Tuesday, June 12, 2018

కవితా.. ఓ కవితా! కఠిన పదాలకు అర్థాలు







యుగకవిగా జగం కీర్తించిన శ్రీశ్రీ గారి 'మహాప్రస్థానం'లోని అద్భుతమైన కవిత ఇది అని వేరే పరిచయం అవసరం లేదు. ఈ కవిత నోటికి రాని యువకవులు ఉండేవారు కాదు మా రోజుల్లో. ఇప్పుడూ అంతే అభిమానం అనుకోండి ఈ కవిత మీద ఈ తరం కవులకు. నిజమే కానీ..ఇందులో మహాకవి వాడిన పదాలకి అర్థాలు ఎంత మందికి తెలుసో!


వితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,

అతి సుందర సుస్యందనమందున

దూరంగా వినువీథుల్లో విహరించే

అందని అందానివిగా

భావించిన రోజులలో,

నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు విషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?


యువకాశల= ?

నవపేశల = ?
సుస్యందనం= ?
స్రుక్కిన = ?



సమాధానాలు
యువకాశల = యుక్తవయస్సులో ఉన్నప్పుడు కలిగే ఆశలు;
నవపేశల = కొత్తకోయల;
సుస్యందనం = మంచి రథం;
స్రుక్కిన = కుమిలిన

-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...