Saturday, November 7, 2015

కొన్ని చిన్నికవితలు



గుండెకాయ
పండితేనే
ఫలం

నాలోకాన్నంతా  పోగేసినా
మా బాబు బుజ్జిగూడు ముందు
మరగుజ్జే

మనిషిక్కడ
మనసక్కడ
రెక్కల గుర్రమా
ఊహ!

కొండనెత్తిన గోపాలుడు
తులసాకుకు తూగలేదా!
-ప్రేమ భలే చిలిపి

నోటికి ముద్ద
మూతికి తాళం
తల్లివేలా!
నమస్కారం!

సమూహాన్నివంటిగా నమిలేసి
వంటిగా సమూహాన్ని నెమరేస్తో
కవి

ముక్కడ్డమున్నా
చూపొక్కటేట
ప్రేమించుకున్నాయి కామోసు
పిచ్చికళ్ళు!

జమ ఖర్చుల పత్రం
జీవితం
జ-జననం
మ-మరణం

లోపల కాదు
గుడిబైట చూసా
గుడ్డోడి బొచ్చలో
మెరిసే దేవుణ్ణి
ప్రణామం!
-కర్లపాలెం హనుమంతరావు



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...