇబ్బంది లేని ఆమె సేవలు ఉదారంగా దొరకడం మగమారాజు చేసుకున్న అదృష్టం. మెడలో మూడు ముళ్లు పడి, సహచరునితో ఏడడుగులు నడిచిన మరుక్షణం నుంచి  ఇంటి పేరును మార్చు, మార్చక పో వంటి తీరును భర్త వంశానికి మీదు కట్టే త్యాగమయులు భూమ్మీద తరుణుల  తప్ప ఇంకెవరుంటారు!

రాముడొచ్చి కూల్చే వరకు రావణబ్రహ్మనైనా  గడ్డిపోచ కింద దూరం పెట్టగలిగిన సీతనీతి స్త్రీ జాతిది. కాళ్ల పారాణి ఆరక ముందే కట్టుకున్న భర్త సోదర ప్రేమతో కానలు పట్టిపోతున్నా కంటి నీరు కొనుకుల కట్ట నుంచి ఉబికి రానీయని ఊర్మిళకట్టు ఉదిత జాతిది. పతిని దేవుడనుకోడం వట్టి మాటలలోనే కాదు; ప్రాణగండం ముంచుకొస్తే సాక్షాత్ ఆ దేవుడితో  తలపడేందుకైనా వెనక్కు తగ్గని సావిత్రిసాథ్వీగుణం కూడా స్త్రీ జాతిదే. తనవాడుగా తలచిన మరుక్షణం  మనువాడే తెగింపుగుణం రుక్మిణికి వలె మనం  మగులందరిలోనూ చూడగలం. భర్తకు లేని దృశ్యభాగ్యం తనకు మాత్రం ఎందుకు.. వద్దని కళ్లకు గంతలు కట్టుకుంది  పట్టపురాణి గాంధారి!  బుద్ధిలో నాలుగు రెట్లు, సాహసబుద్ధిలో ఎనిమిది రెట్లు స్త్రీకే ఆధిక్యతని చెప్పేందుకు  ఈ తరహా ఉదంతాలు చరిత్రలో ఇంకెన్నో!

మగవాడి మతలబు కేవలం ఐదు పదాల్లో తేల్చేసిన అమరుకం, ఆడదాని విషయంలో నూటనలభై నాలుగు పదాలు వాడీ 'ఇహ  నా వల్ల కాదు పొమ్మ'ని గుడ్లు తేలేసింది. కావ్యాలంకారాల అష్టవిధ నాయికల నుంచి, కన్యాశుల్కం మార్కు మధురువాణి వరకు స్త్రీ మనసు అర్థం చేసుకోనేందుకు మగవాడు పడ్డ ఆపసోపాలు అన్నీ ఇన్నీ కావు. స్త్రీ అంతరంగ  గంగనూ ఎంత తిరగ దోడినా మగాడి మనసనే చేదకు దక్కేది రవ్వంత బొట్టే!

హృదయంతో కాకుండా పెదవులతో కొలవబోతే కోమలి కొలతలకు ఏనాడూ అందదు. యుగయుగాలుగా చిక్కుబడ్డ స్త్రీ-పురుష సంబంధం చక్కబడాలంటే మగవాడికి కావాల్సింది ఒక్క నేర్పే కాదు!  కష్టానికి సుఖానికి విడిపోకుండా వుండే ఓర్పు.

అప్పడాల కార్ట్యూన్లు కేవలం మగాడి మనోవికార సూచితాలే! అసలుకు  అప్పడంలా నలుగుతున్నది స్త్రీ  జాతి మగాడి అహమనే కరకు కోరల మధ్యన చిక్కి . చంద్రమతి నాటి సత్యకాలం నుంచి.. దివ్య దిశాల ఈనాటి కలియుగం వరకు వ్యథ ఒకేలా సాగుతున్నది.. వ్యక్తీకరణల్లోనే ఆధునికత..  వైవిధ్యం!

సునీతా మిలియమ్స్, నైనా సెహ్వాలు, మలాలా, ఇందిరా ప్రియాంకాలు, ఇంద్రా సూకీ.. ఎన్ని కోట్ల మందిలో  కొట్లాడి పరజితులవగా చివరకు  గెలిచిన  విజేతల జాబితాలో కనిపించేది?

నిన్నటి దాకా వంటిళ్ళు, పడగ్గదుల వరకే పరిమితమై నోరు విప్పే అవకాశం లేని నారి తంటాలు. విశాల ప్రపంచంలోకి వచ్చి పనిపాటలు చేసుకోక తప్పని ఆర్థిక వాతావరణంలోనూ మారని దుస్థితి! మగవాడి మదమాత్సర్యాల మూలకంగా ఈనాటికీ ఆడదాని పరిస్థితి ముల్లు పక్కన అరటి ఆకు అధోగతే! ఇదే వాస్తవ పరిస్థితి!

ఆత్మరక్షణకు మహిళలు వాడుకునే 'పెప్పర్ స్ప్రే' పార్లమెంటు వాడకం వరకూ పెరిగిందే కానీ, ఆత్మగౌరవానికై మహిళకు హామీ ఇచ్చిన 'రిజర్వేషన్ బిల్లు' అదే పార్లమెంటులో ఎన్నో దశాబ్దాల బట్టి పెండింగులో పడివుంది! 'చీపురు కట్ట'కు దక్కిన రాజకీయ గుర్తింపు ఆ చీపురే అనాదిగా ఆయుధంగా వాడే స్త్రీ జాతికి ఇరవైఒకటో శతాబ్దం వచ్చినా  దక్కకపోవడం.. మగాడి  హిపోక్రసీ బుద్ధి.. రంగులు మార్చే ఊసరవెల్లి  చెల్లికి అక్క అవుతోందని తేటతెల్లమవడంలా!

'అబల' అనగానే లబలబలాడటమే గానీ,  మగవాడి పెత్తందారీ కచేరీలో ఆడదాని  పరిస్థితి 'తబలా' కు మించి ఏం మెరుగ్గా ఉందని!

'ఆడ పుటక'మగ సమాజం పానకంలో ఇంకా పుడకలాగే ఉంది. 'తిరిగి ఆడది .. తిరక్క మగాడు' చెడతారన్న మనువు సూత్రం మంట గలిసేదాకా ఆడది తిరగబడి  ప్రశ్నించడం కొనసాగాల్సుంది అందుకే!

ఏడాదికి ఏదో ఓ ఎన్నిక చేసుకున్న రోజు మహిళా దినోత్సవం జరుపుకోడం కాదు.. ఏడాదంతా మహిళకు ఉత్సవంలా సాగాలంటే ముందు మగవాడి అంతరంగానికి శాశ్వతంగా మరమ్మత్తు చేసే చాతుర్యం కావాలి!

-కర్లపాలెం హనుమంతరావు

(2014 లో మహిళా దినోత్సవానికి (మార్చి 8) కి రాసిన వ్యాసం)

Wednesday, December 8, 2021

మగువంటే మగవాడి మర-యంత్రమా? - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం)

మగువంటే మగవాడి మర-యంత్రమా?

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి అదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 

పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 

నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 

వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్క్య మహర్షి  మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాత మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం. 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా!  అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగవాడు  లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహారథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’.  ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పెడుతున్నందు  వల్లనే  స్త్రీలోకంలో  ఇంతలా అల్లకల్లోలం.

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాడే  తన పాలిట సైతానుగా మారుతున్నందుకు  ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడవాళ్లే.. కైకేయి, మందర, శూర్పణఖ.. అంటూ  తన చిన్ని బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెక్చర్లు  దంచికొట్టచ్చు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి అంతలా  వేపుకుని తినాలా? ఆవటా అంటూ  అంటూ- సొంటూ లేని శుంఠ  ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు! 

కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్న  వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందిలేదు . ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శాపతాపాలకూ  గురి అయిన  కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేసిన  పక్షంలో పుణ్యస్త్రీ వంటి  బిరుదులన్నీ  వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగవాళ్ల   నుంచే!

ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది. 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసింది  ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్ని ఉన్నా  స్త్రీలకు అవ్యాయం  చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయి.. సహకరించుకుంటున్నాయి కూడా!

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించబడినది  ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ  సిద్ధాంతాలు చేయబట్టే  మగవాడు  ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకుపోయి ఉన్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు   బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 

మరను, యంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టగానే  తలొంచుకొని వెళ్లి అతగాడి వంశానికి   జీతం బత్తెం లేని ఊడిగం ఎల్లకాలం చేసుకుంటూ పడివుండటం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలను..   ఇప్పటికీ వాటిని గుడ్డిగా నమ్ముతూ  కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మూఢమతులను!

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు..  అనుభవాలన్నీ  అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లించేదెవరూ? 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితులు ఎన్నెన్నో! 

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చంగా   మగవాడి హక్కులతో సరిసమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యానికి సార్థకత ! 

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దిన పత్రిక సంపాదకీయ పుట వ్యాసం) 

Tuesday, April 20, 2021

ప్రమదల పునరుత్పత్తి హక్కులు- కోవిడ్ మహమ్మారి ప్రవేశంతో మరింత అధ్యాన్నం! --కర్లపాలెం హనుమంతరావు

కోవిడ్-19 మహమ్మారి కారణంగా మహిళల్లో హింస, నిరుద్యోగమే కాదు..  లైంగిక పరమైన ఆరోగ్య సంరక్షణా కొరవడింది. ఫలితం.. పునరుత్పత్తి నాణ్యత దిగజారడం. 

మనదేశం వరకే చూసుకుందాం.  లభిస్తున్న గణాంకాలను బట్టి ప్రభుత్వ సేవల అసమానతలు, సమన్వయలోపాలు సుస్పష్టం. 

స్వీయ హక్కుల పట్ల ఆట్టే అవగాహన లేని సమూహాలలో స్త్రీలది ప్రథమ స్థానం. విద్య, రవాణా వంటి  ప్రాథమిక  సౌకర్యాల కల్పనలోనే సమన్వయ లోపాలు ఇంత స్పష్టమవుతున్నప్పుడు ఇక   ఆరోగ్య పరిరక్షణ పరంగా ప్రస్తుతముండే దైన్య పరిస్థితిపై కథనాలు రాసుకోడం  వృథా కాలయాపన. ఎబోలా, జికాల వంటి మహమ్మారులు విజృంభించిన తరుణంలో దెబ్బతిన్న మాతాశిశువుల ఆరోగ్య పరిస్థితులేవీ పాలకులకు కోవిడ్-19  సంక్షోభంలో పాఠాలు నేర్పించినట్లే  లేవు! మహిళల ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఆరోగ్య సంరక్షణ అత్యయిక పరిస్థితినీ ఎప్పటికి  గుర్తిస్తారో  మన  ప్రభువులు! 

కోవిడ్ అనంతర ప్రపంచంలో మహిళలను మళ్లా వారి మానానికి వారిని విడిచిపెడితే మానవజాతి మనుగడకే మొత్తంగా ప్రమాదం. స్త్రీల పునరుత్పత్తి సమస్యలు స్త్రీలకు మాత్రమే  పరిమితం కాదు. 

  అంశం చుట్టూతా అనేక సమస్యలు మూగున్నాయి; వాటిలో చట్ట సంబంధమైనవే కాదు, నైతికపరమైనవి కూడా ఉన్నాయి. వాటిని గురించే ఈ క్షోభంతా!

జనాభాలో సగంగా ఉన్న స్త్రీ జాతికి నేటికీ తన కుటుంబ పరిణామాన్ని   నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు!   సహజ న్యాయాన్నీ ఒక  హక్కుగా  స్త్రీలు  దేబిరించే దశకు తెచ్చిన ఈ మగ ప్రపంచాన్ని ఏం చేసినా తప్పులేదు!

కనే బాధ్యత మాత్రమే అప్పగించేసి .. ఎంత మందిని, ఏ సమయంలో ప్రసవించాలో,  సంతానాన్ని ఏ   తీరున పెంచాలో అన్న  కీలకమైన నిర్ణయాలను ఇంటి పెద్దలు తామే  పుచ్చేసుకున్నారు!   గుడ్లప్పగించి చూసే దైన్యమే  ఆధునిక స్త్రీ దైనా!

కరోనా మహమ్మారి కారణంగా ఉనికిలోకి వచ్చిన లాక్ డౌన్ వాతావరణంలో మహిళ పరిస్థితి మరింత దయనీయం.  ముఖ్యంగా పునరుత్పత్తి పరంగా!

జాతీయ మహిళా కమీషన్ దగ్గర నమోదయిన గృహహింస ఫిర్యాదుల పెరుగుదల చూస్తే గుండెలు అవిసిపోతాయి. తక్షణ సహాయం అందే పరిస్థితులు కరువైన లాక్-డౌన్ వాతావరణంలో మెజారిటీ స్త్రీల వ్యథలు పడకటింటి నుంచే మొదలు!  జాతీయ మహిళా కమీషన్ లో గృహహింస    బాధితుల సౌకర్యార్థం   వాట్సప్ విభాగం ఓటి  ప్రత్యేకంగా ఏర్పడటమే  దిగజారిన పరిస్థితులకు దర్పణం.  

గృహహింస అంటే కేవలం దేహం మీద జరిగే బౌతిక దాడి ఒక్కటే కాదుగా! ఆంక్షలు, ఆరోగ్య రక్షణకు ఆటంకాలు, మానసిక పరంగా  వేధింపులు.. ఏ తరహా ఒత్తిళ్లయినా సరే  గృహహింస కిందకే వస్తాయి.  సన్నిహితంగా మసిలే జీవిత భాగస్వామి చేసేదయితే  ఆ హింస ప్రభావం మహిళ పునరుత్పత్తి  నాణ్యతను మరంత  తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణుల హెచ్చరిక కూడా  . 

కరోనా- 19 లాక్ డౌన్ వాతావరణం పునరుత్పత్తి ఆరోగ్య పరిస్థితులపై మహిళల  నియంత్రణ శక్తిని  మరంతగా  బలహీనపర్చినట్లు ఐక్యరాజ్య సమితి స్వయంగా నిర్ధారించడం  ఆందోళన కలిగిస్తుంది . సుమారు 12 మిలియన్ల మంది మహిళల గర్భనిరోధక వినియోగ చర్యలకు అంతరాయం ఏర్పడ్డట్లు  ఓ అంచనా. దీని ఫలితంగా 2020 అనంతరం కాలంలో సుమారు 1.4 మిలియన్ల అనాలోచిత గర్భధారణాలకు అవకాశం కలిగినట్లని ఆ నివేదికే తేటతెల్లం చేస్తోంది!

సమయానికి అందని కుటుంబ నియంత్రణ సేవలు, లాక్ డౌన్ కారణంగా విధించిన పరిమిత ప్రయాణాలు.. నిషేధాలు,  అవసరానికి అందుబాటుకు రాని  అనేక ఇతరేతర ఆరోగ్యసౌకర్యాల చలవ .. ఈ గందరగోళమంతా! 

 పునరుత్పత్తికి సంబంధించిన  హక్కులు, కుటుంబ నియంత్రణ.. గర్భస్రావం వంటి  సేవలను పొందే విషయమై  చట్టపరంగా ఉండే  హక్కులు  అన్నీ నామ్ కే వాస్తేనే!  వాస్తవ          లభ్యత విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన్నన.

 మనదేశం    వంటి  అభివృద్ది చెందుతున్న దేశాలలో సహజంగానే ప్రజలకు అందే ప్రభుత్వ సేవలు అరకొరగా ఉంటాయి  . అందులోనూ  తరాల తరబడి అణచివేతకు  గురవుతోన్న    స్త్రీజాతికి ..  ఆరోగ్య పరమైన లైంగిక  హక్కుల పట్ల               అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఈ క్రమంలోనే పునరుత్పత్తికి సంబంధించిన హక్కుల పరిజ్ఞాన లేమి అతివల అవాంఛిత గర్భధారణలకు  ముఖ్య కారణమవడం!

మొత్తం భారతీయ మహిళల్లో దాదాపు సగం మందికి గర్భనిరోధానికి  పాటించే  ఉపాయాలు తెలియవు; తెలిసినవారికేమో  వివిధ కారణాల వల్ల  ఆయా  సౌకర్యాలు బహుదూరం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుటుంబాల నియంత్రణ   ప్రణాళికల్లో స్త్రీ భాగస్వామ్యం దాదాపు శూన్యం .. అదీ విడ్డూరం!

గర్భనిరోధ వినియోగం చుట్టూతా ఉన్న డేటానే  ఈ స్త్రీ స్వయంప్రతిపత్తి లోపానికి ఓ కీలక ఉదాహరణ. 'ఏ అపాయమూ లేకపోయినా వాసెక్టమీలకు కేవలం 0.3% మంది పురుషులు మాత్రమే సంసిద్ధమవుతున్న నేపథ్యంలో    వివాహిత మహిళల్లో హానికరమైనప్పటికీ నూటికి 36  మంది  స్టెరిలైజేషన్ ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు!  

సంస్కృతీ సంప్రదాయాల పరంగా ఈ తరహా అంశాల మీద  బాహాటమైన చర్చలకు ఆస్కారం ఉండటంలేదు. అవివాహితులైన స్త్రీలకు ఏ విధమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించే అవసరం లేదనే ఒక నైతిక  భావన కద్దు,

కానీ  మారుతున్న కాలం ప్రభావం!   ఈ దేశంలో లైంగికపరంగా ప్రస్తుతం  చైతన్యం కలిగివున్న గ్రామీణ అవివాహితులే  27% ఉన్నట్లు అనధికార గణాంకాలు నిగ్గు తేలుస్తోన్న  నేపథ్యం! ఎంత సమర్థవంతమైన ఆరోగ్య సేవా కార్యకర్తలు ఉన్నప్పటికీ,  ఈ తరహా వర్గాలను  ఏ గణనలోకీ తీసుకోలేని   పక్షంలో, చర్చల ద్వారా  సాధించే సానుకూల ఫలితాంశాలు ప్రశ్నార్థకమే అవుతాయి కదా?

2020 లో దేశవ్యాప్తంగా కొనసాగిన లాక్ డౌన్ సమయంలో కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్య సేవా క్షేత్రాలు  తీవ్రంగా దెబ్బతిన్న మాటయితే  వాస్తవం. గృహ నిర్బంధ పరిస్థితుల  కారణంగా,  దేశంలో 25 మిలియన్ల జంటలకు గర్భనిరోధక సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. నిజం చెప్పాలంటే రాబోయే ఏడాదిన్నర కాలంలో భారతదేశం    జననాల విషయంలో రికార్డు నమోదుచేసుకునే అవకాశం దండిగా ఉందంటున్నారు ఆరోగ్య శాస్త్ర నిపుణులు!  

'అన్ని వర్గాలకు సమాన హక్కులు'  అని సర్వత్రా వినవస్తున్న   సామాజిక వ్యవస్థ నినాదమే మూహిళల    పునరుత్పత్తి హక్కుల అంశంలోనూఉంది. పునరుత్పత్తి  అతివ  జీవితాన్ని అత్యంత అధికంగా ప్రభావితం చేసే ప్రధాన అంశం. అందులో స్త్రీ   పురుషునితో సమానంగా స్వతంత్ర ప్రతిపత్తికై డిమాండ్ చేయడంలో  అసమంజసమేమీ లేదు.

పునరుత్పత్తికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం యావత్తూ ఆమెకు సకాలంలో అందుబాటులో ఉంచడం.. ఆ చైతన్యం ద్వారా ఆమె తీసుకునే పునరుత్పత్తి సంబంధమైన నిర్ణయాలను మన్నించగలగడం పురుష ప్రపంచం..  ముందు అహం చంపుకొనైనా అభ్యసించడం అవసరం. ఇది నేరుగా ఆర్థిక, సామాజిక పరంగా స్త్రీని  పురుషునితో సమానంగా ఎదిగే అవకాశం

కల్పించడమే!  స్త్రీల జీవితాల మీద స్తీలకు, స్త్రీ దేహం మీద స్త్రీకి మాత్రమే సర్వహక్కులు కల్పించినప్పుడే ఇది సాధ్యమయే సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం సాకారం అయ్యే ఆశ కనుచూపు మేరలో ఉండగానే కోవిడ్ - మహమ్మారి స్త్రీ జీవితాన్ని మరింత ఛిద్రం చేయడమే విషాదకరం!

-కర్లపాలెం హనుమంతరావు

18 04 -2020

Friday, February 26, 2021

కళ్యాణమస్తు! -కథానిక -కర్లపాలెం హనుమంతరావు

ఉదయం ఐదింటికల్లా మెలుకువ వచ్చింది మాధవరావుగారికి ఎప్పట్లానే. కోడలు గదిలోకి తొంగి చూస్తే నానీ గాఢనిద్రలో కనిపించాడు. యశోద వాషింగ్ రూము నుంచి వచ్చిన తరువాత వాకింగ్ కని వెళ్లి   తిరిగొస్తూ తెచ్చుకున్న న్యూస్ పేపర్లనో మూల  గిరాటేసి, పాల ప్యాకెట్లు వంటగది ప్లాట్ ఫారం మీద పెట్టి  కాలకృత్యాల పని పూర్తి చేసుకుని వచ్చాడు. కోడలు కలిపిచ్చిన కమ్మని కాఫీ ఆస్వాదిస్తూ పేపర్లోని వార్తలు  చూస్తూండగా 'నానీగాడు లేస్తాడేమో! చూస్తుండండి మామయ్యా!' అంటూ తను స్నానాల గదిలోకి దూరింది. వాళ్లమ్మ బాత్ రూంలో ఉన్నప్పుడో, బట్టలు మార్చుకుంటున్నప్పుడో లేచి 'అమ్మ కావాలీ' అంటూ ఆరున్నొక్క రాగాలు అందుకుంటాడు ఆ భడవా! సముదాయించడం రాక తను సతమతమయిపోతాడు. నవ్వే పిల్లలను ఆడించడం తెలుసు కానీ, ఏడ్చే బిడ్డలని ఓదార్చే సహనం మాధవరావుగారికి మొదట్నుంచీ లేదు. ఈ ఏడు పదుల వయసులో కొత్తగా ఇప్పుడెక్కణ్ణుంచి అరువు తెచ్చుకోడం! ఆర్నెల్ల కిందటి వరకు ఆ పనులన్నింటికి వాడి బామ్మ వరలక్ష్మమ్మ ఉండేది ఇంట్లో!

నానీగాడీ రోజు మధ్యలో నిద్ర లేవలేదు. ఆ అమ్మాయే వాడిని లేపి తయారు చేసింది.  ఇద్దరూ ఆదరాబాదరాగా బైలుదేరే సమయానికి ఎనిమిది గంటలు దాటనే దాటింది. 'టాటా.. తాతయ్యా!' అంటూ అమ్మ చెప్పినట్లే చిలక పలుకులు పలుకుతూ వాళ్లమ్మ చిటికెన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులతో స్కూలు బ్యాగు భుజాన వేసుకుని నానీ వెళుతుంటే అలాగే చూస్తూ నిలబడిపోయారు  మాధవరావుగారు.  నానీ బస్సెక్కడం, యశోద ఆటో ఎక్కడం చూసి ఇంటో కొచ్చారు మాధవరావుగారు. ఇది రోజూ ఉండే దినచర్య.

కోడలు బ్యాంకులో పనిచేస్తోంది. అది కొడుకు మనోహర్ పనిచేసిన బ్యాంకే. కంపాష్యినేట్ గ్రౌండ్స్ మీద యశోదకు దక్కింది. రెండేళ్ల కిందట బ్యాంక్ స్టాఫ్ సాగర్ పిక్నక్ కని వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తూ నదిలో జారిపడ్డ కొలీగ్ ను రక్షించబోతూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఒక్కగానొక్క కొడుకు మనోహర్. ఆ దిగులుతోనే ఆరోగ్యం చెడగొట్టుకున్న భార్య ఆర్నెల్ల కిందట అనుకోని జాండీస్ తీవ్రత వల్ల ఈ లోకానికి దూరమైంది. 'విధి తన కుటుంబంతో ఆడుతున్న చదరంగంలో ప్రస్తుతానికి మిగిలి ఉన్న పావులు తను, యశోద.. పసిబిడ్డ నానీ!' అనుకుంటారెప్పుడూ మాధవరావుగారు. యశోద ఏమనుకుంటుందో ఎప్పుడూ బైటికి చెప్పదు. ఈ ఆటలోకి ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన పావు బాలరాజు.

బాలరాజు యశోద పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తున్నట్లు ఒకసారి యశోదే చెప్పినట్లు గుర్తు. ఓ రోజు ఏదో అనుకోని బంద్ కారణంగా బ్యాంకు పని మధ్యలోనే ఆగిపోతే ఆటోలు అవీ ఇక రావని .. ఈ బాలరాజు బైక్ మీదనే ఇంటికొచ్చింది యశోద. చీకటి పడక  ముందే ఇంటికి వచ్చేయ్యాలన్న ఆమె ఆత్రాన్ని వేరే కోణంలో చూడలేదు  అప్పట్లో మాధవరావుగారు. ఆ తరువాతా అతను ఏదో ఒక మిష మీద ఇంటికి రావడం, యశోద తన సహజమైన బిడియానికి మించి కాస్తంత ఎక్కువగానే  అతనితో  చనువుగా మసలడం మాధవరావుగారు గమనించకపోలేదు. ఎంత ఆడా మగా అయినా ఒకే చోట ఒకే తరహా పనిచేస్తున్నప్పుడు సాధారణంగానే ఆ మూవ్ మెంట్సులో ఒక రకమైన ఈజ్ నెస్  ఉంటుందన్నది మాధవరావుగారి వంటి విధ్యాధికులకు అర్థమవని విశేషమేమీ కాదు. కానీ ఎన్ని చదువులు చదివి, ఎంత సంస్కారవంతమైన జీవితానికి అలవాటు పడ్డా, మానవసంబంధాలు ఒక్కో సందర్భంలో అందరినీ మామూలు మనుషులకు మల్లేనే ఆలోచనలో పడదోస్తాయేమో. బాలరాజు వచ్చిన ప్రతీసారీ నానీని అతనికి దగ్గరగా తిరగడానికి తల్లయి ఉండీ యశోద ప్రోత్సహిస్తున్నట్లు అనుమానం వచ్చినప్పటి బట్టి మాధవరావుగారిలో చిన్న అసహనం బైలుదేరిన మాట నిజం. బాలరాజు వచ్చిన ప్రతీసారీ నానీకి ఏవేవో ఆటవస్తువులు తెచ్చివ్వడమూ, వాటిని తీసుకోమని తల్లి యశోద ప్రోత్సహిస్తుండటంతో మాధవరావులో ఈ అసహనం మరంత బలంగా పెరిగిపోసాగింది. అతన్నేమైనా ఆడిగితే కోడలు నొచ్చుకుంటుందేమోనన్న జంకు ఒక్కటే మాధవరావుగారు పళ్లబిగువున నిగ్రహించుకోవడానికి  కారణం.

కానీ, ఈ సారి నానీ పుట్టినరోజు సందర్భంలో బాలరాజు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ ఇంటికి వచ్చి సాయంకాలం దాక అన్ని ఏర్పాట్లూ స్వయంగా దగ్గరుండి చూసుకోవడంతో మాధవరావుగారు నిగ్రహం కోల్పోయారు. పార్టీ ముగిసి పదింటికి  అతగాడు ఇంటికి పోయిన తరువాత కోడలు పిల్లను సహజమైనంత మృదువుగానే అడిగాడాయన 'అస్తమానం అతను ఇక్కడిక్కడే తిరుగుతుంటాడు! ఇంటి దగ్గర పిల్లలు ఎదురుచూడరా అమ్మా? కనీసం కట్టుకున్న పెళ్లామయినా ఏమీ అనదా?'  

'తనకి భార్య లేదు మామయ్యగారూ! మన మనోహర్ సేవ్ చేయబోయి చనిపోయింది ఆమెను గురించే! అదృష్టం బాగుండి అప్పటికామెకు పిల్లలు లేరు' అంది యశోద. ఆ సమయంలో కోడలు మొహం చూసి 'ఛఁ! ఎందుకడిగినా?' అని అనిపించింది మాధవరావుగారికి.

ఆ రోజు నుంచి మామా కోడళ్ల మధ్యన కనిపించని ఓ సన్నని అడ్డుపొరేదో నిలబడ్డట్లయిపోయింది ఇంటి వాతావరణంలో.

'అమ్మాయిని అలా ఆడిగి హర్ట్ చేసినట్లున్నానేమోరా!' అని తన చిన్ననాటి  ఆప్తస్నేహితుడు గంగాధరంగారి దగ్గర వాపోయాడో రోజు మాధవరావుగారు.

గంగాధరంగారు మాధవరావుగారి మల్లేనే గవర్నమెంటు సర్వీసులో ఉన్నప్పటికీ రిటైర్ మెంటుకు సగం గడువింకా  మిగిలుండగనే తప్పుకుని సినిమా పరిశ్రమలోని తమ సన్నిహితుల దగ్గర  వారి కోసమై పనులవీ చేస్తున్నారు. మాధవరావుగారు ఎమ్మే., ఇంగ్లీష్. ఏదైనా ఇంగ్లీష్ హాలివుడ్, వరల్డ్ మూవీస్ లాంటి వాటిని తెలుగులోకి తర్జుమా చేయించుకోవలసి వచ్చినప్పుడు ఆ డివిడిలు(ఎక్కువ పైరేటెడే ఉంటాయి.. ఇట్లాంటి వ్యవహారాలలో.. ఆన్ లైన్లో చూసే అవకాశం ఉండదు) మాధవరావుగారికి అప్పగించి పోతుంటారు. ఆ రోజూ అట్లాగే వచ్చి మిత్రుడి బలవంతం మీద భోజనానికని ఉండిపోయారు.

భోజనం మధ్యలో మిత్రుడి మనసులోని నలుగుడంతా విని 'నీ కోడలు సంగతి మా అందరి కన్నా నీకే ఎక్కువ తెలిసుండాలి కదరా! మనోహరం ఇష్టపడ్డాడని కోడలుగా తెచ్చుకున్నారు నువ్వూ, వరలక్ష్మమ్మా! ఏనాడూ మీరు ఆ పిల్లను ఓ  పేరూ ఊరూ లేని  పేదింటి పిల్లలా చులకన చేసినట్లు నా దాకా అయితే రాలేదు. అసలే ప్రేమించి చేసుకున్న భర్త దూరమై లోలోపల  కుమిలిపోతున్నదా పిల్ల। ఆ డిప్రెషన్  నుంచి బైటపడేందుకు సాయపడాల్సిన పెద్దరికం నీది.  తండ్రిలాంటి  నీ నుంచి ఇట్లా   అనుమానంగా సందేహం బైటపడ్డం సహజంగానే సున్నితమైన ఆమెను కుంగదీస్తుంది కదరా! సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానబ్బాయ్! నీ పర్శనల్ మేటర్సులో జోక్యం చేసుకునే  అధికారం కూడా ఉందన్న భావనతో! ఇంకా మూడు పదులైనా నిండని ఆ అమ్మాయి జీవితం అనుకోని ఓ దురదృష్ట సంఘటన మూలాన ఎల్లకాలం అట్లాగే మోడువారినట్లుండాల్సిందేనా? అదే ప్రమాదంలో మరి మన వాడే మిగిలి.. తన భార్యను పోగొట్టుకునుంటే? ..'

షాక్ అయినట్లు చూసారు మాధవరావుగారు ఈ ఎదురు చూడని ప్రశ్నకు. వెంటనే సర్దుకుని 'నా సంగతి ఎట్లా ఉన్నా.. ముందు వరలక్ష్మి  నానీకి ఒక తల్లి కావాలని తన్నుకులాడేదిరా.. కచ్చితంగా!' అన్నారు.

'నీ సంగతి చెప్పవోయ్! ప్రస్తుతం అదే కదా వాస్తవం?' మిత్రుడు రెట్టించి అడగడంతో ఇహ తప్పించుకునే దారి లేకపోయింది మాధవరావుగారికి. 'మనమెన్ననుకున్నా.. ఇంకా లోకం మగవాడినీ, ఆడదానినీ ఒకే దృష్టితో మన్నించే సంస్కారం అలవరుచుకోలేదనుకుంటారా గంగా! మనోహరాన్ని ఎలాగూ తిరిగి తెచ్చుకోలేను. నానీని కూడా..'

ఎమోషనలవుతున్న మాధవరావుగారి భుజం తట్టి 'కంట్రోల్ యువర్ సెల్ఫ్! ఒక రకంగా నువ్వన్నదీ నిజమేలే! చెప్పడం తేలికే నాకైనా.. ఎవరికైనా! ఓకే.. లీవిట్ టు ది టైమ్.. మ్యాన్.. ఫర్ ది టైమ్ బీయింగ్! వీలైతే యశోదమ్మతో నేనూ ఓ సారి మాట్లాడేందుకు ట్రై చేస్తాలే! ఈ విషయం కాక పోయినా.. మీ భోజనాల గురించి. ఇంతింత ఉప్పులూ.. కారాలా ఈ వయసులో నీకు భోజనంలో!' అంటూ భళ్లున నవ్వేశారు గంగాధరంగారు వాతావరణాన్ని మరంత తేలికపరుస్తూ.  'బీపీలూ, షుగర్లూ ఎంట్రీ అయే ముందు వార్నింగ్ బెల్లులేవీ కొట్టిరావు.. నీకు తెలీని విషయాలా ఇవన్నీ!' అంటూ అక్కడికా టాపిక్ డైవర్ట్ చేసేశారు గంగాధరంగారు.

ఆ సారి పిల్లాడికి దసరా సెలవులు వచ్చినప్పుడు 'ఒకసారి మా పిన్నిని చూసి వస్తాను మామయ్యగారూ! చాలా రోజుల బట్టీ మంచాన బడి తీసుకుంటోంది. బాబయ్యను కూడా చూసి చాలా రోజులయింది. నానిగాడికి కాస్త ఆటవిడుపుగా ఉంటుంది రమ్మంటున్నారు ' అంది యశోద.

పెళ్లయి ఈ ఇంటికి వచ్చిన తరువాత ఎన్నడూ తలుచుకున్నట్లు ఎరగని ఈ పిన్నమ్మ, బాబయ్యలు యశోదకు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారో అర్థమవనంత అజ్ఞానంలో లేరు మాధవరావుగారు. ఇదీ ఒకందుకు మంచిదేమోలే అనిపించింది ఆయనకు. అందరూ మనసులు కూడ దీసుకోవడానికి కొంత సమయం అవసరమే అనిపిస్తోంది. కాకపోతే నానీని చూడకుండా అన్ని రోజులు ఉండడమే  మొదటిసారి చేదు అనుభవం తనకు.

ఆలోచిస్తున్నట్లు కనిపించిన మాధవరావుగారిని చూసి 'మీకు వంటకూ దానికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటవీ చేస్తానన్నారు గంగాధరం మామయ్యగారు’ అంది యశోద.

తన కన్నాముందు గంగాధరంతోనే కోడలు ఈ ఊరుకెళ్లే విషయం చర్చించడం కూడా కొత్త అనుభవం అనిపించింది మాధవరావుగారికి!

గంగాధరం పంపించిన ఆడమనిషిని ఒక అబ్బాయి ఇంటికి తెచ్చి దించిపోయాడు మర్నాడు పొద్దున్నే. యశోదే దగ్గరుండి ఆమెకు  అన్నీ ఏవి ఎక్కడున్నాయో.. ఏ టైముకు ఏమేమి సిధ్ధంచేసి ఉంచాలో..    సాయంత్రం దాకా తన దగ్గరుంచుకుని శ్రద్ధగా చూపించడం మాధవరావుగారు గమనించకపోలేదు. పొద్దుపోయాక పొద్దున దింపిపోయిన అబ్బాయే వచ్చి బండి మీద తీసుకువెళ్లిపోయాడు.

'మగవాళ్లెవరూ దొరకలేదుట్రా గంగా నీకు? నా ప్రాణం మీదకు ఓ ఆడమనిషిని దింపి పెట్టావూ?' అంటూ మాధవరావుగారు ఫ్రెండుతో  ఫోనులో నిష్ఠురాలకు దిగినప్పుడు 'అందుకే అన్నది ఆ రోజు.. ఉప్పు కారాలు కొద్దిగా తగ్గించుకు తినాలని. టెంపరరీగా కుక్ లు, అందునా ఇంటి కొచ్చి వండిపెట్టేవాళ్లు అంత తొందరగా దొరుకుతార్రా మాధవా ఈ రోజుల్లో? యశోదమ్మ మొదటిసారి ఏదో నోరు విడిచి అడిగిందనే కాని నాకు ఇన్ని తంటాలు! అదీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరి  ద్వారానో వత్తిడి తేకపోతే ఈ మహాతల్లైనా  లొంగివుండును కాదు! మరీ ఇబ్బందిగా ఉంటే మా ఇంటికి వచ్చి ఉండు మిత్రమా ఈ నాలుగు రోజులూ! ఎక్కడా ఎడ్జస్ట్ కాలేనంటే ఇహ ఒక్కటే దారి.. మళ్లీ నీ కోడలమ్మను వెంటనే వెనక్కు రమ్మని ఫోన్ కొట్టుకో అబ్బీ' అని భళ్లున నవ్వేశారు గంగాధరంగారు.

---

యశోద వెళ్లి మూడు రోజులయింది. అలవాటైన మనుషులు ఇంట్లో లేకపోతే ఎంత వెలితిగా ఉంటుందో మొదటిసారి అనుభవానికి వస్తోంది మాదవరావుగారికి. నానీగాడు పదే పదే గుర్తుకు వచ్చే బాధ నుంచి తప్పించడానికా అన్నట్లు గంగాధరంగారొచ్చి ఒక డివిడి ఇచ్చిపోయారు తెలుగుసేతకు.

రాత్రి భోజనం  ముగించుకొని ఆ డివిడి చూస్తూ కూర్చున్నారు మాధవరావుగారు. అదో కొరియన్  మూవీ. సెక్సీ సీన్లు కాస్తంత ఎక్కువగానే వచ్చిపోతున్నాయి. నీతిమంతుడైన ఓ  బ్యాంక్ అధికారి మాఫియా లీడర్ ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా వత్తిడి తెచ్చినా రుణమిచ్చేందుకు ససేమిరా అంటుంటాడు. ఓ రోజు బ్యాంకు పని ముగించుకుని ఇంటికి బైలుదేరిన అతగాడు  దారిలో కుండపోతగా  కురిసిన వర్షం మూలకంగా బండి మొండికేస్తే గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఆఫర్ చేసిన లిఫ్ట్ అంగీకరించి చిక్కుల్లో పడడం చిత్రం కథ.  బండి డ్రైవర్ వయసులో ఉన్న ఒక స్త్రీ అని ఆమె ఇంటికి వెళ్లిన తరువాత గాని ఆ బ్యాంకాఫీసరుకు తెలిసిరాదు.   బలవంతం మీద ఆమెతో శృంగారం చేసే సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతుండటంతో మూడ్ పాడయి మాధవరావుగారు మధ్యలోనే  ప్లేయర్ ఆఫ్ చేసేశారు. అట్లాగే  సోఫాలో నిస్త్రాణగా పడుకుండిపోయారు

...

తలుపు గడియ టకటకా ఆగకుండా  మోగుతుండే సరికి  గభాలున మెలుకువొచ్చేసింది మాధవరావుగారికి. టైమ్ చూసుకుంటే ఎనిమిది పది! ఇంతాలస్యంగా ఎప్పుడూ పడుకున్నది లేదు ఇంతకు ముందు.  గబగబా సోఫా దిగిపోయి వెళ్లి తలుపుతీశారు. వంటపని చూసుకునే అమ్మాయి. తన పేరు వెంకటేశ్వరి అని చెప్పినట్లు గుర్తు మొదటి రోజు దింపిపోయిన మనిషి. నడి వయసు కూడా ఇంకా దాటని వెంకటేశ్వరికి భర్త ఉన్నాడో, లేడో.. ఉన్నా వదిలేసిపోయాడో ఆ వివరాలేవీ తనకు తెలియవు. పరాయి ఇళ్లకొచ్చి వంట చేసిపెట్టడమే జీవనోపాధిగా ఎంచుకున్నది అంటే బలమైన కారణమే ఉండుండాలి  ఏ స్త్రీ కైనా ఈ దేశంలో. పేరుకు వంటమనిషి అనే గానీ, శుభ్రంగా ఉంటుంది వ్యక్తి. శుచిగా వండుతుంది. మర్యాదగా మసులుకుంటుంది. వారం రోజులు వండి పెట్టిపోయే మనిషి మీద అంత ధ్యాస పెట్టటం అవసరమా? రాత్రి చూసిన సినిమా దృశ్యాల ప్రభావమా? మనసు పెడదారి పట్టడం లేదు కదా! అని తనను తాను హెచ్చరించుకున్నారు మాధవరావుగారు.  

మూడ్ మార్చుకునే నిమిత్తం గుడి కెళ్లాలని నిశ్చయించుకుని స్నానాదికాలు ముగించుకున్న తరువాత.. అల్పాహారం ఏదో  అయిందనిపించి.. బైటికొచ్చేశారు మాధవరావుగారు.

'గుడి కెళుతున్నానమ్మా! తిరిగొచ్చేదెప్పుడో చెప్పడం కష్టం. కనీసం రెండు మూడు గంటలైనా పట్టొచ్చు.  పని ముగించుకుని నువ్వెళ్లి పోవచ్చు! నా కోసం ఎదురుచూడకుండా   తలుపులు అవీ జాగ్రత్తగా లాగి మాత్రం పో!' అని హెచ్చరించారు బైటికొచ్చే ముందు మాధవరావుగారు. ఫ్లాట్ కు ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టం ఉంది.. తనకూ యశోదకూ ఇబ్బంది కలగకుండా!

గుళ్లో శర్మగారు కనిపించి ఏవో ముచ్చట్లు పెట్టారు. 'వచ్చే పౌర్ణమి నాడు స్వామివారి సన్నిధానంలో వంద మంది పేద యువతులకు సామూహిక కళ్యాణాలు జరిపించాలని సంకల్పం! తమ లాంటి పెద్దల పూనికా తోడయితే  శుభకార్యం మరంత శోభాయమానంగా జయప్రదమవుతుందని ఆశ' అన్నారాయన.

‘మంచి పనుల్లో భాగం పంచుకోడం ఎవరికి మాత్రం చేదు శర్మగారూ!  చెక్ బుక్కుల్లాంటివేవీ వెంట తెచ్చుకోలేదు. మీ వాళ్లని ఇంటికి పంపించండి! ఉడుతా భక్తి సేవించుకొనే  అదృష్టం గౌరవంగా భావిస్తాను!' అని చెప్పి వచ్చేశారు మాధవరావుగారు.

ఆధ్యాత్మిక వాతావరణంలో  ఓ మూడు గంటలు గడిపేసరికి   మనసు మళ్లీ ప్రశాంతమైన మూడ్ లోకి వచ్చేసింది. కడుపులో ఆకలి కరకరలాడుతుంటే.. ఇంటి దారిపట్టారు మాధవరావుగారు.

ఇంటి తలుపు లాక్ చేసుంది. అంటే వెంకటేశ్వరి వెళ్లిపోయిందన్న మాట. పర్సులో నుంచి తాళం చెవి తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చారు. బెడ్ రూమ్ తలుపు వారగా వేసి ఉండటంతో  నెమ్మదిగా నెట్టారు మాధవరావుగారు. సగం తెరుచుకున్న తలుపు దభాలుమని మళ్ళీ మూసుకుపోయింది. ఆ కంటి రెప్పపాటు వ్యవధానంలోనే గదిలో నిన్న తాను సగం చూసి వదిలేసిన సినిమా శృంగార సన్నివేశాలు నడుస్తున్నట్లు అర్థమయింది మాధవరావుగారికి.

గభాలున వెనక్కి వచ్చేసి మెయిన్ పవర్ స్విచ్ టప్ మని ఆఫ్ చేశారాయన.  గుండెలు గుబగుబలాడుతుండగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయారో రెండు నిముషాలు. తేరుకుని  బెడ్ రూం వంక చూస్తే బార్లా తెరిచిన తలుపుల గుండా బెడ్ మీద వెంకటేశ్వరి లోపలి దుస్తులతో పాటు ఆమెను దించేందుకు పద్దాకా వచ్చే కుర్రవాడివి కూడా.. కలగాపులగంగా! రెండే రెండు నిమిషాలలో వాళ్లిద్దరూ సీన్ నుంచి అలా గాయబ్ కావడం మరీ ఆశ్చర్యం కలిగించింది మాధవరావుగారికి.

భోజనం కూడా చెయ్యకుండా ఎంతసేపు అలా కూర్చుండిపోయారో తెలీదు! శర్మగారి విరాళాల మనిషొస్తే ఓ వెయ్యి  నూటపదహార్లకు చెక్కు రాసిచ్చి పంపించారు.  ఫ్రిజ్ లోని ఓ ఆపిల్ పండు కోసుకు తిని అట్లాగే పడుకుండిపోయారు నిస్త్రాణగా. ఆ బెడ్ రూమ్ లోకి అసలు వెళ్లబుద్ధికాలేదు.

సాయంకాలం వంటచేయడానికి వెంకటేశ్వరి రాలేదు. రాదని కూడా తెలుసు. వస్తే.. గిస్తే తనే పెట్టాల్సినవి నాలుగూ పెట్టి తిప్పి పంపించేద్దామని అనుకున్నాడు. కానీ, ఆ అవకాశం అతనికి దక్కలేదు.

తనే ఇంత ఎసరు స్టౌ మీదకు ఎక్కించుకుని యశోద చేసి ఉంచిన పచ్చళ్లతో కలిపి తింటుంటే ఎవరో పిలిచినట్లు వచ్చారు గంగాధరరావుగారు. 'మాధవా! నీ పనమ్మాయి నాకు ఫోన్ చేసి ఇక వంట చెయ్యడానికి వెళ్లడం కుదరదని గంట కొట్టినట్లు చెప్పేసిందిరా బాబూ! 'అదేమిటే! ఆ సంగతేదో నేరుగా ఆయనకే చెప్పొచ్చుగా?' అనడిగితే ఏమందో తెలుసా?'

'ఏమందంటా?' మాధవరావుగారి మాటల్లో వెటకారం.

'వద్దులే! ఆది మనలాంటి పెద్దమనుషులు వినాల్సిన మాట కాదు. ముఖ్యంగా నీ లాంటి మర్యాదస్తులు! అసలన్నింటికీ ఆ దరిద్రపు డి.వి.డి నే కారణమనుకుంటా! అదట్లాంటిదని నిజంగా నాకూ తెలీదురా! ఇది నాకిచ్చిన డైరక్టర్ని ముందు నాలుగు కడిగొస్తా!' అంటూ బైటికెళ్లబోయాడు.

మాధవరావుగారు అమాంతం భోజన్ పళ్లెం ముందు నుంచి లేచొచ్చి ‘ముందా పిల్ల నా గురించి ఏం కూసిందో చెప్పి  చావు!' అనరిచారు కోపంగా!

'కూల్ డౌన్ మ్యాన్! ప్రత్యేకంగా ఏమనలేదులేరా నాయనా! అందరూ అనుకుంటన్నదే తనూ అన్నట్లుంది. 'ఇంత వయసొచ్చినా ఇంకా ఇంట్లో  బూతు బాగోతాలుండే సినిమాలు చూస్తున్నాడయ్యా! ఆడముండని. ఒంటిగా ఆ ఇంట్లో పనిచెయ్యాలంటే గుండె దడగాఉంది. లక్ష రూపాయలు పొయ్యిగాక.. ఇంక నేనా కొంపకు పొయ్యేది కల్ల!' అనేసిందిరా! అసలు తప్పంతా నాదే! ఈ డివిడి బొత్తిగా  పచ్చిబూతని తెలీక తెచ్చిచ్చినందుకు ముందు  నా చెప్పుతో నన్నునేను కొట్టుకోవాలి!' అంటూ చేయి విడిపించుకుని వెళ్లిపోయారు గంగాధరంగారు.

మాధవరావుగారు కొడుకు పోయినప్పుడు కూడా ఇంతగా విలవిల్లాడలేదు. ఆ పూటకిక తిండీ తిప్పలు కడుపులోకి పోయేది కల్లే!

 చాప కిందేసుకుని  అలాగే పడుకుండిపోయారు మాధవరావుగారు. మెల్లగా తత్వం తలకెక్కడం మొదలుపెట్టింది.

మనసు లోతుల్లో  ఆలోచనలు సుళ్లుతిరుగుతున్నాయిప్పుడు. 'వెంకటేశ్వరి చిన్నపిల్ల. వయసు తోడు కోసం అలమటించే ఈడు. ప్లేయర్ లో తాను పొరపాటున వదిలేసి పోయిన డివిడి కంటబడినట్లుంది. మతి చెడి వాడిని పిలిపించుకుంది. అనుకోకుండా తను వచ్చేయడంతో కథిలా అడ్డం తిరిగింది. ఆమె ఎట్లా పోతే తన కేమి గాని.. ఆమె కన్నా వయసులో చాలా చిన్నది యశోద!  భర్త పోయి.. మగతోడు లేక.. దొరికే అవకాశం లేక.. బాధ పంచుకునే దారి లేక.. నట్టింట్లో తన కళ్ల ముందు తచ్చర్లాడుతున్నది ఇంత కాలం బట్టి!  ఆ పిచ్చి తల్లి మానసిక క్షోభను గురించి ఇంత కాలం ఇంత సహజమైన కోణంలో తాను ఎందుకు ఆలోచించలేకపోయినట్లు! ఇది   అమానుషం కాదూ!

యశోదమమ్మ మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోతే మనవడు తనకు దూరమవుతాడన్న స్వార్థ బుద్ధి  తనది. రేపు తనూ వెళ్లిపోతే అదే మనవణ్ణి పెంచి ప్రయోజకుడిని చేయవలసిన  ఒక  అసహాయ వంటరి స్త్రీ ఈ తుంటరి సమాజానికి  ఎదుర్కుంటూ ఆత్మగౌరవంతో  మనగలుగుతుందా?

గంగాధరం వచ్చిన ప్రతిసారి ఇంటి వంటకాలలోని ఉప్పూ కారాలను గురించి నర్మగర్భంగా హెచ్చరించినా తన బుద్ధి అటు మళ్లనే లేదు! ఈ ఉప్పూ కారాలు వంటికి దిట్టంగా పట్టబట్టేకదా యాభై ఏళ్లు పై బడ్డ తన శరీరాన్ని  ఒక కాల్పనిక  చిత్రంలోని కాసిన్ని శృంగార సన్నివేశాలు రాత్రంతా అంతలా వెంటాడి వేధించింది! ఇక వయసులో ఉండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ల మీద ఇంకెంత తీవ్రంగా ప్రభావం చూపిస్తాయో.. ఇదిగో.. ఈ వెంకటేశ్వరి ఉదంతమే ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం! కూతురు వంటి కోడలు విషయంలో తనింత కాలం చేస్తూ వచ్చిన తప్పు స్పష్టంగా కంటి ముందు కనిపిస్తోందిప్పుడు!  తప్పు జరుగుతున్నది తన పక్షం నుంచే కాబట్టి ఆ తప్పును సరిదిద్దకోవలసిన బాధ్యత కూడా ముందు తనతోనే ఆరంభమవాలి' అనుకున్న తరువాత కానీ, మాధవరావుగారికి కంటి నిండా కునుకు రాలేదు.

సాయిబాబా గుళ్లో తొందరలో జరగబోయే 'కళ్యాణమస్తు' కార్యక్రమం కళ్ల ముందు మెదిలింది కలలో!

మర్నాడే బాలరాజు నంబరు కనుక్కుని 'ఒకసారి వచ్చి కలవమ'ని కోరారు మాధవరావుగారు.

'యశోదను చేసుకొనేందుకు నా కెలాంటి అభ్యంతరం లేదు గానీ.. యశోదను ఒప్పించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి అంకుల్!' అన్నాడు బాలరాజు.

'అదేంటీ! మా కోడలుకీ నువ్వంటే ఇష్టమేగా!' అని ఆశ్చర్యపోయారు మాధవరావుగారు.

'ఇష్టం వేరు.. పెళ్లి వేరురా.. పిచ్చోడా! యశోద చేసుకుంటానంటే  'రడీ' అనేందుకు ఎంత మంది సిద్ధంగా ఉన్నారో ముసలి డొక్కువి నీకేం తెలుసు? కానీ ఆమె ఇద్దరు పిల్లలే ఆమెకు  పెద్ద సమస్య' అన్నారు అప్పుడే వచ్చిన గంగాధరంగారు హాస్య ధరోణిలో.  

'ఇద్దరా! ఒక్క నానీగాడే గదరా! వాడంటే ఈ బాలరాజు క్కూడా ఇష్టమేనాయ?' మాధవరావుగారి మాటల్లో మళ్లీ ఆశ్చర్యం.

'నానీ రెండో పిల్లాడబ్బాయ్! పెద్ద మొండి పిల్లవాడివి యశోద దృష్టిలో నువ్వే! నీ కన్నా ముందు నీ కోడలు పెళ్లి ప్రస్తావన నేను తెచ్చినప్పుడు ఏమందో తెలుసా? 'నానీ ఎలాగో నాతోనే ఉంటాడు. అత్తయ్యగారు, మనోహరం లేని మామయ్యగారికి నానీకి లాగా నేనే ఇప్పుడన్నీ! నాతో పాటు నా ఇద్దరు పిల్లల్నీ దగ్గరకు తీసుకుంటానంటేనే నేనే పెళ్లి ప్రస్తావన గురించైనా అలోచించేది' అని ఖరాఖండిగా షరతు పెట్టిందిరా  నిన్ను మించిన మొండి నీ కోడలు. ఆ షరతులన్నీ ముందు చెప్పే ఈ భార్యలేని బాలరాజును, భర్తను మిస్సవుతున్న మన యశోదమ్మను ఒకటి చెయ్యాలనుకున్నా నేను. యశోదమ్మకు చెప్పి చెప్పి ఎట్లాగో ఒప్పించగలిగా కానీ..  పుడకలాగా 'నా నానీనో' అంటూ  నువ్వే యశోద పానకంలో అడ్డుపడుతూ వచ్చావు ఇప్పటి వరకు.

'అందరికీ 'ఓ..కే అయినా నా ఒక్కడి అబ్జెక్షనే అడ్డమయిందంటావు?' అన్నారు మాధవరావుగారు నిష్ఠురంగా!

'మామయ్యగారు మనస్ఫుర్తిగా ఓకే అంటేనే.. నేనే పెళ్లికైనా ఆలోచించేది' అంటూ  ఇంకో కండిషన్ కూడా పెట్టేసిందియ్యా  బాబూ నీ జగమొండి కోడలు. నిన్ను వప్పించడానికే ఇంత పెద్ద కథ నడిపించాల్సి వచ్చిందిప్పుడు' అన్నారు గంగాధరంగారు భళ్లున నవ్వేస్తూ.

'కథా! ఏం కథా' నోరెళ్లబెట్టారు మాధవరావుగారు.

'నీకే అంత తెలుస్తుందిలే! పద! శర్మగారు నిన్ను దగ్గరుండి 'కళ్యాణమస్తు' కార్యక్రమానికి వెంటబెట్టుకురమ్మన్నారు! బాలరాజుక్కూడా బ్యాంకు టైము దాటిపొతుంది' అన్నారు గంగాధరంగారు బాలరాజు వైపు సాభిప్రాయంగా చూస్తూ. బాలరాజు మాధవరావుగారి కాళ్లకు నమస్కారం చేసి వెళ్లిపోయాడు.  

సాయిబాబా గుళ్లో జరిగే ‘కళ్యాణమస్తు’ కార్యక్రమంలో  పీటల మీద కూర్చున్న కాబోయే దంపతుల్లో వెంకటేశ్వరి.. ఆమె పక్కన మొన్న గదిలో నుంచి తప్పించుకున్న అబ్బాయి!  నోరువెళ్లబెట్టేసిన  మాధవరావుగారి చెవులో సన్నగా ఊదాడు గంగాధరరావుగారు 'ఈ జంటా మన యశోదా బాలరాజుల్లా ఒకళ్ల నొకళ్లు ఇష్టపడిన పిల్లలే! వరుడు నేను పనిచేసే ఓ సినిమా కంపెనీలో అసిస్టెంట్ డైరక్టర్. వెంకటేశ్వరికి అదే కంపెనీ కేటరింగ్ సెక్షన్లో పని. నీ ఇంటి బెడ్ రూమ్ సీన్ కు ముందే ఇద్దరూ  రిజిష్టర్డ్లీ మ్యారేజ్డ్ కపుల్! ఇద్దరి తరుఫునా పెద్దలు లేరు.  వెంకటేశ్వరి తృప్తి కోసం ఈ సంప్రదాయపు పెళ్లి. ఎట్లాగూ పెళ్లయిన జంటే కదా.. ఓ మంచి పని కోసం.. ఒక పూట ఓ పది నిముషాల పాటు ఉత్తుత్తి శృంగార సన్నివేశంలో నటించాలని ప్రాధేయపడ్డా! వెంకటేశ్వరి ససేమిరా అంది. కాని.. పిల్లాడు మాత్రం పెద్దమనసుతో చెప్పినట్లే చేశాడు!  నువ్వు కానీ అట్లా ఠకీమని  పవర్  కట్ చేయకుండా లోపలికి వెళ్లుంటే గదిలో వెంకటేశ్వరి అసలు లెనె లేదన్న గుట్టు బైటపడివుండేదిరా ఫూల్! ఉన్నది.. చూసింది..  రెండు దిండ్లూ.. ఒక  దుప్పటి మీద ఆ పిల్ల శారీ!'

వింటూన్న మాధవరావుగారు నోరు వెళ్లబెట్టేశారు.

'చిన్నపిల్లలిద్దరూ మనలాంటి పెద్దల చిన్న బుద్ధుల మరమ్మత్తు కోసం పెద్దమనసు చూపించారు. చెడ్డపేరు తెచ్చుకున్నారు. పెళ్లయిన జంటయి వుండీ నీ లాంటి పెద్దల చేత శాపనార్థాలు కూడా తిన్నారు. అదీ నీ మూర్ఖత్వం కారణంగానే!' అని తేల్చేశారు గంగాధరంగారు.

'కాదండీ మామయ్యగారూ! వారం బట్టీ చూస్తున్నా! బాబయ్యగారిది నిజంగా దొడ్డమనసు. ఎన్ని సార్లు అధాటున  నన్ను ‘యశోదమ్మా!’ పిలిచారో! ప్రేమించిన  మొగుణ్ణి పోగొట్టుకున్న దాన్ని! యశోదమ్మ బాధ నాకూ తెలుసు! అందుకే వీడీ నాటకంలో నా పేరు వాడుకుంటానన్నా కాదనంది' అంది అప్పుడే దండల మార్పిడి కార్యక్రమం అయిందనిపించుకుని వరుడి పక్కన కళకళలాడుతూ నిలబడ్డ వధువు వెంకటేశ్వరి.

మాధవరావుగారి కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఒక మూర్ఖుడి మనసు మార్పుకు ఎంత మంది మంచి మనుషులు  ఎంత పెద్ద నాటకం ఆడాల్సొచ్చిందీ!

'పిల్లాపాపాలతో ఇలాగే మంచి మనసుతో కలకాలం కాపురం చేసుకోండి తల్లీ!’- అంటూ కాళ్లకు నమస్కరించిన వెంకటేశ్వరి దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు మాదవరావుగారు.

అ సమయంలో ఆయన కళ్ల ముందు కదులాడింది త్వరలో జరగబోయే మరో ‘కళ్యాణమస్తు’ శుభకార్యంలో..  వెంకటేశ్వరి  స్థానంలో ఉన్న యశోదమ్మ.. కుర్రవాడి స్థానంలో ఉన్న బాలరాజు.

-కర్లపాలెం హనుమంతరావు

***

కథ 

కళ్యాణమస్తు 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

ఉదయం ఐదింటికల్లా మెలుకువ వచ్చింది మాధవరావుగారికి ఎప్పట్లానే. కోడలు గదిలోకి తొంగి చూస్తే నానీ గాఢనిద్రలో కనిపించాడు. 

యశోద వాషింగ్ రూము నుంచి వచ్చిన తరువాత వాకింగ్ కని వెళ్లి   తిరిగొస్తూ తెచ్చుకున్న న్యూస్ పేపర్లనో మూల  గిరాటేసి, పాల ప్యాకెట్లు వంటగది ప్లాట్ ఫారం మీద పెట్టి  కాలకృత్యాల పని పూర్తి చేసుకుని వచ్చాడు. 

కోడలు కలిపిచ్చిన కమ్మని కాఫీ ఆస్వాదిస్తూ పేపర్లోని వార్తలు  చూస్తూండగా 'నానీగాడు లేస్తాడేమో! చూస్తుండండి మామయ్యా!' అంటూ తను స్నానాల గదిలోకి దూరింది. 

వాళ్లమ్మ బాత్ రూంలో ఉన్నప్పుడో, బట్టలు మార్చుకుంటున్నప్పుడో లేచి 'అమ్మ కావాలీ' అంటూ ఆరున్నొక్క రాగాలు అందుకుంటాడు ఆ భడవా! సముదాయించడం రాక తను సతమతమయిపోతాడు. నవ్వే పిల్లలను ఆడించడం తెలుసు కానీ, ఏడ్చే బిడ్డలని ఓదార్చే సహనం మాధవరావుగారికి మొదట్నుంచీ లేదు. ఈ ఏడు పదుల వయసులో కొత్తగా ఇప్పుడెక్కణ్ణుంచి అరువు తెచ్చుకోడం! 

ఆర్నెల్ల కిందటి వరకు ఆ పనులన్నింటికి వాడి బామ్మ వరలక్ష్మమ్మ ఉండేది ఇంట్లో!

-కర్లపాలెం కథ 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...