ఇక్కడ నొక్కండి...వేరే పేజీ తెరుచుకుంటుంది.
(మాగంటి వారి వెబ్ సైట్ చూస్తున్నప్పుడు నాకీ ఆణిముత్యం దొరికింది.బసవరాజు అప్పారావు గారి ఈ వెర్రి పిల్ల పాట ఆ రోజులలో చాలా ప్రసిద్ధం. బందా కనకలింగేశ్వర రావు గారి విలక్షణమయిన గళం లోనుంచి జాలువారిన ఈ పాట తెలుగు వారి అందరికి గుత్తి వంకాయ కూర ఎంత ఇష్టమో అంత ఇష్టం ఈ తరానికి కూడా ఒక సారి ఆ రుచి చూపించాలనే సదుద్దేశంతోనే ఈ పాటను ఇక్కడ పెట్టటం జరిగింది.నాకు సాంకేతికమయిన అంశాలలో అంతగా అనుభవం లేని కారణం గా పై లంకెను నొక్కగానే వేరే పేజి తెరుచుకునే విధంగా ఏర్పాటు చేశాను .పాటను విని ఆనందించిన తరువాత తిరిగి ఈ పేజీ లోకి వచ్చి మీ స్పందన తెలియచేస్తే నా కృషి ఫలించినదనుకుంటాను.మీ మిత్రులకు ఈ బ్లాగ్ సంగతి చెబితే మరింత సంతోషిస్తాను,
మాగంటి వెబ్ సైట్ వారికి సేకరించిన సేకరించిన డాక్టర్ కారంచేడు గోపాలం గారికి కృతజ్ఞతలు.)
మాగంటి వెబ్ సైట్ వారికి సేకరించిన సేకరించిన డాక్టర్ కారంచేడు గోపాలం గారికి కృతజ్ఞతలు.)
గుత్తి వంకాయ కూరోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూర లోపలా నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా!
కోరి వండినానోయ్ బావా!
కూర లోపలా నా వలపంతా
కూరి పెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా!
తియ్యని పాయసమోయ్ బావా!
తీరుగా ఒండానోయ్ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా!
బాగని మెచ్చాలోయ్ బావా!
తీరుగా ఒండానోయ్ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా!
బాగని మెచ్చాలోయ్ బావా!
కమ్మని పూరీలోయ్ బావా!
కర కర వేచానోయ్ బావా!
కర కర వేగిన పూరీ లతో నా
నా కాంక్ష వేపినానోయ్ బావా!
కనికరించి తినవోయ్ బావా!
కర కర వేచానోయ్ బావా!
కర కర వేగిన పూరీ లతో నా
నా కాంక్ష వేపినానోయ్ బావా!
కనికరించి తినవోయ్ బావా!
వెన్నెల ఇదిగోనోయ్ బావా!
కన్నుల కింపౌనోయ్ బావా!
వెన్నెలలో నా కన్నె వలపనే
వెన్న కలిపినానోయ్ బావా!
వేగముగా రావోయ్ బావా !
కన్నుల కింపౌనోయ్ బావా!
వెన్నెలలో నా కన్నె వలపనే
వెన్న కలిపినానోయ్ బావా!
వేగముగా రావోయ్ బావా !
పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వులు బరిచిందోయ్ బావా !
పువ్వులలో నా యవ్వనమంతా
పొదివి పెట్టినానోయ్ బావా!
పదవోయ్ పవళింతాం బావా!
పువ్వులు బరిచిందోయ్ బావా !
పువ్వులలో నా యవ్వనమంతా
పొదివి పెట్టినానోయ్ బావా!
పదవోయ్ పవళింతాం బావా!
-బసవ రాజు అప్పారావు గారు
No comments:
Post a Comment