Saturday, December 4, 2021

 ముద్దూ ముచ్చట

 

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం- ఆ సందర్బానికి అనువుగా ఓ గల్పిక

 

ముద్దూ ముచ్చట

-కర్లపాలెం హనుమంతరావు

 

'ప్రకృతి వరంజీవితంజీవితం వరంప్రేమ .  ప్రేమ వరంముద్దుఅంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశి కల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/ అత్యున్నతంబైన యవనీధ రానీక,మంబోధ పటలి ముద్దాడుచుండె..అంటో ముద్దుకు అచేతనాలే మురుసి పోతుంటే మనిషి చిత్త వృత్తిని గురించి మరిక చెప్పేది ఏముంది?'  అవును.. ఒక పార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటికకదళీ ఫలం,ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసందివ్యామృతం, అలరుతేనెల ధారచెరుకు రసాల చవులు దేనిలోనూ లేనిదీ ముద్దు లోపలి తీపి. వట్టి రుచేనా.. మనసు ముడతలను సరి చేసేదీ ఈ పెదాల ముడి తడే. పెదవి పెదవి కలిసాయంటే సగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతి మమ మానసం, దేహి ముఖ కమల మధుపానం' అంటూ ప్రియనాయిక మధురాధరాల  కోసం వూరికే  ఆరాటపడతాడా జయదేవుడి అష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండ గొల్లభామా! ఒక్కచిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!అని నల్లనయ్యనే గొల్లభామ వెంట పరుగులెత్తించి అల్లరి పెట్టింది ఈ అధర వల్లరి.  'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగ మేనికి వింత మైకమ్ము గ్రమ్ము/ చిత్తమున కేదో యున్మాద మత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడు నవసరమున.' అదీ మధురాధర సంగమావస్థ మదనావస్థ. మదన తాపానికి  ప్రథమ చికత్స   ప్రియముఖ కమల మధువు ఆస్వాదనమే. ఆ ఔషధ సేవనం  'సురగణాధీశ దుర్లభసుఖ మొసంగు,అగణితాత్మ వ్యథా భార మణచివేయు/ భీష్మసదయ ప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించి కలవరించని వారు అసలు యవ్వనులే కారు

నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదుగోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరేమనసును కోఱే ఆ  'ఛీ పాడుముద్దుతోనే అసలు పేచీ.  తలుపు చాటునోపెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తిదొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళఅన్నారు కవి దాశరథివెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం  పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు  వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాలబుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలిముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షినిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు  అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానంచేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం.  చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే.  చెవుల దొప్పలుముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే. 

 

మనిషి పెదాలు మాత్రమే  ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడిమనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ  అధర ముఖద్వారాలనుంచేసిగ్గుబిడియంకామనసంశయంభయంఅసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవి  పెదవి చివరి భాగాలే.  ముద్దులాడుకునే వేళ 'డోపమిన్అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడంనిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది. 'న్యూరోట్రాన్స్ మీటర్స్'  మెదడులోఉత్పన్నమై  గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుందిమనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలునిముషం ముద్దుకు 20  కేలరీలు ఖర్చు. ముద్దుకో  శాస్త్రమూ కద్దుపేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరంవ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానానీ ముద్దు ముచ్చట కాదంటానాసరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాంకొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు  అంటువ్యాధి కారక క్రిములు.అయినా ముద్దంటే చేదెవరికిచంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోందిమన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం.   నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహముద్దు ఆలోచన  ముందు రోమనులదే అని ఒక వాదంభారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ.   ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలువారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం.  అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందనిపెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని'డెయిలీ ఎక్స్‌వూపెస్'  బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా  నిర్వహించిన తాజా సర్వే సారాంశంసంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవునీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవునాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండుత్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారుస్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరివద్దనుకుంటే ఎలా?

 

కర్లపాలెం హనుమంతరావు,

ఫ్లాట్ నెం# 404, శ్యామ్ కామధేను అపార్టుమెంట్ సు,

మోతీనగర్,

హైదరాబాద్- 500 ముద్దూ ముచ్చట

 

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం- ఆ సందర్బానికి అనువుగా ఓ గల్పిక

 

ముద్దూ ముచ్చట

-కర్లపాలెం హనుమంతరావు

 

'ప్రకృతి వరంజీవితంజీవితం వరంప్రేమ .  ప్రేమ వరంముద్దుఅంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశి కల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/ అత్యున్నతంబైన యవనీధ రానీక,మంబోధ పటలి ముద్దాడుచుండె..అంటో ముద్దుకు అచేతనాలే మురుసి పోతుంటే మనిషి చిత్త వృత్తిని గురించి మరిక చెప్పేది ఏముంది?'  అవును.. ఒక పార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటికకదళీ ఫలం,ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసందివ్యామృతం, అలరుతేనెల ధారచెరుకు రసాల చవులు దేనిలోనూ లేనిదీ ముద్దు లోపలి తీపి. వట్టి రుచేనా.. మనసు ముడతలను సరి చేసేదీ ఈ పెదాల ముడి తడే. పెదవి పెదవి కలిసాయంటే సగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతి మమ మానసం, దేహి ముఖ కమల మధుపానం' అంటూ ప్రియనాయిక మధురాధరాల  కోసం వూరికే  ఆరాటపడతాడా జయదేవుడి అష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండ గొల్లభామా! ఒక్కచిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!అని నల్లనయ్యనే గొల్లభామ వెంట పరుగులెత్తించి అల్లరి పెట్టింది ఈ అధర వల్లరి.  'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగ మేనికి వింత మైకమ్ము గ్రమ్ము/ చిత్తమున కేదో యున్మాద మత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడు నవసరమున.' అదీ మధురాధర సంగమావస్థ మదనావస్థ. మదన తాపానికి  ప్రథమ చికత్స   ప్రియముఖ కమల మధువు ఆస్వాదనమే. ఆ ఔషధ సేవనం  'సురగణాధీశ దుర్లభసుఖ మొసంగు,అగణితాత్మ వ్యథా భార మణచివేయు/ భీష్మసదయ ప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించి కలవరించని వారు అసలు యవ్వనులే కారు

నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదుగోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరేమనసును కోఱే ఆ  'ఛీ పాడుముద్దుతోనే అసలు పేచీ.  తలుపు చాటునోపెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తిదొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళఅన్నారు కవి దాశరథివెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం  పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు  వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాలబుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలిముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షినిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు  అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానంచేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం.  చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే.  చెవుల దొప్పలుముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే. 

 

మనిషి పెదాలు మాత్రమే  ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడిమనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ  అధర ముఖద్వారాలనుంచేసిగ్గుబిడియంకామనసంశయంభయంఅసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవి  పెదవి చివరి భాగాలే.  ముద్దులాడుకునే వేళ 'డోపమిన్అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడంనిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది. 'న్యూరోట్రాన్స్ మీటర్స్'  మెదడులోఉత్పన్నమై  గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుందిమనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలునిముషం ముద్దుకు 20  కేలరీలు ఖర్చు. ముద్దుకో  శాస్త్రమూ కద్దుపేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరంవ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానానీ ముద్దు ముచ్చట కాదంటానాసరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాంకొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు  అంటువ్యాధి కారక క్రిములు.అయినా ముద్దంటే చేదెవరికిచంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోందిమన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం.   నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహముద్దు ఆలోచన  ముందు రోమనులదే అని ఒక వాదంభారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ.   ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలువారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం.  అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందనిపెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని'డెయిలీ ఎక్స్‌వూపెస్'  బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా  నిర్వహించిన తాజా సర్వే సారాంశంసంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవునీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవునాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండుత్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారుస్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరివద్దనుకుంటే ఎలా?

 

కర్లపాలెం హనుమంతరావు,

ఫ్లాట్ నెం# 404, శ్యామ్ కామధేను అపార్టుమెంట్ సు,

మోతీనగర్,

హైదరాబాద్- 500 018

 

 

 

 

 

 

 

 

 

 

 ముద్దూ ముచ్చట- ఈనాడు సంపాదకీయం 

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం- ఆ సందర్బానికి అనువుగా ఓ గల్పిక

 

ముద్దూ ముచ్చట

-కర్లపాలెం హనుమంతరావు

 

'ప్రకృతి వరం- జీవితం. జీవితం వరం- ప్రేమ .  ప్రేమ వరం- ముద్దు' అంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశి కల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/ అత్యున్నతంబైన యవనీధ రానీక, మంబోధ పటలి ముద్దాడుచుండె..' అంటో ముద్దుకు అచేతనాలే మురుసి పోతుంటే మనిషి చిత్త వృత్తిని గురించి మరిక చెప్పేది ఏముంది?'  అవును.. ఒక పార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటిక, కదళీ ఫలం, ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసం, దివ్యామృతం, అలరుతేనెల ధార, చెరుకు రసాల చవులు దేనిలోనూ లేనిదీ ముద్దు లోపలి తీపి. వట్టి రుచేనా.. మనసు ముడతలను సరి చేసేదీ ఈ పెదాల ముడి తడే. పెదవి పెదవి కలిసాయంటే సగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతి మమ మానసం, దేహి ముఖ కమల మధుపానం' అంటూ ప్రియనాయిక మధురాధరాల  కోసం వూరికే  ఆరాటపడతాడా జయదేవుడి అష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండ గొల్లభామా! ఒక్క/ చిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!' అని నల్లనయ్యనే గొల్లభామ వెంట పరుగులెత్తించి అల్లరి పెట్టింది ఈ అధర వల్లరి.  'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగ మేనికి వింత మైకమ్ము గ్రమ్ము/ చిత్తమున కేదో యున్మాద మత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడు నవసరమున.' అదీ మధురాధర సంగమావస్థ మదనావస్థ. మదన తాపానికి  ప్రథమ చికత్స   ప్రియముఖ కమల మధువు ఆస్వాదనమే. ఆ ఔషధ సేవనం  'సురగణాధీశ దుర్లభసుఖ మొసంగు, అగణితాత్మ వ్యథా భార మణచివేయు/ భీష్మసదయ ప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించి కలవరించని వారు అసలు యవ్వనులే కారు. 

నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదు? గోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరే, మనసును కోఱే ఆ  'ఛీ పాడు' ముద్దుతోనే అసలు పేచీ.  తలుపు చాటునో, పెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తి, దొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళ' అన్నారు కవి దాశరథి. వెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం  పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు  వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాల, బుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలి, ముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షి, నిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు  అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానం. చేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం.  చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే.  చెవుల దొప్పలు, ముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే. 

 

మనిషి పెదాలు మాత్రమే  ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడి. మనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ  అధర ముఖద్వారాలనుంచే. సిగ్గు, బిడియం, కామన, సంశయం, భయం, అసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవి  పెదవి చివరి భాగాలే.  ముద్దులాడుకునే వేళ 'డోపమిన్' అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడం, నిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్' అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది. 'న్యూరోట్రాన్స్ మీటర్స్'  మెదడులోఉత్పన్నమై  గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుంది. మనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలు. నిముషం ముద్దుకు 20  కేలరీలు ఖర్చు. ముద్దుకో  శాస్త్రమూ కద్దు. పేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరం. వ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాం' కొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు  అంటువ్యాధి కారక క్రిములు. అయినా ముద్దంటే చేదెవరికి? చంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూ, ధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం.   నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహ. ముద్దు ఆలోచన  ముందు రోమనులదే అని ఒక వాదం. భారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ.   ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలు. వారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం.  అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందని, పెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని 'డెయిలీ ఎక్స్‌వూపెస్'  బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా  నిర్వహించిన తాజా సర్వే సారాంశం. సంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవు, నీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవు, నాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండు, త్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారు, స్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరి. వద్దనుకుంటే ఎలా?

 

కర్లపాలెం హనుమంతరావు,



 

 

 

 

 

 

 

 

 

 


 

 

 

 

 

 

 

 

వ్యంగ్యం క్రూర గాయాలు - కర్లపాలెం హనుమంతరావు - ఈనాడు

 


వ్యంగ్యం 

క్రూర గాయాలు 

 

- కర్లపాలెం హనుమంతరావు 

(  ధరల ఉగ్రవాదం పేరుతో ఈనాడు దినపత్రిక - సంపాదకీయ పుట- 28 - 12 - 2010 లో ప్రచురితం ) 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భార్య అంతటివారే ఉల్లి. పాయలు కొనడానికి బ్యాంకు అప్పుకోసం పరుగెత్తినప్పుడు, మామూలు మధ్యతరగతి గృహిణి కప్పు పంచదార కొనుక్కునేందుకు  ప్రపంచ బ్యాంకు దాకా పోయి రావాలేమో! 


కిలో బియ్యం మూడు రూపాయలకు ఇస్తామన్న ఎన్నికల వాగ్దానం  ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మన పాలకులు పావుకిలో టమోటా  పాతిక రూపాయలకు పెంచేసి  పె ట్టారు. 


ఎక్కడో ముంబయిలో ఉగ్రవాదులు బాంబులు పెట్టబాతున్నారని  అప్రమత్తమైతే చాలదు. ముందిక్కడ పేలబోతున్న కూరగాయల బాంబుల సంగతి చూసుకోండి బాబులూ! ఉప్పుబాంబో మిరపబాంబో పేలిందంటే దేశమంతా బీభత్సం.  శాంతిభద్రతలు ఆనక.. ముందు ఆహార భద్రత ముఖ్యం. అరె! 


ఉల్లి దోశ తినాలన్నా ఏ బిర్లా  కడుపునో పుట్టాలంటే ఎట్లా? టాటాగారూ! టాటాకారు లక్షరూపాయలకోటి రేటుండేది కనిపెట్టే కన్నా కరివేపాకు కట్టోటి కనీసం ఐదుకైనా దొరికే దారి వెఅికి పెట్టండి సారూ! వోగ్స్ వ్యాగెన్లూ, ఫ్యాబ్ సిటీలు ఎట్లాగూ పోయాయి. ఉద్యోగాలు, ఉపాధిపథకాలు, ఉపకార వేతనాలు ఎట్లాగూ ఇప్పించలేక పోతున్నారు . కనీసం నూనె, ఉప్పుకారాలైనా తిప్పల్లేకుండా ఇప్పిచ్చండి సారో  ! 


ఇంగువ డబ్బీ కోసం ఇంటిళ్లాళ్లు కొంపెక్కి ఆందోళన చేస్తుంటే ఆనందంగా ఉందా  మహాప్రభో ! అరవైపెడితేగాని అరకిలో ఆలుగడ్డలు రాని ఈ గడ్డ మీద నిలబడాలంటేనే నిజంగా సిగ్గుతో చితికి పోవాల్సొస్తుంది. 


ఎన్నిక లంటూ అర్థాంతరంగా ఇంటి ముందుకొచ్చి నిలబడితే నిలబడ్డవాల్లందరికీ  ఈసారి నిజంగా గడ్డు పరిస్థితే! 


వెయ్యి రెండు వేలంటే ఏ ఆఫ్ఘనిస్తాన్నుంచో అచ్చేయించుకొచ్చేయచ్చు. కానీ, ఇంటి కో కూరగాయల తట్ట దింపి పొమ్మంటే! ..  కొంప కొల్లేరవడం ఖాయం. 


వంకాయ కిలో అరవైపెట్టి కొనే స్తోమతు లేక వచ్చిన అమెరికా మంచి సంబంధాన్ని తిరక్కొట్టేసింది మా పెద్దక్కయ్య. కాలూ చెయ్యీ  ఆడకున్నా ఆస్ట్రేలియా దాకా పాక్కుంటూ పోయాడు మా  పెచ్చి బాబాయ్ చివర్రోజుల్లో అయినా చారెడు ఉలవచారు మనసారా తాగి పోవాలని.


చెబితే మరీ అతి అనుకుంటారు . కానీ, మా 

దోస్తు పరమేశ్వరంగారింట్లో పడ్డ దొంగలు బీరువా తలుపులు బార్లా తెరచిఉన్నా పట్టుబట్టల్ని, బంగారాన్ని పట్టించుకోకుండా వంటింట్లో ఉన్న గ్యాస్ బండను దొర్లించుకుపోయారయ్యా ! 


కాశీదాకా పోయి, తినే కంచాన్ని ఏ గంగలోనో కలిపొచ్చిన వాళ్ళకు తప్ప ఈ పెరిగే ధరలతో తిప్పలుతప్పటంలేదు.  


నాలుగు చినుకులు పడనీయండి,  ధరలు వాటంతటవే నీరు కారిపోతా యని స్వామి చిదానందులవారి ధర్మప్రబోధాలు ! సన్నాసులు సూక్తులు వినేటందుకా సంసారులిలా  విలువైన ఓటును వృథా చేసుకోడం? 


 అయ్య! ఆ జగన్నాథ రథచక్రాలు ఆనక తీరిగ్గా భూమార్గం పట్టిద్దురు గానీ,  ముందు ఆకాశ మార్గం పట్టిన ఈ అపరాల పీక పట్టుకుని నేలమీదకు దింపుకు రండయ్య ! 


సర్కారు స్వాములా! ధరలను అదుపు చేయడానికి మించి దేశభక్తి మరోటి లేదు ప్రస్తుతానికి . ఒక్క పూటైనా రెండువేళ్లూ నోట్లోకి పోయే ఏర్పాటు చేస్తే అంతకు మించిన ప్రజాసేవా  మరోటి ఉండబోదు. 


ఆనాడు ఆ వేములవాడ భీమకవి ఏమని తిట్టిపోసాడో !  ఇప్పుడు నిజంగానే జనం ముందున్న కంచాల్లో అన్నం సున్నంగా, అప్పాలు కప్పలుగా కనబడు తున్నాయి. 


సింగిల్ ప్లేట్  భోజనం కోసం డబుల్ బెడ్రూం ప్లాట్ కుదవ పెట్టాల్సిన రోజులు అట్టే దూరంలో లేవు. 


బ్యాంకు లాకర్లలో ఇంతదాకా భద్రంగా దాచుకున్నదంతా లాగేసి, వాటితో నాలుగు ఆకుకూరలు, కాయగూరలు కొని దాచుకోకపోతే రాబోయే రోజుల్ని కాచుకోవటం కష్టమే! 


ధరలు, దొరలు స్థిరంగా ఉండని ఈ పూర్ణగర్భలో గంజిలో ఇంతా ఉప్పుకలు, ఉల్లిగడ్డ నంజుకు తినేవాడికన్నా ఆగర్భ శ్రీమంతుడు ఇంకొకడు ఎవరుంటారు చెప్పండి! 


ఆకాశంలోకి దూసుకొనిపోవడానికి రాకెట్లు సిగ్గుపడుతున్నా గానీ- అపరాల రేట్లు ఉత్సాహపడుతున్నాయి. అదుపులేని ధరలు పది అసమ్మతి నేతల పెట్టు.  కేంద్రంలోని సర్కారు ఊపిరి తీసే ముసలం అదే కావొచ్చు . 

'కూరగాయాలు'  కాకుండా సర్కారు ముందే మేలుకుంటే మంచిది!

- కర్లపాలెం హనుమంతరావు 

( ధరల ఉగ్రవాదం  పేరుతో ఈనాడు దినపత్రిక - సంపాదకీయ పుట- 28 - 12 - 2010 లో ప్రచురితం ) 


 








కాలర్ ఎత్తుకు తిరగాలి - ఈనాడు - హాస్యం

 



' కాలర్ ' ఎత్తుకు తిరగాలి! 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట 05 - 09- 2011 - ప్రచురితం ) 


'పాపం మన పిల్లకాయల్ని చూస్తే  జాలేస్తుంది బాబాయ్. సముద్రాలు దాటిన అమాయకంగా ఆ లోయ చదువుల్లో పడిపో యారు. స్కాలర్లు అవుదామనుకుని కాళ్ళకు అనేవో ' రేడియో కాలర్లు' తగిలించుకున్నారు . ప్రారబ్ధం కాకపోతే, పట్టాలు సాధించాలని వెళ్ళినవాళ్ళ కాలికి ఈ జీపీయన్ పట్టీలు పడటం ఏంటో? 


ప్రాసలో నువ్వు బాధపడటం వినేవాళ్ళకు బాగానే ఉంది. గానీ, దేశం కాని దేశంలో ఆ పిల్లలు పడే ప్రయాసను అర్ధం చేసుకోవడం లేదురా అబ్బాయ్ నువ్వు!  సిగ్గుమాలిన ఆ విశ్వ విద్యాలయాలు చేసినవనికి మనం సిగ్గుతో తలొంచుకోవాల్చిన పనేముంది చెప్పు!  పాజిటివ్ గా ఆలోచించుకోవడం ముందు మనం నేర్చుకోవాలి. గురజాడవారి గిరీశం ఏమన్నాడు ? వేర్ యీజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ వుచ్ డజ్‌ నాట్ సెర్వ్‌ ది  పర్పజ్- అనలేదూ!  అమెరికావాడిచ్చిన సెల్లులు మన మెడల్లో గొలుసులుగా వేళ్ళాడదీసుకుంటున్నాం. అదే పంథాలో  ట్రాకర్లనూ, కాళ్ళకు వేసుకునే మేజోళ్ళు అనుకుంటే ఈ గోలే ఉండదు కదా!


నువ్వన్నీ ఇలాగే ఏమిటేమిటో ఉల్టాగా  చెబుతుంబావ్  బాబాయ్! అచ్చోసిన ఆంబోతులు  వెంట  పడకుండా ఇలాంటి ముందరి కాళ్ల బంధనాలు  తగిలించే వాళ్ళట పల్లెల్లో మనాళ్ళు.  పిచ్చివాళ్ళకు, పశువులకు, దొంగలకూ వేసే కాలి సంకెళ్ళను మువ్వల గజ్జెలసుకుని మురిసిపొమ్మంటావా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే! 


ఆ ఇంగ్లీషువాళ్లు  తమ అవసరాల కోసం కనిపెట్టుకున్న వాటినల్లా మనం మనకు అవసరం ఉన్నా లేకపోయినా తెచ్చి ఇక్కడ అందరికీ గొప్పగా చూపించుకోవడంలా? అల్లాగే  కాలర్లనూ మనం మన అవసరాలకు తగినట్లుగా ఉపయోగిం చుకోవడంలో తప్పు..  ముప్పు ఏమిటి?


పుల్లుగా మందు కొట్టేవాడు ఎప్పుడు ఎక్కడున్నాడో తెలు సుకునేందుకు వాడుకునే ఈ ట్రాక్టర్లతో మనకు ఏ అవసరాలు ఉంటాయంటావ్‌బాబాయ్ ? 


బోలెడన్ని ప్రయోజనాలురా బాబూ!  త్రేతాయుగంలో ఇలాంటి ఆచూకీ తెలిపే సాధనాలు లేకపోబట్టేగదా. . రావణాసురుడు ఎత్తుకెళ్ళిన సీతమ్మవారు ఎక్కడుందో తెలుసుకోలేక రాములవారు అంతగా కమిలిపోయింది! ఇప్పుడీ  కాలంలో కూడా ఇలాంటి ట్రాకర్లుంటే ఎంత సుఖంగా ఉంటుందో తెలుసుకో..! 


అలా అడుగు బాబాయ్! గడగడా వప్పచెప్పే స్తా . ఒపిగ్గా విను ! రాజకీయాలు ఇవాళా  రేపూ  ఎలా గున్నాయ్?  ఎవరేపూట ఏ పార్టీలో తిరుగుతున్నారో అధికనాయకులకు  తెలీక తలలు పట్టుకుంటున్నాము!  లేదా కార్యకర్తాల  కాళ్ళకు ఇలాంటి చిన్నచిప్పు ఒకటి తగిలిస్తే వాళ్ళ కదిలకలను ప్రతిక్షణం కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండొచ్చు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక, అలిగి అజ్ఞాతంలోకి వెళ్ళి పోయే నాయకులు కాళ్ళకో చేతులకో ఇలాంటి కాలరేమన్నా  ఉంటే ఎక్కడున్నారో తెలుసుకుని వెళ్ళి బుజ్జగించే కార్య క్రమం చేపట్టవచ్చు.  అభివృద్ధిని పరిశీలించటానికి విదేశాలకు బయలుదేరే బృందాలు నిజంగా ఏ స్విట్జర్లాండులో దిగారో లేదో తెలుసుకోడానికి ఇంతకు మించిన మంచి సాధనం ఇంకే ముంటుంది బాబాయ్ ? సర్కారు సొమ్ము మీద విజ్ఞాన విహార యాత్రలకు బయలుదేరినట్లు పెట్టే  దొంగబిల్లుల చెల్లింపులకు స్వస్తి చెప్పేయచ్చు....  రాష్ట్ర సమస్యలను మాత్రమే  చర్చించటానికి వెళుతున్నామని బుకాయించే ప్రజాప్రతినిధులు నిజంగా కేంద్రమంత్రులతో మాట్లాడుతున్నారో, ఆంధ్రాభవన్లో పేకాడుకుంటూ కూర్చున్నారో ఈ సాధనంతో తెలుసుకోవచ్చా లేదా ? మామూలు రోజుల్లో ముఖ్యుల వెంట నీడలాగా మసలే అదృశ్య హస్తాలు, అవసరం పడినప్పుడు మాయమైపో

తున్నాయి గదా..  అలాంటి శక్తులకు  కాళ్ళకో  చేతులకో ఇలాంటి ట్రాకర్లు తగిలిస్తే కనిపెట్టడం సులభమవుతుందా లేదా?


నీవు చెబుతుంటే నిజమేననిపిస్తోంది బాబాయ్ ! కదలికల గుర్తింపు సాధనలు రాజకీయంగా మనకూ మంచి ప్రయో జనకరం అనిపిస్తున్నాయి.


ఒక్క రాజకీయంగానే కాదురా అబ్బాయ్ ! సగటు మ మనిషికీ  తట్టెడు  ఉపయోగాలు. మొగుడు మందు కొట్టడానికి ఏ బారు చూరు పట్టుకు వేలాడుతున్నాడో తెలుసుకునేందుకు  ఈ చిప్పులు ఆడవాళ్ళకు పనికొస్తాయి. పిల్లాడు కాలేజీలోనే  ఉన్నాడో.. సినిమాహాలు క్యూలో నింబడి ఉన్నాడో తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు చక్కగా పనికి వస్తుందిది. బయ టకు వెళ్ళిన ఆడపిల్ల ఎక్కడ ఎంత భద్రంగా ఉంటుందో తెలుసుకోవడానికి అక్కరకొచ్చే సాధనంరా ఇది అబ్బాయ్ ! మొన్న సంక్రాంతి పండుగ రోజుల్లో రథంముగ్గు వేసుకుంటూ మీ ఆవిడ ఎక్క డికో వెళ్ళిపోయిందని నువ్వెంత కంగారుపడ్డావో  గుర్తుందా! ఇట్లాంటి  పట్టీ ఒకటి కాలికి పట్టాల్లాగా చుట్టుకొని ఉంటే ఆమెకోసం ఏడే వెతుకులాట తప్పి ఉండేది కాదా ? ట్రాఫిక్కులో నువ్వెక్కడన్నా.  ఇరుక్కుపోయినా ఇంట్లో వాళ్ళకు కంగారుపడాల్సిన ఖర్మఉండదు- ఈ పట్టీ గానీ నువ్వు తగిలించుకుంటే. 


నిజమే కానీ బాబాయ్.. ఇలాంటివి మా కార్యాలయాల్లో కూడా ప్రవేశపెడితే మస్టర్లో  సంతకంచేసి క్యాంటీన్లో కూర్చోవడం తగ్గుతుంది.


దార్లోకొచ్చావ్. బళ్ళలో పంతుళ్ళు, ఆసుపత్రుల్లో వైద్యులు పనివేళల్లో ఉండేలా చూడటానికి ఇంతకుమించిన మంచి సాధనంలేదు..


బ్యాంకులోన్లు ఇచ్చేముందు అప్పు తీసుకున్నవాడి కాలికి ఇలాంటి చిప్పు ఒకటి తగిలిస్తే- మొండి బకాయీల బెడదా బాగా తగ్గిపోతుందిగా బాబాయ్! 


నీ బుర్ర పాదరసంలాగా ఎలా పనిచేస్తుందో చూశావా ఇప్పుడు!  నిత్యానందస్వాముల్లాంటి వాళ్ళ కాళ్ళకూ ఇలాంటి కచ్చడాలు తగిలిస్తే వీడియోలో ఉన్నది నకిలీనో కాదో తెలి సిపోతుంది. న్యాయస్థానాల పని తేలికవుతుంది.  నేను చెప్పే దేమంటే, ఈసారి మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్న ప్పుడు పెళ్ళికొడుకు కాళ్ళకు రేడియో కాలరుందో లేదా ముందుచూడు. లేకపోతే ఒకటి కట్టుకున్నదాకా సంబంధం ఖాయం చేసుకోకు సరేనా??


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట 05 - 09- 2011 - ప్రచురితం ) 

సరదాకేః ఆదివారం శీర్షికకు నీతిలేని బూతుకథ నీతి -కర్లపాలెం హనుమంతరావు

 

 

M


ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది. లేచెళ్ళి కాసిని

మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు.

ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు! ఈ సారి కాస్త ఎక్కువగా!

నొప్పికూడా  పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.   కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్

ఎగదంతే గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో విన్నాడు.

ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం పండుకూడా తినలేదు..  వళ్లంతా ఒహటే

ఆవిర్లు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి  మంచంమీద కూలబడ్డాడు.

గుండెల్లో నొప్పి  తెరలు తెరలుగా వస్తూనే ఉంది.

కరోనా?.. హార్ట్ ఎటాక్?!’

అనుమానంతో  గుండె కొట్టుకొనే వేగం  మరింత హెచ్చింది.

ఇప్పుడేం చేయడం?

సమయానికి ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరు. అందర్నీ తానే ఊరికి తరిమేశాడు. ఏదో

పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు దగ్గర పడుతోంది. ఇంట్లో

పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో.. మూడ్ స్థిరంగా ఉండటం

లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి పంపించాడు.. వారం రోజుల తరువాత

తిరిగి తనే   తీసుకు వస్తానని వాగ్దానం చేసి మరీ.

కథ ఇప్పుడిలా తిరగబడుతుందని తనేమైనా కల కన్నాడా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా

జరిగుంటే తగు  జాగ్రత్తల్లో తానుండేవాడే కదా!

కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే ముందే..  వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి.

డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు ఆపద్బాంధవుల ఫోన్ నెంబర్లు

దొరికాయి. డాక్టర్ గోవిందు, డాక్టర్ బండ కోదండం, డాక్టర్ దుర్వాసిని.

డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.

'గోవిందో  గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే పనిగా

మోగుతోంది.  అయినా   ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి.  సెల్ కట్

చేద్దామనుకొనే లోపుగుర్.. గుర్’ మంటూ గొంతు వినిపించింది.

'హలో!.. ఎవరూ?'

'డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!.. గ్గుండెల్లో...

న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే.. ప్ప..ట్నుంచీ'

అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ సార్! అందర్లాగా మీరూ నన్ను

వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'

'కాదా?'

'కాదండీ బాబూ! మనది పంగనామం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్.

బెల్లం సాగుతో అధికాదాయం సాధించే నవీన విధానాలు’ అనే అంశంమీద   పరిశోధన

చేసినందుకు..’  సుబ్బారెడ్డి ఫోన్ ఠక్కుమని కట్ చేసేసాడు. ‘ఇప్పుడా

సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’

రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం.. నెంబర్ వెంటనే కలసింది.

'యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'

 'ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితినంతా గుండెలవిసిపోయేలా  వివరించాడు.

ఆసాంతం  తాపీగా విని.. ఓ సుదీర్ఘ ఉచ్ఛ్వాసం  తీసుకొని మరీ 'సారీ!

మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా డాక్టర్ పట్టా తెలుగు

సాహిత్యానికి సంబంధించింది బ్రో! ‘ప్రాచీనకాలంలో జంతువుల జీవన

విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన  పాత్ర' అనే అంశం మీద కుంభకోణం

విద్యాపీఠం వారిచ్చిన స్నాతకోత్సవానంతర  పట్టా! ‘బండ కోదండం’ అన్న పేరు

విన్న తరువాతైనా మీకు నా గురించి  అర్థం కాకపోవడం విచారకరం..' ఉండేలు

సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో బాదేసినట్లు  గుండెలు

కలుక్కుమన్నాయి.  ఫోన్ కట్ చేసేసాడు.

 

మిగిలిందిక డాక్టర్ దుర్వాసిని.  సమయం చూస్తే అర్థరాత్రి దాటి అర్థ

గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు చేసేస్తేనో!  సంకోచిస్తూనే

నెంబర్ రింగ్ చేసాడు  సుబ్బారెడ్డి మార్గాంతరం లేక.

చాలాసేపు చడీ చప్పుడు  లేదు.. ఊరికే రింగవడం మినహాయించి! అదే పనిగా

ప్రయత్నించిన మీదట  అవతలి వైపు నుంచి రెస్పాన్స్ వచ్చిందీసారి!

ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో సూరేకారం పోసినంత రౌద్రం!

సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక   సమర్పించడం సగం కూడా కాలేదు

అవతలి వైపు  శాల్తీ కాళికాదేవి అవతారమే ఎత్తేసింది.

'ఎవడ్రా నువ్వు? నీకసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..  కాల్

 చేసేదికాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు!

ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు

పేషెంటేవన్న గ్యారంటీ ఏంటంట? నిజంగా నీది గుండెనొప్పేనని రుజువేంటి?

నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ ఆసుపత్రికో..

అంబులెన్సుకో!  నేరుగా ఇలా  ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?

పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు  ‘దిశ’ పోలీస్ స్టేషన్

సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా.. బీ కేర్ ఫుల్!' ఠక్కుమని

ఫోన్ కట్టయి పోయింది.

 

సుబ్బారెడ్డిట్లా  నేరుగా ఇట్లా డాక్టర్లనే తగులుకోడానికి కారణం

లేకపోలేదు. రాతకోసం  ప్రశాంతత కావాలని వేధిస్తుంటే  ఫ్రెండువెధవ తననీ

అడ్రసు తెలీని  అజ్ఞాతంలో వదిలేసి పోయాడు రాత్రి.  మళ్లీ తెల్లారి

వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా ఏంటో  తెల్సిచావదు!

ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో ఫుల్లుగా

మందుగొట్టి  గొడ్డులా పడున్నాడు.  తనదగ్గర సమయానికే  ఆసుపత్రుల నెంబర్లూ

ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ  పడక.

ఉన్న  మూడు నెంబర్లూ  బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!

పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ గుండెల్లో నొప్పి ఎక్కువై

పోతోంది. చెమటలూ ధారాపాతంగా కారిపోతున్నాయి. అక్కడికీ    నొప్పి నుంచి

దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని   న్యూస్ ఛానెలేదో ఆన్ చేసాడు.

ఐటి దాడులకు సంబంధించిన వార్తలేవో వెల్లువలా వచ్చిపడుతున్నాయ్! కేంద్ర

పన్నుల శాఖవాళ్లకు ఉన్నట్లుండి పూనకం వచ్చినట్లుంది. ఆర్థిక అక్రమాల

ప్రక్షాళన కార్యక్రమేదో పెట్టుకున్నట్లు.. బ్రీఫ్ కేసుల్తో సహా సార్ల

దండు  రెండు తెలుగు రాష్ట్రాల మీదా వచ్చిపడింది. దాడుల్లో దొరికింది

ముష్టి రెండువేల కొత్త రూపాయనోటు ఒక్కటీ! వాళ్లిచ్చిపోయిన పంచనామాలో

ఎంచేతనో అంకె పక్కన అక్షరాలు సరిగ్గా అచ్చయ్యాయి కాదు. ఆ అచ్చు తప్పును

నేతలంతా తమకొచ్చిన పరిజ్ఞానంతో పూర్తి చేయడంతో తెలుగు నేతల అక్రమార్జనల

ఖాతాలు లక్ష నుండి కోట్లకు ఉబ్బిపోయాయ్ సందు దొరికిందే  తడవుగా!

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్ ప్రచారానికి సంబంధించిన

వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి.  ట్రంపు మహాశయుడు శత్రువర్గం

మీద పడి  అడ్డమైన కారు కూతలూ అడ్డూ ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే

స్థాయిలో అవతలి వైపు నుంచీ తగ్గకుండా భాషా ప్రయోగాలు !

 

మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి రాజకీయాలమీద విరక్తి పుట్టించే

దుర్భాషలు అవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న సుబ్బారెడ్డికి మాత్రం

హఠాత్తుగా  తారక మంత్రం దొరికినట్లయింది.  మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు

సెల్ ఫోన్ అందుకున్నాడు.

 

మళ్లీ డాక్టర్ దుర్వాసిని  బెడ్ రూంలోని  సెల్ మొరుగుడు మొదలు పెట్టింది

అదే పనిగా.  ఎన్ని సార్లు నోరుమూసేసినా   మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో

దుర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న  మొగుడుగారు గయ్యిమని

లేచారు మేడమ్ గారిమీద 'మీ ఆసుపత్రి నుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవకపోతే

ఎట్లాఆనక సమస్యలొచ్చి పడితే సర్ధిపెట్టలేక చచ్చేది నేనేగా! ముందా ఫోన్

చూడు!' అంటూ.

 భర్త హెచ్చరించరికలతో ఇహ తప్పదన్నట్లు చిరాగ్గా లేచి   సెల్  అందుకొంది

డాక్టర్ దుర్వాసనమ్మ.

  …

 సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో

ఉండేలు సుబ్బారెడ్డి యమగండం నుండి బైటపడ్డాడు  చివరికి ఎట్లాగైతేనేం!

 పోలీసులు సమయానికి వచ్చి  కలగచేసుకోక పోయుంటే ప్రముఖ రచయిత

సుబ్బారెడ్డి  ఈ పాటికి పై లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా   నవల పూర్తి

చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దుర్వాసిని ఇచ్చిన అర్థరాత్రి

'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని  ‘దిశ’  టీం సీరియస్ గా తీసుకోబట్టి

గుండెనొప్పితో లుంగలు  చుట్టుకుపోతోన్న  సుబ్బారెడ్డిని 'సగం  నిర్మాణంలో

ఉన్న ఊరి బైటి భవంతిలో గాలించి మరీ పట్టుకొన్నారు పోలీసులు.   అత్యవసర

ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆగమేఘాలమీద పోలీసులే

దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రిలో చేర్పించడం వల్ల సుబ్బారెడ్డి కథ

సుఖాంతమైంది.

అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దుర్వాసిని సైతం న్యూసెన్సు కేసులో

మరింక ముందుకు పోదల్చుకోలేదు.

***

వాస్తవానికి మనం మెచ్చుకోవాల్సింది సుబ్బారెడ్డిని.. అతగాడి

సమయస్ఫూర్తిని  కాదు. అతగాడు అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు

సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని సమకూర్చి పెట్టిన  రాజకీయ నేతాగణాలని.

అచ్చంగా ట్రంప్ భాషే సుబ్బారెడ్డి   వాడి ఉంటే ఈ కథలో ఇంత వాడి.. వేడి

పుట్టుండేవి కావు.

ఈ మధ్యన తెలుగు రాష్ట్రాలలో నిత్యం నడుస్తున్న రాజకీయ రామరావణ యుద్ధాల

పుణ్యం. ఆ సందర్భంగా ప్రజలు ముచ్చటపడి ఎన్నుకున్న ప్రముఖనేతలు ఆ ప్రజలకే

ముచ్చెమటమలు పట్టే రేంజిలో యమధాటీగా పుట్టిస్తున్న దుర్భాషాసాహిత్యం!

 

రాజకీయనేతల్లో రాను రాను మంచీ మర్యాదలనేవి పూర్తిగా అడుగంటిపోతున్నాయని

కదా     ఆదర్శవాదులు  దురపిల్లడం! అందుకు బదులుగా నేతాగణం కష్టపడి

సృష్టిస్తున్న  దుర్భాషా సాహిత్యం.. దాని ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి

అవసరం ఉందన్నదే ఈ బూతు కథ నీతి!

 కథ అంటే నీతి ఉండాలని కదా మన పెద్దలు చెబుతుండేది! ఈ ‘నీతిలేని బూతుకథ’ నీతి ఇదే!

***

 

From <https://mail.google.com/mail/u/0/#search/%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%BE/CrpPVdKwLFbtBbNsjzZrwVtwnJstVzpNglcfZHpsQtcDPTbDjdgknJbcFMZdkgxNhbQGpBCZVBkJjFLxKDJV>

 

ఈనాడు - సంపాదకీయం అష్టమ స్వరం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 06 - 04 - 2012)

 ఈనాడు - సంపాదకీయం 

అష్టమ స్వరం 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 06 - 04 - 2012) 


సృష్టి ప్రారంభంలో ఓ సాయం సంజెవేళ కైలాస శిఖరంమీద ఓ వంక వాణి మాణిక్య వీణారవం, మరోవంక మహేంద్రుని వేణుగానం, ఇంకో దిక్కున విధాత తాళవాదనం, చెంతనే శ్రీలక్ష్మి గానాలాపన, తదనుగుణంగా మహావిష్ణు మృదంగ తాడన, దైవ నేపథ్య సంగీత సహకారంతో సాగే ఆనందతాండవం మధ్య అలుపుతీత కోసం క్షణకాలం ఆగిన నెలతాలుపు(శివుడు) నాసికా పుటాలనుంచి అవతరించినవే చతుర్వేదాలు! అందులోని సామవేదం ఉపాంగంగా ఆవిర్భవించి గాంధర్వంగా గణుతికెక్కిన స్వరశాస్త్రమే సంగీతం! 


పరమపురుషుడైన మహేశ్వరుడి సంకల్పం సంగీతమైతే, ఆ సామగాన జనిత భావానికి సప్త స్వరాలనందించి సహకరించింది ప్రకృతే' అంటారు స్వరమేళ కళా నిధి రామామాత్యులు. కృతుల అభ్యాస ఆరంభంలో సంగీత విద్యా ర్థులు ఆలపించే తొలి పిళ్ళారి(వినాయకుడు) గీతరాగం ఆరోహణ అవరోహణలు రెండింటిలో ముందుండే స(షడ్జమ) స్వరానికి నెమలి క్రీంకారమే స్పూర్తి. 


కైలాస సానువుల్లో ప్రతిధ్వనించే నందీశ్వరుడి కంఠారావమే 'రిషభంగా స్థిరపడినా  'రె' స్వరం. 


వేటూరివారి ఓ పాట చరణంలోలాగా 'మురళి వనాంతాల విరియు వసంతాల' చిగురించే మోహన గాంధారంలోని ముఖ్య 'గ' కార  స్వరానికి మాతృక మేష రవమే. 


బృహదారణ్యకోపనిషత్ ప్రకారం గాంధార స్వర నాదమే సామగానానికి ఊపిరి. మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖర కలశంవంటి హిందోళ మధ్యమం (మకర స్వరం) పుట్టింది క్రౌంచపక్షి గళం నుంచే. 


శంకరుడికి పరమ ప్రీతికరమైన హిందోళాన్ని కూతురు సంకరం చేసి నందుకు ఆందోళన చెందుతుంది 'శంకరాభరణం'లోని ముఖ్యపాత్ర. కోకిలమ్మ అందించిన కుహుకుహూలే సప్తస్వరాల్లో సంధించిన పంచమ ' ప' స్వరానికి ప్రేరితం. 


ఆరో స్వరాక్షరం 'ద ' కారం  (దైవతం) గుర్రపు సకిలింతలోనుంచి పుట్టినట్లు చెబుతారు. 


నిషాదంలోని ప్రధాన ధ్వని 'ని' గజ ఘీంకార జనితం.


చంటిబిడ్డలో రామచంద్రుణ్ని చూసుకుంటూ కన్నతల్లి పాడే ' రామా లాలీ... మేఘశ్యామ లాలీ' జోలపాటలో జాలువారేదంతా వాత్సల్య' రాగమే ' . 


కంటి దీపంవంటి కూతురు పెళ్ళిచేసి అత్తవారింటికి అంపకాలు పెట్టేవేళ 'సెలవిస్తి మాయమ్మ సెలవిచ్చినాము/ చెలగి మీ అత్తింట్లో బుద్ధిగలిగుండు' అంటూ కన్నవారు కన్నీటితో మప్పే సుద్దు లనిండా వినిపించేది వియోగ ' రాగం' . 


మునిమాపులో మధురానగరి దారికాచి కొంగుపట్టి గోలచేసే గోపాలదేవుణ్ని మందలిస్తూ సాగే నెర బాణీలనిండా సరసంగా తొంగి చూసేది సరాగ ' రాగం' . 


శాస్త్రీయం, జానపద, పాశ్చాత్యం- ధోరణి ఏదైనా దారులు తీసేది మాత్రం బ్రహ్మానంద సామ్రాజ్యానికే 'మూలాధారజ నాద మెరుగుటె ముదమగు మోక్షమురా ఓ మనసా!' అని గదా త్యాగరాజ స్వామివారి రాగహృదయ ప్రబోధం. వస్తు వైవిధ్యంతో సృజించిన వేలాది గీతాల స్వతంత్ర రాగశైలి 'రవీంద్ర సంగీత్'  మీద సంప్రదాయవాదులు రేపిన దుమారం మీద రవీంద్రుడు  ఇచ్చిన సమాధానంలోనే సంగీత సామ్రాజ్య ఎల్లల లేమి తేటతెల్ల మవుతుంది .  అవధులు లేనిది నాదప్రపంచం. కంచెలు కట్టేపని అవివేకం. చిరకాలం మన్ను తుందో... చిత్తుకాగితం పడవలా తడిసి మునుగుతుందో తేల్చేది కాల ప్రవాహమే గదా!' అంటారా రాగరుషి. పుణ్యజ్యోతి, పూర్ణగగన, మధు రహేరి, సకలభువన' అంటూ కొన్ని పదుల మధుర కంఠాలు ఎలుగెత్తి పాడే రవీంద్రుడి గీతాలు నిజానికి చర్చి ఘంటారావాలంత ఉత్తేజితంగా ఉంటాయి. మంచి సంగీతానికి మరణమెందుకుంటుందీ! 


సంగీతానికేదో సూదంటురాయి లక్షణం లేకపోయుంటే, బ్రౌన్ దొరంతటివాడు నెలలపాటు కుమార రాముని కథల వంటివి చెప్పిం చుకొనేందుకు అడవి మనుషులను సొంత భవనంలో ఎందుకు ఉంచుకుంటాడు! సీమపాలనకు ప్రతినిధిగా వచ్చిన బోయల్ దొర స్వరశాస్త్రం ఆయువుపట్లు తెలుసుకోవడానికి రాత్రిళ్లు పల్లెపట్టుల్లో తిరిగేవాడు. బెంగాలీ కొండ సంగీతాన్ని, భోజ్ పురీ పల్లెరాగాల్ని, పంజాబీల వీరగీతాలను , బీహారీ అడవి పాటలను  శ్రమించి సేకరించిన నాదప్రియులలో  నాటి జిల్లా మేజిస్ట్రేటు హ్యూజ్ ప్రేయర్నుంచి కోల్, ఆర్.సి.టెం ఫుల్, సర్ జార్జి గ్రియర్సన్ వంటి తెల్లదొరల దాకా కొల్లలు. 


పశువు నుంచి శిశువుదాకా రాగానికి లోబడని జీవి ఉండదు. రాగానికి రాళ్లు కరిగించే లక్షణం ఉందో లేదోగానీ, రాయివంటి కసాయి గుండెల్ని నీరు చేసే గుణం మాత్రం ఉంది. అమృతవర్షిణి రాగం ఆలపిస్తే మేఘాలు మురిసి కురుస్తాయని మన విశ్వాసం. సర్వకళల్లో గానం ప్రాముఖ్యమేమిటో పానుగంటి లక్ష్మీ నరసింహం మాలతీ మాధవం లోని ఒక పద్యంలో హృద్యంగా తెలియజెప్పారు. 'మానసికంగానే కాదు శారీరకంగా సైతం రసప్రయోగంవల్ల కలిగే ప్రయోజనాలు అశేషం' అంటారు గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య. చిన్న చిన్న శస్త్ర చికిత్సలప్పుడు సంగీతం వినడంవల్ల ఆందోళనలు తగ్గుతున్నట్లు ఆక్స్ ఫర్డ్ లోని జాన్ ర్యాడ్ క్లిఫ్ ఆసుపత్రి వైద్యులు కొత్తగా నిర్ధారించారు. 


శరీరంలోని ఏదో ఒక భాగానికి మాత్రమే మత్తుమందిచ్చి శస్త్ర చికిత్స చేసేటప్పుడు రోగులకు ఇష్టమైన సంగీతం వినిపిస్తే మెలకువలోనూ ప్రశాంతంగా స్పందిస్తున్నారట. నొప్పిని బాగా తట్టుకోవటానికి, త్వరితంగా కోలుకోవటానికి సంగీతం సంజీవనిలాగా పనిచేయటం శుభ పరిణామం' అంటున్నారు అధ్యయన బృందం నేత డాక్టర్ హజీమ్ సదిదీన్. 


అద్వైత సిద్ధికే కాదు, ఆరోగ్య లబ్ధికీ గానం ఒక సోపానంగా మారడం నాదప్రియులందరికీ మోదదాయకం. సప్తస్వరాలకు ఆరోగ్య స్వరం జతకూడటం- బ్రహ్మానందం అనే అందలాన్ని అందుకోవడానికి అందివచ్చిన అష్టమ స్వరం.


- కర్లపాలెం  హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 06 - 04 - 2012 ) 



వాహనవిలాపం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు దినపత్రిక - 01-02-2016 - ప్రచురితం )

 


వాహనవిలాపం 

- కర్లపాలెం హనుమంతరావు

(  ఈనాడు దినపత్రిక - 01-02-2016 - ప్రచురితం ) 


---  




వాహనవిలాపం 

*

(  ఈనాడు దినపత్రిక - ప్రచురితం ) 


అనగనగా ఓ బంద్ రోజు ... 


బైట తిరిగే పనిలేనందున రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంగణంలో వాహనాలన్నీ  కొలువు తీరాయి. 


బస్సు సభ ప్రారంభమయింది. 


బందులూ, ధర్నాలూ, రాస్తారోకోలు, హర్తాళ్లు - రాష్ట్రంలో ఎక్కడ ఆందోళన జరిగినా ముందు ఎర్రబస్సుల మీదే అందరూ కన్నెర్ర చేసేది ! దారినపోయే దానయ్య సైతం సందు చూసుకుని మరీ రెండు రాళ్ళేసి సరదా తీర్చుకుంటుండె !


నిజం. చిన్న దెబ్బ తగిలితే చాలు పెడబొబ్బలు పెట్టే ఈ అబ్బాయిలు, అద్దాలు పగిలితే మనకూ అంత బాధ ఉంటుందని ఎందుకర్ధం చేసుకోరు? ఎక్కడ ఎవరు ఏ పూట ఏ బందుకు పిలుపిస్తారో... ఎప్పుడు మనమీద నిప్పు రాజేస్తారోనని నిత్యం గుండెలు గుబగుబలాడి పోతున్నాయి!


బాగా చెప్పావు. అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద నిర్భ యంగా నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యమొచ్చినట్లని బాపూజీ అప్పుడెప్పుడో అన్నారుగానీ, ఇప్పుడైతే పట్టపగలు రోడ్డు మీద బస్సులు సురక్షితంగా తిరిగి నప్పుడే అసలైన స్వతంత్రమొచ్చినట్లని అనుండేవారేమోనని నా అనుమానం. మన పాట్లు  తెలుసుకోవటా నికైనా మళ్ళా ఒకసారి మహాత్ముడు భూమ్మీదకు దిగి వస్తే బాగుణ్ను!'


ఎన్నికల ముందు ఈ నేతలందరూ బస్సు యాత్రలని ఎన్ని బిల్డప్పులిస్తారో గుర్తుందా! ఇప్పుడొక్కడికీ మన డొక్కు బతుకుల గురించి ఆలోచించనే  లేకుండా పోయింది! 


నిజమే. నాయకులైవా వెళ్లేందుకు  వణికిపోయే మారు మూల పల్లె డొంకల్లోకి జంకూగొంకూ లేకుండా రోజూ వెళ్ళి వస్తుంటామే! మనం మొహం చాటేస్తే పల్లెపట్టుల్లో కోళ్లూ కొక్కొరొక్కో అని కూయటానికి బద్ధకిస్తాయి ! పిల్లకాయల్ని బళ్లకి చేర్చాలన్నా, పాలూ పెరుగూ బుట్టలూ తట్టలూ మార్కెట్లలోకి తరలించుకుపోవాలన్నా, రోగాలొస్తే పెద్దాసుపత్రులో చేరాలన్నా , సినిమాలకీ  షికార్లకీ ఆఫీసులకీ సమయానికి చేర్చటానికీ  మన ప్రగతిరథ చక్రాలే వీళ్లకి గతి! మరి మనకి ఈ దుర్గతి ఏమిటని వెళ్ళి కడిగేద్దామా .. పదండి!


బాగా చెప్పావు. నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలం  అంటూ తేడాలు  పెరిగిపోతున్న ఈ కలికా లంలో అన్ని వర్గాలనూ ఒకే దిక్కుకేసి నడిపించే అసలై న మార్గనిర్దేశకులం మనం. అడిగినా అమ్మయినా పెట్టడానికి తటపటాయించే ఈ కరవు రోజుల్లో చెయ్యూపీ ఊపగానే  రయ్యిమనిపోయే మనం ఠపీమని ఆగి లిఫ్టిస్తున్నామే! మనకే ఎందుకో ఈ అష్టకష్టాలు? 


అవును. ఎక్కడో ఆస్ట్రేలియాలో మన పిల్లల  మీద దాడులు జరుగుతున్నాయని  తల్లడిల్లే  మీడియాసైతం  ఇక్కడ మనమీద ఇలా వాళ్ల కళ్లెదుటే నిత్యం దాడులు జరుగుతున్నా నోరెందుకు మెదపడం లేదో అంతుపట్టదు! ఆడ బిడ్డల మీద యాసిడ్ దాడులకు తెగబడే రౌడీలను  ఎన్ కౌంటర్లు చేసే  పోలీసులూ బస్సుల మీద ఇలా అక్కసు చూపేవాళ్ల పై  పెట్టీ కేసులు పెట్టేందుకూ  'ఐపీసీ'లో సెక్షన్లేవీ  లేనట్లు చేతులు కట్టేసుకున్నారు...!


పక్క మనిషి బాగుపడుతుంటే రెక్క పుచ్చుకు వెనక్కి లాగే మత్సర జనాభా పెరిగిపోతున్న ఈ జమానాలో, ఏ లాభం చూసుకో కుండా బస్సెక్కిన ప్రతి మానవుణ్ని 'పదండి ముందుకు' అంటూ  తీసుకెళ్లే మంచి వాతావరణం ఈ కాలంలో మన బస్సుల్లో మించి మచ్చుకైనా మరింకెక్కడైనా కనిపిస్తుందా ? 


దశాబ్దాలుగా ఆడవారి దశ తిరిగే   బిల్లులను  చట్టాలు  చేయమంటే నేతలు  దిక్కులు చూస్తున్నారు  . ఆ ఆకాశంలోని సగానికి మనమెప్పుడో ప్రత్యేకమైన  సీట్లు కేటాయించాం . రైట్ రైట్ అనటమేతప్పించి  'రాంగ్' అనే మాటే మన కండక్టర్ల నోట రాదు కదా! పదండి వెళ్లి ఆ దేవుడినే అడుగుదాం! 


ఎంత నాస్తికుడైనా  ఎర్ర బస్సు ఎక్కాడంటే అనుక్షణం  ఆ నారాయణుణ స్మరణ తప్పదు కదా  !  మనం చేయించే ప్రయాణాల  పుణ్యానికా... గూండాల  చేతుల్లో మన కిన్ని శిక్షలు ! అడగాల్సిందే  ఆ దేవుణ్ణి ఇప్పుడైనా! 


అడుగుదాం  సరే. మీకేం కావాలి అని ఆ దేవుడు ఎదురడిగితే ? బదులేమిచెప్పాలో మనం కూడా ముందే ఒక మాట అనుకోవాలి  కదా! వట్టి ఎర్ర  జండా ఊపుకొంటూ పోతే సరా... ఎజెండా కూడా  ఉండాలిగా? 


 నిజమే...!ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి . ఎలాగూ మన తెలుగు శకటాల కెవరూ కవరేజి ఇవ్యరు  . అద్దాలు పగిలిన బస్సులు, కాలి బూడిదైపోయిన మన బతుకులనైనా దేశాధ్యక్షుడి  ముందు కవాతుకు అనుమతిస్తే దేశ వ్యాప్తంగా  మన దౌర్భాగ్యం హెడ్ లైన్ల కెక్కే స్తుంది . ఆ వేడుకలకైనా రూటు క్లియర్ చెయ్యమని వేడుకుందాం .. పదండి ! 

***

--- 


- కర్లపాలెం హనుమంతరావు

(  ఈనాడు దినపత్రిక - 01-02-2016 - ప్రచురితం ) 

ఇంతి విలువ ఎంచ తరమా - ఈనాడు సంపాదకీయం

 ఈనాడు - సంపాదకీయం : 

ఇంతి విలువ ఎంచ తరమా?

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 30-01 - 2011 ) 


గోమతీ తీరంలో అశ్వమేధ దీక్షితుడైన శ్రీరాములవారికి వాల్మీకి మహర్షి వెంట వస్తున్న సీతమ్మ భగీరథుడి రథాన్ని అనుసరించే సుర నదిలా తోచగా సౌమిత్రికి ఇక్ష్వాకుల యశోలక్ష్మిలా, భరతుడికి కల్లాకపటమెరుగని కన్న తల్లిలా కనిపించిందంటారు కరుణశ్రీ . పెద్దత్తగారి దృష్టిలో ఆ చిట్టితల్లి చిక్కిపోయిన తనూవల్లి,  కైకేయికి లోకులు పలు గారకులుగా కాకాయని అరచి కరచి ఏకాకిని చేసిన కోకిల, సుమిత్రకు బతుకంతా బాష్పంగా, పారిజాత పుష్పంగా పతిసేవా వ్రతాన్ని సాగిం చిన పరమసాధ్వి .  ఆ కవిభావన వెనుక ఉన్న  ఔచిత్యం స్త్రీ జన్మలోని ఔన్నత్యమే! మహాభారతమూ బోధించింది అదే. పదిమంది ప్రబోధకులకన్నా  జ్ఞానాన్ని అందించే గురువు, పదిమంది గురువుల కన్నా కర్తవ్యాన్ని బోధించే తండ్రి,  పదిమంది తండ్రులకన్నా జీవమిచ్చి  జీవితాంతం ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవించి ప్రేమించే తల్లి మిన్న' అని ఆ పంచమవేదం చెబుతోంది. ఇల్లాలిగా స్త్రీ ఆదరణ కన్నతల్లినే మరపిస్తుంది . వలపులతో పతిదేవుని సేవలతో అత్తమామలను, అణకువతో అతిథులను,  ప్రేమతో బిడ్డలను అలరిస్తుంది. అంతటి సేవల భాగ్యాన్ని ప్రసాదించేది కన్యాదానం. వనాలతో , పర్వతాలతో విలసిల్లే ఈ భూమండలం మొత్తాన్ని దానమిచ్చినందువల్ల కలిగే పుణ్యఫలం సర్వాభరణ సంయుక్తమైన ఒక్క కన్యకనిచ్చినందువల్లే లభిస్తుందని మత్స్యపురాణం చెబుతోంది. అవతారమూర్తి అయినా అణువంతే పుడ తాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడనే గ్రహింపు ఉన్న వారెవరూ ఆమె సేవలకు వెలకట్టే దుస్సాహసం చేయలేరు.


ఆడజన్మ ఎంతో అమూల్యమైనది. అందువల్లే బ్రహ్మ ఎంతో శ్రమించి ఆ లావణ్యవతిని సృష్టించాడన్న నీతిశ్లోకం చమత్కారంగా తోచినా తరచి చూస్తే ఎంతో నిజము ఉన్నది . 'నా బతుకు దైనందినపు భోజనరుచివి/నా యదృష్టపు తాళ్ళకొనల వైచుకున్న ముడివి నీవు' అంటూ ఆధునిక యుగంలో సైతం తిలక్ వంటి కవులు పలవ రించారు మరి! దీనికంతా  మగవారి భావనలో మగువస్థానం పది లంగా ఉండటమే కారణమనే   వాదనా కద్దు. సోదరసేవ నెపంతో కట్టుకున్న ఇల్లాలిని ఏళ్ల తరబడి అంతఃపుర అనివార్య నిద్రలకు వదిలేసిన వారున్నారు. ప్రజాభీష్టం కోసమేనంటూ అగ్నిపునీత అయిన ధర్మపత్నిని కానల పాలుచేసిన మర్యాదాపురుషోత్తముల గురించీ  చదువుకున్నాం. తన సత్యవ్రతం కోసం తాళికట్టిన భార్యను నడిబజారులో విక్రయించిన హరిశ్చంద్రులున్న చరిత్ర. . పోయిన భాగ్యాన్ని తిరిగి రాబట్టుకొనేటందుకు జీవిత భాగస్వామిని జూదంలో పణంగా పెట్టిన ధర్మజుల సంగే తిమిటో! పితృవాక్యపాలన పేరుతో కన్నతల్లి తలనే తెగనరక సాహసించిన అవతారమూర్తుల కథలా తెలుసు. కాసుకు లోనై తల్లీదండ్రీ/ నెనరూ న్యాయం విడనాడి పుత్తడిబొమ్మ పూర్ణమ నొక / ముదుసలి మొగుడికి ముడివేసిన హృదయ విదారక కథా మరచిపోలేనిది. భర్త అంటే భార్యతో కలసి  ఏడు అడుగులు వేసే వేళ  ఆహారం, బలం, పవిత్రకార్యం, సౌభాగ్యం, పశువృద్ధి, రుతుసంపద, సత్సంతాన సాధనల్లో తోడూనీడగా నడుస్తానని సప్తవదినాడు ఆమెకు బాసలు చేస్తేనే కాదు  మగడు. వాటిని  చిత్తశుద్ధితో మనసా వాచా కర్మణా కట్టుబాటుగా  చాటుకునేవాడే నిజమైన చెలికాడు.  ' మగవాడి మనసులోని మహా బోధి వృక్షం ఆడదానిమీద ఏనాడో కూలిపడింది' అని మగువలు ఆవేదన చెందే దుస్థితి రాకూడదన్నది ఆశావాదం. ' ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం'  అన్నదే నేటి నిజం. ''నా నొసళ్ళమీద పురుషచేతి రాతలు గుర్తులు ఏ ఎరైజర్లు, రిమూవర్లు తుడవలేని తరతరాల శాసనాలు' అనేది నిన్నటి నిస్పృహ. 'మనమంటే 34, 24, 35 కొలతలమైనచోట/ దైహిక సౌందర్యపిపాసే మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట/ ఎంత హింస అనుభవిస్తున్నామో కదా!' అనేది నేటిస్పృహ. 'మనుగడకు అందం అనివార్యమైనచోట ఈ జీవితాన్నే ద్వేషిద్దాం!' అనే దృక్పథం రాత్రికి రాత్రే మొగ్గ తొడిగింది కాదు. దాని వెనుక - ఫ్రెంచి విప్లవం నాటినుంచీ స్త్రీల హక్కులకోసం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది. తన మీద తన హక్కుకోసం నేటి యువతి పోరాడుతోంది. కుటుంబ పుట్టుపూర్వోత్తరాలపై శాస్త్రీయ అధ్య యనం చేసిన ఏంగెల్స్- వర్గ సమాజంలోని స్త్రీలపట్ల పురుష పీడనను ప్రస్తావిస్తూ ఇంటి చాకిరిని విశ్లేషించారు. ఇప్పుడు ఐక్యరా జ్యసమితి లాంటివీ సమాజ నిర్మాణంతోపాటు గృహ నిర్వహ ణలోనూ స్త్రీలు అందించే సేవలకు విలువ నిర్ధారించే పనిలో ఉన్నాయి. కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, శయనేషు రంభా, భోజ్యేషు మాతా అని చిరకాలం మహిళ నెత్తిన పెట్టింది తగరపు కిరీటాలే. ఆమె అందించే రకరకాల సేవలకు మూల్యం మదింపు వేస్తే? ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వివాహిత దుర్మరణం కేసులో సర్వోన్నత న్యాయస్థానం - అదే చెప్పింది. మహిళ సంబంధీకులకు నష్టపరిహారం ఎలా ఎంత ముట్టుజెప్పాలో నిర్దేశించిన విశిష్ట తీర్చది. ఇంటిచాకిరి చేసే ఇంతి సేవలకు ఇంతవరకు సరైన విలువ లెక్కింపు విధానం రూపొందించనందుకు వాహనాల చట్టాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ లోపాన్ని వెంటనే సరిదిద్దుకోవాల్సిందిగా పార్లమెంటుకు సూచించింది. 'ఆకాశంలో సగంగా ఉన్నా అవకా శాలు మాకు గుండుసున్నా! మేం పాలిచ్చి పెంచిన జనంలో సగ మమ్మల్ని విభజించి పాలించటం దారుణం' అన్న అమ్మ బాధన అందరూ అర్ధం చేసుకోవాలి. ఆడదైపుట్టే కన్నా అడవిలో మా పుట్టడం మేలన్న నిర్వేదాన్ని తుడిచిపెట్టాలి. అలాంటి పరివర్తన సర్వోన్నత నిర్దేశం మొదటిమెట్టు కావాలి!


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 30-01 - 2011 ) 

ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దినపత్రిక- సంపాదకపుట - 10-04-2003 - ప్రచురితం )

 



ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - దినపత్రిక-  సంపాదకపుట - 10-04-2003 - ప్రచురితం ) 

ఉడయవర్లు ఐదేళ్ల కిందట అందరు కుర్రాళ్ళకు మల్లేనే వై టూకే టైములో టకటకా రెండు కంప్యూటర్ భాషలు నేర్చుకుని అమెరికా ఎగిరెళ్లిపోయినవాడే. 


 రోజులు బాగోలేక రెండు నెల్ల  కిందటే  ఇండియా తిరిగొచ్చేశాడు. 


ఇక్కడి పరిస్థితులంతకన్నా అధ్యానంగా ఉన్నాయి. 


స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో చాలా కంపెనీలు బలవంతంగా ఉద్యోగాలు పీకేస్తున్నాయి. కొత్తగా వస్తున్న కొద్ది ఉద్యో గాలకీ పెద్దవాళ్ళ మధ్యనే  పెద్ద రద్దీగా ఉంది. బాగా నడిచే బ్యాంకుల్లాంటివి ఉన్న బోర్డులు  తిప్పేస్తుండటం వల్ల అందులోని ఉద్యోగులు రోడ్లమీదకొచ్చేస్తున్నారు. 


కరవు వల్ల పల్లెల్లో పనులు లేవు. వృత్తి పని చేసుకుందామంటే  పెద్ద కంపెనీల ఒత్తిడి ఎక్కు నగా ఉంది. బహుళజాతి కంపెనీల ధాటికి తట్టుకోవడం మరీ  కష్టంగా ఉంది. 


ఉన్న ఉద్యోగాలన్నీ గవర్నమెంటు కాంట్రాక్టుకే ఇచ్చేస్తుందని తిట్టుకుంటూ కూర్చోలేదు ఉడయవర్లు. 


బిల్ గేట్స్ పీల్చి వదిలిన గాలిని మూడేళ్ళపాటు  పీల్చి వచ్చిన ఘటం . బ్యాంకు లోనుకు అప్లై చేశాడు. 


ప్రాజెక్టు రిపోర్టు చూసి డైరెక్టర్లకు మతి పోయింది. 


రోజుకు రెండు లక్షల టర్నోవర్! పది రోజుల్లో  బ్రేక్ ఈవెన్!... వరల్డ్  వైడ్ మార్కెట్... పోటీలేని వ్యాపారం... వెయ్యి శాతం లాభం..  ఉంటుందంటున్నాడు. 


వినటానికేదో గిరీశం లెక్చర్లాగుంది గానీ... ఎకనామిక్సన్నీ   పర్ఫెక్టుగా ఉన్నాయి. 


ఎండుగడ్డీ ..   పాత గుడ్డలూ... కర్ర ముక్కల్తో  ఇదంతా సాధ్యమా!' 


‘ఇప్పటికే ఈ బిజినెస్లో బిజీగా ఉన్నాను సార్! మిమ్మల్నేమీ మోసం చేయటానికి రాలేదు. ఇరాక్ నుంచి ఆర్డర్సు న్నాయి. . చూడండివిగో! అమెరికాకీ మన సరుకే కావాలి. బ్రిటన్ నుండీ బొలీవియా వరకు.. ఓహ్.. అందరికీ తొందరే! ముందు తమకే కావాలని ఒత్తిడెక్కువగా ఉంది .  కేపిటల్  కోసమే  మిమ్మల్ని కలవాల్సొచ్చింది .  టు సే ట్రూత్ .. విదేశీ మారక ద్రవ్యం మహా ఈజీగా వసూలయ్యే ఈ స్కీములో భాగం కావాలని చాలామంది పోటీపడుతున్నారు. లాభం పంచుకోవాల్సి వస్తుందని నేనే పస్తాయిస్తున్నా !'  అన్నాడు ఉడ యవర్లు.  


ఉక్కిరిబిక్కిరయిపోయారు డైరెక్ట ర్లందరూ.  ఒకాయనకు మాత్రం ఇంకా అనుమానం  పీకుతూనే ఉంది. 


'చెత్తగడ్డికి... పాత గుడ్డలకి పాతికలక్షలా? '


 ' పోనీ కుండ పెంకులక్కూడా కలిపి ఇప్పించండి సార్... ఆవీ కావాలి' 


'ఒకసారి ఓటికుండల ప్రదర్శన పెడితే కోటి పెంకులు దొరుకుతాయి... వాటిని కూడా కొనటమెందుకూ? ' అన్నాడాయన. ఆయన బోర్డులో ఎంప్లాయీస్ తరపు మెంబరు. 


' ఏరుకోవటాన్నికైనా మేన్ పవర్ కావాలిగా సార్! ఎంత హైటెక్కైనా కంప్యూటర్లెళ్ళి పెంకులేరలేవుగా! ... పోనీ పెయింట్ డబ్బాలకన్నా డబ్బు శాంక్షన్ చేయండి!  '


' బొగ్గు ముక్కలు బోలెడన్ని దొరుకు తాయి. కర్రెలాగూ తగలబడుతుంది గదా...పోనీ బై ప్రొడక్టు కింద బొగ్గయినా లేదు ప్రాజెక్టు రిపోర్టులో!  వయిబిల్టీ గురించి పైవాళ్లడిగితే.. ' 


ఉడయవర్లుకు విషయం అర్థమయింది. 


ఒంటి వేలు  చూపించి బైటికొచ్చాడు. డైరెక్టుగా మేనేజింగ్ డైరెక్టరుకే ఫోన్ చేశాడు బాత్రూములో నుంచి ఉడయవర్లు.  అన్నీ వివరంగా మాట్లాడాడు. 


' డిపాజిటర్ల డబ్బులు.  కమీషన్లు పుచ్చు కుని లోన్లిచ్చే  బాడీ కాదు మనది' అని అన్నాయన  బైటికెళ్లి పోయింతరువాత ఉడయవర్లు  లోపలికొచ్చాడు.


'కొత్త ప్రాజెక్టు.  కొద్దిగా రిస్కు తీసుకుని ఇస్తున్నాం. మాట రాకుండా చూసుకోవాలం' టూ కోటి రూపాయలు శాంక్షను చేసింది మిగిలిన బాడీ. 


' ఇంకో కోటి కూడా కొట్టేదే గానీ ఈ లోగా బ్యాంకు చతికిలపడింది. ' అన్నాడు ఉడయవర్లు ఇంటర్యూ చేయటానికొచ్చిన

విలేకరులతో  కులాసాగా. 


'దిష్టిబొమ్మలు తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టాలనే ఐడియా మీకెలా వచ్చిందసలూ? ' అనడిగాడో విలేకరి.


'అమెరికా నుంచి తిరిగొచ్చిన రోజున విమానాశ్రయంలో పిల్లలు ఓడిన క్రికెట్ ఆటగాళ్ల బొమ్మలు తగలెయ్యడం  చూశాను. రామ్ లీలా గ్రౌండులో ఎప్పుడో దసరాకి జరిగే సరదా ఈ దేశంలో ఏదో ఓ మూల రోజూ జరుగుతూనే ఉంటుందని పేపరు చూసే ప్రతి బురున్నవాడికీ ఈజీగా అర్థమవుతుంది.' 


' పాడెలు కట్టడం.. కుండలు పగలగొట్టడం... జెండాలు తగలబెట్టడం .. లాంటి వాటికన్నా దిష్టిబొమ్మలు తగలబెట్టడం లేటెస్ట్ క్రేజీ.  గుజరాత్ గోల.. ఆయోధ్యలో అల్లర్లు..  ఎన్నికల్లో కొట్లాటలు .. ఉద్యోగుల నిరసనలు  , విద్యార్థుల ఉద్రేకాలు  ..  పార్టీల ప్రొటెస్టులు.. పోలీసు లాకప్ డెత్తులు ... ఎన్కౌంటర్లకు ఎగినెస్టుగా  ర్యాలీలు. . ఉగ్రవాదుల మీద ఆగ్రహాలు.. మహిళామణుల  ఆందోళనలు ..  ఉద్రిక్తతలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు . . ఇలా ఏం జరిగినా చివరికి దిష్టిబొమ్మల్ని తగలెడితేగాని తంతు పూర్తయినట్లు కాదు. మాది కొండపల్లి.  మా నాయన బొమ్మలు చేసి అమ్మేవాడు.  ఆ అనుభవంతో ముందు కొద్ది మొత్తంతో చిన్నగా పని ప్రారంభించా .  ఇంతలో ఇరాక్ వార్ వచ్చి పడింది. వరల్డ్ వైడుగా డిమాండొచ్చింది. బుష్ బొమ్మలకున్నంత డిమాండిప్పుడు మరి దేనికీ లేదు. తొగాడియా బొమ్మలక్కూడా డిమాండెక్కువే. మధ్యమధ్యలో ముష్రాఫ్ సరేసరి . సమయం  సందర్బాన్ని  బట్టి లోకల్ లీడర్లక్కూడా అర్డర్సొస్తున్నాయ్. ఈ మధ్య వ్యాపారులు కూడా అధికారుల బొమ్మలు తగలబెడుతున్నారు . . కొత్తగా కొద్దిగా డేర్ చేసి .. చూసారుగా.. ' 


'ఆర్డర్లన్నీ మీకే ఎందుకొస్తున్నాయి? ' 


' మా దిష్టిబొమ్మలకు ఆకారాలే గాని. పోలికలుండవు.  సందర్భాన్ని బట్టి అదే బుష్ .. అదే సద్దాం హుసేన్. ముష్రాపూ  అనుకోవచ్చు.. మురళీ మనోహర్ జోషీ అనుకోవచ్చు . ఒక దిష్టిబొమ్మ కొంటే జెండా ఉచితం . పాడెలు కూడా చవకగా కట్టిస్తాం. వీలును బట్టి వాటినే కుర్చీలుగా మార్చుకోవచ్చు. . ఓడితే పడుకోబెట్టి తగలెట్టడానికి . . గెలిస్తే కూర్చోబెట్టి ఊరేగించటానికి..  వీలుగా ఉంటుంది. 


కాలం మారుతుంది. మన ఆలోచనలూ మారితేనే విజయం. మా నాయన కొండపల్లి బొమ్మలు మాకు రెండు పూటలా తిండి పెట్టలేకపోయాయి. దిష్టి బొమ్మలు చేస్తూ నేనిప్పుడు కోట్లు గడిస్తున్నా  ' 


'మీకు లోనిచ్చిన బ్యాంకు మునిగింది కదా! లోను తీర్చి డిపాజిటర్లకూ ఉద్యోగు లకూ మీ వంతు సహకారం అందించవచ్చు  కదా!' 


'దిష్టిబొమ్మలు చవకగా ఇచ్చి సహకార మందిస్తూనే ఉన్నా. డైరెక్టర్లల్లో ఒకాయనకు అనాథ శరణాలయముంది. పిల్లల గుడ్డ పీలికలు   కొనే కండిషన్ మీదే  నాకు లోనిచ్చింది. కుండ పెంకులు కావాల్సొచ్చినప్పుడల్లా ఉద్యోగుల చేత ఖాళీకుండల ప్రదర్శన ఏర్పాటు చేయించే వాడింకో డైరక్టరు. ఆయనే బోర్డులో ఉద్యోగుల తరపు ప్రతినిధి.  వాళ్ల వంతు లాభాల్లో కొంతైనా కడితే, మిగిలిన కంతులు నేను కట్టడం న్యాయంగా ఉంటుంది. లోను కట్టే యడం  నాకో లెక్కలోనిది కాదు.  నాలుగు రోజులిలాగే  నిరసనలు సాగితే దిష్టిబొమ్ములు నాలుగు ఎక్స్ ట్రా పోతాయని ఆశ.  కాదు .. కట్టేద్దామన్నా  మా ఫ్యాక్టరీ  ఉద్యోగులూరుకోరు.  నా దిష్టిబొమ్మల్నూరేగించి  తగలెట్టేస్తారు. ' అన్నాడు ఉడయవర్లు. 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - దినపత్రిక-  సంపాదకపుట - 10-04-2003 - ప్రచురితం ) 



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...