పరగడుపునే
లేచి
మంచి
పద్యంతో పుక్కిలించాలని,
పుల్లాపుడకా
రాయీరప్పా
పంటికింద
పడకుండా
తేలికపాటి
వార్తలే
స్వల్పాహారంగా
సేవించాలనీ,
మధ్యాహ్నబోజనంలో
న్యూసు
పేపరు
మధ్యపేజీ
కథనాలు
సుష్టుగా లాగించినా..
టీబ్రేక్
టైములో
న్యూస్
ఐటం
ఎంత వెరైటీగా ఉన్నా..
లైటుగా మాత్రమే తీసుకోవాలనీ,
రాత్రి
పడుకునే
రెండుగంటలముందు
చిన్నప్పుడు
అమ్మమ్మా తాతయ్యా చెప్పిన
కమ్మకమ్మని
కథల్లాంటి
చర్చల్ని
తప్ప వేరే ఏవీ
అస్సలు చూడరాదని..
నా
అధికరక్తపు పోటు జబ్బుకు
ప్రకృతివైద్యనారాయణుడిచ్చిన
సూచన
ఈశ్వరా!
ఈ
ట్వంటీఫొరవర్సు
రొటీను
టీవీ న్యూసుచానెల్స్
ట్వంటీఫస్టు
సెంచరీలో
నా
బతుక్కింక
మోక్షమే
లేదా!
- కర్లపాలెం హనుమంత రావు
18-02-2011
No comments:
Post a Comment