సి సి కెమేరాలు
అంటే క్లోజ్డ్ సర్క్యూట్ కెమేరాలు. నిజానికి ఇవి సర్వ సాక్షి ధర్మాన్ని నిర్వహించే
ఆధునిక యంత్రాలు. 'అంతటా ఉండి.. అన్నీ గమనిస్తుంటాడు దేవుడు' అని భక్తుల విశ్వాసం. అదెంత వరకు నిజమో .. చర్చనీయాంశం. ఆ వాస్తవ అవాస్తవాలను పక్కన
పెడితే ఆ నమ్మకాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించే అమాయకులు దైవభీతితో అయినా కొన్ని
దుష్ట కార్యాలను ప్రయివేటుగానైనా చేసేందుకు జంకే అవకాశం కద్దు. సమాజానికి మేలు కలిగే వరకు సి సి కెమేరాల
ఉనికికి అభ్యంతరం
పెట్టవలసిన అవసరం లేదు కూడా.
అభివృద్ధి
చెందిన దేశాల్లొ సి సి కెమేరాలే నిఘా వ్యవహారాల్లో అధిక శాతం మానవ ప్రమేయాన్ని తగ్గిస్తున్నాయి.
అమెరికా వీధుల్లో అడుగడుగునా ఈ నిఘా కెమేరాలు
కళ్లు విప్పార్చుకొని చూస్తుంటాయి రాత్రింబవళ్ళు. రోడ్డుమీద
పోలీసుల ఉనికి ఆట్టే కనిపించక పోయినా .. ట్రాఫిక్ రూల్సు కాస్తంత ఉల్లంఘించినా
ట్రాఫిక్ వ్యవస్థనుంచి తాఖీదులు రావడం.. కోరితే వాటికి సంబంధించిన సె. సి. కెమేరాల క్లిప్పింగులూ
జత చేసుండటం వల్ల తప్పు చేసిన వారికి తప్పించుకొనే మార్గాంతరం తోచదు. అక్కడి నేర
శిక్షా స్మృతులూ సి
సి క్లిప్పింగులను ముఖ్యమైన అధికారిక సాక్ష్యంగా అంగీకరిస్తాయి. కాబట్టి దోషికి
జరిమానాలు చెల్లించక తప్పని పరిస్థితి. సి సి కెమేరాలకు మనుషులకు మల్లే రాగ
ద్వేషాలు ఉండవు. కాబట్టి.. తప్పు పోలీసు వ్యవస్థనుంచి జరిగినా నిస్సంకోచంగా ఎత్తి
చూపిస్తాయి. ఆ భయం వల్ల కూడా అమాయకులమీద అన్యాయంగా నేరారోపణలు చేసేందుకు జంకుతారు
పోలీసులు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ సి సి కెమేరాలు క్రియాశీలకంగా తమ
పనిచేసుకుంటున్నాయి. నిత్యానందస్వామి రాసలీలలనుంచి..
'నోటుకి ఓటు వ్యవహారం' వరకు సి సి
కెమేరాల పాత్ర ఎంతటిదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టి యం లలో దూరి రొక్కం దొంగతనం
చేసేవాళ్లు.. బంగారం దుకాణాల్లో దూరి
బెదిరించి సరుకు కొల్లగొట్టేవాళ్ల పాలిటి సింహస్వప్నం సి సి
కెమేరా. ఇది నాణేనికి ఒక కోణం. రెండో కోణం నుంచి చూస్తే జరుగుతున్న అపాకారాలు
ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలు దుస్తులు మార్చుకొనే వ్యక్తిగత ప్రదేశాలలో, బసచేసే హోటళ్లలో దొంగతనంగా పెట్టిన కెమేరాల మూలకంగా అసాంఘిక శక్తులకు
మరింత శక్తినిచ్చినట్లు అవుతున్నది. ఎంతో మంది అమాయకులు ఈ సి సి కెమేరాల వలల్లో
చిక్కి విలవిలలాడడం.. పరువుకి భయపడి ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతున్నది. సి సి
కెమేరా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పండు కోసుకున్నట్లే.. గుండెల్నీ
చీల్చవచ్చు. ఉపయోగించే వాడి మనస్తత్వంమీద అదంతా ఆధారపడి ఉంటుంది.
తెలంగాణా రాష్ట్రం
భూముల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇప్పుడు సి సి కెమేరాలు ఉపయోగించే ఆలోచన చేసున్నది
ప్రభుత్వం. ఒకే సందర్భంలో ఒకే వ్యక్తి పేరుమీద ఒకటికి మించి రిజిస్ట్రేషన్లు
జరపించడం, నకిలీ
వ్యక్తుల ద్వారా పత్రాలమీద సంతకాలు చేయించడం, కార్యాలయాలకు ఆవల భూముల రిజిస్ట్రేషన్లు లోపాయికారీగా జరిగిపోవడం.. వంటి ఇంకా ఎన్నో చట్టబాహ్యమైన వ్యవహారాలకు సి సి కెమేరాల ప్రయోగంతో చెక్ పెట్టినట్లవుతుంది. కాకపోతే ఈ
వ్యక్తుల ద్వారా పత్రాలమీద సంతకాలు చేయించడం, కార్యాలయాలకు ఆవల భూముల రిజిస్ట్రేషన్లు లోపాయికారీగా జరిగిపోవడం.. వంటి ఇంకా ఎన్నో చట్టబాహ్యమైన వ్యవహారాలకు సి సి కెమేరాల ప్రయోగంతో చెక్ పెట్టినట్లవుతుంది. కాకపోతే ఈ
సి సి కెమేరా
ప్రయోగంకూడా దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తేనే అనుకున్న
ఫలితాలు రాబట్ట గలిగేది.
ఈ దేశం అత్యున్నతంగా
భావించే రాజ్యాంగ వ్యవ్యస్థల్లో ఒకటైన పార్లమెంటు సభాప్రాంగణంలోనే.. ఒక అత్యంత
విశాలమైన రాష్ట్రాన్ని రెండుగా విభజించే రాజ్యాంగ నిర్వహణ సందర్భక్రమాన్ని దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా
చూసేందుకు
సి సి కెమేరాల
అవకాశం కల్పిస్తున్నా.. వాటి కన్ను కప్పిన క్షణాలను మనం మర్చిపోకూడదు.
-కర్లపాలెం హనుమంతరావు
10-10-2016
No comments:
Post a Comment