11:39 AM
అడివి కాదు మహాప్రభో అడవి. అంబోధి అంటే
సముద్రమే కానీ,
బో కీ వత్తు ఉండాలి. అంభోధి అపార పారావారం అనే భావన ఒకానొక
రోజుల్లో. అంటే ఎవరూ దాటలేనంత వడ్డు కలదని అర్థం. నలదమయంతుల చరిత్రలో కావాలని
దమయంతి చేతికి చిక్కిన కలహంస (నల్లటి హంస)నలుడి మీద ఆమె మరులు మళ్లించే నిమిత్తం
కోసే కోతలలో ఈ అపార పారావారమనే పలుకు వినిపిస్తుంది. 'అపార
పారావార పర్యంతానంత మహీతలంబు నందు నా చూడని రాజులు లేరు సర్వగుణ సౌందర్యంబుల
నెవ్వరు నలుం బోలరు' అనడం అతిగా అనిపిస్తుంది. కానీ, ఎవర్నయినా పొగడాలనుకుంటే ఉన్నది ఉన్నట్టుగా చెబితే 'ఆర్ట్
ఫిల్మ్' తరహాలో బోర్ కొడుతుంది కదా! అందుకే అపార పారావార
పర్యంతం పరుచుకున్న భూమండలంలో నలుడంత నాజూకు మనిషి లేడని ఆ కలహంస కోసింది. ఇక్కడ
అపార పారావారం అన్న పదం ఉపయోగించడంలో విశేషం ఉంది. ఎవరూ దాటలేనిది అంభోధి అని..
అతిశయోక్తి పదాన్ని ఎంచుకోవడంలోనే నలుడి అందాన్ని గురించి చేసే వర్ణనలోని
అతిశయోక్తి సూచితం. ఇంత కథ ఉన్న అంభోధి పదంలో ఉన్న అన్ని అక్షరాలకు ఒత్తులు
ఉండడంలో తప్పేం ఉంది!నీ సంగరి గుర్తు
ఉంచుకుంటే చచ్చినా ఇక అంభోధి పదంలో తప్పు దొర్లే అవకాశం ఉండదు.
అదృష్టం అనే పదాన్ని ఇప్పటి తరంలో ఎక్కువ మంది
అద్రుష్టం అని రాస్తుంటారు. ఉచ్ఛారణలో రెండు పదాలు ఒకే తీరులో పలకడం వల్లనే ఈ
అయోమయం. నిజానికి ఫోనెటికి సిస్టమ్ (ఉచ్ఛారణ ప్రకారం రాసే పద్ధతి) గట్టిగా అమలయే
పరిస్థితి ఉంటే కృష్ణుణ్ణి అయినా క్రుష్ణుడు అని బేఫర్వాగా అనేయవచ్చు. మన దగ్గర
పితలాటకం ఒక్కోసారి ఫోనెటికి సిస్టం, ఒక్కోసారి నాఫోనెటిక్ సిస్టమ్
(ఉచ్ఛారణకు రాసే పదానికి సంబంధం లేకుండా పోవడం) పాటించడం. చుండూరును టిసుండూరుగా,
కాకినాడను కొకనాడగా రాయడం లాంటివి ఇందుకు ఉదాహరణలు. కాబట్టి
తెలుగులో డిక్టేషన్ తీసుకునేటప్పుడు ఉచ్ఛారణను బట్టి పదాలు తయారైనా అప్రమత్తంగా
ఉండడం అవసరం. పాత తెలుగులో పద్యాలలో పద్దాకా కనిపించే అరసున్నాలను నోటితో చదవడం ఆ
అర్థ పూర్ణాలను సృష్టించిన విధాతకైనా సాధ్యమయే వ్యవహారం కాదు. పలక్కపోతే పీడా
పాయిరి అనుకోవచ్చు కాని.. కొన్ని తెలుగు పదాలకు అర్థాలను కేవలం అరసున్నాలే
మార్చేసే సంకటం ఒకటుంది. పాండురంగ మాహాత్మ్యం అనే ప్రబంధం 4వ ఆశ్వాసంలో 'భానుఁడు శీతభానుఁడున్ గాఁడిన మేఘకాళిమ వికారము దూరము సేయ.' అనే పద్యం కనిపిస్తుంది. ఇక్కడ
కాఁడు అంటే అర్థం నాటు, అంటే పొలాలలో నాట్లు వేయడం తరహా
కార్యకలాపం.
No comments:
Post a Comment