వడ్డాది సుబ్బారాయుడిగారు ‘సతీ స్నృతి’ తెలుగులో వచ్చిన
ఒక ప్రముఖ సంతాప కావ్యం (ఎలజీ). సుబ్బారాయుడిగారి వైవాహిక జీవితం చాలా పరితాపకరమైనది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా ఐదుగురు సాథ్వీమణులు
ఆయన చేత మెడలో తాళి కట్టించుకున్నా ఒక్కరికైనా కలకాలం కలసి జీవనయానం సాగించే యోగం లేకపోయింది.
మొదటి కళత్రం పోయిన 1881 ప్రాంతంలో సుబ్బారాయుదుగారు ఇందాక చెప్పుకున్న కళత్ర వియోగానికి
సంబంధిచిన కవితా సంపుటి రాసారు. కవిగారు రాసారు కానీ.. ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు
రాని దుర్గతి. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారే తన ఆంధ్రభాషా సంజీవని పత్రికలో మొదటి
సారి దాన్ని అచ్చువేసారు. దరిమిలా అది ఒక సంపుటిగా వెలువరించడం.. అశేషమైన ప్రచారం సంపాదించుకోవడం.. అదో విశేషం. అక్కడితో
అయిపోతే ఇక్కడ ఈ కథ చెప్పుకునే అవసరమే ఉండేది కాదు.
సుబ్బారాయుడిగారి
‘సతీ స్మృతి’ చదివి విశేషంగా ఉత్తేజం పొందిన వారు అసంఖ్యాకులు, అందులో కొమఱ్రాజు లక్ష్మణరావుగారూ
ఒకరు. ఆ కావ్యం చదివిన ప్రభావంతో ఆయనా ‘వియోగ గీతి’ ఒకటి మరాఠీలో వెలువరించారు. యథాప్రకారం
దానికీ అశేషంగా పాఠకులు స్పందించారు. కవిగారికి ఇంత చిన్నవయసులోనే కలిగిన కళత్ర వియోగానికి
చింతించని వాడు లేడు. ఉత్తరాల ద్వారా ఊరడించే వాళ్ళు కొందరైతే.. వీలు కల్పించుకొని
మరీ కొంతమంది శోకతప్తులు ఏకంగా పూలదండలు పుచ్చుకొని
మరి పరామర్శల కొచ్చేసారుట!
కొసమెరుపేమిటంటే..
కొమఱ్రాజు వారికి అప్పుడు నూనూగు మీసాల వయసే. భార్య సంగతి పక్కనుంచి.. అప్పటి మన సంప్రదాయాల
ప్రకారం ఇంకా మగపిల్లవాడి ముందు పెళ్లి ప్రస్తావనలు
సైతం తీసుకురాకూడని తరుణం!
ఈ అనుభవంతో జడిసిన
కొమఱ్రాజువారు కవిత్వం రాయడం బంద్! ఆ తరువాత ఆయన రాసినవనీ కవిత్వానికి ఆమడ దూరం ఉండటం
గమనార్హం!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆరుద్రగారి సమగ్రాంధ్ర
సాహిత్యం 4వ సంపుటి- పుట 235)
కొమఱ్రాజు లక్ష్మణరావుగారి వివరాలు కొన్ని
(సోర్స్ః వికీపీడియా)
జననం మే
18, 1877
పెనుగంచిప్రోలు,
కృష్ణా జిల్లా
మరణం జూలై 12, 1923
మద్రాసు
మరణ కారణము అనారోగ్యం
వృత్తి దివాన్, రచయిత
ప్రసిద్ధి చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త,
సాహితీవేత్త
భార్యః కోటమాంబ
పిల్లల: వినాయకరావు
తండ్రిః వెంకటప్పయ్య
తల్లిః గంగమ్మ
No comments:
Post a Comment