నాయకులు దర్జాగా దేశాన్ని
తెగనమ్ముతున్నారు
ఐనా గొర్రెల్లా జనం ఆ
కసాయిల్నే
తెగ నమ్ముతున్నారు!
ఏరుకుని తీసుకోడానికి
తల్లి పొట్ట
రేక్కాయల బుట్టా!
రేతస్సు జనిత తేజస్సే కదా
మగాడి లాగా ఆడబిడ్డా!
వెయ్యి కిలోలబరువైనా
అవలీలగ మోస్తాట్ట వస్తాదు
బడిపిల్లడి బ్యాగు మాత్రం
మోయలేక పడి చస్తాడు
పదవి నీది- నొప్పులు నావి
-ముఖ్యమంత్రిపెదాల బాధ
అదీలేదు మరి
నా తిప్పలు చూడరాదా!
అప్పోజిషన్నేత పాదాల రొద
ఏసిబి.. సిబిఐ.. కాగూ
ఈడీ.. కోర్టులు
అక్రమార్కులను కొత్తగా
ఆవహించిన పంచ ‘భూతాలు’ !
లక్షల కోట్లల్లో
కుంభకోణాలు
న భూతో
నా దేశానికి
న భవిష్య్తత్!
తెలుగుతల్లి కొప్పుకు
కొత్తటీవీ
యాంకరమ్మల
సంకర కూ’తల’నొప్పులు’!
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment